5, మార్చి 2025, బుధవారం

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

 *జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

*పదవిభాగం, తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఈశ్వరునికి ఉన్న సాహసం , మరెవ్వరికీ లేదని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు.  ప్రళయకాలంలో కూడా శివుడు నిర్భయంగా ఆనందంగా ఉంటాడని  చెప్పారు.*


*శ్లోకం: 34:*


*కింబ్రూమస్తవ సాహసం పశుపతే !  కస్యస్తి శంభో ! భవ*

                   

*ద్ధైర్యం చేదృశమాత్మన స్థ్సితి రియం చాన్యైః కథం లభ్యతే,*

                   

*భ్రశ్య ద్దేవగణం త్రసన్ముని గణం నశ్యత్ప్రపంచం లయం*


*పశ్యన్నిర్భయ ఏక ఏవ విహార త్యానంద సాంద్రో భవాన్  !!*


*పదవిభాగం:~*


*కిమ్ _ బ్రూమః _ తవ _ సాహసమ్ _ పశుపతే _కస్య _ అస్తి _ శంభో _*

*భవద్ధైర్యం _ చ _ ఈదృశమ్  _ ఆత్మనః _ స్థితిః _ ఇయమ్ _ చ _ అన్యైః*

*కథం _ లభ్యతే _ భ్రశ్యద్దేవగణం _ త్రసన్మునిగణం _నశ్యత్ప్రపంచం _లయం _*


*పశ్యన్ _ నిర్భయః _  ఏకః  _ ఏవ _ విహరతి _ ఆనందసాంద్రః _ భవాన్.*


*తాత్పర్యము :~*


*ಓ పశుపతీ శంకరా !  నీ సాహసాన్ని  ఏమని వర్ణిస్తాను ?ఇటువంటి ధైర్యం, నీకు తప్ప మరెవ్వరికీ లేదు. నీ స్థితిని సైతమూ ఇతరులు పొందలేరు.  నాశనానికి ఉన్ముఖులై దేవతలందరూ పారిపోతుండగా మునులందరూ భయంతో గడగడలాడుతూ ఉండగా, కంటికి  కనబడే ప్రపంచమంతా నశించి పోతూ వుండగా, నీవు ఒక్కడవే నిర్భయుడవై పరమానంద పరిపూర్ణుడవై విహరిస్తావు.*


*వివరణ :~*


*ప్రళయకాలంలో సమస్త ప్రపంచమూ నశించి పోతూండగా దేవతలు అటూ ఇటూ పారిపోతూ వుంటారు. ఋషులు కూడా భయంతో గడగడలాడిపోతూ వుంటారు. ఈశ్వరుడు మాత్రం భయంకరమైన ఆ ప్రళయాన్ని చూస్తూ కూడా నిర్వికారుడై వేడుకగా సంచరిస్తూ ఉంటాడు. ఈశ్వరుని కున్న ధైర్యం మరెవ్వరికీ లేదు అని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు.*


*శివుడు నిర్వికారంగా నిర్భయంగా స్థితప్రజ్ఞుడిలా ఉండడానికి కారణం ఉందట.  సర్వమూ శివుడిలోనే వుంది. శివుడు కూడా అందరిలోనూ ఉన్నాడు. కాబట్టి శివుని కంటే ఇతరము అనే ప్రసక్తి లేదు.  భేదదృష్టి కలవారికే భయం ఉంటుంది. ఈశ్వరుడే ప్రపంచం. ఈశ్వరునిలోనే ప్రపంచం ఉంది. ఈశ్వరుడిలో ఉన్న ప్రపంచం నిక్షేపంగా వుంటుంది.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

కామెంట్‌లు లేవు: