🙏సర్వేజనాః సుఖినోభవంతు: 🙏
🌺శుభోదయం🌺
🏵️ నేటిపెద్దలమాట 🏵️
మనము మన పనిని ఫలితము ఆశించకుండా నిర్వర్తించాలి అనేది గీత చెప్పే మొదటి పాఠము. ఫలితము ఆశించకుండా మనస్ఫూర్తిగా పనిని నిర్వర్తిస్తే ఫలితము దానంతట అదే సిద్ధిస్తుంది అని గీత భోధిస్తుంది.
🌹 నేటిమంచిమాట 🌹
శరీరము శాశ్వతము కాదు ఆత్మ మాత్రమే శాశ్వతము. మన శరీరము ఒక వస్త్రము వంటిది. వస్త్రము చినిగిపోయిన తరువాత కొత్త వస్త్రము ధరించినట్లు, ఆత్మ ఒక శరీరాన్ని వదలి కొత్త శరీరాన్ని ప్రవేశిస్తుందని కృష్ణ భగవానుడు చెపుతాడు.
🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺
పంచాంగం - 02 డిసెంబర్ 2025 - మంగళవారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం - హేమంత ఋతువు
మార్గశిర మాసం - శుక్లపక్షం
సూర్యోదయం - ఉ. 6:34
సూర్యాస్తమయం - సా. 5:36
తిథి - ద్వాదశి మ. 3:52 వరకు
తరువాత త్రయోదశి
సంస్కృత వారం - భౌమ వాసరః
నక్షత్రం - అశ్విని రా. 8:46 వరకు
తరువాత భరణి
యోగం - వారియ రా. 8:58 వరకు
కరణం - భాలవ మ. 3:52 వరకు, భాలవ మ. 3:52 వరకు
వర్జ్యం - తె. 5:18 నుండి ఉ. 6:43 వరకు
దుర్ముహూర్తం - రా. 10:47 నుండి రా. 11:39 వరకు, రా. 10:47 నుండి రా. 11:39 వరకు
రాహుకాలం - మ. 2:51 నుండి సా. 4:13 వరకు
యమగండం - ఉ. 9:20 నుండి ఉ. 10:42 వరకు
గుళికాకాలం - మ. 12:05 నుండి మ. 1:28 వరకు
బ్రహ్మ ముహూర్తం - తె. 4:58 నుండి తె. 5:46 వరకు
అమృత ఘడియలు - మ. 2:23 నుండి మ. 3:49 వరకు
అభిజిత్ ముహూర్తం - ఉ. 11:43 నుండి మ. 12:27 వరకు
🌺🌿🌺🌺🌿🌺🌺🌿🌺🌺🌿🌺
🙏🍃🍃ఓం అంజనీ సుతాయ విద్మహే🍃🍃వాయుపుత్రాయ ధీమహి🍃🍃తన్నో మారుతిః 🍃🍃ప్రచోదయాత్!🍃🍃🍃💦🍌🍌🍌🍌🍌💦🙏
హనుమ నేర్పిన నీతి...
🍁🍁🍁🍁
సాక్షాత్తు భగవంతుడిని కూడా ప్రశ్నించవచ్చా? ఎవరిని.. ఎలా అడగాలి? అన్న ప్రశ్నలకు హనుమంతుడు ఒక సమాధానంగా నిలుస్తాడు.
సీతాదేవిని రావణుడు అపహరించిన తర్వాత ఆమెను వెదుకుతూ రామలక్ష్మణులు రుష్యమూక పర్వత ప్రాంతానికి చేరుకుంటారు.
సుగ్రీవుడి నివాస ప్రాంతం అది. తనను చంపడానికి తన అన్న వాలి వీరిని పంపించారా అని అనుమానించి, విషయం తెలుసుకునేందుకు తన మంత్రి అయిన హనుమంతుడిని పంపుతాడు.
మారుతి మారు వేషంలో రామలక్ష్మణుల దగ్గరకు వచ్చి అనేక విధాలుగా ప్రశ్నిస్తాడు.
‘రాజర్షి దేవ ప్రతిమౌ తాపసౌ సంశితవ్రతౌ! దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ!!’
మీరిద్దరూ మంచి తేజోవంతుల్లా, తీవ్రమైన తపోదీక్ష పట్టిన వారిలా ఉన్నారు. మీ రూపం తాపసుల్లా ఉన్నా మీ తేజం క్షత్రియత్వాన్ని సూచిస్తోంది. గొప్ప పని ఉంటే తప్ప మీవంటి యోధులు క్రూరమృగాలు సంచరించే ఇలాంటి చోటుకు రారు’ అని ప్రశ్నిస్తాడు హనుమ.
ప్రశ్న అంటే ఇలా ఉండాలి. ఒక్క అక్షరం ఎక్కువ తక్కువ కాకుండా ప్రశ్నలు వేశాడు హనుమ.
ఇంత కాలం తాను ఎవరి గురించి ఎదురు చూస్తున్నాడో ఆ దైవం ఎదుట నిలబడినప్పుడు హనుమ తొందరపడలేదు. వచ్చింది ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశాడు.
ఎంత గొప్పగా ప్రశ్నించాడంటే రాముడే ముచ్చటపడ్డాడు. వ్యాకరణ పండితుడు తప్ప మరొకరు ఇలా మాట్లాడలేడన్నాడు. హనుమ ప్రశ్న స్వీకరించిన వ్యక్తి కూడా ఆనందపడేలా అడిగాడు..
మనం కూడా మన సందేహాన్ని ప్రశ్నను కూడా గొప్పగా అడగ గలగాలి..
జై హనుమాన్..
🍁🍁🍁🍁
🙏సమస్త లోకాః సుఖినోభవంతు🙏
🌺శుభమస్తు🌺
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి