14, ఆగస్టు 2023, సోమవారం

పంచాంగం 14.08.2023 Monday,

 ఈ రోజు పంచాంగం 14.08.2023 Monday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు అధిక శ్రావణ మాస కృష్ణ  పక్ష: త్రయోదశి తిధి ఇందు వాసర: పునర్వసు నక్షత్రం సిద్ది యోగ: వణిజ తదుపరి భద్ర కరణం ఇది ఈరోజు పంచాంగం. 


త్రయోదశి పగలు 10:28 వరకు.

పునర్వసు పగలు 11:07 వరకు.

సూర్యోదయం : 06:02

సూర్యాస్తమయం : 06:39

వర్జ్యం : రాత్రి 08:04 నుండి 09:51 వరకు.

దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12:48 నుండి 01:36 వరకు తిరిగి మధ్యాహ్నం 03:17 నుండి 04:08 వరకు. 


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.


యమగండం : మధ్యాహ్నం 10:30 నుండి 12:00 వరకు.  

 


శుభోదయ:, నమస్కార:

విద్యుత్‌ చార్జీల విశ్లేషణ*

 *విద్యుత్‌ చార్జీల విశ్లేషణ*


 *01. ఫిక్స్డ్ చార్జీలు*

*02. కస్టమర్ చార్జీలు*

*03. విద్యుత్ డ్యూటీ* 

*04. ట్రూఅప్ చార్జీలు (11/36)* 

*05. ఇందన సర్దుబాటు (FPPCA charges) చార్జీలు  (5/2021)*

*06. ఇందన సర్దుబాటు (FPPCA charges)  చార్జీలు  (4/2023)* 


*1.  ఫిక్స్ డ్  చార్జీలు*:  మన ఇంటికి కరెంటు రావటానికి  లైన్లు, సబ్‌ స్టేషన్లు , ట్రాన్స్‌ ఫార్మర్లు వగైరా వేయాలి.  వాటికి చేసిన ఖర్చును వసూలు చేయడాన్ని ఫిక్స్‌డ్‌ చార్జీలు అంటారు.  మన ఇంటికి కనెక్షన్‌ తీసుకునేటప్పుడు 2 కేవీ, 4 కేవి, 5 కేవి  అలా మన అవసరాన్ని బట్టి తీసుకుంటాము. ఒక కేవి కి రు.10లు చొప్పున ఎన్ని కేవీ లోడు ఉంటే అన్ని 10లు వసూలు చేస్తున్నారు. ఇవి ఎల్లప్పుడూ కొనసాగుతాయి.  కరెంటు లైన్లు వేసి ఎప్పుడో 30 ఏళ్లకు పైగా అయిన ప్రాంతాలలో కూడా ఇప్పుడు ఈ చార్జీలు  వసూలు చేస్తున్నారు. 


*2. కస్టమర్‌ చార్జీలు*:  మన ఇంటికి కరెంటు సప్లై చేసినందుకు వేసే చార్జీలు. ఇవి  మనం నెలలో వాడుకునే యూనిట్ల శ్లాబును బట్టి రు25,రు.30,రు.45,రు.50,రు.55లు గా ఉన్నది.


*3.  విద్యుత్ డ్యూటీ* : మనం విద్యుత్‌ వాడుకున్నందుకు  ప్రభుత్వానికి కట్టే పన్ను. ఇది యూనిట్‌ కు  6 పైసలు వసూలు చేస్తున్నారు. షాపులకు అయితే యూనిట్‌కు 1 రూపాయి వసూలు చేస్తున్నారు.    


*4. ట్రూ అప్‌ చార్జీలు*:  2014 నుండి 2019 వరకు వాడిన విద్యుత్‌ పై రు.3,013 కోట్ల రూపాయలు ప్రజలనుండి 36 నెలలో వసూలు చేయబోతున్నారు. అవే మనకు బిల్లులో  True-Up Charges (11/36) పేరుతో ఉన్నాయి. ఆనాడు అంటే 2014 నుండి 2019 వరకు మనం వాడిన యూనిట్లకు యూనిట్‌ కు 0.22 పైసల చొప్పున వసూలు చేస్తున్నారు.   వీటిని ఆగస్టు 2022 నుండి జులై 2025 వరకు వసూలు చేస్తారు.  ఆతర్వాత 2019 నుండి 2021 వరకు వసూలు చేస్తారు.


*5. ఇంధన సర్దుబాటు చార్జీలు (FPPCA charges)* :  2021-2022 ఆర్థిక సంవత్సరానికి వాడిన కరెంటుకు ఇప్పుడు వసూలు చేస్తున్నారు.  అవే మనకు ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో (FPPCA charges (5/2021))  బిల్లులో ఉన్నాయి. ఆనాడు మనం వాడిన కరెంటుకు యూనిట్‌కు ఏప్రిల్‌ నుండి జూన్‌ వరకు 0.20 పైసలు చొప్పున వసూలు చేస్తున్నారు. జులైనుండి సెప్టెంబరు వరకు యూనిట్‌కు 0.63 పైసలు, అక్టోబర్‌ నుండి డిశంబరు వరకు యూనిట్‌కు 0.57 పైసలు, జనవరి నుండి మార్చివరకు యూనిట్‌కు 0.66 పైసలు చొప్పున వసూలు చేస్తారు.  ఈ వసూళ్ళు అయిన అనంతరం   2022-2023 ఆర్థిక సంవత్సరానికి తర్వాత వసూలు చేస్తారు.  


*6. ఇంధన సర్దుబాటు చార్జీలు (FPPCA charges)* :  ప్రస్తుత ఆర్థిక సంవత్సం అంటే 2023-2024 లో వాడిన కరెంటుకు ఇప్పుడు వసూలు చేస్తున్నారు. అవే మనకు ఇంధన సర్దుబాటు చార్జీలు (FPPCA charges (4/2023 )) పేరుతో బిల్లులో ఉన్నాయి. ఇవి ఇక మీదట ప్రతి నెలా కొన సాగుతాయి.

⚜ శ్రీ మంగళగౌరి దేవి ఆలయం

 🕉 మన గుడి : 


⚜ బీహార్ : గయ






⚜ శ్రీ మంగళగౌరి దేవి ఆలయం


💠 శ్రీ మాంగల్య గౌరీ/మంగళ గౌరీ/సప్త మోక్షపురి/ పంచ గయా క్షేత్రం బీహార్‌లోని గయలో మంగళగౌరి కొండలు మరియు ఫల్గుణి నది ఒడ్డున ఉన్న 51 శక్తి పీఠాల్లో ఒకటి.  

15వ శతాబ్దంలో నిర్మించిన శ్రీ ఆదిశక్తి దేవి యొక్క పురాతన దేవాలయాలలో ఇది ఒకటి.


💠 భారతదేశంలోని బీహార్‌లోని గయాలోని మంగళ గౌరీ ఆలయం పద్మ పురాణం, వాయు పురాణం మరియు అగ్ని పురాణం మరియు ఇతర గ్రంథాలు మరియు తాంత్రిక రచనలలో ప్రస్తావించబడింది. 

మంగళగౌరిని ఉపకార దేవతగా పూజిస్తారు. 

ఈ ఆలయం ఉప-శక్తి పీఠాన్ని కలిగి ఉంది


💠 దక్షప్రజాపతి నిర్వహించిన ఒక మహా యజ్ఞంలో సతీదేవి తన ప్రాణాలను  అగ్నిలో అర్పించవలసి వచ్చింది.  

ఈ విపత్కర సంఘటన దేవతల్లో వణుకు పుట్టించింది.  

సహించలేని పరమశివుడు శ్రీ సతీదేవి యొక్క నిర్జీవ దేహాన్ని మోసుకొని అనేక సంవత్సరాలు భూమిపై సంచరించాడు.  

విశ్వాన్ని రక్షించడానికి త్రిమూర్తుల విధులు విచ్ఛిన్నమయ్యాయి.  భయంకరమైన పరిణామాల గురించి దేవతలందరూ భయపడ్డారు మరియు విష్ణువును వేడుకున్నారు.  


💠 శివుని దుఃఖాన్ని పోగొట్టడానికి శ్రీ మహావిష్ణువు  సతీదేవి యొక్క నిర్జీవమైన శరీరాన్ని అనేక భాగాలుగా నరికివేసాడు.

 అలా ప్రతి భాగం భూమి యొక్క వివిధ భాగాలలో పడిపోయింది.  

శ్రీ సతీదేవి శరీరభాగాలు భూమిపై పడిన ప్రదేశాలను ‘శక్తి స్థల్/శక్తి పీఠం’గా కొలుస్తారు.


💠  శ్రీ సతీదేవి రొమ్ము భాగం భూమిపై పడిన ప్రదేశం శ్రీ మాంగల్య గౌరీ మందిరం.

మందిరంలో రెండు గుండ్రని రాళ్లు ఉన్నాయి, ఇవి సతీదేవి యొక్క రొమ్ములను సూచిస్తాయి.

ఇక్కడ శక్తి రొమ్ము రూపంలో పూజించబడుతుంది, ఇది పోషణకు చిహ్నం.  ఎవరైతే తన కోరికలు మరియు ప్రార్థనలతో  దుర్గ వద్దకు వస్తారో, వారు అన్ని కోరికలు తీరి విజయవంతంగా తిరిగి వస్తారని నమ్ముతారు.


💠 సతీదేవి మృతదేహంతో శివుడు కైలాసానికి తిరిగి వెళ్ళేటప్పుడు ఈ ప్రదేశం గుండా వెళ్ళాడు అంటారు.


💠 తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయం మంగళగౌరి కొండపై నిర్మించబడింది.

గుడికి చేరుకోవాలంటే ఆ చిన్న కొండ ఎక్కాలి. 

 మెట్ల మార్గం స్థానిక ప్రజల ఇళ్ల మధ్య ఉంటుంది.  మెట్ల మార్గం ప్రారంభంలో, భీముని ఆలయం ఉంది.  అతని మోకాలి ముద్రను మనం ఇక్కడ చూడవచ్చు.  

ఇక్కడ భీముడు శ్రాద్ధకర్మ చేసాడు, అందుకే దీనిని భీమవేది గయ అని పిలుస్తారు.


💠 కొండపై కూర్చున్న అమ్మవారిని దయగల దేవతగా భావిస్తారు. వర్షాకాలంలో ప్రతి మంగళవారం ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 

స్త్రీలు తమ కుటుంబాలు అభివృద్ధి చెందాలని మరియు వారి భర్తలు విజయం మరియు కీర్తిని పొందాలని ఉపవాసం ఉంటారు. 

 

💠 ఈ పూజలో మంగళ గౌరీ దేవికి 16 రకాల కంకణాలు, 7 రకాల పండ్లు, 5 రకాల మిఠాయిలు నైవేద్యంగా పెట్టడం మొదటి నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది.


💠 మంగళ గౌరీ ఆలయంలో శివుడు, దుర్గ, దక్షిణ-కాళి, మహిషాసుర మర్దిని మరియు సతీదేవి యొక్క వివిధ రూపాలను చూడవచ్చు. 


💠 ఈ ఆలయ వివరణ పద్మ పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం, శ్రీ దేవి భాగవత పురాణం మరియు మార్కండేయ పురాణాలలో కూడా ఉంది. 

ఈ ఆలయ సముదాయంలో మా కాళి, గణపతి, శివుడు మరియు హనుమంతుని ఆలయాలు కూడా ఉన్నాయి. 

నవరాత్రి మాసంలో లక్షలాది మంది భక్తులు మంగళ గౌరీ ఆలయానికి వస్తుంటారు.


💠 ఈ క్షేత్రం యొక్క ప్రసిద్ధ పండుగ 'నవరాత్రి', ఇది అక్టోబర్‌లో జరుగుతుంది. 

ఈ మందిరం  'మరణానంతర వేడుకలకు' (శ్రాద్ధము) ప్రసిద్ధి చెందింది.  'మహా-అష్టమి' (ఎనిమిదవ రోజు), భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు.


💠 ఈ ఆలయంలో జరుపుకునే మరో ముఖ్యమైన పండుగ మంగళ గౌరీ వ్రతం (వ్రతం), దీనిని మహిళలు తమ కోరికల నెరవేర్పు కోసం చేస్తారు. 

మంగళవారాలలో ఉపవాసం ఉండి, స్త్రీలు సంతోషకరమైన వైవాహిక జీవితం, పిల్లలు మరియు శ్రేయస్సు కోసం దేవతను ప్రార్థిస్తారు.


💠 కొత్తగా పెళ్లయిన ఆడవాళ్ళందరూ 5 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు మరియు ఇతర వివాహిత స్త్రీలందరూ శ్రావణ మాసంలో మాత్రమే వ్రతం చేస్తారు

ఈ పండుగలు కాకుండా, ఈ ఆలయం దీపావళి, హోలీ మరియు జన్మాష్టమి వంటి ఇతర ప్రధాన హిందూ పండుగలను కూడా గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు.


💠 ఆలయం ప్రతిరోజూ ఉదయం 05:00 నుండి రాత్రి 10:00 వరకు భక్తుల కోసం తెరిచి ఉంటుంది. 


💠 గయా రైల్వే జంక్షన్ ఆలయానికి 4 కిమీ  దూరం, బస్ స్టాండ్ ఆలయం నుండి 4.7 కిమీ దూరంలో ఉంది.

దేశ విభజన భయానక దినం

 ॐ 76 సంవత్సరాల స్వతంత్ర భారతం   


దేశ విభజన భయానక దినం


* ఈ రోజు ఈ విషయమై, 

    దీనితో భారత ప్రభుత్వం ప్రచురించిన 52 పుటల PDF జతచేయబడింది. 


1. దేశ విభజన గాయాలు గుర్తున్నాయా? 


అ) తూర్పు పశ్చిమ పాకీస్థాన్ ప్రాంతాలలో 

  - ఆనాడు అక్కడి హిందువులు, 

    తరతరాలుగా నివసిస్తున్న ప్రాంతాలను ఆస్తులను విడిచి, 

    మిగిలిన భారత భూభాగానికి ఎందుకు రావాల్సి వచ్చింది? 

  - తమ పూర్వులనుంచీ వస్తున్న సొంత భూభాగం మీద మక్కువ ఉండి, అక్కడే ఉండిపోయిన హిందువుల పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? 


ఆ) మానవ హక్కులను పూర్తిగా ఉల్లంఘించే ఆ విభజన 

   "ఒప్పందం" అవడానికి, "హక్కులు" "ఎవరికి" ఎలా సంక్రమించాయి? 


  - One time settlementలాగా, సమస్య పరిష్కారమవుతుంది అనుకుని, ఆ విభజన ఒప్పందం చేసికొని ఉంటే, 

     మిగిలిన భారత భూభాగం, హిందువులకు చెందాల్సి ఉండాలా? వద్దా? 


ఇ) లౌకిక (Secular) దేశం పేరుతో, 

    మత జనాభా ప్రాతిపదికన, 1947 విభజన వంటివి పునరావృతం కావని ఘంటాపథంగా ఎవరైనా చెప్పగలరా? 


ఈ)మతపరంగా చూసి, జాతిని విభజించడం సమంజసమేనా?  

    భారత దేశంలో, 

  - మహమ్మదీయుల దండయాత్రలూ, దురాక్రమణలతో ప్రవేశించిన మహమ్మదీయ మతమూ, 

  - ఆంగ్లేయులు వచ్చాక ప్రవేశించిన క్రైస్తవ మతమూ, 

    బలపడి, భారత జాతీయతకు పెనుమప్పుగా మారుతుంటే, 

    హిందూ జాతికి మనుగడ ఎక్కడుంటుంది? 


              భారత్ మాతాకీ జై 

                వందే మాతరమ్ 


                                   సశేషం


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

*ప్రాచీన భారతంలో మజ్జిగ వాడకం.*

 *ప్రాచీన భారతంలో మజ్జిగ వాడకం.*


*ఒకనాడు ప్రతి ఊరిలో ప్రతి ఇంటిలో లెక్కకు మించి ఆవులు, గేదెలు, పాలిచ్చే పశువులు ఎన్ని ఉన్నా ఇంటినిండా కుండలనిండా ఎంత పెరుగు ఉన్నా ఆనాటి కుటుంబసభ్యులు ఎవరూ ఆ పెరుగు వాడేవారు కాదు. ప్రతి రోజూ ఉదయాన్నే ఆ పెరుగును చిలికి పూర్తిగా వెన్న తీసి తగినన్ని మంచినీరు కలిపి పలుచని తీయని మజ్జిగ తయారు చేసుకొని ఆహరంలో ఉపయోగించేవారు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే.*


*కాని కమ్మని గడ్డ పెరుగును వదిలి పెట్టి పలుచని నీరు వంటి మజ్జిగను తాగడంలో ఉన్న ఆంతర్యము ఏమిటో మనకు తెలియదు. ఆ ఆంతర్యం గురించి తెలుసుకుందాం.*


*ఆధునిక భావ బానిస భారతంలో - పెరుగు వాడకం*


*ఈనాడు దాదాపు నూటికి 90% మంది ప్రజలు తమ ఆహారంలో మజ్జిగను పూర్తిగా మానేశారు. రోజూ రెండు పూటలా పెరుగును మాత్రమే వాడుతున్నారు. పెరుగును చిలికి వెన్న తీసి మజ్జిగను తయారు చేయడానికి కొంత సమయం వెచ్చించాలి. కాబట్టి ఆ విధంగా సమయం వృధా చేయకుండా అన్నములో పెరుగును కలుపుకొని తినడమే గొప్ప నాగరికత అని ఈనాడు అంతా మురిసిపోతున్నారు.* 


*అయితే పెరుగు ఆయుక్షీణం*. 


*ముఖ్యంగా రాత్రి సమయంలో అసలు వాడకూడదు. అలా వాడితే ఉదరంలో వాయువు ఎక్కువ అయ్యి అనేక వాతరోగాలు వస్తాయని ఆయుర్వేద మహర్షులు మనకు నిక్కచ్చిగా తేల్చి ఏనాడో చెప్పారు. అయినా రోజరోజుకు కష్టపడి పనిచేసే స్వభావం కోల్పోతూ, బద్ధకస్తులుగా మారుతున్న నేటి గృహిణులు మజ్జిగను తయారుచేసి వాడడం కన్నా పెరుగును వాడటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.*


*మజ్జిగ  5 రకాలు* 


*1. మధితము అనే మజ్జిగ: పేరుకొన్న పాలల్లో నీరు కలపకుండా చిలికి తయారు చేసిన మజ్జిగను మధిత మజ్జిగ అంటారు. ఇది చిక్కగా జిడ్డుగా ఉంటుంది. ఈ మజ్జిగను ఆహారంలో వాడుతూ ఉంటే నీరసం , ఉదర రోగాలు పైత్యము వల్ల కలిగిన వాతము నాలుకకు రుచి తెలియక పోవడం, మూత్రము ఆగిపోవడం, నీళ్ళ విరోచనాలు మొదలైనవి హరించి పోయి శరీరానికి మంచి బలం కలుగుతుంది. ఈ రకమైన మజ్జిగను గ్రీష్మ, శరత్, హేమంత, శిశిర బుుతువులలో సేవించి ఆరోగ్యం పొందవచ్చు.*


*2. మిళితమను మజ్జిగ : పెరుగు ఒక వంతు నీళ్లు మూడు వంతులు పోసి చిలికి తయారు చేసిన మజ్జిగ మిళిత మజ్జిగ అనబడుతుంది. ఇది శరీరంలో పైత్యాన్ని అరుచిని అతిసార విరోచనాన్ని రక్తంలో చేరిన వాతాన్ని ఇంకా అనేక రోగాలను పోగొడుతుంది. ఈ మజ్జిగ అన్ని కాలాలలో తీసుకోవచ్చు శ్రేష్ఠమైనది.*


*3. గోళము అను మజ్జిగ : ఒకవంతు పెరుగు ఒకటిన్నర వంతు నీళ్లు కలిపి తయారు చేసినది. ఈ విధమైన మజ్జిగ వాడుతుంటే శరీరానికి మంచి కాంతి వస్తుంది. కంటికి మంచి మేలు చేస్తుంది. ఉదరములో మందాగ్ని విష దోషాలు మేహము ప్రమేహము కఫరోగము ఆమరోగము పోగొడుతుంది. ఈ రకమైన మజ్జిగ గ్రీష్మ, వర్ష బుుతువులయందు తీసుకోవాలి.*


*4. షాడభము అను మజ్జిగ : ఒకవంతు పెరుగు అయిదువంతుల నీళ్ళు కలిపి తయారుచేసింది . ఇది శ్లేష్మరోగాలను , గుల్మరోగాలను, రక్తమూలవ్యాధిని పోగొడుతుంది. తేలికగా ఉండి ఉదరములో జఠరాగ్నిని పెంచి శరీరానికి కాంతి ఇస్తుంది.*


*5. కాలశేయము అను మజ్జిగ: ఒకవంతు పెరుగు రెండువంతుల నీళ్ళు కలిపి తయారు చేసింది. ఈ మజ్జిగ బంక విరోచనాలు, విషములను, ఉబ్బులను, మంటను, వాతమును, మూలవ్యాధిని పోగొట్టి శరీరం త్వరగా ముడతలు పడకుండా కాపాడుతుంది. ఇప్పటికే పడిన ముడతలను కూడా తీసి వేస్తుంది.*

రామాయణమ్ 290

 రామాయణమ్ 290

...

సీతమ్మ మాటలు విని శిరస్సుపై అంజలి ఘటించి వినయముగా ఆంజనేయుడు ఆమెతో  ఇట్లనెను.

.

తల్లీ నీవిచ్చట ఉన్నట్లు  రాముడు ఎరుగడు!  రామునికి నీ సమాచారం  తెలిసిన వెంటనే సమస్త వానర గణములు ,భల్లూక సైన్యములు వెంటపెట్టుకొని ఇచ్చటకు రాగలడు.

.

రాముని మార్గమునకు, ఆయన శత్రు నాశమునకు అడ్డు ఏది? సముద్రమును క్షోభింపచేసి మరీ దాటగలడమ్మా!

.

నీవు లేక నిముసముకూడా నిదురించుటకు లేదు తల్లీ రామచంద్రుడు.వంటి మీద తేళ్లు,జర్రులు పాకినా ఈగలు ముసిరినా  వాటి స్పృహ ఏమాత్రము లేకుండా అనుక్షణమూ నీ నామ స్మరణము లోనే ఆయన కాలము వెళ్ళబుచ్చుతున్నాడు తల్లీ!

.

ఆయనకు

ఏదో ఆలోచన

ఎడతెగని మథన

.

ఆయన

ఎదలో నీవే

ఆయనఎదుటా నీవే

సమస్తప్రకృతిలో నీవే

అంతెందుకు?

ఆయన ఎటుచూసినా 

అటు నీవే కనపడుతున్నావమ్మా!

.

విరిసిన మొగ్గచూసినా

కురిసే వానచూసినా

మురిసే నాసీత నా చెంత లేదే?

ఇదే ఆయన చింత!

.

ఆ రాకుమారుడురాముడు నీవే లోకముగా బ్రతుకు తున్నాడమ్మా!

.

రాముని బాధ తన బాధ ఒకటేఅని తెలిసికొని శోకము , ఆనందముకలగలసి శరత్కాలప్రారంభములో మబ్బులో  దాగిన చందమామ ఉన్న రాత్రి వలె సితమ్మ ఉండెను.

.

వూటుకూరు జానకిరామారావు

శ్రీకృష్ణ భగవానుడు నిర్యాణం అనంతరం

 


శ్రీకృష్ణ భగవానుడు నిర్యాణం అనంతరం 

అర్జునుడు అశ్విరాపురం వస్తాడు. అర్జున్ ని చూడగానే ధర్మరాజు కృష్ణుని గురించి కుశల ప్రశ్నలు వేస్తాడు.

అర్జునుడు విషాద వదనంతో "అన్నా శ్రీకృష్ణుడు మనకు లేడు. ఈ భూమి వదిలిపెట్టి అవతారం చాలించాడు."అనగానే ధర్మరాజు గొల్లుమన్నాడు. అన్నయ్య ఇంకో విషయం "ద్వారకలో స్త్రీలందరినీ తీసుకొద్దామని నేను ప్రయత్నిస్తుండగా అక్కడ యాదవులు ఉందని అడ్డుకున్నారు నేను వారిని ఏమి చేయలేకపోయాను. అదే అర్జునుని అదే గాండీవం. కానీ ఆ సహాయూడని అయిపోయాను. "

అంటే పాండవులకు యావశక్తి,యుక్తి, భక్తి అన్నీ శ్రీకృష్ణుడే.


చివరిగా మీరు ఉత్తర గర్భంలో అభిమన్యుడు ఉన్నారు. మీకు తెలుసు ఎవరి కుమారుడు అభిమన్యుడు పొరపాటున వచ్చి ఉంటుంది సుభద్ర కుమారుడు అభిమన్యుడు.


శుభం భూయాత్

సులభోపాయం పారాయణం.

 *నిత్యాన్వేషణ:*


పారాయణం అంటే ఏమిటి? ఈ పారాయణలను చేసే పద్ధతులు తెలపండి?


పరా అయన సంబంధమైనది పారాయణం. అయనం అంటే ప్రయాణం. పరాగతి , పరా శక్తి లలో ఉండేదే ఈ— *పరా* అనేది. అన్నిటికంటే శ్రేష్ఠమైన అని ఈ మాటకు అర్ధం. ఉత్తమ గతి పొందడానికి చేసే ప్రయాణం పారాయణం. నామ స్మరణాత్ అన్యోపాయం న హి పశ్యామః భవతరణే ..అని కలి యుగంలో కడతేరడానికి ఇష్టం దైవం నామం స్మరించడం తేలిక ఐన మార్గం. ఏకాగ్రతతో భగవన్నామాలు గానీ భగవంతుని లేదా భాగవతుల విషయాలు గానీ స్మరించడం, చింతించడం పారాయణం అని వ్యవహరిస్తున్నాము. పారాయణ. అర్థం చేసుకొంటూ చేసినపుడు ఆ కథలో తేలికగా లీనమై ఆనందం పొందగలం.. కొంతైనా ఆ భాషలో పరిజ్ఞానం పాఠకుడికి ఉన్నపుడే అందులోని విషయం బోధ పడుతుంది.

ఎవరికీ బొత్తిగా అర్థం కాకుండా ఉండదు. అర్థం తెలిసే కొద్దీ ఎక్కువ సంతృప్తి కలుగుతుంది. చదవడానికి సరిగా రానివాళ్ళు ఇతరులు పారాయణం చేస్తూ ఉంటే విని ఆనందిస్తారు.

భగవద్గీత, రామాయణము, భాగవతము, దేవీ భాగవతం, దుర్గా సప్త శతి - పారాయణం చేస్తారు. దేవతల సహస్ర నామాలు గూడా పారాయణం చేస్తారు..వేదం , పురాణాలూ పారాయణ క్రమంలో ఉండవు.  ..రామాయణం , విష్ణు సహస్ర నామ స్తోత్రం , వేదంలో కొన్ని పన్నాలు నిత్య పారాయణం చేయడం కొందరు విధిగా పెట్టుకొని పాటిస్తారు. దేవీనవరాత్రులలో, చైత్ర మాసం శ్రీ రామోత్సవాలలో ఈ పారాయణాలు విశేషంగా చేస్తారు.

భాగవతం ఏడు రోజులలో చదివి పూర్తి చేయడం ఒక సంప్రదాయం. రామాయణం సుందర కాండ మాత్రమే పారాయణం చేయడంలో కొన్ని పద్ధతులు పాటిస్తారు.

ప్రతి రోజూ ఏడు సర్గలు మాత్రమే చదువుతూ ఆ విధంగా. ఏడు సార్లు పారాయణం చేస్తారు. చివరలో రామ పట్టాభిషేకం ( యుద్ధ కాండ లోది ) చదువుతారు. ఒక సర్గ చదివేటప్పుడు అది పూర్తి అయ్యేవరకు మధ్యలో లేచిపోరు.. మరుసటి సర్గ మొదటి శ్లోకం ప్రారంభించి నాటి పారాయణం నివేదన మంగళ హారతులతో పూర్తి చేస్తారు. కొన్ని నియమాలు పెట్టుకొని అవి పాటించడం వల్ల ఏకాగ్రత పెరుగుతూ వచ్చి ధ్యానానికి మనసు నిలబడుతుంది.

సన్మార్గంలో నడవడానికీ , ఉన్నతి సాధించడానికీ సులభోపాయం పారాయణం.

సోమవారం, ఆగస్టు 14, 2023*రాశి ఫలాలు

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.       *🌹ఓం శ్రీ గురుభ్యోనమః🌹*

.  *శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*


*సోమవారం, ఆగస్టు 14, 2023*

*శ్రీ శాలివాహన శకం: 1945*

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

*దక్షిణాయనం - వర్ష ఋతువు*

*అధిక శ్రావణ మాసం - బహుళ పక్షం*

*తిధి*      :  *త్రయోదశి ఉ10.12* వరకు 


.                *🌹రాశి ఫలాలు🌹* 

 

*మేషం*


కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్ధిక  లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు ఆలోచనలు మంచివి కావు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం పెరుగుతుంది.


*వృషభం*


నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో సమస్యలను పరిష్కార దిశగా  సాగుతాయి. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. బంధు మిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి.


*మిధునం*


దైవ సేవా  కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు విషయంలో పునరాలోచన చెయ్యాలి. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఉద్యోగ వాతావరణం  గంధరగోళంగా ఉంటుంది. నిరుద్యోగ  ప్రయత్నాలు మందగిస్తాయి.


*కర్కాటకం*


కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవా చేసుకుంటారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. బంధు మిత్రులకు శుభకార్య ఆహ్వానాలు అందిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా సాగుతుంది.


*సింహం*


 ఆకస్మిక దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. గృహ నిర్మాణ వ్యవహారాలలో తొందరపాటు మంచిది కాదు. ఇంటాబయట అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు.   ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన పనులు సకాలంలో పూర్తి చెయ్యలేరు.


*కన్య*


ఆప్తులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. దీర్ఘకాలిక రుణాలు తీర్చాగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు  అందుతాయి. 


*తుల*


ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలలో ఒక కొల్లిక్కి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి ఆశించిన లాభాలను అందుకుంటారు.  సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు  అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. 


*వృశ్చికం*


ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలోఅధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. కొన్ని పనులు వాయిదా వేస్తారు.  ఉద్యోగ విషయమై అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.


*ధనస్సు*


బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తాయి. వ్యాపార పరంగా ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు చివరి నిమిషంలో చేజారుతాయి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వృత్తి వ్యాపారాలు సొంత నిర్ణయాలు కలసిరావు.  ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి.


*మకరం*


ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. సంఘంలో ప్రముఖుల  నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ఆరంభించి సకాలంలో పూర్తిచేస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుమణుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత  ఉత్సాహంగా ముందుకు సాగుతాయి.


*కుంభం*


చాలాకాలంగా పూర్తి కాని పనులను  పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి అందిన ఆహ్వానాలు కొంత  ఉత్సాహాన్నిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికి అవసరానికి  సన్నిహితుల సాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున అనుకూలత  పెరుగుతుంది.


*మీనం*


దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.  ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయటా కొన్ని పరిస్థితులు ఇబ్బందికరంగా సాగుతాయి.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 


🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *అహింసా పరమో ధర్మః - ధర్మ హింసా తథైవ చ !!*

👉 *ధర్మో రక్షతి రక్షితః - వృక్షో రక్షతి రక్షితః*


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈                                                                   

*ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు,*🙏🏻

*లోకాసమస్తా సుఖినోభవంతు,*🙏🏻

*సర్వేజనాః సుఖినోభవంతు,*🙏🏻


🐄 *గోమాత రక్షణ వేదమాత పోషణ మనందరి బాధ్యత*🙏🏻

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

వృద్ధాప్యపీడ ఉండదు.

 🕉️   _*శుభోదయమ్*_  🕉️

    *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* 


 𝕝𝕝శ్లోకం𝕝𝕝 


*ఐశ్వర్యస్య విభూషణం సుజనతా శౌర్యస్య వాక్సంయమః*

*జ్ఞాన స్యోపశమః శ్రుతస్య వినయో విత్తస్య పాత్రే వ్యయః |*

*అక్రోధ స్తపసః క్షమా ప్రభవితు ర్ధర్మస్య నిర్వ్యాజతా*

*సర్వేషా మపి సర్వకారణ మిదం శీలం పరం భూషణమ్ ॥*



𝕝𝕝తా𝕝𝕝

ఐశ్వర్యానికి సౌజన్యమే ఆలంకారం. అలాగే శౌర్యానికి మితభాషిత్వమూ, జ్ఞానానికి శాంతి, శాస్త్రజ్ఞతకు వినయమూ, ధనానికి సపాత్రదానమూ, తపస్సుకు క్రోధం లేకుండా ఉండటం, ప్రభువుకు సహనమూ,ధర్మానికివ్యాజం లేకుండడమూ అలంకారాలు. సర్వజనులకు పై జెప్పినవాటి కన్నిటికీ మూలమైన ఉత్తమాలంకారం శీలమే.


-------------------------------------------- 


𝕝𝕝శ్లోకం𝕝𝕝


వార్ధక్యం వయసా నాస్తి

మనసా నైవ తద్భవేత్‌।

సన్తతోద్యమశీలస్య

నాస్తి వార్ధక్య పీడనమ్‌॥

               (సుభాషితరత్నావళిః)


𝕝𝕝తా𝕝𝕝

వృద్ధాప్యం అనేది వయసులోనూ లేదు.... మనసులోనూ ఉండకూడదు ఎల్లప్పుడూ ఉత్సాహం, క్రియాశీలత కల మానవుడికి వృద్ధాప్యపీడ ఉండదు.

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -19🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -19🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తనకు అల్లుడవుతాడని చెప్పగానే ఆకాశరాజు హృదయములో ఆశ్చర్యము, సంతోషము ఒకదానిని మించి మరొకటి చోటుచేసుకొన్నాయి. 


వామనరూపములో శ్రీమహావిష్ణువుకు మూడు అడుగుల స్థలము దానము చేస్తూ, తాను శ్రీమహావిష్ణువుకు దానము చేయగలిగిన అదృష్టవంతుడనని బలిచక్రవర్తి ఆనందించాడు. 


అదే విధముగా ఆకాశరాజు తాను శ్రీమహావిష్ణువునకు కన్యాదానము చేయడము జరగబోతుందని ఆనందించాడు. అంతకన్నా తనకు కావలసిన యదృష్టము లేదను కున్నాడు. సభానంతరము ధరణీదేవిగారికీ విషయము చెప్పాడు. ఆమె ఆనందానికి అడ్డూ ఆపూ లేదు.


ఒకనాడు శ్రీనివాసునకు ఒక కోరిక పుట్టినది. అదేమిటంటే అడవిలోనికి వెళ్ళి వేటాడలని తన మనోభిష్టాన్ని తెలిపినాడు. శ్రీనివాసుని కోరికకు తెల్లబోయింది. 


వకుళాదేవి ‘నాయనా! సుకుమారమైన శరీరము కలవాడవు. నీవు వేటాడతావా? వరాహవ్యాళ, శార్దూల, ఖడ్జ, మత్తేభాది క్రూరమృగాలు తిరుగాడే అడవులందు వాటితో చెలగాటము మనకు వలదు నాయనా!’’ అన్నదామో. శ్రీనివాసుడు ‘‘అమ్మా! అనవసరంగా భయపడకమ్మా, ఎన్ని క్రూరమృగాలున్నననూ నన్నేమీ చేయజాలవు. నీ పుత్రుడంటే భీరువు కాదమ్మా. నేను జాగ్రత్తగా వేటాడి వచ్చేస్తాను కదా’’ అన్నాడు సరే జాగ్రత్తగా వెళ్ళిరా నాయనా!’’ అనీ ఆశీర్వదించి పంపినది వకుళ.


శ్రీనివాసుడు వేటకు సంసిద్దమయ్యాడు. వేటకు వెళ్ళేటప్పుడు కట్టుకొనే బట్టలు కట్టుకున్నాడు. ముత్యాల సమరించిన కుచ్చులు తీర్చిన దట్టిని మొలకు కట్టుకున్నాడు సంపంగినూనె రాసుకొని చక్కగా దువ్వుకున్నాడు. 


సరిగంచు వల్లెవాటు వేసికొన్నాడు.అనేకరకాల ఆభరణాలు పెట్టుకున్నాడు. పరిమళం వెదజల్లే గంధాలు శరీరానికి రాసుకున్నాడు. కస్తూరీ తిలకము నుదుట పెట్టుకున్నాడు. కర్పూర మిళిత తాంబూలము వేసుకున్నాడు.


 విల్లంబులు ధరియించి వేటకు యింక వెళ్ళిపోదామనుకుంటుంటే, బ్రహ్మదేవుడు యీ విషయము గ్రహించి ఒక గుఱ్ఱాన్ని స్పష్టంచి శ్రీనివాసుడుండే చోటికి పంపాడు. దానిపై యెక్కి శ్రీనివాసుడు వేటకు బయలుదేరాడు.


 అరణ్యము సమీపించి ధనుష్టంకారము అడవిలో గల సింహం, శార్దూల, చామరీ, సారంగ, భల్లూకాది జంతువులు భయపడి చెల్లాచెదురై తమ చోట్లు వదిలి వూరకే తిరగసాగాయి. వేటాడటానికి అదే సమయమనుకున్నాడు శ్రీనివాసుడు. విజృంభింజాడు, పదునుతో మిసమిసలాడే బాణాలు వేసి సింహాల్ని చెండాడసాగాడు. పులుల తలలు నరకసాగాడు. ఏనుగుల్ని నేలమట్టము చేశాడు. లేళ్ళను చాలా చంపినాడు. అడవిపందుల్ని హతమార్చినాడు. ఇక్కడనుండిఅక్కడకు, అక్కడనుండి మరొకచోటికి తన గుఱ్ఱముపై విహరిస్తూ శౌర్యోత్సాహాలతో వేటాడసాగాడు, అంతలో ఒక పెద్ద ఏనుగు మహా ఘీంకారము చేసుకొంటూనే ఎటో వెళ్ళిపోయినది. 


ఆ ధ్వనిని బట్టి వెడలి శ్రీనివాసుడు దానిని తరుమసాగాడు, అది కూడా చాలా వేగముగా వెళ్ళడము ప్రారంభించింది. శ్రీనివాసుడున్నూ మఱింత వేగముతో వెంబడించాడు. కాని ఫలితము లేకపోయినది. అది చివరకు అయిపూ మచ్చా లేకుండా పారిపోయినది. శ్రీనివాసుడు ఆ మహాగజము కారణముగా చాలా అలసట పడినాడు. దాహము కూడా వేసింది. నీటిని గూర్చి చెంతనున్న ఉద్యానవనముకి వెళ్ళినాడు. ఆ వనము పేరు శృంగారవనము.


ధర్మ స్థాపక గోవిందా, ధన లక్ష్మి ప్రియ గోవిందా, స్త్రీ పుం రూప గోవిందా, శర్వాణీ నుత గోవిందా; |


గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా.||19||


*ఓం నమో వెంకటేశాయ*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹