6, నవంబర్ 2025, గురువారం

వందేమాతరం

 *🇮🇳పూర్తి వందేమాతరం🇮🇳*


వందేమాతరం

వందేమాతరం


సుజలాం సుఫలాం మలయజ శీతలామ్

సస్యశ్యామలాం మాతరం వందేమాతరం

శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్

ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్

సుహాసినీం సుమధుర భాషిణీమ్

సుఖదాం వరదాం మాతరం వందేమాతరం


కోటి కోటి కంఠ కలకల నివాద కరాలే

కోటి కోటి భుజై ధృత కర కరవాలే

అబలాకేనో మాం ఎతో బలే

బహుబల ధారిణీం నమామి తారిణీం

రిపుదల వారిణీం మాతరం వందేమాతరం


తుమి విద్యా తుమి ధర్మ

తుమి హృది తుమి మర్మ

త్వంహి ప్రాణః శరీరే

బహుతే తుమి మా శక్తి

హృదయే తుమి మా భక్తి

తో మారయి ప్రతిమాగడి మందిరే మందిరే వందేమాతరం


త్వంహి దుర్గా దశ ప్రహరణధారిణీ

కమలా కమలదళ విహారిణీ

వాణి విద్యాదాయినీ, నమామిత్వాం, నమామి కమలాం

అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం వందేమాతరం

శ్యామలాం, సరలాం, సుస్మితాం, భూషితాం

ధరణీం, భరణీం, మాతరం వందేమాతరం

తరం కనుమరుగవుతోంది

 *ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వీడ్కోలు పలుకుతూ ఒక తరం కనుమరుగవుతోంది. అన్నం తినేముందు ఇతరుల ఆకలిని గుర్తించిన తరం. ఇరుకు ఇళ్లల్లో గొప్ప ప్రేమతో బ్రతికిన తరం. బాధ్యతల్ని ఎరిగిన తరం. 'నేను' అనకుండా 'మనం' అంటూ బతికిన తరం. డిగ్రీలు లేకున్నా, జీవితాన్ని చదివిన తరం. గడియారం లేకున్నా, సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం. ఇంటర్నెట్ చూడకుండా జ్ఞానాన్ని నింపుకున్న తరం. కాలిక్యులేటర్ లేకున్నా లెక్కలు చేయగలిగిన తరం. మొబైల్ ఫోన్ లు లేకున్నా స్నేహ సంభాషణలకు లోటు లేని తరం. TV లు లేకున్నా వినోదంగా కాలం గడిపిన తరం. GPS లు లేకున్నా గమ్యం ఖచ్చితంగా చేరగలిగిన తరం. సాంకేతికత లేకున్నా సుఖసంతోషాలతో బతికిన తరం. ACలు, కూలర్లు లేకున్నా

ఆరుబయట హాయిగా నిద్రించిన తరం. మినరల్ వాటర్ కు బదులు చెరువు/బావి నీళ్లు తాగి ఆరోగ్యంగా బతికిన తరం. పిజ్జాలు, బర్గర్లు కాకుండా పీచు మిఠాయిలు, పేలాలు తిని ఆనందంగా బ్రతికిన తరం. రాత్రిళ్ళు ఇంటి అరుగులపై హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా బ్రతికిన తరం. ఆరో ఏడు వచ్చే వరకు పిల్లల బాల్యాన్ని ఆటపాటలతో నింపిన తరం. ఆ తర్వాత పైసా ఫీజు లేని సర్కారు బడుల్లో తెలుగు మీడియంలో పిల్లలను చదివించి - అటు తెలుగు లోనూ, ఇటు ఇంగ్లీష్ లోనూ పండితులు అయ్యేలా పిల్లలను తీర్చిదిద్దిన తరం. కిలోమీటర్ల దూరాన్ని సైతం అవలీలగా నడవగలిగిన తరం. క్రమశిక్షణ తప్పిన పిల్లవాడికి స్కూల్ లో టీచర్ నాలుగు దెబ్బలు వడ్డిస్తే - వాడికి మరో పది దెబ్బలు ఇంట్లో వడ్డించిన తరం. వీధి నాటకాలను, తోలు బొమ్మలాటలను, బుర్రకధలను ఆస్వాదించిన తరం. సెన్సార్ అవసరం లేని సందేశాత్మక నలుపు-తెలుపు సినిమాలు చూసిన తరం. ఇంటిముంగిటిని ముగ్గులతో అలంకరించిన తరం. పనిమనుషులతో, యోగాలతో, జిమ్ లతో పని లేకుండా, బండెడు చాకిరీ చేసుకుంటూ, చెమటను చిందించి వందేళ్లు బతికిన తరం. బంధాలకు, బంధుత్వాలకు విలువనిచ్చిన తరం. ఆస్తులకన్నా, ఆప్యాయతలకు, అనుబంధాలకు ప్రాముఖ్యతనిచ్చిన తరం. ఉమ్మడికుటుంబాలుగా ఆనందంగా జీవించిన తరం. భేదాభిప్రాయాలున్నా అందర్నీ కలుపుకుని వెళ్ళగలిగిన తరం. వ్యాపారంలో కల్తీకి చోటివ్వని తరం. ఇతరుల మేలు కోరుకున్న తరం. నీతి నిజాయితీలతో మోసాలు చెయ్యకుండా బతికిన తరం. రాళ్లు తిన్నా అరిగించుకోగలిగిన తరం. కార్పొరేట్ హాస్పిటల్స్ లేకున్నా ఆరోగ్యంగా జీవించిన తరం. హార్ట్ ఎటాక్, క్యాన్సర్ ల గురించి తెలియని తరం. బీపీలు, షుగర్ లను దరిచేరనీయని తరం. లాంతర్లతో జీవితంలో వెలుగులు నింపుకున్న తరం. కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొన్న తరం. ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలనే దురాశ లేకుండా ఆనందంగా జీవించిన తరం. ఆడంబరాలకు దూరంగా ఉన్న తరం. పోస్ట్ కార్డులపై సంభాషణలు జరిపిన తరం. త్యాగాలతో పిల్లల భవిష్యత్ కు పునాదులు వేసిన తరం. కులమతాలకు అతీతంగా సోదరభావంతో బతికిన తరం. అలాంటి తరంలోని అపురూపమైన వ్యక్తులు నేడు ఒక్కొక్కరుగా మనల్ని విడిచి వెళ్లిపోతున్నారు. వారిని కోల్పోతుంటే సర్వం కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది. వెళ్లిపోతున్న ఆ తరం వాళ్ల నుండి ఈ తరం ఏమీ నేర్చుకోకపోతే - భవిష్యత్తు అంధకారమే!

ఆలోచించండి!!!!

*Plz share it to all ur friends*

Spread lots of love, positivity and smiles today....

Tomorrow might be too late...!

✍🏻🚩 సర్వే జనాః సుఖినోభవంతు. 🚩

త్రిపుర' పౌర్ణమి విశిష్టత....

 *'త్రిపుర' పౌర్ణమి విశిష్టత.....* 


*కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైనది. ఇది అత్యంత మహి మాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనదే.. సోమవారాలు, రెండు ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అత్యంత ప్రభావంతమైనవి. నెలరోజులూ చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం ఒక్కటీ ఒక ఎత్తు.*


*అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు వివరిస్తున్నాయి. పౌర్ణమిరోజున దీపారాధనకు విశేష ప్రాముఖ్యముంది. శివ, విష్ణు దేవాలయాల్లో రెండింటా దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీదా, ధ్వజస్తంభం ఎదుట, తులసికోట దగ్గర, దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో, ఉసిరికాయలపై బియ్యప్పిండితో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను చక్కగా కుంకుమ, పూలతో అలంకరించుకొని* *వెలిగించాలి. శివాలయంలో ధ్వజస్తంభంపై నందాదీపంతో పేరుతో అఖండదీపాన్ని, ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో భరిణల్లో (కుండలు, లోహపాత్రలతో తయారుచేసి) వేలాడదీస్తారు. అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులు, నదులు వంటి జల వనరుల్లో విడిచి పెడతారు. ఇలా చేయడం వల్ల అప్లైశ్వర్యాలు కలగడంతో పాటు ఎంతో పుణ్యం వస్తుంది.*


*వైజ్ఞానికపరంగా ఆలోచిస్తే ఈ కార్తీక దీపాల వెలుగుల నుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలోని కాలుష్యం తగ్గిపోయి వాతావరణం శుద్ది అవుతుంది. ఫలితంగా ఆరోగ్యం చేకూరుతుంది. కార్తీక పౌర్ణమి నుంచి ఆచరించే వ్రతాల్లో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగి స్తుంది. భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం అని దీనికి పేరు. ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది. పాండ్యుడు, కుముద్వతి దంపతులు సంతానార్ధం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు. వారు చేసిన ఆరాధనలోని చిన్న లోపం వల్ల వరం ఇవ్వదలచుకోలేదట శివుడు. అందుకే 'అల్పాయుష్కుడు, అతి మేధావి అయిన కొడుకు కావాలా... పూర్ణాయుష్కురాలు, విధవ అయిన కుమార్తె కావాలా?' అని అడిగితే... కుమారుణ్ణి కోరుకున్నారా దంపతులు. శివుడి వరం తోటి ఆ దంపతులకి కుమారుడు పుట్టాడు. అయితే ఆ కుమారుడు పెరుగుతున్న కొలదీ ఆ తల్లిదండ్రుల్లో గుబులు పెరుగుతోంది. ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్తుపై వారి దృష్టి పడింది. ఆమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి, శక్తి కలదని విన్నారా దంపతులు. ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశాడు. వివాహమైన కొన్నాళ్లకే భర్తకోసం యమభటులు వచ్చేసరికి అసలు విషయం తెలిసింది ఆ సాధ్వికి, తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుడ్ని ప్రార్దించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం.*


*ఈ పౌర్ణమికి త్రిపుర పూర్ణిమ అని మరోపేరు. తారకాసురుడి ముగ్గురు కుమారులూ బ్రహ్మను మెప్పించి, ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు నగరాలను వరంగా పొందారు. అలాగే ఎవరివల్లా మరణం లేకుండా వరం కోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథంకాని రథంపై, విల్లుకాని విల్లుతో, నారికాని నారి సారించి, బాణం కాని బాణం సంధించి, మూడు నగరాలూ ఒకే సరళరేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురునీ ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు, ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు. ఆ వర బలంతో లోకాలన్నింటా కల్లోలం సృష్టించారు. వివిధ లోకవాసులు విసిగిపోయి బ్రహ్మకు మొరపెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేను... మీరు విష్ణువు దగ్గరకు వెళ్ళండి అని చెప్పాడు. విష్ణువు కూడా తనకా శక్తిలేదని, వారిని వెంటబెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్లాడు. దేవతలందరూ సహకరిస్తే తానీపని చేయగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లుకాని విల్లుగా, ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా, శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను సంహరించాడని, అందువల్ల కార్తీక పౌర్ణమికి ఈ పేరు వచ్చిందని పురాణ కథనం.*


*కార్తీక పౌర్ణమిరోజు చేసే స్నానం, దీపారాధన, ఉపవాసం వంటి అన్నింటిలోనూ ఆరోగ్య, ఆధ్యాత్మిక భావనలు అంతర్లీనంగా ఉన్నాయి. ఈ మాసమంతా సూర్యోదయానికి ముందే తలస్నానం చేయడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది. ప్రస్తుతకాలంలో ఉద్యోగాల బిజీలో కానీ ఇతర ఏ కారణం చేతనైనా రోజూ దేవుడ్ని పూజించి దీపారాధన చేసే సమయం లేని వారు, నిష్ఠను ఆచరించలేని వారు కార్తీక పౌర్ణమినాడు ఆచరిస్తే చాలు... నెలంతా పూజ చేసిన ఫలితం కలుగుతుంది. ఈ రోజున స్త్రీల కొరకు ప్రత్యేకంగా ఉపవాసం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పగలంతా ఉపవాసం ఉండి, రాత్రి దీపారాధన చేసి, చలిమిడిని చంద్రుడికి నివేదించి ఫలహారంగా స్వీకరించాలి. ఇలా చేయడం వల్ల కడుపు చలువ అంటే బిడ్డలకు రక్ష కలుగుతుందని పెద్దలంటారు. ఆరోగ్యపరంగా చూస్తే ఇలా చేయడం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరవని ఆయుర్వేద శాస్త్ర కథనం. ఈ రోజు మరో ప్రత్యేకత ఏంటంటే... శివాలయాల్లో జరిపే జ్వాలాతోరణం. కార్తీకపౌర్ణ మిరోజు శివుడు త్రిపురాసురులను సంహరించి ఇంటికి వస్తాడు. విజయంతో తిరిగి వచ్చిన పరమశివుడికి దిష్టి తగలకుండా ఉండటం కోసం పార్వతీదేవి జ్వాలాతోరణోత్సవం నిర్వహించిందట. అదే పద్ధతిలో ఈ రోజున శివాలయాల్లో జ్వాలాతోరణోత్సవాన్ని జరుపుతుంటారు. కార్తీకపౌర్ణమి రోజున శివాలయానికి వెళ్లి దీపారాధన చేసి ఈ జ్వాలా తోరణోత్సవాన్ని చూడటం వల్ల సమస్త దోషాలు నశించి సకల శుభాలు చేకూరతాయట. ఇంకా ప్రాంతీయ, ఆచార వ్యవహారాల భేదంతో అనేక వ్రతాలు, పూజలు, నోములు చేస్తారీ రోజు. వాటిలో వృషవ్రతం, మహీఫలవ్రతం, నానాఫలవ్రతం, సౌభాగ్యవ్రతం, మనోరథ పూర్ణిమావ్రతం, కృత్తికావ్రతం వంటివి ముఖ్యమైనవి. వీటితోపాటు లక్షబిల్వార్చన, లక్షప్రద క్షిణ, లక్షవత్తులు, లక్షరుద్రం వంటి పూజలు చేస్తారు.*


*ప్రత్యేకతలు*


*దైవదర్శనం, దీపారాధన, దీపదానం, సాలగ్రామదానం, దీపోత్సవ నిర్వహణ ఈ రోజు విశేష శుభ ఫలితాలను అను గ్రహిస్తాయని కార్తీక పురాణంలో ఉంది. ఎవరి శక్తి సామర్ధ్యాలను బట్టి హరిహరులను సేవించి వారి కరుణా కటాక్షాలు పొందాలి. వీరిని ఎంత నిష్ఠతో పూజిస్తే అంత శుభఫలితాలు ఉంటాయి.*


*┈┉━❀꧁గురుభ్యోనమః꧂❀━┉┈*

నాటి_పాతాళ_లోకమే_నేటి_అమెరికా

 #నాటి_పాతాళ_లోకమే_నేటి_అమెరికా..... 


పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ గారు మొదలైన అనేక మంది పండితుల అభిప్రాయం. భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఉంది. భారత దేశంలో నిల్చున్నవారి పాదాల క్రింద ఉన్నది కావున దానికి పాతాళంగా వ్యవహరించారు. 


👉 సగర చక్రవర్తి పుత్రులు 60,000 మంది అశ్వమేధ యాగం కోసం విడువబడిన అశ్వం కోసం భూమిని వజ్రం వంటి తమ గోర్లతో చీల్చి పాతాళానికి చేరుకుంటారు. అక్కడ ధ్యానంలో ఉన్న కపిల మహర్షిని చూసి, ఆయనే దొంగిలించాడని ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళగా, ఆయన వారిని భస్మం చేస్తారు. 


👉 ఆ కపిల మహర్షి తపస్సు చేసుకున్న ఆ ప్రదేశం ఆయన పేరున కపిలారణ్యంగా ప్రసిద్ధికెక్కిందని, అదే ఈనాటి కాలిఫోర్నియా (శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు 1935 లో ఒక ఉప న్యాసంలో చెప్పారు.) 


👉 కాలిఫోర్నియాకు దగ్గరలో ఉన్న ఆష్‌ల్యాండ్ (Ashland)  (సగర పుత్రులు బూడిద కుప్పలు గా  మారిన ప్రదేశం) 


👉 హార్స్‌ల్యాండ్ (Horse land) (యాగాశ్వం కట్టిన ప్రదేశం) అనే ప్రదేశాలకు సరిగ్గా వ్యతిరేక దిశలో గంగా నది ఉద్భవించిన గంగోత్రి హిమనీ నదం (Gangotri Glacier) ఉంది, ఈ రెండు ప్రదేశాలు కూడా సరళ రేఖలో 30 డిగ్రీల అక్షాంశం (Latitude) మీద ఉన్నాయి. 


👉 వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి తోలి, ఆయన నివాసం కోసం ఇచ్చిన ప్రదేశం కూడా కాలిఫోర్నియానే. దీని పురాతన నామం మహాబలి భూమి, ఇప్పుడది మలిబు(Malibu) అనే పేరుగా రూపాంతరం చెందింది. 


👉 ఈ మలిబు నగరంకు దగ్గరలోనే శాంటా మోనికా పర్వతం ఉంది. దీనికి లాస్ ఏంజిల్స్ చాలా దగ్గరి ప్రదేశం. 


👉 బలిచక్రవర్తిని శ్రీ మహా విష్ణువు పాతాళానికి అధిపతిగా నియమించాడు. తన రాజ్యంలో సుఖసంపదలు ఉండాలని బలి వరం కోరుకున్నాడు. అందుకే ఈనాడు అమెరికా అంత సంపదతో తులతూగుతోంది. 


👉 పాతాళ లోకం భారతదేశ పాదాల క్రింద ఉంది, అక్కడికి వెళ్ళాలంటే 50,000 యోజనాలు లోతుగా భూమిలోకి వెళ్ళాలి. భారతదేశం నుంచి భూమిలోకి నిలువుగా సొరంగం తవ్వితే మనం మళ్ళీ అమెరికా ఖండానికే చేరుకుంటాము. 


👉 రాముడి ఆజ్ఞ మీద హనుమంతుల వారి పుత్రుడైన మకరధ్వజుని పాతాళానికి అధిపతిని చేస్తాడు. ఇప్పటికీ మకరధ్వజుల వారిని మధ్య అమెరికా, దక్షిణ అమెరికాల్లో పూజిస్తారు. మధ్య అమెరికా, హోండురస్‌ (Honduras)లో ఉన్న La Ciudad Blanca నగరాన్ని Lost City of the Monkey God గా వ్యవహరిస్తారు. అక్కడి స్థానికులు కోతి ఆకారం కలిగిన భారీ మూర్తులను ఆరాధించేవారు. దాని ముందు స్థానిక జాతులు బలులు కూడా అర్పించేవారు (Theodore Morde అనే అమెరికన్ సాహసికుడు 1939 లో వెల్లడించారు.) 


👉 “సురాసురాణం అన్యోన్యం దివా రాత్రా విపర్యాయ" అనగా సూర్య సిద్ధాంతం ప్రకారం సురాసురులకు ఒకరికి రాత్రయితే మరొకరికి పగలు. 


👉 భూమినుండి 50000 యోజనాల దూరంలో పాతాళం ఉన్నది. ఇప్పటికీ అమెరికాలో సంకల్పం చెప్పు కున్నప్పుడు కపిలారణ్యే అని చదువుకుంటాం. మన భూగోళ అడ్డకొలత (diameter) ఇప్పుడు మనం లెక్క వేస్తె సరిగ్గా లెక్క సరిపోతుంది. 


👉 అమెరికాలో వెలుగు చూసిన ఎన్నో పురాతన శివాలయాలు, నారసింహ చిత్తరువులు, Oregon లో ఒక పెద్ద సరస్సులో ప్రపంచంలో అతి పెద్ద శ్రీచక్ర యంత్రం బయలు పడడం ఇవన్నీ కూడా మన వాంగ్మయంలో చెబుతున్న చరిత్రకు ఆధారాలు చూపుతున్నవే. 


👉  మూల అమెరికన్లు (రెడ్ ఇండియన్లు) విగ్రహారాధన చేస్తారు. ఇప్పటికీ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అని వారు పూజించిన విగ్రహాలు చూపుతారు. మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు మునిమనవడు అయిన జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తే దాన్ని ఆపడానికి ఆస్తీక మహర్షి వస్తాడు. అతడి అభ్యర్ధన మేరకు ఆ యాగం ఆపబడు తుంది. అక్కడ మిగిలిన నాగులను వారి వంశస్థులను తీసుకుని ఆస్తీక మహర్షి పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇది ఎంత సత్యమో నేడు మెక్సికన్లను అజ్తెక్స్ (ఆస్తీకులు) అని పిలవడాన్ని బట్టి తెలుస్తుంది. Azteks నేటికి కూడా మనలాగే విగ్రహారాధన చేస్తారు. మన ధర్మంలో ఒకప్పుడు విలసిల్లిన వామాచార ఛాయలు ఎన్నో కనబడతాయి. వారు కూడా కొన్ని పూజలు చేస్తారు. ఒక్టావియా పాజ్ అనే నోబెల్ గ్రహీత, ఒకప్పటి భారత దేశంలో మెక్సికన్ రాయబారి తన పుస్తకం The light of India లో విపులంగా చర్చించాడు. aztec మరియు మాయా సంస్కృతులు వాటికి హిందూ సంస్కృతికి ఎంత దగ్గర సంబంధం ఉన్నదో చెబుతాడు. వారు మరింత వామాచార పద్ధతులలో జంతుబలులు కూడా చేసేవారు. వారి పుస్తకాలలో మన ఆస్తీక మహర్షి వృత్తాంతం ఉన్నది. 


👉 వారి మాయన్ క్యాలెండర్ కూడా 3114BC నుండి మొదలు అవుతుంది. ఇంచు మించు మనం మహాభారత యుద్ధానంతరం సమయం సరిగ్గా సరి పోతుంది. వారి సృష్టి సిద్ధాంతం కూడా మన సిద్ధాంతంతో పూర్తిగా ఏకీభవిస్తుంది. వారి వేదాన్ని పూపుల్ వుహ్ అంటారు. వారి పండగలు కూడా మన దసరా, దీపావళి, ఉగాది, చక్రపూజ మన సంస్కృతిలాగే అనిపిస్తాయి. వారుకూడా అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటారు. వారికి కూడా చాతుర్వర్ణ వ్యవస్థ వున్నది. వీటి అన్నింటి ఆధారంగా మరిన్ని పరిశోధన జరిగి మన వాంగ్మయ సత్యాలను ప్రపంచానికి తెలియజెయ్య వలసిన అవసరం ఉంది.


ఒకసారి నడిచే దేవుడు కంచి పరమాచార్య వారు మూల అమెరికన్ల మంత్రాలకు మన మంత్రాలకు ఉన్న సంబంధం వివరించారు. ఒకప్పుడు ఈ లోకాలన్నింటిలో ఒకే ధర్మం విలసిల్లేది. 


అక్కడివారి వద్ద తాళం కనబడుతోంది. కేవలం హిందూ ధర్మంలో ఆ తాళం, దాని చిక్కుముడి విప్పే తాళంచెవి కూడా ఉన్నాయి అని పరమాచార్యులు అన్నారు. 


♦️♦️♦️♦️♦️♦️♦️