28, నవంబర్ 2025, శుక్రవారం

బలవంతుడిననో, ధనవంతుడిననో,

 నాకు యెదురు లేదు నరులందు ననబోకు

నాల్గు దినము లుండు నరుడు నీవు

మంచి పంచి బతుకు మదిలోన నిలిచేవు

సకురు అప్ప రావు సత్య మిదిర!


భావం: ఓ మానవులారా! ఈ లోకంలో ఎవ్వరూ కూడా నేను చాలా బలవంతుడిననో, ధనవంతుడిననో, రాజకీయంగా, ఉద్యోగ పరంగా గొప్ప అధికార హోదా ఉందనో, మదమెక్కి, ఇతరులను హీనంగా తక్కువ చూపు చూస్తూ, కొవ్వెక్కిన మాటలాడుతూ ఉండకూడదు! ఈ భూమి మీద ఎవ్వరూ కూడా శాశ్వతంగా జీవించి ఉండిపోరు, అలాగే ఎప్పుడూ ఒకే విధంగా ఉండరు! ఒకరిని మించిన వారు ఒకరు వస్తూనే ఉంటారు, స్ధితులు, పరిస్థితులు మార్పుకు గురౌతూనే ఉంటాయి! మన డబ్బూ, పదవీ, అధికారం ఏ క్షణమైనా మన వదిలి పోవచ్చు! అలాగే ఎప్పుడు ఎవరము పోతామో ఎవరికీ తెలియదు! పోయేలోపు పదిమందితో మంచిగా ఉంటూ, మంచి పనులు చేస్తూ పోవాలి! మనం పోయాక మన కుటుంబానికి మంచి పేరుని, గౌరవాన్నీ ఇచ్చి పోవాలి! మనం మంచిగా పది మంది మనసులో నిలిచి పోవాలి! అంతే గానీ పదిమందిలో వెధవ అనిపించుకొని పోకూడదు! 


సకురు అప్పారావూ ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిజం! 


ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(

కామెంట్‌లు లేవు: