31, మార్చి 2020, మంగళవారం

ఇకనైనా కళ్ళు తెరవండి..

 మన దేశం కరోనా విలయ తాండవంతో బాధపడుతుంటే దానిని ఆపటానికి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు  రాష్ట్ర ప్రభుత్వాలు అనికే విధాలుగా మీరు ఇంటి మటుకే పరిమితం కాండి  బైటికి రాకండి కరోనా భారిన పడకండి అని చెపుతున్నాయి.  కానీ ఈ విషయం చెవికెక్కని అనేక మూర్కులు వాళ్ళ బైకులు, కార్లు తీసుకొని ఇష్టమొచ్చినట్లు తిరుగుతున్నారు.  వీరి వల్ల వారి ప్రాణాలకే కాదు ప్రక్క వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం.  మరి వీళ్ళు పరిస్థితులు తెలుసుకొని తిరుగుతున్నారా లేక తెలియక తిరుగుతున్నారా? అనేది అర్ధం కానీ ప్రశ్న. నిజంగా వీళ్ళకి పరిస్థితి తెలియకపోతే యెట్లా చెప్పాలి. లేక నిర్లక్ష వైఖరి అయితే వాళ్ళకి ఎలా బుద్ది చెప్పాలి. 
నాకేంకాదులే అనే మనస్తత్వం.  నీకేంకాదు, నన్నెవరూ ఆపలేరు, నేను safe గా వున్నాను అనే భావన వీడాల్సిన సమయం వచ్చింది.  మీరు ఏమి చేయకుండా ఇంట్లో కూర్చోటమే మీరు ఈ దేశానికీ చేసే అతిపెద్ద మేలు. దయచేసి ఇంటికే పరిమితం కాండి. 
పోలీసుల చేతికి చిక్కకండి. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కరోనా వ్యాధి నియంత్రణకు పోలీస్ వారికి చాలా పవర్స్ ఇచ్చింది. కాబట్టి ఈ విషయాన్నీ దృష్టిలో ఉంచుకొని మీరు ఇంటి మటుకే పరిమితం కాండి అత్యవసర పరిస్థితులలోనే గడప దాటండి. లేదంటే మీరు బాధ పడటమే కాకుండా మీ కుటుంబాన్ని బాధ పెట్టిన వారవుతారు. మొదట్లో మన తెలుగు రాష్ట్రాల పోలీస్ వారు, ఉన్నతాధికారులు మర్యాదగా మందలించటం చూసాం.  కానీ ఇప్పుడు వాళ్ళు కుడా వాళ్ళ సహనం కోల్పోయారు. కర్రకు బుద్ది చెప్పుతున్నారు. రోడ్ల మీద తిరిగే వాళ్ళ పిర్రలు వాచే దాకా  కొడుతున్నారు. అకారణంగా  మనం ఎందుకు  రోడ్ల మీద తిరగాలి అనే ప్రశ్న ప్రతి వాళ్ళు వేసుకోవాలి. మన మంతా కలసి కట్టుగా వుండి  ఎవరి ఇంట్లో వాళ్లే ఉంటేనే కానీ  ఈ మహమ్మారిని ఆపలేము. ఇప్పుడు  ప్రేమతో చెప్పితే వినే స్థితిలో ఈ మూర్కులు లేరు. 
కాలనీల్లో: నిన్న మా కాలనిలో చిన్న పిల్లల్ని మోటారుసైకిల్ మీద కూర్చో పెట్టుకొని చెక్కర్లు కొట్టే మూర్కుల్ని చూసాను.  అంతే కాదు ఇద్దరు ఆడవారు స్కూటర్ మీద తిరగటం ప్రక్క కాలనీ వాళ్ళు కిరాణాషాపుకు వచ్చి రోడ్డు మీద చక్కగా సిగరెట్ తాగటం చూసాను. చిన్న పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళ బంధువుల ఇంటికి వచ్చే మహిళను చూసాను. వీళ్లని అదుపు చేయటం యెట్లా.?  ఇదే పరిస్థితి అన్ని కాలనీల్లో ఉండొచ్చు. 
టీవీలు, పేపర్లు, రేడియోలు ఒక్కతీరుగా హోరెక్కిస్తున్న ఈ మూర్కులు ఇంకా మాకేం కాదులే అని భావిస్తున్నారు. 
ఇప్పుడు మన ప్రపంచం తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది.  ఈ విపత్తును ప్రతి ఒక్కరూ శాయశక్తులా ఆపటానికి ప్రయత్నం చేయాలి. 
ప్రతిజ్ఞ:  మనమంతా కలిసి ఈ క్రింది ప్రతిజ్ఞ పూనుదాం. 
నేను ఇప్పటినుండి ప్రభుత్వం అనుమతించే వరకు మా ఇల్లు వదలి వెళ్ళను. మా పిల్లలను, మా పెద్దవాళ్ళను ఇల్లు వదలకుండా చూస్తాను. మా ఇంట్లోనే  వుండి నేను నా ఇష్ట దేవుణ్ణి ఈ విపత్తునుండి ప్రపంచాన్ని కాపాడమని ప్రార్ధిస్తాను. 
ఓం శాంతి శాంతి శాంతిహి.