31, జనవరి 2024, బుధవారం

వేమన పద్యములు

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

.           *🌹వేమన పద్యములు🌹* 

.             *అర్థము - తాత్పర్యము*

.                    *Part - 15*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥వేమన పద్యాలు-- 40*


*అంది యందనట్టి యచల స్వరూపంబు*

*పొందు పడగ బూని పొదలు వాడు*

*జెంది మిన్నకుండు జిన్మయాకారుడై* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*


అందీ అందని దాని కొరకు , ఆత్రుతపడక మానవుడు చిదానంద స్వరూపుడై ప్రవర్తించవలెను.


*💥వేమన పద్యాలు -- 41*


*అంది వేమన జెప్పిన యాత్మబుద్ధి* 

*దెలియలేనట్టి మనుజులు దేబె లరయ*

*తలను బాసిన వెండ్రుక ల్వలెను జూడ*

*భుక్తి ముక్తులు హీనమై పోవు వేమా*


*🌹తాత్పర్యము --*

వేమన చెప్పిన ఆత్మబుద్ధిని గ్రహించలేని మనుజులు వెఱ్ఱి వారగుదురు.

తలను వీడిన వెంట్రుకలు కళావిహీనమగునట్లు , భుక్తికి , ముక్తికి కూడా దూరమగుదురు.

కావున వేమన సూక్తులు ఆణిముత్యములని గమనించవలెను.


*💥వేమన పద్యాలు -- 42*


*అందు నిందు నుండు నఖిలుండు జూడగా*

*నెందు దానె నిండి యెరుగుచుండు*

*నతని పూజా ఫలము నందుటే ముక్తిరా* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

 భగవంతుడు సర్వాంతర్యామి.

అన్నిట తానే ఉండి మానవుని తీరు గమనించుచూనే ఉండును.

దైవపూజ చేసి ముక్తి పొందుట కర్తవ్యము.


*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 


*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

**తృతీయ స్కంధము*


*భూరి మదీయమోహతమముం బెడబాప సమర్థులన్యులె*

*వ్వారలు నీవు కాక? నిరవద్య! నిరంజన! నిర్వికార! సం*

*సారలతాలవిత్ర! బుధసత్తమ! సర్వశరణ్య! ధర్మవి*

*స్తారక! సర్వలోక శుభదాయక! నిత్యవిభూతి నాయకా!*


నాయనా! కపిలా! నన్ను చాలా ఎక్కువైన అజ్ఞానం అనే చీకటి క్రమ్ముకొని ఉన్నది. దానిని తొలగించివేయటానికి సమర్థులు నీకంటె వేరైనవారు ఎవ్వరూలేరు. ఎందుకంటే నీవు ఏ దోషాలూ లేనివాడవు. ఏ అంటుసొంటులూ లేనివాడవు. ఏ వికారాలూ నీకు లేవు. సంసారం అనే తీగలను కోసివేయగల కొడవలివంటివాడవు నీవు. సర్వమూ తెలిసినవారిలో మొదటి స్థానం నీది. అందరకూ నీవే దిక్కు. ధర్మాన్ని పెంపొందించే దైవస్వరూపుడవు నీవు. అన్ని లోకాలకూ శుభాలను ఇవ్వగలవాడవు. ఎన్నటికీ చెడిపోని మహిమలకు నాయకుడవు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

. *🌹శ్రీమద్భగవద్గీత🌹*

. *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *సాంఖ్య యోగము*

. *శ్లోకము 07*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*కార్పణ్యదోషో పహతస్వభావః*

*పృచ్చామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః ।*

*యచ్చ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే*

*శిష్యస్తేఽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్ ।।*


*భావము:* 

నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటంలేదు మరియు ఆందోళన, పిరికితనము నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుడను, నీకు శరణాగతుడను. నాకు నిజముగా ఏది శేయస్కరమో దానిని ఉపదేశించుము.

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


// *శ్లోకం* // 


*జననీం జనకం సాధూన్, పుత్రాన్ దారాన్ గురూనపి*

*సమర్థః స్సన్న పుష్ణాతి, స ఏహ గతిక స్మృతః*!!             


/- *_సంస్కృత సూక్తి సుధ_* /-


భావము - *తల్లిదండ్రులను, సాధువులను, కుమారులను, భార్యను, గురువును పోషించనివానికి ఇహలోకంలోను, పరలోకంలోను కూడా పుట్టగతులుండవు*......

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                 🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం - హేమంత ఋతువు - పుష్య మాసం - కృష్ణ పక్షం -‌ పంచమి - హస్త -‌ సౌమ్య వాసరే* *(31-01-2024)* 


ప్రముఖ వేదపండితులు, *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/aqur1knF6lg?si=4BRZy2zsjT0feBpD


🙏🙏

Panchang


 

Technology


 

Murdeswar


 

31-01-2024 / బుధవారం / రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*31-01-2024 / బుధవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


 కొన్ని పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నూతన రుణాలు చేస్తారు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. జీవిత భాగస్వామితో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

---------------------------------------

వృషభం


కొన్ని వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. విలువైన వస్తు,వస్త్ర లాభాలు పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

---------------------------------------

మిధునం


దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. రాజకీయ సంభంధిత సభ, సమావేశాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి.

---------------------------------------

కర్కాటకం


 గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. స్థిరస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి చెందుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో అందుతాయి.

---------------------------------------

సింహం


కుటుంబ సభ్యులతో చర్చలు సఫలమౌతాయి. వ్యాపారమున స్వంత నిర్ణయాలతో ముందుకు సాగడం మంచిది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకులిస్తాయి. బంధువులతో మాటపట్టింపులు తొలగుతాయి.

---------------------------------------

కన్య


ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు జ్ఞాప్తికి వస్తాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో సఖ్యత కలుగుతుంది.

---------------------------------------

తుల


ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఇంటాబయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

---------------------------------------

వృశ్చికం


దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. నూతన వాహనయోగం ఉన్నది. భూవివాదాల పరిష్కారమౌతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి.

---------------------------------------

ధనస్సు


కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. సోదరులతో సఖ్యత లోపిస్తుంది. కుటుంబ సభ్యులతో కొద్దిపాటి సమస్యలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. దైవచింతన పెరుగుతుంది. బంధు మిత్రులతో అకారణ వివాదాలుంటాయి.

---------------------------------------

మకరం


చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తా. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమౌతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ధన, వస్తువులు బహుమతులుగా పొందుతారు.

---------------------------------------

కుంభం


వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విందువినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.

---------------------------------------

మీనం


వృత్తి వ్యాపారలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. బంధువులతో తగాదాలు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. నూతన రుణాలు చేస్తారు.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

శ్రీ మదగ్ని మహాపురాణము

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*

. *భాగం - 53*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 19*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱


*కుండ నిర్మాణాగ్ని కార్యవిధి - 4*


తత్ర శక్తిం న్యసేత్పశ్చాత్పార్థివీం బీజసంజ్ఞికామ్‌ | తన్మాత్రాభిః సమస్తాభిఃసంవృత్తం పార్థివం శుభమ్‌. 46


అఖణ్డం తద్భవం ధ్యాయేత్తదాధారం తదాత్మకమ్‌ |

తన్మధ్యే చిన్త యేన్మూర్తిం పౌరుషీం ప్రణావాత్మికామ్‌. 47


పిమ్మట దానియందు పృథివాకార మైనదియు, బీజ మను పేరు గలదియు అగు శక్తిని ఉంచవలెను. 


సమస్తమైన తన్మాత్రలచే ఏర్పడినది, పృథివీవికారము, శుభమైనదియు, అఖండము, దాని (శక్తి) నుండి పుట్టినది. తత్స్వరూపమును అగు దాని ఆధారమునుధ్యానించవలెను. దాని మధ్యయందు ప్రణవరూపమైన పురుషమూర్తిని ధ్యానించవలెను.


లిఙ్గం సంక్రామయేత్పశ్చాదాత్మస్థం పూర్వంసంస్కృతమ్‌ |

విభక్తేన్ద్రియ సంస్థానం క్రమాద్వృద్ధం విచిన్తయేత్‌. 48


పిమ్మట, పూర్వము సంస్కరింపబడిన, తనలో నున్న లింగశరీరమును దానిమీదికి సంక్రమింపచేయవలెను. అది క్రమముగా విభక్తమైన ఇందియములు, ఆవయవస్థితి కలదై వృద్ధిపొంది నట్లు చింతించవలెను.


తతో7ణ్డమబ్దమేకం తు స్థిత్వా విశకలీకృతమ్‌ | ద్యావాపృథవ్యౌ శకలే తయోర్మధ్యే ప్రజాపతిమ్‌. 49


జాతం ధ్యాత్వా పునః ప్రేక్ష్యప్రణవేన తు తం శిశుమ్‌ |

మన్త్రాత్మకతనుం కృత్వా యతాన్యాసం పురోదితమ్‌. 50


విష్ణుహస్తం తతో మూర్ధ్ని దత్త్వా ధ్యాత్వా తు వైష్ణవమ్‌ | ఏవమేకం బహూన్వాపి జపిత్వా ధ్యానమోగతః.


కరౌ సంగృహ్య మూలేన నేత్రే బద్ధ్వా తు వాససా | నేత్ర మన్త్రేణ మన్త్రీతాన్‌ సదశేనాహతేను తు. 52


కృతపూజో గురుః సమ్యగ్ధేవదేవస్య తత్త్వవాన్‌ | శిష్యాన్‌ పుష్పఞ్జవిభృతః ప్రాఙ్ముఖానుపవేశయేత్‌. 53


పిమ్మట అండము ఒక సంవత్సరముపాటు ఉండి బ్రద్ధలైనట్లును అ ముక్కలు ద్యులోక పృథివీలోకములైనట్లును, వాటి మధ్య ప్రజాపతి జనించి నట్లును ధ్యానించవలెను. 


మరల చూచి, ఆ శిశువును ప్రణవముచే, పూర్వము చెప్పనట్లుగా న్యాసములు చేసి మంత్రాత్మక మగు శరీరము కలవానినిగా చేయవలెను. పిమ్మట శిరస్సుపై విష్ణుహస్తము నుంచి, వైష్ణవమంత్రమును ధ్యానించవలెను. 


ఈ విధముగా ధ్యానయోగముతో ఒకటి గాని, అనేకము గాని జపించి, హస్తములను మొదళ్ళయందు పట్టుకొని, మాంత్రికుడు నేత్రమంత్రము చదువుచు అంచుతో (జాలుతో) కూడిన చినగని వస్త్రముచే ఆ శిష్యుల నేత్రములు బంధించవలెను. 


తత్త్వము నెరిగి గురువు బాగుగా దేవదేవుని పూజించి, దోసిళ్లలో పుష్పములు ధరించి యున్న ఆ శిష్యులను పూర్వాభిముఖులనుగా కూర్చుండబెట్టవలెను.


అర్చియేయుశ్చ తే7ప్యేవం ప్రసూతా గురుణా హరిమ్‌ | క్షిప్త్వా పుష్పాఞ్జలిం తత్ర పుష్పాదిభిరన న్తరమ్‌. 54


వాసుదేవార్చనం కృత్వా గురోః పాదార్చనం తతః | విధాయం దక్షిణాం దద్యాత్సర్వస్వం చార్ధమేవ వా. 55


ఆ శిష్యులు కూడ గుర్వనుజ్ఞ పొంది, అచట పుష్పాంజలిని చల్లి హరిని పూజింపవలెను. పిమ్మట పుష్పాదులతో వాసుదేవార్చనము చేసి. తరువాత గురుపాదార్చనము చేసి సర్వస్వమును గాని, దానిలో సగము గాని గురుదక్షిణగా ఇవ్వవలెను.


గురుః సంశిక్షయేచ్ఛిష్యాంసై#్తః పూజ్యో నామభిర్హరిః | విష్వక్సేనం యజేదిశం శఙ్కచక్రగదాధరమ్‌. 56


తర్జయన్తం చ తర్జన్యా మణ్డలస్థం విసర్జయేత్‌. 57


విష్ణునిర్మాల్యమఖిలం విష్వక్సేనాయ చార్పయేత్‌.


గురువు శిష్యులకు బోధించవలెను. వారు నామములతో హరిని పూజించవలెను. 


శంఖచక్రగదాధిరియై, తర్జనితో జళిపించుచున్న ప్రభు విష్వక్సేనుని పూజించి మండలమునందున్న హరికి ఉద్వాసన చెప్పవలెను. విష్ణునిర్మాల్యము నంతను విష్వక్సేనునకు సమర్పింపవలెను.


ప్రణీతాభి స్తథాత్మానమభిషిచ్య చ కుణ్డగమ్‌. 58


మహ్నిమాత్మని సంయోజ్మ విష్వక్సేనం విసర్జయేత్‌ | బుభుక్షుః సర్వమాప్నోతి ముముక్షుర్లీయతే హరౌ. 59


ఇత్యాతి మహాపురాణ ఆగ్నేయే కుణ్డనిర్మాణాద్యగ్ని కార్యాదికథనం నామ చతుర్వింశోధ్యాయః.


ప్రణీతలలో తనపైజలము చల్లుకొని, కుండములో నున్న అగ్నిని తనలో చేర్చికొని విష్వక్సేనుని విసర్జన చేయవలెను. 


ఈ విధముగ చేసినచో భోగములు అనుభవింప కోరిక గలవాడు సకలభోగములను పొందును. మోక్షేచ్ఛగల వాడు హరియందు లీను డగును.


అగ్ని మహాపురాణములో కుండనిర్మాణాగ్నికార్యాది కథన రూప మగు

సశేషం....


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱

వేమన పద్యములు

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

.           *🌹వేమన పద్యములు🌹* 

.             *అర్థము - తాత్పర్యము*

.                    *Part - 15*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥వేమన పద్యాలు-- 40*


*అంది యందనట్టి యచల స్వరూపంబు*

*పొందు పడగ బూని పొదలు వాడు*

*జెంది మిన్నకుండు జిన్మయాకారుడై* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*


అందీ అందని దాని కొరకు , ఆత్రుతపడక మానవుడు చిదానంద స్వరూపుడై ప్రవర్తించవలెను.


*💥వేమన పద్యాలు -- 41*


*అంది వేమన జెప్పిన యాత్మబుద్ధి* 

*దెలియలేనట్టి మనుజులు దేబె లరయ*

*తలను బాసిన వెండ్రుక ల్వలెను జూడ*

*భుక్తి ముక్తులు హీనమై పోవు వేమా*


*🌹తాత్పర్యము --*

వేమన చెప్పిన ఆత్మబుద్ధిని గ్రహించలేని మనుజులు వెఱ్ఱి వారగుదురు.

తలను వీడిన వెంట్రుకలు కళావిహీనమగునట్లు , భుక్తికి , ముక్తికి కూడా దూరమగుదురు.

కావున వేమన సూక్తులు ఆణిముత్యములని గమనించవలెను.


*💥వేమన పద్యాలు -- 42*


*అందు నిందు నుండు నఖిలుండు జూడగా*

*నెందు దానె నిండి యెరుగుచుండు*

*నతని పూజా ఫలము నందుటే ముక్తిరా* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

 భగవంతుడు సర్వాంతర్యామి.

అన్నిట తానే ఉండి మానవుని తీరు గమనించుచూనే ఉండును.

దైవపూజ చేసి ముక్తి పొందుట కర్తవ్యము.


*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 


*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹