15, సెప్టెంబర్ 2020, మంగళవారం

🌺ప్రసాదాలు రకాలు🌺



1. పరమాన్నం (బెల్లం, బియ్యం, నైయ్యే తో చేస్తారు, పాలు తో కూడ వండు తారు)
2.కనికా (బియ్యం , నెయ్యి, పంచదారతో తయారు చేస్తారు)
3.దొహి పొఖాహ్(దద్దోజనం)-(నీట్లో నానిన అన్నానికి పెరుగు కలిపి తయారు చేస్తారు)
4. ఒద్దా పొఖాళా (నీట్లో నానిన అన్నానికి అల్లం కలుపుతారు)
5. తీపి కిచిడీ (బియ్యం , పెసరపప్పు, నెయ్యి, పంచదారతో చేస్తారు)
6. నేతి అన్నం
7. కిచిడీ (బియ్యం కూరగాయల తో చేస్తారు)
8. మిఠా పొఖాళి (నీట్లో నానిన అన్నానికి పంచదార కలుపుతారు)
9. చిత్రాన్నాం (బియ్యం, నెయ్యి, నిమ్మరసం, ఉప్పుతో చేస్తారు)
10. కాజా
11. గొజ్జా (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేసే మిఠాయి)
12. లడ్డు (రవ్వతో చేయవచ్చు, చేనగపిండి,పంచదార తో చేయవచ్చు)
18. మగజా లడ్డు (గోధుమపిండితో చేసే లడ్డు)
14. జీరాలడ్డు (గోధుమపిండికి జీలకర్ర చేర్చి తయారు చేసే లడ్డు)
15. వల్లభ (గోధుమపిండితో చేసే ఒక ప్రత్యేక మిఠాయి)
16. ఖురుమా (గోధుమపిండి, పంచదార, ఉప్పుతో చేస్తారు)
17. మొథాపులి (మినుములు, నెయ్యి, పంచదారతో చేస్తారు)
18. కకరా (గోధుమపిండి, కొబ్బరికోరు, పంచదారతో చేస్తారు)
19. మరిచి లడ్డు (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)
20. లుణి ఖురుమా (గోధుమపిం 

నా అభిప్రాయాల్ని

దయచేసి నా అభిప్రాయాల్ని ఒకసారి పరిశీలంచండి.
పొద్దున్నే మన గ్రూపు చూడాలంటే భయం వేస్తున్నది.
ఈ రోజు ఏ అడ్వకేట్ మరణ వార్త చూస్తామా అని. . దాదాపుగా ఈమధ్య చాల మంది న్యాయవాదులు మరణించటం చాలా విచారించ వలసిన విషయం.


ఏ కొద్దీ మంది సీనియర్ న్యాయవాదులో తప్ప చాలామంది న్యాయవాదులు చాలా మటుకు ఆర్ధిక ఇబ్బందులలో వున్నవారే. న్యాయవాద వృత్తి "నా నాటికి తీసికట్టు నామం బొట్టు" అన్నట్లుగా తయారవుతూన్నది. దీనికి తోడు న్యాయవాదులు ఇతర పనులు చేయకూడదు అనే నిబంధన ఎలా వున్నది అంటే "అమ్మ పెట్టదు అడ్డుకొని తిననీయదు" అన్నట్లుగా వుంది.
మన బార్ కౌన్సిల్ వారు దయచేసి ప్రస్తుత న్యాయవాదుల దుర్భర పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ఈ క్రింది మార్పులు చేయాలని నేను మన న్యాయవాదుల తరుపున కోరుకుంటున్నాను.
1) మన బారు కౌన్సిల్ న్యాయవాదులు ప్రస్తుతం తరువాత ఆర్డర్ ఇచ్చేవరకు వారికి చేతనైన పనులు చేసుకొని జీవించ వచ్చు అని అడ్వకేట్ యాక్టుని ఆమెండు చేయాలి.


2) దశల వారీగా న్యాయవాదుల నుండి డిక్లరేషన్ తీసుకొని న్యాయవాదులు మరణించిన తరువాత ఇచ్చే 4 లక్షలు ఇప్పుడే ఇవ్వాలి. ఇట్లా తీసుకున్న న్యాయవాదులు మరణిస్తే మరల ఇవ్వక పోయిన పరవాలేదు. ఎందుకంటె ఇప్పుడు జీవితం గడవటమే చాలా కష్టంగా వున్నది.


3) మన బార్ కౌన్సిల్లో చాలా ఫౌండ్ జమ ఐవున్నట్లు మనకు తెలియుచున్నది. కాబట్టి వడ్డీ లేని ఋణం ప్రతి న్యాయ వాదికి ప్రాక్టీసుతో సంబంధము లేకుండా అంటే సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా ఒక్కక్కరికి రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని నేను కోరుతున్నాను.
4) ఇప్పుడు ఫైలింగ్ చాలా తక్కువ అయింది ఏ కొద్దీ మందో దైర్యం చేసి కేసులు వేస్తున్నారు. నూటికి తొంబై మంది ఇంట్లోనే కూర్చుంటున్నారు. కాబట్టి ఇప్పటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వకాలతాకు, మెమోకు వెల్ఫేర్ స్టాంపు పెట్టనవసరం లేకుండా ఆర్డర్ ఇవ్వాలి అది తదుపరి ఆర్దరు ఇచ్చేవరకు అని ఉండాలి.
5) న్యాయవాది చనిపోతే డెత్ సర్టిఫికెట్ లేకుండా కేవలం భార్య, లేక భర్త ఇచ్చే వాగ్మూలంను పరిగణలోకి తీసుకొని వెంటనే డెత్ బెనిఫిట్ డబ్బులు మంజూరు చేయాలి. కాదంటే ఒక వాట్సాప్ నెంబర్ పెట్టి దానికి చనిపోయిన న్యాయవాది ఫోటో పంపమని కోరవచ్చు. దానివల్ల న్యాయవాది చనిపోయిన విషయం తెలుస్తుంది. అబద్దం ఎవరు ఆడరు. న్యాయ వాది మరణిస్తే ఇవ్వవలసిన వెల్ఫేర్ ఫండి వెనువెంటనే కేవలం 5 రోజులల్లో అందించాలి. దానికి కమిటీ అప్రూవల్ కావలి, అది కావలి, ఇది కావాలి అని కాలయాపన చేయకూడదు.

6) పైన చెప్పినట్లు సెంట్రల్ వెల్ఫేర్ ఫౌందుకు కూడా వర్తించాలి.
7) న్యాయ వాది చనిపోతే ఇచ్చే వెల్ఫేర్ ఫౌండుని 4 లక్షల నుండి 10 లక్షలకు పెంచాలి.
8) వయస్సు 30 సంవత్సరాలు దాటిన అభ్యర్థుల్ని అడ్వొకేటుగా ఎన్రోల్ చేయటాన్ని నిషేధించాలి. ఎందుకంటె ఒక విద్యార్థి వరుసగా ఎక్కడ ఫెయిల్ కాకుండా చదివితే 22,23 సమస్తరాలకల్లా లా పట్టా పుచ్చుకోగలడు, ఆయన 7,8, సంత్సరాలు ఇంకా ఎక్కువే ఉంటుంది కాబట్టి 30 సమస్తారాలు దాటిన వారికి ఎన్రోల్మెంటు ఉండకూడదు.
ఇప్పుడు వయస్సుతో నిమిత్తం లేకుండా ఎన్రోల్ మెంట్ చేయటం వలన రిటైర్ అయినవారు చాలామంది అడ్వొకేట్లుగా నమోదు అవుతున్నారు. దీనివల్ల న్యాయవాద వృత్తికి విఘాతం కలుగుతున్నది. కేవలం వృతిమీదనే ఆధారపడ్డ వారికి గొడ్డలిపెట్టు అవుతున్నది. అటు ప్రభుత్వ ఉద్యోగం విరామం చేసి యదేశ్చగా పెన్సన్ పొందుతూ ఇటు అడ్వాకెటేగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
9) పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం న్యాయవాదులుగా నమోదు అయి ప్రాక్టీసు చేస్తున్నవారిని గుర్తించి ప్రభుత్వం వారి పెన్షన్లను రద్దు చేయాలి అప్పుడే నిజంగా సీరియస్ గా ప్రాక్టీస్ చేసే వారే ఇక్కడ మిగులుతారు. ఆషామాషిగా టైమ్పాసుకోసం ప్రాక్టీసు చేసే వారిని నిరోధించవచ్చు.


నా సూచనలు గమనించి బార్ కౌన్సిల్ వెంటనే స్పందించి తగు విధంగా నిర్ణయం తీసుకోవాలని మరి మరి కోరుకుంటున్నాను.

ఇంకా న్యాయవాదుల సమస్యలు పట్టించుకోక పొతే న్యాయవాదుల భవిష్యతు అంధకారంగా కనపడుతుంది.
మన గ్రూపు సభ్యులు నా అభిప్రాయానిని ఏకీభవించెరాట్లైతే దయచేసి సంఘీభావం తెలుప గలరు.
ఇట్లు

సి. భార్గవ శర్మ, న్యాయవాది,
సిటీ సివిల్ కోర్ట్, హైద్రాబాదు.

 views
Please take a look at my views.
It was scary to see our group in the morning.
Whether we will see any Advocate death news today. . The recent deaths of many lawyers are a matter of great concern.


Most lawyers are in financial trouble, except for a few senior lawyers. The legal profession is becoming like "take me by the name". In addition to this, there is a rule that lawyers should not do other things, such as "Amma should not be prevented from eating".
On behalf of our lawyers I would like our Bar Council to make the following changes in view of the current plight of our lawyers.
1) Our Bar Council attorneys should now enact the Advocate Act so that they can do and live consciously until further order.


2) Take the declaration from the lawyers step by step and give now 4 lakhs which will be given after the death of the lawyers. It does not matter if the lawyer dies or dies. Because it is very difficult to live life now.


3) We know that there is a lot of pound deposit in our bar council. So I want to give an interest free loan of two lakh rupees to each lawyer irrespective of his practice i.e. senior or junior.
4) Now the filing has become so low that no matter how many people dare to file cases. Ninety people per fortune are sitting in the house. So in view of the present situation the advocate, the memo should be ordered without the need to put a welfare stamp until it is the next order.
5) Death Benefit Money should be granted immediately after the death of the lawyer considering the statement given by the wife or husband alone without the death certificate. Or you can put a WhatsApp number and ask the deceased lawyer to send you a photo. That makes it clear that the lawyer is dead. Who does not lie. Welfare fund to be paid in case of death of the lawyer should be provided immediately within just 5 days. It needs committee approval, it needs it, it should not be delayed.

6) The same should be applied to the Central Welfare Fund as mentioned above.
7) The welfare fund given in case of death of the lawyer should be increased from Rs 4 lakh to Rs 10 lakh.
8) Advocate should not be allowed to enroll candidates above 30 years of age. Because a student can get a law degree in 22,23 syllabuses if he / she is studying without failing in a row, he / she will have 7,8, years and so there should be no enrollment for those who have crossed 30 syllables.
Many retirees are now registering as advocates due to enrollment regardless of age. This is disrupting the legal profession. It is becoming an ax to grind for those who depend solely on the profession. He is retiring from government service and practicing as an advocate while getting a pension on purpose.
9) Retired government employees are currently registered as lawyers and the government should recognize those who are practicing and cancel their pensions then only those who are really seriously practicing will be left here. Ashamashi can prevent those who practice for timepass.


I would like the Bar Council to take note of my suggestions and respond immediately and make an appropriate decision.

Yet the future of lawyers looks bleak if they ignore the problems of lawyers.
If our group members do not agree with my opinion please be able to express solidarity.
Brick

c. Bhargava Sharma, Advocate,
City Civil Court, Hyderabad.

దీపారాధన

ఒక సారి వెలిగించిన వత్తిని మళ్లీ వెలిగించవచ్చా?
         నేడు వెలిగించిన వత్తిని తీసివేసి రేపటి రోజున కొత్త వత్తి తో దీపారాధన చేయాలి. ఒకరోజు న వెలిగించిన మూడు వత్తులలో ఒక వత్తి శాంతించి మిగిలిన వత్తులు వెలుగుతున్నప్పుడు వాటి సాయంతో కొండెక్కిన వత్తిని వెలిగించవచ్చును. అన్ని వత్తులు ఒకేసారి శాంతించినప్పుడు కూడా అప్పటికప్పుడే అయితే మరోసారి వెలిగించుకోవచ్చును. ఒకసారి చేసిన దీపారాధన లో వత్తులు ఆనాటికి మాత్రమే పరిమితం అని గుర్తించాలి.
 కార్తీక మాసం లో దేవుని దగ్గర దీపం ఎంతసేపు వెలగాలి?
దీపం వెలగవలసిన సమయం తక్కువ కాకుండా చూసుకోవడం అవసరం. దీపం కనీసం గోదోహన కాలం పాటు వెలగాలి అన్నారు. అంటే ఆవు పాలు పితికేందుకు పట్టేంత కాలమైన దీపం వెలగాలని అర్థం. సామాన్య భాషలో అరగంట దాకా వెలిగేంత చమురు పోసి దీపారాధన చేయాలి. అలాగే పూజ పూర్తి అయ్యాక మనంతట మనమే దీపం ఆర్పకూడదు. దానంతట అది ఆరిపోయేవరకు అలా ఉంచాలి. పూజ మధ్యలో దీపం ఆరిపోకుండా చూసుకోవాలి. దీపం ఆరింది అనడం కూడా అపశకునం గా భావిస్తారు. దీపం కొండెక్కింది లేదా ఘనమయ్యింది అంటూ ఉంటారు.

*ధార్మికగీత - 8*


                                     
 *శ్లో:-*
*న గృహం గృహమి త్యాహు: ౹*
 *గృహిణీ గృహ ముచ్యతే* ౹
 *గృహం తు గృహిణీ హీనమ్ ౹*
 *అరణ్య సదృశం మతమ్* ౹౹

*భా:- పరివారం, సేవకగణము, వస్తువాహనములు, ధనకనక రాసులు, సిరిసంపదలతో తులతూగుతున్నప్పటికిని ఆ ఇల్లు వాస్తవంగా "గృహము" అని వ్యవహరింపబడదు. మహాలక్ష్మిని పోలిన "గృహిణి " మహారాణిలా తిరుగాడు చున్నప్పుడే ఆ ఇంటిని నిజమైన గృహముగా పరిగణిస్తారు. అట్టి ఇల్లాలి ప్రాపులో సంతానం దినదిన ప్రవర్ధమానమై, వంశాభివృద్ధితో ఇల్లు కళకళ లాడుతుంది. బ్రహ్మచర్య, వానప్రస్థ,సన్న్యాసాశ్రమ వాసులకు, బంధుమిత్రులకు ఆత్మీయ అతిథిమర్యాదలలో కీలక పాత్రధారి ఇల్లాలే. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఓర్పు, నేర్పు, సమర్ధత, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత , దయ, ధైర్యము, స్థైర్యము మూర్తీభవించిన అలాంటి "గృహిణి" లేని ఆ ఇల్లు అడుగడుగునా భయానకమై, అరణ్యాన్ని తలపిస్తుంది. కళాకాంతులు , భోగభాగ్యాలు, శాంతిసౌభాగ్యాలు లేక వెలవెల పోతుంది. గృహస్థుకు గృహమే ఒక స్వర్గసీమ. అందుకనే " ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే యీ జగతికి జీవనజ్యోతి " అన్నాడో సినీకవి*
                                     *****
                       *సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

 *ధార్మికగీత - 8*

 *పరివారంబును వస్తుసంపదలు నింపైయుండి పొర్లాడినన్*
*అరయన్ గేహిని లేని యిల్లు ధరపై నారణ్యమై వెల్గదే?*
*కరమై యాశ్రమవాసులన్ బొదవుచున్ గార్హస్థ్యమింపొందగా*
*వరమైనిల్చెడి యింతియేగద! సదా ప్రాణంబు జీవంబుయున్*

హిందూ ధర్మం గురించి




ఇదేమి చోద్యం










OWN food

Two well dressed lawyers, Prashant Bhushan and Ram Jethmalani went to an expensive restaurant...
Ordered 2 coffees
and then took out sandwiches from their briefcases to eat...

Waitress: Sorry Sir !!! But you can't eat your OWN food here... Its against the rules ...

The lawyers quietly looked at each other and
EXCHANGED their sandwiches & continued their meals !!!
( You can trust lawyers to find loopholes in any rules)...👏👏👏👏🎓
😜😝👆👆
------
Prize winning message of the year.

Great man




*జీవితసత్యం*



తుమ్మెద పెద్ద పెద్ద వృక్షాలకు రంధ్రాలు చేసి
అందులో జీవనం కొనసాగిస్తుంది.....
చెక్కలకు, మొద్దులకు కూడా రంధ్రం చేసి తన పిల్లల్ని పెంచుతుంది...

కానీ మకరందం కోసం తామర మీద వాలినప్పుడు
ఆ తామర రెక్కలు ముడుచుకుంటాయి....
అయ్యో
నన్ను ఏదో బంధించేసింది అని చెప్పేసి ఆ తామర
రెక్కల్లోనే ఇరుక్కుని చనిపోతుంది....
అయితే
మహా మహా వృక్షాలకు రంద్రం చేయగలిగిన దాని సామర్థ్యం
ఆ తామర రేెకులను తొలచలేదా....
ఆ తామర రేకులకు రంధ్రాలు చెయ్యలేదా..... గట్టిగా రెక్కలు ఆడించినా రాలిపోతాయి...

కానీ అది దాని సామర్థ్యం మర్చిపోవడం, మకరందం గ్రోలే మత్తులోనో...
లేక
నన్నేదో బంధించింది అన్న
భావన దాని శక్తిని బలహీన పర్చింది.... ఆ భావనను
నమ్మడమే దాని బలహీనత.....నేను రంద్రం చేయలేనిదేదో నన్ను బంధించింది అన్న
దాన్ని నమ్మింది...
అంతే అది మరణాన్ని కొనితెచ్చుకుంది...

మన జీవితంలో సమస్యలూ అంతే,
సమస్య బలమైంది కాదు....
మనశక్తిని
మనం మర్చిపోవడమే దాని బలం...
మన శక్తికంటే దాన్ని బలంగా చూడడమే,
గుర్తించడమే, నమ్మడమే దాని బలం...

"మాయ" అనేది నీ ఆత్మశక్తి కంటే బలమైంది కాదు...
దాని బలం తామర రేకు అంత....
నీ ఆత్మబలం వృక్షాలకు రంధ్రాలు చేయగలిగేదంత.
తెలుసుకో
*అదే..జీవిత సత్యం*

🍁🍁🍁🍁

శ్రీ ఆంజనేయ షోడశరత్నమాలికా స్తోత్రం


1) గిరిరాజకన్యకాగర్భసంభూతాయ
  గణేశకుమారదేవదివ్యప్రభావాయ
   ఘనశ్రేష్ఠవైరాగ్యసుసంపన్నాయ
  ఆంజనేయాయ మహాబలాయ ||

2) ఘననవవ్యాకరణవినీతాయ
   రామనామాంకితదేహాయ
   సీతాన్వేషణతత్పరాయ
   ఆంజనేయాయ మహాబలాయ ||




3) దుర్లభసంజీవనపర్వతోద్ధారకాయ
   అంగదజాంబవంతాదిపూజితాయ
   రామానుజప్రాణరక్షకాయ
   ఆంజనేయాయ మహాబలాయ ||

4) సీతామనోదుఃఖనివారకాయ
   అహిమహిరావణసంహరాయ
   అశేషబలశౌర్యప్రదాయకాయ 
   ఆంజనేయాయ మహాబలాయ ||






5) నాగవల్లీదళమాలాధరాయ
    గంధమాదనశైలనివాసాయ
    సకలదేవతాగణపూజితాయ
    ఆంజనేయాయ మహాబలాయ ||

6) సుగ్రీవభయవారకరాజ్యదాయ
   మంత్రయంత్రతంత్రస్వరూపాయ
   భక్తమనోరథక్షిప్రప్రదాయకాయ
   ఆంజనేయాయ మహాబలాయ ||






7) దానవభయంకరవజ్రాంగదేహాయ
   బహుభాషాకోవిదమృదుభాషణాయ
   మహిమోపేతప్రజ్ఞాశీలపంచాననాయ
   ఆంజనేయాయ మహాబలాయ ||

8) బ్రహ్మవిద్యాదాయకగురుస్వరూపాయ 
   పాండవమధ్యమరధధ్వజాగ్రవాసాయ
   వారధిబంధనసమయసహాయకాయ
   ఆంజనేయాయ మహాబలాయ ||






9) ఉష్ట్రవాహనారూఢాయ
  సువర్చలాసమేతాయ
  శ్రీవిద్యాఉపాసకాయ
  ఆంజనేయాయ మహాబలాయ ||

10) యజ్ఞహవిష్యస్వీకృతపవమానస్వరూపాయ 
    సుందరపావనకదళీవననివాసవిగ్రహాయ
    వరబలగర్వితరావణదర్పాపహారాయ
    ఆంజనేయాయ మహాబలాయ ||






11) వశిష్ఠకుంభోద్భవగౌతమాదిపూజితాయ
    భూతప్రేతపిశాచసంఘభయనివారకాయ
    బాలభానుకందుకభావితబాలభీమాయ
    ఆంజనేయాయ మహాబలాయ ||

12) ప్రహస్తాక్షయకుమారాదిదానవసంహరాయ 
    అష్టసిద్ధినవనిధిప్రదాయకభక్తసులభాయ
    అతీవబలపరాక్రమప్రదర్శకగదాధరాయ
    ఆంజనేయాయ మహాబలాయ ||






13) రామపాదుకాశిరోధార్యభరతసమానాయ
    రామకథాశ్రవణపులకాంకితధన్యశరీరాయ
    రాజ్యపదవీకాంక్షరహితనిర్మలమానసాయ
    ఆంజనేయాయ మహాబలాయ ||

14) సూక్ష్మభావగ్రాహ్యపింగళాక్షాయ
    మైనాకస్నేహపూర్వకఆహ్వానస్వీకృతాయ
    రామసుగ్రీవస్నేహవారధిబంధనాయ
    ఆంజనేయాయ మహాబలాయ ||






15) భక్తసంక్షేమప్రదసింధూరాంకితవిగ్రహాయ
       వేదవేదాంతపూజితమృదుపల్లవపదాయ
       లంకావిదాహకఅశోకవనభంజనాయ
       ఆంజనేయాయ మహాబలాయ ||

16) కేయూరమణిమాణిక్యాభూషణమకరకుండలాయ
      సకలపాపౌఘవారణనిజభక్తహృదయమందిరాయ
      సహస్రారస్థితఆనందామృతరసపానమత్తభృంగాయ
      ఆంజనేయాయ మహాబలాయ ||

సర్వం శ్రీ ఆంజనేయదివ్యచరణారవిందార్పణమస్తు

*భాగవతామృతం*


ద్రౌపది పుత్రశోకం

1-142-వ.వచనము
అని పలికి ”రాజర్షియైన పరీక్షిన్మహారాజు జన్మ కర్మ ముక్తులును బాండవుల మహాప్రస్థానంబును గృష్ణకథోదయంబును జెప్పెదం; గౌరవ దృష్టద్యుమ్నాదుల యుద్ధంబున వీరులైన వారలు స్వర్గంబునకుం జనిన వెనుక భీము గదాఘాతంబున దుర్యోధనుండు తొడలు విఱిగి కూలిన నశ్వత్థామ దుర్యోధనునకుం బ్రియంబు సేయు వాఁడై నిదురవోవు ద్రౌపదీపుత్త్రుల శిరంబులు ఖండించి తెచ్చి సమర్పించె; అది క్రూరకర్మంబని లోకులు నిందింతురు.
అని = అని; పలికి = పలికి; రాజర్షి = రాజర్షి {రాజర్షి - వైదిక సంప్రదాయ అనువర్తి యైన రాజు}; ఐన = అయిన; పరీక్షిత్ = పరీక్షిత్తు అను; మహా = గొప్ప; రాజు = రాజు; జన్మ = పుట్టుక; కర్మ = నడత; ముక్తులును = ముక్తిపొందిన విధములను; పాండవుల = పాండవులయొక్క; మహా = గొప్ప (తిరిగిరాని); ప్రస్థానంబును = ప్రయాణమును; కృష్ణ = కృష్ణుని; కథ = కథకు; ఉదయంబును = ప్రారంభమును; చెప్పెదన్ = చెప్పెదను; కౌరవ = కౌరవులు; దృష్టద్యుమ్న = దృష్టద్యుమ్నుడు; ఆదుల = మొదలగువారల; యుద్ధంబునన్ = యుద్ధములో; వీరులైన = వీరమరణము పొందిన; వారలు = వారు; స్వర్గంబు = స్వర్గము; కున్ = కు; చనిన = పోయిన; వెనుక = తరువాత; భీము = భీముని; గద = గదయొక్క; ఆఘాతంబున = దెబ్బలవలన; దుర్యోధనుండు = దుర్యోధనుడు; తొడలు = తొడలు / ఊరువులు; విఱిగి = విరిగి; కూలిన = పడిపోయిన; అశ్వత్థామ = అశ్వత్థామ; దుర్యోధను = దుర్యోధను; కున్ = కు; ప్రియంబు = సంతోషము; చేయువాఁడు = కలుగ చేయువాడు; ఐ = అయి; నిదురవోవు = నిద్రించుచున్న; ద్రౌపదీ = ద్రౌపదియొక్క; పుత్త్రుల = కొడుకుల; శిరంబులున్ = శిరస్సులు; ఖండించి = నరికి; తెచ్చి = తీసుకువచ్చి; సమర్పించెన్ = సమర్పించెను; అది = ఆపని; క్రూర = క్రూరమైన; కర్మంబు = పని; అని = అని; లోకులు = ప్రజలు; నిందింతురు = నిందిస్తారు.
రాజర్షి యైన పరీక్షిత్తు జన్మవృత్తాంతాన్ని, ధర్మకార్యాలను, మోక్షప్రాప్తిని, పాండవుల మహాప్రస్థానాన్ని కృష్ణ కథోదయాన్ని నీకు వివరిస్తాను. కౌరవ పాండవులకు జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో వీరు లైనవారు చాలామంది చనిపోయి స్వర్గానికి వెళ్లారు. అనంతరం భీమసేనుని గదాదండం దెబ్బకు దుర్యోధనుడు తొడలు విరిగి నేల కొరిగాడు. గురుపుత్రుడైన అశ్వత్థామ దుర్యోధనునికి సంతోషం కలిగించటం కోసం నిద్రాక్తులైన ద్రౌపది కుమారుల శిరస్సులు ఖండించాడు. అది చాలా దారుణమైన పని అని, లోకు లందరు ఈ క్రూరకృత్యానికి అశ్వత్థామను నిందించారు.
1-143-ఉ.ఉత్పలమాల

బాలుర చావు కర్ణములఁ బడ్డఁ గలంగి యలంగి, యోరువం
జాలక బాష్పతోయ కణజాలము చెక్కుల రాల నేడ్చి, పాం
చాలతనూజ నేలఁబడి జాలిఁ బడం గని యెత్తి, మంజువా
చాలతఁ జూపుచుం జికురజాలము దువ్వుచుఁ గ్రీడి యిట్లనున్.
బాలుర = కొడుకుల; చావు = మృతి; కర్ణములన్ = చెవులలో; పడ్డన్ = పడగా; కలంగి = కలతచెంది; అలంగి = శోకించి; ఓరువన్ = ఓర్చుకొన; చాలకన్ = లేక; బాష్ప = కన్నీటి; తోయ = నీటి; కణ = బిందువుల; జాలము = సమూహము; చెక్కుల = చెంపల వెంట; రాలన్ = రాలునట్లుగ; ఏడ్చి = దఃఖించి; పాంచాల = పాంచాల రాజు యొక్క; తనూజ = కూతురు; నేలన్ = నేలపై; పడి = పడినదై; జాలిన్ = బాధ; పడన్ = పడుతుండగ; కని = చూచి; ఎత్తి = పైకిలేపి; మంజు = మృదువైన; వాచాలతన్ = మాటల చాతుర్యము; చూపుచున్ = ప్రదర్శిస్తూ; చికురజాలమున్ = ముంగురుల సమూహము; దువ్వుచున్ = దువ్వుతూ; క్రీడి = అర్జునుడు; ఇట్లు = ఈ విధముగ; అనున్ = అన్నాడు.
కన్న కొడుకులంతా, అశ్వత్థామ ఖడ్గానికి బలైపోయారని విని ద్రౌపది దుఃఖాన్ని సహించలేకపోయింది. చెక్కిళ్లపై కన్నీళ్లు కాలువలు కట్టేలా ఏడ్చి జాలితో క్రింద పడి దొర్లుతున్న ద్రౌపదిని అర్జునుడు చూసాడు. ఆమెను ఓదార్చి, మధురమైన మాటలతో ధైర్యం చెప్పుతూ ఆమె ముంగురులు దువ్వుతూ ఇలా అన్నాడు-
1-144-మ.మత్తేభ విక్రీడితము

"ధరణీశాత్మజ వీవు నీకు వగవన్ ధర్మంబెయా ద్రౌణి ని
ష్కరుణుండై విదళించె బాలకుల మద్గాండీవ నిర్ముక్త భీ
కరబాణంబుల నేఁడు వానిశిరమున్ ఖండించి నేఁ దెత్తుఁ, ద
చ్ఛిరముం ద్రొక్కి జలంబు లాడు మిచటన్ శీతాంశుబింబాననా!"
ధరణీశ = రాజ; ఆత్మజవు = కుమారివి; ఈవు = నీవు; నీకు = నీకు; వగవన్ = దుఃఖించుట; ధర్మంబె = మంచిపనా; ఆ = ఆ; ద్రౌణి = ద్రోణుని కొడుకు (అశ్వత్థామ); నిష్కరుణుండు = కరుణలేనివాడు; ఐ = అయి; విదళించె = ఖండించెను; బాలకులన్ = బాలురను; మత్ = నాయొక్క; గాండీవ = గాండీవమునుండి; నిర్ముక్త = వదలబడు; భీకర = భీకరమైన; బాణంబులన్ = బాణములతో; నేఁడు = ఇవేళ; వాని = అతని; శిరమున్ = శిరస్సును; ఖండించి = నరికి; నేన్ = నేను; దెత్తున్ = తెస్తాను; తత్ = ఆయొక్క; శిరమున్ = తలను; త్రొక్కి = త్రొక్కి; జలంబులాడు = స్నానము చేయుము; ఇచటన్ = ఇక్కడ; శీతాంశు = చంద్రుని {శీతాంశుడు - చల్లని కిరణాలు కలవాడు, చంద్రుడు}; బింబ = బింబము వంటి; ఆననా = ముఖము గలదానా.
“చంద్రుని వంటి మోముగల ద్రౌపది! నీవు రాజకుమారివి. క్షత్రియకాంతవు అయి నీకు, చనిపోయిన వారికోసం విచారించటం ధర్మం కాదు. ఇదిగో విను, ఆ అశ్వత్థామ దయాదాక్షిణ్యాలు లేనివాడై నీ బిడ్డలను చంపాడు. అందుకు ప్రతీకారంగా నా గాండీవం నుండి మహోగ్రబాణాలను వేసి వాని శిరస్సు ఖండించి నీకు కానుకగా తీసుకొని వస్తాను. ఆ తలను ఇక్కడ కాలితో తన్ని స్నానం చేద్దువు గాని.”
1-145-వ.వచనము
అని యి ట్లొడంబఱచి, తనకు మిత్రుండును సారథియు నైన హరి మేలనుచుండం గవచంబు దొడిగి, గాండీవంబు ధరియించి, కపిధ్వజుండై, గురుసుతుని వెంట రథంబు దోలించిన.
అని = పలికి; ఇట్లు = ఈ విధముగ; ఒడన్ = ఒప్పునట్లు; పఱచి = చేసి; తన = తన; కున్ = కు; మిత్త్రుండును = స్నేహితిడును; సారథియును = సారథియు; ఐన = అయినట్టి; హరి = కృష్ణుడు; మేలు = మంచిది; అనుచున్ = అని పలుకుచూ; ఉండన్ = ఉండగ; కవచంబు = కవచమును; తొడిగి = ధరించి; గాండీవంబు = గాండీవమును; ధరియించి = తీసుకొని; కపి = ఆంజనేయుని గుర్తు; ధ్వజుండు = జండాపై ధరించినవాడు (అర్జునుడు); ఐ = అయి; గురుసుతుని = అశ్వత్థామ {గురుసుతుడు - ద్రోణుని పుత్రుడు, అశ్వత్థామ}; వెంట = వెనుక తరిమి; రథంబు = రథమును; తోలించినన్ = నడిపించగ.
ఇలా ద్రౌపదికి నచ్చజెప్పి ఆత్మీయుడైన శ్రీకృష్ణుడు మేలుమేలని ప్రశంసిస్తుంతుండగా, అర్జునుడు కవచాన్ని ధరించి గాండీవాన్ని చేతబట్టి, కపిధ్వజంతో కూడిన రథాన్ని సారథియై నారాయణడు ముందుకు నడుపుతూ ఉండగా అశ్వత్థామను వెంట తరిముతూ వెళ్ళాడు.
1-146-శా.శార్దూల విక్రీడితము

తన్నుం జంపెద నంచు వచ్చు విజయున్ దర్శించి తద్ద్రౌణి యా
పన్నుండై శిశుహంత గావున నిజప్రాణేచ్ఛఁ బాఱెన్ వడిన్
మున్నాబ్రహ్మ మృగాకృతిం దనయకున్ మోహించి క్రీడింప నా
సన్నుండౌ హరుఁ జూచి పాఱు పగిదిన్ సర్వేంద్రియభ్రాంతితోన్.
తన్నున్ = తనను; చంపెదన్ = సంహరించెదను; అంచు = అనుచు; వచ్చు = వస్తూ ఉన్న; విజయున్ = అర్జునుని; దర్శించి = చూసి; తత్ = ఆయొక్క; ద్రౌణి = ద్రోణుని పుత్రుడు అశ్వత్థామ; ఆపన్నుండు = ఆపదచెందినవాడు; ఐ = అయి; శిశు = పిల్లలను; హంత = సంహరించినవాడు; కావున = కనుక; నిజ = తన; ప్రాణ = ప్రాణములమీది; ఇచ్చన్ = మమకారముతో; పాఱెన్ = పారిపోయాడు; వడిన్ = వేగంగా; మున్న = పూర్వము; ఆ = ఆ; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; మృగ = లేడి; ఆకృతిన్ = రూపముతో; తనయ = పుత్రిక; కున్ = ను; మోహించి = మోహించి; క్రీడింపన్ = క్రీడించగా; ఆసన్నుండు = సమీపించుతున్న వాడు; ఔ = అగు; హరున్ = శివుని; చూచి = చూచి; పాఱు = పారిపోవు; పగిదిన్ = విధముగా; సర్వ = సమస్త; ఇంద్రియ = ఇంద్రియములు; భ్రాంతి = భయము; తోన్ = తో.
శిశుహంతకడు అయిన అశ్వత్థామ తనను సంహరించటం కోసం సన్నద్ధుడై వస్తున్న అర్జునుణ్ణి చూచి, విభ్రాంతుడై దిక్కు తోచక ప్రాణాలు కాపాడు కోవటం కోస అలోచించాడు. పూర్వం బ్రహ్మదేవుడు లేడి రూపం దాల్చి, కామాతురుడై కన్న కూతుర్ని మోహించి; పరమశివుణ్ణి చూసి పారియిన విదంగా, అశ్వత్థామ పారిపోసాగాడు.
1-147-వ.వచనము
ఇట్లోపినంతదూరంబు బరువిడి వెనుకఁ జూచి రథతురంగంబు లలయుటఁ దెలిసి నిలిచి ప్రాణరక్షంబునకు నొండుపాయంబు లేమి నిశ్చయించి, జలంబుల వార్చి, ద్రోణనందనుండు సమాహితచిత్తుండైప్రయోగంబ కాని యుపసంహారంబు నేరకయుఁ బ్రాణసంరక్షణార్థంబుపార్థునిమీదఁ బ్రహ్మశిరోనామకాస్త్రంబుం బ్రయోగించిన నది ప్రచండతేజంబున దిగంతరాళంబు నిండి ప్రాణి భయంకరంబై తోఁచినహరికి నర్జునుం డిట్లనియె.
ఇట్లు = ఈవిధముగా; ఓపిన = సాధ్యమైన; అంత = అంతట; దూరంబున్ = దూరము; పరువిడి = పరుగెత్తి; వెనుకన్ = వెనుకకు; చూచి = చూసి; రథతురంగంబులు = రథమునకు కట్టిన గుఱ్ఱములు; అలయుటన్ = అలసట పొందుట; తెలిసి = తెలుసుకొని; నిలిచి = ఆగి; ప్రాణ = ప్రాణములను; రక్షంబు = రక్షించుకొనుట; కున్ = కు; ఒండు = మరొక; ఉపాయంబు = ఉపాయము; లేమిన్ = లేకపోవుటను; నిశ్చయించి = నిర్ణయించుకొని; జలంబులవార్చి = ఆచమనం చేసి (సంకల్పించుకొని); ద్రోణనందనుండు = అశ్వత్థామ {ద్రోణనందనుడు – ద్రోణుని పుత్రుడు, అశ్వత్తామ}; సమాహిత = కూడతీసుకొన్న; చిత్తుండు = మనసుకలవాడు; ఐ = అయి; ప్రయోగంబ = ప్రయోగించుట; కాని = తప్ప; ఉపసంహారంబు = మరలించుట; నేరకయున్ = తెలియకపోయినను; ప్రాణ = ప్రాణములను; సంరక్షణార్థంబు = రక్షించుకొనుటకు; పార్థుని = అర్జునుని {పార్థుడు - పృథ పుత్రుడు, అర్జునుడు}; మీదన్ = పైన; బ్రహ్మశిరస్ = బ్రహ్మశిరస్సు అనే; నామక = పేరుగల; అస్త్రంబున్ = అస్త్రమును; ప్రయోగించినన్ = వేసిన; అది = ఆ బ్రహ్మాస్త్రము; ప్రచండ = భయంకరమైన; తేజంబునన్ = వెలుగుతో; దిక్ = దిక్కులయొక్క; అంతరాళంబున్ = మధ్యభాగమంతా; నిండి = నిండిపోయి; ప్రాణి = జీవులకు; భయంకరంబు = భయము కలిగించునది; ఐ = అయి; తోఁచినన్ = అనిపించగా; హరి = కృష్ణుని / హరి; కిన్ = కి; అర్జునుండు = అర్జునుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = అన్నాడు;
ఈ ప్రకారంగా ఓపికున్నంతవరకు పారిపోతున్న అశ్వత్థామ ఒక్కమాటు వెనక్కు తిరిగి చూశాడు; రథాశ్వాలు అలసిపోయినట్లుగా తెలిసికొన్నాడు; ఇక తన ప్రాణాల్ని రక్షించుకోవటానికి వేరే ఉపాయం లేదనే నిశ్చయంతో, అశ్వత్థామ ఆచమనం చేసి, ఏకాగ్ర చిత్తంతో ప్రయోగమే గాని ఉపసంహారం తెలియని బ్రహ్మశిరోనామకాస్ర్తాన్ని పార్థునిపై ప్రయోగించాడు. ఆ బ్రహ్మశిరోనామకాస్ర్తం ప్రచండ తేజంతో సకల దిక్కులూ వ్యాపించి, సర్వప్రాణులకూ భయం కలిగిస్తూ, విజృంభించటం చూసి అర్జునుడు, కృష్ణుని ఇలా అర్థించాడు.
1-148-సీ.సీస పద్యము

"పద్మలోచన! కృష్ణ! భక్తాభయప్రద! ;
వినుము, సంసారాగ్నివేఁగుచున్న
జనుల సంసారంబు సంహరింపఁగ నీవు;
దక్క నన్యులు లేరు దలఁచి చూడ
సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు;
ప్రకృతికి నవ్వలి ప్రభుఁడ వాద్య
పురుషుండవగు నీవు బోధముచే మాయ;
నడఁతువు నిశ్శ్రేయసాత్మ యందు
1-148.1-ఆ.
మాయచేత మునిఁగి మనువారలకుఁ గృప
సేసి ధర్మముఖ్యచిహ్నమయిన
శుభము సేయు దీవు సుజనుల నవనిలోఁ
గావఁ బుట్టుదువు, జగన్నివాస!
పద్మలోచన = హరీ {పద్మలోచనుడు - పద్మముల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు}; కృష్ణ = కృష్ణా / హరీ; భక్త = భక్తులకు; అభయ = అభయమును; ప్రద = ఇచ్చువాడా / హరీ; వినుము = విను; సంసార = సంసారమనే; అగ్నిన్ = అగ్నిలో; వేఁగుచున్న = వేగుచున్నట్టి; జనుల = మానవుల; సంసారంబున్ = సంసారము నందలి మాయను; సంహరింపఁగ = హరించి వేయుటకు; నీవున్ = నువ్వు; తక్కన్ = తప్ప; అన్యులు = ఇతరులు; లేరు = లేరు; తలఁచి = ఆలోచించుకొని; చూడన్ = చూడగా; సాక్షాత్కరించిన = సాక్షాత్తు; సర్వ = సమస్తమునకు; ఈశ్వరుండవు = భగవంతుడవు; ప్రకృతి = ప్రకృతి; కిన్ = కి; అవ్వలి = పరమైన; ప్రభుఁడవు = అధిపుడవు అయినవాడవు; ఆద్య = మూల కారణమైన; పురుషుండవు = పరమపురుషుడు; అగు = అయినట్టి; నీవు = నీవు; బోధము = జ్ఞానము; చేన్ = చేత; మాయన్ = మాయను; అడఁతువు = అణచి వేస్తావు; నిశ్శ్రేయస = ముక్తి పొందిన {నిశ్రేయస్సు - (ఇక పొందవలసిన) శ్రేయస్సులు లేనిది, ముక్తి}; ఆత్మ = ఆత్మ; అందున్ = లో;
మాయ = మాయా; చేతన్ = కి; మునిఁగి = చిక్కుకొని; మను = జీవించు; వారలు = వారు; కున్ = కి; కృప = దయ; చేసి = చేసి; ధర్మ = ధర్మమునకు; ముఖ్య = ముఖ్యమైన; చిహ్నము = గుర్తు; అయిన = అయినట్టి; శుభము = శుభములను; చేయుదు = చేకూరుస్తావు; ఈవు = నీవు; సుజనులన్ = మంచివారిని; అవని = భూలోకము; లోన్ = లో; కావన్ = కాపాడుటకు; పుట్టుదువు = అవతరిస్తావు; జగన్నివాస = హరీ జగన్నివాసుడు - లోకాలకి నివాసమైనవాడు, విష్ణువు;
“పద్మాక్షా! భక్తజనరక్షాపరాయణా! శ్రీకృష్ణా! సంసారాగ్నిలో తపించిపోతున్న జనుల కష్టాన్ని పోగొట్టటం నీకు తప్ప మరొకరికి శక్యం కాదు. నీవు సాక్షాత్తూ సర్వేశ్వరుడవు. ఈ ముల్లోకాలకు అవ్వలివాడవు. ఆదిపురుషుడవైన ప్రభుడవు నీవు ముముక్షువులకు జ్ఞానాన్ని ప్రసాదించి మాయను మటుమాయం చేస్తావు. నీవు మాయాజాలంలో మునిగిన వారికి ధర్మసమ్మతమైన తేజస్సును అనుగ్రహిస్తావు. ఓ జగన్నివాసా! శిష్టరక్షణ కోసమే నీవీ జగత్తులో అవతరిస్తావు.
1-149-క.కంద పద్యము

ఇది యొక తేజము భూమియుఁ
జదలును దిక్కులును నిండి సర్వంకషమై
యెదురై వచ్చుచు నున్నది
విదితముగా నెఱుగఁ జెప్పవే దేవేశా!"
ఇది = ఇదిగో; ఒక = ఒక; తేజము = తేజోమయమైనది; భూమియున్ = భూమిని; చదలును = ఆకాశమును; దిక్కులును = దిక్కులను; నిండి = నిండిపోయి; సర్వంకషమై = అన్నిటిని ఒరుసుకు పోతూ; ఎదురై = ఎదురుగా; వచ్చుచున్ = వస్తూ; ఉన్నది = ఉంది; విదితముగాన్ = వివరముగా; ఎఱుగన్ = తెలియునట్లు; చెప్పవే = చెప్పుము; దేవేశా = దేతలలో శ్రేష్ఠుడా.
దేవాదిదేవా! వాసుదేవా! ఇదేదో ఒక ప్రచండమైన తేజస్సు, భూమ్యాకాశాలు, దిక్కులు వ్యాపించి ఎదురుగా వస్తున్నది. దీని స్వరూప మేమిటో నాకు తెలియ జెప్పు”
1-150-వ.వచనము
అనిన హరి యిట్లనియె.
అనినన్ = అనగా; హరి = హరి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
అర్జునుని మాటలు విని శ్రీకృష్ణు ఇలా పలికాడు-
1-151-శా.శార్దూల విక్రీడితము

"జిహ్మత్వంబునఁ బాఱి ద్రోణజుఁడు దుశ్శీలుండు ప్రాణేచ్ఛమై
బ్రహ్మాస్త్రం బదె యేసె; వచ్చెనిదె తద్బాణాగ్ని బీభత్స!; నీ
బ్రహ్మాస్త్రంబునఁ గాని దీని మరలింపన్ రాదు, సంహార మీ
బ్రహ్మాపత్య మెఱుంగఁ, డేయుము వడిన్ బ్రహ్మాస్త్రమున్ దీనిపై."
జిహ్మత్వంబునన్ = వక్రబుద్ధితో; పాఱి = పారిపోవు; ద్రోణజుఁడు = అశ్వత్థామ {ద్రోణజుడు - ద్రోణునికొడుకు, అశ్వత్థామ}; దుశ్శీలుండు = చెడ్డ శీలముగలవాడు; ప్రాణ = ప్రాణములమీది; ఇచ్ఛము = కోరిక; ఐ = కొరకు; బ్రహ్మాస్త్రంబు = బ్రహ్మాస్త్రము; అదె = అదిగో; ఏసెన్ = వేసెను; వచ్చెన్ = వస్తున్నది; ఇదె = ఇదిగో; తత్ = దాని; బాణ = బాణము యొక్క; అగ్ని = అగ్ని యొక్క; బీభత్స = అర్జునా {భీభత్సుడు - బీభత్సము (అతి క్రూరత్త్వము)గా యుద్ధము చేయువాడు, అర్జునుడు}; నీ = నీ; బ్రహ్మాస్త్రంబున్ = బ్రహ్మాస్త్రమువలన; కాని = తప్పించి; దీనిన్ = దీనిని; మరలింపన్ = మరలించుటకు; రాదు = వీలుకాదు; సంహారము = మరలించుట; ఈ = ఈ; బ్రహ్మాపత్యము = బ్రాహ్మణ వంశీయుడు; ఎఱుంగఁడు = ఎరుగడు; ఏయుము = వేయుము; వడిన్ = తొందరగా; బ్రహ్మాస్త్రమున్ = బ్రహ్మాస్త్రమును; దీని = దీని; పైన్ = మీద.
“అర్జునా! నిప్పులు చెరుగుతూ ఆ వచ్చేది బ్రహ్మాస్త్రం. దీనిని పిక్కబలంతో పారిపోతున్న కుటిలాత్ముడు, ధూర్తుడు అయిన అశ్వత్థామ తన ప్రాణం రక్షించుకోడానికి ప్రయోగించాడు. దీన్ని త్రిప్పి కొట్టటానికి నీ బ్రహ్మాస్త్రం తప్ప మరొక్కటి సమర్థం కాదు. బ్రాహ్మణయువకుడైన ఈ అశ్వత్థామకు బ్రహ్మాస్త్ర ప్రయోగం తప్ప ఉపసంహారం తెలియదు. ఆలస్యం చేయకుండా దీనిపై నీ బ్రహ్మాస్త్రం ప్రయోగించు.”
1-152-వ.వచనము
అనిన నర్జునుండు జలంబుల వార్చి, హరికిం బ్రదక్షిణంబు వచ్చి, ద్రోణనందనుం డేసిన బ్రహ్మాస్త్రంబు మీదఁ దన బ్రహ్మాస్త్రంబుఁ బ్రయోగించిన.
అనినన్ = అని ఆదేశించిన; అర్జునుండు = అర్జునుడు; జలంబులవార్చి = సంకల్పించుకొని; హరి = కృష్ణుని; కిన్ = కి; ప్రదక్షిణంబు = ప్రదక్షిణ; వచ్చి = చేసి; ద్రోణనందనుండు = ద్రోణుని కుమారుడు అశ్వత్థామ; ఏసిన = వేసినట్టి; బ్రహ్మాస్త్రంబు = బ్రహ్మాస్త్రము; మీదన్ = పైన; తన = తన యొక్క; బ్రహ్మాస్త్రంబున్ = బ్రహ్మాస్త్రమును; ప్రయోగించిన = ప్రయోగించగా;
వాసుదేవుని వచనాలు వినగానే అర్జునుడు ఆచమనం చేసి, కృష్ణునికి ప్రదక్షిణం చేసి, అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్ర్తం మీద తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు.
1-153-మ.మత్తేభ విక్రీడితము

అవనివ్యోమము లందు నిండి తమలో నా రెండు బ్రహ్మాస్త్రముల్
రవివహ్నిద్యుతిఁ బోరుచుం ద్రిభువనత్రాసంబుఁ గావింపగా
వివశభ్రాంతి యుగాంతమో యని ప్రజల్ వీక్షింప నా వేళ మా
ధవు నాజ్ఞన్ విజయుండు సేసె విశిఖద్వంద్వోపసంహారమున్.
అవని = భూమి; వ్యోమములు = ఆకాశముల; అందున్ = లో; నిండి = నిండిపోయి; తమలోన = తమలోతాము; ఆ = ఆ; రెండు = రెండు; బ్రహ్మాస్త్రముల్ = బ్రహ్మాస్త్రములు; రవి = సూర్యుని; వహ్ని = అగ్ని; ద్యుతిన్ = కాంతి కలిగి; పోరుచున్ = పోరాడుతూ; త్రి = మూడు; భువన = లోకములకు; త్రాసంబున్ = భయము కలుగునట్లు; కావింపగా = చేయగా; వివశ = ఒడలు తెలియని; భ్రాంతిన్ = భ్రమతో; యుగ = యుగమునకు; అంతమో = అంతమేమో; అని = అనుకొనుచూ; ప్రజల్ = ప్రజలు; వీక్షింపన్ = చూస్తుండగా; ఆ = ఆ; వేళ = సమయములో; మాధవున్ = కృష్ణుని {మాధవుడు - మాధవి భర్త, విష్ణువు}; ఆజ్ఞన్ = ఆదేశము ప్రకారము; విజయుండు = అర్జునుడు; చేసెన్ = చేసెను; విశిఖ = బాణముల; ద్వంద్వ = ద్వయమును; ఉపసంహారమున్ = మరలించుట.
మిన్నూ మన్నూ ఏకం చేస్తూ ఆ బ్రహ్మాస్త్రాలు రెండూ, ఇద్దరు సూర్యులు లాగా, అగ్నిహోత్రులు లాగ పరస్పరం ఘోరంగా పోరు సాగించాయి. అది చూసి భయంతో ముల్లోకాలూ కంపించాయి. ప్రళయకాలమేమోనని ప్రజలంతా భయభ్రాంతులతో పరికింపసాగారు. ఇదంతా శ్రీకృష్ణుడు చూచాడు. అర్జునునికి ఆజ్ఞ ఇచ్చాడు. బ్రహ్మాస్త్రాలు రెండింటినీ పార్థుడు ఉపసంహరించాడు.
1-154-వ.వచనము
ఇట్లస్త్రద్వయంబు నుపసంహరించి, ధనంజయుండు ద్రోణనందనుం గూడ నరిగి తఱిమి పట్టుకొని, రోషారుణితలోచనుండై యాజ్ఞికుండు రజ్జువునం బశువు గట్టినఁ చందంబున బంధించి శిబిరంబు కడకుం గొనిచని హింసింతు నని తిగిచినం జూచి హరి యిట్లనియె.
ఇట్లు = ఈ విధముగా; అస్త్ర = అస్త్రములు; ద్వయంబున్ = రెండింటిన; ఉపసంహరించి = మరల్చి; ధనంజయుండు = అర్జునుడు; ద్రోణనందనున్ = ద్రోణుని పుత్రుని / అశ్వత్థామ; కూడ = వెనుక; అరిగి = వెళ్లి; తఱిమి = తరిమి; పట్టుకొని = పట్టుకొని; రోష = రోషముచే; అరుణిత = ఎఱ్ఱబారిన; లోచనుండు = కళ్ళు కలిగిన వాడు; ఐ = అయి; యాజ్ఞికుండు = యజ్ఞము చేయు వాడు; రజ్జువునన్ = తాడుతో; పశువున్ = పశువును; కట్టిన = కట్టిన; చందంబునన్ = విధముగా; బంధించి = కట్టి; శిబిరంబు = గుడారము; కడ = దగ్గర; కున్ = కు; కొని = తీసుకొని; చని = వెళ్ళి; హింసింతును = సంహరించెదను; అని = అని; తిగిచినన్ = లాక్కొస్తుండగా; చూచి = చూసి; హరి = కృష్ణుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = అన్నాడు.
ఈ విధంగా అస్త్రాలు రెండింటిని ఉపసంహరించిన అనంతరం, పార్థుడు అశ్వత్థామను వెంటాడి పట్టుకొన్నాడు; యాజ్ఞికుడు యజ్ఞంలో పశువును బంధించినట్లు, కోపంతో ఎఱ్ఱబడ్డ కళ్ళతో అర్జునుడు, అతణ్ణి త్రాళ్లతో బంధించాడు; అలా అర్జునుడు “శిబిరానికి లాగికొని వెళ్ళి ఈ ధూర్తుణ్ణి చిత్రహింస పెడతా” నని, అశ్వత్తామను ఈడ్చుకుని రావడం చూసి, అధికమైన క్రోధంతో కృష్ణుడు ఇలా అన్నాడు-
1-155-ఉ.ఉత్పలమాల

"మాఱుపడంగలేని యసమర్థుల సుప్తుల నస్త్రవిద్యలం
దేఱని పిన్న పాఁపల వధించె నిశీథము నందుఁ గ్రూరుఁడై
పాఱుఁడె వీఁడు పాతకుఁడు, ప్రాణభయంబున వెచ్చనూర్చుచుం
బాఱెడి వీని గావుము కృపామతి నర్జున! పాపవర్జనా!
మాఱు = తిరుగ; పడంగ = పడుటకు శక్తి; లేని = లేనట్టి; అసమర్థుల = సమర్థత లేనివారిని; సుప్తుల = నిద్రంచినవారిని; అస్త్ర = అస్త్ర ప్రయోగ; విద్యలన్ = విద్యలందు; తేఱని = ఆరితేరని; పిన్న = చిన్న; పాఁపలన్ = పిల్లలను; వధించెన్ = చంపెను; నిశీథము = చీకటి రాత్రి; అందున్ = లో; క్రూరుఁడు = క్రూరమైన పనులు చేయువాడు; ఐ = అయి; పాఱుఁడె = బ్రాహ్మణుడా; వీఁడు = ఇతడు; పాతకుఁడు = మహాపాపము చేసినవాడు; ప్రాణ = ప్రాణములమీద; భయంబునన్ = భయముతో; వెచ్చన్ = వేడి యైన; ఊర్చుచున్ = నిట్టూర్పులు నిగిడ్చుచు; పాఱెడిన్ = పారిపోవుచున్నాడు; వీనిన్ = ఇతనిని; కావుము = కాపాడుము; కృపామతిన్ = దయాబుద్ధితో; అర్జున = అర్జునుడా; పాప = పాపములను; వర్జనా = విడిచినవాడా.
“పరమ దుర్మార్గుడిలా తనను ఎదిరించే శక్తి లేని వారు, గాఢనిద్రలో ఉన్నవారు, అస్త్రవిద్యలలో నేర్పులేనివారు, చిన్నపిల్లలు అని కూడా చూడకుండా రాత్రి చీకటిలో చంపేసాడు. వీడు బ్రాహ్మణుడా కాదు, పాపిష్ఠివాడు. కానీ పార్థా! నీవు పాపాలను వదలగొట్టే వీరుడవు, వీడేమో ప్రాణాల మీది భయంతో ఒగర్చుకుంటూ పారిపోతున్నాడు కనుక క్షమించి వదలిపెట్టు.
1-156-చ.చంపకమాల

వెఱచినవాని, దైన్యమున వేఁదుఱు నొందినవాని, నిద్ర మై
మఱచినవాని, సౌఖ్యమున మద్యము ద్రావినవాని, భగ్నుడై
పఱచినవాని, సాధు జడభావమువానిని, గావు మంచు వా
చఱచినవానిఁ, గామినులఁ జంపుట ధర్మము గాదు, ఫల్గునా!
వెఱచిన = భయపడిన; వానిన్ = వాడిని; దైన్యమున = దీనత్వముతో; వేఁదుఱున్ = గాబరా; ఒందిన = పొందినట్టి; వానిన్ = వాడిని; నిద్రన్ = నిద్రలో; మై = మేను / ఒళ్ళు; మఱచిన = తెలియకుండా ఉన్న; వానిన్ = వాడిని; సౌఖ్యమున = సుఖంగా; మద్యము = మత్తు పానీయము; త్రావిన = తాగినట్టి; వానిన్ = వాడిని; భగ్నుడు = భంగపడినవాడు; ఐ = అయి; పఱచిన = పారిపోయే; వానిన్ = వాడిని; సాధు = మంచివానిని; జడ = జడత్వ / మందబుద్ధి; భావము = భావముగల; వానిన్ = వాడిని; కావుము = కాపాడుము; అంచున్ = అనుచు; వాచఱచిన = మొరపెట్టుకొనే; వానిన్ = వాడిని; కామినులన్ = స్త్రీలను; చంపుట = సంహరించుట; ధర్మము = ధర్మము; కాదు = కాదు; ఫల్గునా = అర్జునా.
ఫల్గుణా! భయపడిన వాడిని, దిగులుతో మతిభ్రమించిన వాడిని, నిద్రపోయిన వాడిని, మద్యపానంచేసి మైమరచిన వాడిని, పరాజితుడై పారిపోయే వాడిని, కదలక మెదలక పడి ఉన్నవాడిని, రక్షించమని వేడినవాడిని, ఆడవారిని చంపటం ధర్మం కాదు గదా.
1-157-శా.శార్దూల విక్రీడితము

స్వప్రాణంబుల నెవ్వఁడేనిఁ, గరుణాసంగంబు సాలించి య
న్యప్రాణంబులచేత రక్షణము సేయన్ వాఁ, డధోలోక దుః
ఖప్రాప్తుండగురాజదండమున సత్కల్యాణుఁ డౌ, నైన నీ
విప్రున్ దండితుఁ జేయ నేటికి మహావిభ్రాంతిచే నుండఁగన్?"
స్వ = తనయొక్క; ప్రాణంబులన్ = ప్రాణములకొరకు; ఎవ్వఁడేనిన్ = ఎవడైనా; కరుణ = దయయొక్క; సంగంబు = స్పర్శ; చాలించి = విడిచిపెట్టి; అన్య = ఇతరులను; ప్రాణంబుల = ప్రాణముల; చేతన్ = వలన; రక్షణము = కాపాడుట; సేయన్ = చేయని; వాఁడు = వాడు; అధః = క్రింది / నరక; లోక = లోకములలోని; దుఃఖ = దుఃఖములను; ప్రాప్తుండు = పొందువాడు; అగున్ = అగును; రాజ = రాజుయొక్క; దండమున = శిక్షవలన; సత్ = మంచి; కల్యాణుఁడు = శుభమైన మార్గము పట్టినవాడు; ఔను = అగును; ఐనన్ = ఐన; ఈ = ఈ; విప్రున్ = బ్రాహ్మణుని; దండితున్ = దండింపబడినవానిని; చేయన్ = చేయుట; ఏటి = ఎందుల; కిన్ = కు; మహా = మిక్కిలి; విభ్రాంతి = విభ్రాంతి; చేన్ = లో; ఉండఁగన్ = ఉండగా.
ఎవడైతే కనికరం లేకుండా తన ప్రాణాలు కాపాడుకోవటం కోసం పరుల ప్రాణులు తీస్తాడో, అటువంటి దుర్మార్గుడు నరకలోకంలో నానా దుఃఖాలూ అనుభవిస్తాడు; అయితే రాజు వాణ్ణి శిక్షిస్తే వాడి పాపం నశించి, వాడికి శ్రేయస్సు లభిస్తుంది; కాని ఈ అశ్వత్థామ భయభ్రాంతుడై యున్నాడు గదా, కఠినంగా శిక్షించకు.”
1-158-వ.వచనము
అని యివ్విధంబునఁ గృష్ణుఁ డానతిచ్చిన బ్రాహ్మణుండు కృతాపరాధుండయ్యు వధ్యుండు గాఁడను ధర్మంబుఁ దలఁచి చంపక ద్రుపదరాజపుత్త్రికిం దన చేసిన ప్రతిజ్ఞం దలంచి బద్ధుండైన గురునందనుందోడ్కొని కృష్ణుండు సారథ్యంబు సేయ శిబిరంబుకడకు వచ్చి.
అని = అని; ఈ = ఈ; విధంబునన్ = విధముగా; కృష్ణుఁడు = కృష్ణుడు; ఆనతి = ఆజ్ఞ; ఇచ్చినన్ = ఇవ్వగా; బ్రాహ్మణుండు = బ్రాహ్మణుడు; కృత = చేసిన; అపరాధుండు = అపరాధము చేసినవాడు; అయ్యు = అయినప్పటికిని; వధ్యుండు = చంప దగినవాడు; కాఁడు = కాడు; అను = అను; ధర్మంబున్ = ధర్మమును; తలఁచి = తలచుకొని; చంపక = చంపకుండా; ద్రుపదరాజపుత్త్రిక = ద్రౌపది; కిన్ = కి; తన = తను; చేసిన = చేసినట్టి; ప్రతిజ్ఞన్ = వాగ్దానమును; తలంచి = జ్ఞాపకము చేసుకొని; బద్ధుండైన = బంధింపడిన; గురునందనున్ = అశ్వత్థామని {గురునందనుడు - గురువు (ద్రోణుని) కొడుకు, అశ్వత్థామ}; తోడున్ = తనతోకూడా; కొని = తీసుకొని వెళ్ళి; కృష్ణుండు = కృష్ణుడు; సారథ్యంబు = రథము నడపుట; సేయన్ = చేయగా; శిబిరంబు = గుడారము; కడ = దగ్గర; కున్ = కు; వచ్చి = వచ్చి.
ఈ విధంగా కృష్ణుడు వివరించగా”అపరాధం చేసినప్పటికిని బ్రాహ్మణుణ్ణి చంపకూడదు" అనే ధర్మాన్ని కూడా స్మరించి, అర్జునుడు అశ్వత్థామను సంహరించలేదు. పాంచాల రాజపుత్రి సమక్షంలో తాను పలికిన ప్రతిజ్ఞ పాటించడం కోసం కాళ్లూ చేతులూ కట్టేసి అశ్వత్థామను లాక్కునివచ్చి ఎత్తి రథం పైన పడవేశాడు. కృష్ణుడు అశ్వాలను అదలించాడు. రథం శిబిరం వద్దకు చేరింది.

పంచవటి అంటే

పంచవటి అంటే 5 రకములైన దివ్య వృక్షముల సముదాయము. సాధారణముగా ఋషులు, మునులు తమ ఆశ్రమములలో, పర్ణశాలల చుట్టూ ఈ దేవత వృక్షములను నాటి పెంచేవారు. రామాయణము ఆధారముగా మనకు తెలియవచ్చే చారిత్రక విషయం ఏమిటంటే శ్రీ రామచంద్రుడు, సీతా, లక్ష్మణ సమేతముగా అరణ్యవాసము చేస్తున్నప్పుడు, తమ పర్ణశాలను పంచవటి యందు ఏర్పరచుకున్నట్లు తెలుస్తుంది. వారి వనవాస కాలములో, వారు దర్శించిన భరద్వాజ మహర్షి, అగస్త్య మహర్షి ఆశ్రమములు పంచవటి పర్ణశాలలుగా ఉన్నట్లు రామాయణ ఇతిహాసమును బట్టి తెలుస్తుంది. ఈ పంచవటి వృక్షములు, 1 .వట ( మఱ్ఱి - Banyan - Ficus bengalensis) 2 .అశ్వర్ధ ( రావి - Peepal - Ficus religiosa ) 3 .ఔధుంబర (మేడి - Cluster Fig - Ficus racemosa ) 4. ఆమ్ల (ఉసిరిగ - Phyllanthus Emblica) 5 .భిల్వ (మారేడు - Aegle marmelos ). కొందరు అశోక వృక్షమును కూడా పంచవటి వృక్షముగానే భావిస్తారు.

ఈ దివ్య దేవత వృక్షములు కర్బన వాయువులను స్వీకరించి, ప్రాణవాయువును విడుదల చేస్తాయనడములో అతిశయోక్తి లేదు. పర్యావరణము లోని కాలుష్య నివారణకు ఏంతో ఉపయుక్తమైన వృక్ష సంపద ఈ పంచవటి వృక్షములు. ఆయుర్వేద, పురాణ గ్రంథములలో ఈ వృక్షముల మహత్యమును ఎంతగానో ప్రశంసించబడినవి.

*సేకరణ*

సంకల్పం చేసుకోండి

సంకల్పం చేసుకోండి #radhakrishna

సుమారు రెండువేల సంవత్సరాల క్రిందట పురాతన గ్రంధములలో ఉల్లేఖించబడిన ఒక కధ వున్నది. ఆ కధ ఏమంటే - అది కధ అయినా దాని వలన ఒక ప్రేరణ మనకు ప్రాప్తిస్తుంది- శ్రీ గౌడపాదాచార్యులవారు తన గ్రంధంలో దీనిని ఉదహరించారు. ఒక గబ్బిలం వుండేది. పై కప్పుకు కాళ్ళు పెట్టుకుని రాత్రిపూట తలక్రిందులుగా వేలాడబడి వుంటుంది. ఎక్కువగా చీకట్లో, గుహల్లో వున్నట్లుగా వర్ణన వుంటుంది.

అది సముద్రపు ఒడ్డున తన గుడ్లు పెట్టుకుంది. ఒకరోజు సముద్రంలో అలలు పొంగి ఆ గుడ్లు కొట్టుకుని పొయాయి. అప్పుడు ఆ గబ్బిలం ఏడుస్తూ కూర్చోలేదు. ఓదార్చడానికి వచ్చి పోయే వాళ్ళతో మాట్లాడుతూ కూర్చోలేదు. ఎప్పుడైతే గుడ్లు కొట్టుకు పొయాయో, వెంటనే పని మొదలు పెట్టింది. ఏమి పని మొదలు పెట్టింది. ! తన ముక్కుతో సముద్రపు నీరు నింపుకుని దూరంగా వెళ్ళి నేలపైన వేసేది. తన గుడ్లు కొట్టుకు పోయాయని తెలిసి ఎవరైతే సానుభూతి చూపించడానికి వచ్చారో వారు కూడ అదేపని చెయ్యడం మొదలు పెట్టారు. ఎలాగైనా సముద్రుడిని శుష్కింపచేయాలన్న దృఢ నిశ్చయంతో ఇఖ వారు ఎవరి మాట వినలేదు.

ఇంత చిన్న పక్షి సముద్రుడిని శుష్కింప చేయగలదా చెప్పండి! కానీ దాని మనసులో ఎంతటి ఉత్సాహం! దృఢత! పౌరుషం! ఎంతటి ప్రయత్నం. దాని రోమరోమంలో నిండిపోయింది. దేశ దేశాలనుండి పక్షులు రావడం మొదలు పెట్టాయి. మా బంధు మిత్రుడు (పక్షి జాతి) ఒకడు సముద్రుడినే శుష్కింపజేసే దృఢసంకల్పం చేసుకున్నాడట. ఇంత పెద్ద సంకల్పం అంత చిన్నప్రాణి మనసులో ఎంత ఉత్సాహం! ఈ సమాచారం గరుత్మంతుడికి తెలిసింది. గరుడుడు పక్షులకు రాజు. సముద్రుడిని శుష్కింపజేయటానికి కోట్లాది పక్షులు ఆ పనిలో నిమగ్నమైవున్నాయట. "పద నేను చూస్తాను" అని గరుడుడు కూడా వచ్చాడు. దీని అర్ధం ఏమిటంటే ఎప్పుడైతే మానవుడు తన పనిని దృఢతా పూర్వకంగా చేస్తాడో అప్పుడు సహాయం కూడ తప్పక లభిస్తుంది. యుక్తికూడా దొరుకుతుంది. బుద్ధికూడ స్ఫురిస్తుంది. తన పనిని దృఢంగా చెయ్యగలగటమే కావలసినది. సహాయం చేసేవారు వస్తారు. వివేచన నిచ్చేవాళ్ళు వస్తారు. గరుడుడు వచ్చాడు. అంతా విన్నాక గరుడుడిలా అన్నాడు.

"ఓ సముద్రమా! మా వారంతా ఇన్నిపక్షులు సంలగ్నమై నిన్ను శుష్కింపజేయాలనుకుంటున్నారు. నీవేమో ఇవి నన్నేం చేస్తాయి? క్షుద్రమైన పక్షులు అనుకుంటున్నావా ఇప్పుడు చూడు నా తడాఖా!" అని గరుడుడు సముద్రముపైన తన రెక్కలతో రెండు మూడు సార్లు బలంగా ప్రహారం చేశాడు. అప్పుడు సముద్రుడు ఉద్విగ్నుడైనాడు. గబ్బిలపు గుడ్లను తెచ్చి ఇచాడు. దానికి తన గుడ్లు లభించాయి.దీని అభిప్రాయం ఏమిటంటే ఎంత పెద్ద పనైయిన సరే సంకల్పించి, మన శక్తికొద్దీ ప్రయత్నిస్తే అప్పుడు నీకు సహాయం చెసేవాళ్ళు, నీకు సలహా ఇచ్చేవాళ్ళు నీకు లభిస్తారు. అప్పుడు ఆపని చెయ్యడం వలన నీకు సఫలత చేకూరుతుంది. కేవలం నిరుత్సాహంతో ఉండకూడదు. అందుకనే -
భగవంతుడంటాడు - "ఓ బుద్దిశీలులారా! లేవండి! జాగృతులు కండి. మీ జీవితములో అగ్నిని (తేజస్సు) ప్రజ్వలింపజేయండి. తేజోవంతులు కండి. ప్రకాశవంతులు కండి. ఎట్టిపరిస్థితులలోను, నిరుత్సాహితులు కాకండి. పదండి ముందుకు! పదండి ముందుకు!!

జై శ్రీరాం, జైహింద్

గురురూపంబునదోచి

+91 94419 42157:
 గురురూపంబునదోచి,
భక్తిి నతులన్ గొల్వంగ
శిష్యాళి,కాదరమేపారగ
మంత్రతంత్రవిధులుత్సాహంబుతోజెప్పి,తత్వరహస్యంబులుతెల్పి,ఆత్మపరమాత్మజ్ఞానమున్ గూర్చు
సత్కరుణామూర్తిని విష్ణుమూర్తియను
సద్భావంబుతోజూడరే.
: చరమున్ స్థావరమౌజగంబున సమస్తంబాతడౌటన్
నిరంతరమావిష్ణు ,స్మరింప
పుణ్యఫలముల్ దాగూర్చు నేర్పొప్పగా
నరకక్లేశములన్ దరించి,
నరునిన్ నారాయణున్
రూపమైవరలన్ జేయు
గృపారసంబు
బ్రసరింపన్ జేసి భక్తౌఘమున్.

భగవంతుడుతననునిరంతరముస్మరించుభక్తులకు
నరకబాధలనుతప్పించి సారూప్యమను ముక్తిని
ప్రసాదించును.తనంతటివారినిచేస్తాడనితాత్పర్యము.
: చైతన్యంబొకడే;
యనేకమగుచున్ సర్వత్రభాసించు
నా యా తత్త్వంబుల
నామరూపకృతులందానంత్యమున్ జూపుచున్;
ద్త్వెతంబున్ బలెదోచు,
 నీజగము నద్త్వెతంబుగా గాంచు
చిజ్జ్యోతిన్ బుధ్ధివెలుంగజేయు
హరి నే స్తోత్రంబు గావించెదన్.
తా.ఒకేచైతన్యాన్ని మనము నామరూపకృతులభేదంతోఅనేకంగాచూస్తున్నాము.
ఒకటిగాచూసేబుధ్ధినిప్రసాదించేభగవంతుడు
హరిని నేనుప్రార్థిస్తున్నాను.

*ధర్మ సూత్రాలు*


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

1. వాల్మీకి శ్రీరామ పట్టభిషేకానంతరం రామాయణ రచన చేశాడు. ముందుగా ఊహించి వ్రాసినది కాదు.
2. వినాశ కాలం వచ్చినవారు వివేకమును కోల్పోయి ధర్మవిరుద్ధమైన పనులు చేసి నశిస్తారు.
3. ఎవరిపాప కర్మలకు వారే బాధ్యులు. కానీ, పాపంలో భాగం కూడా పిల్లలకు రావటం తప్పదు.
4. రావణుడు, ఆంజనేయుడు నవ వ్యాకరణాలు చదివిన సర్వ శాస్త్రవేత్తలు.
5. పరమార్థం తెలియనిదే జీవితానికి ప్రయోజనం లేదు.
6. వ్యాసమహర్షి మహాభారతాన్ని కురుక్షేత్రము అయిన తరువాత చాలాకాలంకి వ్రాసిరి.
7. కైవల్య ముక్తి అంటే మోక్షమే. జీవన్ముక్తి అంటే జీవించి ఉండగనే ముక్తుడై యుండడం. జీవన్ముక్తికి ప్రారబ్దము నశించగావిదేహముక్తుడవుతాడు.
8. భగవత్కథలు ఎప్పుడూ మిధ్యలు కావు. ఇది పెద్దలమాట.
9. పున్నామ నరకం నుంచి రక్షించే వాడే పుత్రుడు.
10. నవగ్రహ స్తోత్ర పఠనంవల్ల నవగ్రహాలు ప్రసన్నములై శుభ ఫలాన్ని యిస్తాయి.
11. ఇతరులకు అపకారం చేసి, ఇతరుల బాధలవల్ల సంతోషము పొందే దుర్మార్గుడిని ఖలుడు అంటారు.
12. జమ్మి చాల పవిత్రమైన చెట్టు. అగ్ని స్వరూపము.
13. బ్రహ్మకపాలంలో పిండ ప్రదానం చాల మంచిపని. అంత మాత్రంచేత తద్దినాలు ఎగ్గొట్ట కూడదు. శరీరం ఉన్నంతవరకు పితృ దేవతలకు తద్దినం పెట్టుట శాస్త్రీయ ధర్మము.
14. ఇతరుల ఐశ్వర్యాన్ని చూసి ఎప్పుడూ దుఃఖపడకూడదని, సత్పురుషులను, ద్వేషించకూడదని, స్త్రీలను పరాభవించకూడదని, పరద్రవ్యాన్ని అన్యాయంగా అపహరించకూడదని, మహాభారతం ద్వారా గ్రహించిన నీతి.
15. భగవంతుని త్రికరణశుద్ధిగా పరమోత్తమ భక్తితో ఆశ్రయించిన భక్తులకు దేహాభిమానముగానీ, అహంకారముగానీ ఏమాత్రము వుండకూడదు.
16. పూర్వ కర్మను బట్టి ఇప్పటి జీవితంలో సుఖదుఃఖాలు సంప్రాప్త మౌతాయి.
17. దేవాలయల్లో ధ్వజస్థంభాలు పవిత్రమైనా, కాపురాలుండే ఇళ్ళపైన వాటి నీడ పడడం శాస్త్ర విరుద్ధం.
18. అశ్వథామ, బలి చక్రవర్తి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, ఈ ఏడుగురు చిరంజీవులు.
19. గురువునకు, దైవమునకు ఎప్పుడూ వంగి నమస్కారం పెట్టగూడదు. సాష్టాంగం గానే పెట్టాలి.
20. శివాలయానికి ఎదురుగా ఇల్లు కట్టగూడదు.
21. జగమెరిగినవాడు అంటే తత్త్వవేత్త అన్నమాట. అతనికి దేహాభిమానం లేదు.
22. రాధ గోకులమునందు పరాశక్తి. శ్రీకృష్ణుడు పరమాత్మ. శక్తి, శక్తిమంతుల అభిన్నమైన ప్రేమ, భక్తులకు ఆదర్శం.
23. గాయత్రీ మంత్రం జపమాలతో చేసిన ఉత్తమము. విశేష ఫలం.
24. గాంధారి గర్భవతి గా వున్నప్పుడు, సేవ చేసిన మరొక స్త్రీకి కలిగిన ధృతరాష్ట్రుని కుమారుడు యుయుత్సువుడు.
25. విష్ణుమూర్తికి ఇద్దరు కుమారులు, బ్రహ్మ మరియు మన్మథుడు.
26. భక్తివల్ల జ్ఞానము, రక్తివల్ల అజ్ఞానము కలుగును.
27. కృతయుగమునందు తప్పస్సు, త్రేతాయుగమునందు జ్ఞానము, ద్వాపరయుగమునందు యజ్ఞము, విశేష ప్రాముఖ్యమును పొందియున్నవి. కలియుగమున దానము చేయుటయే ముఖ్య కర్తవ్యము.
28. ఏకాదశి వ్రత ఉపవాసమునకు దశమినాటి రాత్రి భోజనం చేయకూడదు. ఏకాదశి పూర్తి ఉపవాసం. ద్వాదశి ఘడియలు ఉండగానే భుజించుట సంప్రదాయం. దీనినే విష్ణువాసం అంటారు.
29. శివుడు అభిషేక ప్రియుడు కావున లింగరూప అభిషేకమే ఆయనకు ప్రియం.
30. మానవ జన్మకు జ్ఞానం విశేషం.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

గీతా మకరందము

14-18-గీతా మకరందము
        గుణత్రయవిభాగయోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అవతారిక - ఆ యా గుణములు కలవారు మరణానంతర మేయేలోకములను బొందుదురో చెప్పుచున్నారు –

ఊర్ధ్వం గచ్ఛన్తి సత్త్వస్థా 
మధ్యే తిష్ఠన్తి రాజసాః |
జఘన్యగుణవృత్తిస్థా
అధో గచ్ఛన్తి తామసాః ||

తాత్పర్యము:- సత్త్వగుణము గలవారు (మరణానంతరము) ఊర్ధ్వలోకముల కేగుచున్నారు. రజోగుణముగలవారు మధ్యమమగు మనుష్యలోకమున జన్మించుచున్నారు. నీచగుణ ప్రవృత్తిగల తమోగుణయుతులు (పాతాళాది) అధోలోకములకు (లేక, అల్పములగు పశ్వాదిజన్మలకు) జనుచున్నారు.

వ్యాఖ్య:- సత్త్వగుణముగలవారు ఊర్ధ్వలోకములను, ఊర్ధ్వగతినే పొందుదురని తెలుపుటవలన, ఆ
గుణము అవలంబనీయమనియు, రజోగుణతమోగుణయుతులు, మధ్య లోకమును, అధోలోకమును బొందుదురని చెప్పుటవలన ఆ గుణములు అభిలషణీయములు కావనియు స్పష్టమగుచున్నది. దీనినిబట్టి ఊర్ధ్వగతిగాని, అధోగతిగాని వారి వారి యధీనమునందే కలవని తేలుచున్నది. కాబట్టి ప్రయత్నపూర్వకముగ సత్త్వగుణసమాశ్రయముద్వారా ఊర్ధ్వగతినే పడయుటకు సర్వులును యత్నించవలెను.

ప్రశ్న:- సత్త్వగుణము కలవారు మరణానంతర మేలోకములకు పోవుదురు?
ఉత్తరము:- ఊర్ధ్వలోకములకు (లేక , ఊర్ధ్వగతికి)
ప్రశ్న:- రజోగుణము కలవారు?
ఉత్తరము:- మధ్యమమగు మనుష్యలోకములకు (లేక, మధ్యమగతికి).
ప్రశ్న:- తమోగుణము కలవారు?
ఉత్తరము:- అధోలోకములకు (లేక, అధోగతికి)

రామబంటు

ఈ పవిత్ర పృధ్విపై అనుక్షణం ధర్మ సంరక్షణార్ధం, తపించెడి మహా స్వామి ! ఏ కార్య సాధనకైనా శ్రీరామ నామ పునశ్చరణే మహోన్నతమని చాటెడి రామబంటు ! అసాధ్యమనుకొనే ఎట్టి పనుల సానుకూలతకైనా సహకరించెడి మారుతి ! లక్ష్య సాధన కోసం విశ్వ మానవాళికి ఆదర్శమూర్తి, శ్రీ హనుమ ! చెప్పడం కన్నా చేతలలో ఆచరణలో చూపిన మహానుభావుడు ! మనోజవం మారుతతుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం, వాతాత్మజం వానర యూధముఖ్యం, శ్రీరామ దూతం శరణం ప్రపద్యే !!🌅🌹🕉️🌻💐 🙏గుళ్లపల్లి ఆంజనేయులు 

*తెలుగులో వంద ఉత్తమ పుస్తకాలు*

 *తెలుగులో వంద ఉత్తమ పుస్తకాలు* వీలుగా ఉన్నప్పుడు చదవండి మిత్రులారా 💐

●కన్యాశుల్కం - గురజాడ అప్పారావు
●మహాప్రస్థానం - శ్రీశ్రీ
●ఆంధ్ర మహాభారతం - కవిత్రయం
●మాలపిల్ల - ఉన్నవ లక్ష్మినారాయణ
●చివరకు మిగిలేది - బుచ్చిబాబు
●అసమర్థుని జీవయాత్ర - గోపీచంద్
●అమృతం కురిసిన రాత్రి - దేవరకొండ బాలగంగాధర తిలక్
●కాలాతీత వ్యక్తులు - డాక్టర్ శ్రీదేవి
●వేయి పడగలు - విశ్వనాథ సత్యనారాయణ
●కళాపూర్ణోదయం - పింగళి సూరన
●సాక్షి - పానుగంటి లక్ష్మీనారాయణ
●గబ్బిలం - గుఱ్ఱం జాషువా
●వసు చరిత్ర - భట్టుమూర్తి
●అతడు ఆమె - ఉప్పల లక్ష్మణరావు
●అనుభవాలూ..జ్ఞాపకాలు - శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి
●అముక్త మాల్యద – శ్రీకృష్ణదేవరాయులు
●చదువు - కొడవగంటి కుటుంబరావు
●ఎంకి పాటలు - నండూరి సుబ్బారావు
●కవిత్వ తత్వ విచారము - డాక్టర్ సిఆర్ రెడ్డి
●వేమన పద్యాలు – వేమన
●కృష్ణపక్షం – కృష్ణశాస్త్రి
●మట్టిమనిషి - వాసిరెడ్డి సీతాదేవి
●అల్పజీవి – రావిశాస్త్రి
●ఆంధ్రుల సాంఘిక చరిత్ర - సురవరం ప్రతాపరెడ్డి
●ఆంధ్ర మహాభాగవతం – పోతన
●బారిస్టరు పార్వతీశం - మెక్కుపాటి నరసింహశాస్త్రి
●మొల్ల రామాయణం – మొల్ల
●అన్నమాచార్య కీర్తనలు - అన్నమాచార్య
●హంపీ నుంచి హరప్పా దాకా - తిరుమల రామచంద్ర
●కాశీయాత్రా చరిత్ర - ఏనుగుల వీరాస్వామయ్య
●మైదానం – చలం
●వైతాళికులు – ముద్దుకృష్ణ
●ఫిడేలు రాగాల డజన్ – పఠాభి
●సౌందర నందము - పింగళి, కాటూరి
●విజయవిలాసం - చేమకూర వేంకటకవి
●కీలుబొమ్మలు - జివి కృష్ణారావు
●కొల్లాయి గడితేనేమి - మహీధర రామమోహనరావు
●మ్యూజింగ్స్ – చలం
●మనుచరిత్ర- అల్లసాని పెద్దన
●పాండురంగ మహత్యం - తెనాలి రామకృష్ణ
●ప్రజల మనిషి - వట్టికోట ఆళ్వార్ స్వామి
●పాండవోద్యోగ విజయములు - తిరుపతి వేంకటకవులు
●సమగ్ర ఆంధ్ర సాహిత్యం – ఆరుద్ర
●దిగంబర కవిత - దిగంబర కవులు
●ఇల్లాలి ముచ్చట్లు - పురాణం సుబ్రమణ్యశర్మ
●పానశాల - దువ్వూరి రామిరెడ్డి
●శివతాండవం - పుట్టపర్తి నారాయణాచార్యులు
●అంపశయ్య – నవీన్
●చిల్లర దేవుళ్లు - దాశరథి రంగాచార్య
●గణపతి - చిలకమర్తి లక్ష్మీనరసింహం
●జానకి విముక్తి – రంగనాయకమ్మ
●స్వీయ చరిత్ర – కందుకూరి
● మహోదయం - కెవి రమణారెడ్డి
●నారాయణరావు - అడవి బాపిరాజు
●విశ్వంభర – సినారె
●దాశరథి కవిత – దాశరథి
●కథాశిల్పం - వల్లంపాటి వెంకటసుబ్బయ్య
●నేను.. నా దేశం - దర్శి చెంచయ్య
●పెన్నేటి పాట - విద్వాన్ విశ్వం
●ప్రతాపరుద్రీయం - వేదం వెంకటరాయశాస్త్రి
●పారిజాతాపహరణం - నంది తిమ్మన
●పల్నాటి వీర చరిత్ర – శ్రీనాథుడు
●రాజశేఖర చరిత్ర – కందుకూరి
●రాధికా సాంత్వనము - ముద్దు పళని
● స్వప్న లిపి – అజంతా
●సారస్వత వివేచన - రాచమల్లు రామచంద్రారెడ్డి
●శృంగార నైషధం – శ్రీనాథుడు
●ఉత్తర రామాయణము - కంకంటి పాపరాజు
●విశ్వ దర్శనం - నండూరి రామమోహనరావు
●అను క్షణికం - వడ్డెర చండీదాస్
●ఆధునిక మహాభారతం - గుంటూరు శేషేంద్రశర్మ
●చంఘీజ్ ఖాన్ - తెన్నేటి సూరి
●చాటు పద్య మంజరి - వేటూరి ప్రభాకరశాస్త్రి
●చితి.. చింత - వేగుంట మోహనప్రసాద్
●గద్దర్ పాటలు – గద్దర్
●హాంగ్ మీ క్విక్ - బీనాదేవి
 ●ఇస్మాయిల్ కవిత – ఇస్మాయిల్
●కుమార సంభవం - నన్నే చోడుడు
●మైనా - శీలా వీర్రాజు
●మాభూమి - సుంకర, వాసిరెడ్డి
●మోహన వంశీ – లత
●రాముడుండాడు రాజ్యముండాది – కేశవరెడ్డి
●రంగనాథ రామాయణం - గోన బుద్దారెడ్డి
●సౌభద్రుని ప్రణయయాత్ర - నాయని సుబ్బారావు
●సూత పురాణం - త్రిపురనేని రామస్వామిచౌదరి
●సాహిత్యంలో దృక్పథాలు - ఆర్ఎస్ సుదర్శనం
●స్వేచ్ఛ – ఓల్గా
●కరుణశ్రీ - జంధ్యాల పాపయ్యశాస్త్రి
●వేమన - రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ
●తృణకంకణం – రాయప్రోలు
●హృదయనేత్రి - మాలతీ చందూర్
●బ్రౌను నిఘంటువు - చార్లెస్ బ్రౌన్
●నీతి చంద్రిక - చిన్నయ సూరి
●తెలుగులో కవితా విప్లవాల స్వరూపం - వేల్చేరు నారాయణరావు

●నీలిమేఘాలు – ఓల్గా
●అడవి ఉప్పొంగిన రాత్రి – విమల
●చిక్కనవుతున్న పాట - జి లక్ష్మినరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్
●కొయ్య గుర్రం – నగ్నముని
●నగరంలో వాన – కుందుర్తి
●శివారెడ్డి కవిత – శివారెడ్డి

బుధ గ్రహం - దోష నివారణ



తారాచంద్రులకు జన్మించిన వాడు బుధుడు. బ్రహ్మ దేవుడి అనుగ్రహంతో గ్రహంగా మారాడు. బుధుడికి అధి దేవత శ్రీ మహా విష్ణువు. గుండ్రని ఆకారం, పరిమాణం పొడుగు, ప్రకృతి కఫ, వాత, పిత్తములు కలిగిన వాడు. శరధృతువును ఉత్తర దిక్కునూ, సూచిస్తూ.. పృధ్వీ తత్వం కలిగిన వాడు, గ్రహ సంఖ్య 5, రత్నం పచ్చ, లోహం, ఇత్తడి, కంచు, గుణం రజో గుణం కలిగిన వాడు. ఆశ్లేష, మూల, రేవతి నక్షత్రములకు బుధుడు అధిపతి. మిధున కన్యా రాశులకు అధిపతి. బుధుడు కన్యారాశిలో 15 డిగ్రీల వద్ద పరమ ఉచ్ఛ స్థితిని పొందుతాడు. మీనరాశిలో 15 డిగ్రీల వద్ద పరమ నీచను పొందుతుంది. కన్యారాశిలో 15, 20 డిగ్రీలు మూల త్రికోణము ఔతుంది. బుధుడికి సూర్యుడు, శుక్రుడు మిత్రులు. సింహరాశి, వృషభరాశి, తులా రాశులు మిత్ర స్థానములు. చంద్రుడు శత్రువు. కర్కాటక రాశి శత్రు స్థానం. బుధ గ్రహ దశ 17 ఏళ్లు. బుధుడు 7వ స్థానం మీద మాత్య్రమే దృష్టిని సారిస్తాడు.

బుధుడు స్వభావరీత్యా శుభుడు, తత్వము భూతత్వం, గ్రహ స్వభావం, ఒంటరిగా పాపి శుభగ్రహములతో చేరిన శుభుడు. జీవులు పక్షులు, గ్రహ స్థానం క్రీడాస్థలాలు, జలతత్వం జలభాగం, ఆత్మాధికారం వాక్కు, పాలనా శక్తి రాకుమారుడు, గ్రహ పీడ బంధువుల వలన బాధలు, గ్రహ వర్గం శని, గృహంలో భాగములు పఠనా మందిరం, దిక్బలం తూర్పు, నివాస ప్రదేశములు జనావాసాలు, చెట్లు ఫలములు లేని చెట్లు, పండ్లు సీమ చింత, ధాన్యం పెసలు, పక్షులు చిలుక, గబ్బిలం, జంతువులు మేక గొర్రె, ఇతర వస్తువులు నగలు, మిశ్ర లోహములు.

పరమేశ్వరునికి అభిషేకం చాలా ప్రీతిపాత్రమైనది. అంతేకాకుండా అభిషేకం చేయుట వలన త్వరితగతిన దేవుని సక్షాత్కారం లభిస్తుంది. కలియుగమందు సులభరీతిలో తమ పాప ప్రక్షాళనకు అభిషేకం చేసుకొనుట తప్పనిసరి. విశేషించి శివ, సుబ్రహ్మణ్య, గణపతి, ఆంజనేయ, సాయిబాబా వంటి దైవముల అభిషేకములు చేయుటవలన కోర్కెలు తీరును. బలం, ఆరోగ్యం, యశస్సు, సకల సంపద, సకల ఐశ్వర్యం, భూలాభం, ధాన్యం, గృహ, గోవృద్దిని పొందుటకు ఈ కలియుగమున తప్పక అభిషేకములను ఆచరించవలెను.

బుధ గ్రహ దోషానికి శాంతులు
బుధునికి 17 వేలు జపం + 17 వందల క్షీరతర్పణం+170 హోమం+17 మందికి అన్నదానం చేసేది.
బుధవారం రోజున పెసర పప్పు పొంగలి, పచ్చని అరటి పళ్ళు పేదలకు దానం చెయ్యాలి.
బుధవారం రోజున విష్ణు మూర్తి (ఉదా: రాముడు, కృష్ణుడు, రంగనాధ స్వామి, నరసింహస్వామి) ఆలయాలను దర్శించవచ్చు. పెసలు, అరటిపండు కలిపి ఆవుకి ఆహారంగా పెట్టాలి.

గమనిక: ఏ రోజు ఆవుకు ఆహారంగా ఏ ధాన్యం పెడుతామో ఆ ధాన్యం మీరు తినరాదు. ఒక రాగి ముక్కకి పెద్ద రంధ్రం చేసి, దానిని పారుతున్న నీటిలో వేయవలెను. బుధ గ్రహం బాగా లేనపుడు నపుంసకులకు లేదు అనకుండా ధర్మం చేయాలి. తొలి ఏకాదశి రోజున విష్ణు సహస్ర నామ స్తోత్రం 5 సార్లు పారాయణ చేయగలరు. బుధవారం రోజున పురుష సూక్తం(లేదా) విష్ణు సూక్తం (లేదా) నారాయణ సూక్తం పారాయణ చేయాలి. తులసి మాలను 17 బుధవారములు శ్రీవెంకటేశ్వరస్వామికి అలంకరించండి

బుధ గ్రహ దోష నివారణకు మహా విష్ణు పూజ చేయాలి. బుధ మంత్రంతో జపం చేసి మంచి పచ్చ (మరకతం)ను బుధవారం రోజు ధరిస్తే దోషాలు హరింపబడుతాయని శాస్త్రం చెబుతోంది.

బుధ గ్రహ దోష నివారణకు పచ్చని మైదానంలో, ఆకు పచ్చి వాతావరణంలో కొంతకాలం గడపటం మంచిది. విద్యాలయ పరిసరాల్లో ఉండటం, పండిత ప్రసంగ శ్రవణం, మేధావుల స్నేహం ఉపయుక్తమైన ప్రక్రియలు చేయడం ద్వారా బుధ గ్రహ దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

బుధ గ్రహ ప్రభావంతో నరాలు, చర్మం, స్వరపేటిక సంబంధిత వ్యాధులు, నాసిక సంబంధ వ్యాధులు, పక్షవాతం, పిచ్చితనం, నోటి వ్యాధులు సామాన్యంగా బుధుడు కల్పించే వ్యాధులు. అంతేగాకుండా వ్యాపారంలో చిక్కులు, మోసపోవడం, ఆదాయ వ్యయాలు గణిత సంబంధమైన పొరపాట్లు బుధ గ్రహ దోషం వలన కలిగే ఇబ్బందులని శాస్త్రం చెబుతోంది.

కాబట్టి బుధ గ్రహ దోష నివారణకు బుధవారం రోజు పచ్చ పెసలు బ్రాహ్మణునికి దానం చేయాలి. బుధవారాల్లో పచ్చ పెసలు నానపెట్టి ఆవుకు పెడితే దోష నివారణ జరుగుతుందని శాస్త్రం చెబుతోంది....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193557

శ్రీకృష్ణకర్ణామృతము



ప్రథమాశ్వాసము 2 వ శ్లోకము నకు
పద్యానువాదము

చీరెలు జారినా చింతించు కనులేక
           గుమికూడి యుండగా గోప సతులు ,
దివ్య ప్రసూనముల్ దివి కాంతలందరు
           సద్భక్తి తోడను జల్లు చుండ ,
మురళినాళంబును మోవిపై జేర్చియు
           పరవశనాదంబు పంచు చున్న
సర్వేసు డగు విష్ణు శైశవ మూర్తి యై
           నూత్నతేజంబుతో నుండె నిపుడు
శ్రీకరంబుల నిచ్చు నా చిద్విలాసు
శైశవంబున నలరారు సత్వశోభు
ముక్తి సంధాత యైనట్టి మురళిధరుని
గొల్తు మనసార పదముల కూర్చిశిరము
             
     
       గోపాలుని మధుసూదన రావు

రామాయణమ్.62


..
రాజు పెద్దకొడుకును అడవికి వెళ్లమన్నాడట ! చిన్న భార్యమీది మోజుతో ఈ దారుణానికి ఒడిగట్టాడట! ఎంత నిర్దయుడీ రాజు ! ఎంత తెలివిమాలినవాడీయన !.
.
రాముడిని అరణ్యాలకు పంపాలన్న కైక కుతంత్రము ,దశరధుని ఆజ్ఞ, దావానలంలా వ్యాపించింది నగరమంతా ! .
.
ఎవరికి వారు తమకే అన్యాయం జరుగుతున్నట్లుగా భావించారు ! .
.
కొడుకు గుణవంతుడు కాకపోయినా సరే!
 వాడు కళ్ళెదురుగుండా ఉంటే చాలని సర్దుకుపోతారే లోకంలోని తల్లితండ్రులు !
.
మరి దశరథుడికి ఏమయ్యింది ! సకలగుణాభిరాముడు,మర్యాదా పురుషోత్తముడు,సాక్షాత్తూ ధర్మస్వరూపుడు ,దయార్ద్రహృదయుడయిన రాముని అడవులకు పంపటమా?.....పురప్రజలు అందరూ ఇలా  మాట్లాడుకుంటూనే ఉన్నారు......
.
కదిలాడు కోదండపాణి భార్యాసమేతుడై ,తమ్ముడు ముందు నడుస్తుండగా తండ్రికి మరొక్కమారు చెప్పి వెడదామని పాదచారియై తన భవనం నుండి బయల్వెడలాడు.
.
అయోధ్యా నగరమంతా సౌధాగ్రాలమీదనే ఉన్నది !
.
 ప్రజలందరూ వీధులలోకి చేరారు !
 ఇసుకవేస్తే రాలటంలేదు ! అందరి కన్నులు ధారాపాతంగా వర్షిస్తున్నాయి.
.
 జనం జనం జనం ఎటు చూసినా జనమే వారి రోదనమే! అందరి చూపులూ
 సీతారామలక్ష్మణులున్నవైపే.
.
కదిలితే సేవకులు,మెదిలితే పరిచారకులు ,నగరంలో నడవటమంటే ఏమో వారికి తెలియదు !
 సకలరాజలాంఛనాలతో వెడలే రాజకుమారుడు ,సుకుమారుడు నేడు  ఒంటరియై కాలినడకన తండ్రిగృహానికి బయలుదేరాడు ! .
.
సీతమ్మ అంటే అలా ఉంటుంది ! ఇలా ఉంటుంది అని కధలుకధలుగా చెప్పుకోవటమే కానీ ఎవరూ ఎన్నడూ చూడలేదు.
.
అదిగదిగో సీతమ్మ్ ! అబ్బబ్బ బంగారుతల్లి ! ఎంత చక్కనిది ! ఏడుమల్లెలెత్తు ! ఎండకన్నెరుగని ఇల్లాలు నేడిలా భర్తతో కలిసి అడుగులో అడుగులు వేస్తూ అడవికి బయలుదేరింది ! .
.
రాముడు లేని ఈ అయోధ్య మనకెందుకు ! రాముడెక్కడుంటే అదే మన నివాసం!                       
 అది కొండయినా !                             పెనుబండయినా !                               
కడలైనా కారడవైనా! ..               
.
ఈ కొంపలు పాడుబెట్టేద్దాం ! ఎలుకలు పందికొక్కులు తిరుగాడుతూ భూతాలకు నిలయమైపాడుబడ్డ అయోధ్యనే ఏలుకొంటాడు భరతుడు ,మనమెందుకుండాలిక్కడ?
.
 అందరిమనసులో ఒకటే నిశ్చయం ! రాముడే మనకేడుగడ!రామునితోటే జీవనం ! రాముడెక్కడుంటే మనమక్కడే !
.
మానవీయజీవనానికి రాముడే మూలం ! మనమంత కొమ్మలం రెమ్మలం !.
.
మూలం హ్యేషమనుష్యాణాం ధర్మసారో మహాద్యుతిః
పుష్పం ఫలం చ పత్రంచ శాఖాశ్చాస్యేతరే జనాః
.
రాముడు ధర్మమే సారముగాగలవాడు ! గొప్పకాంతికలవాడు .ఈతడే మనుష్యులకు "మొదలు".ఇతర జనులందరూ ఈ చెట్టు మొదలుతో సంబంధముగల పుష్పములు ,ఫలములు,పత్రములు ,శాఖలు..
.
నడచి నడచి తండ్రిసౌధానికి చేరుకొని ద్వారపాలకుని పిలిచి తమ ఆగమన వార్త రాజుకు తెలుపమన్నాడు రాఘవుడు .
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

శ్రీకృష్ణ కర్ణామృతము.

  (ఆంధ్రపద్యటీకా తాత్పర్య సహితము )
                            లీ లా శు క క వి వి ర చి త ము
                                  శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః
                                      (తృతీయాశ్వాసము)
                                          (30-08-2020)   
                                   
3-085-శ్లో॥

          యన్నాభీసరసీరుహాన్తరపుటే భృఙ్గాయమాణో విధిః
          యద్వక్షః కమలావిలాససదనం యచ్చక్షుషీ చేన్ద్వినౌ ।
          యత్పాదాబ్జవినిస్సృతా సురనదీ శమ్భో శ్శిరోభూషణం
          యన్నామస్మరణం ధునోతి దురితం పాయాత్స నః కేశవః ॥

టీకా॥

         యన్నాభీ....పుటే = ఎవ్వనియొక్క బొడ్డునందలి తామరయొక్క లోపలి భాగమను దొప్పయందు (దొప్పవలె నుండునట్టి యా తామర యొక్క లోపలిభాగమందు), విధిః = బ్రహ్మ, భృంగాయమాణః = తుమ్మెద లవలె నాచరించుచున్నాఁడో, యద్వక్షః = ఎవ్వని ఱొమ్ము , కమలా విలాస సదనం = లక్ష్మీ దేవి యొక్క విలాసార్థమైన గృహమో (లక్ష్మీదేవి యెవ్వనిఱొమ్ము నందు విలాసముగా నెలకొన్నదో), యచ్చక్షుషీ = ఎవ్వని కన్నులు, ఇంద్వినౌ = సూర్యచంద్రులో, యత్పాదాబ్జవినిస్సృతా = ఎవ్వని పాదమునుండి వెలువడినదైన, సురనదీ = గంగానది, శంభోః = శివునికి , శిరోభూషణం = శిరోభూషణమాయనో, యన్నామస్మరణం = ఎవ్వని నామములను దలంచుట, దురితం = పాపమును, ధునోతి = , సః = ఆప్రసిద్ధుఁడైన, కేశవః = శ్రీకృష్ణుఁడు, నః = మమ్ము, పాయాత్ = రక్షించుఁగాత.

తాత్పర్యము॥

      బ్రహ్మకు పుట్టినిల్లయిన నాభికమలము గలవాఁడును, లక్ష్మీదేవి కి నివాసమైన వక్షస్థ్సలము గలవాఁడును, సూర్యచంద్రులు నేత్రములుగాఁ గలవాఁడును, శివ శిరోభూషణమైన గంగకు పుట్టినిల్లైన పాదము గలవాఁడును, సకలపాపహరము లైన నామధేయములు గలవాఁడైన కృష్ణుఁడు మమ్ము రక్షించుఁగాక.

ఉత్పలమాల॥

     ఎవ్వని నాభికంజమున భృంగము భంగిఁ జెలంగుఁ బద్మజుం
     డెవ్వని కన్ను లిందురవు లెవ్వని వక్షము లచ్చి కాటప
     ట్టెవ్వని పాదపద్మజల మీశుజటాజటవిఁ బొల్చు భూషణం
     బెవ్వనిఁ బేర్కొనం గలుష మీగునొ యాహరి నన్నుఁ బ్రోచుతన్॥

శ్రీమద్భగవద్గీత


2వ అధ్యాయము
సాంఖ్య యోగము

శృతివిప్రతి పన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా ।
సమాధావచలా బుద్ధిస్తదా యోగామవాప్స్యసి ।। 53 ।।

శృతి-విప్రతిపన్నా — కామ్య కర్మ కాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా; తే — నీ యొక్క; యదా — ఎప్పుడైతే; స్థాస్యతి — ఉండునో; నిశ్చలా — నిశ్చలంగా; సమాధౌ — భగవంతుని యందు; అచలా — స్థిరముగా; బుద్ధిః — బుద్ధి; తదా — అప్పుడు; యోగం — యోగము; అవాప్స్యసి — నీవు పొందెదవు.

భావము: కామ్య కర్మ కాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని యందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగ స్థితిని పొందెదవు.

వివరణ:  సాధకులు ఆధ్యాత్మిక పథంలో పురోగమించేటప్పుడు తమ మనస్సులో వారికి భగవంతునితో సంబంధం బలపడుతూ ఉంటుంది. ఆ సమయంలో, తాము పూర్వం చేసే వైదిక కర్మలు ప్రతిబంధకంగా, సమయం తీసుకునేవిగా అనిపిస్తాయి. తమ భక్తి తో పాటుగా ఇంకా పూజలు మొదలగునవి చేయాలా అని అనుకుంటారు మరియు పూజాది కార్యాలను వదిలి పూర్తిగా సాధన లో నిమగ్నమైతే ఏదైనా తప్పు చేసినట్టవుతుందా అని సంశయ పడతారు. ఇలాంటి వారు తమ సందేహానికి ఈ శ్లోకం లో జవాబు తెలుసుకొంటారు. కోరికలను తీర్చే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా సాధన లోనే నిమగ్నం అవటం తప్పు కాదని, పైగా అది ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.

మాధవేంద్ర పూరి అనే 14వ శతాబ్ద ముని చాలా దృడంగా ఈ భావాన్ని వ్యక్తం చేస్తాడు. అతను విస్తృతమైన కర్మకాండ ఆచారాలు పాటించే ఒక వేద బ్రాహ్మణుడు, కానీ సన్యాసం తీసుకుని, పరిపూర్ణంగా శ్రీ కృష్ణభక్తి లో నిమగ్నమయిపోయాడు. తన జీవిత తదుపరి దశలో ఇలా అన్నాడు:

సంధ్యా వందన భద్రమస్తు భవతే భోః స్నాన తుభ్యం నమః
భో దేవః పితరశ్చతరపణ విధౌ నహం క్షమః క్షమ్యతాం
యత్ర క్వాపి నిషద్య యాదవ కులోత్తాస్య కంసద్విషః
స్మారం స్మారమఘం హరామి తదలం మన్యే కిమన్యేన మే

"అన్ని వైదిక ఆచారాలకి నా క్షమార్పణ అర్పిస్తున్నాను, ఎందుకంటే వాటిని పాటించటానికి ఇక నావద్ద సమయం లేదు. కాబట్టి ఓ ప్రియమైన, సంధ్యా వందనము (ఉపనయనం జరిగి యజ్ఞోపవీతం పొందినవారు రోజుకు మూడు సార్లు చేసే వైదిక ప్రక్రియ), పుణ్య స్నానాలు, యజ్ఞయాగాదులు, పితృకర్మలు వంటివి, దయచేసి నన్ను క్షమించండి. ఇప్పుడు, నేనెక్కడ కూర్చున్నా, కంస విరోధి అయిన శ్రీ కృష్ణ పరమాత్మ నే ధ్యానిస్తున్నాను, అది చాలు నన్ను ఈ భౌతిక బంధాల నుండి విడిపించటానికి".

శ్రీ కృష్ణుడు 'సమాధౌ-అచలా' అన్న పదాన్ని, భగవంతుని ధ్యాస లో ఉండే ధృఢ సంకల్పాన్ని సూచించటానికి, ఈ శ్లోకం లో ఉపయోగించాడు. 'సమాధి' అన్న పదం 'సమ్' (సమత్వము) మరియు 'ధి' (బుద్ది) అన్న మూలధాతువుల నుండి ఏర్పడింది, అంటే 'పరిపూర్ణ సమత్వ బుద్ధి స్థితి'. ఉన్నతమైన చైతన్యం లో స్థిర బుద్ది కలిగి, ప్రాపంచిక భౌతిక ప్రలోభాల పట్ల మోహితుడు కానివాడు ఆ యొక్క 'సమాధి' అంటే సంపూర్ణ యోగ స్థితిని పొందుతాడు.

గురువును

 గురువును చక్కనౌశుభముగాచరియించుగ్రహంబులారు నొ//త్తరికలవేని,రాహువువిధంబనువర్తనమందులేదయే//ని,రజముమూర్ధరీతి బలనేతగ శీర్షమునున్న చంద్రభా//స్కరులను తేజమూర్తులయి కర్కశ పీడితులాయరాహుచే/////
 స్తుతి పద్యం శార్దూలవృత్తం//
శ్రీకామాక్షి పరావిశేషమయమై/,క్షేమాంచిత కావ్యమున్//సాకల్యంబుగ వ్రాయనెంచితిని నే/సామర్ధ్యమున్ లేక ,ని//శ్శోకం,మాన్యము, మూకపంచశతి,/త్సూక్ష్మార్ధముల్ తెన్గునన్//వీకంబోవని పద్యధారలగ,సం/ప్రీతిన్ కటాక్షింపవే///

*శ్రీ రామాయణంలో మహర్షులు*


శ్రీరామాయణ గ్రంథం.. వాల్మీకి, నారదమహర్షుల ప్రశ్నోత్తరాలతోనే ప్రారంభమవుతుంది. ‘షోడశగుణ పూర్ణుడైన మానవుడు ఈ లోకంలో.. ఈ కాలంలో ఉన్నాడా?’’ అని.. తపోధనుడైన వాల్మీకి.. వేదవేత్తలలో శ్రేష్ఠుడైన దేవర్షి నారదమహర్షిని అడిగాడు. దానికి నారదుడు.. ‘‘ఇక్ష్వాకు వంశంలో రాముడను పేరుతో ప్రసిద్ధి చెందిన, లోకంలోని వారందరిచే ప్రశంసింపబడుతున్న మానవుడు కలడు’’ అని బదులిచ్చాడు. అలా శ్రీ రామాయణావతరణకు నారద వాల్మీకి మహర్షులే మూలకారకులు.



శ్రీ రామాయణ గ్రంథారంభం నుండి శ్రీరామపట్టాభిషేక ఘట్టం వరకు గల అనేక ముఖ్య సందర్భాలలో కీలకపాత్రను పోషించిన వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకు వంశానికి కులగురువు. బ్రహర్షియైున వశిష్ఠుని ఆజ్ఞకు రఘు వంశ రాజులు ఏనాడూ ఎదురు చెప్పలేదు. దశరథ మహరాజు నిర్వహించిన అశ్వమేధ, పుత్రకామేష్టి యాగాలు, దశరథ నందనుల నామకరణం, విశ్వామిత్రుని యాగ సంరక్షణ నిమిత్తం రామలక్ష్మణులను పంపించడానికి దశరథుని ఒప్పించడం.. ఇలా ఎన్నో విశిష్ట కార్యాలను నిర్వహించింది వశిష్ఠ మహర్షే.



అలాగే.. విభాండక మహర్షి కుమారుడైన ఋష్య శృంగ మహర్షి.. దశరథుని ఆహ్వానం మేరకు ‘పుత్రకామేష్టి’ అనే బృహద్యాగంలో పాల్గొని ఆశీస్సుల నందించి యాగ సాఫల్యానికి కారకుడయ్యాడు.



శ్రీరాముని శక్తిని, శ్రీరామతత్త్వాన్ని లోకానికి ముందుగా తెలియపరిచినవాడు విశ్వామిత్ర మహర్షి. తన వద్దనున్న బల, అతిబల విద్యలను జృంభక మొదలైన అస్త్రాలను రామలక్షణులకు ఉపదేశించాడు. తన యాగాలకు అడ్డంకులు కల్పిస్తున్న తాటక, సుబాహువుల సంహారం ద్వారా.. దుష్టశిక్షణకు, శిష్ట రక్షణకు అవతరించిన సత్య పరాక్రమవంతుడైన మహాత్ముడే శ్రీరాముడు అని లోకానికి చాటి చెప్పాడు. ఆ తర్వాత రామలక్షణులను జనకుని కొలువుకు తోడ్కొని వెళ్లి, శివధనుర్భంగం చేయించి, సీతాదేవితో వివాహం జరిపించి, రావణవధకు బీజం వేసి లోకక్షేమానికి దోహదపడిన మహనీయుడు విశ్వామిత్ర మహర్షి.



వనవాస దీక్షలోనున్న సీతారామలక్ష్మణులకు ఆతిథ్యాన్ని ఇచ్చింది, చిత్రకూటము ఆశ్రమ నిర్మాణమునకు అనుకూల ప్రదేశమని తెలిపింది.. భరద్వాజ మహర్షి. రావణ వధానంతరం తన ఆశ్రమానికి వచ్చిన శ్రీరామునికి వరాలను ఇచ్చింది కూడా భరద్వాజ మహర్షియే. విరాధుడు చెప్పిన ప్రకారం శ్రీరాముడు శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్లాడు. ‘నేను చేసిన తపముతో ఎన్నెన్నో పుణ్యలోకాలు, మరెన్నో పుణ్యఫలాలు నాకు వశమయినాయి. చిత్ర విచిత్రములైన సుఖాలను కలిగించే ఆ పుణ్యఫలాలను సమర్పిస్తానని శరభంగ మహర్షి చెప్పినా రాముడు ఒప్పుకోలేదు.
‘ఈ అడవిలో నివాసయోగ్యమైన, ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని తెలపండి చాలు’ అని శ్రీరాముడు కోరగా.. సుతీక్ష్ణ మహర్షి దగ్గరకు పంపాడు. ఇక.. శ్రీరామ చంద్రునికి ఆదిత్యహృదయాన్ని ఉపదేశించి, రావణవధకు సహకరించిన తపోసంపన్నుడు.. అగస్త్య మహర్షి. ఇలా ఎందరో మహర్షులు .. ఆ అవతారపురుషుని చరితను జనులకు శాశ్వతంగా అందించి, తరించడానికి కారకులయ్యారు. అట్టి మహర్షులందరినీ నిత్యం తలుచుకుని వందనం చేయాలి.
🙏🙏🙏🙏🙏
 *-: శఠగోపాచార్యులు.*

48వ పద్యం


మ.
తను వెందాక ధరిత్రినుండు నను నందాకన్ మహారోగదీ
పనదుఃఖాదులు బొందకుండ ననుకంపాదృష్టి వీక్షించి, యా
వెనుకన్ నీపదపద్మముల్ తలచుచున్ విశ్వప్రపంచంబు బా
సిన చిత్తంబున నుండజేయ గదవే, శ్రీకాళహస్తీశ్వరా!

*ధర్మం.*



అందరూ అంటుంటారు ధర్మమే గెలుస్తుంది అని.. అది తప్పు.. ధర్మం దానంతట అదే గెలవటం కాదు.. నువ్వు గెలిపించాలి, మనం కలిసి గెలిపించాలి.. అర్థం కాలేదా...

అయితే రండి... ఒక్కసారి నెత్తుటితో తడిసిన చరిత్ర పుస్తకాలలోకి తొంగి చూడండి..

త్రేతాయుగంలో రాముడి భార్యను రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు, సరేలే ధర్మమే గెలుస్తుంది కదా, తన సీత తిరిగి వస్తుంది అని రాముడు చేతులు కట్టుకొని గుమ్మం వైపు చూస్తూ కూర్చోలేదు.. రావణాసురుడి మీదా ధర్మయుద్ధం ప్రకటించాడు. ఆ రాముడికి అఖండ వానర సైన్యం తోడై ధర్మం వైపుకు అడుగులు వేశారు, ఆ యుద్ధంలో రాముడికి సైతం గాయాలు అయ్యాయి. తన భుజాలను, తొడ భాగాల చర్మాన్ని బాణాలు చీల్చుకొని వెళ్ళాయి. నరాలు తెగి రక్తం చిందుతున్నా సరే తట్టుకొని నిలబడ్డాడు, పోరాడాడు, యద్ధంలో గెలిచాడు.. ధర్మం గెలిచింది...

ద్వాపరయగంలో కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు తను దేవుడు కదా అని ఓక సామాన్య మానవుడు లా యుద్దాన్ని చూడలేదు.. ధర్మం చూసుకున్నాడు. పాండవుల పక్షాన నిలుచున్నాడు. అర్జునుడికి రథ సారధిగా మారాడు, గుర్రానికి గుగ్గిళ్లు పెట్టాడు, దాని పేడ ఎత్తేశాడు. స్నానాలు చేయించాడు.
ఆ యుద్ధంలో రథాన్ని నడుపుతూ ఆ వేగంలో వెనకాల అర్జునుడి మాటాలు వినపడవు గనుక అర్జునుడు తన కాలుతో కృష్ణుడి కటి భాగంలో ఎటువైపు తగిలిస్తే రథాన్ని అటువైపు తిప్పాలని ముందుగనే అనుకున్నారు.. అలా కాళ్ళతో కూడా తన్నించుకున్నాడు... అవన్ని ధర్మం కోసమే చేసాడు. ధర్మాన్ని గెలిపించడం కోసమే చేసాడు. అలా కురుక్షేత్ర యద్ధం ముగిసింది, ధర్మం గెలిచింది..

కలియుగం ఇప్పుడు కూడా మనం ప్రతిరోజు సమస్యలతో పోరాడుతునే వున్నాం.. ప్రతి ఒక్కరి మదిలో మంచికి చెడుకి యుద్ధం జరుగుతునే వుంది.. నువ్వు నమ్మితే అది నిజం మాత్రమే అవుతుంది.. ఆచరిస్తే ధర్మం అవుతుంది. అది భవిష్యత్ తరాలకు మార్గదర్శకం అవుతుంది.

అదే నువ్వు నా, ని, తన, మన భేదాలను పక్కన పెట్టి న్యాయం ఆలోచిస్తేనే ధర్మం అర్థం అవుతుంది..
అలా ఆలోచించి పోరాడిన రోజే ధర్మం గెలుస్తుంది, తెగించి అలా ధర్మం వైపుకు నిలబడిన రోజు నీ వెనకాల ప్రపంచమే నడుస్తుంది..

మన ధర్మాన్ని కాపాడుకుందాం. మన భావితరాలకు అందిద్దాము...

రైతు ఆదాయం

🌾🌾🌾👳‍♂👳‍♂🌾🌾🌾
*ఒక ఎకరానికి నేను పెట్టిన పెట్టుబడి ఖర్చులు సుమారుగా , 2020 ఏడాదికి*:

1. నారుమడి,మరియు
పొలం దున్నడం : ₹ 5500=00
2. చదును చేయడం వేయడం : ₹ 1500=00
3. గట్టు చెక్కడం పెట్టడం : ₹ 1000 =00
4. వరి నాటు : ₹ 4000=00
5. వరి విత్తనాలు హైబ్రిడ్20 కిలోలు : ₹ 1800=00
6. కలుపు మందు కలుపు తీయడం : ₹ 1800=00                                     
7.DAP 2 బస్తాలు : ₹ 2500=00
8. జింక్ 10 కిలోలు : ₹ 600=00
9.గుళికలు: ₹ 1000=00
10.యూరియా2బస్తాలు : ₹ 700=00
11. పొటాష్1బస్తా : ₹ 950=00
12.మందుల పిచికారీ : ₹ 1000=00
13. వరి కోత మిషన్ : ₹ 2000=00
14. మిషన్ కు ట్రాక్టర్ : ₹ 1000=00
15. ధాన్యం ఆరబెట్టడం : ₹ 500=00
16. హమాలి ఛార్జ్ : ₹ 1000=00 ___________________________ *రైతు పెట్టుబడి మొత్తము. : ₹ 26,850=00* ____________________________

   ధాన్యం దిగుబడి బస్తాలు = *70*
             1 బస్తాకి కిలోలు = *40*
                     70×40 = *28 క్వింటాళ్లు*

క్వింటాలుకు...ధర * ₹ 1810×28= 50,680=00*

*రైతు పెట్టుబడి= ₹ 26,850=00*
                                       
*రైతుకు మిగిలింది= ₹ 23830=00* *రైతు 6నెలల కష్టార్జితం*

*రైతుకు 1నెల కష్టార్జితం = ₹ 3971=00 
అంటే రైతుకు ఒక్క రోజుకు పడే కూలి ₹ *132=00*   

*ఆరుకాలం కష్టపడితే వచ్చే ఆదాయం ..??*
ఒకవేళ ప్రకృతి కన్నెర్ర చేసై??
గాలి దుమారం,వడగండ్ల వాన లేదా అగ్గితెగులు,మెడవిరుపు, వగైరా లాంటి రోగాలు వస్తే ఏంటి రైతు పతిస్థితి???*

*రైతు ఆదాయం కనీసం ఇంకొక 50% నుంచి 75% పెరగడమే ఎకైక పరిష్కారం, దానికి ప్రభుత్వం మార్గాలు అనుసరించాలి, రైతు ఉత్పత్తులను విలువ జోడిస్తే చాలా వరకు మేలు చేకూరుతుంది*

క్రికెటర్లకు, సినిమా నటులకు, రాజకీయ నాయకుల పోస్టులకు మనం వందలు, వేలు, లక్షల్లో లైక్కు, షేర్లు, కామెంట్లు పెడతాము, ఎందుకంటే మనం వాళ్ళను అభిమానిస్తారు గాబట్టి, తప్పు లేదు కానీ కష్టాలు పడి, మనకు అన్నం పెట్టే రైతుపై అంతకన్నా అభిమానం చూపాలి, రైతు కష్టాన్ని గుర్తించాలి, అంతే కాక 6 నెలలు కష్టపడితే కానీ రైతు పండించే ధాన్యం గింజ మన కంచంలో అన్నం గా మనం తింటాము, కావున ఒక్క అన్నం మెతుకు కూడా వృధా చెయ్యొద్దు అని నా మనవి.

ఈ పోస్టును దయచేసి విరివిగా షేర్ చేసి మన రైతుపై మన అభిమానం చూపిద్దాం.🙏🙏
                                    మీ రైతు అభిమాని .....🌻🌻🌹🌹🌾🌾
🌾🌾🌾🌾

జాగ్రత్తగా చూసుకోండి..

మీ శరీర భాగాలను జాగ్రత్తగా చూసుకోండి..

1. మీకు ఉదయం అల్పాహారం లేనప్పుడు *పొట్ట* గాయపడుతుంది.

2. మీరు 24 గంటల్లో 10 గ్లాసుల నీరు కూడా తాగనప్పుడు *కిడ్నీలు* గాయపడతాయి.

3. మీరు 11 గంటల వరకు నిద్రపోకపోయినా, సూర్యోదయానికి మేల్కొనకపోయినా *గాల్ బ్లాడర్* గాయపడుతుంది.

4. మీరు చల్లని మరియు పాత ఆహారాన్ని తినేటప్పుడు *చిన్న ప్రేగు* గాయపడుతుంది.

5. మీరు ఎక్కువ వేయించిన మరియు కారంగా ఉండే ఆహారాన్ని తినేటప్పుడు *పెద్ద ప్రేగులు* గాయపడతాయి.

6. మీరు పొగతో ఊపిరి పీల్చుకున్నప్పుడు మరియు సిగరెట్ల కలుషిత వాతావరణంలో ఉన్నప్పుడు
*లంగ్స్* గాయపడతాయి.

7. మీరు భారీగా వేయించిన ఆహారం, జంక్ మరియు ఫాస్ట్ ఫుడ్ తినేటప్పుడు *లివర్* గాయపడుతుంది.

8. మీరు ఎక్కువ ఉప్పు మరియు కొలెస్ట్రాల్‌తో మీ భోజనం తిన్నప్పుడు *గుండె* గాయపడుతుంది.

9. మీరు తీపి పదార్థాలు తినేటప్పుడు *ప్యాంక్రియాస్* గాయపడుతుంది. ఎందుకంటే అవి రుచికరమైనవి.

10. మీరు చీకటిలో మొబైల్ ఫోన్ మరియు కంప్యూటర్ స్క్రీన్ వెలుగులో పనిచేసేటప్పుడు *కళ్ళు* గాయపడతాయి.

11. మీరు ప్రతికూల ఆలోచనలను ఆలోచించడం ప్రారంభించినప్పుడు *మెదడు* గాయపడుతుంది.

---- ఈ భాగాలన్నీ మార్కెట్లో అందుబాటులో లేవు.

కాబట్టి జాగ్రత్త వహించండి మరియు మీ శరీర భాగాలను ఆరోగ్యంగా ఉంచండి.

ధన్యవాదములు..🙏

నీ దేహం దేవుని ఆలయం..

ఒక్క రోజు లoగ్స్ చేసే పని వెంటిలేటర్ చేస్తే పాతిక వేలు..

కిడ్నీస్ చేసే పని డయాలిసిస్ చేస్తే 10 వేలు..

హార్ట్ లుంగ్స్ మిషన్ అయితే రోజుకు లక్షల్లో..

ఇంకా బ్రెయిన్ కి సబ్టిట్యూట్ రాలేదు, వస్తే కోట్లల్లో..

అంటే మెడికల్ పరిభాషలో, రోజుకు కొన్ని లక్షల విలువైన పని మన శరీరం చేస్తుంది..

దేవుడికి కృతజ్ఞతలు చెప్పటానికి ఇంతకంటే బలమైన కారణం కావాలా???

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వేరే ఉదాహరణలు కావాలా..
 So, Stay healthy and stay fit..

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 #ఆరోగ్య జాగ్రత్తలు

సన్నిధినట

ఎన్నగా పూజ్యపాదుల సన్నిధినట
పద్మపాద సురేశ్వర ప్రభృతివరులు
కలరు హస్తామలకు బోలు ఘనగణంబు
ఉన్న శిష్యుల ప్రఖ్యాతి గన్నవారు |

పఠనగావించి వేదమ్ము పరమ తత్త్వ
ముపనిషత్తుల నెరుగ సమజ్జ్వలముగ
సహజ వైరాగ్య చిత్తుడై సన్యసించె
పూర్వ నామ సనందన పుణ్యమూర్తి |

తాను నదిపాయ కావలి తటము నుండ
చయ్యనను బిల్వ తననునూ
చార్యుడంత
నమ్రహితమైన భక్తి సనందనుండు
అట్టె నీటిపై పరువులు పెట్టెనంత |

అధికవర్షం


దినరాజు కనరాక దిగులుతో దీనలై
     దిక్కులే యెదలోన స్రుక్కుచుండ
భూజగణమ్ములే ఓజమ్ముగోల్పోయి
     తలవంచి కదలకే కలతనంద
ద్విజబృందములె స్వీయవిభవమ్ముచాటించు
     కూజితమ్ములు మాని గూళ్ళనుండ
సుమబాణతతియె విసుగుచెందుచును రాలి
     భూమిపైబడి యేడ్చి పొర్లుచుండ

ప్రకృతి పలుకు ముత్యముల సంప్రీతిలేక
మౌనినా ధ్యానముద్రను మనుచునుండ
సుప్త చైతన్య సుస్థితి క్షోణిపొంద
వర్ష మధికమై పోద్రోచె హర్షమెల్ల.

ఉప్పొంగి ప్రవహించు నుత్సాహయుక్తలై
     నదులె నీటికళను కదలుచుండ
తపియించి తపియించి ఉపనదీబృందముల్
     జీవనదుల సాటి చేవనంద
తటములే తటులతో తటపటాయింపక
     స్నేహానుబంధమ్ము నెరపుచుండ
తటములే దాటుచున్ తమగొప్పచాటింప
     ఎదల తాపత్రయమ్మున నదులెవెలుగ

తీరవాసుల గుండెల వారిభీతి
రైళ్ళు పరుగెత్తి నిద్రలే రాకయుండ
నీరదమ్ముల వారిద నిరతిపెరిగి
వర్షహర్షమ్ము శూన్యమై వసుధమూల్గె.

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.

*ధార్మికగీత - 21*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
                       
                                     *****
          *శ్లో:- మాతా శత్రు: పితా వైరీ ౹*
                 *యేన బాలో న పాఠితః ౹*
                 *న గర్భ చ్యుతి మాత్రేణ ౹*
                 *పుత్రో భవతి పండితః ౹౹*
                                       *****
*భా:- ప్రతి తల్లి ,తండ్రి తమను పున్నామ నరకము నుండి కాపాడగల వంశోద్ధారకుడు పుట్టాలని కలలు కంటారు. పుత్రుణ్ణి కంటారు. అతిగారాబము, నిరక్షరాస్యత, పేదరికము, నిరాశ్రయము, అండదండల లేమి, ఉదాసీనత ఇత్యాది కారణాలవల్ల ఆ బిడ్డకు చదువు సంధ్యలు చెప్పించకుండా, గాలికి వదిలేస్తే ఆ తల్లి, ఆ తండ్రి తమ కుమారునికి బద్ధ శత్రువులు అవుతారు. వాడు జీవితాంతం ప్రత్యక్ష నరకం ఇక్కడే చూపిస్తూ ఉంటాడు. సామ దాన భేద దండోపాయాలచే అతణ్ణి ప్రయోజకునిగా చేయడం తల్లిదండ్రుల విధి. వాడే తీర్చిదిద్దపడతాడనేది పెద్ద తప్పిదమే. ఎలాగంటే తల్లి గర్భం నుండి ఊడిపడినంత మాత్రాన ఏ పుత్రుడు పండితుడు కాడు. కాలేడు. ఆహారము, ఆహార్యము, క్రమశిక్షణ, దీక్ష, దక్షత, శ్రద్ధ, ఆసక్తి, నిరంతర కృషి, మార్గదర్శనము, గురుశుశ్రూష, దైవకృప ఇవన్నీ తోడైతేనే ఆ పుత్రుడు నిజంగా పండితుడై రాణించ గలడు. వంశాన్ని ఉద్ధరించగలడు. లోకాన్నితన సేవలతో అలరించగలడు. "పుత్రాత్ ఇచ్ఛేత్ పరాజయం" అనే న్యాయానికి పాత్రుడై పుత్రోత్సాహం కలిగిస్తాడు. ఉదాసీనంగా వదిలేస్తే, విద్యాగంధం లేక, సప్తవ్యసన బాధితుడై "పండితపుత్రుడు" అవడం ముమ్మాటికి ఖాయమని సారాంశము.*
                                    *****
                     *సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

మత్స్యావతార చరితము



శ్రీభాగవతమును చెవులార వినుచు
యాధ్యాత్మికానంద మనుభవించేటి
శౌనికాదిగగల్గు సంయమివరులు
పలికిరీరీతిగా ప్రార్థించిసూతు

"విమలాత్మ ! వినమాకు వేడుకయయ్యె
వింతగా పరమాత్మవిష్ణుండు దొల్లి
మత్స్యరూపము దాల్చె మహిమాన్వితముగ
కర్మబద్ధునిభంగి ఘనుడీశ్వరుండు
నిఖిలనిందిత తమోనిలయమైనట్టి
మీనరూపమునేల మేలనిదాల్చె ?
ఎక్కడ వర్తించె ? యేమియున్ జేసె ?
ఆద్యమై వెలయు నయ్యవతారమునకు
కారణంబెయ్యది ? కార్యంశమేమి ?
నీవేను కర్తవు నిఖిలంబుదెలుప
దేవాదిదేవుడా దివ్యుని చరిత
విస్తరించియుదెల్పు వీనులుపండ "

ఆరీతి మునులంత యభ్యర్ధనమున
యడుగగాసూతుని యాలకించతడు
ననియె నీరీతిగా యతిప్రసన్నతతొ
" ఇపుడు మీరడిగిన యీప్రశ్నదొల్లి
నర్జున ప్రియ పౌత్రు డడుగగా శుకుని 
నాతండు వివరించె నరయనీరీతి ;

విభుడీశ్వరుండైన విష్ణుదేవుండు
వేద బ్రాహ్మణ సుర విమలసాధువుల
ధర్మార్థ గోవుల ధరయందు గావ
ఘనరూపములయందు , గాలిచందమున
తనురూపములయందు తగిలితానుండు ;
ఎక్కువతక్కువ యెన్నడొందకను
నిర్గుణత్వంబున నెఱయు ఘనుండు
గురుతయు దొరతయు గుణముల నొందు .
అట్టి యాపరమాత్మ యవనిని బ్రోవ
మనుజేశ ! చోద్యమే మత్స్యంబుయగుట !
విష్ణుని మహిమలు విభవోన్నతములు
వినుము దెల్పెదనీకు వివరంబుగాను
యాలకింపు మికను యానందముగను "

బాదరాయుణుడిట్లు పలికియునృపుతొ
మత్స్యావతారపు మహిమాన్వితమును
వీనులవిందుగా వివరించెనిట్లు

' శంకర విజయము

*81 - కంచి మహాస్వామి వారి '* ' శంకర విజయము
🕉🌞🌎🌙🌟🚩

సనాతనుడు, పద్మపాదులు అనే సన్యాస నామంతో శంకరుల శిష్యునిగా వున్నారని, ఇంతకుముందు తెలుసుకున్నాము కదా ! 


పద్మపాదులు శంకరుల శారీరిక భాష్యం పై వివరణ పంచపాదిక అనే పేరుతో వ్రాసారు. దీని విశేషం ఏమిటో చూద్దాం.
 ఈ గ్రంధం వ్రాస్తూ, పద్మపాదులు, ఆగ్రంధంతో సహా, తీర్థయాత్రల క్రమంలో, రామేశ్వరానికి వెళుతూ, మార్గమధ్యలో జంబుకేశ్వరంలో ఆయన మేనమామ ఇంట్లో బసచేశారు. ఆ దశలో తాను వ్రాస్తున్న వివరణ పుస్తకాన్ని అక్కడ వుంచి, తిరుగు ప్రయాణంలో తీసుకు వెళదామని, రామేశ్వరం వెళ్లారు, పద్మపాదులు. 


అయితే, ఈలోపు ఆయన మేనమామ, పద్మపాదులు లేనప్పుడు ఆ పుస్తకాన్ని తిరగవేస్తూ, ఇది మీమాంసకుల సిద్ధాంతానికి చేటు తెచ్చేదిగావున్నదని భావించి, తాను మీమాంసకుడు అవడం వలన, ఆపుస్తకాన్ని, తన పాడుబడిన రెండవయింటిలో వుంచి, ఆ ఇంటికి నిప్పుపెట్టారు. 


పద్మపాదుడు తిరిగివచ్చాక చూసుకుంటే, ఆపుస్తకం కాలిపోయిన విషయం తెలిసింది. తాను ఇంతకుముందు సురేశ్వరాచార్యుని అద్వైతబుద్ధిని శంకించడం వలన, గురువులైన శంకరులు తనకు ఈ శిక్షవేశారని భావించి, శంకరులకు జరిగిన విషయం నివేదించారు పద్మపాదులు. 


దానికిశంకరులు, పద్మపాదులకు ధైర్యం చెబుతూ, ' నీవు నాకు ఇంతవరకూ, మొదటి అధ్యాయంలో ని నాలుగు భాగాలూ, రెండవ అధ్యాయం లోని మొదటిభాగాన్ని మాత్రమే వినిపించావు. నాకు అదంతా గుర్తువున్నది. నేను చెబుతూ వుంటాను. తిరిగి వ్రాసుకో ! దీనినే ప్రచారం చెయ్యి. ' అని చెప్పారు. అలాంటి ధారణశక్తి జగద్గురువులకు కాక ఎవరికి వుంటుంది. ఏకసంధాగ్రాహులంటే అలాంటి వారే కదా !


సూత్రభాష్యం యొక్క మొదటి అయిదుభాగాలకూ అది భాష్యం కనుక దీనికి పంచపాదుక అనే మాట స్థిరపడింది. బ్రహ్మసూత్రాలలో మొదటిఅధ్యయానికి చెందిన నాలుగు సూత్రాలకు వీరి వ్యాఖ్యానం మిగిలింది. పద్మపాదులను పీఠాధిపతిగా నియమించినట్లుగా కూడా తెలుస్తోంది. కొందరు ద్వారకామఠానికి అనీ, మరికొందరు పూరి మఠానికి అనీ, మార్కండేయ సంహితలో, ఆనందగిరీయంలో శృంగేరీమఠానికి అనీ పేర్కొనడం జరిగింది. 


శంకరుల నలుగురు ముఖ్య శిష్యులలో హస్తామలకుడు ఒకరు. వీరిని గురించి కూడా చెప్పుకుందాం. ఆయన మౌనజ్ఞాని. శంకరులు యాత్రలు చేస్తుండగా, పశ్చిమ తీరానికి చెందిన శ్రీబలిలో వీరిని శంకరులు చూసారు. ఈయనకు వయసు కు తగిన జ్ఞానము అబ్బలేదు. చెవిటి, మూగ బాలునిగా వుండేవారు. ఆయన తండ్రి ఆ పిల్లవాడిని శంకరులకు అప్పజెప్పి, అతడిని తీర్చిదిద్దమని వేడుకున్నాడు. తండ్రే స్వయంగా అతడ్ని ' జడుడు ' అని అన్నాడు. కానీ శంకరులకు ఆ పిల్లవానిలో జ్ఞాని కనిపించదు. 


బ్రహ్మజ్ఞానులు కూడా జడుల లాగానే వుంటారు. ఈయనను జ్ఞానిగా శంకరులు గుర్తించారు. 

🕉🌞🌎🌙🌟🚩

రామాయణమ్.76


..
భాస్కరోదయ కాలొయం గతా భగవతీ నిశా
అసౌ సుకృష్ణో విహగః కోకిలస్తాత కూజతి
.
నాయనా పూజ్యురాలైన రాత్రి గడిచినది సూర్యోదయ సమయము ఆసన్నమైనది చాలా నల్లనియైన పక్షి కోకిల కూయుచున్నది.(పూజనీయురాలైన రాత్రి అట ,వందే వాల్మీకి కోకిలం).
.
రామచంద్రుడు నిదుర లేచాడు ఆయనకు కోకిలకూతలు,నెమళ్లక్రేంకారాలు సుప్రభాతగీతికలయి మేల్కొలుపులు పాడినాయి.( ప్రకృతి ఏర్పాటు చేసిన వంది మాగధులు వీరు).
.
లేచిన వెంటనే ఆలస్యం చేయకుండా తాము చేయవలసిన పనిని లక్ష్మణునకు చెప్పాడు. వెంటనే గంగ దాటాలి .
.
లక్ష్మణుడు ఆ వార్త గుహుడికి చేరవేశాడు ! హుటాహుటిన గుహుడప్పుడు దృఢమైనది ,చక్కగా అలంకరింపబడినది,సమర్ధులైన నడుపువారు కలది,అయిన నావను రేవులో సిద్దం చేసి ,రాముని వద్ద వినమ్రుడై నిలుచున్నాడు.
.
అప్పుడు రాముడు ఆనందంగా మిత్రమా మమ్ము ఆవలి ఒడ్డుకు చేర్పించవయ్యా అని పలికాడు.
.
ఇంతలో సుమంత్రుడు వచ్చి రామా ఏమి ఆజ్ఞ అన్నట్లుగా చేతులు మోడ్చి నిలుచున్నాడు.
.
రాముడు తన కుడి చేతితో సుమంత్రుని స్పృశిస్తూ ఇక నీవు తిరిగి వెళ్ళి రాజును కనిపెట్టుకొని ఉండుము అని పలికాడు.
.
అప్పటిదాకా రాముడితో కలిసి వున్న సుమంత్రుడు తిరిగి వెళ్ళాల్సి వచ్చేటప్పటికి కరిగి నీరైనాడు ...రామా ! నీ కష్టాలు చూస్తుంటే ఋజుత్వానికి గానీ,బ్రహ్మచర్యానికి గానీ,వేదాధ్యయనమునకు గానీ, మృదుత్వానికిగానీ ఫలం లేదు అనిపిస్తున్నది !
.
నీ కష్టాలు భరించగలగటం నీవలననే సాధ్యం లోకంలో ఏ ఒక్క పురుషుడి వల్లకూడా కాదు సుమా ! ( ఈ మూడు రోజులకే ఇట్లా అంటున్నాడీయన ,ఇక ముందు ఏమి కానున్నదో ఈయనకు తెలియదు).
.
మేమెంత దురదృష్టవంతులము! ! నీకు దూరమై పాపాత్మురాలైన ఆ కైక వశులమై ఇక బ్రతుకీడ్చాలి.అని పరిపరివిధాలుగా దుఃఖిస్తున్న సుమంత్రుని చూసి రాముడు ,సుమంత్రా ఇన్ని వేల సంవత్సరాలనుండీ రాజులు పరిపాలిస్తున్నారు రాజాజ్ఞ అనుల్లంఘనీయము ,అప్రతిహతము కదా! అయినా అడవిలో జీవించవలసినందులకు నేనుగానీ సీతగానీ లక్ష్మణుడుగానీ ఏ మాత్రము బాధపడటంలేదు.పద్నాలుగేండ్లు ఎన్నాళ్ళలో తిరిగి వస్తాయి చెప్పు ,మేము ఇలా వెళ్లి అలా తిరిగి వస్తాము. అయోధ్యలో మరల మీ అందరితో కలిసి ఆనందంగా కాలం గడుపగలము. కావున నీవు విచారింపకుము అని పలికి అయోధ్యలో అందరికీ పేరుపేరునా తన నమస్కారములు తెలియచేయమన్నాడు.
.
రామా నిన్ను విడిచి నేను వెళ్ళలేను ,నిన్ను విడిచి ఉండలేనయ్యా! నీ భక్తుడను,నీ భృత్యుడను,మర్యాద కాపాడువాడను నన్ను విడువకయ్యా, నీ తోటే ఉంటాను నాకు అనుజ్ఞ ఇవ్వు అని సుమంత్రుడు రాముని వేడుకుంటున్నాడు.
.
సుమంత్రా నీవు తిరిగి వెళ్ళకపోతే మా అమ్మ కైకేయికి నేను అరణ్యానికి వెళ్ళాననే నమ్మకము కలిగేదెట్లా? అందుకోసమైనా నీవు తిరిగి వెళ్లాలి.అని సుమంత్రుని సమాధాన పరిచినాడు.
.
గుహుని వైపు తిరిగి మిత్రమా మర్రిపాలు తెప్పించయ్యా జటాధారిని కావాలి నేను ! అని పలికాడు.
.
రామాయణమ్..77
..
గుహుడు తెప్పించిన మర్రిపాలు జుట్టుకు తను రాసుకొని తమ్ముడు లక్ష్మణునికి తానే స్వయంగా రాశాడు రాముడు.
నార చీరలుకట్టి జటలు ధరించిన సోదరులిరువురూ ఋషులలాగా శోభిల్లారు.
.
మిత్రమా గుహా ! సైన్యమూ,ధనాగారము,దుర్గము.(.Armed forces,Treasury,Defence systems) ఈ మూడిటి విషయములో ఏ మాత్రము ఏమరుపాటు లేకుండా ఉండు .రాజ్యము పరిపాలించుట చాల కష్టమని పెద్దలు చెపుతున్నారు ,అని రాముడు పలికి అతనిని వీడుకొల్పి నావవద్దకు వెళ్లాడు.
.
లక్ష్మణుడు ముందుగా సీతమ్మను ఎక్కించి,తాను ఎక్కాడు ఆ తరువాత రాముడు నావ ఎక్కి కూర్చున్నపిదప గుహుడు నావను అవతలి ఒడ్డుకు చేర్చమని ఆజ్ఞాపించాడు.
.
రాముడు నావెక్కిన వెంటనే తన శ్రేయస్సును కోరుతూ నావెక్కేటప్పుడు జపించే మంత్రాన్ని జపించాడు .
.
నావ గంగానది మధ్యకు చేరింది!
.
అప్పుడు సీతమ్మ గంగమ్మను ప్రార్దించింది .ఆవిడకు మొక్కుకుంది.
అమ్మా ! వనవాసము నుండి మేము క్షేమముగా తిరిగి వచ్చిన పిదప నిన్నుకొలుస్తానమ్మా!
.
నీ సంతోషం కోసం బ్రాహ్మణులకు లక్షలగోవులు,అన్నవస్త్రాలు ఇస్తాను
నేను నియమముతో నీకు వేయి కుండ లతో కల్లు,మాంసాహారము, సమర్పించుకుంటానమ్మా!
నీ ఒడ్డున ఉన్న సమస్తదేవతలను పూజించుకుంటాను.
.
ఇలా ఆవిడ మొక్కులు మొక్కుకుంటూ ఉండగనే నావ దక్షిణపు ఒడ్డును చేరుకుంది.
.
రాముడు నావ దిగాడు మెల్లగా సీతమ్మకు చేయి అందించి సుతారంగా పట్టుకొని దింపాడు ,ఆతరువాత లక్ష్మణుడు కూడా దిగాడు.
.
అది నిర్జన ప్రదేశము ! లక్ష్మణుడితో కూడి సీతారాములు నడక మొదలు పెట్టారు. ముందు లక్ష్మణుడు ఆవెనుక సీత వారిరువురినీ కాచుకుంటూ వెనుక రామచంద్రుడు.సీతమ్మ భద్రంగా రామలక్ష్మణుల మధ్యలో నడువసాగింది.
.
నడుస్తూ మాట్లాడు కుంటున్నారు.వనవాసంలో కష్టాలేమిటో ఇకనుంచీ సీతకు బాగా అర్ధమవుతయిలే( రావద్దంటే పట్టుబట్టి భర్తమీద అలిగి మరీ వచ్చిందిగా సీతమ్మ,ఇహ రామయ్యమొదలుపెట్టాడు ఆవిడకు కష్టాలగురించి చెప్పటం ! ఇది దెప్పిపొడుపేనేమో)..ఏ పని అయినా మన చేయిదాటిపోతే దానిని సరి చేయటం చాలా కష్టం ! ( నిజమే కదా).
.
ఈ వనంలో జనులుగానీ ,పొలాలుగానీ,తోటలుగానీ ఉండవు !మిట్టపల్లాలు,లోతైన లోయలు ఉంటాయి అట్లాంటి వనంలోకి సీత ఈనాడు ప్రవేశిస్తున్నది.
.
నడిచీ,నడిచీ బాగా ఆకలి వేస్తున్నది మువ్వురికీ
అప్పుడు లక్ష్మణుడు సేకరించి తెచ్చిన ఆహారాన్ని భుజించి రాత్రి విశ్రమించటానికి ఒక చక్కటి చెట్టు మొదలు చూసుకొని దాని క్రిందకు చేరారు.

సత్యవాక్కు

ऊँ शिवाय गुरवे नमः।

కామం దుగ్ధే విప్రకర్ష త్యలక్ష్మీః
కీర్తిం సూతే దుర్హృదో నిష్ప్రహంతి।
శుద్ధాం శాంతాం మాతరం మంగళానాం
ధేనుం ధీరా స్సూనృతాం వాచ మాహుః।।
_________________________

కామం- కోరిక (అనే పాల)ను,
దుగ్ధే-పితికి ఇస్తుంది.
అలక్ష్మీః-చీడపీడలను(పేదరిక లక్షణాలను),
విప్రకర్షతి- నశింపజేస్తుంది.
కీర్తిం- ప్రసిద్ధిని,
సూతే- కలిగిస్తుంది.
దుర్హృదః- శత్రువులను,
నిష్ప్రహంతి- నశింపజేస్తుంది.
(అలాంటి),
శుద్ధాం-నిర్మలమైనదియును,
శాంతాం- మిక్కిలి శాంతమైనదియును,
మంగళానాం- సమస్త శుభములకును,
మాతరం-తల్లియును ఐన,
ధేనుం-గోవువంటిదానినిగా,
సూనృతాం-సత్యబద్ధమైన,
వాచం-వాక్కును గూర్చి,
ధీరాః-పండితులు,
ఆహుః-చెప్పియున్నారు.।।
_________________________
  పండితులు సత్యవాక్కును గూర్చి గోవుతో సమానమైనదానినిగా చెప్పియున్నారు.అది ఎలా అంటే--కోరినదానిని పాలవలె పితికి ఇస్తుంది.అశుభాలనీ, చీడపీడలనీ తొలగించివేస్తుంది.
చక్కని పేరు ప్రతిష్ఠలను కలిగిస్తుంది.శత్రువులను నశింపజేస్తుంది.ఇంకా, ఆ సత్యవాక్కు పవిత్రతను కలిగిస్తుంది.ప్రశాంతతను ఇస్తుంది.సకలశుభాలను తల్లిలాగా అనుగ్రహిస్తుంది సుమా।।
_________________________

भवभूतिः --उत्तररामचरितम्
१५-९-२०२०---- रेण्टाल.

శ్రీవారిఆలయంలోమొదలైనబ్రహ్మోత్సవశోభ

#శ్రీవారిఆలయంలోమొదలైనబ్రహ్మోత్సవశోభ

బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవానికి సమయం ఆసన్నమవుతోంది. ఆపదమొక్కుల వాడికి మామూలు రోజుల్లో చేసే అలంకారాన్ని నిత్యకృత్య అలంకారం అని, పండుగ రోజులు, ఉత్సవాల సందర్భంగా చేసే అలంకారాన్ని విశేష అలంకారం అని అంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో, మూలమూర్తి మలయప్పస్వామి వారికి అలంకరించే ఆభరణాలును పరిశుభ్రం చేయడం టీటీడీ ప్రారంభించింది. జ్యువలరీ సెక్షన్ విభాగం ఆద్వర్యంలో శ్రీవారి ఆలయంలో ప్రధానంగా అత్యంత విలువైన ఏడు కిరీటాలు గరుడ సేవకు వినియోగించె సహస్రనామ హారం, లక్ష్మీ హారం, మకరకంఠి, పీతాంబరం, నిత్య కట్ల ఆభరణాలు, మొదలైన విలువైన వజ్రభారణాలను ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలు ముందు ప్రత్యేక నిపుణులతో హెర్బల్ లాంటి కెమికల్ తో శుద్ధి చేసి మెరుగులు దిద్దితారు. మూలవిరాట్టుకు, ఉత్సవ మూర్తులకు వినియోగించే ఆభరణాలు అన్నీ కలిపి తిరుమల వెంకన్నకు 11 టన్నుల స్వర్ణాభరణాలు ఉన్నాయి. శ్రీవేంకటేశ్వరుని ఆభరణాలకు ఎంతో చరిత్ర ఉంది. గత వెయ్యేళ్లలో ఎంతోమంది ప్రభువులు ఎన్నో వెలకట్టలేని ఆభరణాలను సమర్పించారు. స్వామివారి విశిష్టత, తిరుమల వైభవం, ఆభరణాలు గురించి.. ‘తిరుపతి శ్రీ వెంకటేశ్వర’ అనే బుక్‌లో..డా..సాదు సుబ్రమణ్యశాస్త్రిగారు 1921లో పబ్లిష్ చేశారు.