1, ఫిబ్రవరి 2019, శుక్రవారం

KCR నా పెద్ద కొడుకు

రెండు రోజుల క్రిందట నేను ఒక లోకల్ బస్సులో ప్రయాణిస్తూ ఒక 70 సంత్సరాల మహిళ ప్రక్క కూర్చోటం జరిగింది.  పేదరాలైన ఆమె మాటల మధ్యలో తనకు కొడుకులు ఉన్న ఎవ్వరు తనని పట్టించుకోటం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పెన్షన్ తనని ఆదుకొంటున్నదని తానూ ఇంకా జీవించి ఉన్నానంటే కేవలం ఆ పెన్షన్ మరియు రూపాయి కిలో బియ్యం అని అశ్రు నయనాలతో చెప్పింది.  నాకొడుకులు నా కొడుకులు కారు KCR నా పెద్ద కొడుకు అన్నది.   పేదవాళ్ల కష్టాలు తెలుసుకొని తీసుకొన్న నిర్ణయం బహుదా ప్రశంసనీయం.  పేదవారికి, రైతులకి అలాగే అన్ని కులాల్లోని పేదవారిని ఆదుకోటం ప్రశంసనీయం.  
డ్వాక్రా మహిళలకు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవటానికి కొత్త పధకాలు పెడితే చాల బాగుంటుంది. ఉదాహరణకు సమిష్టిగా కరం పొడి తయారీ. దీనికోసం కొద్దీ పెట్టుబడిలో ఒక దంపుడు మిషన్ కొనుక్కుంటే టోకులో ఎండు మిర్చి కొని పొడి చేసి దానిని ప్యాక్ చేసి అమ్మవచ్చు. ప్రభుత్వం రేషన్ దుకాణాలలో కూడా విక్రయించ వచ్చు. 
అలాగే ఇతర పిండ్లు కూడా చేయ వచ్చు. 
డిస్పోసబుల్ గ్లాసులు, ప్లేట్లు, ఇతర సామాగ్రి తయారు చేయవచ్చు,
ఊదు బత్తిల తయారీ 
సామూహికంగా కోఅప్రతివే స్టోర్ నడపటం మెదలైనవి నడప వచ్చు. 

ప్రజల దీవెనెలు దానికి తోడు ఎన్నో యజ్ఞ యాగాది క్రతువులు చేయటం తో అటు ప్రజల అండ ఇటు దైవ బలము తోడు వుంటటంతో KCR విజయ పధంలో పయనిస్తారనటం అతిశేయోక్తి కాదు.