20, డిసెంబర్ 2025, శనివారం

సమస్త మంగళప్రదం

  *పారిజాత పుష్పాలు ఎందుకు కొయ్యకూడదు?*

🔔 *తెలుసుకొందాం* 🔔


✨ *పారిజాత పుష్పాల ఆధ్యాత్మిక విశిష్టత* ✨


🌺 క్రింద పడిన పారిజాత పుష్పాలతోనే దేవుడిని పూజ చేయాలని ఎందుకు చెబుతారో తెలుసా?


🌿 *పారిజాతం ప్రత్యేకత*


• పారిజాత వృక్షం దైవ స్వరూపంగా పరిగణించబడుతుంది.


• ఈ పుష్పాలతో పూజ చేస్తే భగవంతుని అనుగ్రహం తప్పక లభిస్తుంది.


• పురాణాల ప్రకారం పారిజాత వృక్షం సముద్ర మథనంలో ఉద్భవించింది.


• తర్వాత విష్ణువు స్వర్గానికి తీసుకెళ్లగా, సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు భూలోకానికి తెచ్చాడు.



🌸 ఎందుకు కిందపడిన పుష్పాలనే వాడాలి?


• సాధారణంగా పూలను కోసి పూజ చేస్తారు.


• కానీ పారిజాత పువ్వు మాత్రం భూమిని తాకిన తర్వాత మాత్రమే స్వామికి సమర్పించాలి అని శాస్త్రం చెబుతుంది.


• ఎందుకంటే ఇది స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన వృక్షం 🌿.


• అందుకే కిందపడిన పువ్వు భూమిని తాకిన తర్వాతే పవిత్రమవుతుంది.


• కిందపడిన పువ్వులను మాత్రమే ఆవుపేడతో అలికిన నేల నుండి ఏరుకొని దేవుడికి సమర్పించాలి.



🌼 పారిజాతం ఇంటి ఆవరణలో ఉంటే…


🌟 ఆ ఇంటిలో ఎప్పుడూ సిరి సంపదలు, ఐశ్వర్యం నిలుస్తాయి అని పురాణ వచనం.



🌺 పారిజాత పుష్పాలు 9 రకాలు 🌺


1. ఎర్ర (ముద్ద) పారిజాతం ❤️


2. రేకు పారిజాతం 🍃


3. తెలుపు–ఎర్ర కాడతో (సాధారణంగా కనిపించేది) ⚪🔴


4. పసుపు పారిజాతం 💛


5. నీలం పారిజాతం 💙


6. గన్నేరు రంగు పారిజాతం 🌺


7. గులాబీ రంగు పారిజాతం 🌸


8. తెల్లని పాలరంగు పారిజాతం 🤍


9. ఎర్ర రంగు పారిజాతం 🔴


⚠️ ఎరుపు రంగు పారిజాతం విష్ణు ఆరాధనకు వాడరాదు.


ఎందుకంటే ఎరుపు = తమోగుణం, కానీ విష్ణువు = సత్వగుణం.



🕉️ పారిజాతం వరప్రసాదం 🕉️


• పారిజాత వృక్షం తపస్సు చేసి,


🌸 “నా పుష్పాలను కోయకూడదు, తానే ఇచ్చినప్పుడు మాత్రమే వాడాలి” అనే వరం పొందింది.


• అందువల్లే కిందపడిన పువ్వులను మాత్రమే తీసుకుని పూజకు వాడడం పవిత్రం.


🌟 *పారిజాతం యొక్క పంచస్పర్శ మహిమ* 🌟


భూ స్పర్శ 🌍 + మృత్తికా స్పర్శ 🪨 + జల స్పర్శ 💧 + హస్త స్పర్శ ✋ + స్వామి స్పర్శ 🙏


➡️ ఈ ఐదు స్పర్శలతో కలిసిన పారిజాతం పంచమహా పాతకాలను తొలగిస్తుంది.

💐 అందుకే పారిజాతం పుష్పాలు – కిందపడినవే పవిత్రమైనవి, పూజకు ఉత్తమమైనవి అన్నది పురానవచనం.


✨ పారిజాత పుష్పం భగవంతుని అనుగ్రహానికి దివ్య ద్వారం. ✨


✨శ్రీ పారిజాత పుష్ప సమర్పణం సమస్త మంగళప్రదం కావాలి.✨

శనివారం🍁* *🌹20డిసెంబర్2025🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🍁శనివారం🍁*

 *🌹20డిసెంబర్2025🌹*  

    *దృగ్గణిత పంచాంగం* 

                  

           *స్వస్తి శ్రీ విశ్వావసు* 

           *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - హేమంత ఋతౌః*

*పుష్యమాసం - శుక్లపక్షం*


*తిథి  : పాడ్యమి* ‌పూర్తిగా రోజంతా *రాత్రితో సహా*

*వారం    : శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం  : మూల* రా 01.21 వరకు ఉపరి *పూర్వాషాఢ*

*యోగం : గండ* సా 04.17 వరకు ఉపరి *వృద్ధి*

*కరణం  : నాగ* ఉ 07.12 *కింస్తుఘ్న* రా 08.13 ఉపరి *బవ*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 10.30 - 12.00 సా 05.00 - 06.30*

అమృత కాలం  : *సా 06.17 - 08.03*

అభిజిత్ కాలం  : *ప 11.43 - 12.27*

*వర్జ్యం    : ఉ 07.41 - 09.07 & రా 11.35 - 01.21*

*దుర్ముహూర్తం  : ఉ 06.31 - 08.00*

*రాహు కాలం   : ఉ 09.18 - 10.42*

గుళికకాళం      : *ఉ 06.31 - 07.54*

యమగండం    : *మ 01.29 - 02.52*

సూర్యరాశి : *ధనుస్సు*                  

చంద్రరాశి : *ధనుస్సు*

సూర్యోదయం :*ఉ 06.41*

సూర్యాస్తమయం :*సా 05.47*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :*ఉ 06.30 - 08.44*

సంగవ కాలం         :     *08.44 - 10.58*

మధ్యాహ్న కాలం    :    *10.58 - 01.12*

అపరాహ్న కాలం    : *మ 01.12 - 03.26*


*ఆబ్ధికం తిధి         : పుష్య శుద్ధ పాడ్యమి*

సాయంకాలం        :  *సా 03.26 - 05.40*

ప్రదోష కాలం         :  *సా 05.40 - 08.14*

రాత్రి కాలం           :*రా 08.14 - 11.40*

నిశీధి కాలం          :*రా 11.40 - 12.31*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.48 - 05.40*

<><><><><><><><><><><><><><>

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🙏 శ్రీ వేంకటేశ్వర కరావలంబమ్🙏*


*వేదాంతవేద్య భవసాగర* 

*కర్ణధారశ్రీపద్మనాభ*


*!!.ఓం నమో వెంకటేశాయ నమః.!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️


*స్థిర నిల్యావర హనుమంత*

*ఈశ బాలక హనుమంత*

*జయ బజరంగబలి*

*జయజయ జయ బజరంగబలి*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

  

          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

తిరుప్పావై – 5వ పాశురము*_

 🌹🌷🪔🪔🛕🪔🪔🌷🌹

*శనివారం 20 డిసెంబర్ 2025*


_*శ్రీమతే రామానుజాయ నమ:*_

_*తిరుప్పావై – 5వ పాశురము*_

_*శ్రీ భాష్యం అప్పలాచార్యుల వారి ఆంధ్ర అనువాదముతో*_


_*5వ పాశురము*_


_*మాయనై మన్ను, వడమదురై మైన్దనై*_

_*త్తూయ పెరునీర్ యమునై త్తురైవనై*_

_*ఆయర్ కులత్తినిల్ తోన్రుమ్ మణి విళక్కై*_

_*త్తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ద దామోదరనై*_

_*తూయోమాయ్ వన్దు నామ్ తూమలర్ తూవిత్తొళుదు*_

_*వాయినాల్ పాడి, మనత్తినాల్ శిన్దిక్క*_

_*పోయపిళ్ళైయుమ్ ప్పుగుదరువా నిన్రనవుమ్*_

_*తీయినిల్ తూశాగుం శెప్పేలో రెమ్బావాయ్*_


_*తాత్పర్యము:-*_


ఆశ్చర్యకరములగు చేష్టలు కలవాడును, నిత్యము భగవత్సంబంధము గల ఉత్తరదేశమునందలి మథురానగరానికి నిర్వాహకుడును, పవిత్రము, అగాధమునగు జలముగల యమునానదిరేవే తనకు గురుతుగా కలవాడును, గోపవంశమున ప్రకాశించిన మంగళదీపము అయినవాడును, తల్లి యశోద గర్భమును ప్రకాశింప చేయునటులు త్రాడుచే కట్టబడి దామోదరు డైనవాడును నగు కృష్ణభగవానునివద్దకు మనము పవిత్రులై వచ్చి, పరిశుద్ధములగు పుష్పములతో నర్చించి, అంజలిఘ్హటించి, వాక్కుతో కీరించి, మనసార ధ్యానించినచో మన పూర్వసంచిత పాపరాశియు, ఆగామిపాపరాశియు అగ్నిలో పడిన దూదివలె భస్మమైపోవును. కావున భగవానుని నామములను పాడుడు.


*శ్రీమతే రామానుజాయ నమ:*

*శ్రీమన్నారాయణ రామానుజ యతిభ్యో నమ:*

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏