*ఉపవాసం-అన్నం తినటం* దీని గురించి ఈరోజు మాట్లాడుతున్నారు.
ఈ శరీరానికి ఏ కోశము అని పేరండి? *"ఈ శరీరానికి అన్నమయకోశము"* అని పేరు. ఈ పేరులోనే ఉన్నది.... ఈ శరీరం నలిచి ఉండటానికి ఆధారం ఏదో... అన్నం ఆహారంగా ఇవ్వకపోతే ఈ శరీరం నిలబడదు.
*"అన్నమయములైనవన్ని జీవమ్ములు. కూడు లేక జీవకోటి లేదు....."*
*"అన్నము లేదు. కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్న...."*
ఈ పద్యాలు పోతన భాగవతములోనివి.
అన్నము లేకుండా జీవకోటి లేదు అని పైన పద్యంలో చెప్పటం జరిగినది. మానవుడైతే బియ్యాన్ని లేదా గోధుమలను లేదా మరొకదానిని వండుకొని తింటాడు. దీనిని అన్నం అంటున్నాము. పశువులు గడ్డి వగైరా తింటాయి. పక్ష్యాదులు పురుగులు కీటకాలు వగైరా తింటాయి.
వండుకు తినేది మాత్రమే అన్నం అనబడదు. శరీరాన్ని నిలుపుకోవటానికి జీవులు దేనిని ఆహారంగా తీసుకున్నా... అదంతా అన్నమే...
ఉపవాసం ఉన్నప్పుడు అన్నం తినకూడదు. అన్నం తినకూడదని అన్నారని దాని బదులుగా వేరే వాటితో కడుపంతా నింపేస్తే.. అదంతా అన్నంకాదా? కచ్చితంగా అదంతా అన్నమే. అన్నం తినకూడదు అనే నియమాన్ని పాటించాలంటే... ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. దేవుడి ప్రసాదం పేరు చెప్పి పులిహోరలు దధ్యోదనాలతో కడుపు నింపితే అది ఉపవాసం ఎలా అవుతుంది?
ఆబ్దికం రోజున దేవతార్చన కూడా చేస్తారు (అది ఉన్నవారు). తీర్థప్రసాదాలను మాత్రం తీసుకోకుండా ఉంచుతారు. ఆబ్దికం పూర్తి అయినాక భోజనం చేసే ముందర దేవతార్చనకు సంబంధించిన తీర్థప్రసాదాలను తీసుకొని భోజనం చేస్తారు.
ఇదే పద్ధతి ఉపవాసంలో కూడా పాటించి గుళ్ళో ప్రసాదమో... ఇంట్లో ప్రసాదమో... ఉపవాస విరమణసమయంలో తీసుకొని ఆ తరువాత భోజనం చెయ్యాలి.
అస్సలు ఏమీ తినకుండా పూర్తిగా కటిక ఉపవాసం ఉండకూడదంటుంది శాస్త్రం. ఇదొక ఆరోగ్యసూత్రం కూడా.... కటిక ఉపవాసం వద్దంటే... కొబ్బరి నీరు వంటి ద్రవాహారాన్ని అది కూడా... పరిమితంగా తీసుకోవాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి