5, మార్చి 2025, బుధవారం

గురువారం🪷* *🌹06, మార్చి, 2025🌹*

 *卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*

      *🪷గురువారం🪷*

*🌹06, మార్చి, 2025🌹*

    *దృగ్గణిత పంచాంగం*                 


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిరఋతౌః* 

*ఫాల్గుణ మాసం -శుక్లపక్షం*


*తిథి : సప్తమి* ఉ 10.50 వరకు ఉపరి *అష్టమి*

*వారం    : గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం : రోహిణి* రా 12.05 వరకు ఉపరి *మృగశిర*


*యోగం  : విష్కుంబ* రా 08.29 వరకు ఉపరి *ప్రీతి*

*కరణం : వణజి* ఉ 10.50 *భద్ర* రా 10.01 ఉపరి *బవ*


*సాధారణ శుభ సమయాలు*

 *ఉదయం 09.00 - 10.00 వరకు*

అమృత కాలం : *రా 09.02 - 10.34*

అభిజిత్ కాలం  : *ప 11.55 - 12.42*


*వర్జ్యం : సా 04.26 - 05.58*

*దుర్ముహూర్తం : ఉ 10.20 - 11.07 మ 03.05 - 03.53*

*రాహు కాలం : మ 01.48 - 03.17*

గుళికకాళం : *ఉ 09.20 - 10.49*

యమగండం : *ఉ 06.22 - 07.51*

సూర్యరాశి : *కుంభం* 

చంద్రరాశి : *వృషభం*

సూర్యోదయం :*ఉ 06.22* 

సూర్యాస్తమయం :*సా 06.16*

*ప్రయాణశూల : దక్షిణ దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం          :  *ఉ 06.23 - 08.45*

సంగవ కాలం         :      *08.45 - 11.07*

మధ్యాహ్న కాలం  :      *11.07 - 01.30*

అపరాహ్న కాలం   : *మ 01.30 - 03.53*


*ఆబ్ధికం తిధి        : ఫాల్గుణ శుద్ధ అష్టమి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.16*

ప్రదోష కాలం         :  *సా 06.16 - 08.41*

రాత్రి కాలం : *రా 08.41 - 11.54*

నిశీధి కాలం         :*రా 11.54 - 12.43*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.44 - 05.33*

_________________________________

        *🌷ప్రతినిత్యం🌷*

          *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*

    

*🌹పోగొట్టుకున్న వస్తువులు* 

*దొంగలించ బడ్డ ధనము లేక*

*వస్తువుల తిరిగి పొందుటకు🌹*

     

*కార్త వీర్యార్జునో నామ* 

*రాజా బాహు సహస్రవాన్||*

*తస్య స్మరణ మాత్రేన* 

*హృతం నష్టంచ లభ్యతే||*


      *ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🌹🌹🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🌹🌹🌹🌷

🌹🍃🌿🌷🌹🌿🍃🌹

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి

 🕉️🌹🔱🪔🛕🪔🔱🌹🕉️


  *సుబ్రహ్మణ్యేశ్వరస్వామి* 

       *28 నామములు*


1. యోగీశ్వరః – యోగీశ్వరులకు అధిపతి.

2. మహాసేనః – దేవసైన్యానికి అధిపతి, దేవసేనాపతి.

3. కార్తికేయః – ఆరు కృత్తికా నక్షత్రములచే పోషింపబడిన వాడు.

4. అగ్నినన్దనః – పరమశివుని జ్ఞానాగ్ని నుంచి ఉద్భవించినవాడు మరియు పరమశివుని తేజస్సు కొంత సేపు భరించినందువల్ల, అగ్ని దేవునికి కూడా తనయుడిగా పిలువబడినవాడు.

5. స్కందః – పరమశివుని తేజస్సు నుండి జన్మించినవాడు.

6. కుమారః – కుమార అన్న నామం కేవలం సుబ్రహ్మణ్యునికేచెందినది. ఎందుకంటే, జగత్తుకి మాతా పితలు అయిన పార్వతీ పరమేశ్వరుల అన్యోన్యతకి ఫలం మన బుజ్జి సుబ్రహ్మణ్యుడు.

7. సేనానీః – దేవసేనలకు అధిపతి, దేవసేనాధ్యుక్షుడు.

8. స్వామీ శంకరసంభవః – శంకరుని దివ్యమైన తేజస్సు నుండి పుట్టినవాడు.

9. గాంగేయః – పరమశివుని తేజస్సు అగ్నిదేవుడు భరించలేక, గంగా మాతకి ఇచ్చేస్తే, గంగా మాత కొంత సేపు శివుని తేజస్సును భరిస్తుంది. అందువల్ల, గంగా మాతకి కూడా పుత్రునిగా పిలబడ్డవాడు కాబట్టి గాంగేయ అనే నామం వచ్చింది.

10. తామ్రచూడః – కుక్కుటమును అధిరోహించిన వాడు.

11. బ్రహ్మచారీ – ఎల్లప్పుడూ బ్రహ్మనందు రమించువాడు.

12. శిఖిధ్వజః – అగ్ని ధ్వజముగా కలవాడు.

13. తారకారిః – తారకాసురడనే రాక్షస సంహారము చేయుటకు అవతారం దాల్చిన వాడు, తారకాసురుడిని, ఇతర రాక్షస గణములను సంహరించి దేవతలను రక్షించినవాడు.

14. ఉమాపుత్రః – ఉమాదేవి, అంటే పార్వతీ అమ్మ వారి ముద్దుల తనయుడు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి వారు అచ్చం అమ్మవారి లానే ఉంటారు.

15. క్రౌంచారిః – పర్వత రూపములో ఉన్న క్రౌంచ అనే రాక్షసుడిని సంహరించినవాడు.

16. షడాననః – ఆరు ముఖములు గలవాడు.

17. శబ్దబ్రహ్మసముద్రః – జ్ఞాన స్వరూపుడు, అంటే వేదములు ఏ పరబ్రహ్మ స్వరూపమును గురించి ఘోషిస్తున్నాయో, ఆ వేద శబ్దములచే ప్రతిపాదించబడిన వాడు.

18. సిద్ధః – పరిపూర్ణ సిద్ధ స్వరూపుడు.

19. సారస్వతః – సరస్వతీ స్వరూపము, అంటే జ్ఞాన స్వరూపము.

20. గుహః – సకలజీవుల హృదయ గుహలో కొలువై ఉన్నవాడు.

21. భగవాన్ సనత్కుమారః – చతుర్ముఖ బ్రహ్మ గారి నలుగురు మానస పుత్రులలో ఒకరైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగావచ్చారు. ఈ విషయమే, శ్రీవిద్యా రహస్యంలో మాహాత్మ్యఖండంలో వివరించబడినదని, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నిర్ధారించారు.

22. భోగమోక్షఫలప్రదః – ఈ భూమి మీద మనం సుఖంగా జీవించడానికి అవసరమైన సంపదతో పాటు అంత్యమునందు మోక్షమును కూడా ఇవ్వగలిగినవాడు.

23. శరజన్మా – శరవణతటాకము (రెల్లు పొదల) నుండి జన్మించినవాడు.

24. గణాధీశః – సకల దేవతలకు, గణములకు అధిపతి అయిన వాడు.

25. పూర్వజః – అందరికన్నా ముందున్నవాడు, అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు, కేవలం ఒక అవతారం మాత్రమే కాదు, ఎప్పుడూ ఉండే పరబ్రహ్మ స్వరూపం. ఆయన ఎప్పుడూఉన్నవాడు, పుట్టుక లేనివాడు.

26.ముక్తిమార్గకృత్ – ముక్తి మార్గమును బోధించే గురు స్వరూపం. అంత్యమున ముక్తిని ప్రసాదించి, తనలో కలుపుకునే స్వామి.

27.సర్వాగమప్రణేతా – సకల ఆగమములకు మూలము.

28. వాంచితార్ధప్రదర్శనః – అభీష్టములను నెరవేర్చే తండ్రి.


*స్కంద ఉవాచ ఈ ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రము రుద్రయమల తంత్రములోనిది. ఎవరైతే ఈ 28 నామములు ప్రతీ దినం ప్రాతః కాలం భక్తి శ్రద్ధలతో చదువుతారో, వారు సరస్వతీ అనుగ్రహం పొంది, చక్కని తెలివితేటలు, మంచి వాక్కు మరియు జ్ఞానమును పొందుతారు.*


" *సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు "*


              *🔱సేకరణ🔱*

*🌹న్యాయపతి నరసింహారావు🙏*

అమరావతి

 *అమరావతి* - *అమరేశ్వర స్వామి దేవాలయo  చుట్టుప్రక్కల అమరావతి 108 గ్రామాలలో-108 శివాలయములు*(*27నక్షత్రములుకు 108పాదములు*) *27 నక్షత్రములు వారు దర్శించవలసిన శివాలయములు 108 నక్షత్ర పాదములు  వారీగా సూచించబడినది. వారి వారి నక్షత్రమునందుసరించి వారి వారి పాదమున అనుసరించి దర్శించవలసిన శివాలయములు తప్పక దర్శించండి శివానుగ్రహం పొందండి*


1) *అమరావతి మండలం*


1) అత్తలూరు - సోమేశ్వర స్వామి                       

(అశ్విని  - 1 పాదం)                                                

2) చావపాడు - కాశీవిశ్వేశ్వర స్వామి                  

(అశ్విని  - 2 పాదం)                                                

3) ధరణికోట – శంభులింగేశ్వరస్వామి              

(అశ్విని  - 3 పాదం)                                                

4) దిడుగు - సోమేశ్వర స్వామి                            

(అశ్విని  - 4 పాదం)                                                

5) యండ్రాయి - ఉగ్ర ఏకాంబరేశ్వర స్వామి     

(భరణి  - 1 పాదం)                                                   

6) జూపూడి - కాశీవిశ్వేశ్వర స్వామి

(భరణి  - 2 పాదం)

7) కర్లపూడి - రాజరాజేశ్వర స్వామి

(భరణి  - 3 పాదం)

8) లెమెల్లె - మల్లేశ్వర స్వామి

(భరణి  - 4 పాదం)

9) మల్లాది - మల్లేశ్వర స్వామి

(కృతిక  - 1 పాదం)

10) ముక్కామల - మల్లేశ్వర స్వామి

(కృతిక  - 2 పాదం)

11) మునుగోడ - మల్లేశ్వర స్వామి

(కృతిక - 3 పాదం)

12)నెమలికల్లు - మల్లేశ్వర స్వామి

       (కృతిక  - 4పాదం)

13) పెదమద్దూరు-రామలింగేశ్వర స్వామి

         (రోహిణి  - 1 పాదం)

14) పొందుగల - సంగమేశ్వర స్వామి

         (రోహిణి  - 2 పాదం)

15) ఉంగుటూరు - మల్లేశ్వర స్వామి

        (రోహిణి  - 3 పాదం)

16)వైకుంఠపురం - మల్లేశ్వర స్వామి

       (రోహిణి  - 4 పాదం) 


2) *తుళ్లూరు మండలం*       

                                             

1) అబ్బరాజు పాలెం - భవానీశంకర స్వామి                 

(మృగశిర  - 1 పాదం)                                                      

2) అనంతవరం - మల్లేశ్వర స్వామి                              

(మృగశిర  - 2 పాదం)                                                      

3) దొండపాడు – రాజమల్లేశ్వర స్వామి                         

(మృగశిర - 3 పాదం)                                                       

4) మందడం - రామలింగేశ్వర స్వామి                          

(మృగశిర  - 4 పాదం)                                                      

5) నెక్కల్లు - మల్లేశ్వర స్వామి                                       

(ఆరుద్ర  - 1 పాదం)                                                        

6) పెదపరిమి - మల్లేశ్వర స్వామి                                  

(ఆరుద్ర  - 2 పాదం)                                                        

7) రాయపూడి - సోమేశ్వర స్వామి                                 

(ఆరుద్ర  - 3 పాదం)                                                         

8) తుళ్లూరు - రామలింగేశ్వర స్వామి                             

(ఆరుద్ర  - 4 పాదం)                                                         

9) వెలగపూడి - మల్లేశ్వర స్వామి                                   

(పునర్వసు  - 1 పాదం)

10) వెంకటపాలెం - భవానీశంకర స్వామి                       

(పునర్వసు  - 2 పాదం)                                                   


3)  *మంగళగిరి మండలం*

1) ఆత్మకూరు - విశ్వేశ్వర స్వామి

     (పునర్వసు  - 3 పాదం)

2) బేతపూడి - సోమేశ్వర స్వామి

    (పునర్వసు  - 4 పాదం)

3) చినకాకాని - కాశీవిశ్వేశ్వర స్వామి

      (పుష్యమి  - 1 పాదం)

4) కాజా - అగస్త్యేశ్వర స్వామి

    (పుష్యమి - 2 పాదం)

5) కురగల్లు - మల్లేశ్వర స్వామి

    (పుష్యమి  - 3 పాదం)

6) మంగళగిరి - మల్లేశ్వర స్వామి

   (పుష్యమి  - 4 పాదం)

7) నవులూరు - నాగేశ్వర స్వామి

     (ఆశ్లేష  - 1 పాదం)

8) నిడమర్రు - మల్లేశ్వర స్వామి

     (ఆశ్లేష  - 2 పాదం)

9) నూతక్కి - శక్తీశ్వర స్వామి

 (ఆశ్లేష  - 3 పాదం)

 10) పెదవడ్లపూడి - మల్లేశ్వర స్వామి 

 (ఆశ్లేష  - 4 పాదం)




4) *తాడేపల్లి మండలం*                                          



1) చిర్రావూరు - నాగేశ్వర స్వామి                         

(మఖ  - 1 పాదం)                                                   

2) గుండిమెడ - కాశీవిశ్వేశ్వర స్వామి                  

(మఖ  - 2 పాదం)                                                

3) కొలనుకొండ – కాశీవిశ్వేశ్వర స్వామి              

(మఖ  - 3 పాదం)                                                

4) కుంచనపల్లి - కాశీవిశ్వేశ్వర స్వామి              

(మఖ  - 4 పాదం)                                                

5) పెనుమాక - మల్లేశ్వర స్వామి     

(పుబ్బ  - 1 పాదం)                                                   

6) సీతానగరం - సోమేశ్వర స్వామి

(పుబ్బ  - 2 పాదం)

7) తాడేపల్లి - త్రిపుర తాండవేశ్వర స్వామి

(పుబ్బ  - 3 పాదం)

8) ఉండవల్లి - భాస్కరేశ్వర స్వామి

(పుబ్బ  - 4 పాదం)

9) వడ్డేశ్వరం - రుద్రేశ్వర స్వామి

(ఉత్తర  - 1 పాదం)

5) *పెదకాకాని మండలం*


1) అనుమర్లపూడి - మల్లేశ్వర స్వామి

      (ఉత్తర  - 2 పాదం)

2) నంబూరు - మల్లేశ్వర స్వామి

    (ఉత్తర  - 3 పాదం)

3) తక్కెళ్లపాడు - చంద్రశేఖర స్వామి

 (ఉత్తర  - 4 పాదం)

4) వెనిగండ్ల - ఉమామహే శ్వర స్వామి

     (హస్తా  - 1 పాదం)


6) *పెదకూరపాడు*                                         


1) చిన్నమక్కెన - కాశీవిశ్వేశ్వర స్వామి               

(హస్తా  - 2 పాదం)                                                   

2) లగడపాడు - మల్లిఖార్జున స్వామి                   

(హస్తా  - 3 పాదం)                                                  

3) ముస్సాపురం – రాజరాజేశ్వర స్వామి              

(హస్తా  - 4 పాదం)                                                   

4) పాటిబండ్ల - మల్లేశ్వర స్వామి                         

(చిత్త  - 1 పాదం)                                                     

5) పెదకూరపాడు - రామలింగేశ్వర స్వామి         

(చిత్త  - 2 పాదం)                                                     


7) *మేడికొండూరు మండలం*


1) మేడికొండూరు - భీమలింగేశ్వర స్వామి

  (చిత్త  - 3 పాదం)

2) పాలడుగు -  భీమేశ్వర స్వామి

   (చిత్త  - 4 పాదం)

3) మండపాడు -చెన్నకేశవ మల్లేశ్వర స్వామి

 (స్వాతి  - 1 పాదం)

4) సరిపూడి - దక్షిణామూర్తి స్వామి

 (స్వాతి  - 2 పాదం)

5) విశదల - మల్లేశ్వర స్వామి

 (స్వాతి  - 3 పాదం)

  6) సిరిపురం - రామలింగేశ్వర స్వామి

     (స్వాతి  - 4 పాదం)

   7) పొట్లపాడు - రామలింగేశ్వర స్వామి

      (విశాఖ  - 1 పాదం)

  8) కొర్రపాడు - సోమేశ్వర స్వామి

        (విశాఖ  - 2 పాదం)


8) *తెనాలి మండలం*                                          



1) అంగలకుదురు - మల్లేశ్వర స్వామి              

(విశాఖ  - 3 పాదం)                                                

2) గుడివాడ - నీలకంఠేశ్వర స్వామి                  

(విశాఖ  - 4 పాదం)                                               

3) కొలకలూరు – అగస్త్యేశ్వర స్వామి               

(అనురాధ  - 1 పాదం)                                         

4) నందివెలుగు - అగస్త్యేశ్వర స్వామి            

(అనురాధ  - 2 పాదం)                                           

5) పెదరావూరు - మల్లేశ్వర స్వామి                   

(అనురాధ  - 3 పాదం)                                             

 9) *సత్తెనపల్లి మండలం*


1) సత్తెనపల్లి - కాశీవిశ్వేశ్వర స్వామి

    (అనురాధ  - 4పాదం)

2) పాకలపాడు - శంభులింగేశ్వర స్వామి

    (జ్యేష్ఠ  - 1 పాదం)

3) నందిగామ - సోమేశ్వర స్వామి

   (జ్యేష్ఠ  - 2 పాదం)

4) కొమెరపూడి - ఆనందేశ్వర స్వామి

     (జ్యేష్ఠ  - 3 పాదం)

5) కట్టమూరు - కాశీవిశ్వేశ్వర స్వామి

    (జ్యేష్ఠ  - 4 పాదం)

6) కంటెపూడి - మల్లేశ్వర స్వామి

     (మూల  - 1 పాదం)

7) గుడిపూడి - సోమేశ్వర స్వామి

       (మూల  - 2 పాదం)

8) ధూళిపాళ్ల - ఉత్తరేశ్వర స్వామి

       (మూల  - 3 పాదం)

9) భృగుబండ - సోమేశ్వర స్వామి

      (మూల  - 4 పాదం)



10) *క్రోసూరు మండలం*      

                                   

1) అందుకూరు - రామలింగేశ్వర స్వామి             

(పూర్వాషాడ  - 1 పాదం)                                                

2) బాలేమర్రు - భవానీశంకర స్వామి                     

(పూర్వాషాడ  - 2 పాదం)                                               

3) బయ్యవరం – కాశీవిశ్వేశ్వర స్వామి                  

(పూర్వాషాడ  - 3 పాదం)                                                

4) దొడ్లేరు - భీమలింగేశ్వర స్వామి                        

(పూర్వాషాడ  - 4 పాదం)                                                

5) హాసన్నబాదు - కాశీవిశ్వేశ్వర స్వామి              

(ఉత్తరాషాడ  - 1 పాదం)                                                  

6) క్రోసూరు - మల్లేశ్వర స్వామి                            

(ఉత్తరాషాడ  - 2 పాదం)                                               

7) పారుపల్లి - రాజమల్లేశ్వర స్వామి                    

(ఉత్తరాషాడ  - 3 పాదం)                                               

8) పీసపాడు - నాగమల్లేశ్వర స్వామి                   

(ఉత్తరాషాడ  - 4 పాదం)                                                 

9) విప్పర్ల - మల్లేశ్వర స్వామి

(శ్రవణం  - 1 పాదం)

10 ఊటుకూరు - కాశీవిశ్వేశ్వర స్వామి

(శ్రవణం  - 2పాదం)

 11) *అచ్చంపేట మండలం*


1) అచ్చంపేట - మల్లేశ్వర స్వామి

 (శ్రవణం  - 3 పాదం)

2) చామర్రు - లక్ష్మణేశ్వర స్వామి

 (శ్రవణం  - 4 పాదం)

3) గింజుపల్లి - కాశీవిశ్వేశ్వర స్వామి

 (ధనిష్ఠా  - 1 పాదం)

4) కస్తల - చంద్రమౌళేశ్వర స్వామి

 (ధనిష్ఠా  - 2 పాదం)

5) కోగంటివారిపాలెం- రామలింగేశ్వర స్వామి

 (ధనిష్ఠా  - 3 పాదం)

6) క్రోసూరు - సోమేశ్వర స్వామి 

 (ధనిష్ఠా  - 4 పాదం)

7) కొత్తపల్లి - మల్లేశ్వర స్వామి 

 (శతభిషా  - 1 పాదం)

8) వేల్పూరు - రామలింగేశ్వర స్వామి

 (శతభిషా  - 2 పాదం)


12) *తాడికొండ మండలం*                                          

1) బండారుపల్లి - మల్లేశ్వర స్వామి                   

(శతభిషా  - 3 పాదం)                                              

2) నిడుముక్కల - సోమేశ్వర స్వామి                  

(శతభిషా  - 4 పాదం)                                              

3) పాములపాడు – మల్లేశ్వర స్వామి                  

(పూర్వాభద్రా  - 1 పాదం)                                        

4) ఫణిద్రం - రామలింగేశ్వర స్వామి                  

(పూర్వాభద్రా  - 2 పాదం)                                         

5) పొన్నెకల్లు - రాజరాజేశ్వర స్వామి                 

(పూర్వాభద్రా  - 3 పాదం)                                          

6) తాడికొండ- మూలస్థానేశ్వర స్వామి               

   (పూర్వాభద్రా  - 4 పాదం)                                        

                                                                                                                                                         

                                                                                                                                    

13) *గుంటూరు మండలం*


1) గోరంట్ల - మల్లేశ్వర స్వామి

 (ఉత్తరాభద్రా  - 1 పాదం)

2) గోర్లవానిపాలెం - కాశీవిశ్వేశ్వర స్వామి

 (ఉత్తరాభద్రా  - 2 పాదం)

3) జొన్నలగడ్డ - అమరలింగేశ్వర స్వామి

 (ఉత్తరాభద్రా  - 3 పాదం)

4) లాం - మల్లేశ్వర స్వామి

 (ఉత్తరాభద్రా  - 4 పాదం)

5) మల్లవరం - మహలింగేశ్వర స్వామి

 (రేవతి  - 1 పాదం) 

6) నల్లపాడు - అగస్త్యేశ్వర స్వామి

    (రేవతి  - 2 పాదం)

7) పెదపలకులూరు - సర్వేశ్వర స్వామి

    (రేవతి  - 3 పాదం)

8) పొత్తూరు - సోమేశ్వర స్వామి

   (రేవతి  - 4 పాదం)

T.V.MAHESH 

9246596926

ఆనందభాష్పాలు

 కళ్ళలో ఆనందభాష్పాలు తెప్పించే కృష్ణుడి లీల


****


బంధు మహంతి అతని భార్య , ఇద్దరు మగపిల్లలు భోజనం చేయక 2 రోజులు అయ్యింది. వర్షాలు లేక , కరువుకు బలి అయిన పేద కుటుంబం అతనిది. ఒడిషాలోని కటక్ మరియు బాలాసోర్ మధ్య వున్న జాజ్పూర్ లో భిక్షమెత్తుకొని , వచ్చిన కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి తాను , తన భార్య ఇంకా మిగిలివున్న చెట్ల యొక్క ఆకులు తింటూ బ్రతుకుతున్నాడు బంధు మహంతి.


భార్య కంట తడిపెట్టినప్పుడల్లా బంధు ఇలా అనేవాడు


''ఏడ్చకు. నాకు పురి నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడున్నాడు. చాలా మంచివాడు. ఎవరు ఏ సహాయం అడిగినా అతను కాదనడు. మనకూ అతను సహాయం చేస్తాడులే''.


ఒకరోజు భార్య


''మనం మీ స్నేహితుడి దగ్గరికెళ్ళి మన దీనావస్థను చెప్పుకొందాం. ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలు చనిపోతారు ''.


అంటే బంధు మహంతి భార్య పిల్లల్ని తీసుకొని 144 కి.మీ. దూరం లో వున్న పురి నగరానికి బయలుదేరాడు. మధ్య దారిలో అడవి వస్తుంది.


1530 వ సంవత్సరం లో నాలుగురోజులు కాలినడకన ప్రయాణించి బంధు మహంతి పురి నగరం చేరాడు. రాత్రి అయ్యింది.


''ఇపుడు నా స్నేహితుడు నిద్ర పోతుంటాడు. నిద్రా భంగం చేయడం మంచిది కాదు. ఉదయం ఆయన ఇంటికి వెళదాం''


అన్నాడు బంధు. ఆమె సరే అంటూనే


''ఇపుడు పిల్లలకు తినడానికేమీ లేదు. వాళ్లు ఆకలికి ఏడుస్తున్నారు''..


అని అంటే అపుడు బంధు


''చూడు , మనం ఇపుడు పురి జగన్నాథుడి మందిర ప్రాంగణంలోవున్నాం. గుడి తలుపులు మూసేసారు అయినా ఒకసారి ఆ తలుపులనే చూసి వద్దాం"


అంటూ భార్యా పిల్లల్ని తీసుకొని ద్వారం బయటే నిలబడి కృష్ణ భగవానుడిని ప్రార్థించాడు . ఆరాత్రి అతను చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే సమస్త పురాణాల సారమంతా అందులో వుంది :


''ప్రభూ , నేను నీ భక్తుడిని . నీవు తప్ప నాకు ఎవరు దిక్కు ? నేను కటిక పేదవాడిని. నేను ఆకలితో వున్నాను.అయినా నాకు బాధ లేదు. కానీ నా భార్య , పిల్లలు ఆకలితో మరణిస్తారేమో. నేను ఇన్ని రోజులూ నా భార్యకు ' నాకో స్నేహితుడున్నాడు , అతను మనకు సహాయం చేస్తున్నాడు ' అని చెపుతూ వస్తున్నాను. కానీ ఆమెకు తెలియదు నీవే ఆ స్నేహితుడని. ఇపుడు వాళ్ళ ఆకలి తీరలేదు , ఏ సహాయం అందలేదు అనుకో , ఆమెకు నీవు వున్నావు అనే విశ్వాసం పోతుంది. నేనది భరించలేను. నా మాటలు నమ్మి నీమీద నమ్మకం పెట్టుకొన్న ఆమెను నిరాశ పరచొద్దు. నీవు వున్నావు , నీవు ఇదంతా చూస్తున్నావు. ఇది నా నమ్మకం. ఆతరువాత నీ ఇష్టం !''.


తిరిగి వచ్చి ఆలయ ప్రాంగణంలో కుండల్లో పెట్టిన నీరు త్రాగి అక్కడే పడుకొన్నారు. మధ్యరాత్రి అయ్యింది. ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన బ్రాహ్మణ రూపంలో వున్నాడు.బంధు మహంతి భార్య కళ్ళు మూస్కొన్నది కానీ నిద్రపట్టలేదు. చిన్నగా చప్పుడైతే లేచి కూర్చొంది. ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పళ్ళెంలో కమ్మని పదార్థాలను ఆమె ముందు పెట్టాడు. ఆమె భావోద్వేగంతో పళ్ళెం అందుకొన్నది. ఆయన వెళ్ళిపోయాడు. ఆమె బంధును, పిల్లల్ని నిద్రలేపి


'ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇది ఇచ్చిపోయాడు'..


అని చెప్పింది. బంధు అన్నాడు


'నేను చెప్పాను కదా , నా స్నేహితుడు చాలా మంచివాడు అని. అతనే పంపివుంటాడు'


ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని ఆ పేద భక్త కుటుంబం సంతోషంగా తిని , ఆ పళ్ళాన్ని కడిగి గుడ్డ సంచిలో పెట్టి నిద్ర పోయారు.


కథ అయిపోయిందా ? లేదు . ఇపుడు మొదలౌతుంది.


తెల్లవారింది. జగన్నాథ దేవాలయం అర్చకులు మందిరం తలుపు తెరచి , స్వామి విగ్రహానికి నీళ్ళతో అభిషేకించి , అలంకరించబోతుంటే అక్కడుండాల్సిన బంగారు పళ్లెం లేదు. నిమిషాల్లో వార్త అందరికీ తెలిసిపోయింది. ఇంతలో ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి బంధు దగ్గర బంగారు పళ్ళెం వుండటాన్ని చూసి , అధికారులకు చెప్పాడు. వాళ్ళు అర్చకులతో కలిసివచ్చి బంధును పట్టుకొని కొట్టడం మొదలుపెట్టారు. బంధు ఏమీ మాట్లాడటం లేదు. కళ్ళు మూసుకొని దెబ్బలు తింటూనే మనసులో


"నేను దొంగను అని వీళ్లు నన్ను కొట్టినంతమాత్రాన , నీపై నాకున్న నమ్మకం పోతుందా ? నీవు వున్నావు , ఇదంతా చూస్తున్నావు'*


అని జగన్నాథుడైన కృష్ణుడితో అంటున్నాడు. అతని భార్య మాత్రం ఏడ్చుకొంటూ


'ఆయన్ని కొట్టకండి. ఆయనకు ఏమీ తెలియదు. నిన్నరాత్రి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈపళ్ళెంలో నాకు ఆహారం ఇచ్చి వెళ్ళిపోయాడు. మేము దొంగలం కాదు'..


అని అంటూన్నా వాళ్ళు వదల్లేదు. బంధును తీసుకెళ్లి కారాగారంలో పెట్టారు. ఆలయప్రాంగణంలో ఒక చెట్టు క్రింద ఏడ్చి ఏడ్చి పిల్లలను గుండెలకు హత్తుకొని బంధు భార్య సొమ్మసిల్లి పడిపోయింది.


రాత్రి అయ్యింది. పురి నగరంలోవున్న అప్పటి రాజు ప్రతాపరుద్రుడికి మధ్యరాత్రి ఒక కల వచ్చింది.


''అక్కడ నా భక్తుడు చెరసాలలో బాధపడుతుంటే , ఇక్కడ నీవు హాయిగా నిద్రపోతున్నావా ? అతను నాకు నిజమైన భక్తుడు. అతను నిరపరాధి. అతనికి బంగారు పళ్ళెంలో ఆహారాన్ని ఇచ్చింది నేనే''..


అని స్పష్టంగా ఎవరో చెప్పారు.


ఆయన కాక ఇంకెవరు చెప్పివుంటారు ?


---------------------------


ఆ క్షణమే ప్రతాపరుద్రుడు జగన్నాథమందిరానికి వెళ్ళి , అధికారులందరినీ రమ్మని ఆదేశించాడు. బంధు భార్య గురించి అక్కడివారు రాజుకు చెప్పారు. వారినీ అక్కడికి తీసుకురండి చెప్పి , స్వయంగా ప్రతాపరుద్ర రాజే కారాగార గదికి వెళ్ళి , తాళాలు తీయించాడు. ఆ తరువాత ఆయన చేసిన పని అక్కడున్నవారిని దిగ్భ్రాంతికి గురిచేసింది.


-------------------------


ఒడిషా మహారాజు అయిన ప్రతాపరుద్రుడు , బంధు మహంతి కాళ్ళకు సాష్టాంగ ప్రమాణం చేసాడు. అంతే కాదు , అక్కడిక్కడే బంధు మహంతిని పురి జగన్నాథ మందిరపు వంటశాలకు ప్రధాన వంటవాడిగా నియమించాడు. అదొక్కటే కాదు , బంధు మహంతి కుటుంబానికి జగన్నాథ దేవాలయం యొక్క ప్రధాన వంటవాళ్ళుగా శాశ్వత హక్కులు కల్పించాడు.ఇప్పటికీ బంధు మహంతి కుటుంబమే 494 సంవత్సరాలుగా జగన్నాథ దేవాలయంలో వంటపనిని నిర్వహిస్తున్నారు.


*******

నమ్మక బాగుపడినవారు లేరు. నమ్మి చెడినవారులేరు.

గ్రాంధిక వ్యావహారిక ఉద్యమం

 🙏గ్రాంధిక వ్యావహారిక ఉద్యమం 🙏

గిడుగు వారి సారధ్యంలో వ్యావహారికభాషోద్యమం ఒక స్థాయికి చేరిన సమయంలో కవులు రచయితలు రెండుగా చీలిపోయారు.గ్రాంథిక భాషవైపు వేదం వారు,కొక్కొండ వెంకటరత్నంగారు, మొదట తిరుపతి వెంకట కవులు, జయంతి రామయ్య పంతులు.ముఖ్యలు.

చివరకు తిరుపతి వెంకట కవులు వ్యవహారికం లో రచనలు చేశారు ఈ ఉద్యమం గురించి ఈ వ్యాసంలో చూద్దాము.

1907లో జె.ఎ.యేట్స్ (J. A. Yates) అనే ఇంగ్లీషుదొర ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ళ ఇన్స్పెక్టర్‌గా వచ్చాడు. చిన్న తరగతుల్లో తెలుగు పండితులు పాఠాలు చెప్పే పద్ధతి ఆ దొరకు అర్థం కాలేదు. ప్రజలు వ్యవహరించే భాష, పుస్తకాల భాష మధ్య ఎందుకు తేడాలున్నాయి అన్నది అతని ముఖ్య సమస్య. అంతకు ముందు తమిళదేశంలోనూ అదే సమస్య అతనిని వేధించింది. విశాఖపట్నంలో మిసెస్ ఎ.వి.ఎన్.కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న పి.టి. శ్రీనివాస అయ్యంగారిని అడిగితే ఆయన గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి దీనికి సమాధానం చెబుతారని అన్నాడు. ఆ విధంగా గిడుగు జీవిత ఉత్తరార్థంలో ఈ విషయాన్ని గురించి గాఢంగా ఆలోచించి తెలుగు విద్యావిధానంలో అన్యాయం జరుగుతున్నదని గుర్తించాడు. గురజాడ, గిడుగులు, శ్రీనివాస అయ్యంగారు, యేట్సు — ఈ నలుగురి ఆలోచనల వల్ల వ్యావహారిక భాషోద్యమం ఆరంభమైంది.

1906 నుండి 1940 వరకు గిడుగు రామమూర్తి కృషి అంతా తెలుగు భాషా సేవకే. యేట్స్ ప్రోత్సాహంతో శిష్టజన వ్యావహారిక తెలుగు భాషను గ్రంథరచనకు గ్రాహ్యమైందిగా చేయడానికి అత్యంత కృషి చేసి కృతకృత్యుడయ్యాడు. కందుకూరి వీరేశలింగం పంతులు మద్దతు ఇతనికి లభించింది.


ఆంధ్ర సాహిత్య నిర్మాణానికి విశేషకృషి చేసిన మేధావుల్లో ప్రముఖుడు జయంతి రామయ్య పంతులు.

1860 లో ముక్తేశ్వరంలో పుట్టిన ఈయన సంస్కృతాంధ్రాల్లో ఇంటనే పాండిత్యం గడించాడు. బి.ఏ.బిల్. చదివి ఇంగ్లీషు లోనూ అపార పాండిత్యం సంపాదించాడు.

ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక తెలుగుకు చేసిన సేవ అపారం.

సూర్యారాయాంధ్ర నిఘంటు నిర్మాణ ప్రణాళిక ఆయన ఆలోచన ఫలితమే.

శాసనాలు చదవడంలోనూ చక్కని నైపుణ్యం కలిగిన ఆయన కొన్ని శాసనాలు సంపాదించాడు.. శాసన పద్య మంజరి రెండు వాల్యూములుగా ప్రకటించాడు.

ఈయన గిడుగువారి వ్యావహారిక భాషా వాదానికి దీటుగా గ్రాంథిక వాదానికి నాయకత్వం వహించాడు.


. ఒకరికొకరికి వైరుధ్యాలున్నా వేదం వేంకట రాయ శాస్త్రి, వావిలికొలను సుబ్బారావు గూడా గ్రాంథిక వాదాన్ని బలపరిచిన వారిలో ముఖ్యులు


(నాటకాలలో పాత్రోచిత భాష వేదం మొదటినుండీ అనుసరించినది. దీనికి జయంతి, వావిలికొలను ఇద్దరూ వ్యతిరేకులే.)


జయంతి రామయ్య పంతులు భవ భూతి ఉత్తర రామచరిత్ర నాటకాన్ని గ్రాంథిక భాషలో అనువదించాడు. ఏకో రసః కరుణ ఏవ …శ్లోకం లో భవభూతి స్పష్టంగా తన నాటకంలో కరుణ ప్రధాన రసమని నిర్ధారణ చేశాడని అదే సరైన వాదమని దాని పీఠికలో వ్రాశాడు.


వేదం వేంకట రాయ శాస్త్రి గూడా ఆ నాటకం అనువదించాడు. దాని సుదీర్ఘ పీఠిక లో అది విప్రలంభ ప్రధాన నాటకమని సిద్ధాంతం చేశాడు.


సూర్యారాయాంధ్ర నిఘంటు రచన ఒక బృహత్ ప్రణాళిక. దానికీ మొట్టమొదటి(1916లో) ప్రధాన సంపాదకుడు వేదం వారే. .అపుడు మదరాసు దాని ప్రధాన కార్యాలయం. కానీ , ఏ కారణాల వల్లనో ఒక సంవత్సరానికే ఆయనను దానినుంచి తప్పించారు. ఆయనకు నెలకు 150 రూపాయల జీతమూ, గ్రంథ పద సేకరణకు తాళ పత్ర గ్రంథాలయాలలో గ్రంథాలు కాపీచేయడానికి ఇద్దరు ముగ్గురు పండితులను చేర్చుకొనే అవకాశమూ ఇస్తామని ముందు అంగీకరించినా దాని నిర్వాహకులు, సక్రమంగా, సహకరించ లేదు.


వెంకటగిరి రాజా రాజగోపాలకృష్ణ కు వేదంవారిపై అపార గౌరవం. రాజా గారి మృతి గూడా దీనికొక కారణం.


తర్వాత కాకినాడలో 1919 లో తిరిగి నిఘంటు నిర్మాణ కార్యం ప్రారంభించారు. జయంతి రామయ్య పంతులు పర్యవేక్షణ లోనే ఆంధ్ర సాహిత్య పరిషత్తు నడిచేది . ఈయన 1936 లో కొన్ని సంపుటాలు పూర్తి అయి విడుదల చేశారు.1941లో కన్నుమూశారు.

గ్రాంథిక భాషావాదుల వాదన 

అనాగరిక భాష వంటి వాడుక భాష ఉత్తమమైన సాహిత్య రచనకి పనికిరాదు.

వాడుక భాష మాట్లాడడం వరకే పరిమితం అది గ్రామ్యభాష.

వాడుక భాష ఒక లక్షణం గానీ, వ్యవస్థ గానీ లేనిది.

వ్యావహారిక భాషావ్యాప్తి వలన ప్రాచీనమైన కావ్యాలకు, వ్యాకరణాలకు నష్టం కలుగుతుంది. మన సాహిత్య సంపద అనాథ అవుతుంది.

వాడుక భాషలో అనేక భేదాలున్నాయి. మాండలికాలు ఉన్నాయి. ఒక మాండలిక భాష వేరొక ప్రాంతం వారికి అర్థం కాదు. పాఠ్యగ్రంథాలు, సాహిత్యం ఏ మాండలికంలో రాయాలి? ఎవరికి ఇష్టమైన భాషలో వారు రాసుకుంటే తెలుగు భాషా సమైక్యతకి ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి తెలుగు భాషను పరిరక్షించడానికి గ్రాంథిక భాషే మంచిది.

నన్నయ నుండి నేటి వరకు గ్రాంథిక భాష మారలేదు. దానికి ఏకరూపత, ప్రామాణికత ఉన్నాయి.

వ్యాకరణ బద్ధం కాని ప్రామాణికత లేని వాడుక భాషలో సార్వకాలిక సాహిత్యరచన వీలుకాదు.

శాస్త్ర గ్రంథాలను అవసరమైతే సరళ గ్రాంథికంలో రచించవచ్చును.

వ్యావహారిక భాషావాదుల అభిప్రాయాలు


వాడుక భాష గ్రామ్యభాష కాదు. సజీవ భాష.

వ్యావహారిక భాషకు లక్షణాలు, వ్యాకరణం లేవన్నారు. గ్రాంథిక భాషకి కూడా పూర్తిగా వ్యాకరణాలు లేవు.

తెలుగు భాష మారుతోంది. కాబట్టి కొత్తవ్యాకరణాలు, సవరణలు వెలువడ్డాయి. నన్నయ భాషకి, తిక్కన భాషకి, ప్రబంధ బాషకి, దక్షిణాంధ్ర యుగం నాటి భాషకి చాలా భేదాలున్నాయి.

వ్యావహారిక భాషావాదం ప్రాచీన సాహిత్యానికి వ్యతిరేకంగా ఏర్పడలేదు. ప్రాచీన కావ్యాలను, వ్యాకరణాలను గౌరవిస్తూనే వాడుక భాషకి ప్రాచుర్యం కల్పించాలి.

వాడుక భాషలో కూడా ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించవచ్చును. ఉదాహరణ: గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం.

గ్రాంథికభాష పండితులకే అర్థం కాదు. గొప్ప పండితులు కూడా తప్పులు లేకుండా రాయలేరు. మరి ఇతరులు ఎలా రాయగలరు.

వాడుక భాషలో భేదాలున్నాయి. అయితే అందరూ కలిసి కోస్తా మాండాలికాన్నే వాడుతున్నారు. కాబట్టి కోస్తా మాండలిక ఆంధ్రమే అనుసంధాన భాషగా ఉంటుంది.

మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర, సాంకేతిక రంగాలలో విజ్ఞానం పెంపొందించుకోవాలంటే పాఠ్యగ్రంథాలు వాడుక భాషలోనే ఉండాలి.

వాడుక భాష ప్రజల భాష. గ్రాంథిక భాష పండితులు 

గురజాడ గిడుగు రామమూర్తితో కలిసి వాడుక భాషా వ్యాప్తికి ఉద్యమించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కము నాటకాన్ని 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించారు (కచ్చితమైన సంవత్సరం తెలియ రాలేదు). ఆ రోజుల్లో ప్రబలంగా వున్న కన్యాశుల్కము, వేశ్యావృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తువు. 1892లో నాటకపు తొలి ప్రదర్శన జరిగింది. 1897లో కన్యాశుల్కము తొలి కూర్పును మహారాజా ఆనందగజపతికి అంకితమిచ్చారు. ఇప్పుడు మనకు దొరుకుతున్న కన్యాశుల్కము రెండవ కూర్పును 1909లో రచించారు.


1892 లో గురజాడ వారి కన్యాశుల్కము నాటకాన్ని తొలిసారిగా ప్రదర్శించారు. మొదటి ప్రదర్శనకే ఎంతో పేరు వచ్చింది. దీనితో సాహిత్యంలో వాడుక భాష ప్రయోగానికి ఒక రకంగా నాంది పలికింది అని చెప్పవచ్చు. సాంఘిక ఉపయోగంతో పాటు రసజ్ఞుల ఆనందానికి కూడా వాడుక భాష వాడవచ్చని ఈ నాటకం నిరూపించింది. దీని విజయంతో, అప్పారావు ఈ ఆలోచన సరళిని అవలంబించి ఇతర సాహిత్యకర్తలను వెదకసాగారు. ఈ సరళికి అతని చిన్ననాటి స్నేహితుడు చీపురుపల్లిలో తన సహాధ్యాయి అయిన గిడుగు రామమూర్తి ముఖ్యుడు. వాడుక భాష ప్రయోగానికి వ్యతిరేకి అయిన కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి కూడా ఈ నాటకం సాహితీ విలువలను ప్రశంసించడంతో అప్పారావుకు ఎంతో పేరు వచ్చింది. 1896 లో ప్రకాశిక అన్న పత్రికను మొదలుపెట్టారు. 1897 లో కన్యాశుల్కాన్ని వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు వారు ప్రచురించారు. అప్పారావు దీన్ని మహారాజా ఆనంద గజపతికి అంకితం ఇచ్చారు. 1909 ఆరోగ్యం కుదుట పడడానికి నీలగిరి కొండల్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కన్యాశుల్కం తిరగ రాసారు. 1910 లో రాసిన దేశమును ప్రేమించుమన్నా అనే దేశభక్తి గీతం ఎంతో ప్రసిద్ధి పొందింది.

గిడుగు రామమూర్తి 1940 జనవరి 15వ తేదీన ప్రజామిత్ర కార్యాలయంలో పత్రికాసంపాదకులను సంబోధిస్తూ చేసిన తన తుదివిన్నపంలో వ్యావహారిక భాషా వ్యాప్తికి చాలా సంతృప్తి పొందాడు. కాని, ప్రభుత్వ విద్యాశాఖవారు, విశ్వవిద్యాలయాలు గ్రాంథికాన్ని వదిలిపెట్టక పోవటానికి బాధపడ్డాడు. ఆ విన్నపంలోని చివరిమాటలు -"దేశభాష ద్వారా విద్య బోధిస్తే కాని ప్రయోజనం లేదు. శిష్టజనవ్యావహారికభాష లోకంలో సదా వినబడుతూంటుంది. అది జీవంతో కలకలలాడుతూ ఉంటుంది. గ్రాంథికభాష గ్రంథాలలో కనబడేదే కాని వినబడేది కాదు. ప్రతిమ వంటిది. ప్రసంగాలలో గ్రాంథికభాష ప్రయోగిస్తూ తిట్టుకొన్నా సరసాలాడుకున్నా ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చూడండి. గ్రాంథికభాష యెడల నాకు ఆదరము లేకపోలేదు. ప్రాచీనకావ్యాలు చదువవద్దనీ విద్యార్థులకు నేర్పవద్దనీ నేననను. కాని ఆ భాషలో నేడు రచన సాగించడానికి పూనుకోవడం వృథా అంటున్నాను. నిర్దుష్టంగా ఎవరున్ను వ్రాయలేరు. వ్రాసినా వ్రాసేవారికి కష్టమే వినేవారికి కష్టమే. వ్రాసేవాండ్లేమి చేస్తున్నారు? భావం తమ సొంత (వాడుక) భాషలో రచించుకొని గ్రాంథికీకరణం చేస్తున్నారు. అది చదివేవాండ్లు వినేవాండ్లు తమ సొంత వాడుకమాటలలోకి మార్చుకొని అర్థం చేసుకొంటున్నారు. ఎందుకీ వృథాప్రయాస? స్వరాజ్యం కావలెనంటున్నాము. ప్రత్యేకాంధ్రరాష్ట్రము కోసం చిక్కుపడుతున్నాము. ప్రజాస్వామిక పరిపాలనం కోరుచున్నాము. ఇటువంటి పరిస్థితులలో మన ప్రజలకు, సామాన్య జనులకు ఏభాష ద్వారా జ్ఞానం కలుగచేయవలసి ఉంటుందో, ఏ భాషలో గ్రంథరచన సాగించవలసి ఉంటుందో ఆలోచించండి. మీచేతులలో పత్రికలున్నవి. పత్రికల ద్వారా మీరు ఎంతైనా చేయగలరు”.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

సాధన పరమార్థం

 సాధన పరమార్థం


మనసు ప్రపంచాన్ని ఆశ్రయించినంత కాలం మనిషికి జీవితంలో హెచ్చుతగ్గులు, ఒడుదొడుకులు తప్పవు. మనిషికి మరణభీతి ఎక్కువ! లోకంలో ఎందరో శరీరాన్ని వీడుతున్న ఘట్టాలను చూస్తున్నప్పటికీ తాను సైతం అలా ఒకరోజు దేహత్యాగం చేయాల్సి ఉంటుందన్న నిజాన్ని స్వీకరించలేడు. చనిపోయేదాకా తాను శాశ్వతుణ్నే అన్న భ్రమతో జీవిస్తాడు. అందుకే ఆఖరి నిమిషం దాకా అతణ్ని భవసాగరం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ప్రాపంచిక ఆకర్షణల వలయం చుట్టుముట్టి వేధిస్తుంది.


ఆత్మ శాశ్వతమైంది కాబట్టి, దాని వాసన ప్రభావంతో శరీరం సైతం శాశ్వతమైనదే నని మనిషి చివరి వరకు భ్రమిస్తాడు. శ్మశాన వైరాగ్యం కలిగినా, అంతరాత్మ నిరం తరం వారిస్తున్నా దైనందిన జీవితంలో చెడ్డపనులు చేయడం మాత్రం మానడు.


దైవప్రేరితంగా మానవ జీవితం అనుక్షణం అంతర్గత సాధనలో మునిగి ఉంటుంది. తాను గ్రహించినా, గ్రహించకపోయినా మనిషి జీవితం ప్రతి క్షణం సాధనలో భాగంగానే సాగుతుందంటారు విజ్ఞులు.


మనిషి సాధనను పరిపూర్ణం చేసు కోవడంలో ప్రకృతి అనుసరించే విధానాన్ని పరిశీలించవచ్చు. సృష్టి ప్రారంభం నుంచి సూర్యుడు ప్రతిదినం ఉదయిస్తూనే ఉన్నాడు. ప్రతిసాయంత్రం అస్తమిస్తూనే ఉన్నాడు. గాలి వీస్తూనే ఉంది. అగ్ని దహిస్తూనే ఉంది. నీరు దాహార్తిని తీరుస్తూనే ఉంది. ఆకాశం విశాల దృక్పథాన్ని చాటుతూనే ఉంది. ధరిత్రి సహన గుణాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. ప్రకృతిని అను సరించి మనిషి నేర్చుకోవాల్సిన సద్గుణాల్లో ఇంతకన్నా గొప్పవి మరేముంటాయి?


ఒక పని ప్రారంభించాల్సి ఉన్నప్పుడు-మొదట దానికి ఉపక్రమిస్తే సగం కార్యం పూర్తయినట్లే అంటారు. మిగతా సగం పూర్తి చేయడానికి శ్రద్ధ, సహనం, నైపుణ్యం ఇత్యాది సద్గుణాలు కావాలి. అవి కార్యసిద్ధికి తోడ్పడ తాయి. ఒక పని కష్టమైందని భావించి ఉపక్రమించకపోవడం పెద్దతప్పు

ఆత్మజ్ఞానం కలిగిన ప్రతి మనిషికి ఏది మంచో ఏది చెడో తెలుసు. చెడ్డ పనులు చేయకుండా మనసును నిగ్రహించుకోవాలి. అలా చేయకపోతే అలవాటుగా మారి ప్రమాదం కొని తెచ్చుకున్నట్లవుతుంది. మంచి పనుల విషయంలో మనిషి అందుకు భిన్నంగా వ్యవహరించాలి. చేయగా చేయగా మంచి పనులు అలవాటుగా మారి జీవితాన్ని నందనవనం చేస్తాయి.


చూసే ప్రతి ప్రాణిలో వేసే ప్రతి అడుగులో దైవాన్ని దర్శించే ప్రతిభ మనిషికి సాధనవల్ల లభిస్తుంది. మంచి ప్రవర్తన వల్ల లభించే ఆనందం జీవితాన్ని పరి పూర్ణం చేస్తుంది. ప్రతిక్షణం పెల్లుబికే మంచి భావనలు అతడి జీవితాన్ని ప్రకాశ మానం చేస్తాయి. ఆధ్యాత్మికత కేవలం దైవారాధన చేసే ఒక మార్గం కాదు. మనిషి ఆనందంగా జీవించడానికి అవసరమైన మానసిక స్థైర్యాన్నిచ్చే గొప్ప కళ. మంచి మార్గంలో నడుస్తూ తనపట్ల తాను ప్రసన్నుడై జీవించే వ్యక్తి సదా ఆనందభరితుడై ఉంటాడు. అతడితో కలిసి జీవించేవారు సైతం సంతోషంగా ఉంటారు. ఎదుటి వారు తన కారణంగా ఆనందంతో జీవించగలిగితే అందుకు బాధ్యుడైన వ్యక్తి సాధన పరమార్థాన్ని సాధించినట్లే!


గోపాలుని రఘుపతిరావు

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం  - షష్ఠి - కృత్తిక -‌‌ సౌమ్య వాసరే* (05.03.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

మహామృత్యుంజయ మంత్రం*

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*మహామృత్యుంజయ మంత్రం*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*మహామృత్యుంజయ మంత్రం - ఈ మంత్రంలో ఓం, త్ర్యంబకం, యజామహే, సుగంధిం, పుష్టివర్థనం, ఉర్వారుకం, మృతోర్ముక్షీయ, అమృతాత్ …ఈ పదాలకు యెంత అద్భుతమైన , అమృతతుల్యమైన భావం ఉంది.*


*మహా మృత్యుంజయ మంత్రంను “మరణం జయించే మంత్రం” లేదా “త్రయంబక మంత్రం” అని అంటారు. మహా మృత్యుంజయ మంత్రం రోగాలను నయం చేయుటలో అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఒకటిగా భావిస్తారు.*


*మహా మృత్యుంజయ మంత్రం శివుని గొప్ప మంత్రం. ఋషి మార్కండేయుల వారి ద్వారా సృష్టించబడిందని చెబుతారు. మార్కండేయనిచే వ్యవహరించబడే ఒక రహస్య మంత్రంగా ఉంది.*


*”ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం*

*ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ “*

*మనకు ఉన్న, తెలిసిన మంత్రాలలో గాయత్రి మంత్రం వలె ఈ “మహా మృత్యుంజయ మంత్రం” పరమ పవిత్రమైనది, అతి ప్రాచుర్యమైనది. క్షీర సాగర మథనంలో జనించిన హాలాహలాన్ని రుద్రుడు  దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు.*


*ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులగుదురు అని పలువురి నమ్మకం.*


*ఓం నమః శివాయ ।*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

ఓం శాంతిః శాంతిః శాంతిః

సర్వేజనా సుఖినోభవంతు!!

ఓం తత్సత్!


సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!!

☸️☸️☸️☸️☸️☸️☸️☸️🕉️

(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(66వ రోజు)*

   *(క్రితం భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*పరశురాముడు - శ్రీ రాముడు,*

           *విశ్వామిత్రుడు*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*శివధనుస్సును విరచి సీతను వివాహం చేసుకున్నాడు శ్రీరాముడు. భార్యతో సహా అయోధ్యకు బయల్దేరాడు. ఈ సంగతి తెలుసుకున్నాడు పరశురాముడు. తన దైవం శివుని ధనుస్సును శ్రీరాముడు విరవడాన్ని తట్టుకోలేకపోయాడు. అవమానంగా భావించాడు.*


*శ్రీరాముణ్ణి ఎదుర్కొన్నాడు. తన కుమారుణ్ణి కాపాడమని దశరథుడు ఎంతగా కాళ్ళా వేళ్ళాబడినా కనికరించలేదు పరశురాముడు. కోపంతో కళ్ళెర్రజేసి అన్నాడిలా. ‘‘చూడబోతే బాలుడవు, నువ్వా శివధనుస్సును ఎక్కుపెట్టి విరిచింది! ఏదీ నా ధనుస్సును ఎక్కుపెట్టు చూద్దాం. నీ బలం, ధైర్యం తెలిసిపోతాయి.’’*


*తన ధనుస్సును శ్రీరాముడికి అందజేశాడు పరశురాముడు. అతని ధనుస్సును అవలీలగా ఎక్కుపెట్టాడు శ్రీరాముడు. దానితో పాటు పరశురాముని తేజస్సును కూడా హరించాడతను. అప్పుడు శ్రీరాముడు, సాక్షాత్తూ విష్ణుమూర్తిని గ్రహించాడు పరశురాముడు. నమస్కరించాడతనికి. శాంతచిత్తుడై మహేంద్రపర్వతం మీదికి తరలిపోయాడు. క్షత్రియులకు సింహస్వప్నం, బ్రాహ్మణపక్షపాతి పరశురాముడు చిరంజీవి. రానున్న మన్వంతరంలో అతను సప్తర్షులలో ఒకడు కాగలడు.*


*విశ్వామిత్రుడు:~*


*గాధిరాజు కుమారుడయిన విశ్వామిత్రుడు, అనేక సంవత్సరాలపాటు రాజ్యపాలన చేశాడు. క్షత్రియుడు అయినప్పటికీ తపోబలంతో బ్రాహ్మణ్యం సాధించాడు. మహర్షి అయినాడు. విశ్వామిత్రుని తపోబలం చాలా గొప్పది. కాని, రాజసం వల్ల అతని తపోబలం చాలా వ్యర్థమయింది.*


*విశ్వామిత్రుని గురించి భాగవతంలో చాలా సంక్షిప్తంగా ఉంది. అతను రామలక్ష్మణులకు గురువు. వారికి ధనుర్విద్యను నేర్పిన మహానుభావుడు. అంతేకాదు, గాయత్రీమంత్రానికి విశ్వామిత్రుడు ఋషి.*


*విశ్వామిత్రునికీ, వసిష్ఠునికీ బద్ధ వైరం. విశ్వామిత్రుని రాజర్షిగానే అంగీకరిస్తాడు వసిష్ఠుడు. కాదు, తాను బ్రహ్మర్షినంటాడు విశ్వామిత్రుడు. ఆఖరికి ఆ స్థానాన్ని అందుకున్నాడతను.*


*విశ్వామిత్రుని ఆశ్రమానికి సిద్ధాశ్రమం అని పేరు. అతనికి నూటక్క మంది కుమారులు. వారిలో మధ్యవాడు మధుశ్చంద్రుడు. ఫలితంగా అంతా మధుశ్చంద్రులయినారు.*


*హరిశ్చంద్రుడను యెక రాజుగలడు. అతడు తనకు కుమారుడు గలిగినయెడల తన కుమారుని యజ్ఞపశువుగాజేసి యాగముచేయునట్లు వరుణునిగూర్చి మ్రొక్కుకొనెను. ఆ పిమ్మట వరుణుని యనుగ్రహమున నాతనికి కుమారుడు గలిగెను. కాని నాతడెప్పటికప్పుడు యజ్ఞముచేయుటకు సుముఖుడుగాక కాలమును దాటవేయుచుండెను. ప్రతిజ్ఞను పాటించని ఆ రాజును వరుణదేవుడు "జలోదరవ్యాధి గ్రస్తుడవవుదువుగాక” అని శపించెను. రాజు వ్యాధిగ్రస్తుడై తన దోషమును తెలుసుకొని యజ్ఞమును చేయ సంకల్పించెను. యజ్ఞపశువుగానుండి ప్రాణములువీడ నిష్ఠము లేని నాతని కుమారుడు శునస్సేపుడు తండ్రియింటిని విడచి అరణ్యమునకు పారిపోయెను.*


*హరిశ్చంద్రుని యజ్ఞపశువయిన శునస్సేపుణ్ణి తన ఆశ్రమానికి తీసుకుని వచ్చాడు విశ్వామిత్రుడు. పుత్రులతో సమానంగా చూశాడతన్ని. తన పుత్రులను కూడా అతన్ని అన్నగా చూడమని చెప్పాడు. పెద్దవారయిన యాభైమంది మధుశ్చంద్రులూ అందుకు అంగీకరించలేదు. కోపం వచ్చింది విశ్వామిత్రునికి. వారిని ‘మ్లేచ్ఛులు’ కండి అని శపించాడు.*


*చిన్నవారయిన యాభైమందీ శునస్సేపుణ్ణి అన్నగా భావించి అభిమానించారు. అందుకు సంతోషించాడు విశ్వామిత్రుడు. వారికి సంతానవృద్ధి కలిగేటట్టుగా దీవించాడు.* 


*జన్మతః భార్గవుడయినప్పటికీ తనని పుత్రునిగా విశ్వామిత్రుడు స్వీకరించడంతో శునస్సేపుడు కౌశికుడు అయినాడు. కౌశికుడికి అష్టకుడు, హరీతుడు, జయంతుడు, సుమదాముడు, మొదలయిన వారు జన్మించారు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

 *జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

*పదవిభాగం, తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఈశ్వరునికి ఉన్న సాహసం , మరెవ్వరికీ లేదని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు.  ప్రళయకాలంలో కూడా శివుడు నిర్భయంగా ఆనందంగా ఉంటాడని  చెప్పారు.*


*శ్లోకం: 34:*


*కింబ్రూమస్తవ సాహసం పశుపతే !  కస్యస్తి శంభో ! భవ*

                   

*ద్ధైర్యం చేదృశమాత్మన స్థ్సితి రియం చాన్యైః కథం లభ్యతే,*

                   

*భ్రశ్య ద్దేవగణం త్రసన్ముని గణం నశ్యత్ప్రపంచం లయం*


*పశ్యన్నిర్భయ ఏక ఏవ విహార త్యానంద సాంద్రో భవాన్  !!*


*పదవిభాగం:~*


*కిమ్ _ బ్రూమః _ తవ _ సాహసమ్ _ పశుపతే _కస్య _ అస్తి _ శంభో _*

*భవద్ధైర్యం _ చ _ ఈదృశమ్  _ ఆత్మనః _ స్థితిః _ ఇయమ్ _ చ _ అన్యైః*

*కథం _ లభ్యతే _ భ్రశ్యద్దేవగణం _ త్రసన్మునిగణం _నశ్యత్ప్రపంచం _లయం _*


*పశ్యన్ _ నిర్భయః _  ఏకః  _ ఏవ _ విహరతి _ ఆనందసాంద్రః _ భవాన్.*


*తాత్పర్యము :~*


*ಓ పశుపతీ శంకరా !  నీ సాహసాన్ని  ఏమని వర్ణిస్తాను ?ఇటువంటి ధైర్యం, నీకు తప్ప మరెవ్వరికీ లేదు. నీ స్థితిని సైతమూ ఇతరులు పొందలేరు.  నాశనానికి ఉన్ముఖులై దేవతలందరూ పారిపోతుండగా మునులందరూ భయంతో గడగడలాడుతూ ఉండగా, కంటికి  కనబడే ప్రపంచమంతా నశించి పోతూ వుండగా, నీవు ఒక్కడవే నిర్భయుడవై పరమానంద పరిపూర్ణుడవై విహరిస్తావు.*


*వివరణ :~*


*ప్రళయకాలంలో సమస్త ప్రపంచమూ నశించి పోతూండగా దేవతలు అటూ ఇటూ పారిపోతూ వుంటారు. ఋషులు కూడా భయంతో గడగడలాడిపోతూ వుంటారు. ఈశ్వరుడు మాత్రం భయంకరమైన ఆ ప్రళయాన్ని చూస్తూ కూడా నిర్వికారుడై వేడుకగా సంచరిస్తూ ఉంటాడు. ఈశ్వరుని కున్న ధైర్యం మరెవ్వరికీ లేదు అని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు.*


*శివుడు నిర్వికారంగా నిర్భయంగా స్థితప్రజ్ఞుడిలా ఉండడానికి కారణం ఉందట.  సర్వమూ శివుడిలోనే వుంది. శివుడు కూడా అందరిలోనూ ఉన్నాడు. కాబట్టి శివుని కంటే ఇతరము అనే ప్రసక్తి లేదు.  భేదదృష్టి కలవారికే భయం ఉంటుంది. ఈశ్వరుడే ప్రపంచం. ఈశ్వరునిలోనే ప్రపంచం ఉంది. ఈశ్వరుడిలో ఉన్న ప్రపంచం నిక్షేపంగా వుంటుంది.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

మంగళగిరి పానకాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవారంభం‌*

 *రేపటి రోజు నుండి మంగళగిరి పానకాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవారంభం‌* 


*ధ్యాయామి నారసింహాఖ్యం బ్రహ్మవేదాంతగోచరం*

*భవాబ్ధి తరణోపాయం శంఖచక్రధరంపదమ్*



శ్రీ నరసింహుడు సద్యోజాతుడు.  అంటే భక్త రక్షణార్ధం అప్పటికప్పుడు అవతరించిన మూర్తి.  ఆపదలలో వున్న భక్తులను , వేడుకున్న వెంటనే కాపాడగల దయగల దేవుడు నరసింహస్వామి.  అందుకనే శ్రీ శంకరాచార్యులంతటివారు తనని ఆపదలనుండి రక్షించమని శ్రీ నరసింహస్వామిని వేడుకుంటూ కరావలంబన స్తోత్రం చేశారు.  అంతటి దయామయుడైన ఆ స్వామి  కృష్ణానదీ తీరాన వెలసిన ఐదు క్షేత్రాలను పంచ నారసింహ క్షేత్రాలంటారు. అంతేకాదు  ఈ ఐదు క్షేత్రాలలో స్వామిని ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. 


అవి

   1. మంగళగిరి పానకాలయ్య

2. వేదాద్రి స్నానాలయ్య

3. మట్టపల్లి అన్నాలయ్య

4. వాడపల్లి  దీపాలయ్య

5. కేతవరము  వజ్రాలయ్య


వీటిలో మనమిప్పుడు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైభవం గురించి తెలుసుకుందాము.  మిగతా నాలుగు క్షేత్రాలకన్నా , ప్రస్తుతం కృష్ణానదికి కొంచెం దూరంగా వున్న క్షేత్రమిది. మంగళగిరి అనగానే గుర్తుకొచ్చేవి పానకాల స్వామి , గాలి గోపురం , చేనేత వస్త్రాలు (మంగళగిరి చేనేత వస్త్రాలు -  డ్రెస్ మెటీరియల్ , చీరెలు బహుళ ప్రచారం పొందాయి).  ఇవ్వన్నీ ఇక్కడ ప్రసిధ్ధి కెక్కినవే.  ముందుగా ఆలయ చరిత్ర తెలుసుకుందాము.


*స్ధల పురాణం*


మంగళగిరిలో మూడు నరసింహస్వామి ఆలయాలున్నాయి.  కొండ దిగువన వున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం , కొండపైన వున్న పానకాల స్వామి ఆలయం , కొండ శిఖరం మీద వున్న గండాల నరసింహస్వామి ఆలయం.  కొండ దిగువన వున్న ఆలయంలో శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామిని భక్తులు దర్శించుకోగలరు.  


హిరణ్యకశిపుని వధానంతరం శ్రీ నరసింహస్వామి చాలా భయంకర రూపంతో, రౌద్రంగా , అందరికీ భీతికొల్పుతూ వున్నారు.  దేవతలంతా ఆ దేవదేవుని శాంతించమని ప్రార్ధించినా ఫలితం కనబడలేదు.  శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసి స్వామికి అమృతము  సమర్పించినది.  దానిని గ్రహించి స్వామి శాంత స్వరూపులైనారు.  ఈయనే మంగళాద్రిపై వెలసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామి.  ఈయనకి భక్తులు కృత యుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవునెయ్యిని , ద్వాపర యుగంలో ఆవు పాలను సమర్పించారు.  కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు. 


పానకాలస్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరచిన నోటితో దర్శన మిస్తుంది.  భక్తులు స్వామికి సమర్పించే  పానకాన్ని పూజారిగారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు.  పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం వస్తుంది.  ఇంక పానకం పోయటం ఆపి , మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.  ఈ పానకాన్ని కొండపైన పూజారులే తయారు చేస్తారు.  ఇంత పానకం ఇక్కడ వినియోగమవుతున్నా , ఇక్కడ ఒక్క చీమ కూడా కనిపించక పోవటం విశేషం.


పానకాలస్వామి గుడి వెనుక కొంచెం ఎత్తులో శ్రీ లక్ష్మి ఆలయం వున్నది.  దీనికి పక్కగా ఒక సొరంగం వుంటుంది.  దాన్లోంచి వెళ్తే కృష్ణా తీరాన వున్న ఉండవల్లి గుహలకి వెళ్ళవచ్చంటారు.  ఋషులు ఇదివరకు ఆ మార్గంగుండానే వెళ్ళి కృష్ణానదిలో స్నానం చేసివచ్చి స్వామిని సేవించేవారంటారు.  ప్రస్తుతం ఆ మార్గం మూసుకుపోయింది.


సర్వ మంగళ స్వరూపిణి , సర్వ శుభదాయిని అయిన  శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసింది కనుక ఈ పర్వతము మంగళగిరి అయినది.  అంతకు ముందు ఈ కొండకు మూర్కొండ , మార్కొండ అనే పేర్లుండేవి.


*పానకాల స్వామి* మహత్యం గురించి ప్రచారంలో వున్న ఇంకొక కధ.  స్వామి పానకం తాగటం ఎంతమటుకు నిజమో పరీక్షించటానికి అక్కడి జమీందారు వెంకటాద్రి నాయడు తన బావమరిది , శక్తి ఉపాసకులు అయిన యార్లగడ్డ అంకినీడుతో కలసి కొండపై స్వామివారి తెరిచివున్న నోట్లోకి తన కుడిచేతిని పోనిచ్చారుట.  చెయ్యి కొంత దూరం వెళ్ళగానే నవులుతున్నట్లు విపరీతమైన బాధ కలిగిందిట.  అంకినీడుగారికి తేళ్ళు, పాములు కరచినంత బాధ కలిగిందట.  వెంకటాద్రి నాయుడుగారు చెయ్యి బయటకి తియ్యగా చెయ్యి రక్త మాంసములు లేక శల్యావశిష్టంగా వుండటం చూసి విస్మయం చెందారుట.  అప్పుడు స్వామి మీద నమ్మకం కలిగి , స్వామికి తన శరీరం ఆహారమయిందని, తన జన్మ సార్ధకమయిందని ఆయన ఆలయ గోపురం నిర్మింపచేశారుట. 


కొండ శిఖరానవున్న గండాల నరసింహస్వామి చిన్న మందిరంలో విగ్రహం వుండదు.  తీరని ఆపదలు వచ్చిన భక్తులు, తమ గండాలు గడిచిపోతే అక్కడ నేతితోగానీ, నూనెతోగానీ దీపం పెడతామని మొక్కుకుని, గండం గడిచిపోగానే  మొక్కుకున్న విధంగా అక్కడ దీపారాధన చేసి వస్తారు. 


కొండకిందవున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని, మెట్ల మార్గంలో వున్న భ్రమరాంబా మల్లికార్జునస్వామి ఆలయంలో మూర్తులను,  ద్వాపర యుగంలో పాండవులు ప్రతిష్టించారుట.  


*గాలి గోపురం*


ఆలయానికి నాలుగువైపులా గాలి గోపురాలున్నా తూర్పున వున్న గాలి గోపురం నిర్మాణ శైలి వల్ల ప్రసిధ్దికెక్కింది.  మొదట విజయనగర రాజులు ఈ గోపుర నిర్మాణంచేబట్టి 3 అంతస్తులు కట్టించారు.  తర్వాత కాలంలో అక్కడి జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు క్రీ.శ. 1807 – 1809 లో ఈ గోపురం పై ఇంకొక 8 అంతస్తులు నిర్మింపచేశారు.  153 అడుగుల ఎత్తు వున్న ఈ గోపురం వెడల్పు 49 అడుగులు మాత్రమే.  వెడల్పు తక్కువగా వుండి ఇంత ఎత్తుగావున్న ఇలాంటి గోపురాలు అరుదుగా కనిపిస్తాయి.  అందుకే ఇది ప్రసిధ్దికెక్కింది.


దీనిని గురించి ఇంకొక ఆసక్తికరమైన విశేషం కూడా ప్రచారంలో వున్నది.  గోపురము 14 అంతస్తులూ నిర్మించిన తర్వాత  ఆ గోపురం ఉత్తరానికి  ఒరిగిందట.  గోపురం నిర్మించిన శిల్పి ఆ గోపుర నిర్మాణంలో తను చేసిన తప్పేమిటో తెలియక , శిల్ప శాస్త్రంలో విజ్ఞుల సలహామేరకు కాంచీపుర ప్రాంతానికి వెళ్ళి, అక్కడ సుప్రసిధ్ధ శిల్పులతో ఈ విషయం చర్చించారు.  వారు సూచించిన విధంగా మంగళాద్రికి వచ్చి గోపురానికి తూర్పు భాగంలో లోతైన కోనేరు తవ్వించారు. దానితో ఉత్తరానికి ఒరిగిన గోపురం చక్కబడి తిన్నగా నిలబడింది.  ఆ కోనేరుని చీకటి కోనేరని పిలుస్తారు.


*ఉత్సవాలు*


ఫాల్గుణ మాసంలో 11 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలు ఇక్కడ ముఖ్యమైనవి.  ఫాల్గుణ శుధ్ద షష్టినాడు ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలలో చతుర్దశినాడు శాంత నరసింహస్వామికి , శ్రీదేవి , భూదేవులకు కళ్యాణం  జరుగుతుంది. మరునాడు , అంటే పౌర్ణమి రోజు జరిగే రధోత్సవంలో లక్షమంది పైగా ప్రజలు పాల్గొంటారు.  స్వామి దేవేరులతో సహా ఊరేగే ఈ పెద్ద రధం లాగటానికి భక్తులు పోటీ పడతారు.  కనీసం ఆ రధం తాళ్ళు తాకినా పుణ్యమేనని భావిస్తారు.  ఈ సమయంలో ఇక్కడ జరిగే తిరనాళ్ళుకూడా ప్రసిధ్దికెక్కింది. శ్రీరామ నవమి , హనుమజ్జయంతి , నృసింహ జయంతి , వైకుంఠ ఏకాదశి , మహా శివరాత్రి వగైరా ఇక్కడ జరిగే ఇతర ముఖ్య ఉత్సవాలు.


కొండపైన పానకాలస్వామి ఆలయానికి మెట్ల మార్గమేకాక  వాహనంలో కూడా చేరుకోవచ్చు.


*దర్శన  సమయాలు*


కొండపైన పానకాల స్వామి ఆలయం ఉదయం 7గం. లనుంచి సాయంత్రం 3 గం.లదాకా మాత్రమే తెరచి వుంటుంది.  సాయంత్రం సమయంలో దేవతలు , ఋషులు స్వామిని సేవించటానికి వస్తారని ఇక్కడివారి నమ్మకం.  అందుకే 3 గం.లకి ఆలయం మూసేస్తారు.


కొండ దిగువనవున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమయాలు

ఉదయం 5 గం. లనుంచి 12-30 దాకా తిరిగి సాయంత్రం 4 గం.ల నుంచి 8-30 దాకా.


*మార్గము*

విజయవాడ గుంటూరు రహదారిలో విజయవాడకు దాదాపు 16 కి.మీ. ల దూరంలో వున్న మంగళగిరి చేరుకోవటానికి రైలు, రోడ్డు మార్గాలున్నాయి.

భోజన , వసతి సౌకర్యాలు

మంగళగిరి , విజయవాడ , గుంటూర్లలో లభిస్తాయి. 


 *ఓం నమో నారసింహాయ నమః*