30, డిసెంబర్ 2024, సోమవారం

బంధాల్లో అనుబంధం

 ఫ్రెండ్స్ బంధాల్లో అనుబంధం ఆనందం ఉండాలంటే 

అహంకారం ఉండకూడదు నాకు అన్నీ తెలుసు 

నేనే గొప్ప అనే అజ్ఞానం ఉండకూడదు. 

ఒక మునీశ్వరుడు శిష్యులతో కలిసి 

నదిలో సంధ్యా  వందనం చేస్తుండగా 

ఒక తేలు నీళ్లలో   కొట్టుకువస్తుండడం గమనించాడు. 

నీళ్లలో  కొట్టుకుపోతున్న తేలుని రక్షిద్దాం అని 

దోసిట్లో తీసుకున్నాడు కాని అది అతన్ని కుట్టగానే 

 నొప్పితో వదిలేసాడు .

మళ్ళీ అది నీళ్లతో పాటు కొట్టుకు పోతుంటే 

మునీశ్వరుడు మళ్ళీ  దోసిట్లో తీసుకున్నాడు రక్షిద్దాం అని , 

కానీ మళ్ళీ  అది కుట్టింది !! నొప్పితొ వదిలేశాడు !. 

చివరికి అలా ౩ , 4  సార్లు జరిగిన తరువాత 

మొత్తానికి తేలును గట్టుమీద పడేసి 

దాని ప్రాణాన్ని రక్షించాడు !!


ఇదంతా గమనిస్తున్న ఒక శిష్యుడు 

" ఏంటి స్వామి తేలు విషపూరితం అని మీకు తెలుసు, 

కుడుతుంది అని తెలుసు ,

అయినా అది మిమ్మల్ని అన్నిసార్లు కుట్టినా  

నొప్పిని భరించి రక్షించారు  . 

అది ఎలాగూ విషపు జీవి దానిని ఎందుకు రక్షించారు ? " 

అని అడిగాడు .


అప్పుడు స్వామిజి " నాయన ! నేను తేలుని  రక్షిద్దాం అని ప్రయత్నిస్తుంటే అది తన  సహజ స్వభావమయిన

 " కుట్టడం " మరువలేదు.కేవలం తేలుకే అలా ఉంటె , 

నేను మనిషిని,మునీశ్వరుడిని , 

రక్షించే ఉపకారం చేసే స్వభావాన్ని ఎలా వదిలిపెడతను ?? 

అని అంటారు. 


 చూశారా ఫ్రెండ్స్ ఇక్కడ మనం గ్రహించి పాటించవలసిన

నీతి ఏంటి అంటే 

మనం ఎంత సహాయం చేసినా  

మనల్ని పక్కన పెట్టే వాళ్ళు , 

మనకు అపకారం చేసేవాళ్ళు మన చుట్టూ ఉండొచ్చు !! 

కాని మంచి మత్రమే చేయాలనే  

మన సహజ స్వభావం మరువకూడదు !! 

మన మంచితనం సహాయమే మనకు ఆ పరమాత్మ రక్ష !🙏


శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి 🙏

భగవద్గీత చదువు.*

 🚩🚩🚩భగవద్ గీత🚩🚩🚩


🚩భగవద్గీత ఎందుకు చదవాలి?🚩🚩


🔹సంతోషంగా ఉన్నావా ... *భగవద్గీత చదువు.*

🔹బాధలో ఉన్నావా ... *భగవద్గీత చదువు.*

🔹ఏమీ తోచని స్థితి లో ఉన్నావా ... *భగవద్గీత చదువు.*

🔹ఏదో గెలిచినావా ...*భగవద్గీత చదువు.*

🔹ఏదో ఓడిపోయినావా ...*భగవద్గీత చదువు.*

🔹నువ్వు మంచి చేసినావా ... *భగవద్గీత చదువు.*

🔹నువ్వు చెడు చేసినావా ... *భగవద్గీత చదువు.*

🔹నువ్వు ఏదో సాధించాలి అనుకుంటున్నావా...*భగవద్గీత చదువు.*

🔹నువ్వు ఏది సాధించ లేక పోతున్నావా ...*భగవద్గీత చదువు.*

🔹నువ్వు చాలా ధనవంతుడవా...*భగవద్గీత చదువు.*

🔹నువ్వు చాలా బీద వాడివా ... *భగవద్గీత విను.*

🔹నువ్వు సమాజాన్ని బ్రతికించాలని అనుకుంటున్నావా...*భగవద్గీత చదువు.*

🔹నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్నావా...*భగవద్గీత చదువు.*

🔹నువ్వు మోసపోయినావా...*భగవద్గీత చదువు.*

🔹నీకు అందరూ ఉన్నారా... *భగవద్గీత చదువు.*

🔹నీవు ఒంటరివా....*భగవద్గీత చదువు.*

🔹నీవు చాలా ఆరోగ్యంగా ఉన్నావా... *భగవద్గీత చదువు.*

🔹నీవు వ్యాధిగ్రస్తుడవయ్యావా...*భగవద్గీత చదువు.*

🔹నీవు చాలా విద్యావంతుడవా...*భగవద్గీత చదువు.*

🔹నీవు పురుషుడవా...*భగవద్గీత చదువు.*

🔹నీవు మహిళవా...*భగవద్గీత చదువు.*

🔹నీవు ముసలివాడివా ...*భగవద్గీత చదువు.*

🔹నీవు యవ్వనస్తుడివా ...*భగవద్గీత చదువు.*

🔹దేవుడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసుకోవాలి అని ఉందా ... *భగవద్గీత చదువు.*

🔹దేవుడు లేడు అని అనుకుంటున్నావా ....*భగవద్గీత చదువు.*

🔹ఆత్మ అంటే ఏమిటి? తెలుసుకోవాలని అనుకుంటున్నావా...*భగవద్గీత చదువు.*

🔹పరమాత్మ తత్త్వం ఎలాంటిదో తెలుసుకోవాలని అనుకుంటున్నావా...*భగవద్గీత చదువు.*

🔹మనిషి జీవితం ఎందుకో తెలుసుకోవాలని అనుకుంటున్నావా ...*భగవద్గీత చదువు.*

🔹కర్మ అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉందా...*భగవద్గీత చదువు.*

🔹ఈ సృష్టి ఎలా వచ్చిందో తెలుసుకోవాలని వుందా...*భగవద్గీత చదువు.*

🔹పుట్టకముందు మనం ఎవరో తెలుసుకోవాలని వుందా... *భగవద్గీత చదువు.*

🔹చనిపోయిన తర్వాత మనం ఏమవుతామో తెలుసుకోవాలని వుందా...*భగవద్గీత చదువు.*

🔹దేవుడంటే అసలు ఎవరో తెలుసుకోవాలని వుందా...*భగవద్గీత చదువు.*

🔹నీలో కామం, క్రోధం, లోభం, మొహం, మధం, మాత్సర్యము వంటి అరిషడ్వర్గాలు ఉన్నాయా...*భగవద్గీత చదువు.*

🔹నీవు ప్రేమిస్తున్నావా...*భగవద్గీత చదువు.*

🔹నీవు ద్వేషిస్తున్నావా...*భగవద్గీత చదువు.*

🔹నీలో వైరాగ్యం ఉందా...*భగవద్గీత చదువు.*

🔹జ్ఞానం మరియు అజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవాలని వుందా...

*భగవద్గీత చదువు.*

🔹బంధాలు, అనుబంధాలు ఎలా ఉండాలో తెలుసుకోవాలని వుందా...*భగవద్గీత చదువు.*

🔹ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలని వుందా...*భగవద్గీత చదువు.*

🔹మోక్షం అంటే ఏమిటో, స్వర్గం అంటే ఏమిటో, నరకం అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉంటే ...*భగవద్గీత చదువు.*

🔹పంచ భూతాలు అంటే ఏమిటి, అవి ఎందుకు ఉన్నాయి తెలుసుకోవాలంటే....*భగవద్గీత చదువు.*

🔹ప్రకృతి, పురుషుడు, భగవంతుడు అనే వాటి యొక్క సంబంధం ఏమిటో తెలుసుకోవాలంటే...*భగవద్గీత చదువు.*

🔹ఇక చివరగా... నీవు ఎవరు, ఎక్కడ నుండి వచ్చావు, ఎక్కడికి పోతావు, నీవారు ఎవరు, నీ అసలు గమ్యం ఏమిటి అని తెలుసుకోవాలి అంటే...*భగవద్గీత చదువు.*

గురు అక్షరమాల స్తుతి*

 🚩🚩 *గురుభ్యోనమః* 🚩🚩


*గురు అక్షరమాల స్తుతి*


*అ - అద్వైతమూర్తి - గురువు*

*ఆ - ఆనందస్ఫూర్తి - గురువు*

*ఇ - ఇలదైవం - గురువు*

*ఈ - ఈశ్వరరూపము - గురువు*

*ఉ - ఉద్ధరించువాడు - గురువు*

*ఊ - ఊర్ధ్వముఖుడు - గురువు*

*ఋ - ఋజువర్తనుడు - గురువు*

*ౠ - ఋణము లేనివాడు - గురువు*

*ఎ - ఏమిలేదని చెప్పువాడు - గురువు*

*ఏ - ఏకమేవాద్వితీయం బ్రహ్మ - గురువు*

*ఐ - ఐశ్వర్య ప్రదాత - గురువు*

*ఒ - ఒక్కటే ఉన్నది అని చెప్పువాడు - గురువు*

*ఓ - ఓంకార రూపము - గురువు*

*ఔ - ఔదార్య మేరువు - గురువు*

*అం - అందరూ సేవించేది - గురువు*

*అః - అహంకార రహితుడు - గురువు*

*క - కళంకము లేనివాడు - గురువు*

*ఖ - ఖండరహితుడు - గురువు*

*గ - గుణాతీతుడు - గురువు*

*ఘ - ఘనస్వరూపము - గురువు*

*ఙ - జిజ్ఞాసులకు జ్ఞానప్రదాత - గురువు*

*చ - చక్రవర్తి - గురువు*

*ఛ - ఛత్రము వంటి వాడు - గురువు*

*జ - జనన మరణములు లేని వాడు - గురువు*

*ఝ - ఝరులవలె బోధించువాడు - గురువు*

*ఞ - జ్ఞానస్వరూపము - గురువు*

*ట - నిష్కపటుడు - గురువు*

*ఠ - నిష్ఠకలవాడు - గురువు*

*డ - డంబము లేనివాడు - గురువు*

*ఢ - ఢంకా మ్రోగించి చెప్పువాడు - గురువు*

*ణ -  తూష్ణీభావము కలవాడు - గురువు*

*త - తత్త్వోపదేశికుడు - గురువు*

*థ - తత్త్వమసి నిర్దేశకుడు - గురువు*

*ద - దయాస్వరూపము - గురువు*

*ధ - దండించి బోధించువాడు - గురువు*

*న - నవికారుడు - గురువు*

*ప - పంచేంద్రియాతీతుడు - గురువు*

*ఫ - ఫలాకాంక్షా రహితుడు - గురువు*

*బ - బంధము లేనివాడు - గురువు*

*భ - భయరహితుడు - గురువు*

*మ - మహావాక్యబోధకుడు - గురువు*

*య - యమము కలవాడు - గురువు*

*ర - రాగద్వేష రహితుడు - గురువు*

*ల - లవలేశము ద్వేషము లేనివాడు - గురువు*

*వ - వశీకరణశక్తి కలవాడు - గురువు*

*శ - శమము కలవాడు - గురువు*

*ష - షడ్భావ వికారములు లేనివాడు - గురువు*

*స - సహనశీలి - గురువు*

*హ - హరిహర రూపుడు - గురువు*

*ళ - నిష్కళంకుడు - గురువు*

*క్ష - క్షరాక్షర విలక్షణుడు - గురువు*

*ఱ-ఎఱుకతో ఉన్నవాడు - 

గురువు*

తిరుప్పావై ప్రవచనం‎-15 వ రోజు*

 🌹🌷🪷🏹🛕🏹🪷🌷🌹

 *🕉️సోమవారం 30 డిసెంబర్, 2024🕉️*

   *వేకువఝామున పాడుకొనుటకు*



 *తిరుప్పావై ప్రవచనం‎-15 వ రోజు*

                 

     *🏹15 వ పాశురము🏹*


*ఆచార్య సన్నిదానానికి చేరే ముందర స్థితి*


*ఎల్లే ! ఇళంకిళియే ! ఇన్నం ఉఱంగుదియో శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్* *నంగైమీర్ ! పోదరుగిన్ఱేన్ వల్లై ఉన్ కట్టురైగళ్* *పండేయున్ వాయఱిదుమ్*

*వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ*

*ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై*

*ఎల్లారుం పోందారో పోందార్ పోంద్ - ఎణ్ణిక్కోళ్*

*వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క*

*వల్లానై మాయనై ప్పాడ - ఏలోర్ ఎమ్బావాయ్*


మనిషికి సహనం , ఓరిమి కలగడం చాలా కష్టం. ఉద్రేకం రావడం అనేది మానవసహజం , కాని దాన్ని ఓరిమితో సహించడం మానవప్రయత్నంతోనే సంభవం. దీన్నే మనం సాధన అంటాం. ఇది భాగవత సహవాసం వల్ల ఏర్పడుతుంది. అలా ఏర్పడి ఉంటే , అప్పుడు ఆచార్య కటాక్షం కలిగే యోగ్యత ఏర్పడింది. మంత్రానుసంధానం చేసే స్థితి లభించినట్లే. ఆచార్య సన్నిదానానికి చేరే ముందర కల్గాల్సిన దాంట్లో ఇది ముందర స్థితి . ఈ రోజు ఆండాళ్ తల్లి ఎట్లాంటి భాగవతోత్తముల సహవాసం మనకు కావాలో చెబుతుంది. 


ఈరోజు పాశురం బయటగోపబాలికలకు లోపలగోపబాలిక మధ్య సంభాషణలా సాగుతుంది. నిన్నటి గోపబాలికతో కల్సి వీరంతా స్వామిని పంఖజ నేత్రా , పుండరీకాక్షా అని పాడుతుంటే విన్నది. ఈవిడకి భాగవతోత్తముల పాటలంటే చాలా ఇష్టం. తాను లేచి బయటకొస్తే వారు పాడటం ఆపేస్తారేమోనని అనుకొని తాను లోపలనుండే గొంతు కలిపి ఆనందిస్తుంది.


అంతలోనే వాళ్ళంతా అక్కడ చేరగానే లోపల గోప బాలిక మెలుకువతోనే ఉండి తమ దగ్గరకు రాలేదని కోపంతో,  *"ఎల్లే!"* ఏమే  *"ఇళంకిళియే!"* లేత చిలకా !  *"ఇన్నం ఉఱంగుదియో"* ఇంకా నిద్ర పోతూనే ఉన్నావా. వీళ్ళకేమో ఈ గోపబాలిక అందమైన గొంతు కలదని , వారి వెంట ఈ గోప బాలిక ఉంటే శ్రీకృష్ణుడు తప్పక వాళ్ళకు దొరుకుతాడు అని భావిస్తున్నారు ఆమెలోని యోగ్యతను పొగుడుతున్నారు. 


కాని లోపల గోప బాలికకు నేను మిమ్మల్ని అంతా ఎడబాసి బాధతో నేనుండగా నన్ను పొగడటం సరికాదు అని ,  శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్నట్లు భావించి ఆక్షేపిస్తున్నట్లుగా అనిపించి *"శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్"*  ఏమిటా గోల మీరంతా , శ్రీకృష్ణుడు నా దగ్గర ఏమి లేడు *"నంగైమీర్ !"* పరిపూర్ణులు మీరే.  *"పోదరుగిన్ఱేన్"* వస్తున్నాను అని అంది. 


 బయట నుండి వాళ్ళు *" వల్లై"* మహా సమర్దురాలివే *"ఉన్ కట్టురైగళ్"* నీనోటి దురుసుతనం మాకు తెలుసులే , *"పండేయున్ వాయఱిదుమ్"*  ఎప్పటినుండో మాకు నీ సంగతి తెలుసులే అని అన్నారు.  


అంతలో లోపల గోప బాలిక *"వల్లీర్గళ్ నీంగళే"* మీరే సమర్థులు ,  నన్నా సమర్థురాలు అని అంటున్నారు , అసలే నేను శ్రీకృష్ణుడి ఎడబాటుచే భాదలో  ఉన్నాను ,  మీరేమో అంతా కల్సి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళడానికి సిద్దంగా ఉన్నారు ,    *"నానే తాన్ ఆయిడుగ"* రాకపోవడం నాదే తప్పు అని ఓరిమితో అంది. 


కాని బయట నుండి , *"ఒల్లై నీ పోదాయ్"*  ఏమే రా ! మరి ఇంక ,  *"ఉనక్కెన్న వేఱుడైయై"* మరి తప్పు ఒప్పుకున్నా నీకేమి వేరే అనుభవమా మరోకసారి ఎత్తిపొడిచారు లోపల గోపబాలికను పరిక్షించటానికి. ఆమె లోపలనుండి *"ఎల్లారుం పోందారో"* అంతా వచ్చారా అంది , బయటనుండి వీళ్లు *"పోందార్"*  అందరూ వచ్చారు , నీవు బయటికి రా నీ దర్శనం మాకు కావాలి అన్నారు. 


 *"పోంద్ - ఎణ్ణిక్కోళ్"* ఏం చేద్దాం అందరం అని ఆడిగింది లోపల గోప బాలిక. *"వల్లానై కొన్ఱానై "* బలం కల్గిన ఏనుగు - కువలయాపీడం *"మాత్తారై మాత్తరిక్కవల్లానై"* దాని కొమ్ములను విరిచి ఆ కొమ్ములతోనే సంహరించిన స్వామి , శత్రువులలోని శత్రుత్వాన్ని తొలగించగల్గినవాడు *"మాయనై"* చిత్ర విచిత్ర మైన మాయలు చేసే మాయావిని *"ప్పాడ"* పాడుదాం.


ఆండాళ్ తల్లి అయిదోపాటలో మాయనై అని మొదలుపెట్టి శ్రీకృష్ణ అవతారాన్ని ప్రారంభించింది. శ్రీకృష్ణుడు పుట్టింది మథురలో , పెరిగింది గోకులంలో అక్కడ ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన పనులు చేసి మళ్ళీ మథురా నగరానికి తిరిగి వచ్చి కంస సంహారం చేసాడు. మథురానగరం నుండి బయలుదేరి మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చేవరకు ఉంది ఆయన మాయ. పుట్టగానే రాత్రికి రాత్రికే యమునానది దాటి ఆవల గోకులానికి బయలుదేరాడు , అక్కడికి పంపిన పూతన ,  శకటాసురుడు , అశ్వాసురుడు , బకాసురుడిని సంహరించి తన కళ్యాణ గుణాలతో అక్కడివారిని పిచ్చెక్కించి , అక్కడినుండి తిరిగి మథురకు వచ్చి కువలయాపీడాన్ని , చారూణముష్టికులను చంపి , కంసుణ్ణి చంపి , బందీగా ఉన్న ఉగ్రసేనుణ్ణి రాజుగా చేసి మథురానగరానికి పట్టిన దారిద్ర్యాన్ని తొలగించాడు.  ఇది భగవంతుడు చేసే చేష్ట.  


ఈరోజుతో పదో గోపబాలికను లేపుతూ మనకు ఒక పది రకాల జ్ఞానులని , వారి జ్ఞాన దశలను పరిచయం చేసింది ఆండాళ్. అలాంటి యోగ్యత కల్గిన మహనీయుల్ని మనం చేరి ఉండాలని , వారిని దర్శించుకుంటూ వారు ఆదేశించిన మార్గంలో పయనిస్తూ జీవితంలో ముందుకు సాగ గలిగితే అది మనకు శ్రేయస్సు. ఇది నిలబడడానికి మనం భగవంతుణ్ణి  ప్రార్థించాలి తప్ప , లోకంలో భక్తులను దూరం చేసుకోకూడదు.  తిరుప్పావై మనకు అదే నిరూపణ చేస్తుంది. పదిమంది గోపికలను లేపే ఈ పది పాటలే తిరుప్పావై అంటారు , ఇక ఈ నమ్మకం గట్టి పడటానికి మిగతా పాటలు.


*భాగస్వామ్యం చేయడమైనది*

 *న్యాయపతి నరసింహారావు*

సోమవారం*🕉️ *🌹30, డిసెంబర్, 2024🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

           🕉️ *సోమవారం*🕉️

      *🌹30, డిసెంబర్, 2024🌹*

          *దృగ్గణిత పంచాంగం*                   


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*

*దక్షిణాయణం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం - కృష్ణపక్షం*


*తిథి     : అమావాస్య* రా 03.56 ఉపరి *పుష్యమాసారంభః*

*వారం  : సోమవారం*(ఇందువాసరే)

*నక్షత్రం  : మూల* రా 11.57 వరకు ఉపరి *పూర్వాషాడ*


*యోగం  : వృద్ధి* రా 08.32 వరకు ఉపరి *ధృవ*

*కరణం  : చతుష్పాద* సా 04.02 *నాగ* రా 03.56 ఆపై *కింస్తుఘ్న*


*సాధారణ శుభ సమయాలు*

        *-ఈరోజు లేవు-*

అమృత కాలం  : *సా 05.24 - 07.02*

అభిజిత్ కాలం  :  *ప 11.48 - 12.32*


*వర్జ్యం           : ఉ 07.34 - 09.12 & రా 10.19 - 11.57*

*దుర్ముహూర్తం  : మ 12.32 - 01.17 & 02.46 - 03.31*

*రాహు కాలం : ఉ 07.59 - 09.23*

గుళికకాళం       : *మ 01.34 - 02.58*

యమగండం     : *ఉ 10.46 - 12.10*

సూర్యరాశి : *ధనుస్సు*

చంద్రరాశి : *ధనుస్సు*

సూర్యోదయం :*ఉ 06.35*

సూర్యాస్తమయం :*సా 05.45* 

*ప్రయాణశూల  : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం    :  *ఉ 06.35 - 08.49*

సంగవ కాలం    :      *08.49 - 11.03*

మధ్యాహ్న కాలం  :*11.03 - 01.17*

అపరాహ్న కాలం : *మ 01.17 - 03.31*


*ఆబ్ధికం తిధి  : మార్గశిర అమావాస్య*

సాయంకాలం  :  *సా 03.31 - 05.44*

ప్రదోష కాలం     :  *సా 05.44 - 08.19*

రాత్రి కాలం       :  *రా 08.19 - 11.44*

నిశీధి కాలం       :*రా 11.44 - 12.37*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.53 - 05.44*

_____________________________

        *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*నటరాజ స్తోత్రం (పతంజలి కృతం)*


*అథ చరణశృంగరహిత శ్రీ నటరాజ స్తోత్రం*


*పతంజలి దృగంజన-మనంజన-మచంచలపదం జనన భంజన కరమ్ ।*

*కదంబరుచిమంబరవసం పరమమంబుద కదంబ కవిడంబక గలం*

*చిదంబుధి మణిం బుధ హృదంబుజ రవిం పర చిదంబర నటం హృది భజ ॥ 1 ॥*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

ఆఱడి చేతలం జనుల

 ఉ.ఆఱడి చేతలం జనుల ఆస్తుల నన్నియు నాక్రమించుచున్

గాఱులు ప్రేలి సజ్జనుల కల్మిని దోచెడు ఘాతుకమ్ములన్ 

వేఱిమి తోడ జేసెడు వివేకము లేని తుటారి వారికిన్

పారము పొందఁ జాలని అవాంఛితమౌ నరకమ్మెదిక్కగున్౹౹ 105


చ.సలలిత రమ్య వాగ్విభవ చారు విలోచన భక్త పాలినీ

విలసిత రాగ వల్లరి! సువీక్షిత కావ్య మనోహరోన్ముఖీ! 

కలుషిత హారిణీ వివిధ కామ్య మనోరథ సిధ్ధ దాయినీ

తలచెద నీదయాంబునిధి తాప విమోచన కామ్య సిధ్ధికై౹ 106

బామ్డ మూల్యం న యాచితే

 

బాండ   మూల్యం న యాచితే  

పూర్వం కౌసల్య రాజ్యంలో వింద్యానగరి అనే పట్టణంలో ఆదిత్య శర్మ అనే పండితోత్తముడు వుండే వాడు. యెర్రని వడలుతో చక్కగా  నుదుట భస్మం దిద్దుకొని పట్టు పీతాంబరాలను ధరించి పుర వీధులలో తిరుగాడుతుంటే సాక్షాత్తు మన్మధుడే భువిపైకే దిగి వచ్చాడా అనిపించే విధంగా ఆతని రూప లావణ్యం ఉండేది. . ఆబాల గోపాలం అతనిని పరికించి చేసేవారు. నారిహృదయ చోరుడు అనదగును అతని సౌందర్యం,. చూసేవారు చూపులను ప్రక్కకు తిప్పుకొనజాలరు అది అతని సుందరరూపం.  చక్కటి భాషతో చలోక్తులను జోడించి పండితులతో ముచ్చటిస్తుంటే సురగురువు బృహస్పతి ఎదుట వున్నాడా అని అనిపించే వాడు. ఆదిత్య శర్మ సకల శాస్త్రాలను ఔపోసన పట్టిన ద్రష్టుడు. సంస్కృతం అతనికి వెన్నతోపెట్టిన విద్య చక్కగా ఆశువుగా కవిత్వం చెప్పగల దిట్ట పండితులు ఇచ్చే సమస్యలను అతి సునాయాసంగా తన కవిత్వంతో మంత్రముగ్దుల్ని చేసే వాడు. ఆయన కవిత్వం వింటూవుంటే ప్రతి శ్లోకం కాళిదాసు కుమార సంభవం లోదా అనిపించేది  ఇక నీతి శాస్త్రానికి సంబందించిన కవిత్వాలు  భతృహరి సుభాషిత శ్లోకాలను తలపించేవి.  నగరంలో ఎక్కడ పండితగోష్ఠి జరిగిన ఆదిత్య శర్మ వుండవలసిందే. శర్మ లేని సభ ఏదో వెలితిగా ఉన్నట్లు తోచేది. పుర ప్రముఖులు అందరు ఆదిత్య శర్మ ఔచిత్యాన్ని, సమయస్ఫూర్తిని, కవిత్వ పాఠవాన్ని, సౌశీల్యతను వేనోళ్ళ పొగిడేవారు. నగర స్త్రీజనులు సహితము వారికి ఏ సందేహాలు వచ్చిన నిస్సంకోచంగా ఆదిత్య శర్మ వద్దకు వచ్చి నివృతి చేసుకొనే వారు పరస్త్రీలకు తోబుట్టువులా ఒప్పాడేవాడు. పట్టణంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అది తనదిగా భావించి వారి చెంతకు వెళ్లి దాని పరిష్కారాన్ని తన బుద్ధికుశలతతో తెలిపేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వింద్యానగరిలో ఆదిత్య శర్మ లేకుండా ఏ ఒక్కరికి ఒక్క రోజు గడచేది కాదు,

ఒకరోజు ఆదిత్య శర్మ పట్టణ వీధులలో నడచి వెళ్లుచుండగా సాలంకార శోభితమైన ఒక పల్లకి ఎదురు పడ్డది పల్లకిలో ఎవరో ప్రముఖులు వెళుతున్నారని ఆదిత్య శర్మ తలంచినాడు,  ఇంతలో పల్లకిలో వ్యక్తి ఆదిత్య శర్మ అని పిలిచాడు. అప్పుడు వెనుతికకు తిరిగి చూడ తన గురుదేవులు విద్యాధరులు. వెంటనే ఆగి గురువుగారికి పాదాభివందనం చేసి తన గృహముకు అరుదెంచామని సాదరంగా ఆహ్వానించాడు ఆదిత్య శర్మ. బహుకాలం తరువాత కలిసిన శిష్యుని కుశలప్రశ్నలు వేసి కౌగిలించుకొన్నారు గురువుగారు..శిష్యుని అభ్యర్థన మేరకు గురువుగారు ఆదిత్య శర్మ గృహంకు వచ్చారు. గురువు గారికి అర్గ్య పాద్యాదులను ఇచ్చి సాదరంగా గృహంలోకి ఆహ్వానించాడు ఆదిత్య శర్మ. . గురువు గారు స్నానసంధ్యాదులను పూర్తిచేసుకొనుచుండగా ఆదిత్య శర్మ తన భార్య సుగుణవతితో గురువుగారికి ఇష్టా  భోజనము సమకూర్చవలసిందిగా చెప్పాడు. ఆదిత్య శర్మ గృహిణి సుగుణవతి పేరుకు తగ్గట్టుగానే సుగుణాల రాసి తన పుట్టింటివారికి. ఆదిత్య శర్మ మీద ఎప్పుడు కస్సు బుస్సులాడటంలో ఆమె సిద్దహస్తురాలు. గురువుగారి ముందు తన పరువు పోకుండా వుండాలని ఆదిత్య శర్మ భార్యను బ్రతిమిలాడుకొనగా దయతో సుగుణవతి  ఒక ఒప్పందానికి వచ్చింది.  అదేమిటంటే తాను గురువు గారిముందు గొప్పలు పోవటానికి ఆమెను తిట్టినా ఆమె నోరు మెదపకుండా వుండాలని.  కాగా సుగుణవతి ఒక షరతు పెట్టింది అదేమిటంటే కేవలం ఒక నూరు తిట్లవరకే సహిస్తానని తరువాత సహించనని ఆమె పేర్కొన్నది. బ్రతుకు జీవుడా అని ఆమె షరతుకు ఆదిత్య శర్మ వప్పుకున్నాడు. గురువుగారు సంధ్యావందనం ముగించిన పిదప ఇరువురు  కొంత తడువు ఇష్టాగోష్టి జరిపారు. శిష్యుని కవితా నైపుణ్యం, శాస్త్ర విచారాలను పరికించిన గురువుగారు అనేక విధముల ప్రశంసలను చేశారు. తన గురువుగారు చేసే ప్రశంసలకు ఆదిత్య శర్మకు ఐరావతం ఎక్కినంత  ఆనందమైనది. పాపం ఆ అభాగ్యునికి ముందు జరగపోయే విపత్తు తెలియదు. అదే కదా దైవలీల అన. . భగవంతుడు ఒకక్షణం ఆనందాన్ని చవిచూపిస్తాడు మరుక్షణం విచారాన్ని విరజిమ్ముతాడు. రెండిటి సిద్దపడి చెలించని వాడే స్థితప్రజ్ఞుడని కదా శ్రీ కృష్ణ భగవానులవారు భగవత్ గీతలో నుడివారు. గురుశిషులు ప్రియసంభాషణలు ఆడుతూ చక్కగా నవ్వుతు ఉండగా తలుపు ప్రక్కనుంచి ఆదిత్య శర్మ శ్రీమతి సుగుణవతి ఏమండీ భోజనం సిద్ధం అని అన్నది. వెంటనే శర్మ గురువుగారు రండి అని వంట గదిలోకి ఆహ్వానించాడు. 

ఇరువురు వంటగదిలోకి ప్రేవేశించగానే రెండు అరిటి ఆకులలో చక్కగా షడ్రుచులతో అలరారే నవకాయ పిండివంటలతో భోజనం వడ్డించి వున్నది. ఎదురుగా విశాలమైన పీటలు వేసి వున్నాయి. గురువుగారికి ఒక పీట్ చూపించి తానూ ఒక పీటమీద కూర్చున్నాడు. తన భార్య ఇచ్చిన భరోసాతో మన కధానాయకుడు ఆదిత్య శర్మ భార్య మీద పెట్రేగి పోవటం మొదలు పెట్టాడు. సహజంగా పురుషులకు ఇంటికి వచ్చిన అతిధులముందు భార్యమీద పెత్తనం చూపాలనే భావన ఉండటం సహజం. ఆదిత్య శర్మ ఎంతటి పండితోత్తముడైన ఈ విషయంలో మాత్రం మినహాయింపు లేదు. అందునా ముందే భార్యతో వప్పందం చేసుకున్నాడాయే.  ఏమిటే ఈ పప్పు ఇందులో ఉప్పు అస్సలు లేనే లేదు అని మొదలు పెట్టాడు. అదేమిటి శర్మ పప్పు రుచికరంగా వున్నదిగా అని గురువు గారు అన్నారు లేదు గురువుగారు దీనికి అట్లా చెపితేనే కానీ వంట సరిగా చేస్తుంది అని ధీమాగా అన్నాడు. పులిహోరలో జీడిపప్పు వేయమన్నాను పల్లీలు వేసావేమిటి అని, అయిన దానికి కానిదానికీ ఇల్లాలిని విసుక్కోవటం చేస్తున్నాడు. ఒక దశలో భోజనం చేస్తున్న గురువుగారికి శిష్యుని ప్రవర్తన జుగుప్సాకరంగా తోచినది . ఏదైనా శృతి మించి రాగాన పడకూడదు అంటారు పెద్దలు. ముఖ్యంగా ఇల్లలుతో ప్రవర్తించే విషయంలో వళ్ళు దగ్గర పెట్టుకోవాలి. చాలామంది భర్తలు ఈ నగ్న సత్యం తెలియక జీవితంలో శృంగభంగాలకు లోనవడం కద్దు.   

ఈ విషయంలో శతకకారుడు ఏమన్నాడో ఒకసారి పరికిద్దాం.

కులకాంత తోడ నెప్పుడుఁ
గలహింపకు వట్టి తప్పు ఘటియింపకుమీ
కలకంఠి కంట కన్నీ
రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ!

భర్త ఎంతటి యోగ్యుడైనను భార్యను అకారణంగా తప్పు పట్టరాదు అని కదా అర్ధం. 

విద్యావంతుడు, గుణవంతుడు, సౌశీల్యుడు అయిన మన ఆదిత్య శర్మను  కూడా అహంభావం, గర్వము మత్తు పొరలులాగా కమ్మేసినాయి. ఆ విషయం గుర్తించలేక పోయాడు మన శర్మ. భోజనం పూర్తికావస్తుండగా పెరుగు వేసి చావు అని భార్యతో విసురుగా అన్నాడు. వెంటనే సుగుణవతి పెరుగు బాండాని తీసుకొచ్చి అతని నెత్తిమీద గట్టిగ కొట్టింది దానితో భాండము (మట్టి పాత్ర) ముక్కలై పెరుగు మొత్తం అతని శిరస్సు మీద చెల్లా చెదురుగా పడ్డది . అది చూసిన గురువు గారు ఉత్తరావపోశన కూడా పట్టకుండా లేచి దొడ్లోకీ వెళ్లారు. ఇందాకనే అయ్యాయి వంద నీ బొంద ఈ భణ్డాఖరీదు వంద రూపాయలు ఇయ్యి అని సుగుణవతి భర్తతో గట్టిగ అన్నది.  దొడ్లో చేతులు కడుకుంటున్న గురువుగారికి ఆ మాటలు స్పష్టంగా వినపడ్డాయి. అప్పుడు గురువుగారికి భార్యాభర్తల మధ్య వున్న విషయం పూర్తిగా అవగతమైనది. . 

గురు శిష్యులు ఇద్దరు వరండాలో బల్లమీద కూర్చున్నారు. శర్మ గురువుగారికి ముఖం చూపించలేక  పోయాడు. అప్పుడు గురువుగారు నాయనా ఎందుకు విచారిస్తావు ఇది అందరి ఇండ్లలో ఉండేదే మీ గురుపత్ని నాకు ఇటువంటి సన్మానాలు అనేక పర్యాయాలు చేసింది చూడు అని తన తలమీద వున్న  పాగా తీసి శిరస్సు చూపించాడు. అక్కడ అనేక బొడిపెలు వున్నాయి.  గురువుగారు వెంటనే అన్నారు . కాక పొతే మీ గురుపత్ని  వెంటనే బాండ మూల్యం మాత్రం నీ భార్య లాగ అడగదు. ఆ రకంగా నేను కొంత మెరుగుగా వున్నానని గురువుగారు ఆదిత్య శర్మతో అన్నారు. అప్పటి నుంచి ' భండ మూల్యం నా యాచతే" అనే నానుడి వచ్చిందని ప్రాజ్ఞులు చెపుతారు. కొన్ని అనుభవాలు మనకు గుణ పాటలు నేర్పుతాయి.

పూర్తి శ్లోకం కింద చూడండి

అనేక శత బాండాని భిన్నాని మమ మస్తక
 అహో గుణవతి భార్య బాండమల్యం నా యాచతే
 


వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - హేమంత ఋతువు - మార్గశిర మాసం - కృష్ణ పక్షం - అమావాస్య - మూల -‌‌ ఇందు వాసరే* (30.12.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*