*ఉచితాలు - అనుచితాలు*
సభ్యులకు నమస్కారములు.
ఏ ఒక్క పార్టీని గాని ఏ ఒక్క రాజకీయ నాయకుడిని ఉద్దేశించి కాదు. వ్యవస్థ ఎట్లా తయారైందో చూద్దాము.
*ప్రభుత్వాలకు రాజ్యాంగం పన్నులు వసూలు చేసుకునే హక్కు కల్పించింది ఎందుకు.*
మనంతట మనమే రోడ్డేసుకోలేం,
బడి కట్టుకోలేం,
గుడి కట్టుకోలేం,
ఆస్పత్రి కట్టుకోలేం.
ఆ పనుల్ని చేయడానికి ఒక వ్యవస్థను పెట్టిన దానికి *ప్రభుత్వము* అని పేరు పెట్టారు.
ఆ గవర్నమెంటు వ్యవస్థకు మన (ప్రజల) పనులు చేసిపెట్టే బాధ్యత నాయకులకు, అధికారులకు రాజ్యాంగం అప్పగించినది. అందుకోసం ట్యాక్సుల రూపంలో
మన (ప్రజల) డబ్బులు తీసుకుని, మన (ప్రజల) కోసం బడి కట్టాలి,రోడ్డు వేయాలి,
ఆస్పత్రి కట్టాలి, కరెంటు తయారుచేయాలి,
డ్రైనేజీలు వేయాలి,
చెరువులు కట్టాలి
ప్రాజెక్టులు కట్టాలి ఇత్యాది.
కానీ మనం (ప్రజలు) కట్టిన డబ్బులను నాయకులు *తమ పేర్లు పెట్టుకుని*
తమకు *నచ్చిన వాళ్లకు పంచుతున్నారు*.
*అసహాయులను ఆదుకొనుట మంచిదే, అందుకు ఉపాధులను కల్పించాలి*. అంతేగానీ ఉచితాలను అలవాటు చేయకూడదు
కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. తెలంగాణలో కరిగేపోయాయి.
మొన్నే 50 వేల కోట్ల డబ్బులు పంచాం, ఇంత పంచాం, అంత పంచాం అని అధికార వర్గాలు ఘనంగా చెప్పుకున్నాయి. చెప్పుకొంటూనే ఉంటారు.
*ఎవరి సొమ్ము అది*
*ప్రజలు కట్టిన పన్నులే కదా.* మరి వాటిని ఇష్టారాజ్యంగా పంచుతుంటే ప్రజలు ప్రశ్నించాలి కదా.
రేపటి నుంచి
తెలంగాణలో గాని ఆంధ్రలో గాని ఇతర రాష్ట్రాల కంటే 4 (కొన్ని ) రూపాయలు ఎక్కువపెట్టి పెట్రోలు మరియు డీజిల్ కొనాలి.
*ఇటువంటి పన్నులను మిగతా రాష్ట్రాల్లో వేశారనుకొండి*
*జనం పాలకులను నిలదీస్తారు. కడిగేస్తారు.*
కానీ తెలంగాణలో, ఆంధ్రాలో *ప్రజలు పుడితే పథకం, చదివితే పథకం,*
*పెద్దయితే పథకం,*
*స్కూలు కెళితే పథకం,*
*సంఘానికెళితే పథకం*
*వ్యవసాయం చేస్తే పథకం, పెళ్లి చేసుకుంటే పథకం*
ఉన్న ధన నిల్వలు పెంచడం కష్టం గాని, *పంచడం ఎంత సేపు, 5 నిమిషాల పని.*
డబ్బులు ఇస్తున్నపుడు సంతోషంగా, అభిమానులు తీసుకుంటున్నారు. పన్నుల డబ్బులు ఈలా ఉచితాలకు పంచుతూ ఉంటే అభివృద్ధి పనులు ఎలా అవుతాయి.
చాలా సింపుల్ లాజిక్.
*మనం డబ్బులు ట్యాక్సుల రూపంలో కడితేనే గవర్నమెంటు వద్ద డబ్బులుంటాయి. ఆ డబ్బులను ఎలా వాడితే పెరుగుతాయి అన్నది నాయకుడిని బట్టి ఉంటుంది*
కులాల వారిగా ప్రజలను వేరు చేసి.... చేసే వృత్తుల వారిగా కోట్లమంది హక్కుని కొంతమందికి పంచితే మిగతా వారి తలపై అప్పులు ధరల రూపంలో గుది బండై కూర్చోవా.
*ఓ ఓటరు మహాశయా మేలుకో* ఉచితంగా ఏది రాదు అనేది అందరూ అర్థం చేసుకోవాలి.
*ప్రభుత్వాలు జనంపై ఎన్ని రకాల పన్నులు వేస్తాయో...ఒక్కసారి గమనించండి.*
ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు, రాయితీలు ప్రజలందరి కష్టార్జితాలు, ఫలితాలు అందరికీ అందాలి. *సమాజంలో చైతన్యం తీసుకవద్దాము*
ధన్యవాదములు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి