30, జూన్ 2020, మంగళవారం

కృష్ణ నామం

కృష్ణనామం శతకోటి జన్మల పాపాలను సైతం హరించివేస్తుందని పురాణాల్లో చెప్పబడింది. ధర్మాచరణ దుర్లభామయిన ఈ కలి యుగంలో, కేవలం ఒక్క దైవనామస్మరణ మాత్రమే మోక్షాన్ని ప్రసాదిస్తుందని చెప్పబడింది. తన అవతారం చాలిస్తున్నప్పుడు, శ్రీ కృష్ణ పరమాత్మ తన-దివ్య తేజస్సును, శక్తులను శ్రీమద్భాగవతములో ప్రవేశింప చేసి, " నేను ఈ భాగవతంలోనే నివసిస్తుంటాను." అని అభయమిచ్చారు.

విష్ణుగాధా శ్రవణముచే పరీక్షిత్తు, కీర్తనచే శుకుడు, స్మరణచే ప్రహ్లాదుడు, పాద సేవచే లక్ష్మిదేవి, పూజలచే పృధు చక్రవర్తి, అభివందనముచే అక్రూరుడు, దాస్యముచే హనుమంతుడు, సఖ్యముచే అర్జునుడు సర్వస్వమూ ఆత్మ సమర్పణము చేసి బలిచక్రవర్తి, ఈ నవ విధ భక్తులచే క్రుతార్దులయినారు. శ్రీ కృష్ణ భక్తి అంత గొప్పది.

ఎన్నో పాపాలు చేసిన 'అజామిళుడు' చివరి క్షణం లో 'నారాయణా!' అని యధాలాపంగా తన కొడుకుని పిలచి, శాశ్వత వైకుంఠప్రాప్తి పొందాడు. ఈ కధ 'భాగవతం' లోని షష్ఠ స్కందం లో ఉంది.

'ఎన్నో పాపాలు చేసిన యితడు వైకుంటానికి ఎలా వస్తాడు? పైగా యితడు పిలచినది తన కొడుకునే గానీ, శ్రీమన్నారాయణుడిని కాదు!' అన్న యమ దూతలతో, విష్ణు దూతలు ఇలా అంటున్నారు. పేరు పెట్టి పలికినా, పరిహాసంగా పలికినా, వెక్కిరిస్తూ హేళనగా పలికినా, ఊత పదంగా పలికినా, యే విధంగా అయినా భగవన్నామాన్ని ఉచ్చరిస్తే పాపాలన్నీ నిశ్శేషంగా నశించి పోతాయి.

పై నుండి పడినప్పుడు కాని, ఎముకలు విరిగినప్పుడు కాని, పాము, తేలు లాంటివి కరచినప్పుడు కాని, వళ్ళు కాలినప్పుడు కాని, జ్వరతీవ్రతలో కాని, అమ్మ బాబోయ్ అని అరచే బదులు శ్రీహరీ, కేశవా, రామా, నారాయణా, శివా అని భగవంతుని నామాలను స్మరిస్తే, యాతనను అనుభవించవలసి ఉండదు. ఔషధము యొక్క గుణము తెలిసి వాడినా, తెలియక వాడినా పని చేస్తుంది కదా!

మీ మనసుకి నచ్చిన దైవ నామాన్ని, గురు నామాన్ని స్మరించండి - తరించండి.

షడ్దర్శనములు



హిందూమత సాంప్రదాయంలో జీవితము, ధర్మము, మోక్షము వంటి కొన్ని క్లిష్టమైన తాత్వికసమస్యలకు పలువిధాలైన సమాధానాలు వివిధ తత్వవేత్తలచే ప్రతిపాదింపబడినవి. వారి ప్రతిపాదనలే దర్శనములు.

దర్శనాలలో పరిశీలింపబడిన కొన్ని ప్రశ్నలు - మరణానంతరము శరీరమునుండి విడివడిన జీవుడేమగును?

మోక్షస్వరూపం ఎలాంటిది?
జీవుడు లోకాంతరములకు వెళ్ళు మార్గం ఏమిటి?

ఇటువంటి ప్రశ్నలకు దర్శనాలలో సమాధానాలు చెప్పబడ్డాయి. వాటిలో ఆరు ముఖ్యమైనవి వాటినే షడ్దర్శనములు అంటారు.

సాంఖ్య దర్శనము:
కపిల మహర్షిచే ప్రవర్తింపజేయబడినది. ప్రకృతి లేక మూల ప్రకృతి విశ్వసృష్టికి కారణమని సాంఖ్య సిద్ధాంతము. ప్రకృతి సత్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలతో కూడి ఉంది. ప్రకృతి, పురుష సంయోగమువలన బుద్ధి జనించును. పురుషుడు బుద్ధిచేయు చేష్టలను తనవిగా భావించుకొని సంసారములో బంధింపబడును. ప్రకృతి, పురుషుల స్వభావమును గ్రహించి, ఈ బంధమునుండి విడివడుటయే మోక్షము.

యోగ దర్శనము: పతంజలి మహర్షి యోగదర్శనమును రచించెను. ఇందులో మనసును నిగ్రహించుటకు తగిన ఉపాయములు బోధింపబడినవి. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యఅహారము, ధ్యానము, ధారణ, సమాధి అను పది రకములైన అభ్యాసములచే మానవుడు ప్రకృతి-పురుష వివేకము పొంది ముక్తుడగును.

న్యాయ దర్శనము:
న్యాయ దర్శనము శాస్త్రములకు శాస్త్రమని అర్ధము. దీనికి మరో పేరు తర్కశాస్త్రము. అంత మాత్రము చేత న్యాయ దర్శనమును తర్క శాస్త్రము అని అనరాదు.
తాత్విక సమస్యలపై వాదోపవాదాలకు అవసరమైన నియమ నిబంధనలే న్యాయ దర్శనముగా గౌతమ మహర్షి సూత్రబద్దం చేసాడు. దీనిలో మొత్తం 524 సూత్రాలు ఉన్నాయి.
న్యాయదర్శనం యొక్క పదహారు పదార్థాలను (షోడశపదార్థములు) తెలుసుకుంటే నిశ్శ్రేయసం (మోక్షం) ప్రాప్తిస్తుందని వాగ్దానం చేస్తుంది. అవి: ప్రమాణం, ప్రమేయం, సంశయం, ప్రయోజనం, దృష్టాంతం, సిద్ధాంతం, అవయవం, తర్కం, నిర్ణయం, వాదం, జల్పం, వితండం, హేత్వాభాసం, ఛలం, జాతి, నిగ్రహ స్థానం.

వైశేషిక దర్శనము:
వైశేషిక దర్శనమును కణాద మహర్షి ప్రవర్తింపజేశారు. ఈ రెండు దర్శనాలలో చాలావిధాలుగా పోలికలున్నాయి. ప్రపంచము పరమాణువులచే నిర్మించబడినది. కుండను చేయడానికి కుమ్మరి ఉండాలి గదా! అలాగే సృష్టిని చేసేవాడొకడుండాలి. అతడే భగవంతుడు. అని న్యాయదర్శనములో చెప్పారు.
జీవులు కర్మ బద్ధులై సుఖదుఃఖములను అనుభవిస్తున్నారు. సత్కర్మలను భగవత్ప్రీతి కోసం చేసేవారికి భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. వారికి యోగమార్గంలో మోక్షం లభిస్తుంది.

పూర్వమీమాంస: వేదముల మొదటి భాగం ఆధారంగా ఏర్పడింది పూర్వ మీమాంస దర్శనము. ఈ దర్శన కర్త జైమిని మహర్షి. ఇది వేదములలో చెప్పిన యజ్ఞయాగాది కర్మలకు ప్రాముఖ్యము ఇస్తుంది. వేద నిషిద్ధములైన కర్మలు చేసేవారు నరకానికి వెళతారు. లేదా క్రిమికీటకాది నీచ జన్మలు పొందుతారు. వేదాలలో చెప్పిన యజ్ఞయాగాది కర్మలు చేసేవారు స్వర్గానికి వెళతారు. కర్మ ఫలాన్ని ఇచ్చేవాడు భగవంతుడు అనే వాదాన్ని పూర్వమీమాంస అంగీకరింపదు.

ఉత్తరమీమాంస: వేదముల ఉత్తరభాగము ఆధారముగా వెలువడినది ఉత్తరమీమాంసా దర్శనము. దీనినే వేదాంత దర్శనము అనీ, బ్రహ్మసూత్రములు అనీ అంటారు. ఇది వేదముల చివరి భాగమైన ఉపనిషత్తులనుండి ఉద్భవించినది. ఇది ఆరు దర్శనములలోను ప్రముఖ స్థానము ఆక్రమించుచున్నది. ఈ దర్శనము జీవాత్మకు, పరమాత్మకు గల సంబంధమును ప్రతిపాదించును. వ్యాస మహర్షి రచించిన బ్రహ్మసూత్రములను వేర్వేరు భాష్యకారులు వ్యాఖ్యానించిన విధముపై వేర్వేరు శాఖాభేదములు ఏర్పడినవి. వాటిలో అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము - అనే మూడు సిద్ధాంతములు ప్రసిద్ధములు.

ఇవన్నీ వేదములు ప్రమాణంగా చెప్పబడిన దర్శనాలు. ఇవే కాక వేదములను అంగీకరింపని వారు (చార్వాకులు, బౌద్ధులు, జైనులు ఇలాంటి వారు) చెప్పిన దర్శనాలు కూడా ఉన్నాయి

పంచ గయలు



మన దేశంలో మొత్తం 5 గయలు ఉన్నాయని చెబుతారు.


1. శిరోగయ, 2. నాభిగయ, 3. పాదగయ, 4. మాతృగయ, 5. పితృగయ.

 🔹1. శిరోగయ : బిహార్ రాష్ట్రంలో ఫల్గుణీ నదీ తీరంలో “శిరోగయ” గా వెలసింది. దీనినే బుద్ధగయ అని కూడా అంటారు.

 🔹2. నాభిగయ : జాజాపూర్, ఒరిస్సా రాష్ట్రంలో వైతరణి నదీ తీరంలో వున్న ప్రదేశంను “నాభిగయ” అని అంటారు.

🔹 3. పాదగయ : పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్‌లో గయని పాదాలుండటం వలన అవి వున్న ప్రదేశం పిఠాపురాన్ని “పాదగయ” అంటారు.

 🔹4. మాతృగయ : గుజరాత్ రాష్ట్రంలో మహేషన జిల్లాలో సరస్వతీ నదీ తీరంలో గల ప్రాంతాన్ని “మాతృగయ” అని అంటారు. బిందు సరోవరమనే మరో పేరు కూడా కలదు. అహమ్మదాబాదుకు 32 కి||మి|| దూరంలో గల మాతృగయలో మాతృవంశం వారికి పిండప్రదానం మరింత ముఖ్యం. ఒరిస్సాలోని భువనేశ్వర్‌కి 33 కి||మి|| దూరంలో వున్న బిందు సరోవరం వద్ద కూడా పిండ ప్రదానాలు చేస్తారు.

🔹 5. పితృగయ : బధరీనాథ్, ఉత్తర ప్రదేశ్‌లోని అలకనందా నదీ తీరంలో గల “బ్రహ్మకపాలం” అనే ప్రదేశాన్ని “పితృగయ” అంటారు.

ఏకాదశి : ఉపవాసం ఫలితం

ఏకాదశి : ఉపవాసం ఫలితం.. ఎవరు ఆచరించాలి ?
ఏకాదశి ఉపవాసాన్ని చాలామంది ఆచరిస్తుంటారు. కర్మసిద్ధాంతాన్ని ఆచరించే శైవులు, వైష్ణవులు బేధం లేకుండా ఆచరించే వ్రతాలల్లో ఏకాదశి వ్రతం ఒకటి. ప్రతి నెల వచ్చే రెండు ఏకాదశలను వ్రతంలాగా ఆచరిస్తే మోక్షం తప్పనిసరిగా లభిస్తుందని పురాణాలు పేర్కొన్నాయి. అంతేకాదు ఈ వ్రతం ఆచరించిన వారికి సకల పాపాల నుంచి విముక్తి, ఆయురారోగ్యాలు లభిస్తాయి. అయితే ఈ వ్రతాన్ని ఆచరించిన తర్వాత ద్వాదశి నాడు ఉదయాన్నే భోజనం చేయాలి.

ద్వాదశ పారణం అంటే ఏంది?
ఏకాదశి వ్రతం ఆచరించి అంటే ఉపవాసం ఉన్నవారు తర్వాతి రోజు అంటే ద్వాదశి తిథినాడు భోజనం చేసే విధానాన్ని పారణం అంటారు. ద్వాదశినాడు ద్వాదశి ఘడియలు వెళ్ళాకముందే పారణం (భోజనం) చేయాలి. దేవతలకు ఆరునెలలు పగలు, ఆరునెలలు రాత్రి. దక్షిణాయానం రాత్రికాలం. ఈ చీకటి తొలగి దేవతలు వెలుగులోకి వస్తారు. అంటే వారికి పగలు ప్రారంభమైనట్టు. అందుకే ఆ రోజు ఉపవాసం పుణ్యప్రదం. బ్రహ్మ స్వేదబిందువు నుండి రాక్షసుడు జన్మించాడని, బ్రహ్మ ఆజ్ఞతో ముక్కోటి ఏకాదశీ నుండి అన్నంలో నివసిస్తాడని పురాణ కథనం. అందుకే ప్రతి ఏకాదశినాడు భోజనం మాని ఉపవాసం ఉండాలంటారు. ఏడాదిలో 24 ఏకాదశుల్లో ఉపవాసం ఉంటే వచ్చే మొత్తం ఫలితం ముక్కోటి ఏకాదశి ఆ రోజు అవకాశం లేనివారు తొలి ఏకాదశినాడు ఉంటే లభిస్తుంది.




ఏకాదశి వ్రతాన్ని ఎవరు ఆచరించాలి?
ఈ ఏకాదశి వ్రతాన్ని గృహస్థులందరూ ఆచరించవచ్చు. ఏకాదశి దీక్ష ముఖ్యముగా ఉపవాస ప్రధానం. గరుడ పురాణములో
ఊపోష్య ఏకాదశ్యాం నిత్యం పక్షయోరుభయోరపి !
కృత్వాదానం యథాశక్తి కుర్యాశ్చ హరిపూజనమ్ !!
అని చెప్పబడినది. అనగా ఉపవాసం, దానం, హరి పూజ అనేవి ఏకాదశి వ్రతములో ముఖ్యమైన విశేషాలు. ఏకాదశి నాడు ఉపవాసమున్నవారు ద్వాదశినాడు విష్ణుపూజ చేసి ఆ విష్ణువుకి నివేదించిన పదార్థాలను ఆహారంగా స్వీకరించాలి. విష్ణువుకు నివేదించకుండా ఆహారం స్వీకరిస్తే అది దొంగతనంతో సమానమని శాస్ర్తాలు పేర్కొన్నాయి.

ఉపవాసం ఎవరు ఉండ కూడదు?
ఎనిమిదేండ్లలోపు పిల్లలు, 80 ఏండ్లు దాటిన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, శ్రామికులు, కర్షకులు, ఉద్యోగానికి తప్పక వెళ్లాల్సినవారు ఉపవాసాన్ని ఆచరించకున్నా దోషం లేదు అని పురాణాలు పేర్కొన్నాయి. ఇక గృహస్తులు, సన్యాస ఆశ్రమంలో ఉన్నవారు తప్పక ఈ దీక్షను ఆచరించాలి.

ఏకాదశినాడు ఏం తినవచ్చు?
ఏకాదశినాడు పూర్తిగా ఉపవాసం ఉండలేనివాళ్ళు పండ్లు, సగ్గుబియ్యం, పాలు, పెరుగు, మజ్జిగ తీసుకోవచ్చు. ధాన్యాలు కాని, పప్పుదినుసులు కానీ స్వీకరించరాదని పురాణాలు చెప్తున్నాయి.

కాళిదాసుకు అమ్మ పరీక్ష

మండు వేసవిలో ఒకరోజు మహాకవి కాళిదాసు పరదేశానికి బయల్దేరాడు. మిట్టమధ్యాహ్న సమయానికి ఒక కుగ్రామానికి చేరుకున్నాడు. బాగా దాహం వేయడంతో ఓ గుడిసె దగ్గరికి నీళ్ల కోసం వెళ్తాడు. ఓ బాలిక నీటి కుండతో గుడిసెలోకి వెళ్తుంటుంది. ఆమెను చూసి ‘బాలికా! నాకు దాహంగా ఉంది. నీళ్లు ఇవ్వమ’ని అడిగాడు కాళిదాసు. అప్పుడా బాలిక.. ‘మీరెవరో నాకు తెలియదు.. నీళ్లు ఎలా ఇచ్చేద’ని బదులిచ్చింది. కాళిదాసు ‘నేను ఎవరో తెలియకపోవడం ఏంటి? పెద్ద పండితుడను. ఎవరిని అడిగినా చెబుతార’ని అన్నాడు. అహంకార పూరితమైన ఆ మాటలు విని బాలిక నవ్వి.. ‘మీరు అసత్యమాడుతున్నారు. ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు. వారెవరో చెబితే నీళ్లు ఇస్తాను’ అంటుంది.

అప్పుడు కాళిదాసు కాసేపు ఆలోచించి.. ‘నాకు తెలియదు. గొంతు ఎండిపోతోంది. ముందు నీళ్లు ఇవ్వమ’ని బతిమాలుకుంటాడు. అయినా ఆ బాలిక కనికరించదు. ‘ఇద్దరు బలవంతులు ఎవరో కాదు ఆకలి, దాహం. ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు?’ అని అడుగుతుంది బాలిక. ‘నేను బాటసారి’ని అన్నాడు కాళిదాసు. ‘మళ్లీ అసత్యమాడుతున్నారు. బాటసారి అంటే ఒకచోటి నుంచి మరోచోటికి బడలిక లేకుండా వెళ్లాలి. మీరేమో అలిసిపోయారు కదా. ఈ లోకంలో అలా అలసిపోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు. వారే సూర్యచంద్రులు!’ అని చెప్పి గుడిసెలోకి వెళ్లింది బాలిక.

దాహానికి తట్టుకోలేక.. ఆ గుడిసె ముందే నిలబడి.. ‘మాతా నీళ్లు ఇవ్వండి. దాహంతో చనిపోయేలా ఉన్నాను..’ అని ప్రాధేయపడ్డాడు కాళిదాసు. లోపలి నుంచి ఓ ముసలావిడ బయటకు వచ్చి.. ‘మీరెవరో సెలవివ్వండి.. నీళ్లిస్తాను’ అంది. కాళిదాసు దీనంగా.. ‘నేను అతిథిని..!’ అని బదులిచ్చాడు. ‘మీరు అసత్యం చెబుతున్నారు. ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు. ఒకటి ధనం, రెండోది యవ్వనం. ఈ రెండూ ఎప్పుడు వెళ్లిపోతాయో ఎవరికీ తెలియదు’ అంటుంది. కాళిదాసు.. ‘నేను సహనశీలిని నీళ్లు ఇవ్వండ’ని వేడుకుంటాడు. కానీ ఆమె ‘మీరు మళ్లీ అసత్యమే చెబుతున్నారు. ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలురు ఉన్నారు. ఒకటి భూమి, రెండోది వృక్షం. ఇప్పుడు నిజం చెప్పు నీవెవరు?’ అని అడిగింది.

ఓపిక నశించిన కాళిదాసు.. ‘నేను మూర్ఖుడను. ఇప్పుడైనా నీళ్లివ్వండ’ని అడిగాడు. ఆ అవ్వ నవ్వుతూ.. ‘ఇదీ అసత్యమే. ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు. అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు’ అని అంటుంది. ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది. ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు. ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది. ‘కాళిదాసా..! విద్యతో వినయం వృద్ధి చెందాలి కానీ, అహంకారం కాదు నాయనా! కీర్తిప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ  బుద్ధిని మరల్చడానికే ఈ పరీక్ష’ అని జలమును అనుగ్రహిస్తుంది.

గమనిక;- విద్య, అధికారం, ధన బలము తో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి

తొలిఏకాదశి*


*ఆషాడ శుక్ల ఏకాదశి - 1 జులై 2020🚩*

*ఉపవాస ప్రారంభం 19:49, జూన్ 30  నుండి ఉపవాస సమాప్తం 17:29, జులై 01*

 ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, *ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు*. పూర్వకాలంలో ఈ రోజునే *సంవత్సరారంభంగా పరిగణించేవారు*. వానాకాలం మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువు యమ దంష్ట్రిక (యముడి కోర). *ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలూ పబ్బాలూ ఎక్కువ. లంఖణం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి.*

*ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది.* తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు *ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని* నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత *కార్తీక శుద్ధ ఏకాదశి* నాడు మేల్కొంటాడంటారు. ఈ ఏకాదశిని పద్మఏకాదశిగా కూడా పిలుస్తారు. *ఈ యోగ నిద్ర అనేది భూమి పై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన*.తద్వారా ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి. 

*భవిష్యోత్తరపురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు.*

తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు, తన శరీరము నుంచి జనింపజేసిన కన్యక నే *"ఏకాదశి"* అంటారు.ఏకాదశీ వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు- మోహిని రూపంలో వచ్చి ఏకాదశిపూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట.  *చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు. రైతులు ఆరోజున కచ్చితంగా పేలపిండి తింటారు. ఏకాదశినాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది.*

ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక. *ఏకాదశి అంటే పదకొండు. అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు. వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి వాటినన్నటినీ ఒకటిగా చేసి, అప్పుడు దేవునికి నివేదన చేయాలి. దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్దకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం.*

*పురాణ నేపథ్యం*

ధర్మము తప్పని, సత్యసంధుడు అయిన రాజు మాంధాత. అతని రాజ్యంలో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది. దానితో ప్రజలు పడరాని పాట్లు పడుతుంటే అంగిరసుడు సూచన పై ఈ శయనైక ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేస్తాడు, దానితో వర్షం వచ్చి కరువు తీరి ప్రజలు సుఖంగా వున్నారని పురాణాలు చెపుతున్నాయి. *విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళతాడని పెద్దలు చెప్పగానే, నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది. విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం. అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట. ఇప్పటివరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు, ఈ రోజు నుంచి దక్షిణదిక్కుకు వాలుతాడు. అంటే ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు. దానినే సాధారణ పరిభాషలో నిద్రపోవడం అని అభివర్ణించారు. సాక్షాత్తు భగవంతుడే నిద్రిస్తుంటే ఈ పూజలు ఎవరికి చేయాలి అనుకోవచ్చు. ఈ నెలలోనే ప్రకృతిలో, పర్యావరణంలో మార్పులు వస్తాయి. తద్వారా మన శరీరానికి జడత్వం వచ్చి, అనేక రోగాలు చుట్టుముడతాయి. ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై, దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియనిగ్రహాన్ని కలిగిస్తుంది. ఇంతేకాక కష్టపరిస్థితుల్లోను, భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి. ఇందువలన కామక్రోధాదులను విసర్జించగలుగుతారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. అలా ఏకాదశినాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది.*
 
ఈ పండుగకు పేల పిండిని తినే ఆచారము ఉన్నది *పేలాలలో బెల్లాన్ని, యాలకులను చేర్చి దంచి ఈ పిండిని తయారుచేస్తారు ఈ దినాన ప్రతి దేవాలయంలోను పేలా పిండిని ప్రసాదంగా కూడా ఇస్తారు.ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది. బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం. కావున శరీరానికి ఈ పిండి వేడిని కలుగజేయడమేగాక, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడటానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది.

*శైవము*

హైందవ మత సంప్రదాయములో *పరమశివుని ప్రధాన అధిదేవతగా ఆరాధించే శాఖను శైవము అంటారు.* వీరు శివాలయాలలోని లింగాకారంలో నున్న శివుని పూజిస్తారు. శివారాధకులను శైవులు అని అంటారు. శైవ మతాన్ని ప్రచారం చేయటానికి సాహిత్యాన్ని సృష్టించిన వారు శివకవులు. వారిలో *నన్నెచోడుడు, మల్లికార్జున పండితుడు, పాల్కురికి సోమనాథుడు* ముఖ్యులు. వీరిని *"శివ కవిత్రయము"* అని అంటారు.

*వీరశైవం*

ఆది జగద్గురు *శ్రీ రేణుకాచార్య భగవత్పాదులు శ్రీ స్వయంభు సోమేశ్వర లింగం నుండి లింగోద్బవం చెంది పరమశివుడి ఆనతి మేరకు ఈ భుమండలంపైన శక్తివిశిష్టాద్వైతాన్ని స్థాపించడం జరిగింది.* ఈ శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్నే *వీరశైవంగా* పిలుస్తారు. శివునికి ఐదు ముఖాలు - *సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన*. ఈ ఐదుగురి అంశలలో ఉద్భవించినవారు *పంచాచార్యులు*. వారు చారిత్రక వ్యక్తులో, కాదో తెలియదు. *స్వయంభువులుగా* చెప్పబడుతారు. వారిపేర్లు *రేణుకాచార్య, మరుళారాధ్య, ఏకోరామారాధ్య, పండితారాధ్య, విశ్వారాధ్య* అనేవారు.వారి అనుగ్రహాన్ని కోరుదాం. ఈ సిద్ధాంత శిఖామణి *రేణుకాచార్య - అగస్త్య సంవాదంగా* చెప్పబడుతుంది. ఈ వీరశైవ సామ్రాజ్యానికి ఐదు ముఖ్య పీఠాలున్నాయి. వానిని మొదట పాలించినది పంచాచార్యులు. అవి *బాళేహెణ్ణూరు, ఉజ్జయిని (ఉజ్జిని)(కర్ణాటక), కేదారనాథ్ (ఉత్తరాఖండ్) , శ్రీశైలం, కాశీ.* వీరశైవ మతానికి సంబంధించి మూలమైన అయిదుగురు పంచాచార్యులలో ఈ రేణుకులు ప్రథములు. వీరి గురించి 28 శివాగమాలలో చాలా చోట్ల ప్రస్తావించబడింది. ప్రధానంగా *స్వయంభువాగమ, వీరాగమ, సుప్రభేదాగమాల్లో* వివరించబడి ఉంది. వీరు వీరసింహసనం అను పేర పీఠమును స్థాపించడం జరిగింది ఈ పీఠమూల పరంపర ఇప్పటికీ కొనసాగుతున్నాయి. శ్రీ రెణుకాచార్యుల వారు కృతయుగమున అగస్త్య మహాముని వినతి మేరకు అగస్త్యునికి శైవ సిద్దాంతమును ఉపదేశించారు.

*రేణుకాచార్యులు అగస్త్య మహామునికి ఉపదేశించిన శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్ని, శివయోగి శివాచార్యులు "సిద్దాంత శిఖామణి" పేరిట సంస్కృత భాషలో గ్రంథస్తం చేయటం జరిగింది*. ఈ గ్రంథం అప్పటికే వీరాగమాది 28 గ్రంథాల్లో ఉన్న వీరశైవ తత్వాన్ని సంగ్రహించి రాయటం జరిగింది. *సిద్దాంత శిఖామణి,* సిద్దంతాలకన్నిటికీ తలమానికమై శిరోరత్నమువలె భాసిల్లటం జరుగుతుంది. ఈ శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్ని రేణుకాచార్యుడు బోధించటం వలన దీనిని *"రేణుకాగీత"* అని కూడా పిలవబడుతుంది

*బ్రహ్మసూత్రములకు శక్తి విశిష్టాద్వైత సిద్దంతపరంగా (వీరశైవ పరంగా ) భాష్యము - నీలకంఠ భాష్యం వ్రాసిన శ్రీకంఠ శివాచార్యులు వీరశైవులకు ఆగమోక్త ప్రామాణిక గ్రంథమైన సిద్దాంత శిఖామణి* గూర్చి ప్రస్తుతించటం జరిగింది. ఈ గ్రంథమే సమస్త వీరశైవులకు ప్రామాణిక గ్రంథము.

శ్రీకంఠ శివాచార్యులు కూడా తమ బ్రహ్మసూత్ర భాష్యం శ్రీకంఠ భాష్యములో సిద్దాంత శిఖామణి శ్లోకములను ప్రమాణ యుక్తముగా ఉదహరించుట జరిగింది.

10వ శాతబ్దంలో బ్రహ్మసూత్రములకు శక్తి విశిష్టాద్వైత సిద్దంతపరంగా (వీరశైవ పరంగా ) భాష్యము శ్రీకరభాష్యం వ్రాసిన శ్రీపతి పండితాచార్యుడు వీరశైవులకు ఆగమోక్త ప్రామాణిక గ్రంథమైన సిద్దాంత శిఖామణి గూర్చి  ప్రస్తుతించటం జరిగింది.

వేదవ్యాసుడు తన స్కంద పురాణము శంకర సణితలో అధ్యాయము 85 లో శ్రీశైల సూర్యసింహనాధీశులైన జగద్గురు శ్రీ సదానంద శివాచార్య భగవత్పాదుల గారిని గూర్చి ఈ విధముగా స్తుతించారు.

తస్మిన్ శ్రీ పర్వతేపుణ్యే, సన్సారామయభేషజే| ఆస్తే లింగాంగ సంబంధీ, సదానందాహ్వయోమునిః|| సర్వోపనిషదర్ధజ్ఞః - శివధ్యాన పరాయణాః| భస్మావలిప్త సర్వాంగో -రుద్రాధ్యాయ జపాశ్రయః|| రుద్రాక్ష మాలాభరణో - దృతపాశుపత వ్రతః| అతివర్ణాశ్రమీయోగి -జీవన్ముక్తో జగద్గురుః|| తం సదానంద నామానం -- శంకరధ్యాన లాలసం| నిరస్తకుహకం విప్రం - సహపుత్రేణ పూజయ|| తస్యప్రసాదత్వే - పుత్రోగచ్చేన్నీరోగతాం ధ్రువం| తస్మాదుత్తిష్ఠ గచ్చత్వం - శ్రీఅ పర్వతమతంద్రితః||

తాత్పర్యము:- *శ్రీశైల సూర్యసింహనాధీశులైన జగద్గురు శ్రీ సదానంద శివాచార్య భగవత్పాదులు సంసార రోగమును పారద్రోలుదురు. పరమ పవిత్రులు, భస్మరుద్రాక్షధారులు, శ్రీ రుద్రాధ్యాయ, జపాసక్తులు, (సంసార రోగ నాశకులు) జీవన్ముక్తులు, జగద్గురువులు, శ్రీశైల క్షేత్రమున ఉన్నారు. వారిని పూజించినట్లయితే వారి అనుగ్రహము వలన నీ కుమారుడైన పింగళుడు రోగ విముక్తుడు అగును. నీవు తక్షనమే శ్రీశైల క్షేత్రమునకు వెళ్లుమని హరప్రియుడు శ్వేతునకు చెప్పినట్లు వేదవ్యాస మహర్షి స్కంద మహాపురాణము యొక్క శంకర సంహిత లోని 85వ అధ్యాయములో శ్లొకము 90 నుండి 95వ శ్లోకము వరకు వివరించి ఉన్నాడు.,* తన పద్మపురాణాంతర్గత, శివగీత 16 వ అధ్యాయం యందు అఙ్ఞో పహాస భక్తాశ్చ-భూతి రుద్రాక్షధారిణ| లింగినోయశ్చవాద్వేష్టి - తేనైనా త్రాధికారిణ||

ప్రతిమా శివలింగంవా - దేవ్యైరేతః కృతంతుయత్| తత్రమాం పూజయేత్తేషు - ఫలం కోటి గుణోత్తరమ్||

తా: *అఙ్ఞాని, అపహాస్యము చేయువాడు, విభూతి రుద్రాక్ష లింగదారులె ఉన్న శివభక్తులను ద్వేషించువారు మోక్షమును పొందుటకు అర్హులు కారు. ఎవరైతే భక్తితో శివలింగాన్ని పూజిస్తారో, వారే ముక్తిని పొందుటకు అర్హులు.*

తన శివ మహాపురాణము యొక్క విద్వేశ్వర సంహితలో 16వ అధ్యాయములో 159వ స్లోకమున శివభక్తో వసేన్నిత్యం - శివలింగం సమాశ్రితః| పూజయాచర లింగస్య - క్రమాన్ముక్తో భవేధ్రువమ్||

తా: *శివభక్తుడైనవాడు ఎల్లప్పుడూ తన దేహము పై శివలింగమును ధరించియున్నను జంగమమూర్తి పూజ వలననే మోక్షమును పొందగలడు అని చెప్పబడింది.*

*నాయనార్లు:*

శైవ శాఖలో వీరు చెప్పుకోదగ్గవారు. *వైష్ణవశాఖలో ముఖ్యమైన 12 మంది ఆళ్వార్లతో కలిపి వీరిని దక్షిణ భారతదేశంలో పరమ భక్తాగ్రేసరులుగా వ్యవహరిస్తారు వీరుమొత్తం 63 (అరవై ముగ్గురు) మంది.* తమ కవిత్వంతో శివుణ్ణి కీర్తించిన *అపర భక్తాగ్రేసరులు*. వీరి చరిత్ర తమిళంలోని *'పేరియ పురాణం'* లో చక్కగా వివరించబడింది. దీనిని రచించినది సెక్కిళార్. ఈ నయనార్లలో *భక్త కన్నప్ప, కరైక్కాల్ అమ్మన్* మొదలగు వారు పెక్కు ప్రసిద్ధులు. 

*లింగాయత్*

భారతదేశంలో శైవం ఎన్నో శాఖలుగా రూపాంతరం చెందింది. వాటిలో *లింగాయత్ శైవం* కర్ణాటకలోని ప్రసిద్ధ శైవ శాఖ. ఈ పద్ధతిని *బసవేశ్వరుడు* ప్రారంభించాడు. *ఈ శైవాన్ని పాటించేవారు తమ కంఠంలో చిన్న శివ లింగాన్ని ధరిస్తారు. ఆ శివ లింగానికి రోజూ నీటితో అభిషేకం నిర్వహించి మరల ఆ లింగాన్ని తమ కంఠంలో ధరిస్తారు.*

*శివాలయం*

*శివుని ఆరాధనకు శివాలయం ప్రధానమైన కేంద్రం.* మన దేశంలోను, రాష్ట్రంలోను ఎన్నో శివాలయాలు ఉన్నాయి. వానిలో ముఖ్యమైనవి *ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచ భూత లింగాలు,  పంచారామాలు.*

*ఏకదండి..ద్విదండి..త్రిదండి*



మనం ఎంతో మంది పీఠాధిపతులను లేదా యతీంద్రులను (స్వాములను) చూస్తూ వుంటాం. వారి చేతుల్లో కర్రలు పట్టుకొని వుండటం కూడా చూసివుంటాం. ఆ *కర్రలను దండెములు* అంటారు. అవి,  *వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత మరియు విశిష్టాద్వైత* భావానికి సంకేతాలు. వారు చేతిలో పొడవాటి కర్రలు ఎల్లవేళలా పట్టుకుంటారు. ఈ (దండాలు) కర్రలు వివిధ ఆకారాలలో ఉంటాయి. ప్రతీదానికి కూడా ఓ అర్థం ఉంది. *గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాల సమ్మేళనమే మనిషి, కాబట్టి సన్యాసులు అయిదు అడుడుగుల కర్రను ధరిస్తారు.* 

ఆ యతీంద్రులు తమ చేతి ధరించే, *కర్రలలో ఏకదండి (ఒక కర్ర), ద్విదండి (రెండు కర్రలు), త్రిదండి (మూడు కర్రలు)* అని మూడు విధాలుగా ఉన్నాయి. దండి అంటే కర్ర అని అర్థం. *ఒక కర్రను (ఏకదండి) ధరించే వారు అద్వైత సిద్ధాంతాన్ని నమ్మేవారని అర్థం. అద్వైతం అనగా జీవాత్మ, పరమాత్మ ఒక్కటేననే సిద్ధాంతం. అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ, అన్యాయ మార్గాన సంచరించినా, ప్రవర్తించినా ఆ పాపఫలితాన్ని బతికి ఉండగానే ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదు అనే సిద్ధాంతాన్ని వారు బోధిస్తారు. ఇది  జగద్గురు ఆది శంకరాచార్యుల వారు బోధించినది. ఈ అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించే వారి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టు నుండి సేకరించిన ఒక కర్ర ఉంటుంది.*

ఇక రెండవ సిద్ధాంతం ద్వైతం. *రెండు కర్రలు కలిపి (ద్విదండి) ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతం అనసరించి బోధించేవారు. వీరి ప్రథమాచార్యుడు మధ్వాచార్యులు. వీరిని ‘ద్విదండి స్వాములు’ అంటారు వీరు విష్ణుభక్తులు. వీరు పరమాత్మ వేరు మరియు జీవాత్మ వేరు అని బోధిస్తారు. జీవుడు మిథ్య కాదు. అలాగే జడ జగత్తు కూడా మిథ్య కాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవజగత్తులు కూడా అంత సత్యం.*

ఇక మూడవది విశిష్టాద్వైతం. *మూడు కర్రలను కలిపి (త్రిదండి) భుజాన పెట్టుకునేవారిని తత్వత్రయం అనుసరించే వారు అంటారు. వీరిది భగవద్రామానుజాచార్యుల పరంపర. ఈ సిద్ధాంతం ప్రకారం, శరీరంలో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడని, జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి సత్యాలని, ఈ మూడింటిని నారాయణ తత్వంగా నమ్ముతూ, జీవుడు ఆజ్ఞానంతో సంసార బంధంలో చిక్కుకుంటాడని, నారాయణుని శరణు వేడిన వారు భగవదనుగ్రహం వలన అజ్ఞానం నుండి విముక్తులై, మరణానంతరం నారాయణ సాన్నిధ్యం (మోక్షం) పొందుతారని, వారికి మరుజన్మ ఉండదని విశిష్ఠాద్వైతపు సిద్ధాంతాన్ని బోధిస్తారు.*

ఈ మూడు కర్రలలో, *ఒక్కో దండం ఒక్కోక్క తత్వానికి గుర్తు. ఒకటి జీవుడికి, ఒకటి ప్రకృతికి మరియూ ఒకటి పరమాత్మకి.* మనం చూసే ఈ ప్రపంచం అంతా *ఈ మూడు తత్వాలతోనే నిండి ఉంటుంది అని వేదం తెలియజేస్తుంది.* వేదార్థాన్ని వివరించే పురాణాలు, ఇతిహాసాలు, వాంగ్మయాలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. *తత్వాలు అన్నింటినీ మూడుగా విడదీయవచ్చు*. 

అందులో మనం లెక్కకు అందనంత మంది జీవులు వుంటారు. రెండోది రకరకాల చిత్ర విచిత్ర రూపాలు మార్చుకొనే పంచభూతాత్మకమైన ప్రకృతి. ప్రకృతి అంటే అచేతనమైనది మరియు ప్రకృతికి జ్ఞానం ఉండదు. అందుకే దానిని అచిత్తు అని అంటారు. చేతన రహితమైనప్పటికీ చేతనమైన జీవ సంబంధంచే తన రూపాన్ని మార్చుకుంటుంది. కర్మ సంబంధం చేత సహజమైన జ్ఞానం కలిగి అణుస్వరూపుడైన జీవులు, ఈ ప్రకృతిని శరీరాలుగా దాల్చి ఉంటారు. ఎనభైనాలుగు లక్షల రకాల జీవులు ఈ విశ్వంలో వుంటారని చెబుతారు. ఈ జీవులంతా ప్రకృతిలో సంచరిస్తూ, కర్మ అనుభవాన్ని కష్టమైనదో లేక సుఖమైనదో ఎదో ఒకదాన్ని పొందుతూ ఉంటారు. *ప్రకృతిని జీవరాశిని ఈ రెండు తత్వాలని నిరంతరం బయట లోపల వ్యాపించి వాటిని నిలబెట్టి, వాటికి కావల్సిన శక్తిని ఇచ్చి నడిపిస్తూ ఉండే తత్వం పేరే పరమాత్మ.* ఈ పరమాత్మ అనే తత్వం మూడోది. *ఈ మూడు తత్వాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి, విడిచి ఉండటం అనేది లేనే లేదు*. పరమాత్మ జీవాత్మ ప్రకృతిలలో వ్యాపించి ఉంటాడు. జీవుడు ప్రకృతిలో నిరంతరం ఉంటాడు. అంటే మరి ముక్తి ఉండదా అని అంటే అట్లాంటి సందేహం అవసరం లేదు. *ప్రకృతి అనేక రకాలుగా అనేక గుణాలతో ఉంటుంది. ప్రకృతికి సత్వ, రజస్సు అని మరియు తమస్సు అనే గుణాలు కలిసి వుంటాయి. అందుకే మిశ్రమ తత్వం అని పేరు. రజస్సు, తమస్సు ఏమాత్రం లేని కేవలం సత్వం మాత్రమే ఉండే సుద్ద సత్వ ప్రకృతి విరజా నదికు ఆవల ఉండే ప్రకృతి. ఇవి రెండు కాక గుణములకు అతీతమైన కాలం అనేది ఒక ప్రకృతి. కాలం కూడా ప్రకృతిలో ఒక భాగమే, అందుకే అది సత్వ శూన్యం అని పేరు. ఇలా మూడు రకాలుగా ఉండే ప్రకృతి, ఎన్నో జీవులు, వీటికి వెనకల ఉండి నడిపించే పరమాత్మ ఈ మూడుతత్వాలని విశ్వసించి మనకు మార్గం చూపే యతులు త్రిదండాన్ని ధరించాలని శాస్త్రం యొక్క నిర్ణయం.* ఈ మూడు దండాలను కలిపి కట్టి, ధరించిన వ్యక్తిని త్రిదండి అని అంటారు. చక్రం ధరించిన వాడిని చక్రీ అన్నట్టుగానే 'త్రిదండీ' అని సంస్కృతంలో పదం వస్తుంది, అదే తెలుగులో 'త్రిదండి' అని వ్యవహరిస్తాం. శ్రీవైష్ణవ సంప్రదాయంలో యతులు త్రిదండాన్ని ధరించాలని నియమం. వేదం కానీ, ఇతిహాసాలు ఇదే విషయాన్ని ప్రస్తావించాయి. *దత్తాత్రేయుడు అనే భగవంతుడు వేదోద్దరణకై ఎత్తిన అవతారం. కర్నాటక రాష్ట్రంలో, మండ్యా దగ్గరలో మేలుకోట క్షేత్ర ప్రాంతంలో ఆయన పాద చిహ్నాలు ఉంటాయి. అక్కడి పుష్కరిణికి దత్తాత్రేయ పుష్కరిణి అని పేరు. భగవంతుడు, అత్రి మహర్షికి అనసూయకు తనను తానే వారి పుత్రునిగా అర్పించుకోవడం చేత దత్తుడు అయ్యాడు. అందుకే ఆయన పేరు దత్తాత్రేయుడు అయ్యింది. వైదిక ధర్మాన్ని లోకానికి నెలకొల్పి ఉన్నాడు, ఆయనకూడా త్రిదండి సన్యాసి అని తెలుస్తున్నది.*  మనకు ప్రామాణికమైన గ్రంథాలు తెలిపే దత్తాత్రేయుడు త్రిదండి సన్యాసి అని తెలుస్తున్నది. అందుకే అవసరం ఏర్పడినప్పుడు త్రిదండి సన్యాసులు మేలుకోటలో దత్తాత్రేయుని వద్దకి వెళ్ళి తిదండాన్ని పొందే సంప్రదాయం ఉంది. రామానుజుల వారి చరిత్రలో వారికి కుళోత్తుంగచోళుడి వల్ల ఏర్పడ్డ ఉపద్రవం నుంచి రామానుజుల వారిని తప్పించడానికి, కూరేశులు రామానుజులవారి దండాన్ని మరియు కాశాయాన్ని తాను ధరించి, రామానుజులవారిని పశ్చిమ దేశం వైపు పంపారు. రామానుజులవారు మేలుకోట ప్రాంతం చేరే సరికి వారి వద్ద త్రిదండం, కాశాయం లేదు. తిరిగి వాటిని పొందే అవకాశం లేదు. అందుకే వారు మేలుకోటలోని దత్తాత్రేయుడి వద్ద కొత్త త్రిదండాన్ని, కాశాయాన్ని ఉంచి స్వీకరించినట్లు చరిత్ర చెబుతుంది.

ప్రభావిద్య

గతంలో తరుణీవిద్యను ఉపదేశించారు. ఇప్పుడు తరుణీ విద్యకు ఆంగభూతమైన ప్రభావిద్యను ఉపదేశిస్తున్నారు. ఆ పరమేశ్వరి కోటి సూర్యప్రభలతో వెలుగొందుతూ ఉంటుంది. ఇక్కడ కోటి అనే
నామం సంఖ్యావాచకం కాదు. అనేకానేకమైనటువంటి, లెక్కలేనటువంటి కాంతి కిరణము లతో ఆ పరమేశ్వరి విరాజిల్లుతుంటుంది. భైరవయామళంలో పరమేశ్వరుడు పార్వతీ
దేవికి శ్రీవిద్యను వివరిస్తూ పంచభూతాలు, తన్మాత్రలు, ఇంద్రియాలు, మనస్సు, మాయ, శుద్ధవిద్య, మహేశ్వరుడు, సదాశివుడు ఈ ఇరవైఐదు తత్వాలకు అతీతంగా ఆ పరమేశ్వరి
బిందువునందు ఉంటుంది. ఆమె శరీరం నుంచి ప్రకాశవంతమైన కాంతికిరణాలు వస్తున్నాయి. ఆ కిరణాలు వేయి, రెండువేలు, లక్ష, కోటి, అర్బుదము ఇంకా లెక్కపెట్టటానికి వీలుకాదు అంటున్నాడు. అంటే లెక్కపెట్టలేనన్ని, లెక్కపెట్టటానికి వీలుకానన్ని కిరణాలు
ఆ పరమేశ్వరి శరీరం నుంచి వస్తున్నాయి. ఆ కిరణాలవల్లనే ఈ చరాచరజగత్తంతా ప్రవర్తిల్లుతున్నది.

బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుణ్ణి జనకమహారాజు అడుగుతాడు.

జనకుడు : స్వామీ ! ఈ జగత్తులోని కార్యక్రమాలన్నీ దేనివల్ల జరుగుతున్నాయి?
యాజ్ఞవల్క్యుడు : సూర్యుని యొక్క వెలుగువల్ల. సూర్యుని వెలుగులోనే జీవులన్నీ కూడా తమకు కావలసినచోటికి పోయి, మళ్ళీ ఆ వెలుగులోనే తిరిగివస్తాయి. తమ కిష్టమైన కార్యాలు చేస్తాయి.
జ: మరి సూర్యకాంతులు ఎప్పుడూ ఉండవుకదా ? సూర్యుడు లేనప్పుడు ఏరకంగా కార్యక్రమాలు జరుగుతాయి ? అంటే రాత్రులందు ఏరకంగా జరుగుతుంది.
యా: చంద్రుని కాంతులతో చంద్రుని కాంతిలో జనులు తమ పనులు నిర్వర్తించుకుంటారు.
జ: సూర్యుడు చంద్రుడు ఇద్దరూ లేనప్పుడు అంటే సంధ్యవేళలయందు కార్యక్రమాలు ఏ రకంగా జరుగుతాయి ?
యా : అగ్నికాంతులతో అంటే దీపపు వెలుగులతో జరుగుతాయి.
జ: అయితే సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఎవరూ లేనప్పుడు కార్యక్రమాలు ఎలా జరుగుతాయి? వాక్కువల్ల, వాక్కు అనేది ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి చేరుతుంది. దానివల్ల పనులు జరుగుతాయి.
యా: జ: మరి వాక్కు కూడా లేప్పుడు ఎలా జరుగుతుంది ? అంటే సూర్యుడు చంద్రుడు అగ్ని వాక్కు లేవు. అంతా చీకట్లు, అప్పుడు ఏం జరుగుతుంది ?
యా : ఆత్మవల్ల జరుగుతుంది. పెనుచీకట్లు దాటిన తరువాత ఆత్మ యొక్క కాంతులవల్ల జగత్తంతా ప్రవర్తిల్లుతుంది. అసలు ఆత్మ యొక్క కాంతులతోనే చరాచరజగత్తు అంతా నడుస్తున్నది. అని చెబుతాడు. కాబట్టి పరమేశ్వరి నుంచి వచ్చే కిరణాలవల్లనే
ఈ జగత్తు అంతా నడుస్తున్నది. ఆ కిరణాలలో అగ్ని 108, సూర్యుడు 116, చంద్రుడు 136 కిరణాలను గ్రహించగలిగారు. ఇప్పుడు సూర్యుని కాంతివల్ల పగలు, చంద్రకాంతుల
వల్ల రాత్రి, సంధ్యవేళలయందు అగ్నికాంతులవల్ల జీవకోటి సంచరిస్తున్నది. ఈ రకంగా అనేక కోట్ల కిరణసముదాయము ఆమె శరీరం నుంచి వస్తుంది. అసలు పరమేశ్వరి అంటే దివ్యమైన తేజోమయమైన కాంతి పుంజము. అందుకే ఆమె ప్రభావతి,
ప్రభారూపా అనబడింది. ఆమె మూలప్రకృతి. వ్యక్తావ్యక్తస్వరూపిణి. వివిధాకారాలతో జగత్తంతా వ్యాపించి ఉన్నది. భక్తుల అజ్ఞానపు చీకట్లను పారద్రోలి జ్ఞానజ్యోతులు
ప్రసాదిస్తుంది. ఆ దేవి విషయం 388 నుంచి 404 వరకు నామాలలో చెప్పబడింది.

శ్రీమాత్రే నమః

వైదిక ధర్మ ప్రచారం

వెంకటేశ్వర ప్రసాదు

విమాన వేంకటేశ్వరస్వామి విశిష్టత.



           విజయనగర పాలకుల కాలంలో తిరుమల శ్రీవారికి లెక్కకు మించిన ధన కనక వస్తు వాహనాలను విజయనగర ప్రభువులు అందించారు. అలాంటి సమయంలో కొంత మంది అర్చకులు స్వామి వారి నగలను ధరించి తిరుగాడటం మహారాజు దృష్టిలో పడింది. ఆగ్రహంతో ఆ మహారాజు తొమ్మండుగురు వైష్ణవ అర్చకులను తన కరవాలంతో కడతేర్చాడు.  నరహత్య మహాపాప మనుకుంటే ఏకంగా  తొమ్మండుగురిని ఆలయంలోనే మట్టుపెట్టాడు మహారాజు. 
            అత్యంత పవిత్రమైన దేవాలయంలో జరిగిన యీ ఘోరమైన పాప పరిహారానికి నడుము బిగించారు విజయనగర సామ్రాజ్య రాజ గురువులైన శ్రీ వ్యాసరాయలవారు.  12 సంవత్సరములపాటు రాజగురువులు శ్రీవారి గర్భాలయంలో అత్యంత కఠోర దీక్షతో పాప పరిహార పూజాదికములను నిర్వహించారు. ఆ 12 సంవత్సరముల కాలంలో భక్తులకు గర్భగుడి లోని మూలవిరాట్ దర్శనభాగ్యాన్ని నిషేధించారు. 
           అందుకు ప్రతిగా ఆనందనిలయ విమానం మొదటి అంతస్తులో శ్రీవారి మూలమూర్తిని పోలిన విగ్రహాన్ని ప్రతిష్టించి నిత్యార్చన దర్శనాదులకు ఆటంకం లేకుండా చేయబడింది. ఈ విగ్రహం ఆనందనిలయానికి ఉత్తర వాయువ్యం మూలకు వుంటుంది. శ్రీవారి మూలమూర్తి రూపానికి యిదొక్కటే ప్రతిరూపంగా సంభావింపబడుతూ ఆనందనిలయ విమాన వేంకటేశ్వరునిగా ప్రసిధ్ధిగాంచారు. 
          గర్భాలయంలో స్వామి తన భక్తుల మనోభీష్టాన్ని తీర్చే వాడైతే ఈ విమాన వేంకటేశ్వరుడు కేవలం మోక్ష ప్రదాత. అందుకనే ప్రదక్షిణ మార్గంలో వీరిని తప్పనిసరిగా దర్శించుకోవాలి. 
          గర్భాలయం లో స్వామిని దర్శించుకోవడానికే సమయం సరిపోదు.  కనుక మన కోరికలన్నీ ఇక్కడ స్వామికి ఎంతసేపు కావాలంటే అంత సేపు నిలబడి అన్నీ మొక్కుకోవచ్చు.  
          ఇదీ సంక్షిప్తంగా శ్రీ విమాన వేంకటేశ్వర స్వామి వారి విషయం.

కలియుగంలో గురువుని నిర్ణయించుకోవడం

గురువును నిర్ణయించుకోవడం ఎలా?

గురువును మనము  నిర్ణయించుకోలేక పోవచ్చు.దానికి కారణం మనం అజ్ఞానాంధకారo లో ఉన్నాము.కాబట్టి.పూర్వ జన్మలో ఉత్తమ సద్గురువును సేవించి ఉంటే ఈ జన్మలో వారే ఎదో మిష తో మన దగ్గరకు వచ్చో,లేక వారు ఉన్న ప్రాంతంకి మనల్ని లాగో మళ్ళీ సాధనాలు పూర్తి  చేయిస్తారు.
పూర్వజన్మ లో మన గురువు లు భగవత్ సాక్షత్ కారులు,జ్ఞానులు కాక పోయింటే వాళ్ళు మనల్ని మార్చి పోయి ఉంటారు.
మరి ఎలా?అంటే దానికి గురు చరిత్ర చదువు తూ మనకు సద్గురువును చూపమని ప్రార్ధించాలి.అప్పుడు దత్తాత్రేయ స్వామియే మనకు గురువును చూపుతారు.(మహారాష్ట్ర ,కర్ణాటక లో చేస్తున్నది ఇదే)మనమే గురువుని నిర్ణయం చేస్తే మన అజ్ఞానంతో గురువులోని కొంత శక్తిని మాత్రమే గురించి సరి అయిన నిర్ణయం చేయ లేక పోవచ్చు.అందుకే ఈ రోజుల్లో  గురువుని నిర్ణయించే పని గురు చరిత్ర కు వదలాలి.
ఈ రోజుల్లో కావలసింది భోధక గురువు కాదు.అనుభవ జ్ఞానం ఉండి, మహానుభావులచే అపార శక్తి పొందిన అనుభవ జ్ఞానం ఉన్నవారు మాత్రమే తరింపజేయగలరు.

తిరుమల శ్రీవారి తొలిసంపద ఆవు మందలే



ఇప్పుడు తిరుమల శ్రీవారి సిరిసంపదలతో తులతూగుతోంది. వార్షిక ఆదాయం రూ.2,500 కోట్లు దాటి 3 వేల కోట్ల రూపాయల దిశగా పరుగులు తీస్తోంది. బ్యాంకుల్లో శ్రీవారికి చెందిన 7 టన్నుల బంగారం గుట్టగా పోగయింది. రూ.15 వేల కోట్ల డిపాజట్లు బ్యాంకుల్లో ఉన్నాయి. ఎక్కడెక్కడో భూములు, మిద్దెలు మేడలు శ్రీవారి సొంతం. అయితే ఒకనాడు శ్రీవారి సంపదంతా ఆవు మందలే. ఆ ఆవు మందలే స్వామివారి ఆలయంలో దీపారాధనకు ఆధారమయ్యాయి. శ్రీవారి ఆలయంలో ఒకప్పుడు ఆలయంలో దీపం వెలిగించడానికే ఇబ్బందిపడ్డారు. దీపం వెలిగించడం కోసమే విరాళాలు స్వీకరించారు. ఇలా స్వీకరించిన విరాళాలలో ఆవుల మందలే ప్రధానంగా ఉండేవి. ఆలయంలో ఒక నేతిదీపం వెలిగించాలంటే 32 ఆవులు, ఒక ఆబోతు స్వామివారికి కట్నంగా స్వీకరించేవారట. ధనవంతులైతే 40 కొలంజుల బంగారం ఇచ్చేవారట. ఇది ఒక పద్ధతిగా ఆనాడు నిర్దేశించుకున్నారు.

శ్రీవారి ఆలయంలో క్రీ.శ.830లో అప్పటి రాజులు నందవిళక్కు అంటే వెలుగుతున్న దీపం అనే పేరుతో నిత్యం నేతిదీపం వెలిగించే పద్థతికి శ్రీకారం చుట్టారట. శాసనాల్లో చాలా చోట్ల వెలుగుతున్న దీపం ప్రస్తావన ఉంది. దీపాలను వెలిగించడానికి ఎవరెవరు విరాళాలు ఇచ్చిందీ శాసనాల్లో రాశారు. దీపాలను వెలిగించడానికి విరాళంగా వచ్చిన ఆవులను పోషించడానికి అవసరమైన గడ్డి పెంపకం కోసం భూములు విరాళంగా ఇచ్చిన రాజులున్నారు.
బంగారాన్ని శ్రీవారి భాడాగారానికి జమచేసిన విధమూ ఆనాడు అమల్లో ఉంది. క్రీ.శ.905 నుంచి క్రీ.శ.953 దాకా ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి పరాంతక చోళుడైన పరాకేశసరి.. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో రెండు నేతి దీపాలు వెలిగించడం కోసం ఒక్కో దీపానికి 40 కొలంజుల బంగారం దానం చేశారు. తెలుగు పల్లవ రాజులలో అత్యంత ముఖ్యుడైన విజయగండ గోపాలుని పట్టపురాణి దేవరసియార్‌ తిరుమల శ్రీవారి సన్నిధిలో మూడు దీపాలు వెలిగించడానికి 32 ఆవులు, ఒక ఆబోతు, బంగారం దానం చేశారు. యాదవ రాజులలో అత్యంత పరాక్రమవంతునిగా పేరుగాంచిన వీరనరసింగదేవ యాదవ రాయలు గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యం దీపారాధన కసం 32 గోవులను, ఒక ఎద్దును దానం చేశారు.

అలాగే తిరుమల ఆలయానికీ 32 ఆవులు, ఒక ఆబోతు దానం చేశారు. శాసనాల్లో పలు చోట్ల శ్రీవారికి గోదానం చేసిన ఉదంతాలు కనిపిస్తాయి. దీపారాధనకు గోవులే ఆధారంగా కనిపిస్తాయి. గోవులను పోషించడం, వాటి ద్వారా వచ్చే పాల నుంచి వెన్నెను దాని నుంచి నెయ్యిని సేకరించి దాంతో దీపాలు వెలిగించడమనేది ఒక పద్దతిగా సాగింది. అందుకే శ్రీవారి తొలి సంపద ఆలమందలే అయ్యాయి. ఈ లెక్కన అప్పట్లో శ్రీవారికి ఎన్ని వేల ఆవులు ఆస్తిగా ఉండేవో అనిపిస్తుంది. ఇప్పటికీ స్వామివారికి ఆవులను కానుకగా వచ్చే సాంప్రదాయం కొనసాగుతోంది. తిరుమల, తిరుపతిలోని తితిదే గోశాలలో ఉన్నవి అలా వచ్చిన ఆవులే.

*చదువు కున్న వాడి కంటే చాకలి వాడు ఎలా నయం*?

-  _కథ_! 

ఒకసారి ఒక గ్రామం లో పండితులు, తర్క శాస్త్రజ్ఞులు, మీమాంసకులు ఇలా అందరూ కలిసి ఓ ఇంటి అరుగు మీద సభ జరుపుకుంటున్నారు.

అటు జరిగి ఇటు జరిగి వాళ్ల చర్చ ‘వైకుంఠం ఎక్కడ ఎంత దూరం లో ఉండి ఉంటుంది?‘ అనే విషయం వైపు జరిగింది.

ఒక పండితుడేమో వైకుంఠం కొన్ని వేల కోట్ల ఖగోళాలకు అవతల నిజం గా ఉన్న ఒక పాల సముద్రం లో ఉన్నదన్నాడు. 

తార్కికుడేమో అలా గాదు చంద్రుడు లక్ష్మీ దేవి తో పాటే పుట్టాడు ఆయనని మనం రోజూ చూడ గలుగు తున్నాము. 

తన అక్క లక్ష్మీదేవికి దూరం గా చంద్రుడు ఉండడు కాబట్టి వైకుంఠం ఎక్కడో చంద్ర మండలానికి అవతల వైపు ఉండచ్చు అని తార్కికం గా చెప్పాడు. 

అదే గ్రామం లో ఒక చాకలి వ్యక్తి నివసిస్తున్నాడు. 

అతడు తన బట్టలను తీసుకుని చెరువుకు పోతూ ఈ పండితుల నందరినీ గమనించాడు. 

తన దారిన తాను వెళ్లి పోయాడు. 

సాయంత్రం అతడు తిరిగి వస్తూ ఆ పండితులు ఇంకా గట్టి గా వాదించు కుంటూనే ఉండడం గమనించాడు. 

‘ఈ పండితులు ఉదయం నుండీ సాయంత్రం దాకా ఏం వాదించు కుంటున్నారా!‘ 

అని సందేహం వచ్చి వాళ్లని వెళ్లి కారణం అడిగాడు. 

వాళ్లు ‘మేం వైకుంఠం ఎక్కడ ఉందో వాదించు కుంటున్నాము‘ అంటే 

అతడు తల గుడ్డ తీసి తన తలగోక్కుని. 

‘ఇంత మాత్రం దానికి ఉదయం నుండి సాయంత్రం దాకా వాదించు కోవాలా బాబయ్యా?!‘ అని ఆశ్చర్యం గా ఆడిగాడు. 

దాంతో ఈ సారి ఆశ్చర్య పోవడం ఆ పండితుల వంతయింది. 

"అంటే ఏంటి?! నీకు వైకుంఠం ఎక్కడుందో తెలుసా?! 

ఇంత చదువు కున్నాము మాకే తెలియని అతి సూక్ష్మ మైన ఈ శాస్త్ర రహస్యం నీకెలా తెలుస్తుంది... 

పో పో నీ పనిచేసుకో..." అని ఈసడింపు గా పలికారు.

"అయ్యా! నేను తమ రంత చదువుకో లేదండీ. 

కానీ నాకు వైకుంఠం ఎక్కడుందో చూచాయ గా తెలుసండీ... 

నేను మా పంతు లోరు మొన్నీ మధ్య బాగోతం (భాగవతం) చెబుతా ఉంటే ఇన్నా నండీ బాబయ్య! 

మా పంతు లోరు చెప్పారు 

ఆ ఏనుగు (గజేంద్రుడు) ప్రాణంబుల్ ఠావుల్ దప్పె మూర్చవచ్చె... అని, 

మరంత మూర్చ వచ్చే పరిస్థితుల్లో మాటలే రావు గదా బాబయ్యా. 

మనం చావ బోయె మనిషి చెప్పే మాటలు వినాలంటే _నోటి దగ్గర చెవి బెడితే గానీ వినబడవు గదా బాబయ్యా_! 

మరి ఆ ఏనుగు చాలా బలహీనం గా అరిచింది గదా...

‘రావే ఈశ్వరా... రావే వరదా.... రావే గోవిందా...‘ అని 

అయినా గూడా ఆ ఏనుగు మాటలు ఆ వైకుంఠయ్య కు వినపడ్డాయి అంటే ...

బహుశా ఆ వైకుంఠం ఇక్కడే ఎక్కడో మహా అయితే *పది అంగుళాల దూరంలో ఉండుంటుందండీ*‘ అని చెప్పి తన దారిన తాను వెళ్లిపోయాడు. 

ఎన్నో శాస్త్రాలను అభ్యసించి వైకుంఠం ఎక్కడ ఉందో తెలియని చదువుకున్న పండితులకంటే,

‘తన పంతులయ్య చెప్పిన భక్తి వెనుక తన దైన నమ్మకం పెట్టు కుని వైకుంఠం మా ఇంటి పక్కనే ఎక్కడో ఉంది. 

అని తార్కికం గా సమాధాన పడి తన రోజు వారీ పని (కర్మయోగం) చేసు కుంటున్న చాకలి వాడు కొన్ని లక్షల రెట్ల నయం‘ అని 

అప్పట్నించీ ‘చదువు కున్న వాని కంటే చాకలి వాడు నయం‘ అన్న నానుడి పుట్టింది.

"మన మనసు లో ఉన్నది వదిలేసి ఎక్కడో వెతుకుతున్న దైవం మనలో లేడా"

_మనలో నిత్యం అయిన ఆత్మ నిత్యం, సత్యం, సత్యము._

*సర్వే జనా సుఖినోభవంతు*Telugu Kavulaku swagatham

విభూది మహిమ


విభుతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ విభుతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతు ఉంటాడు. నరక బాధలు లోనుకాకుండా చూస్తాడు. కాల్చిన పేడను (ఆవు పేడ) ఈ భస్మం లో ఉపయోగిస్తూ ఉంటారు. భస్మ ధారణ చేయకుండా చేసే జపతపాలు ఫలితాలను ఇవ్వవని శాస్త్ర వచనము. 


మన శరీరములో 32 చోట్ల భస్మ ధారణ చెయ్యాలి అని శాస్త్రము చేప్తోంది, కాని ఈ కాలము లో అలాగ చెయ్యటము వీలుపడని పక్షములో కనీసము శిరస్సు, రెండు చేతులు, గుండే, నాభి అనే ఐదు ప్రదేశాలలో భస్మాన్ని ధరించవచ్చు. త్రిపుండ్రాలుగా (ముడు గీతలు) అడ్డముగా భస్మ ధరణ చెయాలి. ఇలాగ చేస్తే జన్మ జన్మల పాపాలు నసించి పోతాయని పెద్దల వాక్కు.

ఈ భస్మ ధారణ చేయడానికి కొన్ని మంత్రాలు చెప్పబడ్డాయి శాస్త్రాలలో. 
బ్రాహ్మణ, క్షత్రీయులు "మానస్తోకే మంత్రము " తో, వైశ్యులు " త్ర్యయంబక " మంత్రము తో , ఇతరులు శివపంచాక్షరి తో భస్మ ధారణ చెయాలి. 
ఈ విభుతి మహిమను వివరించే కధ దేవి భాగవతము పదకొండవ స్కందము లో ఉంది.
మహిమాన్వితమైన విభుతిని వివిధ పద్ధతులలో తయారు చేస్తారు. ఆవుపేడను కింద పడనీయకుండా, చేత్తోపట్టుకుని, వేదమంత్రాల మధ్య హోమము చేసి తయారు చేసుకున్న భస్మాన్ని "శాంతికము " అని అంటారు. 

షడాక్షరి మంత్రముతో హొమము చేసి తయారు చేసుకునే భస్మాన్ని "పౌష్ఠికం" అని అంటారు. బీజాక్షరాలతో హొమము చేసి తయారు చేసిన భస్మాన్ని "కామదం" అని అంటారు.. 

భస్మం తయారు చేసుకునే ముందే ఆవుపేడను సేకరించి, చిట్టు, లేక పొట్టును కలుపుతూ ముద్ద చేసి, ఆ ముద్దను పిడకలుగా చేసి అతి శుభ్రమైన ప్రదేశములో ఎండబెట్టాలి. 

యాగాలు చేస్తున్నప్పుడు అరణిని మధించడం ద్వార వచిన అగ్నితో గాని, మంత్ర పూర్వకముగా పిడకలను హొమ గుండము లో వేసి హోమము చెయ్యాలి.
అనంతరం శుబ్ర్హమైన పాత్రలో విభుతిని నింపాలి. 

హర హర మహా దేవ శంభో శంకర

*సాయిబాబా గూర్చి


వాట్సాప్ ఫార్వర్డ్
*ఈమధ్య చాలామంది హిందువులు.* *సాయిబాబా_దేవుడు కాదని చాలా వాదించుకుంటున్నారు.*
*దీనికి మచ్చుకు కొన్ని ఉదాహరణలు (నిజాలు) చూడండి.*

ఇది చాలా చిన్న విషయం ఎవరైనా నేరుగా సమాధానం చెప్పగలిగే విషయం.కానీ మన హిందూ ధార్మిక సంస్థలు స్వామీజీలు కుండబద్దలు కొట్టినట్టు దీనికి సమాధానం చెప్పడానికి భయపడుతున్నారు.ఎవరైనా ఒకరు ధైర్యం చేసి పబ్లిక్ గా మాట్లాడినా కూడా వారికి ఎవరు సపోర్ట్ గా రావడం లేదు.
ముస్లిం మత పెద్దలు ఆయనను ముస్లిం ఫకీరుగా అంగీకరించారు. 
భారత ప్రభుత్వం కూడా ఆయనను ముస్లిం ఫకీర్ గా మాత్రమే గుర్తించింది. అందుకే సాయిబాబా దేవాలయాలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోదు మన దేవాలయాలను ఆక్రమించుకున్నట్టు గా.ఎందుకంటే ముస్లింలు అంటే ప్రభుత్వానికి చాలా ప్రేమ.

ఈమధ్య హరే కృష్ణ వారు ఒక సాయిబాబా మందిరంలో భగవద్గీత బుక్ స్టాల్ పెట్టుకుంటామంటే దానికి సాయిబాబా మందిరంలో సాయిబాబా గురించి మాత్రమే చెప్పాలి అంటూ అనుమతి నిరాకరించారు.

 సాయి కథామృతం లో అడుగడుగునా సాయిబాబాను నిజమైన పరబ్రహ్మ స్వరూపంగా మిగతా దేవతలైన రాముడు కృష్ణుడు విఘ్నేశ్వరుడు అందరూ కూడా సాయి బాబా యొక్క చిన్న అంశాలుగా ఎలా పడితే అలా రాశారు.
  కొంతమంది ఇంకొక అడుగు ముందుకేసి శివలింగంపై సాయిబాబా కాలు పెట్టినట్టుగా విగ్రహాన్ని నిర్మించి పూజిస్తున్నారు.

అందుకే నేను కొంత చొరవ తీసుకొని పరిశోధించి నిజాలను మీ ముందుంచుతున్నాం.ఇందులో అన్ని ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాను దేనికి డొంకతిరుగుడు సమాధానం చెప్పలేదు.

సాయిబాబా దేవుడు మాత్రమే.
 హిందూ దేవుడు కాదు. వేదాలలో పురాణాలలో చెప్పబడిన దేవుడు కాదు.
సాయిబాబాకు రాముడికి కృష్ణుడికి ఎటువంటి సంబంధం లేదు.
సాయిబాబా హిందూ దేవుడు అవతారం కూడా కాదు.
సాయిబాబా హిందూ సన్యాసి కూడా కాదు.ఆయన స్వయంగా అల్లా మాలిక్ అని చెబుతూ ముస్లిం సన్యాసి డ్రెస్ వేసుకుని మసీదు దగ్గర ఉండే వాడు.
హిందూ సంస్కృత శ్లోకాలలో సాయిబాబా ప్రస్తావన ఎక్కడా లేదు. 
సాయిబాబా కి మందిరాలు నిర్మించడానికి హిందూ దేవాలయాల ఆర్కిటెక్చర్ ని కాపీ కొట్టేసారు. ఆయనను పూజించడానికి హిందూ దేవుళ్ళ అష్టోత్తరాలను సహస్ర నామాలను పూజావిధులు కాపీ కొట్టేసారు. నెమ్మదిగా శ్రీరాముడు శ్రీకృష్ణుడు కూడా సాయిబాబా భక్తులు అని చెప్పడం స్టార్ట్ చేశారు.ఇంకాస్త ముందుకు వెళ్లి సాయిబాబానే వీళ్ళందర్నీ సృష్టించాడు అన్నారు.

అసలు సాయి బాబా అంటే ఏమిటో చూద్దాం.బాబాగారు షిరిడి గ్రామానికి వచ్చి నప్పుడు మొట్టమొదటగా అక్కడ ఉండే దేవాలయంలోని పూజారి సాయి అని ఆయనను పిలిచారు. అదే పేరుతో ఆయన ఫేమస్ అయిపోయారు. సాయిబులు అంటే ముస్లిములు అని అందరికీ తెలుసు. సాయిబు అనే పదం ఒక పర్షియన్ పదం.

సాయిబు అనేది ముస్లిములను సూచించదు. ఇస్లాం లో ఒక మతం అయినటువంటి సున్ని మతంలోని సూఫీ ఫకీర్ లను సూచిస్తుంది.

ఇస్లాం లో sufi అనే ఒక మతం ఉంది. వారు ఫకీరుగా దేశమంతా తిరుగుతూ ఉంటారు. ఆ బాకీలను సాయ అంటారు పర్షియన్ భాషలో.అంటే హిందూ సన్యాసులను స్వామీజీ  అని మనం గౌరవంగా ప్రేమగా ఎలా పిలుస్తాము, ఇరాన్లో పర్షియన్ భాషలో సాయి అని ఇస్లామిక్ ఫకీర్ లను పిలుస్తారు. పర్షియన్ భాషలో దీని అర్థాన్ని మనం గమనిస్తే పేద పెద్దాయన, తండ్రి లాంటి వాడు, పేద సన్యాసి అంటే అర్థాలు వస్తాయి. ఈ ఇస్లామిక్ ఫకీర్లు దేశమంతా తిరుగుతూ ఉండే వాళ్ళు. వాళ్లని మన వాళ్లు కూడా పర్షియన్ భాషలో లాగే సాయి అంటూ పిలిచేవాళ్ళు.అందుకే ఆ పూజారి బాబాను చూసి సాయ అని పిలిచాడు.మనవాళ్లు ఆ పదాన్ని కొంచెం ఇండియన్ భాషలకు అనుగుణంగా అచ్చుతో అంతమయ్యే లాగా సాయి అని మార్చారు.

ఆయన ఎప్పుడూ రెండు మాటలను పదేపదే చెబుతూ ఉండేవాడు. ఒకటి సబ్కా మాలిక్ ఏక్. రెండు అల్లాహ్ మాలిక్. ఆయన ఎప్పుడూ మసీదు దగ్గరే ఉండే వాడు.ఆయన వేషధారణ డ్రెస్సింగ్ అంతా చూడండి కచ్చితంగా ముస్లిం ఫకీరులా గా డ్రెస్ వేసుకుని వాడు.
ఎప్పుడు కాషాయ వస్త్రాలు రుద్రాక్ష మాలలు జపమాలలు తులసి మాలలు త్రిశూలం, డమరుకం వంటివి ఉపయోగించినట్లుగా చారిత్రక ఆధారాలు మనకు లభించడంలేదు.

ఆయన చాలా సమయాన్ని ఇతర ముస్లిం ఫకీర్ లతో గడిపినట్టుగా మనకి చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.ఆయన హిందూ సన్యాసులతో కలిసి జపాలు ధ్యానాలు చేసినట్టుగా కానీ లేదా హిందూ పండగలో వచ్చి ఏదైనా వ్రతాలు పూజలు నిర్వహించినట్లు గాని మనకు ఎక్కడ చారిత్రక ఆధారాలు లేవు.

హిందూ సన్యాసులు ఎవరైనా కాషాయ వస్త్రాలు ధరించి ధ్యానాలు జపాలు తపాలు చేస్తూ ఉంటారు.తమ దగ్గరకు వచ్చిన వారికి ఏదైనా మంత్రం జపించండి లేదా ధ్యానం చేయమంటూ ఉపదేశిస్తూ ఉంటారు. కనీసం కమండలం జపమాల  దగ్గర ఉంచుకుంటారు.సాయి బాబా గారు ఎప్పుడు దానం చేసినట్టు జపం చేసినట్టు లేదా కాషాయ వస్త్రాలు ధరించి నట్టు మనకి కనిపించదు.

బాబాగారు షిరిడీకి వచ్చినప్పుడు షిరిడి పూర్తిగా హిందువుల తో కూడిన చిన్న గ్రామం.బాబాగారు ఇస్లాంకు చెందిన ఫకీరు కాబట్టి మన వాళ్ళు ఆయనను పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడు ఆయన వెళ్లి ఒక పాడుబడిన మసీదులో ఉండేవారు.ఆయన హిందూ సన్యాసి ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక దేవాలయంలోనే ఉండేవాళ్ళు. ఆయన ముస్లిం సన్యాసి కాబట్టి వెళ్లి మసీదు లోనే ఉన్నారు.

ఇక ఆయన తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి హిందూ గ్రంథాలతోపాటు ఖురాన్ తప్పకుండా చదవండి అంటూ ప్రచారం చేసేవాడు.దేవుడు లేడు అనే వాడిని ఆయన చాలా విమర్శించినట్లు మనకు ఆధారాలు లభిస్తున్నాయి.హిందూ సన్యాసులు ఎవరూ కూడా దేవుడు లేడు అనే వారిని విమర్శించడానికి వదిలేస్తారు. కేవలం ఇస్లాం లో మాత్రమే నాస్తికులను దూషిస్తారు.ఇస్లామిక్ దేశాలన్నింటిలో నాస్తికులకు మరణశిక్ష అమలు చేయబడింది.

బాబా గారు నమాజ్ చేయడాన్ని ప్రోత్సహించినట్టు గా మరియు ఆయనే స్వయంగా రోజు నమాజ్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. ఆయన బక్రీదు మరియు రంజాన్ రోజుల్లో ఖురాన్లోని Al-Fatih చదివి అందరికీ వినిపించేవారు.కానీ ఎప్పుడూ హిందూ పండుగలు రోజుల్లో వచ్చి పురాణాలు సంస్కృత శ్లోకాలు చదివి అందరికీ వినిపించినట్లుగా లేదా రోజు పురాణాలు భాగవతం వంటివి ప్రవచనాలు చెప్పినట్టుగా మనకు ఆధారాలు కనిపించడం లేదు.

ఆయన రోజు ఖురాన్ కి సంబంధించిన రెండు భజనలు వినేవాడు.mawlid,qawwali అనే ఇస్లామిక్ పాటలను వినేవాడు. Mawlid అనేది మొహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజుని కీర్తిస్తూ పాడే పాట.qawwali కూడా అల్లాహ్, మహమ్మద్ ని ఇస్లాంని కీర్తిస్తూ పాడే ఒక పాట. ఈ పాటలను ముస్లిం ఫకీర్లు తబలా తో పాడుతారు.బాబా గారు కూడా అచ్చం ఇలాగే తబలా తోనే ఈ పాటలను పాడేవారు పాడించి వినేవారు.ఇప్పటికీ ముస్లిం ఫకీర్లు అందరూ ఇదే విధంగా తబలా తో ఈ పాటలను పాడుతూ ఉంటారు.

సాయిబాబా గురించి అనేక సినిమాలు తీశారు.కానీ ఎక్కడా కూడా నేను చెప్పినటువంటి పాయింట్లను హైలెట్ చేసి చూపించలేదు. వాటిని మరుగుపరిచే సారు.ఎందుకు అంటే ఆయనను హిందూ దేవుళ్ళ లో కలిపేసే దానికి ఆయన్ని శ్రీకృష్ణుడు అవతారం గా ప్రచారం చేసే దానికి.

బాబా గారు తన దగ్గరకు వచ్చిన భక్తులకు మటన్ ను స్వయంగా వండి ప్రసాదంగా పెట్టినట్టుగా సాయి చరిత్ర లో ch 38 లో రాసారు.

అంతేకాకుండా ఆయన స్వయంగా ముస్లిం ఫకీర్ లతో కలిసి చేపలు మాంసాహారం తిన్నట్టుగా కూడా రాశారు.హిందూ సాధువులు ఎవరూ కూడా పొరపాటుగా కూడా ప్రాణం పోతున్న కూడా మాంసాహారం తినరు.

ముస్లింలు సాయిబాబాను ముస్లిం ఫకీర్ గా గుర్తించారు. ముస్లిం ఫకీర్ గా వాళ్ళు ఒప్పుకున్నారు.ముస్లింలు ఎవరూ కూడా హిందూ సాధువును పొరపాటుగా కూడా ముస్లిం ఫకీర్ గా ఒప్పుకోరు ఆ విషయాన్ని మీరు గమనించాలి.వాళ్లు హిందూ మతాన్ని హిందూ మతాన్ని ప్రచారం చేసే సాధువులను విపరీతంగా ద్వేషిస్తారు వారు ఎంతో మంది సాధువులు చంపినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి అటువంటి వారు పొరపాటు కూడా హిందువును ఫకీర్ గా ఒప్పుకోరు.

సాయిబాబా హిందూ దేవుళ్ళ అవతారమా??
మన దేవుళ్ళు అవతారాలు అన్నీ చూస్తే దుష్టులను శిక్షించడానికి సత్పురుషులు రక్షించడానికి మాత్రమే అవతరించినట్లు తెలుస్తోంది.
మరి బాబాగారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఎక్కడ చేశారు?
బాబాగారి టైం లో బ్రిటిష్ ప్రభుత్వం మన దేశాన్ని పీడిస్తోంది.ఆయన అవతార మూర్తి అయిన ఏ కనీసం బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి మనకు స్వతంత్రమైన సంపాదించి ఉండాలి ఆయన మహిమలతో.
కనీసం ఆ శిరిడీ గ్రామంలో ఎవరైనా ప్రజలకు హాని తలపెట్టే టప్పుడు ఏదైనా crime జరిగేటప్పుడు అక్కడ ప్రత్యక్షమై దుష్టులను శిక్షించి ఉండాలి.ఆయన అలాంటివి ఏమీ చేసినట్టు మనకు కనిపించడం లేదు.

ఆయన చూపించిన  మిరాకిల్స్ అన్నీ కూడా చాలా చిన్నవి అవి కూడా ఆయన చుట్టూ ఉన్న మనుషులు ఆయనను ప్రార్థిస్తే మాత్రమే చేసినవి.ఆయన చేసిన మహిమలన్నీ కూడా శిరిడి అనే చిన్న గ్రామానికి మాత్రమే పరిమితమైనవి.

గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి ప్రజలందరినీ ఇంద్రుని నుంచి రక్షించిన శ్రీ కృష్ణుడు ఎక్కడ బాబా గారు ఎక్కడ??ఆయన మిరాకిల్స్ లో చాలా గొప్పగా చెప్పబడేది వేడి వేడిగా ఉండే నీళ్లలో చేయి పెట్టి కలపడం.వేరొకరికి వచ్చిన వ్యాధులను తనకు ట్రాన్స్ఫర్ చేసుకోవడం. ఇలాంటివన్నీ కూడా అసలు మిరాకిల్స్ అని చెప్పే దానికి సరిగ్గా సరిపోవని అనాలి.

వీటి వలన దేశానికి జాతికి ఎటువంటి ప్రయోజనం లేదు.ఇంత చిన్న miracles చేసేదానికి శ్రీకృష్ణుడు శ్రీరాముడు అవతారం ఎత్తి వచ్చాడంటే మనము నమ్మాలా?? బాబా భక్తులు మరి ఒక్క అడుగు ముందుకేసి సాయిబాబానే పరిపూర్ణ అవతారం, రాముడు కృష్ణుడు అవతారాలు సంపూర్ణం కాదు. అని ప్రచారం చేస్తున్నారు. నిజానిజాలు పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది.

సాయిబాబా గురువా? వ్యాస పౌర్ణమి కి సాయిబాబాకు సంబంధం ఏమిటి?

గురువు అంటే అజ్ఞానాన్ని అంధకారాన్ని పోగొట్టి మోక్షాన్నిచ్చే వాడు అని. అంతేగాని గుడ్డిగా నన్ను నమ్మండి నేను మీకు ఏం కావాలంటే అది ఇస్తాను అని వాడు కాదు. అసలు బాబాగారు మోక్షం గురించి ఒక్కమాట చెప్పలేదు.
వ్యాసభగవానుడు వేదాలను విభజించారు. అష్టాదశ పురాణాలను రచించాడు. వేదాంత జ్ఞానాన్ని బ్రహ్మ సూత్రాల ద్వారా అందించారు.అందుకు కృతజ్ఞతగా ఆయనను స్మరించుకునే దానికి వ్యాసుడి పుట్టినరోజుని వ్యాసపౌర్ణమి గా సెలబ్రేట్ చేస్తారు.
అదేవిధంగా ఆ రోజు ఆదిశంకరులు మరియు ఇతరత్రా గొప్ప గురువులను కూడా పూజిస్తారు. గురు పౌర్ణమి రోజు మోక్ష మార్గాన్ని చూపించిన గురువులకు మాత్రమే వందనం చేస్తారు.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై.
ముస్లిం ఫకీర్ అయినా బాబాకు సచ్చిదానంద పరమాత్మకి సంబంధం ఏమిటి?
ఖురాన్ లో బోధించిన గుడ్డి నమ్మకాన్ని ఫాలో అవమని చెప్పిన బాబా గురువులకే గురువు సద్గురు ఎలా అయ్యాడు?

సాయిబాబా అందరి కంటే గొప్ప గురువు అంటూ గురువారాన్ని ఆయనకు తగిలించారు. గురు పౌర్ణమి ని baba పౌర్ణమి గా మార్చేశారు. బాబా గారు తన శిష్యులకు ఎవరికి కూడా ఏ విధమైన ప్రవచనం చేయలేదు.
భక్తి జ్ఞాన కర్మ యోగ మార్గాలు లో ఏ మార్గాన్ని  కూడా ఆయన ఉపదేశించలేదు.
ఆయనను ఒక హిందూ సన్యాసి గా భ్రమపడుతూ ఎంతో మంది శిష్యులు తమకు ఏదైనా దీక్షను ఇవ్వాల్సిందిగా ఏదైనా మంత్రాన్ని ఉపదేశించిన ప్రార్థించారు.ఆయన ముస్లిం ఫకీర్ కదా అటువంటివేమీ ఆయన ఉపదేశించలేరు ఉపదేశించలేదు.
ఆయన  గ్రంథాలను రచించలేదు.
అసలు మనిషికి పునర్జన్మ ఉందని జన్మ పరంపర నుంచి మనిషి బయటపడాలని మోక్షాన్ని సంపాదించాలని ఆయన ఎక్కడ చూచాయిగా కూడా చెప్పలేదు.

ఆయన ఉపదేశించిన శ్రద్ధ మరియు సబూరి ఎవరి అజ్ఞానాన్ని పోగొట్ట లేదు.శ్రద్ధ మరియు సబూరి అనేవి (గుడ్డిగా నమ్మండి నమ్మకాన్ని కోల్పోవద్దు)అనేవి ఇస్లాం మరియు ఖుర్ఆన్ సంబంధించినవి.కురాన్ లో పదేపదే నమ్మకాన్ని కోల్పోవద్దు విశ్వాసం కలిగి ఉండండి అని చెప్పబడి ఉంటుంది. బాబాగారు ముస్లిం ఫకీర్ కదా అదే చెప్పారు.ఆయన పవిత్రంగా భావించింది కేవలం శుక్రవారం మాత్రమే ఎందుకంటే అది ముస్లింలు సంబంధించిన రోజు.
శుక్రవారాన్ని వదిలేసి ఈయన వ్యాసుడు కంటే గొప్ప గురువు అని అబద్ధాలు చెబుతూ గురుపౌర్ణమి ను బాబా కు తగిలించారు.

సాయిబాబా మంత్రాలు???
సయా అనేది పర్షియన్ భాషలో పదం. దానిని సంకరం చేసి సాయి అనే పదాన్ని సృష్టించారు.
మీరు అనుకున్నట్టుగా రామ,కృష్ణ అనేవి మన దేవుళ్ళ పేర్లు కాదు. అవి సంస్కృతంలోని మహత్తరమైన బీజాక్షరాలు.వాటిని స్మరిస్తే మీ కర్మఫలాలు నశించి మీకు ముక్తి వస్తుంది.

బీజాక్షరాలు కేవలం సంస్కృతంలోనే ఉంటాయి.మరి సాయి అనే ఈ సంకరజాతి పదం ఏ భాషకు చెందింది కాదు. ఈ పదాన్ని సంస్కృతంలోని బీజాక్షరాలలో కలిపి జపం చేస్తే ఏమవుతుంది??
వచ్చే సత్ఫలితాలు కూడా రాకుండా పోతాయి అది మాత్రం కచ్చితంగా చెప్పగలను.

మన వాళ్ళు అందరికంటే ముందు ఉంటారు మన మంత్రాలను గ్రంథాలను దేవాలయాలను కలుషితం చేసే దానికి దీనికి ఇదే పెద్ద ఉదాహరణ.

సాయిబాబాకు దేవాలయాలు నిర్మించి నిత్యం పూజలు చేసి హారతులు పట్టడం సబబేనా??
సాయి బాబా షిరిడీ గ్రామానికి వచ్చినప్పుడు ఒక పాడుబడిన మసీదులో ఉండేవారు. ఆయన జీవిత చివరాంకంలో వరకు కూడా మసీదులోనే గడిపారు. ఎప్పుడు దేవాలయంలో వచ్చి ఉండలేదు.
అటువంటప్పుడు హిందూ దేవాలయాన్ని నిర్మించి దానిలో ఆయన పెడితే ఆయన ఆనందపడతాడు లేదా బాధపడతాడు ఆలోచించండి.
ఆయన రోజు వినింది ఖురాన్లోని మరియు ముహమ్మద్ ప్రవక్తను ప్రశంసిస్తూ రాసిన ప్రేయర్లు.
ఆయన జీవించి వున్నప్పుడే ఎప్పుడు హిందూ గ్రంథాలను మంత్రాలను చదవలేదు వినడానికి కూడా ఇష్టపడలేదు.
మరి చనిపోయిన తర్వాత ఆయన విగ్రహాన్ని పెట్టి రోజు మూడు నాలుగు సార్లు సంస్కృత మంత్రాలు చదివి వినిపిస్తే ఆయన ఆనందపడతాడు లేదా కోప్పడతాడు ఆలోచించండి.

సాయిబాబా యోగులకు రాజా గొప్ప యోగిపుంగవుడు??
సాయి బాబా ఎక్కడా కూడా యోగ శాస్త్రం గురించి ధ్యానం గురించి తపస్సు గురించి ఒక్క మాట చెప్పలేదు.ఇంకా హిందువుల అందర్నీ ఖురాన్ చదవమని ప్రోత్సహించాడు.
ఎప్పుడు ధ్యానముద్రలో కనిపించలేదు.
ప్రాణాయామం ఆసనాలు వంటివి చేసినట్టుగా మనకి ఎక్కడ రాయబడలేదు.
పతంజలి మహర్షి గురించి యోగ సూత్రాల గురించి ఎక్కడా వ్యాఖ్యానం చేయలేదు.
కేవలం ఖురాన్ గురించి మరియు ఇస్లాం గురించి ప్రచారం చేసిన ఒక ముస్లిం ఫకీరు అసలు యోగి కాదు.
అటువంటివాడిని యోగులకు రాజు అని దొంగ ప్రచారం చేశారు. చాలా గొప్ప యోగి అని అబద్ధాలు చెప్పారు.

ఇప్పుడు సాయిబాబా కాళ్ళకింద శివుని కృష్ణుని రాముని పెట్టి పూజిస్తున్నారు.ఇంకొన్ని రోజుల తర్వాత సాయి బాబా మాత్రమే దేవుడు మిగతా వాళ్ళని పూజిస్తే మేము చంపుతా అంటారేమో.
జీసస్ కూడా ఇలానే తయారయ్యాడు. మొదట్లో జీసస్ కూడా దేవుడే అన్నారు. ఇప్పుడు జీసస్ మాత్రమే దేవుడు మిగతా ఎవరిని పూజించిన నరకానికి పోతారు అంటున్నారు.

సాయిబాబా దేవుడంటే ఏ సమస్య లేదు.సాయిబాబా హిందూ దేవుడు. హిందూ దేవుళ్ళు అందరినీ సాయిబాబానే సృష్టించాడు అంటేనే సమస్య.సాయిబాబా శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఒక్కటే అంటేనే సమస్య. శ్రీకృష్ణుడి లాగా సాయిబాబా విశ్వరూపం చూపించాడు అంటేనే సమస్య.

మరి మన స్వామీజీలు ధార్మిక సంస్థలు శాంతి పరులుగా ఉండబట్టే కదా ఇలాంటివన్నీ చేయగలుగుతున్నారు.సాయిబాబా భక్తులకు ధైర్యం ఉంటే ఒక మసీదు కట్టి అందులో సాయిబాబు అని పెట్టి పూజించండి.ఒక చర్చి కట్టి అందులో సాయిబాబా ని పెట్టి పూజించండి.అల్లా కంటే కూడా సాయిబాబా గొప్ప జీసస్ కంటే కూడా సాయిబాబా నేనే గొప్ప అని ప్రచారం చేయండి చూద్దాం.

సాయిబాబా దేవుడు అనే దానికి baba భక్తులంతా చూపించే రుజువు ఏమిటో చూద్దాం.
1.కొంతమందికి ఆయన కలలో కనిపించాడు.
2.మరికొంతమందికి ఆయన ధ్యానంలో కనిపించాడు.
3.ఇంకొంతమంది నిజంగా చూసాము అంటున్నారు.
మీరందరూ ఏవేవో పర్సనల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు ఆయన వేలకు సహాయం చేశాడు.
4.ఆయన జీవించి ఉన్నప్పుడు ఏవేవో మిరాకిల్స్ చేసినట్టుగా మనకి ఆయన శిష్యుల ద్వారా ఆయన భక్తుల ద్వారా తెలుస్తోంది .

సాయిబాబా గట్టిగా దేవుడు అని చెప్పే దానికి ఇంతకు మించి పెద్ద ఆధారాలు మనకు లభించడంలేదు.

అసలు ఈ గందరగోళానికి అంతా కారణం దేవుడు అనే పదానికి అర్థం మనకు తెలియక పోవడమే.

దేవుడు, భగవంతుడు, పరమాత్మ, పరబ్రహ్మ అంటూ అనేక పదాలు దైవత్వాన్ని సూచిస్తున్నాయి.

వీటికి గల తేడాను అర్థం చేసుకుంటే ఎవరు దేవుడు ఎవరు కాదు నీకే ఈజీగా తెలిసిపోతుంది.

మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ.
ఈ పదాలను చూస్తే తల్లిదండ్రులు దేవుడు మనకి విద్య నేర్పిన గురువు కూడా దేవుడే.ఇప్పుడు చెప్పండి మీ తల్లిదండ్రులు దేవుళ్ళ లేక సాయిబాబా దేవుడు?

మనకి సహాయం చేసిన వాళ్లని కూడా మనం దేవుడిగా కీర్తిస్తాం. మరి వాళ్ళు నిజంగా దేవుడు అయిపోతారా?

అగ్ని దేవుడు వరుణ దేవుడు ఇంద్రుడు మీరందరూ దేవుళ్లు కాదా?
ఏసుప్రభు అల్లా బుద్ధుడు కూడా దేవుళ్లే. వీళ్లకు సనాతన ధర్మానికి మన వైదిక దేవుళ్లకు ఎటువంటి సంబంధం లేదు.
అలానే సాయిబాబా కూడా దేవుడే. అలానే సాయిబాబాకు మన సనాతన ధర్మానికి రాముడికి కృష్ణుడికి శివుడికి మన గ్రంధాలు ఎటువంటి సంబంధం లేదు.
సాయిబాబాను పూజిస్తే మీ సమస్యలు తొలగి పోతే పూజించండి దానికి ఎటువంటి అభ్యంతరం లేదు.కానీ ఒక్కటి మాత్రం అందరూ ఒప్పుకోవాలి రాముడికి సాయికి రాముడికి, కృష్ణుడి కి సాయికి, సాయికి శివుడికి ఎటువంటి సంబంధము లేదు.
దయచేసి సాయిబాబా భక్తులందరూ సాయిబాబా భక్తులు గానే ఉండండి ఆయన తీసుకొచ్చి మన సనాతన ధర్మంలోని దేవుడి తో లింక్ పెట్టవద్దు ఇక్కడే వచ్చిన చిక్కంతా.
మీరు సాయి బాబా ని తీసుకువెళ్లి ఏసుప్రభు కి లేదా అల్లా కి లింకు పెట్టగలరా అల్లా కాదు సాయిబాబా నిజమైన దేవుడని వారితో వాదించగల రా??

ఇక సాయిబాబా జీవితం విషయానికి వస్తే,
ఆయన తానే స్వయంగా నేను ముస్లిం అని చెప్పుకున్నాడు.
స్వయంగా తన చేతితో మటన్ బిర్యానీ ఉండి దాని ప్రసాదంగా పెట్టే వాడు.
ఆయన స్వయంగా నేను సమాధి లో నుంచి మీకు సమాధానం చెప్తాను మీకు హెల్ప్ చేస్తాను అన్నాడు.
అంతే కానీ అందరూ దేవుళ్ళు కంటే నేనే గొప్పవాణ్ణి నేనే నిజమైన దేవుని మిగతావాళ్లంతా ఫాల్స్ అని చెప్పలేదు.

సాయి కేవలం ఒక ఫకీర్ మాత్రమే అతన్ని దేవున్ని చేసి బ్రిటిష్ ఖాన్ గ్రేస్ కంమ్మీనిక్రృష్ట పార్టీలు మనల్ని సెక్యులర్ బానిసలు చేశారు అంతే కానీ అతడు ఏ విధంగా చూసినా కూడా దేవుడు కాదు. ఒకవేళ మికు భక్తి ఉంటే మిరంతా కోలుచుకోండి అంతేకాని
 #శ్రీరాముడు_శ్రీక్రిష్ణుడి_శివలింగాలను అతని కాళ్ళదగ్గర పెట్టి అవమానిస్తే మాత్రం ..ఎవడు చేతులు కట్టుకుని ఉరికే ఉండము. 
         
ఇది నాకు వాట్సాప్ ద్వారా వచ్చింది.   ఆలోచించవలసిన వాస్తవాలు ఉన్నాయనిపించి పంపడమైనది.

శ్లోకం


శ్లో||అమంత్రం అక్షరం నాస్తి
నాస్తి మూలం అనౌషధం
అయోగ్యః పురుషో నాస్తి
యోజకా తత్ర దుర్లభా||

అర్థం||  మంత్రం కాని అక్షరం లేదు. ఔషధం కాని చెట్టు వేరు లేదు. పనికి రాని మనిషీ లేడు. వీటిని ఉపయోగించుకునేవాడే లభించటం లేదు. అక్షరాలు అన్నీ మంత్రాలే. వాటిని సాధన చేసే ప్రయత్న శీలురు కావాలి. సామాన్య మైన " రామ" అనే మంత్రాన్నిజపించి బోయవాడు వాల్మీకి మహర్షి గా మారాడు. మాటలలో మహత్తరమైన శక్తి ఉంది. ఒక మంచి మాట వింటేమనస్సు ఆనంద పడుతుంది. ఇంకొక చెడ్డ మాట వింటే మనస్సుకు బాధ కలుగుతుంది. ఇక్కడ ఉన్న మనసు, మాట-- ఈ రెంటిలో దేనికీ రూపం లెదు. మనసునూ రుజువు చెయ్యలేము, మాటనూ రుజువు చెయ్యలేము. మనసుకు రూపం లెదు. మాటకు శబ్దం ఉంది. కాని క్షణంలో అంతరిస్తుంది.మరి ఇవి చూపే ప్రభావాలు మాత్రంఅనూహ్యం గా ఉంటాయి.

మాటతో జీవితం మారుతుంది. మాట తేడాతో యుద్ధాలు జరుగుతాయి. మనసులు కలిస్తే జీవితాలు ఆనందమయంగా మారుతాయి. మనసు విరిగితే జీవితాలు చెదిరి పోతాయి. మామూలు గా కనిపించే మాటనే మంత్రం గా సాధన చేసి ఫలితాన్ని పొందవచ్చు. ఇక బీజాక్షర సంయుక్తం అయిన మహా మంత్రముల మహిమ వేరే చెప్ప వలసిన పని లేదు. మంత్రాలకు చింతకాయలు రాలవు అని అంటారు. నిజమే. అది మామూలుగా పుస్తకంలో ఉన్న మంత్రం చదివి పరీక్షించిన వాని సంగతి. మంత్ర సిద్ధి ఉన్న వానికైతే చింత కాయలు రాలుతాయి. ఇంకా అద్భుతాలు కూడా జరుగుతాయి. ఆ మంత్ర సిద్ధి కలగాలంటే ఏళ్ళ కెళ్ళు సాధన చేసి చూడాలి. మంత్రాలు ఉన్నాయి. అలా సాధన చేసే వారే లేరు.

ఇక చెట్ల సంగతి కొస్తే, ప్రతి మొక్కలోనూ ఔషధ లక్షణాలు ఉన్నాయి. కాని దానిని పట్టుదలగా పరిశీలించి కనుగొనే నాదుడే లేదు. బుద్ధుని వ్యక్తిగత వైద్యుడైన జీవకుని గురించి ఒక గాధ ప్రచారం లో ఉంది. ఇదే కథ చరకుని గురించి కూడా చెప్తారు. వైద్య శాస్త్రాన్ని బాగా అభ్యసించిన తరువాత ఈయనకు గురువు గారు ఒక పరీక్ష పెట్టారు. ఒక ఏడాది పాటు దేశమంతా తిరిగి అన్ని మొక్కలనూ పరిశీలించి, వైద్యానికి పనికి రాని మొక్కను ఒక దాన్ని కనుగొని దాన్ని తెచ్చి ఇమ్మని గురువు చెబుతాడు.

జీవకుడు అలాగే సంవత్సరం పాటు పరిశీలించి తిరిగి ఉత్త చేతులతో వస్తాడు. ప్రశ్నార్థకం గా చూచిన గురువుతో- వైద్యానికి పనికి రాని మొక్క తనకు కనిపించలేదని చెబుతాడు. అప్పుడు మాత్రమె ఆయనకు వైద్య శాస్త్రం లో పరిపూర్ణత కలిగినట్లు గురువు భావించి ఇక నీవు వైద్యం చెయ్యటం ప్రారంభం చేయ వచ్చు అని అనుమతి ఇస్తాడు. ఇట్టి పరిశీలన, అధ్యయనం చేసాడు కనుకనే జీవకుడు ఈనాడు కొన్ని బౌద్ధ శాఖలలోవైద్యానికి Patron Saint గా పరిగణించ బడుతున్నాడు.

అదే విధం గా పనికి రాని మనిషి కూడా ఈ ప్రపంచం లో ఉండడు. కొందరిలో తెలివి తేటలు తక్కువగా ఉండొచ్చు. కాని వారు కూడా పరిశ్రమ తో గొప్ప వారు కాగలరు. కొందరిలో తెలివితేటలు ఎక్కువగా ఉండొచ్చు. కాని వీరు బద్ధకానికి లోనైతే జీవితంలో ఏమీ సాధించలేరు. ప్రకృతి అన్నింటినీ మనిషికి ఇచ్చింది. ఒక్క బద్ధకాన్ని, సోమరి తనాన్నిఒదిలించుకో గలిగితే, ధైర్యాన్ని పుంజుకో గలిగితే మనిషి సాధించలేనిది లేదు. ఎన్నెన్నో విద్యలు మానవుని కోసంఎదురు చూస్తూ చీకటిలో ఉన్నాయి. వాటిని అందుకునే వారు, సాధించే వారే లేరు.

ఇంద్రియ వ్యామోహం తో కొందరు, దురహంకారం తో ఇంకొందరు, బద్ధకంతో ఇంకొందరు, పిరికి తనం తో మరి కొందరు పరిస్థితుల ప్రభావం వల్ల కొందరు-- ఇలా రకరకాలుగా ఏమీ సాధించలేని అప్రయోజకులుగా మారుతారు. వీటిని వదిలించుకో గలిగితే మనిషిని విజయ లక్ష్మి ఏదో నాటికి వరిస్తుంది. యోగ వాశిష్టం లో ఒక గొప్ప శ్లోకం ఉంది. దాని అర్థ భాగమే గొప్పఉత్తేజాన్ని కలిగిస్తుంది. "దైవం నిహత్య కురు పౌరుష మాత్మశక్త్యా" అని శ్రీ రామునికి గురువైన వశిష్ట మహర్షిచెబుతాడు. ఓ శ్రీ రామా, పురుష ప్రయత్నానికిమించిన ఉపాయం లేదు. కావున పౌరుషం తోనూ, ఆత్మ శక్తి తోనూ విధిని జయించు. అని ప్రబోధిస్తాడు.

ఈ విధం గా ఉత్సాహంతో ప్రయత్నం చేసే వారికి ప్రకృతిలో అన్నీలభిస్తాయి. అది బాహ్యం గా కావచ్చు, అంతరికంగా కావచ్చు. ప్రయత్నశీలుడు ఏదోనాటికి తప్పక విజయాన్నిపొందగలడు.ప్రకృతిలో అన్నీ ఉన్నాయి. వాటిని అందుకునే వారే అరుదు. ఇంకొక్క మాట. ఈనాడు మనం Positive Thinking అని పేరు పెట్టి విదేశీయుల సాహిత్యాన్ని కాపీకొట్టి ఏదో సాధించి నట్టు చెప్పు కుంటున్నాం.నిజమైన Positive Thinking యొక్క మూలాలు యోగ వాసిష్టాది ప్రాచీన గ్రంధాలలో లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ఈ అర్థ శ్లోకం ఒక చిన్న ఉదాహరణ మాత్రమె.మనం విదేశీయులను కాపీ కొట్ట నక్కర లేదు. మన పెద్దల వారసత్వాన్ని సరిగ్గా అందుకోగలిగితే అదే చాలు. దానిని మించిన సంపద ఈ ప్రపంచం లో మరే దేశంలోనూ లేదు🙏🙏🙏🙏🙏🙏

మనవి కష్టాలు అంటారా


కష్టాలు కష్టాలు అని మనం తెగ బాధపడతాం.
 కాని నిజానికి మనవి కష్టాలు అంటారా?

👉ఇంద్రుడు అంతటివాడు శాపం తట్టుకోలేక వెళ్లి         తామరతూడులో దాక్కున్నాడు.
👉నహుషుడు శాపం వలన తొండగా మారిపోయాడు.
👉హరిభక్తుడైన పరమ భాగవతోత్తముడు ప్రహ్లాదుడు తన సంపదలు కోల్పోయి గాడిదగా మారి ఊక తిన్నాడు.
👉పాండవులు అడవుల పాలయ్యారు.
వేరేవాడి దగ్గర ఆవులు కాచారు, గుర్రాలను మేపారు. వంటలు వండారు. సేవ చేశారు.
👉నలుడు భార్యని కూడా కోల్పోయి తన శౌర్యం కోల్పోయి అడవుల్లో తిరిగాడు.
👉దేవతలు తమ ప్రతిభ కోల్పోయి తలా ఓ దిక్కు పారిపోయి వందల సంవత్సరాలు దాక్కున్నారు.
👉రాముడంతటి వాడె భార్యతో అడవుల్లో కాలం గడపవలసి వచ్చింది.
👉శ్రీకృష్ణుడు చిన్ననాటి నుండే తన మీద జరిగే దాడులు ఎదుర్కుంటూ నే ఉన్నాడు. 
అనేకమంది రాక్షసులు, సైంధవుడు, జరాసంధుడు, ఎందఱో కృష్ణుడి మీదికి, అతడి రాజ్యం మీదికి మాటిమాటికి దాడులు చేశారు. 
చివరికి తన కొడుకుని తన కళ్ళ ముందే చంపితే చూస్తూ ఉండిపోయాడు. 
అయన భార్యలని దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు. రుక్మిణికి అర్జునుడు చితి పేర్చితే యోగ విద్య ద్వారా ఆ మంటల్లోకి ఆహుతి అయింది. 
సత్యభామ ఒంటరిగా హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసి శరీరం వదిలేసింది.
👉పెళ్లైంది మొదలు ఎన్నో కష్టాలు పడిన కుంతీదేవి దృతరాష్ట్రుడి తో సహా అగ్నీకీలల్లో ఆహుతై పోయింది.
👉ఇంద్రుడి కొడుకు శాపం వలన కాకిగా మారిపోయాడు.

అంతటి దేవతలు, మహాత్ములే ఎన్నో కష్టాలు పడ్డారు. వీటి ముందు మనకి వచ్చే చిన్ని చిన్ని కష్టాలు ఓ లేక్కంటారా? కానేకాదు.

ప్రతీది కాలం నిర్ణయిస్తుంది.. నీకు ఎప్పుడు ఏది దక్కాలో అది సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది.అది కష్టం అయినా సుఖం అయినా...
ఓపిక తో ఉండాలి..
ధైర్యంగా ఎదుర్కోవాలి... 
లక్ష్యాన్ని సాధించాలి...

!!సర్వే జనా సుఖినోభవంతు!!🙏🏼VSN🙏🏼

*నరసింహ సుభాషితం*

*సంస్కృతాంధ్ర సాహితీసౌరభం*
*సుభాషితం - నాస్తి విద్యాసమో బంధుః*

*శ్లోకం:*
*నాస్తి విద్యాసమో బంధుః నాస్తి విద్యాసమో సహృత్ ।*
*నాస్తి విద్యా సమం విత్తం నాస్తి విద్యాసమం సుఖం ॥*

*పద విభాగం:*
న, అస్తి, విద్యా, సమః, బంధుః, న, అస్తి, విద్యా, సమః, సహృత్, 
న, అస్తి, విద్యా, సమం, విత్తం, న, అస్తి, విద్యా, సమం, సుఖం.

*ప్రతిపదార్థం:*
విద్యా సమః = విద్యతో సమానమైన, బంధుః = బంధువు లేదా చుట్టము, నాస్తి = లేడు,  విద్యా సమః = విద్యతో సమానమైన, సహృత్ = స్నేహితుడు, న అస్తి = లేడు, విద్యా సమం = విద్యతో సమానమైన, విత్తం = ధనము, నాస్తి = లేదు, విద్యా సమం = విద్యతో సమానమైన, సుఖం = సుఖము, నాస్తి = లేదు.

*Meaning:*
There is no relative equal to knowledge and education. There is no friend equal to knowledge and education. There is no wealth equal to knowledge and education. There is no happiness equal to knowledge and education.

*తాత్పర్యం:*
విద్యతో సరితూగ గల బంధువు లేదు. విద్యతో సమానమైన స్నేహితుడు లేదు. విద్యతో సమానమైన ధనమూ లేదు. విద్యతో సరితూగ గల సుఖము లేదు.

విద్య యొక్క ప్రాసస్థ్యాన్ని, విద్య యొక్క ఆవశ్యకతని ఎంతోమంది మహానుభావులు, ఎన్నో గ్రంథాలలో మనకి నొక్కి వక్కాణిస్తునే ఉన్నారు. తల్లిదండ్రులు పిల్లలకి తెలియ జేస్తూనే ఉన్నరు. ప్రభుత్వాలు విద్య యొక్క ఆవస్యకతని దృష్టిలో ఉంచుకుని అనేకమైన అవకాసాలని కల్పిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానము బాగా పెరిగిన నేపథ్యములో, యువతకి ఉద్యోగావకాసాలు కూడా బాగా ఉన్న నేపథ్యములో ఈ విద్య యొక్క ఆవశ్యకతని అందరూ గుర్తిస్తున్నారు.

విద్య యొక్క ఆవశ్యకతని ఈ సుభాషితము ద్వారా మరొక మారు మననం చేసుకుందాము. 

విద్యతో సమానమైన బంధువు లేదా చుట్టము లేడు. అవసరములో ఆదుకునే బంధువు విద్య మాత్రమే. విద్యతో సమానమైన స్నేహితుడు కూడా లేడు. అవసరార్థం తన యొక్క చదువే తన నేస్తమౌతాడు. విద్యతో సమానమైన ధనము లేదు. ఈ *విద్యాధనము ఒక్కటే ఖర్చు పెట్టిన కొలదీ పెరుగుచుండేది మరియు తరగనిది* . విద్యా ధనము ఉంటే ప్రపంచములో ఏ విధముగానైనా ద్రవ్యము సంపాదించవచ్చు. విద్యతో సమానమైన సుఖము లేదు. సరియైన విద్య ద్వారా, తగిన జ్ఞానము, విజ్ఞానము అలవడతాయి. ఈ విజ్ఞానము ఇచ్చే సుఖము బాహ్య ప్రపంచపు సుఖాలకంటే అతీతము, ఉన్నతము అయినవి.

**కరుణశ్రీ చాటువు**

  
  **ఎండిన మ్రోడులే కిశలయించెనొ!యేకశిలాపురమ్ములో
బండలు పుల్కరించెనొ! అపార ముదమ్మున తెల్గు తల్లికిన్
గుండెలు పొంగిపోయి కనుగొల్కులునిండెనొ!పచ్చిపైరులే
పండెనొ జాలువారిన! భవత్కవితామృత భక్తిధారలన్**
               ***
**బమ్మెర పోతనామాత్యా! ఏకశిలానగరంలో మీరు భాగవత పురాణం ఆంధ్రీకరిస్తుండగా మీ యొక్క అమృత కవితలలో నుండి జాలువారిన భక్తి అను వర్షపు ధారలలో తడిసి ఎండి మోడువారిన చెట్లు కూడ చిగురించి ఉంటాయి. తెలుగు తల్లి గుండెలు అనంతమైన ఆనందంతో పొంగిపోయి, కనులు చెమరించి ఉంటాయి. కొత్తగా మొలకలెత్తి ఇంకా పండని పంటలు పండిపోయి ఉంటాయి.**
                    ***
        **ఇదం న మమ**

సేకరణ:: యం.వి.శర్మ