20, డిసెంబర్ 2025, శనివారం

మంచి వాళ్ళ సావాసం

  🌹మంచి వాళ్ళ సావాసం


అనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యంలో ఒక వేటగాడు వున్నాడు.అతను వేటకు వెళ్లి రెండు రామచిలుకలను పట్టి తెచ్చాడు.ఆ చిలుకలను రాజభవనానికి తెచ్చి రాజుకు బహుకరించాడు. ఆ రాజు ఈ చిలుకలను మంత్రికి మరియు సేనాధిపతికి ఇచ్చాడు.మంత్రికి,సేనాధిపతికి ఒక్క నిముషం కూడా పడదు . రాజు రామచిలుకకు ఎవరైతే మాటలు నేర్పిస్తారో వారికి బహుమతులు ఇస్తాను అని చెప్పాడు .మంత్రి ఇంటికి వెళ్లి భార్యతో దీనికి మాటలు నేర్పించు మనకు అన్ని బహుమతులు రావాలి అంటాడు అది విన్న మంత్రి భార్య ఎలా అండి అని అడిగింది. రాజు గారు దీనికి మాటలు నేర్పిస్తే బహుమతి ఇస్తా అన్నారు అంటాడు.

మంత్రి గారి భార్య సరే అంటుంది. సేనాధిపతి కూడా భార్యకు విషయం చెప్పి చిలుకను ఇస్తాడు.

మంత్రి భార్య ఒక సంగీతం నేర్పించే గురువు అవడం చేత అది అన్ని పాటలు ,పద్యాలు మంచి మాటలు నేర్చుకుంది. సేనాధిపతి భార్య పదవి ఉందని అహంకారంతో ఏ పని చేయకుండా అందరితో గొడ్డు చాకిరి చేయిస్తూ అందరిని తిడుతూ ఉంటుంది అది విన్న చిలుక ఆ మాటలు తిట్లు నేర్చుకుంది.మంత్రి ఎప్పుడు రాజు క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు కనుక చిలుక కూడా రాజు గారి మీద గౌరవం పెంచుకుంటుంది సేనాధిపతి రాజుకి వ్యతిరేకంగా ఇతర రాజులతో రహస్య సమావేశాలు నిర్వహించి రాజు పై దాడికి ప్రయత్నిస్తాడు. ఒకరోజున రాజుగారు ఆ రెండు చిలుకలని సభకు తేవలసిందిగా ఆదేశించాడు. వారిద్దరూ చిలుకలను తీసుకుని వచ్చారు,రాజు మంత్రి గారి చిలుకను అడిగాడు.ఎలా వున్నావు? అని దానికి ఆ చిలుక పద్దతిగా నేను బాగున్నాను. రాజు గారు మీరు ఎలా ఉన్నారు ?అని అడిగింది

రాజు కు సంతోషం కలిగింది.సేనాధిపతి చిలుకని ప్రశ్నించాడు రాజు దానికి ఆ చిలుక నేను ఎలా ఉంటే నీకు ఎందుకు అయిన మా సేనాధిపతి నీపైన దాడి చేయి స్తాడు .నువ్వు చస్తావ్ అని అంటుంది రాజు కి కోపం వచ్చి సేనాధిపతిని బంధిస్తాడు.


 మంచి వాళ్ళ సావాసం ఎప్పుడూ మంచే నేర్పుతుంది అందుకే అన్నారు పెద్దలు సహవాసదోషం అని అంటారు.చెడు మాటలు చేతలు తొందరగా ఆకర్షితం అవుతాయి. కనుక మంచే నేర్చుకోవాలి.🌹🌹🙏🏻🙏🏻🌹🌹

కామెంట్‌లు లేవు: