4, జులై 2025, శుక్రవారం

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🍁శనివారం 5 జూలై 2025🍁*

``

           *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది.

``

     *వాల్మీకి రామాయణం*               

            *89వ భాగం*

```

సుగ్రీవుడు అలా అనగానే ఇన్ని కోట్ల వానరాలు లంక యొక్క అంతఃపురాల మీద పడిపోయి రావణ అంతఃపురంతో సహా అన్ని ఇళ్ళని అగ్నికి ఆహుతి చేశాయి. ఆ ఇళ్ళల్లో ఉన్న రకరకాల వస్త్రాలు, బంగారు పాత్రలు, ముత్యాలు, రత్నాలు మొదలైనవన్నీ కాలిపోయాయి. బాలురు, వృద్ధులు మినహాయించి లంకలో ఉన్న మిగిలిన మూలబలంలోని రాక్షసులు చాలామంది కాలిపోయారు. 


ఇదేసమయంలో రామచంద్రమూర్తి క్రుద్ధుడై ధనుష్టంకారం చేశాడు. ఒకపక్క ధనుష్టంకారం, ఒకపక్క వానర ఘోష, ఒకపక్క రాక్షసుల అరుపులు, ఒకపక్క రామ బాణ పరంపర వచ్చి లంకా పట్టణ ప్రాసాదముల మీద పడిపోతోంది. 


ఎక్కడా చూసినా అరుపులతో పరిస్థితి ఘోరంగా ఉంది.

అప్పుడు రావణుడు కుంభకర్ణుడి కుమారులైన కుంభుడు, నికుంభుడిని యుద్ధానికి పంపాడు. వాళ్ళతో పాటు ప్రజంఘుడు, మకరాక్షుడు అనే తన కుమారుడిని యుద్ధానికి పంపాడు.


అప్పుడు సుగ్రీవుడు కుంభుడిని, హనుమంతుడు నికుంభుడిని, అంగదుడు ప్రజంఘుడిని, రాముడు మకరాక్షుడిని సంహరించారు.


ఈ వార్త విన్న రావణుడు విశేషమైన శోకాన్ని పొంది, మళ్ళీ ఇంద్రజిత్ ని పిలిచి యుద్ధానికి వెళ్ళమన్నాడు.


ఆ ఇంద్రజిత్ మళ్ళీ అదృశ్యమయిపోయి బాణ పరంపరతో వానరాలని కొట్టడం మొదలుపెట్టాడు.


అప్పుడు లక్ష్మణుడు రాముడితో…  

“అన్నయ్యా! వీడు ఎన్నోసార్లు యుద్ధానికి వస్తున్నాడు. నువ్వు నాకు అనుమతిని ఇవ్వు, సమస్త రాక్షసజాతి నశించిపోవాలని సంకల్పించి, అభిమంత్రించి బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టేస్తాను” అన్నాడు.


రాముడన్నాడు…  

“పారిపోతున్నవాడిని, ప్రమత్తుడై ఉన్నవాడిని, కనపడకుండా మాయా యుద్ధం చేస్తున్నవాడిని, వెన్ను చూపి పారిపోతున్నవాడిని, శరణాగతి చేసినవాడిని కొట్టకూడదు. పైగా బ్రహ్మాస్త్రం వేస్తే సమస్త భూమండలం క్షోభిస్తుంది. అందుకని ఒక్కడిని సంహరించడం కోసం అలాంటి అస్త్ర ప్రయోగం చెయ్యకూడదు. మనం అదును చూసి, వాడు ఎటువైపు తిరుగుతున్నాడో, బాణాలు ఎటువైపు నుండి వస్తున్నాయో చాలా నిశితంగా పరిశీలించు. ఇవ్వాళ వాడు ఎక్కడో అక్కడ దొరకకపోడు, అప్పుడు తీవ్రమైన వేగం కలిగిన బాణములతో ఇంద్రజిత్ ని కొట్టి భూమి మీద పడేస్తాను. లక్ష్మణా! ఇది నా ప్రతిజ్ఞ" అన్నాడు.


రాముడి మాటలను విన్న ఇంద్రజిత్ అనుకున్నాడు.. 'ఈ రామలక్ష్మణులు నన్ను కనిపెట్టి కొట్టడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి నేను ఏదో ఒక మోసం చేసి, రామలక్ష్మణుల దృష్టిని నా నుంచి మరల్చాలి' అనుకుని ఆలోచించాడు. 


అప్పుడాయన వెంటనే సీతమ్మని మాయ చేత సృష్టించి తన రథంలో కూర్చోపెట్టాడు.


ఆయనకి ఎదురుగా హనుమంతుడు ఒక పర్వతాన్ని పట్టుకొని వస్తున్నాడు. అప్పుడా ఇంద్రజిత్ తన రథంలో ఉన్న మాయా సీత చెంపల మీద ఎడాపెడా కొట్టాడు. వాడు అలా కొడుతుంటే ఆవిడ… 'హా రామా, హా రామా' అని ఏడుస్తోంది. 


అలా ఏడుస్తున్న సీతమ్మని చూసిన హనుమంతుడు తట్టుకోలేక ఆ పర్వతాన్ని కిందపడేసి, ఏడుస్తూ…  

“దుర్మార్గుడా, ఆమె మహా పతివ్రత, రామ కాంత. సీతమ్మని అలా కొడతావా, నాశనమయిపోతావురా నువ్వు, నేను, సుగ్రీవుడు నిన్ను విడిచిపెట్టము, నీ శిరస్సు గిల్లేస్తాను. సీతమ్మని వదులు” అని హనుమంతుడు బాధతో ఏడుస్తూ అరిచాడు.


అప్పుడు ఇంద్రజిత్ అన్నాడు… “ఆమె స్త్రీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. కాని మాకు దుఃఖాన్ని కల్పించింది కాబట్టి ఈమెని మాత్రం నేను విడిచిపెట్టను" అని చెప్పి ఒక ఖడ్గాన్ని తీసుకొని ఆమె శరీరాన్ని చీరేశాడు. అప్పుడా మాయా సీత మరణించి ఆ రథంలో పడిపోయింది. తరువాత ఇంద్రజిత్ ఆ రథంతో వెళ్ళిపోయాడు.


ఎప్పుడైతే సీతమ్మ పడిపోయిందో అప్పుడు హనుమంతుడు యుద్ధం మానేసి, ఏడుస్తూ, పెద్ద పెద్ద కేకలు వేస్తూ… “ఇంకా ఈ యుద్ధం ఎవరి కోసం చేస్తారురా. ఏ తల్లిని రక్షించడానికి యుద్ధానికి వచ్చామో ఆ తల్లిని సంహరించాడు. ఇంక నేను యుద్ధం చెయ్యను" అని ఏడుస్తూ రాముడి దగ్గరికి వెళ్ళి… 

“రామా! దుర్మార్గుడైన ఇంద్రజిత్ వానరులందరూ చూస్తుండగా సీతమ్మని తీసుకొచ్చి, సంహరించి తీసుకెళ్ళిపోయాడు. ఇంక సీతమ్మ లేదు" అని చెప్పాడు.


ఈ మాటలు విన్న రాముడు మూర్చపోయి కిందపడిపోయాడు.

తరువాత వాళ్ళు రాముడి ముఖం మీద కొన్ని నీళ్ళు పోసి ఆయనని లేపారు.


అప్పుడు లక్ష్మణుడు అన్నాడు… 

“అన్నయ్యా! నువ్వు ‘ధర్మము ధర్మము ధర్మము’ అని ఇన్నాళ్ళు పట్టుకు తిరిగావు. ఆ ధర్మం నీకు ఏ ఫలితాన్ని ఇచ్చింది. నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల రాజ్య భ్రష్ట్రుడివి అయ్యావు, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల తండ్రిగారు మరణించారు, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల సీతమ్మ అపహరింపబడింది, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల జటాయువు మరణించాడు, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల 14 సంవత్సరాలుగా అరణ్యాలలో తిరుగుతున్నావు. ధర్మాన్ని విడిచిపెట్టిన రావణుడు అంతఃపురంలో కులుకుతున్నాడు, సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు. అధర్మంతో ఉన్నవాడు అంత సంతోషంగా ఉన్నాడు, ధర్మంతో ఉన్న నువ్వు ఇంత కష్టంలో ఉన్నావు. ఇంకా ధర్మము ధర్మము అని ఎందుకంటావు అన్నయ్యా, ఆ ధర్మాన్ని విడిచిపెట్టు. మనం కూడా అధర్మాన్నే స్వీకరిద్దాము” అన్నాడు. 


వెంటనే విభీషణుడు పరుగు పరుగున వచ్చి… “ఎంతమాటన్నావు లక్ష్మణా, సీతమ్మని ఇంద్రజిత్ సంహరిస్తే రావణుడు ఊరుకుంటాడనుకున్నావా? ఎంతోమంది చెప్పినా సీతమ్మని విడిచిపెట్టనివాడు ఇంద్రజిత్ సీతమ్మని చంపితే ఊరుకుంటాడా. ఆ ఇంద్రజిత్ మహా మాయావి, మీరు అంతలోనే వాడి మాయ మరిచిపోయారు. వాడు మాయా సీతని సంహరించి తీసుకుపోయాడు. వాడు ఇప్పుడు ఏం చేస్తుంటాడో తెలుసా. పెద్ద ఊడలు దిగిపోయిన మర్రి చెట్టు ఒకటి ఉంది, దాని చుట్టూ చాలా చీకటిగా ఉంటుంది. వాడు అక్కడికి వెళ్ళి నికుంభిలా హోమం చేస్తాడు. అక్కడ వాడు నికుంభిలా దేవతని ఉద్దేశించి హోమాన్ని పూర్తి చేసి, వాడి గుర్రాల మీద, ఆయుధముల మీద ఆ అక్షతలని చల్లుకొని యుద్ధ రంగంలోకి వస్తే దేవేంద్రుడు కూడా వాడితో యుద్ధం చెయ్యలేడు. సీతమ్మ చనిపోయింది అనుకుని మీరు ఇక్కడ ఏడుస్తున్నారు, కాని వాడు అక్కడ హోమం చేస్తుంటాడు. రామా! నన్ను అనుగ్రహించు, నాతో లక్ష్మణుడిని తీసుకెళ్ళి ఆ హోమం పూర్తవకుండానే వాడిని సంహరిస్తాను” అన్నాడు.


అప్పుడు రాముడు లక్ష్మణుడిని ఆశీర్వదించి, హనుమ మొదలైన వీరుల్ని సాయంగా పంపారు.


విభీషణుడు లక్ష్మణుడిని ఇంద్రజిత్ హోమం చేసుకునే చోటుకి తీసుకెళ్ళాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఇంద్రజిత్ ఆ హోమం చెయ్యడం కోసం సిద్ధపడుతున్నాడు. తన హోమాన్ని ఎవరూ పాడుచెయ్యకుండా చుట్టూ సైన్యాన్ని కాపు పెట్టాడు.


అప్పుడు విభీషణుడు… “లక్ష్మణా! నువ్వు ఒకపక్క నుంచి సైన్యాన్ని బాణాలతో కొట్టి కాకావికలం చెయ్యి, అప్పుడు ఇంద్రజిత్ కనపడతాడు. అదే సమయంలో హనుమ వెళ్ళి రాక్షస సైన్యాన్ని తుదముట్టించెయ్యాలి. అంతమంది అక్కడ పడిపోతుంటే వాడు అక్కడ కూర్చుని హోమం చెయ్యలేడు. కాబట్టి రథం ఎక్కి వస్తాడు, అప్పుడు నువ్వు వాడిని కొట్టాలి” అన్నాడు.


వెంటనే లక్ష్మణుడు బాణ ప్రయోగం చేశాడు. అప్పుడా సైన్యం పక్కకి తప్పుకుంది, వాళ్ళు పక్కకి తప్పుకోగానే ఆ మర్రి చెట్టు కనపడింది. వెంటనే హనుమంతుడు అరివీరభయంకరుడై ఆ రాక్షసులని మర్దించేశాడు. హనుమ ప్రతాపం ముందు ఆ రాక్షస సైన్యం నిలబడలేక పెద్ద హాహాకారాలు చేశారు. 


ఆ హాహాకారాలు విన్న ఇంద్రజిత్ హోమాన్ని ఆపి 'ముందు హనుమంతుడిని సంహరించి, అప్పుడు హోమం చేస్తాను' అని అనుకొని రథం ఎక్కాడు. 


అప్పుడాయన ఒక బ్రహ్మాండమైన అస్త్రాన్ని హనుమంతుడి మీద ప్రయోగిద్దామని ఆ అస్త్రాన్ని అభిమంత్రిస్తుండగా లక్ష్మణుడు ధనుష్టంకారం చేశాడు. 


ఆ టంకారానికి ఇంద్రజిత్ లక్ష్మణుడి వైపు చూశాడు.


అప్పుడు లక్ష్మణుడు.. “దుర్మార్గుడా, హనుమతో యుద్ధం ఎందుకు, నీతో యుద్ధం చెయ్యడానికి నేను వచ్చాను. పౌరుషం ఉంటే నాతో యుద్ధం చెయ్యి” అన్నాడు.


అప్పుడు ఇంద్రజిత్ …

“ఇంతకముందు నిన్ను రెండు మూడుసార్లు కొట్టాను, అయినా బుద్ధి లేకుండా మళ్ళీ వచ్చావు. చూడు నీకు ఎటువంటి యుద్ధం చూపిస్తానో ఇవ్వాళ” అని ఇద్దరూ యుద్ధం మొదలుపెట్టారు.


లక్ష్మణుడి పక్కన ఉన్న విభీషణుడిని ఇంద్రజిత్ చూసి అన్నాడు… “నువ్వు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగావు, నువ్వు స్వయానా నా తండ్రికి తమ్ముడివి, నాకు పినతండ్రివి. నీ కొడుకు వరసైన నన్ను చంపడానికి ఇవ్వాళ శత్రువులతో చేతులు కలిపావే, నీకు ఇలా చెయ్యడానికి సిగ్గుగా లేదా. శత్రువులతో చేతులు కలిపి తనవారిని చంపినవాడు చివరికి ఆ శత్రువుల చేతులలోనే చనిపోతాడు” అన్నాడు. 


విభీషణుడు అన్నాడు… “నీ తండ్రియందు, నీయందు పాపం ఉంది కనుక నేను మిమ్మల్ని విడిచి ధర్మాత్ముడైన రాముడి పక్కకి వచ్చాను” అన్నాడు.


అప్పుడు ఇంద్రజిత్ కి లక్ష్మణుడికి ఘోరమైన యుద్ధం జరిగింది. ఇద్దరూ ఒకరిని ఒకరు బాణాలతో కొట్టుకున్నారు. లక్ష్మణుడు వేసిన బాణాలకి ఇంద్రజిత్ యొక్క ధనుస్సు ముక్కలయిపోయింది. తరువాత ఇంద్రజిత్ బాణాలతో లక్ష్మణుడి కవచాన్ని పగలగొట్టాడు. ఇద్దరూ సింహాలలా యుద్ధం చేశారు. విభీషణుడు ఆ రాక్షసుల మీద బాణాలని వేసి వాళ్ళని సంహరించాడు. ఇంద్రజిత్ కి లక్ష్మణుడికి 3 రోజుల పాటు భయంకరమైన యుద్ధం జరిగింది. ఆఖరికి ఇంద్రజిత్ యొక్క సారధిని లక్ష్మణుడు కొట్టాడు. అప్పుడా ఇంద్రజిత్ ఒక చేతితో సారధ్యం చేస్తూ లక్ష్మణుడితో యుద్ధం చేశాడు. అప్పుడు నలుగురు వానర వీరులు ఆ రథం యొక్క గుర్రాలని కిందకి లాగేసి ఆ రథాన్ని నాశనం చేశారు.


లక్ష్మణుడు ఎన్ని అస్త్రాలని వేసినా ఇంద్రజిత్ సంహరింపబడకపోయేసరికి విభీషణుడు అన్నాడు… “ఆ ఇంద్రజిత్ పౌరుషం పెరిగిపోతుంది. ఏదో ఒకటి చేసి ఆ ఇంద్రజిత్ ని సంహరించు” అన్నాడు.

```

*ధర్మాత్మా సత్య సంధశ్చ రామో దాశరథిర్యది*

*పౌరుషే చా అప్రతిద్వంద్వః తదైనం జహి రావణిమ్*

```

అప్పుడు లక్ష్మణుడు రెండు కోరలు కలిగిన సర్పంలాంటి ఒక బాణాన్ని తీసి, వింటినారికి తొడిగి “మా అన్న రాముడు ధర్మాత్ముడైతే, సత్యసంధుడైతే, దశరథుడి కొడుకే అయితే, పౌరుషం ఉన్నవాడే అయితే నా ఎదురుగా నిలబడిన ప్రతిద్వంది అయిన ఇంద్రజిత్ నిగ్రహింపబడుగాక” అని బాణ ప్రయోగం చేశాడు. 


ఆ బాణం వెళ్ళి ఇంద్రజిత్ కంఠానికి తగలగానే ఆయన శిరస్సు శరీరం నుండి విడిపోయి కింద పడిపోయింది. ఇంద్రజిత్ మరణించాడు.```


       *రేపు…90వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

శనివారం🚩* *🌹05 జూలై 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

        *🚩శనివారం🚩*

  *🌹05 జూలై 2025🌹*        

    *దృగ్గణిత పంచాంగం*  

                   

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*ఆషాఢమాసం - శుక్లపక్షం*


*తిథి  : దశమి* సా 06.58 వరకు ఉపరి *ఏకాదశి*

*వారం    : శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం   : స్వాతి* రా 07.51 వరకు ఉపరి *విశాఖ*

*యోగం : సిద్ధ* రా 08.36 వరకు ఉపరి *సాధ్య*

*కరణం   : తైతుల* ఉ 05.45 *గరజి* సా 06.58 ఉపరి *వణజి*

*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ10.30-12.00 సా04.00 - 06.30*

అమృత కాలం  : *ఉ 09.57 - 11.45*

అభిజిత్ కాలం  : *ప 11.46 - 12.38*

*వర్జ్యం          : రా 02.07 - 03.54*

*దుర్ముహూర్తం  : ఉ 05.40 - 07.24*

*రాహు కాలం   : ఉ 08.56 - 10.34*

గుళికకాళం       : *ఉ 05.40 - 07.18*

యమగండం     : *మ 01.50 - 03.28*

సూర్యరాశి : *మిధునం*

చంద్రరాశి : *తుల*

సూర్యోదయం :*ఉ 05.47*

సూర్యాస్తమయం :*సా 06.55*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.40 - 08.16*

సంగవ కాలం         :      *08.16 - 10.53*

మధ్యాహ్న కాలం    :     *10.53 - 01.30*

అపరాహ్న కాలం    : *మ 01.30 - 04.07*

*ఆబ్ధికం తిధి         : జ్యేష్ఠ శుద్ధ దశమి*

సాయంకాలం        :  *సా 04.07 - 06.44*

ప్రదోష కాలం         :  *సా 06.44 - 08.55*

రాత్రి కాలం           :*రా 08.55 - 11.50*

నిశీధి కాలం          :*రా 11.50 - 12.34*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.12 - 04.56*

--------------------------------------------------

         *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి*


*🙏శ్రీ వేంకటేశ్వర స్వామి🙏* 

*🔯సహస్రనామ స్తోత్రం*🔯


        *నాగరాజపాలనం*  

       *భోగినాథశాయినం*  

        *నాగవైరిగామినం*  

    *నగారిశత్రుసూదనమ్*  

       *నాగభూషణార్చితం*


*🌹ఓం నమో వేంకటేశాయ🌹*


***************************

   *🍁శ్రీ ఆంజనేయ స్తోత్రం🍁*


      *నమో వాయుపుత్రాయ*  

     *భీమరూపాయధీమతే*

     *నమస్తే రామదూతాయ*  

     *కామరూపాయశ్రీమతే!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🚩🪷🌹🛕🌹🌷🪷🌷🚩

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

పంచ గయలు*

 *పంచ గయలు* 


మన దేశంలో మొత్తం 5 గయలు ఉన్నాయని చెబుతారు. 


*1. శిరోగయ, 2. నాభిగయ, 3. పాదగయ, 4. మాతృగయ, 5. పితృగయ.* 


 1. *శిరోగయ* : బిహార్ రాష్ట్రంలో ఫల్గుణీ నదీ తీరంలో *“శిరోగయ”* గా వెలసింది. దీనినే బుద్ధగయ అని కూడా అంటారు.


 2. *నాభిగయ* : జాజ్ పూర్, ఒరిస్సా రాష్ట్రంలో వైతరణి నదీ తీరంలో వున్న ప్రదేశంను *“నాభిగయ”* అని అంటారు.


 3. *పాదగయ* : పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్‌లో గయని పాదాలుండటం వలన అవి వున్న ప్రదేశం పిఠాపురాన్ని *“పాదగయ”* అంటారు.


 4. *మాతృగయ* : గుజరాత్ రాష్ట్రంలో మహేషన జిల్లాలో సరస్వతీ నదీ తీరంలో గల ప్రాంతాన్ని *“మాతృగయ”* అని అంటారు. బిందు సరోవరమనే మరో పేరు కూడా కలదు. అహమ్మదాబాదుకు 32 కి||మి|| దూరంలో గల మాతృగయలో మాతృవంశం వారికి పిండప్రదానం మరింత ముఖ్యం. ఒరిస్సాలోని భువనేశ్వర్‌కి 33 కి||మి|| దూరంలో వున్న బిందు సరోవరం వద్ద కూడా పిండ ప్రదానాలు చేస్తారు.


5. *పితృగయ* : బధరీనాథ్, ఉత్తర ప్రదేశ్‌లోని అలకనందా నదీ తీరంలో గల *“బ్రహ్మకపాలం”* అనే ప్రదేశాన్ని *“పితృగయ”* అంటారు.

దండం దశగుణం భవేత్"*

 *"దండం దశగుణం భవేత్"*


దండిస్తే కాని పని జరగదు అనే సందర్భంలో "దండం దశగుణం భవేత్" అంటూంటారు. _"దేవుడికైనా దెబ్బే గురువు"_ అంటే కొడితేగాని పని జరగదు అని భావం. 

కానీ ఈ శ్లోకం పూర్తిగా చూద్దాం.


*విశ్వామిత్రా హి  పశుషు*

*కర్దమేషు జలేషు చ |*

*అంధే తమసి వార్ధక్యే*

*దండం దశగుణం భవేత్ ||*


ఇది శ్లోకం.

 మరి దీనిలోని అర్థం - 

1. వి - పక్షులు, 

2. శ్వా - కుక్కలు, 

3. అమిత్ర - మిత్రులుకానివారు (శత్రువులు), 

4. అహి - పాములు, 

5. పశు - పశువులు, 

6. కర్దమేషు - బురదలో, 

7. జలేషు - నీటిలో, 

8. అంధే - గుడ్డితనంలో,

9. తమసి - చీకటిలో, 

10. వార్ధక్యే - ముసలితనంలో 

దండం - కర్ర,

దశగుణం - 10 గుణాలను, 

భవేత్ - కలిగిస్తుంది. 


అంటే కర్ర పక్షులను, కుక్కలను, శత్రువులను, పాములను, పశువులను అదుపు చేయడానికి, బురదలోను, నీటిలోను, గ్రుడ్డితనంలోను, చీకటిలోను, ముసలితనంలోను ఆపుగా(ఆసరాగా) ఉంటుంది. కావున కర్ర ఈ పది రకాలుగా ఉపయోగపడుతుంది - అని భావం.


~సాహితీనందనం

జెండా రూపశిల్పి

 జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య వర్థంతి సందర్భంగా..


జాతి గుండెల్లో పింగళి వెంకయ్య...!!


జాతి గుండెలో త్రివర్ణమై ఎగురుతూ

తెలుగువాడిగా ఖ్యాతిని పొందుతూ

స్వాతంత్ర్య సమరం లో జెండాగా వెలుగొంది

దేశభక్తికి నిలువెత్తు రూపముగా నిలిచే...


జాతి చేతికి ఘనమైన పతాకం

ప్రతి హృదయములో ఎగురుతుంది ప్రతి క్షణం

మూడు రంగుల ముచ్చట గొలుపుతూ

నింగిలో రెపరెపలాడుతుంది అనుక్షణం..


పింగళి వెంకయ్య మదిలో మెదిలిన రూపం

యావత్ జాతి చేతిలో మెరిసిన కంకణం

గుండె నిండా ధైర్యము నింపే జెండా

చిరునవ్వులతో విశ్వంలో ఎగురుతుంది నిత్యం...


భారతీయుడికి చిహ్నంగా నిలిచింది

ప్రపంచ వేదికలో చిరునామాగా తిరుగుతుంది

స్వాతంత్ర్యానికి గుర్తుగా సగర్వంగా నవ్వుతూ

చేతి పిడికిలి కర్రలో మువ్వర్ణమై తిరుగుతుంది....


జాతి మరిచిపోతున్న మహానేత ఇతను

గుర్తు చేయుట మనందరి బాధ్యత

జాతికి ఆయుధమైన త్రివర్ణం అతను 

దేశ సంగ్రామపు నిజమైన రూపం ఈ కేతనం..


జెండాకిచ్చే గౌరవం రూప శిల్పి 

జాతి కీర్తిని భుజాలపై మోసే దేశభక్తుడు 

జాతి మనుగడలో ఆణిముత్యం 

స్వాతంత్ర్య సమరంలో అసామాన్య విజేత..


జోహార్లు జోహార్లు పింగళి వెంకయ్య

జాతి జెండాలో నిన్ను చూస్తూ మురిసిపోతూ 

నీ ఇచ్చిన ఈ త్రివర్ణం సమైక్యతగా కదులుతూ 

యావత్ దేశం మొత్తం రుణపడి ఉంది నీ త్యాగానికి..


కొప్పుల ప్రసాద్

నంద్యాల

9885066235

నయమొసంగును

 ऊँ!

----

" తేటగీతి..

--

*వి* నయమొసంగును కీర్తిని విస్తృతముగ 

*శా* స్త్రవిజ్ఞానగరిమయు సత్కృతియును 

*లా* తివిధముగనుండిన రక్తిఁబోవు

*క్షి* తిలోప్రతిష్టఁగలుఁగు క్షేమమలర !!! "

----

పోతనార్యుని పద్య మాధురి

: పోతనార్యుని పద్య మాధురి పొందు భాగవతోత్తముల్

లేత కొబ్బరి లౌజు జూసిన, లేచిపోయెదరంతలో,

పోతపోసిన ఖండ చక్కెర పోలు లీలల దేలుచున్

పూతరేకులు తిన్నవెంటనె పుల్లనైనవటందురే 🙏🙏🙏 భూమికాకర్షణ పుష్టిగా గలదని

         తెలిపినందుకొకడు విలువబడసె

శక్తిసూత్రముజూపి జగతినందికొకడు

         శాస్త్రజ్ఞుడైపోయి చాలమెరసె

విద్యుదయస్కాంత వివరములను దెల్పి

         విజ్ఞుడంచొకడిల పేరుపొందె

సృష్టి నీవిడినట్టి చిరమైన శక్తినే

          మరలవెలుపలకు మరలజేసి


రన్న నిజమరయగలేక నవనిజనులు

శాస్త్రవేత్తలె ఘనులన సరియె కనగ

పూర్ణవిధుభాస కోదాడు పురనివాస

పాపనిష్కాస రఘునాథ పరమపురుష

శ్రీకాళహస్తీశ్వరా

 🌻శ్రీకాళహస్తీశ్వరా నమోస్తు🌻


భవదీయ నామంబు ప్రత్యహ మందునన్ 

           భజియించు నుత్తమ భక్తతతికి

దుశ్శకునంబులు దూరంబుగా నుండు 

          గ్రహదోష కష్టముల్ కలుగ కుండు 

శలభంబు లెంతగా సంరంభమున పడ్డ

         కాలెడు ననలమున్ గప్ప గలవె !

అరయ నీ మానవు  లెఱిగియు న్నన్నియున్

         సతతంబు నీసేవ సల్పు కొనియు

పడెడు నిడుముల నెల్లను బాపు కొనక 

కోలు పోయదరేలనో కాల మంత ?

భక్త పాలన శంకరా ! పరమ పురుష !

ప్రణతి శ్రీకాళహస్తీశ్వరా ! మహేశ !             29*



ఈ ప్రాణముల్ నేను కాపాడు కొనుటకు

        నన్య దైవతముల న్నడుగ నెపుడు

నడుగంగ బోయిన న్ననయంబు నీదు పా 

        దార్చనారతులనే నడుగ బోదు

నీ పద పద్మముల్ నిరతంబు గొల్చెడు

       మహితమౌ భక్తిలో మసలునాకు

నింకనున్ గోరంగ నేముండు శంకరా !

         భక్తి సాధకమైన ముక్తి దప్ప

ఇట్టి నాపైన దయజూపి పట్టి కరము

చింతలనుదీర్చి నీలోన చేర్చు కొనుము

కరుణ చూపుము నా పైన కామదహన ! 

ప్రణతి శ్రీకాళహస్తీశ్వరా ! మహేశ !              30*


✍️గోపాలుని మధుసూదనరావు🙏

పద్యతాంబూలం

 పద్యతాంబూలం 


గెంతుల పినవయసున పిత, 

కాంతుడు కళ్యాణమునను, కన్నసుతుండున్, 

పంతమునకన్నదమ్ములు, 

చెంతన మగతలపె లేని చేడియ గలదే?  


చిగురొత్తగ తల్లిని, చెరి 

సగమని దెచ్చిన సుదతిని, సరి వదినమ్మన్, 

బగి తోబుట్టును, తనయను, 

మగువను బ్రతుకున తలవని మగవాడేడీ?


ఇలా, ఇద్దరూ ఒకరికొకరు కావాలిగా, 

అందుకే, జంట తాంబూలములు..😀


🙏🕉️🙏


- రామ్ డొక్కా, ఆస్టిన్, టెక్సస్

వారాహీ మాత🙏

 🙏 వారాహీ మాత🙏

వారాహీ మాత గురించి ఒక్కొక్క పురాణం లో ఒకోరకంగా చెప్పబడింది. వారాహీ మాతను గురించి వివరిస్తాను

వారాహీ దివా న స్మరేత్ అని శాస్త్ర వచనం 

వారాహీ మాతను పగటి పూట స్మరింపరాదు అంటే జపించకూడదు. మాత విశ్రాంతి తీసుకునే సమయం.ఆ తల్లికి నిద్రాభంగం అవుతుంది 

వారాహీ మాత ఆవిర్భాము గురించి వివిధ పురాణాలలో వివిధములుగా వివిధ వాహనాలతో వివిధ ఆయుధాలతో ఉన్నది. అవి ఒక్కసారి పరిశీలిద్దాము.

వారాహి దేవి అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి. ఈమెను సప్త మాతృకలలో ఒకామెగా, దశమహావిద్యలలో ఒకామెగా కొలుస్తారు. ఈమె వరాహ ముఖం కలిగి ఉంటుంది. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. ఈమె వరాహ స్వామి. నేపాల్ లో ఈమెను బారాహి అంటారు.( వబయో రభేదః )

వారాహి

పులిని వాహనంగా కలిగి వరాహ ముఖం, పది చేతులతో వారాహి దేవి ఉంటుంది .


ఆయుధములు

త్రిశూలం, ఖడ్గం

వాహనం

గేదె, సింహం, పులి, గుర్రం


వారాహి దేవిని శైవులు, వైష్ణవులు, శాక్తేయులు పూజిస్తారు. ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు. బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవారాహి, మరీచి ఈమె ప్రతిరూపాలే.


మార్కండేయ పురాణంలోని దేవీ మాహాత్మ్యంలో శుంభ-నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుండి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మాణి, ఇలా వరాహ స్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది. వారాహి వరాహ రూపంలో చేతిలో చక్రం, ఖడ్గంతో వర్ణించబడి ఉంది.

రక్తబీజుడిని చంపడం కోసం దుర్గా దేవి సప్త మాతృకలతో కలిసి పోరాడుతుంది. ఆ విధంగా అష్టమాతృకలు అయ్యారు. వారాహి ఎరుపు వర్ణం చర్మంతో గేదె వాహనంగా చేతులలో ఖడ్గం, డాలు, అంకుశం ఆయుధాలుగా కలిగి ఉంది.

దేవీ మాహాత్మ్యంలోని తరువాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని, అతని సేనను సంహరిస్తుంది. శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే, ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకుని రాక్షసుడ్ని సంహరిస్తుంది. వామన పురాణాం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుండి వారాహి పుడుతుంది.


మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి, వివిధ దిక్కులను మాతృకలు కాస్తారు అని చెప్పే స్తోత్రంలో ఈమె కాచేది ఉత్తర దిక్కును. ఇదే పురాణంలో ఈమె గేదెను వాహనంగా చేసుకుందని తెలపబడి ఉంది.


దేవీ భాగవత పురాణం ప్రకారం వారాహిని, ఇతర మాతృకలతో పాటుగా, అమ్మవారు సృష్టించారు. అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృకలున్నారని తెలుపుతుంది. రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది.


వరాహ పురాణంలో రక్తబీజుడి కథ తిరిగి ప్రస్తావనకు వస్తుంది. కానీ ఈ కథలో ఒక మాతృక మరో మాతృక నుండి ఉద్భవిస్తుంది. ఈ కథ ప్రకారం వారాహి శేషనాగుపై కూర్చొని వైష్ణవి తరువాత ఉద్భవిస్తుంది. ఈమె ఈ పురాణం ప్రకారం అసూయ అనే వికారానికి అధిదేవత.


మత్స్యపురాణం ప్రకారం ఈమె జననం భిన్నంగా ఉంది. ఈ పురాణం ప్రకారం ఈమె అంధకాసురుడనే రాక్షసుడ్ని సంహరించేందుకు సహాయం కోసం శివుడి ద్వారా సృష్టించబడింది. ఈ అంధకాసురుడు కూడా రక్తబీజుడి లాగానే భూమికి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుండి పుట్టుకొస్తాడు.


దేవీ పురాణం వారాహీ దేవిని విచిత్రంగా వరాహా స్వామికి తల్లిగా (వరాహజననిగా) వర్ణించింది.


వారాహిని శైవులు , వైష్ణవులు , శాక్తులు పూజిస్తారు . వారాహిని సప్త-మాతృకల సమూహంలో పేర్కొన్నారు., ఇవి శక్తి మతంలో పూజించబడుతున్నాయి, అలాగే శివునితో సంబంధం కలిగి ఉంటాయి .


వారాహి ఒక రాత్రి దేవత మరియు కొన్నిసార్లు ధ్రుమ వారాహి ("చీకటి వారాహి") మరియు ధూమావతి ("చీకటి దేవత") అని పిలుస్తారు. తంత్రం ప్రకారం, సూర్యాస్తమయం తర్వాత మరియు సూర్యోదయానికి ముందు వారాహిని పూజించాలి. పరశురామ కల్పసూత్రం ఆరాధన సమయం అర్ధరాత్రి అని స్పష్టంగా పేర్కొంది. శక్తలు వారాహిని రహస్య వామమార్గ తాంత్రిక పద్ధతుల ద్వారా పూజిస్తారు, ఇవి ప్రత్యేకంగా పంచమకార ఆరాధనతో సంబంధం కలిగి ఉంటాయి - ద్రాక్షారసం, చేపలు, ధాన్యం, మాంసం మరియు కర్మ సంయోగం . గంగానది ఒడ్డున ఉన్న కాళరాత్రి ఆలయంలో ఈ పద్ధతులు పాటిస్తారు, ఇక్కడ రాత్రిపూట మాత్రమే వారాహికి పూజలు చేస్తారు; గుడి పగటిపూట మూసివేయబడుతుంది. వారాహిని లలితా త్రిపురసుందరి దేవత యొక్క అభివ్యక్తిగా లేదా "దండనాయక" లేదా "దండనాథ"గా భావిస్తారు.

 శక్తిమతం యొక్క శ్రీ విద్యా సంప్రదాయం వారాహిని పరా విద్య ("అతీంద్రియ జ్ఞానం") స్థాయికి పెంచింది . దేవీ మహాత్మ్యం దీర్ఘాయువు కోసం వారాహిని ప్రేరేపించాలని సూచించింది. వారాహి పూజకు మరియు సిద్ధులను పొందేందుకు ముప్పై యంత్రాలు మరియు ముప్పై మంత్రాలు నిర్దేశించబడ్డాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే లలితా దేవి ఇచ్చా శక్తి, రాజమాతంగేశ్వరి జ్ఞానశక్తి వారాహీ మాత క్రియాశక్తి.

మన పురాణాల ప్రకారం మహా శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్త మాతృకలు,వీరే బ్రహ్మీ ,మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండీ.

8.వ మాతృక గా నారసింహి

9.వ మాతృక గా వినాయకి నీ ఆరాధించడం జరుగుతుంది,భక్తులకు కొంగుబంగారంగా మనల్ని ఎప్పుడు చల్లగా చూసేందుకు వీరు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు,ఈ సప్త మాతృక స్వరూపిణి ఈ వారాహి మాతగా పరిగణించపడుతోంది, ఈ వారాహిరూపం రూపాన్ని పోలిఉండి,నల్లని శరీరఛాయాతో మేఘ వర్ణంతో ఎనిమిది చేతులతో, అభయ వరద హస్తం,శంకు చక్ర, రోకలి నాగలి,పాశం హలం ఆయుధాలతో భక్తులకు దర్శనం ఇస్తుంది,ముఖ్యంగా లలితదేవికి సర్వసైన్యాధ్యక్షురాలు ఈ వారాహిమాత,అందుకే ఈమె ప్రస్తావన లలిత సహస్రనామాలలో వినిపిస్తుంది,వారాహి మాతను భక్తి శ్రద్ధలతో కొలిచినవారికి,భక్తుల పాలిట కొంగు బంగారమై,తన పైన నమ్మకం ఉంచిన వారి సమస్యలపై గొప్ప యోధురాలిగా నిలిచి జీవితంలో భక్తులకు ఎదురయ్యే అడ్డంకులన్ని తొలగించి,శత్రుభయం,జ్ఞానసిద్ధి బుద్ధి, ధనప్రాప్తి,ఇంకా అనేక అనేక సకల జయాలు సిద్ధిస్తాయి,అలాగే ఈమె అజ్ఞాచక్ర కుండలిని జాగృతికి కూడా ఎంతో సహాయపడుతుంది, అందుకే ఆమెను ఆజ్ఞచక్రేశ్వరి అన్నారు,శుంభ నీశుoబ,రక్త బీజ వధలోను ఈమె ప్రస్తావన ఉంది.

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

చిత్రము వింతయే యగును

 




చిత్రము వింతయే యగును చిన్నకు పెద్దది చేయి యుండగా


చిత్రము తల్లికిన్ నమరె చిన్నది హస్తము వికృతంబుగా


ఆత్రము నయ్యె చూపరకు హాస్యము దోచెను తల్లి బిడ్డకున్


నేత్రము గొన్నదేమొ భ్రమ నిక్క మదెయ్యది చెప్పరేలకో.


అల్వాల లక్ష్మణ మూర్తి

తిప్పతీగ ఉపయోగాలు

 తిప్పతీగ ఉపయోగాలు - సంపూర్ణ వివరణ . 


      తిప్పతీగ అనునది ప్రతి వూరు డొంకలలో పెరుగుతుంది . దీనిని సంస్కృతంలో " గుడూచీ" అని పిలుస్తారు . దీనికి అర్థం వ్యాధుల నుండి రక్షించునది అని అర్థం.  " అమృత" అనే పేరు కూడా దీనికి కలదు. అనగా అమృతమునకు సమానం అయినది అని అర్థం. 


            ఇప్పుడు మీకు దీనిలోని ఔషధ గుణముల గురించి మీకు వివరిస్తాను. 


  తిప్పతీగ యందలి ఔషధ గుణములు  - 


 *  ఇది వాత , పిత్త , కఫ దోషముల మూడింటి మీద పనిచేస్తుంది . బలకరము , ఆకలిని పెంచుతుంది . మెదడుకు మంచిది . నేత్రములకు బలాన్ని ఇచ్చును. పాండు , కామెర్లు , జ్వరము , మూత్రవ్యాధులు , కుష్ఠు , దగ్గు మొదలగు వ్యాధులను పోగొట్టును . కడుపులోని నులిపురుగులను నశింపచేయును . తల్లిపాలను శుద్ధిచేయును . 


 *  జ్వరములలో తిప్పతీగ కషాయం 20ml ఉదయము , సాయంత్రం ఇచ్చిన జ్వరములు తగ్గును. 


 *  మూత్రసంబంధ వ్యాధులలో తిప్పతీగ రసములో తేనె కలిపి ఇవ్వాలి. కామెర్ల యందు కూడా తిప్పతీగ రసములో ప్రతిరోజూ తేనె కలిపి ఇచ్చిన కామెర్ల సమస్య తగ్గును. 


 *  కీళ్లనొప్పుల యందు తిప్పతీగ , శొంఠి కలిపి ఇచ్చిన కీళ్లనొప్పులు తగ్గును. 


 *  ప్రతిరోజూ తిప్పతీగ రసం తాగించి రోగి బలానుసారం కందికట్టులో నెయ్యి చేర్చిన అన్నము తినుచున్న కుష్ఠు వ్యాధి తగ్గును. 


 *  తిప్పతీగ రసమును ప్రతిరోజూ ఉదయం , సాయంత్రం ఒక నెలరోజుల పాటు సేవిస్తే ఏ వ్యాధులు రాకుండా , ముసలితనం రాకుండా మానవుడు ఆరోగ్యముగా ఉండును. 


 *  తిప్పతీగ చూర్ణము , బెల్లం , నెయ్యి , తేనె కలిపి ముద్దగా చేసి ఉండలా చేసి రోజూ ఒక ఉండ తింటే మానవుడు ఆరోగ్యముగా 100 సంవత్సరాలు జీవిస్తాడు. 


 *  తిప్పతీగ రసం కొద్దిగా నూనెలో కలిపి తాగిన బోదకాలు తగ్గును. 


 *  తిప్పతీగ కషాయంలో పిప్పలి చూర్ణం కలిపి ఇచ్చిన చాలా రోజుల నుంచి వేధిస్తున్న జీర్ణజ్వరం తగ్గును. 


 *  తిప్పతీగ కషాయం ప్రతిరోజూ సేవించిన మధుమేహం తగ్గును. మూత్రాశయపు రాళ్లు కూడా కరిగిస్తుంది. 


 *  మొలల సమస్య ఉన్నవారు తిప్పతీగ స్వరసాన్ని మజ్జిగతో కలిపి వాడవలెను . 


 *  తిప్పతీగ కషాయాన్ని సేవించిన వాంతులు తగ్గును. 


 

        పైన చెప్పిన విధముగా ఎన్నో విలువైన ఔషధయోగాలు తిప్పతీగతో ఉన్నాయి. స్థలాభావం వలన నేను వాటిని సంపూర్ణముగా వివరించలేకున్నాను. నేను రాసిన గ్రంథాలలో చాలావరకు మూలికల గురించి సంపూర్ణ వివరణ ఇవ్వడం జరిగింది...


  

    గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

      9885030034                       


    

    కాళహస్తి వేంకటేశ్వరరావు 


  అనువంశిక ఆయుర్వేద వైద్యులు

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🪷శుక్రవారం 4 జూలై 2025🪷*

``

          *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది.

``

      *వాల్మీకి రామాయణం*                

           *88 వ భాగం*

```

అప్పుడు యుద్ధరంగం లోకి రావణుడి కుమారుడైన నరాంతకుడు వచ్చి చాలా భయంకరమైన యుద్ధం చేశాడు. 


అంగదుడు తన పిడికిలిని బిగించి ఆ నరాంతకుడి తల మీద ఒక దెబ్బ కొట్టేసరికి, వాడు తల పగిలి చనిపోయాడు. 


తదనంతరం మహోదరుడిని నీలుడు సంహరించాడు. 


దేవాంతకుడిని, త్రిశిరుడిని(మూడు తలకాయలతో ఉంటాడు) హనుమంతుడు సంహరించాడు. 


ఉన్మత్తుడిని గవాక్షుడు సంహరించాడు. 


ఆ తరువాత అతికాయుడు యుద్ధానికి వచ్చాడు. అప్పుడు రాముడు… “విభీషణా! అంత పెద్ద శరీరంతో ఉన్నాడు, అసలు వాడెవడు?” అని అడిగాడు.


అప్పుడు విభీషణుడు… “ఆయన సామాన్యుడు కాదు. ఆయన వేదం చదువుకున్నాడు, బ్రహ్మగారి దగ్గర వరాలు పొందాడు. ఆయన కవచాన్ని ఎటువంటి బాణం పెట్టి కొట్టినా అది పగలదు. అందుచేత అతనిని నిహతుడిని చెయ్యడం చాలా కష్టం అన్నాడు.


ఆ అతికాయుడు యుద్ధంలో చాలా మందిని నెత్తురు కారేటట్టు కొట్టాడు, ఎందరినో నిగ్రహించాడు. అప్పుడు లక్ష్మణుడు ఆ అతికాయుడితో యుద్ధం చెయ్యబోతుంటే వాడన్నాడు… “లక్ష్మణా! నువ్వు పిల్లవాడివి, నీతో నాకు యుద్ధం ఏమిటి. నేను అతికాయుడిని, చిన్న చిన్న వాళ్ళతో నేను యుద్ధం చెయ్యను, అలా చెయ్యడం నాకు అసహ్యం. నన్ను ఎదిరించి నిలబడగలిగిన నా స్థాయివాడు ఎవడన్నా ఉన్నాడా వానర సైన్యంలో?” అన్నాడు.


అప్పుడు లక్ష్మణుడు… “ఈ డాబులెందుకురా, నాతో యుద్ధం చెయ్యి” అన్నాడు.


అతికాయుడన్నాడు… “పిల్లవాడివి, అగ్నిహోత్రాన్ని ఎందుకు పైకి లేపుతావు, నిద్రపోతున్న సింహాన్ని ఎందుకు లేపుతావు. ఆ తరువాత నీ శరీరం పడిపోయాక బాధ పడతావు. వెళ్ళి రాముడిని పిలువు” అన్నాడు.


అప్పుడు లక్ష్మణుడు… “నీ బతుక్కి రాముడు కావాలేంటి, నీకు నేను సమాధానం చెబుతాను” అని అర్ధచంద్రాకార బాణాలని అతికాయుడి మీదకి ప్రయోగించాడు. 


ఆ బాణాలు తగిలాక వాడన్నాడు… “అబ్బో నీతో యుద్ధం చెయ్యవలసిందే!” అని ఐంద్రాస్త్రం, వాయువ్యాస్త్రం మొదలైన ఎన్నో అస్త్రాలని లక్ష్మణుడి మీద ప్రయోగించాడు. 


ఆ అస్త్రములన్నిటికి లక్ష్మణుడు ప్రతిక్రియ చేశాడు. లక్ష్మణుడు ఎన్ని బాణములను ప్రయోగించినా, ఎన్ని అస్త్రములను ప్రయోగించినా, అన్నీ వాడి యొక్క కవచానికి తగిలి పడిపోతున్నాయి.


ఆ సమయంలో వాయుదేవుడు వచ్చి లక్ష్మణుడితో… “వాడికి బ్రహ్మగారు ఇచ్చిన వరం ఆ కవచం. వాడు ఆ కవచం పెట్టుకుని ఉన్నంతసేపు ఎవరు ఏది పెట్టి కొట్టినా ఆ కవచం పగలదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే వాడి కవచం పగులుతుంది” అన్నాడు.


అప్పుడు లక్ష్మణుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఆ అతికాయుడిని సంహరించాడు.


అతికాయుడు మరణించాడన్న వార్త విని రావణుడు క్రుద్ధుడై, సామాన్యమైన వారిని పంపిస్తే వీలులేదని మళ్ళీ ఇంద్రజిత్ ని పిలిచి… “నువ్వు యుద్ధానికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమయ్యింది!”అన్నాడు.


అప్పుడా ఇంద్రజిత్ 4 గుర్రములు పూన్చిన రథం ఎక్కి అనేకమంది సైన్యంతో యుద్ధ భూమిలోకి ప్రవేశించాడు. ఆయన చుట్టూ సైన్యం మొహరించి ఉంది, కాని ఇంద్రజిత్ మాత్రం కొంతసేపు ఎవరికీ కనపడలేదు.(ఆ సమయంలో చుట్టూ మోహరించిన సైన్యం మధ్యలో ఉన్న ఇంద్రజిత్ సమిధలు, పుష్ప మాలికలు, ఎర్రటి వస్త్రాలతో అగ్నిహోత్రంలో హోమం చేస్తాడు. ఆ హోమం చేశాక ఆ హోమాగ్ని సుడులు తిరుగుతూ పైకిలేస్తుంది, అప్పుడు ఒక నల్ల మేకని పట్టుకొచ్చి తన పళ్ళతో దాని కంఠాన్ని కొరికి, మెడ చీల్చి, ఆ మేక మాంసాన్ని ఆ హోమాగ్నిలో వేస్తాడు {వీటిని ఆభిచారిక హోమాలు అంటారు, ఇవి చాలా ప్రమాదకరమైనవి}. అప్పుడా పుష్పాలని, అక్షతలని తన ఆయుధముల మీద వేసి, ఎర్రటి వస్త్రాలు కట్టుకొని, రథం ఎక్కి మాయమయిపోతాడు, ఇంక ఎవరికీ కనపడడు. ఆ ఇంద్రజిత్ గుర్రాల చప్పుడు కాని, వాడి ధనుస్సు యొక్క శబ్దము కాని, వాడి బాణ ప్రయోగం కాని ఎవరికీ వినపడదు, అర్ధం కాదు. ఆయనకి అందరూ కనపడతారు, కాని ఆయన ఎవరికీ కనపడడు. ఒక్క విభీషణుడు మాత్రమే ఆయనని మాయా బలంతో చూడగలడు)


హోమాన్ని పూర్తి చేసిన ఇంద్రజిత్ రథం ఎక్కేటప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కారం చేసి, బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ఆవాహన చేసుకున్నాడు. ఆయన రథం ఎక్కగానే ఆ రథం ఎవ్వరికీ కనపడలేదు, అప్పుడాయన ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. మేఘాల మధ్యకి వెళ్ళిన ఇంద్రజిత్ దిక్కులని, విదిక్కులని మంచుతో కప్పేసి, ధనుష్టంకారం కూడా వినపడకుండా కొన్ని వేల బాణాలను ప్రయోగం చేసి హనుమంతుడిని, సుగ్రీవుడిని, ద్వివిదుడిని, మైందుడిని, అంగదుడిని, గంధమాదనుడిని, జాంబవంతుడిని, సుషేణుడిని, వేగదర్సిని, నీలుడిని, గావాక్షుడిని, కేసరిని మొదలైన అనేకమంది వానర వీరులని తన బాణములతో కొట్టి భూమి మీద పడేశాడు. అన్ని కోట్ల వానర సైన్యాన్ని బ్రహ్మాస్త్రం చేత కట్టి పడేశాడు.


అప్పుడు వాడు పైనుంచి ఒక పెద్ద నవ్వు నవ్వి రామలక్ష్మణులతో అన్నాడు… “ఒకసారి నాగ పాశాలతో మిమ్మల్ని కట్టాను, కాని మీరు విడిపించుకున్నారు. ఇవ్వాళ బ్రహ్మాస్త్రంతో మిమ్మల్ని కట్టేస్తాను, ఇవ్వాల్టితో యుద్ధం అయిపోతుంది” అన్నాడు.


అప్పుడు రాముడు లక్ష్మణుడితో… “లక్ష్మణా! ఇవ్వాళ మనకి వేరొక దారిలేదు. వాడు బ్రహ్మగారికి చెందిన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి కొడుతున్నాడు, ఆ బ్రహ్మాస్త్ర బంధనం చేత మొత్తం వానర సైన్యం పడిపోయింది. ఎదురుగా ఉన్న వీరుడైతే మనం కొట్టచ్చు, కాని వాడు మాయా యుద్ధం చేస్తున్నాడు, కనుక మనం వాడిని కొట్టలేము. అందుచేత వాడు కొడుతున్న బాణ పరంపరకి ఓర్చుకున్నంతసేపు ఓర్చుకో, తరువాత స్పృహతప్పినవాడు పడిపోయినట్టు రణభూమిలో పడిపో. అప్పుడు వాడు ఎన్ని బాణములు కొట్టాలో అన్ని బాణములతో మన శరీరాలని కొడతాడు. అలా కొట్టేశాక శత్రువు మరణించాడనుకొని, జయలక్ష్మిని పొందాననుకొని వాడు అంతఃపురంలోకి వెళ్ళిపోతాడు. 

ఆ తరువాత బతికుంటే చూద్దాము. ముందు వాడిని కొట్టెయ్యని” అన్నాడు.


అప్పుడు ఇంద్రజిత్ రామలక్ష్మణులిద్దరినీ బాణాలతో కొట్టేశాడు. ఇద్దరి శరీరాల నిండా బాణాలతో కొట్టాడు, నెత్తురు వరదలై కారిపోయింది. వాడి బాణ పరంపరని తట్టుకోలేక రామలక్ష్మణులిద్దరూ భూమి మీద పడిపోయారు. 


అప్పుడు వాడు వికటాట్టహాసం చేసి చూసేసరికి ఆ యుద్ధ భూమిలో నిలబడి ఉన్నవాడు ఎవడూ లేడు, అందరినీ ఒక్కడే కొట్టేశాడు, మొత్తం 67 కోట్ల వానర సైన్యాన్ని ఇంద్రజిత్ ఒక్కడే కొట్టాడు. 


తరువాత వాడు అంతఃపురానికి వెళ్ళి రావణుడితో… “రామలక్ష్మణులిద్దరినీ బ్రహ్మాస్త్ర బంధనం చేశాను, వాళ్ళు పడిపోయి ఉన్నారు” అని చెప్పాడు.


ఇంద్రజిత్ బాణములు ప్రయోగించకముందే విభీషణుడు యుద్ధ భూమినుంచి పారిపోయాడు. హనుమంతుడికి ఉన్న వరం వలన ఆయనని ఏ అస్త్రము బంధించలేదు. 

ఆ విభీషణుడు, హనుమంతుడు కలుసుకొని… “అసలు మన సైన్యంలో ఉన్న పెద్ద పెద్ద వీరులు ప్రాణాలతో ఉన్నారా, ప్రాణాలు విదిచిపెట్టేశారా?” అని ఒక కాగడా పట్టుకొని ఆ యుద్ధ భూమిలో వెతికారు.(ఇంద్రజిత్ అందరినీ కనురెప్పలు కూడా తెరవడానికి వీలులేకుండా బాణాలతో కొట్టాడు) అలా వెతుకుతుండగా వాళ్ళకి జాంబవంతుడు కనిపించాడు, అప్పుడు విభీషణుడు… “జాంబవంతా! నీకు స్పృహ ఉందా, మేము మాట్లాడుతుంది నీకు అర్ధం అవుతుందా?” అని అడిగాడు.


అప్పుడు జాంబవంతుడు మెల్లగా కనురెప్పలు పైకి ఎత్తి అన్నాడు… 

“నాయనా, నీ కంఠం చేత గుర్తుపట్టానయ్య, నువ్వు విభీషణుడివి కదా. హనుమంతుడు ప్రాణాలతో ఉన్నాడా?” అని అడిగాడు.


విభీషణుడు అన్నాడు… “నువ్వు పెద్దవాడివి, వానర యోధులకందరికి కూడా నువ్వు తాతవంటి వాడివి. అటువంటి నువ్వు రామలక్ష్మణులు బతికి ఉన్నారా? అని అడగకుండా హనుమంతుడు జీవించి ఉన్నాడా అని ఎందుకు అడిగారు” అన్నాడు.


అప్పుడు జాంబవంతుడు అన్నాడు… “మొత్తం వానర సైన్యం అంతా మరణించని, హనుమంతుడు ఒక్కడు బతికుంటే మళ్ళి వీళ్ళందరూ బతుకుతారు. మొత్తం వానర సైన్యం బతికి ఉండని, హనుమంతుడు ఒక్కడు చనిపోతే అందరూ చనిపోయినట్టే. హనుమ శక్తి ఏమిటో నాకు తెలుసు, హనుమ ఉన్నాడా?” అని అడిగాడు.


వెంటనే హనుమంతుడు జాంబవంతుడి పాదాలు పట్టుకొని… “తాతా! హనుమ నీకు నమస్కరించుచున్నాడు” అన్నాడు.


అప్పుడు జాంబవంతుడు… 

“అందరినీ రక్షించగలిగినవాడివి నువ్వే. ఆలస్యం చెయ్యకుండా ఉత్తర క్షణం బయలుదేరి హిమాలయ పర్వతాలకి వెళ్ళు. అక్కడ కైలాస పర్వతం పక్కన ఓషది పర్వతం ఒకటి ఉంది. దానిమీద ఉండే మృతసంజీవని(దీని వాసన చూస్తే చనిపోయిన వాళ్ళు బతుకుతారు), విశల్యకరణి (దీని వాసన చూస్తే, శరీరంలో బాణపు ములుకులు గుచ్చుకుని ఉంటె అవి కింద పడిపోతాయి), సంధానకరణి (దీని వాసన చూస్తే విరిగిపోయిన ఎముకలు అతుక్కుంటాయి), సౌవర్ణకరణి (దీని వాసన చూస్తే, ముర్చపోయిన వాళ్ళకి తెలివి వస్తుంది) అనే నాలుగు ఓషదులని తీసుకురా” అన్నాడు.


జాంబవంతుడు ఈ మాట చెప్పగానే హనుమంతుడు ఒక పర్వతాన్ని ఎక్కి, మెరుపు వెళ్లినట్టు ఆ పర్వతాన్ని తొక్కేసి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. హనుమంతుడు తీవ్రమైన వేగంతో హిమాలయ పర్వతాలని చేరుకొని, ఓషది పర్వతం ఎక్కడుందని చూస్తుండగా ఆ హిమాలయాల మీద ఆయనకి బ్రహ్మగారి ఇల్లు కనపడింది, అక్కడే పరమ శివుడు తన ధనుస్సుని పెట్టే ఒక పెద్ద అరుగు కనపడింది. అక్కడే హయగ్రీవుడిని ఆరాధన చేసే ప్రదేశం కనపడింది, సూర్య భగవానుడి కింకరులు ఉండే ప్రదేశం కనపడింది, అక్కడే ఇంద్రుడు ఉండే గృహం, కుబేరుడు ఉండే గృహం కనపడింది, అక్కడే సూర్య భగవానుడిని విశ్వకర్మ చెక్కిన వేదిక కనపడింది.

తరువాత ఆయన ఆ ఓషది పర్వతం కోసం వెతికాడు. ఆ ఓషది పర్వతంలోని ఓషదులు తమని ఎవరో తీసుకుపోడానికి వస్తున్నారని, అవి తమ ప్రకాశాన్ని తగ్గించేసి లోపలికి అణిగిపోయాయి.


ఆ ఓషదులను చూసిన హనుమంతుడు… “ఆ ఓషదులని నాకు కనపడకుండా దాస్తారా, రామ కార్యానికి సాయం చెయ్యరా?” అని ఆ పర్వత శిఖరాన్ని పీకి, చేతితో పట్టుకొని వాయు వేగంతో ఆ శిఖరాన్ని తీసుకొచ్చి యుద్ధ భూమిలో పెట్టాడు.


అలా పెట్టేసరికి వాటి వాసనలు పీల్చిన ఇన్ని కోట్ల వానరాలు పైకి లేచిపోయాయి, రామలక్ష్మణులు పైకి లేచారు.

అప్పుడు హనుమంతుడు ఆ పర్వతాన్ని తీసుకెళ్ళి ఆ హిమాలయ పర్వతాల దగ్గర పెట్టి వచ్చేశాడు.


అప్పుడు సుగ్రీవుడు అన్నాడు…

“మనల్ని బ్రహ్మాస్త్ర బంధనం చేసి వెళ్ళిన ఇంద్రజిత్ కి బుద్ధి రావాలి. అందుకని మీరందరూ ఒకసారి ఎగిరి లంకలోకి దూరిపోండి, కాగడాలు పట్టుకొని లంకనంతా కాల్చెయ్యండి” అన్నాడు.```


        *రేపు…89వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

శుక్రవారం🌹*_ *🪷04 జూలై 2025🪷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     _*🌹శుక్రవారం🌹*_ 

  *🪷04 జూలై 2025🪷*         

    *దృగ్గణిత పంచాంగం*                 


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*ఆషాఢమాసం - శుక్లపక్షం*


*తిథి  : నవమి* సా 04.31 వరకు ఉపరి *దశమి*

*వారం    : శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం   : చిత్త* సా 04.50 వరకు ఉపరి *స్వాతి*

*యోగం : శివ* సా 07.36 వరకు ఉపరి *సిద్ధ*

*కరణం   : కౌలువ* సా 04.31 *తైతుల పూర్తిగా రాత్రంతా*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.30 - 10.30 సా 05.30 - 06.30*

అమృత కాలం  : *ఉ 09.37 - 11.26*

అభిజిత్ కాలం  : *ప 11.46 - 12.38*

*వర్జ్యం          : రా 11.08 - 12.56*

*దుర్ముహూర్తం  : ఉ 08.16 - 09.09 మ 12.38 - 01.30*

*రాహు కాలం   : ఉ 10.34 - 12.12*

గుళికకాళం       : *ఉ 07.17 - 08.56*

యమగండం     : *మ 03.28 - 05.06*

సూర్యరాశి : *మిధునం* చంద్రరాశి : *తుల*

సూర్యోదయం :*ఉ 05.46*

సూర్యాస్తమయం :*సా 06.55*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.39 - 08.16*

సంగవ కాలం         :      *08.16 - 10.53*

మధ్యాహ్న కాలం    :     *10.53 - 01.30*

అపరాహ్న కాలం    : *మ 01.30 - 04.07*

*ఆబ్ధికం తిధి         : జ్యేష్ఠ శుద్ధ నవమి*

సాయంకాలం        :*సా 04.07 - 06.44*

ప్రదోష కాలం         :  *సా 06.44 - 08.55*

రాత్రి కాలం           :*రా 08.55 - 11.50*

నిశీధి కాలం          :*రా 11.50 - 12.34*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.12 - 04.56*

-----------------------------------------------

         *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🪷శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం🪷*


*సర్వలౌకికకర్మభ్యో*  

*విముక్తానాం హితాయ వై*

*భుక్తిముక్తిప్రదం*  

*జప్యమనుబ్రూహి దయానిధే*


*🪷ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః🪷*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

పోతన రూపచిత్రణ!

 పోతన రూపచిత్రణ! 


మ: త్రిజగ న్మోహన నీలకాంతి తనువుద్దీపింపఁ బ్రాభాత నీ


        రజ బంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల , నీలాలక


        వ్రజ సంయుక్త ముఖారవింద మతి సేవ్యంబై విజృభింప మా


        విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్!


                   ఆం: భాగవతం- ప్రధమస్కంథం- 247: వ: పద్యము;


                     

                   ముల్లోకాలను మైమరపించే నీలమేఘ ఛ్ఛాయగల తనువుతో, ఉదయారుణ కిరణ కాంతిని 


   ప్రతిఫలించు నుత్తరీయంబుతో ,గాలికి నూయలలూగు నల్లని ముంగురులతో నొప్పు ముఖారవిందముతో చూడముచ్చటఁ గొల్పుచు మా అర్జును దరికి నరుదెంచుచుండు అందగాడు శ్రకృష్ణుఁ డెల్లవేళల నామదిలో నిలచుగాక! అనిభీష్మ స్తుతి;


                 నల్లనివాడే గాని యామేనిలో నొక మెఱపున్నది. ఆకర్షణ యున్నది. అదియెంతటిదనగా ముల్లోకములను మోహింప జేయు నంతటిదట! ఆమూర్తి కన్నుల బడెనా అంతే ఆయాకర్షణ ప్రవాహమున గొట్టికొని పోవలసినదే!


                         ఇఁక నాతఁడు ధరించిన పీతాంబరమా ఉదయారుణ కాంతి రంజితమై చూపరులకు యింపు నింపు చున్నది. 

కృష్ణుడు కదలివచ్చుచుండ బాలసూర్యోపమ మైన కాంతిపుంజ వలయమేర్పడుటకా వస్త్రము ఆధారమగుచున్నది. ఎంత యద్భుతము! 


                  మోమా అరవిందమును బోలియున్నది. అది నల్లని ముంగులతో శోభాయమానమై యున్నది.కవి బయటకు చెప్పకున్నను తుమ్మెదలు ముసిరిన పద్మమును బోలియున్నది. 


                              ఇంత యందమును మూటగట్టి వచ్చువాడు వన్నెలాడు (సోకులరాయడు) గాకుండునా? 


              ఇదీ పోతన గారి యద్భుత రూప చిత్రణా సామర్ధ్యము!


                                                             స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కాకి చెప్పే సత్యం...!

 🎻🌹🙏 కాకి చెప్పే సత్యం...!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


‘🌿’కావు కావు కావు కావు! అని అరుస్తుందంటే ఏవీ నీకు శాశ్వతం కావు! అన్నమాట ’’...


🌸కాకి ప్రతీ ఊరిలో, ప్రతీ ఇంటిపై వాలి ఏదో ఒక సమయంలో అరిచే ఉంటుంది... 


🌿ఏమని? ...

....కావు కావు కావు అని...!!! 

అనగా ఏవి శాశ్వతం కావు అని! ... 

నువ్వు నిరంతరం ఎంతో శ్రమించి సంపాదించిన సంపదలు శాశ్వతం కావు...


🌸బంధాలు శాశ్వతం కావు... 

ఏ కోరికలూ శాశ్వతం కావు...

నువ్వు చూసేవి చేసేవి ఏవీ శాశ్వతం కావు... 


🌿ఎదీ శాశ్వతం కానపుడు మరి ఎందుకు ఇంత తపన? 


🌸నీది కాని దాని కోసం నువ్వు ఎంత తపించినా ప్రయోజనము లేదు...


🌿నీకు చెందవల్సింది నీవు వద్దు అన్నా నీకు చెంది తీరుతుంది,

లేనిదాని కోసం ఉన్నదానిని వదులుకోకు!...


🌸ప్రపంచం అసత్యం, అశాశ్వతం. ఒక్క పరమాత్మ మాత్రమే సత్యము, శాశ్వతమని తెలుసుకుని మసలుకోవాలి...!!! 


🌿అన్ని శాస్త్రాలు చదివి, ఇన్ని తెలిసికూడా మనం మాయలో ఎందుకు పడుతున్నాము మరి!!!... 


🌸అంటే భగవంతుని పై విశ్వాసం లేక, భగ్వన్నామమును, మనఃస్ఫూర్తిగా పలుకక పోవడం వల్ల అలా జరుగుతుంది,


🌿అది ఎలా???

అంటే మన జీవితం అంతా పార్ట్ టైమ్ భక్తి, ప్రొద్దున్నో సాయంత్రమో దేవుని గుడి ముందు కూర్చున్నప్పుడు మాత్రమే భగవంతుడు,


🌸 ఆయన నామం గుర్తువస్తుంది, మిగితా సమయంలో నాది, నాది అనే భావం లో బ్రతుకుతాము, 


🌿పండగ అయితే ప్రొద్దున్నే స్నానాలు ఆచరించి , పూజలు సలుపుతాము, అదే మిగిలిన రోజుల్లో దేవుడంటే ఎవరో తెలియని వారిలా ఉంటాము, 


🌸ఆయన మాత్రం సమయానికి ఆదుకోవాలి, అనుగ్రహించాలి , ఇదీ ఈరోజు మన భక్తి...


🌿ఆయనను, ఆయన నామాన్ని గట్టిగా పట్టుకోవాలి, ఆయన తప్ప ఇతరము లేదని ప్రార్థించాలి, 


🌸అప్పుడే మన జీవనానికి ఎట్టి ఇబ్బందీ ఉండదు, ఈ జీవితానికి  పరిపూర్ణమైన శాంతి లభిస్తుంది...🚩🌞🙏🌹🎻


   🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు - ఆషాడ మాసం - శుక్ల పక్షం -‌ నవమి -చిత్ర -‌‌ భృగు వాసరే* (04.07.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

స్వామి వివేకానంద

 *నేడు 4/7/2025: స్వామి వివేకానంద 123 వ వర్ధంతి:*


*భారతదేశాన్ని ప్రేమించడమెలాగో, ఉద్ధరించడమెలాగో నేర్పిన మహనీయుడు స్వామి వివేకానంద.!*


*‘‘ఓ తేజస్వరూపా! జననమరణాలకు అతీతుడా! మేలుకో బలహీనతల్ని తొలగించుకో! పౌరుషాన్ని ప్రసాదించుకో! మనిషిగా మసలుకో లే.!లెమ్ము’’ అంటూ యువతను జాగృతం చేసిన వేదాంతభేరి స్వామి వివేకానంద... స్వామి వివేకానంద ఇలా యువతను జాగృతం చేసారు.*


*ప్రేమ... డబ్బు... ఙ్ఞానం... చదువు... దేనికోసమైనా తపనపడుతూ పిచ్చివాడై పోయేవాడికి అది తప్పకుండా దొరుకుతుంది. అందుకోసం మనం కనబరచల్సిందల్లా ఉడుంపట్టులాంటి పట్టుదల, సంకల్పబలం, శ్రమించే తత్వం.*


*గొప్ప అవకాశాలే వస్తే ఏమి చేతకాని వారు కూడా ఏదో గొప్ప సాదించవచ్చు. ఏ అవకాశాలూ లేనప్పుడు కూడా ఏదైనా సాదించినవాడే గొప్పవాడు.*


*ఆత్మవిశ్వాసం లేకపోవడం అనేది క్షమించరాని నేరం. మన చరిత్రలో ఏదైనా సాదించిన గొప్ప వ్యక్తుల జీవతాలను  నిశితంగా పరిశీలించండి. వారిని నడిపించింది ఆత్మవిశ్వాసమేనని తెలుస్తుంది. భగవంతుడి పట్ల నమ్మకం లేనివాడు నాస్తికుడు అనేది ఒకప్పటి మాట. ఆత్మవిశ్వాసం లేనివాడు నాస్తికుడు అనేది నేటి మాట.*🌺✍️

🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏

తొందర పడి యెవ్వరినీ

 *2167*

*కం*

తొందర పడి యెవ్వరినీ

నిందించుటపాడిగాదు నిక్కంబెరుగన్

నిందాసత్యంబైనచొ

వందరమౌ బంధమెటుల బలపడు సుజనా.?

*భావం*:-- ఓ సుజనా! తొందరపడి యెవ్వరినీ నిందలపాలు చేయడం న్యాయం కాదు. నిజం తెలిసిన తరువాత ఆ నింద అబద్ధం అని తేలితే ముక్కలైన/చెడిపోయిన ఆ బంధం మళ్ళీ ఎలా బలపడగలుగుతుంది!?. (వందర= ముక్కలగుట).

*సందేశం*:-- తొందరపడి చేసే నిందలవలన ఆత్మీయులు దూరమై బతుకు భారం కాగలదు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

ధనహీనమున మరొకగతి

 *2166*

*కం*

ధనములు గలనాడొకవిధి

ధనహీనమున మరొకగతి తలచెడి జనులన్

[ధనముండగ గౌరవమిడి

ధనహీనంబున విలువలు తక్కువ నిడగన్]

అనురాగహీనులనెరిగి

యనుబంధము క్రుంచుకొనగ నలరుదు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! మనవద్ద ధనములు ఉన్న నాడు ఒకలాగ,లేనినాడు మరొకలాగ[ మనవద్ద డబ్బున్నప్పుడు గౌరవమిచ్చి డబ్బు లేని నాడు హీనంగా చూసేవారు అనురాగ హీనులు] తలచేవారిని అనురాగం లేని వారు గా గుర్తించి వారి తో అనుబంధం తగ్గించుకోవడం వలన వెలుగొందెదవు.

*సందేశం*:-- మనవద్దనున్న ధనములనుబట్టి మనకిచ్చే విలువలు మార్చేవారికి తగు దూరంలో ఉండటం మంచిది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

రామాయణం


``

            *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది.

``

      *వాల్మీకి రామాయణం*                

              *85వ భాగం*

```

అప్పుడు సుషేణుడు… 

“పూర్వకాలంలో దేవతలకి రాక్షసులకి గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాక్షసులు దేవతలని విశేషమైన అస్త్రాలతో బాధించారు. ఎందరో దేవతలు ప్రాణాలు విడిచిపెడుతుంటే, శరీరాలు దెబ్బతింటుంటే దేవగురువైన బృహస్పతి విశల్యకరణి, సంజీవకరణి, సంధానకరణి అనే ఓషధులు కలిగిన మొక్కలని రసం పిండి వాసన చూపిస్తే ఆ దేవతలందరూ మళ్ళీ జీవించారు. ప్రస్తుతం అవి పాల సముద్రంలో ఉండే రెండు పర్వత శిఖరాల మీద ఉన్నాయి. మన దగ్గర ఉన్న వానర సైన్యంలో హనుమ, సంపాతి, ఋషభుడు, నీలుడు మొదలగు వారు మాత్రమే వెళ్ళి ఆ ఓషధులని గుర్తుపట్టగలరు. వాటిని తీసుకొచ్చి రాముడికి, లక్ష్మణుడికి వాసన చూపిస్తే వారు జీవించే అవకాం ఉంటుంది" అన్నాడు.


సుషేణుడు చెప్పిన ప్రకారం వెళదామని వారు అనుకుంటుండగా అక్కడ ఒక గొప్ప నాదం వినపడింది. ఎక్కడిదీ ధ్వని అని అందరూ ఆ సముద్రం వైపున చూడగా, బ్రహ్మాండమైన కాంతితో, రెక్కలు అల్లారుస్తూ ఒక మహా స్వరూపం వస్తోంది. అది వస్తున్నప్పుడు దాని కాంతి చేత, వేగం చేత సముద్రపు ఒడ్డున ఉన్న కొన్ని వేల వృక్షములు నేలన పడిపోయాయి. కాంతివంతమైన స్వరూపంతో గరుత్మంతుడు వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఆయనని చూడగానే అందరూ ఆశ్చర్యపోయి నమస్కారం చేశారు. అప్పటివరకూ రామలక్ష్మణులని గట్టిగా పట్టుకుని ఉన్న నాగములు గరుత్మంతుడు వచ్చి అక్కడ వాలగానే వాళ్ళని విడిచిపెట్టేసి పారిపోయాయి. 


నాగములు విడిచిపెట్టగానే రామలక్ష్మణులు స్వస్థత పొంది పైకి లేచారు. అప్పుడు గరుత్మంతుడు వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకొని గట్టిగా ఆలింగనం చేసుకొని వాళ్ళిద్దరి ముఖాలని తన చేతులతో తడిమాడు. 


గరుత్మంతుడు అలా కౌగాలించుకోగానే, ఇంతకముందు రాముడికి ఎంత బలం ఉండేదో, ఎటువంటి పరాక్రమము ఉండేదో, ఎటువంటి బుద్ధి ఉండేదో, ఎటువంటి తేజస్సు ఉండేదో వాటికి రెండింతలు పొందాడు. వాళ్ళ ఒంటి మీద ఉన్న గాయములన్నీ మానిపోయాయి.


అప్పుడు గరుత్మంతుడు…  

“నాయనా రామా! ఇకమీద నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. కద్రువ యొక్క సంతానమైన భయంకరమైన కోరలున్న పాములని తన మాయ చేత ఇంద్రజిత్ బాణములుగా మార్చుకున్నాడు. ఈ నాగపాశం నుండి దేవేంద్రుడు కూడా విడిపించుకోలేడు. యక్ష, గంధర్వ, కిన్నెరులు అందరూ కలిసి ఇక్కడికి వచ్చినా ఈ నాగపాశములను విడదీయలేరు. ఇది కేవలం నన్ను చూసి మాత్రమే విడివడుతుంది” అన్నాడు.


అప్పుడు రాముడు… “మీరు ఎవరు?” అని అడిగాడు.


గరుత్మంతుడు అన్నాడు… "నేను గరుత్మంతుడిని, నేను ఎందుకు వచ్చాను అని ఇప్పుడు అడక్కు. నీకు నాకు ఒక గొప్ప స్నేహం ఉంది. నీకు నాకు ఉన్న అనుబంధమేమిటో యుద్ధం అయ్యాక చెబుతాను. ఇప్పుడు చెప్పడం కుదరదు, నువ్వు నన్ను అడగనూ కూడదు. కొద్దికాలంలోనే ఈ లంకలో వృద్ధులు, బాలురు తప్ప ఓపికున్న రాక్షసుడు ఎవ్వడూ ఉండకుండా నువ్వు కొట్టేసి సీతమ్మని పొందుతావు. మరి నేను బయలుదేరడానికి నాకు అనుమతిని కటాక్షించు రామా" అన్నాడు.


రాముడు… “చాలా సంతోషం, మీరు వెళ్ళండి” అన్నాడు.


గరుత్మంతుడు ఎలా వచ్చాడో అలా తన బంగారు రెక్కలను ఊపుకుంటూ సముద్రం మీద నుంచి వెళ్ళిపోయాడు.


రెట్టింపు ఉత్సాహంతో, బలంతో ఉన్న రామలక్ష్మణులని చూడగానే అక్కడున్న వానరులందరూ ఆనందంతో భేరీలు మ్రోగించారు, కుప్పిగంతులు వేశారు, పాటలు పాడారు, పెద్ద పెద్ద కేకలు వేశారు. లోపల సంతోషంగా కూర్చుని ఉన్న రావణుడికి ఈ కేకలు వినపడి…  

“ఏమి జరిగిందో చూడండి!” అన్నాడు. 


అప్పుడు అక్కడున్న రాక్షసులు ప్రాసాదం మీదకి ఎక్కి చూసేసరికి, రెండు ఏనుగులు స్నానం చేసి వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో అలా రామ లక్ష్మణులిద్దరు నిలబడి ఉన్నారు. 


వాళ్ళు వెంటనే చూసిన విషయాన్ని రావణుడికి చెప్పారు. 


ఆ మాటలు విన్న రావణుడు మొదట ఆశ్చర్యాన్ని పొంది తరువాత ఆగ్రహంతో ఊగిపోయాడు.


అప్పుడు రావణుడు ధూమ్రాక్షుడు అనే రాక్షసుడిని పిలిచి… “నువ్వు వెంటనే వెళ్ళి రాముడిని, లక్ష్మణుడిని, సుగ్రీవుడిని సంహరించి తిరిగిరా, నీకన్నా బంధువు నాకు లేడు. నువ్వు అపారమైన శౌర్యం ఉన్నవాడివి, నీకు కావలసినంత సైన్యాన్ని తీసుకుని వెళ్ళు” అన్నాడు.


అప్పుడా ధూమ్రాక్షుడు పశ్చిమ ద్వారంగుండా బయటకి వెళ్ళాడు. ఆయన అలా బయటకి వెళ్ళగానే ఆకాశం నుండి ఒక మేఘం వచ్చి రక్తాన్ని వర్షించింది. ఆకాశంలో తిరుగుతున్న ఒక గ్రద్ద వాడి రథం మీద వాలింది. రక్తంతో తడిసిపోయిన ఒక తెల్లటి మొండెం సూర్యమండలంలో నుంచి వాడి రథం ముందు పడింది. ఇన్ని అపశకునములు కనపడినా ఆ ధూమ్రాక్షుడు యుద్ధానికి వెళ్ళాడు.


ఆ ధూమ్రాక్షుడు తన యొక్క బాణములతో వానరులని కొట్టి వాళ్ళ శరీరాలని చీల్చేస్తున్నాడు. 


అప్పుడు హనుమంతుడు ఒక పెద్ద శిలని పెకలించి పరుగు పరుగున వచ్చి దానిని ధూమ్రాక్షుడి మీదకి విసిరాడు. 


హనుమ వేసిన శిలని గమనించిన ధూమ్రాక్షుడు ఆ రథం నుంచి బయటకి దూకేశాడు. ఆ రథం తుత్తునియలు అయిపోయింది. తరువాత ఆ ధూమ్రాక్షుడు కొన్ని బాణములతో హనుమంతుడిని కొట్టాడు. 


వెంటనే హనుమంతుడు ఒక పర్వత శిఖరాన్ని పీకి ఆ ధూమ్రాక్షుడి మీద వేశాడు. 


నుజ్జునుజ్జయిపోయి ఆ ధూమ్రాక్షుడు మరణించాడు.


తరువాత రావణుడు వజ్రదంష్ట్రుడు అనే రాక్షసుడిని యుద్ధానికి పంపాడు. అప్పుడాయన సైన్యంతో కలిసి దక్షిణ ద్వారంగుండా బయటకి వచ్చాడు. ఆ వజ్ర దంష్ట్రుడు బయటకి రాగానే అరణ్యంలో ఉన్న నక్కలు అరిచాయి, అన్ని మృగాలు ఏడిచాయి. ఆ వజ్ర దంష్ట్రుడు ఒకేసారి 7-8 బాణములని ప్రయోగించేవాడు. అన్ని వైపులకి బాణములని ప్రయోగం చేసి వానరములని కొట్టాడు. ఇక వీడిని ఉపేక్షించకూడదని అంగదుడు భావించి, ఒక పెద్ద వృక్షాన్ని పట్టుకొచ్చి వజ్ర దంష్ట్రుడిని కొట్టబోయాడు. కాని ఆ వృక్షాన్ని తన బాణముల చేత వజ్ర దంష్ట్రుడు నరికేశాడు. తరువాత అంగదుడు ఒక పెద్ద పర్వతాన్ని పట్టుకొచ్చి దానిని విసిరేశాడు. ఆ దెబ్బకి వజ్రదంష్ట్రుడి రథం ముక్కలయిపోయింది. మళ్ళి అంగదుడు ఒక పర్వత శిఖరాన్ని పట్టుకొచ్చి విసిరేసరికి దాని కిందపడి వజ్ర దంష్ట్రుడు మరణించాడు.


ఈసారి రావణుడు అకంపనుడు అనే రాక్షసుడిని పంపాడు. ఆ అకంపనుడు యుద్ధానికి వస్తుండగా ఆయన ఎడమ కన్ను అదిరింది, అకారణంగా వాడి కంఠం బొంగురుపోయింది, పక్షులు, మృగాలు ఆయన చుట్టూ తిరుగుతూ దీనంగా ఏడుస్తున్నాయి, ఎత్తుపల్లాలు లేని మార్గంలో వెళుతున్న గుర్రాలు తొట్రుపడి మోకాళ్ళ మీద కిందపడి పైకి లేచాయి. ఈ అకంపనుడు కూడా పశ్చిమ ద్వారంగుండానే బయటకి వెళ్ళాడు. ఆయన కొంతసేపు భయంకరమైన యుద్ధం చేసి వానరాలని కొట్టాడు. తరువాత హనుమంతుడు ఆయన మీదకి ఒక పర్వతాన్ని విసరగా దానిని ముక్కలు చేశాడు. తరువాత హనుమంతుడు వేసిన ఒక పెద్ద చెట్టుని 14 బాణములతో కొట్టి బద్దలుచేశాడు. ఆ తరువాత హనుమంతుడు ఇంకొక పెద్ద చెట్టుని పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తూ దారిలో ఉన్న రాక్షసులని కొట్టుకుంటూ, ఏనుగుల్ని ఎడమ చేతితో విసిరేస్తూ మహా రౌద్రరూపంతో ఆ చెట్టును పట్టుకెళ్ళి అకంపనుడిని కొట్టాడు. ఆ దెబ్బకి వాడు పచ్చడై చనిపోయాడు.


అప్పుడు రావణుడు తన సర్వసైన్యాధికారి అయిన ప్రహస్తుడిని పిలిచి… “ప్రహస్తా! యుద్ధం చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు నేను వెళ్ళాలి, కుంభకర్ణుడు వెళ్ళాలి, నికుంబుడు వెళ్ళాలి లేకపోతే తత్తుల్యమైన పరాక్రమము ఉన్న నువ్వు వెళ్ళాలి. వెళ్ళిన వాడు తిరిగి రావడం లేదు, ఇప్పుడు కాని నువ్వు వెళితే యుద్ధం చేద్దాము. మనం యుద్ధం చెయ్యలేము అని నువ్వు అంటే యుద్ధం ఆపేద్దాము” అన్నాడు. 


అప్పుడు ప్రహస్తుడు… “మీరు ఈ మాట ఇంతకముందు ఒకసారి సభలో అడిగారు. అప్పుడు కొంతమంది… 'సీతమ్మని ఇచ్చెయ్యండి' అన్నారు. మీరు అప్పుడే ఇవ్వలేదు, ఇప్పుడు యుద్ధం ఆపడమేమిటండి. యజ్ఞంలో వేసిన దర్భలా వెళ్ళి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నన్ను వెళ్ళమనా మీ ఉద్దేశం” అన్నాడు.


అప్పుడు రావణుడు "ప్రహస్తా! నీ కంఠం గట్టిది, నువ్వు యుద్ధానికి వెళ్ళి గట్టిగా అరువు. వానరులకి యుద్ధం చెయ్యడం రాదు, వాళ్ళు చపలబుద్ధులు. నువ్వు గట్టిగా అరిస్తే అన్ని వానరాలు పారిపోతాయి. అప్పుడు యుద్ధ భూమిలో ఒక్క రామలక్ష్మణులు తప్ప ఎవరూ ఉండరు, అప్పుడు నువ్వు వాళ్ళని సునాయాసంగా కొట్టేయ్యచ్చు” అన్నాడు.


అప్పుడా ప్రహస్తుడు రావణుడికి ప్రదక్షిణ చేసి, రథానికి ప్రదక్షిణ చేసి కొన్ని లక్షల సైన్యంతో యుద్ధానికి వెళ్ళాడు. ఈయనకి కూడా అనేకమైన అపశకునాలు కనపడ్డాయి. ఈయన కూడా మిగతా వాళ్ళలాగానే వాటిని లెక్కచెయ్యకుండా తూర్పు ద్వారంగుండా ముందుకెళ్ళాడు.


అప్పుడు ప్రహస్తుడికి నీలుడికి యుద్ధం జరిగింది. ప్రహస్తుడు చాలా గొప్ప యుద్ధం చేసి ఎందరో వానరాలని చంపాడు. ప్రహస్తుడు నీలుడి మీద బాణాలని ప్రయోగిస్తే, ఆబోతు మీద వర్షం పడితే అది ఎంత సంతోషంగా ఉంటుందో, నీలుడు కూడా ఆ బాణాలు పడుతుంటే అంత సంతోషంగా ఉన్నాడు. నీలుడు ఒక చెట్టుని పెకలించి ప్రహస్తుడి రథాన్ని కొట్టాడు, అప్పుడా రథం పడిపోయింది. తరువాత ఆయన ఒక పెద్ద సాల వృక్షంతో ప్రహస్తుడి గుర్రాలని కొట్టాడు. ఆ తరువాత ఒక శిలని తీసుకొచ్చి ప్రహస్తుడి మీద పడేశాడు. దాంతో ఆ ప్రహస్తుడు కూడా మరణించాడు.


ప్రహస్తుడు మరణించాడన్న వార్త విన్న రావణుడు ఉద్విగ్నతని పొంది, తన సైన్యం అంతటినీ పిలిచి…

“ఇప్పుడు నేనే యుద్ధానికి వెళుతున్నాను. నేను బయటకి వెళ్ళాక వానరాలు లోపలికి రావచ్చు, అందుకని మీరందరూ జాగ్రత్త వహించి కోట శిఖరముల మీద నిలబడండి” అని చెప్పి రథం ఎక్కి, సైన్యాన్ని తీసుకొని యుద్దానికి వెళ్ళాడు.


రాముడంతటివాడు కూడా యుద్ధ భూమిలోకి వస్తున్న రావణుడిని చూసి 'మిట్ట మధ్యానం వేళ సూర్యుడిని చూస్తే స్పష్టంగా కనపడకుండా ఆయన తేజస్సు చేత కళ్ళు అదిరినట్టు, ఈయనని చూస్తే కూడా కళ్ళు అదురుతున్నాయి. ఎవరీ వస్తున్నవాడు' అని ఆశ్చర్యపోయి, వస్తున్నవాడు ఎవరని విభీషణుడిని అడిగాడు.


విభీషణుడు అన్నాడు “రామ! ఆ ఏనుగు మీద వస్తున్నవాడు అకంపనుడు(ఇందాక చనిపోయినవాడు కూడా అకంపనుడే, కాని వీడు ఇంకొక అకంపనుడు), వాడిది సామాన్యమైన యుద్ధం కాదు, వాడిని కనీసం పర్వత శిఖరాలతో కొట్టాలి, లేకపోతె వాడికి ఇష్టం ఉండదు. ఆయన పక్కన రథంలో వస్తున్నవాడు ఇంద్రజిత్. వాడి రథం యజ్ఞాగ్నిలో నుంచి బయటకి వస్తుంది, సింహములు పూన్చిన రథం మీద వస్తాడు. ఈ పక్కన, మహేంద్ర పర్వతం, వింధ్య పర్వతం ఎంత శరీరాలతో ఉంటాయో, ఎంత ధైర్యంతో ఉంటాయో, అంతటి ధైర్యము, శరీరము ఉన్న అతికాయుడు వస్తున్నాడు. పర్వత శిఖరం కదిలొస్తోందా అన్నట్టుగా ఉన్న ఆ ఏనుగు మీద వస్తున్నవాడు మహోదరుడు. అక్కడ ఒక గుర్రము ఎక్కి పాశము పట్టుకొని వస్తున్నవాడు పిశాచుడు, వాడు అరవీరభయంకరుడు. అటుపక్క వృషభం ఎక్కి చేతిలో శూలం పట్టుకొని వస్తున్నవాడు త్రిశిరస్కుడు, వాడు మహా ఘోరమైన యుద్ధం చేస్తాడు. అటుపక్క తన ధ్వజానికి సర్పాన్ని గుర్తుగా పెట్టుకొని, ధనుస్సు పట్టుకొని వస్తున్నవాడు కుంభుడు. అలాగే పర్వతాలని గులకరాళ్ళగా విసరగల బాహుపరాక్రమము కలిగినవాడు ఆ పక్కన వస్తున్నాడు, వాడి పేరు నరాంతకుడు. భోజనం చెయ్యడం అందరికీ ఎంత సంతోషమో, యుద్ధం చెయ్యడం అంత సంతోషంగా ఉండేవాడు నికుంభుడు. అదుగో అక్కడ పది తలకాయలతో, ఇరవై చేతులతో, కిరీటాలు వేసుకొని, కుండలాలు తొడుక్కొని, బ్రహ్మాండమైన పర్వతంవంటి భీమకాయం కలిగినవాడు, మహేంద్రుడు, యముడు, దేవతలు మొదలైనవారిని యుద్ధరంగంలో పరుగులు తీయించినవాడు, అందరినీ శాసించగలిగినవాడు, ఎవడి పేరు చెబితే లోకాలు ఏడుస్తాయో అటువంటి రావణుడు ఆ ఏనుగు మీద వస్తున్నాడు.


అప్పుడు రాముడు రావణుడిని చూసి "ఏమి తేజస్సు, ఏమి కాంతి, ఏమి స్వరూపం, ఏమి పరాక్రమం, మిట్ట మధ్యానం సూర్యుడిలా ప్రకాశిస్తున్నాడు. ఇప్పటివరకూ నేను దేవతలలో కాని, యక్షులలో కాని, గంధర్వులలో కాని ఇంత తేజస్సు కలిగినవాడిని చూడలేదు. కాని ఇన్నాళ్ళకి రావణుడిని చూసే అదృష్టం కలిగింది, ఇక వీడు తిరిగి ఇంటికి వెళ్ళడు. ఎవరితో యుద్ధం చెయ్యాలని చూస్తున్నానో అటువంటివాడు ఇవ్వాళ యుద్ధ భూమిలోకి వచ్చాడు” అని సంతోషంగా ధనుస్సుని చేతితో పట్టుకొని టంకారం చేశాడు.


రావణుడిని చూడగానే సుగ్రీవుడు ఒక పెద్ద పర్వత శిఖరాన్ని పెకలించి గబగబా వెళ్ళి రావణుడి మీద పడేశాడు. తన మీదకి వస్తున్న ఆ పర్వత శిఖరాన్ని రావణుడు అర్థచంద్రాకార బాణాలతో తుత్తునియలు చేసి, బంగారు కొనలు కలిగిన బాణాలతో సుగ్రీవుడి గుండెల్లో కొట్టాడు. ఆ దెబ్బకి భూమిలో నుంచి జలం పైకొచ్చినట్టు సుగ్రీవుడి గుండెల్లోనుంచి రక్తం పైకి వచ్చింది. అంతటి సుగ్రీవుడు కూడా గట్టిగా అరుస్తూ కిందపడి మూర్చపోయాడు. తదనంతరం గవాక్షుడు, గవయుడు, సుషేణుడు, ఋషభుడు, నలుడు మొదలైన వానర వీరులందరి మీద 4, 6, 8, 12 బాణములను ఏకాకాలమునందు విడిచిపెట్టి వాళ్ళ మర్మస్థానముల మీద కొట్టాడు. వాళ్ళందరూ కింద పడిపోయారు.

వానర వీరులందరినీ రావణుడు కొట్టేస్తున్నాడని హనుమంతుడు గబగబా వచ్చి రావణుడి రథం ముందు నిలబడి కుడి చెయ్యి బిగించి

“రావణా! నీకు బ్రహ్మగారి వరాలు ఉన్నాయని మిడిసిపడ్డావు, సీతమ్మని అపహరించావు, నా పిడికిలి గుద్దు చేత నీలోని జీవాత్మని పైకి పంపించేస్తాను రా” అన్నాడు.

అప్పుడు రావణుడు “నువ్వంత మొనగాడివైతే అది చాలా గొప్ప విషయమే, నన్ను గుద్దు చూస్తాను" అన్నాడు.

హనుమంతుడు తన పిడికిలిని బిగించి రావణుడి శిరస్సు మీద ఒక గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి రావణుడు స్పృహ తప్పినట్టయ్యి అటు ఇటూ తూలి 

“ఆహా! ఏమి గుద్దు గుద్దావురా, చేస్తే నీలాంటి వాడితో యుద్ధం చెయ్యాలి” అన్నాడు.

అప్పుడు హనుమంతుడు “ఛీ దురాత్ముడా, ఇన్నాళ్ళకి నా పిడికిలి పోటు మీద నాకు అసహ్యం వేసింది. దీనితో గుద్దాక నువ్వు బతికి ఉన్నావు, ఎంత ఆశ్చర్యం. నేను ఇంక నిన్ను కొట్టను, నువ్వు నా వక్షస్థలం మీద గుద్దు, నా శక్తి ఏమిటో నువ్వు చూద్దువు కాని. అప్పుడు నేను నిన్ను మళ్ళి తిరిగి గుద్దుతాను” అన్నాడు.


అప్పుడు రావణుడు తన కుడి చేతిని బిగించి హనుమ యొక్క వక్షస్థలం మీద ఒక గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి హనుమంతుడు గిరగిరా తిరిగి నెత్తురు కక్కుతూ నేల మీద పడిపోయాడు.```


        *రేపు…86వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏


*🌷బుధవారం 2 జూలై 2025🌷*

``

            *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది…

``

      *వాల్మీకి రామాయణం*                

            *86వ భాగం*

```

అప్పుడు సర్వసైన్యాధికారి అయిన నీలుడు చీమ అంత రూపాన్ని పొంది రావణుడిని బాగా విసిగించాడు. రావణుడి బాణాల మధ్య నుండి తప్పించుకుంటూ వెళ్ళి ఆయన కిరీటం మీదకి దూకి, అక్కడినుంచి కిందకి దూకి ఆయన చెవులు కొరికాడు, తరువాత ఆయన బుగ్గలు కొరికాడు, తరువాత ఆయన లాల్చిలో దూరాడు. అటు ఇటూ పాకుతూ నానా అల్లరి పెట్టాడు. అప్పుడు రావణుడు ఆగ్నేయాస్త్రాన్ని నీలుడి మీదకి అభిమంత్రించి వదిలాడు, అప్పుడా అస్త్రం మంటలు కక్కుతూ నీలుడి మీద పడిపోయింది. అదృష్టవశాత్తు నీలుడు అగ్ని యొక్క అంశకి జన్మించినవాడు కనుక ఆ మంటలని తట్టుకోగలిగాడు, కాని స్పృహ కోల్పోయి నెత్తురు కక్కుతూ నేల మీద పడిపోయాడు.


ఇక రావణుడిని ఉపేక్షించకూడదని అనుకొని రాముడు ముందుకి వెళుతుండగా, లక్ష్మణుడు రాముడి పాదాలు పట్టుకొని… “అన్నయ్యా! నువ్వు వెళ్ళకూడదు. ఇటువంటి వాడితో యుద్ధం చెయ్యడానికి నువ్వు వెళితే మేమంతా ఎందుకు. నేను వెళతాను, నన్ను ఆశీర్వదించు!” అన్నాడు.


అప్పుడు రాముడు… “నాయనా! వచ్చినవాడు సామాన్యుడు కాదు. వాడు వేసిన బాణాలని నిగ్రహిస్తూ, నీ బాణములతో వాడి మర్మస్థానములయందు గురి చూసి కొడుతూ రావణుడిని నొప్పించు. లోపల మంత్రాలని మననం చేసుకుంటూ వెళ్ళు!” అని చెప్పాడు.


“దుష్టాత్ముడవై మా వదినని అపహరించావు, ఇప్పుడు యుద్ధ భూమిలో కనపడ్డావు కనుక నువ్వు ఇక ఇంటికి వెళ్ళే సమస్య లేదు” అని చెప్పి లక్ష్మణుడు రావణుడి మీద బాణములను ప్రయోగించాడు. 


లక్ష్మణుడు వేసిన బాణములను రావణుడు దారిలోనే సంహారం చేసి తాను కొన్ని బాణములను ప్రయోగించాడు. 


రావణుడు వేసిన బాణములను లక్ష్మణుడు నిగ్రహించాడు. 


ఇక లక్ష్మణుడిని ఉపేక్షించకూడదని రావణుడు భావించి బ్రహ్మగారు ఇచ్చిన శక్తి(ఈ అస్తం ఎవరిమీదన్నా ప్రయోగిస్తే ఇంక వాళ్ళు మరణించవలసిందే) అనే భయంకరమైన ఆయుధాన్ని అభిమంత్రించి ఆయన మీద వేశాడు. లక్ష్మణుడు దాని మీదకి వేసిన అనేకమైన బాణములను కూడా అది నిగ్రహించుకుంటూ వచ్చి ఆయన వక్షస్థలం మీద పడింది. 


అప్పుడు లక్ష్మణుడు… 'నేను విష్ణు అంశ' అని స్మరించాడు. అయినా ఆ బాణము యొక్క దెబ్బకి లక్ష్మణుడు స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయాడు.


వెంటనే రావణుడు లక్ష్మణుడిని తన రథంలో లంకకి తీసుకు వెళదామని అనుకొని పరుగు పరుగున వచ్చి తన 20 చేతులతో లక్ష్మణుడిని ఎత్తబోయాడు. ఆ చేతులతో మేరు పర్వతాన్ని, మందర పర్వతాన్ని ఎత్తిన రావణుడు, ఆ చేతులతో హిమవత్ పర్వతాన్ని కదిపిన రావణుడు ఇవ్వాళ ఆ చేతులతో లక్ష్మణుడిని ఎత్తలేకపోయాడు.

(లక్ష్మణుడు పడిపోయేముందు.. 

'నేను విష్ణు అంశని!' అని పడిపోయాడు కనుక రావణుడు ఎత్తలేకపోయాడు). 


ఇంతలో హనుమంతుడు మూర్ఛనుండి తేరుకుని చూసేసరికి, రావణుడు రథం దిగి లక్ష్మణుడిని పైకెత్తడానికి ప్రయత్నిస్తూ కనపడ్డాడు. అప్పుడు హనుమంతుడికి ఎక్కడలేని కోపం వచ్చి 'నీ దిక్కుమాలిన చేతులతో లక్ష్మణుడిని ముట్టుకుని, ఎత్తి తీసుకు పోదామనుకుంటున్నావా' అనుకొని, పరుగు పరుగున వచ్చి తన కుడి చేతితో రావణుడి వక్షస్థలంలో ఒక పోటు పొడిచాడు. ఆ దెబ్బకి రావణుడి చెవుల నుండి, ముక్కు నుండి, కనుగుడ్ల పక్కనుండి కూడా రక్తం కారి, మోకాళ్ళ మీద కిందకి పడిపోయి, మళ్ళీ స్పృహలోకి వచ్చి గబగబా తన రథంలోకి వెళ్ళి కూర్చుండిపోయాడు.


అప్పుడు లక్ష్మణుడిని హనుమంతుడు పరమభక్తితో, రక్షించుకోవాలనే భావనతో ముట్టుకునేసరికి ఆయన దూదిపింజలా పైకి లేచిపోయాడు. లక్ష్మణుడిని తీసుకెళ్ళి రాముడికి అప్పగించారు. 


వెంటనే లక్ష్మణుడు స్పృహని పొంది… “బ్రహ్మగారి శక్తిని నా మీదకి ప్రయోగించాడు అన్నయ్యా, అప్పుడు నేను విష్ణు అంశని స్మరించాను. నాకు ఏ ఉపద్రవం లేదు” అన్నాడు.


లక్ష్మణుడి మాటలు విన్న రాముడు క్రోధపర్వశుడై గబగబా అడుగులు వేసుకుంటూ యుద్ధానికి బయలుదేరాడు. 


వెంటనే హనుమంతుడు వచ్చి… 

“స్వామీ! ఏ విధంగా అయితే 

శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడి మీద కూర్చొని యుద్ధం చేస్తాడో, అలా మీరు నా వీపు మీద కూర్చొని యుద్ధం చెయ్యండి. ఆ రావణుడు రథంలో కూర్చుంటే మీరు నేల మీద నిలబడి యుద్ధం చెయ్యడమేమిటి స్వామీ, నా మీద కూర్చొని యుద్ధం చెయ్యండి” అన్నాడు.


అప్పుడు రాముడు హనుమ మీద కూర్చొని యుద్ధానికి వెళ్ళి… 

“దురాత్ముడా, ఆచారభ్రష్టుడా, పర స్త్రీని అపహరించినవాడా! ఈ రోజు నువ్వు అంతఃపురంలోకి వెళ్ళవు. ఇవ్వాళ నీ పదితలకాయలు కొట్టేస్తాను…” అని రాముడు చెబుతుండగా, రావణుడు విశేషమైన బాణ పరంపరని హనుమంతుడి మీద కురిపించాడు. 


ఆ బాణపు దెబ్బలకి హనుమంతుడి శరీరం అంతా నెత్తురు వరదలై కారిపోతోంది. 


అలా ఉన్న హనుమని చూసిన రాముడికి పట్టరాని కోపం వచ్చి, అర్థచంద్రాకార బాణములు, నారాచ బాణములు, వంకరలు లేని బాణములు రావణుడి మీద ప్రయోగించాడు.


‘అవి బాణాల, మెరుపులా?’ అని రావణుడు ఆశ్చర్యంగా చూస్తుండగా, ఆ బాణ పరంపరకి రావణుడి గుర్రాలు పడిపోయాయి, సారధి చనిపోయాడు, ధ్వజం పడిపోయింది, చక్రాలు ఊడిపోయాయి, రావణుడు తూలి భూమి మీద నిలబడ్డాడు. ఆ రావణుడి చేతిలో కోదండము, ఖడ్గము ఉన్నాయి. అప్పుడు రాముడు రావణుడి భుజంలోకి బాణాలు కొట్టాడు, కోదండాన్ని బాణాలతో కొట్టి విరిచేశాడు, ఆ ఖడ్గాన్ని విరిచేశాడు. ఆ రావణుడి అన్ని మర్మస్థానాలని బాణాలతో కొట్టాడు. ఆ దెబ్బలకి నెత్తురు వరదలై కారిపోయింది. తరువాత రాముడు బాణములతో రావణుడి కిరీటాన్ని కొడితే అది దొర్లి కింద పడిపోయింది.(ఈ సర్గని మకుట భంగ సర్గ అంటారు)


అప్పుడు రాముడు “భయంకరమైన యుద్ధం చేశావు రావణా. నీ ఖడ్గం విరిగిపోయింది, నీ గుర్రాలు చనిపోయాయి, నీ సారధి మరణించాడు, నీ ధ్వజం కిందపడిపోయింది, నీ రథం ముక్కలయ్యింది, నీ చేతిలో ఉన్న కోదండం విరిగిపోయింది, నీ కిరీటం కింద పడిపోయింది, నీ చేతిలో ఒక్క ఆయుధం లేదు. ఇప్పటివరకూ నా వాళ్ళని పడగొట్టి బాగా అలసిపొయావు, నీ కళ్ళల్లో భయం కనపడుతోంది, నీ ఒంటికి చెమట పట్టింది, నిన్ను విడిచిపెట్టేస్తున్నాను. పోయి ఇవ్వాళ రాత్రి పడుకో, విశ్రాంతి తీసుకో, మళ్ళీ రేపు ఉత్తమమైన రథాన్ని ఎక్కు, చేతిలో ఆయుధాన్ని పట్టుకొని యుద్ధానికి రా, నా పరాక్రమము ఏమిటో చూద్దువు కాని, ఇవ్వాల్టికి పో!” అన్నాడు.


రావణుడు వెనక్కి తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అప్పుడాయన మంత్రులందరినీ, సైన్యాన్ని పిలిచి, సిగ్గుతో తల వంచుకొని… “గరుత్మంతుడు పాములని తినేసినట్టు, ఏనుగులు సింహము చేత ఓడింపబడినట్టు, ఇవ్వాళ నేను రాముడి బాణముల చేత ఓడింపబడ్డాను. ఇవ్వాళ ఒక నరుడు నా రాజ్యానికి వచ్చి, నన్ను కొట్టి, చంపకుండా వదిలేసి, ‘ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకొని రేపు మళ్ళీ స్వస్థతని పొంది, ఆయుధాన్ని పట్టుకొని, రథం ఎక్కి రా, చూపిస్తాను నా పరాక్రమము!’ అన్నాడు.


ఒకనాడు బ్రహ్మగారు నాతో 'నువ్వు మనుష్యుల చేతిలో నశించిపోతావు' అన్నారు. ఆయన మాట యదార్ధమవుతోంది. ఆ బ్రహ్మగారి గురించి తపస్సు చేసినప్పుడు దేవ, దానవ, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషుల చేతుల్లో మరణించకూడదని కోరుకున్నాను, కాని మనుష్యుల చేతిలో, వానరుల చేతిలో మరణించకూడదన్న వరాన్ని నేను అడగలేదు. నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది, ఇక్ష్వాకు వంశంలో అనరణ్యుడు(రావణుడు అనరణ్యుడిని యుద్ధంలో సంహరించాడు) అని ఒక రాజు ఉండేవాడు. ఆయన నన్ను ఒకనాడు 'ఒరేయ్ రాక్షసుడా, మా ఇక్ష్వాకు వంశంలో ఒకనాడు రాముడన్నవాడు జన్మిస్తాడు, ఆయన నిన్ను సంహరిస్తాడు!' అని శపించాడు. బహుశా ఆయనే ఇవ్వాళ ఇక్ష్వాకు వంశంలో రాముడిగా వచ్చి ఉంటాడు. ఒకనాడు పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న వేదవతిని అనుభవించాలని ప్రయత్నించాను. ఆ వేదవతి… 'స్త్రీ కారణంగా నువ్వు నశించిపోతావు!' అని శపించింది. బహుశా ఆ వేదవాతే జనక మహారాజుకి కూతురిగా సీతగా పుట్టిందిరా, నేను సీతని నా మృత్యువు కోసమే తెచ్చిపెట్టుకున్నాను. ఒకనాడు కైలాస పర్వతం మీద పార్వతీదేవి నన్ను శపించింది, నందీశ్వరుడు శపించాడు (నందీశ్వరుడిని చూసి రావణుడు.. 'కోతి ముఖంవాడ' అని హేళన చేశాడు. 'ఆ వానరాలే నీ కొంప ముంచుతాయిరా!' అని నంది అన్నాడు). నలకూభరుడి భార్య అయిన రంభ శాపం ఫలిస్తోంది, వరుణుడి కుమార్తె అయిన పుంజకస్థల శాపం ఫలిస్తోంది. ఇవ్వన్నీ నిజం చెయ్యడం కోసమని రాముడొచ్చాడని నేను అనుకుంటున్నాను.

అయినా నేను దేవ దానవులని ఓడించినవాడిని, నేను ఎవరికీ భయపడను, సీతని ఇవ్వను. మీరందరూ జాగ్రత్తగా కోట బురుజులు ఎక్కండి, ప్రాసాదాలు ఎక్కండి. నేను ఎవరిని పిలిస్తే వాళ్ళు రావాలి, యుద్ధానికి వెళ్ళాలి. ఇంక మామూలు వాళ్ళు యుద్ధానికి పనికిరారు. నా తమ్ముడైన కుంభకర్ణుడు ఉన్నాడు, వాడి యుద్ధానికి ఇంద్రుడు మొదలైన వాళ్ళే హడలిపోయారు. వాడు మొన్ననే సభకి వచ్చాడు, ఇప్పుడు నిద్రపోతున్నాడు. వాడిని లేపడమే కష్టం, వాడు నిద్రలేస్తే రాముడు ఎంత. వెంటనే వెళ్ళి కుంభకర్ణుడిని లేపి తీసుకురండి!” అన్నాడు.```


        *రేపు…87వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

సమస్యకు

 *రెక్కలు రాని పక్షి యెగిరెన్ రివు రివ్వున నాకసంబునన్*

ఈ సమస్యకు నా పూరణ 


మిక్కిలి యాశతో వినత మేలును కీడులు నెంచకుండగాన్


మక్కువ నండమున్ పొడిచె మండె ననూరుడు పుట్టి, శాపమున్


"పిక్కలు వోయె నా" వనుచు పెట్టె, విమోచన గూడ చెప్పుచున్


రెక్కలు రాని పక్షి యెగిరెన్ రివు రివ్వున నాకసంబునన్.


అల్వాల లక్ష్మణ మూర్తి.

04.07.2025, శుక్రవారం

 *🙏జై శ్రీమన్నారాయణ🙏*

04.07.2025, శుక్రవారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

ఉత్తరాయనం - గ్రీష్మ ఋతువు

ఆషాఢ మాసం - శుక్ల పక్షం

తిథి:నవమి సా4.25 వరకు

వారం:భృగువాసరే (శుక్రవారం)

నక్షత్రం:చిత్ర సా5.30 వరకు

యోగం:శివం రా8.54 వరకు

కరణం:కౌలువ సా4.25 వరకు తదుపరి తైతుల తె5.23 వరకు

వర్జ్యం:రా11.42 - 1.28

దుర్ముహూర్తము:ఉ8.09 - 9.01

మరల మ12.30 - 1.22

అమృతకాలం:ఉ10.28 - 12.14

రాహుకాలం:ఉ10.30 - 12.00

యమగండ/కేతుకాలం:సా3.00 - 4.30

సూర్యరాశి:మిథునం

చంద్రరాశి:కన్య

సూర్యోదయం:5.33

సూర్యాస్తమయం:6.35


**


*నేడు మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగారి 128 వ జయంతి...*


అల్లూరి సీతారామరాజు 1897 జులై 4న విశాఖపట్నం జిల్లా పాండ్రంగిలో జన్మించారు. అయితే పెరిగింది మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో. రామరాజు తండ్రి వెంకట రామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ..


నేను సాయుధ విప్లవాన్ని ఆమోదించను. కానీ, అల్లూరి సీతారామరాజు సాహసి. ఆయన ధైర్యం, త్యాగనిరతి, నిరాడంబరత ప్రశంసనీయమైనవి. ఆయన తిరుగుబాటుదారుడు కాదు, యువతకు ఆదర్శప్రాయుడు'... అల్లూరి దివికేగిన తరవాత.. తెలుగునాట పర్యటించిన మహాత్మా గాంధీ ఆయన పోరాట పటిమను గురించి తెలుసుకుని వ్యక్తం చేసిన అభిప్రాయమిది.


గాంధీ మహాత్ముడితో పాటు ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి తెగువను ప్రశంసించారు. ఆ రోజుల్లో అల్లూరి ఉద్యమం వెనక ఉన్న లక్ష్యాల గురించి ఈతరం వారు తప్పక తెలుసుకోవాలి. స్థానిక సంస్థల అభివృద్ధి, మద్యపాన నిషేధం, అందరికీ విద్య వంటి మహోన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని అల్లూరి ముందుకు సాగారు. గొప్ప నాగరికులమని చెప్పుకొంటూ అడవితల్లి బిడ్డలపై దురాగతాలకు పాల్పడి, ఆటవిక రాజ్యాన్ని కొనసాగిస్తున్న బ్రిటిష్‌ పాలకులను ఎదిరించి- గిరిజనుల వ్యధను ఆదర్శనీయమైన పోరాట గాథగా మార్చిన అల్లూరి జీవితం స్ఫూర్తిదాయకమైనది. అందుకే ఆయన తెలుగు వారికి మాత్రమే పరిమితమైన స్వరాజ్య సమరయోధుడు కాదు. మాతృభూమి పట్ల అవ్యాజమైన ప్రేమాభిమానాలు కలిగిన భారతీయులందరికీ ఆరాధ్యుడు...


*‘రాచరికంపు రక్కసి కరమ్ములు సాచి అమాయిక ప్రజన్‌ / దోచు పర ప్రభుత్వమును దోచిన రాజుల చిన్నవాడ! వీ / రోచితమైన తావక మహోద్యమమాంధ్ర పురా పరాక్రమ / శ్రీ చరణమ్ములందు విరజిమ్మె నవారుణ విప్లవాంజలుల్‌’ అంటూ కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి- అల్లూరికి పద్య పంక్తులతో అంజలి ఘటించారు.*