*300 వ్యాధులకు అద్భుతమైన సంజీవిని మన “మునగ ఆకు!”*
➖➖➖✍️
```
#మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే. అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది.
#అసలు 4,5వేల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో వినియోగిస్తున్నారంటే ఆ ఆకు గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది.
#ఆయుర్వేదంలో 300లకుపైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు.
#అందుకే దీనిని సాంప్రదాయకైన మందుగానూ చెబుతుంటారు మన పెద్దలు.```
#మునగాకులో ఉన్న అద్భుతమైన అద్భుతమైన ఔషద గుణాలు:```
#మునగాకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి.
#క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ Aని పదిరెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందొచ్చు.
#కళ్ల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ లో మునగాకును వాడతారు.
#పాల నుంచి లభించే క్యాల్షియం కన్న 17రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది.
#పెరుగు నుంచి పొందే ప్రోటీన్లను 8రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు.
#అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం 15రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చు.
#మహిళలు రోజుకి 7గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్ గా తీసుకుంటే 13.5శాతం బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గాయని పరిశోధనల్లో తేలింది.
#ఐదు రకాల క్యాన్సర్లకు అద్భుత ఔషదం మునగాకు. లంగ్, లివర్, ఒవేరియన్, మెలానోమా వంటి క్యాన్సర్లను నిరోధించే సత్తా ఉందని తాజా పరిశోధనల్లో తేలింది.
#యాంటీ ట్యూమర్ గానూ ఆకు వ్యవహరిస్తుంది.
#థైరాయిడ్ ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు.
#మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్ లో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తుందట.
#మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి.
#మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో
ఈ విటమిన్లు వుండవు.
#అలాగే కాల్షియం, పాస్పరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా వుంటాయి.```
#వందగ్రాముల మునగాకులో వుండే పోషక పదార్థాలను ఒక్కసారి పరిశీలిద్దాం:```
నీరు – 75.9 శాతం.
పిండి పదార్థాలు – 13.4 గ్రాములు.
ఫ్యాట్స్ – 17 గ్రాములు.
మాంసకృత్తులు – 6.7 గ్రాములు
కాల్షియం – 440 మిల్లీ గ్రాములు.
పాస్పరస్ – 70 మిల్లీ గ్రాములు
ఐరన్ – 7 మిల్లీ గ్రాములు.
‘సి’ విటమిన్ – 200 మిల్లీ గ్రాములు.
ఖనిజ లవణాలు – 2.3 శాతం.
పీచు పదార్థం – 0.9 మిల్లీ గ్రాములు.
ఎనర్జీ – 97 కేలరీలు..```
#ఔషధ విలువలు అద్భుతం```
#ప్రారంభ దశలో వున్న కీళ్ళ నొప్పులకు మునగాకు దివ్య ఔషధం. #మునగాకును నూరి కట్టుకడితే తగ్గిపోతాయి.
#మునగాకును నూరి లేపనంగా రాయడం, కట్టు కట్టడం ద్వారా చర్మరోగాలు, వ్రణాలు నివారణ అవుతాయి.
#మునగాకు రసాన్ని సేవించడం ద్వారా దృష్టి మాంద్యము, రేచీకటి తొలగిపోతాయి.
#మునగ ఆకులలో అమినో ఆమ్లాలు వుంటాయి. అందువల్ల మాంసకృత్తుల లోపాల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు.
#గర్భిణులకు, బాలింతలకు మునగాకు రసం అమృతంతో సమానం.
#మునగాకు రసాన్ని దోసకాయ రసంతో కలిసి ప్రతిరోజూ సేవిస్తే గుండె, కాలయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు క్రమంగా తొలగిపోతాయి.
#మునగ రసం రక్తహీనతను నివారిస్తుంది.
#మునగాకుతో మరికొన్ని ఉపయోగాలు:
#మునగాకుల రసాన్ని పాలలో కలసి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి.
#గర్భిణులు, బాలింతలకు ఇస్తే వారికి అవసరం అయిన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.
#తల్లులతోపాటు, పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా వుంటారు.
#పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి.
#గుప్పెడు మునగాకులను వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా, టీబీ, దగ్గు తగ్గుతాయి.
#మునగాకు రసం ఒక చెమ్చా తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరినీళ్ళలో కలిపి, కాస్తంత తేనె కలిపి ఇస్తే విరోచనాలు తగ్గిపోతాయి.
#మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి.
#ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయిని. అలాంటివారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంగా ఉపయోగిస్తూ వుంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది.```
మరి ఇన్ని మంచి లక్షణాలున్న మునగాకును నిర్లక్ష్యం చేయడం తగునా..✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి