17, జూన్ 2025, మంగళవారం

సుభాషితము

 👌 _*సుభాషితము*_ 👌


_*ప్రదోషే దీపకశ్చంద్రః*_

_*ప్రభాతే దీపకో రవిః !*_

_*త్రైలోక్యే దీపకో ధర్మః*_

_*సుపుత్రః కులదీపకః||*_


రాత్రివేళలందు వెలుగును అందించే వాడు చంద్రుడు, పగటివేళలందు వెలుగును అందించే వాడు సూర్యుడు, ముల్లోకములకు వెలుగును అందించేది ధర్మము, సుపుత్రుడు కులమును ప్రకాశింప జేస్తాడు.

ఆత్మావై పుత్రనామాసి*

 *ఆత్మావై పుత్రనామాసి* 

     ---------------------------------

 నాలుగు వేదాలలో మొదటిదైన ఋగ్వేదంలో మంత్రాలు, ప్రార్థనలు ఉంటాయి. వీటిలో ఎక్కువ భాగాల్లో కర్మలు (rituals) గురించి చెప్పబడ్డాయి.

మనిషి జననానికి ముందు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నుంచి మరణించేదాకా అతని జీవితంతో 16 రకాల సంస్కారాలు (కర్మలు) ముడిపడి ఉంటాయని హిందూ మతం చెబుతుంది. వీటిని 'షోడశ సంస్కారాలు' అంటారు. ప్రతి హిందువు తన జీవితం మొత్తంలో ఇది జరుగుతాయి. గర్భదానం మొదలుకొని అంత్యేష్టి (మరణం) వరకు ఇవి 16 రకాల సంస్కారాలు. ఇందులో నాలుగవ కర్మ *జాతకర్మ.* 

జాత = జననం, పుట్టుక

కర్మ = చేసే పని 

నవ మాసాలు తల్లి గర్భంలో ఉండి, బయటకు వచ్చిన శిశువుకు చేసే మొదటి సంస్కారం జాత కర్మ. (మొత్తం షోడశ కర్మలలో ఇది నాలుగవది. గర్భదానం, పుంసవనం, సీమంతం, జాతకర్మ.....) 

ఇప్పుడు అన్ని కులాల్లో ఈ కర్మ చేస్తున్నట్లయితే కనిపించదు. బిడ్డకు బొడ్డుతాడు కోయక ముందు చేసే కర్మ ఇది. అయితే బొడ్డుతాడును ఇప్పుడు ప్రసవించిన వెంటనే తీసేస్తున్నారు. అందువలన ఇప్పుడు కొందరు దీన్ని 11వ రోజు చేస్తున్నారు. ఇది ప్రాథమికంగా శౌచ ( శరీరాన్ని శుభ్రపరచడం ) క్రియకు చెందినది. ఈ కర్మ చివరిలో తండ్రి బిడ్డను తన ఒడిలో కూర్చోబెట్టుకుని, ఋగ్వేదంలోని ఒక శ్లోకం చెబుతాడు.   

 _"అంగాదంగాత్ సంభవసి !_ _హృదయాదధిజాయసే_ 

 *ఆత్మావై పుత్రనామాసి* _త్వంజీవశరదాంశతం !_" 

అంగాదంగాత్ సంభవసి != నా ప్రతి అవయవం నుంచి నీవు ఉద్భవించావు ( అచ్చం నా (తండ్రి) ప్రతిరూపమే)

హృదయాదధిజాయసే = నా హృదయం నుంచి జన్మించావు.

 నా శరీరాన్ని పోలిన శరీరంతో మాత్రమే నువ్వు పుట్టలేదు... మనసు కూడా అచ్చం నాలాంటిదే మరి!

 *ఆత్మావై పుత్రనామాసి* = నా ఆత్మ మరో రూపం పొంది నీలా నేను (పుత్రుడుగా) ఈ భూమి మీద తిరుగుతాను.  

అంటే ఓ పుత్రా! నువ్వు ఎవరో కాదు.... నేనే నువ్వు. 

త్వంజీవశరదాంశతం ! = నీవు నూరేళ్ళు వర్ధిల్లు! 

ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. 'ఆత్మావై పుత్రనామాసి' ఈ పాదంలో తండ్రికి పుత్రుడికి మధ్య ఉన్న సంబంధబాంధవ్యం చెప్పబడింది. శరీరం తండ్రి అయితే ఆత్మ పుత్రుడు. తండ్రి బింబమైతే కొడుకు ప్రతిబింబం .తండ్రి తన శీలం, నడవడిక, ధర్మం - ఇవి నిలవటం కోసం స్వయంగా తన ఇల్లాలి గర్భంలో ప్రవేశించి కుమారుడై జన్మిస్తున్నాడు. తండ్రి పుత్రుడికి ఉపదేశించిన మొదటి మాట ఇది. 

 తొలి వేద కాలంలో ( క్రీ. పూ. 1500 - 1000) మాతృ స్వామ్య వ్యవస్థ ఉండేది కాబట్టి స్త్రీకి గౌరవం ఉండేది. మలివేద కాలంలో (క్రీ. పూ. 1000 - 600) పితృ స్వామ్య వ్యవస్థ వలన పురుషాధిక్యం ఏర్పడి, ఆనాటి సమాజంలో స్త్రీ గౌరవం క్రమంగా తగ్గింది. అందువలన చాలా శ్లోకాలను పురుషులకు ఆపాదించుకుని, వక్రభాష్యం చెప్పారు. 

" అపుత్రస్య గతిర్నాస్తి" అనేది శ్లోకం. పుత్రులు లేనివారికి ఉత్తమ గతులు కలుగవు అని దీని సారాంశం. . అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడు సృష్టిని కొనసాగించాలని... సృష్టి కొనసాగడానికి వివాహ వ్యవస్థ ద్వారా చేయూతనివ్వాలని.... అలా కొనసాగించకపోవడం అంటే అధర్మమేనని భావించేవారు. 

ఇక్కడ పుత్రులు అంటే కొడుకు లేదా కూతురు అని అర్థం. సృష్టిలో ఇద్దరు ఉంటారు కదా!

 కానీ *పుత్రుడు* అనే పదానికి పున్నామ నరకం నుంచి కాపాడే వాడు - కొడుకు అని వ్యుత్పత్తి చెప్పారు. మరణం తర్వాత సంభవించే 14 నరకాలలో 'పున్నామ నరకం' కూడా ఒకటి. పుత్ + నరకం.

పుత్రులు లేని వారికి కలిగే నరకం అన్నమాట. అంతేగాని కొడుకు లేని వారికి కలిగే నరకమని కాదు. 

 పై శ్లోకం లాగే 'ఆత్మావై పుత్రనామాసి' శ్లోకంలో కూడా పుత్ర = కొడుకు లేదా కూతురు అని అర్థం లోనే తీసుకోవాలి. కొడుకు అని కాదు. కూతురైన కొడుకు అయినా తల్లి గర్భం నుంచి రావలసిందే. తల్లిదండ్రుల జన్యు లక్షణాలను పంచుకోవాల్సిందే. కొడుకుకు మాత్రమే తండ్రి రూపం వస్తుందా? కూతురుకు రాదా? ఇవన్నీ వేదాలకు తర్వాత కాలంలో రాసిన వక్ర భాష్యాలు. 

 *'ఆత్మావై పుత్రనామాసి'* ఈ వాక్యాన్ని ఇలా అర్థం చేసుకోండి. తండ్రి ఇలా అంటున్నాడు.... "ఓ పుత్రా! ( కొడుకు లేదా కూతురు) నేను ఈ సృష్టి కార్యంలో ఒక భాగమై.... నా వంతుగా నీ తల్లి ద్వారా నీకు ఈ జన్మనిస్తున్నాను . నువ్వు నా ప్రతిరూపం. ఈ శరీరం మాత్రమే నాది. నా ఆత్మ మీ రూపంలో (కొడుకు/ కూతురు) భూమి మీద నడయాడుతున్నది" అని అర్థం.

బ్లాగు అభివృద్ధికి పాటుపడగలరు

వీక్షక మిత్రులకు నమస్కారం. 

మీ అందరి ఆదరాభిమానాలతో మన బ్లాగు నిర్విరామంగా అనేక విషయాలను ప్రస్తావిస్తూ నిరాఘాటంగా కొనసాగుతున్నదని తెలుపుటకు సంతశిస్తున్నాము. నిత్యం వేల సంఖ్యలో మన బ్లాగును ప్రపంచ దేశాలనుంచి చూస్తున్నారంటే అది ఒక శుభ సూచకంగా భావిస్తున్నాము. ఇంత మంది చూస్తున్నా కూడా ఒక్కరు కూడా స్పందించక పోవటం శోచనీయం. కాబట్టి మిత్రులారా మీరు ఏదైనా పోస్ట్ చదివిన వెంటనే అది మీకు నచ్చితే వెంటనే స్పందించగలరు. నచ్చకపోతే అది కూడా తెలుపగలరు. ఈ బ్లాగుని మరింత విశేషంగా తీర్చి దిద్దటానికి మీరు తోట్పాటు పడగలరని ఆశిస్తున్నాము . ఇది మనందరి బ్లాగు దీనిని మనం ఇంకా వృద్ధిలోకి తీసుకొని వద్దాము. మీరు కూడా మీకు నచ్చిన అంశాలు ఏవైనా ఉంటే తప్పకుండ కామెంటు రూపంలో మీ పేరు ఫోను నంబర్ ఎక్కడి నుంచి వ్రాస్తున్నారో తెలియచేస్తూ పంపగలరు. మీ పేరు లేకుండా ఫోను నెంబరు లేకుండా దయచేసి కామెంట్లు పెట్టకండి. మీ అభిప్రాయాలతో పాటు మీరు ఎవరో కూడా ప్రపంచానికి తెలియాలన్నది మా ఉద్దేశ్యం. 

మంగళవారం 17 జూన్ 2025🚩* `` *రామాయణం*

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🚩మంగళవారం 17 జూన్ 2025🚩*

``

          *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది…

``

     *వాల్మీకి రామాయణం*                 

             *71వ భాగం*

```

అప్పుడు అక్కడున్న వికృత రూపములు కలిగిన రాక్షస స్త్రీలు సీతమ్మ చుట్టూ చేరి “సీతా! దేనికైనా ఇంత అతి పనికిరాదు. రావణుడు అంటే సామాన్యుడు కాదు, బ్రహ్మ కుమారులలో నాలుగో ప్రజాపతి అయిన పులస్త్యబ్రహ్మ యొక్క కుమారుడైన విశ్రవసోబ్రహ్మ యొక్క కుమారుడు రావణబ్రహ్మ. సాక్షాత్తు బ్రహ్మగారికి మునిమనవడు. లోకంలో అందరినీ జయించాడు, బ్రహ్మగారిని గూర్చి తపస్సు చేశాడు, ఎన్నో గొప్ప వరములను పొందాడు. అలాంటి రావణుడితో హాయిగా భోగం అనుభవించకుండా ఏమిటి ఈ మూర్ఖత్వం. పోనిలే మెల్లగా మనస్సు మార్చుకుంటావు అని ఇంతకాలం చూశాము,కాని మనస్సు మార్చుకోకుండా ఇలా ఉంటావేంటి, ఎంత చెప్పాలి నీకు” అని గద్దించారు.


అప్పుడు సీతమ్మ అనింది…  

“ఐశ్వర్యం ఉంటే భర్తగా చూడడం, రాజ్యం ఉంటే భర్తగా చూడడం, ఒంట్లో ఓపిక ఉంటే భర్తగా చూడడం నాకు తెలియదు. ఆయన దీనుడు కావచ్చు, రాజ్యహీనుడు కావచ్చు, కాని నా భర్త నాకు గురువు, సమస్తం. సూర్యుడి భార్య అయిన సువర్చల సూర్యుడిని ఎలా అనుగమిస్తుందో, వశిష్ఠుడిని అరుంధతి ఎలా అనుగమిస్తుందో, శచీదేవి ఇంద్రుడిని ఎలా అనుగమిస్తుందో, రోహిణి చంద్రుడిని ఎలా అనుగమిస్తుందో, లోపాముద్ర అగస్త్యుడిని ఎలా అనుగమిస్తుందో, సుకన్య చ్యవన మహర్షిని ఎలా అనుగమిస్తుందో, సావిత్రి సత్యవంతుడిని ఎలా అనుగమిస్తుందో, శ్రీమతి కపిలుడిని ఎలా అనుగమిస్తుందో నేను కూడా అలా రాముడిని అనువర్తిస్తాను. మీరు నన్ను చంపి, నా శరీరాన్ని ముక్కలు చేసి తినెయ్యండి, నేను మాత్రం రాముడిని తప్ప వేరొకడిని కన్నెత్తి కూడా చూడను. రావణుడిని నా ఎడమ కాలితో కూడా ముట్టుకోను. మీరు నాకు ఇలాంటి మాటలు చెప్పకూడదు, నేను వినకూడదు” అన్నది.


అప్పుడు హరిజట అనే రాక్షస స్త్రీ లేచి… “ఈమెని రావణుడు అపహరించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పటినుంచి నా నోటి వెంట లాలాజలం కారిపోతోంది. ఈమెని ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నాను” అన్నది.


ఈ మాటలు విన్న ఏకజట అనే రాక్షస స్త్రీ లేచి అన్నది… “నేను బయట పడితే ఎవరన్నా ఈ విషయం చెప్పేస్తారేమో అని భయపడ్డాను. కాని హరిజట బయటపడింది కాబట్టి చెప్తున్నాను, ఆకలితో ఉన్నవాడు ఎదురుగా భోజనాన్ని పెట్టుకుని తినకుండా ఎలా నిగ్రహించుకొని ఉంటాడో, అలా నేను కూడా ఈ నరకాంతని ఎదురుగా పెట్టుకొని తినకుండా నిగ్రహించుకొని ఉన్నాను. ప్రభువు ఎలాగూ అనుమతి ఇచ్చాడు కదా ఈమెని దండించమని, కాబట్టి ఈమె పీక పిసికేసి తినేద్దాము. ఈమె హృదయమునకు కిందన ఉండే భాగము, గుండె, మెదడు నాది అన్నది.


అప్పుడు మిగతా రాక్షస స్త్రీలు, నావి కాళ్ళు, నావి తొడలు, నావి చేతులు అని వాటాలు వేసుకున్నారు.


తరువాత అజముఖి అనే స్త్రీ… “ఈమెని అందరమూ సరిసమానంగా వాటాలు వేసుకుందాము. తొందరగా కల్లు తీసుకురండి. ఈమెని తింటూ, కల్లు తాగుతూ, నికుంబిలా నాట్యం చేద్దాము” అంది.


అప్పుడు సీతమ్మ ఏడుస్తూ… “ఇక్కడ మరణిద్దామన్నా కూడా నాకు స్వేచ్ఛ లేదు” అని అనుకొని, ఆ రాక్షస స్త్రీలని చూసి భయపడుతూ కూర్చున్న చోట నుంచి లేచి శింశుపా వృక్షం మొదటికి వెళ్ళి కూర్చుంది.```


       *రేపు… 72వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

గుండెలో బ్లాక్స్

 స్టెంటు వేయు టెంతొ సింపులే యని బల్క

నమ్మి వేసుకుంటె నాశనమ్మె

మందులాప జూస్తె మరణమే గతియౌను

సకురు అప్ప రావు సత్యమిదిర! 


భావం: "గుండెలో బ్లాక్స్ ఏర్పడ్డాయి, స్టెంటు వేయించుకోండి, ఏ కష్టమూ లేకుండా సింపుల్ గా అరగంటలోనో, గంటలోనో పనైపోతుంది, జస్ట్ స్టెంటుకి 80 వేలు, ప్లస్ హాస్పిటల్ బిల్లు కలిపి, లక్షో, లక్షన్నరో కట్టేసి, హేపీగా ఇంటికెళ్ళి, రేపటినుంచే పనులు చేసుకోవచ్చు! 

" అని హాస్పిటల్ వాళ్ళు అందమైన అమ్మాయితో స్వీట్ గా చెప్పిస్తే, టెంప్ట్ అయిపోయి, "ఆహా! ఇంత ఈజీనా?" అని, డబ్బులిచ్చి ఆరోగ్యం కొనేసుకుందామని కమిట్ అయ్యారా? మీరు కొనుక్కొని వేయించుకునేది ఆరోగ్యాన్ని కాదు, దరిద్రాన్ని అని, తర్వాత తెలుస్తుంది! స్టెంటు వేయించుకోకపోతే, చక్కగా యోగా, హోమియో, నేచురోపతీ ద్వారా కొన్నాళ్ళలో ఆరోగ్యాన్ని సరిచేసుకుని, తర్వాత ఏ మందులూ లేకుండా జీవిత కాలం సుఖంగా బ్రతకొచ్చు! కానీ ఈ స్టెంటు వేయించుకున్న వాడికి ఆ స్టెంటే ఉరితాడు! స్టెంటుకు అంటుకున్న రక్తమే గడ్డకట్టేస్తూ, ఆ స్టెంటు వద్దనే నిత్యం రక్తం బ్లాక్ అవుతూ ఉంటుంది! అలా జరగకుండా ఉండటానికి వాడితో "ఎకోస్ప్రిన్" వగైరా మాత్రలు జీవితకాలం వాడిస్తారు! వాడు పొరపాటున "ఎకోస్ప్రిన్" ఆపితే, ఆ స్టెంటే వాడి ప్రాణం తీస్తుంది! స్టెంటు వేయించుకున్న వాడు ఎప్పటికీ, చచ్చేదాకా ఇంగ్లీషు మందుల కాళ్ళ దగ్గర బానిసగా మారిపోతాడు! అలాగే ఎకోస్ప్రిన్ వాడితే రక్తం ఎప్పుడూ పలుచగానే ఉండి, గడ్డకట్టదు! అంటే దెబ్బలు తగిలినా, ఆపరేషన్లు చేసినా గాయాలు అతుక్కోవు, అతిగా శ్రమపడి, ఆయాసపడితే ఊపిరితిత్తులు చిట్లిపోయి, రక్తం ధారాపాతంగా పోయి, చస్తాడు, మెన్సెస్, పైల్స్ సమస్య ఉన్నా కూడా అధిక రక్తం పోయి, చస్తాడు! అదే గుండెలో ఏ సమస్య ఉన్నా, భయపడకుండా, యోగా, హోమియో దగ్గరకు చేరుకుంటే, హాయిగా, సంతోషంగా, ఏ మందులకూ కలకాలం బానిసగా కాకుండా బ్రతకొచ్చు! 

సకురు అప్పారావూ ఇదేనయ్యూ నిజం! 


ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

బ్రహ్మ సత్యం

 🙏వేదాంత వ్యాసం🙏

"బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, 

జీవో బ్రహ్మైవ న పరాః"


బ్రహ్మ అంటే అంతిమ వాస్తవికత, సర్వోన్నత దేవుడు

పురాణాలలో బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ. ఆయనే సృష్టికర్త. మరి ప్రకృతిని కూడా బ్రహ్మ అంటారు. వేదాన్ని, యజ్ఞాన్ని బ్రహ్మ అంటారు. ప్రణవాన్ని బ్రహ్మము అంటారు. ఇవికాక ఉపాధులే లేని నిరాకార పరమాత్మను కూడా బ్రహ్మము అంటారు.

 అన్నింటికన్నా పూర్వమైనది, మొదటగా ఉన్నది, రెండు కానిది, ఏకైకమైనది అయిన బ్రహ్మం తన ఏకైక తత్త్వం అనేకం కావాలని సంకల్పించింది. అదే రకరకాల వస్తువులుగా చిత్ర విచిత్ర సమ్మేళనాలతో రూపుదాల్చింది. ద్రవపదార్థాలు, ఘనపదార్థాలు, వాయుపదార్థాలు ఇలా ఎన్నో రకాలుగా మార్పులు చెంది, చిన్నచిన్న రూపాలతో ఈ సృష్టి ఆకారాన్ని పొందింది. జీవరాశులు ఉత్పన్నం అయినాయి. ఆదిలో ఉన్న ఒక్కదానిలో నుంచే ఈ అన్నీ ఉద్భవించాయన్నమాట 

 వ్యష్టిపరంగా చైతన్యాన్ని ఆత్మ అంటే, సమిష్టిపరంగా అదే చైతన్యాన్ని బ్రహ్మము అంటారు. రెండూ ఒకటే. మరి రెండు పేర్లు ఎందుకు అంటే? కారణం వాటి స్థానం. వ్యష్టి స్థాయిలో ఆత్మ, సమిష్టి స్థాయిలో బ్రహ్మము (ఈ సమిష్టి చైతన్యాన్నే పరమాత్మ అని కూడా అంటారు). వాటి అర్ధాలు కూడా ఇంచుమించు ఒకటే. ఆత్మ అంటే ఆప్నోతి సర్వం ఇతి ఆత్మ - సర్వాత్మకమైన ఎల్లలు లేని వస్తువు. బ్రహ్మము అంటే అనంతం - బృహ్ నుంచి వచ్చింది. బృహ్ అంటే పెద్దది. పూర్తిగా పెద్దది.

“బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి”-బ్రహ్మమును ఎవరు అనుభవించాడో వాడే బ్రహ్మము అవుతాడు. పరబ్రహ్మమును అనుభవించిన కారణం చేత ఆయనే పరబ్రహ్మము. అందుకే “గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః! గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః!!”-గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అనబడే మూడు రూపములు పొందినటువంటి వాడై ఉంటాడు. అటువంటి గురువు జ్ఞానమును పొందినప్పటికీ, సమున్నతమైన స్థాయిలో నిలబడినప్పటికీ సామాన్యమైన లోకులు శాస్త్రాన్ని ఎలా ఆచరిస్తారో అలా ఆయన కూడా ఆచరించాలని నియమం లేదు. ఆయన అలా ఆచరించలేదు కాబట్టి ఆయన స్థాయి తక్కువైంది అని చెప్పడం సాధ్యంకాదు. భగవాన్ రమణులు మహా పురుషులు. వారు బ్రహ్మముయొక్క స్థాయిని చేరిపోయినవారు. అంతటి అద్వైతానుభూతియందు ఓలలాడుతూ ఉండేవారు. శరీరాన్ని చూపించి ఎప్పుడూ ఇది అని వేలు చూపించి తను సాక్షిగా ఉండేవారు. అటువంటి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి, గురుస్వరూపుడైన రమణమహర్షి సంధ్యావందనం చేయాలనీ, యజ్ఞోపవీతం వేసుకోవాలనీ, గోచీపోసి పంచె కట్టుకోవాలనీ, వేదం ఎలా చెప్పిందో అలా ఆయన ప్రవర్తించాలనీ, అలా ఆయన ప్రవర్తించకపోతే దోషం వస్తుందనీ, చెప్పడం సాధ్యం కాదు.అది అగ్నిహోత్రం వంటిది. ఆస్థాయికి చేరినటువంటి మహాపురుషులు కర్మాచరణను శాస్త్రీయంగా చేశారా? చేయలేదా? అన్న విషయంతో సంబంధం ఉండదు. వారు ఎప్పుడూ జ్ఞానమునందు ఓలలాడుతూ ఉంటారు. జ్ఞానిని అనుకరించే ప్రయత్నం చేయకూడదు. అజ్ఞానిని ఎప్పుడూ అనుకరించకూడదు. అనుకరణవల్ల మహాత్ముల స్థాయిని చేరలేరు. పరమభక్తితో కర్మాచరణము చేయగా చేయగా అనుగ్రహించిన భగవంతుని కారుణ్యమే ఒకనాడు జ్ఞానము కలగడానికి అవకాశం ఇస్తుంది. ఒకసారి జ్ఞానము కలిగిన తరువాత అదే మోక్షమునకు హేతువు. జ్ఞాని శరీరముతో ఉన్నప్పటికీ నేను ఆత్మ అని దానియందు రూఢియై అద్వైతానుభూతియందు ఓలలాడుతూ ఉంటాడు. అటువంటి వ్యక్తి శరీరం పడిపోతున్నప్పుడు కూడా సాక్షిగా చూస్తాడు శరీరాన్ని. శరీరంతో తాదాత్మ్యత పొందడు. అందుకే అందరూ ఇలా ప్రవర్తిస్తున్నారో ఎలా వైదికమైనటువంటి ప్రవర్తనకు కట్టుబడుతున్నారో అలా కట్టుబడాలి అని భావించడం పొరపాటు. గురువుయొక్క లీల, మాట పరమశక్తివంతములు. గురువు లోకోద్ధరణకొరకే నోరువిప్పుతాడు. గురువుయొక్క సహజస్థితి మౌనం. భగవాన్ రమణులకు అందుకే మౌనయోగి అని పేరు. అలా మౌనంగా ఉండి పరబ్రహ్మముగా అనుభవములో ఎప్పుడూ రమిస్తూ ఉంటారు. అటువంటి స్థాయి పొందిన మహాపురుషులు.


"బ్రహ్మము నిరాకార చైతన్యము. ఆకారము లేకపోవడంతో దానికి భౌతిక, రసాయనిక లక్షణాలు కూడా వుండవు. అది నిర్గుణం, ఎలాంటి గుణాలు వుండవు. కాలానికి, ప్రదేశానికి అతీతమైనది కాబట్టి దానికి మార్పు లేదు. ఒక ప్రదేశానికి అంకితమవలేదు కాబట్టి ఈ చైతన్యం నిర్వికల్పం. దానికి విభజన లేదు."

అద్వైతానికి ఆధారముగా శంకరాది వ్యాఖ్యాతలు చెప్పారు.

"బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, జీవో బ్రహ్మైవ న పరాః" కు 

ఇది ప్రమాణం. 

సహజంగా ద్వైతులు ఇంకొక విధముగా వ్యాఖ్యానించారు. 

ఇది భగవంతుని వాక్కు. ప్రమాణంగా తీసుకోవలసినది. కనుపించే ప్రపంచం, చూస్తున్న మనం అసత్యంగానూ, కనుపించని ఆత్మ సత్యంగానూ అర్థమవడానికి మనస్సు, బుద్ధి లగ్నం కావాలి. 

ఆమాటకు వస్తే చెప్పిన కృష్ణుడూ లేడు, విన్న అర్జునుడూ లేడు, చెప్పబడిన గీతా, దాని అర్థము శాశ్వతమా? అని వితండవాదం చేయవచ్చు. కాని సమాధానం మన వాదములోనే ఉన్నది. అందుకే 5000 సంవత్సరాల తరువాత మనము ఇంకా గీత చెప్పుకుంటున్నాము.

.

ఇది లౌకిక శాస్త్రాలలోనూ నిజమే. న్యూటన్, ఐన్స్టీన్ లేరు. వారి భౌతిక శాస్త్రాలు నేటికీ ఉపయోగంలో ఉన్నాయి

అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్

వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్కర్తుమర్హతి

.

ఓఅర్జునా! ఈ సర్వము (ఈప్రపంచమంతయు) ఏ పరమాత్మచేత వ్యాపింపబడిఉన్నదో, అది నాశరహితమని ఎరుంగుము. అవ్యయమగు అట్టి ఆత్మకు ఎవరూను వినాశము కలిగింపలేరు. 

ఈ సృష్టికి (ప్రపంచమంతకు) ఆధారభూతమైన వస్తువు ఒకటి ఉన్నది. అది మనకు కనబడటములేదు. అందుకే భగవంతుడు మనకు చెబుతున్నాడు. దానినే పరమాత్మ వస్తువు అని మనం అన్నాము. 

వైజ్ఞానికులు దానినే గురుత్వాకర్షణ క్షేత్రము అనవచ్చును

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

ఉత్పల ప్రతిభ!

 ఉత్పల ప్రతిభ!


“కవితా మహేంద్రజాలం” గ్రథంనుంచిసేకరించబడిన పద్యమిది. వారు శ్రీ ఉత్పలవారి గురించి “ఉత్పల పరిమళం”లో వ్రాసిన పరిచయవాక్యాలనే యిక్కడ పొందుపరుస్తున్నాను.


“(శ్రీ ఉత్పలవారు) కవిగా, పండితుడుగా, నవలా రచయితగా, కథానికాకర్తగా, సినిమా రచయితగా, వ్యాసకర్తగా, పురాణతత్వవ్యాఖ్యాతగా బహుముఖీనమైన ప్రజ్ఞాప్రాభవాలు ప్రదర్శించిన వ్యక్తి-…”

శ్రీ ఉత్పలవారికి హైదరాబాదు, శంకర మఠం సభలో ఇవ్వబడిన సమస్య:—


“గుట్టుగ చెప్పికొన్న పలుకుల్ 

బహిరంగములౌను వెంటనే“.

కవిగారి సమస్యాపూరణం యిది:—


“జుట్టున గంగయున్ మరియు సోముడు మేల్కొనియుందురక్కునన్ 

కట్టడి పాపరేడు, యలికంబున నగ్ని, శివుండు పార్వతీ 

పట్టపుదేవితో సరసభాషణ కేనియు నోచుకోడటే!

గుట్టుగ చెప్పికొన్న పలుకుల్ బహిరంగములౌను వెంటనే”! ||


ముందు సమస్య అర్థం చూద్దాం! మాటలు, వాటి అన్వయమూ తేటతెల్లంగానేవున్నాయి. గుట్టుగ అంటే ఏకాంతంలో రహస్యంగా అనుకునే మాటలుకూడా వెనువెంటనే బహిరంగంగా అందరికీ తెలిసిపోతున్నాయట! ఇదీ దీని భావం.


దీనిని శివపరంగా పూరించి దీనికి ఎక్కడాలేని సొగసులు కూర్చారు, శ్రీ ఆచార్యులవారు. ఎంత సునిశిత దృష్టి? ఎంత సున్నితమైన భావన? ఎంత సులభమనోజ్ఞ శైలి? ఎంత సులలితపదప్రయోగం? ఎంత సుకర అన్వయం? ఇదంతా వారి సొమ్ము! వారికే చెల్లింది. ఇప్పుడు పద్యభావం సుతారంగా పట్టుకునేయత్నం చేద్దాం!


“శివుడి తలమీద ఒకప్రక్క గంగమ్మతల్లి, మరొకవైపు చంద్రుడు, వక్షస్థలంలో వ్రేలాడే వాసుకి(పాపరేడు=సర్పరాజు), నుదుటిమధ్య(అలికంబున) అగ్ని ఉన్నారు. ఆ ఉన్న అందరూ ఎప్పుడూ మెలకువగా ఉండేవారూ, శివపరమాత్మని ఒక్కక్షణమైనా వీడనివారూను. పాపం పశుపతి తన పట్టపురాణితో ఏకాంతంగా సరససల్లాపం చేసుకోవడానికే అవకాశం ఉండదు. “వాక్కు-అర్థములాగ” ఎప్పుడూ

ఎడబాయక ఉండే ఆ దంపతులిద్దరికి “ప్రైవసీ” అన్నది మచ్చుకికూడా లేకుండా పోయింది.

ఐనా ఎలాగో ఒకలాగ కాస్త “గుట్టు”గా ఏదైనా “క”భాషలాంటి కోడ్ లాంగ్వేజ్ లో మట్లాడుకుందామన్నా పరువుదక్కడం కష్టం. ఎందుకంటే చంద్రుడు తారానాథుడు. నక్షత్రాలకి భర్త. తన విశ్వమాధ్యమంద్వారా “కలైనేశన్ “వంటి వార్తాప్రసారాలలో తగినంత మసాలాజోడించి అంతా బట్టబయలు చేస్తాడు. గంగమ్మ “ఛానల్ ” ఆవిడకి వుంది. సవతులని భర్తైన సాగరుడి సమక్షంలో కలిసినవెంటనే శంకరుల సంసారం గుట్టు రట్టు చేస్తుంది. వాసుకి క్రిందిలోకాలప్రసారాలు తను చూసుకుంటాడు. అగ్ని దేవలోకంతోసహా పైలోకాల ప్రసారాలని స్వయంగా దగ్గరవుండి నడిపిస్తాడు. ఇది మన ప్రియమైన విశ్వనాథుడి కాపురం పరిస్థితి. పిసరంతైనా ఏకాంతంలేని కైలాసవాసి సంసారం ఇంత అందంగా సాగుతోందిమరి!

స్వస్తి! 🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌸🌸

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు - జేష్ఠ మాసం - కృష్ణ పక్షం -‌ షష్ఠి - శతభిషం -‌‌ భౌమ వాసరే* (17.06.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

కుమారిలభట్టు

 కుమారిలభట్టు

ఒకానొక సమయంలో భారతదేశమంతటా బౌద్ధమతము వ్యాప్తి చెందినది. దీనికి సంబంధించి సనాతన ధర్మంలో కొంత ఆందోళన పాడడం జరిగింది. బౌద్ధము వేదమును అంగీకరించదు. వేదము ప్రమాణము కాదు అన్నవారిని నాస్తికుడు అని పిలుస్తారు. వేదప్రమాణమును అంగీకరించనిది నాస్తికము అవుతుంది. బౌద్ధము వైపు వెళ్ళిపోతే నాస్తికులు అయిపోతారని నాస్తిక మతమును ఖండించి తిరిగి ప్రజలలో కర్మ నియతిని ఏర్పరచి, మరల అందరినీ వేదమార్గంలో నడిపించడం కోసమని సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారు కుమారిల భట్టుగా వెలశారు. ఆయన ప్రయాగ క్షేత్రంలో పుట్టారు. ఏదయినా తెలుసుకోకుండా ఖండిస్తే దానివలన మర్యాద ఉండదు. బాగా తెలుసుకుని ఖండించాలి. అందుకని వారు ఒక బౌద్దారామమునందు చేరారు. అది ఏడు అంతస్తుల ప్రాకారము కలిగినటువంటి ఆరామము. అక్కడ అనేకమంది బౌద్ధులు ఉండేవారు. వేదము కాని, యజ్ఞము కాని, యాగము కాని, ప్రార్థన కాని, స్తోత్రము కాని చేయడం వారు అంగీకరించరు. అక్కడే కూర్చుని గురువుగారు చెప్పేది ఆయన వినేవారు. సనాతన ధర్మమును ఖండించినపుడు వాటి గురించి చెప్పినపుడు కుమారిల భట్టు ఏడుస్తూ ఉండేవాడు. ఒకరోజున గురువు ‘ఎందుకు ఏడుస్తున్నావు?’ అని అడిగాడు. అపుడు ఆయన ‘సనాతన ధర్మంలోని విషయములను ఎంతో గొప్పగా ఖండించారు. అందుకు సంతోషంతో ఆనంద భాష్పములు కారుస్తున్నాను’ అని ఆయన అబద్ధం చెప్పారు. ఎందుకు? అసలు ఆ మతంలో ఉన్నదేంటో తెలుసుకుంటే తప్ప ఖండించడం కుదరదు. పూర్వం అంటే అటువంటి కర్మనిష్ఠ ఉండేది. ఇప్పుడు నాలుగు శ్లోకములు, రెండు పద్యములు చదవడం రాకపోయినా అసలు అవతల మతంలో గొప్పతనం ఏమి ఉన్నదో తెలియకపోయినా అవతల మతానికున్న ప్రస్తాన త్రయం అంటే ఏమిటో తెలియకపోయినా, అవతల మతం మీద దుమ్మెత్తి పోసెయ్యవచ్చు. అంతటి హీనస్థితికి మనం దిగజారిపోయాము. ఇది కలియుగం కదా! కానీ కుమారిల భట్టు అటువంటి వాడు కాదు. విషయమును తెలుసుకుని, ఏది చెడో దానిని మాత్రమే ఖండించాలని అనుకున్నాడు. ఇలా అనుకుని గురువుగారి దగ్గర నేర్చుకున్నాడు.

బాగా నేర్చుకున్న తర్వాత ఈయన ఉద్దేశ్యమును శిష్యులు, గురువులు కనిపెట్టారు. ‘ఈయన బౌద్ధుడు కాడు. ఈయన బ్రాహ్మణుడు. ఈయన సనాతన ధర్మమునందు మక్కువ ఉన్నవాడు. వేదమంటే చాలా ప్రీతి కలిగిన వాడు. ఈయన కేవలం మన మతం గురించి తెలుసుకోవడానికి మనలో చేరాడు. కుశాగ్రబుద్ధి కనుక ఈవేళో రేపో మనతో వాదానికి దిగుతాడు. అప్పుడు మనం ఈయనను తట్టుకోవడం కష్టం. కాబట్టి ఆయన ఈ స్థితిని పొందకముందే ఈయనను చంపేస్తే గొడవ వదిలిపోతుంది’ అని అనుకున్నారు. ఆయనను మాటలలో పెట్టి ఏడవ అంతస్తుకి తీసుకువెళ్ళారు. ఒక కిటికీ దగ్గర నిలబెట్టి ఆయనతో మాట్లాడుతుండగా కొందరు వెనకనుంచి వచ్చి ఆయన రెండు కాళ్ళూ ఎత్తేసి, ఆయనను పైనుండి క్రిందికి తోసేశారు. అపుడు కుమారిల భట్టు క్రింద పడిపోతూ ఆయన ఒక శ్లోకం చెప్పారు. ‘వేదమే ప్రమాణం అయితే, సనాతన ధర్మం సత్యం అయితే వేదములలో చెప్పబడినవన్నీ సత్యములే అయితే, అది అనుష్టించవలసిన మతమయితే నేను క్రిందపడినప్పుడు మరణించకుందును గాక’ అని దాని అర్థం. ఏడంతస్తుల నుండి కిందపడిపోయినా ఆయనకు ఏమీ అవలేదు. కానీ కంట్లో ఒకరాయి గుచ్చుకుని నెత్తురు వచ్చింది. ఆయన వెంటనే వేదమాతను ప్రార్థన చేసి ‘నువ్వు ప్రమాణం అయితే నేను మరణించకూడదు అని నేను అన్నాను. ఇపుడు నేను మరణించలేదు. బ్రతికాను. నువ్వు ప్రమాణమని నిరూపించావు. చాలా సంతోషం. కానీ ఈ రాయి నా కంట్లో ఎందుకు గుచ్చుకోవాలి?’ అని అడిగాడు.

మనకి పురాణములలో అశరీరవాణి పలికింది అని తరచుగా చెప్తుంటారు. అశరీరవాణి అంటే వేదం. ఇప్పుడు వేదం అశరీరవాణియై పలికింది. వేదమును మొట్టమొదట ఈశ్వరుడు ఋషులకు చెప్పాడు. ఏ రూపము లేకుండా వారికి వినపడేటట్లుగా వాళ్ళ చెవిలో చెప్పాడు. అది అప్పటినుంచి వినబడుతూ గురువు దగ్గర శిష్యుడు, గురువు దగర శిష్యుడు అలా వింటూ వెళ్ళింది. కాబట్టి దానికి ‘శృతి’ అని పేరు వచ్చింది. వింటూ స్వరం తెలుసుకుని పలికారు కనుక దానికి శృతి అని పేరు వచ్చింది. కాబట్టి ‘మనకి శృతి ప్రమాణము. ఇటువంటి శృతి ప్రమాణం అయితే చావకూడదని నేను అనినప్పుడు నేను చావలేదు కానీ నా కంటికి ఎందుకు దెబ్బతగిలింది’ అని ఆయన అడిగారు. అలా అడిగితే అశరీరవాణియైవేదము అంది ‘నీవు పైనుండి క్రింద పడిపోయేటప్పుడు ‘వేదమే ప్రమాణం అయితే’ అంటూ పడ్డావు. ‘వేదము ప్రమాణం కనుక నేను మరణించను’ అని నీవు అనలేదు. చిన్న అనుమానం పెట్టుకున్నావు. అటువంటి అనుమానము నీ శ్లోకమునండు ఉండరాదు. నీవు బ్రతికావు కానీ నీకు ఈ చిన్న అనుమానం ఉండడం వల్ల కంట్లో రాయి గుచ్చుకుంది’ కుమారిల భట్టుకి కంటికి దెబ్బ తగిలింది కానీ వేదము ప్రమాణం అయింది. అప్పటి నుంచి మరల అందరూ కర్మానుష్ఠానం యజ్ఞము, యాగము, దానము ఇవన్నీ మళ్ళీ మొదలుపెట్టారు. https://chat.whatsapp.com/JY0yPPPRgIiHuoZll8ImNd

కుక్కే సుబ్రహ్మణ్య

 *కుక్కే సుబ్రహ్మణ్య – నాగదేవత నివసించే ప్రదేశం*

నాగదోష పరిహారం చేయించుకోవాలను కుంటున్నారా?!. 

మీ అనుకూలాన్ని బట్టి ఈ ఆలయాన్ని సందర్శించండి, మహిమాన్విత మైన శ్రీ కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహాన్నీ పొందండి...


కుక్కే శ్రీ సుబ్రమణ్యేస్వామి వారి గుడి KUKKE SREE SUBRAMANYA Temple నాగదోష పరిహారములకు చాలా ప్రసిద్ధమైనది. 

ఇక్కడ ప్రధానముగ సర్పహత్యదోషం, ఆశ్లేష బలి పూజ మరియు నాగ ప్రతిష్ట పూజలు చాలా నిష్టగ నిర్వహిస్తారు. 

ఇక్కడ గుడిలో నాగదోష పరిహారములు చేసుకుంటే వారికి జీవితంలో ఎటువంటి భాదలు లేకుండా మంచి సంతానం కలిగి సుఖసంతోశాలతో జీవిస్తారు, అని పురాణ గాధలలో ఉంది.


కర్ణాటకలోని మంగళూరు దగ్గరలోని సుల్లియా అనే ఊళ్ళో కుక్కే సుబ్రమణ్య దేవాలయం వుంది.

 సుబ్రహ్మణ్య స్వామిని ఇక్కడ నాగ దేవతగా ఆరాధించడం విశేషం. 

ఇది ఒక ప్రసిద్ధ యాత్రా స్థల౦ – ఇక్కడి క్షేత్ర గాధ కూడా యాత్రికుల్ని ఇక్కడికి ఆకర్షిస్తుంది.


*ఆలయ స్థలపురాణం*


ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మన దేశంలో ఎన్నో దేవాలయాలు వెలిశాయి.

వాటిల్లో కొన్ని ఆలయాలను భక్తులు, రాజులు, వంశస్థులవారు దేవుడిపై భక్తిని చాటిచెప్పేందుకు నిర్మించగా.. మరికొన్ని దేవాలయాల్లో దేవతలు స్వయంభువులుగా వెలిశారు. 

అలా వెలిసిన దేవాలయాల్లో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఒకటి.

 కుమారస్వామి (సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, కార్తికేయుడు) కి నిలయమైన ఈ క్షేత్రం ‘పరశురామ’ క్షేత్రాలలో ఒకటి.


ఈ ఆలయం ప్రాకృతిక సౌందర్యారాలు వెలువరించే కర్ణాటక రాష్ట్రం, దక్షిణ కన్నడ జిల్లాలో మంగళూరుకు 100 కి.మీ.ల దూరంలో కుమార పర్వతశ్రేణుల మధ్య ధారా నది ఒడ్డున ఉన్న గ్రామం ’సుబ్రహ్మణ్యం’లో వుంది.


 పూర్వం ఈ గ్రామాన్ని ‘కుక్కే పట్నం’ అనే పిలిచేవారు, క్రమంగా ఇది ‘కుక్కె సుబ్రహ్మణ్య’గా ప్రాచుర్యంలోకి వచ్చింది. 

సుబ్రహ్మణ్య ఆలయం గురించి ‘స్కాందపురాణం’లో సనత్‌కుమార సంహితలోని సహ్యాద్రికాండలోని తీర్ధక్షేత్రమహామణి పురాణంలో తెలుపబడింది.🙏

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: ఏడవ అధ్యాయం

విజ్ఞానయోగం: శ్రీ భగవానువాచ


యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి 

తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్ (21)


స తయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే 

లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హి తాన్ (22)


ఏ భక్తుడు ఏ దేవతామూర్తిని పూజించకోరుతున్నాడో, అతనికి ఆ దేవతామూర్తి పట్ల అచంచలమైన శ్రద్ధ నేను కలగజేస్తాను. అలాంటి శ్రద్ధాభక్తులతో ఆ దేవతామూర్తిని ఆరాధించినవాడు నేను కలగజేసే కామితార్థాలనే ఆ దేవతద్వారా పొందుతున్నాడు.

శ్రీ వజ్రేశ్వరి ఆలయం

 🕉 మన గుడి : నెం 1145


⚜ మహారాష్ట్ర : ముంబై 


⚜  శ్రీ వజ్రేశ్వరి ఆలయం



💠 శ్రీ వజ్రేశ్వరి యోగిని దేవి ఆలయం, మహారాష్ట్రలోని ముంబై సమీపంలో ఉన్న వజ్రేశ్వరి దేవికి అంకితం చేయబడిన గౌరవనీయమైన తీర్థయాత్ర స్థలం. 

ఈ ఆలయం దాని దైవిక ఉనికి, వేడి నీటి బుగ్గలు మరియు చారిత్రక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది.


💠 వజ్రేశ్వరి ఆలయం దుర్గాదేవి స్వరూపమైన వజ్రేశ్వరికి అంకితం చేయబడింది.

గతంలో వడ్వలి అని పిలువబడే ఈ పట్టణాన్ని ఆలయ ప్రధాన దేవత గౌరవార్థం వజ్రేశ్వరి అని పేరు మార్చారు.


💠 పురాణాలు వద్వాలి ప్రాంతాన్ని విష్ణువు అవతారాలైన రాముడు మరియు పరశురాముడు సందర్శించిన ప్రదేశంగా పేర్కొన్నాయి . పరశురాముడు వద్వాలిలో యజ్ఞం చేశాడని మరియు ఆ ప్రాంతంలోని అగ్నిపర్వత బూడిద కొండలు దాని అవశేషంగా ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి .


💠 ఈ ఆలయ ప్రధాన దేవత వజ్రేశ్వరి, వజ్రబాయి మరియు వజ్రయోగిని అని కూడా పిలుస్తారు, దీనిని వజ్రేశ్వరి అని కూడా పిలుస్తారు , ఇది భూమిపై పార్వతి లేదా ఆది-మాయ దేవత యొక్క అవతారంగా పరిగణించబడుతుంది . 

ఆమె పేరుకు అక్షరాలా " వజ్ర మహిళ ( పిడుగు )" అని అర్థం. 


💠 దేవత యొక్క మూలాల గురించి రెండు ఇతిహాసాలు ఉన్నాయి, రెండూ వజ్రంతో సంబంధం కలిగి ఉన్నాయి.


💠 కాళికాళ లేదా కాళికుట్ అనే రాక్షసుడు వద్వాలి ప్రాంతంలో ఋషులను మరియు మానవులను ఇబ్బంది పెట్టాడు మరియు దేవతలకు వ్యతిరేకంగా యుద్ధం చేశాడు. 

బాధతో, వశిష్టుడి నేతృత్వంలోని దేవతలు మరియు ఋషులు ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి త్రిచండి యజ్ఞం చేశారు 


💠 ఇది దేవతకు అగ్ని నైవేద్యం . ఆహుతి ( యజ్ఞంలో నెయ్యి నైవేద్యం ) ఇంద్రుడికి (దేవతల రాజు) ఇవ్వబడలేదు . 

కోపంతో, ఇంద్రుడు తన వజ్రాన్ని ( హిందూ పురాణాలలో అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో ఒకటి ) యజ్ఞంపై విసిరాడు. 

భయభ్రాంతులకు గురైన దేవతలు మరియు ఋషులు తమను రక్షించమని దేవతను ప్రార్థించారు. 

ఆ ప్రదేశంలో దేవత తన మహిమతో కనిపించింది మరియు వజ్రాన్ని మింగివేసింది మరియు ఇంద్రుడిని అణగదొక్కడమే కాకుండా రాక్షసులను కూడా చంపింది. 


💠 రాముడు దేవత వద్వాలి ప్రాంతంలో ఉండి వజ్రేశ్వరి అని పిలువబడాలని కోరాడు. 

అందువలన, ఈ ప్రాంతంలో వజ్రేశ్వరి ఆలయం స్థాపించబడింది.


💠 వజ్రేశ్వరి మహాత్మ్యంలోని మరో పురాణం ప్రకారం, ఇంద్రుడు మరియు ఇతర దేవతలు పార్వతి దేవి వద్దకు వెళ్లి , కాళిక అనే రాక్షసుడిని చంపడానికి సహాయం చేయమని అభ్యర్థించారు. 

పార్వతి దేవి సరైన సమయంలో వారికి సహాయం చేస్తానని హామీ ఇచ్చి, ఆ రాక్షసుడితో పోరాడమని ఆదేశించింది. యుద్ధంలో, కాళిక తనపై విసిరిన అన్ని ఆయుధాలను మింగేసింది .

చివరకు, ఇంద్రుడు వజ్రాన్ని రాక్షసుడిపై విసిరాడు, దానిని కాళిక ముక్కలుగా విరిచింది. వజ్రం నుండి దేవత ఉద్భవించింది, ఆమె రాక్షసుడిని నాశనం చేసింది. దేవతలు ఆమెను వజ్రేశ్వరిగా కీర్తించి , ఆమె ఆలయాన్ని నిర్మించారు. 


💠 1739లో, పేష్వా బాజీ రావు I యొక్క తమ్ముడు మరియు సైనిక కమాండర్ అయిన చిమాజీ అప్పా , పోర్చుగీసు ఆధీనంలో ఉన్న వాసాయి కోటను స్వాధీనం చేసుకునేందుకు వెళుతూ వాడ్వాలి ప్రాంతంలో శిబిరం ఏర్పాటు చేసుకున్నాడు . 

మూడు సంవత్సరాల యుద్ధం తర్వాత కూడా ఆ కోట జయించలేనిది. 

కోటను జయించి పోర్చుగీసువారిని ఓడించగలిగితే, ఆమెకు ఒక ఆలయాన్ని నిర్మిస్తానని చిమాజీ అప్పా దేవత వజ్రేశ్వరిని ప్రార్థించాడు. 


💠 పురాణాల ప్రకారం, దేవత వజ్రేశ్వరి అతని కలలో కనిపించి కోటను ఎలా జయించాలో చెప్పింది. 

మే 16న, కోట కూలిపోయింది మరియు వాసాయిలో పోర్చుగీసుల ఓటమి పూర్తయింది. 

తన విజయాన్ని జరుపుకోవడానికి మరియు దేవత వజ్రేశ్వరి ముందు తీసుకున్న ప్రతిజ్ఞను నెరవేర్చడానికి, చిమాజీ అప్పా కొత్త సుభేదార్ (గవర్నర్) శంకర్ కేశవ్ ఫాడ్కేను వజ్రేశ్వరి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు.


💠 ప్రధాన మందిరంలో మూడు విభాగాలు ఉన్నాయి: 

ప్రధాన గర్భగుడి ( గర్భ గృహం ), మరొక గర్భగుడి, మరియు స్తంభాల మండపం (సమావేశ మందిరం).


💠 గర్భ గృహంలో ఆరు విగ్రహాలు ఉన్నాయి. కుడి మరియు ఎడమ చేతుల్లో వరుసగా కత్తి మరియు గద కలిగిన వజ్రేశ్వరి దేవత యొక్క కాషాయ మూర్తి (విగ్రహం) మరియు ఆమె పక్కన త్రిశూలం మధ్యలో ఉన్నాయి. 


💠 చేతిలో కత్తి మరియు కమలంతో ఉన్న రేణుక (పరుశురాముడి తల్లి) దేవత యొక్క విగ్రహాలు, వాణి దేవత, సప్తశృంగి మహాలక్ష్మి మరియు పులి, ( దేవత వజ్రేశ్వరి వాహనం) దేవత యొక్క ఎడమ వైపున ఉన్నాయి. 

ఆమె కుడి వైపున కమలం మరియు కమండలు (నీటి కుండ) కలిగిన కాళికా (గ్రామ దేవత) యొక్క విగ్రహాలు మరియు పరశురాముడు పార్శువు (గొడ్డలి)తో సాయుధంగా ఉన్నారు.


💠 గర్భగుడి వెలుపల ఉన్న గర్భగుడిలో గణేశుడు , భైరవుడు , హనుమంతుడు మరియు మొరబా దేవి వంటి స్థానిక దేవతల విగ్రహాలు ఉన్నాయి. 

భక్తులు మందిరంలోకి ప్రవేశించేటప్పుడు మోగించే గంట మరియు పాలరాయి సింహం ఉన్నాయి.


💠 ముంబై నుండి 75 కి.మీ దూరంలో ఉన్న వజ్రేశ్వరి పట్టణంలో ఉంది.


రచన

©️ Santosh Kumar

18-18,19-గీతా మకరందము

 18-18,19-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - కర్మకు కారణమును, ఆధారమును తెలుపుచున్నారు –


జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా 

త్రివిధా కర్మచోదనా 

కరణం కర్మ కర్తేతి 

త్రివిధః కర్మసంగ్రహః


తాత్పర్యము: - కర్మమునకు హేతువు తెలివి, తెలియదగిన వస్తువు, తెలియువాడు అని మూడువిధములుగ నున్నది. అట్లే కర్మ కాధారమున్ను ఉపకరణము (సాధనము), క్రియ, చేయువాడు - అని మూడు విధములుగ నున్నది.

 

 ప్రశ్న:- కర్మమునకు హేతు వెన్ని విధములుగ నున్నది? అవియేవి?

ఉత్తరము:- మూడువిధములుగ. అవి (1) ఉపకరణము (2) క్రియ (3) కర్త (చేయువాడు) అయియున్నవి.

~~~~

అవతారిక - జ్ఞానము, కర్మ, కర్త - అనువానియొక్క సాత్త్విక, రాజస, తామసరూపములను తెలియజేసెదనని భగవానుడు పలుకుచున్నారు -


జ్ఞానం కర్మ చ కర్తా చ 

త్రిథైవ గుణభేదతః

ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్ఛృణు తాన్యపి. 


తాత్పర్యము:- గుణములనుగూర్చి విచారణచేయు సాంఖ్యశాస్త్రమునందు జ్ఞానము, కర్మము, కర్త అనునివియు సత్త్వాదిగుణములయొక్క భేదముననుసరించి మూడువిధములుగనే చెప్పబడుచున్నవి. వానినిగూడ యథారీతి (శాస్త్రోక్తప్రకారము) చెప్పెదను వినుము.


ప్రశ్న:- భగవానుడు గుణభేదముననుసరించి మూడువిధములుగ వేనినిగురించి చెప్పదలంచెను?

ఉత్తరము:- (1) జ్ఞానము, (2) కర్మ, (3) కర్త - అను ఈ మూడింటినిగూర్చి.

ప్రశ్న:- వానిని గురించి యెచట తెలుపబడినది?

ఉత్తరము:- సాంఖ్యశాస్త్రమునందు.

తిరుమల సర్వస్వం -273*

 *తిరుమల సర్వస్వం -273*

 *సుప్రభాత గానం 3* 

*ఒకటవ శ్లోకం*


*"కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే,* 

*ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్."*


*శ్లోకార్థం* 


 కౌసల్యామాత పుత్రరత్నమైన రామచంద్రా! తూర్పున తెల్లవారుచున్నది. నరులలో శార్దూలము (అనగా సింహం) వంటి శ్రీరామా! దేవదేవునికి నిత్యకైంకర్యాలు సమర్పించే సమయ మాసన్నమైంది. మేలుకో!


*తాత్పర్యం - భావార్థం:*  


 దశావతారధారి, విశ్వవ్యాపి, ఘటనాఘటన సమర్థుడు యైన శ్రీవేంకటేశ్వరుణ్ణి ఎలా సంబోధించాలి? సుప్రభాతగానం దేనితో ప్రారంభించాలి? అన్న సంశయం ఎదురైనప్పుడు శ్రీమహావిష్ణువుకు ఏ అవతారంలో, ఏ మహాపురుషుడు, ఎలా, ఏ సందర్భంలో మేలుకొలుపు పాడారో మన్నన్ స్వామి మననం చేసుకున్నాడు. వెనువెంటనే వాల్మీకి రామాయణం వారి మదిలో మెదిలింది. యాగ సంరక్షణార్థం తనతో వచ్చి, రాత్రి అరణ్యంలో విశ్రమించిన శ్రీరామచంద్రుణ్ణి మరునాటి ఉదయం విశ్వామిత్రుడు ఏవిధంగా మేలుకొలిపాడో తలపుకు వచ్చింది. స్వామివారిని తన మనోఫలకంపై త్రేతాయుగ అవతారమైన శ్రీరామచంద్రునిగా చిత్రించుకున్నాడు. తక్షణం వారి నోటినుండి పై శ్లోకం వెలువడింది.


 వన్యమృగాలకు మృగరాజే (అనగా సింహం) మకుటం లేని మహారాజు. శ్రీరాముణ్ణి శార్దూలంతో పోల్చడం ద్వారా ఈ శ్లోకంలో వారిని నరులందరికి రారాజుగా వర్ణించడం జరిగింది.


 రాముడే దేవుడు. వారింకెవరిని అర్చించుకోవాలి? అనే సంశయం మన మదిలో ఉత్పన్నమయ్యే ఆస్కారముంది. శ్రీరాముడు తన అవతార పరిసమాప్తి వరకు మానవమాత్రుని గానే ప్రవర్తించి, మానవ సహజమైన కష్టనష్టాలను అనుభవించాడు. వాటన్నింటినీ స్థిరచిత్తంతో సహించి, విపత్కర పరిస్థితులను వీరోచితంగా ఎదుర్కొన్నాడు గానీ విష్ణువుగా తన మహత్తును ప్రదర్శించలేదు. సముద్రాన్ని లంఘించాల్సి వచ్చినప్పుడు వానరసేనతో వారధి నిర్మింపజేశాడు గానీ వైకుంఠం లోని క్రీడాపర్వతాన్ని తెచ్చి అవలీలగా పుడమిపై ప్రతిష్ఠించిన తన భృత్యుడైన గరుత్మంతుణ్ణి, తన సేనలను ఆవలివడ్డుకు చేర్చవలసిందిగా ఆదేశించలేదు. ఆ మహత్తర కార్యాన్ని గరుడుడు తృటిలో నిర్వహించగలడు. కానీ, రాముడు యుగధర్మాన్ని పాటించి, సామాన్య మానవునిలా మసలుకొన్నాడు. కావున శ్రీరామచంద్రుడు సైతం పురుషార్థసాధనలో భాగంగా దేవతారాధన చేయాల్సిందే.



 *రెండవ శ్లోకం*


*"ఉత్తష్టోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ,* 

*ఉత్తిష్ఠ కమలాకాన్త త్రైలోక్య మంగళం కురు."*


*శ్లోకార్థం*   


 గోవిందా! గరుడధ్వజాన్ని చిహ్నంగా గలిగిన రాజాధిరాజా! లక్ష్మీనాథా! సత్వరమే మేలుకో... మేలుకొని ముల్లోకాలకు శుభాలను కలుగజేయి.


*తాత్పర్యం - భావార్థం:*  


 శ్రీవేంకటేశ్వరుణ్ణి మొదటి శ్లోకంలో శ్రీరామచంద్రునిగా సంబోధించిన అణ్ణన్ స్వామివారు; రెండవ శ్లోకంలో *'గోవిందా'* అంటూ శ్రీమహావిష్ణువు యొక్క మరో ఉత్కృష్ట అవతారమైన శ్రీకృష్ణునిగా కీర్తించారు. గోకులంలో గోవర్ధనగిరి నెత్తి గోవులను రక్షించడం ద్వారా శ్రీకృష్ణుడు గోవిందుడు అయ్యాడు. గోవులతో, గోపకులతో శ్రీకృష్ణుని కానాడు ఉన్న అనుబంధం నేటికీ కొనసాగుతోంది. ఈనాటికీ, ప్రతినిత్యం శ్రీనివాసుని ప్రథమ దర్శనభాగ్యం ఒక గొల్లవానికే లభిస్తుందని మునుపటి ప్రకరణాలలో తెలుసుకున్నాం.


 ఈ శ్లోకంలో శ్రీనివాసుణ్ణి 'గరుడధ్వజం' చిహ్నంగా కలిగిన వానిలా కూడా కవివరేణ్యులు వర్ణించారు. శ్రీనివాసునికి తన వాహనము, సేవకుడు అయిన గరుత్మంతునితో ఆత్మీయ సంబంధం ఉంది. శ్రీవారి ధ్వజంలో (జెండా) ఉండే చిహ్నం కూడా గరుత్మంతుడే.


 గరుడధ్వజారోహణతో ముల్లోకవాసులకు ఆహ్వానం పలుకుతూ ఆరంభమయ్యే బ్రహ్మోత్సవాలు అదే ధ్వజాన్ని అవనతం చేయడంతో ముగుస్తాయి. 


 ఆర్తత్రాణపరాయణుడైన ఆనందనిలయుడు గరుడుని పేరు విన్నంతనే పులకించిపోయి, తన కారుణ్యకాంతులను ప్రసరింప జేస్తాడని అణ్ణన్ స్వామివారు ఆకాంక్షించారు. 


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 k*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*శల్య పర్వము ప్రథమాశ్వాసము*

*410 వ రోజు*


*శల్యుడి పరాక్రమము*


సుషేణుడి మరణంతో కౌరవసేనలు పారిపోయాయి. అది చూసి శల్యుడు సింహంలా ఘర్జిస్తూ కౌరవ సేనలు పారి పోకుండా నిలిపాడు. తిరిగి కౌరవ సేనలు పాండవసేనలతో తలపడ్డాయి. ధర్మరాజుకు రక్షణగా భీమసేనుడు, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, శిఖండి, ఉపపాండవులు, నకుల సహదేవులు నిలిచారు. శల్యుడు వారితో ముందుగా యుద్ధం చేస్తున్నాడు.ఇంతలో ప్రభద్రక సేనలు, పాంచాల సేనలు శల్యుడిని చుట్టుముట్టాయి. శల్యుడు వారిని శరవర్షంలో ముంచెత్తి వారందరిని యమసదనానికి పంపాడు. అది చూసిన సుయోధనుడు సంతోషించాడు. అది చూసి ధర్మరాజు శల్యుడిని ఎదుర్కొన్నాడు. శల్యుడు ఒక నారాచమును ధర్మరాజు శరీరం చీల్చుకు పోయేలా ప్రయోగించాడు. అదిఛూసిన భీముడు ఏడు బాణములు, నకులుడు అయిదు బాణములు, సహదేవుడు తొమ్మిది బాణములు ఉపపాండవులు అనేక బాణములు వేసి శల్యుడిని ఎదుర్కొన్నారు. అది చూసి కృతవర్మ, కృపాచార్యుడు, శకుని, ఉలూకుడు శల్యునికి సాయంగా వచ్చారు. శల్యుడు భీమసేనుడి హయములను చంపాడు. భీముడు తన గద తీసుకుని కౌరవ సేనలను తనుమాడసాగాడు. సహదేవుడు శల్యుని మీద ధారాపాతంగా బాణములు వేసాడు. శల్యుడు సహదేవుడి హయములను చంపాడు. శల్యుడి కుమారుడు రుక్మాంగదుడు సహదేవుడిని ఎదుర్కొన్నాడు. సహదేవుడు కత్తి తీసుకొని కత్తి తీసుకుని తన రథం మీద నుండి కిందికి దూకి రుక్మాందుడి వైపు వెళ్ళి అతడి రథము మీద లంఘించి అతడి తలను తన కత్తితో నరికాడు.


*భీమసేనుడు శల్యుడిని ఎదుర్కొనుట*


కుమారుడి మరణం కళ్ళారా చూసిన శల్యుడుకోపం తట్టుకొన లేక పాండవ సైన్యాలను దునుమాడసాగాడు. శల్యుడు ధర్మరాజు మీద అతిక్రూర మైన బాణమును వేసాడు. అది చూసి భీముడు తన గద తీసుకుని కిందము దిగి శల్యుడి రథానికి కట్టిన అశ్వములను చంపాడు. శల్యుడు భీముడి మీదకు తోమరం విసిరి భీముడి గుండెలను చీల్చాడు. భీమసేనుడు ఆ తోమరమును లాగి దానితో శల్యుడి సారథిని చంపాడు. శల్యుడు ముద్గర అనే ఆయుధము తీసుకుని రథము నుండి కిందికి దిగాడు. భీముడు తన గదాయుధంతో శల్యుడిని ఎదుర్కొన్నాడు. ఇరు పక్షముల సేనలు యుద్ధం ఆపి వారి గదాయుద్ధం చూడసాగారు. శల్యుడు, భీముడు సింహఘర్జనలు చేస్తూ గుండ్రముగా తిరుగుతూ రెండు ఏనుగులవలె ఢీకొన్నారు. గదా ఘాతములతో శరీరం రక్తసిక్తం అయింది. ఒకరిని ఒకరు కొట్టుకుని మూర్ఛ పోయారు. అది చూసి కృపాచార్యుడు శల్యుని తన రథం మీద ఎక్కించుకుని తీసుకు వెళ్ళాడు. భీముడు మూర్ఛ నుండి తేరుకొని శల్యుడి కొరకు వెదుకుతో పెద్దగా అరుస్తున్నాడు. ఇంతలో చేకితానుడి ఆధ్వర్యంలో పాండవసేన భీముని ముందుకు వచ్చి కౌరవసేనలను ఎదుర్కొంది. సుయోధనుడు చేకితానుడి మీద ఒక ఈటెను బలంగా విసిరి చేకితానుడిని చంపాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

సాక్షాత్కారం

 *🕉️సాక్షాత్కారం.....!* 


*ఆత్మ సాక్షాత్కారం వేరు, దైవ సాక్షాత్కారం వేరు. మొదటిది జరగడమే కష్టం. అది జరిగితే రెండోది తనంత తానుగానే సంభవిస్తుంది. ఆత్మ సాక్షాత్కారానికి ఆధ్యాత్మికవేత్తలు కొన్ని మార్గాలు సూచించారు.*


*ఆత్మ సాక్షాత్కారం కలగడానికి పూర్వజన్మ వాసనా బలం కలిగి ఉండాలంటారు కొందరు. సాధకుడి మనసులో తొలుత కొన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి. కంటికి కనిపిస్తూ, నిరంతరం పరిణామం చెందుతున్న ఈ సృష్టికి మూలం ఏమిటి, దాని వెనక దాగిన శక్తి ఏమిటి? ఇంత అద్భుతంగా గతి తప్పకుండా సాగుతున్న ఈ కదలికలకు, అనేక చర్యలకు చోదకశక్తి ఏది లాంటి ప్రశ్నలవి. వాటికి సమా ధానాలు తెలుసుకోగలిగితే ఆత్మజ్ఞానం కలగడం సులువేనని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు. అవి కచ్చితంగా భాగవతంలో మాత్రమే దొరకుతాయి.*


*భాగవతంలో ఏదో ఒక పద్యాన్నో, ఘట్టాన్నో చదవడం మొదలెడితే- ఆపై వారి ప్రమేయం లేకుండానే లోపలికి, ఇంకా లోతులకు తీసుకెళ్లిపోతాయవి. ఆ క్రమంలో పాఠకుల మనసుల్లో ఉత్కంఠ, జిజ్ఞాస బయలుదేరతాయి. మరికొన్ని ప్రశ్నలూ పుడతాయి. ఇలా... భాగవతంలోని విషయం చదువరులను అలౌకిక పరమార్థ స్థితికి చేరుస్తుంది. ఆత్మజ్ఞానం కలగడానికి భాగవతం ఎలా దోహదకారి కాగలదనే సందేహం కలగవచ్చు. దాని ఆవిర్భావానికి దారితీసిన ఘటనలే అందుకు కారణమనే సమాధానమూ ఆ వెంటనే వస్తుంది. అది సంస్కృత భాషలోదా, తెలుగు భాషలోదా అన్న సందేహం అక్కర్లేదు. రెండు భాషల్లోనూ భాగవత ఆవిర్భావ నేపథ్యం అదే.*


*వ్యాసుడు భారతాన్ని రచించాడు. ఏకరాశిగా ఉన్న వేదాలను వ్యాసం (నాలుగుగా) చేశాడు (అందుకే వేదవ్యాసుడనే పేరు పొందాడు.) పురాణాలు, ఉపపురాణాలు రచించాడు. అయినా ఏదో వెలితి మనసును ఆవరించుకుని ఉంది. స్తబ్ధుగా కూర్చుని ఆలోచనలో పడిపోయాడు. నారదుడు ప్రత్యక్షమై ఎందుకలా ఉన్నావని అడిగాడు. వ్యాసుడు చెప్పాడు. అప్పుడు నారదుడు వ్యాసుడితో- 'నువ్వు ఇంత వరకూ లౌకిక విషయాలకు సంబంధించిన రచనలే చేశావు. పారమార్ధిక చింతనను ప్రేరేపించే రచనలు చెయ్యలేదు. ఆ లోటు తీర్చే దిశగా ప్రయత్నాలు చెయ్యి' అని సలహా ఇచ్చాడు. ఆ మాటను సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పిందిగా భావించి (నారదుడు విష్ణు అంశ సంభూతుడని, ఆయన ధరించిన ఇరవై ఒక్క అవతారాల్లో ఇదీ ఒకటనే అభిప్రాయం ప్రచారంలో ఉంది) భాగవత రచనకు పూనుకొన్నాడు.*


*అనువాదానికి సిద్ధమైనప్పుడు పోతన పరిస్థితీ అదే. నారాయణ శతకం, భోగినీ దండకం మొదలైన గ్రంథాలను రచించాడు. అయినా ఏదో అసంతృప్తి తొలుస్తోంది. మనశ్శాంతి కోసం గోదావరి తీరంలో సైకత వేదిక మీద పద్మాసనం వేసుకుని ధ్యానంలో కూర్చున్నాడు. ఆ క్షణంలో ఆయన పక్కన తళుక్కున ఒక మెరుపు మెరిసింది. ఉత్తర క్షణంలో శ్రీరామచంద్రమూర్తి 'శ్రీమహాభాగవతాన్ని తెలిగించు, నీ భవబంధాలన్నీ తొలగిపోతాయి' అని పలికి అంతర్థానమైపోయాడు. కర్తవ్యం బోధపడింది. ఆనంద పరవశుడై- పలికేది భాగవతం, పలికించేవాడు రామభద్రుడు, (కాబట్టి) నేను పలికితే పాపాలను హరించే కావ్యం అవుతుంది. (ఇన్ని లాభాలు ఉన్నప్పుడు) భాగవతాన్ని కాకుండా వేరే విషయాన్ని ఎందుకు పలుకుతాను (పలకను) అని ఆంధ్రీకరణకు పూనుకొన్నాడు. ఈ భాగవతాన్ని భవిష్యత్తులో చదివేవారెవరైనా ఆధ్యాత్మిక మార్గానికి మరలాలని అభిలషించాడు. అందుకు తగ్గట్లు అందులో ఎన్నో సూక్తులు, బోధనలు, భక్తి భావనా విషయాలు, భగవంతుడి కథలు, లీలలు వంటి ముక్తిదాయక విషయాలు చెప్పారిద్దరూ.*


*ఇలా... ఆత్మ సాక్షాత్కారం పొందిన దరిమిలా దైవ సాక్షాత్కారమై వ్యాసుడు, పోతన రచించి, అనువదించిన పురాణమే భాగవతం. అందుకే భాగవతాన్ని చదువుతున్నప్పుడు ఎవరైనా ఏ భేదాలు లేకుండా కేవలం భక్తిభావం కలిగి ఉంటారు. అలా నిర్వికార, నిరామయ చిత్తంతో పారాయణ చేసేవారు ఆత్మసాక్షాత్కారం పొందినవారుగా మారిపోతారు. ఫలితంగా వారికి ఆముష్మిక భావనే తప్ప ఐహిక భావనలుండవు!*

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


    శ్లో𝕝𝕝 *ఋషయశ్చ హి దేవాశ్చ ప్రీయన్తే పితృభిః సహl*

              *పూజ్యమానేషు గురుషు తస్మాత్పూజ్యతమో గురుఃll*


                *_మహాభారతం - శాంతి పర్వమ్_*


తా𝕝𝕝 గురువులను పూజిస్తే..... పితృదేవతలతో పాటు ఋషులు, దేవతలు కూడా సంతోషిస్తారు. కనుక *గురువు మిక్కిలి పూజనీయుడు...*


 ✍️VKS ©️ MSV🙏

ముసలి తనం లో

 *2048*

*కం*

ముదిమిని గల తలిదండ్రుల

ముదమున పాలించినంత ముదిమిన మనకున్

ముదములు కలిగించునటుల

పదునుగ మన తనయు లుండు పదపడి సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ముసలి తనంలో ఉన్న తల్లిదండ్రుల సంతోషమును కాపాడగలిగితే మనలను ముసలి తనం లో కాపాడే విధంగా మన పిల్లలు సన్నద్ధం కాగలరు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*