7, డిసెంబర్ 2025, ఆదివారం

ఉపవాసం-అన్నం తినటం

 *ఉపవాసం-అన్నం తినటం* దీని గురించి ఈరోజు మాట్లాడుతున్నారు. 


ఈ శరీరానికి ఏ కోశము అని పేరండి? *"ఈ శరీరానికి అన్నమయకోశము"* అని పేరు. ఈ పేరులోనే ఉన్నది.... ఈ శరీరం నలిచి ఉండటానికి ఆధారం ఏదో... అన్నం ఆహారంగా ఇవ్వకపోతే ఈ శరీరం నిలబడదు. 


*"అన్నమయములైనవన్ని జీవమ్ములు. కూడు లేక జీవకోటి లేదు....."*


*"అన్నము లేదు. కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్న...."* 


ఈ పద్యాలు పోతన భాగవతములోనివి. 


అన్నము లేకుండా జీవకోటి లేదు అని పైన పద్యంలో చెప్పటం జరిగినది. మానవుడైతే బియ్యాన్ని లేదా గోధుమలను లేదా మరొకదానిని వండుకొని తింటాడు. దీనిని అన్నం అంటున్నాము. పశువులు గడ్డి వగైరా తింటాయి. పక్ష్యాదులు పురుగులు కీటకాలు వగైరా తింటాయి. 


వండుకు తినేది మాత్రమే అన్నం అనబడదు. శరీరాన్ని నిలుపుకోవటానికి జీవులు దేనిని ఆహారంగా తీసుకున్నా... అదంతా అన్నమే...


ఉపవాసం ఉన్నప్పుడు అన్నం తినకూడదు. అన్నం తినకూడదని అన్నారని దాని బదులుగా వేరే వాటితో కడుపంతా నింపేస్తే.. అదంతా అన్నంకాదా? కచ్చితంగా అదంతా అన్నమే. అన్నం తినకూడదు అనే నియమాన్ని పాటించాలంటే... ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. దేవుడి ప్రసాదం పేరు చెప్పి పులిహోరలు దధ్యోదనాలతో కడుపు నింపితే అది ఉపవాసం ఎలా అవుతుంది? 


ఆబ్దికం రోజున దేవతార్చన కూడా చేస్తారు (అది ఉన్నవారు). తీర్థప్రసాదాలను మాత్రం తీసుకోకుండా ఉంచుతారు. ఆబ్దికం పూర్తి అయినాక భోజనం చేసే ముందర దేవతార్చనకు సంబంధించిన తీర్థప్రసాదాలను తీసుకొని భోజనం చేస్తారు. 


ఇదే పద్ధతి ఉపవాసంలో కూడా పాటించి గుళ్ళో ప్రసాదమో... ఇంట్లో ప్రసాదమో... ఉపవాస విరమణసమయంలో తీసుకొని ఆ తరువాత భోజనం చెయ్యాలి. 


అస్సలు ఏమీ తినకుండా పూర్తిగా కటిక ఉపవాసం ఉండకూడదంటుంది శాస్త్రం. ఇదొక ఆరోగ్యసూత్రం కూడా.... కటిక ఉపవాసం వద్దంటే... కొబ్బరి నీరు వంటి ద్రవాహారాన్ని అది కూడా... పరిమితంగా తీసుకోవాలి.

ఆన్లైన్లో సంగీతం క్లాసులు

   ఆన్లైన్లో సంగీతం క్లాసులు


 ఆన్లైన్లో కర్ణాటక సంగీత క్లాసులు కండక్ట్ చేయబడుతున్నాయి మీ పిల్లలకి సంగీతం నేర్పించదల్చుకుంటే వెంటనే ఈ పోస్ట్ కింద కామెంట్ రూపంలో మీరు తెలియజేయగలరు. మీ వాట్సాప్ నంబర్ తెలియజేస్తే వాట్సాప్ ద్వారా మేమే మిమ్మల్ని కాంటాక్ట్ చేయగలము.


మీరు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా పర్వాలేదు ఆన్లైన్లో క్లాసులు అటెండ్ కావచ్చు 


ప్రస్తుతం అమెరికాలో వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఉన్నారు.

07డిసెంబర్2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     🌞 *ఆదివారం*🌞

*🌹07డిసెంబర్2025🌹*  

    *దృగ్గణిత పంచాంగం* 

                    

         *స్వస్తి శ్రీ విశ్వావసు*

         *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం - కృష్ణపక్షం*


*తిథి  : తదియ* ‌సా 06.24 వరకు ఉపరి *చవితి*

*వారం    : ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం  : ఆరుద్ర* ఉ 06.13 ఉపరి *పునర్వసు* రా.తె 04.11 వరకు 

*యోగం : శుక్ల* ఉ 08.07 వరకు ఉపరి *బ్రహ్మ*

*కరణం  : వణజి* ఉ 07.50 *భద్ర* సా 06.24 ఉపరి *బవ* (08) తె 05.08 వరకు ఆపైన బాలువ


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 07.00 - 09.00 మ 02.00 - 04.00* 

అమృత కాలం  : రా 01.59 - 03.27

అభిజిత్ కాలం  : ప 11.37 - 12.21

*వర్జ్యం    : సా 05.12 - 06.40*

*దుర్ముహూర్తం  : సా 04.05 - 04.50*

*రాహు కాలం   : సా 04.11 - 05.44*

గుళికకాళం      : మ 02.47 - 04.11

యమగండం    : ప 11.59 - 01.23

సూర్యరాశి : వృశ్చికం                      

చంద్రరాశి : మిధునం/కర్కాటకం*

ఉ 06.33 

సా 05.42

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          : ఉ 06.23 - 08.38

సంగవ కాలం         :     08.38 - 10.52

మధ్యాహ్న కాలం    :    10.52 - 01.06

అపరాహ్న కాలం    : మ 01.06 - 03.20

*ఆబ్ధికం తిధి         : మార్గశిర బహుళ తదియ*

సాయంకాలం        :  సా 03.20 - 05.34

ప్రదోష కాలం         :  సా 05.34 - 08.08

రాత్రి కాలం           :  రా 08.08 - 11.33

నిశీధి కాలం          :   రా 11.33 - 12.25

బ్రాహ్మీ ముహూర్తం :  తె 04.41 - 05.33

******************************

        🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌞శ్రీ సూర్య పంజర స్తోత్రం🌞*


       *సువర్ణరేతసే నమః*

         *యమాయ నమః*

        *దివాకరాయ నమః* 

      *కర్ణస్థానే మాం రక్షతు*


🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

        🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - హేమంత ఋతువు - మార్గశిర మాసం - కృష్ణ పక్షం - తృతీయ - పునర్వసు -‌‌ భాను వాసరే* (07.12.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*