*గోసేవకు వరం*
➖➖➖✍️
```
ఒకసారి అర్జునుడు, శ్రీ కృష్ణుడు ఒక వృద్ధ విధవరాలి ఇంటికి అతిథులుగా వెళ్లారు. ఆ వృద్ధ విధవరాలు శ్రీకృష్ణునికి పరమ భక్తురాలు కూడ. ఆమె నిత్యం కన్నయ్యను స్మరిస్తూ తన జీవితాన్ని గడుపుతోంది. ఆమెకు నా అన్నవాళ్లు ఎవరూ లేరు. సమాజ సేవ చేసుకుంటు ఈ లోకం లో
ఆ భక్తురాలు ఉండేది ఒక పూరి గుడిసెలో..! ఆమె వద్ద ఒక ఆవు ఉండేది. ఆమె ఆ గోమాత ప్రసాదించిన పాలను గ్రామ వాసులకు దానం ఇచ్చి కాస్తో కూస్తో పుణ్యం సంపాదించేది. ఆమె తన జీవనాధారమైన ఆవును బాగా చూసుకునేది.
ఆ పుణ్య ప్రభావంతోనే, తాను ఎంతగానో అభిమానించే కన్నయ్య తన ఇంటికి రావడం చూసి, ఎంతగానో సంతోషపడింది.
కన్నయతో పాటు ధర్మశ్రేష్ఠుడైన దనుర్థారి అయిన పార్థుడు కూడా అతని వెంట రావడం చూసి ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
ఆ రోజు వచ్చిన అతిథి దేవునితో సమానం అంటారు. అలాంటిది ఏకంగా దేవాది దేవుడే అతిథిగా వచ్చాడు. కనుక అమె సంతోషం అధికమై ఆమె తన ఆవు ఇచ్చిన పాలు ఇతరుల పిల్లల కు ఇవ్వగా వచ్చిన ఆహార పదార్థాలను అన్నిటినీ ఆరోజు కృష్ణార్జునులకు నివేదించింది.
శ్రీకృష్ణుడు ఆమె ఆతిథ్యానికి, అలాగే ఆమె నిష్కల్మషమైన భక్తికి మెచ్చాడు. అలా కొద్దిసేపు ఆమెతో మాట్లాడిన తరువాత ఆ నర నారాయణులు వెళ్లిపోయారు.
బయటికి వచ్చిన పిమ్మట అర్జునుడు మాధవునితో ఇలా అన్నాడు...
“మాధవా..! మీరు ఆమె భక్తికి మెచ్చారు కదా మరి ఆమెకు ఒక వరాన్ని ఎందుకు ఇవ్వలేదు?"
దీనికి సమాధానంగా గోపాలుడు చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నాడు- “అర్జునా నాభక్తులెవరూ అయాచిత ధనాన్ని కలలో కూడ ఆశించరు. ధనం ఐతే నేను ఆమెకు ఎప్పుడో ఇచ్చేవాడినే. కాని ఆమె ఏ రోజూ నన్ను అడగలేదు. ఇచ్చినా తీసుకోదు కూడ. ఎందుకంటే అది మితి మీరీన ప్రాణ హాని కూడ అనీ విజ్ఞులకు విధితమే, నన్ను ప్రేమించే తనకు ఆ ఆవుకు కామధేనువు వరాన్ని ప్రసాదించాను. ఆ గోవు అక్షయ పాత్రలా క్షీరం లేదనక కాదనక ఎప్పుడూ ప్రసాదిస్తుంది. దాని గోష్ణాన్నీ తాగిన ఆ వూరి పిల్లలంతా మహా బలవంతులౌతున్నారు. వారిని కన్నవారు చాల సంతోషపడి, అలా అందరి ఆశీస్సులు ఆమెకు అందేవి. అది చాలాదా,అర్జునా మానవజన్మకు.
సంభ్రమాశ్చర్యాలకు లోనైన పార్ధుడు తిరిగి కన్నయ్యతో “మాధవా! గోవు కామధేనువు ఎలా ఔతుంది?” అని అన్నాడు.
మళ్లీ కృష్ణయ్య నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చారు...
“కౌంతేయా..! నీవు నన్ను అర్థం చేసుకోలేదు. ఆమె ఆవు[నా] గురించే ఎక్కువగా ఆలోచించి చేసే సేవ నా ఒక్కడికే చెందదు. ముక్కోటి దేవతలకు ఈ సేవ గోవు ద్వారా ఆమెకు సమకూరుతుంది. ఆవును ఎలా పోషించాలి, ఆవుకు మేత ఎలా సేకరించాలి, ఆవు శుచిగా, శుభ్రంగా ఉండటానికి ఎలా నీటితో స్నానం చేయించాలి....ఇలా పలు విధాలుగా ఎక్కువ సమయం ఆ గోవు గురించే ఆలోచించడం వలన, నన్ను పదే పదే స్మరించడ మవుతుందనేది నీకు తెలుసు కదా అర్జునా”
అదే ఆ ఆవును కామధేనువు చేస్తే మేపే పనే వుండదు. ఆ పనే గనుక లేకపోతే, ఆ భక్తురాలు రోజంతా నన్ను సేవిస్తూ, స్మరిస్తూ నా గురించి ఇతరులకు చెబుతూనే పాలను దానం చేస్తూనే వుంటుంది కదా! ఆ పుణ్యకర్మ తోనే తుది సమయం వచ్చినప్పుడు నేను తనని [ఇహలోకం] భూమి నుంచి దాటి నా లోకము [పరలోకం ]తీసుకు వెళ్ళిపోతాను. నా శాశ్విత సేవలో తరించి తన జన్మను ధన్యం చేసుకుంటుంది. ఈ జన్మాంతరం తాను తప్పక నా లోకాన్ని చేరుకుంటుంది.”
వాసుదేవుని మాటలు విన్న పార్థుడు ఎంతగానో సంతోషించాడు.
చూశారా మనకు ఎన్నో కష్టాలు వస్తుంటాయి. ఆ కష్టాలు అనేవి భగవంతుడు పెట్టే పరీక్ష వంటిది.. కష్టాలు నశించిన పిమ్మట మనకు తప్పక ఆనందం లభిస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా కృష్ణయ్య లీలలోని భాగమేనని సర్దుకుపోవాలి..
ఆ తర్వాత అంతా ఆ పరమాత్ముడే చూసుకుంటాడు.✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
ఇలాంటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏


