31, అక్టోబర్ 2020, శనివారం

శరత్ పూర్ణిమ - విశిష్టత

 శరత్ పూర్ణిమ - విశిష్టత

ఈ రోజు (31-10-2020, శనివారము) శరత్ పూర్ణిమ. ఆశ్వీయుజ పూర్ణిమకే శరత్ పూర్ణిమ అని పేరు. ఇది అమ్మవారి (శక్తి) ఆరాధనకు చాలా విశేషమైన రోజు. మామూలు ప్రజలు అమ్మవారి ఆరాధన దేవి నవరాత్రులు 9 రోజులు చేస్తే, దేవీ ఉపాసకులు, మంత్ర సాధకులు, దశ మహా విద్యలు దీక్షా పరులు, గురువులు అమ్మవారి ఆరాధన ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు చేస్తారు. ఏడాదిలో ఈ పూర్ణిమ నాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తాడు. అందువలన ఈ రోజు చంద్రుడిని పూజించడం, చంద్ర కాంతిలో మంత్ర జపం చేయడం మంచిది. ఈ శరత్ పూర్ణిమ రోజున చందకిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. అవి శారీరిక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. అందువలన చంద్రకాంతిలో కూర్చుని ఏదైనా దశ మహా విద్య మంత్రం, స్వర్ణ ఆకర్షణ భైరవ మంత్రం, కాలభైరవ సహస్రనామ పారాయణ చేయడం, ఆవుపాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచి, ఉదయాన్నే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. చంద్రకాంతి నుంచి ఈ పౌర్ణమి రోజున అమృతం కురుస్తుందని శాస్త్రం చెప్తోంది. చంద్రకాంతిలో ఉంచిన పరమాన్నం చంద్రకిరణాల లో ఉన్న ఓషిధీతత్త్వాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. మరునాడు ఉదయం ఆ పరమాన్నాన్ని కుటుంబసభ్యులందరూ నైవేధ్యంగా స్వీకరించాలి.


ఈ పూర్ణిమకే కోజాగరి పూర్ణిమ అనే పేరు కూడా ఉంది. కోజాగరీ పూర్ణిమ రోజున ప్రత్యేకంగా స్వర్ణ భైరవుని పూజిస్తారు.


అందరికి శరత్ పూర్ణిమ శుభాకాంక్షలు. మీ కాలభైరవ స్వామి

అరుణాచల శివ 🙏

 అరుణాచల శివ 🙏




' సద్దర్శనము - సద్విద్య' (ఉన్నది నలుబది)

          -భగవాన్ శ్రీ రమణ మహర్షి



శ్లోకం : 32


 గవేషణా త్ప్రాప్య హృదన్తరం త

 త్పతే దహాన్తా పరిభుగ్నశీర్షా l

 అథాహమన్య త్స్ఫురతి ప్రకృష్టం

 నాహంకృతి స్త త్పరమేవ పూర్ణం ll



అహంభావము హృదయమధ్యమున అన్వేషించి తన మూలస్వరూపమునుపొంది పైకి రాజాలక ఆ మూలస్వరూపమునందు లయమునొందును. ఆ అహంభావము లయించిన పిదప ఉత్తమమైన - విశుద్ధమైన - మరియొక 'అహం' రూపము భాసించును. అది పూర్వోక్తమైన అహంభావము కాదు. అది అఖండమైన పరమాత్మతత్త్వమే.


'అహం' పదమునకు వాచ్యార్థమైన ఆత్మాభాసమగు అహంకారము నశించినపుడు కాలత్రయమునందును అనుసరించునదై, 'అహం' పదమునకు లక్ష్యార్థమైన, శుద్ధమైన, అహంవృత్తి-మేఘములు తొలగిన పిదప సూర్యుడువలె భాసించును.


ఓం నమో భగవతే శ్రీ రమణాయ🙏

అమర చైతన్యం"

 *"అమర చైతన్యం"* 

*( శ్రీ రమణ మహర్షి బోధనలు )*



*ఒక జ్ణానిని  ఎవరైన తూలనాడితే దానిని వారు ఎలా స్వీకరిస్తారు ?*


*జవాబు: పసి పిల్లవాడు, జ్ఞాని ఒక్కటే. సంఘటనలు జరిగినంతసేపే వారికి ఆసక్తి వుంటుంది. వాటి ప్రభావం వారిమీద ఎంతమాత్రం ఉండదు. దాని గురించిన ఆలోచనలేమీ వుండవు. గీతలో ఒక శ్లోకము ఇలా వున్నది అహం నశించిన వ్యక్తి తన ధర్మం ప్రకారం శతృవులను (లోకం లోని వారిని) సంహరించినా అతను హంతకుడు కాడు. అతనికి ఏదీ బంధించదు. అలాగే జ్ఞానికి గతకర్మలు వాసనలు వుండవు. అహం నశించిన వ్యక్తిని అవి ఎలా బంధిస్తాయి. అలాగే జ్ఞాని యుద్ధంలో ఎంతమందిని చంపినా అతనికి ఏ పాపము అంటదు. జ్ఞానికి భూత, భవిష్యత్ , వర్తమానము లేమీ లేవు. ఆయన వీటికి అతీతుడు. ఎందుకంటే కాలాతీతమైన ఆత్మలోనే ఆయన జీవిస్తాడు కనుక. జ్ఞానులు భవిష్యత్తు గురించి ప్రణాళిక లేమీవేయరు. వారు అలా ఎందుకు చేయాలి. వాళ్ళలో అహం లేదు కనుక వారు ఆ దివ్యశక్తి చేత కార్యములకు వినియోగింపబడతారు. ఏమి జరుగుతుందో ఊరక చూస్తూంటారు. వారు పనులన్నీ దైవేశ్చకే వదిలిపెడతారు. వారిలో అహం లేదు కనుక ఎపుడూ శాంతిగా ఉంటారు.*

ఆణిముత్యాలు

 ఆణిముత్యాలు..._

పరమాత్మను కనుక తెలుకోకపోతే నీవు చదివిన శాస్త్రాలన్నీ వృధాయే.ఆయనను గనక తెలుసు కొంటే ఇక శాస్త్రాలన్నీ వృధాయే._


భవబంధాలనుంచి విముక్తి పొందాలంటే మనిషి తానైనదానికి, తాను కానీ దానికి మధ్య తేడాను అభ్యాసం చేయాలి. అప్పుడు మాత్రమే అతడు సత్యాన్ని తెలుకోగలుగుతాడు._


చీకటి, అది కల్పించే భ్రమలూ అవన్నీ కూడా సూర్యుడు రానంతవరకే. సూర్యుడు వచ్చాకా అవన్నీ మటుమాయం కావలసిందే కదా ! అలాగే ఆత్మసాక్షాత్కారం కానంతవరకే ఈ మాయ పొరలన్నీనూ..


నీవు కానిదాని గురించి ఆలోచించకు. అది నిన్ను కృంగదీస్తుంది. భాధ కలిగిస్తుంది. దానికి బదులుగా నీ అసలు స్వరూపం మీదా ద్రుష్టి సారించు. అది నిన్ను అన్నింటినుంచి విముక్తుడిని చేస్తుంది.


మనసును నిశ్చలంగా ఉంచితే అది నిన్ను భగవంతుడి వైపు తీసుకుపోతుంది. లేదంటే నిన్ను భ్రమలలోనే ముంచేస్తుంది.


సంపదల వెంట పరుగులు పెట్టకు. ఎందుకంటే సంపద మనిషిని పతనం చేస్తుంది. సంపద గల మనిషి తన స్వంత కుమారులకు కూడా భయపడతాడు. ఇది సంపద వల్ల వచ్చే ఫలితం.


సూర్యుడు నుంచి వచ్చే వేడి నుంచి చంద్రుడు భూమిని కాపాడుతూ ఉన్నట్లుగా, మహాత్ములు ఎల్లప్పుడు భాదల్లో ఉన్నవాళ్ళకి సహాయం చేస్తుంటారు


నిర్గుణ సమాధి ద్వారా మనిషి తన వృదయంలో ఉన్న అజ్ఞాన ముడిని విప్పేసుకుంటాడు.


బంగారాన్ని మండుతున్న కొలిమిలో గనక పెడితే ఎలాగైతే దానిలోని మాలిన్యాలన్నీ పోతాయో అలాగే మనిషి కూడా ధ్యానమగ్నుడైతే పరిశుద్ధుడౌతాడు.ఇంద్రియనిగ్రహంతో వైరాగ్యభావం గల మనిషిలో ఉన్న శాంతినీ, సంతోషాన్ని ఎవరు పోగొట్టగలరు...?_శ్వాసమీదనే ధ్యాస పెట్టుకొని ధ్యానమగ్నుడైన వాడికి అన్నీ ఉన్నట్లే.


అజ్ఞానమే అన్ని బంధాలకు ఆదిమూలం. అదిపోతే దానితో బాటు వచ్చిన అన్ని బంధాలూ పటాపంచలవుతాయి.


 తామరాకుమీది నీటిబిందువు ఎలాగైతే నిలకడగా ఉండదో అలాగే ఈ జీవితం కూడా నిలకడగా ఉండదు.


ఇంద్రియాలు సహకరిస్తే సుఖం. అవి సహకరించకపోతే దుఃఖం. కాబట్టి సుఖదుఃఖాలు రెండు కూడా శాశ్వతమైనవి కాదని తెలుసుకొంటే మంచిది.

రుద్రపశుపతి నాయనారు

 Sri Siva Maha Puranam -- 5 By Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


రుద్రపశుపతి నాయనారు


అరువదిమంది నాయనార్లలో రుద్రపశుపతి నాయనారు ఒకరు. సన్యాసి కూడా రుద్రం చదవాలి. అభిషేకం చేయకపోయినా రుద్రం పారాయణ చేస్తే వెంటనే పాపములు పటాపంచలు అవుతాయి. రుద్రపశుపతి నాయనారుకి ఒక లక్షణం ఉండేది. ప్రతిరోజూ కూర్చుని రుద్రాధ్యాయం చదువుతూ ఉండేవారు. అలా చదువుతున్నప్పుడు ఒక అనుమానం వచ్చింది. అందులో

 ‘యుధాయ చ సుధన్వనే చ నమ స్రుత్యాయ చ పథ్యా య చ నమః కాట్యాయ చ  నీ ప్యాయ చ నమ స్సూద్యాయ చ సరస్యాయ చ  నమో నా ద్యాయ చ వై శన్తాయ చ ||  నమః కూప్యాయ చావ ట్యాయ చ నమో వష్యా౯  య చావష్యా౯  య చ  నమోమే  ఘ్యాయ చ విద్యు  త్యాయ చ నమ ఈద్ద్రియాయ చాతప్యాయ  చ నమో వాస్తవ్యాయ చ వాస్తు పాయ చ ||  ఈ మాటలు ఉన్నాయి. ఇవన్నీ ఈశ్వరుడే అన్నాడు. అనగా నీరు, నీటిమీద నురుగు, చెట్టు, చెట్టు మీద పిట్ట చెట్టులో ఆకుపచ్చతనం ఈశ్వరుడు. నాయనారు తిరుమలయార్ ప్రాంతంలో ఉండేవారు. ఆయన ఈ రుద్రమును చదివి ఆకాశం ఈశ్వరుడు, మేఘం ఈశ్వరుడు, నీరు ఈశ్వరుడు, నురుగు ఈశ్వరుడు, చెట్టు ఈశ్వరుడు, పిట్ట ఈశ్వరుడు. కాబట్టి నేను ఇంట్లో కూర్చుని వీటన్నింటినీ చెప్తుంటే ఉపయోగం ఏమిటి? కాబట్టి నేను ఈశ్వరుడిలో చేరిపోయి ఈశ్వరానుభూతిని పొందుతాను’ అన్నాడు.

ఒకరోజున తెల్లవారుఝామున ఎవ్వరికీ చెప్పకుండా ఊరిబయటకు వెళ్ళి అక్కడ గల కొండమీద నుంచి ఒక సెలయేరు జాలువారుతున్న సెలయేట్లో నడుంలోతు నీళ్ళలో నిలబడ్డాడు. చల్లని నీటి స్పర్శకు ఈశ్వరుడు తనను కౌగలించుకున్న అనుభూతిని పొందారు. ఇవన్నీ ఈశ్వరుడు కదా! నేను ఈశ్వరుడిలో ఉన్నాను అని నమః ఫేన్యాయచ నమస్సికత్యాయ చ ప్రవా హ్యాయ చ’ అని పారాయణ చేసి బయటకి రాలేక రాలేక వచ్చేవాడు. ఒళ్ళు తుడిచేసుకుని పొడి బట్ట కట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు. మరల మధ్యాహ్నం సంధ్యావందనం కోసం ఆ చెరువు దగ్గరకు వెళ్ళి నీళ్ళలో నిలబడి శివుని ధ్యానం చేసేవాడు. చుట్టూ కనిపిస్తున్న ప్రతివస్తువులో శివరూపమును చూసేవాడు. సాయంత్రం కూడా అదేనీటిలో అదే పరిస్థితి. ఇలా కొన్నాళ్ళు జరిగింది. చివరకు రానురాను ఆయనకు ఎవరు కనపడినా ఈశ్వరుడే కనపడేవాడు. ఆఖరికి దొంగ కనపడితే ‘నమః చోరాయచ’ అనేవాడు. అలా అంతటా ఈశ్వర దర్శనం చేస్తూ ఉండేవాడు. శంకరుడు ఇక నేను తప్ప ఇంకొకడు కనపడని నిన్ను నాలోకే తీసుకోవాలి అని నాయనారుని తనలోకి తీసుకున్నాడు. నాయనారు శివునిలో ఏకమయి పోయి తాను శివుడు అయిపోయాడు. దీనిని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే నాయనారు భావనచేత మోక్షమును పొందినట్లుగా మనం గమనిస్తాము.

శం – భావయతి –  మంచి భావములు ప్రవేశించి ఈశ్వరాభిముఖులై నిరతిశయ సుఖ స్వరూపమయిన శివునియందు కలిసి శివుడు అవుతారు. అటువంటి స్థితి కలగడం కోసమే మహానుభావుడయిన పరమాత్మ ఉపకారం చేశాడు. ఇటువంటి జ్ఞానమును శంభు స్వరూపం కటాక్షిస్తుంది. ‘శంభుః’ అన్న నామం, పరమశివుని రూపములలో ఆ శాంభవ స్వరూపం అంత గొప్పది అయింది. ఆ నామములు చెప్పుకుంటే చాలు ఉద్ధరణ కలుగుతుంది.

  ‘జ్ఞానదాతా మహేశ్వరః’ ఈశ్వరుని అనుగ్రహం వలన మాత్రమే జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానమును ఇచ్చేవాడికి మహేశ్వరుడు అని పేరు. శంభునామమును గట్టిగా పట్టుకుని ఆ నామముతో పిలిస్తే, ఆయన భావములను మార్చి మనసుని ఈశ్వరుని వైపు తిప్పుతాడు. సత్ప్రవర్తన కల్పిస్తాడు. చక్కని వ్యక్తిగా రూపు దిద్దుతాడు. ప్రతిరోజూ శంభు నామమును చెప్పుకుంటూ శంభు అనుగ్రహమును పొందాలి.  ‘శం’ – ఈ లోకంలో సుఖము దగ్గర నుంచి నిరతిశయ సుఖం వరకు, ఊర్ధ్వలోక సుఖం వరకు ఎంత సుఖం ఉన్నదని అనుకుంటున్నారో అన్ని సుఖములను ఇవ్వడమును కామకోటని పిలుస్తారు. కామకోటి అనగా ఇక్కడ కోర్కెలను ఇవ్వడంతో మొదలుపెట్టి కోర్కెలు లేకుండా చెయ్యడం వరకు తీసుకువెళ్ళి, పుణ్యమును ఇచ్చి పుణ్యము వలన ఊర్ధ్వలోక ప్రాప్తి ఇచ్చి, మరల తిరిగి రానవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్య స్థితి అనబడే మోక్ష స్థితి వరకు ఇవ్వగలిగిన అంచులన్నీ అమ్మవారి చేత పరిపాలించబడుతున్నాయి. ఆవిడ యవనిక ఎత్తి ఈ కామకోటిలో నిలబెడుతుంది. ఈ కోటిలో ఏ మెట్టుమీద నిలబడతారో దానికి తగినట్లుగా నిలబెట్టడానికి ఈ నామములు, ఈశ్వరానుగ్రహము రక్షిస్తాయి. రుద్రపశుపతి నాయనారు వృత్తాంతమే అందుకు ఉదాహరణ.

స్నేహంలో ఆనందం

 *స్నేహంలో ఆనందం* ✍🏻నారంశెట్టి ఉమామహేశ్వరరావు 

 ​

ఒక అడవిలో ఒక గుర్రం ఉండేది. అది ఒంటికన్నుతోనే పుట్టింది. దాని తల్లిని ఏదో జంతువు చంపేసింది. అది ఒంటరిదయింది. అక్కడా ఇక్కడా గడ్డి మేస్తూ బ్రతికేది. ఒంటరిగా ఉండే కంటే ఎవరైనా స్నేహితులంటే బాగుణ్ణని  అనుకుంది గుర్రం. 

      ​కొత్తస్నేహితుడిని వెదుకుతూ బయల్దేరిందది. ఒక గాడిద కనిపించగానే పలకరించి “నాతో  స్నేహం చేస్తావా?” అని అడిగింది  గుర్రం. “నీలాంటి ఒంటికన్ను గుర్రంతో ఎవరైనా స్నేహం చేస్తారా” అనేసి  వెళ్ళిపోయింది గాడిద.

      ​అదేమీ పట్టించుకోకుండా గుర్రం ముందుకు  వెళుతుంటే పచ్చికను మేస్తున్న దున్నపోతు కనిపించింది. స్నేహం చేయమని దాన్ని అడగగానే “నాది పెద్ద  కుటుంబం. వాళ్ళతో గడిపేసరికి రోజు గడచిపోతుంది. మరెవరితోనూ స్నేహం చెయ్యను” అనేసి మేత మేయడంలో మునిగిందది .  

 పట్టు విడవకుండా వెళుతున్న గుర్రానికి  ఎలుగుబంటి ఎదురయింది. దాన్ని కూడా స్నేహం చెయ్యమనగానే “వేగంగా పరుగెత్తే నీకూ నాకూ సరిపోదు. నాకేమో పెద్ద గోళ్లున్నాయి. నీకు లేవు.తేనెతుట్టలు, చీమల పుట్టలు, చెరుకు గడలు ఇష్టంగా తింటాను. నువ్వేమో గడ్డీగాబు మేస్తావు. మనకి కుదరదు” అని చెప్పింది  ఎలుగుబంటి. 

      ​ఆవు, జింక,కుందేళ్లను అడిగి భంగపడింది  గుర్రం. తనతో ఎవరూ స్నేహం చెయ్యక పోయేసరికి గుర్రానికి ఏడుపొచ్చింది.       ​దగ్గర్లోని చెరువు గట్టున ఒక  చెట్టు క్రింద కూలబడి గట్టిగా ఏడిచింది గుర్రం. “ఎందుకేడుస్తున్నావని” ఒకేసారి అడిగాయి చెట్టు, చెరువు.

“ఎవరూ లేనిదాన్ని. స్నేహం కోసం ఎవరినడిగినా కుదరదన్నారు.  ఒంటి కన్ను గుర్రాన్నని ఎవరికీ నాతో స్నేహం ఇష్టం లేదు” అంది గుర్రం ఏడుస్తూనే..

చెరువు “బాధపడకు. నీతో స్నేహం చేస్తాను. ఈ క్షణం నుండి ఇక్కడెక్కడో గడ్డిమేసి  నా నీరు త్రాగుతూ ఉండు. నేనెలాగూ కదలలేను.  అడవి ఊసులేవో నాకు చెప్పు. వింటాను”  అంది.

చెట్టు కూడా “ నేనూ స్నేహం చేస్తాను. నా నీడలో ఎండకు, వానకు తల దాచుకో. నేనెటూ వెళ్ళలేను. ఆ కబుర్లేవో నేనూ వింటాను“ అంది.

గుర్రానికి ఒకేసారి ఇద్దరు స్నేహితులు  దొరికేసరికి  సంతోషమయింది. అది మొదలు తన కష్టసుఖాలను చెరువు, చెట్టులకు చెప్పుకునేది. ఎక్కడ తిరిగిందో,  ఏమేమి చూసిందో  సాయంత్రానికల్లా  వచ్చేసి పూసగుచ్చినట్టు చెప్పేది గుర్రం వాటికి.  

 గుర్రం చెప్పే కబుర్లను ఆసక్తిగా వినేవి చెరువులో చేపలు, కప్పలు, తాబేళ్లు. వాటికి కూడా గుర్రంతో స్నేహం చెయ్యాలనిపించి  “ గుర్రమన్నా! మేము కూడా  చెరువు దాటి వెళ్లలేని వాళ్ళము.  నీ కబుర్లు నచ్చాయి మాకు. మాతో స్నేహం చెయ్యవా”  అని అడిగాయి అవన్నీ. 

ఒకప్పుడు తనతో స్నేహానికి ఒక్కరూ రామన్నారు. ఇప్పుడేమో స్నేహం చేస్తామని అడుగుతున్నారని సంబర పడింది గుర్రం. వాటికి సరేనని  చెప్పింది.

 అది అడవిలో తిరిగినప్పుడు పండ్లు,  పురుగులు  దొరికితే తెచ్చి చెరువులో వేసేది. వాటిని ఇష్టంగా తినేవి చేపలు. “నువ్వు  మంచివాడివి. మాకోసం కబుర్లు చెబుతున్నావు. ఆహారం తెస్తున్నావు. నీతో స్నేహం బాగుంది” అని మెచ్చుకునేవి చేపలు.

చెరువుకి నీరు త్రాగడానికి వచ్చిన గాడిద, దున్నపోతు,  ఎలుగుబంటి చెరువులోని  చేపల మాటల్ని విన్నాయి. ఒంటికన్నుదే అయినా మంచివాడైన గుర్రంతో   స్నేహం వద్దనడం తప్పని  తెలుసుకున్నాయి. 

“ఒంటికన్ను చూసి అప్పుడు నీ  స్నేహం వద్దన్నాము. మమ్మల్ని క్షమించు. ఇప్పుడు మాతో స్నేహం చెయ్యు ” అని అడిగాయి ఆ జంతువులు.

“సరే” అంది సంతోషంగా గుర్రం. “కొత్త స్నేహితులొచ్చారని మమ్మల్ని మరచిపోకు” అన్నాయి చెరువు, చెట్టు, చేపలు.

“మీరంతా కావాలి. కొత్త స్నేహితులు వచ్చినా సరే ఇక్కడి చెట్టుక్రింద పడుకుని, చెరువు నీరే త్రాగుతూ, మీతో ముచ్చట్లు చెబుతానంది” గుర్రం.  చెరువులోని చేపలన్నీ ఒక్కసారి  గాలిలో ఎగిరి పల్టీలు కొడుతూ “భలేభలే గుర్రం. చాలా మంచి నేస్తం” అని పాటందుకున్నాయి. తన సంతోషాన్ని తెలుపుతూ కొమ్మల్ని  గట్టిగా  ఊపింది చెట్టు. ఒక అలను గుర్రం కాళ్ళ వైపు పంపి సంతోషం తెలిపింది చెరువు.కప్పలన్నీ బెకబెకా అరిచి  గోల చేశాయి. చాలాకాలం వరకు స్నేహంలో ఉన్న మజాను అవన్నీ కలిసి అనుభవించి ఆనందించాయి.

*తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు  క్రింది లింక్ ద్వారా చేరండి*

https://t.me/joinchat/AAAAAEqrF94avWw7JKUdgQ

ఏకశ్లోకి సుందరాకాండ

 ఏకశ్లోకి సుందరాకాండ



🍁🍁🍁🍁



వాల్మీకి సుందరకాండ చాలా మహిమాన్విత మైనది. సమయం చాలనప్పడు, ఈ శ్లోకం ఒక్కటైన చదివినా (భక్తిశ్రద్ధలతో) మంచి ఫలితం వస్తుందని పెద్దల నమ్మకం. 


హనుమ అమ్మవారి జాడ గురించి లంక అంతా వెదుకుతాడు. అమ్మవారిని కనుగోలేక నైరాస్యం చెందుతాడు. ఒకానొక సమయంలో ప్రాయోపవేశాని కూడా సిద్ధపడతాడు. చివరకు అమ్మవారినే ప్రార్థన చేస్తాడు. అప్పుడు మహర్షి, హనుమ చేత ఈ శ్లోకాన్ని పలికిస్తారు.


"నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ

దేవ్యైచ తస్మై జనకాత్మజాయై

నమోఽస్తు రుద్రేంద్రయమానిలేభ్యో

నమోఽస్తు చంద్రార్కమరుద్గణేభ్యః"

{13 వ సర్గ లోని 59వ శ్లోకం}


భావము: లక్ష్మణుని (భక్తుని) తో కూడి ఉన్న రామచంద్రునికి (పరమాత్మ) నమస్కారం. జనకాత్మజ అయిన సీతమ్మతల్లి కి (పరాశక్తి) నమస్కారం. మరియు రుద్ర, సూర్య, చంద్ర, ఇంద్ర, యమ, వరుణ మొదలైన మరుత్తు గణాలకు ( ప్రకృతి శక్తులకు) నమస్కారం.

 

దీనినే ఏక శ్లోకి సుందరకాండ అంటారు. ఈ శ్లోకం గురించి మరికొన్ని వాస్తవాలు:


1) మార్గనిర్దేశిక శ్లోకం: ఒక్కొక్క సారి మనం క్లిష్టమైన పరిస్తితులను ఎదుర్కొంటాం. అప్పడు ఏంచెయ్యాలొ, ఏం చెయ్యకూడదో తెలియని గందరగోళం మనం ఎదుర్కొన్నప్పుడు, భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకం పఠిస్తే, గాయత్రీ స్వరూపమైన అమ్మవారు, మన బుద్ధి ప్రచోదనం చేసి, మనకు సద్భుద్ధిని కలిగిస్తుంది. ఎటువంటి ఆపదల్లో కూడా, మనం మంచి నిర్ణయాలు తీసుకోగలం. (సమత్వం యోగవుచ్యతే- భగవద్గీత సాంఖ్యయోగం)


2) ప్రార్ధనా శ్లోకం: ఇది ప్రార్థనాశ్లోకంగా నిత్యం చదువకోదగ్గది. అట్లాగే, రామాయణ పారాయణమున దీనిని ప్రార్ధనగా ఉపయోగిస్తారు. శ్రీ భాష్యం అప్పలాచార్యులు గారు దీనిని కార్యసిద్ధి మంత్రం గా వర్ణించేవారు.


3)జాతకం: ఎవరిదైనా జాతక చక్రంలో బుధుడు నీచ స్థితి లో వుంటే లేదా బుధమహా దశ / బుధ అంతరదశ వుంటే, ఈ శ్లోకం నిరంతరం పఠిస్తారు. 

ప్రారబ్ధం వలన జరగవలసిన చెడు ఫలితాలు కూడా కొంతమేర తగ్గుతుంది. కొంత చెడు జరిగినా, అది మన మానసిక ధైర్యాన్ని దెబ్బతీయదు సరి కదా ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుంది.


4)నమస్కారం: నమస్కారం ప్రాముఖ్యత గురించి తెకలియజేసినది వేదం. 

(రుద్ర నమకం -యజుర్వేదం) అటువంటి నమః పునరుక్తి మనకు మొదటిసారిగా 

రామాయణం సుందరకాండ లోని ఈ శ్లోకాలో కనిపిస్తుంది. 


భగవంతుని నమస్కరించునపుడు, భగవద్భక్తుల ద్వారా, పరాశక్తి ద్వారానే ఆశ్రయింపవలయును- అను నియమాలను ఇందు హనుమ ద్వారా పాటించి, మహర్షి మనకు తెలియజేసారు.


సుందరకాండ పారాయణం చాలా మంచి ఫలితాలను ఇస్తుందని మన పూర్వీకుల నమ్మకం. అపారమైన విశ్వాసంతో నమ్మకాన్ని నిజం చేద్దాం.


జై శ్రీమన్నారాయణ 🙏


🍁🍁🍁🍁

జగదంబ’ పలుకు

 'జగదంబ’ పలుకు

               ************

విశాఖపట్నంలోని జగదంబ సెవెంటీ ఎంఎం థియేటర్ కి యాభై ఏళ్లు పూర్తయ్యాయని తెలియగానే ఆ థియేటర్ తో నా జ్ఞాపకాలు రింగులు రింగులుగా కళ్ళ ముందు కదిలాయి. ఆ ఫ్లాష్ బ్యాక్ మీతో పంచుకోవాలని ఇది మొదలుపెట్టాను. (వాడుకలో ‘జగదాంబ’ అనేస్తారు గానీ అసలు ఉచ్చారణ ‘జగదంబ’ కాబట్టి అలాగే రాస్తాను.)

**********

ఈ జగదంబ థియేటర్ రాక ముందు ఆ ఏరియా అంతా చెట్టూ చేమలతో చిన్న అడివిలా ఉండేది. లోపల ఎక్కడో ఎల్లమ్మ అనే గ్రామదేవత గుడి ఉండేది. ఆ దేవత పేరు మీద ఆ ప్రాంతాన్ని ‘ఎల్లమ్మ తోట’ అని పిలిచేవారు. నిజానికి ఆ ప్రాంతమంతా దసపల్లా సంస్థానానిది. ఇప్పుడు విశాఖలో మనకి తెలిసిన హోటల్ దసపల్లా, దసపల్లా చిత్రాలయ ఉన్న జాగాలు ఒరిజినల్ గా ఆ సంస్థానానివే. ఒరిస్సాకి చెందిన ఈ సంస్థానానికి విశాఖలోనే కాకుండా ఉత్తరాంధ్రలో చాలా చోట్ల భూములుండేవి.

దసపల్లా సంస్థానాధీశులు కలకత్తాలో ఉండేవారు. వారి సంస్థానం వ్యవహారాలు చూసుకోడానికి మా తాతగారు (మాతామహులు) పన్యాల వెంకట రాజగోపాల రావు గారిని దివానుగా నియమించారు. (అవును..ఆయన పేరునే నాకు పెట్టారు). అప్పట్లో మా తాతగారు విశాఖపట్నం డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. రెవెన్యూ చట్టాలు, రైతుల వ్యవహారాల్లో ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని దసపల్ల సంస్థానాధీశులు మా తాతగారి మీద భూముల అజమాయిషీ బాధ్యతను పెట్టి నిశ్చింతగా కలకత్తాలో కాలం గడిపేవారు.

సరే.. ఈ దసపల్లా సంస్థానం ముచ్చట్లు ఆపి, మళ్లీ జగదంబ థియేటర్ దగ్గరికి వద్దాం.

***********

అనగా అనగా వేగి వీరు నాయుడు. వీరికి విశాఖ, పూర్ణా మార్కెట్ లో ఉల్లిపాయల హోల్ సేల్ బిజినెస్ తోపాటు విశాఖలో రామకృష్ణా థియేటర్ కూడా ఉండేది. వీరు నాయుడు గారబ్బాయి వేగి భద్రాచలం (ఆయన్ని రాంబాబు అనేవారు) థియేటర్ వ్యవహారాలు చూసుకునేవారు. ఓసారి రాంబాబు గారు సినిమా బిజినెస్ పనుల మీద మద్రాస్ వెళ్లినప్పుడు అక్కడి సెవెంటీ ఎంఎం థియేటర్లు ఆయన మనసుని ఆకట్టుకున్నాయి. అలాంటి థియేటర్ ని విశాఖలో కట్టాలని నిర్ణయించుకున్నారు.

అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని హైదరాబాద్ లో, 1965 లో దివంగత కుమారుడి పేరు మీద ఎన్టీఆర్ నిర్మించిన రామకృష్ణా సెవెంటీ ఎంఎం థియేటర్ మాత్రమే రాష్ట్రానికి ఏకైక సెవెంటీ ఎంఎం థియేటర్ గా నీరాజనాలు అందుకుంటూ ఉండేది. ఇంకెక్కడా.. ఆఖరికి సినిమా ఎగ్జిబిటర్లకు హెడ్డాఫీసు అయిన విజయవాడలో కూడా అప్పటికి ఎంఎం థియేటర్ లేదు. అలాంటిది మారుమూల విశాఖలో బోలెడంత ఖర్చుతో సెవెంటీ ఎంఎం థియేటర్ కట్టాలనుకోవడం సాహసోపేత నిర్ణయమే.

మరి అంత పెద్ద థియేటర్ కట్టాలంటే విశాఖలో సరైన చోట విశాలమైన జాగా కావాలి కదా. రాంబాబు గారి దృష్టి ఎల్లమ్మ తోట సెంటర్ లో ఉన్న దసపల్లా స్థలం మీద పడింది. వెంటనే సంస్థానం దివానుగా ఉన్న మా తాతగారిని సంప్రదించి, తన ప్రతిపాదనను ఆయన ముందు పెట్టారు. మా తాతగారు ఆ ప్రతిపాదనను దసపల్లా సంస్థానాధీశులకు నివేదించారు.

అప్పటికే సంస్థానాధీశులు భూముల విక్రయం ఆలోచనలో ఉన్నట్టున్నారు. రాంబాబు గారి ప్రతిపాదనకు అంగీకరించి, ఎల్లమ్మ తోట దగ్గరున్న స్థలాన్ని ఆయనకి విక్రయించారు. ఆ సంప్రదింపులు, రాతకోతలు అన్నీ మా తాతగారి చేతుల మీదుగానే జరిగాయి.

***********

అప్పట్లో, అంటే 1970 లో నేను విశాఖ ఏవీఎన్ కాలేజీలో బీకాం ఫస్టియర్ చదువుతూ ఉండేవాణ్ణి. అప్పుడు అన్నీ ప్రైవేట్ సిటీ బస్సులే. మా పదమూడో నెంబరు బస్సు ఎల్లమ్మతోట, కేజీహెచ్ మీదుగా మా కాలేజీకి వెళ్లేది.

విశాఖలో కీలకమైన జాగాని సొంతం చేసుకున్న రాంబాబు గారు ఓ శుభ ముహూర్తాన ఎల్లమ్మ తోట సెంటర్ లో తన తల్లిగారి పీరు మీదుగా జగదంబ థియేటర్ నిర్మాణాన్ని ప్రారంభించారు. శరవేగంతో సాగిపోతున్న ఆ నిర్మాణాన్ని ప్రతి రోజూ కాలేజీకి వెళ్తున్నప్పుడు మా సిటీ బస్సు కిటికీలోంచి కళ్ళప్పగించి చూడడం నాకు అలవాటైపోయింది. అలా నా కళ్ళ ముందే కోస్తాంధ్రలో (ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో) మొట్టమొదటి సెవెంటీ ఎంఎం థియేటర్ అన్ని హంగులతో ముస్తాబై ప్రారంభోత్సవానికి సిద్దమైంది.

1970 అక్టోబర్ 25న జగదంబ థియేటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఎంతో ఆర్భాటంగా జరిగింది. స్థల విక్రయంలో కీలక పాత్ర వహించిన మా తాతగారైన దసపల్లా దివాన్ పన్యాల వెంకట రాజగోపాల రావు గారితో పాటు మనవడు, ఈ బచ్చా రాజగోపాలుడు కూడా జగదంబ థియేటర్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ప్రారంభ సినిమాగా ‘వేర్ ఈగిల్స్ డేర్’ సెవెంటీ ఎంఎం ఇంగ్లీష్ సినిమాని ప్రదర్శించారు.

ఒక్క లీలా మహల్ లో తప్ప మిగతా అన్ని సినిమా హాళ్ళలో చెమటోడ్చి సినిమాలు చూడడం అలవాటై పోయిన జనాలకి జగదంబ థియేటర్ ఒక మహా అద్భుతంగా కనిపించింది. చల్లటి వాతావరణంలో, కూరుకుపోతున్నట్టు ఉండే కుషన్ సీట్లలో కూర్చుని, ఎంతో వెడల్పుగా ఉండే తెరమీద మెడ అటూ ఇటూ తిప్పుతూ సెవెంటీ ఎంఎం సినిమాలు చూడడం ఒక గొప్ప అనుభూతిగా మిగిలిపోయింది. భాష అర్ధం కాక అంతవరకూ ఇంగ్లీషు సినిమాలు చూడనివారు కూడా ఈ అనుభూతి కోసమే జగదంబ థియేటర్ కి వచ్చేవారంటే అతిశయోక్తి కాదు. (ఇవన్నీయాభై ఏళ్ల కిందటి సంగతులు, అనుభూతులు సుమా.. ఇప్పుడు దాని బాబులాంటి థియేటర్లు వచ్చాయి. అధునాతన థియేటర్లు చూసిన కళ్ళతో ఇప్పుడు జగదంబ థియేటర్ ని చూస్తే ‘రాజుని చూసిన కళ్ళతో,,’ సామెత గుర్తుకి రాక మానదు.)

జగదంబ థియేటర్ అతి త్వరలోనే ఎంతగా సూపర్ హిట్టయిందంటే అది విశాఖకి ఒక ల్యాండ్ మార్క్ గా మారిపోయింది. అంతవరకూ ఆ ప్రాంతాన్ని ‘ ఎల్లమ్మతోట’ అని పిలిచేవారు కూడా ఆ పేరు మర్చిపోయి “జగదంబ సెంటర్’ అనడం ప్రారంభించారు. ఇప్పుడు విశాఖలో సిటీ బస్సు ఎక్కి “ఎల్లమ్మ తోటకి ఒక టిక్కెట్టివ్వండి” అని అడిగి చూడండి. కండక్టరు వెర్రి చూపులు చూడకపోతే ఒట్టు.

                            -- మంగు రాజగోపాల్

గుర్తు చేసుకుందాం

 *👌🌱గుర్తు చేసుకుందాం🌱👌*


*🤝🇮🇳సర్ధార్ వల్లబాయ్ పటేల్ జన్మదినం🇮🇳🤝*


*🌹31-10-2020🌹*


*📝రాష్ట్రీయ ఏక్తా దివస్* ను  భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన *సర్దార్ వల్లభ్ భాయి పటేల్* పుట్టిన రోజు (1875, అక్టోబరు 31న) ను జరుపు కుంటారు.


👌వీరుగుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించారు. ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది.


*💠🇮🇳కుటుంబం🇮🇳💠*


💠1875 అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియాడ్లో జవేరీ భాయి, లాడ్‌లా పటేల్‌లకు నాల్గవ సంతానంగా వల్లభభాయి పటేల్ జన్మించాడు. జవేరీభాయి వృత్తి రీత్యా వ్యవసాయదారుడు. జవేరీ భాయి పేట్ లావ్ తాలూకాలోని కరంసాద్ గ్రామంలో జన్మించాడు. సామాన్య గృహస్థుడైనా 1857 స్వాతంత్ర్య సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి దళంలో పోరాడాడు.


*📝విద్యాభ్యాసం📝*


💠వల్లభాయ్ ప్రాథమిక విద్యాభ్యాసం తన ఊరి లో సాగించారు. స్థానికంగా జరిగిననూ ఉన్నత న్యాయశాస్త్రం చదువులకై ఇంగ్లాండు వెళ్ళి బారిష్టర్ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగివచ్చి అహ్మదాబాదులో న్యాయవాద వృత్తిని చేపట్టాడు.


💠తన భార్య అయిన ఝవెర్బాను పుట్టింటి నుండి తీసుకొచ్చి గోద్రాలో కాపురం పెట్టాడు. 1904లో ఆయనకు ఒక కుమార్తె - మణిబెన్, 1906లో దహ్యాభాయ్ అను కుమారుడు జన్మించారు. 1909లో ఆయన భార్య కాన్సర్ వ్యాధితో మరణించింది. వల్లభాయ్ కోర్టులో ఒక కేసు గురించి వాదిస్తున్నపుడు ఆమె మరణించిన వార్తను అందించినపుడు ఆ పేపరును చూసి తన జేబులో పెట్టుకొని, తిరిగి కేసు వాదించి గెలిచాడు. ఆ తర్వాతే ఆ వార్తను ఇతరులకు తెలియచేసాడు. ఆమె మరణానంతరం తిరిగి వివాహం చేసుకోరాదని నిశ్చయించుకున్నాడు. తన కుటుంబసభ్యుల సహకారంతో పిల్లలను పెద్దవాళ్ళను చేసాడు.


💠36 ఏళ్ళ వయసులో ఇంగ్లాండుకు వెళ్ళి అక్కడ లండన్‌లో ఒక లా కాలేజీలో చేరాడు. 36 నెలల కోర్సును 30 నెలలో పూర్తిచేసాడు, అదీ క్లాసులో ప్రథమ స్థానంలో. తర్వాత అహ్మదాబాద్‌కు తిరిగి వచ్చి అనతికాలంలోనే గొప్ప లాయరుగా విశేష కీర్తిని,ధనాన్ని ఆర్జించాడు. ఆయన ఎప్పుడూ తెల్ల దొరలా సూటు బూటు వేసుకొని దర్జాగా తిరిగేవాడు.


*🇮🇳జాతీయ నేతగా🇮🇳*


💐బారిష్టరు పట్టా పుచ్చుకొని ఇంగ్లాండు నుంచి తిరిగి వచ్చిన వల్లబ్ భాయి పటేల్ దేశంలో జరుగుతున్న భారత జాతీయోద్యమం ప్రభావానికి లోనైనాడు. తన వృత్తిని నిర్వహిస్తూనే గాంధీజీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. 1928లో బార్డోలీలో బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా కిసాన్ ఉద్యమం చేపట్టి విజయవంతంగా నడిపించి, దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. అప్పుడే అతనికి సర్దార్ (సర్దార్ అనగా నాయకుడు అని అర్ధం) అనే పేరు వచ్చింది.

1940, బాంబే, ఏ.ఐ.సి.సి. మీటింగులో గాంధీ, మౌలానా ఆజాద్ లతో పటేల్.

గాంధీ మొదలుపెట్టిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని దాదాపు 300,000 మంది సభ్యులతో కలసి దాదాపు 15 లక్షల రూపాయల విరాళాలు సేకరించారు. విదేశీ వస్తు దహనంలో భాగంగా తనవద్దనున్న తెల్లదొరలు వేసుకొనే బట్టలను అగ్నికి ఆహుతి చేసారు. తన కుమార్తె మణి, కొడుకు దాహ్యాతో కలసి జీవితాంతం ఖాదీ బట్టలు వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గుజరాత్‌లో మద్యపానం, అస్పృశ్యత, కులవిచక్షణలకు వ్యతిరేకంగా పనిచేసారు.


💐1931 కరాచి భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. ఉప్పు సత్యాగ్రహం, 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం మొదలగు ఉద్యమాలలో కూడా ప్రముఖ పాత్ర వహించాడు


💐భారత రాజ్యాంగ రచనకై ఏర్పడిన భారత రాజ్యాంగ సభలో సీనియర్ సభ్యుడిగా వల్లబ్ భాయి పటేల్ మంచి సహకారాన్ని అందించాడు. అంబేద్కర్ను డ్రాప్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా నియమించుటలో ముఖ్య పాత్ర పోషించాడు. భారత రాజ్యాంగ సభలో ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్ గా పనిచేశాడు. భారత పార్లమెంటులో రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్ లకు నామినేట్ చేయు అధికారానికి కూడా అతనే ప్రతిపాదించాడు.

దేశ స్వాతంత్ర్యం కోసం విశేషకృషి సల్పిన వల్లబ్ భాయి పటేల్ కు సహజంగానే స్వాతంత్ర్యానంతరం ముఖ్యమైన పదవులు లభించాయి. జవహర్ లాల్ నెహ్రూ మంత్రిమండలిలో హోంమంత్రిగాను, ఉప ప్రధాన మంత్రిగాను 1947 నుంచి 1950 డిసెంబరు 15న మరణించేవరకు పదవులు నిర్వహించారు.


*🇮🇳నెహ్రూతో విబేధాలు🇮🇳*


💠భారత జాతీయోద్యమం సమయంలోనే వల్లబ్ భాయి పటేల్ నెహ్రూతో విభేదించారు. ముఖ్యంగా 1936 భారతీయ జాతీయ కాంగ్రెస్ సదస్సులో నెహ్రూ ప్రవచించిన సోషలిజాన్ని వల్లబ్ భాయి పటేల్ వ్యతిరేకించారు. స్వాతంత్ర్యానంతరం కూడా స్వదేశీ సంస్థానాల విలీనంలో నెహ్రూ శాంతి కాముకను కాదని బలవంతంగా బలప్రయోగం, సైనిక చర్యలు చేపట్టి విజయం సాధించారు. కాశ్మీర్ అంశాన్ని ఐక్య రాజ్య సమితికి నివేదించడంలో నెహ్రూతో విభేదించారు. పాకిస్తాన్కు చెల్లించవలసిన రూ.55 కోట్లు ఇవ్వరాదని కూడా వల్లబ్ భాయి పటేల్ నెహ్రూతో వాదించారు. తొలి రాష్ట్రపతి ఎన్నికలలో కూడా చక్రవర్తి రాజగోపాలచారి వైపు నెహ్రూ మొగ్గు చూపగా, వల్లబ్ భాయి పటేల్ రాజేంద్ర ప్రసాద్ను ప్రతిపాదించి సఫలీకృతుడైనారు. అలాగే 1950 కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ అభ్యర్థి కృపలానీని కాదని పురుషోత్తమ దాస్ టాండన్ను గెలిపించారు.


*🤝🇮🇳ఐకత్వ చిహ్నము🇮🇳🤝*


💠1950 డిసెంబరు 15 న వల్లబ్ భాయి పటేల్ కన్నుమూశాడు. ముంబాయిలో పెద్ద ఎత్తున ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వేలాదిగా ప్రజలు, స్వాతంత్ర్య సమర యోధులు, దేశ విదేశీ రాజకీయ నాయకులు, నివాళులర్పించారు. అతను ప్రస్తుతం మన మధ్య లేకున్ననూ అతని ఘనకార్యాలు, చేపట్టిన చర్యలు ఏ నాటికీ మరువలేనివి.

భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని 2018 అక్టోబర్ 31న ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం ఇది. దీని ఎత్తు 182 మీటర్లు. ఈ విగ్రహాన్ని ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ (ఎకత్వ చిహ్నము) అని పిలుస్తున్నారు.గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలోని సాధు బెట్ అనే చిన్న దీవిలో దీన్ని నిర్మించారు. ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇంటిగ్రేషన్ ట్రస్ట్’ ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రాజెక్టును చేపట్టింది.


💠ఈ విగ్రహన్ని, భారత ప్రధాన మంత్రి శ్రీ. నరేంద్ర మోడీ గారు, 31 అక్టోబరు 2018 న అత్యంత ఘనం గా ఆవిష్కరించారు.


💠1991లో భారత ప్రభుత్వం వల్లబ్ భాయి పటేల్ సేవలను గుర్తించి 

*🇮🇳భారత రత్న🇮🇳* బిరుదును మరణానంతరం ప్రకటించించింది.

సద్విమర్శ

 *సద్విమర్శ* 


🍁🍁🍁🍁


మనిషి ఎంత ఎత్తుకు ఎదిగితే అంత కఠినమైన పరీక్షలను, విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది.


 ప్రపంచ చరిత్రలో మహత్కార్యాలను సాధించిన మహనీయులెందరో ఎన్నో అపజయాలను, విమర్శలను చవిచూశారు. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అద్భుతాలు సాధించారు. 


సాహసాలు, సత్కార్యాలు సాధించాలనుకున్నప్పుడు ఇతరులు ఎగతాళి చేసినా, విమర్శించినా వెనకంజ వేయకూడదు.

 ఏకాగ్రతతో మన పని మనం చేసుకుంటూ ముందుకుసాగాలి. మార్పును అభిలషించాలి. నవ్విన నాపచేను పండుతుందని, మనల్ని అవహేళన చేసినవాళ్లే మన గురించి గొప్పగా చెప్పుకొనే రోజులు వస్తాయని గట్టిగా నమ్మాలి.



విమర్శలు కటువుగా ఉంటే మానవ సంబంధాలు దెబ్బతింటాయి. అందుకే ఎవరినైనా విమర్శించేటప్పుడు విజ్ఞత పాటించాలి. సాధ్యమైనంత వరకు మన విమర్శలు సద్విమర్శలుగా ఉండాలి. అవే మనిషి మానసిక వికాసానికి తోడ్పడతాయి.


 స్వామి వివేకానంద ఎదుటి వారిని ‘నీవు బాగా పనిచేయడం లేదని అనడం కన్నా- నువ్వు చక్కగా చేస్తున్నావుకాని ఇంకా చక్కగా చేయగలవు’ అని సున్నితంగా సూచనలివ్వాలని అనేవారు. విమర్శలు ఎదుటివారు చేస్తున్న పనిని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉండాలి. అంతే తప్ప, వారిని తప్పు పడుతున్నట్లుగా ఉండకూడదు.



విమానం కనిపెట్టేముందు రైట్‌ సోదరులు, అమెరికా అధ్యక్షుణ్ని కావాలని ఉందని చిన్నప్పుడే అనుకున్న బిల్‌క్లింటన్‌ సైతం ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. వాటిని ధైర్యంగా ఎదుర్కొని తమతమ రంగాల్లో పరిణతి సాధించారు. ఎన్నిసార్లు ఓటమి ఎదురైనా తనకున్న ఆత్మవిశ్వాసమే థామస్‌ ఆల్వా ఎడిసిన్‌ను ఎలక్ట్రిక్‌ బల్బ్‌ కనిపెట్టేలా చేసింది.



ఇతరుల ఉన్నతిని చూసి కొంతమంది ఈర్ష్యతో రగిలిపోతుంటారు. ఎవరైనా మంచిపని చేస్తే మెచ్చుకునే బదులు విపరీత బుద్ధితో విమర్శించే కుసంస్కారులే ఎక్కువగా కనిపిస్తుంటారు. ఒకరి ఉన్నతిని చూసి సహించలేకపోవడం మాత్సర్యం. అది లేనప్పుడే ఆత్మతత్వం తెలుస్తుంది. 


దైవాంశ సంభూతుడైన కపిలమహర్షి తన తల్లికి వేదాంత సారాన్ని బోధిస్తూ ఇలా అంటారు ‘నేను నిరంతరం అన్ని జీవుల్లోనూ ఆత్మ స్వరూపుడనై ఉన్నాను. కాబట్టి మానవుడు తన తోటి మానవుణ్ని కించపరిస్తే అది ఆత్మస్వరూపుడైన నన్నే కించపరచడమవుతుంది’!


ఎదుటివారిని కించపరచేవాళ్లు చేసే పూజలు పూజలు కావు. జీవులను అవమానించే స్వభావం ఉన్నవారు నానాఫల, పుష్పాదుల చేత చేసే పూజలతో దైవం సంతృప్తి చెందే ప్రసక్తే తలెత్తదు. అంటరానితనం పాటించడం, తోటి మానవుల్ని నీచంగా చూడటం, కులమత వైషమ్యాలకు ఆజ్యంపోయడం లాంటి కార్యాలు చేయడం దైవానికి సమ్మతం కావు.


 ‘సర్వజీవుల్లోనూ ఆత్మస్వరూపుడనైన నన్ను అభేద భావంతో అర్చించడమే నాకు ప్రీతికరం’- ఇది సజీవ జీవకోటిలో ఉన్న దైవాన్ని ఎలా అర్చించాలో కపిలమహర్షి వివరించిన వైనం. 


తోటివారిలో భగవంతుణ్ని చూసేవారు ఎవరినీ నిందించరు. కటువుగా విమర్శించరు. మంచి సలహాలతో, సద్విమర్శలతో ఎదుటివారిని ప్రోత్సహిస్తారు.



సద్విమర్శలు మన పురోగమనానికి దారిచూపే కాంతిపుంజాలు. మన వికాసానికి తగిన పాఠాలై అవి మార్గదర్శకాలవుతాయి. మన వివేచనను, వివేకాన్ని జాగృతం చేస్తాయి. వాటిని స్వీకరించి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను తప్పక సాధిస్తాం. విజయ శిఖరాలను అధిరోహిస్తాం!

(ఈనాడు అంతర్యామి)



🍁🍁🍁🍁

outside

 _One night Shankaracharya was desperately searching for something on the street outside his small hut._


_When his pupil returned from his errand, he saw this and curiously asked the Master, “Aacharya, what are you looking for here on the street at this hour?”_


_Shankaracharya replied, “I lost my needle, I am looking for it.”_


_The pupil joined him in the search, but after searching for a while, he asked, “Can you try and recollect where you might have dropped it?”_


_Shankaracharya said, “Of course, I remember. I dropped it near the bed in the hut.”_


_The pupil, utterly astonished at the strange answer, said, “Aacharya, you say you lost it inside the house, then why are we looking for it outside?”_


_Shankaracharya innocently replied, “There is no oil left in the lamp, so it is pitch dark inside the house. Hence I thought of searching for it outside, since there is enough street light here.”_


*_While holding back his laugh, the pupil said, “If you lost your needle inside the house, how could you even expect to find it outside?”_*


*_Shankaracharya simply smiled back at the pupil and said, "Isn't that what we do? We run to far away temples and walk up mountains to search for what we have lost inside ourselves. We are all seeking outside what we have lost inside us. Why? Just because it is pitch dark inside._*


*_Silly, aren’t we?"_*


*_"Light the Lamp inside you to remove the darkness within and find your lost treasure right there in."_*


బయట

 _ఒక రాత్రి శంకరాచార్యుడు తన చిన్న గుడిసె వెలుపల వీధిలో ఏదో వెతుకుతున్నాడు ._




_ తన విద్యార్థి తన పని నుండి తిరిగి వచ్చినప్పుడు, అతను దీనిని చూసి ఆసక్తిగా మాస్టర్‌ను అడిగాడు, "ఆచార్య, ఈ గంటలో వీధిలో మీరు ఇక్కడ ఏమి చూస్తున్నారు?" _




_శంకరాచార్యులు, “నేను నా సూదిని కోల్పోయాను, నేను వెతుకుతున్నాను” అని సమాధానం ఇచ్చారు.




_ విద్యార్థి శోధనలో అతనితో చేరాడు, కాని కొద్దిసేపు శోధించిన తరువాత, “మీరు ఎక్కడ పడిపోయిందో మీరు ప్రయత్నించండి మరియు గుర్తుపట్టగలరా?” అని అడిగాడు.




_శంకరాచార్యులు, “తప్పకుండా, నాకు గుర్తుంది. నేను గుడిసెలోని మంచం దగ్గర పడేశాను. ”_




_ వింత సమాధానం చూసి పూర్తిగా ఆశ్చర్యపోయిన విద్యార్థి, “ఆచార్య, మీరు దాన్ని ఇంటి లోపల పోగొట్టుకున్నారని చెప్తారు, అప్పుడు మేము బయట ఎందుకు వెతుకుతున్నాము?” _




_శంకరాచార్యులు అమాయకంగా సమాధానమిస్తూ, “దీపంలో నూనె లేదు, కాబట్టి ఇది ఇంటి లోపల చీకటిగా ఉంది. అందువల్ల ఇక్కడ తగినంత వీధి వెలుతురు ఉన్నందున బయట వెతకాలని అనుకున్నాను. ”_




* _ తన నవ్వును వెనక్కి పట్టుకొని, విద్యార్థి, “మీరు ఇంటి లోపల మీ సూదిని పోగొట్టుకుంటే, దాన్ని బయట ఎలా కనుగొంటారు?” _ *




* _శంకరాచార్యుడు విద్యార్థిని వైపు తిరిగి నవ్వి, "మనం చేసేది అదేనా? మనం దూర దేవాలయాలకు పరిగెత్తుకుంటూ, మనలో మనం కోల్పోయిన వాటిని వెతకడానికి పర్వతాల మీదుగా నడుస్తాము. మాకు. ఎందుకు? లోపల పిచ్ చీకటిగా ఉన్నందున ._ *




* _సిల్లీ, మనం కాదా? "_ *




* _ "మీ లోపల ఉన్న దీపాన్ని వెలిగించి, లోపల ఉన్న చీకటిని తొలగించి, మీ కోల్పోయిన నిధిని అక్కడే కనుగొనండి." _ *

జడ భరతుడు

 *జడ భరతుడు !*🌹





        అగ్నీధ్రుడు అనే రాజు జంబూ ద్వీపాన్ని పరిపాలించాడు. *పూర్వాచిత్తి* అనే అప్సరస వలన అతనికి తొమ్మిది మంది పుత్రులు కలిగారు. వారు “నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రంయకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాశ్వుడు, కేతుమాలుడు” అనువారు. 


        వారు పెరిగి పెద్దయినాక తండ్రి అగ్నీధ్రుడు జంబూ ద్వీపంలో వున్న దేశాలను ఈ తొమ్మిది మందికీ పంచి యిచ్చాడు. వారు ఆయా దేశాలను తమ తమ పేర్లతో పరిపాలిస్తూ వచ్చారు.


        పెద్దవాడయిన *నాభి* భార్య పేరు *మేరుదేవి* వీరికి శ్రీమహావిష్ణువు కుమారుడుగా జన్మించాడు. అతని పేరు *ఋషభుడు* అతను తన అద్భుత శక్తి చేత ఇంద్రుడిని అణచి వేశాడు. ఇతడు తన రాజ్యానికి *అజనాభం* అని పేరు పెట్టాడు. అతని భార్య *జయంతి* 


        వీరికి నూర్గురు పుత్రులు కలిగారు. వారందరూ గుణగణాలలో తండ్రికి సాటి అయినవారు. వారిలో పెద్దవాడు *భరతుడు* పరమ భాగవతోత్తముడుగా ప్రసిద్ధుడై గొప్ప కీర్తి గడించాడు.


        ఈయన విశ్వరూపుని కుమార్తె అయిన *పంచజని* ని పెళ్ళాడాడు. వీరికి అన్ని విధాల తండ్రితో సమానులైన 5 గురు పుత్రులు జన్మించారు. 


        భరతుడు తన తండ్రి తాతల వలెనె ప్రజానురంజంకంగా పదివేల సంవత్సరాలు భూమండలాన్ని పరిపాలించాడు. ఎన్నో యజ్ఞాలూ, యాగాలూ, సత్కర్మలూ చేసి పరమ పురుషుడు శ్రీమన్నారాయణుని తన మనసులో ప్రతిష్టించుకొని పూజిస్తూ వచ్చాడు. 


        తుదకు విరక్తుడై సర్వం త్యజించి కుమారులకు రాజ్యాన్ని అప్పగించి *పులహ మహర్షి* ఆశ్రమ మైన “సాలగ్రామ క్షేత్రానికి” వెళ్లి అక్కడ ఒక పర్ణశాల నిర్మించుకొని ప్రశాంత వాతావరణంలో భగవంతుడిని ఆరాధిస్తూ గడపసాగాడు. 


        లేడి చర్మం వస్త్రం గా ధరించి వివిధ పుష్పాలతో, తులసి దళాలతో శ్రీహరిని పూజిస్తూ భగవచ్చింతన తప్ప వేరొకొ విషయం పట్టకుండా గొప్ప భక్తుడై బ్రహ్మజ్ఞాని అయ్యాడు. అన్నిటికీ అతీతుడై జడత్వముతో వుండడము వల్ల అతనికి *జడభరతుడు* అని పేరు వచ్చింది.


        ఇలా వుండగా ఒక రోజు అతడు పరమ పవిత్ర మైన చక్రనదికి స్నానానికి వెళ్ళాడు. స్నానం చేసి నిత్య నైమిత్తిక కర్మలు ఆచరించి ప్రణవమును జపిస్తూ కాసేపు ఆ నది ఒడ్డునే కూర్చున్నాడు. అప్పుడొక లేడి అక్కడికి నీళ్ళు తాగడానికి వచ్చింది అది నిండు గర్భవతి. నీళ్ళు తాగుతుండగా సమీపంలో నుండి సింహ గర్జన వినిపించింది. 


        ఆ అరుపుకు భయంతో బెదిరిపోయిన ఆ లేడి నదికి అడ్డంపడి నదిని దాటడానికి ప్రయత్నిస్తూ వుంటే, అప్పుడు దానికి గర్భస్రావమై బిడ్డ నదిలో పడిపోయింది. అదికూడా చూసుకోకుండా ప్రాణభయంతో నది దాటి ఒడ్డుకు వెళ్లి ఆయాసంతో అక్కడే పడి మరణించింది. 


        ఇదంతా చూసిన జడభరతుడు నదిలోకి దిగి ఆ చిన్న లేడికూనను చేతిలోకి తీసుకొని, దాన్ని శుబ్రంగా కడిగి తుడిచి తన వెంట ఆశ్రమానికి తీసుకొని వెళ్ళాడు. తల్లి లేని దాన్ని చూసి అతనికి దయ, జాలి కలిగాయి. అప్పటినుండీ దానిని యెంతో అభిమానంగా చూసుకునే వాడు. 


        ప్రతి రోజూ దానికీ గడ్డి, ఆకులు తినిపించడం, దాన్ని మృగాల బారిన పడకుండా కాపాడడం, అలా కన్నబిడ్డ వలె చూసుకోసాగాడు. అది కూడా ఒక్క క్షణం కూడా అతన్ని విడిచి పెట్టకుండా అతని వెనక వెనకే తిరుగుతూండేది.


        స్నానానికి వెళ్ళినా ధ్యానం చేసుకుంటున్నా ఎప్పుడూ అతని వెంటే వుండేది. అన్ని బంధాలూ విడిచి భగవంతుని ఆరాధనలో కాలం గడుపుతున్న భరతుడికి ఈ లేడి మూలంగా ఒక ఎడతెగని బంధం ఏర్పడింది. రోజు రోజుకీ ఎక్కువైపోయి ఆ లేడి పిల్లే అతని లోకం అయిపోయింది. 


        క్రమంగా అతని పూజలూ, జపతపాలూ దేవతార్చనలు, అనుష్టాన క్రియలూ గంగలో కలిశాయి. తన భగవత్పూజ వెనక పడినందుకు జడభరతుడు విచారించ లేదు. పైగా పరోపకారం, శరణాగత రక్షణ తన కర్తవ్యం అనుకున్నాడు. ఆ లేడి క్షణం కనిపించక పొతే విలవిలలాడి పోయేవాడు. 


        ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచాయి. అతనికి అవసాన దశ వచ్చేసింది.

అయితే మరణ సమయంలో కూడా తను భగవన్నామ స్మరణ చేయక ఆ లేడినే తలుస్తూ ప్రాణాలు విడిచాడు. ఆకారాణం వల్ల అతను మరుజన్మలో ఒక లేడిగా పుట్టాడు. 


        అయితే అతను పూర్వజన్మలో చేసిన పుణ్యం, తపోబలం వల్ల అతనికి పూర్వజన్మ జ్ఞానం కలిగింది. తన పూర్వజన్మ తలుచుకొని యెంతో దుఃఖపడ్డాడు.


        “భగవదారాధన చేస్తూ యోగిగా తను మోక్ష పదం పొందడానికి బదులు అవివేకియై ఒక లేడి పిల్లను చేరదీసి తుదకిట్లా భ్రష్టుడను అయ్యానే” అని వాపోయాడు. ఆ విధంగా జడభరతుడు విరక్తి పొంది తాను వుండే కాలాంజనం అనే పర్వతం నుండి సాలగ్రామ క్షేత్రమైన పులహ ఆశ్రమానికి వెళ్లి పోయాడు. ఈ మృగ జన్మ ఎప్పుడు అయిపోతుందా? అని ఆరాట పడుతూ తుదకు ఆహారాదులు మాని నదీజలాలలో ప్రవేశించి ఆ మృగ దేహాన్ని విడిచి పెట్టాడు.


        ఈ కథ ద్వారా మనం తెలుసుకో వలసింది ఏమిటంటే, దేనిమీదా అతిగా వ్యామోహం పెంచుకో కూడదు. అది తమ పిల్లలూ, మనవలూ, మనవరాళ్ళ మీద గానీ జంతువులు, వస్తువుల మీద గానీ అతి ప్రేమ పెంచుకొని దైవారాధన మరిచి, వాళ్ళే సర్వస్వమని ఎక్కువ మమకారాన్ని పెంచుకుంటే జడభరతుడి లాగ అయిపోతాం. 


                                   🌺🙏🌺

దక్షిణామూర్తి

 *ఆది గురువు దక్షిణామూర్తి.....*


భారతీయ సంస్కృతి ప్రపంచదేశాలకు అనుసరణీయం. మార్గదర్శనం చేస్తోందంటే ఈ సంస్కృతి వికాసానికి మూలం గురువే అన్న సత్యం బోధిస్తుంది. వ్యక్తి షోడశ సంస్కారాలు పరిపూర్ణం కావడానికి దోహదపడే వాడు గురువు.


అజ్ఞానతిమిరాన్ని పోకార్చి జ్ఞాన జ్యోతులు వెలిగించే గురువును ప్రత్యక్ష దైవంగా మన భారతీయ సంస్కృతి సాహిత్యాలు అభివర్ణించాయి.

''ఆలయం కరుణాలయం'' అని ఆది గురువు దక్షిణామూర్తి శంకరులను కీర్తించింది మన సంస్కృతి. గురు సేవ మహాభాగ్యంగా భావించి తరించిన ఎందరో సత్పుర్షులు ఈ వేద భూమిని మరింత పవిత్రం చేశారు.


వ్యక్తి క్రమ శిక్షణాత్మక జీవితాన్ని జన్మ ఉన్నంత వరకు ఒక మంచి సంస్కారంగా తెలియజేసిన మన సంస్కృతిలో గురువుకు ఉన్నత స్థానం ఈయ బడింది. మానవ సమాజం ఉన్నంత ఉత్తమ సంస్కారాలతో ఆదర్శవంతమైన జీవితం గడిపిన పురుషార్థాలను సుసంపన్నం చేసే ప్రక్రియలో గురుస్థానం ప్రముఖమైనది. వ్యక్తి పుట్టుకతో సంస్కార వంతుడు కావడానికి తొలి గురువు తల్లి.


ఆమె శిక్షణలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వ్యక్తి విద్యాసంస్కారం అలవరచు కోవడానికి గురువును ఆశ్రయిస్తాడు. గురువు ద్వారా లభించిన జ్ఞానాన్ని పదు గురికి పంచుతూ ఒక నాటి శిష్యుడు గురు స్థానానికి చేరుకుంటాడు. ఈ సందర్భంలో గురువు ఇచ్చే జ్ఞానాన్ని విశ్లేషిస్తూ ఒకచైనా సామెతను మనం స్మరించుకోవాలి. ఆ సామెత ఇలా వుంది.


''జ్ఞానం లేని జీవితం పండని పొలం రెండూ వ్యర్థమే''.

పై భావం ఏ దేశానిదైనా, ఏ భాషదైనా అంత రార్థం ఒక్కటే. గురు ముఖత: నేర్చిన జ్ఞానమే మనిషి జీవితాన్ని ఆదర్శ వంతం చేస్తుంది. అందుకే హయగ్రీవుని స్తుతిలో జ్ఞాన ఆనందాలకు హేతువుగా తెలియజేయడం జరిగింది. మన భారతీయ సంస్కృతి ఆది గురువుగా దక్షిణా మూర్తిని అభివర్ణించింది. ఆ శ్లోకం ఇలా వుంది...


గురవే సర్వలోకానాం

భిషజే భవ రోణినాం

నిధయే సర్వ విద్యానాం

దక్షిణా మూర్తయేనమ:


అన్న దక్షిణామూర్తి శ్లోకం దక్షిణామూర్తిని మేధ దక్షిణా మూర్తి గానూ, ఆదిగురువు గాను తెలియ జేస్తోంది. గురువు విశ్వానికి, జ్ఞానానికి వుండే సంబంధాన్ని విశదపరుస్తాడు. గురువంటే గమించే జ్ఞానం. అంథకారాన్ని తొలగించే జ్ఞానం. అచేతనం నుండి చేతనానికి తీసుకపోయే మార్గదర్శి. గురువు జ్ఞానాన్ని నిష్కామకర్మ రూపంగా శిష్యులకు అందిస్తాడు.


''పూర్వ దత్తేషు యా విద్యా'' అన్న విధంగా పూర్వ జన్మలో చేసిన పుణ్యం వల్లనే గొప్ప విద్య శిష్యునికి అలవడటానికి పుణ్యమూర్తి గురువే ఆధారం అవుతాడు. అందుకే గురుస్తుతిలో...


గురుమూర్తించి దాకాశం సచ్చిదానంద విగ్రహం

నిర్వి కల్పం నిరాబాధం దత్తమానంద మాశ్రయే

గురుస్తుతితో ధన్యులమౌదాం.


ఓం శ్రీ త్రిమూర్తి స్వరూప గురవేనమ:

ఓం నమో దక్షిణామూర్తియే నమః

ఓం మౌనవ్యాఖ్యా 


ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం

వర్శిష్ఠాంతేవస దృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |

ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం

స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ||


వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం

సకలమునిజనానాం ఙ్ఞానదాతారమారాత్ |

త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం

జననమరణదుఃఖచ్ఛేద దక్షం నమామి ||


*|| ఓం నమః శివాయ ||*

వెన్నెల_పారాయణం

 #ఈరోజు_రాత్రి #వెన్నెల_పారాయణం  #అతి_శీఘ్రముగా_అభీష్టాలు_నెరవేర్చు_సాధన 

#అందరికీ_తెలిసేందుకు_దయచేసి_షేర్_చేయండి

#సంభవామి_యుగే_యుగే


 మీరు శ్రమ అనుకోకుండా ఓపిక ఉంటే కాచిన పాలల్లో ఇలాచి పటికబెల్లం కలిపి వెన్నలలో కూర్చుని  చంద్రుణ్ణి చూస్తూ  9 సార్లు లలితా పారాయణం చేయండి.. మీ సమస్య తిరిపోతుంది.. అన్ని సార్లు అని ఆనుకుంటారేమో అని చెప్పలేక పోయాను కానీ పౌర్ణమి చాలా విశేషం.. 


మీకు ఎట్టి సమస్య అయినా పరిస్కారం లభిస్తుంది, సంకల్పమ్ సిద్ధిస్తుంది.. ఇలా ఎవరైనా వారి తీవ్రమైన సమస్య కోసం లేదా అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం కోసం చేయవచ్చు తర్వాత ఆ పాలు ఇంట్లో వారు తాగాలి..


లలితా సహస్త్రనామం పూర్తిగా ఒక్కసారి చదివితే చదివిన వారి దేహం చుట్టూ శ్రీచక్ర ఆకారం ఏర్పడుతుంది అలా 9 సార్లు పూర్తి అయిన సమయం వరకు మన శరీరాన్ని శ్రీచక్రం చుట్టి ఉంటుంది.. 


అంత సేపు ఏక అసనంలో పారాయనఁ భక్తిగా చేస్తే ఆ శ్రీ చక్రంలో బీజాల ప్రకంపనలు శరీరాన్ని స్పర్శిస్తుంది..


 శ్రీచక్రం మధ్యలో ఎవరు ఉంటారు అమ్మవారు అంటే ఆ తల్లి స్పర్శ మనకు కలుగుతుంది.. 


ఇలా వెన్నెల పారాయణం ప్రతి పౌర్ణమి కి చేయవచ్చు..


ప్రతి నెల 9 సార్లు చదవలేని వారు ఒక్క సారి చదవచ్చు.. 


ఏదైనా తీరని సమస్య , కోరిక ఉన్నవారు 9 సార్లు చేస్తే ఆటంకాలు తొలగి పోతుంది.. 


ఏ సమస్య లేకున్నా ఆ తల్లి అనుగ్రహము కోసం చేయవచ్చు, 9 సార్లు చేస్తే మీ సంకల్పమ్ త్వరగా సిద్ధిస్తుంది కనుక అలా చెప్పాను శక్తి కొద్దీ భక్తిగా ఒక్కసారి కూడా చేయవచ్చు..


( 7.30 pm పైన చేయవచ్చు బయట చేయడం కుదరని వారు చంద్రుని పాలలో దర్శనం చేసుకొని ఆ పాలు దేవుడి ముందు పెట్టుకుని కూడా చేయవచ్చు వర్షాలు పడే సమయంలో చంద్రుడు కనిపంచరు అప్పుడు అమ్మవారి రూపాన్ని పాలల్లో చూసి చంద్రుడు గా భావించి పారాయణ చేయవచ్చు).


వీలున్న వారందరూ తప్పకుండా పారాయణ చేయండి, పారాయణ చేసిన వారు రేపు తెలియజేయండి ...



శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః

దేవాలయ దర్శనం

 మన హిందూ దేవాలయ దర్శనం లో ఎంతటి సాంకేతిక ఉందో చూద్దాం:- 


1.భూమిలో ఎక్కడైయితే electronic&magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది.ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి.


2.ప్రదక్షిణ:- మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన..ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి.యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి. 


3.ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని.... 


4.కొబ్బరి కాయ స్వచ్ఛతకు గుర్తు.పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును..అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం...


5.మంత్రాలు:- ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96..26..అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం..అంటే మనకి తెలియకుండానే neurons ని ఆక్టివేట్ చేసి డేటా ని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజపరువస్తాయి.


6.గర్భ గుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది.అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు.


7.అభిషేకం:- విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి..వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి.అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం. 


8.హారతి:-పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు..హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో స్వేదకర్మ అని పేరు.ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు.


9.తీర్థం:-ఇందులో పచ్చ కర్పూరం.. తులసి..లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతం తో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారు. 


10.తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది..అందుకే మడి..

జై శ్రీ రామ్ ॐॐॐ🙏🙏

భగవద్గీతలో

 *భగవద్గీతలో ఈ ఐదు శ్లోకాలు ఎప్పుడూ గుర్తు చేసుకుంటే చాలు*


🟡🟣🔴🟢🔵🟠


*మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం ప్రతిఫలం అందుకుంటున్నాం? అందుకు ప్రతిగా ఏం చేయాలి? కన్ ఫ్యూజన్ లేకుండా భగవద్గీతను మూడు ముక్కల్లో చెప్పాలంటే- ఇంతకంటే పెద్ద సెంటెన్సులు లేవు. కొందరు అనుకున్నట్టుగా, భగవద్గీత ఎట్టిపరిస్థితుల్లో మతగ్రంథం కానే కాదు. కురుక్షేత్ర సంగ్రామంలో అందరినీ చంపడం అధర్మం అనే చింత. అందరూ చచ్చిపోతారనే బాధ. ఈ రెండింటి గురించి మథనపడే అర్జునుడికి- శ్రీకృష్ణుడు విడమరిచి చెప్పిన సారాంశమే భగవద్గీత*

.

*బేసిగ్గా ఒక సినిమా పాట-మూడు నెలలకు పాతదైపోతుంది. ఒక కథ-ఆర్నెల్లకు పాచిపోతుంది. ఒక నవల-ఏడాది తర్వాత కనుమరుగైపోతుంది. కానీ వేల ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా నిత్య చైతన్య ప్రవాహమై, దారిమరిచిన బాటసారికి కరదీపికై, సమస్త భూమండలాన్ని దివ్యశక్తితో ముందుకు నడిపిస్తున్న ఏకైక గ్రంథం - ఇగిరిపోని గంధం- భగవద్గీత. ఇదేదో మతోద్బోధ అనుకునే వాళ్ల మైండ్ సెట్ మార్చలేం.*

.

*ఆధ్యాత్మిక ప్రవచనమైనా, వ్యాపార సూక్తులైనా, మేనేజ్మెంట్ కోర్సులైనా, వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులైనా, ఆటలో గెలవాలన్నా, పరీక్షలో పాస్ కావాలన్నా, జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్నా, ఎక్కడో చోట ఏదో సందర్భంలో గీతను కోట్ చేస్తాం. గీత గురించి చర్చిస్తాం. ఆది శంకరాచార్య దగ్గర్నుంచి స్వామీ వివేకానంద, మాక్స్ ముల్లర్ దాకా భగవద్గీత గొప్పదనాన్ని వేనోళ్లా చాటినవారే.*

*వందల శ్లోకాలు ఔపోసన పట్టాల్సిన పనిలేదు. బట్టీ పట్టి కంఠశోష తెచ్చుకోమనడం లేదు. ఒక నాలుగైదు శ్లోకాలు చాలు ప్రతి వ్యాపారి, ఉద్యోగి అనుసరించవలసిన *విద్యుక్త్ధర్మాలు*


*భగవద్గీత లోని 5 simple management skills*


*భగవద్గీతలో ఈ ఐదు శ్లోకాలు డీకోడ్ చేసుకుంటే చాలు*


.#1.


*కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ: మాతే సంగోఅస్త్వకర్మణి* ||


*అంటే, నువ్వు కర్మలు చేయడానికి మాత్రమే. ఆ కర్మఫలాలకు అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో ఎట్టిపరిస్థితుల్లో కర్మలు చేయకు. అలాగని చేయడం మానకు అని అర్ధం.*


*ప్రతీ ఆంట్రప్రెన్యూర్ కు ఈ శ్లోకం వర్తిస్తుంది. చేయాల్సిన పని గురించి రెండే రెండు ముక్కల్లో నిక్షిప్తమైన సార్వజనీన సత్యం ఇది*


*ప్రతీ వ్యాపారి లేదా ఉద్యోగి ఇదే సూత్రం మీద పనిచేయాలి. ప్రతిఫలం గురించి ఆశించకుండా చేసుకుంటూ పోవడమే. ప్రాసెస్ ఎంజాయ్ చేసుకుంటూ తీరం చేరుకోవాలే తప్ప.. ఎంతసేపూ ఫైనల్ ఔట్ పుట్ మీదనే ఏకాగ్రత చేయొద్దు. అలా అని పూర్తిగా ఆశావాదం లేకుండా పనిచేయమని కాదు. ఆశ పడటం తప్పు కూడా కాదు. కానీ ఎలాంటి చర్యా లేకుండా- గాల్లో దీపం పెట్టే దేవుడా నీవే దిక్కు అంటే మాత్రం కష్టం. చేయాల్సింది చేయాలి. ఫలితం సంగతి తర్వాత. ముందు ధైర్యంగా అడుగేయాలి.*

#2.


*వాసంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహీ* ||


*అంటే,"చిరిగిపోయిన బట్టలను పడేసి, మనం కొత్తబట్టలు ఎలా కట్టుకుంటామో, జీర్ణమైన శరీరాన్ని వదిలిన ఆత్మ కూడా- మరోకొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది" అని అర్ధం.*

*ఆంట్రప్రెన్యూర్లు కూడా అంతే. వెర్సటాలిటీ చూపించాలి. దేన్నయినా స్వీకరించేలా ఉండాలి. అవే సక్సెస్ రుచి చూపిస్తాయి*. *ముఖ్యంగా మార్పును ఎప్పటికప్పుడూ గమనించాలి. కొత్త ట్రెండ్ ఫాలో అవ్వాలి. నా ఇష్టం- నాకు ఇదే ఇష్టం అంటే- వాళ్లు అక్కడే ఉండి పోతారు. అలా కాకుండా కొత్తదాని కోసం అన్వేషించాలి. కొత్తదనాన్ని చదివేయాలి. కొత్త అవకాశాల కోసం ఎదురు*


*చూడాలి అదె నిజమైన ఆంట్రప్రెన్యూర్ లక్షణం. బిజినెస్ అంటేనే నిరంతర ప్రయాణం. వ్యాపారి నిరంతర పథికుడు. నాలుగు గోడల మధ్యనే ఉంటే ప్రపంచం ఏనాటికీ అర్ధం కాదు. మొండిగా ఉండొద్దు. ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలి. సంకుచిత భావాలు వదిలేయాలి. స్పాంజి నీళ్లను పీల్చుకున్నట్టు అనుభవాల్ని పాఠాలుగా మలుచుకోవాలి. అప్పుడే గమనం వేగం అందుకుంటుంది*.

#3.


*క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్దినాశాత్‌ప్రణశ్యతి* 


*అంటే, కోపం వల్ల అవివేకం, అవివేకం వల్ల మతిమరుపు, మరుపుతో బుద్ధినాశనం, బుద్ధినాశనంతో మనిషే నాశనం.*


*ఇదొక యాంగర్ మేనేజ్‌మెంట్ లాంటిది. ఆంట్రప్రెన్యూర్లకు మస్టుగా ఉండాల్సిన లక్షణం*


*లేకుంటే చెప్పుడు మాటలు విని, వాస్తవాలతో పనిలేకుండా ఆలోచించి బుర్రపాడు చేసుకుంటారు. మైండ్ లో ఒకరకమైన కన్ ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. దాంతో సహజంగానే మతిమరుపు వస్తుంది. ఆటోమేటిగ్గా లక్ష్యం నుంచి తప్పుకుంటాం. అందరిముందు నవ్వుల పాలవుతాం. అందుకే కోపాన్ని జయించాలి. టెంపర్ ని అదుపులో ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో సహనం కోల్పోవద్దు.*

#4.


*తస్మాదసక్త స్సతతం కార్యం కర్మ సమాచార* |

*ఆసక్తో హ్యాచరన్ కర్మ పర మాప్నోతి పూరుష:* ||


*కాబట్టి, చేసే పని, దాని ఫలితము మీద అదే పనిగా ఆసక్తి ఉండొద్దు. కర్మ ప్రకారం చేసుకుంటూ పోవాలంతే అంటాడు శ్రీకృష్ణ భ‌గ‌వానుడు వ్యాపారమూ అంతే. ఓపెన్ మైండెడ్ గా ఉండాలి. అవసరమైతే జత కలవాలి. బలం పెంచుకోవాలి. అత్యాశకు పోవద్దు. వీలైనంత క్రియేటవివ్ గా ఉండాలి. ఇన్నవేటివ్ గా ఆలోచించాలి. మార్కెట్ మార్పులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనించాలి. అంతేగానీ బైనాక్యులర్ పట్టుకుని ఎలుకను వేటాడినట్టుగా ఉండొద్దు.*

#5.

*ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ*|

*యథోల్యేనావఈతో గర్భస్తథా తేనేదమావృతమూ* ||


*అంటే- పొగ చేత నిప్పు, ధూళి చేత అద్దం, మావి చేత గర్భస్త పిండం కప్పబడినట్లే, కోరికల చేత జ్ఞానం కూడా కప్పబడినట్లే, కోరికల చేత జ్ఞానం కూడా కప్పబడి వుంటుంది అని అర్ధం.*


*ఆంట్రప్రెన్యూర్లు వెతుక్కోవాలే గానీ ఇందులో బోలెడంత నిగూఢార్ధం దాగివుంది. కప్పేసే మనల్ని మిస్ లీడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్.. ఒకచోట మంట అంటుకుంది అనుకుందాం. వెంటనే పొగ దాన్ని కప్పేస్తుంది. ఎదురుగా వుండే అద్దం మీద ధూళి- నిప్పును, పొగను రెండింటినీ దాచేస్తుంది. అంతులేని కోరికలు బుద్దిని జ్ఞానం ను  నాశనం చేస్తాయి.* 

*ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి. ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గాలి అన్న విచక్షణా జ్ఞాన‌మే ఉద్యోగమైనా లేదా వ్యాపారమైనా...*


🟠🟣🟡🔵🟢🔴

ఆధ్యాత్మిక జీవనము*

 *ఆధ్యాత్మిక జీవనము*


ఇంద్రియాలు మనకు అందించే జ్ఞానం గురించి మనం చాలా ఎక్కువ ఆలోచిస్తుంటాము. బాహ్య వస్తువులను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నామని అనుకుంటాము. కానీ అది నిజం కానే కాదు. బాహ్య వస్తువుల నుంచే ప్రేరణ బయలుదేరి, మనకంటి ద్వారా మనస్సుకు చేరి, తర్వాత మనలోని జ్ఞాతకు అనుభూతిని కలుగజేస్తోంది. ఇదంతా ఎంత డొంక తిరుగుడుగా జరుగుతున్నదో గమనించారా. దీనినే మనం జ్ఞానం అని పిలుస్తున్నాము.


నిజమైన ప్రత్యక్షానుభూతిలో లేదా అపరోక్షానుభూతిలో ఆత్మ యొక్క స్వప్రకాశం వలన సత్యం నేరుగా అవగతం అవుతుంది.  అంతరాత్మ యొక్క ఈ అంతర్జ్యోతి మనస్సు, ఇంద్రియాల ద్వారా భాసిస్తూ ఉంటుంది. అంతేకాక అది తానుగా కూడా ప్రకాశించగలదు.


ఇదే *మహాచైతన్య* స్థితి. దీనినే *తురీయం* అని కూడా అంటారు. మన అనుభవం మూడు అవస్థలలో ఉంటుంది. ఇవి జాగ్రత్ (మేలుకుని ఉన్నప్పటి స్థితి), స్వప్న (కలలు కనే స్థితి), సుషుప్తి (గాఢ నిద్ర). 


ఈ మూడింటికి  భిన్నమైనది మరొకటి ఉంది. అదే తురీయం. అది ఒక అవస్థ కాదు. అది భావాతీతమూ, మహాచైతన్యవంతమూ అయి ఉంటుంది. మొదటి మూడు అవస్థలూ దాని యొక్క పాక్షికస్వరూపాలే. ఆ అవస్థలో మనలోని ఆత్మ, తాను పరమాత్మ యొక్క అంశనని తెలుసుకుంటుంది.


*శుభంభూయాత్*

భగవంతుడు భక్త సులభుడు*

 🕉️🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻🕉️


*🕉️మన కోసం-మంచి మాటలు🕉️*


_*భగవంతుడు భక్త సులభుడు*_


*ఆర్తిగా పిలిస్తే దిగి రాక మానడు...*


శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి జీవితంలో జరిగిన ఓ అద్భుత సంఘటన . 


*వారు పూజ చేసేటప్పుడు ఆవాహయామి అనగానే ఆ దేవత వచ్చి ఎదురుగా బుద్ధిగా కూర్చునేదిట . అది వారి అనుభవం.*


ఒకసారి ఒకామె వచ్చి తనకు సీతా మంత్రం అనుగ్రహించమని కోరిందట .


ఆశ్చర్యంతో , ఆనందంతో వారు చాలా కాలం సీతా మంత్రోపాసన చేసి , తరువాత ఆవిడని రమ్మని 

మంత్రోపదేశం చెసారట . 


ఆవిడ వెళ్ళిపోతూ ఈ మంత్రం చేస్తే చాలా కస్టాలు వస్తాయని వింటున్నాను . నిజమేనా అని అడిగిందట . 


వారు అలాటప్పుడు ఆ మంత్రం కావాలని ఎందుకు అడిగావు ? సందేహాలుండకూడదు. అంటే, ఆమె అదేమీ లేదంటూ వెళ్ళిపోయిందట .


కొంత కాలానికి ఆవిడ తిరిగి వచ్చి తనకి ఆ మంత్రం వద్దనీ , ఇక చేయలేననీ, చాలా కష్టాల బారిన పడుతున్నాననీ వాపోయిందిట . 


ఆమె ప్రారబ్దానికి బాధపడుతూ , ఆమె ప్రారభ్దానికి జాలి పడి , సందేహాస్పదమైన మనసుతో, పరిపూర్ణ విశ్వాసం లేకుండా చేస్తే ఇలాగే ఉంటుందేమో అనుకుంటూ 

దయతో శ్రీ శాస్త్రి గారు దానికి కావలసిన జపాలు ముందు ఆయన చేసుకుని ఆవు కుడి చెవిలో మంత్రం చెప్పి వదిలెయ్యి . 


ఇకనించీ మళ్ళీ దాని గురించి ఆలోచించవద్దు అని చెప్పేరట . 


ఆవిడ అలాగే చేసి వెళ్ళిపోయిందట . 


ఆ రాత్రి కలలో సీతమ్మ వారు గురువుగారికి కనిపించి , అర్హత లేని వారికి నా మంత్రం ఎందుకు ఇచ్చావు ? 

ఇకనించీ నువ్వు పిలిస్తే రాను అన్నారుట . 


గభాలున లేచి వారు కన్నీరు మున్నీరు గా విలపించారుట . 


కాలం గడుస్తోంది . కొన్నాళ్ళకి వారింట్లో శ్రీరామనవమిని రామపట్టాభిషేకం ప్రతిసారిలాగే నిర్వహిస్తున్నారు . తండోపతండాలుగా శిష్యులు వచ్చి ఉన్నారుట . 


*గురువుగారు శ్రీరామచంద్రుని ఆవాహన చేసి , తరువాత సీతమ్మను ఆవాహన చేయబోయి ఆగిపోయారట...* 


తల్లి రానని చెప్పిందిగా . ఏ మొహంతో పిలవగలను ? అని పాత జ్ఞాపకాలతో అశ్రుధారలు ప్రవహిస్తూంటే అలాగే చాలా సేపు ఏడుస్తూ ఉండిపోయారట . 


చివరకి అతి కష్టం మీద సీతాం ఆవాహయామి అని అనగలిగేరట . 


వెంటనే వచ్చి తల్లి అక్కడ కూర్చున్నదట . 

ఆయన సంతోషానికి హద్దులు లేవు . 

గద్గద స్వరం తో 'రానన్నావు కదా తల్లీ . ఈ దాసుని మీద అంత దయా?' అని ఆనంద బాష్పాలు రాలుస్తున్నారట . 


*ఏం చెయ్యనురా ! శ్రీ రాములవారిని పిలిచావు ముందు వారొచ్చి మాట్లాడకుండా కూర్చున్నారు... నీ యెదుట....*


*నేను రాకేం చెయ్యను ? అన్నదట...🙏🏻*

16-24-గీతా మకరందము

 16-24-గీతా మకరందము

   దైవాసురసంపద్విభాగయోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - కాబట్టి శాస్త్రోక్తపద్ధతి ననుసరించియే కార్యము లాచరించులాగున అర్జునునకు శ్రీకృష్ణపరమాత్మ బోధించుచున్నారు- 


తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ | 

జ్ఞాత్వా శాస్త్రవిధానో క్తం 

కర్మ కర్తుమిహార్హసి || 


తాత్పర్యము:- కావున చేయదగినదియు, చేయరానిదియు నిర్ణయించునపుడు నీకు శాస్త్రము ప్రమాణమైయున్నది. శాస్త్రమునందు చెప్పబడినదానిని తెలిసికొని దాని ననుసరించి నీ వీ ప్రపంచమున కర్మమును జేయదగును.


వ్యాఖ్య:- ఏ కార్యమును చేయవలెను? ఏ కార్యమును చేయరాదు? అను వితర్కము కలిగినపుడు శాస్త్రమే యిట ప్రమాణమైయున్నది. దాని ననుసరించియే వర్తించవలెనని భగవాను డిచట బోధించుచున్నారు.‘తస్మాత్' అనగా, పూర్వశ్లోకము నుందు చెప్పబడినరీతిగ శాస్త్రవిరుద్ధముగ నాచరించినచో సుఖముగాని, మోక్షముగాని గలుగదు కాబట్టి - అని యర్థము. ఈ వాక్యములవలన భగవద్దృష్టి యందు వేదశాస్త్రము లెంతటి పరమప్రమాణములో విదితమగుచున్నది. మఱియు అవి గొప్ప ప్రమాణములని సాక్షాత్ భగవానుడే సెలవిచ్చుట వలన ఇక నట్టిశాస్త్రాదులందు జనులెంతటి విశ్వాసముంచవలయునో యోచించుకొనవలసి యున్నది. కావున ఇక వేదశాస్త్రముల గొప్పతనము విషయమై, ప్రామాణ్యము విషయమై జనులకేమాత్రము సందేహము యుండరాదు. అకుంఠితవిశ్వాసముతో వానియందు బోధించిన రీతి యనుష్ఠించిన చాలును. మనుజుడు తరించిపోగలడు.


‘జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం' అని చెప్పుటవలన కర్మాచరణకు పూర్వము శాస్త్రజ్ఞాన మవసరమని తేలుచున్నది. శాస్త్రాదులద్వారా కర్మచేయు పద్ధతిని తెలిసికొని పిదప కర్మచేయుట ఉత్తమము. శాస్త్రపరిచయమువలన అనగా అపరావిద్యవలన ఉత్తమ కర్మాచరణము సాధ్యమై క్రమముగ చిత్తశుద్ధి గలుగగా పరావిద్యయు అనగా బ్రహ్మానుభూతియు అచిరకాలములో (అభ్యాసవశమున) లభించుట కవకాశమేర్పడుచున్నది.


"కర్మ కర్తుమిహార్హసి” - అని బోధించుటవలన కర్మచేయుటలో తప్పులేదనియు, అయితే ఆ కర్మ శాస్త్రానుకూలముగా నుండవలెననియు గీత తెలుపుచున్నది. కనుకనే అర్జునుని అట్టి శాస్త్రోపదిష్ట కర్మము నాచరింపవలసినదిగా భగవాను డిచట నుద్బోధించుచున్నారు.


ప్రశ్న: - ఏ కార్యము చేయవలెను, ఏకార్యము చేయరాదు, అనువిషయమందు ప్రమాణమెయ్యది? 

ఉత్తరము:- శాస్త్రము. కావున శాస్త్రోపదిష్టపద్ధతి ప్రకారమే ఆచరించవలెను. 

ప్రశ్న:- కర్మనెపుడు చేయవలెను?

ఉత్తరము:- శాస్త్రవిధానమెట్లున్నదో తెలిసికొని ఆపిదప చేయవలెను.

ప్రశ్న:- కర్మ నెట్లుచేయవలెను?

ఉత్తరము: - శాస్త్రములందు ఉపదేశింపబడినరీతి చేయవలెను.


ఓమ్ 

ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే 

శ్రీకృష్ణార్జునసంవాదే దైవాసుర సంపద్విభాగయోగోనామ 

షోడశోఽధ్యాయః 


ఇది ఉపనిషత్ప్రతిపాదకమును, బ్రహ్మవిద్యయు, యోగశాస్త్రమును,

శ్రీకృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు  దైవాసుర సంపద్విభాగ యోగమను 

పదునాఱవ అధ్యాయము 

ఓమ్ తత్ సత్

రాంరాం

 *రాంరాం* అంటే?

*****

మీరెప్పుడైనా ఆలోచించారా?

"రాంరాం"అని ఎందుకంటాము.


చాలామంది ఒకరినొకరు కలుసుకున్నపుడు.,ఎదురైనప్పుడు "రెండుసార్లు" "రాంరాం" అని అనడం చూసే ఉంటాము.

అలా ఎందుకు అంటారు?

రెండుసార్లే ఎందుకనాలి?

ఒకసారి.,మూడుసార్లు ఎందుకనరు?

రెండుసార్లు "రాంరాం"అనడం వెనుక ఒక రహస్యం దాగి ఉంది.

ఇది ఆదికాలం నుండి కూడా కొనసాగుతున్నది.

హిందీ శబ్దం రాంలో "ర"27 వ అక్శరం.

"ఆ"20 వ అక్శరం.

"మ" 25 వ అక్శరం.

అప్పుడు ఈ మూడు అక్శరాల సంఖ్యను కలిపితే 54 అవుతుంది.!

అర్థం ఏమంటే?

ఒక "రాం"అర్థం 54.!

ఇంకో"రాం"అర్థం 54.!!

రెండు "రాం"లు కలిపితే 108.!!!

మనం జపం చేసే జపమాలలో కూడా 108 సంఖ్యలోనే ముత్యాలు ఉంటాయి.!

కాబట్టి

ఒకసారి *రాంరాం* అంటే 108 సార్లు *రాంరాం* అన్నట్లే!

జపమాల పూర్తి చేసినట్లే!

కాబట్టి

అందరికీ *రాంరాం*!!!

ఆదికవి వాల్మీకి మహర్షి*

 *ఆదికవి వాల్మీకి మహర్షి*


నేడు ఆదికవి అయిన *మహర్షి వాల్మీకి జయంతి*


మహా పుణ్య కవి , రామాయణాన్ని అందించిన వాల్మీకి మహర్షి కారణజన్ముడు . వాల్మీకి జీవితం ఎంతో విలక్షణమైనదని, వాల్మీకి తన జీవిత కాలంలో పాపా, పుణ్య కర్మలను ప్రక్షాళన చేశాడు , తన రామాయణ ఇతిహాసం. మానవుడు రచించిన తొలి గ్రంథము , చారిత్రక పురుషుడైన రఘురాముని గురించి ఇతని సమకాలం గురించి చెప్పడమే కాకుండా కథనం మధ్యమంగా ఆనాటి భౌగోళిక విషయాలను క్రోడీకరించాడు. సీతారాముల జీవితం రామాయణంగా ప్రసిద్ధి చెందింది. హిందూ ధర్మముల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది.


వాల్మీకి గొప్ప మహర్షి, తపఃశాలి. ఈయన రచించిన వాల్మీకి రామాయణాన్నే భారతీయులు ప్రామాణికంగా తీసుకుంటారు.

రామాయణంలోని ఉత్తరకాండలో మనకి వాల్మీకి పూర్వాశ్రమ జీవితం గురించి తెలుస్తుంది.


ఆ కథనం ప్రకారం వాల్మీకికి ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు రత్నాకర్ . ఆయన తన కుటుంబాన్ని పోషించటానికి అడవిలో నివసిస్తూ బాటసారుల సొత్తును దోచుకుని జీవితం గడిపేవారు. ఒకరోజు నారద మహర్షిని కూడా దోచుకోబోగా, నారదుడు ఆ దొంగను ….. కుటుంబం కోసం చేసే ఈ దోపిడి ద్వారా వచ్చే పాపాన్ని కుటుంబం కూడా పంచుకుంటుందా అని ప్రశ్నిస్తారు. ఔను అని దొంగ అనగా, ఈ విషయాన్ని భార్య నుండి ధృవీకరించుకోమని నారదుడు అంటాడు. భార్యను అడుగగా, పాపాన్ని పంచుకోడానికి నిరాకరిస్తుంది. ఆ విధంగా ఆత్మసాక్షాత్కారం పొంది, నారదుడిని క్షమాపణ కోరి, జీవిత సత్యాన్ని తెలుసుకుంటారు. నారదుడు రామనామ మంత్రాన్ని వాల్మీకికి ఉపదేశిస్తారు.


ఉపదేశం తర్వాత ఆయన జపం చేస్తూ ఉన్న చోటనే తపస్సమాధి లోకి వెళ్ళిపోయారు చుట్టూ చీమలు పుట్టలు తయారు చేసుకున్నా చలించకుండా తపస్సు చేస్తారు. చాలా కాలం తపస్సు చేసాక బ్రహ్మ తపస్సుకు మెచ్చి ఆకాశవాణి ద్వారా వాల్మీకి అనే పేరుతో పిలుస్తాడు. వల్మీకం అనగా పుట్ట అని అర్థం. వల్మీకం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యారు. తపఃసంపన్నత తర్వాత వాల్మీకి ఆశ్రమవాసం చేయసాగారు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, శ్రీ రాముడు సీతను వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఆశ్రమంలోనే సీత లవ-కుశలకు జన్మనిచ్చినట్లూ..తెలుస్తుంది.


యోగవాశిష్టము అనే యోగా, ధ్యానముల గురించిన సంపూర్ణ విషయములు గల మరో పుస్తకము మహర్షి వాల్మీకి వ్రాశారు.ఈ పుస్తకము రామాయణములోని అంతర్భాగమే.

రాముడు పది-పన్నెండు సంవత్సరాల వయసులో మానసిక అశాంతికి లోనై, మానసిక ధౌర్భల్యమునకు గురి అయిన ప్పుడు వశిస్టుడి ద్వారాయోగా, ధ్యానములను శ్రీరాముడికి బోధించారు వ్రాసింది. వాల్మీకిమహర్షి, పలికింది, బోధించింది వశిస్టుడు,అందు వలన “యోగవాశిష్టము” అనే పేరు వచ్చింది.


ఆదిత్య హృదయము అనెడి సూర్యస్తుతిని వ్రాసినవారు వాల్మీకి మహర్షియే. కౌసల్యా సుప్రజా రామ అనెడి సుప్రభాతమును వ్రాసిన వారు వాల్మీకియే. మహర్షివాల్మీకి “వాల్మీకి మతము” అనే దానిని నెలకొల్పారు.


భారతీయ వాఙ్మయములో రామాయణము ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. అన్ని భారతీయ భాషలందును, అన్ని ప్రాంతములందు ఈ రామాయణ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము.


24,000 శ్లోకము లతో కూడిన రామాయణము భారతదేశము, హిందూ ధర్మము ల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడినది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు- భక్తుడు – వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శ జీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును.

అటువంటి సుందర కావ్యాన్ని చదివేముందు మనం వాల్మీక మహర్షిని స్మరించుకోవాలని పండితులు ఆయనను ఎంత అందంగా అనుభూతిస్తారో చూడండి.


కూజంతం రామ రామేతి I మధురమ్ మధురాక్షరమ్ II

ఆరుహ్య కవితా శాఖాం I వందే వాల్మీకి కోకిలమ్ II


కవిత్వమనే చెట్టు కొమ్మపై కూర్చొని, వాల్మీకి అనే కవికోకిల, మధురమూ మధురాక్షరమూ అయిన రామనామాన్ని పాడుతోందట! ఎంత సౌందర్య సంపూర్ణ ఆస్వాదనో!


ఈ స్లోకంలో ఆదికవి వాల్మీక మహరిషి ని కవిత్వమనే చెట్టు కొమ్మపై కూర్చొని రామాయణ పారాయణ చేసిన “కవికోకిల” గా వర్ణించారు పండితులు


ఈ శ్లోకంలో కవిత్వమనే పెద్దచెట్టుకు వాడిన “ఆరూహ్య ” పదం అద్భుతం.


రామాయణం దాదాపుగా క్రీపూ 500 లో రాయబడిందని పాశ్చాత్యులు నమ్ముతారు.


రామాయణంలో తెలుపబడిన విషయాలననుసరించి కనీసం లక్ష సంవత్సరాల ప్రాచీనమవవచ్చని భారత దార్శనికుల నమ్మకం.


ఇతర ఇతిహాసాల్లాగానే రామాయణం కూడా ఎన్నో మార్పులకు, కలుపుగోరులకు, తీసివేతలకు గురి అయింది.

వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలీనుడని పేర్కొన్నాడు.


శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, సీతను వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తుంది.


ఈ ఆశ్రమంలోనే సీత లవ-కుశలను కన్నట్టూ, వీరిద్దరి విద్యాభ్యాసం ఇక్కడే వాల్మీకికి శిష్యరికంలో జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తుంది.


మనకు ప్రామాణికతను అందించిన ఆదికవి వాల్మీకి మహఋషిని మనసారా స్మరించుకుందాం.

పంచ మహా యజ్ఞాలంటే ఏమిటి?*

 *పంచ మహా యజ్ఞాలంటే ఏమిటి?*


ఇవి ఋత్విక్కులు చేసేయజ్ఞాలు కాదండీ. శాస్త్ర ప్రకారం ప్రతి వ్యక్తీ అను నిత్యం పాటించ వలసిన విధులు. అవి ఏమిటి?


1. దేవ యజ్ఞం


పూర్వం నిత్యాగ్నిహోత్రులు వుండేవారు.

వారు తాము భోజనం చేసే ముందు కొంచెం అన్నాన్ని అగ్నికి ఆహుతి చేసేవారు. దీనికి ఆహుతం అని పేరు. అలాకాక ఇంట్లో వారందరూ అగ్నికి సమిధలు సమర్పించినా ఆహుతం చేసినట్లే. సృష్టికి మూలకారకుడైన దేవదేవుని నిత్యం తలుచుకుని ఆయనకు కృతజ్ఞతలు తెలపటమే దీని ముఖ్యోద్దేశ్యం.


2. పితృ యజ్ఞం


మనల్ని కని పెంచి ఇంత వారిని చేసిన తల్లితండ్రలను ప్రేమగా చూడాలి. చిన్నప్పుడు వారు మనల్ని ఎంత ప్రేమగా చూశారో, మన అవసరాలెలా తీర్చారో, అలాగే వారి పెద్ద వయసులో వారిని కనిపెట్టుకుని వుండాలి. ఇలా వారి ఋణాన్ని కొంతయినా తీర్చుకోగలం. ఇది పితృ యజ్ఞం.


3. భూత యజ్ఞం


గృహస్తు సర్వప్రాణికోటిమీద దయ కలిగి పుండాలి. పశు పక్షులు, క్రిమి, కీటకాదులు మానవుడి మీద ఆధార పడి వున్నాయి. అందుకే మనిషికి భూత

దయ వుండాలి. అన్నం తినే ముందు ఒక ముద్ద అన్నం పక్షుల కోసం బయట (పక్షులు వచ్చే ప్రదేశంలోపెట్టాలి. ఇంటి ముందు కుక్కకి, ఇంట్లో పిల్లికి అన్నం పెట్టాలి. ఇంట్లో పశువులు వుంటే వాటికి పెట్టాలి. క్రిమి కీటకాల కోసం కొంచెం అన్నం (తినక ముందు) పక్కన పెట్టాలి. (మన పెద్దలు వీటిని పాటించటం మీలో కొందరయినా చూసే వుంటారు). జలాశయాలలో జలచరాలకు కూడా

ఆహారం వెయ్యాలి. సర్వ ప్రాణులయందూ దయ కలిగి వుండి ప్రతి నిత్యం కనీసం ఏదో ఒక దానికన్నా ఆహారం ఇవ్వాలి.


4. మనుష్య యజ్ఞం


మన పెద్దలు అతిధి దేవో భవ అన్నారు.


అప్పటివారు ఆతిధ్యం కోరి వచ్చినవారు తమకు తెలియనివారయినా వారిని ఆదరించి సత్కరించేవారు. రోజులు మారినాయి. అయినా

ఇంటికొచ్చినవారిని మన కులం వారా, మన మతం వారా మన కేవిషయంలో నైనా పనికి వస్తారా లేదా వగైరాలాలోచించకుండా వారు వచ్చిన సమయాన్నిబట్టి తగు విధంగా గౌరవించాలి. తోటి వారి పట్ల దయ కలిగి వుండాలి. అందరితో

సఖ్యంగా వుండాలి. ఎవరైనా సహాయం కోరితే, మనం చెయ్యగలిగితే నిస్వార్ధంగా చెయ్యాలి.


5. బ్రహ్మ యజ్ఞం


ప్రతి వారూ, ప్రతి రోజూ వేద మంత్రాలు కానీ శాస్త్రిలని కానీ చదవాలి. ఇప్పుడు వేద మంత్రాలు చదివే వారి సంఖ్య తక్కువగానీ ప్రతి వారూ ఎవరికి

వీలయిన, ఎవరికి ఆసక్తి వున్న, ఎవరికి అనుకూలంగా వున్న శాస్త్రాలను చదవాలి. ప్రతి రోజూ కొత్త విషయాలను తెలుసుకునే ఆసక్తి

చూపించాలి. అంతేకాదు. తను తెలుసుకున్నది ఇతరులకు చెప్పాలి. ప్రతి మనిషికీ భగవంతుని పట్ల విశ్వాసం, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, భూత దయ, తోటి మనిషులతో కలిసి వుండే మనస్తత్వం,

శాస్త్రం తెలుసుకుని నలుగురితో పంచుకునే జిజ్ఞాస

వున్నాయనుకోండి. ఈ ప్రపంచం ఎలా వుంటుందో ఒక్కసారి ఊహించుకోండి.


మనిషిని సక్రమ మార్గంలో నడపటానికే ఈ పంచ యజ్ఞాలను నిర్దేసించారు మన పెద్దలు.

తీర్థాల రవి శర్మ

9989692844

ఆదికవి శ్రీవాల్మీకికి భక్త్యంజలి

 ఆదికవి  శ్రీవాల్మీకికి భక్త్యంజలి


పామరువోలె బుట్టి బహు 

         పాపము లెన్నియొ  నాచరించియున్ 

నీమము తోడ నారదుని 

         నెయ్యపు పల్కుల నాలకించి , యా

రాముని నామమున్ మదిని 

         రంజిల బల్కియు పుట్టలోపలన్,  సు 

త్రాములు మెచ్ఛ మౌనివయి 

         రామకథన్ రచియించి నావు , నీ

నామము దల్చియున్ మదిని        

        యాదికవీ !  నిను గొల్తు నిచ్చలన్ .


✍️ గోపాలుని మధుసూదన రావు

710. *ఓం సంప్రదాయేశ్వర్యై నమః.🙏*

 710. *ఓం సంప్రదాయేశ్వర్యై నమః.🙏*


శ్రీ విద్యా వర సంప్రదాయ సుగతిన్ శ్రీ *సంప్రదాయేశ్వరీ!*


భావాతీత పరంపరాగతముగా వర్ధిల్లుచుండెన్, భవ


చ్ఛ్రీవాత్సల్యమె తోడు కాగ శుభముల్ శ్రేయంబులున్ గూర్చుచున్.


శ్రీమత్ సద్వర సంప్రదాయములనే చిత్రాన్ని ద్రూపి! సాగింపుమా.

🙏

అమ్మకు నమస్కరించుచు🙏

చింతా రామకృష్ణారావు.

ధార్మికగీత - 66*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                        *ధార్మికగీత - 66*

                                  *****

            *శ్లో:- అతిథి  ర్బాలక   శ్చైవ ౹*

                   *స్త్రీజనో  నృపతి  స్తథా  ౹*

                   *ఏతే  విత్తం  న  జానన్తి  ౹*

                   *జామాతా చైవ పంచమః ౹౹*

                                     *****

*భా:- సంసారం ఒక సాగరం. దాని బాధలు వర్ణనాతీతం. వీటికి తోడు మన చుట్టూ తిరుగుతూ, మనల్ని పట్టి పీడించే గ్రహాలు, ఉపగ్రహాలు మరో ఐదు ఉన్నాయి. అవి. 1. "అతిథి":- తిథి,వార,తారాబలం పట్టింపు లేకుండా రావడమే గాక, స్నానానికి వేడివేడి నీరు,కాఫీ,టిఫిన్,విందు,పాన్పు  వంటి షోడశోపచారాలను తప్పనిసరి హక్కుగా ఆశిస్తాడు. 2."బాలలు":-  రోదనమే వీరి అస్త్రము,శస్త్రము. కొండమీది కోతి కావాలని మంకు పట్టు పడతారు. సాధ్యాసాధ్యాలు వారికి పట్టవు. కోరేది ఇచ్చేదాకా వదలరు.  3. "స్త్రీజనము":- భార్యామణి ఖరీదైన చీరలు,నగలు,అలంకరణ, గృహసామాగ్రి కోసం పదే పదే ఒత్తిడి పెట్టి, సాధించి తీరతారు.  4."నృపతి" :-  ప్రభుత్వము  వృత్తి, ఆదాయ, ఇంటి, నీటి, స్థిరాస్తి, వస్తు సేవా పన్నులు; భూసేకరణ, రోడ్లవిస్తరణ వంటి చట్టాలను విధిగా అమలుచేస్తుంది. మన గోడు పట్టించుకోదు.  5. "జామాత":- అల్లుడుగారు. వస్తు-వాహనాలు,నగలు-నగదు, ఇల్లు-ఇల్లాలు అమిరినా తృప్తి పడక, కొత్త కోరికలకోసం పట్టువదలని విక్రమార్కుడై పీడిస్తాడు. వీరికే దశమగ్రహమని పేరు, ఇలా యీ ఐదుగురు మన స్థితిని-పరిస్థితిని, చిత్తమును- విత్తమును; మదిని - హృదిని    అణుమాత్రం కూడా గ్రహించజాలరు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తారు. వీటన్నిటిని ఓర్పుతో, నేర్పుతో అధిగమించడమే గృహస్థాశ్రమధర్మము*. 

                                      *****

                     *సమర్పణ  :  పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

 ఆవును కౌగిలించుకుంటే రోగాలు నయమైపోతాయ్ – పాశ్చాత్య దేశాలు అనుసరిస్తున్నసరికొత్త, గ్లోబల్ వెల్నెస్ విధానం “కౌ హగ్గింగ్”

➖🔸➖🔸➖🔸➖🔸➖🔸➖🔸➖🔸➖🔸➖


ఒత్తిడిని తగ్గించడానికి మరియు వ్యక్తులలో సకారాత్మక ధోరణిని పెంచడానికి సహాయపడే ఆవును కౌగిలించుకోవడం లేదా ” కాక్ నఫ్ల” అనే తాజా వెల్నెస్ పద్ధతికి కొత్తగా క్రేజ్ ఏర్పడింది.

నెదర్లాండ్స్‌లోని రీవర్‌లో ప్రారంభమైన ఈ విధానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. స్విట్జర్లాండ్ మరియు యునైటెడ్ స్టేట్స్ లోని పొలాలలో ఇప్పుడు సందర్శకులకు ఈ చికిత్స లభిస్తోంది.

ఇది వ్యక్తులలో సానుకూల దృక్పధాన్ని పెంచుతుంది. ఆవు యొక్క వెచ్చని శరీర ఉష్ణోగ్రత మరియు నెమ్మదైన హృదయ స్పందన, ఒత్తిడిని తగ్గిస్తుంది.

“గావో విశ్వస్య మాతరః” ఆవు ప్రపంచానికే తల్లి వంటిది అని అనాదిగా భారతీయుల విశ్వాసం. అందుకే భారతీయులు గోవును తల్లిగా భావించి పూజిస్తారు.  భారతీయులు, ముఖ్యంగా హిందువులు గోవును తల్లిగా భావించి పూజించడాన్ని కొందరు రాజకీయ నాయకులు, అన్య మత ప్రచారకులు, హేతువాదులు హేళన చెయ్యడం అనేక సందర్భాలలో జరుగుతూ ఉంటుంది.


కానీ నేడు శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలలోని ప్రజలు గోమాత యొక్క మహిమను గుర్తించి గోవుకు సన్నిహితంగా మెలిగితే,  గోమాతను  ఆలింగనం చేసుకుంటే తమకున్న శారీరిక, మానసిక రుగ్మతలు తొలగిపోతాయని నమ్మి ఇప్పుడు “కౌ హగ్గింగ్” (ఆవును కౌగిలించుకోవడం), “కాక్ నఫ్ల”  పేరుతో ఒక వెల్ నెస్ ప్రక్రియను ప్రారంభించి, ఎంతో ఆసక్తిగా ఆచరిస్తూ ఉండడం ఓ గొప్ప పరిణామం.


ఇప్పుడు అనేక దేశాలలో ఆవును కౌగిలించుకోవడం లేదా  కాక్ నఫ్ల” అనేది ఒత్తిడిని తగ్గించడానికి మరియు సానుకూల దృక్పధాన్నిపెంచడానికి సహాయపడే తాజా వెల్నెస్ పద్ధతిగా మారింది.


నెదర్లాండ్స్‌లోని గ్రామీణ పట్టణమైన రీవర్ లో ప్రారంభమైన ఆవును  కౌగిలించుకోవడమనే ఈ పద్ధతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. స్విట్జర్లాండ్ మరియు యునైటెడ్ స్టేట్స్ లోని పొలాలలో కూడా ఇప్పుడు సందర్శకులకు ఈ కొత్త చికిత్సను అందిస్తున్నారు.


నెదర్లాండ్స్‌లోని స్పాన్‌బ్రూక్‌లో “ఫార్మ్ సర్వైవల్” నడుపుతున్న జోస్ వాన్ స్ట్రాలెన్ అనే వ్యక్తి ఆరు సంవత్సరాల క్రితం ఇతర రైతుల నుండి ఈ పద్ధతి గురించి విన్నతర్వాత “ఆవు కౌగిలింత” సెషన్లను అందించడం ప్రారంభించాడు.


ఆవుల గురించి ఇన్సైడర్తో మాట్లాడుతూ, “మీరు వాటి బాడీ లాంగ్వేజ్ ను బట్టి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా అవి కళ్ళు సగం మూసుకుని, చెవులు క్రిందికి వాల్చి ఉన్నప్పుడు, అలాగే కొన్నిసార్లు వ్యక్తి ఒడిలో తల పెట్టుకుని పడుకుని రిలాక్సవుతున్నట్టుగా ఉన్నప్పుడు….


“అంటే ఇది సానుకూల శక్తి మార్పిడన్నమాట. ఆవును గట్టిగా కౌగిలించుకునే వ్యక్తి ఆవు శరీరంలోని వెచ్చదనం ద్వారా రిలాక్స్ అవుతాడు. మరి కొన్నిసార్లు ఆవు హృదయ స్పందనను కూడా అనుసరిస్తాడు. ఇది ఆవుకు, వ్యక్తికి ఇద్దరికీ గొప్ప అనుభవం.


“ప్రజలు తాము ఊహించిన దానికంటే ఎక్కువగా అనుభూతి చెందుతున్నామని తరచుగా నాకు చెప్తూ ఉంటారు. వారు ఆవు కౌగిలిలోని వెచ్చదనాన్ని, అంగీకారాన్ని, ప్రేమను అనుభూతి చెందుతారు. ఆవులో కూడా అదే విధమైన భావనను వారు గుర్తించగలుగుతున్నారు.


“నీలి ఆకాశం క్రింద పచ్చని పొలాలలో చుట్టూ ఆవులతో ఉంటే చాలు. అంతకంటే అద్భుతమైన చోటు ఉండదు.” అని పేర్కొన్నారు.


BBC కథనం ప్రకారం… ఆవు యొక్క వెచ్చని శరీర ఉష్ణోగ్రత, నెమ్మదైన హృదయ స్పందన కారణంగా మానవులలో ఆక్సిటోసిన్ పెంపొందుతుంది. అది సానుకూల దృక్పధాన్ని ఏర్పరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుందని నమ్ముతారు. ఇది సహజంగా అనుబంధం కారణంగా విడుదలయ్యే హార్మోన్.


అప్లైడ్ యానిమల్ బిహేవియర్ సైన్స్ లో ప్రచురించబడిన ఫ్రెంచ్ మరియు ఆస్ట్రియన్ శాస్త్రవేత్తలు 2007 లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం ఆవులు “వాటిని యజమానులు రుద్దడం, మసాజ్ చేయడం లేదా ప్రేమను చూపించినప్పుడు అవి తమ ఆనందము మరియు విశ్రాంతి పొందుతున్న సంకేతాలను చూపుతాయి” అని తేలింది.


ఆవులను కౌగిలించుకునే మానవులు కూడా తక్కువ హృదయ స్పందన రేటును అనుభవించారని, శారీరకంగా తామెంతో రిలాక్స్ అవుతున్నట్లుగా అనుభూతి చెందుతున్న సంకేతాలను చూపించారు. ఇది “మానవులు – పశువుల మధ్య అనుబంధాన్ని మెరుగుపరచడానికి ఆసక్తి కలిగిస్తుంది” అని ఆ పత్రిక పేర్కొంది.


ఆచరణలో, ఆవులను కౌగిలించుకోవడం, వాటితో ప్రేమగా మెలగడం, వాటికి మసాజ్ చేయడం వంటివి ప్రతిరోజూ మూడు గంటల వరకు ఉంటాయి.  కానీ మనుషుల మాదిరిగానే, కొన్ని ఆవులు ఇతర జంతువులకంటే ఎక్కువ స్నేహశీలియైనవి. అలాగే వాటికి ఆసక్తి లేకపోతే మాత్రం దూరంగా నడుస్తాయి కూడా.


ఏదేమైనా, ప్రపంచ జంతు సంరక్షణ విభాగంలో విదేశాంగ సలహాదారు అయిన ఫిలిప్ విల్సన్ ఇన్సైడర్‌తో ఇలా అన్నారు: “ఆవును కౌగిలించుకున్నప్పుడు ఆవుకు కూడా కొన్ని ప్రయోజనాలున్నాయని కొన్ని నివేదికాలు వెల్లడి చేస్తున్నప్పటికీ… దీనిలో ప్రధాన లబ్ధిదారుడు కౌగిలించుకునే వ్యక్తి మాత్రమే.”


“జంతు సంక్షేమ సంస్థగా, జంతువుల యొక్క అంతర్గత స్వభావాన్ని ప్రజలు అర్థం చేసుకుని జీవించడం, భావోద్వేగాలు కలిగి ఉండడం, నొప్పి మరియు బాధలను అనుభవించగల సామర్థ్యాన్ని పొందడం, ​​అలాగే సానుకూల భావోద్వేగాలను నేర్చుకుంటారు మరియు అర్థం చేసుకుంటారని మేం భావిస్తున్నాం.” అని ఆయన అన్నారు.


“ప్రజలతో అవాంఛిత పరిచయం కారణంగా జంతువు మరియు వ్యక్తికి వచ్చే ప్రమాదాలు, రవాణా మరియు గృహ పరిస్థితుల వల్ల కలిగే అనవసరమైన ఒత్తిడి గురించి కూడా మేము ఆందోళన చెందుతున్నాము.


“చికిత్సా ప్రయోజనాల పరంగా, కుక్కలు మరియు పిల్లులు వంటి పెంపుడు జంతువులను ఉపయోగించడం కూడా అంతే ప్రభావవంతంగా ఉంటుందా? దీనివలన ఏమైనా  ఉభయులకు తక్కువ ప్రమాదం కలిగిస్తుందా? అని కూడా మేము పరిశీలిస్తున్నాము.” అని ఆయన అన్నారు.


ఏదేమైనప్పటికీ  మిగతా ప్రపంచమంతా ఇప్పుడు, ఆలస్యంగా గోమాత యొక్క మహిమను గుర్తిస్తూ ఉన్నా కొన్ని యుగాల క్రితమే గోమాత మహిమను గుర్తించి,  గోవును తల్లిగా పూజించి, గో సంపదనే నిజమైన సంపదగా భావించిన భారతీయుల విజ్ఞానం ఎంత గొప్పది? గో మహిమకు అంతటి ప్రాధాన్యం ఇచ్చారు కనుకనే సాక్షాత్తు భగవానుడైన శ్రీకృష్ణుడే గోపాలకుడైనాడు.  ఏనాటికైనా యావత్ ప్రపంచం సనాతన ధర్మ ఛత్ర ఛాయలోకి రావలసిందే….  ఆ నీడలో సేద దీరవలసిందే.  వందే గోమాతరం.  భారత్ మాతాకీ జై.


Credit విశ్వసంవాదకేంద్ర ఆంధ్రప్రదేశ్

Technology


 

Shankar





 

Doctor advise


 

సద్వినియోగం

 సద్వినియోగం


ఈ లోకంలో అన్నింటికంటే ముఖ్యమైనది, 


అన్నింటికంటే విలువైనది,


వదిలితే తిరిగి పొందలేనిది,


 జీవితాలను శాసించేది,


ఆశయాలను సాధించే అవకాశాలను అందించేది,


కోరికలను సాకారం చేసుకోవడానికి సహకరించేది,


దైవస్వరూపమైనది.. కాలం. 


మన ఆలోచనలకు, ప్రణాళికలకు, ప్రయత్నాలకు రూపాన్నిచ్చేది కాలమే.   


కాలగమనమే మన జీవనయానం. 


👉అటువంటి విశిష్టమైన కాలాన్ని సద్వినియోగం చేసుకున్నవాడే అనుకున్న లక్ష్యాలను సాధించగలడు. జీవనసార్థక్యాన్ని పొందగలడు.

అసూయ తెచ్చిన తంటా

 అసూయ తెచ్చిన తంటా


ఒక ఊర్లో రాజేష్, కామేశ్ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. తన పొరుగింట్లో ఉంటోన్న రాజేష్‌ను ఎలాగైనా అధిగమించాలని అనుకుంటాడు కామేశ్. తెలివితేటల్లోనూ, ఆస్తిపాస్తుల్లోనూ, మంచి తనంలోనూ, పరోపకారం చేయడంలోనూ... తనకంటే ఇంకెవరూ ఎక్కువగా ఉండకూదని అతను ప్రయత్నిస్తూ ఉంటాడు.


అయితే... ప్రతిసారీ ఇతడికి రాజేష్ చేతిలో భంగపాటే ఎదురవుతూ ఉండేది. రాజేష్ ఇంకెప్పటికీ వసూలు కాదని వదిలేసిన రెండు వేల రూపాయల బాకీ వసూలయింది. ఈ విషయం తెలిసిన కామేశ్ అసూయతో రగిలిపోతున్న సమయంలోనే దూరపు బంధువు ఒకడు వచ్చి అప్పు అడిగాడు. పట్టరాని కోపం వచ్చినా ఆపుకుని ఎలాగైనా సరే దీన్ని అవకాశంగా తీసుకుని రాజేష్‌ను దెబ్బతీయాలనుకుంటాడు కామేశ్.


"సమయానికి నా దగ్గరా డబ్బులేదు. పరోపకారానికి మారుపేరైన మా పక్కింటి రాజేష్ నీకు సాయపడవచ్చు. వెళ్దాం రా...'' అంటూ అతడిని రాజేష్ ఇంటికి తీసుకువెళ్ళాడు కామేశ్. ఊరిపెద్దలతో మాట్లాడుతున్న రాజేష్‌కు తన బంధువును పరిచయం చేసి... డబ్బు అవసరమట, మీరే ఇవ్వగలనని చెప్పాడు.


ఇంతలో కామేశ్ బంధువు రాజేష్‌తో మాట్లాడుతూ... మీరు నాకు అప్పు ఇవ్వలేకపోతే నా ఇంకా కోతకు రాని వరిపంటను తనఖాగా పెట్టుకుని ఇవ్వండి చాలా అవసరం అన్నాడు. ఇంతలో అక్కడ ఉన్న పెద్దమనుషులు ఇప్పుడు వరిపంటకు అంత డిమాండ్ ఏమీ లేదు కదా... అలాంటప్పుడు ఆ పంటను ఎలా తనాఖాగా పెట్టుకుంటారని రాజేష్‌కు సూచించారు.


ఇంతలో రాజేష్‌ను ఎలాగైనా సరే ఇబ్బందుల్లో పడేయాలనుకున్న కామేశ్.. మన రాజేష్‌కేంటండీ... అతను ఎందులో చేయిపెట్టినా లాభమే సాధిస్తాడంటూ మాట్లాడాడు. పైన తథాస్తు దేవతలుంటారని, కామేశ్ మంచి ఉద్దేశ్యంతో చెప్పాడు కాబట్టి అప్పు ఇవ్వమని చెప్పేసారు ఆ పెద్దమనుషులు. సరేనన్న రాజేష్ అప్పుగా కొంత డబ్బును ఇచ్చి పంపేస్తాడు.


తథాస్తు దేవతల దీవెనల చలువో, లేదా తాను చేస్తున్న మంచి పనుల చలువో, మెచ్చుకుంటోన్న ప్రజల ఆశీర్వాదాల చలువోగానీ రాజేష్ తనఖాగా పెట్టుకున్న వరిపంట బాగా పండింది. ఊహించని రీతిలో వరిపంట డిమాండ్ పెరిగి, అమ్మకాలు కూడా ఊపందుకున్నాయి.


తాను అప్పుగా ఇచ్చిన డబ్బుకంటే పదింతల డబ్బును వరిపంట ద్వారా సంపాదించాడు రాజేష్. విషయమంతా తెలిసిన కామేశ్ ఇంకా అసూయతో రగిలిపోతూ... అరే ఎంతపని చేశాను. ఆ పంటను నేనే పెట్టుకుని ఉంటే... మంచిపేరుకు మంచిపేరు, డబ్బుకు డబ్బు వచ్చి ఉండేవి. అన్నింటినీ పోగొట్టుకున్నాను కదా అనుకున్న కామేశ్... ప్రతిక్షణం కుమిలిపోతూ కాలం వెళ్లదీయసాగాడు.


కాబట్టి పిల్లలూ...! పక్క వ్యక్తి అభివృద్ధి చెందుతూ ఉంటే... రోజు రోజుకూ ఎదిగిపోతుంటే అందుకు కుమిలి పోవడం, అసూయతో రగిలిపోవడం కాకుండా... మనం కూడా అభివృద్ధి చెందేందుకు ప్రయత్నించాలని ఈ కథ ద్వారా అర్థమైంది కదూ...!

అమ్మ































 

శివానందలహారీ

 🙏శివానందలహారీ🙏


స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ 

పురాణే మంత్రేవా స్తుతినటన హాస్యే ష్వచతురహ

కథం రాజ్ఞామ్ ప్రీతిర్భవతి మయి కో2హం పశుపతే 

పశుం మాం సర్వజ్ఞ ప్రధితకృపయా పాలయ విభో  05


స్మ్రతి,పురాణములందు,స్తుతి,నాట్యములయందు

          శకున , వైద్య , నటన శాస్త్ర మందు

సంగీత సాహిత్య సారస్వతము లందు 

           చతుర , హాస్య , విదూష వితతు లందు

నేర్పున్న వాడను నే గాను పరమేశ !

           భావింప నన్నింట పశువు నేను

నటువంటి నా మీద నవనీపతుల కెట్లు

          ప్రేమతో జీరంగ ప్రీతి గలుగు ?

పశువు నగునన్ను పాలించ పరుడు లేడు

పశుపతీ ! నీవు పాలించి భవము నందు

కరుణ తోడను రక్షించి కావు మెపుడు

భక్త మందార ! శంకరా ! పాహి పాహి !        05 


✍️ గోపాలుని మధుసూదన రావు