3, డిసెంబర్ 2025, బుధవారం

నమస్కార ఫలం:*

 

            *నమస్కార ఫలం:*

                ➖➖➖✍️

```

ఒక భక్తుడు దేవునికి ఇలా నివేదించుకుంటున్నాడు...   

“స్వామీ నేను చేసిన రెండు తప్పులను క్షమించి కాచు!” అని సాష్టాంగపడి నమస్కారపూర్వకంగా అంటున్నాడు.


రెండు తప్పులు ఏమిటి అంటే:             


౧. నేను గత జన్మలో నీకు నమస్కారం చెయ్యలేదు, చేసి ఉన్నట్లయితే నాకు ఈ జన్మ ప్రాప్తించేది కాదు..!

కాబట్టి ఈ జన్మలో నీకు భక్తి పూర్వకంగా నమస్కరించుకుంటున్నాను.



రెండవ తప్పు: 


నేను మరొక జన్మలో నీకు నమస్కారం చెయ్యలేను... 

ఎందుకంటే ఈ జన్మలో నమస్కరిస్తున్నాను కాబట్టి నాకు మరు జన్మ లేదు.


*కాబట్టి...


ఉత్తరోత్తరా జన్మల ప్రశ్నే లేదు, కావున నా ఈ రెండు మహాపరాధాలను క్షమించి కాచుకో! అని అర్ధిస్తున్నాడు...



మన భక్తి కూడా ఇలా వుండాలి, మనమూ చేస్తున్నాము రోజూ నమస్కారం...


అదొక సాధారణ క్రియగా మారింది తప్ప త్రికరణ శుద్ధిగా చేస్తున్నామా? 


మనం త్రికరణ శుద్ధిగా నమస్కరించినప్పుడు మనము కూడా ఆ భక్తుని స్థితికి చేరుకుంటాము, కదా...!!


శివభుజంగ స్తోత్రంలో శంకరులు ఇలా అంటారు...


నేను పశువు సమానుడను, నువ్వు పశుపతివి, పశువు అయితే కాచవా అంటే నీ వాహనం నంది...


కావున నువ్వు నన్ను కాచి కాపాడాలి.


కాదు నేను పశువు కన్నా హీనుడవందువా నన్ను కాస్తేనే నీకు దరిద్రజన పోషక అన్న నామం సార్ధకమవుతుంది. 


నేను అపరాధాల చక్రవర్తిని, నన్ను కాచి నీ నామం స్థిరం చేసుకో, పోనీ పాపులను నువ్వు కాపాడవా అంటే అత్యంత హేయమైన పనులు చేసిన చంద్రుడిని నువ్వు నెత్తిన పెట్టుకున్నావు.


తన భార్యలందరినీ ఒక్కమాదిరి చూసుకుంటానని మాటిచ్చి తప్పి, స్వయంగా తన గురు పత్నినే అపహరించిన చంద్రుడు అత్యంత ఘోరమైన తప్పులు చేసిన వాడు.

అతడినే నువ్వు రక్షించ గలిగినప్పుడు నన్ను బ్రోచి కాపాడు మహేశ్వరా!’అని వేడుకుంటాడు...


మనం కూడా త్రికరణ శుద్ధిగా ఆయనకు ‘సర్వస్య శరణాగతి’ చేసి ఆయనను వేడుకుంటే తప్పక కాపాడతాడు, రక్షిస్తాడు, ఉద్ధరిస్తాడు...✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

కామెంట్‌లు లేవు: