5, జనవరి 2021, మంగళవారం

బ్రాహ్మణా సాంప్రదాయ క్యాలండరు 2021

బ్రాహ్మణా సాంప్రదాయ క్యాలండరు 2021 కొరకు క్రింద క్లిక్ చేయండి  


https://drive.google.com/file/d/1W8q4AQbOdKzi0Vh4o3H4Rxd4xt4vKiRn/view?usp=sharing

శ్రీ రామ తీర్థం

 🌹శ్రీ రామ తీర్థం 🌹


   ✍️హిందువులకు ఆరాధ్య దైవం, ఆదర్శ ప్రభువు శ్రీ రామ చంద్ర స్వామి. 


భారత దేశ నలుమూలలా ప్రతి ఒక్క పల్లెలో అయోధ్య రాముని ఆలయం ఉంటుందంటే అతిశయోక్తి లేదు.   భదాద్రికి ( భద్రాచలం) సరి సమానమైన రామ క్షేత్ర అన్వేషణలో ప్రముఖంగా వినిపించిన రెండు క్షేత్రాలు ఒంటిమిట్ట ( కడప జిల్లా), మరియు శ్రీ రామ తీర్థం ( విజయనగరం ). 


పూసపాటి రాజుల రాజధాని నగరంగా చరిత్రలో సుస్థిర స్థానం కైవసం చేసుకొని పాత కొత్త సంస్కృతులకు, పురాతన మరియు నూతన నిర్మాణాలకు కూడలిగా ఉత్తరాంధ్ర లో ఉన్నప్రసిద్ద నగరం  విజియనగరం. ఈ రాజ వంశం వారు నిర్మించిన నూట ఆరు ఆలయాలలో శ్రీ రామ తీర్థం ఒకటి.


 


సన్నటి తారు రోడ్డుకు ఎడమ పక్కన నున్నగా, పచ్చదనం లేకుండా ఉన్న బోడి కొండలు.


కుడిపక్కన నాలుగు వందల సంవత్సరాల క్రిందట నిర్మించిన ఆలయం.

కొద్దిగా ఎత్తులో చుట్టూ ప్రహరీ గోడతో ఉన్న ఆలయ ప్రాంగణానికి ఉత్తరం పక్కన నూతనంగా అయిదు అంతస్థుల గాలి గోపురం నిర్మించారు.


పది ఎకరాల పై చిలుకు విస్తీర్ణంలో ఉన్న "భాస్కర పుష్కరణి", ఈ క్షేత్రంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న స్థలాలలో ఒకటి.

నేడు ఆలయంలో పూజలు అందుకొంటున్న మూల విరాట్టులు ఎవరి కంట పడకుండా వెయ్యి సంవత్సరాలు అజ్ఞాత వాసం చేసినది ఈ సరస్సులోనే !

అందుకే భక్తులు ఈ నీటిని గంగా జల సమానంగా పరిగణిస్తారు.


 


నీరు నిండిన పిడతల పైన ప్రమిదలను ఉంచి దీపం వెలిగించి ప్రార్ధిస్తే మనోభిష్టాలు నెరవేరుతాయి అన్నది భక్తుల విశ్వాసం.

ఇలా దీపాలు వెలిగించడానికి ఈశాన్యం లో శ్రీ లక్ష్మీ నారాయణ రూపాలను నెలకొల్పారు.

పచ్చగా పాచిపట్టినా, తామర పుష్పాలతో, ఆకులతో ఆకర్షణీయంగా ఉన్న కోనేరులో ముఖ పాద హస్తాలను పరిశుబ్ర పరుచుకొని ఆలయం వైపు వెళతారు భక్తులు.


 


 ఉత్తరం వైపు రాజ గోపురం ఉన్నాప్రధాన ద్వారం మాత్రం తూర్పునే !

విరాట్ నిర్మాణాలు లేవు.

ద్వారానికి పైన గుమ్మటం లాగా ఉన్న నిర్మాణాలున్నాయి.

కళింగ ప్రాంత నిర్మాణ శైలి.

ఇలాంటివే శ్రీ కూర్మం, అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాలలో ఉంటాయి.


ద్వారం వద్ద రాతి మీద ఆలయ పురాణ చారిత్రక గాధల వివరాలను చెక్కి భక్తుల కొరకు ఉంచారు.

దాని ప్రకారం క్షేత్ర పురాణ గాధ ద్వాపర యుగం నాటిదిగా అర్ధమౌతుంది.

మాయా జూదంలో ఓడిన పాండు నందనులు అరణ్య వాసానికి తరలి వెళుతున్న సమయంలో శ్రీ కృష్ణుడు వారికి సీతా లక్ష్మణ సమేత శ్రీ రామ విగ్రహాలను ప్రసాదించి, భక్తి శ్రద్దలతో పూజిస్తే వనవాస కాలం చక్కగా గడిచి పోతుంది అని తెలిపారట.


అలానే చేస్తూ వచ్చిన పాండవులు వనవాస ఆఖరి రోజులు ఇక్కడ గడిపి, అజ్ఞాత వాసానికి వెళుతూ విగ్రహ సంరక్షణ,  పూజాదికాల భాద్యత " వేద గర్భుడు" అనే బ్రాహ్మణునికి అప్పగించారట.

నాటి నుండి అనేక శతాబ్దాల పాటు ఆయన వంశం వారే ఇక్కడ నీలాచల పర్వత పై భాగాన పాండవులు నిర్మించిన ఆలయ నిర్వహణా భాద్యతలను చూసుకోనేవారట.

కానీ క్రీస్తు శకం రెండో శతాబ్ద కాలానికి ఈ ప్రాంతంలో ఒక దాని తరువాత ఒకటిగా జైనం మరియు బౌద్ధం ప్రాబల్యాన్ని సంతరించుకొన్నాయి.


వారి విగ్రహారాధనకు వ్యతిరేకులు.

నాటి జైనుల మరియు బౌద్దుల స్థూపాలను, ఆరామ, విహారాల శిధిలాలను పక్కనే ఉన్ననీలా చల , ఘని, దేవభక్తుల కొండల మీద నేటికీ చూడవచ్చును.

తూర్పు చాళుక్య రాజు విమాలదిత్యుని ( 1011 - 1022) కాలం నాటి శాసనం పర్వతం పైన ఆంగ్ల పరిశోధకులకు పంతొమ్మిదో శతాబ్దంలో లభించినది అంటారు.

వారి ప్రభావం వలన  వేద గర్భుని వంశీకులు విగ్రహాలను నీటి మడుగులో దాచి ప్రాంతం విడిచి వెళ్లి పోయారట.

అలా సుమారు వెయ్యి సంవత్సరాలు అజ్ఞాతంగా నీటిలో ఉండిపోయిన శ్రీ రాముడు తిరిగి పదిహేడో శతాబ్దంలో ఆలయ ప్రవేశం చేసిన ఉదంతం కూడా విశేషమైనదే!


ఇక్కడికి సమీపంలోని "కుంభిలాపురం " ( నేటి కుమిలి) రాజధానిగా చేసుకొని పదహారో శతాబ్ద కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించే వారు పూసపాటి వంశం వారు.

నాటి ప్రజలలో చాలా మంది అటవీ సంపద మీద ఆధారపడి జీవనం సాగించేవారట.

అలాంటి వారిలో పుట్టు మూగ అయిన ముదుసలి కూడా ఒకరు.

ఒక నాడు ఆమె అడవిలోనికి వెళ్ళిన  సమయంలో తీవ్ర గాలులతో పెద్ద వర్షం కురిసిందట.

ముసలమ్మ భయపడిపోయి ఒక చెట్టు క్రింద వానకు తడుస్తూ వణుకుతూ రామనామ జపం చేయసాగిందట


ఆ సమయంలో  ఆమెకు శ్రీ రామచంద్రుడు దర్శనమిచ్చి భయపడవలదని, వాక్కును ప్రసాదించి, తను సమీపంలో ఉన్న కోనేరులో ఉన్న సంగతి తెలిపారట.

వాన వెలసిన తరువాత నగరానికి తిరిగి వచ్చిన పుట్టు మూగ మాట్లాడటం తెలిసి పిలిపించుకొన్న రాజు శ్రీ సీతా రామ చంద్ర గజపతి విషయం తెలుసుకొని తరలి వెళ్లి విగ్రహాలను వెలికి తీసి కొండ పైన, క్రింద ఆలయాలను నిర్మించారట.

తీర్ధం ( జాలం) లో లభించిన శ్రీ రామడు  కొలువుతీరిన క్షేత్రంగా "శ్రీ రామ తీర్థం " అన్న పేరోచ్చినది.


 


 ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే అంతర భాగంలో ప్రహరీ గోడకు  ఆనుకొని నలు వైపులా మండపం నిర్మించారు.

బహుశా యాత్రీకులు సేద తీరడానికి ఉద్దేశించి కాబోలు అనిపించింది,

 ఎదురుగా  ధ్వజస్థంభము,బలి పీఠం. ముఖ మండపం లోనికి ప్రవేశ ద్వారం.


ప్రదక్షిణా ప్రాంగణంలో దక్షిణం వైపున పాత ఉప ఆలయాల స్థానంలో పునః నిర్మించిన శ్రీ వైకుంఠ స్వామి మరియు శ్రీ మాధవ స్వామి కొలువై ఉంటారు. 


పడమర వైపున శ్రీ ఆండాళ్ పురాతన ఉపాలయం. 


ఉత్తరాన శ్రీ భూ భుజంగ వరాహ లక్ష్మి నరసింహ స్వామి మరియు శ్రీ వేణుగోపాల స్వామి ఉపాలయాలు ఉన్నాయి. 


రాయి సున్నమూ కలిపి నిర్మించిన మండపాలు, స్థంభాల పైన  ఎలాంటి శిల్పాలు చెక్కడాలు లేవు.


అమ్మవారి ఆలయంలో స్థంభాల అమరిక ప్రత్యేకంగా కనిపించినది. దగ్గర దగ్గరగా అమర్చారు.

వాయువ్యంలో కళ్యాణ మండపం.

ఈశాన్యంలో శ్రీ రామ క్రతు స్థంభం.

ఇక్కడ మాత్రం రెండు స్తంభాలు  ప్రత్యేకంగా కనిపిస్థాయి. పీఠ భాగంలో మరో రెండు స్థంభాల పైన భిన్న రూపాలలో శ్రీ ఆంజనేయుని మలచారు.దశావతార మరియు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రూపాలు కూడా కనిపించాయి.

ప్రాంగణంలో అనేక కూర్మావతార సజీవ రూపాలు తిరుగాడుతూ కనపడతాయి.


ప్రదక్షిణ పూర్తి చేసుకొని విశాలంగా ఉన్న అర్ధ మండపం దాటితే ఉన్న గర్భాలయంలోనాలుగు అడుగుల గద్దె మీద  పుష్ప స్వర్ణా భరణ భూషితులై శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామ స్వామి నయన మనోహరంగా దర్శనమిస్తారు.


సహజంగా మూడు విగ్రహాలకు కలిపి ఒకే మకర తోరణం ఉంటుంది అన్ని ఆలయాలలో !

కానీ ఇక్కడ గమనింప దగిన అంశం ఏమిటంటే,మూడు భాగాలుగా విభజింపబడిన పెద్ద మకర తోరణం విగ్రహాల వెనక అమర్చడం !


ఆలయ చరిత్ర లాగే పక్కన ఉన్న మూడు పర్వతాలు కూడా భిన్నమైన చరిత్రను తెలుపుతాయి. 


 నీలాచలం మీదనే పాండవులు నివాసముండే వారట. దానికి నిదర్శనంగా ఐదు గదులుగా ఉండే కొండ గుహలను "పాండవుల పంచలు " అని, పక్కనే గుహలో ఉన్న గుర్తును " భీముని బుర్ర" అని పిలుస్తారట.

నిరంతరం నీటితో నిండి ఉండే "పాతాల గంగ" , బుద్దుని విగ్రహాలు ఇక్కడ ఉన్నాయట.


పక్కనే ఉన్న దుర్గ లేదా గురుభక్తుల కొండ క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం నుండి క్రీస్తు శకం ఆరో శతాబ్దం వరకూ ఇక్కడ నివసించిన జైనుల స్థూపాలు ఇతర నిర్మాణాలు ఉంటాయట. తదనంతర కాలంలో ప్రతిష్టించిన ఆరు అడుగుల ఎత్తు  శ్రీ దుర్గా దేవి విగ్రహం అదనపు ఆకర్షణగా పేర్కొన్నారు.

చాళుక్య రాజు విమలాదిత్యుని శాసనం ఈ కొండ మీదే లభించినదట.


మూడోది అయిన  ఘని లేదా బౌద్దుల కొండ మీద బుద్దుని విగ్రహాలు, శిధిలావస్థలో ఉన్న ఆరామ విహారాలు, నీటి మడుగు ఉంటాయట.

స్కాంద పురాణం నుండి అనేక గ్రంధాలలో, కీర్తనలలో శ్రీ రామ తీర్థ ప్రాశస్త్యం గురించి పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.

అపర ఆదిశేషుని అంశగా పేర్కొనే శ్రీ వైష్ణవ ఆచార్యులు శ్రీ రామానుజులు శ్రీ రామ తీర్థం సందర్శించినట్లుగా ఆయన గురించి రచించిన తమిళ గ్రంధాలలో ప్రస్తావించబడినది.


ఎందరో కవులు శ్రీ రామ తీర్థం విశిష్టతను తమ రచనలలో కొనియాడారని తెలుస్తోంది.

భావకవి ఆంధ్రా షెల్లీ గా ప్రసిద్దులైన శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు తన తోలి కవిత రచించినదిక్కడే !

అభ్యుదయ కవి ఈ యుగం నాదేనని సగర్వంగా ప్రకటించుకొన్న శ్రీ శ్రీ గారి వివాహం జరిగింది కూడా శ్రీ రామ తీర్థం లోనే !!


ప్రతినిత్యం వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

ధనుర్మాసంలో, పర్వదినాలలో ఈ సంఖ్యా వేల కు పెరుగుతుందని అదే శ్రీ రామనవమి మరియు శివరాత్రి సంబరాలకు లక్షకు పైగా ఉంటుందని తెలిపారు.

శివరాత్రి అత్యంత వైభవంగా జరిపే వైష్ణవ క్షేత్రం శ్రీ రామ తీర్థం.


దీనికి తగినట్లుగా క్షేత్ర పాలకుడు "శ్రీ సదా శివ స్వామి" ఆలయం పక్కనే ఉంది.

చిన్న ఆలయం .

పెద్ద లింగం .

మరోసారి క్షేత్రాన్ని సందర్శించే భాగ్యం కలిగించమని క్షేత్ర పాలకునికి వినమ్రంగా విన్నవించుకొంటే కోరిక నెరవేరుతుందని నమ్మకం.


శ్రీ రామ నవమి, బ్రహ్మోత్సవాలలో లక్షల సంఖ్యలో భక్తులు ఒడిష, ఆంధ్రా ప్రాంతాల నుండి వస్తారు.

విశేష పూజలు, అలంకరణలు, అర్చనలు మరియు ఆరగింపులు ఘనంగా జరుపుతారు.

మూడు మతాలకు కూడలిగా పేర్కొనదగిన శ్రీ రామ తీర్థం విజయ నగరం పట్టణానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది.


సోర్స్ :- విజయనగరం మిత్రులు రామకృష్ణ మరియు చందు గారి దగ్గర తీసుకున్న సమాచారం.

దేవాలయ దర్శనంలో

 _*💫 మన దేవాలయ దర్శనంలో ఉన్న  సాంకేతిక ఏమిటో తెలుసుకుందాం... 🥀*_


_*1. మూలవిరాట్ :* భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి._


_*2. ప్రదక్షిణ :* మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి._


_*3. ఆభరణాలతో దర్శనం :* ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని..._


_*4. కొబ్బరి కాయ :* ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం..._


_*5. మంత్రాలు :* ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే neurons ని ఆక్టివేట్ చేసి డేటా ని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర  నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజపరువస్తాయి._


_*6. గర్భగుడి :* గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు._


_*7. అభిషేకం :* విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం._


_*8. హారతి :* పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు._


_*9. తీర్థం :* ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారు._


_*10. మడి :* తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది.. అందుకే మడి..!_


🙏🇮🇳😷🌳🏵️🌐🤺🥀

తిరుప్పావై ప్రవచనం‎ - 20 వ రోజు

 _*తిరుప్పావై ప్రవచనం‎ - 20 వ రోజు*_ 




🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉




*ఈ సంసార తాపాన్ని తొలగించగలిగేది కేవలం హరి సరస్సు మాత్రమే*

     



☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️




*20. వ పాశురము*



*ముప్పత్తు మూవర్* *అమరర్క్కు మున్ శెన్ఱు*

*కప్పం తవిర్క్కుం కలియే !* *తుయిల్ ఏరాయ్*

*శెప్పం ఉడైయాయ్ !* *తిఱలుడైయాయ్ శేత్తార్క్కు*

*వెప్పం కొడుక్కుం విమలా ! తుయిల్ ఎరాయ్*

*శెప్పన్న మెల్ - ములై* *చ్చెవ్వాయ్ చ్చిఱు మరుంగుల్*

*నప్పినై నంగాయ్ ! తిరువే ! తుయిలెరాయ్*

*ఉక్కముం తట్టొళియుం తందు ఉన్ - మణాళనై*

*ఇప్పోదే ఎమ్మై నీరాట్టు - ఏలోర్ ఎంబావాయ్*



అమ్మను కీర్తిస్తే స్వామికి ఆనందం , మరి అమ్మను కఠినంగా మట్లాడితే స్వామికి కష్టంగా అనిపిస్తుంది , నిన్న మన వాళ్ళు అమ్మను కొంచం కఠినంగా మాట్లాడే సరికి స్వామికి కొంచం కోపం వచ్చింది , అందుచే స్వామి లేచి రాలేదు. ఈ రోజు స్వామిని ఆయనకున్న పరాక్రమాది గుణాలతో కీర్తిస్తారు , ఆయనలో ఉండే జ్ఞానం , శక్తి , బలం , ఋజుత్వం ఇలాంటి గుణాలతో కీర్తిస్తారు. అయినను లేవలేదని , ఆయనకు ఆనందాన్నిచ్చేలా అమ్మను కీర్తిస్తారు.


ఆండాళ్ తల్లి స్వామిని మేల్కొనడానికి ఆయన వైభవాన్ని చెబుతున్నారు , *"ముప్పత్తు మూవర్ అమరర్క్కు"* ముప్పై మూడు వర్గాల దేవతలను *"మున్ శెన్ఱు"* ఆపద రానికంటే ముందే వెళ్ళి కాపాడే *"కప్పం తవిర్క్కుం కలియే !"* గొప్ప బలం కలవాడివే. *"తుయిల్ ఏరాయ్"* లేవవయ్యా. చావు అంటూ లేని దేవతలనేమో వారు పిలవకముందే వెళ్ళి కాపాడుతావు , ఏమాత్రం కోరిక లేకుండా , కేవలం నివ్వు ఆనందంగా ఉంటే చూసిపోవాలని కాంక్షించే మాలాంటి వాళ్ళను మాత్రం కాపాడవా , మేం నీదగ్గరికి రావడం తప్పైందా.


 *"శెప్పం ఉడైయాయ్! "* సత్య పరాక్రమశాలీ , అడిన మాట తప్పని వాడా , నిన్న మాతో అందరూ కలిసి రమ్మని చెప్పి , మాట ఇచ్చి , ఇప్పుడు నీ చుట్టూ తిప్పుకుంటున్నావా , ఎమైంది నీ మాట. *" తిఱలుడైయాయ్"* సర్వలోక రక్షణ సామర్థ్యం కలవాడా !, *"శేత్తార్క్కు వెప్పమ్కొడుక్కుం విమలా !"* శత్రువులకు దుఖాఃన్ని ఇచ్చే నిర్మలుడా , ఏ దోశం అంటని వాడా. *"తుయిల్ ఎరాయ్"* నిద్ర లేవయ్యా.


అయితే స్వామి లేవకపోయే సరికి , అయితే నిన్న వీళ్ళు అమ్మను కొంచం కఠినంగా మాట్లాడినందుకు స్వామికి కోపం వచ్చిందని గమనించి అమ్మను కీర్తిస్తారు ఇలా. *"శెప్పన్న మెల్ - ములై చ్చెవ్వాయ్ చ్చిఱు మరుంగుల్"* సముదాయ అంగ సౌందర్యం కల్గి , *"నప్పినై"* స్వామి సంబంధంతో *"నంగాయ్ !"* పరి పూర్ణమైన అందం కలదానా ! *"తిరువే !"* సాక్షాత్తు నీవే లక్ష్మివి *"తుయిలెరాయ్"* అమ్మా మేల్కో. 


వీళ్ళ ప్రార్థనకి అమ్మ కరిగి , లేచి వీళ్ళ దగ్గరకు వచ్చి , ఏం కావాలర్రా అని అడిగింది. *"ఉక్కముమ్"* స్నానానికి తర్వాత మాకు స్వేదం ఏర్పడితే దాని అపనౌదనానికి విసనకర్ర కావాలి , *"తట్టొళియుమ్"* స్నానం తర్వాత అలకరించు కోవడానికి ఒక నిలువుటద్దం కావాలి , *" తందు"* ఈ రెండు ఇచ్చి *"ఉన్మణాళనై"* నీ స్వామిని *"ఇప్పోదే"* ఇప్పుడే *"ఎమ్మై"* మాతో కలిపి *"నీరాట్టు"* నీరాడించు. ఇలా అడగటం మనకు కొంచం ఎలాగో అనిపిస్తుంది. బాహ్యంగా చూస్తే తప్పు కదా అనిపిస్తుంది. కాని దోషమేమి లేదు.


పురుషుడు ఆయనొక్కడే మిగతా జీవ వర్గం అంతా ఆయనకు చెందిందే. అందులో కొందరు ముందు ఉన్న వారుంటారు , కొందరు వెనక ఉన్న వారుంటారు. ముందున్న వారు వెనక వాళ్ళకు మార్గ నిర్దేశం చేస్తారు. అక్కడ పరమ పదంలో నిత్యశూర వర్గానికి చేందిన వారిలో మొదటిదైన లక్ష్మీదేవి , ఆ తత్వాన్ని తెలిసిన వారు , ఆ తత్వాన్ని సరిగా చూప గలిగిన వారు. మనం కొత్తగా ఒక ఊరుకి వెళ్ళి అక్కడ చెఱువులో స్నానం చేయాలంటే ఆ వూరి గురించి బాగా తెలిసిన వారి సలహాతో చేస్తాం కదా , అలాగే. 


కులశేఖర ఆళ్వార్ పరమాత్మను గురించి చెబుతూ


*"హరి సరస్సివి గాహ్య ఆపీయ తేజోజలౌగం*

 *భవమరు పరి ఖిన్నః ఖేదమద్య త్యజామి"*

 

హరీ అనేది ఒక గొప్ప సరస్సు , సంసార తాపాన్ని తొలగించ గలిగేది అదే. అందులో అందరూ మునగాల్సిన వాళ్ళే. తాపం తగ్గాలనుకొనేవారంతా అక్కడే మునగాలి , వీళ్ళు వాళ్ళు అని నియమం లేదు. జీవులమైన మనకు కానీ పరమ పదంలోని నిత్యశూరులకు గాని ఉన్నది ఒకే సరస్సు , అందులో మునిగితే ఈ సంసారంలో ఉన్న తాపం అంతా తొలుగుతుంది.  


ఆ హరి సరస్సు గురించి తెలిసిన దానివి , నీవు మార్గం చూపిస్తే మెం దాంట్లో ప్రవేశించగలం అని , అమ్మ ఆండాళ్ తల్లి నీళాదేవిని అదే కోరుతుంది. పరమాత్మను చేరటానికి అమ్మ ఒక ప్రాపకురాలుగా పని చేస్తుంది. భగవంతుని యోక్క కళ్యాణగుణాల జలాలలో మనం నీరాడుతాం. దాన్నే మనకు తిరుప్పావై అందిస్తోంది. ఇప్పుడు అమ్మ కూడా వీళ్ళతో కల్సి మార్గ నిర్దేశం చేస్తుంది. రేపటి నుండి స్వామిని అందరూ కల్సి మేల్కోల్పుతారు .

కాళిదాస మహాకవి

 కొన్ని భోజ కాళిదాస కథలలో మహాకవిని స్త్రీ లోలుడిగా చిత్రీకరించారు.కవిగా,లలిత శృంగార రస పోషణ లో 

ఆయన అందె వేసిన చెయ్యి కావటం వల్ల ఇలాంటి అపోహ కలిగిందా? లేక కాళీ  ఉపాసనతో పాటు కేళీ పిపాస 

కూడా ఆయన జీవితం లో భాగంగా చెప్తే ఈ కథలు మరీ ఆసక్తి కరంగా వుంటాయని యిది ఈ కథలకు జోడించ 

బడిందా? లేక 'ఎంత వారలయినా కాంత దాసులే' అన్న లోకోక్తి ని కాళిదాసు కూడా పూర్తిగా అనువర్తించాడా?

చెప్పడం కష్టం.


ధారానగరం లో రమణీ మణి అనే రాజ నర్తకి వుండేది. ఆమె సౌందర్యానికి నాట్య ప్రతిభకీ దాసుడై రాజు ఆమెను తన ఉంపుడుగత్తె గా వుంచుకున్నాడు.ఆమెకు కాళిదాసు కవిత్వమంటే చాలా అభిమానం.ఆయనతోనూ ఆమెకు సంబంధాలుండేవి.ఈ రహస్యం ఆమె రాజుకు తెలియకుండా జాగ్రత్త పడింది.

అయినా కొన్నాళ్ళకు రాజుకు అనుమానం వచ్చింది. ఆయన దాన్ని తెలుసుకునేందుకు ఒక ఉపాయం చేశాడు

రాజు ఆమె భవనానికి వచ్చినప్పుడు గోడ మీద శ్లోక పాదం వ్రాశాడు.


'కుసుమే కుసుమోత్పత్తి: శ్రూయతే న తు దృశ్యతే'

అర్థము:-ఒక పువ్వులో నుంచి మరో పువ్వు పుట్టటం వినటమే గానీ ఎక్కడా కనబడదు. 


ఈ శ్లోకం పూర్తిచేసిన వారికి అక్షర లక్షలు యిస్తానని భోజుడు రమణి తో చెప్పాడు.ఒక వేళ కాళిదాసు ఇక్కడికి వచ్చినట్టయితే తప్పక పూర్తి చేస్తాడు,అప్పుడు రహస్యం బట్ట బయలవుతుందని ఆయన ఉద్దేశ్యం 

యింత పెద్ద బహుమతి అంటే రమణికి ఆశ పుట్టింది.

ఈసారి కాళిదాసు వచ్చినప్పుడు ఆమె గోడమీది శ్లోక పాదం చూపించి నా కోసం దీనిని పూర్తి చేయండి అని కోరింది.ఇదేమీ తెలియని కాళిదాసు చెప్తాను రాసుకో అని 


'బాలే, తవ ముఖాంభోజే దృష్టం యిందీవర ద్వయం'

అర్థము:-- కానీ ఓ ముద్దరాలా యిప్పుడు నిన్ను చూడగా,నీ ముఖ మనే తామరపువ్వులో నీ కన్నులనే నీలి కలువలు పుట్టినట్టు కనిపిస్తున్నాయి సుమా!అన్నాడు మహా కవి.


అంత చక్కని పూరణ వినగానే రమణికి మతి పోయింది.ఈ పూరణ రాజుకు చూపిస్తే తనకు అక్షర లక్షలు ఖాయం.అనుకోని దురాశ తో కాళిదాసు నిద్రిస్తుండగా ఆయన తల నరికేసి శవాన్ని దాచేసింది.

రాజుగారు వ్రాసిన దానికిందే తన చేత్తో కాళిదాసు పూరణను కొంచెం మార్చి 'బాలే' అనే పదం కాక రాజును వుబ్బేద్దామని 'రాజే!'అని వ్రాసింది


కుసుమే కుసుమోత్పత్తి: శ్రూయతే న తు దృశ్యతే 

రాజే,తవ ముఖాంభోజే దృష్టం యిందీవర ద్వయం 

అర్థము:-- ఒక పువ్వులోనుంచి యింకొక పువ్వు పుట్టటం వినడమే గానీ ఎక్కడా కనబడదు.కానీ యిప్పుడు నిన్ను చూస్తె రాజా!నే ముఖమనే కమలం లో కన్నులనే నల్ల కలువల జంట కనబడుతున్నది.


రాజు రానే వచ్చాడు పూరణ చూసి ఎవరు పూరించారు?అని అడిగాడు యింకెవరు నేనే అని బొంకింది.

రాజు ఆమె చెంప చెళ్ళు 

మనిపించాడు.దుర్మార్గురాలా నీ అబద్దం నమ్మటానికి నేను మూర్ఖుడ ననుకున్నావా?.యిది కాళిదాసు వ్రాసినదని స్పష్టంగా తెలుస్తూంది.ఎటొచ్చీ నీ బుద్ధి హీనత వల్ల 'బాలే'

అన్న మాటను మార్చి 'రాజే' అని వ్రాశావు.ఆ మాత్రం తో నేను బుట్టలో పడిపోతాననుకున్నావు.కానీ 'రాజన్'అనే సరయిన సంబోధనకు బదులు నీ సొంత తెలివి నుపయోగించి 'రాజే' అని తప్పు రాసి నీ దొంగ బుద్ధి ని నువ్వే ప్రకటించు కున్నావు.చెప్పు యింతకూ కాళిదాసు ఎక్కడ?అని నిలదీశాడు.

రమణి భయపడిపోయి తప్ప్పు ఒప్ప్పుకొని జరిగిన దంతా చెప్పింది.కాళిదాసు మరణించాడన్న వార్త రాజు నమ్మలేక పోయాడు.రమణి కాళిదాసు శవాన్ని చూపగానే రాజు మూర్ఛ పోయాడు.కాసేపటికి తేరుకొని 

తన యిష్ట దేవత భువనేశ్వరీ దేవిని ప్రార్థించాడు.నా జీవితం లో మిగిలి వున్న ఆయువు లో సగం ఈ కవీశ్వ రుడికి ధార పోస్తాను.ఈయనను బ్రతికించు తల్లీ అని ప్రార్థించాడు.దేవి కరుణతో కాళిదాసు లేచి వచ్చాడు.రాజా నీ ఆయువు లో సగం ధారపోసి నన్ను బ్రతికించావు.నా శేష జీవితం నీకే అంకితం చేసి నీ ఋణం తీర్చుకుంటాను ఏమి చెయ్యాలో ఆజ్ఞాపించు. అన్నాడు కవిరాజు.కవీశ్వరా నువ్వు లేకుండా నేను జీవించ లేను,జీవించినా అటువంటి నిస్సార మైన జీవితం నాకు వద్దు.మనం జంటగా ఒక కావ్య రాద్దాం 

నీ పేరూ,నాపేరూ శాశ్వతంగా చరిత్ర లో నిలిచి పోతుంది.అన్నాడు రాజు.

తర్వాత యిద్దరూ కలిసి 'చంపూ రామాయణ కావ్యాన్ని ప్రారంభించారు.(చంపూ కావ్య మంటే శ్లోకాలూ,గద్యాలూ రెండింటి తో చెప్పబడ కావ్యం)సరళంగా సాగే ఈ చక్కని గ్రంథం 'భోజ చంపువు'గా ప్రచారం పొందింది.దీన్ని ఈనాటికీ సంస్కృత విద్యార్థులు తమ తొలి అధ్యయన గ్రంథాలలో ఒకటిగా చదువుకుంటారు.అయితే ఈ రామాయణం 'సుందరకాండ' వరకే భోజ,కాళిదాసుల రచన.అక్కడిదాకా వ్రాసి యిద్దరూ ఒకే సారి మరణించారు.మిగిలిపోయిన యుద్ధ కాండను ఆ తర్వాత  16వ శతాబ్దం లో లక్ష్మణ సూరి అనే ఆంధ్ర  దేశ పండితుడు పూర్తి  చేశాడట...

-------------------   శుభరాత్రి   ----------------------------

పంతొమ్మిదవ రోజు పాశురం*_

 _ *తిరుప్పావై పంతొమ్మిదవ రోజు పాశురం*_ 


 


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

 


 

*🌴19. వ పాశురము🌴*



    *కుత్తువిళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్ మేల్* 

    *మెత్తెన్ఱ పఞ్చశ యనత్తిన్ మేలేఱి ,*

    *కొత్తలర్ పూఙ్కుళల్ నప్పిన్నై కొఙ్గైమేల్* 

   *వైత్తుక్కి డన్దమలర్* *మార్ పా ! వాయ్ తిఱవాయ్*

    *మైత్తడ జ్కణ్నినాయ్ నీ యున్మణాళనై*

    *ఎత్తనై పోదుమ్ తుయిలెళ వొట్టాయికాణ్* 

    *ఎత్తనై యేలుమ్ పిరివాత్తగిల్లాయాల్*

    *తత్తువ మన్ఱుతగవేలో రెమ్బావాయ్*



*🌳భావం :🌳*



గుత్తి దీపపు కాంతులు నలుదిశలా వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్లు గల మంచము మీద అందము , చలువ , మార్దవము , పరిమళము , తెలుపులనే - ఐదు గుణములు కలిగిన హంస తూలికా తల్పముపై పవ్వళించియుండు గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన శిరోజములు కలిగిన నీళాదేవి యొక్క స్తనములను తన విశాల వక్షస్థలముపై వైచుకొని పవళించియున్న ఓ స్వామీ ! నోరు తెరచి ఒక్క మాటైననూ మాట్లాడకూడదా ? లేక కాటుకచే అలంకరింపబడిన విశాలమైన నేత్రములు కల ఓ నీళాదేవీ ! జగత్స్యామియైన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుట కనుమతింపకున్నావు ! క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే ? ఇది నీ స్వరూపమునకు , నీ స్వభావమునకును తగదు. నీవలె మేము కూడా అతనికి అనన్యార్హ శేషభూతులమేకదా ! కాన కరుణించి కొంచెమవకాశమీయము తల్లీ ! అట్టి అవకాశము నీవిచ్చితివేని మేము చేసే యీ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్కైంకర్యరూప మంగళ వ్రతముగా సాంగోపాంగముగ సమాప్తి చెందును. ఇందేమాత్రమూ సంశయము లేదు అని ఆండాళమ్మగారు నీళా శ్రీకృష్ణులను వేడుకొంటున్నారు.  




*☘️అవతారిక :☘️*




స్వామిని కీర్తించటానికి వచ్చామని , తన సుకుమారమైన చేతులకున్న గాజుల మధుర ధ్వనితో తలుపును తెరువుమని నీళాదేవిని ఆండాళ్ తల్లి ప్రార్ధించింది. ముందు (ఆ పాశురంలో) ఇప్పుడీ మాలికలో - ఆండాళమ్మగారి ప్రార్ధన నాలకించి నీళాదేవి తలుపు తెరవబోగా , మనవారి కెదురుగా ముందు యీమె వుండరాదని శ్రీకృష్ణుడు యీమెను తలుపు తెరవనీయక ఆమెను బిగ్గ కౌగలించి పడకనుంచి లేవనీయకయుండే శ్రీకృష్ణుని మేల్కొలపమని అతడు మాట్లాడకయుండగా - అతనిని మేల్కొలుపుమమ్మాయని ఆండాళమ్మగారు నీళాదేవిని పదేపదే వేడుకొంటున్నారు.         



*🌹19. వ మాలిక🌹*



*(కాపిరాగము - ఆదితాళము)*


ప.. తగదిది నీకిది తరుణిరొ వినవే !

    జాగు సేయకే శ్రీకృష్ణుని లేపవె !


అ..ప. తగునా ? నీ స్వరూప స్వభావమ్ములకు 

    మగని విశ్లేషమును సహింపజాలవె !

    దీప కాంతులెల్లెడళ విరియగా 

    ఆ పంచగుణముల పడకను శయనించి 

    సుపుష్ప సుగంధ కచ కుచ శోభిత 

    శ్రీ పద్మాక్షుని మాటాడనీయవె !

    ఓ పద్మాక్షీ ! విభుని లేపవే !