1, ఫిబ్రవరి 2024, గురువారం

Panchanag

 


 

సనాతన ధర్మం*

 *సనాతన ధర్మం*  



 *"బొట్టు"* లేకుండా ఒక హిందువు ఉన్నారంటే అది వారి *దౌర్భాగ్యం* అనుకోవాలి. పుట్టిన 11 వ రోజునుండి చనిపోయిన 11 వ రోజువరకూ బొట్టు మన జీవితంలో ఒక భాగం. చివరికి చనిపోయాక *శవాని* కి కూడా బొట్టు పెడతారుగా! నువ్వు ఏ రకం బొట్టు ఆయినా పెట్టుకో! కానీ, నీ నుదురు *స్మశానం* లా ఉండకుండా చూసుకో! 


  ❔ నీ నుదురు ఖాళీగా ఉందంటే దరిద్రానికి *'Fashion'* అనే పేరుపెట్టి మరీ ఆహ్వానిస్తున్నా వని అర్థం.


🟡చందనం గుండ్రంగా పెట్టుకుంటావా? పెట్టుకో! అది *పూర్ణత్వాని* కి చిహ్నం!


🇦🇷 విభూతి పెట్టుకుంటావా? పెట్టుకో!        అది   *ఐశ్వర్యాని* కి ప్రతీక! ఏనాటికైనా ఈ శరీరం భస్మం కావాల్సిందేగా!


🩸నామం పెట్టుకుంటావా? పెట్టుకోండి! అది నువ్వు ఉన్న స్థితినుండి, నిన్ను *ఉన్నతస్థితి* కి చేరుకోమనీ అంటోంది!


🔴కుంకుమ పెట్టుకుంటావా? పెట్టుకో! ఇది *సౌభాగ్యాని* కి సోపానం!

🟤 సింధూరం పెట్టుకుంటావా? పెట్టుకో! హనుమంతుడి *ఆశీర్వాదం* లభిస్తుంది. 

🕉️కనుబొమ్మల మధ్యనుండేది ఆజ్ఞాచక్రం. 72000 నాడులకది నిలయం. అక్కడ తప్పకుండా ఏదో ఒక బొట్టుపెట్టు!  

బొట్టుపెట్టుకుంటే నీలో *భక్తి భావన* కలుగు తుంది... అండఅండందూ జై భారత్ జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 👌👌👍

మన్రో గంగాళాలు

 🌷🌷🌷🌻🚩🙏🚩🌻🌷🌷🌷


*"మన్రో గంగాళాలు" అంటే ఏవో తెలుసా..??*


కడుపు నొప్పికి మంత్రం *శ్రీవారి పులిహోరే...* ‼️


తిరుమలలో శ్రీవారికి ప్రతిరోజు నివేదించే నైవేద్యాలు ఇలాంటి గంగాళంలో మాత్రమే ఎందుకు నివేదింప బడుతున్నాయి..??


ఈ గంగాళం వెనక ఉన్న కథ ఏమిటి..??


👉 1800 ప్రాంతంలో తిరుమలలో దాదాపు శ్రీవారి కైంకర్యాలకు, నైవేద్య నివేదనకు, భక్తులకు ప్రసాదాల వితరణ కోసం ప్రముఖంగా వెదురు బుట్టలు వాడేవారు. 


👉 అపట్లో భక్తులకు హోటల్స్ లేవు కనుక.... తిరుమలలో భక్తులకు బుట్టల్లో ప్రసాదాలు పంచిపెట్టేవారు. అవే ఆనాటి భక్తులకు కడుపు నింపేవి. అక్కడక్కడా రామానుజా కూటముల ద్వారా కూడ అన్న సంతర్పణ కూడా జరిగినా ఆలయంలో పంచి పెట్టె ప్రసాదాలే ఆ నాటి భక్తులకు ప్రధాన ఆహారం.


👉 1800 ప్రాంతంలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ లో పని చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం వారి ఈస్ట్ ఇండియా కంపెనీ లో గవర్నర్ గా పని చేసిన అధికారి పేరు.. " THOMOS MUNRO " ..


👉 దక్షిణ భారతదేశం మరియూ ప్రముఖంగా రాయలసీమ, కంచి ప్రాంతంలో ఆయన ఎలుబడి కింద ఉండేది.


👉 ఈయన నిక్కచ్చిగా క్రైస్తవ పద్ధతులు పాటించే విదేశీయుడు... మన హైందవ సనాతన ధర్మం పట్ల ఎటువంటి గౌరవ భావం లేనివాడు..


👉 ఉద్యోగ రీత్యా చాలా సార్లు తిరుమల వచ్చినా...ఒక్కసారి కూడా శ్రీవారి దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్లిపోయేవాడు.


👉 అప్పట్లో తిరుమలలో భక్తులకు గుడి బయట ప్రసాదాలు పెద్ద మొత్తంలో పంచిపెట్టేవారు( అవే వారికి భోజనాలు ).. అప్పట్లో శ్రీవారికి ప్రధాన ప్రసాదంగా పొంగలి, పులిహారా , దద్దోజనం మొదలైన వంటలు సమర్పించేవారు. (అప్పటికి లడ్డు ప్రధాన ప్రసాదం కాదు.)

ఆ ప్రసాదాలను భక్త్తులు ఎంతో భక్తితో అక్కడ నేల మీద కూర్చుని నేరుగా చేతులతో తన్మయత్వంలో తినడం చూసి థామస్ మన్రోకి ఒకరకమైన అసహ్యం వేసింది...

స్వతహాగా విదేశీయుడు కావున... అలా నేరుగా చేతులతో ప్రసాదాలు తినడం చూసి అది ఆరోగ్యకరమైన పద్దతి కాదు అని , శుచి శుభ్రత లేకుండా అలా అందరూ కలిసి ఓకేదగ్గర నేరుగా ప్రసాదాలు చేతితో తినడం వల్ల లేనిపోని అంటు వ్యాధులు, కడుపు నొప్పులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి అని.... 


👉మన ఆలయ సంప్రదాయం, ప్రసాదాలు పట్ల ఒకింత చులకన భావం కలిగిన థామస్ మన్రో వెంటనే తన అధికారం ఉపయోగించి నేరుగా తిరుమలలో భక్తులు శ్రీవారి ప్రసాదాలు తినకుండా ఆదేశాలు ఇచ్చాడు.. 


👉 శ్రీవారి లీల ప్రభావంతో ఏ కడుపు నొప్పిని సాకుగా చూపించి ప్రసాదాలు థామస్ మన్రో రద్దు చేశారో...అదే తీవ్రమైన కడుపు నొప్పి ఆయనకి వచ్చి ఎన్ని రకాలుగా వైద్యం చేయించినా తగ్గకుండా ఆతని ఆరోగ్యం క్షీణించి , పూర్తిగా అనారోగ్యంతో మంచం పట్టినాడు. 


👉 అనుకోని పరిస్థితుల్లో అతనికి మంత్రాలయం రాఘవేంద్రస్వామి వారి మీద ఎనలేని భక్తి శ్రద్ధ గురి కుదిరింది. అతను ఆ ఆలయంకి ఎన్నో కైంకర్యాలకు దన సహాయం చేసినా ఆయన కడుపు నొప్పి మాత్రం తగ్గక నరక యాతన అనుభవించేవాడు. 


👉 అతనిలో వచ్చిన ఆధ్యాత్మిక పరివర్తన కి, సనాతన ధర్మం పట్ల భక్తిని గమనించిన మంత్రాలయ పీఠాధిపతులు ఆయన తిరుమల శ్రీవారి పట్ల ,ఆయన ప్రసాదాల పట్ల చేసిన ఘోరమైన తప్పుని తెలియజేసి, శ్రీవారి క్షేత్ర మహిమని వివరించారు. శ్రీవారి ప్రసాదాల మహిమ తెలుసుకున్న థామస్ మన్రో..శ్రీవారి పులిహార నేరుగా తన చేతితో తిన్న వెంటనే కడుపునొప్పి మటుమాయం అయింది..


👉తప్పు తెలుసుకున్న థామస్ మన్రో... శ్రీవారికి కైంకర్యాల కోసం, నైవేద్యాలు సమర్పణ కోసం చాలా గంగాళాలు సమర్పించాడు మరియూ తిరుపతి శ్రీవారి భక్తులకు మళ్ళీ మునుపటి లాగా ప్రసాదాలు పంచి పెట్టేలా వాటిని భక్తులు నేరుగా ఆలయం దగ్గరే తినేలా తిరిగి ఉత్తర్వులు ఇచ్చాడు...... 


👉 ఎంత పశ్చాత్తాప పడినా, ఎన్ని గంగాళాలు దేవస్థానానికి సమర్పించినా శ్రీవారి దర్శనానికి మాత్రం నోచుకోలేకపోయాడు.

మనోవ్యధ తో మంచం పట్టి నేరుగా నీ సేవలో పాల్గొని అదృష్టం లేదా స్వామి అని ఎన్నో విధాల శ్రీవారిని ప్రార్థిస్తూ 1827 లో ప్రాణం వదిలాడు. 


👉 అతని భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు ఆనాటి నుండి ఈనాటి వరకు తన అన్ని రకాల ప్రసాదాలను కేవలం ఆ గంగాళాలులోనే స్వీకరిస్తున్నాడు... ఈ గంగాళలను ఇప్పటికీ

 *" మన్రో గంగాళాలు "* అనే పేరుతో దేవస్థాన పూజా కైంకర్యాల లో చలామణీలో ఉన్నాయి...

శ్రీవారి దర్శనానికి నేరుగా నోచుకోకపోయినా ఆయన పేరు మీదే ప్రసాదాల పాత్రలు ఉండేలా శ్రీవారు అతనికి ఎప్పటికీ తరిగిపోని చిరకీర్తిని కలిగించి ఒక రకమైన చిరకీర్తి ప్రసాదించాడు. 


👉 తెలుసుకోవాలన్న శ్రద్ధ, భక్తి ఉండాలే గాని తిరుమలలో పరమాత్మ గూర్చే కాదు ఆ పరమాత్మునికి నివేదించే ప్రసాదాల లోనే కాక ఆ ప్రసాదాల పాత్రల వెనక కూడా ఎంతో విలువైన ఆధ్యాత్మిక మహిమలు, శ్రీవారు లీలలు, చరిత్ర కలదు. 


భక్తితో శ్రీనివాసుని తెలుసుకునే ప్రయత్నం చేస్తే తిరుమలగిరిలో అడుగడుగున, ప్రతి గడప కి, ప్రతి చెట్టు కి ప్రతి ఒక్క చిన్న ప్రదేశం వెనక ఎంతో తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక చరిత్ర దాగి ఉంది...


శ్రీనివాసుడి గురించి తెలుసుకోండి ..నలుగురికి తెలియజెప్పండి..


 🙏 *ఓం నమో వెంకటేశాయ* 🙏

సమస్య పూరణములు

 శ్రీ వై.వి.రమణారావుగారు ఇచ్చిన సమస్యలు 2:

1)దత్తపది:మగువ, తెగువ, తగవు, దిగువ 

2)సమస్య:కలియుగమున ధర్మకర్మ కళ్యాణమగున్ 

నా పూరణములు:

1)167.కం.మగువల నవమానించకు 

       తెగువను చూపించిపోరు దేశము కొరకై 

       తగవులు మానుము గృహమున 

       దిగువన పనిచేసి నీవు ఎగువకు చనుమా 

2)168.కం.తొలియుగములందు ధర్మము                

        నలుపదముల నడిచెననుట నదినిక్కంబౌ 

        పలువురి పుణ్యఫలమ్ముగ

        కలియుగమున ధర్మకర్మ కళ్యాణమగున్ 

 దర్భా శ్రీరామశాస్త్రి,హైదరాబాద్,31.01.2024

జీవకుడి" జీవిత విశేషాలు -

 మరుగున పడిన ఆయుర్వేద వైద్య పితామహుడు అయిన "జీవకుడి" జీవిత విశేషాలు - 


    ఆయుర్వేదం అనగా అందరికి చరకుడు , వాగ్భాటాచార్యుడు , శుశ్రుతుడు మాత్రమే అందరికి గుర్తుకువస్తారు. కాని కాలగర్భంలో కలిసిపోయిన ఒక గొప్ప ఆయుర్వేద వైద్య పితామహుఁడు , శస్త్రచికిత్సా నిపుణుడు గురించి మీకు ఈ రోజు తెలియచేస్తాను. ఆ గొప్ప ఆయుర్వేద వైద్య పితామహుఁడు నామధేయం "జీవకుడు " ఇతను బుద్ధుని కాలం నాటి అనగా క్రీస్తూపూర్వం 6 వ శతాబ్దం నాటివాడు .ఈ వైద్యుని చరిత్ర మనకి ఆశ్చర్యం కొలుపుతుంది.


                 ఇతను గౌతమబుద్ధుని సమకాలికుడు ఆయనకు చికిత్స చేసెను. " కౌమార భృత్యం " అనగా బిడ్డల చికిత్స యందు మిక్కిలి చతురత కలవాడు అని ఇతనికి బిరుదు కలిగి ఉండెను. కాని జీవకుడు కాయచికిత్స యందు శస్త్రచికిత్స యందు గొప్ప ప్రజ్ఞ కలవాడు అని చారిత్రిక నిదర్శనములు కలవు. అతడు మగధరాజ్యమునకు ముఖ్య పట్టణం అగు రాజగృహ నగరము నుండి బింబిసార చక్రవర్తి యొక్క కుమారుడు అగు అభయునిచే అప్పటికే ప్రసిద్ది చెందిన తక్షశిలా నగరం నందలి వైద్యవిశ్వవిద్యాలయమునకు పంపబడెను. ఆ కాలము నందే వేయిమైళ్ల దూరం వైద్యవిద్యను సంపాదించు నిమిత్తం ఇతను పోయననిన ఆశ్చర్యపడవలసిన అవసరమే లేదు .


               తక్షశిలా విశ్వవిద్యాలయము నందు జీవకుడు ఏడు సంవత్సరాలపాటు వైద్యవిద్యను అభ్యసించి గురువువద్దకు సెలవు తీసుకొనుటకు వెళ్లగా గురువు ఇతనిని పరీక్షింపదలచి " ఈ గడ్డపార తీసుకుని తక్షశిలా నగరం చుట్టూ యోజనము దూరములో వైద్యమునకు పనికిరాని మూలికను తెమ్ము " అని పంపించెను . అతడు తిరిగి తిరిగి ఏదో ఒకరకమగు చికిత్సకు కాని , ఆహారంగా గాని పనికిరాని వస్తువు అంటూ ఏమి లేదు అని " న కించిత్ జగ త్యనౌషధం " అని చెప్పెననియు అందుకు ఆ గురువు సంతసించి అతని ప్రయాణ ఖర్చులకు కొంత ధనమును ఇచ్చి వీడ్కోలు పలికే అని పురాతన గ్రంథాలలో ఉన్నది. జీవకుడు సాకేత నగరముకు వచ్చు వరకు ప్రయాణ ఖర్చులకు ధనము లేక అక్కడే కొన్ని రోజులు వేచిచూడవలసిన వచ్చెను.


 * జీవకుడి చికిత్సలు - 


        సాకేత నగరమున ఒక ధనికుడు అగు శెట్టి భార్య ఏడు సంవత్సరముల నుండి తలలో ఏదో సమస్యతో భాధపడుచూ ఎందరు వైద్యం చేసినను కుదరక కష్టపడుచుండును. జీవకుని గురించి విని తన గృహమునకు ఆహ్వానింపగా ఇతడు కొన్ని మూలికలు సంపాదించి వానితో ఒక ఘృతము తయారుచేసి ముక్కుద్వారా నశ్యము చేయించెను. ఈ చికిత్సతోనే ఆమె రోగము నయం అయ్యెను. ఆ కాలములోనే వైద్యదక్షిణగా 16000 బంగారు రూపాయలు ఇచ్చెను . ఒక గుర్రపు బండిని , నౌకరులను ఆయనకు సమర్పించెను. దీనితో జీవకుడు రాజగృహమునకు చేరి తనపోషకుడు అగు అభయునకు తనకు సహాయం చేసిన ధనమును తిరిగి ఇచ్చివేసెను. ఆ తరువాత బింబిసార చక్రవర్తికి కలిగిన" భగంధర " రోగమును కొన్ని లేపనముల సహాయముతో చేసి కుదిర్చెను . ఆ తరువాత జీవకుడు రాజవైద్యుడిగా నియమించబడెను. ఆ తరువాత గౌతమబుద్ధునకు వారి బౌద్ధ సంఘమునకు వైద్యుడు అయ్యెను.


                     జీవకుడు చికిత్స చేసిన అత్యద్భుత చికిత్సలలో కొన్ని బౌద్ధ గ్రంధములలో వర్ణింపబడినవి. రాజగృహ నగరం నందు ఒక వైశ్యశిఖామణి కుమారునకు మితిమీరిన తలనొప్పి అనేక సంవత్సరముల నుండి భాదించుచుండెను. జీవకుడు శస్త్రచికిత్సచే తలలో నొకభాగం తొలచి రెండు పురుగులను తీసివేసి వ్రణమును ఎప్పటివలె కుట్టి ఏదో ఒక లేపమును పూసి కట్టు కట్టెను. ఇందువలన తలనొప్పి నిర్మూలనం అయ్యెను .


              కాశీపట్టణమునకు చెందిన ఒక వ్యక్తి కుమారుడు వ్యాయామము చేయుచుండగా పేగులలో మెలికపడి ఆహారం జీర్ణించుకోలేక మలబద్దకం కలిగి రక్తహీనుడు అయ్యి శల్యావశిష్టుడై యుండెను. అంతట వారు జీవకునిని పిలిపించగా ఇతడు శస్త్రచికిత్సచే సరిచేయుచూ మెలికపడిన పేగులను రోగి భార్యకు చూపించి పేగులను మెలికను విడకొట్టి తిరిగి ఎప్పటివలె ఉదరకుహరమున స్వస్థలమున నిలిపి పైన చర్మం కుట్టి ఏదో లేపనం పూసి మాన్పెను. 


                ఉజ్జయినీ మహారాజు అగు "ప్రద్యోత" చక్రవర్తి కామెర్ల వ్యాధిచేత భాధపడుతుండెను. ఆఖరు వైద్యముగా వారి సంస్థాన వైద్యులను బింబిసార చక్రవర్తి దగ్గరకు జీవకుని కోసం పంపిరి. రోగము కంటే రోగి మొండివాడు అని జీవకునకు తెలుసుకొనెను. ఈ వ్యాధికి ఘృతపానం చేయవలెను . (ఆయుర్వేదం నందు ఘృతము అనగా మూలికలను ఆవునెయ్యితో కలిపి వండుటను ఘృతము అందురు.) ఘృతం పేరుచెప్పగానే రోగికి వాంతి వచ్చుచుండెను. అందువల్ల ఘృతం పనికిరాదు అని రాజు శాసించెను . జీవకుడు కష్టపడి రంగు , రుచి అన్నియు మారునట్లు ఒక ఘృతమును తయారుచేసి ఒకవేళ మహారాజుకు వాంతి అయిన మహారాజు ఘృతం అని కనిపెట్టి ఏమి దండన విధించునో అను శంఖ చేత ఒక యుక్తిని పన్నెను . అదేమనగా మహారాజునకు మందు లొపలికి ఇవ్వగానే తాను ఒక పచ్చిమూలిక సంపాదించి వెంటనే విరుగుడుగా ఇవ్వవలెను అనియు అందుకు వేగముగా పరిగెత్తగల వాహనమును తయారుచేసి వీధిలో సిద్ధముగా నుంచవలెను అనియు ఏర్పాటు చేయించెను .


                  మహారాజునుకు ఔషదం ఇచ్చి ఉపచారవిధానాదులు చేయుటకు తగినవారిని నియమించి వేగముగా నగరం విడిచిపోయెను. చక్రవర్తికి రోగము నివారణ అయ్యెను . కాని వైద్యుడు కనిపించలేదు . రాజు రహస్యం అంతా తెలుసుకుని జీవకునకు చేరవలసిన బహుమానమును బింబిసారుని రాజధానికి పంపెను. ఇలా జీవకుడు ఎన్నో కఠినమైన చికిత్సలు చేయుచుండెను అని " చుల్లవగ్గా " 5 -14 - 1 అనే గ్రంథము నందు కలదు . ఒకసారి బుద్ధునకు అనారోగ్యం కలిగెను. అప్పుడు విరేచనౌషధం ఇవ్వవలసి వచ్చెను. అతిగౌరముగా కాపాడుబడుచున్న పవిత్ర మునీశ్వరుడు అయిన గౌతమ బుద్దునకు లొపలికి తీసికొనుటకు అహితములైన మందులను లొపలికి ఇచ్చుట జీవకునకు ఇష్టం లేదు . అందుచే విరేచనౌషధములను పద్మములో ఇమిడ్చి వాసన చూచుటకు బుద్దునకు ఇచ్చెను. సుఖముగా విరేచనాలైన పిమ్మట వేడినీళ్లలో స్నానం చేయించి సంపూర్ణంగా ఆరోగ్యం కలుగు వరకు ద్రవపదార్థాలను ఆహారంగా ఇచ్చుచుండిరని వ్రాయబడినది . మరొకసారి ఒక భక్తురాలు విందు ఇచ్చినప్పుడు ఆహార దోషము వలన తినినవారందరికి అజీర్ణము పుట్టి దోషప్రకోపం వలన బాధలు పడుచుండిన సమయమున అందరికి చికిత్స చేసెను అని కలదు .


     ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.


 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

అన్నవరంలో

 ప్రతి శనివారం, ఆదివారం రోజుల్లో *అన్నవరంలో సేవ* ఉంది. 

ఎవరైనా వెళ్లాలని 7893159871 కాల్ చేయండి. 


*రామేశ్వరంలో* హుండీ లెక్కింపు ఉన్నది ఫిబ్రవరి ఒకటో తేదీన ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు 7893159871 కాల్ చేయండి.


 మహాశివరాత్రి సందర్భంగా *పట్టిసీమ, కోటప్పకొండ శ్రీశైలంలో, పంచరామాల్లో సేవలు* ఉన్నవి. ఎవరైనా ఉంటే కనుక తెలియజేయండి

789315981. 


 *సింహాచలంలో*, ప్రతి శనివారం, ఆదివారం సేవ ఉన్నది. ఎవరైనా ఉంటే కనుక తెలియజేయండి

7893159871 


*సిరిపురంలో సేవ* చేయడానికి సేవకులు కావలెను. 

7893159871


* *ద్వారకా తిరుమల సేవ* ఉన్నది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు, 7893159871 కాల్ చేయండి. 


*భద్రాచలంలో సేవ* చేయటానికి సేవకులు కావలెను 7893159871 కాల్ చేయండి. 


*తిరుపతిలో సేవ* చేయటానికి సేవకులు కావలెను 7893159871


*మద్ది ఆంజనేయ స్వామి గుడి వద్ద సేవ* చేయడానికి సేవకులు కావలెను 7893159871 కాల్ చేయండి


*అయోధ్య మరియు కాశి* వచ్చే వారు ఎవరైనా ఉంటే గనుక కాల్ చేయండి. భోజనానికి , రూముకి , ట్రైన్ చార్జీలతో కలిపి, మూడు రోజుల సేవకి ₹3500/- 


*కాణిపాకంలో సేవ* చేయడానికి సేవకులు కావలెను 7893159871.


*రామనారాయణ టెంపుల్, విజయనగరం సేవ*, శనివారం, ఆదివారం సేవ చేయుటకు కావలెను. 

7893159871 


*కాశీకి అస్తికలు అనే కాన్సెప్ట్ తో మొదలుపెట్టిన మన సంస్థ మూడోసారి అస్థికలు తీసుకు వెళ్ళే కార్యక్రమం మొదలు పెట్టాము. దీనికి డబ్బులు అవసరం లేదు. 

ధనికా భేద కుల మత భేదము ఏమీ లేవు. 

ఫిబ్రవరి రెండో తేదీన తీసుకు వెళ్ళటం జరుగుతుంది. కాశీలో శాశ్వతంగా కార్యక్రమం చేసి లైవ్ వీడియో పంపిస్తాము. కనుక మన వాళ్ళు ఎవరైనా అస్తికలు ఉంటే కనుక మాకు తెలియజేయండి మేము ఫ్రీగా తీసుకువెళ్లి కార్యక్రమం అన్ని పూర్తి చేసి వస్తాము. 7893159871 కాల్ చేయండి. 


*షిరిడిలో సేవ* కలదు మార్చి నెల, ఏప్రిల్ నెల. ఎవరైనా ఉంటే కనుక కాల్ చేయండి7893159871


భక్తితో (డబ్బులు ఆశించకుండా) సేవ చేయాలి అనుకునేవారికి…పంపించండి. 


జై శ్రీ రామ!

జై శ్రీ మన్నారాయణ!

హరే కృష్ణ!

సంకల్పము

 *శుభోదయం*

**********

సంధ్యా వందన 

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల 

సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.01.02.2024 

బృహస్పతివాసరే( గురువారము)

 **********

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే

హేమంతృతౌ

పౌష్య మాసే కృష్ణ పక్షే 

షష్ఠ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

బృహస్పతివాసరే

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

*ఇతర పూజలకు*

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే

హేమంతృతౌ పౌష్య మాసే కృష్ణ పక్షే

షష్ఠ్యౌపరి సప్తమ్యాం

బృహస్పతివాసరే.అని చెప్పుకోవాలి.

*ఇతర ఉపయుక్త విషయాలు*

సూ.ఉ.6.35

సూ.అ.5.52

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం* 

*ఉత్తరాయణ పుణ్యకాలం శరత్ ఋతువు*

*పుష్య మాసం*

*కృష్ణ పక్షం షష్ఠి ఉ.10.08 వరకు*. 

గురు వారం. 

నక్షత్రం చిత్త రా.12.18 వరకు. 

అమృతం సా.5.21 ల 7.05 వరకు. 

దుర్ముహూర్తం ప.10.21 ల 11.06 వరకు.

దుర్ముహూర్తం మ.2.51 ల 3.36 వరకు. 

వర్జ్యం ఉ 6.55 ల 8.39 వరకు. 

వర్జ్యం తె. 6.17 ల మరునాడు ఉ. 7.00 వరకు. 

యోగం ధృతి ఉ.9.53 వరకు.   

కరణం వనజి. ప.10.08 వరకు. 

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం ప. 1.30 ల 3.00 వరకు. 

గుళిక కాలం ఉ. 9 00 ల 10.30 వరకు. 

యమగండ కాలం ఉ. 6.00 ల 7.30 వరకు. 

---////----////---////---////---

పుణ్యతిధి పుష్య బహుళ సప్తమి. 

************

*బ్రాహ్మణ వధూవరుల వివరాలకై సంప్రదించండి*:-

/\//\\//\\//\\///\\//\\//\\//\\//\\//\\//\\/\\_ 

*శ్రీ పద్మావతి శ్రీనివాస బ్రాహ్మణ వివాహ సమాచార సంస్థ*, 

(రి.జి.నెం.556/2013)

S2 - C 92, 6 - 3 -1599/92,

సచివాలయనగర్,వనస్థలిపురం,

హైదరాబాద్ 500 070.

ఫోన్(చరవాణి) నెం.

*8019566579/9848751577*

****

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

.

పంచాంగం 01.02.2024

 ఈ రోజు పంచాంగం 01.02.2024

Thursday,

 

స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: ఉత్తరాయణం హేమన్త ఋతు పుష్య మాస కృష్ణ పక్ష: షష్థి తిధి బృహస్పతి వాసర: చిత్ర నక్షత్రం ధృతి యోగ: వణిజ తదుపరి భద్ర కరణం. ఇది ఈరోజు పంచాంగం.


షష్థి మధ్యాహ్నం 02:00 వరకు.

చిత్ర రాత్రి 03:47 వరకు.

సూర్యోదయం : 06:52

సూర్యాస్తమయం : 06:08


వర్జ్యం : పఫలు 10:00 నుండి 11:46 వరకు.


దుర్ముహూర్తం : పగలు 10:37 నుండి 11:22 వరకు తిరిగి మధ్యాహ్నం 03:08 నుండి 03:53 వరకు.


అమృత ఘడియలు : రాత్రి 08:40 నుండి 10:27 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.


యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

వేదన..స్వాంతన..

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*వేదన..స్వాంతన..*


"స్వామివారి మందిరానికి రావాలని అనుకుంటున్నాము..ఎలా రావాలో తెలుపుతారా?.." అంటూ చెన్నై నుంచి మధుసూదనరావు గారు అడిగారు..ఆయన వయసు డెబ్భై ఏళ్ళు..రైల్లో ఎక్కడ దిగాలో చెప్పి..అక్కడనుంచి మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి ఆశ్రమానికి బస్ లో రావడానికి మార్గాన్ని వివరంగా తెలిపాను..ఆ తరువాత శని ఆదివారాల్లో మందిరానికి వస్తానని చెప్పారు..అనుకున్న ప్రకారమే మధుసూదనరావు గారు శనివారం ఉదయం తొమ్మిదిన్నర కల్లా శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు..గది కి వెళ్లి, స్నానాదికాలు ముగించుకొని, మందిరం లోకి వచ్చి..శ్రీ స్వామివారి విగ్రహానికి నమస్కారం చేసుకొని...నావద్దకు వచ్చి.."ఇక్కడికి మాలకొండ దగ్గరే కదా..అక్కడికి వెళ్ళడానికి ఆటో లు ఉన్నాయా?.." అన్నారు..ఒక గంట ఆగితే బస్ వస్తుందని..అందులో వెళ్ళమని సలహా ఇచ్చాను..సరే అన్నారు..మాలకొండకు వెళ్లి, శ్రీ లక్ష్మీ నరసింహుడి దర్శనం చేసుకొని సాయంత్రానికి తిరిగి మందిరానికి వచ్చారు..


ఆరోజు సాయంత్రం పల్లకీ సేవ వద్ద పూజ చేయించుకొని..తిరిగి నా వద్దకు వచ్చి.."ప్రతి శనివారం నాడు ఇంతమంది భక్తులు ఉంటారా?..వీళ్ళందరికీ అన్నదానం చేస్తున్నారా?.."అన్నారు..అవును అన్నాను..ఓ ఐదు నిమిషాల పాటు మౌనంగా వున్నారు..ఆ తరువాత.."శనివారం నాటి సాయంత్రం అన్నదానం చేయించడానికి సుమారుగా ఖర్చు చెప్పండి..వచ్చే వారానికి నేను భరిస్తాను.." అన్నారు..వివరంగా చెప్పాను..అంతా విని.."బాబూ..నేను రేపు సాయంత్రం తిరిగి చెన్నై వెళ్లాలని టికెట్ బుక్ చేసుకున్నాను..కానీ ఇందాకటి నుంచీ ఈ కోలాహలం చూసిన తరువాత..ఈ వారమంతా ఇక్కడే వుండి.. స్వామివారి సేవ చేసుకొని..శనివారం నాడు అన్నదానం చేసి..ఆదివారం నాటి సాయంత్రం తిరిగి హైదరాబాద్ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాను..నాకు కేటాయించిన గదిని ఈ వారమంతా నాకే ఉంచండి.."అన్నారు..సరే అన్నాను..


ఆరోజు గడిచిపోయింది..ప్రక్కరోజు ఆదివారం ఉదయం ప్రభాత పూజ, సమాధికి అభిషేకం, విశేష హారతులు అన్నీ దగ్గరుండి చూసారు..మధ్యాహ్నం అన్నదాన సత్రానికి వెళ్లి భోజనం చేసి వచ్చారు..

"నువ్వు నాకన్నా చిన్నవాడివి..బాబూ అని ఏకవచనం తో పిలుస్తున్నాను.. ఏమీ అనుకోకు..నీతో కొంచెం సేపు మాట్లాడాలి.." అన్నారు..దగ్గరకు జరిగి కూర్చున్నాను..


"నాకు ఇద్దరు కుమారులు..ఇద్దరూ ఇంజినీర్లే.. పెద్దవాడికి వివాహం చేసాను..రెండో వాడికి సంబంధాలు చూస్తున్నాము..పోయిన సంవత్సరం చాలా గడ్డుకాలం నా జీవితం లో..నలభై ఐదు ఏళ్ల పాటు నాతో సంసారం చేసిన నా భార్యకు కాన్సర్ సోకి..మేము గ్రహించేసరికి ఆలస్యం జరిగి..ఆవిడ కాలం చేసింది..బాగా కృంగిపోయాను..ఈ వయసులో తోడు లేకుండా పోయింది..మరో మూడు నెలలు గడిచేసరికి.. రెండో వాడు ప్రమాదంలో చనిపోయాడు..దెబ్బ మీద దెబ్బ..పెద్ద కొడుకు వద్ద ఉంటున్నాను..మానసికంగా కోలుకోలేని పరిస్థితి..ఒంటరితనం పీడించసాగింది.. మా కాలనీకి దగ్గరగా ఉన్న గుడికి వెళ్ళసాగాను.. అక్కడ సత్సంగం లో ఈ స్వామివారి గురించి..ఈ మందిరం గురించి విన్నాను..ఎందుకో తెలీదు..ఒక్కసారి వెళ్లి చూసిరావాలని బలంగా అనిపించింది..ఆలస్యం చేయకుండా వచ్చాను..ఇన్ని రోజుల తరువాత ఈరోజు నాకు మనసు ప్రశాంతంగా ఉంది..ఒక వారం పాటు ఇక్కడే వుంటాను..నువ్వు కాస్త సహకరించాలి.." అన్నారు...చాలా బాధగా అనిపించింది.."సరే..వారం పాటు వుండండి..భోజనం ఏర్పాటు కూడావుంది.." అని చెప్పాను..


ఆ వారం లో సోమవారం నుండీ శుక్రవారం వరకూ శ్రీ స్వామివారి మందిర మంటపం లో ఎక్కువ సేపు ధ్యానం చేసుకుంటూ వున్నారు మధుసూదనరావు గారు..శనివారం సాయంత్రం పల్లకీసేవ లో పాల్గొన్నారు..ఆరాత్రి అన్నదానం వద్ద తాను కూడా పాల్గొని..వడ్డన కూడా చేశారు..ఆదివారం నాడు శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి, నమస్కారం చేసుకొని వచ్చారు..


"బాబూ..మళ్లీ కొన్నాళ్ళు ఆగి వస్తాను..ఇక్కడ నా మనసుకు స్వాంతన దొరికింది..నైరాశ్యం తొలిగింది..తప్పకుండా మళ్లీ వస్తాను..అక్కడికి వెళ్లిన తరువాత కూడా ఊరికే కూర్చోకుండా..నాకు చేతనైన సేవ చేస్తాను..సాటివాళ్లకు సేవ చేస్తే, నీ మనోవేదన తీరుతుంది అని శ్రీ స్వామివారు ఆదేశించినట్లు అనిపించింది.. అంతా ఈ స్వామివారి దయ!.." అన్నారు..ఈ వయసులో మధుసూదనరావు గారికి ఏది ముఖ్యమో దానినే స్వామివారు అనుగ్రహించారు..వారి సమస్యకు ఉపయుక్తమైన పరిష్కారం చూపారు..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

భారతరత్న అవార్డు

 ఈ రోజు సుమన్ టీవీ చీరాల లో ఒక ఆసక్తికరమైన అంశం చూసాను. అది మిత్రులందరితో పంచుకోవాలనిపించింది.  


నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతరత్న అవార్డు ప్రకటించ బడిన కర్పూరీ ఠాకూర్ నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవాడట. ఆయన బీహార్ ముఖ్య మంత్రిగా వుండగా, తదనంతర కాలంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన యశ్వంత్ సిన్హా ఐఏఎస్ అధికారిగా వుండి, కర్పూరీ ఠాకూర్ కు కార్యదర్శిగా పనిచేశాడట. ఆయన ఒకసారి కర్పూరీ ఠాకూర్ స్వగ్రామానికి వెళితే, ఆయన వుంటున్నది ఒక చిన్న పూరిగుడిసెలోనట. ముఖ్య మంత్రిగారి భార్య ఈయనకు కట్టెల పొయ్యి మీద టీ పెట్టి ఇస్తే, యస్వంత్ సిన్హా కళ్ళ వెంట నీళ్లు వచ్చాయట.


కర్పూరీ ఠాకూర్ తండ్రి 85 ఏళ్ళ వయసులో కూడా తన కులవృత్తిని కొనసాగించేవాడట. ముఖ్య మంత్రి తండ్రయి వుండి, ఇంకా ఈ పనెందుకని ఎవరైనా అడిగితే, "మావాడు జులాయిగా తిరుగుతున్నాడు. నేను కూడా పని మానేస్తే, ఇల్లు ఎట్లా గడుస్తుంది" అనే వాడట ఆయన.


కర్పూరీ ఠాకూర్ ఒకసారి జయప్రకాష్ నారాయణ్ జయంతి కార్యక్రమానికి చిరిగిన చొక్కాతో వెళ్ళాడట. అది చూసిన చంద్రశేఖర్ "వీడికి చొక్కా కొనుక్కోవడానికి చందాలివ్వండి" అని ఎగతాళిగా అన్నాడట. కర్పూరీ ఠాకూర్ వెంటనే తన ముందు ఒక గుడ్డ పరుచుకొని కూర్చున్నాడట. వచ్చిన డబ్బులను సీ.యం. రిలీఫ్ ఫండుకు జమచేశాడట. 


ఇటువంటి మహానుభావుడిని వెతికి పట్టుకొని ప్రధాన మంత్రి, ఆయన చనిపోయిన 35 ఏళ్ళకు భారతరత్న ఇస్తుంటే, ప్రజాధనంతో బొజ్జలు పెంచుకొని, అచ్చుబోసిన ఆంబోతుల్లా తయారైన నేటి నాయకులు "ఇదంతా ఎలక్షన్ల స్టంటు" అంటూ తప్పు పట్టడాన్ని ఏమనాలి?  

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య గారిది కూడా ఇదే పరిస్థితి. ఇటువంటి విషయాలు చదువుతుంటే, మనసు ఆర్ద్రమౌతుంది కదా (సేకరణ)

బ్లడ్ క్యాన్సర్ కు మందు

 

 బ్లడ్ క్యాన్సర్ కు మందు దొరికింది!! దాన్ని మళ్లీ ఫార్వార్డ్ చేయకుండా తొలగించవద్దు ఇది భారతదేశంలోని ప్రతి ఇంటికి చేరనివ్వండి. 'ఎమోటిఫ్ మెర్సిలేట్' బ్లడ్ క్యాన్సర్‌ను శుద్ధి చేసే ఔషధం. పూణేలోని యోశోద హెమటాలజీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉచితంగా లభిస్తుంది. అవగాహన కల్పించండి. ఇది ఎవరికైనా సహాయం చేయగలదు. మీకు వీలైనంత వరకు కొనసాగండి. నైతికతకు ధర లేదు. తెలుసు: యశోదా హెమటాలజీ క్లినిక్. 109, మంగళమూర్తి కాంప్లెక్స్, హీరాబాగ్ చౌక్, తిలక్ రోడ్, పూణే-411002. ఫోన్: 020-24484214 లేదా 09590908080 లేదా 09545027772 లేదా www.practo.comని సందర్శించండి. సేకరణ:- వై.వి. రమణ మూర్తి.

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

               🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం - హేమంత ఋతువు - పుష్య మాసం - కృష్ణ పక్షం -‌ షష్ఠి - చిత్ర -‌ గురు వాసరే* *(01-02-2024)* 


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/-EUQUl1Ixqo?si=8cyH5bO_gS4C7n-z


🙏🙏

సుభాషితమ్

 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 


శ్లో𝕝𝕝 పూర్ణే తటాకే తృషితః సదైవ

భూతేఽపి గేహే క్షుధితః స మూఢః |

కల్పద్రుమే సత్యపి వై దరిద్రః

గుర్వాదియోగేఽపి హి యః ప్రమాదీ ||


తా𝕝𝕝 సద్గురువును కలుసుకున్నప్పటికీ తిరిగి తప్పులు చేసే మూఢుడు ఎలాంటి వాడంటే, నిండు చెరువు దగ్గర ఉన్నా దాహంతో ఉండేవాడు, సొంత ఇల్లు ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ ఆకలితో అలమటించేవాడు, మరియు కల్పవృక్షం తన వద్ద ఉన్నప్పటికీ పేదవాడు....

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*01-02-2024 / గురువారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట ఊహించని వివాదాలు మానసికంగా చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు స్థాన చలనాలు తప్పవు.

---------------------------------------

వృషభం


రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగ వాతావరణం మరింత అనుకూలిస్తుంది.

---------------------------------------

మిధునం


ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పాతమిత్రుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.

---------------------------------------

కర్కాటకం


దూరపు బంధువుల నుండి అందిన శుభవార్త కొంత ఊరట కలిగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగుల శ్రమ వృధాగా మిగులుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు కొంత చికాకు పరుస్తాయి.

---------------------------------------

సింహం


అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఋణ దాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణించవు.

---------------------------------------

కన్య


నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

తుల


చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి.

---------------------------------------

వృశ్చికం


దైవ చింతన పెరుగుతుంది.పెద్దల ఆరోగ్యసమస్యలు కొంత మానసికంగా కలచివేస్తాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

---------------------------------------

ధనస్సు


వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి తొలగడానికి నూతన ఋణప్రయత్నాలు చేస్తారు.

---------------------------------------

మకరం


వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. విలువైన వస్తువుల బహుమతులుగా పొందుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------

కుంభం


వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ధన పరంగా ఇబ్బందులు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు చికాకు పరుస్తాయి.

---------------------------------------

మీనం


సంతాన విదేశీ ప్రయాణ ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


// *శ్లోకం* // 


*కుత్రానృతే న్యపాపం, యచ్ఛోక్తం ధర్మ రక్షార్ధమ్*, !     

*కోధర్మోభిమతో, యశ్శిష్టానాం నిజ కులీనానామ్* !!            


/- *_సంస్కృత సూక్తి సుధ_* /-


భావము - *ధర్మాన్ని రక్షించే నిమిత్తమై అబద్ధమాడినా అది పాపం కాదు.....మరి ధర్మమంటే ఏమిటి అనగా సదాచారపరులగు శిష్టులకు ఏది సమ్మతమో , అదే ధర్మము*.