30, అక్టోబర్ 2020, శుక్రవారం

రామాయణమ్.107

 రామాయణమ్.107

.

రామా ! నిన్ను దుఃఖము బాధించదు ,

సుఖము సంతోషపెట్టదు .

నీలాంటి వాడు ముల్లోకాలలో ఎవడైనా ఉన్నాడా? 

నీవు పెద్దలను గౌరవించే స్వభావము 

కలవాడవు .

నీ సంశయములను పెద్దలవద్ద నివృత్తి చేసు సుకొనుటకు వారి వద్దకే వెళ్ళి వారిని అడిగి తెలుసుకుంటూ ఉంటావు..

.

బ్రతికిఉన్నవారిపట్లకానీ,

మరణించినవారిపట్లకానీ ,

మంచివాడి విషయంలోకానీ,

చెడ్డవాని విషయంలోకాని 

రాగద్వేషాలు లేని బుద్ధి నీది 

అట్టి నీకు ఈ లోకంలో దుఃఖము కలిగించేది ఏది?

.

ఓ మహాత్మా ! రామా! నీకు దేవతలతో సమానమైన బలమున్నది,సత్యప్రతిజ్ఞ ఉన్నది,

అన్నీ తెలిసినవాడవు,బుద్ధిమంతుడువు

 నీ వంటి వాడు ఇంత కష్డపడవలసిన అవసరములేదు.

.

నేను ఇంటలేనప్పుడు నా తల్లి చేసిన పాపకార్యమునకు నా సమ్మతి లేదు. అది నాకు ఎంత మాత్రము ఇష్టము కాదు .నన్ను అనుగ్రహింపుము.

.

ధర్మమునకు భయపడి మాత్రమే తీవ్రమైన దండనకు అర్హురాలైన నా తల్లిని దండింపకున్నాను. లేనిచో వధించియుండెడి వాడను.అది లోక నిందితమైన అకార్యము ! .కావున చేయజాలకున్నాను.

.

మన తండ్రి దశరథ మహారాజు నాకు గురువు ,క్రియాశీలుడు,వృద్ధుడు,ఇప్పుడు మరణించినాడు కావున నిందించలేకున్నాను.

.

ఓ రామా ధర్మము నీకు తెలుసు ! ధర్మజ్ఞుడైన వాడు ఎవడైనా ఒక ఆడుదానిని సంతోషపెట్టడానికి పాప కార్యాలు చేస్తాడా? 

వినాశ కాలే విపరీత బుద్ధి! వినాశము దాపురించింది కాబట్టే ఆయనకు ఈ బుద్ధి కలిగింది.

.

నీకు కర్తవ్యమేదో అకర్తవ్యమేదో బాగా తెలుసు .నీవు మన తండ్రిగారు చేసిన ధర్మవిరుద్ధమైన కార్యమును వెనుకకు మరల్చుము.

.

రామా ! అరణ్యవాసమునకు ,క్షత్రియధర్మమునకు ఎక్కడైనా పోలిక ఉందా? 

జటలు ధరించి తాపసవృత్తిలో సుక్షత్తియుడైన నీవంటి వాడు రాజ్యపాలనము చేయకుండ ఉండవచ్చునా?

.

నేను విద్యచేత,స్థానముచేత,పుట్టుక చేత,నీకంటే చిన్నవాడనయ్యా! నెనెట్లా పరిపాలించగలనని అనుకున్నావు? నేను నీ దాసుడను .నీవు లేకున్నచో జీవించవలెనని కూడ నేను అభిలషించను .

.

ఓ రామా ! ఇప్పుడే నిన్ను రాజ్యాభిషిక్తుడను గావించడానికి పురోహితులంతా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. 

.

నేను శిరస్సు వంచి ప్రార్ధిస్తున్నాను నా మీద దయచూపు!

.

అని నీరునిండిన కనులతో రాముడిని వేడుకుంటున్నాడు భరతుడు.

.

భరతుండెంతగా ప్రార్ధించినప్పటికీ తండ్రి మాటమీదనే స్థిరముగా నిలిచాడు రామచంద్రుడు.

.

వూటుకూరు జానకిరామారావు 


రామాయణమ్. 108/109

..

రాముడు గంభీరంగా చెపుతున్నాడు.గొంతులో ఒక స్థిరత్వం మాటలో పటుత్వం కలగలసి వస్తున్నాయి. ఆయన వాక్కులు దృఢంగా ఉన్నాయి..

.

నీచులు ,క్రూరులు,పాపాత్ములు,దురాశాపరులు,సేవించేటటువంటిది అధర్మముతో నిండినదీ అయిన క్షత్రియధర్మమును నేను పరిత్యజించెదను.

.

మనిషి చేసే పాపము, ముందు అతని మనసులో పుడుతుంది, ఆతరువాత శరీరము ఆ పాపకర్మ చేస్తుంది .

.

 నాలుక అబద్ధమాడుతుంది . ఈ విధముగా పాపము మూడు విధాలుగా ఉంటుంది. ..

ఒకటి .మానసికము,,

రెండు..శారీరికము.,, మూడు ..వాచికము.

.

జాబాలీ ! నీవు శ్రేష్ఠము అని నాకు చెప్పినదంతా కూడా చెడ్డదే!

.

నా తండ్రిగారి ఎదుట చేసిన ప్రతిజ్ఞ కాదని ఇప్పుడు భరతుడి మాటలను ఏల పాటించగలను?

.

నా తండ్రి ఎదుట చేసిన ప్రతిజ్ఞ స్థిరమైనది! అప్పుడు కైకేయీ దేవి కూడ సంతసించినది.

.

నేను పరిశుద్ధుడనై ,మితభోజనము చేయుచు ,పవిత్రములైన కందమూలఫలములతో ,పితృదేవతలను తృప్తి చెందించుతూ ,సంతుష్టి చెందిన పంచేద్రియములు కలవాడనై ,కపటము విడనాడి(Without Hypocrisy)

శ్రద్ధావంతుడనై కార్యాకార్యములు తెలుసుకుంటూ వనవాసజీవితము గడిపెదను.

.

దేవతలందరును ధర్మసమ్మతమైన శుభకార్యములు చేయుటవల్లనే ఆయా పదవులు పొందగలిగారు.

.

నాస్తికత్వముతో కూడిన జాబాలి మాటలను నిర్ద్వంద్వముగా ఖండించాడు రాముడు .

.

అసలు నీలాటి వారిని చేరదీసిన నా తండ్రిని నిందించవలె నిన్నుకాదు .

సత్యము ,ధర్మము,పరాక్రమము,భూతదయ,ప్రియవాక్కు,

దేవబ్రాహ్మణ ,అతిధులపూజ ..ఇవి స్వర్గానికి మార్గములని సత్పురుషులు చెపుతున్నారు.

.

రాముడి ఆగ్రహన్ని చూసిన జాబాలి ,రామా! నేను నాస్తికుడను కాను నిన్ను అయోధ్యకు మరల్చవలెననే ఉద్దేశ్యము తప్ప వేరే ఏదియును లేదు. 

.

రాముడికి కోపము వచ్చినదని గ్రహించిన వశిష్ఠులవారు ఆయనకు ఇక్ష్వాకుల చరిత్ర అంతా తెలిపి ,ఇక్ష్వాకులలో జ్యేష్ఠుడే రాజు ! అదే ధర్మము అని తెలిపి శాంతింపచేశారు.అతి ప్రాచీనమైన మీ కుల ధర్మాన్ని నీవు చెరచవద్దు అని హితబోధ చేశారు.

.

రామా నేను నీకు, నీ తండ్రికి ఆచార్యుడను ,నేను చెప్పిన విధముగా చేసినచో నీవు ధర్మమార్గమును అతిక్రమించినవాడివి కాజాలవు.

.

జానకిరామారావు వూటుకూరు



.

రామాయణమ్ 106

 రామాయణమ్ 106

.

తండ్రి మరణవార్త విని మొదలు నరికిన చెట్టులా కూలపడి బాలుడిలా రోదించసాగాడు రాముడు.

నా తండ్రి లేని అయోధ్యతో నాకేమి పని ? అరణ్యవాసము అయిన పిదపకూడ నేను అయోధ్యలో కాలు పెట్టను.నాకిక మంచిమాటలు చెప్పేవారెవ్వరు? అయ్యో నేనెంత నష్ట జాతకుడను, నా వలన దుఃఖిస్తూ నా తండ్రి మరణించినాడే ! కడసారి చూపుకు కూడా నోచని వాడనైనానే ! భరతా ! నీవు శత్రుఘ్నుడు ఎంతో పుణ్యము చేసినారు కావున తండ్రిగారి అంత్యక్రియలు గావించగలిగినారు. అని దుఃఖిస్తూ ఉన్న రాముడికి కర్తవ్యం గుర్తు చేశాడు భరతుడు.

.

సుమంత్రుడు వెంటరాగా రామలక్ష్మణులు ఇరువురూ కొండదిగి మందాకినిని సమీపించారు. బురదలేకుండా నిర్మలంగా ఉన్న రేవు చూసుకున్నారు. సుమంత్రుడు సాయం చేయగా అందులో మునకలు వేసి తండ్రికి జలతర్పణాలు విడిచి.ఇంగుదీకాయలపిండితో పిండప్రదానము చేసి భారమైన హృదయంతో మరల కొండ ఎక్కి తమ పర్ణశాలను చేరుకున్నారు.

.

అక్కడ అన్నదమ్ములు మరల ఒకరి నొకరు కౌగలించుకొని బిగ్గరగా రోదించసాగారు. వారి రోదనలధ్వనికి మొత్తం అడవి అంతా కలతచెందింది.

.

ఏడుస్తున్న వీరిని తల్లులు దగ్గర చేరి ఓదార్చసాగారు.

.

కౌసల్యా మాత రాముని దగ్గరకు తీసుకొని ఆయన వంటికి అంటివున్న దుమ్ము ను మెల్లగా తుడుస్తూ ఆయన వీపు నిమరసాగింది.

.

రాముడు అంత అక్కడ కు వచ్చియున్న జనులందరినీ పలకరించి కొందరిని కౌగలించుకొని వశిష్ఠమహర్షికి పాదాభివందనం చేసి ఆయన ప్రక్కన కూర్చున్నాడు.

అప్పుడు భరతుడు ,లక్ష్మణ,శత్రుఘ్నులు అందరూ అన్నప్రక్కనే ఆసీనులైనారు.

.

నిశ్శబ్దం తాండవిస్తున్నది అందరు జనమంతా కూడా రాముడు ఏం చెపుతాడా అని ఆసక్తిగా ఎదురు చూడసాగారు.

.

ఆ రాత్రి అంతా మరల రోదనలతోనే గడచిపోయింది! 

మెల్లగా అందరూ హోమజపాదులు పూర్తిచేసుకొని మరల రాముని వద్దకు చేరారు.

.

మౌనాన్ని చీలుస్తూ భరతుడు అన్నమాటలు అందరికీ వినిపించాయి.

.

అన్నా ! నా తల్లిమాట మన్నించి నాకు రాజ్యమును ఇచ్చావు .దానిని నీకే తిరిగి ఇచ్చివేయుచున్నాను .స్వీకరించు ! నిష్కంటకమైన రాజ్యాన్ని ఏలుకో! సువిశాలమైన ఈ సామ్రాజ్యాన్ని ఏలగల సమర్ధుడవు నీవే ! మాకెవ్వరికీ అంత సమర్ధత లేదు.

.

నీ గమనము గరుడపక్షి వంటిది మేమో మామూలు పిట్టలవంటి వారము .నిన్ను అనుసరించే శక్తికూడా లేని వారము.అని భరతుడు పరిపరివిధాలుగా అన్నను ప్రార్ధించాడు,రోదించాడు

.

అప్పుడు రాముడు, భరతా!నీవు ఈ విధంగా రోదించడం తగదు.

.

మనిషికి స్వాతంత్ర్యము కానీ, తన ఇష్టము వచ్చినట్లు పనులు చేసే సామర్ధ్యము కానీ లేవు. ప్రతి ఒక్కడినీ దైవము అటూ ఇటూ లాగుతుంటుంది.

.

ఎంత పోగు చేసుకున్నా ధనము నశిస్తుంది ఎంత ఉన్నతి పొందినా ప్రతిఒక్కడునూ పతనము చెందవలసినదే .( you can't always be on the crest of success). 

.

మనుష్యుల పరస్పర సంబంధాలు విచ్ఛిన్నం అయితీరవలసినదే! 

పుట్టిన వాడు మరణించవలసినదే! 

( Inevitabilities of LIFE).

.

పండిన పండ్లకు చెట్టునుండి రాలిపోవడమే భయము.

అట్లే పుట్టిన మనిషికి గిట్టుట ఒకటే భయము.

.

ఎంత బ్రహ్మాండమైన ఆకాశహర్మ్యాలు దృఢమైనవి అని నీవు అనుకుంటూ నిర్మించినా కొంతకాలానికి జీర్ణమై ,శిధిలమై కూలిపోవలసిందే! .

.

కాలానికి జీర్ణము చేసే శక్తి ఉన్నది ! 

గడచిన రాత్రి తిరిగి వస్తుందా!.

.

మనిషిని ఆతనిమృత్యవు ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది అది అతనితోటే కలిసి కూర్చుంటుంది ,కలిసి ప్రయాణం చేస్తుంది.

.

ముఖము ముడుతలు పడి ,వెంట్రుకలు నెరిసి,శిధిలమైపోతున్న శరీరాన్ని మనిషి తిరిగి సమర్ధవంతంగా చేసుకోగలడా! అది ఎవరి వల్లా కాదు.

.

సూర్యోదయమవ్వగనే పనులు చేసుకుంటూ చీకటి పడగానే నిద్దురిస్తూ ఉన్న మనిషి కాలంగడిచిపోతున్నది అనే విషయాన్ని మాత్రం గమనించలేకున్నాడు.

.

ఋతువులు వస్తున్నాయి పోతున్నాయి దానితోపాటే ప్రాణుల వయస్సు కూడా క్షీణిస్తున్నది.

.

ఒక ప్రవాహంలో కొన్ని కట్టెముక్కలు కలిసివెడుతున్నాయి కాస్తదూరము వెళ్ళగానే అవి విడిపోయి కనపడుతున్నాయి. కాలప్రవాహంలో జీవనగమనంలో బంధువులూ ,స్నేహితులూ,భార్యాపుత్రులూ అలాంటి కట్టెముక్కల లాంటి వారే! అందరూ విడిపోక తప్పదు.

.

మన తండ్రి తన కర్తవ్యాన్ని నిర్వర్తించి స్వర్గము చేరుకున్నాడు.

మన తండ్రి నన్ను ఏమి చేయమని ఆజ్ఞాపించినాడో అది మాత్రమే నేను పాటిస్తాను.

.

దశరధమహారాజు మన తండ్రి, మన బంధువు .అది రాజాజ్ఞ! దానిని పాటించి తీరవలసినదే ! అదే ధర్మము! మన తండ్రి ఆజ్ఞను మనము పాటించవలసినదే !ఆయన ఆజ్ఞ  తిరుగులేనిది అని చెప్పి ముగించాడు రాముడు.

.

వూటుకూరు జానకిరామారావు 


.

పంచభూతాలు

 పంచభూతాలు - అగ్ని 

(డబ్బు, ఆరోగ్యం, సుఖాలు, హోదాలు ఇలా ఏదైనా అనుగ్రహించగల అగ్ని ఆరాధన గురించి తెలుసుకోండి)


అగ్ని ఆరాధన అనేది మన సనాతన భారతీయ సంప్రదాయానికి మూల స్తంభం మరియు సనాతన ధర్మ ఔన్నత్యానికి ప్రతీక మన జీవన విధానానికి , పురోభివృద్ధికి చిహ్నం.


మన చుట్టూ చాలా మంది డబ్బున్నవాళ్ళు, రాజకీయనాయకులు , సెలెబ్రిటీలు ఇలా ఎందరో ఎక్కువగా అగ్ని ఆరాధన చేస్తారు లేదా వారి పేరు మీద చేయించుకుంటారు అని తెలుసా.ఎందుకంటే నీకు ఏమి ఇవ్వాలన్న అగ్ని దేవుడే ఇవ్వాలి ఎందుకంటే నువ్వు భగవంతుడికి ఏది సమర్పించిన ఆయనే చేరవేస్తాడు ( హవ్య వాహనుడు)...మనకి ఆ పరమాత్మకి మధ్య వారధిలా కూడా పని చేస్తాడు.. నీలో జఠరాగ్ని రూపంలో ఉండి నువ్వు తిన్నది పచనం చేస్తున్నాడు.మన శరీరంలో ఉష్ణo రూపంలో ఉండవలసిన రీతిలో ఉంటూ మన శరీరం పడిపోకుండా కాపాడుతున్నాడు ఇలా ప్రతి చోటా ఉండి మనల్ని రక్షించే పరమాత్మ స్వరూపుడు..

పూర్వము చాలా వరకు అందరి ఇళ్ళలో కూడా పొయ్య మీద అన్నం వండిన తరువాత అందులోనుండి కొద్దిగా మెతుకులు తీసి ఆ మంటలో వేసి కొద్దిగా నెయ్యి వేసేవారు అంటే అది కూడా ఒక రకంగా ఆయనకి కృతజ్ఞతలు చెప్పటమే అలాగే మనలో ఉన్న జఠరాగ్ని లో ఏ చెత్త పడితే ఆ చెత్త వేసి పాడుచేస్తే ఆ తరువాత తిన్నది అరగదు, తినటానికి ఆకలి వెయ్యదు కనుక మిత మైన, శుచి శుభ్రత కలిగిన ఆహారాన్ని తీసుకోండి అదికూడా దేవునికి అర్పించి తినండి..మనం ఒక ముద్ద తినగలుగుతున్నాం అంటే దేవుని దయ ఉండాలి ఎంతో మంది వజ్రాలు , రత్నాలు పొదిగిన కంచంలో తినగలిగిన వాళ్ళు కూడా ఒక్క ముద్ద తినలేని రోగాలతో బాధ పడుతున్నారు కనుక మీరు తినే ఆహారాన్ని ఎప్పుడూ కృతజ్ఞతా భావంతో తినండి..

పాచి మొహంతో, స్నానం లేకుండా పొయ్యి వెలిగించి వంట చేయరాదు ఎంత డబ్బున్నవాళ్ళు అయినా క్రమంగా దరిద్రులు అయిపోతారు, అగ్నిని నోటితో ఊది ఆర్పరాదు, కాలితో తొక్కి ఆర్పరాదు, హేళన చెయ్యటం లాంటి దోషాలు ఎప్పుడూ చెయ్యకండి..


మీరు కూడా అగ్ని ఆరాధన చెయ్యటం మొదలు పెట్టండి మీ సమస్యలు తప్పకుండా తొలగిపోతాయి ఆయన ధార్మికమైన ఏ కోరిక అయినా ఇవ్వలేనిది అంటూ ఏమి లేదు..ఇప్పుడు మనలో అందరికి రకరకాల ప్రశ్నలు వచ్చేస్తు ఉంటాయి..ప్రతి రోజు చెయ్యమంటున్నారు ఇంట్లో చేయవచ్చా, ఏ దిక్కున చెయ్యాలి, ఆవు నెయ్యి వాడాలా, అగ్నికి ఆహ్వానం పలికితే మళ్ళీ ఉద్వాసన చెప్పాలి అంటారు మరి ఆ మంత్రాలు మాకు రావు కదా....ఇలా చాలా రకాలుగా..

ముందు ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సినది ఏమనగా మనం పెద్ద పెద్ద సోమ యాగాలు, చండి హోమాలు చేయట్లేదు చాలా సులభంగా దీపారాధన ఎలా చేస్తాము అలా అంతే. నాకు ఇప్పటికి కూడా ప్రతి రోజు క్రమం తప్పకుండా నిత్యాగ్నిహోత్రం చేసే మహానుభావులు, కారణజన్ములు తెలుసు వారు అంతా హంగు ఆర్భాటాలకి దూరంగా వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే..

అలానే మీకు దగ్గరలోని వేదం చదువుకున్న గురువులను ఆశ్రయించండి వారిని అడగండి కావాలంటే వారు నేర్పుతారు ( కేవలం చిన్న గిన్నె ( హోమ గుండంలా, ఎండు కొబ్బరి, హారతి కర్పూరం, ఆవు నేయి మాత్రం చాలు మీరు అగ్ని ఆరాధన చెయ్యటానికి)..

కాకపోతే స్వాహాకారం కలుపుతాము ఏ దేవునికి చేస్తే ఆ దేవునికి, అలా అని ఉగ్రదేవతా ఆరాధన చెయ్యరాదు..

మీకు దగ్గరలోని అగ్నిహోత్రం చేసేవాళ్ళని వినయ,విధేయతలతో ప్రార్దించి చూడండి తప్పక నేర్పుతారు లేదా నాకు వీలు కుదిరినప్పుడు ఒక వీడియో చేసి పెడతాను లేదా దానికి సంబంధించిన కార్యక్రమం ఎలా చేసుకోవాలి అనే లింక్ ఎవరైనా పెద్దలది పోస్ట్ చేస్తాను..

వీలు కుదిరిన వాళ్ళు ప్రతిరోజు 108 సార్లు స్వాహా కార మంత్రంతో చేసుకోండి లేదా వారానికి ఒక్కసారి అయినా వీలు చూసుకుని చేసుకోండి...మీరు ఊహించని విధంగా మీ జీవితంలో మార్పులు జరిగి మీ కుటుంబం అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో సుఖంగా ఉంటారు. మీరు ఇప్పటికి కూడా ప్రతిరోజు అగ్ని ఆరాధన చేసే వారి యొక్క మొఖంలో తేజస్సుని చూడండి అగ్నిలా వెలుగుతూ ఉంటారు..


ఎంతో గొప్పదైన మన సనాతన సంప్రదాయ విజ్ఞానంలో ఇటు వంటి విషయాలను వదిలిపెట్టి మన జీవితాలను మనమే నాశనం చేసుకున్నాం..వీలైనంత తొందరగా ప్రారంభించండి..మీరు మనసా నిజంగా చేద్దాం అనుకుంటేనే ఆయన అనుగ్రహం మొదలు అయిపోతుంది (ఓం భావనామాత్ర సంతుష్ట హృదయాయై నమః కదా )


ఇంకా చెప్పుకుంటుపోతే చాలా ఉంది కొంతవరకు తెలియజేసాను...













 

వేద ఆశీర్వాదం


 

శంకర


 

మానవ శరీరంలో వ్యర్ధాలను

 మానవ శరీరంలో వ్యర్ధాలను బహిష్కరించు అవయవాల గురించి సంపూర్ణ వివరణ - 2 . 



       అంతకు ముందు పోస్టు నందు వ్యర్ధాలను శరీరము నుంచి బయటకి పంపే 4 రకాల అవయవాల గురించి తెలియచేస్తూ ముందుగా మొదటిదైన ప్రేవుల గురించి మీకు సంపూర్ణముగా తెలియచేశాను . ఇప్పుడు మిగిలిన మూడింటి గురించి సంపూర్ణముగా వివరిస్తాను. 



 *  మూత్రపిండములు  - 


       ప్రేవులు పూర్తిగా పనిచేయని స్థితిలో శరీరంలోని మాలిన్యములు బయటకి పంపుటకు మూత్రపిండములు బాగుగా పనిచేయవలసి ఉంటుంది. అందుకే మలబద్దకం సమస్య ఉన్నవారికి మూత్రం అధికంగా వచ్చును. కొంతకాలమునకు మూత్రపిండములు కూడా అలసిపోయి చెడిపోవును . కావున మూత్రపిండములలో రాళ్లు , మూత్రనాళములో రాళ్లు , మూత్రకోశములో రాళ్లు మొదలగు వ్యాధులు సంభవించును . దీనివల్ల రక్తములో మూత్రము కలియుట , రక్తపోటు మొదలగు సమస్యలు కలుగును. 


 *  ఊపిరితిత్తులు  - 


     మూత్రపిండ వ్యాధులకు మందులు వాడిన శరీరంలోని మురికిని బయటకి పంపుటకు ఉపిరితిత్తులు ప్రయత్నించును. దగ్గు , జలుబు , అలర్జీ , దమ్ము  ద్వారా శరీరంలోని తెమడను బయటకి పంపుటకు ప్రయత్నించును. ఈ సమస్యను కూడా అణుచుటకు మందులు వాడుచున్న శరీరం నందలి మలిన పదార్థము చర్మము క్రిందికి వెళ్లి చర్మవ్యాధులను కలగచేయును . 


 *  చర్మము  - 


     రక్తములో ఉన్న మాలిన్యాలను చర్మము ద్వారా బహిష్కరించుటకు ప్రయత్నించునప్పుడు గజ్జి , తామర , పుండ్లు , గడ్డల రూపములో కనిపించును. దీనిని మనం మందులతో అణిచివేయుచుండిన చర్మవ్యాధి , కుష్టు మొదలగు వ్యాధులు వచ్చును . 



       పైన వివరించిన నాలుగు బహిష్కరణ అవయవాలు చక్కగా పనిచేసినంత కాలం ఏ రోగము దరిచేరదు . ఇందులో ఏ ఒక్కటి తన విధిని సరిగ్గా నిర్వర్తించలేకపోయినా శరీరము అంతా రోగగ్రస్తం అవుతుంది. అంతేకాని శరీరంలో వివిధ అవయవములకు సంబంధం లేదు అనుకోకూడదు. 


             ఈవిధముగా శరీరంలోని నాలుగు బహిష్కరణ అవయవాలు మందుల వలన దోషపూరితమై ఒకదాని పని ఇంకొకటి చేసి రోగగ్రస్తము అగును. కావున సమస్య మొదలగు క్రమము నందే సరైన జాగ్రత్తలు పాటించి ఎప్పటికప్పుడు శరీరంలోని మాలిన్యాలను బయటకి పంపవలెను. 


            ఈ మధ్యకాలంలో చాలా మంది ఉదయాన్నే లేవగానే మలవిసర్జనకు వెళుతున్నాము .మలబద్ధక సమస్య లేదనుకుంటున్నారు. నిజానికి రోజుకు రెండుసార్లు మలవిసర్జన చేయుట అత్యుత్తమ పద్దతి. అదేవిధముగా ఋతువు మారినప్పుడల్లా విరేచనౌషధములు తీసుకుని ఉదరమును మరియు ప్రేవులను శుభ్రపర్చుకోవలెను. ఉదయాన్నే మలవిసర్జన చేసినప్పుడు బయటకి వెళ్లునది కేవలం 60 % మాత్రమే . మిగిలిన 40 % ప్రేవులకు పట్టి ఉండును. అది అలా మురిగిపొయి విషవాయువులు వెలువడి రక్తములో కలిసి శరీరంలోని మిగతా అవయవాలకు చేరుకుని ఆయా అవయవ సంబంధ రోగాలను కలుగ చేయును . కావున ఋతువు మారినప్పుడల్లా విరేచనౌషధాలను తీసుకుని ఉదరము మరియు ప్రేవులను శుభ్రపర్చుకోవలసిందిగా ముఖ్య సూచన . 



                               సమాప్తం 


    గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100  రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

ఒక దీపం 17000 దీపాలు వెలిగించింది !

 ఒక దీపం 17000  దీపాలు వెలిగించింది ! 

[ మరిన్ని దీపాలను వెలిగిస్తూనే వుంటుంది ] 


ఆమె పేద మహిళ. పొలాల్లో కూలీపని చేసుకొంటూ వుండేవ్యక్తి. హఠాత్తుగా ఆమె బ్రతుకు మీద మరో పిడుగు పడింది. భర్త ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఒకడే కొడుకు. కర్నాటకలో ప్రభుత్వ పాఠశాలకు వెళుతున్న 12 ఏళ్ళ పిల్లవాడు. వాడిని తీసుకొని ఆమె మరొక మహిళ ఇంటికి వెళుతోంది. మొత్తానికి అడ్రసు పట్టుకొని ఆ ఇంటి తలుపు తట్టింది. '' ఎవరమ్మా , మీరు ? '' అని అడిగింది ఇంటావిడ. ''అమ్మా , నా భర్త ఈ మధ్యనే చనిపోయాడు. వీడు నా కొడుకు. నేను ఒక కూలీ. వీడిని చదివించాలి. మీరు నా బోటివాళ్ళకు సహాయం చేస్తారని ఎవరో చెపితే వచ్చాను , '' అంది ఆమె.  "తప్పకుండా చేస్తాను. ఏమి చదువుతున్నావు , బాబూ ? '' అని ఆ ఇంటావిడ అడిగితే ''  ఏడవ తరగతి , '' అన్నాడు ఆ పిల్లవాడు. '' బాగా చదువుకో. పదవ తరగతి దాకా నీక్కావాల్సిన ఫీజు , పుస్తకాలు , బట్టలు నేను ఏర్పాటు చేస్తాను. పదవ తరగతి లో నీవు 95 % మార్కులు తెచ్చుకొంటే , ఆ తరువాత నీవు ఏమి చదవాలనుకొంటావో , అది ఎంత ఖర్చుతో కూడిందైనా , మేము చదివిస్తాం. ఇంతకూ ఏమి కావాలనుకొన్నావు ? '' అని అడిగింది ఆమె. '' మేడం , మేము చాలా పేదవాళ్ళం. ఒకసారి మా అమ్మకు ఆరోగ్యం పూర్తీగా దెబ్బతినింటే , ఒక డాక్టరు ఆమెను కాపాడాడు. మా అమ్మకు ప్రాణం పోసిన డాక్టరు లాగా , నేనూ డాక్టరు కావాలనుకొన్నాను, '' అన్నాడు ఆ చిన్న పిల్లవాడు. '' తప్పకుండా అవుతావు, కానీ బాగా కష్టపడాలి. చెడు అలవాట్లు , స్నేహితులకు దూరంగా వుండాలి. మీ అమ్మను బాగా చూసుకోవాలి. మధ్యలో ఇవన్నీ మరచిపోతావా ? '' అని అడిగింది ఆమె. '' లేదు, మేడం. మీరు చెప్పినట్టే చేస్తాను , '' అన్నాడు. '' మంచిది. నీక్కావాల్సిన అన్ని ఏర్పాట్లూ నేను చేస్తాను , '' అనింది ఆమె. 

ఆ అబ్బాయి ఈ కఠిన పరీక్షకు తట్టుకొంటాడా ,లేడా అని తెలుసుకొనేందుకేనా అనిపించేలాగా , అతనికి 14 వ ఏట ఒక ప్రాణాంతకమైన అనారోగ్య పరిస్థితి ఏర్పడింది. . అపుడు చాలా భయపడ్డారు తల్లీ కొడుకులు. ఆ సమయంలో తనకు సహాయం చేస్తానని మాట ఇచ్చిన ఆమెకు తానిచ్చిన మాటను గుర్తుచేసుకొనేవాడు ఆ అబ్బాయి. ఇంతకూ ఆ అబ్బాయి పదవతరగతిలో 95 % మార్కులు తెచ్చుకొన్నాడా ? MBBS చదివాడా ?  డాక్టరు అయ్యాడా ?  ఇది తెలుసుకోవాలంటే మనం కర్నాటక గదగ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కి వెళ్ళాలి. అక్కడ COVID- 19 బారిన పడిన వ్యక్తులకు చాలా అంకిత భావంతో సేవలు అందిస్తున్న డా. కె.వి. మనోజ్ కుమార్ ను కలవాలి. ఆయనే అప్పటి నిరుపేద కూలీ కొడుకు. 


ఇలాంటి నిరుపేద విద్యార్థులు  [ ఏ కులమైనా , మతమైనా ] వాళ్ళ కలలను నిజం చేసుకొని , వాళ్ళ కుటుంబాలను పేదరికంలోంచి బయటకు తెచ్చేవిధంగా సహాయం చేయడానికే శ్రీమతి కుమారీ శిభులాల్ అనే ఈ మహిళ [ ఫోటో చూడండి] 1999 లో Shibhulal Family Philanthropic Initiatives [ SFPI] ను స్థాపించి , ప్రభుత్వాలనుండి ఎటువంటి నిధులూ ఆశించకుండా నిస్వార్థంగా  పనిచేస్తున్న ఒక స్వచ్చంద సంస్థ. 1999 నుండి 2020 దాకా ఈ సంస్థ 17000 పేద కుటుంబాలలో పెద్ద మార్పును తీసుకురాగలిగింది.[ ప్రస్తుత సంవత్సరంలో 4300 మంది విద్యార్థులు SFPI చేత చదివించబడుతున్నారు]  ఈ కుటుంబాల్లోని విద్యార్థులు  పేదరికం నుండి తమ వాళ్ళను బయటకు తెచ్చారు. ఈ సంస్థ సహాయం అందుకొన్న పేద బాల బాలికల్లో ఇపుడు 230 మంది డాక్టర్లు , 940 మంది ఇంజినీర్లు , 131 మంది టీచర్లు వున్నారు. వినీత్ కుమార్ అనే ఒక పేద విద్యార్థి  గతం లో NEET State topper ,  అనిత అనే అమ్మాయి JEE topper.  

'' మా జీవితాలను మార్చిన మీకు మేము ఏమి ఇవ్వగలం  మేడం ? '' అని వారు అడిగితే , '' మీరు నాకు ఏమీ ఇవ్వాల్సిన పనిలేదు. ఒక పేదవాడింటికి వెళ్ళి , అతని కొడుక్కో , కూతురుకో  వాళ్ళకు అవసరమైన అంశంలో పాఠం చెప్పండి. మీలాగా మరొక్కడిని తయారుచేయండి చాలు , '' అంటారు ఆవిడ. 


నీవు మొదట అడుగు పెట్టినప్పుడు , ఒక ప్రదేశంలో ముళ్ళు కనపడుతుంటే , నీవు దాన్ని వదిలే నాటికి అక్కడ పువ్వులు పూస్తుండాలి.

”ధర్మం”* అంటే ఏమిటి?

 . *”ధర్మం”* అంటే ఏమిటి? 

         

🌹🌹🌹🙏🌹🌹🌹


 *• ధర్మసాక్షిగా పెండ్లాడిన భార్యను వదిలివేయకుండా వుండటం:

         *వివాహ ధర్మం!* 


 *• తన భర్త అందహీనుడైనా, స్థితిపరుడుకాకున్నా, నమ్మివుండటం:

            *భార్య ధర్మం!* 


 *• నమ్మిన మిత్రునికి అపకారం 

     చేయకుండటం :

           *మిత్ర ధర్మం!* 


 *• సోమరితనం లేకుండటం:

          *పురుష ధర్మం!* 


 *• విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించటం:

             *గురుధర్మం!* 


 *• భయభక్తులతో విద్యను నేర్చుకోవటం:

             *శిష్యధర్మం!* 


 *• న్యాయమార్గంగా సంపాదించి సంసారాన్ని పోషించటం:

          *యజమాని ధర్మం!* 


 *• భర్త సంపాదనను సక్రమంగా ఖర్చుపెట్టి గృహాన్ని నడపటం:

            *ఇల్లాలి ధర్మం!* 


 *• సైనికుడుగా వుండి దేశాన్ని, ప్రజలను కాపాడటం:

            *సైనిక ధర్మం!* 


 *• వృద్ధులైన తల్లిదండ్రుల్ని ఆదరించి పోషించటం:

               *బిడ్డల ధర్మం!* 


 *• తాను జన్మనిచ్చిన బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయటం :

              *తండ్రి ధర్మం!* 


 *• తన ఇంటికీ, తనను కన్నవారికీ పేరు ప్రతిష్ఠలు తేవటం:

          *బిడ్డలందరి ధర్మం!* 


 *• తన వృత్తి ఎటువంటిదైనా వృత్తిని గౌరవించటం :

             *ప్రతివాని ధర్మం!* 

  

 *• తాను సంపాదించినదాన్ని తనవారితో పంచుకొని తినటం :

             *సంసార ధర్మం!* 


 *• అసహాయులను కాపాడటం:

           *మానవతా ధర్మం!* 


*• చెప్పిన మాటను నిలుపుకోవటం :

               *సత్య ధర్మం* 


🌹🌹 🌹🙏🙏🌹🌹🌹

సాధారణంగా జరగాలి

 🌷పెళ్లి సాధారణంగా జరగాలి షష్టిపూర్తి ఘనంగా జరగాలి🌷 

     

     🙏కొంచం వీలు కల్పించుకొని ప్రతిఒక్కరూ తెలుసుకోవలసిన విషయం.🙏


1. 🕉️మానవుని  సంపూర్ణ ఆయుర్దాయం 120 సంవత్సరాలు అని జ్యోతిష్య శాస్త్రం  చెబుతున్నది. 


2. 🕉️ 60 సంవత్సరాలు నిండినప్పుడు  చేసుకునేది షష్టిపూర్తి.

3. 🕉️ప్రతివారికీ మృత్యువు 60 వ యేట ఉగ్రరథుడు అను పేరుతో , 70 వ యేట భీమరథు డు అను పేరుతో, 78 వ యేట విజయరథు డు అను పేరుతో ఎదురుచూస్తుంటాడు.

      ఎక్కువ మంది ఈ సంవత్సరం లలో గండం...

4.🕉️ ఆరోగ్య సమస్యలకు తట్టుకోవటానికి  చేసే శాంతి ప్రక్రియ షష్టిపూర్తి.


5.🕉️ బృహస్పతి , శని 30 సంవత్సరాలకు  మానవుని జన్మకాలంలో ఉన్నరాశికి చేరటానికి 60 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళిద్దరూ తాము బయలుదేరిన రాశికి చేరుకోవటంతో మానవుని జీవితం మరలా ప్రారంభమవుతుంది. తిరిగి జీవితం ప్రారంభం ఐనట్లు సంకేతం.


6. 🕉️ మానవుడు పుట్టిన  తెలుగు సంవత్సరాలు (60) నిండుతాయి కనుక షష్టిపూర్తి. 


7. 🕉️షష్టిపూర్తి  సందర్భంగా  ఆయుష్కామన యజ్ఞము చేస్తారు. ఆయువును కోరి చేయు యజ్ఞము ఆయుష్కామనయజ్ఞము అని అంటారు.


8. 🕉️ పెద్దలు ఈ ఆయుష్కామన యజ్ఞాన్ని చేసే పధ్ధతిని ఇలా చెప్పారు.


9.🕉️ ‘’  తెల్లని నూతన వస్త్రముపై తూర్పు దిక్కుగా 12 గీతలు గీచి వాటిమీద అయిదు గీతలు గీసి మొత్తము 60 గదులు వచ్చే విధంగా చేస్తారు . వరుసకు 12 అయిదు వరుసలు తూర్పు దిక్కున బియ్యం పోసి కలశం ఉంచుతారు. ప్రభవ నుంచి క్షయ వరకు 60 సం " అధిదేవతలతో ఆవాహన చేస్తారు. దక్షిణాయన ఉత్తరాయణ దేవతలను, 6 ఋతువులను 12 మాసములను ఆవాహన చేస్తారు. పక్షములను,తిదులను వారములను - వారదేవతలు అయిన - సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని ని ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు - అగ్ని, జలము , భూమి, విష్ణువు ఇంద్రుడు, ప్రజాపతి లని ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు శివుడు, దుర్గ, కుమారస్వామి, బ్రహ్మ - ఇంకా ఏకాదశ రుద్రులు, నక్షత్ర దేవతలు 27 యోగములు 11 కరణములు ఇలా అందరి దేవి దేవతా స్వరూపాలని మృత్యుంజయుని ఆవాహన చేసి బ్రాహ్మణోత్తములు మంగళాచరనములతొ వేదయుక్తంగా ఈ కార్యక్రమం జరిపిస్తారు. అపమృత్యు నివారణార్థం హోమాల్ని, జపాలని కుడా చేస్తారు.తదుపరి బ్రహ్మలను సత్కరించి బంధుమిత్రులతో విందు ఆరగిస్తారు. 


10. 🕉️పూర్వకాలంలో  పురుషుడు ఏ వేడుక చేసుకున్నా భార్యకు కూడా జరగినట్టే   భావించేవారు కనుక  స్త్రీలకు మళ్ళీ విడిగా షష్టిపూర్తి చేసే ఆచారంలేదు.


11.🕉️పెళ్లి సాధారణంగా జరగాలి. షష్టిపూర్తి ఘనంగా జరగాలని పెద్దల మాట. ఎందుకంటే షష్టిపూర్తి దృఢమైన   ఆత్మీయతల సుగంధం పరిమళించే సందర్భం కనుక.


12.🕉️ బిడ్డలు తమ కృతజ్ఞతను తమ తల్లిదండ్రులకు  అర్పించుకొనే అపురూప సందర్భం  షష్టిపూర్తి.

 గమనిక:- షష్ఠి పూర్తి మాకు ఆచారం లేదండి...... అనేది అవాస్తవం. నిరభ్యంతరంగా అందరూ తమ శక్తి కొలది చేసికోవాలి.

  🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏

మంత్రోచ్ఛారణ

 మంత్రోచ్ఛారణ - వైజ్ఞానిక విశ్లేషణ :


“మననాత్ త్రాయతే ఇతి మంత్ర:”  - అనగా మననం చేసేవాడిని రక్షించేది మంత్రం. అదీయూ గురువుల  ఉపదేశంతో నేర్చుకుని మననం చేస్తే ఎన్నో బాధలను తీర్చగలదు, ఎన్నో కార్యాలను సఫలం చెయ్యగలదు. కానీ కొందరు వెటకారంగా మంత్రాలకు చింతకాయలు రాల్తాయా అని ఎద్దేవా చేస్తారు. అసలు మంత్రం, దాని వెనకున్న నిగూడార్ధం గురించి చర్చించుకుని మనకు అనుభవంలో ఏది రాల్చగలదో ముచ్చటించుకుందాం. 


ప్రతీ మంత్రంలో ఓంకారం, బీజాక్షరాలు ఒక అమరికతో ఒకొక్క శక్తిని ప్రేరేపణ చేసేవిగా వుంటాయి. ముందుగా ఓంకారం గురించి చూస్తె అది “అ” కార, “ ఉ” కార, “మ” కార సంగమం. ఆకారం ఉచ్చరించినప్పుడు ఆ ఉచ్చరించిన వాణి కడుపు, హృదయం స్థానంలో చలనం గమనించవచ్చు. ఉకార ఉచ్చారణతో గొంతులోను, మరియు గుండె దగ్గర మనం సెన్సేషన్ గమనించవచ్చు. “మ్” అని అంటున్నప్పుడు నాసికా రంధ్రాల నుండి మెదడు వరకు vibration గమనించవచ్చు. ఇది ఎక్కడో ఎందుకు మీరే ఒకసారి ఉచ్చరించి చూడండి , ఆ కదలికలను మీరు ఇప్పుడు చెప్పుకున్న అన్ని ప్రదేశాలలో చలనం గమనించవచ్చును. ఇవి మూడు కలిపి ఓం కారం జపించినప్పుడు కటి ప్రదేశం నుండి మెదడు వరకు, మనకున్న షట్చక్రాలు ఉత్తేజితం అవుతాయి. ఈ ఓం కారానికి frequency 425Hz గా గుర్తించారు. అదే ఓంకార మంత్రోచ్చారణ ఒక క్రమపద్ధతిలో చేసేవారికి binural waves మెదడు లో తయారవుతాయి. దాని వలన ఆల్ఫా(8-13.9Hz), బీటా(14-30Hz) ,టీటా(4-7.9), డెల్టా (0.1-3.9 హజ్)తరంగాలు మెదడులో ఉత్పన్నమవుతాయి.  సైంటిస్ట్ లు దీని మీద ప్రయోగాలు చేసి ఓంకార ఉచ్చారాణ ద్వారా ఒకరి మానసిక స్థితి బీటా నుండి డెల్టా వరకు ప్రశాంతత స్థితికి వెళ్తుంది. 

మానసిక ఒత్తిడి ఓంకార ఉచ్చారణ ద్వారా ఎలా తగ్గిందో ఈ క్రింద పేపర్ లో మరింత వివరంగా చర్చించబడి వుంది.

http://paper.ijcsns.org/07_book/200808/20080825.pdf


కేవలం ఓంకార మంత్రోచ్చారణ ద్వారా మానసిక ప్రశాంతత, కాన్సంట్రేషన్ పెరుగుదల, ఎక్కువ ఉత్సాహం, స్ట్రెస్ తగ్గుదల కనబడ్డాయి. 

MRI scan ద్వారా మరికొన్ని విషయాలు గమనించారు. దీని ద్వారా ఎపిలేప్సి, డిప్రెషన్ కూడా తగ్గించవచ్చు అని నిర్ధారణకు వచ్చారు. 


ఇక మనం మిగిలిన మంత్రాల విషయం గురించి చూద్దాం. ప్రతి మంత్రం కొన్ని బీజాక్షరాల సమాహారం. ప్రతీ బీజాక్షరానికి దాని శక్తి వుంటుంది. దానికి తత్సంబంధిత ఒక frequency వుంటుంది. ఈ బీజాక్షరాల క్రమపద్ధతి లో ఉదాత్త, అనుదాత్త స్వరాలతో చదివినప్పుడు ఒక signature ఉత్పన్నమవుతుంది. ఆ మంత్రానికి ఉన్న శక్తి తరంగాల రూపంలో వెలువడుతుంది. తత్సంబంధిత దేవతా స్వరూపానికి అది చేరి రావలసిన ఫలితం ఇప్పిస్తుంది. ఇదెలా కుదురుతుంది అని అనుకుంటే దానికి అర్ధమయ్యే ఒక ఉదాహరణ తీసుకుందాం. దీన్ని మనం పూర్తిగా అర్ధం చేసుకోవాలంటే మనం ముందు తెలుసుకోవాలంటే మన చుట్టూ మనకు అర్ధం కానీ, ఎన్నో తరంగాలు ఉన్నాయి. ఉదాహరణకు రేడియో లో FM ట్యూన్ చెయ్యాలంటే 88-108 Mhz లో మార్చుకోవాలి. అందునా దానికి లైన్ of sight మాత్రమె ఆ సిగ్నల్ tap చెయ్యగలదు. అందుకే వైజాగ్ FM రేడియో వేరు, విజయవాడ FM రేడియో స్టేషన్ వేరు. ఒకొక్క ఊరిలో ఆ FM సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ ని అందుకోవాలంటే దానిని అర్ధం చేసుకునే FM receiver ఉండాలి. ఆ frequency కి మనం ట్యూన్ చేసుకుంటే ఆ కార్యక్రమం మనం వినగలం. అదే AM రేడియో అంటే కొన్ని latitudes వరకు వ్యాపిస్తుంది. అందుకే మనం శ్రీలంక AM రేడియో కూడా వినగలం. అలాగే satellite రేడియో ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్న కార్యక్రమం కూడా వినవచ్చు. వాటికి తత్సంబంధిత receiver తప్పని సరి. 


మన ఋషులు, యోగులు ఒకొక్క దేవతకు సంబంధించిన signature కనుగొన్నారు. వారు చెప్పిన పద్ధతిలో సాధన చేస్తే ఆ దేవతా స్వరూపాన్ని మనం అనుసంధానించుకోవచ్చును. సర్వత్రా వ్యాపించి ఉన్న దేవతా శక్తిని ఆ మంత్రాల ద్వారా మనం ఉత్తేజితం చేసుకుంటాం. ఎలాగంటే బయట ఎల


Electric pole మీద current వెళ్తూంటుంది, దాన్ని మనం ఒక వైర్ తగిలించుకుని మనం ఇంట్లో పవర్ తెచ్చుకున్నట్టు. ఆ శక్తి తరంగాలు మన చుట్టూ ఉన్నప్పుడు ఆ మంత్రధ్వని ద్వారా ఆ అనంతశక్తిని మనం కొంత మనలోకి తెచ్చుకున్నట్టు. బయటున్న ఎలక్ట్రిక్ pole కొంత ఎత్తులో వుంటుంది. దానికి మన ఇంటినుండి తగిలించాలంటే ఆ వైర్ కి ఇంత అని నిర్దుష్టమైన పొడుగు ఉండాలి, ఆ వచ్చేది 5amperes లేక 15 amps అన్నదాన్ని బట్టి ఆ వైర్ మందం వుంటుంది. అలాగే మనం ఏ కామ్యం కోసం చేస్తున్నామో ఆ కారణాన్ని బట్టి ఒకొక్క మంత్రం అన్ని సార్లు మననం చెయ్యాలని చెప్పబడి వుంది. ఒకే మంత్రం ఒక కామ్యానికైతే 15000 జపం చెప్పబడి వుంటే కొన్నింటికి 64వేలు ఇలా రకరకాలు గా వుంటుంది. ఆ శక్తి మండలం దగ్గర నుండి మనకు ఎంత శక్తి కావలసి వస్తుంది అంత మనకు గురువులు మంత్రజపం చెయ్యమని చెబుతారు. ఎలాగైతే ఒక ఎనర్జీ ఎక్స్పర్ట్ ఒక ఇంటికి ఎంత పవర్ కావాలని చెప్పగలడో, గురువులు మన కామ్యాన్ని బట్టి ఎంత శక్తి మనకవసరమో అన్ని వేల మంత్రజపం చెయ్యాలో చెబుతారు. నమ్మకంతో చేస్తే  తప్పక ఫలితం వుంటుంది.


ఇక్కడ మరొక కోణం వుంది. ఇద్దరి వ్యక్తుల మధ్య సంభాషణ కేవలం మౌఖికంగానే కాదు, మౌనంగా కూడా వారి భావాల ద్వారా జరుగుతుంది. ఇది సైంటిఫిక్ గా కూడా నిరూపింపబడివుంది. వీటిని మనం నిత్యం అనుభవిస్తూనే వుంటాం. చూడండి కొంతమందిని కలవగానే ఎన్నో ఏళ్ళ అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. కొందరిని కలవగానే వారినుండి దూరం పోవాలని వుంటుంది. ఒకొక్కరి భావాలు మరొకరితో మాటల్లేకుండానే కలుస్తాయి, వికర్శితం అవుతాయి. ప్రతి ఒక్కరికీ కొంత ఆరా (aura) వుంటుంది. మంత్రజపం ద్వారా మన aura పెంచుకోవచ్చు. అది ఎవరితో వికర్షిత మవుతోందో వాటిని సర్దవచ్చు. కేవలం మనలోనే కాదు, ఒక పరిస్థితికి ఎవరెవరితో సంబంధం వుందో దాన్ని ట్యూన్ చెయ్యగల సామర్ధ్య౦ మంత్రజపానికి వుంది.

అందరిలో ఉన్నది

 *త్వయి మయి సర్వత్రైకో విష్ణుః*

*వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణుః*

*సర్వస్మిన్నపి పశ్యాత్మానాం*

*సర్వత్రోత్సజ భేదజ్ఞానమ్‌!!* 


 *నీలో, నాలో, అందరిలో ఉన్నది ఒక్కడైన ఆ విష్ణువే.దైవత్వాన్ని పొందాలంటే అందరి విషయంలో సమత్వాన్ని పాటించు’  మనలో సమత్వ భావన లేకపోవడం వల్ల ఒకరంటే విపరీతమైన ద్వేషం, మరొకరంటే వెర్రి ఆపేక్ష కలుగుతాయి. నలువైపులా అద్దాలున్న గదిలోకి మనిషి ప్రవేశించినప్పుడు అన్ని దర్పణాల్లో కనిపిస్తున్న ప్రతిబింబం తనదేనని గుర్తించి నవ్వుతూ బయటకు వస్తాడు. అదే గదిలోకి శునకం ప్రవేశిస్తే తన చుట్టూ చాలా శునకాలున్నాయని, అవి తనతో వైరానికి వచ్చాయని మొరగడం మొదలుపెడుతుంది.*

గుడి దగ్గర్లో ఇల్లు

 🌴🌀 గుడి దగ్గర్లో ఇల్లు ఉండకూదనడానికి 

          ఖచ్చితమైన కారణాలు..! 🌀


🚩 గుడి నీడ ఇంటి మీద పడే విధంగా ఇల్లు నిర్మించకూడదంటారు. నిజమేనా? నిజమే.

 గుడినీడ పడకూడదు అంటే గుడికి దగ్గర ఇల్లు నిర్మించరాదు అని అర్థం. గుడి అత్యంత శక్తివంతమైనది. ఆ శక్తి గుడి పరిసరాలను ప్రభావితం చేస్తుంది. కొన్ని సమయాల్లో ఈ శక్తి ఇంటిని ప్రశాంతంగాఉంచకపోవచ్చు. 


🚩 అందుకనే పురాతన గుళ్ళుచూసినట్లైతే గర్భగుడి చుట్టూ ఒకటికంటే ఎక్కువ ప్రహరీ గోడలు నిర్మించి ఉండటం గమనించినవచ్చు. అందువల్ల గుడి గోడ నీడ పడే విధంగా ఇంటిని నిర్మించకుండా ఉంటే మంచిది.


🚩 అసలు గుడికి దగ్గర్లో ఇల్లు కట్టుకోవచ్చా? ఒకవేళ కట్టుకుంటే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి? ఆ విషయాలే ఇప్పుడు తెలుసుకుందాం..!!


🚩 ప్రపంచం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది. కాని మనిషికి ప్రశాంతత మాత్రం కరువైపోయింది. మనసు ప్రశాంతత కోరినప్పుడు చాలా మంది గుడికి వెళ్తుంటారు. అందుకే ఇప్పటికి చాలా మంది గుడికి దగ్గర్లో ఇల్లు కట్టుకుంటారు. కాని ప్రాచీన గ్రందాల ప్రకారం కొన్ని మంచి, కొన్ని చెడు ప్రభావాలు ఉంటాయని తెలుస్తుంది.

పురాణాల ప్రకారం దేవాలయం బయట ఉండే ధ్వజస్తంభం. 

వీటిలో ముఖ్యంగా ధ్వజస్తంభం గురించి తెలుసుకోవాలి.


🚩 శాస్త్రాల ప్రకారం దేవాలయం బయట ఉండే ధ్వజస్తంభం యొక్క నీడ ఇంటిపైన పడకూడదనే సూత్రం ఉంది. వాస్తు శాస్త్రంలో ఈ విషయం పై చక్కని వివరణ కూడా ఉంటుంది. అలాగే ధ్వజస్తంభానికి ఎదురుగా ఇల్లు కట్టుకుంటే హాని జరుగుతుందని పురాణాలు తెలుపుతున్నాయి.


🚩 అదే విధంగా శివుని గుడికి, గ్రామ దేవతల గుడికి, అమ్మవారి గుడికి ఎదురుగా ఇల్లు కట్టుకోకుడదు. శివాలయం ఎదురుగా ఇల్లు కట్టుకోవాలనుకుంటే కనీసం 100 అడుగుల దూరం పాటించాలి. శివుని యొక్క చూపు ఎల్లవేళలా ఇంటి పైన పడటం అంత క్షేమం కాదట. ఈ విషయాన్ని ప్రాచీన గ్రంధాల్లో వివరించారు.


🚩 అలాగే విష్ణు దేవుని గుడి వెనకాల కూడా ఇల్లు కట్టుకోకూడదని వాస్తు శాస్త్రం సూచిస్తుంది. ఒకవేళ ఇల్లు కట్టుకోవాలనుకుంటే కనీసం 20 అడుగుల దూరం పాటించాలి.


🚩 శక్తి ఆలయాలకు ఇరు వైపులా కూడా ఇల్లు కట్టుకోకూడదు అంటున్నాయి శాస్త్రాలు. ఒకవేళ ఇల్లు కట్టుకోవాలనుకుంటే కనీసం 120 అడుగుల దూరం పాటించాలని వాస్తు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.


🚩 కొన్ని గ్రంధాలలో శక్తి ఆలయాలకు వెనక వైపున ఇల్లు కట్టుకోకుడదు. కొన్ని గ్రంధాలలో విష్ణు దేవుని ఆలయానికి పక్క ఇల్లు కట్టుకోకుడదు అని ఉన్నాయి. అలాగే కొన్ని గ్రంధాలలో శక్తి ఆలయాలకు వెనక వైపున ఇల్లు కట్టుకోకుడదు అని ఉన్నాయి.


🚩 మిగితా దేవుళ్ళ యొక్క ఆలయాలకి 80 అడుగుల లోపల ఎటువంటి నివాసయోగ్యమైన ఇల్లు కట్టకూడదట.


సర్వేజనా సుఖినోభవంతు.



🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🚩🚩🚩🚩🚩🚩🚩

అత్రి మహర్షి

 అత్రి మహర్షి                       అత్రి మహర్షి ఎవరో తెలుసా ? మనం సప్తమహర్షులు అనేమాట వింటూంటాం కదా ... వాళ్ళల్లో ఈయన ఒకడన్నమాట . అత్రి మహర్షి బ్రహ్మదేవుడి మనస్సులోంచి పుట్టాడు . అంటే బ్రహ్మమానస పుత్రుడన్నమాట . అలా పుట్టిన అత్రి మహర్షిని బ్రహ్మదేవుఁడు “ లోక రక్షణ కోసం నేను కొంతమందిని సృష్టిస్తున్నాను , నువ్వు గొప్ప తపశ్శక్తిని పొంది నాకు ఈ సృష్టికార్యంలో సాయపడాలి ” అని అడిగాడు . అందుకు అత్రి మహర్షి సరే ! అలాగే సాయపడతానని చెప్పి ఒక మంచి అనుకూలమయిన ప్రదేశాన్ని చూసుకుని తపస్సు ప్రారంభించాడు . ఈ మహర్షి చేసిన ఘోరతపస్సుకి ఆయన కళ్ళల్లోంచి ఒక గొప్ప తేజస్సు బయటికి వచ్చి భూమి , ఆకాశం అన్ని దిక్కులా వ్యాపించి పోయింది . ఆ తేజస్సుని భూమ్యాకాశాలు కూడా భరించలేక పోవడం వల్ల అది సముద్రంలో పడిపోయింది . ఇది బ్రహ్మదేవుడికి తెలిసి ఆయన ఆ తేజస్సుని అత్రిమహర్షికి పెళ్ళయ్యాక తేజస్సు యొక్క కొంత అంశతో చంద్రుడు కుమారుడుగా పుడతాడని , క్షీరసాగర మథన సమయంలో మిగిలిన అంశ వచ్చి చంద్రుడిని కలుస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు . కొంతకాలం తర్వాత , అత్రి మహర్షికి దేవహూతి కర్దముడు అనే దంపతులకు పుట్టిన తొమ్మిదిమంది కూతుళ్లలో ఒక కూతురయిన అనసూయతో పెళ్ళి జరిగింది . పెళ్ళి చేసుకున్న అత్రి మహర్షి అనసూయాదేవితో కలిసి జీవిస్తున్నాడు . అనసూయాదేవి గొప్ప పతివ్రతగా వినుతికెక్కింది . ఒకనాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అనసూయాదేవిని పరీక్షిద్దామని బయలుదేరి అత్రిమహర్షి ఆశ్రమానికి వచ్చారు . అత్రి మహర్షి అనసూయాదేవి వారికి ఆతిథ్యం ఏర్పాట్లు చేస్తున్నారు . అప్పుడు త్రిమూర్తులు మహర్షితో మాకు వడ్డించే స్త్రీ నగ్నంగా వడ్డించాలి అన్నారు . అనసూయాదేవి అంగీకారంతో అత్రిమహర్షి మీ కోరిక ప్రకారమే అన్నాడు . త్రిమూర్తులు స్నానం చేసి కూర్చున్నాక అనసూయ వారిమీద మంత్రజలం చల్లి , చంటి పిల్లల్లా చేసి నగ్నంగా వడ్డించింది . మళ్ళీ దుస్తులు ధరించి వాళ్ళ ముగ్గుర్ని మంత్రజలంతో మామూలుగా చేసి తినండి అంది . భోజనం తర్వాత మళ్ళీ చంటి పిల్లల్ని చేసి ఉయ్యాలలో వేసింది . త్రిమూర్తుల్ని వెతుక్కుంటూ సరస్వతి , లక్ష్మి , పార్వతి వచ్చి అనసూయ దగ్గర చంటి పిల్లల్ని చూసి మా భర్తల్ని మాకియ్యమని అడిగి అత్రి అనసూయలను మా ముగ్గురి అంశలతో ముగ్గురు పిల్లలు కలుగుతారని దీవించి తమ భర్తల్ని తీసుకుని వెళ్ళిపోయారు . ఒకసారి కౌశికుడి భార్య , సూర్యుడు ఉదయించగానే తన భర్త చనిపోతాడని తెలిసి సూర్యుడు ఉదయించకుండా చేసింది . అనసూయాదేవి సూర్యుడు ఉదయించేటట్లు చేసి కౌశికుణ్ణి కూడా బ్రతికించింది . అత్రి మహర్షికి పిల్లలు లేరని వంద సంవత్సరాలు భార్యతో కలిసి తపస్సు చేశాడు . అప్పుడు త్రిమూర్తులు ప్రత్యక్షమై పిల్లలు కలిగేలా వాళ్ళని ఆశీర్వదించారు . కొన్నాళ్ళయ్యాక అత్రి మహర్షి కంట్లోంచి చంద్రుడు , అనసూయాదేవికి దత్తాత్రేయుడు , దుర్వాసుడు అనే పేర్లతో ముగ్గురు పిల్లలు పుట్టారు . ఒకనాడు అత్రి మహర్షి అనసూయని పిలచి మనకి మంచి ప్రవర్తన కలిగిన పిల్లలు కలిగారు కదా ... నేనింక తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోదామనుకుంటున్నాను . నువ్వుకూడా నాతో వస్తావా ? పిల్లల దగ్గరుంటావా ? అని అడిగాడు . అప్పుడు అనసూయ స్వామీ ! మీకంటే నాకు పిల్లలు ఎక్కువ కాదు . కానీ , పిల్లలు బాగా చిన్నవాళ్ళు . వాళ్ళు కొంచెం పెద్ద వాళ్ళయ్యాక మనం వెడితే ధర్మంగా ఉంటుంది , ఈ లోగా పిల్లల్ని పోషించడానికి కొంచెం ధనం కావాలి కదా ! మీరు పృథు చక్రవర్తి దగ్గరకు వెళ్ళి ధనం తీసుకురండి అంది . ఆ సమయంలో పృథుచక్రవర్తి అశ్వమేధయాగం చేస్తున్నాడు . ఆ యాగాశ్వాన్ని రక్షించడానికి తన కుమారుడితో వెళ్ళమని పృథు చక్రవర్తి అత్రి మహర్షిని అడిగాడు . అత్రి మహర్షి సరేనని బయల్దేరాడు . పృథు చక్రవర్తి వైభవాన్ని చూడలేక ఇంద్రుడు యాగాశ్వాన్ని దాచేశాడు . అత్రి మహర్షి తన దివ్యదృష్టితో చూసి ఆ విషయం పృథు చక్రవర్తి కుమారుడికి చెప్పాడు . అతడు ఇంద్రుణ్ణి జయించి ఆ యాగాశ్వాన్ని తీసుకుని వచ్చాడు . అశ్వమేధయాగం పూర్తయ్యాక పృథు చక్రవర్తి ఇచ్చిన ధనం , వస్తువులు మొదలయిన వాటిని తీసుకువెళ్ళి పిల్లలకిచ్చి అత్రి మహర్షి అనసూయా దేవితో కలిసి తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోయాడు . ఒప్పుడు దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది . అందులో రాహువు వేసిన అస్త్రాలకి సూర్యచంద్రుల్లో వెలుగు తగ్గిపోయి లోకమంతా చీకటయిపోయింది . అప్పుడు అత్రి మహర్షి తన చూపులోనే రాక్షసులందర్ని చంపేశాడు . ఎంతోమంది ఋషులు అత్రిమహర్షి నడిగి పూజా విధానం అభిషేకం , దేవతా ప్రతిష్ట , ఉత్సవాలు , దోషాలకు ప్రాయశ్చిత్తాలు మొదలయిన వాటి గురించి తెలుసుకుంటూ ఉండే వాళ్ళు . అత్రి మహర్షి రచించిన ఆత్రేయ ధర్మశాస్త్రంలో దాన ధర్మాలు , జపతపాలు రహస్య పాయశ్చిత్తాలు మొదలయిన వాటి గురించి తెలియచేయబడ్డాయి . అలాగే అత్రి సంహితలు అనే గ్రంథాల్లో ఆచారాలు , గురుప్రశంస , చాతుర్వర్ణ ధర్మాలు , జపమాలాపవిత్రత , పుత్రులు దత్తపుత్రులు మొదలయినవాటి గురించి తెలియచేయబడ్డాయి . దత్తపుత్రుణ్ణి స్వీకరించవచ్చు అనే దాన్ని గురించి మొట్టమొదట ప్రవేశపెట్టింది అత్రిమహర్షి ...... ! అత్రి మహర్షి గురించి చాలా విషయాలు మనకి తెలిసినట్టే కదా ! అత్రి మహర్షి గురించే కాదు ఆయన భార్య అనసూయాదేవి గురించి కూడా తెలుసుకున్నాం . చదివారు కదా ! సప్తమహర్షుల్లో ఒకడయిన అత్రి మహర్షి గురించి . కూడ అంత గొప్పవాళ్ళం అవ్వాలన్నమాట . పెద్ద కష్టమేం కాదనుకుంటా .... ! మనం 

ఆత్మ విచారం

 🕉️☸️🕉️☸️🕉️☸️🕉️☸️🕉️


          *_🌹నేటి ఆత్మ  విచారం 🌹_*


*_నిజానికి ఈ ప్రపంచంలో ఏది ఎవరికోసం ఆగదు. ఏది ఏ ఒక్కరిపైనో ఆధారపడి లేదు._*


*_మనలో ప్రతివాళ్ళము ప్రత్యామ్నాయం లేనంత ప్రత్యేకమైన  వాళ్ళమేమి కాదు. ఆ సమయానికి, ఆ రంగానికి అప్పటివరకు మనం ముఖ్యమే కావొచ్చు !కానీ మన చోటును, మన లోటును మరొకరు భర్తీ చేయలేనంత ముఖ్యమేమి కాదని మాత్రం ప్రతి ఒక్కరమూ తెలుసుకోవాలి._* 


*_మనం చాలా సార్లు ఈ కఠిన వాస్తవాన్ని విస్మరిస్తాం. తలపెట్టిన పనిలో ఏ కాస్త ప్రావిణ్యం పెరిగినా మనను మించిన వాళ్లే లేరని విర్రవీగుతుంటాం. మనలా మరొకరు పనిచేయలేరని మనకు మనమే భుజకీర్తులను తగిలించు కుంటూ ఉంటాం._* 


*_ఇంతకు మించిన అవివేకం మరోటి లేదు. ఎంతటి గొప్ప కార్యసాధకులైన నిమిత్తమాత్రులే ! ఆ సమయంలో అక్కడ అందుబాటులో ఉన్నాం కాబట్టి ఆ విధాత మనల్ని ఉపయోగించుకుంటున్నాడు. అంతే ! అనుకోవాలి._*


*_అందుకే "తాను చేయకపోతే ఆ పని ఆగిపోతుందని ఎవరు అహంకరించకూడదు. భగవంతుడు తాను చేయించాలనుకున్న కార్యాన్ని ఎలాగైనా చేయించుకుంటాడు ._*


*_ఎవరికి ఏది దక్కాలో అది ఎలాగైనా దక్కి తీరుతుంది. మన ద్వారా కాకపోతే మరొకరి ద్వారా వారి సంకల్పం నెరవేరుతుంది. అలా వారి ఆశలు, ఆశయాలు ఫలించటానికి మనం వాహకులమే కానీ కారకులం మాత్రం కాదని మరిచిపోకూడదు._*


*_అలా కాకుండా  " నేనే ఆనాడు వారికీ ఆ సాయం చేసి ఉండకపోతే..."  అని స్వోత్కర్షకు పొతే అది మన అనుభవరాహిత్యం._*


*_"నేను కూయందే పొద్దు పొడవదు " అని కోడి మిడిసి పడితే అది దాని అమాయకత్వం. అలాగే " నేను లేనిదే ఈ పని ముందుకు సాగదు " అని ఎవరైనా కళ్ళు నెత్తికెక్కించుకుంటే అది వారి అవివేకం._*


*_ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరిగే తీరుతుంది ! ఈ ప్రపంచంలో ఏ ఒక్కరిదీ, మరెవ్వరూ భర్తీ చేయలేనంత ప్రత్యేకమైన స్థానమేమీ కాదు. మనం కాకపోతే మరొకరు. మన కన్నా మించిన వాళ్ళు మన పాత్రను పోషించడానికి వస్తారు._*


*_అయితే ఎంతచేసిన మనకు ఏమి విలువ ఉండదా.. ? ఎక్కడ ప్రాముఖ్యత లభించదా.. ? గుర్తింపు దక్కదా...? అని మథనపడాల్సిన అవసరం లేదు.మన సామర్త్యానికి, శ్రమకి, ఆ సర్వేశ్వరుడు సరైన రీతిలో స్పందిస్తూనే ఉంటాడు. ఫలితాన్ని ప్రసాదిస్తూనే ఉంటాడు. అనుకువగా ఉంటే ఆశించిన దానికన్నా...అర్హతకు మించి ఆయన మనకు అందిస్తాడు._*


*_✡సర్వేజనాః_* *_సుఖినోభవంతు._*🙏


    🌺 *_🕉* 🌸 🙏


💦🌺🌻🌸💦🌺🌻🌸💦🌺

పరమశివుని

 Sri Siva Maha Puranam


PART -- 2


పరమశివుని లీలా మూర్తులలో పదమూడవ మూర్తి హరిహరమూర్తి. అనగా ఆయన శరీరంలో సగభాగమును శ్రీమహావిష్ణువు స్వీకరించారు. అలా పరమశివుణ్ణి ప్రసన్నుడిని చేసుకొని శరీరంలో సగాభాగామును స్వీకరించిన మూర్తిని హరిహరమూర్తి అంటారు. 'నీవు ఎటువంటి భక్తితో ఎటువంటి ఉపాసన చేసి శంకరుని అర్ధభాగమును పొందావో ఆ ఉపాయమును నాకు చెప్పవలసినది' అని పార్వతీ దేవి నారాయణుణ్ణి ప్రార్థన చేస్తే, శ్రీమన్నారాయణుడు పార్వతీదేవికి ఉపదేశం చేసిన స్తోత్రమే శివాష్టోత్తర శతనామ స్తోత్రము. ఈ శివాష్టోత్తర శత నామ స్తోత్రమును ఆధారము చేసుకొని పార్వతీ దేవి శంకరుని శరీరంలో అర్థ భాగమును పొందింది. అది పదునాల్గవ స్వరూపము. దానిని అర్ధనారీశ్వర స్వరూపము అని పిలుస్తారు. మనుష్య జన్మ ప్రయోజనం భగవంతునితో ఐక్యమే కనుక శివాష్టోత్తర శతనామ స్తోత్రమును ప్రదోష వేళలో చదవడం ఇహమునందు సమస్తమయిన కోరికలను తీరుస్తుంది. పరలోక సుఖమును, భగవంతుని అనుగ్రహమును మనయందు ప్రసరింపజేస్తుంది. 

‘శివో మహేశ్వరః’ అని పిలుస్తారు. ‘మహేశ్వరః’ అనబడే నామము చిత్రమయిన నామము. మంత్రపుష్పం చెప్పినప్పుడు 

ఈశానస్సర్వవిద్యానామీశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్!

బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం!!

అని చెపుతాము. సర్వమంగళములకు కారణం అయినవాడు, సర్వ జగన్నిమాయకుడు, సృష్టిస్థితిలయలు చేసేవాడు తానొక్కడే అయివుండి, కాని సృష్టి చేసినప్పుడు ఒకడిగా, స్థితి కారకుడిగా ఉన్నప్పుడు ఒకడిగా, లయకారకుడిగా ఉన్నప్పుడు ఒకడిగా, మూడుగా కనపడుతూ ఆయన అనుగ్రహము చేత జ్ఞానము కలిగినప్పుడు అవి మూడు కావు ఒక్కటే అన్న జ్ఞానము ఎవరి నుంచి ప్రసరిస్తుందో ఆయన మహేశ్వరుడు. ఆయనే మూడుగా కనపడే ఒక్కడి. అందుకే పోతనగారు భాగవతంలో ఒకచోట ఒకమాట అంటారు – 

మూడు మూర్తులకును మూడు రూపములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుది కభేదమై యొప్పారు బ్రహ్మమనగ నీవె ఫాలనయన’. మనము సృష్టి స్థితిలయ అని మూడు మాటలు వాడుతుంటాము. మనలో చాలామందికి ఒక తప్పు అభిప్రాయం ఉంటుంది. రుద్రుడు లేదా శివుడు అనేసరికి ఆయన సంహారకర్త, లయకారుడు, ఆయన సంహరిస్తాడు అని అనుకుంటారు. అన్నివేళలా లయము అనే శబ్దమునకు అర్థం కేవలం చంపివేయడం కాదు. పరమశివుడు చాలా ఉదారుడై ఉంటాడు. మనకు లయమునందు ‘స్వల్పకాలిక లయం’ అని ఒకమాట ఉంది. గాఢనిద్ర పట్టినట్లయితే ఆ నిద్రలో దుఃఖం తెలియదు. హాయిగా నిద్ర పట్టింది అంటాడు. ఆ హాయి అనేది ఏమిటి? మనస్సు లేకపోవడమే హాయి. గాఢ నిద్రలో ఉన్న స్థితిలో మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయి ఆత్మగా ఉండిపోతే ఎంతో సంతోషంగా ఎంతో హాయిగా ఉంటుంది. ఆ స్థితిలో బాహ్యమునకు సంబంధించిన ఎరుక అంతా ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు గొప్ప ఆనందమును పొందుతాడు. ఇలా ఆనందమును పొందిన స్వరూపము ఏదైతే ఉందో ఆ ఆనందమే శంకరుడు. ఆ ఆనందమే పరమశివుడు. మనం పొందిన ఆ నిద్రను స్వల్పకాలిక లయం అని పిలుస్తారు. తెల్లవారి నిద్రలేవగానే మనస్సు మేల్కొంటుంది. మేల్కొనడం అనగా ఆత్మనుంచి విడివడుతుంది. యథార్థమునకు సృష్టి స్థితి లయ అనేవాటిని యిక్కడే దర్శనం చెయ్యాలి. అది మహేశ్వర స్వరూప దర్శనం అవుతుంది. తెలివిరాగానే మనం చేయవలసిన పనులకు సంబంధించి మనకు ఏదో ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన అనేది మనస్సు స్వరూపం. ఆత్మగా ఉండి మీరు మొదటి ఆలోచనను చూసినట్లయితే దాని ఆలోచనలను చూడడం మీకు అలవాటు అవుతుంది. ఇదే సృష్టి. చతుర్ముఖ బ్రహ్మ దర్శనం. బ్రహ్మకి పూజలేదు. సంకల్పదర్శనం చేత మాత్రమె మీరు బ్రహ్మదర్శనం చేసేస్తారు. సృష్టి ప్రారంభం అయింది. అనగా మీ మనస్సు బయటకు వచ్చింది. ఇప్పుడు మీకు స్థితి కావాలి. స్థితి అంటే నిర్వహణ శక్తి. మనస్సు కొన్ని సంకల్పములను చేస్తుంది. వీటిని విడగొట్టగలిగిన ప్రజ్ఞ కావాలి. ఇలా చేయాలంటే మీకు సమర్థత కావాలి. ఇది నిర్వహణ సమర్థత. అటువంటి శక్తిని పొంది ఉన్నవాడు స్థితికారకుడు. అటువంటి శక్తిని స్త్రీగా చెప్తే నారాయణి అమ్మవారు. పురుషుడిగా చెప్తే శ్రీమహావిష్ణువు. కాబట్టి మీరు తప్పకుండా ప్రాతఃకాలమునందు విష్ణునామం చెప్పాలి. విష్ణుశక్తి మీయందు ప్రసరిస్తే సాయంకాలం వరకు ఆ ప్రజ్ఞ అలా వెడుతుంది. అందుకని విష్ణుపూజతో, విష్ణు నామంతో రోజు ప్రారంభం కావాలి. తరువాత మీరు అభిషేకం చేసుకోవచ్చు, శివార్చన చేసుకోవచ్చు. కానీ విష్ణునామంతో ప్రార్థించాలి. మనకు భగవంతుడు ఒక్కడే. కానీ మనకు ప్రయోజనం చేకూర్చడానికి అన్ని రూపములను పొందాడు. రాత్రి నిద్రపోయే ముందు 11 మార్లు శివనామం జపించి విశ్రాంతి స్థానమునకు శరీరమును చేర్చివేయాలి. ఇప్పుడు ఈ శివానుగ్రహం స్వల్పకాలికలయం. శివనామము చెప్పి నిద్రపోతే ‘నిద్రాసమాధి స్థితి’ – అది సమాధి స్థితి అవుతుంది. తొలి తలంపు ఏది వస్తుందో దానిని మీరు ఈశ్వరుని వైపు తిప్పడం మనస్సుకు ప్రయత్నపూర్వకంగా అలవాటు చెయ్యాలి. అపుడు మీరు కాలమునందు ఒకరోజు అనబడే విభాగమును మహేశ్వరుడిగా మారుస్తున్నారు. ఇది మహేశ్వరార్చనము. 

ఈ మహేశ్వరార్చన చేత మీరు మహేశ్వరుడు అయ్యారు. ఎలా? మొట్టమొదట ఆలోచన బయటకు వస్తూనే మనస్సుకి ఒక అలవాటు ఉండాలి. మీకు కూడా మీ మనస్సుకు తర్ఫీదు ఇవ్వడం రావాలి. నిద్రలేవగానే అది మొదటి సంకల్పం ఏమి చెప్పాలంటే –సాధారణంగా ఎడమవైపు నిద్ర పొమ్మని శాస్త్రం చెపుతోంది. మీరు నిద్రలేవగానే నీ దృష్టి ప్రసారం తిన్నగా మీరు ఆరాధించే దేవతా స్వరూపము మీద పడాలి. అలా లేవగానే దేవతా స్వరూపమును చూడడం మొదటిగా మనస్సుకు మీరు అలవాటు చేయాలి. అంతేకానీ, టైం అయిపోతోందని గడియారం వంక చూస్తూ కంగారు కంగారుగా లేవడం అలవాటు కాకూడదు. నిద్రలేవగానే మీ తలను తిప్పి కళ్ళు విప్పితే మొట్టమొదటి దృష్టి పరమేశ్వర మూర్తి మీద పడడం చేత పరావర్తనం చెంది ఆ పార్వతీ పరమేశ్వరులు లేక లక్ష్మీ నారాయణుల దర్శనం జరిగి ఈ కంటితో చూసి లేచిన తర్వాత కాలు పెట్టేముందు మనస్సునందు మరల ‘సముద్రవసనే దేవి పర్వత స్తనమండలే’ అని శ్లోకం చెప్పి క్రిందకి దిగగానే గురువుగారూ, మీరు నాకు ఉపదేశం చేశారు – మీరు చెప్పిన బుద్ధితో ఈరోజు నారోజు గడుచుగాక’ అని నేలమీద పది గురువుగారి పాదములను ఒక్కసారి మనస్సులో ధ్యానం చేసి, వారి పాదములకు శిరస్సు తాటించి పైకి లేవాలి. ఇది మీకు అలవాటు అయితే మీకు తెలియకుండా మీకు మొదటి ఆలోచన రావడానికి సాక్షి అవుతుంది. ఇపుడు ఈ ఆలోచనను మీరు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదీ స్థితికారకత్వం. 

లలితాసహస్రంలో అమ్మవారికి 'భావనామాత్ర సంతుష్టాయై నమః' అని ఒక నామం ఉన్నది. నీ భావన చేత ఆవిడ సంతుష్టురాలవుతుంది. మీ మనస్సులో మీరు మంచి భావన చేస్తుంటే అక్కడ ఆమె ఆనందిస్తుంది. మనలోవున్న శక్తి అంతా ఆవిడే! ఇక్కడవున్న ప్రకృతి వికారమయిన శరీరము ఆవిడ. ఇది ఆయనను కోరుతోంది. దీనిని దానితో కలపాలని ఆవిడ తెరపైకెత్తుతుంది. ఇది మాయ అన్న యవనికను ఒకరోజున పైకి ఎత్తేస్తుంది. అప్పుడు మీరు దానితో కలుస్తారు. అప్పుడు మీరు జీవితంలో అనుసంధాన ప్రక్రియగా వెళ్ళవలసిన మహేశ్వర స్వరూపము. అంతేకాని - మహేశ్వర స్వరూపమనగా ఏదో దేవతలందరి చేత పూజించబడేవాడు అని అనుకోకూడదు. అలా అనుకోవడం దోషం కాకపోవచ్చు. కాని మీరు అలా అనుసంధానం చేసుకుంటే అది భక్తికి బాగా పనికొస్తుంది. కాని ఇది మీరు నిత్యజీవితమునందు అలవాటులోకి తెచ్చుకోవలసిన ప్రక్రియ. మీరు యిలా దర్శనం చేస్తూ వెడుతున్నట్లయితే మీ లయ పరమశివుడు. నిద్రలేవగానే మిమ్మల్ని ఎవరయినా 'మీరు ఇప్పటిదాకా ఎవరితో కలిసి ఉన్నారు' అని అడిగినట్లయితే అపుడు మీరు ధైర్యంగా 'నేను ఇప్పటివరకు కైలాసమునందు పార్వతీ పరమేశ్వరులతో కలిసి వున్నాను - అదీ నా నిద్ర' అని చెప్పగలగాలి. ఎందుచేత? నేను ణా నిద్రను పడుకోబోయే ముందు అలా స్వీకరించాను. నేను లేచినప్పుడు చతుర్ముఖ బ్రహ్మ దర్శనమే ణా మేల్కొనుట. ణా పూజామందిర ప్రవేశము స్థితికర్త ప్రార్థన. నా నిన్నటిరోజు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తల సమాహారము. అది మహేశ్వర స్వరూపముగా నాచేత ఉపాసన చేయబడిన కాలము. కనుక నేను మహేశ్వరోపాసన చేత మరొక మాహేశ్వరుడను అయినాను. ఇది మీ జీవితమునందు రావలసిన ప్రక్రియ. ఇలా చెయ్యగా చెయ్యగా భ్రమరకీటక న్యాయంలో ఒకనాడు మీరు ఆ స్వరూపమును పొందుతారు. ఇలా కాకుండా వేరొక రకమయిన ఆలోచనతో వ్యగ్రతతో జీవితం వెళ్ళిందంటే అసలు ఆత్మలోంచి విడివడడంలో మీకు కృతజ్ఞతా భావం కలగదు. 

మహేశ్వర శబ్దం గురించి –

తమీశ్వరాణాం పరమం మహేశ్వరం తమ్ దేవతానాం పరమం చ దైవతం’ దేవతలు అందరూ కూడా ఎవరికీ ప్రార్థన చేసి నమస్కరిస్తారో, సర్వ జగత్తును ఎవరు నియమించి, పోషించి రక్షిస్తున్నాడో, ఎవడు దీనిని నిలబెడుతున్నాడో, ఎవడు దీనిని తనలోకి తీసుకుంటున్నాడో వాడే మహేశ్వరుడు. వాడు సర్వ జగన్నియామకుడు. వాడు పరబ్రహ్మమయి ఉన్నాడు. ఇటువంటి పరబ్రహ్మము ఎక్కడ దర్శనం అవుతుంది? దానిని మనం చూడగలమా? దీనికి శాస్త్రం సమాధానం చెప్పింది. మహేశ్వర దర్శనం చేయడానికి ముందుగా మీకు మహేశ్వర దర్శనం చేయాలన్న తాపత్రయం కలగాలి అని చెప్పింది. ఒక్కొక్కరు చాలా పెద్ద చదువులు చదువుకుంటారు. అలా చదువుకోవడం గొప్ప కాదు. అలా చదువుకున్న చదువును నిరంతరం ఎవరయితే అనుష్ఠానంలోనికి తెచ్చుకుంటారో వారు గొప్పవారు. అటువంటి వారు మహాపురుషులు అవుతారు. చదివిన విషయమును ఆచరణలో పెట్టడానికి శ్రద్ధ కావాలి. చెప్పాం కాదు., అనుష్ఠానం లో ఉండాలి. ఈశ్వరుడు సర్వసాక్షి. ఆయన చూస్తున్నాడు అనే బెరుకు మీకు ఉన్నట్లయితే, ఒకడు చూసి మిమ్ము మెచ్చుకోవాలని మీరు పనులు చేయరు. అ పనులు చేయడం మీవిదిగా భావించి పనులను చేస్తారు. శివ పురాణమును ఒక కథగా వినే ప్రయత్నం మీరు చేయకూడదు. అలా చేస్తే అది మీ జీవితమును అభ్యున్నతి మార్గం వైపు తీసుకువెళ్ళదు. శివపురాణం మన నిత్యజీవితంలో ఎలా ఉపయోగపడుతుందో మనం ఆలోచించాలి. ఈశ్వరుడిని చూడాలి అనే తాపత్రయం మీరు సృష్టి స్థితి లయానుసంధానం నిరంతర ప్రక్రియగా చెయ్యడంలో ఉంటుంది. ఆయన –

సర్వజ్ఞాతా తృప్తి రనాది బోధః స్వతంత్రతా నిత్యమలుప్త శక్తిః 

అనంత శక్తిశ్చ విభోర్విధిజ్ఞాత షడాహురంగాని మహేశ్వరస్య’ అంది శాస్త్రం. 

కొన్ని విషయములను కన్ను చూసినా మనస్సు వాటిని పట్టుకోదు. మనం ఒకచోట కూర్చుని కంటితో అన్నిటినీ చూస్తున్నా అల చూస్తున్నవాటిలో కొన్నిటిని మాత్రమే గుర్తు పెట్టుకోగలము. కానీ ఈశ్వరుడు అలా కాదు. మహేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయగతమయిన అభిప్రాయములను కూడా తెలుసుకోగలడు. 

మీ మనస్సును ఈశ్వరుని పాదముల మీద పెట్టగలిగితే ఈశ్వరుడు మీవెంట పడుగెడతాడు. మీ మనస్సు అక్కడ పెట్టడానికి మీరు చేస్తున్న పరిశ్రమకు ‘పూజ’ అని పేరు. అలా భగవంతునియందు మనస్సును కేంద్రీకరించి పూజ చేయడం అలవాటు చేసుకోవాలి. అది అలవాటు అయితే మీరు ఏ ప్రదేశంలో వున్నా పూజ చేసుకోగలుగుతారు. కాబట్టి పరమేశ్వరుడు హృదయగతాభిప్రాయమును పట్టగలిగినవాడు. దీనికే సర్వజ్ఞత అంటారు. సర్వజ్ఞత, స్వతంత్రత అనేవి రెండూ ఈశ్వరుడితో ముడిపడి ఉంటాయి. ఏకకాలమునందు సమస్త చరాచర జగత్తులో వున్న ప్రాణుల హృదయాంతర్గత భాగములను తాను చూస్తాడు. చూసి ఆ భావముల పరిపుష్టి చేత మోక్షమును కూడా అనుగ్రహిస్తాడు. పైకి చూస్తే ఈవిషయము మీకు ఒక్కనాటికీ దొరకదు.

ధార్మిక కార్యక్రమాలు


 

ధార్మిక ప్రాధాన్యత*

 *ధార్మిక ప్రాధాన్యత*


గుడిలో దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే అష్టోత్తరశతనామావళితో పూజిస్తాము. ఆ దేవుని నామస్మరణ చేసుకోవాలంటే 108 పూసలు ఉన్న మాలని వాడతాము. 108 అన్న సంఖ్య అనాదిగా మన పురాణాలలో కనిపిస్తూనే ఉంటుంది. క్షీరసాగరమథనంలో సైతం 54 మంది రాక్షసులు, 54 దేవగణాలు కలిసి చిలికిచిన సాగరంలోంచి అమృతం వెలికి వచ్చింది. మనిషిలో మంచీ, చెడు లక్షణాలు రెండూ ఉంటాయనీ... వాటిలో మంచిది పైచేయి అయినప్పుడు అమృతమయమైన మోక్షాన్ని సాధించగలుగుతామనీ ఈ ఉదంతంలోని ఉద్దేశం కావచ్చు. అలా 108 మనలోని పరిపూర్ణతకు ఒక చిహ్నంగా భావిచవచ్చునేమో! కేవలం క్షీరసాగరమథనమే కాదు- వైష్ణవ దివ్యదేశాలు, శ్రీ కృష్ణుని ముఖ్య గోపికలు... ఇలా మన ధార్మిక జీవితంలో అడుగడుగునా 108 ప్రసక్తి వస్తూనే ఉంటుంది.


పాశ్చాత్య విజ్ఞానం ఇంకా తప్పటడుగులు వేస్తుండగా, వందల ఏళ్ల క్రితమే మన ఖగోళశాస్త్రం పరిపక్వతకు వచ్చిందన్నది ఓ నమ్మకం. దాదాపు పదిహేను వందల సంవత్సరాల క్రితమే వెలువడిన సూర్యసిద్ధాంతంలో, ఎక్కడో సుదూరాన ఉన్న శనిగ్రహపు చుట్టుకొలతను సైతం అంచనా వేయగలిగారు. అంతేకాదు! సూర్యుడి కిరణాలు, భూమిని చేరేందుకు ఎంత సమయం పడుతుందో కూడా చెప్పగలిగారు. ఇంతటి సూక్ష్మమైన లెక్కలు కట్టగలిగిన వీరికి ఈ విశ్వసృష్టిలో 108కి ఉన్న ప్రాధాన్యత ఎరుకలోకి వచ్చే ఉంటుంది. ఉదాహరణకు- సూర్యుని చుట్టుకొలతను 108తో హెచ్చిస్తే భూమికీ, సూర్యునికీ మధ్య ఉన్న దూరం వస్తుంది. అలాగే చంద్రుని చుట్టుకొలతను 108తో హెచ్చిస్తే భూమికీ, చంద్రునికీ మధ్య ఉన్న దూరం వస్తుంది. ఇక సూర్యుడు దాదాపు భూమికి 108 రెట్లు పెద్దగా ఉంటాడు. ఈ గణాంకాలన్నీ ఖచ్చితంగా కిలోమీటర్లు, మీటర్లతో సహా సరిపోలవు కానీ... 108కి అతి చేరువలో మాత్రం ఉంటాయి.

 

మన పెద్దలు స్థూల ప్రపంచంలో ఉన్న ఈ సంఖ్యను మానవ ధార్మిక, లౌకిక జీవితానికి ఆపాదించారేమో అన్న సందేహం కలుగక మానదు. అందుకు ఉదాహరణగా మన జాతకచక్రాలనే తీసుకోవచ్చు. పిల్లవాడు పుట్టిన సమయం ఆధారంగా అతను ఫలానా నక్షత్రంలోని ఫలానా పాదం అని అంచనా వేస్తాము. అలా 27 నక్షత్రాను నాలుగేసి పాదాలతో హెచ్చిస్తే 108 పాదాలు వస్తాయి. అంటే పుట్టినవారందరూ కూడా 108 వర్గాలలో ఏదో ఒక కోవకి చెందాల్సిందే అన్నమాట. ఈ రకంగా 108ని మన జీవితానికి అడుగడుగునా అన్వయించపేచేందుకు పెద్దలు ప్రయత్నించినట్లు కనిపిస్తుంది. ఆఖరికి ఆ జీవితంలోని తత్వం అర్థం చేసుకునేందుకు రాసిన ఉపనిషత్తుల సంఖ్య కూడా 108.


మన పూర్వీకులు మనిషిని ఈ విశ్వంలోని ఒక భాగంగానే గమనించారు. ప్రపంచం మనిషినీ, మనిషి ప్రపంచాన్ని ప్రభావితం చేయగలరని నమ్మారు. అందుకు అనుగుణంగానే జీవనశైలిని రూపొందించుకున్నారు. దానికి ఈ 108 సంఖ్య గొప్ప ఉదాహరణగా నిలిచిపోతుంది. ఈ విశ్వానికీ 108 అన్న సంఖ్యకూ ఎక్కడో లంకె ఉన్నదన్న విషయాన్ని మన పెద్దలు నమ్మబట్టే దానికి అనుగుణంగా ధార్మిక సూత్రాలను ఏర్పరుచుకొన్నారు.

హోమాలు

 🛕🚩 *హిందూ ఆధ్యాత్మిక వేదిక...

=======================


*హోమాలు అంటే ఏంటీ..? వాటితో కలిగే ప్రయోజనాలు ఏంటి?*


ముఖ్య హోమాలు వాటి ప్రయోజనాలు ఏమిటో గమనిద్దాం :


*గణపతి హోమం*


 విఘ్నాలను తొలగించే విఘ్ననాయకుడు గణపతి. మానవులు ప్రారంభించే ప్రతి కార్యాల్లోనూ మొదటగా గణపతిని పూజించడం జరుగుతుంది. ప్రారంభించిన కార్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని కోరుతూ వినాయకుడిని పూజిస్తారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను, ప్రతికూల అంశాలను తొలగించడానికి వినాయకుడికి గణపతి హోమం నిర్వహిస్తాము. ఈ గణపతి హోమం చేయడం వలన విజయము, ఆరోగ్యము, సంపద కార్య సిద్ధి కలుగుతాయి. హిందూ ధర్మం ప్రకారం ఏ శుభకార్యం చేయాలన్నా మొదటగా గణపతి హోమంతోనే ప్రారంభించడం జరుగుతుంది. ఈ గణపతి హోమానికి అష్ట ద్రవ్యలు/ 8 రకాలు. దర్భ మొదలగునవి ఉపయోగించడం జరుగుతుంది.


*రుద్ర హోమం:-*


పురాణ కథలను అనుసరించి రుద్ర అనునది శివునికి మరొక నామము. శివుడు లేదా రుద్రుని అనుగ్రహం కొరకు చేసే హోమాన్ని రుద్రహోమము అంటారు. ఈ హోమం చేయుట వలన శివుని అనుగ్రహం పొంది తద్వారా అపమృత్యు భయాలు తొలగింపబడి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొంది శక్తి సంపన్నులు అవుతారు. దీర్ఘాయుష్షుని పొందడం జరుగుతుంది. మృత్యువు మీద విజయాన్ని సాధించడానికి కూడా ఈ రుద్ర హోమం చేస్తారు. ఏ వ్యక్తి అయితే రుద్ర హోమం చేస్తారో ఆ వ్యక్తి యొక్క జన్మ నక్షత్రం ఆధారంగా నిర్ణయించబడిన ముహూర్తానికి రుద్రహోమం జరపబడుతుంది. ఈ రుద్రహోమం అత్యంత శక్తివంతమైనది.


*చండీ హోమం:-*


హిందూ పురాణాల ప్రకారం అత్యంత శక్తిస్వరూపిణి చండీ. జీవితంలో ఎదురయ్యే కష్టాలను తొలగించడానికి, ఆనందమైన జీవితాన్ని గడపడానికి, సిరిసంపదల కోసం చండి హోమం నిర్వహించడం జరుగుతుంది. చండి హోమం నిర్వహించడం వలన జీవితంలో ఉన్న ప్రతికూల అంశాలన్నీ తొలగిపోతాయి. చండీ హోమం చేసేప్పుడు నవగ్రహాలను ఆవాహన చేసుకొని చేయడం జరుగుతుంది.చండీ హోమాన్ని ఎక్కువగా శుక్రవారం రోజు లేదా అష్టమి, నవములలో చేయడం శ్రేష్టం. సప్తశతిలో ఉన్నటువంటి 13 అధ్యాయాల ప్రకారంగా చండీహోమం చేసేందుకు 13 రకాల విభిన్నమైన పదార్థాలను వాడడం జరుగుతుంది.


*గరుడ హోమం:-*


 మానవుని శరీరాకృతి, గరుడుని ముఖము కలిగి... శ్రీమహావిష్ణువు వాహనంగా పిలువబడే దైవ స్వరూపమే గరుడుడు. గరుడుడు అనంతమైన శక్తికి, జ్ఞానానికి స్వరూపం. గరుడార్, గరుడ భగవాన్ అని పిలిచుకొనే గరుడుడికి చేసే హోమమే గరుడ హోమం. సరైన విధివిధానాలతో కనుక గరుడ హోమం చేసినట్లయితే ఆకర్షణ శక్తి పెరగడం అలాగే అనేక విషయాల పట్ల, వ్యక్తుల పట్ల ఆధిపత్యాన్ని సాధించడం, శత్రువుల మీద విజయం, ప్రమాదాల నుంచి రక్షించబడడం, అన్ని శారీరక, మానసిక వ్యాధుల నుంచి ఉపశమనం మొదలగునవి లభిస్తాయి. అంతేకాకుండా ఈ గరుడ హోమం చేయడం వలన జ్ఞానము అలాగే జ్ఞాపకశక్తి వృద్ధి జరుగుతుంది.


*సుదర్శన హోమం:-*


 శ్రీమహావిష్ణుకు చెందిన అత్యంత శక్తివంతమైన ఆయుధమే సుదర్శన చక్రం.హిందూ పురాణాల ప్రకారం ఈ ఆయుధం చాలా శక్తివంతమైన ఆయుధం అవ్వడమే కాకుండా దైవిక శక్తి కలిగి ఉండి దుష్టశక్తులను సంహరిస్తుంది. మానవుని జీవితంలో లేదా కుటుంబంలో జరుగుతున్న ప్రతికూల అంశాలకు కారణమైన దుష్టశక్తుల నుండి రక్షింపబడడానికి, నరదృష్టి తొలగించడానికి ఈ సుదర్శన హోమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గృహ ప్రవేశ సమయంలో మరియు మిగిలిన శుభకార్యాల సమయంలో కూడా సుదర్శన హోమం నిర్వహించబడుతుంది. హోమాగ్నికి అష్ట ద్రవ్యాలను సమర్పిస్తూ అత్యంత పవిత్రమైన సుదర్శన మంత్రాన్ని జపిస్తూ ఈ హోమం చేయడం జరుగుతుంది. మానవుని జన్మ నక్షత్రం ఆధారంగా నిర్ణయింపబడిన ముహూర్తాన్ని అనుసరించి ఈ హోమం చేయడం జరుగుతుంది.


*మన్యుసూక్త హోమం:-*


వేదాల ననుసరించి మాన్యు అనగా ఆగ్రహం అని, లేదా మరొక అర్థం లో తీవ్రమైన భావావేశము అని చెప్పబడుతుంది.మాన్యు దేవుడి ఆశీస్సుల కోసం చేసే హోమము మన్యుసూక్త పాశుపత హోమం. ఈ హోమాన్ని ప్రధానంగా శత్రు సంహారం కోసం చేయడం జరుగుతుంది. కోర్టు కేసుల లాంటి దీర్ఘకాలిక సమస్యల నుండి విముక్తి కోసం కూడా ఈ హోమాన్ని చేస్తారు. ఈ హోమాన్ని శనివారం చేయడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు పొందడం జరుగుతుంది.


*లక్ష్మీ కుబేర పాశుపతహోమం:-*


 హిందూ ధర్మానుసారంగా... సంపదకి దేవతలుగా లక్ష్మీ దేవిని, కుబేరున్ని పూజిస్తాము.జీవితంలో ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్న వారికోసం సూచింపబడేదే లక్ష్మి కుబేర పాశుపతహోమం.జీవితంలో ఆర్థిక వృద్ధి, సిరి సంపదల కొరకు లక్ష్మీదేవిని అలాగే కుబేరుడిని కూడా ఈ హోమంలో పూజించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ హోమాన్ని శుక్రవారం రోజున చేయడం శ్రేష్టం. ఎందుకనగా శుక్రవారాన్ని లక్ష్మీ వా పరిగణిస్తాము కనుక. హోమం చేసుకునే వ్యక్తి యొక్క జన్మ నక్షత్రాన్ని అనుసరించి నిర్ణయించబడిన ముహూర్తానికి ఈ హోమం చేయబడును. ఈ హోమం చేయడానికి కమలాలని వాడడం జరుగుతుంది.


*మృత్యుంజయ పాశుపత హోమం:-*


మరణం నుంచి విజయాన్ని పొందడమే మృత్యుంజయం.పేరులో ఉన్నట్టుగానే మృత్యువుపైన విజయాన్ని సాధించడం కోసం మృత్యుంజయ పాశుపత హోమం నిర్వహిస్తారు. ప్రాణ హాని అలాగే తీవ్రమైన అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందడం కోసం ఈ హోమం చేయడం జరుగుతుంది. దుష్టశక్తులను అదుపుచేసి, సంహరించే భూత నాథుడిగా పిలవబడే ఆ శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం చేసే హోమం చేస్తారు.ఈ హోమం చేసుకునేవారు హోమానికి సంబంధించిన మంత్రాన్ని 21సార్లు జపించవలసి ఉంటుంది. ఈ హోమం చేయడానికి కావాల్సిన ప్రధాన వస్తువులు. దర్భ, అమృత మూలిక. దీర్ఘాయుష్షును కోరుతూ హోమము చేసే వారి జన్మదినం రోజున ఈ హోమాన్ని నిర్వహిస్తారు.


*నవదుర్గ పాశుపత హోమం:-* 


భక్తుల చేత దుర్గామాత నవదుర్గగా పూజింప బడుతుంది. జట దుర్గ, శాంతి దుర్గ, శూలిని దుర్గ,శబరి దుర్గ,లవణ దుర్గ,అసురి దుర్గ, దీప దుర్గా, వన దుర్గ, మరియు జ్వాలా దుర్గ. దుర్గామాతయొక్క ఈ తొమ్మిది రూపాలను పూజించడానికి చేసే హోమమే ఈ నవదుర్గ పాశుపత హోమం.ఈ హోమం చేయడం వలన దుష్ట శక్తుల నుంచి విముక్తి, శాంతి,సంపద, ఆరోగ్యం, ఆయుష్యు, సంతానం, విద్య మొదలైనవి లభించి ప్రతికూలమైన ఆలోచనలు, ప్రతికూలమైన అంశాలను నుండి విముక్తి కలిగుతుంది.🙏🙏🙏.

ఆచార్య సద్భోదన

 *ఆచార్య సద్భోదన*


ఏ కోరిక లేని వారికి సమస్తమూ చేకూరుతుంది.


ఎవరైతే ఇతర భావాలు లేక నన్ను చింతిస్తూ ఎడతెగక ధ్యానిస్తారో నా యందే నిష్ఠ కలిగిన అట్టివారి యోగక్షేమాలు నేనే వహిస్తాను.

-భగవద్గీత.


కొందరి వద్ద ఏదీ ఉండదు. అయినా వారిలో రాచరికపు ఠీవీ ఉట్టిపడుతూ ఉంటుంది. అసలు పరిత్యాగం అంటే అర్థం ఏమిటి? మనకున్న పరిమితులను వదిలివేయడమే. అటువంటి పరిత్యాగం చేసిన వారికి అల్ప విషయాల మీదకు దృష్టి మళ్ళదు. 


సంతోషం కోసం అందరూ అర్రులు చాస్తూ ఎదురుచూస్తారు, కానీ *నాది, నేను* అనే రుగ్మతలు దానిని అందనివ్వక నిరోధిస్తాయి. 


మన ఆలోచనా పరిణతి మారే కొద్దీ ఆశ, అహంకారం, ఈర్ష్యలనే సంకుచిత వలయాల నుండి బయటకు వస్తాం. మహాత్ములకు భౌతిక వస్తువుల పట్ల ఏ మాత్రం వ్యామోహం కలగదు. సన్నిపాత జ్వరంలో అధిక ఉష్ణం వలన మతి స్థిరంగా లేక అన్నీ వంకరగా తోస్తాయి. అదే విధంగా ప్రాపంచికత అనే జ్వరం ఉన్నా వాస్తవం అపసవ్యంగా కనిపిస్తుంది.


*శుభంభూయాత్*

అరటిపళ్ళు

 సురేష్ తన తోటలోని అరటిచెట్టులోని 100 అరటిపళ్ళు ఉన్న గెలను కోసి తన ఇంటి పనివాడైన రాముడిని పిలిచి గుడిలో ఈ గెలను ఇచ్చి రమ్మని చెప్పడు 

రాము అలాగే అయ్యగారని చెప్పి వెళ్ళాడు 

ఆరోజు రాత్రి సురేష్ కి దేవుడు కలలో కనిపించి 

సురేష్ నువ్వు పంపిన ఒక్క అరటిపండు నాకు అందింది అని చెప్పడు 

ఉలిక్కిపడి లేచి సురేష్ ఆశ్చర్యపోయాడు నేను 100 పళ్ళు పంపితే దేవుడు ఒక్కటే అందిందని అంటున్నాడే అని 

రాముని పిలిచి వెంటనే అడిగాడు 

రాము అయ్యా నేను గుడిలో గెలను ఇచ్చానయ్యా అని చెప్పడు 

సురేష్ కి కోపం వచ్చింది కాస్త గట్టిగ అరిచాడు 

రాము నిజాయితీగా నువ్వు చేసిన తప్పు ఒప్పుకో అన్నాడు 

రాము భయపడిపోయి అయ్యా నిజం చెప్పేస్తాను 

గుడికి వెళ్ళే దారిలో ఒక అతను చాలా ఆకలిగా ఉందని అడిగాడు అతనికి ఒక్క పండు ఇచ్చాను మిగతా అంత గుడిలో ఇచ్చాను అని చెప్పడు 


అప్పుడు అర్థం అయ్యింది సురేష్ కి 

ఆకలితో ఉన్నవాడికి ఇచ్చిన పండు ఆ పరమాత్ముడికి చేరుతుంది అని 

గుడిలో లక్షలు పోసి హోమాలు చేయడం కాదు ఆకలి అనేవారికి అన్నం పెట్టడం ఆ దేవుడికే సేవ చేసినట్టు 


పేదవారికి మనం చేసే సాయం ఆ భగవంతుడితో మన మొర ఆయనకు ప్రత్యక్షంగా విన్నవించుకున్నట్టే.

సద్విమర్శ

 *సద్విమర్శ* 


🍁🍁🍁🍁


మనిషి ఎంత ఎత్తుకు ఎదిగితే అంత కఠినమైన పరీక్షలను, విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది.


 ప్రపంచ చరిత్రలో మహత్కార్యాలను సాధించిన మహనీయులెందరో ఎన్నో అపజయాలను, విమర్శలను చవిచూశారు. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అద్భుతాలు సాధించారు. 


సాహసాలు, సత్కార్యాలు సాధించాలనుకున్నప్పుడు ఇతరులు ఎగతాళి చేసినా, విమర్శించినా వెనకంజ వేయకూడదు.

 ఏకాగ్రతతో మన పని మనం చేసుకుంటూ ముందుకుసాగాలి. మార్పును అభిలషించాలి. నవ్విన నాపచేను పండుతుందని, మనల్ని అవహేళన చేసినవాళ్లే మన గురించి గొప్పగా చెప్పుకొనే రోజులు వస్తాయని గట్టిగా నమ్మాలి.



విమర్శలు కటువుగా ఉంటే మానవ సంబంధాలు దెబ్బతింటాయి. అందుకే ఎవరినైనా విమర్శించేటప్పుడు విజ్ఞత పాటించాలి. సాధ్యమైనంత వరకు మన విమర్శలు సద్విమర్శలుగా ఉండాలి. అవే మనిషి మానసిక వికాసానికి తోడ్పడతాయి.


 స్వామి వివేకానంద ఎదుటి వారిని ‘నీవు బాగా పనిచేయడం లేదని అనడం కన్నా- నువ్వు చక్కగా చేస్తున్నావుకాని ఇంకా చక్కగా చేయగలవు’ అని సున్నితంగా సూచనలివ్వాలని అనేవారు. విమర్శలు ఎదుటివారు చేస్తున్న పనిని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉండాలి. అంతే తప్ప, వారిని తప్పు పడుతున్నట్లుగా ఉండకూడదు.



విమానం కనిపెట్టేముందు రైట్‌ సోదరులు, అమెరికా అధ్యక్షుణ్ని కావాలని ఉందని చిన్నప్పుడే అనుకున్న బిల్‌క్లింటన్‌ సైతం ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. వాటిని ధైర్యంగా ఎదుర్కొని తమతమ రంగాల్లో పరిణతి సాధించారు. ఎన్నిసార్లు ఓటమి ఎదురైనా తనకున్న ఆత్మవిశ్వాసమే థామస్‌ ఆల్వా ఎడిసిన్‌ను ఎలక్ట్రిక్‌ బల్బ్‌ కనిపెట్టేలా చేసింది.



ఇతరుల ఉన్నతిని చూసి కొంతమంది ఈర్ష్యతో రగిలిపోతుంటారు. ఎవరైనా మంచిపని చేస్తే మెచ్చుకునే బదులు విపరీత బుద్ధితో విమర్శించే కుసంస్కారులే ఎక్కువగా కనిపిస్తుంటారు. ఒకరి ఉన్నతిని చూసి సహించలేకపోవడం మాత్సర్యం. అది లేనప్పుడే ఆత్మతత్వం తెలుస్తుంది. 


దైవాంశ సంభూతుడైన కపిలమహర్షి తన తల్లికి వేదాంత సారాన్ని బోధిస్తూ ఇలా అంటారు ‘నేను నిరంతరం అన్ని జీవుల్లోనూ ఆత్మ స్వరూపుడనై ఉన్నాను. కాబట్టి మానవుడు తన తోటి మానవుణ్ని కించపరిస్తే అది ఆత్మస్వరూపుడైన నన్నే కించపరచడమవుతుంది’!


ఎదుటివారిని కించపరచేవాళ్లు చేసే పూజలు పూజలు కావు. జీవులను అవమానించే స్వభావం ఉన్నవారు నానాఫల, పుష్పాదుల చేత చేసే పూజలతో దైవం సంతృప్తి చెందే ప్రసక్తే తలెత్తదు. అంటరానితనం పాటించడం, తోటి మానవుల్ని నీచంగా చూడటం, కులమత వైషమ్యాలకు ఆజ్యంపోయడం లాంటి కార్యాలు చేయడం దైవానికి సమ్మతం కావు.


 ‘సర్వజీవుల్లోనూ ఆత్మస్వరూపుడనైన నన్ను అభేద భావంతో అర్చించడమే నాకు ప్రీతికరం’- ఇది సజీవ జీవకోటిలో ఉన్న దైవాన్ని ఎలా అర్చించాలో కపిలమహర్షి వివరించిన వైనం. 


తోటివారిలో భగవంతుణ్ని చూసేవారు ఎవరినీ నిందించరు. కటువుగా విమర్శించరు. మంచి సలహాలతో, సద్విమర్శలతో ఎదుటివారిని ప్రోత్సహిస్తారు.



సద్విమర్శలు మన పురోగమనానికి దారిచూపే కాంతిపుంజాలు. మన వికాసానికి తగిన పాఠాలై అవి మార్గదర్శకాలవుతాయి. మన వివేచనను, వివేకాన్ని జాగృతం చేస్తాయి. వాటిని స్వీకరించి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను తప్పక సాధిస్తాం. విజయ శిఖరాలను అధిరోహిస్తాం!

(ఈనాడు అంతర్యామి)



🍁🍁🍁🍁

శివామృతలహరి


.శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన

 #శివామృతలహరి శతకంలోని మరొక పద్య రత్నం;


మ||

విడువం బోను భవత్పదాబ్జయుగళిన్ విశ్వేశ ! నీ అందె స

వ్వడిలో గొంతుక కల్పిపాడెడి మహాభాగ్యంబు నాకిమ్ము: బో

యడు కన్నప్పకు ముత్తితాయ మిడలేదా యంచు వేధించెదన్

సిడివెట్టన్ తనయుండు కిన్కదగునే ? శ్రీ సిద్ధలింగేశ్వరా !


భావం;

స్వామీ విశ్వేశ్వరా! నీ రెండు పాదాలను ఎప్పుడూ విడవను.

నీవు నాట్యం చేస్తున్నప్పుడు నీ కాలి  అందె సవ్వడితో పాటు నేనుకూడ గొంతు కలిపి నిన్ను స్తుతించే భాగ్యాన్ని నాకు కలుగ జెయ్యి.

బోయడైన భక్త కన్నప్పకు ముక్తి అనే తాయిలన్ని ప్రసాదించావు కదా! అదేవిధంగా నాకెందుకు అవకాశం కల్పించవు అని నిన్ను వేధిస్తూ ఉంటాను.

తనయుడు గుక్కపట్టి ఏడుస్తుంటే నువ్వు పరాకుగా ఎలా ఉండగలవు తండ్రీ! శ్రీ సిద్ధ లింగేశ్వరా!

FRANCE ANNOUNCED 2ND

 FRANCE ANNOUNCED 2ND PHASE OF LOCK DOWN FOR 2 WEEKS.

GERMANY DECLARED LOCKDOWN FOR 4 WEEKS,

ITALY ALSO TO FOLLOW SHORTLY...

ALL THESE COUNTRIES CONFIRMED THIS SECOND WAVE IS MORE DEADLIER...

IN INDIA WE ARE HEADING TO THE COUNTRYS MOST CELEBRATED FESTIVAL DIWALI...TAKE UTMOST CARE AND MANTAIN ALL PRECAUTIONS ALSO BECOME COMMUNICATORS OF THE ALERT AMONG ALL FRIENDS AND RELATIVES...SAVE INDIA FROM SECOND WAVE...

WE WILL NOT BE ABLE TO TAKE THE 2ND PHASE OF LOCKDOWN...

PLZ SHARE...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Gotra Vs Gene*

 *Gotra Vs Gene*

~~~~~~~~~~~~~

*Do you know why every time you sit in a puja the priest asks you for you Gotra ?*_❓


*Science behind Gotra (GENETICS) is nothing but what is today popularly known as _GENE ~ MAPPING_*


*What is Gotra system ?*


*Why do we have this system ? Why do we consider this to be so important to decide  marriages ?*


*Why should sons carry the gotra of father, why not daughter ?*


*How/why does gotra of a daughter change after she gets married ? What is the logic ?*


*Infact this is an amazing genetic science we follow.Let's see the SCIENCE of GENETICS behind our great GOTRA systems.*


*The word GOTRA formed from two sanskrit words GAU (means cow) and Trahi (means shed).*


*Gotra means cowshed.*


*Gotra is like cowshed protecting a particular male lineage. We identify our male lineage / gotra by considering to be descendants of the 8 great Rishi (Sapta rishi + Bharadwaj rishi). All the other gotra evolved from these only.*


*Biologically, human body has 23 pairs of chromosomes (one from father and one from mother) on these 23 pairs, there is one pair called sex chromosomes which decides the gender of person.*


*During conception if the resultant cell is XX chromosomes then the child will be girl, if it is XY then it is boy.*


*In XY - X is from mother and Y is from father.*


*In this Y is unique and it doesn't mix. So in XY, Y will supress the X and son will get Y chromosomes. Y is the only chromosome which gets passed down only between male lineage. (Father to Son and to Grandson).*


*Women never gets Y. Hence Y plays a crucial role in genetics in identifying the genealogy. Since women never get Y the Gotra of the woman is said to be of her husband.*


*They are 8 different Y chromosomes from 8 Rishis. If we are from Same Gotra then it means we are from same root ancestor.*


*Marriages between same Gotra will increase the risk of causing genetic disorders as same Gotra Y chromosomes cannot have crossover and it will activate the defective cells.*


*If this continues, it will reduce the size and strength of Y chromosome which is crucial for the creation of male.*


*If no Y chromosome is present in this world, then it will cause males to become extinct.*


*So Gotra system is a method to avoid genetic disorders and attempt to protect Y chromosome.*


*Amazing bio-science by our Maharishis. Our Heritage is unarguably THE GREATEST.*


*Our Rishis had the _"GENE MAPPING"_ sorted out thousands of years ago...*


గోత్రా Vs జీన్

~~~~~

మీరు పూజలో కూర్చున్న ప్రతిసారీ పూజారి మీ కోసం గోత్రా ఎందుకు అడుగుతున్నారో మీకు తెలుసా? _❓


గోత్రా (జెనెటిక్స్) వెనుక ఉన్న శాస్త్రం ఈ రోజు GENE ~ MAPPING గా ప్రసిద్ది చెందింది.


గోత్రా వ్యవస్థ అంటే ఏమిటి?


మనకు ఈ వ్యవస్థ ఎందుకు ఉంది? వివాహాలను నిర్ణయించడానికి ఇది చాలా ముఖ్యమైనదిగా మేము ఎందుకు భావిస్తాము?


కుమారులు తండ్రి గోత్రాన్ని ఎందుకు మోయాలి, కుమార్తె ఎందుకు కాదు?


కుమార్తె వివాహం అయిన తర్వాత గోత్రా ఎలా / ఎందుకు మారుతుంది? తర్కం ఏమిటి?


ఇది మేము అనుసరించే అద్భుతమైన జన్యు శాస్త్రం. మన గొప్ప గోత్రా వ్యవస్థల వెనుక జన్యుశాస్త్రం యొక్క శాస్త్రాన్ని చూద్దాం.


గోట్రా అనే పదం GAU (అంటే ఆవు) మరియు ట్రాహి (అంటే షెడ్) అనే రెండు సంస్కృత పదాల నుండి ఏర్పడింది.


గోత్రా అంటే ఆవు.


గోత్రా ఒక నిర్దిష్ట మగ వంశాన్ని రక్షించే ఆవు వంటిది. 8 గొప్ప రిషి (సప్త రిషి + భరద్వాజ్ రిషి) యొక్క వారసులుగా పరిగణించడం ద్వారా మేము మా మగ వంశం / గోత్రాన్ని గుర్తించాము. మిగతా గోత్రాలన్నీ వీటి నుండి మాత్రమే ఉద్భవించాయి.


జీవశాస్త్రపరంగా, మానవ శరీరంలో ఈ 23 జతలలో 23 జతల క్రోమోజోములు (తండ్రి నుండి ఒకటి మరియు తల్లి నుండి ఒకటి) ఉన్నాయి, సెక్స్ క్రోమోజోములు అని పిలువబడే ఒక జత ఉంది, ఇది వ్యక్తి యొక్క లింగాన్ని నిర్ణయిస్తుంది.


గర్భధారణ సమయంలో ఫలిత కణం XX క్రోమోజోములు అయితే పిల్లవాడు అమ్మాయి అవుతుంది, అది XY అయితే అది అబ్బాయి.


XY లో - X తల్లి నుండి మరియు Y తండ్రి నుండి.


ఈ Y లో ప్రత్యేకమైనది మరియు అది కలపదు. కాబట్టి XY లో, Y X ని అణచివేస్తుంది మరియు కొడుకు Y క్రోమోజోమ్‌లను పొందుతాడు. Y మాత్రమే క్రోమోజోమ్, ఇది మగ వంశం మధ్య మాత్రమే దాటిపోతుంది. (తండ్రి నుండి కొడుకు మరియు మనవడు).


మహిళలు ఎప్పటికీ Y ను పొందరు. అందువల్ల వంశవృక్షాన్ని గుర్తించడంలో జన్యుశాస్త్రంలో Y కీలక పాత్ర పోషిస్తుంది. స్త్రీలు ఎప్పటికీ Y ను పొందరు కాబట్టి స్త్రీ యొక్క గోత్రా తన భర్తకు చెందినది.


అవి 8 ish షుల నుండి 8 వేర్వేరు Y క్రోమోజోములు. మనం అదే గోత్రానికి చెందినవారైతే, మనం ఒకే మూల పూర్వీకుల నుండి వచ్చాము.


అదే గోత్రా మధ్య వివాహాలు జన్యుపరమైన రుగ్మతలను కలిగించే ప్రమాదాన్ని పెంచుతాయి, అదే గోట్రా వై క్రోమోజోమ్‌లకు క్రాస్ఓవర్ ఉండకూడదు మరియు ఇది లోపభూయిష్ట కణాలను సక్రియం చేస్తుంది.


ఇది కొనసాగితే, ఇది పురుషుల సృష్టికి కీలకమైన Y క్రోమోజోమ్ యొక్క పరిమాణం మరియు బలాన్ని తగ్గిస్తుంది.


ఈ ప్రపంచంలో Y క్రోమోజోమ్ లేనట్లయితే, అది మగవారు అంతరించిపోయేలా చేస్తుంది.


కాబట్టి గోట్రా వ్యవస్థ జన్యుపరమైన లోపాలను నివారించడానికి మరియు Y క్రోమోజోమ్‌ను రక్షించడానికి ప్రయత్నించే ఒక పద్ధతి.


మన మహారిషులచే అద్భుతమైన బయో సైన్స్. మా వారసత్వం నిస్సందేహంగా గొప్పది.


మా ish షులు వేల సంవత్సరాల క్రితం "GENE MAPPING" ను క్రమబద్ధీకరించారు ...

పంచవటి

 #పంచవటి అని పేరు రావడానికి గల కారణం ఏంటో తెలుసా ?


రామాయణం ప్రకారం సీతా దేవిని రావణుడు అపహరించిన ప్రదేశం #పంచవటి.. సీతా రాములు పినతల్లి కైకేయి కి ఇచ్చిన మాట నెరవేర్చడానికి, తండ్రి ఆజ్ఞ మేరకు వనవాసానికి వెళతారు.. 


ఆ సమయంలో నాసిక్ లోని గోదావరీ తీరానికి చేరుకొన్న వారు అగస్త్య మహాముని సూచన మేరకు ఈ ప్రాంతంలో పర్ణ కుటీరం నిర్మించుకుని నివసించారు.. ఇక్కడే లక్ష్మణుడు శూర్పణక ముక్కు చెవులు కోసిన ప్రదేశం ఉందని కధనం... అయితే ఈ స్థలానికి #పంచవటి అని పేరు రావడానికి గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 


ఇక్కడ ఐదు పెద్ద పెద్ద చెట్లు వున్నాయి. వీటినే పంచవటి గా పిలుస్తారు. ఆ చెట్లకి 1, 2, 3, 4, 5 అని నంబర్లు కూడా వేసి ఉంచారు. 


1. #వట_వృక్షం: (మర్రిచెట్టు) 


 వటవృక్షం కింద ప్రార్థనలు చేయటం అనాది కాలం నుంచి వస్తోంది.. ఈ వృక్షాన్ని విష్ణుమూర్తి అంశగా భావిస్తారు. అందుకే స్వామికి వటపత్రశాయి అని పేరు. కురుక్షేత్రం లో శ్రీకృష్ణుడు గీతను బోధించింది కూడా వటవృక్ష సమీపంలోనే...! కురుక్షేత్రంలో దాదాపు అయిదువేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ వృక్షం నేటికీ దర్శనమిస్తుంది.


 2. #బిల్వ_వృక్షం: (మారేడు చెట్టు)


బిల్వపత్రాలతో శివుని పూజిస్తారు.. బిల్వవృక్షం సాక్షాత్తూ శివ స్వరూపమని అంటారు. ఒకానొక సమయంలో శని ప్రభావం నుంచి తప్పించుకునేందుకు సాక్షాత్తూ ఆ మహాదేవుడే ఈ మారేడు చెట్టుగా మారి అజ్ఞాతంగా ఉన్నాడని పురాణాలూ చెబుతున్నాయి... అందుకే బిల్వ పత్రాలతో శివుని పూజించిన వారిపై శని ప్రభావం ఉండదని భక్తులు నమ్ముతారు.. ఆనాటి నుంచి నేటికీ పరమేశ్వరుడిని బిల్వపత్రాలతో అర్చన చేయటం ఆనవాయితీగా వస్తుంది. 


 3. #అశ్వత్థ_వృక్షం (రావి చెట్టు)


పలు దేవతామూర్తులు అశ్వత్థవృక్షం నీడలోనే అరాధనలు అందుకుంటాయి.. బుద్ధుడికి జ్ఞానోదయం అయింది కూడా ఈ వృక్షం కిందే. అందుకే దీనిని బోధివృక్షం అని కూడా పిలుస్తారు. బౌద్ధ భిక్షువులకు ఇది అత్యంత పవిత్రమైంది. తొలిరోజుల్లో గౌతమబుద్ధుడి పాదముద్రలు, చిహ్నాలను, పాదుకలను ఆయన స్మృతులుగా ఈ చెట్టు వద్దే పెట్టి ధ్యానించేవారు.. గ్రామీణ ప్రాంతాల్లో ఎందరో గ్రామదేవతలు రావిచెట్టు మూలల్లోనే కొలువు తీరటం విశేషం. అందుకే ఈ అశ్వతవృక్షాన్ని ‘స్థలవృక్ష’గా భావిస్తూ ఇక్కడి భక్తులు ఆరాధిస్తారు.      


 4. #నింబ_వృక్షం (మేడి చెట్టు)


 5. #ఆమ్లాక_వృక్షం: (ఉసిరి చెట్టు)


నదీ స్నానాల్లో, నదీ పూజల్లో దీపారాధానకు ఉసిరికి ప్రత్యేక స్థానం.. వీటి మధ్యలో దీపాన్ని పెట్టి వెలిగించటం ఆనవాయతీ... 


ఈ అయిదు వృక్షాలు ఆధ్యాత్మికంగానే కాదు..,  ఆరోగ్యపరం గానూ ప్రయోజనకరం. అందుకే #పంచవటి పారమార్థిక సాధనలో అంత ప్రాధాన్యం సంతరించుకుంది...


సర్వేజనా సుఖినోభవంతు...🙏🙏🙏











 


 

పోత‌న త‌ల‌పులో...98

 పోత‌న త‌ల‌పులో...98


క‌మలాక్షుడి గొప్ప‌ద‌నాన్ని గురించి నారదుడికి చెబుతున్నాడు బ్ర‌హ్మ‌.....

              **

కారణకార్యహేతు వగు కంజదళాక్షునికంటె నన్యు లె

వ్వారును లేరు; తండ్రి! భగవంతు ననంతుని విశ్వభావనో

దారుని సద్గుణావళు లుదాత్తమతిం గొనియాడకుండినం

జేరవు చిత్తముల్ ప్రకృతిఁ జెందని నిర్గుణమైన బ్రహ్మమున్.

             **


 నారదా! అటు కారణాలకు, ఇటు కార్యాలకు అన్నిటికి కారణభూతుడైనవాడు ఆ కమలాక్షుడే. ఆయన కంటే ఇతరు లెవరూ ఆశ్రయింపదగిన వాళ్లు లేరు. షడ్గుణైశ్వర్య సంపన్నుడు, తుది లేనివాడు, ప్రపంచసృష్టి గావించే ఉదారుడు అయిన ఆ పరమాత్ముని సద్గుణ పుంజాలను గొప్ప మనస్సుతో కొనియాడాలి. లేకుంటే మనస్సులు ప్రకృతికి అతీతమైన నిర్గుణ బ్రహ్మను పొందలేవు.


                    **

నిగమార్థప్రతిపాదకప్రకటమై; నిర్వాణ సంధాయిగా

భగవంతుండు రచింప భాగవతకల్పక్ష్మాజమై శాస్త్ర రా

జి గరిష్ఠంబగు నీ పురాణ కథ సంక్షేపంబునం జెప్పితిన్;

జగతిన్ నీవు రచింపు దాని నతివిస్తారంబుగాఁ బుత్రకా!

                     **

 నారద! ఈ భాగవతం అనే పురాణ కథ వేదార్థాలను ప్రతిపాదించడం చేత ప్రశస్తమై వుంది. మోక్షప్రదంగా ఉండేటట్లు ఆ భగవంతుడు దీన్ని రచించాడు. ఇది భగవద్భక్తులకు కల్పవృక్షం, శాస్త్రాలంన్నిటి కంటె శ్రేష్ఠమైనది. ఈ పురాణకథను నేను నీకు సంగ్రహంగా చెప్పాను. నీవు దీన్ని లోకంలో బహు విస్తృతమైన కృతిగాకావించుము.


                     **

వనజాక్షు మహిమ నిత్యము

వినుతించుచు; నొరులు వొగడ వినుచున్; మదిలో

ననుమోదించుచు నుండెడు

జనములు దన్మోహవశతఁ జనరు మునీంద్రా!"

                              **


నారదా... ఎల్లవేళలా కమలనయనుని మహిమను స్తుతించాలి. ఇతరులు స్తుతిస్తూ వుంటే వినాలి. మనస్సులో ఆ మహిమను మననం చేస్తూ సంతసించాలి. అలా చేసే వాళ్లు దేవుని మాయకు లోనుగారు.


                         **

ఇలా ..పూర్వం బ్రహ్మదేవుడు ఋషీశ్వరుడైన నారదునికి భాగవత ముఖ్యకథను వివరించాడు. ఆ విషయాన్ని యోగీశ్వరుడైన శుకుడు మహా భక్తితో పరీక్షిన్మహారాజుకు తెలియజెప్పాడు.


🏵️పోత‌న ప‌దం🏵️

🏵️ప‌ర‌మ పావ‌నం🏵️

విశ్వాసం

 భక్తి తో కూడిన విశ్వాసం..


"అన్నదానానికి మా అల్లుడు కూతురు విరాళం ఇద్దామనుముంటున్నారు.. ఇప్పుడే ఇవ్వమంటారా?..లేక రేపుదయం ఇవ్వొచ్చా?" అని నల్గొండ నుంచి వచ్చిన శ్రీ మాల్యాద్రి గారు ఒక శనివారం సాయంత్రం పల్లకీ సేవకు ముందు నన్ను అడిగారు..


"మీ ఇష్టం..రేపుదయమే ఇవ్వండి.." అన్నాను..


శ్రీ మదమంచి మాల్యాద్రి గారు, ఎన్నో ఏళ్లనుంచి..ఖచ్చితంగా చెప్పాలంటే..1981 నుంచీ మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి పరమ భక్తులు..శ్రీ స్వామివారిని అత్యంత భక్తి విశ్వాసాలతో కొలిచే కుటుంబాలలో వీరిది కూడా ఒకటి..


మాల్యాద్రి గారి తల్లిగారు కీర్తి శేషురాలు శ్రీమతి లక్షమ్మ గారికి ఆరోజుల్లో కడుపులో విపరీతంగా నొప్పి వచ్చేది..ఆరోజుల్లో అందుబాటులో ఉన్న పరీక్షలన్నీ చేయించారు.. చివరకు వైద్యులు, కడుపులో గడ్డ ఉందని తేల్చారు!..  మందులెన్నో వాడారు..ఫలితం కనబడలేదు..ఆపరేషన్ చేయాలని తీర్మానించారు!..లేకపోతే ప్రాణానికే ముప్పు ఉందని కూడా చెప్పారు..ఆవిడకు ఎటూ పాలుపోలేదు..


ఆ సమయంలోనే శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆశ్రమం నిర్మించిన శ్రీ బొగ్గవరపు మీరాశెట్టిగారి బావమరిది రాములుసెట్టి గారు, లక్షమ్మ గారితో, "ఒకసారి, మొగలిచెర్ల వచ్చి, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సమాధి వద్ద మొక్కుకో..నీకు ఆరోగ్యం కుదుటబడుతుంది!.." అని చెప్పారట!..లక్షమ్మ గారు, ఆ మాట పట్టుకుని, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి వరుసగా మూడు వారాలు పాటు వచ్చారు..ఆవిడ భక్తి విశ్వాసాలు ఆ దత్తాత్రేయుడికి తాకాయి..ఆయన అనుగ్రహమూ లక్షమ్మ గారి మీద ప్రసరించింది..మరో వారానికల్లా, ఆవిడ నొప్పి నయమైంది..ఆ తరువాత మళ్లీ పరీక్షల కోసం డాక్టర్ గారి దగ్గరకు వెళ్లారు..ఎటువంటి అనారోగ్యమూ లేదని డాక్టర్ గారు తేల్చి చెప్పేసారు..


తల్లి ఆరోగ్యంగా ఉండటానికి కారణమైన శ్రీ దత్తాత్రేయుడిని, మాల్యాద్రి గారు పరిపూర్ణంగా నమ్మారు!..నల్గొండ లో ఇటుకబట్టీల వ్యాపారం చేస్తూ, తనకే కష్టం వచ్చినా, మొగలిచెర్ల దత్తుడిదే భారం అనుకున్నారు..ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా శ్రీ స్వామివారిని దర్శించుకోవడం ఒక నియమంగా పెట్టుకున్నారు..


"ఆ స్వామి చల్లగా చూడబట్టే..నా సంసారం బాగుంది..పిల్లలూ ఎదిగొచ్చారు..నిలదొక్కుకున్నారు..ఇదిగో ఈ అమ్మాయి డెంటల్ డాక్టర్, అల్లుడు బ్యాంక్ లో ఉన్నాడు..హైదరాబాద్ లో కూకట్పల్లి లో ఉంటారు..వీడు మనుమడు"!.అంటూ హాయిగా నవ్వారు..


మాల్యాద్రి గారి అల్లుడు గుర్రం వెంకట నారాయణ, ధనలక్ష్మి అనబడే ఆ దంపతులిద్దరూ..భక్తిగా శ్రీ స్వామి వారి వద్ద ఆరోజు అన్నదానం చేయించారు..అత్యంత నిరాడంబరంగా, అన్నదాన సత్రం వద్ద, అన్ని పనుల్లో పాలుపంచుకుని, మరోసారి దత్తాత్రేయుడికి నమస్కారాలర్పించి..మొగలిచెర్ల నుంచి కొండంత తృప్తితో తిరిగి వెళ్లారు..మాల్యాద్రి గారు మళ్లీ మొగలిచెర్ల త్వరగా వస్తానని చెప్పి వెళ్లారు!..


మొగలిచెర్ల దత్తాత్రేయుడి వద్దకు వచ్చే ఒక్కో భక్తుడిది ఒక్కో అనుభవం..ఎవరికి వారికే అది అనుభవం లోకి వచ్చే అనుభూతి!..ఎందరి అనుభవాలో మేము వింటూ ఉంటాము..కానీ..ప్రతిసారీ మాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది..మేము నిత్యమూ కొలిచే దత్తాత్రేయుడు, ఇంతమందికి ఇన్నిరకాలుగా అనుభూతులు పంచుతున్నాడా..అని..నిజానికి ఆ ఊహే అజ్ఞానం కదూ..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా.. పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

మదురై మదనగోపాలుడు

 🚩🚩

మదురై మదనగోపాలుడు

🚩🚩


భక్తులను పరిరక్షించడానికి , పరమశివుని కోపోగ్ర తాపాన్ని ఉపశమింప చేయడానికి

శ్రీ మహావిష్ణువు  కదళీ వనంలో  వెలసిన స్ధలం మదురై.

ఒకానొక సమయంలో   ఉగ్రంగా వున్న మహేశ్వరుడు యీ వనంలో తపమాచరించసాగాడుఆయన రూపం నుండి

ఉద్భవించిన అగ్నిశిఖలు  ఎవరినీ దగ్గరకు చేరనివ్వలేదు. దేవతలందరూ శివుని తపోతీవ్రతకు అమితంగా భయపడి నారాయణుని వేడుకున్నారు.  నారాయణుడు నదీ తీరాన గల కదళీవనం

చేరుకుని సమ్మోహనకరంగా వేణుగానం వినిపించాడు.  ఈశ్వరుడు ఆ వేణుగానానికి తన్మయుడైనాడు. పరమశివుని ఉగ్రత చల్లారింది. తరువాత  మహావిష్ణువు దగ్గరుండి మదురై లో మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం చేయించాడు.

పిదప, శివ దంపతులు 

వేణుగానం వినిపించిన

వాసుదేవునికి కృతజ్ఞతలు తెలిపినట్లు ,ఆ  తరువాత మదనగోపాలస్వామి

ఆలయం నిర్మించబడినట్లు  ఆలయ స్ధలపురాణ చరిత్ర వివరిస్తోంది.

మదన అంటే అ‌త్యధిక సౌందర్యం, మదర్త అంటే

అధికమైనది అని అర్ధం.

ఆండాళ్ నాచ్చియార్ శ్రీ రంగం వెళ్ళేముందు 

పెరియాళ్వారుతో  మదనగోపాలస్వామి

దర్శనం చేసివెళ్ళినట్లు, 

ఆమె మదన గోపాలస్వామి లో 

శ్రీ రంగనాధుని  దర్శించినట్లు చెప్తారు. 


సుమారు పది శిలా శాసనాలు ఆలయగోడల మీద కనిపిస్తాయి.  వాటిలో యీ ఆలయ స్వామి నామం 'ఆందమైన

పెండ్లికొడుకు' అని చెక్కబడినది.

ఆ పేరునే మదనగోపాలస్వామి గా

పిలుస్తున్నారు. ఆళ్వారుల కాలానికే యీ ఆలయం నిర్మించబడినదని అంటారు.

అతి ప్రాచీనమైన యీ ఆలయం విజయనగర రాజుల  కాలంలో , 1550వ  సంవత్సరం లో యీ ఆలయం పునరుధ్ధరించ

బడినదని,

1942  సంవత్సరం లో

వసంత మండపం నిర్మించబడినదని తెలుస్తున్నది.

16 వ శతాబ్దంలో నాయకరాజులు మదురైని పాలించిన కాలంలో  నిర్మించబడిన తూర్పు ముఖంగా వున్న ఐదంతస్తుల రాజగోపురం

అందమైన శిల్పాలతో

దర్శనమిస్తూవుంటుంది. 

ఆలయంలోనికి ప్రవేశించగానే ఎడమ ప్రక్కన  అశ్వధ్ధవృక్షానికి

క్రింద వినాయకుడు దర్శనమిస్తాడు. ఇక్కడ

షష్ఠిపూర్తి కళ్యాణోత్సవాలు

ఎక్కువగా జరుపుకుంటారు. వినాయకుని పూజించిన వారి వంశం తామరతంపగా వర్ధిల్లుతుందని భక్తుల నమ్మకం.

మహామండపం అద్భుత శిల్పనైపుణ్యం కలిగిన స్ధంభాల మీద మహామండపం నెలకొల్పబడింది.

గర్భగుడిలో మదనగోపాలస్వామి నామంతో  వేణుగోపాలుడు , రెండు చేతులలో వేణువును, 

రెండు చేతులలో శంఖు

చక్రాలను ధరించి ఎడమకాలిమీద ఆనుకుని కుడికాలు కొంచెం వంచి అందమైన

భంగిమలో దర్శనం ప్రసాదిస్తున్నాడు.

వేణుగోపాలునికి రెండు

ప్రక్కలా భామా , రుక్మిణీలు నిలబడిన భంగిమలో కొలువై వున్నారు. 

ఈ కృష్ణుని పై మదనగోపాల శతకం 

వ్రాయబడినది. 

ఈ ఆలయంలో  ఉత్సవ విగ్రహాలుగా , శీదేవి, భూదేవి సమేత మదనగోపాలుని దర్శనం లభిస్తుంది.  స్వామికి

పెసరపప్పు పాయసం చేసి నివేదించి వేడుకుంటే

సంతానభాగ్యం కలుగుతుంది  అని భక్తుల నమ్మకం.


ఇక్కడే ఒక ప్రత్యేకమైన ఆలయంలో 

మదన మధురవల్లీ తాయారు చతుర్భుజాలతో ఆశీనురాలైన భంగిమలో కొలువై వున్నది.

ఈ దేవికి  'గడపదాటని దేవి ' అనే పేరు కూడా వున్నది.  గోరింటాకును తెచ్చి ఈ  దేవి చేతులకు పెట్టి

పూజిస్తే కళ్యాణం, మొదలైన శుభకార్యాలు ఏ అడ్డంకులు లేకుండా నెరవేరుతాయి, 

శుక్రగ్రహ దోషం , కాలసర్ప దోషం

తొలగి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల 

ధృఢ విశ్వాసం.


ఆండాళ్ దేవికి కూడా ఒక ప్రత్యేక సన్నిధి వున్నది. 

హరిహర సర్పరాజు అనే పేరుతో వున్న నాగరాజు సన్నిధిలో, శక్రవారమునాడు రాహుకాల పూజలు జరుపుతారు.  నాగ దోషం,కుజ దోషం , 

కాలసర్ప దోషం  వున్న వారు యీ పూజలో పాల్గొని పూజించిన దోష నివారణమౌతుందని

భక్తుల ధృఢవిశ్వాసం.


శ్రీ రామునికి ప్రత్యేక సన్నిధి వున్నది. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణులతో ప్రక్కన

హనుమంతునితో  దర్శనమిస్తాడు. రావణుని వధానంతరం అయోధ్యకు తిరిగి వెడుతున్న  విజయరాఘవుని రూపంలోని భంగిమ ఇది.  ఈ స్వామి

సన్నిధిలో వేడుకున్న ఏ కార్యమైనా దిగ్విజయంగా

నెరవేరుతుందని భక్తులు

విశ్వసిస్తారు.

ఈ ఆలయంలో పలు ఉత్సవాలు ఘన వైభవంగా జరుపుతారు. 

వైకుంఠ ఏకాదశికి స్వర్గద్వారాలు తెరిచే ఉత్సవం  అత్యంత ప్రసిద్ధి చెందినది.

ఫాల్గుణ మాసం ఉత్తరా

నక్షత్రం రోజున  కళ్యాణోత్సవం

వైభవంగా జరుపుతారు.


మదురై  మహానగరంలోని

మేల మాసి వీధిలో దక్షిణ పడమటి దిశగా 

మదనగోపాల స్వామి

ఆలయం వున్నది

ధార్మికగీత - 65*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                        *ధార్మికగీత - 65*

                                  *****

      *శ్లో:- శబ్దాదిభిః పంచభి రేవ పంచ ౹*

             *పంచత్వ మాపు: స్వగుణేన బద్ధా:౹*

             *కురంగ మాతంగ పతంగ మీన ౹*

            *భృంగా నరః పంచభి రంచితం కిమ్?*

                                     *****

*భా- మానవ జీవన పురోగతికి, అథోగతికి  కారకాలు పంచేంద్రియాలే. ఒక్క ఇంద్రియానికి వశమైతేనే ప్రాణాన్ని పోగొట్టుకొంటున్న సందర్భాలు కోకొల్లలు. 1. "శబ్దము"(చెవి):- "లేడి"  శ్రవణపేయమైన మృదుమధుర వేణుగానామృతరసాస్వాదనలో పడి, వేటగానికి చిక్కి బలైపోతోంది.2. "స్పర్శ"(చర్మము):- "మదపుటేనుగు" ఆడయేనుగు యొక్క శారీరక తాకిడి సుఖానికి ఆశపడి, వేటగాడు ఏర్పాటుచేసిన కందకంలో కూరుకుపోయి బందీ అవుతోంది.3. "రూపము"(కన్ను):- "మిడత" భగభగ మండే మంటల కాంతి సొబగులకు ప్రలోభపడి,  మోహంతో  వాటిలోకి  దూకి తనకు తానే అంతరించిపోతోంది.4."రసము"(నాలుక):- "చేప" జిహ్వచాపల్యంతో "ఎర " కోసం ఆశపడి, జాలరివాని గాలానికి చిక్కి, జీవితాన్ని అర్పణ చేసికొంటోంది.5. "గంధము"(ముక్కు):- "తుమ్మెద" పరిమళ భరితమైన పుష్పాలలోని  మకరందానికి ఆశపడి, సూర్యాస్తమయసమయంలో ముకుళితపుష్పంలో చిక్కుపడి, అంతమౌతున్నది. ఈ విధంగా ఒక్క ఇంద్రియానికి లోబడితేనే పరిస్థితి ఇలా ఉంటే , ఇక పంచేంద్రియాలన్నింటికి దాసానుదాసుడై, బ్రహ్మానంద, పరమానందపరవశు డౌతున్న  "పాపం మానవుని" గతి యేమి కానున్నదోగదా! ఇంద్రియాలను ఆధీనంలో  పెట్టుకొని, గెలువజాలిన "జితేంద్రియుడ"వడానికి   యమ నియమాలతో సాధన చేయాలని సారాంశము.*

                                    *****

                      *సమర్పణ  :  పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

C

 







B







 

A










 

తారుమారు

 *తారుమారు*


జోగయ్య ముగ్గురు కూతుళ్ళకు పెళ్ళిళ్ళు చేశాడు. ఇంక పెళ్ళికెదిగిన కొడుకు ఉన్నాడు. ఆచారాలు సాంప్రదాయాల పేరుతో తమ దగ్గర దోచిన దంతా కొడుకు ద్వారా లాగాలని ఒక ఆశ.

అందుకు భార్య కూడా తాళం వేస్తున్నది.


పిలగాడికి పిల్లనివ్వాలని వస్తున్నారు. పిలగాడు నచ్చాడు గాని వసారాలో ఉండటంతో సుతారము ఇష్టం లేక వెనుతిరుగుతున్నారు.


వారి భావం గ్రహించి ఈ వసారాలో ఉన్నంతకాలం పదిరూపాయలు ఇచ్చే సంబంధం రాదని, అప్పుచేసి మేడ కట్టాడు.

ఆశించినట్టే సంబంధాలు వస్తున్నాయి. కాని, జోగయ్య అడిగే కట్నానికి బంగారానికి  కంగారు పడి తిరిగి చూడకుండా పోతున్నారు.

పెద్ద వారికి వీరు ఆనటం లేదు  చిన్నవారికి వీరు మోటుకోవడం లేదు. కాలం గడచి పోతున్నది. వడ్డీలు పెరిగి పోతున్నాయి. వారికి కట్నం ఆశ ఎక్కువని అందరికీ తెలిసి పోయి రావడం మానుకున్నారు.

అమ్మాయిల కోసం తిరిగి న ఖర్చు లతో బ్రహ్మాండమైన పెళ్ళి చేయవచ్చు.

అబ్బాయికి మీసాలు గడ్డం లో తెల్లవెంట్రుకలు పొడచూపుతున్నాయి.


ఇంక నాలుగు రోజులు జరిగితే అసలు పిల్లను కూడా ఇవ్వరని, పేదింటి అమ్మాయికి ఎదురు కట్నం ఇచ్చి, కరోనా సమయంలో నలుగురిని పిలిచి, అయిందనిపించారు పెళ్ళి ఏడుపు ముఖాలతో

తిరిగి చూసుకుంటే అప్పులు తడిచి మోపెడైనాయి.

అయిన కాడికి మేడ తెగనమ్మి అప్పులు కట్టి, ఊరిచివరన ఓ గుడిసె వేసుకుని కాపురం పెట్టాడు జోగయ్య.


మీ దురాశ వల్ల  ఇల్లు పోయింది. మేము ఈగుడిసెలో ఉండలేమని కొడుకు కోడలు పట్నం వెళ్ళి పోయారు.

లోకుల సొమ్ముకు ఆశ పడ్డందుకు బాగా చెంపలు వాయగొట్టుకున్నాడు మన జోగయ్య.

✍🏻జంజం కోదండ రామయ్య

*తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు  క్రింది లింక్ ద్వారా చేరండి*

https://t.me/joinchat/AAAAAEqrF94avWw7JKUdgQ

జీవితంలో భయం కన్నా భయంకరమైందేదీ లేదు.

 జీవితంలో భయం కన్నా భయంకరమైందేదీ లేదు. అదో తీవ్రమైన భావోద్వేగం. అది కోపానికన్నా ప్రమాదకరమైంది. ఊహ కలిగాక, ఓవైపు జ్ఞానం పెరుగుతుంటే, మరోవైపు భయమూ మనసులో చోటు సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. ఆత్మవిశ్వాసం కలవాడు, దృఢ సంకల్పం కలిగినవాడు, సంయమనశీలి, దేశకాల పరిస్థితులపట్ల అవగాహన ఉన్నవాడు మనసులో భయానికి తావే ఇవ్వడు.

భయం దిగులును, బాధను, దుఃఖాన్ని, పిరికితనాన్ని కర్తవ్యవిమూఢతను పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. అన్నింటినీ మించిన భయం- మరణభయం. ఎంత వయసు మీరినా తానింకా బతకాలనే అనుకుంటాడు మనిషి. అయితే భయం క్షణం క్షణం మరణాన్ని చవిచూపిస్తుంది. సుఖాన్ని, శాంతిని, తృప్తిని, ఆనందాన్ని దూరం చేస్తుంది. ఉన్నది పోతుందేమో అని ఒకడికి భయమైతే, రావలసింది రాదేమోనన్న భయం మరొకడికి. ఇంటిగుట్టు రట్టయి పరువు పోతుందేమోనన్న భయం ఇంకొకడికి. తన సంపదను దోచుకుపోతారేమోనన్న భయం వేరొకడికి. భయాలు ఎన్నయినా వాటిని దూరం చేయగలిగేది వైరాగ్యం ఒక్కటేనని భర్తృహరి ఏనాడో చెప్పాడు.

వేగంగా పరవళ్లు తొక్కుతూ ప్రవహించే నదికి ఓ పర్వతమో, చెట్టో అడ్డం వస్తే ప్రవాహం అక్కడే ఆగుతుందా? పక్కదార్లు చూసుకొని పల్లంవైపు ప్రవహిస్తూ ముందుకెళ్లిపోతూనే ఉంటుంది. 


మనిషికీ అలాగే ఎన్నో సమస్యలు, కష్టాలు, ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. అంతమాత్రాన మనిషి బెంబేలెత్తి పోకూడదు. భయపడి కుంగిపోకూడదు. భయమనే వరదకు అడ్డుకట్ట వేయడానికి ధైర్యమనే ఆనకట్టను నిర్మించుకోవాలి అంటారు స్వామి వివేకానంద. భయంతో ఏ పనినీ సాధించలేం


. స్థితప్రజ్ఞ, నిగ్రహం, ఓర్పుతోనే ఎంతటి సమస్యనైనా అధిగమించగలం. పరిస్థితులు ఎంతటి విపత్కరమైనా, అప్రమత్తులమై అవగాహనతో మనం మనలా మనోధైర్యంతో ముందుకు సాగడమే పరమ కర్తవ్యం.

ఆత్మవిశ్వాసానికి ఆధ్యాత్మిక చింతన తోడైతే మనిషికి సర్వత్రా విజయం తథ్యం. భయం అనే వ్యాధికి దివ్యౌషధం భక్తి మాత్రమే. భయం కలిగించేది, తొలగించేది శ్రీమన్నారాయణమూర్తే అని విష్ణు సహస్రనామం చెబుతోంది. భక్తికి వశమయ్యేది, భయాన్ని పారదోలేది పరమేశ్వరి అని లలితా సహస్రనామం చెబుతోంది. ప్రహ్లాదుడు, రామదాసు, మీరాబాయి ఎన్ని శిక్షలు అనుభవించారు! 


నిర్భీతితో పరమాత్మ నామస్మరణతో అవలీలగా ఆ అవరోధాలన్నీ అధిగమించి సద్గుతులు పొందారు.

భక్తిలో ఆర్తి ఉంటుంది. వేదన ఉంటుంది. వినమ్రత ఉంటుంది. శరణాగతి ఉంటుంది. ఆత్మసమర్పణ భావం ఉంటుంది. మనిషికి జీవితంలో భక్తి ఒక్కటే తరణోపాయం. అందుకు నామస్మరణే ప్రథమ సాధనం. నామస్మరణ భయాలన్నింటినీ ఇట్టే తెంచివేయగల అమోఘ సాధనం.

మనిషి అధర్మానికి, అత్యాచారానికి, హింసకు, దౌర్జన్యానికి- ఇలాంటి అకృత్యాలు చేయడానికి మాత్రం భయపడవలసిందే. విముఖత చూపవలసిందే! 


దోషికి, నేరస్తుడికి, దుష్టుడికి భయం ఉంటుంది. క్రమశిక్షణ, సదాచరణ, సత్సాంగత్యం ఉన్నవాడికి భయమే కలగదు. కష్టమైనా ధర్మవర్తననే నమ్ముకోవాలి. దాని వెనక ఎన్నో అద్భుతమైన అవకాశాలు దాగి ఉంటాయి. నీడను చూసి భయపడేవాడు తరవాత వెలుగు మనదరికి చేరుతుందని గ్రహించి, సంయమనం పాటించాలి. దైర్యవంతుడు అంటే భయం తెలియనివాడు కాదు, దాన్ని జయించినవాడు. భయం అనే శత్రువు మనలో లేనంతవరకు బయటి శత్రువేదీ మనల్ని భయపెట్టలేదు.

భయం తలుపుతట్టింది. భక్తి తలుపు తెరిచి చూస్తే బయట ఎవరూ లేరు!

*తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు  క్రింది లింక్ ద్వారా చేరండి*

https://t.me/joinchat/AAAAAEqrF94avWw7JKUdgQ

శ్రీమహాలక్ష్మికి

 *శ్రీమహాలక్ష్మికి శుభమంగళం*


శ్రీకనకవల్లికి సిరుల మా తల్లికిి సౌభాగ్యవతికిదే జయమంగళం

చక్కని మోమునకు శ్రీకాంత శోభితకు శ్రీమహాలక్ష్మికి శుభమంగళం


ఘల్లు ఘల్లున గజ్జె లందెలు మ్రోగేటి పాదపద్మములకు ఇదే మంగళం

కనకధారలతోడ గాజుల సవ్వడితో హస్త కమలంబులకు ఇదే మంగళం


కరుణా కటాక్ష వీక్షణంతో చూసేటి అరవిందలోచనకు జయమంగళం

సకల శుభ కళలతో అలరాలుచున్న మా పద్మనాభ ప్రియకు ఇదె మంగళం


అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకియగు జయ జగజ్జననికిదె మంగళం

 కోరినదే తడవుగా వరములిచ్చే తల్లి హరి పట్టపురాణికిదె మంగళం


      *🌞శుభ శుభోదయం🌞*


🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏

చిత్రగుప్తు జయంతి

 పాపపుణ్యాల లెక్కాపత్రం!

ఈ నెల 29 చిత్రగుప్తు జయంతి


సృష్టిలోని 84 లక్షల జీవరాశుల చావు పుట్టుకలను నిర్దేశించే గ్రంథం చిత్రగుప్తుని చిట్టా అని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ పుస్తకంలో ఆయా జీవరాశుల జనన, మరణాల సమయం కూడా ఉంటుందని పౌరాణిక కథనం. అసలు ఎవరీ చిత్రగుప్తుడు? ఎక్కడివారీయన?

చిత్రగుప్తుడి జననం, వంశం, విధి నిర్వహణ గురించి పలు పురాణాలు చెబుతున్నాయి. సృష్టి ఆదిలో ఆయువు తీరిన జీవులన్నీ పరలోకం చేరాయి. పాపపుణ్య విచారణలో యముడు తీవ్ర గందరగోళానికి గురయ్యాడు. బ్రహ్మకు తన బాధను మొరపెట్టుకున్నాడు. బ్రహ్మ ఆలోచిస్తూ సమాధి స్థితిలోకి వెళ్లిపోవడంతో 11 వేల సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు ఆయన శరీరం నుంచి నడుముకు ఒక కత్తి కట్టుకుని, కలం, కాగితాల కట్టను చేతుల్లో పెట్టుకుని ఒక దివ్యపురుషుడు ఉద్భవించాడు. బ్రహ్మ అతన్ని యమలోకంలో పద్దుల నిర్వహకుడిగా నియమించాడు. అతనే చిత్రగుప్తుడు.

ఇంకో కథనం ప్రకారం.. సూర్యవంశానికి చెందిన చిత్రుడు చాలా కాలం పాటు సూర్యుని ఆరాధించాడు. దానికి సంతోషించి సూర్యుడు సర్వజ్ఞత అనుగ్రహించాడు. ఆదిత్యుని అనుగ్రహాన్ని పొందినందున అతనికి చిత్రాదిత్యుడనే పేరు వచ్చింది. ఇలాంటి కార్యదక్షుడు తన దగ్గర ఉంటే బాగుంటుందని యముడు అనుకున్నాడు. చిత్రాదిత్యుడు సముద్ర స్నానానికి వెళ్లినప్పుడు యమదూతలను పంపి అతన్ని సశరీరంగా తనసదనానికి తెప్పించుకున్నాడు. గుప్తంగా తన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందున చిత్రాదిత్యుడికే చిత్రగుప్తుడనే పేరు వచ్చింది.

కార్తీక శుక్లపక్ష విదియను యమ ద్వితీయ అని స్మృతి కౌస్తుభం చెబుతోంది. ఇదే రోజు చిత్రగుప్త పూజను జరపాలని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా ఉత్తర భారతదేశంలో వ్యాపారులు చిత్రగుప్త పూజను నిర్వహిస్తుంటారు. దీపావళి తర్వాత రెండు రోజులకు వచ్చే భాయ్ దూజ్ (యమ ద్వితీయ) రోజున తమ ఆదాయ, వ్యయాల రికార్డులను చిత్రగుప్తుని పటం ముందు ఉంచి ప్రార్థిస్తారు. బిహార్లో జరిపే ఛత్ పూజ కూడా చిత్రగుప్తుడికి సంబంధించిందే. ఎర్రటి వస్త్రంపై కలం, సిరాబుడ్డి, కత్తి, ఖాతా పుస్తకాలను ఉంచి పూజిస్తారు. చిత్రగుప్త పూజలో పసుపు, తేనె, ఆవాలు, అల్లం, బెల్లం, చక్కెర, గంధం, సిందూరం సమర్పిస్తారు. కేతువు అనుగ్రహం కోసం ఓం శ్రీ చిత్రగుప్తే నమః అనే మంత్రాన్ని జపిస్తారు.

న్యాయదేవత...

జీవుల సంస్కారాన్ని అనుసరించి వారి పాపపుణ్యాలను లిఖించాలని, చిత్రగుప్తుని బ్రహ్మ ఆదేశించినట్లు బృహత్ బ్రహ్మ ఖండంలో ఉంది. యజ్ఞయాగాదుల్లో హవిర్భాగాలు కూడా చిత్రగుప్తునికి చెందుతాయని పద్మపురాణం పేర్కొంటోంది. న్యాయ దేవతగా కూడా ఆయనను అభివర్ణించారు. యమ సంహితలో అత్యంత బాధ్యతాయుత విధుల్లో యమునికి సహాయం చేస్తుంటాడని ఉంది. జీవుల పుట్టుక నుంచి మరణం దాకా ప్రతి చర్యనూ నిగూఢంగా పరిశీలించి లిఖిస్తుంటాడు. శారీరక పాపాలతో పాటు మానసిక దోషాలను కూడా సంగ్రహించగలిగే అతీంద్రియ జ్ఞానం ఇతనికి ఉంది. చిత్రగుప్తుడు లెక్కతేల్చిన అనంతరం యమధర్మరాజు ఆ ఆత్మకు తగిన శరీరాన్ని నిర్ణయించి పునర్జన్మను ప్రసాదిస్తాడు.