14, ఆగస్టు 2025, గురువారం

అనగనగా

 🔔 *అనగనగా...* 🔔

ఒక కవి ఇంట్లో

దొంగలు పడ్డారు!

ఆరు వారాల నగలు

మూడు లక్షల నగదు

ఐదు పుస్తకాలు పోయాయి!!

పుస్తకాలది ఏముందయ్యా...నగలు నగదు చోరీ జరిగిందని కేసు నమోదు చేసుకున్నాడు పోలీసు.

పోలీసుల దర్యాప్తు జరుగుతోంది..నెలలు గడుస్తున్నా జాడలేదు...ఇక వడిసెను సుమతీ అనుకున్నాడు కవి....

ఐదు నెలల తర్వాత ఇంటికి ఒక పార్సిల్ వచ్చింది.. అందులో నగలు నగదు భద్రంగా పంపించారెవరో...కవి గారి భార్య పిల్లలు వాటిని కళ్ళకు అద్దుకుని ఆనందించారు...

పుస్తకాలు పోతేపోయినయి.. సొమ్ము దొరికింది అంతేచాలు అన్నారు భార్యాపిల్లలు..

ఆ పుస్తకాలు నా పంచప్రాణాలు అన్నాడు కవి...

" పోద్దురు బడాయి "

" పదేళ్లు కష్టపడి ఐదు పుస్తకాలు రాశానే...అవి నా పంచప్రాణాలు... పంపించినవాడు పుస్తకాలు పంపించి...నగదు నగలు పంపించకపోయినా బాధపడక పోయేవాడిని...కష్టపడితే సొమ్ము సంపాదించగలను..మళ్ళీ ఆ పుస్తకాలు రాయలేనే...అవి సరస్వతీ దేవి అమ్మవారు "... ఎడ్వడం మొదలెట్టాడు.

https://youtu.be/LAFG_ujf6BU

" నీ పుస్తకాలు సరస్వతీదేవీ ఐతే.. నా నగలు నగదు సాక్షాత్తు లక్ష్మీదేవి.. ఆ దొంగేవడో పిచ్చోడు " ఆనంద పడింది.ఇంతలో ఆ పార్సిల్లో ఒక కవర్ కనిపించింది.దాన్ని చించి అందులోని చీటి ఆసక్తిగా చదవడం ప్రారంభించింది ఆవిడ.

కవి గారికి

నమస్కారములు...

బీరువా తాళాలు పగులగొట్టి చూశా..నగలు నగదు పక్కన పుస్తకాలు కనిపించగానే ఇవేవో ఖరీదైనవని భావించి దోచుకెళ్లా..బీరువాలో ఎందుకు దాచారు...వీటిలో నిధి రహస్యాలు ఏమైనా ఉన్నాయేమోనని ఓపిగ్గా వాటిని చదివా..నగదు నగలుకన్నా గొప్ప నిధి దొరికింది.. అది జ్ఞాన నిధి..తప్పుచేశానని తెలుసుకున్నా..

ఈ లోగా నాభార్య పాతికవేలు ఖర్చుచేసింది.. చమటోడ్చి సంపాదించి కొద్దినెలల్లో మనియార్థర్ చేస్తా..డబ్బుతో పాటు పుస్తకాలు పంపిస్తా.. ఐతే వాటి జిరాక్స్ ప్రతులు మాత్రం తీసుకుని నావద్ద ఉంచుకుంటా... వాటిని మా పిల్లలతో పాటు తోటివారితో చదివిస్తా.. ఒకవేళ పుస్తకాలు దొంగిలించకపోతే నగలు నగదు తిరిగి పంపించేవాడినికాదు.. ఇప్పుడు నా దృష్టిలో నగలు నగదు కన్నా పుస్తకాలే విలువైనవిగా కనిపిస్తున్నాయి...ఈ రోజు నుంచి దొంగతనాలు మానేస్తున్నా... పుస్తకాలు అచ్చేసుకునేందుకు తోచిన డబ్బుకూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తా...

                     ఇట్లు

          దొంగతనాలు మానిన దొంగ

ఇప్పుడు కవి ముఖంలో ఆనందం..

ఆయన భార్య ముఖంలో ఆలోచనలు

లక్ష్మీదేవి గొప్పదా?

సరస్వతీ దేవి గొప్పదా?   

ప్రతి విద్యార్థికి ఈ కథ ఒక పాఠం కావాలి

🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

వర్షధారల కురిపించి

 తే.గీ.

వర్షధారల కురిపించి వసుధలోని 

తెలుగు నేలల మురిపించి చలువబరచి 

జలనిధిగజేసె వరుణుండు క్షమనెల్ల 

వలదు వలదంచు వేడగా వరుణవిభుడు 

*~శ్రీశర్మద*

ఆదిపర్వము

 🔯🌹🌷🏹🕉️🏹🌷🌹🔯

*🪷బుధవారం 13 ఆగస్టు 2025🪷*

*శ్రీమదాంధ్ర మహాభారతం*

         *ఆదిపర్వము*

     *మహా భారత కథ* 

      *ప్రారంభం(1 -6)* 

ఇంక భారత కధను మొదలు పెడతాను వినండి. పంచపాండవులలో

అర్జునుడు ప్రముఖుడు. అతడే శ్రీకృష్ణునికి బావ. అర్జునుని కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు మహారాజు. ఆ పరీక్షిత్తు మహారాజు కుమారుడు జనమేజయుడు. ఆ జనమేజయుడు ఒకసారి ఒక మహా యజ్ఞము చేస్తున్నాడు. సరమ అనే దేవతల కుక్క కుమారుడు సారమేయుడు. ఆ సారమేయుడు ఆ యజ్ఞము చేసే చోటికి వచ్చి ఆడుకుంటున్నాడు. జనమేజయుని తమ్ముళ్లు అది చూచారు. వారు ఆ కుక్క పిల్లను కొట్టి తరిమేసారు.

సారమేయుడు అనే కుక్క పిల్ల ఏడుస్తూ పోయి తన తల్లి సరమకు

జరిగిన విషయం చెప్పింది. సరమ కోపంతో జనమేజయుని వద్దకు వచ్చింది. “ఓ జనమేజయ మహారాజా! నీ తమ్ములు ఏ మాత్రం వివేకము, కరుణ లేకుండా నా కొడుకు సారమేయుని కొట్టారు. ఓ రాజా! యుక్తా యుక్త వివేచన విచక్షణ లేకుండా మంచి వారికి, సాధువులకు అపకారం చేసే వారికి అకారణంగా ఆపదలు వచ్చి మీద పడతాయి.” అని పలికి ఆ సరమ అనే కుక్క వెళ్లి పోయింది.

తరువాత కొన్నాళ్లకు జనమేజయుడు తాను చేయుచున్న యాగము

పూర్తి చేసాడు. తన రాజధాని హస్తినా పురమునకు పోయి సుఖంగా ఉన్నాడు. ఇంతలో జనమేజయునికి సరమ మాటలు గుర్తుకు వచ్చాయి. చేసిన తప్పుకు శాంతి చేయిద్దాము అనుకున్నాడు. తగిన ఋత్విక్కు కోసరం అన్వేషిస్తున్నాడు. ఆ క్రమంలోశ్రుత శ్రవసుడు అనే మునిని కలుసుకున్నాడు. అతనికి నమస్కరించి ఇలా అన్నాడు. “తమరి కుమారుడు సోమశ్రవసుని నాకు పురోహితునిగా పంపండి." అని అర్థించాడు. దానికి తండ్రి సమ్మతించాడు. జనమేజయుడు సోమశ్రవసుని పురోహితునిగా స్వీకరించాడు. సోమశ్రవసుని

ఆధ్వర్యంలో అనేక పుణ్యకార్యములు చేసాడు. పైలుడి శిష్యుని పేరు ఉదంకుడు. ఉదంకుడు గురువులను భక్తితో సేవించి అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశత్వం, వశిత్వం, కామానసాయిత, అనే ఎనిమిది సిద్ధులు పొందాడు. ఒక రోజు గురువు గారి భార్య ఉదంకుని పౌష్యుడు అనే మహారాజు భార్య వద్దనున్న కుండలములు తీసుకురమ్మని పంపింది. ఉదంకుడు ఆ పని మీద పౌష్యు మహారాజు వద్దకు వెళుతుండగా దారిలో ఒక దివ్య పురుషుని చూచాడు. అతని కోరిక మేరకు గోమయము ( ఆవు పేడ) భక్షించాడు. ఆ దివ్య పురుషుని అనుగ్రహం పొందాడు. 

తరువాత పౌష్యమహారాజు వద్దకు వెళ్లాడు. “మహారాజా! నేను నా గురుపత్ని ఆజ్ఞ మేరకు నీ వద్దకు వచ్చాను. నీ భార్య వద్దనున్ను కుండలములు

ఇప్పిస్తే అవి తీసుకొని పోయి మా గురుపత్నికి ఇస్తాను. త్వరగా ఇప్పించండి.” అని అడిగాడు. "మహాత్మా! ఆ కుండలములు నా భార్య వద్ద ఉన్నవి. ఆమెను అడిగి తీసుకోండి.” అని అన్నాడు.

ఉదంకుడు పౌష్యమహారాణి వద్దకు వెళ్లాడు. కాని ఆమె ఉదంకునికి

కనిపించలేదు. మరలా రాజు వద్దకు వచ్చి “రాజా! మహారాణి నాకు

కనిపించలేదు. మీరే ఆ కుండలములు తెప్పించి ఇవ్వండి." అని అడిగాడు. "మహాత్మా! నా భార్మ మహా పతివ్రత. చాలా పవిత్రురాలు. ఆమె అపవిత్రులకు కనపడదు.” అని అన్నాడు. అప్పుడు ఉదంకునికి గుర్తుకు వచ్చింది. తాను గోమయ భక్షణము చేసి ఆచమనము చేయలేదు అని. ఆ అపవిత్రత వలన రాణి తనకు కనపడలేదు అని అనుకున్నాడు.

సశేషం

తంగిరాల చంద్రశేఖర అవధాని, కపిలేశ్వరపురం

                 *సేకరణ* 

 *న్యాయపతి నరసింహారావు* 

🔯🌹🚩🏹🛕🏹🚩🌹🔯

మహా భారత కథ*

గురువారం🪷* *🌹14 ఆగస్టు 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🪷గురువారం🪷*

  *🌹14 ఆగస్టు 2025🌹*      

     *దృగ్గణిత పంచాంగం*                 

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్షఋతౌః* 

*శ్రావణమాసం - కృష్ణపక్షం*

*తిథి  : షష్ఠి* రా 02.07 వరకు ఉపరి *సప్తమి* 

*వారం    : గురువారం* ( బృహస్పతివాసరే )

*నక్షత్రం   : రేవతి* ఉ 09.06 వరకు ఉపరి *అశ్విని*

*యోగం : శూల* మ 01.12 వరకు ఉపరి *గండ*

*కరణం  : గరజి* మ 03.15 *వణజి* రా 02.07 ఉపరి *భద్ర*

*సాధారణ శుభ సమయాలు:*

 *ప 11.00 - 12.00 సా 04.00 - 06.30*    

అమృత కాలం  : *ఉ 06.50-08.20 & రా 12.51-02.21*

అభిజిత్ కాలం  : *ప 11.47 - 12.38*

*వర్జ్యం      : రా 03.51 - 05.21*

*దుర్ముహూర్తం  : ఉ 10.05 - 10.56 మ 03.10 - 04.00*

*రాహు కాలం   : మ 01.47 - 03.22*

గుళికకాళం       : *ఉ 09.02 - 10.37*

యమగండం     : *ఉ 05.51 - 07.25*

సూర్యరాశి : *కర్కాటకం* 

చంద్రరాశి : *మీనం/మేషం*

సూర్యోదయం *ఉ 05.59*

సూర్యాస్తమయం :*సా 06.43*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.51 - 08.23*

సంగవ కాలం         :     *08.23 - 10.56*

మధ్యాహ్న కాలం    :     *10.56 - 01.28*

అపరాహ్న కాలం    : *మ 01.28 - 04.00*

*ఆబ్ధికం తిధి         : శ్రావణ బహుళ షష్ఠి*

సాయంకాలం        :*సా 04.00 - 06.33*

ప్రదోష కాలం         :  *సా 06.33 - 08.49*

రాత్రి కాలం           :*రా 08.49 - 11.49*

నిశీధి కాలం          :*రా 11.49 - 12.35*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.21 - 05.06*

******************************

         *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

*శ్రీదత్త నవరత్నమాలికా స్తోత్రం*

*కోకబన్ధుసమవేక్ష్య*

*మహస్కం దత్తదేవ* 

*మనిశం కలయామి ॥*

       *జై దత్తాత్రేయ నమః*

🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

          🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

కేదారనాథ్

 *కేదారనాథ్*

అక్కడెలా నిర్మించగలిగారు… కేదారనాథ్ అంటేనే ఓ మార్మిక స్థలి

```

ఏదో ఉంది కేదారనాథ్ గుడిలో… ఆ నిర్మాణంలో, ఆ సన్నిధిలో… మనకు అర్థం కాని మిస్టరీ…!

ఎస్, భారతీయ వాస్తు పరిజ్ఞానం మన గుళ్ల నిర్మాణంలో ఉంది… వందలేళ్లు అలా చెక్కుచెదరకుండా ఉన్న బృహదాలయాలు ఎన్నో… ఎన్నెన్నో…

ప్రత్యేకించి కేదారనాథ్… ఎవరు నిర్మించారనే వివరాలే సరిగ్గా తెలియవు… 8వ శతాబ్దం అంటుంటారు… అంటే ఈ గుడి వయస్సు 1200 ఏళ్లు దాటి… చెక్కుచెదరకుండా నిలిచిన మన ఓల్డ్ ఆర్కిటెక్చర్ నాలెడ్జికి శిఖరమెత్తు ప్రతీక…

అసలు ఆ గుడి నిర్మాణస్థలమే ఓ మిస్టరీ… దాన్ని ఎందుకు ఎంచుకున్నారు అప్పటి నిర్మాణ స్థపతులు అనేది మిస్టరీ… ఈరోజుకూ అది గుడి నిర్మాణానికి ప్రతికూలమైనదే… ఒకవైపు 22,000 అడుగుల ఎత్తులో కేదార్‌నాథ్ కొండ… మరోవైపు 21,600 అడుగుల ఎత్తులో కరచ్‌కుండ్…

మూడో వైపు 22,700 అడుగుల ఎత్తులో భరత్‌కుండ్ ఉన్నాయి.. ఈ మూడు పర్వతాల గుండా ప్రవహించే ఐదు నదులు మందాకిని, మధుగంగ, చిర్గంగ, సరస్వతి, స్వరందరి…

చలికాలంలో విపరీతమైన మంచు కురిసే చోటు… వర్షాకాలంలో నీరు అతి వేగంతో ప్రవహించే ప్రదేశం… అది ప్రవాహ స్థలి… ఈరోజుకూ మనం అక్కడికి వాహనాల్లో వెళ్లలేం…

మరి అంతటి ప్రతికూల పరిస్థితుల్లో ఎలా కట్టారు…? కేదారనాథ్ దేవాలయంలోని రాళ్లపై లిగ్నోమాటిక్ డేటింగ్ పరీక్షను నిర్వహించినప్పుడు… దానిలో 14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం మధ్యకాలం వరకు ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడి ఉందని పరీక్షలో తేలిందట…

ఐనా సరే గుడి చెక్కుచెదరలేదు… 2013లో కేదారనాథ్‌ను తాకిన విపత్కర వరద చూశాం కదా, సగటుకంటే 375% ఎక్కువ వర్షపాతం నమోదైంది… చాలా మంది మరణించారు… పలు పరిసర గ్రామాలు దెబ్బతిన్నాయి…

మన ఎయిర్‌ఫోర్స్ దాదాపు లక్ష మందిని రక్షించింది.,. అంతా అతలాకుతలం… ఆ వరదలు తగ్గిన తరువాత చూస్తే… 1200 సంవత్సరాల తరువాత, ఆ ప్రాంతం లోనికి బయటి నుండి తరలించబడిన ప్రతిదీ తుడుచుకుపెట్టుకు పోయింది… ఒక్క నిర్మాణం కూడా నిలబడలేదు…కానీ ఈ ఆలయం మాత్రం ఓ స్థిరశిఖరంలా నిలబడే ఉంది…

అంత దృఢమైన కట్టడం మన వాస్తు జ్ఞానం… కేదార్‌నాథ్ ఆలయాన్ని “ఉత్తర- దక్షిణ”గా నిర్మించారు… దేశంలోని దాదాపు అన్ని దేవాలయాలు “తూర్పు- పశ్చిమ” దిశలో ఉంటాయంటారు… అన్ని గుళ్లలాగే దీన్నీ నిర్మించి ఉంటే ఇలా ఉండేది కాదేమో…

అందరికీ ఆశ్చర్యం ఏమిటంటే… గుడి నిర్మాణానికి ఉపయోగించిన రాయి అక్కడ లభ్యమయ్యేరకం కాదు… ఎక్కడి నుంచో తెచ్చారు… అక్కడికి ఎలా తెచ్చారు..? ఎలా పేర్చారు అనూహ్యం.,. సిమెంట్ అప్పటికి లేదు సరే, కానీ అనేక గుళ్లకు వాడిన పద్ధతి గాకుండా ‘ఆష్టర్’ పద్ధతి వాడినట్టు చెబుతారు…

పుష్కరం క్రితం వరదల్లో ఓ మహత్తు తెలిసిందే కదా… ఓ పెద్ద బండరాయి (భీమశిల) ప్రవాహంలో కొట్టుకొచ్చి, సరిగ్గా గుడి వెనుక ఆగిపోయి, వరద ప్రవాహం గుడికి తగలకుండా అడ్డుపడింది… తనను తాకి వరద ఇరువైపులా చీలి, గుడికి ఏ నష్టం రాకుండా కాపాడింది… అందుకే అనేది, కేదారనాథ్‌లో ఏదో ఉంది… మనకు అంతుపట్టనిది… మనం నమ్మనిది..!