*ఆచార్య సద్బోధన*
➖➖➖✍️
```
మానవుడు భగవంతుని అనుగ్రహం కోసం నిరంతరం తాపత్రయ పడుతుంటాడు. అయితే భగవంతుని అనుగ్రహం పొందాలంటే మనం ఏమి చేయాలి?
కృతయుగంలో తపో ధ్యాన యోగ సాధనలు ఆచరిస్తూ సత్యానికి పట్టం కట్టారు.
త్రేతాయుగంలో ధర్మమే ఆచరణ అయింది. అది ధర్మయుగమైంది.
ద్వాపరయుగానికి వచ్చేటప్పటికి అర్చన, ఆరాధనలు ఏర్పడ్డాయి. దానివలన శాంతి, ప్రేమలు నెలకొన్నాయి.
కృతయుగం నాటి సత్యం, త్రేతాయుగం నాటి ధర్మం, ద్వాపరయుగంనాటి శాంతి, ప్రేమలకు ఈ కలియుగంలో అహింసను జతచేసి భగవానుడు మనకు సరికొత్త సులువైన సాధన మార్గాన్ని చూపించాడు. భేదభావము చూపక ప్రేమతో అందరినీ సేవించడమే భగవంతుడు చూపిన ఆ ఏకైక మార్గం. భగవంతుని అనుగ్రహం పొందడానికి ఇదే అసలైన రాచబాట.
కలియుగంలో అందరూ ధ్యానం చేయలేరు. యోగం చేయలేరు, యజ్ఞం చేయలేరు. అందుకే భగవంతుడు స్మరణ, సేవ అనే సులువైన అనువైన సాధన మార్గాలు చూపించాడు.
మానవ జీవితములను తరింపజేసే సాధన మార్గాలివి. కనీసం వీటినైనా అచరిస్తూ జీవితములను సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
ఇలాంటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి