12, నవంబర్ 2025, బుధవారం

హోదా Vs జ్ఞానం*

 హోదా Vs జ్ఞానం* 


 *🚗ఒక* కారు* తయారీ కంపెనీ యజమాని తన కంపనిలోని ఒక ఇంజనీర్ కు " ఒక మంచి కారును డిజైన్ చేసి తయారు చేయుమని" ఒక పని అప్ప చెప్పాడు. 


👤ఆ *ఇంజనీర్* " ఒక అద్భుతమైన కారును "తయారుచేసి సిద్ధంగా ఉంచి యజమానికి కబురుపెట్టాడు.

 *👨‍🎨యజమాని* వచ్చి ఆ కారును చూసి ఆశ్చర్యానందాలను వ్యక్తం చేయడంతోపాటు అతని పనితనాన్ని చాలా మెచ్చుకున్నాడు.


🚗ఆ *కారును* కంపెనీ తయారు ప్రదేశం నుండి షోరూంకు తీసుకొద్దామని చూసేసరికి ప్రవేశ ద్వారం కన్నా కారు ఒక్క అంగుళం ఎత్తుగా ఉంది.


 *🚗కారును* తయారు చేసేముందు ఈ విషయం గమనించలేక పోయినందుకు *ఇంజనీర్ లోలొపల చింతించి*

తయారీ ప్రాంతం నుంచి వెలుపలకు కారును ఎలా తీసుకోవాలో ఆ యజమానితో కలిసి ఆలోచించసాగాడు.


అక్కడే ఉన్న *"పెయింటర్"* కారును అలాగే బయటకు తీసుకు వద్దాం! కారు టాప్ పైన కొన్ని గీతలు.. నొక్కులు పడితే తర్వాత సెట్ చేసుకోవచ్చు!! అని సలహా ఇచ్చాడు.


 *"👊ప్రవేశ ద్వారం* పగులగొట్టి కారు బయటకు తీసుకువద్దాం! తర్వాత ద్వారాన్ని రిపేర్ చేయిద్దాము! " అని అసెంబ్లింగ్ అసిస్టెంట్ ఆ ఇంజనీరుకు సలహా ఇచ్చాడు.


ఈ *రెండు* సలహాలు విని *యజమాని* కన్విన్స్ కాలేక పోయాడు. ఎందుకంటే అలా కారుకు *నొక్కులూ, గీతలు పడడం* కానీ, ద్వారాన్ని పగలగొట్టడం కానీ మంచి శకునంగా అతడు భావించలేకపోయాడు.


 *👁 జరుగుతున్న* విషయమంతా చూస్తున్న అక్కడే ఉన్న👮‍♀ *"వాచ్ మెన్ "* భయం భయంగా సందేహిస్తూనే తన మనసులోని ఐడియా చెప్పాలని " ఒక చిన్న సలహా సార్! "అన్నాడు.


 *👪అక్కడున్నవాళ్ళు* " నిపుణులే ఇవ్వలేని సలహాని వాచ్ మెన్ ఏమిస్తాడా? " అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా..


👮‍♀ఆ *వాచ్ మెన్* ఇలా అన్నాడు.~ *🚗కారును* బయటకు తీసుకురావడం చాలా ఈజీ సార్! కారు, ద్వారం కన్నా ఒక ఇంచే ఎత్తు ఉందికదా సార్!!!


కారు టైర్లలోని "గాలి" కొంత తీసేసి బయటకు తెచ్చి తిరిగి కారుటైర్లలో గాలినింపితే సరి!!" అన్నాడు.


 👮‍♀ *వాచ్ మెన్* సలహా విని అతన్ని అభినందిస్తూ అక్కడున్న ప్రతీ ఒక్కరూ చప్పట్లు కొట్టసాగారు.               

 

*👤కాబట్టి* ,కేవలం నిపుణుల అభిప్రాయం తీసుకుని మాత్రమే సమస్యలను విశ్లేషించవద్దు!! 


👳ఒక్కోసారి చదువుకోని తాతనో, నానమ్మనో, అమ్మమ్మనో వంటి తాము సామాన్యంగా భావించే వ్యక్తులు కూడా... *"ఎంతో కష్టం అని భావించిన సమస్యను అతి సులభంగా పరిష్కరించవచ్చు.!"*


ఈ కథలో నేర్చుకోవలసిన మరో *నీతి* కూడా ఉంది.


🕺మిత్రులతోనో, బంధువులతోనో.. గొడవ వల్లనో మరే కారణం వల్లనో అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు ఈ కథలోని కారులా మనం *ఎత్తుగా (ఉన్నతంగా అనుకొని)* వారి ఇంటి ప్రవేశ ద్వారం చిన్నగా ప్రవేశించలేనిదానిలా కనిపిస్తుంది.


అప్పుడు ఈ కథలోని వాచ్ మెన్ సలహా పాటించాలి!!


👍కొంత *గాలి (ఇగో)* తీసివేసి..తగ్గి ఉండాలి.! 🙇


*ఎత్తును(ప్రవర్తనను)* అడ్జెస్ట్ చేసుకోవాలి.


🕊నిజానికి మనమందరం ఆనంద స్వరూపమైన *"ఆత్మ"* గలవారము!!


కానీ, 


""🤦‍♀ *అనవసరమైనవి జమ చేస్తూ ఉంటే అశాంతితో బరువెక్కిపోతాము!!!!!*


*ఈ చెత్తనంతా తొలగించుకుంటున్నకొద్దీ ఆనందంతో తేలికైపోతాము!!!!

కోపము – శిక్ష*

 ప్రతిరోజూ…

శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…

74d2;1311e2;    నడిచే దేవుడు…

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀🌼P0398.పరమాచార్య పావన గాధలు…



               *కోపము – శిక్ష*

                 ➖➖➖✍️

```

అది ఎన్నికల సమయం. కాంచీపురం జిల్లా కలెక్టరు గారే స్వయంగా చీఫ్ ఎలెక్షెన్ ఆఫీసరుగా బాధ్యతలు నిర్వహిస్తున్నందున కార్యాలయంలో మొత్తం అందరూ ఎన్నికల నిర్వహణలో తలమునకలయ్యారు. ఎల్లుండే ఎన్నికలు జరిగే రోజు. 


ఢిల్లీ నుండి ఇద్దరు ముగ్గురు ఐ.ఎ.యస్ అధికారులు జరగబోయే విధానసభ లోకసభ ఎన్నికల పర్యవేక్షణకై కంచికి వచ్చారు. అందులో ఒకరు చాలా నిఖార్సైన వ్యక్తిత్వం కలవారు మరియు చాలా కోపిష్టి కూడా. వారు వేరే రాష్ట్రంవారు కావడం వల్ల వారికి తమిళం రాదు. 


నేను తహసీల్దార్ కావడం చేత వారి బస మరియు బాగోగులు చూడటం నా కర్తవ్యం. వారిని కలిసిన కొద్దిసేపటికే వారి గుణగణాలను అంచనా వెయ్యగలిగాను. ఆయన భార్యా పిల్లలతో సహా రావడం చేత వారికి ప్రభుత్వ ట్రావెలర్స్ బంగ్లాలో సకల సౌకర్యాలతో విడిది ఏర్పాటు చేసాము. వారి మనసు పాడుకాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవల్సిందని నాకు పై అధికారుల నుండి వచ్చిన ఆదేశం యొక్క సారం. 

వారికి కొన్ని తమిళ పదాలు తెలుసని కూడా నాకు తెలిసింది. 


వారు కుటుంబ సమేతంగా పరమాచార్య స్వామివారిని చూడాలని నాకు చెప్పారు. 


నేను వారిని కంచి శ్రీమఠానికి తీసుకుని వెళ్ళాను. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి స్వామివారు జపం చేసుకుంటున్నారు. శ్రీమఠం సేవకులొకరు అక్కడ నేలపైన ఒక జమఖానం పరిచి ఉంచారు. ఆ అధికారి కుటుంబ సమేతంగా దానిపైన కూర్చున్నారు. నేను వారి పక్కనే నిలబడి ఉన్నాను. 


స్వామివారు దర్శనం ఇవ్వడం మొదలుపెట్టగానే నేను వారినందరిని స్వామి వద్దకు తీసుకుని వెళ్ళాను. 


మహాస్వామివారు ఒక చిన్న గదిలో చెక్క కుర్చీపై కూర్చుని ఉన్నారు. గది తలుపు ఇవతలి నుండి మేము స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఆరోజు స్వామివారు మౌనవ్రతంలో ఉన్నారు. చేతిసైగలతోనే కొన్ని ప్రశ్నలను అడిగి ఆ ఆఫీసరు కుటుంబాన్ని ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చి పంపించారు. 


సరిగ్గా అదే సమయంలో కోపిష్టి యువకుడైన ఒక మఠం ఉద్యోగి అరవడం మొదలుపెట్టాడు. “వాడు ఎవడైతే ఏంటి! వాడేమైనా పెద్ద పోటుగాడా! రాస్కెల్ నా జమఖాణం మీద కూర్చోవడానికి వాడికి ఎంత ధైర్యం? మఠం పవిత్రత అంతా పోయింది. ఇప్పుడే రాష్ట్రపతికి టెలిగ్రాం చేస్తాను”


అతను అలా అరవడం మాకు అవరోధంగా మారింది. నాకు చాలా బాధకలిగింది. పరమాచార్య స్వామివారి సమక్షంలో ఒక వ్యక్తి ఇలా అరవడం మఠాన్ని,స్వామివారిని అవమానించినట్టే కదా? అతను ఇలా అరవడానికి కారణం తను జమఖాణం పైన కూర్చోవడమే అని ఆఫీసరుకు తెలిస్తేదాని పర్యవసానం మా పనిమీద కూడా పడుతుంది కదా! 


ఒక పదిహేను నిముషాలు అలా అరిచి అతను వెళ్ళిపోయాడు. నేను స్వామివారిని మనస్సు లోనే ప్రార్థిస్తున్నాను “స్వామీ ఆ యువకుడు అరుస్తున్నది తను జమఖాణం పైన కూర్చున్నందువల్లే అని ఆ ఆఫీసరుకు తెలియకుండా చూడు” అని. 


దర్శనం ముగించుకుని మేము మఠం నుండి బయటకు రాగానే ఆఫీసరు అడగనే అడిగాడు. “ఎవరతను? ఎందుకు అలా అరుస్తున్నాడు? అది కూడా మహాత్ములైన స్వామివారి ముందు” 


నేను తెలివిగా చిన్న అబద్ధం చెప్పి తప్పించుకున్నాను. “ఈరోజు పౌర్ణమి కదా. ఆ యువకుడికి కొంచం చిత్తభ్రమ ఉంది. కాబట్టి అతను అలా ఎవరో ఒకరిపై అరుస్తూ ఉంటాడు” అని.


“ఓహ్ అలాగా! నువ్వు ఈ విషయం ముందే చెప్పిఉంటే అతనికోసం కూడా మనం స్వామివారిని ప్రార్థించేవారం కదా” అని తన ఔదార్యాన్ని చాటుకున్నాడు ఆఫీసరు. 


క్రమశిక్షణకి కట్టుబాట్లకి మారుపేరైన మహాస్వామివారు ఈ అరుపులు విన్నారు. ఆరోజు దర్శనానికి వచ్చిన వారందరూ వెళ్ళిపోగానే ఆ యువకుడిని పిలిచి మందలించడమే కాకుండా మూడురోజులపాటు మఠంలోనికి రాకూడదని చెప్పారు. 


వేరొక సేవకుని ద్వారా నాకు ఈ విషయం తెలిసింది. తప్పుచేసినవాడు ఎంతటి మేధావి, భక్తుడు అయినా అనాగరికులుగా కోపంతో ప్రవర్తిస్తే వాళ్ళకి శిక్ష తప్పదు.✍️                             

     - టి.యస్.కోదండరామశర్మ, మహాపెరియవళ్–దరిశన అనుభవంగళ్

జయజయ శఙ్కర హరహర శఙ్కర```

*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*

*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥*

```

#KanchiParamacharyaVaibhavam # “కంచిపరమాచార్యవైభవం”🙏

.     సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

            🌷🙏🌷


🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


నిను సేవింపగ


నిను సేవింపగ నాపదల్పొడమనీ, నిత్యోత్సవం బబ్బనీ, జనమాత్రుండననీ, మహాత్ముడననీ, సంసార మోహంబు

కొననీ, జ్ఞానము గల్గనీ, గ్రహగతుల్ కుందింపనీ, మేలు వ చ్చిన రానీ, యవి నాకు భూషణములే శ్రీ కాళహస్తీశ్వరా!


ఈశ్వరా! నేను నిన్ను సేవిస్తుండగా, నాకు కష్టాలు రానీ, సుఖాలు రానీ, నన్ను లోకము సామాన్యుడననీ, గొప్పవాడననీ, సంసార వ్యామోహము కలుగనీ, జ్ఞానమే కలుగనీ, గ్రహచారము నన్ను క్రుంగదీయనీ లేక మంచి చేయనీ, అవి అన్నీ నాకు ఆభరణములు వంటివే అవుతాయి. నీ పాదసేవ చేస్తున్న నాకు అన్నీ నీ అనుగ్రహములు గానే కనిపిస్తాయి.



రాయలసీమ పౌరుషపు గడపల్లో

 *రేనాటి పౌరుషం కుందూ నది…*

    *(కుందూ నది గీతం)*


రాయలసీమ పౌరుషపు గడపల్లో

ఎర్రమల కనుమల సానుల్లో 

ఉప్పలపాడలో జన్మించే చిన్న నీటి బుగ్గ 

తన దారిని మళ్లించి పెనమ్మతో కలిసే..


సీమలో సిరుల తల్లి కుందూ మాత 

సరసరా నీటి సవ్వడితో కదులుతూ 

కృష్ణమ్మ చెంత ఉన్నా అటు చూడక 

పెన్నమ్మతో మైత్రి బంధానికి కదిలే…


పురాతన నామం కుముద్వతి

ప్రస్తుతం కుందూ నదిగా రూపాంతరం 

రేనాటి సీమకు పౌరుషం పోసి 

శత్రువులను జయించే బలాన్ని సమకూర్చే..


ఆదిమానవుడి ఆనవాళ్లకు సాక్ష్యంగా 

రాతి వనాలలో నీటి పంటగా 

ఎర్రమల కొండల్లో కోనేటి రూపంగా 

గిరులల్లో వంపులో ప్రాకింది సొంపుగా..


కొండ ప్రాంతాల్లో నది రాతివనంగా

సున్నపురాళ్ల శిలలను అడుగున కలిగి 

నేలలో నీళ్ళు ఇంకక నేలపై పొర్లుతూ 

తాన ప్రత్యేకతను చాటుకొని ప్రవహించే..


అపారమైన ధైర్యాన్ని నీళ్లతో అందించి 

లేత మీసాలకు కూడా రోషాన్ని రప్పించి

రేనాటి గడ్డలో గుండె ధైర్యాన్ని నూరిపోసి 

సీమ పౌరుషంలో చిరస్థాయిగా నిలిచింది..


ఈ నీటిలో కత్తులే కడిగిన ‌పదును పెరిగే 

గుక్కెడు నీళ్లు తాగితే గుండె ధైర్యం వచ్చే 

పగోడు చిక్కితే పరలోకానికి పంపే

రోషం గౌరవం కుందూ నీటిలోని గొప్పతనం..


నది తీరాన మొలిచిన గడ్డి కూడా అస్త్రమే 

ఇక్కడి ప్రజల మాటల్లో మాధుర్యమే

కవనమల్లిన కవి పుంగవులు ఎందరో 

కలం గళం విప్పిన ముద్దు బిడ్డలందరు..


పుష్కర నది కాకపోయినా 

కుందూ నది స్నానం పుణ్యప్రదానం 

పవిత్రమైన గంగతో సమానం 

తీరం వెంబడి ప్రజలకు విలవేల్పు కుందూ..


రేనాటి భూముల్లో ‌నీటి కుండల ‌కనిపించే 

పెరిగిన పంటల్లో పసిడిగా నవ్వుల నివసించే

రైతన్నల కళ్ళల్లో ముత్యంలా మురిసే 

నాగేటి సాలులో గలగల దొర్లి పోయే..


కుందూ అన్నది కుందేరుగా మారుతూ 

పెద్దెరుగా నంద్యాల్లో పరవళ్ళు తొక్కుతూ 

నంది మండలంలో నవధాన్యాలు పండించే 

సీమలో సిరుల పంటలకు ప్రాణము పోసే..


చినుకు చినుకు ఒడిసి పట్టుకొని 

వాగును వంకను ప్రేమతో కలుపుకొని 

చిరుధార మహోగ్రరూపమై కదిలి 

సీమ ముఖాల్లో చిరునవ్వులే చిందించే…


అడుగుపెట్టిన గ్రామాల్లో ఆనందమే 

ప్రకృతి ఒడిలో పరవళ్ళు తొక్కుతూ 

సూర్యోదయ సూర్యాస్తమయాల్లో వెలుగుల్లో 

సుందర కన్యలా వయ్యారంగా సాగిపోయే..


సీమ నేలలో ఒంపులెన్నో తిరుగుతూ

నీటి బిందువులతో నడకలెన్నో సాగిస్తూ 

కొండల్లో కోనల్లో ముచ్చట్లెన్నో ‌చెప్పుతూ 

సీమ అంచుకు పచ్చని హారాన్ని సమకూర్చే..


బహుశా ఏ కవి కంట పడలేదేమో 

ఈ అపురూప సౌందర్య నది ప్రవాహం 

గలగల పారుతున్న శబ్ద సౌందర్యం 

బిరబిర ఉరికే మహోగ్ర స్వరూపం…


దారిలో దాయాదులను కలుపుకుంటూ 

గాలేరు పాలేరు నిప్పుల వాగు సంకలగుతో

తోడబుట్టినోళ్లను సంకలో ఎత్తుకుంటూ 

నల్లమల నీటిని అంగిట్లో నిలుపుకుంటూ..


ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి పౌరుషం 

బుడ్డా వెంగల్ రెడ్డికి దాన గుణం 

రేనాటి పాలెగాళ్లకు వీరత్వాన్ని అందించే 

కుందూ ప్రవాహము లోనే కలిసే రోషం ..


అప్పుడప్పుడు ఉగ్రరూపం దాల్చుతూ

అపర గంగై శివతాండవం చేస్తూ 

ఆవేశము తగ్గి మరలా ఆశీర్వదించే 

పతిత పావనిలా సీమ సిగలో మిగిలే..


*🖊️కొప్పుల ప్రసాద్* 

నంద్యాల 

9885066235

రాక్షస సంహారం

 *ఈ రాక్షస సంహారం అంతం ఎప్పుడు..?*


ఎర్రకోట సాక్షిగా చిమ్మింది రక్తం 

త్రివర్ణముపై చీకటి నీడలా కమ్ముకుంది 

ఏ మాశించింది ఈ ఘోర నిప్పురవ్వలతో 

భీతావహ దృశాలతో మనసు మండుతుంటే..


స్వార్థపు పొరల్లో ఇంకిపోయి 

మతమైకములో విచ్చలవిడిగా తిరుగుతూ 

అంధత్వం ఆవహించినట్లు నటిస్తూ 

నడిరోడ్డుపై అక్రమ వలల్లో బంధిస్తున్నారు..


సరిహద్దు రేఖలను తుంచుకుంటూ

చీకటి లోకములో రంగులను పులుముకుంటూ 

అర్థము లేని ప్రశ్నలతో సతాయిస్తూ 

కూర్చున్న కొమ్మలను నిలువునా నరుకుతున్నారు..


ఎంత విజ్ఞానం వికసిస్తే నేమి 

మూఢత్వానికి మూర్ఖత్వాన్ని జోడిస్తూ 

నరమేధాన్ని నడివీదుల్లో ప్రదర్శిస్తూ 

సామాన్యులను బలిగోరే మూర్ఖపు చర్యలు..


ఏం ఆశిస్తుంది ఈ అజ్ఞానము ప్రపంచం 

తోటి మనిషిని చంపి పిశాచిలా విహరిస్తూ 

ఉనికి కోసం రక్తపుటేరులను పారించుట 

మతోన్మాదమ మత్తులో తూగుట న్యాయమా..


ఏ పవిత్ర గంధం బోధించింది 

మనిషిని మనిషిని చంపుకొనే సిద్ధాంతాన్ని 

ఏ భగవంతుడు ప్రబోధించాడు 

రక్తపు మడుగులలో స్నానాన్ని ఆచరించమని..


విజ్ఞాన ఫలం విశ్వంలో సూర్యోదయం చేస్తుంటే 

ఇంకా అజ్ఞానపు చీకట్లో ముష్కర యుద్ధాలు 

ఉగ్రవాదుల ఉగ్రరూపం లో మారణ హోమాలు 

ఇంకెప్పుడు అంతం ఈ రాక్షస సంహారం..


కొప్పుల ప్రసాద్ 

నంద్యాల 

9885066235

ప్రాభాతమ్మున సూర్యతేజము

 శా॥

ప్రాభాతమ్మున సూర్యతేజము ధరన్ వారించు ధ్వాంతప్రభల్ 

ప్రాభాతమ్మున సూర్యతేజము హృదిన్ రావించు చైతన్యమున్ 

ప్రాభాతమ్మున సూర్యతేజము వెసన్ ప్రాణమ్మగున్ జీవికిన్ 

ప్రాభాతామలసూర్యదేవుడిని సంభావింతు కైమోడ్పులన్ 

*~శ్రీశర్మద*