3, డిసెంబర్ 2025, బుధవారం

ఆణిముత్యాలు

  *ఆణిముత్యాలు:*

మనుషుల్లో మార్పు సహజం.

ఎలా మారాలనేది...

వివేకం చెబుతుంది.

ఎప్పుడు మారాలనేది...

అనుభవం చెబుతుంది.

ఎందుకు మారాలనేది...

అవసరం చెబుతుంది.


పరిస్థితులు కఠినమైనా సరే,

మనం, నిజాయితీ గా ఉండడమే...

నిజమైన వ్యక్తిత్వం.


జీవితంలో ఎదగాలంటే, రెండు కావాలి!.

నేర్చుకునే సంకల్పం,

ఓర్చుకునే సహనం.

ఇవి ఉన్నప్పుడు గమ్యం...

ఒక రోజు తప్పక చేరుతుంది.


ఆవేశానికి...ఆలోచన ఎంత ముఖ్యమో!,

ఆశయానికి... సాధన అంతే ముఖ్యం!!.


గడియారం..దుకాణంలో ఉంటే రేటు,

ఇంట్లో ఉంటే, టైమ్!,

దేనికైనా విలువ రావాలంటే...

సరైన ప్రదేశంలో ఉండాలి!.


మనిషి కోసం...

కోపాన్ని వదులుకోవాలి!,

కానీ, కోపం కోసం...

మనిషిని వదులుకోవద్దు!.


మంచివాడు...

శత్రువుకీ సహాయం చేస్తాడు!,

చెడ్డవాడు...

తోడబుట్టిన వారినీ ముంచుతాడు.


*సర్వేజనాః సుఖినో భవంతు.*

శుభ సౌమ్య వారం 🌹Happy Wednesday

కామెంట్‌లు లేవు: