8, జులై 2023, శనివారం

పుత్రులు

 పుత్రులు ఏడు రకాలుగా జన్మిస్తారు.........!!


1) పూర్వ జన్మలో తన సొమ్మును దాచమని ఒక వ్యక్తికి ఇచ్చి, అది తీసుకోకుండానే మరణించిన వాడు, తాను దాచిన సొమ్ము తీసుకోవడానికి ఆ ఇంట్లో పుత్రుడుగా జన్మిస్తాడు.


2) తాను పూర్వ జన్మయందు బాకీపడిన అప్పును (ఋణాన్ని) చెల్లించుటకు పుత్రుడుగా జన్మిస్తాడు.


3) పూర్వ జన్మలోని శత్రుత్వం తీర్చుకోవడానికి ఈ జన్మలో పుత్రునిగా జన్మిస్తాడు.


4) పూర్వ జన్మలో తనకు ఒకడు అపకారం చేసాడు. దానికి ప్రతీకారం తీర్చుకోలేదు. ఈ జన్మలో ప్రతీకారం తీర్చుకోవడానికి అపకారం చేసినవాడికి పుత్రునిగా జన్మిస్తాడు.


5) పూర్వ జన్మలో తాను అనుభవించిన సేవ - సుఖములకు బదులు తీర్చడానికి పుత్రునిగా జన్మించి తల్లిదండ్రులకు సేవ చేస్తాడు.


6) పూర్వ జన్మలో తాను ఏ వ్యక్తి నుండి ఉపకారం పొందుతాడో, ఆ ఉపకారానికి బదులుగా ఉపకారం చేయుటకు పుత్రునిగా జన్మిస్తాడు.


7) ఏమీ ఆపేక్షించనివాడు కూడా పుత్రునిగా జన్మించి, తన విధులను తీరుస్తాడు.


ఇలా పుత్రులుగా జన్మించినవారు కర్మానుసారముగా తమ పనులు పూర్తికాగానే మరణిస్తారు, లేదా దీర్ఘకాలం జీవించి ఉపకారం చేయడమో, ప్రతీకారం తీర్చుకోవడమో చేస్తారు. కేవలం పుత్రులే కాదు, భార్య - భర్త - సోదరుడు - పనిమనిషి - ఆవు - కుక్క మొదలైన పశువులు కూడా కర్మరుణం తీర్చుకోవడానికి మనతో ఉంటారు. ఋణము తీరగానే వదిలి వెళ్ళడమో, పరలోకానికి చేరడమో జరుగుతుంది.

(సేకరణ)

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 110*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 110*


మలయకేతు వద్దనుంచి కబురురాగానే చాలా సంతోషించాడు రాక్షసామాత్యుడు. ఇటీవలకాలంలో ఎడముఖం పెడముఖంగా ఉంటున్న రాజే స్వయంగా కబురుపెట్టేసరికి రాక్షసుడు ఆ ఉత్సాహంలో మంచి దుస్తులు ధరించి ముస్తాబయ్యాడు. అయితే ధరించడానికి ఆభరణాలు లేకపోవడంతో ప్రతీహారి బలవంతం మీద అంతకు ముందు వర్తకుల వద్దనుంచి తాను కొన్న ఆభరణాలను - అవి పర్వతకునివని తెలియనందున - ధరించి మలయకేతు సుముఖానికి బయలుదేరాడు. 


రాక్షసుడు శిబిరంలో అడుగుపెడుతూనే, 'అత్తవారింటికి వెళ్తున్నానని' చెప్పి బయలుదేరిన సిద్ధార్థకుడిని అక్కడ చూసి ఆశ్చర్యంతో "నీవింకా వెళ్లలేదా ?" అని ప్రశ్నించాడు. 


సిద్ధార్థకుడు బెదురుచూపులు చూస్తూ "వెళ్లేలోగానే వీళ్ళకి దొరికిపోయాను" అని చెప్పాడు. 


ఆ ప్రశ్న-జవాబు విని మలయకేతు, బాగురాయణుడు మొహాలు చూసుకున్నారు. అంతలో మలయకేతు దృష్టి రాక్షసుడు ధరించిన ఆభరణాల మీద పడింది. అవి మరణించిన తన తండ్రి ఆభరణాలని గుర్తించగానే ఆవేశంతో అతని మొహం జేవరించింది. 


రాక్షసుడు ఆ మార్పులను గమనించకుండా "కుమారా ! నా భృత్యుడు అమాయకుడు. అతడిని వదిలిపెట్టు" అని చెప్పాడు 'అతడు అత్తవారింటికి వెళ్తున్నాడన్న' భావనతో. 


"అతడు అమాయకుడని అంటున్నారంటే, మీరు నేరస్థులని అంగీకరిస్తున్నారా ?" అని ప్రశ్నించాడు మలయకేతు తీవ్రస్వరంతో. 


రాక్షసుడు ఉలిక్కిపడి "నేను... నేరస్తుడినా ...?" అన్నాడు తడబాటుతో. 


"కాదా ? అలా అయితే ఈ లేఖని చదివి ఆ మాట చెప్పండి" అంటూ లేఖను రాక్షసుని మీదకు విసిరాడు మలయకేతు. 


రాక్షసుడు నివ్వరబోయి ఆ లేఖని పరిశీలిస్తుంటే, సిద్ధార్థకుడు బెదురుచూపులు చూస్తూ "ప్రభువుల వారికి భయపడి నిజం చెప్పక తప్పలేదు. ఆ లేఖలోని ప్రతిమాటకీ వివరంగా వీళ్ళకి చెప్పాను..." అంటూ తాను అంతకుముందు వాళ్లకు వివరించిన విధంగానే రాక్షసునికి కూడా ప్రతి పదార్థాన్ని వివరించి చెప్పేశాడు. 


అదంతా విన్న రాక్షసుడు దిగ్భ్రాంతుడవుతూ "ఇదంతా ఏదో కుట్ర...." అన్నాడు. 


"అవును కుట్రే.... ఈ లేఖ రాసిన దస్తూరి మీ మిత్రుడు శకటదాసుది... లేఖపై మీ నామాక్షర అంగుళీకయకం ముద్ర ఉన్నది. ఒకనాడు మీకు మేము కానుకగా పంపిన ఆభరణాలు ఇప్పుడు యీ లేఖతో పాటు చంద్రగుప్తునికి బహుమానంగా పంపబడుతున్నాయి. మీ మిత్రుడు శకటదాసు ఇంతకు పూర్వమే కుసుమపురంవైపు మారువేషంలో పలాయనం చిత్తగించాడని, మీరొచ్చే ముందే మా చారులు వార్త తెచ్చారు... అయినా ఇదంతా కుట్రే... మీరు నిరపరాదులే... కానీ... మీరు ధరించిన ఆభరణాలు మా తండ్రి పర్వతకుల వారివి.... విషకన్య ప్రయోగం జరిగినరాత్రి వారు ఆ ఆభరణాలే ధరించారు. అవి ఇప్పుడు మీ ఒంటిమిదికి, ఎలా వచ్చాయో చెప్పగలరా రాక్షసా....?" అని ప్రశ్నించాడు మలయకేతు తీవ్రస్వరంతో. 


తాను ధరించిన ఆభరణాలు పర్వతకుడివని వినగానే... రాక్షసునికి మతిపోయినట్లయింది. ఏం మాట్లాడాలో పాలపోక వెర్రిచూపులు చూస్తూ "ఇందులో .... చాణక్యుని కుతంత్రమేదో కనిపిస్తోంది...." అన్నాడు హీనస్వరంతో. 


"చాణక్యుడా ! మాటి మాటికీ అతని పేరు అడ్డుపెట్టుకోవడం మీకు అలవాటైపోయిందా ? విషపూరిత ఫలాలతో సర్వార్ధసిద్ధి చావుకి కారణం మీరు కాదా ? జీవసిద్ధి చేత విషకన్యను సృష్టింపజేసినది మీరు కాదా? దేనికోసం... మగధ మహామాత్య పదవికోసమేనా ....?" అని గర్జించాడు మలయకేతు.


రాక్షసుడు ఖిన్నుడవుతూ "అబద్దం .... కుమారా .... ఇదంతా కుట్ర. ఆ చాణక్యుని దుస్తంత్రం. నాకొక అవకాశం ఇస్తే యీ కుట్రలను నిరూపిస్తా...." అన్నాడు ఆవేదనగా. 


"ఇంకొక్క అవకాశమివ్వాలా ? ఎందుకూ... నా తలగొట్టి చంద్రగుప్తునికి నువ్వు సమర్పించుకోవడానికా...?" 


"కుమారా ....!" 


"చీఛీ... నన్నలాపిలిచి ఆ మాటను అపవిత్రం చెయ్యకు... నా తండ్రికి పూర్వస్నేహితుడివని తండ్రిలాంటివాడివని చేరదీసి ఆదరించాను. కానీ ఒక పథకం ప్రకారం ఆ చంద్రగుప్తుని తొత్తుగా నా పంచన చేరావని ఊహించలేదు... నీ మొహం చూడాలంటే అసహ్యం వేస్తోంది. ఫో.... శ్రోత్రియ బ్రాహ్మణుడివనీ, నా తండ్రికి మిత్రుడవని దయతలచి నిన్ను ప్రాణాలతో వదిలిపెడుతున్నాను. ఫో... నిన్నూ, నీ చంద్రగుప్తుడినీ కదనరంగంలోనే ఎదుర్కొని నా కరవాలంతోటే బదులు చెప్తాను. ఫో...." అని గర్దించాడు మలయకేతు ఆగ్రహావేశంతో. 


అనూహ్యమైన అవమాన క్లేశంతో, నిరాశ నిస్సృహలతో జీవచ్ఛవంలా బయటికి నడిచాడు రాక్షసుడు. అతడి వెనుకనే జారుకున్నాడు సిద్ధార్థకుడు. 


మలయకేతు వొళ్ళు తెలియని ఆవేశంతో తన సేనాధిపతి రాజశేఖరుని పిలిచి "కులూత, మలయా, కాశ్మీర రాజ్యాధీశులు మా రాజ్యాన్ని ఆశించారు. ఆ ముగ్గురినీ వారి శిబిరాలలోనే తలలు నరికి సంహరించండి. సింధు, పారిశీక రాజులు మా గజబలాన్ని ఆశించారు వాళ్ళని మన ఏనుగుల చేత తొక్కించి చంపించండి" అని ఆజ్ఞాపించాడు.


రాజశేఖర సేనాని తన రాజాజ్ఞని రహస్యంగా అమలుపరిచాడు. అనంతరం ఆయా సైన్యాధిపతులకు విషయం తెలిసి మలయకేతు సైన్యాల మీద దాడి చేశారు. ఆ దాడిలో రాజశేఖర సేనానితో పాటు మలయకేతు సైన్యం చాలా భాగం నశించింది. అదే సమయంలో మగధ సైన్యం భద్రభట, డింగరాత్త, బలగుప్తాది సేనాధిపతుల సారథ్యంలో వారి మీద దాడి చేసింది. కులూత, మలయా, కాశ్మీర, సింధు, పారిశీక రాజన్యులను మలయకేతు చంపించడం చేత ఆయా రాజ్యాలసేనాధిపతులు చంద్రగుప్తుని సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ సంధి చేసుకున్నారు. 


"జయహో.... చంద్రగుప్త సార్వభౌములకూ... జయహో... జయహో...." 


విజయోత్సవ నినాదాలు తన శిబిరానికి సమీపంలో ప్రతిధ్వనిస్తుంటే వింటున్న మలయకేతు విస్తుబోయాడు. ఆ నినాదాలు ఎవరు చేస్తున్నారో, బయట ఏం జరుగుతున్నదో కూడా అతని ఊహకి అందడం లేదు. 


"బాగురాయణా.... బాగురాయణా... వినయా.... వినయా..." అంటూ వాళ్లకోసం బిగ్గరగా కేకలు పెట్టాడు మలయకేతు. మరుక్షణం గంభీరంగా శిబిరంలోకి ప్రవేశించాడు బాగురాయణుడు. అతడి వెనక మగధ సైనికులు.


"మలయకేతుల వారు మన్నించాలి.... తమరిని ఖైదు చెయ్యమని ఆజ్ఞ..." చెప్పాడు బాగురాయణుడు భావరహితంగా. 


మలయకేతు అదిరిపోతూ "ఆజ్ఞా... ? ఎవరి ఆజ్ఞ..." అడిగాడు విస్మయంగా. 


మరుక్షణం మరోవైపునుంచి వినయుడు శిబిరంలోకి అడుగుపెడుతూ "మా గురుదేవులు ఆర్య చాణక్యుల వారి ఆజ్ఞ...." చెప్పాడు గంభీరంగా. 


అంతే, చాణక్యుడి పేరు వింటూనే భయంతో కుప్పకూలిపోయాడు మలయకేతు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

 శ్రీ కృష్ణదేవరాయలు విరచించిన *ఆముక్తమాల్యద* గ్రంథానికి శ్రీ వేదం వెంకట్రాయశాస్త్రి గారు ఒసంగిన వ్యాఖ్యాంతం గురించిన ఓ ఆర్యోక్తి ఈ *షకటప* పదం కూడుకొన్నదై కనబడ్డది. ఇదిగో ఆ ఆర్యోక్తి.


సీ. శృంగార నైషధ శ్రీ విరాజిల్లంగ సర్వంకషవ్యాఖ్య సలిపినాడు. సర్వాంధ్ర బుధపరిషత్ 'షకటప' మహోపాధ్యాయ బిరుదంబు నంగినాఁడు, యువరాజు చేత రత్నోజ్జ్వల సౌవర్ణ వలయంబు దుశ్శాలు వడసినాడు, నెల్లూరునగర మనీషులచే నవమల్లి నా ధాఖ్య భాసిల్లినాఁడు,

ఆదిత్యనాథ్ ప్రొఫైల్.

 యోగి ఆదిత్యనాథ్ !!


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కాషాయ వేషధారణలో కేవలం "సన్యాసి" మాత్రమేనని చాలా మంది అనుకుంటారు.


 అయితే వాటి గురించిన వాస్తవాలు తెలుసుకోవాలంటే కింద చదవండి....మీకు నచ్చితే షేర్ చేయండి.


 ▪️ అజయ్ మోహన్ బిష్త్ మారుపేరు (పదవీ విరమణ తర్వాత)

 యోగి ఆదిత్యనాథ్

 జన్మస్థలం - ఉత్తరాఖండ్ దేవభూమి


  ▪️HNB గర్వాల్ యూనివర్సిటీ చరిత్రలో అత్యధిక మార్కులు (100%)


 ▪️యోగి జీ గణిత విద్యార్థి, అతను B.Sc గణితం బంగారు పతకంతో ఉత్తీర్ణత సాధించాడు.


 ▪️ 1972లో ఉత్తరాఖండ్‌లోని దేవభూమిలోని వెనుకబడిన పంచూర్ గ్రామంలో చాలా పేద కుటుంబంలో జన్మించారు.  అతనికి ఇప్పుడు 50 ఏళ్లు.


 ▪️భారత సైన్యంలోని పురాతన గూర్ఖా రెజిమెంట్ యొక్క ఆధ్యాత్మిక గురువు.


  ▪️ నేపాల్‌లో యోగి మద్దతుదారుల పెద్ద సమూహం, యోగిని గురు భగవాన్‌గా ఆరాధిస్తారు.


 ▪️ మార్షల్ ఆర్ట్స్‌లో అద్భుతమైన నైపుణ్యం.  ఏకకాలంలో నలుగురిని ఓడించిన రికార్డు.


 ▪️ సుప్రసిద్ధ ఈతగాడు.  ఎన్నో పెద్ద నదులను దాటారు.


 ▪️కంప్యూటర్‌ను కూడా ఓడించే అకౌంటింగ్ నిపుణుడు.  ప్రముఖ గణిత శాస్త్రవేత్త శకుంతలా దేవి కూడా యోగిని మెచ్చుకున్నారు!


  ▪️ రాత్రిపూట కేవలం నాలుగు గంటల నిద్ర.  అతను ప్రతిరోజూ ఉదయం 3:30 గంటలకు లేస్తాడు.


   ▪️ యోగా, ధ్యానం, గౌశల, ఆరతి, పూజ రోజువారీ దినచర్య.


  ▪️ రోజుకు రెండు సార్లు మాత్రమే తింటారు..

  పూర్తిగా శాఖాహారం.  ఆహారంలో దుంపలు, వేర్లు, పండ్లు మరియు దేశీయ ఆవు పాలు ఉంటాయి.


 ▪️ అతను ఇప్పటి వరకు ఏ కారణం చేత ఆసుపత్రిలో చేరలేదు..


  ▪️ యోగి ఆదిత్యనాథ్ ఆసియాలోని అత్యుత్తమ వన్యప్రాణి శిక్షకులలో ఒకరు, అతనికి వన్యప్రాణులంటే చాలా ఇష్టం.


 ▪️యోగి కుటుంబం ఎంపీ లేదా ముఖ్యమంత్రి కాకముందు ఎలాంటి స్థితిలో ఉందో ఇప్పటికీ అలాగే జీవిస్తోంది.


 ▪️ సంవత్సరాల క్రితం పదవీ విరమణ తీసుకున్న తర్వాత యోగి ఒక్కసారి మాత్రమే ఇంటికి వెళ్లారు.


 ▪️ యోగికి ఒకే బ్యాంకు ఖాతా ఉంది మరియు అతని పేరు మీద భూమి ఆస్తి లేదు లేదా అతనికి ఎటువంటి ఖర్చులు లేవు.


 ▪️ వారు తమ సొంత జీతం నుండి వారి ఆహారం మరియు బట్టలు ఖర్చు చేస్తారు మరియు మిగిలిన డబ్బును సహాయ నిధిలో జమ చేస్తారు.


  ఇది యోగి ఆదిత్యనాథ్ ప్రొఫైల్.


 భారతదేశంలో నిజమైన నాయకుడి ప్రొఫైల్ ఇలా ఉండాలి.  అటువంటి సాధువులే భారతదేశాన్ని మళ్లీ ప్రపంచ గురువుగా మార్చగలరు.

 అటువంటి వ్యక్తులను దేవుడు తన మాధ్యమంగా భూమిపైకి పంపే అవతారాలు అంటారు.

 


  జై శ్రీ రామ్🙏

ఈశ్వరార్చనకు ఫలితం



"ఒక పుష్పంబు భవత్పదద్వయముపై

 నొప్పంగ సద్భక్తి రం

 జకుడైపెట్టిన,పుణ్యమూర్తికి పునర్జన్మంబులేదన్న, బా

యక కాలత్రితయోపచారముల నిన్నర్చించుచున్ పెద్ద  నై

 ష్ఠికుడై యుండెడువాడు,నీవగుట తా

 చిత్రంబె? సర్వేశ్వరా!


సర్వేశ్వర శతకం-చిమ్మపూడి అమరేశ్వరుడు.


భావం: ఓసర్వేశ్వరా!నీపాదాలపై భక్తితో ఒకపువ్వుంచి

ప్రార్ధించినవాడికి పునర్జన్మమేలేదని పురాణాలుప్రవచిస్తున్నాయ్.అలాంటిది ముక్కాలములయందూ మూడుసంధ్యలా ,మహానిష్ఠతో నిన్నర్చించేవాడు నీలోసమైక్యమైతే యిక నాశ్చర్యపడవలసినదేమున్నది?అనిభావం.


          ఈశ్వరార్చనకు ఫలితం జన్మరాహిత్యమేనని,ఈశ్వరసాయుజ్యమేనని చెప్పే యీపద్యం.కాకతిరాజులకు

సమకాలికుడైన చిమ్మపూడి రచించుట విశేషం.🙏

ఆవుపాల ఉపయోగాలు

 ఆవుపాల ఉపయోగాలు  - సంపూర్ణ వివరణ  2 . 


  *  ఆవుపాలలో విటమిన్ A , B2 , D  నికోటిక్ యాసిడ్ ఉన్నాయి. తాజా పాలలో విటమిన్ C కూడా ఉంటుంది. కాని పాలు కాచినప్పుడు విటమిన్ C నశిస్తుంది. కాబట్టి ప్రతినిత్యం పాలని ఆహారంగా తీసుకొనే అలవాటు ఉన్నవారు విటమిన్ C కలిగిన కాస్త పుల్లనికాయలు , పండ్లు తీసుకోవడం మంచిది .


 *  పాలలో సమృద్దిగా ఉన్న విటమిన్ A , B కాంప్లెక్స్ , C & D అనునవి సూర్యుని అతినీలలోహిత కిరణాల ( Ultra voilet Rays ) ప్రసార ప్రభావం వలన కొన్ని మార్పులకు లోనగుటచేత ఉబ్బసము, క్షయ , కొన్ని ఎలర్జీలకు , దగ్గు , శరీరంలో కొన్ని మాంసకృత్తులు లోపించుట , శారీరకశక్తి లోపించినట్లుగా బాధపడువారికి , జుట్టు రాలిపోవువారికి , వయస్సు మీరినట్లు కనిపించుట , బలహీనంగా ఉన్న చిన్నపిల్లలకు మంచి బలవర్ధకమైన ఆహారముగా పనిచేయును . 


 * గ్లాసు పాలలో 4 నుంచి 5 చుక్కలు " సోడియం నైట్రేట్ " కలిపి ఆహారంగా వినియోగిస్తుంటే పాలలో విడిగా ఉన్న క్యాల్షియం ఎంతో ఉపకరిస్తుంది. 


 *  పుల్లటి పండ్లు గాని , బిస్కెట్స్ కాని తిన్న తరువాత పాలు తాగితే జీర్ణక్రియ తేలికగా జరుగును. 


 *  పాలు జీర్ణాశయము నందలి " పెప్సిన్"తో కలిసి జీర్ణాశయంలో అధికంగా జనియించే                       " హైడ్రోక్లోరికామ్లం " ను తగ్గించడంలో సహకరిస్తుంది.  జీర్ణాశయంలో గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్నవారు ప్రతిరోజు పాలను ఆహారంగా స్వీకరిస్తూ ఉంటే మంచి మందుగా పనిచేస్తాయి. 


 * పాలు పిల్లలలో జీర్ణం అయినంత త్వరగా పెద్దవారిలో జీర్ణం కావు . రికెట్స్ వ్యాధి ఉన్నవారికి కొవ్వుపదార్దాలు , క్యాల్షియం జీర్ణం అగుట అసాధ్యం . కాబట్టి పాలు స్వీకరించరాదు. రికెట్స్ వ్యాధి ఉన్నవారు పాలు తాగినప్పుడు జీర్ణం అగుట కష్టసాధ్యం అగుట చేత విరేచనాలు కూడా అయ్యే అవకాశం ఉంది. క్యాల్షియం అరగక ప్రమాదంగా మారే అవకాశంగా ఉంది.


 *  పాలు సరిపడనివారు స్వీకరించరాదు. పాలు మితిమీరి తాగుతూ ఉంటే మలబద్దకం , అజీర్తి వంటి అనారోగ్యాలు దరిచేరే ప్రమాదం ఉన్నది. కడుపు నిండుగా భోజనం చేసినవెంటనే పాలు తాగుట మంచిది కాదు. 


 *  పాల ద్వారా కలరా , టైఫాయిడ్ , క్షయ వంటి రోగాలను కలిగించే సూక్ష్మక్రిములు అతితేలికగా పయనించగలవు. కావున పాలను తాగేముందు బాగా కాచి తాగుతూ ఉంటే వ్యాధులను సంక్రమింపచేసే క్రిములు నశించుటయే కాక జీర్ణక్రియ తేలికగా జరుగును. 


 *  పాలను పెద్ద మంటతో అతిగా కాచి నిదానముగా చల్లార్చుతూ ఉంటే పాలలో రుచి పోతుంది. 


 *  పాలను కాచే ముందుగా పాలపాత్రను బాగా శుభ్రపరచవలెను . పాలు వాసన వచ్చినా , నీలిరంగుకు మారినా త్రాగరాదు. ఇటువంటి పాలు తాగిన వాంతులు , విరేచనాలు , కడుపునొప్పి వంటి సమస్యలు వచ్చును. ఆరోగ్యం పూర్తిగా చెడిపోవును 


 *  భోజనానంతరం 2 నుంచి 3 గంటలు ఆగి పాలు తాగిన సంపూర్ణంగా జీర్ణం అగును. 


 *  గోరువెచ్చని పాలలో తగుమాత్రం తేనె కలిపి కాని లేదా ఏమి కలపకుండా కాని తాగితే మంచిది . అలా కాకుండా పంచదార కలిపిన పాలు తాగితే జీర్ణాశయంలో " హైడ్రోక్లోరిక్ ఆసిడ్ " అధికం అయ్యి జీర్ణం అగుట కష్టసాధ్యం అగును. 


 *  గర్భము ధరించిన ( సూడి పశువు ) పశువుల పాలు తాగుతూ ఉంటే వయస్సుకు వచ్చిన స్త్రీ , పురుషుల ముఖము పైన మొటిమలు వస్తాయి. దీనికి కారణం ఆ పాలలో " ప్రొజెస్టిరాన్ "                 " ఈస్ట్రోజెన్ " అను సెక్స్ హార్మోన్స్ మిళితమై ఉండటమే దీనికి కారణం . 


 *  పిల్లల వయస్సును అనుసరించి పాలలో నీటిశాతం పెంచుటయో , తగ్గించుటయో చేయాలి . ఉదాహరణకు ఒక నెల వయస్సు ఉన్న పిల్లలకు 1 వంతు పాలు , 3 వంతులు నీరు కలిపి 2 నుంచి 3 గంటల కొకమారు  పట్టాలి. 


 *  పిల్లలకు ఆవుపాలు పట్టువారు ఆ పాలలో కొద్దిగా తేనె కలిపి తాగిస్తే ఉపయోగకరంగా ఉండును. 


 *  రాత్రి సమయంలో పసి పిల్లలకు ఆవుపాలు తాగించుట అంత మంచిది కాదు. ఈ సమయంలో నులివెచ్చని నీటిలో గ్లూకోజ్ గాని , పంచదార గాని కలిపి తాగించుట మంచిది . 


 *  ఆవుపాలను తరచుగా వేడిచేయుట మంచిది కాదు. ఒకేసారి పాలు కాచి అవసర సమయాలలో ఆ పాలలో వేడినీరు కలిపి పిల్లలకు పాలు తాగిస్తుంటే ఆ పాలు తేలికగా జీర్ణం అగును. 


 *  తల్లిపాలు సమృద్దిగా లభించే పిల్లలకు పోతపాలు పోయుట అనర్థదాయకం . ఎందుకంటే తల్లిపాలలో కంటే ఆవుపాలలో క్యాల్షియం , ఫాస్పరస్ 4 నుంచి 5 రెట్లు అధికంగా ఉండటం చేత చిన్నపిల్లల మూత్రపిండాలకు వాటి విసర్జన కష్టం అయ్యి మూత్రపిండాలు పాడగును. అవసరం అయితే అత్యంత పలచగా చేసి పోయవలెను . 


      మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


    గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

      9885030034                       


        

   కాళహస్తి వేంకటేశ్వరరావు 


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


       9885030034