3, డిసెంబర్ 2025, బుధవారం

హనుమ సన్యాసి వేషములో

 హనుమ సన్యాసి వేషములో మొదటిసారిగా రామచంద్రమూర్తి దగ్గరకు వెళ్ళారు. రామలక్ష్మణులను చూడగానే అద్భుతమైన స్తోత్రము చేసారు. ప్రప్రధమ సమావేశములో హనుమ మాటలు విని, ఆ వాగ్వైభావము చూసి 


రాముడు నా సృగ్వేదవినీతస్య నా యజుర్వేదధారిణః | నా సామవేదవిదుషః శక్యమేనం ప్రభాషితుం |


చూడు లక్ష్మణా! ఎలా మాట్లాడాడో! ఆ మాట తీరు చూడు! ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము చదువుకున్నవాడు తప్ప ఇలా మాట్లాడ లేడు. అనగా ఆయన ఉద్దేశ్యము సామవేదము శాంతిని ఇస్తుంది. యజుర్వేదము మంత్రముల చేత దేవతల యొక్క అనుగ్రహమును క్రతు రూపములో సాధించిపెడుతుంది. ఋగ్వేదము సూక్త రూపములో ఉంటుంది. ఆ మూడూ ప్రసన్నము చేసుకోవడానికి ఎలా ఉపకరణములుగా ఉంటాయో అలా ఆయన యొక్క మాట తీరు ఉన్నది. వాటిని సమగ్రముగా విచారణ చెయ్యనివాడు కార్య సాధకుడై ఇలా మాట్లాడలేడు అని ఎంతో కోపముతో ఉండి కత్తి ఎత్తిపెట్టి చంపేద్దామని పొడిచేస్తున్నవాడు కూడా ఇటువంటి

వ్యక్తి మాట్లాడితే కత్తి దింపేస్తాడు. ఎంత గొప్ప మాట? ఎటువంటి వాగ్వైభవము? ఈయనను అభినందించాలి ఆదరించాలి. హనుమ మాటల వలన రామ లక్ష్మణులకు హనుమకు సయోధ్య కుదిరింది.🙏🏻🙏🏻🙏🏻

కామెంట్‌లు లేవు: