27, డిసెంబర్ 2020, ఆదివారం

నీతి కథలు

 *మంచికి మంచి, చెడుకు చెడు! -- నీతి కథలు*


*ఆహ్వా అనే గ్రామంలో నిరుపేద బ్రాహ్మడొకడు ఉండేవాడు. అతడు చదువుకోలేదు. ఎంత ప్రయత్నించినా ఎక్కడా చేయడానికి తగిన పని దొరకలేదు. అందువల్ల చేసేదిలేక రోజూ ఇంటింటికీ వెళ్ళి బిచ్చమెత్తగా వచ్చిన బియ్యాన్ని, పిండిని భార్యకిచ్చేవాడు. ఆమె వండిపెడితే, భార్యాభర్తలూ, నలుగురు పిల్లలూ తలా కొంచెం తినేవారు. ఒక్కొక్కసారి బిచ్చమెత్తింది, పిల్లలకు మాత్రమే సరిపోయేది. అలాంటప్పుడు ఆలూమగలు ఆకలితోనే పడుకునేవారు.*


*బిచ్చమెత్తిన దానితో కుటుంబమంతా ఎప్పుడు గాని కడుపు నిండా తిన్న పాపాన పోలేదు. ఆ సంగతి తెలిసినా, మరో మార్గం కనిపించక బ్రాహ్మడు బాధపడుతూ అలాగే కాలం గడపసాగాడు. ఆ దుస్థితి తట్టుకోలేక అతని భార్య, ‘‘నువ్వు తెచ్చేది ఒక్క పూటగడవడానికి కూడా చాలడం లేదు. కుటుంబ పోషణకు నువ్వేదైనా మరొక మార్గం ఆలోచించక తప్పదు,'' అన్నది. ‘‘ఆ సంగతి నాకూ తెలుసు లక్ష్మీ. మరో మార్గం కనిపించడం లేదు.*


*నన్నేం చెయ్య మంటావో నువ్వే చెప్పు,'' అన్నాడు బ్రాహ్మడు నిస్పృహతో తలపట్టుకుంటూ. లక్ష్మి కొంచెంసేపు ఆలోచించింది. ‘‘మన రాజుగారు దయాస్వభావుడని విన్నాను. నువ్వు వెళ్ళి ఆయన్ను దర్శిస్తే, సాయపడగలడనుకుంటాను,'' అన్నది. ‘‘సరే అలాగే వెళతాను. ఆయన నాకేదైనా దానంగా ఇచ్చినప్పుడు, ఆశీర్వదించడం ఎలాగో నాకు తెలియదే!'' అన్నాడు బ్రాహ్మడు అనుమానంగా.*


*‘‘అదేం పెద్ద సమస్యకాదు. ఆ సమయంలో నీ మనసులో తోచింది చెప్పు చాలు,'' అన్నది లక్ష్మి ఎంతో నమ్మకంతో. మరునాడు తెల్లవారగానే బ్రాహ్మడు రాజ దర్శనానికి బయలుదేరాడు. రాజభవంతి వద్దకు చేరగానే భటులు అతన్ని రాజు దగ్గరికి తీసుకు వెళ్ళారు. అతడు రాజుకు తన దయనీయమైన పరిస్థితిని గురించి విన్నవించాడు. అంతా విన్న రాజు, ‘‘నీకేంకావాలో చెప్పు,'' అన్నాడు. ‘‘మహాప్రభూ, ఆ సంగతి నా కన్నా తమకే బాగా తెలుసు. నేనొక నిరుపేద బ్రాహ్మణ్ణి.*


*అంత మాత్రమే చెప్పగలను,'' అంటూ వినయంగా తలవంచుకున్న బ్రాహ్మడు ఆ తరవాత కొంతసేపటికి తలపైకెత్తి, ‘‘మంచి ఎప్పుడూ మంచే. చెడు ఎల్లప్పుడూ చెడుగానే ఉంటుంది!'' అన్నాడు చేయి పైకెత్తి. రాజు మందహాసం చేసి, ఒక చీటీ తీసి అందులో ఏదో రాసి బ్రాహ్మడి కిచ్చి, ‘‘దీనిని తీసుకెళ్ళి కోశాధికారికి చూపించు,'' అన్నాడు. బ్రాహ్మడు దానిని తీసుకుని కోశాధికారి దగ్గరికి వెళ్ళాడు. కోశాధికారి బ్రాహ్మడిచ్చిన చీటీ తీసి చదివి అతనికొక వెండికాసు ఇచ్చాడు.*


*బ్రాహ్మడు ఆ వెండికాసును తీసుకెళ్ళి భార్య కిచ్చాడు. ఆమె దాంతో కావలసిన వాటిని కొనుక్కుని రావడంతో ఆ రాత్రి కుటుంబంలోని వారందరూ తృప్తిగా కడుపునిండా తిన్నారు. మరునాడు కూడా బ్రాహ్మడు రాజదర్శనానికి వెళ్ళాడు. రాజు చీటీలో ఏదో రాసి ఇచ్చాడు. దానినతడు కోశాధికారికి చూపగానే అతడు మరో వెండికాసు ఇచ్చాడు. ఇలాగే మూడు నాలుగు రోజులు గడిచాయి.*


*దానిని చూసిన కాపలాభటుడికి బ్రాహ్మడు ఎందుకిలా రోజు తప్పకుండా వస్తున్నాడో తెలుసుకోవాలన్న ఉత్సుకత కలిగింది. ఐదో రోజు భటుడు బ్రాహ్మడి వెనగ్గా అతన్ని అనుసరించి వెళ్ళాడు. బ్రాహ్మడు నాణెం పుచ్చుకుని నగర పొలిమేరను దాటి, తన గ్రామం దారి పడుతూండగా, వెనక నుంచి భటుడు అతని భుజం తట్టాడు. బ్రాహ్మడు వెనక్కు తిరిగి చూడగానే, ‘‘అయ్యా, తమరు రోజు తప్పకుండా వస్తున్నారు. రాజదర్శనం చేసుకుని చీటీ తీసుకుని వెళ్ళి కోశాధికారి నుంచి కాసు పుచ్చుకుని వెళుతున్నారు.*


*మరి మిమ్మల్ని రాజదర్శనానికి ఉచితంగా అనుమతిస్తున్న నన్ను అసలు పట్టించుకోవడం లేదు. నాకివ్వవలసిన.....'' అంటూ భటుడు మాటను పూర్తిచేయక ముందే బ్రాహ్మడు వెనక్కు తిరిగి, తన గ్రామం కేసి వేగంగా వెళ్ళిపోయాడు. మరునాడు బ్రాహ్మడు యథా ప్రకారం రాజును చూడడానికి వచ్చాడు.*


*అతడు కోశాధికారి కార్యాలయం నుంచి వెలుపలికి రాగానే, ‘‘అయ్యా, కాస్త ఆగు!'' అంటూ అక్కడికి వచ్చాడు కాపలాభటుడు. ఆగి ఏమిటి అన్నట్టు చూశాడు బ్రాహ్మడు. ‘‘నీకో సంగతి చెప్పాలి. రాజుగారు నీపై ఆగ్రహంతో ఉన్నారు,'' అన్నాడు భటుడు.*


*బ్రాహ్మడు కొంతసేపు మౌనంగా ఊరుకుని ఆ తరవాత, ‘‘రాజుగారికి నా మీద కోపం కలిగేలా నేనెలాంటి తప్పూ చేయలేదే! నా మీద ఆయన కెందుకు కోపం?'' అన్నాడు. భటుడు అతన్ని సమీపించి అటూ ఇటూ ఒకసారి చూసి, ‘‘నేను రాత్రి అలసిపోయిన రాజుగారి పాదాలు ఒత్తుతూండగా, ‘నా దగ్గరికి వచ్చి వెళుతూన్న బ్రాహ్మణ్ణి చూశావుకదా? అతడు దీవించేప్పుడు అతని నోటి నుంచి దుర్వాసన వెలువడుతుంది!' అన్నారు.*


*అయినా, రాజుగారితో నిన్ను దగ్గరికి రానీయొద్దు అని చెప్పడానికి నేనెంతవాణ్ణి!'' అన్నాడు గుసగుస లాడుతున్నట్టు మెల్లగా. ‘‘అవునవును, నువ్వెలా చెప్పగలవు. అయినా ఆ సంగతి చెప్పినందుకు చాలా కృతజ్ఞుణ్ణి. ఇకపై జాగ్రత్త వహిస్తాను. రేపు రాజుగారిని దీవించడానికి ఆయన్ను సమీపించేప్పుడు నోటికి అడ్డంగా కండువా చుట్టుకుంటాను,'' అంటూ బ్రాహ్మడు వెళ్ళిపోయాడు. మరునాడు బ్రాహ్మడు రాజదర్శనానికి వెళ్ళినప్పుడు నోటికీ, ముక్కుకూ అడ్డంగా కండువాను చుట్టుకుని వెళ్ళాడు.*


*అదృష్టవశాత్తు రాజు దాన్ని గురించి ఆరా తీయకుండా ఎప్పటిలాగే చీటీ ఇచ్చి పంపేశాడు. భటుడు తనను ఆరోజు వెంబడించకపోవడం కూడా బ్రాహ్మడికి వింతగా కనిపించలేదు. ఆనాటి రాత్రి రాజుగారి కాళ్ళు ఒత్తుతూ భటుడు, ‘‘రోజూ ఉదయం తమ దర్శనానికి వచ్చే బ్రాహ్మడు మహా పొగురుబోతు ప్రభూ,'' అన్నాడు యథాలాపంగా. అంతవరకు పడుకున్న రాజు లేచి కూర్చుంటూ, ‘‘ఎందుకలా చెబుతున్నావు.*


*ఎంతో వినయం చూపుతూ, భగవద్భక్తిగల మృదు స్వభావిలా కనిపిస్తాడే. రోజూ నన్ను దీవిస్తాడు కూడా,'' అన్నాడు. ‘‘అతడు ఈ రోజు నోటికి అడ్డుగా కండువాను చుట్టుకు రావడం తమరు చూశారు కదా?'' అని అడిగాడు భటుడు తలెత్తకుండా రాజుగారి పాదాలు ఒత్తుతూ.*


*‘‘చూశాను. బహుశా పన్ను నొప్పిలాంటిదేదో ఉంటుంది,'' అన్నాడు రాజు దాన్నంతగా పట్టించుకోకుండా. ‘‘కాదు ప్రభూ. ఎందుకలా చుట్టకున్నావని నేనడిగితే అతడేం చెప్పాడో తెలుసా? అతడు దీవించడానికి మిమ్మల్ని సమీంపిచేప్పుడు, మీ చెవినుంచి వెలువడే దుర్వాసనను భరించలేకే అలా చుట్టుకున్నానని చెప్పాడు ప్రభూ!'' అన్నాడు భటుడు. రాజు ఆ తరవాత మరేం మాట్లాడలేదు. గాఢంగా నిట్టూర్చి పడుకున్నాడు.*


*బ్రాహ్మడు రోజూ తనను దీవిస్తూ చెప్పే, ‘‘మంచి ఎప్పుడూ మంచే. చెడు ఎల్లప్పుడూ చెడుగానే ఉంటుంది,'' అనే మాట ఆయన మనసులో కదలాడ సాగింది. మరునాడు బ్రాహ్మడు నోటికి అడ్డుగా ఎలాంటి కట్టూ లేకుండా రాజభవనానికి వచ్చాడు. అతడు అక్కడి నుంచి తిరిగి వెళుతూండగా, భటుడు అడ్డుపడి, ‘‘నాకు ఇవ్వాల్సిన ఈనాము ఇవ్వకుండా నువ్వు తప్పించుకోలేవు,'' అన్నాడు. ‘‘నన్ను క్షమించు, ఆ సంగతే మరిచిపోయాను!''*


*అంటూ బ్రాహ్మడు కొంతసేపు ఆగి, ‘‘ఈ రోజు వెండికాసును నేను వదులుకుంటాను. నువ్వు ఈ చీటీని పట్టుకెళ్ళి కోశాధికారి నుంచి నాతరఫున వెండికాసును పుచ్చుకో,'' అని చీటీని భటుడికిచ్చి బ్రాహ్మడు గబగబా వెళ్ళిపోయాడు. భటుడు ఉత్సాహంగా వెళ్ళి, చీటీని కోశాధికారికి చూపాడు. దాన్ని చదివిన కోశాధికారి భటుణ్ణి కాస్సేపు ఆగమన్నాడు. అంతలో రాజభవనంలోని ఇద్దరు అంగరక్షకులను వెంట బెట్టుకుని క్షురకుడొకడు అక్కడికి వచ్చాడు.*


*వాళ్ళు భటుణ్ణి పెడరెక్కలు విరిచిపట్టుకోగా, క్షురకుడు వాడి ముక్కూ, చెవులూ కోసేశాడు. నెత్తురోడుతూ, భటుడు కోశాధికారి మీద ఫిర్యాదు చేయడానికి రాజభవనానికి పరిగెత్తాడు. ‘‘బ్రాహ్మడికిచ్చిన చీటీ నీ చేతికెలా వచ్చింది?'' అని అడిగాడు రాజు కటువుగా. ‘‘ప్రభూ, నేను ఈనాము అడిగాను. దానికి బదులు అతడు ఆ చీటీ ఇచ్చాడు,'' అన్నాడు భటుడు. ‘‘పేద బ్రాహ్మడితో నువ్వు లేనిపోని అబద్ధాలు చెప్పావు. అందుకు తగిన శిక్ష అనుభ వించక తప్పదు కదా!'' అన్నాడు రాజు.*

ధైర్యవచనం

 అంతర్యామి - *ధైర్యవచనం*


మనిషికి ఓటమి గొప్ప పాఠం నేర్పుతుంది. మంచి ప్రయత్నానికి, మరింత పట్టుదలకు పురిగొల్పుతుంది. గెలుపు, ఓటమి మధ్య పోటీ పెడితే ఓటమే ఓ అడుగు ముందుఉంటుంది. అయినా, ధైర్యవంతుడు భయపడడు. భయమనేది సజీవ మృత్యువై రోజూ హింసిస్తూనే ఉంటుందన్న సత్యాన్ని గ్రహించినవాడు కనుక- బెదరడు.


చెలమను తవ్వుతుంటే చేతికి ముందు ఇసుకే అంటుతుంది. దానికి భయపడో, నిరాశ చెందో తవ్వడం మానేస్తే తియ్యటి జలం ఎలా పొందగలం? ధీరత్వం శ్రీరాముడి ముఖ్య లక్షణం. అందుకే ఆయన్ని ధీరోదాత్తుడన్నారు. పుట్టినవాడు మరణించక తప్పదన్న పరమ సత్యాన్ని తెలుపుతూనే వాసుదేవుడు అర్జునుడిని యుద్ధానికి ప్రోత్సహిస్తూ సంసిద్ధుణ్ని చేస్తాడు.


దీపాన్ని తలకిందులుగా వెలిగించినా, జ్వాల పైకే లేస్తూ వెలుగుతుంది. ధైర్యవంతుడూ అంతే! దేనికీ బెదరడు, వెరవడు. పాల సముద్రాన్ని మధిస్తున్నప్పుడు హాలాహలం పుట్టినా భీతిల్లక లక్ష్యంపైన దృష్టి సారించడం వల్ల ఎన్నో అమూల్యమైన వాటిని పొందగలిగారు దేవతలు. లోకకల్యాణ కారకులై జోతలందుకున్నారు. యమధర్మరాజు పాశబద్ధుడై ప్రాణాలు హరించడానికి వచ్చినప్పుడు మార్కండేయుడు అప్రమేయ ధైర్యంతో, భక్తి ప్రపత్తులతో వెళ్లి శివలింగాన్ని ఆలింగనం చేసుకుని దీర్ఘాయుష్మంతుడయ్యాడు. సమయోచిత నిర్ణయంతో, విజ్ఞతతో ప్రవర్తించడమే విజేతకు ఉండవలసిన లక్షణం.


తప్పు చెయ్యనివాడు ధీమాగా ముందుకు సాగుతాడు. అపరాధి అడుగడుగునా భయపడుతూనే ఉంటాడు. అటువంటివాడికి విజయం కనుచూపు మేరలోనైనా కనపడదు. మనసులో ద్వేషం పెంచుకునేవాడిలో భయం విషవృక్షమై పెరుగుతూనే ఉంటుంది.


హరిని ద్వేషించి హిరణ్య కశిపుడు అలాగే అంతమయ్యాడు. సత్యస్వరూపుడు శ్రీమన్నారాయణుని స్మరించిన ప్రహ్లాదుడు ధైర్యంతో చిత్రహింసలన్నింటినీ ఆనందంగా భరించాడు. శుకుడి నుంచి భాగవత కథలను వినడం వల్లనే పరీక్షిత్తుకు అంత ధైర్యం కలిగింది. ముందు నడవబోయే మార్గం గడిచిన కంటకమయమైన దారికన్నా మంచిదనుకుంటేనే ముందడుగు వేయగలం. వివేకంతో, తెగింపుతో ముందుకు వెళ్ళేవాడు ఏదైనా సాధించగలుగుతాడు. ఎందరో తాపసోత్తములు, ఆచార్యులు, ప్రవచనకర్తలు సాహసంతో సంకటాలను ఎదుర్కొని, ఆటంకాలను అవరోధించి, గమ్యం చేరుకొని పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఎందరో కష్టాలు, పరాజయాలు ఎదుర్కొని, ఎన్నో ఆవిష్కరణలు చేసి, పరిశోధనలు సాగించి మానవజాతికి సౌఖ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించారు. వారిలో చాలామంది ప్రాథమిక పరీక్షల్లో ఎంపికల్లో వైఫల్యం పొందినవారే!


అనుమానంతో, అపనమ్మకంతో పనిచేసేవాణ్ని ఓటమి వెంటాడుతూనే ఉంటుంది. ధైర్యశాలి ముందు ఓటమి చేతులు కట్టుకుని నిలబడుతుంది. ‘సులభంగా, దొడ్డిదారిన అందే విజయాలు శాశ్వత సుఖాన్ని, కీర్తిని ఇవ్వలేవు... జీవితంలో విజయాన్ని సాధించాలనుకుంటే మెట్ల వైపు చూస్తూ ఉండకుండా, ఆ మెట్లు ఎక్కుతూపోవాలి’ అనేవారు బాపూజీ. శిల్పం అందాలను సంతరించుకోవాలంటే ఉలిదెబ్బలు తప్పవు. వేలు వంకరగా పెట్టనిదే వెన్న రాదు. కవ్వంతో పెరుగు చిలక్కపోతే మీగడ వెన్నగా మారదు. గునపాలతో తవ్వకపోతే ఖనిజాలు వెలువడవు. గెలుపూ అంతే! పిలిస్తే వచ్చేది కాదు గెలుపు. ఎంతో సాధన, కృషి, పట్టుదల కావాలి.


శీతోష్ణాలు, రాత్రింబవళ్లు ఎంత సహజమో జయాపజయాలూ అంతే సహజమని గ్రహించేవాడు సర్వదా సాహసవంతుడే. సదా విజేతే! జీవితమనే నదికి గెలుపు, ఓటమి రెండు తీరాలు. ఈ తీరాలే జీవన సౌఖ్య సూత్రాలు. ఈ సత్యం తెలుసుకున్నవాడే స్థితప్రజ్ఞుడు, సంపూర్ణ మానవుడు!


- చిమ్మపూడి శ్రీరామమూర్తి

సాయపడే హృదయం

 *సాయపడే హృదయం*


మనిషి తనను తాను చూసుకున్నప్పుడు తన శరీరం కనిపిస్తుంది. తనకో వ్యక్తిత్వం ఉన్నట్లు అనిపిస్తుంది. తన ఉనికి తనకు స్పష్టంగా తెలుస్తుంది.

నేను అనే భావం మనిషికి చాలా ఆనందం కలిగిస్తుంది. పుట్టుకలో లేని నేను ఎదుగుతున్న కొద్దీ ఎరుకలోకి వచ్చి మొక్క మానైనట్లుగా మహావృక్షంగా పెరుగుతుంది.


నేేను అనేది శిఖరంలా, నాది అనేది ఆధార పీఠంలా మనిషి బతుకుతుంటాడు. ఒక్కోసారి ఒక్కడే అంతా తానే అయి చేస్తున్న భావనకు లోనవుతుంటాడు. అది అతడి మనసు చేసే మాయాజాలం.


ఎక్కడా ఏ సహాయం తీసుకోకుండా గాలికి పుట్టి గండాన పెరిగినట్లు, తనకు ఎవరి అవసరం లేనట్లు ఊహల్లో ఒక్కోసారి మనిషికి అనిపిస్తుంది. అది అందమైన భ్రమ.


నిజానికి మనిషి ఎందరిమీదో ఆధారపడి బతుకుతాడు. ఏ సహాయమూ లేకుండా జీవితం సాగదు.


తల్లిగర్భంలోనే శిశువుకు రూపం ఏర్పడుతుంది. తల్లి బతుకుతో బిడ్డ బతుకు ముడివడి ఉంటుంది. ఇంతకు మించిన సహాయం లోకంలో లేనే లేదు. అందుకే తల్లి రుణం తీర్చడం ఏ బిడ్డకూ సాధ్యం కాదు అంటారు.


పుట్టి భూమ్మీద పడిన శిశువు గాలితో, నీటితో, పాలతో, తల్లి ప్రేమతో బతుకుతాడు. పెరుగుతున్నకొద్దీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో సహాయాల మూలాన మనిషి శరీరాన్ని నిలబెట్టుకుని ఒక వ్యక్తిత్వం సంపాదించుకుంటాడు.


అన్ని వనరులున్నా, అందరూ ఉన్నా- మనిషి మీద మనిషి ఆధారపడి బతకాలి. ఒకరికొకరు సహాయం చేసుకోకుండా మానవ జీవనం ముందుకు సాగదు.


గొప్ప మనుషులు, మహానుభావులు- లోకం తమకు చేసిన సహాయం వల్లనే ఇంతటి స్థాయికి వచ్చామని చెబుతూ ఉంటారు.


శ్రీకృష్ణుడి సహాయం లేకుండా పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చెయ్యగలిగేవారా? శ్రీరాముణ్ని కలిసిన హనుమ చేసిన సహాయం సీతమ్మను చూపించడానికే కదా. దివ్య సహాయాలు దైవ కార్యాల్లో ఎన్నో ఉన్నాయి.


యోగికి యోగంలో సహాయం కావాలి. జ్ఞానికి జ్ఞానంలో సహాయం అవసరం. భక్తుడికి నిరంతరం భగవంతుడి సహాయం తప్పనిసరి.


సహాయం ఒక దివ్యమైన, శక్తిమంతమైన ఆపన్న హస్తం. ఆ చెయ్యి వెనక ఉండి నడిపించకపోతే మహాకార్యాలెన్నో ఆగిపోతాయి.


అవసరమైనప్పుడు సహాయాన్ని కోరాలి. సహాయం కోసం పోరాడాలి. సహాయం కోసం ప్రార్థించాలి. సహాయం కోసం శరణాగతి చెందాలి.


మనుషులు మనుషులకే కాదు, పశుపక్ష్యాదులకూ ప్రేమతో సహాయం చెయ్యాలి.


మనకు మనం అవసరాలకు, ఆపదలకు ఆదుకుంటున్నతీరు చూసినప్పుడు ఈశ్వరుడి మనసు కరుగుతుంది. తనవంతుగా కొండంత బలాన్ని, ధైర్యాన్ని, ఆశీర్వచనాన్ని అందించి దయగల దేవుడు అని నిరూపించుకుంటాడు.


మన కోసం మనం బతుకుతూ ఇతరుల కోసం బతకాలి. సహాయం చెయ్యడానికి ముందుండే మనిషే మనిషి. సహాయం చెయ్యడానికి అవకాశం కోసం ఎదురుచూసే మనిషిదే గొప్ప హృదయం.


యోగక్షేమాలు చూసేవాడు భగవంతుడు. మనుషుల ద్వారా ఎవరెవరికి ఏ సమయానికి ఏ సహాయం చెయ్యాలో క్షుణ్నంగా తెలిసినవాడు ఆయన. అది ఆయన ప్రణాళిక. తనకు కావలసిన పూజ చేయించుకుని, దానికి తగిన ఫలాన్ని ఇచ్చి, అతడి పాపాన్ని తొలగించడానికి చేసే సహాయమే దైవానుగ్రహం.


సహాయం కావాలంటే, సహాయం చెయ్యాలి. ఎప్పుడో ఎవరికో చేసిన సహాయమే ఇప్పుడు మనల్ని సుఖంగా 

ఉంచుతుంది

ముద్గాన్న నైవేద్యము

 ముద్గాన్న నైవేద్యము ఈ ధనుర్మాసములో మహా విష్ణువుకు ముద్గాన్నమును నైవేద్యముగా సమర్పిస్తారు. [ పెసర పప్పుతో చేసిన పులగము ] దీని గురించి ’ ఆగ్నేయ పురాణము ’ లో ఇలాగుంది

|| కోదండస్తే సవితరి ముద్గాన్నం యో నివేదయేత్ |


సహస్ర వార్షికీ పూజా దినేనైకేన సిధ్యతి ||


" ధనూరాశిలో సూర్యుడుండగా పులగమును ఒక్క దినమైనా విష్ణువుకు సమర్పించిన మనుష్యుడు ఒక వేయి సంవత్సరముల పాటు పూజ చేసిన ఫలాన్ని పొందుతాడు " అని వివరిస్తుంది ఈ నైవేద్యమును పాకము చేయు విధమును కూడా పురాణమే తెలుపుతుంది. దాని ప్రకారము , " బియ్యమునకు సమానముగా పెసర పప్పును చేర్చి వండు పులగము ఉత్తమోత్తమము. బియ్యపు ప్రమాణములో సగము పెసరపప్పు చేర్చితే అది మధ్యమము. బియ్యపు ప్రమాణములో పావు వంతు పెసరపప్పు చేర్చితే అది అధమము. అయితే , బియ్యపు ప్రమాణమునకు రెండింతలు పెసరపప్పు చేర్చితే అది పరమ శ్రేష్టమైనది. భక్తులు తమకు శక్తి ఉన్నంతలో శ్రేష్ట రీతిలో పులగము వండి పరమాత్మునికి నివేదించవలెను. ఎట్టి పరిస్థితిలోనూ పెసర పప్పు ప్రమాణము , బియ్యమునకంటే సగము కన్నా తక్కువ కాకుండా చూసుకోవలెను. " అంతే కాదు , ’ పెసర పప్పు , పెరుగు , అల్లము , బెల్లము , కందమూలములు , ఫలములతో కూడిన పులగమును భగవంతునికి సమర్పిస్తే సంతుష్టుడై భక్త వత్సలుడైన మహా విష్ణువు తన భక్తులకు సకల విధములైన భోగములను మోక్షమును కూడా ప్రసాదిస్తాడు ’ అని పురాణము తెలుపుతుంది. అందుకే , ధనుర్మాసమనగానే విష్ణు పూజ మరియు పులగము [ పొంగల్ ] తప్పని సరియైనాయి. శ్రద్ధాళువులు తమ తమ శక్తి మేరకు ధనుర్మాసములో శ్రీ మహావిష్ణువును పూజించి కృతార్థులై , ఆయన కృపకు పాత్రులు కాగలరు.

శ్రీరాముడు

 *శ్రీరాముడు నడచిన దారుల్లో...*


శ్రీరామచరిత్రలో అతి ముఖ్యమైనదీ సుదీర్ఘమై నదీ ఆయన చేసిన వనవాసం. 


పితృవాక్య పరిపాలనా కర్తవ్యదీక్షా కంకణధారుడై ఆయన తన 

25వ ఏట ప్రారంభించి తనకు *39* ఏళ్లు వచ్చే వరకూ వన సీమలలోనే సంచరించాడు. 


శ్రీరాముడు మనదేశం లో ఎంతోమందికి ఆరాధ్యదైవం కావడానికి ఆయన శూరత్వమే కాకుండా ఈ ధర్మ దీక్షయే ప్రధాన కారణం. 


*14* సం.ల సుదీర్ఘ కాలం లో ఆయన *అయోధ్య* లో ప్రారంభించి దక్షిణాదిన *రామేశ్వరం* వరకూ ప్రయాణంచేశాడు. 


ఆ తరువాత సేతు నిర్మాణం గావించి లంక లో రావణ సంహారం చేసాడు. 


ఇంత కాలం పాటు ఆయన ఏయేచోట్ల తిరిగాడో తెలుసు కోవాలంటే 

మనం కూడా ఆయన నడచిన దారుల్లోనే ప్రయాణించి 

ఆయన అడుగు జాడలేమైనా గుర్తించగలమేమో చూడాలి. నాతో రండి. ఆయన నడచిన దారుల్లోనే మనమూ ప్రయాణించి వద్దాము.


శ్రీరాముడు తన వనవాస సమయంలో ఏఏ ప్రాంతాలలో తిరిగాడో తెలుసుకోవడానికి 

*డా॥.రామావతార్* గారు మొదలైన పరిశోధకులు చాలా మంది రామాయణంలో శ్రీ వాల్మీకి వర్ణనలు ఆధారంగా 

*అయోధ్య* నుంచి *రామేశ్వరం* వరకూ విస్త్రృతంగా పర్యటించారు. 


ఆయా ప్రాంతాలలో ప్రజలలో ఉండే ఐతిహ్యాలనూ ఇతర ఆధారాలను బట్టి వారు 

మొదట *189* ప్రాంతాలనూ తరువాత మరోక *60* ప్రదేశాలనూ కనుగొన్నారట. 


ఈ వివరాలన్నీ *శ్రీ రామావతార్* గారి  

*శ్రీ రాముని అడుగుజాడల్లో*  

(In the foot steps of Shri Ram) అనే పుస్తకంలో వివరించారు.  


*డా.।। రామావతార్ శర్మ* గారు స్వతంత్ర భారత మొదటి రాష్ట్రపతి అయిన  *శ్రీ డా.।। బాబూ రాజేంద్రప్రసాద్* గారి గురువు గారు


శ్రీ రాముడు సీతా లక్ష్మణ సమేతుడై అయోధ్య నుంచి బయలుదేరి 

మొదట అక్కడికి *20కి. మీ* దూరంలోని తమసా నదీ తటాన ఉన్న *మాండా* (Mandah) అనే ప్రాంతాన్ని చేరుకున్నారు. 


ఆ తరువాత *గోమతీ నదిని దాటి సరయూ* తీరాన్ని చేరుకున్నారు. 


ఆ తరువాత తమ కోసల దేశపు సరిహద్దులు దాటుతూ నిషాద రాజైన *గుహుని* సహాయంతో గంగను దాటి ప్రస్తుత అలహాబాదుకు *20 కి.మీ* దూరంలోని *నిషాద రాజ్యం*లోని 

*శృంగవేరపురం* (Srigraur)చేరుకున్నారు. 


ఆ తర్వాత అక్కడ నుండి బయలు దేరి 

*త్రివేణీ సంగమ* ప్రాంతం లో యమునా నదిని దాటి 

*ఉత్తర- మధ్యప్రదేశ్ ల సరిహద్దుల్లోని చిత్రకూటాన్ని* చేరుకున్నారు. 


ఈ ప్రాంతంలో *వాల్మీకి ఆశ్రమం, మాండవ్య ఆశ్రమం, భరత్ కూప్* అనేవి ఇప్పటికీ ఉన్నాయి. 


శ్రీ రామ పాదుకల్ని తీసుకు వెళ్లడానికి భరతుడు వచ్చివెళ్లాక వారు 

*చిత్రకూటాన్ని* వదలి *మధ్యప్రదేశ్లోని సతానా* ప్రాంతంలో ఉన్న

*అత్రి ఆశ్రమాన్ని* చేరుకున్నారు. 


ఇక్కడ నుండి శ్రీ రాముడు ఇప్పటి *మధ్యప్రదేశ్ ఛత్తీస్ ఘడ్* రాష్ట్రాలలో విస్తరించి ఉన్న *దండకారణ్యాన్ని* చేరుకున్నారు.


*దండకారణ్యంలో శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై దాదాపు పది* సం.లు విహరించాడు. 


ఈ అరణ్యంలోని నదీనద తటాకాలు ఫలవృక్ష సంపద వారినంతగా ఆకర్షించాయేమో? 


*సత్నా* ప్రాంతంలోని *శర్భంగ, సుతీక్షణ* మున్యాశ్రమాలను దర్శించుకుని *నర్మదా, మహానదీ* తీరాల వెంబడి ప్రయాణిస్తూ అనేకమైన ఇతర మున్యాశ్రమాలను దర్శించుకుని వారు తిరిగి *సుతీక్షణ* ముని ఆశ్రమానికి చేరుకున్నారు. 


ఇప్పటికీ *పన్నా, రాయపూర్, బస్తర్, జగదల్ పూర్* ప్రాంతాలలో *మాండవ్య ఆశ్రమం*, *శృంగి ఆశ్రమం*, *రామలక్ష్మణ మందిరం*, *కోటిమాహేశ్వర దేవాలయం* వంటివి ఆ స్మృతి చిహ్నాలుగా మిగిలి ఉన్నాయి. 


ఆ తరువాత అనేకమైన చిన్న చిన్న నదులూ వాగులూ సరస్సులూ కొండలూ దాటుకుంటూ శ్రీ రాముడు 

*నాసిక్ ప్రాంతం*లోని *అగస్త్యముని* ఆశ్రమం చేరుకున్నాడు. 


ఇక్కడి అగ్నిశాలలో తయారైన అనేకమైన *శస్త్రాలను అగస్త్యుడు శ్రీరామునికి ఇచ్చాడని వాల్మీకి* పేర్కొన్నాడు.


*అగస్త్యాశ్రమం* నుంచి బయల్దేరిన శ్రీరాముడు 

*నాసిక్ సమీపంలోని పంచవటి* చేరుకున్నాడు. ఇక్కడ *5* పెద్ద వటవృక్షాలుండడం వల్ల ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చింది. 


*శూర్పణఖ వృత్తాంతం*, 


*ఖరదూషణుల* వధ జరిగిన ప్రాంతమిదే. 

 

ఈ ప్రాతంలో *మారీచ వధ* జరిగిన చోట *మృగయాధీశ్వర్, వనేశ్వర్* అనే *స్మృతి చిహ్నాలు* ఇప్పటికీ ఉన్నాయి. 


*నాసిక్ పరిసరాల్లో రామాయణ గాథకు సంబంధించిన స్మృతి చిహ్నాలు:* 


సీతాసరోవరం రామకుండం, త్రయంబకేశ్వరం, జనస్థాన్ మొదలైనవి అనేకం ఉన్నాయి. 


*సీతాపహరణం* జరిగినది ఈ ప్రదేశం *(జనస్థాన్)లోనే*. 


సీతాపహరణం తర్వాత దారిలో తననడ్డగించిన జటాయువు రెక్కలను రావణుడు తృంచిన ప్రాంతం నేడు *సర్వతీర్థ* మని పిలువబడుతోంది. 

ఇది *నాసిక్* పట్టణానికి *56 కి.మీ* దూరంలోని *తకేడ్* గ్రామం వద్ద ఉంది.


సీతాపహరణం తరువాత ఆమెను వెతుక్కుంటూ బయల్దేరిన రామలక్ష్మణు లు దారిలో *జటాయువు, కబంధులను* కలుసుకున్నాక 

*దక్షిణంగా* పయనిస్తూ 

*ఋష్యమూకపర్వతాన్ని* చేరుకున్నారు. 


ఈ దారిలోనే వారు *శబరి* ఆశ్రమానికి రావడం, ఆమె ఆతిథ్యం స్వీకరించడం జరిగింది.


ఆ ఆశ్రమమున్న *పంపాసరోవర* ప్రాంతం 

నేడు *కర్ణాటక రాష్ట్రం* లోని *బెల్గాం* దగ్గరున్న *సురేబన్ గా* గుర్తించ బడింది. 

ఈ ప్రాంతంలో ఇప్పటికీ *రేగు* చెట్లు అధికంగా ఉండడం విశేషం. 

*(భక్త శబరి శ్రీ రాముని చేత తను కొరికి రుచి చూసిన రేగు పళ్ళను తినిపించింది అన్నది ఐతిహ్యం)*. 


ఇక్కడి నుండి మంచి మంచి గంధపు చెట్ల వనాలనూ మంచి సరస్సులనూ దాటుకుంటూ  శ్రీ రామ లక్ష్మణులు *ఋష్యమూకాన్ని* చేరుకున్నారు. 


ఈ *ఋష్యమూకం*, *కిష్కంధ* ప్రస్తుత కర్నాటక *బళ్ళారి* జిల్లాలోని *హంపీ* ప్రాంతం. 


ఇక్కడే వారు *హనుమాన్, సుగ్రీవు* లను కలుసుకోవడం వారు సీతమ్మ వారి నగలను చూపడం జరిగింది.


ఇక్కడ *వాలిని సంహరించిన పిదప శ్రీ రాముడు వానర సేనతో కలసి *దక్షిణ దిశ* గా *సముద్రం* వైపు ప్రయాణించాడు. 


*మలయ పర్వతాన్నీ , గంధపు వృక్షాల వనాల్నీ సరస్సులనూ దాటుకుంటూ కావేరీ* తీరం చేరాడు. 


ఆ తర్వాత *తిరుచ్చిరాపల్లి*, *తంజావూరు*, *రామనాథపురా* ల

గుండా *రామేశ్వరం* చేరుకున్నాడు.


చిత్రమైన విషయం ఏమిటంటే రామాయణం లో వాల్మీకి వర్ణించిన ప్రాంతాలన్నీ 

భౌగోళికం గా ఇప్పటికీ నిలిచి ఉన్న స్మృతి చిహ్నాల తో సరిగా సరిపోవడం. 


రామాయణంలో *గంగా యమునల సంగమ ప్రాంతంగా చెప్పబడ్డ పరిసరాల్లో *(కోల్డిహ్వా, ఝూసీ, హేటాపట్టి లలో)* పురాతత్వ పరిశోధక శాఖ జరిపిన త్రవ్వకాల్లో ఈ ప్రాంతం *క్రీ.పూ. ఆరు, ఏడు వేల సం.ల* నుంచీ జనావాసాలుగా ఉండేవని గుర్తింపబడ్డాయి. 

*త్రివేణీ సంగమ* తీరంలో అలహాబాదులోని *ఆనంద భవన్* (నెహ్రూ గారి ఇల్లు)కి ఎదురుగా ఉండే ప్రాంతమే నాటి *భరద్వాజ* ఆశ్రమం. 


*ఇక్కడా*, *శృంగవేరపురాల్లోనూ* జిరిపిన త్రవ్వకాల్లో రామాయణ గాథకు సంబందించిన ముఖ్యమైన ఆధారాలు లభ్యమయాయి.


(శాస్త్రీయమైన పరిశోధనలు చేసి ఈ అమూల్యమైన విషయాలను మనకందించిన 

*I-SERVE, Delhi Chapter*  వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ 

- *పంతుల గోపాలకృష్ణా రావు*)

హితోక్తులు

 హితోక్తులు


🍁🍁🍁🍁🍁


మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోడానికి ఎవ్వరు ఉండరు.


మనతో పాటు మన చుట్టు ఉన్నవారు ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోడానికి పది చేతులు వస్తాయి.


కాలికి తగిలే ఎదురు దెబ్బలు నడవడం నేర్పిస్తాయి. మనుస్సుకు తగిలే ఎదురు దెబ్బలు బ్రతకడం నేర్పిస్తాయి.

 

జ్ఞాపకాలు కత్తి కంటే ప్రమాదకరం. కత్తి ఒకేసారి చంపుతుంది కాని, జ్ఞాపకాలు ప్రతీక్షణం గుచ్చి గుచ్చి చంపుతాయి._


మన మాట ఒక హృదయాన్ని కదిలించే విదంగా ఉండాలి కాని,  విరిచేసే విదంగా ఉండకూడదు._


నీకు సహాయం చేసిన వారిని మరిచిపోవద్దు. నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించవద్దు. నిన్ను నమ్మిన వారిని మోసమూ... చేయవద్దు._


జీవితం చిన్నది ఎంతకాలముంటామో...ఎప్పుడు పోతామో మనకే తెలియదు. ఉన్నా కొన్ని రోజులు నవ్వుతు, నవ్వేస్తూ ఆనందంగా గడిపేద్దాం.._


నేటి సమాజంలో చనిపోయిన తర్వాత శరీరానికి నిప్పు పెట్టే వారికంటే... తమ స్వార్థప్రయోజనాలకోసం బ్రతికి ఉన్నప్పుడు మనస్సుకు నిప్పు పెట్టేవారే ఎక్కువ.


మనిషికి మరణం ఉంటుంది కాని, మంచితనానికి మరణం ఉండదు..


మిమ్ములను చూసి అందరు జాలిపడేలా బ్రతకడం కాదు. అందరు అసూయా పడేలా బ్రతకడం నేర్చుకోవాలి. జీవితం అంటే కడుపు నింపుకునే ఆకలి కాదు. ప్రతీ ఒక్కరి గుండెల్లో దాచుకొనే జ్ఞాపకం అలా... బ్రతకాలి


 ముళ్ల బాట దాటితేనే పూలబాట ఎదురౌతుంది. సవాళ్ళను ఎదురుకుంటేనే విజయం సిద్ధిస్తుంది.


బలహీనులను తొక్కి గొప్పగా బ్రతకటం కాదు. నీ బలంతో పదిమందికి పెట్టి గంజి నీళ్ళు త్రాగి గౌరవంగా బ్రతుకు.


_తప్పులు చేసి సమాజం ముందు తలవంచడం కంటే, నీతిగా నాలుగు రోజులు బ్రతికేది మేలు._ 


మన జననం సాధారణమైందే కావొచ్చు కాని, మరణం మాత్రం చరిత్ర సృష్టించేదిగా ఉండాలి.


అదుపు తప్పి క్రింద పడితే ఆదుకోదు ఈ... లోకం..._

అలసి పోయి కన్నుమూస్తే ఆపలేదు బంధం.

దారిలోన చీకటైతే తోడు రాదు నీడ.

జారిపోయి దూరమైతే చేరుకోదు ప్రేమా.


 నిన్ను నమ్ముకో...నీకు నీవై సాగిపో..._👍👍👍




🌸జై శ్రీమన్నారాయణ🌸

భక్తి

 భక్తి.....


కావ్య కంఠ గణపతి ముని ఒకసారి అరుణాచలం వెళ్లారు. వారితోపాటు వారి తమ్ముడు కూడా వచ్చాడు. ఆయనకు జఠరాగ్ని ఎక్కువ. ఆ పిల్లాడు అన్నయ్యా ఆకలేస్తోంది అంటున్నాడు. ఆ రోజున ఏకాదశి తిధి. అందుకని ఆయన తన దగ్గర ఉన్న డబ్బులతో ఒక డజను అరటిపళ్ళు కొన్నారు. వాడు అవన్నీ తినేశాడు. తినేసి ఒక గంట గడిచేసరికి మళ్ళీ అతడు అన్నయ్యా ఆకలేస్తోంది అన్నాడు. అపుడు గణపతి ముని బ్రాహ్మణుల ఇంటి ముందుకు వెళ్లి 'భవతీ బిక్షామ్ దేహీ' అంటూ ఎవరైనా అన్నం పెడితే తమ్ముడికి పెడదామని యాచన చేస్తున్నారు. ఆ రోజు ఏకాదశి. ఎవ్వరూ అన్నం పెట్టలేదు. వీడు ఏడుపు. అపుడు ఆయన ఒక శ్లోకం చదివారు.


బ్రాహ్మణ గృహంలో ఎవరైనా అకస్మాత్తుగా వస్తే పెట్టడాడనికి కొద్దిగా అన్నం ఉండేటట్లుగా వండాలి."ఆఖరికి కలియుగంలో వీళ్ళ అన్న పాత్రలలో అన్నం కూడా లేదన్నమాట.. ఒక్కడు కూడా అన్నం పెట్టలేదు" అని ఆయన అనుకున్నారు.


ఆయన ఒక ఇంటి ముందు నుంచి వేడుతున్నారు. ఆ ఇంటి అరుగు మీద ఒక వృద్ధ బ్రాహ్మణుడు పడుకుని ఉన్నాడు. ఆయన గభాలున లేచి కావ్య కంఠ గణపతి మునిని పట్టుకుని అన్నాడు. 'నీవు బాగా దొరికావు. నా భార్య కు ఒక నియమం ఉంది. అందరూ ఏకాదశి వ్రతం చేసి మరునాడు ఉదయం పారణ చేస్తే నా భార్య ఏకాదశి నాడు రాత్రి భోజనం చేస్తుంది. కానీ భోజనం చేసేముందు ఆవిడకు ఒక నియమం ఉంది. ఆవిడ ఎవరైనా ఇద్దరు బ్రాహ్మణులకు భోజనం పెట్టుకుని తింటుంది. ఇవ్వాళ తిరువణ్ణ మలైలో యాత్రికులు కూడా దొరకలేదు. ఎవ్వరూ దొరకలేదు. నువ్వు ఆకలని తిరుగుతున్నావు. మా ఇంట్లో కి రా.. అని తీసుకు వెళ్ళాడు.


ఆ ఇంట్లోని ఇల్లాలు స్నానం చేసి రండి. భోజనం వడ్డిస్తాను' అంది. కావ్యకంఠ గణపతి ముని, ఆయన తమ్ముడు గబ గబా వెళ్లి స్నానం చేసి తడిబట్టతో వచ్చారు. ఆవిడ మడి బట్టను ఇచ్చింది. అవి కట్టుకుని భోజనానికి కూర్చున్నారు. ఆవిడ షడ్రషోపేతమైన భోజనం పెట్టింది. భోజనం ఐన తరువాత ఆవిడ చందనం ఇచ్చింది. ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే భోజనం అయ్యాక చందనం పెట్టాలి. వారు అది చేతులకి రాసుకుని లేవాలి. అది ఇంటి యజమానే తీస్తే దాని వలన ఎంతో గొప్ప శ్రేయస్సును పొందుతాడు. వాళ్ళు చందనం రాసుకున్నాక ఆవిడ తాంబూలం ఇచ్చింది.


వీళ్ళు కడుపునిండా తినేసారేమో కళ్ళు పడి పోతున్నాయి. 'అమ్మా , ఇంక ఎక్కడికీ తిరగలేం. ఈ రాత్రికి మీ అరుగు మీద పడుకుంటామమ్మా..' అన్నారు. ఆవిడ సరేనని ఆవిడ తలుపు వేసేసింది. వీళ్ళిద్దరూ పడుకుని నిద్రపోయారు. గాఢ నిద్ర పట్టేసింది. వీరు నిద్రించిన ఇల్లు అరుణాచలం లో అయ్యంకుంట్ల వీధిలో ఉంది. మరునాడు సూర్యోదయం అవుతుంటే వారికి మెలకువ వచ్చింది. ఇద్దరూ నిద్ర లేచారు. 'అమ్మయ్య రాత్రి ఈ తల్లి కదా మనకి అన్నం పెట్టింది' అనుకుని అరుగు మీద నుండి లేచి చూసారు. అది వినాయకుడి గుడి. అక్కడ ఇల్లు లేదు. వాళ్ళు తెల్లబోయి 'రాత్రి మనం షడ్రషోపేతమైన భోజనాలు తిన్నాము. ఇక్కడ రత్నకింకిణులు ఘల్లు ఘల్లు మంటుంటే ఎవరో ఒక తల్లి మనకి అన్నం పెట్టింది. ఆ తల్లి ఇల్లు ఏది' అని చూసారు. కలకాని కన్నామా అనుకున్నారు.


పక్కకి చూస్తే రాత్రి ఆవిడ ఇచ్చిన తాంబూలాలు ద్రవ్యంతో కూడా ఆ పక్కనే ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి... ఎవడు ఆర్తితో ప్రార్థన చేసి, ఎవడు ఆర్తితో పూజ చేస్తున్నాడో వాడు నోరు తెరచి అడగవలసిన అవసరం లేకుండా, వాడి అవసరాలు తీర్చడానికి భగవంతుడు వాడి వెనుక తిరుగుతూ ఉంటాడు. వాడికి ఈశ్వరుని అనుగ్రహం ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది. దానికి ప్రకటనలు అక్కర్లేదు. కాబట్టి అంత స్వచ్ఛమైన భక్తితో, అమ్మవారి పట్ల కృతజ్ఞతతో బ్రతికేవాడు ఎవడున్నాడో వాడిని అమ్మయే కాపాడుతూ ఉంటుంది...


ఓం నమః శివాయ

జ్ఞానిని, అజ్ఞానిని అనుకరించకూడదు

 _*జ్ఞానిని, అజ్ఞానిని అనుకరించకూడదు*_

🕉🌞🌎🌙🌟🚩


*_ఎవరిని మీరు అనుకరించాలి అంటే ? ఒక జ్ఞానిని మీరు అనుకరించలేరు, ఒక అజ్ఞానినీ మీరు అనుకరించకూడదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండీ ఈ విషయం... ఒక జ్ఞానిని అనుకరించలేరు !_*



*_ఒక భగవాన్ రమణులు గోచీ పెట్టుకొన్నారుగదాని మీరూ గోచి పెట్టుకుని ఆయలా తిరిగితే మీరు రమణమహర్షి అవడం సాధ్యంకాదు. భగవాన్ రమణులూ.. ధ్యానంలో ఉండగా... ఆయన తొడలకింద తేళ్ళూ, జ్జెర్రులూ పట్టుకొని తొడలు కొరుక్కుతినేసి నెత్తురు కాల్వలై ప్రవహించినా... ఆయనకు శరీరమునందు సృతిలేదు. ఆయనలా గోచీ పెట్టుకోగలవేమో... ఆయనలా... నువ్వు ఆ స్థితిలో నిలబడిపోయి బాహ్మము నుంచి విడిపడిపోవడం నీకు సాధ్యమవుతుందా ?_*



*_జ్ఞానిని అనుకరించ వద్దూ... జ్ఞానిగా అయిన తరువాత, నీవు జ్ఞానివి కాగలిగితే... నీ స్థితి నీ కొస్తుందప్పుడు, నీవు జ్ఞానివైపోయినట్టూ..._*



*_రమణులు ఎలా ఉంటారో, రామకృష్ణ పరమహంస ఎలాఉంటారో, ఒక చంద్రశేఖర సరస్వతి ఎలా ఉంటారో, ఒక చంద్రశేఖర భారతి ఎలా ఉంటారో అలా ఉండే ప్రయత్నం నీవు చేయకూడదు. అది సాధ్యమయ్యే విషయం కాదు._*



*_చంద్రశేఖర భారతీ... పుష్పార్చన చేస్తూ... చేస్తూ... సమాధిలోకి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతే బిందెలతో నీళ్ళు తెచ్చి ఆయనమీద పోసేసేవాళ్ళు. ఆయనకు బాహ్య స్పుృతి ఉండేది కాదు. ఒళ్ళుతుడిచేసి బట్టలాగేసి, చుట్టేసేవారు. అలాగే ఉండేవారు. కొన్ని రోజులు అదే సమాధి స్థితిలో ఉండేవారు._*



*_ఏదీ అలా నేను కూడా నటిస్తానండీ అంటే కుదిరే విషయమా ! అది సాధ్యం కాదు. జ్ఞానిని అనుకరించ రాదూ అనుకరించే ప్రయత్నమూ చేయ్యకూడదు. లేదా జ్ఞానిని అనుకరించలేవు. అజ్ఞానినీ... అనుకరించరాదు._*



*_జ్ఞానీ సంధ్యావందనం చేయకపోవచ్చూ, జ్ఞానీ బట్టకట్టకపోవచ్చు, ఒక అజ్ఞానీ బట్ట కట్టకపోవచ్చూ, తండ్రికి తద్దినం పెట్టకపోవచ్చూ, వాడు చేస్తున్నాడని నీవు చేయకూడదు. ఈ రెండిటికి మధ్యలో నీ పరిధి తెలుసుకొని నీవు ప్రవర్తిస్తే పైకి ఎక్కుతావు, ఈ ఎక్కేటటువంటి ప్రస్తానమునకు సాధన అని పేరు._*



*_అజ్ఞానికి చూసి అలా చేయకుండా ఉండడం, జ్ఞానిని అనుకరించే ప్రయత్నం చేయకపోవడం, అజ్ఞానిచూసి వాడు బాగుపడాలని కోరుకొని, నీవు జ్ఞానం పొందడానికి ప్రయత్నం చేయడానికి నిశ్ఛలమైన చిత్తంతో కర్మాచరణం చేసేటటువంటి ప్రక్రియకు సాధనా అని పేరు శాస్త్రంలో..!_*


🕉🌞🌎🌙🌟🚩

సలేశ్వర క్షేత్రం

 సలేశ్వర క్షేత్రం.


👉ఈ గుడికి వెళ్ళాలంటే ప్రాణాలపై ఆశ వదులు కోవాల్సిందే..

👉మరణించిన వారిని బ్రతికించగలిగే మహా శక్తి ఉన్న సంజీవని పర్వతం ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా ?

గుడి అంటే రోజూ పూజలు,నైవేద్యాలు ఇవన్నీ రోజూ మామూలే! 

కానీ ఓ దేవాలయం కేవలం 5 రోజులు మాత్రమే తెరచివుంటుంది. 

ఆ 5 రోజులులూ దేవుడికి పూజలు చేసి గుడిని మూసేస్తారు. 

మళ్ళీ తెరిచేది యాడాది తర్వాతే. 

ఎందుకంటే ఈ గుడికి వెళ్ళటం ఆషామాషీ వ్యవహారం కాదు. 

అక్కడికి వెళ్ళాలంటే గుండెలు అరచేత్తో పట్టుకుని అడుగులు వేయాల్సిందే. 

అడుగడుగునా పొంచివున్న ప్రమాదాలతో ఓ సాహసయాత్రను తలపించే ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే భక్తి ఒక్కటే చాలదు.

గుండె ధైర్యం కూడా పుష్కలంగా వుండాలి.

ఇంతకీ ఆ గుడి ఎక్కడ వుంది?

అక్కడికి ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలని వుంది కదూ!

సలేశ్వరం శ్రీశైలం దగ్గరలోని ఒక యత్రా స్థలము. 

ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం, 

చారిత్రిక ప్రాముఖ్యత గల ప్రదేశం, 

ఆధ్యాత్మిక ప్రదేశం. 

ఇది శ్రీశైలం అడవులలొని ఒక ఆదిమవాసి యాత్రా స్థలము. 

ఇక్కడ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతర జరుగుతుంది. 

ఈ జాతర ఉగాది వెళ్ళిన తరువాత తోలి పౌర్ణమికి మొదలగుతుంది.

శ్రీశైలానికి 40 కిలొమిటర్ల దూరంలో వుంటుంది సలేశ్వరం. అడవిలో నుండి 25 కిలోమీటర్ల ప్రయాణం వుంటుంది. ఇందులో 20 కిలొమిటర్ల వాహన ప్రయాణం సాధ్యపడుతుంది.

అక్కడి నుండి 5 కిలొమిటర్ల కాలినడక తప్పదు. 

ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శంకరుడు లోయలో వున్న గుహలో దర్శనమిస్తాడు. 

ఇక్కడ సంవత్సరంలో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోనికి అనుమతి వుంటుంది. 

ఇక్కడ జలపాతానికి సందర్శకులు అందరూ ముగ్ధులు అవుతారు.

కలియుగ అంతానికి కారణమయ్యే గుడి !

వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే !

👉1. ఆలవాలం.

అదో దట్టమైన కీకారణ్యం. ఎత్తైన కొండలు, పాలనురుగులా జాలువారే జలపాతాలు,

ప్రకృతి రమణీయదృశ్యాలు, 

అక్కడి ప్రతి అణువూ నిండి వుంటుంది. 

దీనితో పాటు కారడివి ఆధ్యాత్మికతకు కూడా ఆలవాలంగా వుంటుంది.

👉2. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే మార్గం.

తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా నల్లమల అడవులలో కొలువైవున్న సలేశ్వర క్షేత్రం వెళ్ళాలంటే ఎవరికైనా ఒణుకు పుట్టాల్సిందే. 

హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే మార్గంలో 150కి.మీ రాయి దగ్గర పరహాబాద్ గేటు వుంటుంది. 

అక్కడినుంచి 32కిమీ ల దూరం దట్టమైన అడవిలో వెళ్ళాలంటే ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అనుమతి తీసుకోవాల్సిందే.

👉3. జాగ్రత్త.

గుట్ట కొనను చేరుకొన్నాక మళ్ళీ ఉత్తరవైపునకు తిరిగి గుట్టల మధ్య లోయ లోనికి దిగాలి. 

ఆ దారిలో ఎన్నెనో గుహలు సన్నని జలధారలు కనిపిస్తాయి. 

గుండం కొంత దూరంలో ఉందనగా లోయ అడుగు బాగానికి చేరు కుంటాం.

👉4. లోయలో జాగ్రత్తగా నడవాలి.

గుండం నుండి పారె నీటి ప్రవాహం వెంబడి రెండు గుట్టల మధ్య గల ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. ఒక్కోచోట బెత్తెడు దారిలో నడవాల్సి వుంటుంది. 

ఏమరు పాటుగా కాలు జారితె ఇక కైలాసానికే.

👉5. నీరు అతి చల్లగా, స్వచ్ఛంగా.

గుండం చేరిన తర్వాత అక్కడి దృశ్యం చాల అందంగా కనిపిస్తుంది. 

తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తే చుట్టు ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మధ్యలోనుండి ఆకాశం కుండ మూతి లోపలి నుండి ఆకాశం కనబడినట్లు కనబడుతుంది. గుండంలోని నీరు అతి చల్లగా, స్వచ్ఛంగా వుంటుంది. అనేక వనమూలికలతో కలిసిన ఆనీరు ఆరోగ్యానికి చాల మంచిది.

పుణ్యక్షేత్రమైన శ్రీశైలంకు ప్రయాణం

👉6. లింగమయ్య స్వామి లింగం.

గుండం ఒడ్డు పైన తూర్పు ముఖంగా రెండు గుహలు ఒకదానిపై ఒకటి ఉన్నాయి. 

పై గుహనే ముందు చేరుకోవచ్చు. 

ఆ గుహలోనె ప్రధాన దైవమైన లింగమయ్య స్వామి లింగం ఉంది. 

స్థానిక చెంచులే ఇక్కడ పూజారులు. 

క్రింద గుహలో కూడా లింగమే ఉంది. 

గుడి ముందు మాత్రం వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలున్నాయి.

👉7. సలేశ్వరం జాతర సంవత్సరాని కొకసారి చైత్ర పౌర్ణ్మికి రెండు రోజులు ముందు, రెండు రోజులు వెనుక మొత్తం ఐదు రోజులు జరుగుతుంది.

ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరుతున్నది గాన కొంతమంది దాతలు ఉచిత భోజన వసతి కలిగిస్తున్నారు. భక్తులు వచ్చేటప్పుడు 'వత్తన్నం వత్తన్నం లింగమయ్యో' అంటూ వస్తారు.

వెళ్లేటప్పుడు 'పోతున్నం పోతున్నం లింగమయ్యొ' అని అరుస్తూ నడుస్తుంటారు.

👉8. శిధిలావస్థ.

10కి.మీ లు వెళ్ళగానే రోడ్డుకు ఎడమప్రక్కన నిజాం కాలపు శిధిలావస్థలో వున్న భవనాలు కనిపిస్తాయి. 

నిజాం రాజు అక్కడి ప్రకృతి అందాలకు ముగ్ధుడై వందేళ్ళకు పూర్వమే అక్కడ వేసవి విడిది నిర్మించుకున్నాడు. 

అందుకే ఆ ప్రదేశాన్ని పరహాబాద్ అంటారు.

👉9. నడకదారులు.

ఈ ప్రాంతంలో పులులు ఎక్కువగా సంచరిస్తుండడంతో 1973 లో కేంద్రప్రభుత్వం టైగర్ ప్రాజెక్టును ఇక్కడ ఏర్పాటుచేసింది. 

అక్కడ నుంచి సలేశ్వరానికి 3 నడకదారులున్నాయి. దట్టమైన అడవిలో వున్న సలేశ్వర ఆలయంలో చెంచులే పూజాకార్యక్రమాలు నిర్వహిస్తూవుంటారు.

కొలను భారతి - ఎపి లో ఉన్న ఒకేఒక సరస్వతి దేవాలయం !!

👉10. చైత్రపౌర్ణమి.

సలేశ్వరంలో సంవత్సరానికి ఒక్క సారి జాతర జరుగుతుంది. 

చైత్రపౌర్ణమికి రెండు రోజుల ముందు రెండు రోజుల తరువాత అంటే మొత్తం 5 రోజులపాటు జాతర జరిగే సమయంలోనే ఆ గుడిని తెరచివుంచుతారు. 

ఈ 5రోజులలో దేవుడి దర్శనానికి వచ్చే భక్తులు సాహసయాత్ర చేయాల్సి వుంటుంది.

👉11. జలపాతాలు.

ఇరుకైన లోయల్లో కేవలం కాలు మాత్రమే పట్టే దారి మాత్రమే వుంటుంది. 

పొరపాటున అక్కడ కాలు జారితే అంతే సంగతులు. కనీసం శవం కూడా దొరికే పరిస్థితి వుండదు. 

అక్కడికి వెళ్ళే దారిలో వుండే జలపాతాలు మండు వేసవిలో ఎంతో ఆనందాన్ని,ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

👉12. భక్తులతో కిటకిటలాడుతూ.

నీటి గుండాలు చూపులు తిప్పుకోనివ్వవు. 

గుడి తెరచి వుండే 5రోజులు భక్తులతో కిటకిటలాడుతూ వుంటుంది. 

శ్రీశైలం మల్లికార్జున స్వామి, సలేశ్వర లింగామయ స్వామి, లుగ్దీ మల్లన్న, ఉమామహేశ్వరం ఈ నాలుగు లింగాలే అందరికీ తెలుసు. 

ఐదో లింగం నల్లమల అడవులలో ఎక్కడ వుందో ఇప్పటికీ ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు.

👉13. చరిత్రకారులు.

సలేశ్వర ఆలయాన్ని 6వశతాబ్దిలో నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతారు. 

13వ శతాబ్దంలోని మల్లికార్జునపండితారాజ్య చరిత్ర, శ్రీ పర్వత క్షేత్రంలో సలేశ్వర క్షేత్ర విశేషాలను పాల్పురి సోమనాధుడు వర్ణించాడు. 

ఆలయం నిర్మించిన నాటి నుంచి ఏడాదిలో 5 రోజులు మాత్రమే తెరచివుంచటం ఆనవాయితీగా వస్తోంది. 

17వ శతాబ్దం చివరిలో ఛత్రపతి శివాజీ సలేశ్వరం క్షేత్రంలో ఆశ్రమం పొందినట్లు చరిత్ర చెబుతుంది.

👉14అక్కడి పకృతి అందాలకు ముగ్దుడైన నిజాం.

వంద సంవత్సరాలకు ముందే అక్కడ ఒక వేసవి విడిదిని నిర్మించాడు. 

అదిప్పుడు శిథిలావస్థలో వుంది.

ఆ ప్రదేశానికి ఫరాహబాద్ అనిపేరు. 

అనగా అందమైన ప్రదేశం అని ఆర్థం.

👉15. ఎలా చేరుకోవాలి.

హైదరాబాద్ - శ్రీశైలం వెళ్ళే దారిలో మన్ననూర్ అనే ఊరు వస్తుంది. 

అక్కడి నుండి 10 -12 KM దూరం శ్రీశైలం వెళ్ళే మార్గంలో వెళ్తే ... 

సలేశ్వరం అనే బోర్డు కనిపిస్తుంది. 

ఆ బోర్డు చూపించే గుర్తు వైపు 10 కిలోమీటర్లు వెళ్తే ... సలేశ్వరం లోయ కనిపిస్తుంది. 

అక్కడే వాహనాలు, బస్సులు ఆపాలి. 

లోయలో ఐదు కిలోమీటర్లు నడిస్తే ... 

ఆకాశ గంగను తలపించే జలపాతం, గుహలు కనిపిస్తాయి. 

అదే సలేశ్వర క్షేత్రం.

నిజాం విడిది నుండి ఎడమ వైపున 22 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత సలేశ్వరం బేస్ క్యాంపు వస్తుంది. 

అక్కడే వాహనాలను ఆపుకోవచ్చు. 

అక్కడినుండి సలేశ్వరం అనే జలపాతం చేరుకోడానికి రెండు కిలొమీటర్ల దూరం నడవాలి.

ఓం నమః శివాయ..స్వస్తి..!!


లోకా సమస్తా సుఖినోభవంతు..!!

వేంకటేశ్వర సుప్రభాతం

 వేంకటేశ్వర సుప్రభాతం ఈశానాం వేంకటపతి అని రమయా రమమాణాయ యిలా విశేషమైన వర్ణనలతో ప్రకృతి🌿🍃 సంబంధియైన తత్వాన్ని పురుష సంబంధించిన తత్వాన్ని మనకు వేదం ద్వారా ఉపనిషత్తుల ద్వారాతెలియుచున్నది. ఈశ అనునది ఉపనిషత్తు, ర రుద్ర వర్ణన ఋగ్వేద మంత్ర మూలం. దీనిని తెలియుటయే ఙ్ఞాన మని. ప్రసూన, ప్రసన్నం, ప్రచోదనం, ప్రాచీన, వీని మూలం అగ్ని తత్వమును తద్వారా నీటి తత్వాన్ని మనకు ఈ అనే శక్తి యే మాలిని తెలియును. ప ర ప్ర అయినది. రమయా లో ర, మ  ప్ర గా మారినది. ఈ అనేది దృశ్య మానము కాదు. దానిని రామ ద్వారా తెలియుట యే ఙ్ఞాన మని అది ప్రసన్నం చేయుటయే మూల శక్తి మా అణాయ రమమాణాయ అని యిలా విశ్లేషణ చేయుచు తత్వాని గ్రహించుటకై ఉపాసన. మూల శక్తిని తెలియుట. యిదియే ఆత్మ స్వరూపమైన వేంకటపతి అనగా రూపం కాదు జీవ సంబంధ లక్షణము వేంకట తత్వం. అది ఈశ తత్వ మని ఎరుగవలెనని యిదియే ఙ్ఞానం.ఙ్ఞానీనాం అగ్రగణ్యుడు. అగ్ర భాగమున గణన చేయగలిగిన వాడు. గణన అనగా శక్తిని సూత్ర రూపంగా విభజించ గలవాడు.

మొగలిచెర్ల

 *స్వామివారి సమాధి ముచ్చట..(2వ భాగం).*


శ్రీ స్వామివారు పద్మాసనం వేసుకొని కూర్చుని వున్నారు..వారికెదురుగా నాన్నగారు, మీరాశెట్టి గారు కేశవులు గారు కూర్చుని వున్నారు.."నాకు అన్నం తెచ్చేది కాక, ఇలా మిమ్మల్ని తీసుకొచ్చే పని కూడా ప్రసాదు కే పెట్టారా మీరు?.." అని నాన్నగారిని స్వామివారు అడిగారు.."ముసలయ్య రాలేదు స్వామీ..అందుకని వీడిని పిలిచాను.." అన్నారు నాన్నగారు..స్వామివారు నా వైపు చూసి..తన దగ్గరకి రమ్మని పిలిచి..తన ప్రక్కనే కొద్దిగా ఎడంగా కూర్చోమని చెప్పారు..ఒక ప్రక్కగా కూర్చున్నాను..


"సమయం తక్కువగా ఉంది శ్రీధరరావు గారూ..మీరు ముగ్గురూ శ్రద్ధగా వినండి..ఎక్కువలో ఎక్కువ ఐదారు నెలలు అంతే..మీరు మనసు స్థిర పరచుకొని జీవసమాధి చేయండి.." అన్నారు..


"మేము ముగ్గురమూ కనబడితే..నువ్వు సమాధి చేయమని అడుగుతావు..ఇంకేమీ మాట్లాడవా?.." అన్నారు మీరాశెట్టి గారు..(మీరాశెట్టి గారొక్కరే..మొదటినుంచీ శ్రీ స్వామివారిని ఏక వచనం తో పిలిచేవారు..అది వారికి అలవాటు..) స్వామివారు పెద్దగా నవ్వి.."మీరాశెట్టీ..ఇక నాకు మిగిలింది మోక్షమే నయ్యా..దాని గురించే నేను పదే పదే మీకు చెప్పాలి..నా తపస్సు చివరిదశకు వచ్చేసింది.." అన్నారు..


"స్వామీ..మీరు కొన్నాళ్లపాటు జీవించి వుండి..మాలాంటి వారికి జ్ఞానబోధ చేయాలి..ఇంత చిన్న వయసులో మీరు మోక్షం అని చెప్పి..ప్రాణత్యాగం చేయడం సరైన పద్ధతి కాదు..మరొక్కసారి ఆలోచించండి..సమాజానికి మీలాంటి సాధకుల అవసరం ఎంతో ఉన్నది.." అన్నారు నాన్నగారు..


"శ్రీధరరావు గారూ..సమాజహితం కొఱకు నేను జీవించే ఉండనక్ఖరలేదు..ఇది తపోభూమి..నా సాధన, తపస్సు తాలూకు శక్తి నా సమాధి లోనూ నిక్షిప్తమై ఉంటాయి..ఆ సందేహం మీకు వద్దు..నా ఆయుష్షు ను నేను పొడిగించుకోలేను..అది నా చేతుల్లో లేదు..కాకుంటే..మాలాంటి అవధూతలకు వుండే ఒక సౌకర్యం ఏమిటంటే..మేము మా ఆయుష్షు తీరే సమయానికి మా ఇష్టప్రకారం ఇచ్చామరణాన్ని పొందవచ్చు..అదొక్కటే నా చేతుల్లో ఉంది..ఇలా చెపితే మీకు అర్ధం కాకపోవచ్చు..కానీ ముందు ముందు మీరే కళ్లారా చూసి..నిర్ధారణకు వస్తారు.." 


"మీరు మహానుభావులు..ఒక యోగికి సేవ చేసుకుంటున్నాము అని మేము ఎంతో ఆనందపడుతున్నాము..మీరేమో ఇలా అర్ధాoతరంగా శరీరం విడిచిపెట్టి మోక్షానికి వెళతామని చెపుతున్నారు..కాస్త ఆలోచించండి స్వామీ.." అన్నారు కేశవులు గారు..


"కేశవులు గారూ నేనెంత చెప్పినా..మీకు అసలు విషయం ఇంతవరకూ అర్ధం కాలేదు..నాకు ఆయుష్షు ఎక్కువ కాలం లేదు..ఆ ఒక్కమాట మీకు అర్ధం అయితే చాలు.." అన్నారు..


"మా చేతులతో నిన్ను సమాధి చేయడం మా వల్ల అయ్యే పనేనా..మా తో కాదు.." అని మీరాశెట్టి గారు ఖరాఖండిగా తేల్చేశారు..స్వామివారు నవ్వి.."ముసలయ్య రాలేదని ప్రసాద్ బండి కట్టుకొని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు..అలానే ఆరోజు కూడా ఇలాంటి వాళ్ళు వుండకపోతారా..." అంటూ నా భుజం తట్టి..లేచి నిలబడ్డారు..నాన్నగారితో సహా మిగిలిన ఇద్దరూ కూడా లేచి నిలుచున్నారు..


"మీరు బాగా ఆలోచించుకోండి..ఇంకా కొద్దినెలలు సమయం ఉంది..నా సాధన చరమదశకు చేరుతున్నది..ముందు ముందు తీవ్ర సాధన చేయాలి..మిమ్మల్ని పదే పదే కలవడం కూడా కుదరదు..ఇక వెళ్ళిరండి.." అని చెప్పి, శ్రీ స్వామివారు వరండా మెట్లు దిగి పందిరిలో నిలబడ్డారు.. 


స్వామివారి సమాధి ముచ్చట చివరి భాగం రేపు చదువుకుందాం..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

దుఃఖానికి కారణం ఏమి?*

 *దుఃఖానికి  కారణం ఏమి?*

*దుఃఖాన్ని తొలగించుకోవటం ఎలా?*

*భయాన్ని అధిగమించడం ఎలా?*

*అసంతృప్తిని పోగొట్టుకోవటం ఎలా?*

*మనస్సుని అదుపుచేయటం ఎలా?*

*ఈ సృష్టి ఏమిటి?*

*నేను ఎవరు?*

*నన్ను నేను తెలుసుకోవటం ఎలా?*


ఇటువంటి ప్రశ్నలకు సమాధానాన్ని *శ్రీమతి కర్రా సూర్యకాంతం గారు* తన ఆత్మజ్ఞాన ప్రవచనాల ద్వారా చిన్న పిల్లాడికి చదువు చెప్పినట్టు బ్లాక్ బోర్డ్ మీద వివరిస్తూ బోధిస్తారు. ఈ Free Course(79 వీడియోలు) మొత్తం పూర్తిచేసినవారికి సర్వ సందేహాలు తొలగిపోయి ప్రశాంతత, సంతృప్తి తప్పక కలుగుతాయి.


www.freegurukul.org/blog/self-knowledge

       (OR)

1) https://youtu.be/accMe83Jt7s

2) https://youtu.be/nfEizqMiEiQ

3) https://youtu.be/85Qr9bvJz7I

4) https://youtu.be/vsAUo0Qj38Q

5) https://youtu.be/TkUW6DdP03Y

6) https://youtu.be/ju6bB2-JzPc

7) https://youtu.be/K4MZaf7qjSI

8) https://youtu.be/P5ua21s-zM0       

9) https://youtu.be/eE1XzbjxiGA

10) https://youtu.be/HAgNOXdYcWs

11) https://youtu.be/Kcy3jwUdLc8

12) https://youtu.be/Yng3B2wzevs

13) https://youtu.be/a2Rdx6wSd8A

14) https://youtu.be/MlhJdqnq2vY

15) https://youtu.be/hEFxA3C6Khg

16) https://youtu.be/ixOluEIS8qo

17) https://youtu.be/A6FGNhyMt3c

18) https://youtu.be/iREaRtMRsWs

19) https://youtu.be/j7zO0N2heY8

20) https://youtu.be/iHQ2aKSl8no

21) https://youtu.be/R_hIWkE7LTY

22) https://youtu.be/qzhTsbyMQI4

23) https://youtu.be/h1kXaKqbsd4

24) https://youtu.be/_uNqJaZRA-c

25) https://youtu.be/ahn07hmfsf0

26) https://youtu.be/_H2FyIM6EYI

27) https://youtu.be/rm7tOblCn0M

28) https://youtu.be/PAQ0YxVjWHA

29) https://youtu.be/oChmYpIY2v8

30) https://youtu.be/Juo1SS25BTA

31) https://youtu.be/9049Crvvy1A

32) https://youtu.be/cQDSGy3JY-o

33) https://youtu.be/hChWnSclYxw

34) https://youtu.be/IdKbmxmPfD4

35) https://youtu.be/FLiGhBfdmLw

36) https://youtu.be/bMJygKlwe6o

37) https://youtu.be/NjUdi0i91L0

38) https://youtu.be/UJ5QZ7JoH-0

39) https://youtu.be/r4QHemWuCaM

40) https://youtu.be/BODti9UxmTE

41) https://youtu.be/2KgsWnIQLb4

42) https://youtu.be/N2uRXoNRRoc

43) https://youtu.be/DNij7tDozcY

44) https://youtu.be/9DO7Zp3cHcA

45) https://youtu.be/ZtfQlib56ec

46) https://youtu.be/oMvdF1sKJyE

47) https://youtu.be/Pyw0f_ANrvk

48) https://youtu.be/-_lfb0csh_Q

49) https://youtu.be/1PuWwNQtEH8

50) https://youtu.be/BUDe9QA8a8w

51) https://youtu.be/4JTA3NAZmaE

52) https://youtu.be/TFDlpsfOyhM

53) https://youtu.be/l1QMipWn3cY

54) https://youtu.be/hcbQgA_9hSo

55) https://youtu.be/T7mkYPMoK7Y

56) https://youtu.be/zt6WiKVN6xM

57) https://youtu.be/eOvm3OAFam4

58) https://youtu.be/iOz4dMWdJck

59) https://youtu.be/IEcfob_RDhE

60) https://youtu.be/avXO0nFrTxw

61) https://youtu.be/vIvdFhFHtXU

62) https://youtu.be/LbaOfLsQUUs

63) https://youtu.be/0EFCbqn2qUk

64) https://youtu.be/epiGgZ0Ugbw

65) https://youtu.be/BCdzmzFIhj8

66) https://youtu.be/Zob1KfTSo2s

67) https://youtu.be/4CaL3wVKKSY

68) https://youtu.be/egNPGeigOjA

69) https://youtu.be/vga02zzjUO0

70) https://youtu.be/3BGmnffEeCM

71) https://youtu.be/VtaOKSELQ8c

72) https://youtu.be/Dm3zjmrkCtU

73) https://youtu.be/KFASTY83XqE

74) https://youtu.be/I6rxeJ9d-zY

75) https://youtu.be/gSD56fErTCI

76) https://youtu.be/n1SvwZ98Tgg

77) https://youtu.be/pWLCYqCEDm4

78) https://youtu.be/Wh684-nHS4E

79) https://youtu.be/xK8XBpBQUTM



శ్రీమతి కర్రా సూర్యకాంతం గారి వెబ్సైట్

http://ahambrahmasmisatsang.com

Phone:9032484819


ఆత్మ జ్ఞానం,ఆత్మ విద్య, బ్రహ్మ జ్ఞానం, బ్రహ్మ విద్య  పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన సమాచారం ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏


మరింత సమాచారం కోసం:

ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్

Website: www.freegurukul.org

Android App: FreeGurukul 

iOS App: Gurukul Education  

Helpline: 9042020123

*To Join In WhatsApp Group*: To get this type of Spiritual, Inspirational, Personality Development messages daily, join in group by this link  www.freegurukul.org/join

మోసం జరుగుతోంది

 #COVID19  #Vaccin #టీకా


Fraud is going on.. If someone calls you and ask for vaccine registration, don't entertain. They ask for Aadhaar card, email nos.. and send OTP, and ask to tell you the same, as soon as you give the OTP no. Your bank account money will be emptied... as your aadhar is linked to Your bank account.


BE Careful, BE safe!


మోసం జరుగుతోంది .. ఎవరైనా మీకు ఫోన్ చేసి టీకా నమోదు కోరితే నమ్మకండి.  వారు ఆధార్ కార్డ్, ఈమెయిల్ వివరాలు అడిగి..  OTP పంపుతా మంటారు. ఆ OTP నెంబర్ వచ్చిన వెంటనే మిమ్మల్ని అదే నెంబర్ చెప్పమని అడుగుతారు.  మీరు చెప్పిన వెంటనే మీ ఆధార్ మీ బ్యాంక్ ఖాతాతో అనుసంధానించబడి ఉన్నందున.. మీ బ్యాంక్ ఖాతా డబ్బు ఖాళీ అవుతుంది.


జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి!

బ్రాహ్మణ వృధ్ధాశ్రమం :-

 బ్రాహ్మణ వృధ్ధాశ్రమం :-


జంటకు ఐతే : రూ 25000

ఒకరికి ఐతే నెలకు రూ 15000 


సపరేటు రూము 

వెస్టర్ను బాత్ రూము 

వేడినీళ్లు 

అల్పాహారం 

మంచి వేడి వేడి భోజనం 

రాత్రికి తిరిగి అల్పాహారం లేదా భోజనం 

మంచం ,బీరువా 

కేవలం బట్టలు తీసుకుని వస్తే చాలు 

టీవీ , ఫ్రిడ్జ్ 

ఉదయం సాయంత్రం 

కాఫీ లేదా పాలు 

బట్టలు ఉతుకుతారు 

ఉల్లిపాయలు వాడము 

సంప్రదాయాలను పాటించేవారికే అవకాశం 

బెడ్ రిడన్ వారికి అవకాశం లేదు 


చిరునామా : 

నల్లకుంట , హైదరాబాద్ 

వివరాలకు మెసేజి పెట్టండి : 

9701609689


or 

DIAL 

SMT DURGARANI

6304921292

💐💐💐💐💐


మీకు తెలిసిన బ్రాహ్మణులకు మెసేజ్ పంపండి


పేద మధ్యతరగతి బ్రాహ్మణ ఆడపిల్లల పెళ్ళికి మా సహకారం : 

బాధ్యతతో ప్రకటన : తేదీ : 9 డిసెంబర్ 2020 : 


నిశ్చితార్థం రోజు 

కేవలం 15 లేదా 20 మంది లోపు 

వచ్చేది ఉంటె , హాజరు అవుతారు అంటే .. 


హాలు , భోజనాలు , వీడియో గ్రఫీ ఉచితం .. 


ఇది హైదరాబాద్ నల్లకుంట లో .. 


ఆడపిల్ల పెళ్లి అంటే 

తల్లి తండ్రులు వచ్చి దరఖాస్తు పెట్టుకుంటే 

పెళ్ళికి బంగారు తాళిబొట్టు 

పట్టు చీరలు 

రూ 5 వేలు నగదు సహాయం చేయబడును .. 


ఆడపిల్లకు తండ్రి లేరు 

చాల పేదరికంలో ఉన్నారు 

అనుకుంటే , పై మూడుతో పాటు 

వంద మంది వరకు భోజనాలు 

క్యాటరింగ్ కూడా ఉచితం .


రెండు నెలల ముందే తెలియ చేస్తే, 

దిల్ షుక్ నగర్ , హైదరాబాద్ లో 

హాలు కూడా ఉచితంగా ఇవ్వబడును .


బ్రాహ్మణ సంక్షేమ భవన్ :-

9701609689


వివరాలకు మెసేజి పెట్టండి !!


*ధన్యవాదములు*

అన్నింటికి కర్త ఈశ్వరుడే*

 అన్నింటికి కర్త ఈశ్వరుడే* 


గొడ్డలి కట్టెలను కొడుతుంది. గొడ్డలి గొప్పతనం కాదు. 

కలం గొప్ప గ్రంధాలను వ్రాస్తుంది. కలం గొప్పతనం కాదు. 

మనం గొప్ప గొప్ప పనులు చేస్తాం. మన గొప్పతనం కాదు...


అన్నింటికి కర్త అయిన ఈశ్వరునిదే ఆ గొప్పతనం. మనం కేవలం నిమిత్త మాత్రులం. ఈశ్వరుని చేతిలో పనిముట్లం.. అని భావిస్తూ సర్వ కర్మలను, కర్మ ఫలాలను ఈశ్వరుని యందు వదిలి భక్తుడు నిశ్చింతుడై యుండాలి...


ఓక రోజు.. కాశి వెళ్ళే ట్రైను కదిలింది. ఆదరాబాదరాగా పరుగెత్తుకుంటూ ఒక పల్లెటూరి వ్యక్తి రెండు పెట్టెలు నెత్తిమీద పెట్టుకొని ఎలాగో శ్రమపడి రైలు ఎక్కాడు. అతడు రొప్పుతూ రోజుతూ, చెమటలు పట్టి ఉన్నాడు. అటూఇటూ చూచి ఒకచోట సీటు ఉంటే కూర్చున్నాడు. కూర్చొని తాను తెచ్చిన పెట్టెలను తన తలపై ఉంచుకొని ప్రయాణం చేస్తున్నాడు. ప్రక్కన కూర్చున్న వ్యక్తి ఈ పల్లెటూరు ఆసామిని అడుగుతున్నాడు. అయ్యా! ఆ పెట్టెలను ఎందుకు నెత్తిమీద పెట్టుకొని మోస్తున్నావు..? నీ సీటు క్రింద పెట్టుకోవచ్చు గదా.. అన్నాడు. దానికా పల్లెటూరి ఆసామి అంటున్నాడు.. "బాబూ! నేను నాకే టికెట్టు తీసుకున్నాను. వీటిని రైలు మోస్తుందో మోయలేదో తెలియదు గదా.. అందుకే నేనే మోస్తున్నాను అని అన్నాడట. దానికా వ్యక్తి అతడి అమాయకత్వానికి నవ్వి.. నాయనా! నిన్నూ, నీ పెట్టెలను అన్నింటిని ఆ రైలే మోస్తుంది. నీవు నెత్తిమీద పెట్టుకున్నా వాటి బరువును రైలే మొయ్యాలి. ఎందుకు అనవసరంగా నెత్తిన పెట్టుకొని హైరాన పడతావు.. క్రింద పెట్టుకో.. ఏం ఫరవాలేదు అన్నాడు. 


అలాగే ... అన్ని భారాలు మోసేవాడు ఆ ఈశ్వరుడు. అనవసరంగా అహంకారాన్ని నెత్తిన పెట్టుకొని అన్నీ నేనే మోస్తున్నానని భ్రమ పడుతూ ఉండరాదు. అన్నీ నావల్లనే జరుగుతున్నవి అనుకోరాదు. ఇదంతా ఒట్టి అహంకారం. ఈ అహంకారాన్ని వదిలితేనే భగవంతుని సాన్నిధ్యం లభించేది.


కనుక కర్మలన్నింటిని ఈశ్వరుని యందే విడిచిపెట్టాలి. అంటే... 


ఈశ్వరుని స్మరిస్తూ కర్మలు ప్రారంభించు.

ఈశ్వరుని స్మరిస్తూనే కర్మలను కొనసాగించు.

ఈశ్వరుని స్మరణతోనే కర్మలను ముగించు...


కర్మఫలాలను గురించి ఆలోచించకు. లభించిన దానిని ప్రసాద బుద్ధితో స్వీకరించు. నేను నిమిత్తమాత్రుడను అని భావించు. కర్త ఈశ్వరుడే అనే నమ్మకంతో ఉండు. ఏమి జరిగినా నిశ్చితంగా ఉండు. నేను చేస్తున్నాను, ఇది నా వల్లనే జరుగుతుంది అనే అహంకారాన్ని వదులు. ఈ అహంకారాన్ని వదలటమే కర్మలను ఈశ్వరుని లో సన్యసించుట. అలాచేస్తే నీవు ఈశ్వరుని చేతిలో మురళివైపోతావు.


ఇలా సర్వ కర్మలను ఈశ్వరుని తో సన్యసించి, ఈశ్వరుని ధ్యానం నే లక్ష్యంగా పెట్టుకోవాలి...


*|| ఓం నమః శివాయ నమః //*

౦ గురించి వక పరిశీలన

 ౦ గురించి వక పరిశీలన. పూర్ణ మని వక భావన ఏది పూర్ణము. శక్తి పూర్ణమా లేక పదార్ధము పూర్ణమా. యీ రెండును కానివి ఏమైనా నున్నది వుంటే అది పూర్ణమా. గణితం ప్రకారం దీనికి విలువ నున్నది లేక సున్నా శూన్యమా. శక్తి పూర్ణ మని వేదం. యీ శక్తి ఈ అని ఆంగ్లం కూడా ఇ అనగా మూల ప్రకృతి యని అవ్యక్త మని  దాని వ్యక్తమైన మూర్ఖపు ప్రకృతి రూపమైన మార్పుగా తెలియుతున్వది. మార్పు లక్షణము కలది కావున మాయ యయని యిది తెలియుట యే పూర్ణము. అన్న మునకు శక్తి లక్షణము కలదు. కాని అన్నం పచించుటవలన వక అగ్ని బియ్యం మును విభజించుట వలన వక లక్షణము అనగా భిన్నమును చేయుట వక లక్షణము పిండి చేయుట వలన వక లక్షణము. యిన్ని విధములుగా చేయుట వలన దేని లక్షణము దానికే. బియ్యం, నూక, పిండి మెుదలగునవి ఎలా విలక్షణముగలవి గా మీర్పుచేయుచున్నామెూ అటు లనే పూర్ణమైన లక్షణము గల ఆత్మ కూడా విభిన్నమైన లక్షణములు గల పదార్థమును ఆశ్రయించి ఆత్మ యెుక్క తత్వమును తెలుసుకొనుచున్నది. తెలిసికొని తిరిగి మిగిలిన కర్మ శేషమును అనుభవించు చున్నది. కర్మ రూపమని అనుభవించుటచేత పూర్ణ మని అది ౦ ఁ గా మారిననూ సగం అర్ధం తెలియును. ప్రకృతి కూడా ఁ తెలిసికొనిన ౦ పూర్ణము. సున్న రెండు సున్నాలు గా మారుతోంది అది విభజించబడి ౩ గా మారుతోంది ౩ E  కలిపి 8 గా మారి అనగా యిచ్చట సూత్రము మూడూ శక్తులు మరొక మూడు శక్తులుగా విభజించినవి కలిపిన 8 రెండు సున్నలు గల ఎనిమిది దిక్కులను వ్యాప్తి చెందుతుంది పూర్ణ లక్షణము.

బ్రహ్మ ముహూర్తం



🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

బ్రహ్మ ముహూర్తం..!! ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ.. దీనికి సరైన అర్థం, పరమార్థం మాత్రం చాలామందికి తెలియదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున అని తెలుసు కానీ.. కరెక్ట్ సమయం మాత్రం చాలామందికి తెలియదు. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి ? బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలని, పూజ చేయాలని, పిల్లలు చదువుకోవాలని ఎందుకు సూచిస్తారు ? బ్రహ్మ ముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యత ? బ్రహ్మి ముహూర్తంలోనే ఎందుకు నిద్రలేవాలి ? ఇలాంటి అనుమానాలన్నింటికీ.. పరిష్కారం దొరికింది. తెలుసుకోవాలని ఉందా.. అయితే.. ఈ ఆర్టికల్ లోకి ఎంటర్ అయిపోండి. బ్రాహ్మి ముహూర్తం సుర్యోదయానికి 48 నిమిషాల ముందు సమయాన్ని బ్రాహ్మి ముహూర్తం అంటారు. రాత్రిభాగంలోని ఆఖరి 48 నిమిషాలను.. సూర్యోదయానికి ముందు 48 నిమిషాలను బ్రహ్మీముహూర్తం అంటారు.  బ్రహ్మీ ముహూర్తం పూజలు, జపాలకు మంత్ర సాధనకు విశిష్టమైన సమయంగా చెబుతారు. విద్యార్థులకు విద్యార్థులు బ్రాహ్మి ముహూర్తం లో లేచి చదువుకుంటే బాగా గుర్తుంటుందని నమ్ముతారు.  మన శరీరంలో జీవ గడియారం ఉంటుంది. దీన్ని అనుసరించే మన జీవక్రియలన్నీ జరుగుతాయి. అలాగే ఉదయం మనలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలు బ్రహ్మీ ముహూర్తంలో చదువుకుంటే చక్కగా గుర్తుంటుందట.  అలాగే ముందు రోజు భరించిన ఒత్తిడులు అన్ని నిద్రలో మరిచిపోతాం కాబట్టి మెదడు ఉత్తేజంతో ఉంటుంది. పరిసరాలు కూడా నిశ్శబ్దంగా ఉంటాయి. ఈ అన్ని కారణాల వల్ల చదివినది మెదడులో జాగ్రత్తగా నిక్షిప్తం అవుతుంది.  ఆయుర్వేదం ప్రకారం రాత్రి తొందరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచేవారికి ఆరోగ్య సమస్యలు రావు. రాత్రంతా చెట్లు వదిలిన ఆక్సిజన్ వేకువ జామున కాలుష్యం బారిన పడకుండా ఎక్కువ పరిమాణంలో మనకు అందుబాటులో ఉంటుంది. వాకింగ్ కు వెళ్లేవారికి ఇది చాల ఉపయోగ పడుతుంది. గృహిణులకు నిద్ర లేచిన దగ్గర నుంచి ఎన్నో పనులు. పిల్లల సంరక్షణ, ఇంట్లో పెద్దవారి సంరక్షణ, వంట పనులు, ఇంటిపనులతో క్షణం తీరిక లేకుండా గడుపుతారు. అలాంటి వారికీ ఒత్తిడి లేని, మానసిక, శారీరక ఆరోగ్యం చాలా అవసరం.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸