17, ఆగస్టు 2023, గురువారం

స్వతంత్ర భారతం -

 ॐ 76 సంవత్సరాల స్వతంత్ర భారతం - 

                ఆత్మవిమర్శ చేసుకొనే విషయాలు 


3. లౌకికత - మతము - సంస్కృతి 


    42వ రాజ్యాంగ సవరణ ద్వారా, రాజ్యాంగ ప్రవేశికలో చేర్చుకొన్న "సామ్యవాద, లౌకిక" అనే రెండు పదాలలో "లౌకిక" అంటే ముందు తెలుసుకోవాలి. 


లౌకిక


    లౌకిక దేశమనగా ప్రజలకు, ప్రభుత్వానికి గల అనుసంధానం కేవలం రాజ్యాంగం, చట్టం న్యాయం ద్వారా ఉండాలి. 

    ప్రజల మతాల ఆధారంగా ఎక్కువ తక్కువలు ఉండవు. 

    అన్ని మతాలు సమానంగా గౌరవించబడతాయి. 

    దేశానికి అధికార మతమంటూ ఏదీ లేదు. 

    పౌరులందరూ వారికి ఇష్టమున్న మతాన్ని నమ్మి, ఆచరించి, పెంపొందించుకోవచ్చు. 


మతం - స్వామి వివేకానంద 


    మతం అనేది వ్యక్తిగతమనీ, అది సామాజికం కాదనీ స్వామి వివేకానంద తమ లేఖలలో ఒకదానిలో క్రిందివిధంగా పేర్కొన్నారు. 


    Specially therefore you must bear in mind that 

    religion has to do only with the soul and 

    has no business to interfere in social matters. 

    you must also bear in mind that 

    this applies completely to the mischief which has already been done. 

    It is as if a man after forcibly taking possession of another's property, 

    cries through the nose when that man tries to regain it and 

    preaches the doctrine of the sanctity of human right! 

 

    ఈ సందర్భంగా కొన్ని ఉదాహరణలు పరిశీలించాలి. 


అ) ఇండోనేషియా సైన్యం - హనుమంతుడు 


    ఇండోనేషియా ఒక ముస్లిందేశమని అందరికీ తెలిసిన విషయమే! 

    వాళ్ళు సైన్య శిక్షణాంతరం ఉండే passing out paradeకి, పాక్ ఆనాటి నియంత జియావుల్ హక్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. 

    ప్రతి అధికారీ హనుమంతుని విగ్రహం ముందు పెరేడ్ చేస్తున్నాడు. శపథం స్వీకరిస్తున్నాడు. 

    ఇది చూసిన జియావుల్ హక్ కు ఒళ్ళు మండిపోయింది. 

    అక్కడి సైన్యాధికారిని ఇదేమిటని అడిగాడు. 

    ఆ సైన్యాధికారి ఎంతో గర్వంతో " మేము మతాన్ని మార్చుకొన్నామేగానీ, మా సంస్కృతీనీ, పూర్వులనీ మార్చుకోలేదు కదా!" అని  సమాధానమిచ్చాడు. 

    

ఆ) రామాయణం - నెహ్రూ లౌకికత 


    1950 దశకంలో ఇండోనేషియాలో "అంతర్రాష్ట్రీయ - రామాయణ మహోత్సవం" జరిగింది. 

    అందులో భాగంగా జరిగే  నృత్యనాటిక ప్రదర్శనలకి కళాకారుల బృందాలని  పంపమని ఆ దేశం ఆహ్వానిస్తే, 

    అప్పటి మన ప్రధాని నెహ్రూ, "మనది సెక్యులర్ దేశమనీ, అందువలన కళాకారులను పంపడం కుదరదనీ" తెలిపాడు. 

    మన సంస్కృతీ పరిరక్షణకన్నా, రాజ్యంగంలో అప్పుడు లేని "లౌకికత్వం" తనకి ముఖ్యమైంది. 


ఇ) ఇందిర ప్రభుత్వం - మహమ్మదీయం లౌకికత 


    మొరాకోలో జరిగిన అంతర్రాష్ట్రీయ ముస్లిం సమ్మేళనానికి, ఆహ్వానం లేకపోయినా, ఇందిర ప్రభుత్వం, 

    కేంద్రమంత్రి ఫక్రుద్ధీన్ ఆలీ అహ్మద్ ని పంపింది. 

   చాలా ముస్లిం దేశాలకన్నా మన దేశంలో ముస్లిం జనాభా ఎక్కువట. అందువలన పంపించక తప్పలేదని తన చర్యని సమర్ధించుకొంది. 


పరస్పర విరుద్ధాలు 


(i) నెహ్రూ ప్రధానిగా రామాయణం మతపరమైనదని, లౌకికం ప్రదర్శించడం. 

(ii) ఆయన కుమార్తె ఇందిర, ప్రధానిగా ప్రభుత్వం తరఫునే ముస్లిం సమ్మేళనానికి ప్రతినిధిని పంపడం. 


ఈ) ప్రస్తుతం మనముందు 


    2016 సంవత్సరం ఇండోనేషియా దేశ, విద్య మరియు సాంస్కృతీ శాఖ మంత్రి అనీస్ - బాస్వేదన్ 

    మన దేశం వచ్చి అన్న మాటలు అందరూ తెలుసుకోవాలి. 

   "మా దేశం రామాయణ ప్రదర్శనలకు పెట్టిందిపేరు. 

    మా కళాకారులు సంవత్సరంలో రెండుసార్లు మీ దేశంలో వివిధ నగరాలలో పర్యటించి రామాయణ ప్రదర్శనలు చేయడానికి అనుమతించండి. 

    మీ కళాకారులు కూడా మా దేశానికి రండి. 

    ఇరు దేశాలూ కలిసి ప్రదర్శనలిద్దాం. 

    ఇరు దేశాల విద్యార్థులకూ శిక్షణనిద్దాం. 

    మా విద్యావిధానంలో రామాయణాన్ని చేర్చాం" అన్నారు. 


మన సమస్య 


    మనం "లౌకిక" అనే పేరుతో, "మత నిరపేక్ష" నుండీ "ధర్మ - సంస్కృతీ నిరపేక్ష" దేశంగా మారిపోయాం. 

    మన ధర్మ - సంస్కృతులను మనమే నిర్లక్ష్యం చేస్తున్నాం. 


కారణం - పరిష్కారం 


    మహమ్మదీయం, క్రైస్తవం అనే మతాలు ఏర్పడిన కాలాలలో, 

    ఆయా ప్రదేశాలోని సంస్కృతీ ఆచారాలే, ఆయా మతాలకి సంక్రమించాయి. 

    కానీ, భారతీయ ధర్మమూ - సంస్కృతులూ మతాలకి చెందినవికావు. 


    కాబట్టి, 

    మతాలని, సంస్కృతీ - ధర్మాలనుంచీ వేరుచేసి, 

    సంస్కృతీ - ధర్మాలకి చెందిన రామాయణం "లౌకికం" అని నిర్థారించుకొంటే, 

    రాజ్యాంగ ప్రవేశికలో చేర్చబడ్డ "లౌకిక" అనే పదం, 

    దేశంలో ప్రధాన సమస్యకి పరిష్కారంగా అయిపోతుంది కదా! 


                                 సశేషం 


              భారత్ మాతాకీ జై 

                వందే మాతరమ్  


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

కామెంట్‌లు లేవు: