21, మార్చి 2024, గురువారం

భగవద్గీత

 యువతకు భగవద్గీత ఏ విధంగా ఉపయోగపడుతుంది?


భగవద్గీత జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు ప్రధానంగా గోచరించే విషయం 1.ఇన్ద్రియ నిగ్రహం 2 స్వధర్మాచరణ 3. హృదయదౌర్బల్యమును విడనాడుట!


క్లైభ్యం మాస్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే।

క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరన్తప।।(2/3)


క్లైభ్యమనగా చేతకానితనం మరియు పిరికితనము! ఇది హృదయదౌర్బల్యమును కలిగించును. హృదయదౌర్బల్యమనగా (Depression). ఇది క్షుద్రము అనగా పరమ నీచమైనది!

కనుక ఈ నీచమైన హృదయదౌర్బల్యమైన పిరికితనమును వదిలి కర్తవ్యోన్ముఖుడవు కమ్ము!


‘స్వధర్మమపి చావేక్ష్య న వికమ్పితుమర్హసి’(2/31)


స్వధర్మాచరణమున చలింపరాదు!


‘స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః(3/35)


ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా, లోపాలతో కూడి ఉన్నా సరే, తన సహజ ధర్మాన్ని నిర్వర్తించటమే అత్యుత్తమము. పరధర్మాచరణ మిక్కిలి భయంకరమైనది! 


పైన చెప్పిన మూడు శ్లోకాలను పరిశీలిద్దాం!



పైన చెప్పిన మూడు విషయాలు నేటి యువతకు మరీ ప్రత్యేకించి విద్యార్ధులకు వర్తిస్తాయి! నేటి యువత ప్రతీ చిన్న విషయానికి హృదయదౌర్బల్యమునకు (depression and mental imbalance) లోనవుతున్నారు! మరి ఇది పూర్వపు రోజులలో లేదా? అంటే లేదనే చెప్పవచ్చు! పూర్వం గురుకులాలలో విద్యనభ్యసించేవారు! అక్కడ విద్యార్ధి కొన్ని కఠిన నియమములకు లోబడి ఇన్ద్రియనిగ్రహంతో ఉండేవారు! ఉదాహరణకు, తెల్లవారుఝామున బ్రాహ్మీముహుర్తాన లేవడం, గురు శుశ్రూష చేసి విద్యను అభ్యసించడం, గురువుగారి ఆజ్ఞ అయిన తరువాతనే భుజించడం వగైరా క్రమశిక్షణతో మెసలుకొనోవారు! గురుసేవ మరియు విద్యనభ్యసించడమనే విద్యార్థియొక్క స్వధర్మమును పాటించేవారు. వారికి మిగిలిన విషయాలపై దృష్టి ఉండేదికాదు! అలాగుననే, మొదటి ర్యాంకే రావాలని తల్లిదండ్రుల ఒత్తిడి ఉండేదికాదు! అటువంటి ఒత్తిడి లేని వాతావరణంలో మనస్సు దౌర్భల్యమునకు లోనవదు! కనుక వారు నియమములతో కూడిన క్రమశిక్షణతో ప్రశాంతంగా విద్యనభ్యసించేవారు! వారివారి బుద్ధి పరిణితినిబట్టి కొందరు వేగం మరికొందరు కాస్త ఆలస్యంగా మొత్తం విద్యనభ్యసించి వారు సమాజానికి చాలా ఉపయోగపడేవారు! 


మరి నేటి యువత? చదువుకునే విద్యార్థికి దేశ రాజకీయాలతో ఏం పని? ఉదాహరణ ఢిల్లీ యూనివర్శిటీ ఘఠనలు! రాజకీయం వారి స్వధర్మం కాదు! పరధర్మము ఎప్పుడూ భయానకమేయని గీతాబోధ! అదే ప్రస్తుతం జరుగుతోంది! విద్యార్థులలో నియమములు లేవు, ఇన్ద్రియనిగ్రహణ లేదు, క్రమశిక్షణ లేదు, గురువుల పట్ట గౌరవంలేదు. మీదుమిక్కిలి, పరస్పర లింగాకర్షణ! ఆ ఆకర్షణకు ప్రేమయని పేరు! అది సఫలీకృతమైనా కాకపోయినా విద్యార్థి లక్ష్యం దెబ్బతినడం తప్పదు! ఇది వికటిస్తే, ఇన్ద్రియనిగ్రహణ లేకపోవడం వలన హృదయదౌర్భల్యమునకు లోనయి, అయితే ఎదుటివారిని హింసించడం లేక తాను పిరికివాడయితే (క్లైభ్యం) ఆత్మహత్య చేసుకోవడం మనం రోజూ చూస్తున్నాము! ఇటువంటి వారు సమాజానికి ఎలా మేలు చెయ్యగలరు? 

అయితే, మనం మరల గురుకులాల వ్యవస్థకు వెళ్లగలమా? సాధ్యం కాదు! కనుక, మన పాఠ్యాంశాలలో గీత, రామాయణ, భారతంలోని ప్రధానమైన విషయాలను  బోధించాలి! రామాయణం వలన కుటుంబవ్యవస్థ, సౌభ్రాతృత్వం, మంచి నడవడిక అబ్బుతాయి. భారతం వలన సమాజంలో మన చుట్టూయున్నవారితో ఏ రకంగా మెసలుకోవాలో తెలుస్తుంది. గీత వలన ఇన్ద్రియనిగ్రహము, స్వధర్మాచరణ తెలిసి ప్రతి చిన్నవిషయానికి ఉద్వేగానికి లోనవకుండా, మరియొకరికి హాని తలపెట్టకుండాయుండడం తెలుస్తుంది! 


కనుక నేటి యువత భగవద్గీతను అధ్యయనం చేయడం వలన, ఇటువంటి బలహీనతలకు లోనవకుండా తనను తాను ఉద్ధరించుకుంటూ, మెరుగైన సమాజాన్ని తయారు చేయగలదు!

వరాలైన శాపాలు

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*వరాలైన శాపాలు -- చందమామ కథలు* 


ఒక గ్రామంలో నారాయణ అనే పేద వ్యవసాయదారు ఉండేవాడు. అతడు చాలా తెలివైనవాడే కాని, అతనికంటూ సొంతంగా కుంటెడు పొలం కూడా లేదు. అందువల్ల ఇతరుల పొలాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసి జీవించేవాడు. అతనికి రెండు తీరని కోరికలుండేవి. ఒకటి దేశాటన చెయ్యటం; రెండోది రుచికరమైన రాజభోజనం తినాలని. అయితే అవి అతని వంటి పేదరైతుకు తీరే కోరికలు కావు. కనీసం రాజధానిలో జరిగే వసంతోత్సవాలైనా చూడాలని నారాయణ ఒక సంవత్సరం, తన స్నేహితుడైన మాధవుడితో కలిసి, రాజధానికి బయలుదేరాడు. వాళ్ళు పగలల్లా ప్రయాణం చేసి, చీకటి పడే సమయానికి అరణ్యం మధ్యలో చిక్కుకుపోయారు. ఆ రాత్రి తలదాచుకోవటానికి ఒక గుడి కనిపించింది. నారాయణ ఉత్సాహంతో, ఆ రాత్రి ఆ గుడిలో గడుపుదామన్నాడు. మాధవుడు తల అడ్డంగా ఊపుతూ, ‘‘ఇది చండముఖి అనే దేవత గుడి.

ఆ దేవత మహా ముక్కోపి. ఆమె పగలల్లా ఎక్కడెక్కడో సంచారం చేసి, ఝాముపొద్దుపోయేసరికి గుడికి తిరిగి వస్తుంది. ఆ సమయానికి గుడిలో ఎవడైనా కనిపిస్తే ఆగ్రహంతో వాణ్ణి శపిస్తుంది. అందుచేత రాత్రివేళ ఎవరూ గుడిలోకి అడుగు పెట్టరు,'' అన్నాడు. ‘‘దేవత ఆగ్రహిస్తే ఆగ్రహించనీ, నే నింక ఒక్క అడుగైనా ముందుకు రాలేను,'' అంటూ నారాయణ ఆవులించి, గుడిలోకి వెళ్ళాడు. మాధవుడు మరేం మాట్లాడకుండా ముందుకు సాగి పోయాడు. గుడిలో నడుమువాల్చిన మరుక్షణం నారాయణకు నిద్ర పట్టేసింది. కొంత రాత్రి గడిచినాక ఎవరో కొరడాతో కొట్టినట్టు తోచి, నారాయణ ఉలిక్కిపడి నిద్ర మేలుకున్నాడు. ఎదురుగా ఒక దేవత, ఎరట్రి కళ్ళతో, చేతిలో కొరడా పట్టుకుని నిలబడి ఉంది, ‘‘ఎవడ్రా నువ్వు? నా అనుమతి లేకుండా నా గుడిలో పడుకోవటానికి నీకెంత ధైర్యం!'' అన్నది పట్టరాని కోపంతో. నారాయణ ఆమెకు చేతులెత్తి భక్తితో నమస్కరించి, ‘‘తల్లీ, నే నొక పేద రైతును. వసంతోత్సవాలు చూడడానికి రాజధానికి పోతూ, అలసిపోయి, చీకటి పడేసరికి, ఇక్కడ విశ్రమించాను. నా వల్ల తప్పు జరిగితే క్షమించు,'' అన్నాడు. ‘‘నిన్ను క్షమించానంటే ఆ సంగతి తెలిసి జనం ఈ గుడిని చిటికెలో సత్రంగా మార్చేస్తారు. ఆ తరవాత నాకు శాంతి అన్నది కరువై పోతుంది. నిన్ను శపించి తీరాలి. అప్పుడే మానవులకు నేనంటే భయభక్తులు ఉంటాయి. నువ్వు రైతునంటున్నావు గనక, ఒక సంవత్సరంపాటు నీ చేతి నీరు తగిలిన ప్రతి మొక్కా చచ్చిపోవాలి! ఇకనైనా ఒళ్ళు దగ్గరపెట్టుకు బుద్ధికలిగి ఉండు," అని దేవత అదృశ్యమైపోయింది. వ్యవసాయం చేసుకుని బతికే తన బోటి వాడు సంవత్సరంపాటు వ్యవసాయం చెయ్యకుండా ఎలా బతకాలా అని విచారిస్తూ నారాయణ రాజధాని చేరాడు. ఆ యేడు వసంతోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి. నారాయణ వాటిని తనివి తీరాచూసి ఆనందించాడు. దేశం అన్ని మూలల నుంచీ ఉత్సవాలకు వచ్చిన వ్యవసాయదార్లు రాజుగారితో తమ కష్ట సుఖాలు చెప్పుకున్నారు. అందరికీ దాపరించిన సమస్య ఒక చిత్రమైన కలుపుమొక్క. దాన్ని ఎన్నిసార్లు పీకినా నిర్మూలం కాక, పైరులన్నిటినీ పాడుచేస్తున్నది. ఈ సంగతి విని నారాయణ రాజుగారికి నమస్కరించి, ‘‘నాకు అవకాశం ఇస్తే ఒక్క ఏడాదిలో ఈ కలుపు మొక్కలను నామరూపాలు లేకుండా సమూలంగా నిర్మూలించగలను,'' అన్నాడు. రాజు మొదట అతడి కేసి అనుమానంగా చూశాడు. అయితే, ఆ తరవాత, అతని శక్తిని పరీక్షించి, అతనికి అలాటి శక్తి ఉన్నట్టు రూఢి చేసుకుని, అతనికి కావలసిన పరివారాన్ని ఇచ్చి, అతను కోరిన ఏర్పాట్లన్నీ చేశాడు. నారాయణ తన పరివారంతో అన్ని గ్రామాలకూ వెళ్ళి, పైరు నాటేముందుగా పొలాలన్నిటికీ తన చేతిమీదుగా నీరు పెట్టాడు. దాంతో చేలో ఉన్న కలుపు మొక్కలన్నీ పూర్తిగా నశించిపోయాయి. ఈ విధంగా దేశాటన చేయాలి; రాజభోజనం తినాలి అన్న నారాయణ కోరికలు నెరవేరాయి. అతను ఒక్క ఏడాదిలో దేశమంతా పర్యటించి, గొప్ప సత్కారాలు పొందాడు. రాజుగారు అతనికి నూరు ఎకరాల భూమి ఇనాముగా ఇచ్చాడు. మరుసటి సంవత్సరం కూడా నారాయణ వసంతోత్సవాలకు రాజధానికి పోతూ, చండముఖి ఆలయం దగ్గిరికి వచ్చేసరికి చీకటి పడటం చేత, ఆ ఆలయంలోనే విశ్రమించాడు. ఒక రాత్రివేళ దేవత ప్రత్యక్షమయింది. నారాయణ ఆమెకు నమస్కరించి, ‘‘తల్లీ, నీ శాపం వల్ల ఎంతో లోకోపకారం జరగటమేకాక, నా కోరికలన్నీ తీరాయి. దేశాటన చేసి, రాజభోజనం తిన్నాను,'' అన్నాడు. చండముఖి కళ్ళ నిప్పులు రాల్చుతూ, ‘‘మూర్ఖుడా, మళ్ళీ నన్ను కవ్వించటానికి వచ్చావా? ఈ సంవత్సరం నువ్వు నడిచిన మేర నిలువులోతు గొయ్యి పడుతుంది. నీకు ఎవరైనా పెట్టితేతప్ప తిండి ఉండదు. ఇదే నా శాపం,'' అని అంతర్థానమయింది. తాను కదలటానికి లేదని గ్రహించి, నారాయణ తెల్లవారినదాకా ఆ గుడిలోనే కూర్చుని, ఒక ఉపాయం ఆలోచించాడు. తెల్లవారగానే, ఆ దారినపోయే మనిషితో రాజుగారికి కబురుచేసి, ఒక పల్లకీ తెప్పించుకుని, అందులో వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకుని, తన శాపం గురించి వివరంగా చెప్పి, దానివల్ల లాభం పొందే ఒక పథకాన్ని రాజుగారికి సూచించాడు. అదేమంటే, రాజ్యంలో తవ్వవలసిన పంటకాలవలన్నీ ముగ్గులతో గుర్తుపెడితే, నారాయణ వాటి వెంట నడుచుకుంటూ పోతాడు. అతని వెనకనే నిలువులోతు కాలవలు వాటంతట అవే ఏర్పడతాయి. ఈ పథకం అమలుజరిగింది. నారాయణ కాలువల కోసం నడవనప్పుడు పల్లకీలో ప్రయాణం చేశాడు. అతను ఎక్కడ ఉన్నా రాజభోజనం బంగారు పాత్రలలో అతను ఉన్నచోటికి వచ్చింది. ఈ విధంగా నారాయణకు దేవత ఇచ్చిన రెండోశాపం వల్ల దేశానికి మరింత మేలు జరిగింది. ప్రయాస లేకుండా, అతి స్వల్పఖర్చుతో దేశమంతటా పంటకాలువలు ఏర్పడి, ఎంతో కొత్తభూమి సాగులోకి వచ్చింది. మూడోసంవత్సరం కూడా నారాయణ వసంతోత్సవాలకు బయలుదేరి వెళుతూ, మళ్ళీ చండముఖి ఆలయంలోనే చీకటిపడే వేళకు చేరాడు. ఒక ఝాముపొద్దు పోయేసరికి దేవత వచ్చింది. నారాయణ చేతులు జోడించి ఆమెతో, ‘‘తల్లీ, నీ శాపాలు అమోఘం! నీ శాపంవల్ల మరొకసారి నాకు దేశాటనా, రాజభోజనమూ, లోకోపకారం చేసిన పుణ్యమూ లభించాయి. నువ్వు దయ ఉంచి ఇక మీదటనైనా శాపాలియ్యటం మానితే, ఇటుగా వెళుతూ రాత్రివేళ ఈ అడవిలో చిక్కుకుపోయిన మనుషులు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. నీకు నిత్యమూ పూజలు జరిగేటట్టు ఏర్పాటు చేస్తాను,'' అన్నాడు. చండముఖి పట్టరాని కోపంతో, ‘‘మూర్ఖుడా, ఇప్పటికి రెండుసార్లు నా ఆజ్ఞ ధిక్కరించి నా గుడిలో ప్రవేశించావు. నా శాపాలను అవహేళన చేశావు. ఈసారి నీ దేశాటనా, లోకోపకారమూ ఎలా సాగుతాయో నేను చూస్తాను. నీ దృష్టిలో పడిన ఏ వస్తువైనా మరుక్షణమే భగ్గున మండి మసి అయిపోతుంది. నువ్వు బతికున్నన్నాళ్ళూ కళ్ళకు గంతలు కట్టుకుని, గుడ్డివాడిలా జీవించవలసిందే!'' అని శపించింది. నారాయణ చప్పున పై పంచ తీసి కళ్ళకు అడ్డంగా తలపాగా చుట్టుకుని, ఆ రాత్రంతా ఆలోచించి, తెల్లవారినాక తడుముకుంటూ గుడి బయటికి వచ్చి, తలపాగా విప్పి, ఒకసారి గుడికేసి చూశాడు. మరుక్షణం గుడి భగ్గున మండి బూడిదకుప్ప అయిపోయింది. దానితోనే నారాయణ శాపంకూడా పోయింది. తరవాత నారాయణ అక్కడ ఒక సత్రం కట్టించాడు. అది ప్రయాణీకులకు ఎంతో ఉపయోగపడుతూ వచ్చింది.


సేకరణ:- వాట్సాప్ పోస్ట్.

శతరుద్రీయము

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

. *శతరుద్రీయము-16*

(వ్యాఖ్య: శ్రీ తురుమెళ్ళ మాధవ కుమార్)

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱


*ప్రథమానువాకము-14 వ ఋక్కు*


*నమకనామాని : ఓం అన్నానాంపతయే నమః*



ఋషి : భగవంతుడు 

దేవత. : భగవంతుడు 

ఛందస్సు: అనుష్టుప్పు


*నమస్తే అస్వాయుధాయానాతతాయ ధృష్ణవే!*

*ఉభాభ్యాముత తే నమో బాహుభ్యాం తవ ధన్వనే!!*


ఉపద్రవము తలపెట్టని రుద్రా నీకు నా నమస్కారము♪. నీ చేతి యందలి సమర్థమగు బాణములకూ, ధనుస్సునకూ, నీ బాహువులకూ నా నమస్కారము♪.


*వివరణ :* 


*అనాతతాయ : హానిచేయ తలపెట్టనటువంటిది.* 


రుద్రుని చేతియందలి ఆయుధమును "హేతి” గా సంబోధించారు ఇంతకు ముందర♪. దానిని మనం “ఆశ” అని అన్వయించుకున్నాము♪. ఈ ప్రపంచంలో చాలామంది భగవంతుని పేరు తలచేవాడిని పిచ్చివాడని అంచనావేస్తారు♪. సన్యాసులను ఎందుకూ పనికిరాని వారుగా తలుస్తారు♪. 


కానీ, ఎంతమంది నిజంగా అర్థం చేసుకుంటారు.... 


 “భక్తులు అంటే కోటానుకోట్ల జన్మల అనుభవాల ద్వారా జీవితాన్ని కాచి వడపోసి చివరకు కావలసినది ఏదో దానిని అర్థం చేసుకున్నవారనీ, వారి జన్మలు ఆఖరుజన్మలనీ, శాశ్వతమైన పదమును పొందిన ఆ భక్తాగ్రేసరులు మనము తిరిగే ఈ పిచ్చి ప్రపంచంలోకి రారనీ”..........


“నా కృష్ణునికి ఇదే ఇచ్ఛ అయితే అలాగే కానియ్యి” అంటూ మీరాబాయి విషం త్రాగింది♪. కృష్ణునిపై ఆమెకుగల అపారమైన నమ్మకంవల్ల విషం ఆమెను ఏమీ చేయలేకపోయింది♪. 


ప్రహ్లాదుడు తండ్రి ద్వారా పడ్డ కష్టాలు పగవాడికి కూడా రాకూడదని కోరుకుంటారు♪. ఆ భక్తాగ్రేసరునికి శ్రీహరి పైనున్న కాంక్ష ఈ కష్టాలను గుర్తించకుండా చేసింది♪.


భగవంతునిపై కోపం తెచ్చుకొనేవాళ్ళు కూడా వుంటారు♪. నాకు తెలిసిన ఒక కుటుంబంలో వెంకటేశ్వరునికి పూజ చేయరు♪. ఎందుకో అని అడిగితే వాళ్లు తిరుపతికి వెళ్లినప్పుడు రోడ్డుప్రమాదంలో వాళ్ల తండ్రిగారు పోయారట, అందుకని వీళ్లు వెంకటేశ్వరుని పూజించడం మానేశారు♪. సరే వారినమ్మకం వారిది♪. 


ఇలాగే, చాలా మంది భగవంతునిపై అపోహలు పెట్టుకుంటూంటారు♪. ఇటువంటి వారికోసమే ఇక్కడ *“అనాతతాయ”* అంటూ భగవంతుని పైన కాంక్ష హానిచేయనటువంటిది అని చెప్పబడింది♪.


*అనన్యాశ్చింతయంతో మాం*

*యేజనాః పర్యుపాసతే!*

*తేషాం నిత్యాభియుక్తానాం* 

*యోగక్షేమం వహామ్యహమ్ ||*

                            (భగవద్గీత, 9-22)


భగవద్గీతలో అర్జునునికి ఇవ్వబడ్డ హామీ మనందరికీ వర్తిస్తుంది♪. భగవంతుని ద్వేషించి నాశనమైన చరిత్రలు ఎన్నెన్నో చూశాముగానీ, ఆ స్వామిని ఆశించి ఆశాభంగం పొందిన వారెవరూ లేరు♪. 


భగవద్గీతలో “నా భక్తుడు యెన్నటికీ నాశనం పొందడు (న మే భక్తః ప్రణశ్యతి)” అంటూ చెప్పారు♪. ఈ విషయాన్ని నిజంచేసిన గాథలు ఎన్నెన్నో♪. మన దురదృష్టం ఏమిటంటే భగవంతునితోటి బేరసారాలు నడుపుతాము♪. 


వెలుతురు ఎక్కడవుంటుందో చీకటి అక్కడే వుంది, సుఖం ఎప్పుడైతే అనుభవిస్తున్నామో దానిని వెంబడించే దుఃఖమూ వుంటుంది♪. ఇవన్నీ ద్వంద్వాలు అనబడతాయి♪.


భగవంతుని దగ్గరకు వెళ్లి అన్యమైనది కోరుకుంటే కోరుకున్నది దొరుకుతుంది కానీ, ద్వంద్వ సూత్రం ఇక్కడ వర్తిస్తుంది♪. అనన్యమైన కోరిక వున్నవానికి అది యెటువంటి హానీ కలుగచేయదు♪. కాబట్టి, అటువంటి దానికి ఇక్కడ సాధకుడు శిరస్సువంచి నమస్కరిస్తున్నాడు♪.


*బాహుభ్యాం నమః :*


భగవంతుని చూడాలన్న ఆశ ఎవరికి వుండదు? అందరికీ వుంటుంది♪. కానీ ఆయన దర్శనం చేసుకోవాలనో లేదా ఆయనను చేరుకోవాలనో ఖచ్చితమైన లక్ష్యంతోటి ఎవరో కోటిమందిలో ఒక్కరు ప్రయత్నం చేస్తారు♪. వారిలోగూడా ఎవరో ఒక్కరు ఆయనను యధార్థం (తత్త్వం) గా తెలుసుకుంటారు♪. దానికి కారణం తెలుసుకోవడం అవసరం♪. 


విశ్వామిత్రుడు నాలుగువేల సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు, చివరకు మేనక ఎదురుగా వచ్చి నాట్యంచెయ్యగానే మైమరచి తపస్సువదిలి సంసారంలో పడ్డాడు♪. అంటే ఆయన ఆకర్షణకు లోబడినట్లుగా మనకు పురాణం చెబుతుంది♪.


అదే శివపురాణం చూడండి. జగన్మాత ఆ శివుడిని పెళ్ళి చేసుకుంటానని భీకరమైన ప్రతిజ్ఞ చేస్తుంది♪. తపస్సు చేస్తూ శరీరాన్ని కృశింపజేస్తూ వుంటే ఒక అతిలోకసుందరుడు ప్రత్యక్షమై 'ఆ శివునివద్ద ఏముంది, భూతాల మధ్య వుంటాడు, పుర్రెలో తింటాడు, స్మశానంలో వుంటాడు♪. అతనిని చేసుకుని ఏం సుఖపడతావు ....నన్ను చేసుకో” అంటూ అడగగానే పార్వతి అతనితో... “నా శివుని గురించి ఇలా నువ్వు మాట్లాడడం నీకు తగనటువంటిది♪. ఆయన గురించి నేను చేసే ఈ తపస్సు నేను మానను, నిన్ను చేసుకోవటం జరగని పని” అంటూ అసహ్యంగా తిరస్కరిస్తుంది♪. తర్వాత తన తపస్సును పరీక్షించేందుకై సదాశివుడే ఆ రూపంలో వచ్చాడని తెలిసి సంతోషిస్తుంది♪.


పై రెండు కథలలోనూ ఒకటే లక్ష్యం కనిపిస్తుంది♪. ఇద్దరూ సాధకులే. కాకపోతే ఒకరిది అపరిపక్వ స్థితి, వేరొకరిది పరిపక్వస్థితి♪. 


ఇంతకీ ఈ కథలకూ శివుని బాహువు లకూ ఏమిటి సంబంధం?


విశ్వామిత్రుడు ఆకర్షణకు లొంగిపోయాడనీ, పార్వతి అమ్మవారు ఆకర్షణకు లొంగలేదనీ అర్థం అవుతుంది♪. ఆ ఆకర్షణను ప్రయోగించేది “ఆవరణ, విక్షేప” శక్తులనబడే బాహువులు♪.


మరింత వివరంగా పరిశీలిద్దాము.


                    *సశేషం.....*

        ❀┉┅━❀🛕❀┉┅━❀


*సేకరణ:* *శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

యోగవాసిష్ఠ రత్నాకరము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

. *హరి ఓం*

 *ఓం శ్రీ మహాగణాధిపతయే నమః* 

*ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః* 

*ఓం నమో వసిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి శుకాదిభ్యః*

 

. *🌹యోగవాసిష్ఠ రత్నాకరము🌹* 

*వైరాగ్య ప్రకరణము - 1వ అధ్యాయము* 

. *🌹రాఘవ వైరాగ్య వర్ణనము🌹*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

. *శ్రీ వాల్మీకి రువాచ :-*

0015 


*1-35*

*ప్రాప్యం సంప్రాప్యతే యేన భూయో యేన వ శోచ్యతే* *పరాయా నిర్వృతేః స్థానం యత్తజ్జీవితముచ్యతే.* 


తప్పక పొందదగినట్టి పరమశాంతి నిలయమైన అత్మను బొందినవాడు మరల యెన్నటికిని దుఃఖము నొందడు. అట్టివాని జీవితమే జీవితము. 


*1-36*

*తరవోఽ పి హి జీవన్తి జీవన్తి మృగపక్షిణః* 

*స జీవతి మనో యస్య మననేన న జీవతి.*


వృక్షములున్ను జీవించుచున్నవి. మృగపక్షులున్ను జీవించుచున్నవి. కాని దృశ్యసంకల్పము లేని మనస్సు గలవాడే నిజముగ జీవించుచున్నవాడగును. (లేక తత్త్వబోధచే వాసనాక్షయమువలన నశించిన మనస్సు గలవాడే నిజముగ జీవించుచున్నవాడగును.)  


*1-37*

*జాతాస్త ఏవ జగతి జన్తవః సాధుజీవితాః* 

*యే పునర్నేహ జాయన్తే శేషా జరఠగర్దభాః.*


ఎవరు ఈ ప్రపంచమున తిరిగి జన్మింపరో (పునర్జన్మరహితులో), ఎవరు ఉత్తమ జీవితము గలవారోఅట్టివారే నిజముగ జన్మించిన వారగుదురు. (వారి జన్మమే సఫలమైనది), తక్కినవారు ముసలి గాడిదలవంటివారే యగుదురు. (అప్రశస్త జీవులని భావము).


                    *సశేషం.....*

        ❀┉┅━❀🛕❀┉┅━❀


*సేకరణ:* *శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

ఆత్మవిద్యా విలాసము -

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

. *🌹శ్రీ సదాశివ బ్రహ్మేంద్రస్వామి🌹*

. *🌹విరచితము🌹*

  *ఆత్మవిద్యా విలాసము - శ్లోకం 16*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*శ్లోకం:-*


*దేహేంద్రియాసు హృదయాదిక చైత్యవర్గాత్ ప్రత్యక్చితే ర్విభజనం భవవారి రాశేః |* 

*సంతారణే ప్లవ ఇతి శ్రుతి డిండిమోఽయం తస్మాద్విచారయ జడాజడయో స్స్వరూపమ్ ॥*



*భావం:-*

దేహం, ఇంద్రియాలు, పంచప్రాణాలు, హృదయం మొదలైన చైతన్యంతో కూడిన వర్గం నుండి లోనుండే చితిని విడదీయడమే సంసార సముద్రాన్ని దాటించే పడవ అని ఉపనిషత్తులు చాటిస్తాయి. అందుచేత జడాజడాల స్వరూపాన్ని గురించి విచారణ చేయుము.


*వివరణ:-* 

శిష్యుని హృదయం చాలా పరిపక్వత చెంది వున్నందున శ్రీ గురువు అత్యుత్తమమైన ఆత్మ విచారణా మార్గాన్ని సూటిగా బోధిస్తున్నాడు.


*చైత్యవర్గం :-*

దేహము, అయిదు జ్ఞానేంద్రియాలు అయిదు కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనోబుద్ధి చిత్తాహంకారాలనే నాలుగు అంతఃకరణాలు కలిసిన ఇరవైయింటినీ చైత్యవర్గమంటారు.


ప్రపంచాన్ని గురించిన జ్ఞానాన్ని ఇస్తాయి, కాబట్టి జ్ఞానేంద్రియాలకి ఆ పేరు వచ్చింది. తక్కిన వాటికి వేరే రకమైన చైతన్యం ఉన్నది. దేహం ఎంతో తెలివైయింది. తనకి పడని వాటిని, అక్కరలేని వాటిని వెంటనే బయటకి తోసివేస్తుంది.


 కర్మేంద్రియాలకు, పంచప్రాణాలకి తమ తమ పనులు చేయడానికి తగిన జ్ఞానం ఉన్నది. అంతఃకరణాల వ్యవహారాలన్నీ చైతన్యంతో కూడినవే.


అయితే ఇవి చైతన్యంతో కూడిన జడాలు. వాటికి స్వతహాగా చైతన్యం లేదు, స్థూల సూక్ష్మ రూపాలుగా ఉన్న ఈ ఇరవయింట్లోను చైతన్యం ప్రసరించిన కారణంగా అవి చైతన్యంతో ప్రవర్తిస్తాయి.


 చైతన్య ప్రసారం ఆగిపోగా అవి తిరిగి జడాలవుతాయి, నశించిపోతాయి. చైతన్యంలేనిదే అవి నిలవలేవు, కొండలు, నదులు మొదలైన వాటిలాగా అవి జడాలుగా నిలిచి ఉండవు. కేవలం చైతన్యాన్ని ప్రసరించడానికే అవి ఉపయోగ పడతాయి. అందుకే అవి చైత్యవర్గం అని పిలువబడుతాయి.


*ప్రత్యక్షితి:-*

 అన్నింటికి అంతరంలో ఉండే చితి. బల్బులోకి ప్రవేశించి వెలుగు నిచ్చే కరెంటులాగా, పైన చెప్పిన చైత్యవర్గం లోపల ప్రవేశించి చైతన్యాన్ని ఇస్తుంది.


*విభజనం :-* 

సంసారంలో కొట్టుమిట్టాడే జీవుడు చైతన్యవంతుడు. అందుండి తరించాలని తహతహపడేది కూడా ఈ జీవుడే.


అందువల్ల తనలోని చితిని, చైత్యవర్గాన్ని విడదీసి తన చితి తన చైత్యవర్గంలోకి ప్రవేశించి, బాహ్య విషయాలని చూపుతోందని, చూపిస్తుందని గ్రహించాలి.


అప్పుడే అతడికి తన నిజ స్వరూపం తెలిసి బాహ్య ప్రపంచాన్ని అధిగమిస్తాడు. లోపలి చితిని విడదీసినప్పుడు దానికి బాహ్య ప్రపంచంలోగాని, దాని బాధలతో గాని సంబంధం ఉండదు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం -‌ ద్వాదశి - ఆశ్రేష -‌‌ గురు వాసరే* *(21-03-2024)* 


ప్రముఖ వేదపండితులు, *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/BC2F8y5uXdo?si=rWN5EqcF72zeDMCe


🙏🙏