2, జూన్ 2023, శుక్రవారం

గీతాసారం

 పురుషులు అయినా స్త్రీలు అయినా తమ పుట్టుకకు సార్థకత చేకూర్చుకోవాలి. చిన్నతనంలోనే వైధవ్యం అయితే ఏమి ఆమె చరిత్రలో సాధించినవి అత్యధికంగా ఉన్నవి. ఆమె చదువుకోలేదు..ఆమెకు ఉన్న జ్ఞానం అపారం.ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకున్న సమర్థురాలు.


పండితులను రప్పించి వారికి విశేష దక్షిణలు ఇచ్చి శాస్త్రాలు, పురాణేతిహాసగాథలు చెప్పించుకుని వినేది.

ఓ మారు అహల్యా బాయి తమ రాజ పురోహితుని పిలిచి 'భగవద్గీత' చదివి అర్థం చెప్పమని కోరిందట.


ఆ రాజ పురోహితుడు మొదటి శ్లోకం "ధర్మ క్షేత్రే కురు క్షేత్రే సమ వేతా యుయుత్సవః" అని రెండో పాదం చదవ బోతుంటే ఆవిడ స్వామీ నాకు గీతా సారమంతా అర్థమై పోయింది. అని అన్నారట. ఆయన ఆశ్చర్య పోయి నేనింకా చదవనే లేదు కదమ్మ మీకెలా అర్థ మయిందని అడిగాడట. 


అందుకు అహల్యా బాయి చిరునవ్వు  నవ్వి 'క్షేత్రే క్షేత్రే ధర్మం కురు' అనే కదా దాని అర్థం నీవు ఏ క్షేత్రం లో ఉన్నావో ఆ క్షేత్ర ధర్మాన్ని పాటించు అనే కదా కృష్ణ

పరమాత్మ చెప్తున్నది. 


నీవు రాజుగా వుంటే రాజధర్మం,తండ్రిగా వుంటే పితృ ధర్మం, కొడుకుగా వుంటే పుత్ర ధర్మం అలాగ ఎవరి ధర్మం వారు పాటించాలని చెప్పారు. అదే కదా గీతాసారం.


ఇపుడు నేను మహా రాణిని రాజధర్మం పాటించాలని, శత్రు నిర్మూలన చేసి మన ధర్మాన్ని నిలబడితే గానీ మన ధర్మం నిలబడదు. ధర్మోద్దరణ చేస్తేనే లోకమంతా సుఖమయంగా వుంటుంది అని అన్నారట. 


పండితులయిన రాజపురోహితులవారు  ఆమె అమేయ జ్ఞానానికి అబ్బుర పడ్డాడట.

కామిడీ

 👉😇👎 కామిడీ అయినప్పటికీ వాస్తవానికి దగ్గరగా.......

👉ఇప్పటికే ఓ సీఎం ఉచితల పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంటే సీఎం కావాలని ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి మళ్లీ ఉచితాలనే ప్రజల మీదకు జల్లుతుంటే నేను సీఎం ఎందుకు కాకూడదనిపించింది. అందుకే నేను కూడా నాకు తోచినంతలో హామీలు పత్రాన్ని రిలీజ్ చేస్తున్నా..

నా పేరు రాంబాబు బిఏ ...

నేనే గనుక సీయంని అయితే....


01. *గొంతులోకే గోరుముద్ద పథకం* తో ప్రతి ఇంటికీ వండిన వంటకాలని పంపిస్తా . 


02. *చేతిలో చత్వారం* పేరుతో అందరికీ స్మార్టు ఫోన్లిచ్చి ఫ్రీ ఇంటర్నెట్టు - ఫ్రీ ఓటీటీ చానెల్సు ఇస్తా. 


03. *లివరులోకే లిక్కరు* పథకంతో ఇంటింటికీ సారా పైపులు


04. *మస్తిష్కానికే మత్తు* పేరుతో ప్రజలందరికీ మత్తు పదార్ధాల సప్లై


05. *ఇంటికీ ఒంటికీ* పథకం పేరుతో ఉచిత ఇల్లు , ఫర్నీచరు , పవరు సప్లై -


06. *బద్దకస్తులకి బట్టలు* పేరుతో ఆర్నెలలకో రెండు జతల ఉచిత బట్టలు 


07. *నీడ బతుకులకి ఎండతోడు* పథకంతో ఇంట్లో ఉటడి బోరుకొట్టేసిన బతుకులకి ఉచిత విదేశీ పర్యటన.


08. *పాదాల వద్దకే పుణ్యం* పేరుతో భగవంతుడ్నే గుమ్మం దగ్గరకి తెచ్చే పథకం


09. *చదువెందుకు చంకనాక* పథకం పేరుతో చదవకపోయినా 99% మార్కులతో మాస్టర్ డిగ్రీ సర్ట

రుతుపవనాలు ఆలస్యం

 రుతుపవనాలు ఆలస్యం కావడం వలన ఈ సారి వర్షపాతం లోటు భాగా పెరగనుంది. ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం, అలాగే అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడేందుకు సిద్ధంగా ఉంది. దీని వలన రుతుపవనాలు ఆలస్యంగా ఈ సారి మొదలౌవ్వనుంది. నిన్న మనకు రాయలసీమ జిల్లాల్లో మాత్రమే వర్షాలను చూసాము. 


నేడు కూడ నిన్నటి లాగానే చిత్తూరు జిల్లాలోని పలు భాగాలతో పాటుగా అన్నమయ్య​, అనంతపురం, సత్యసాయి, కర్నూలు జిల్లాలోని పలు భాగాల్లో మాత్రమే వర్షాలను చూస్తాము. ఎందుకంటే తేమ అనేది ఉత్తరాంధ్ర​, కోస్తాంధ్రలో తక్కువగా ఉంది కానీ కర్ణాటక ప్రాంతంలో మాత్రం కాస్తంత ఎక్కువగా ఉండి అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడేందుకు సిద్ధంగా ఉండటం వలన రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడటం సహజం. మరో వైపున అల్లూరిసీతారామరాజు జిల్లాతో పాటుగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలను చూడగలము.



భోజన నియమాలు

 ప్ర: *భోజన నియమాలని తెలుపగలరు*.

జ: *మన శాస్త్రంలో ఎన్నో భోజన విధులని తెలిపారు*. *మనకున్నన్ని భోజన నియమాలు మరెక్కడ కనపడవు. ఎక్కడ నాగరికత ఉంటుందో అక్కడ నియమం ఉంటుంది*.

తిన్న ఆహారంలో - 

*స్థూల భాగం* - మలినంగా మారుతుంది.

*సూక్ష్మ భాగం* - ప్రాణశక్తిగా మారుతుంది.

*అత్యంత సూక్ష్మ భాగం* - మనసుగా మారుతుంది.

అందుకే మన పెద్దవాళ్ళు ఆహార విషయంలో ఇన్ని నియమాలు పెట్టారు. మనం తిన్న ఆహారమే మన మనస్సును నిర్మాణం చేస్తుంది కాబట్టి ఆహార విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

*మన శాస్త్రాలలో చెప్పిన భోజన విధులలో కొన్ని* -

● ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగ తినరాదు.

● చప్పుడు చేస్తూ తినడం, త్రాగడం చేయరాదు.

● ఆచమనం చేస్తున్నప్పుడు చప్పుడు చేస్తూ తాగుతే రక్తపాన దోషం వస్తుంది.

● పంక్తిలో కూర్చున్నప్పుడు ఇతరులు లేవకుండా లేవకూడదు.

● ఎడమ చేతిలో పట్టుకొని నుంచోని తింటే గోమాంస భక్షణ దోషం వస్తుంది.

● తింటున్న అన్నాన్ని నిందించారదు.

● ఎంత కోపం వచ్చినా విస్తరిని త్రోయరాదు.

● భోజనానికి కూర్చునే ముందు కాళ్ళు, చేతులు, నోటిని శుభ్రం చేసుకోవాలి.

● బిగుతుగా వున్న దుస్తులను, తలపైనా టోపి వంటివి ధరించరాదు.

● తూర్పుముఖంగా కూర్చుని భుజిస్తే ఆయుష్షు పెరుగుతుంది. దక్షిణ ముఖంగా చేస్తే కీర్తికరం. పశ్చిమాభిముఖం సంపత్కరం. ఎప్పుడైనా సరే ఉత్తరం వైపు తిరిగి భుజించారాదు. కొన్ని చోట్ల - సమూహ భోజనాలలో కొన్ని సడలింపులు చెప్పారు.

● పూర్ణిమ, అమావాస్యలలో రాత్రిపూట భోజనం చేయరాదు.

● చెప్పులు వేసుకొని భుజించారాదు. మంచం మీద కూర్చొని తినరాదు. అది విషం వలె బాధిస్తుంది.

● భగవంతునికి నివేదించని ఆహారాన్ని స్వీకరించరాదు.

● తినరాని వాటిని, నివేదన చేయని వాటిని, అపరిశుద్ధమైన వాటిని తినరాదు.

● నిందిస్తూ తినరాదు. చెడు ఆహారం తినరాదు. శత్రువులు తెచ్చిన ఆహారం తినకూడదు.

● భోజన పదార్థములన్నీ ఆకులోగానీ, కంచంలోగానీ వడ్డించిన తరువాత నీటిని కుడిచేతిలోనికి తీసుకొని మంత్రాన్ని జపించి ఆ నీటిని భోజనంపై చల్లవలెను. అనంతరం మళ్లీచేతిలోకి నీరుతీసుకొని

మధ్యాహ్నమైతే - *"సత్యంత్వర్తేన పరిషించామి"* అనీ అంటూ కుడిచేతిని, ఎడమ చేతి వైపు నుంచి కుడిచేతి వరకూ ప్రదక్షిణగా విస్తరిచుట్టూ నీటిని విడువలెను.

తర్వాత ఐదుసార్లు అన్నం కొద్దికొద్దిగా తీసుకొని ప్రాణాహుతులు పఠిస్తూ నోటిలో వేసుకొని నమలకుండా మింగవలెను.

ఈ విధంగా చేయలేనివారు కనీసం భోజన సమయంలో ఈ క్రింది శ్లోకాలనైనా పఠించవలెను.

*"త్వదీయం వస్తుగోవింద తుభ్యమేవ సమర్పయే*

*గృహాణ సముఖోభూత్వా ప్రసీద పరమేశ్వర"*

అంటే - "ఓ గోవిందా! నీ వస్తువును నీకే సమర్పిస్తున్నాను. నీవు నాయందు ప్రసన్నుడవై ప్రసన్నముఖముతో దీనిని గ్రహించు" అని అర్థం.

*"బ్రహ్మార్పణం బ్రహ్మహవిః  బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్*

*బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధి నా"*

ఈ శ్లోకాలను పఠించిన అనంతరం భోజనం చేయవలెను. భోజనం చేయడం ముగించిన అనంతరం -భోజనం చేసి లేచిన అనంతరం చేతులు, కాళ్ళను కడుక్కోవడంతో పాటు నోటియందు నీటిని పోసుకొని పుక్కలించవలెను.

అనంతరం -

*అగస్త్యం వైనతేయఞ్చ శమఞ్చ బడబానలమ్*

*ఆహార పరిపాకార్థం స్మరే ధ్బీమఞ్చ పఞ్చమమ్"*

అనే శ్లోకాన్ని పఠించవలెను. అంటే అగస్త్యుడు, గరుత్మంతుడు, శనీశ్వరుడు, బడబానలుడు, భీములను స్మరించడం వల్ల ఆహారం సమంగా జీర్ణంకాగలదు అని అర్థం.

(బ్రహ్మ శ్రీ సా.ష.శర్మ)

ఈ రోజు పద్యము:

 178వ రోజు: (భృగు వారము) 02-06-2023

మన మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:


గొప్ప వారలైన తప్పులు చేయుట 

సహజమగును చూడ జగతిలోన 

తప్పు దిద్దుకొనెడి తత్వమ్ము  మంచిది 

తెలిసి మెలగ మేలు తెలుగు బాల


ఈ ప్రపంచములో అందరు ఏ సమయములోనైనను ఏదో ఒక తప్పు తెలిసి కాని తెలియక కాని చేస్తూ ఉంటారు. కాని ఆ తప్పును ఎదుటి వారు తెలియజేసినపుడు దానిని సరి చేసుకొని తగు రీతిలో ప్రవర్తించుట మంచిది.  అంతే కాని తమ తప్పును ప్రకటించిన వారిపై క్రోధావేశములు, శతృత్వ భావము చూపరాదు. 

 

ఈ రోజు పదము. 

ఉడుత (Squirrel): ఉఱుత, చమరపుచ్ఛము, చిక్రోడము, వృక్షమర్కటిక, వృక్షశాయిక.

 అద్భుతమైన వరం.. బ్రహ్మముహూర్తం..!


పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే... ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే 'బ్రహ్మముహూర్తం' అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి, 98-48 నిమిషాల మధ్యకాలం ఇది. 

 

నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.


పురాణగాథ

బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.


ఏం చేయాలి..?

ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.


ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు... హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.


చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది. 


బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది. 


బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. ముందు మనం మన అంతర్యామిలోని ఆత్మలో లీనమై తద్వారా పరమాత్మను చేరుకుంటాము....

అర్ధ నారీశ్వర

 *శుభోదయం*

💐🙏💐🙏💐

ఈ సృష్టి మొత్తం అర్ధ నారీశ్వర తత్వంతో నిండి ఉన్నది.. 


అందుకే వారు ఈ సృష్టికే ఆది దంపతులు, తల్లిదండ్రులు. 

ఏ ఒక్కరు లేకున్నా, ఈ సృష్టి లేదు. 


అమ్మ శక్తి స్వరూపిణి అయితే ఆ శక్తికి చైతన్యము, కదలిక ఇచ్చేది అయ్యవారు. 


ఇది ప్రతి విషయంలో అన్వయించవచ్చు.. 


ఉదా.. మాట అయ్యవారైతే మాటలోని శబ్దం అమ్మవారు..


అలాగే దృష్టి, దృశ్యము... [చూపు (చూసే శక్తి), చూసే వస్తువు]


గమనము .. చలనము.. (నడక, నడిచే శక్తి)


ధ్యాని, ధ్యేయ వస్తువు... 


ఇలా ప్రాకృతికమైన బంధంతో  ఈశ్వరుడు అంతటా వ్యాపించి ఉన్నాడన్న సత్యమును గ్రహించడం మనం చేసే ధ్యానము...  


ఆ రెండూ ఒకటే అన్న సత్యాన్ని గ్రహించి, అనుభూతి చెంది, తానే ఈశ్వరుడుగా మారడం అఖండ సమాధి స్థితి... 


🙏🙏🙏🙏🙏🙏

ఓం అరుణాచల శివ

తెలంగాణా పోరు - హోరు.

 తెలంగాణా పోరు - హోరు.


నాడొక తెలంగాణ పోరు

నేడొక తెలంగాణ జోరు

స్వీయస్వపరి పాలన కోరు

ఆత్మ బలిదానాల హోరు.


రగిలే మంటలు జ్వాలలై

పిడికిలి బిగించి చైతన్యమై

దశాబ్దాల సాగే పోరాటమై

నవ తెలంగాణ సాకారమై..


ఢిల్లిపాలనపై కత్తెత్తిన యోధ

సర్దార్.పాపన్నగౌడ్ ధీరుడై

భువనగిరిన రాజ్యమేలి

గొల్కొండన తలన వ్రేలాడే.


తెలంగాణ తొలి యోధుడు

భావి తరానికి ఊపిర్లూడి

స్వేచ్ఛ విప్లవాగ్ని రగిలించి 

తానొకసమిధైన ధీరుడు.


తొలి దశపు పోరాటాలు

యువకుల ఆత్మార్పణలు

రగిలించే నిప్పుల కెరటాలు

స్వతంత్ర రాష్ట్ర భావుకలు.


పాలకులు వేసిన పాచికలు

ఉద్యమం చతికిల పడంగా

చాపకింద నీరులా సాగేను

మూడు దశాబ్దాల మౌనం.


రాజకీయ చిత్రం మారే

ఓ నిప్పు కణిక రాజేసే

తెలంగాణ స్వరం పెరిగే

పరాయి పాలన కాదనే.


మా నిధులు మానీళ్ళంటూ

మానియామకాలు అంటూ

తెలంగాణ రణ నినాదాలు

పదు నాల్గేళ్ళ పోరాటాలు.


పోరాట సమితి పేరుతో

తెలంగాణ పోరు మొదలై 

స్వరాష్ట్ర ఏర్పాటుకాంక్షించి

సంకల్పించేను తెలంగానం.


కేసిఆర్ చేసే నిరాహార ధీక్ష

సకల జనులు చేసిన సమ్మె

ఉద్యోగి విద్యార్ధి కలిసి జేసే

ప్రజల పోరు ఉద్యమించే.


యాదగిరి, శ్రీకాంత చారీ

చేసిన ఆత్మ బలిదానాలు

జనం చేసిన పోరాటాలు

రహదారుల దిగ్బంధాలు.


కేంద్రమే దిగి వొచ్చేను

జనం కోరికను తీర్చేను

తెలంగాణ రాష్ట్రమొచ్చె

స్వతంత్ర పాలన తెచ్చే.


యేలు బంగారు తెలంగాణ

జేయు కోటిఎకరా మాగాణ

నేటి పాలన చేయు గణన

స్వేచ్చా గొంతు ప్రాంగణాన.


తెలంగాణ పోరాట యాదిలో

నాటి పోరు దశాబ్దాల చరితం 

నేడు స్వయంపాలన  దశాబ్ది ఉత్సవం



శుభాకాంక్షలు.



అశోక్ చక్రవర్తి. నీలకంఠం.

9391456575.

ఈ రోజు పద్యము:

 178వ రోజు: (భృగు వారము) 02-06-2023

మన మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:


గొప్ప వారలైన తప్పులు చేయుట 

సహజమగును చూడ జగతిలోన 

తప్పు దిద్దుకొనెడి తత్వమ్ము  మంచిది 

తెలిసి మెలగ మేలు తెలుగు బాల


ఈ ప్రపంచములో అందరు ఏ సమయములోనైనను ఏదో ఒక తప్పు తెలిసి కాని తెలియక కాని చేస్తూ ఉంటారు. కాని ఆ తప్పును ఎదుటి వారు తెలియజేసినపుడు దానిని సరి చేసుకొని తగు రీతిలో ప్రవర్తించుట మంచిది.  అంతే కాని తమ తప్పును ప్రకటించిన వారిపై క్రోధావేశములు, శతృత్వ భావము చూపరాదు. 

 

ఈ రోజు పదము. 

ఉడుత (Squirrel): ఉఱుత, చమరపుచ్ఛము, చిక్రోడము, వృక్షమర్కటిక, వృక్షశాయిక.

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 78*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 78*


ఆనాటి వేకువఝామునే నందులు ఆశ్రమానికి వెళ్లి జీవసిద్ధిని కలుసుకున్నారు. అప్పటికే గతరెండు రోజులనుంచీ జీవసిద్ధి శత్రుంజయ హోమాన్ని చేస్తున్నాడు. 


"తానొక హోమం చెయ్యబోతున్నానీ, దాని ఫలితం చేత కోటదాకా వచ్చిన శత్రువులు కోట బయటే ఆగిపోతారని" యాగ ప్రారంభానికి ముందు మూడు రోజుల క్రితమే నందులకు చెప్పివున్నాడు జీవసిద్ధి. అతని మాట నిజమైనందుకు, అతనికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చారు నందులు. 


"ఈ రోజు శుభదినం... ఈ ఒక్కరోజు శత్రువుల మీద దాడిచేసి వీలైనంత విజయాన్ని సాధించండి. అలాగే ఈ ఒక్కరోజే మీకు అశుభదినం. ఈరోజు గట్టెక్కితే మీకన్నీ విజయాలే... కోటకి నాలుగు దిక్కులా ఉన్న అరవైనాలుగు ద్వారాలూ ఒక్కసారిగా... హఠాత్తుగా తెరిచి శత్రువుల మీద దాడి చెయ్యండి" అని చెప్పాడు యాగసిద్ధిలో వున్న జీవసిద్ధి మహోగ్రస్వరంతో. 


నందులు తక్షణం రాజభవనానికి వచ్చి మంత్రి, సేనానులను సమావేశపరిచి తన వ్యూహాన్ని తెలిపారు. కోట బయట శత్రుసేనలు లోపలికి ప్రవేశించే మార్గాలు కానక దిక్కుతోచని స్థితిలో ఉంటే, ఇలా అన్ని ద్వారాలు తెరిచి వాళ్లపై దాడికి దిగడం ఎందుకో రాక్షసామాత్యునికి అర్థం కాలేదు. అతడి తన అభ్యంతరాన్ని బయటపెట్టబోయాడు. 


కానీ ప్రధాన సేనాని భద్రభటుడు అతనిని వారించి "మనం చెప్పినా నందులు వినిపించుకోరు. ఎందుకొచ్చిన కంఠశోష ? మనమూ తగు జాగ్రత్తలోనే ఉన్నాం కదా... ఏం జరుగుతుందో చూద్దాం" అని చెప్పాడు. ఆ మాటతో రాక్షసామాత్యుడు మౌనం వహించాడు. 


ఆనాటి సూర్యోదయంతో పాటే కోటకి నలవైపులా ఉన్న ఆరవైనాలుగు ద్వారాలూ ఒక్కసారిగా తెరవబడ్డాయి. నలువైపులా కందకాల మీద బల్లకట్టులు దించబడ్డాయి. మగధసైనికులు సింహనాదాలు చేస్తూ ఒక్క పెట్టున శత్రుసైనికుల మీదికి విరుచుకుపడ్డారు. ఆ ఆకస్మాత్తు దాడిని నలువైపులా ముందు వరసలో వున్న సైనిక దళాలు సర్వనాశనమైపోయాయి. ఉత్తర దిక్కున ముందు వరసలో నిలిపి ఉంచిన పారశీక దళాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా రెండు ఘడియల కాలం పోరుసలిపి పర్వతకుని బలగాలలో సగానికి పైగా నాశనమయ్యాయి. 


అప్పటికి ఆ దిగ్భ్రాంతి నుంచి తేరుకున్న పర్వతక, వైరోచన, మలయకేతులు మగధసైనికుల మీదికి విరుచుకుపడి ఎదురుదాడి ప్రారంభించారు. ఇరుపక్షాల మధ్య పోరు తీవ్రమైంది. 


శోత్రీయ బ్రాహ్మణుడైన చాణక్యుడు తలపైని శిరస్త్రాణము, వక్షస్థలమునకు కవచం ధరించి అశ్వారూడుడై ఖడ్గచాలనం చేస్తూ అద్భుతమైన పోరాటపటిమను కనపరచడం ఇక్కడ విశేషం. 


పాంచాలా కిరాతకాదులు పడమటి దిక్కున అద్భుతమైన పోరాటపటిమను ప్రదర్శిస్తూ మాగధ సైనికులను సంహరించసాగారు. తూర్పున ముందు వరుసలోనున్న కామరూప సైన్యము తొలుత మాగధుల దాడిలో దాదాపుగా తుడిచిపెట్టుకుపోగా ఆ తదనంతరం సింహపురి వీరులు ఎదురుదాటికి దిగి మగధసైన్యాన్ని వూచకోత కొయ్యసాగారు. 


ఇక దక్షిణ దిశ నుండి ఆంధ్ర, కళింగ, పిప్పల వనసేనావాహినితో చంద్రగుప్తుడు మాగధులపై ఆది నుంచీ ఎదురుదాడి ప్రారంభించాడు. 


దక్షిణ దిక్కున మగధసైన్యానికి రాక్షసామాత్యుడు నాయకత్వాన్ని వహిస్తున్నాడు, తొలి రెండు ఘడియల కాలంలో అసలైన పోరు ఇక్కడే జరిగింది. 


రాక్షసుడు అరవీర భయంకరుడై విజృంభించి పోరాడుతూ, మహోగ్రస్వరంతో రంకెలు వేస్తూ మగధ సైనికులకు ఉత్సాహపరచసాగాడు. ఒకానొక దశలో భారత యుద్ధములోని భీష్మ పితామహుని జ్ఞప్తికి తెచ్చాడు. అతడిని నిలువరించడం చంద్రగుప్తునికి చాలా కష్టతరమైంది. ఇక తానే స్వయంగా రాక్షసామాత్యుని ఎదుర్కొన్నాడు చంద్రగుప్తుడు. 


ఇద్దరి మధ్యా మహోధృతంగా పోరు జరిగింది. తుదకు రాక్షసమాత్యుని చేతనున్న కరవాలాన్ని ఎగరగొట్టి, నిస్సహాయుడై, నిరాయుదుడై క్రిందపడిన రాక్షసుని శిరస్సు ఖండించబోయాడు చంద్రగుప్తుడు. సరిగ్గా ఆ క్షణంలో అతనికి చాణక్యుని ఆదేశం గుర్తుకు వచ్చింది. 


"ఎట్టి పరిస్థితులలోనూ రాక్షసామాత్యునికి మాత్రం ఏ హాని కలిగించరాదు" అన్న చాణక్యుని ఆజ్ఞని జ్ఞప్తికి తెచ్చుకొని "ఆర్య చాణక్యుల వారి ఆదేశమే నీకు ప్రాణభిక్ష పెట్టింది... పో... ప్రాణాలతో బ్రతికిపో..." అన్నాడు చంద్రుడు. ఆ మాటలు వింటూ నిశ్చేష్టుడయ్యాడు రాక్షసామాత్యుడు. 


సరిగ్గా ఆ సమయంలోనే యుద్ధరంగంలో ఎవ్వరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🍂🥀🍂🥀🍂🥀🍂🥀🍂🥀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

చొప్పకట్ల. ప ద్య సౌ ర భం !

 శు భో ద యం🙏


.                చొప్పకట్ల.


ప ద్య సౌ ర భం !


భళిరాయెన్నడుజారెనీభువికి,రంభారాగిణీ రత్నమే/

,ఖలయో? నిర్జరవల్లభప్రియవధూకంఠశ్రవద్దామమో?

మలయాశాలత మారుతోల్లలిత శంపావీచికాడోలికా/

చలదుత్ఫుల్ల జలేజమాలికయొ?,చెంచత్ చెంచలాతన్వియో?


భావం:ఔరా! ఏమీసౌందర్యము!రంభారాగీణీత్యాదిదేవకాంతలనడుములనుండిభువికిజారిపడిన రతనాలమొలనూలా?

?(వడ్డాణమా)

             దేవేంద్రునిపట్టపురాణిశచీదేవి మెడనుండిజారినపారిజాతసుమమాలయా?మలయానిల చంపాడోలికలలోనూయలలూగు విరసినపద్మమాలయా!

        ఆకాశమున చమక్కున మెఱయు మెఱపుతీగెయా? ఎవరీమె?


        "ఇంతకీ యెవరీమె? అలనాటియందాలతార మల్లీశ్వరి(భానుమతి) నవరసభరితమైన యీచిత్రంలో ఒకరసవద్ఘట్టంకోసం యీపద్యం రచింపబడింది.రచయితయెవరు?

కృష్ణశాస్త్రియనికొందరు,కాదుకాదు,మల్లాది రామకృష్ణశాస్త్రియనికొందరూ వాదులాట!

             ఇరువురిలో నెవరూకిమ్మనరు.

ఎలావివాదం తెగేది? పోనీండి.సందర్భంతెలిసికొందాం.

        శైలిని పరిశీలిస్తే మల్లాదికవితాశైలికి మచ్చుతునక యనిపించకమానదు.

                రాయలుపాలించేకాలంలో జరిగినకథ! మల్లీశ్వరీ,నాగరాజులు,బావా, మరదళ్ళు.చిన్నటనుండీ ప్రేమతో పెనవేసికొన్నది వారిబంధం.

            ఒకనాడాజంట సంతకుపోయివస్తూ,వర్షంకారణంగా,

ఒకసత్రంలో ఆగిపోయారు.కుర్రజంటవారిసరదాలువేరు.బావకోసం ఆమె"పిలచినబిగువటరా?"-అనిపాడుతూ నాట్యంచేయసాగింది.అప్పుడే మారువేషంతోవచ్చినరాయలు,ఆపల్లెటూరిపిల్లపాటకూ,ఆటకూ ముగ్ధుడైపోయాడు.నాట్యానంతరం రాయలవెంటవచ్చిన నందితిమ్మనగారు ఈపద్యాన్ని ఆశువుగా చదువుతారు.రాయలాజంటను సత్కరిస్తాడు.ఇదీ పద్య సందర్భం!


కఠినపదాలకు అర్ధం:

భళిరా? -ఆశ్చర్యార్ధకం-ఔరా!

మేఖల-వడ్డాణము.నిర్జరవల్లభప్రియ-ఇంద్రునిభార్యశచీదేవి;

కంఠశ్రవద్దామమో-మెడనుండిజారిపడినపూమాలయా?

మలయాశ-దక్షిణదిశ; మారుతము-గాలి;ఉల్లలిత-మిగులనందగించిన;

శంపావీచికాడోలికా-మెరపుతీగెలఊయలలో; చలత్-కదిలే;

ఉత్ఫుల్ల-బాగుగావిరసిన;

జలేదమాలికయొ-పద్మమాలయా?

చెతత్-కదలాడే; చెంతలా తన్వియో-మెరపుకన్నియయా?


         మహాకవులరచనలను మరలమరల మననంచేయాలి.అప్పుడు దానిసారం,వంటబడుతుంది.

                            స్వస్తి!🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

చీకటి నశించదు.

 .

                 _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*ఉద్యంతు శతమాదిత్యా*

*ఉద్యంతు శతమిందవః।*

*న వినా విదుషాం వాక్యైః*

*నశ్యత్యాభ్యంతరం తమః॥*


తా𝕝𝕝

వందమంది సూర్యులు ఉదయించినను, వందమంది చంద్రులు ఉదయించిను - ఒక జ్ఞానియొక్క సత్సందేశం వింటే తప్ప మనస్సులోని చీకటి నశించదు.

 శ్లోకం:☝️

  *ఏకచక్షుర్వివేకో హి*

*ద్వితీయం సత్సమాగమః ।*

  *తౌ నష్టౌ యస్య స క్షిప్రం*

*మోహకూపం పతేద్ధ్రువం ।।*


భావం: మనిషికి వివేకం ఒక కన్ను లాంటిది మరియు సత్సాంగత్యం అతనికి రెండవ కన్ను వంటిది. ఈ రెండూ లేని వ్యక్తి అసలైన అంధుడు. వాడు ఖచ్చితంగా మోహమనే చీకటి బావిలో పడతాడు.