14, జూన్ 2025, శనివారం

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🚩శనివారం 14 జూన్ 2025🚩*

``

          *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది…

``

     *వాల్మీకి రామాయణం*                

           *68వ భాగం*

```

రావణాసురుడు పడుకున్న ఆ మందిరంలో గోడలకి కాగడాలు పెట్టబడి ఉన్నాయి. ఆయన పడుకున్న తల్పము బంగారంతో చెయ్యబడింది, అక్కడ పడుకున్న స్త్రీలు ధరించిన ఆభరణములు ఎర్రటి బంగారంతో చెయ్యబడినవి, రావణాసురుడు పెట్టుకున్నవి బంగారంతో చెయ్యబడిన ఆభరణములు. గోడలకి ఉన్న కాగడాల నుండి వస్తున్న కాంతి, అక్కడ ఉన్న స్త్రీల ఆభరణముల నుండి వస్తున్న కాంతితో కలిసి, ఏదో మండిపోతుందా అన్నట్టుగా ఒక ఎర్రటి కాంతి ఆ ప్రదేశాన్ని ఆవరించింది. అక్కడ వెలుగుతున్న కాగడాలు అటూ ఇటూ కదలకుండా అలాగే నిలబడి వెలుగుతున్నాయి. ఆ కాగడాలని చూస్తుంటే, జూదంలో ఓడిపోయినా కాని ఇంటికి వెళ్ళకుండా, పక్కవాడి ఆటని దీక్షగా చూస్తున్న జూదరిలా ఉన్నాయి.


అక్కడ పడుకున్న స్త్రీలు ఒకరి మీద ఒకరు చెయ్యి వేసుకుని, ఒంటి మీద వస్త్రం సరిగ్గా లేకుండా పడుకొని ఉన్నారు. అందరి ముఖాలు పద్మాలలా ఉన్నాయి. అలా కొన్ని వేల స్త్రీలు మదవిహ్వలులై, రావణాసురుడితో కామోప భోగాన్ని అనుభవించి, విశేషమైన మధ్యపానం చేసి, మత్తెక్కి, బడలి నిద్రపోతున్నారు. అక్కడ ఉన్న వేల స్త్రీలు తక్కువ జాతిలో జన్మించినవారు కాదు, ఎవరూ సౌందర్యం తక్కువైనవారు కాదు, ఇంతకుముందు వేరొక పురుషుడిని పొందినవారు కాదు, నడువడి తెలియనివారు కాదు, వీళ్ళందరూ రావణుడిని కోరుకుని వచ్చినవారు.


రావణుడు పడుకున్న తల్పం బంగారంతో చెయ్యబడింది, దానికి వైఢూర్యాలతో మెట్లు కట్టబడి ఉన్నాయి. పడుకుని ఉన్న రావణుడికి చామరం వేస్తున్న ఉత్తమమైన స్త్రీలు ఆ చామరంలోకి అనేకరకములైన పరిమళద్రవ్యాలని చేర్చి, జాగ్రత్తగా వీస్తున్నారు. ఆ తల్పం మీద, ఉత్తమమైన పరుపు మీద రావణుడు పడుకొని ఉన్నాడు. హనుమంతుడు రావణుడి తల్పం దగ్గరికి వెళితే, రావణుడి రోమ కూపాల నుండి కొడుతున్న బ్రహ్మతేజస్సు చేత హనుమంతుడు అవతలకి తొలగతోయబడ్డాడు. అప్పుడు హనుమంతుడు దూరంగా వెళ్ళి ఒక వేదిక మీదనుండి రావణుడిని చూస్తే, ఆకాశంలో వెళ్ళిపోతున్న ఒక నల్లటి మబ్బు భూమి మీదకి దిగిపోయి తల్పం మీద పడుకుంటే ఎలా ఉంటుందో, రావణుడు అలా ఉన్నాడు. ఆయన పెట్టుకున్న కుండలములు ప్రకాశిస్తున్నాయి. ఆయన అనుభవించి సుఖము చేత, తాగిన మధ్యము చేత తిరుగుడుపడుతున్న ఎర్రటి నేత్రములతో ఉన్నాడు. అరమోడ్పు కన్నులతో(సగం మూసిన కన్నులతో), పెద్ద చేతులతో, ఉత్తమమైన వస్త్రములు కట్టుకొని నిద్రపోతున్నాడు. దేవేంద్రుడి వాహనమైన ఐరావతం తన దంతములచేత కుమ్మితే ఏర్పడిన గాయములు రావణుడి శరీరం మీద కనపడుతున్నాయి, అలాగే 

శ్రీమహావిష్ణువు తన చక్రం చేత కొట్టినప్పుడు ఏర్పడిన మచ్చలు ఉన్నాయి, దేవేంద్రుడు తన వజ్రాయుధం చేత కొట్టినప్పుడు తగిలిన దెబ్బలు కనపడుతున్నాయి. ఆ రావణుడు బాగా బలిసిన భుజాలతో ఉన్నాడు, ఆయన చేతి గోళ్ళు ఎర్రటి కాంతితో మెరిసిపోతున్నాయి. ఆయన ఆ తల్పం మీద, పడుకొని ఉన్న పాములా ఉన్నాడు, ఆయన చేతులు పరిఘలలా ఉన్నాయి, ఆయన చేతులకి ఉన్న వేళ్ళు రెండు అయిదు తలల పాముల్లా ఉన్నాయి.


తరువాత హనుమంతుడు అక్కడ పడుకొని ఉన్న స్త్రీలని వెతికాడు. అక్కడ పడుకుని ఉన్న స్త్రీలలో ఒకామె మృదంగాన్ని గట్టిగా పట్టుకొని పడుకుంది, ఒకామె వేణువు ఊదుతూ నిద్రపోయింది, ఒకామె వీణ వాయిస్తూ నిద్రపోయింది, ఒకామె పక్కన ఉన్న స్త్రీ మీద చీరని తీసి తన మీద దుప్పటిగా కప్పుకుంది. ఆ స్త్రీలు అక్కడున్న సంగీత వాయిద్యాలని గట్టిగా కౌగలించుకొని, వాటిని రావణుడిగా భావించి చుంబిస్తున్నారు. అక్కడ ఒక్క స్త్రీ ఒంటి మీద ఆభరణము కాని, వస్త్రము కాని సరిగ్గా లేదు. అలా పడుకొని ఉన్న స్త్రీలందరినీ హనుమంతుడు చూసుకుంటూ వెళ్ళాడు.


రావణుడికి కొంత దూరంలో, బంగారు తల్పం మీద అపారమైన సౌందర్యవతి అయిన ఒక స్త్రీ పడుకొని ఉంది. ఆవిడ రావణుడి భార్య అయిన మండోదరి. ఆవిడని చూడగానే 'ఈవిడే సీతమ్మ' అని హనుమంతుడు అనుకొని, తన భుజాలని కొట్టుకుని, తోకని ముద్దు పెట్టుకుని, విచిత్రమైన పాటలు పాడి, పిల్లిమొగ్గలు వేసి, గెంతులు వేసి, స్తంభాల పైకి ఎక్కి, కిందకి దూకి తన కోతి బుద్ధిని బయట పెట్టుకున్నాడు. 


కొంతసేపటికి ఆయన అనుకున్నారు “మా అమ్మ సీతమ్మ, రాముడు పక్కన లేనప్పుడు ఇటువంటి పట్టు పుట్టం కట్టుకొని, పక్కన రావణుడు ఉండగా ఇంత హాయిగా నిద్రపోతుందా. అరరే నా బుద్ధి ఎంత వైక్లవ్యాన్ని పొందింది. ఈమె సీతమ్మ కాదు!” అనుకొని ముందుకి సాగిపోయాడు.


అక్కడినుండి ముందుకి వెళ్ళగా, రకరకాలైన బంగారు పాత్రలు, వెండి పాత్రలు, మణిమాణిక్యాలు పొదిగిన పాత్రలు, పువ్వులనుండి తీసిన సుర, పళ్ళనుండి తీసిన సుర, తేనెనుండి తీసిన సురలు మధురమైన వాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. అక్కడ తాగేసిన పాత్రలు, సగం తాగి కిందపడేసిన పాత్రలు, స్త్రీ-పురుషులు ఒకరిమీద ఒకరు ఉండరాని విధంగా మత్తులో పడి ఉన్నారు. హనుమంతుడు వాళ్ళందరినీ చూసుకుంటూ ముందుకు వెళ్ళాడు. అప్పుడాయన అందరూ ఆహారం తీసుకునే ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ నెమళ్ళ మాంసం, కోళ్ల మాంసం, మేకల మాంసం, గొర్రెల మాంసం, అడవిపందుల మాంసం అలా రకరకాలైన పదార్ధాలు ఉన్నాయి. హనుమ ఆ ప్రాంతాన్నంతటినీ వెతికారు. మళ్ళి పుష్పక విమానంలోకి వెళ్ళి, అందులో వెతికి కిందకి దిగుతూ అనుకున్నారు “ఈ లంకా పట్టణం అంతా వెతికాను, ఇందులో వెతకని ఇల్లు లేదు. ఇక్కడ గంధర్వ, యక్ష, కిన్నెర స్త్రీలు, రాక్షసులు కనపడుతున్నారు కాని సీతమ్మ తల్లి జాడ కనిపెట్టలేకపోయాను” అని బాధ పడ్డాడు.


కాని వెంటనే “ఎవడు శోకమునకు లొంగిపోడో, ఎవడు నిరంతరము ఉత్సాహముతో ఉంటాడో, వాడు మాత్రమే కార్యాన్ని సాధించగలడు. అందుకని నేను శోకమునకు లొంగను, మళ్ళీ సీతమ్మని అన్వేషిస్తాను, మళ్ళీ ఈ లంకా పట్టణం అంతా వెతికేస్తాను” అని ఉత్సాహాన్ని పొంది లంకా పట్టణం అంతా వెతికి కూర్చున్నాడు.


అప్పుడాయన అనుకున్నాడు… 

“ఇంత లంకా పట్టణాన్ని 4 అంగుళాలు కూడా వదలకుండా నేను వెతికాను, అయినా నాకు సీతమ్మ దర్శనం కాలేదు. బహుశా ఒంటి మీద వస్త్రము లేని స్త్రీలని ఎందరినో ఈ లంకా పట్టణంలో నేను చూశాను, అందువలన నాయందు ధర్మమునకు లోపం వచ్చిందేమో. నేను వెతుకుతున్నది సీతమ్మని, ఆమె ఒక స్త్రీ. అందువలన ఆమెని వెతుకుతున్నప్పుడు సీతమ్మో కాదో అని ఆ స్త్రీల వంక చూశాను. ఆ స్త్రీలని అలా చూశాను కాని, నా మనసునందు ఎటువంటి వికారము కలగలేదు, నాకు ఎవరూ గుర్తులేరు. నేను పవిత్రముగానే ఉన్నాను” అని హనుమంతుడు తన మనస్సులో భావన చేసి, “నేను సీతమ్మ దర్శనం చెయ్యలేకపోయాను. ఇప్పుడు నేను వెనక్కి వెళితే అక్కడ ఉన్న వానరాలు నన్ను 'సీతమ్మ దర్శనం చేశావా?' అని అడుగుతారు. 'నాకు సీతమ్మ జాడ తెలియలేదు' అని చెప్తాను. సీతమ్మ జాడ తెలీకుండా వెనక్కి వెళితే సుగ్రీవుడు చంపేస్తాడని అందరూ ప్రాయోపవేశం చేస్తారు. నేను వెళ్ళి ఈ మాట సుగ్రీవుడికి చెబితే, మిత్రుడైన రాముడికి సహాయం చెయ్యలేకపోయానని సుగ్రీవుడు ప్రాణం వదిలేస్తాడు. ఉన్న స్నేహితుడు కూడా వెళ్ళిపోయాడని రాముడు కూడా ప్రాణము వదిలేస్తాడు. రాముడు లేనప్పుడు లక్ష్మణుడు ఉండడు. అప్పుడు అక్కడున్న వానరకాంతలందరూ ప్రాణములు వదిలేస్తారు. తదనంతరం వానరులందరూ మరణిస్తారు. ఈ వార్త అయోధ్యకి చేరి కౌసల్య, కైకేయి, సుమిత్ర, భరతుడు, శత్రుఘ్నుడు మరణిస్తారు, తరవాత అయోధ్యలో అందరూ మరణిస్తారు. నేను పట్టుకెళ్ళే వార్త వల్ల ఇంత మంది మరణిస్తారు. ఈ వార్తని నేను తీసుకువెళితే ఎంత వెళ్ళకపోతే ఎంత.


బహుశా రావణుడు సీతమ్మని తీసుకువస్తున్నప్పుడు, ఆయన ఒడిలో కొట్టుకుంటున్న సీతమ్మ జారి సముద్రంలో పడిపోయి ఉంటుంది, కాదు కాదు, సీతమ్మ అంత పిరికిది కాదు. తన పాన్పు చేరడంలేదని, రావణుడే సీతమ్మని ముక్కలుగా నరికి ఫలహారంగా తినేసుంటాడు, కాదు కాదు, కాముకుడైనవాడు తాను కామించిన స్త్రీని సంహరించడు. లేకపోతే రాక్షసులు సీతమ్మని తినేసుంటారు, కాదు కాదు, రావణుడు కామించిన స్త్రీని తినగలిగే ధైర్యం రాక్షసులకు ఉండదు. రాముడికి సీతమ్మ జాడ తెలియకూడదని రావణుడే అమ్మని ఎక్కడో దాచి ఉంటాడు. కాబట్టి నిద్రపోతున్న రావణుడి పది తలలు గిల్లేసి, వాడి మృతకళేబరాన్ని రాముడి పాదాల దగ్గర పడేస్తాను, లేదా ఈ లంకని పెల్లఘించి పట్టుకుపోతాను. కాదు కాదు, సీతమ్మ జాడ చెప్పలేనప్పుడు ఇవన్నీ తీసుకువెళ్ళడం ఎందుకు, అందుకని నేను అసలు వెనక్కి వెళ్ళను. సీతమ్మ జాడ దొరికేవరకు వానప్రస్థుడిలా ఉంటాను, లేదా అగ్నిలోకి ప్రవేశిస్తాను, లేదా నీటిలోకి ప్రవేశించి శరీరాన్ని వదిలేస్తాను” అనుకున్నాడు.


కాని ఆయన వెంటనే “ఛీ! మరణించడం ఏమిటి, ఆత్మహత్య మహా పాపం. మళ్ళీ ఉత్సాహాన్ని పొంది వెతుకుతాను” అనుకొన్నాడు.```


       *రేపు…69వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

Saastry gaaru


    

శా.
మాయా పద్ధతి చేతఁగాదు, పర సంపత్కైతవప్రక్రియో/
పాయ వ్యాప్తికి బుద్ధిబోదు, కృపణత్వం బొప్ప దుర్మార్గులం/
దే యాచ్ఞామతి స్తోత్ర పాఠము లొకింతేఁ జేయఁగాఁ జాలఁ దం/
డ్రీ! యీ జీవితనౌక పట్టగల దొడ్డేరీతి? విశ్వేశ్వరా!

 విశ్వనాధ స్వభావోచితమైనపద్యం!

మాయచేయటం నాకుచేతకాదయ్యా!ఇతరులసందలనుకొల్లగొట్టే ఉపాయమూతెలియదు.ధనం కోసం దేహీయని దుర్మార్గులనాశ్రయించిస్తోత్ర పాఠములు చేయనూలేను. 
మరి యీజీవిత నౌకను ఒడ్డుకు చేర్చేదెట్లయ్యా!
విశ్వేశ్వరా!ఏమో యికనీదేభారమయ్యా!!
              -విశ్వనాధశతకం

14 జూన్ 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

       *🚩శనివారం🚩*

 *🌹14 జూన్ 2025🌹*      

   *దృగ్గణిత పంచాంగం*   

                 

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*జ్యేష్ఠ మాసం - కృష్ణ పక్షం*


           *ఈనాటి పర్వం*    

       *సంకష్టహర చతుర్ధి*


*తిథి  : తదియ* మ 03.46 వరకు ఉపరి *చవితి*

*వారం    : శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం   : ఉత్తరాషాఢ* రా 12.22 వరకు ఉపరి *శ్రవణం*


*యోగం : బ్రహ్మ* మ 01.13 వరకు ఉపరి *ఐంద్ర*

*కరణం   : భద్ర* మ 03.46 *బవ? రా 03.51 ఉపరి *బాలువ*


*సాధారణ శుభ సమయాలు:* *ఉ10.30-12.00సా05.00-06.30*

అమృత కాలం  : *సా 05.41 - 07.21*

అభిజిత్ కాలం  : *ప 11.42 - 12.34*


*వర్జ్యం          : ఉ 07.41 - 09.21 & రా.తె 04.28 - 06.06*

*దుర్ముహూర్తం  : ఉ 05.35 - 07.19*

*రాహు కాలం    : ఉ 08.51 - 10.29*

గుళికకాళం       : *ఉ 05.35 - 07.13*

యమగండం     : *మ 01.46 - 03.24*

సూర్యరాశి : *వృషభం*

చంద్రరాశి : *ధనుస్సు/మకరం*

సూర్యోదయం :*ఉ 05.42*

సూర్యాస్తమయం :*సా 06.51*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.35 - 08.12*

సంగవ కాలం         :      *08.12 - 10.49*

మధ్యాహ్న కాలం    :     *10.49 - 01.26*

అపరాహ్న కాలం    : *మ 01.26 - 04.04*


*ఆబ్ధికం తిధి         : జ్యేష్ఠ బహుళ తదియ*

సాయంకాలం       :*సా 04.04 - 06.41*

ప్రదోష కాలం         :  *సా 06.41 - 08.52*

రాత్రి కాలం           :*రా 08.52 - 11.46*

నిశీధి కాలం          :*రా 11.46 - 12.30*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.08 - 04.51*

------------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🙏శ్రీ వేంకటేశ్వర స్వామి🙏* 

 *🔯సహస్రనామ స్తోత్రం🔯*


*చంద్రసూర్యలోచనం* 

*మహేంద్రనీలసన్నిభమ్* 

*నాగరాద్గిరీశ్వరం*

*నమామి వేంకటేశ్వరమ్*


*🌹ఓం నమో వేంకటేశాయ🌹*

****************************

   *🚩హనుమాన్ స్తుతి🚩* 


*నమో రామదాసం నమో భక్తపాలం*

*నమో ఈశ్వరాంశం నమో లోకవీరం*

*నమో భక్త చింతామణిం గదాపాణిం*

*నమో మారుతిం రామదూతం నమామి*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🚩🪷🌹🛕🌹🌷🪷🌷🚩

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

కీళ్ళు నరిగెనంచు

 కీళ్ళు నరిగెనంచు కీళ్ళన్ని మార్చేస్తె

పార్ట్లు బోయెనంచు పార్ట్లు మార్చ

సొంత పార్ట్లు బోతె సుఖమేల వచ్చురా

సకురు అప్ప రావు సత్య మిదిర!


భావం: ఇంగ్లీషు వైద్యంలో పాడైన కీళ్ళనో, పాడౌతున్న అవయవాలనో బాగుచేసి సరి చేయగలిగే మందులు లేకపోవడం వలన సహజ కీళ్ళను తొలగించి, కృత్రిమ కీళ్ళను బిగించడం, మన శరీర భాగాలను బాగు చేయలేక, హోమియో, యోగా, ఆయుర్వేదం లాంటి వేరే వైద్య విధానాలలో బాగౌతుందని తెలిసినా, అక్కడికి పోనివ్వకుండా పేషెంట్లను భయపెట్టి, సర్జరీల పేరుతో దండిగా డబ్బు గుంజగలిగే అవకాశాన్ని వదులుకోలేక, సొంత అవయవాలు పీకి పారేసి, వేరే వ్యక్తుల అవయవాలు వేసి కుట్టేస్తే సమస్యలు క్షణాల్లో తీరిపోతాయనుకుంటే అది ఒక పిచ్చి భ్రమ మాత్రమే! జరిగే ఆపరేషన్లలో, అవయవ మార్పిడిలో నూటికి 90% అనవసరమైనవీ, కేవలం సర్జరీలు చేసే హాస్పిటళ్ళకు ధన దాహాన్ని తీర్చేవి మాత్రమే! మనది కాని అవయవాలను కానీ, కృత్రిమ వస్తువులను కానీ మన శరీరము ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటుంది! సహజమైన అవయవాలైతే మందులకు స్పందిస్తాయి, సరౌతాయి! కానీ కృత్రిమమైనవి మందులకు స్పందించకపోవడం వలన, శరీరం వాటిని వ్యతిరేకించడం వలన జీవితాంతం వాటితో సమస్యలను, నరకాన్ని అనుభవిస్తూ, డబ్బు ఖర్చుపెట్టి క్షణాల్లో ఆనందాన్ని పొందెయ్యాలనుకునే వీళ్ళ కలలు కల్లలౌతాయి! ఆరోగ్యమనేది డబ్బుతో కొనుక్కునేది కాదు! కష్టపడి, ఓర్పుతో సొంత అవయవాలను కాపాడుకుంటేనే సుఖం దొరుకుతుంది! 

సకురు అప్పారావు చెప్పేది నిజం! 


ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా, కరోనా లాంటి వైరస్ ల వ్యాప్తిని అరికట్టడానికి, రకరకాల జ్వరాలకూ ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

మనం ఏది చేస్తామో…*

 *మనం ఏది చేస్తామో…*

           *అది పదింతలై…*

                     *మనకే చేరుతుంది!*

    https://chat.whatsapp.com/ByG7yJpvXgGGi51t1YNv1T 

             ➖➖➖✍️

కారు ఆగిపోయింది. అందులోంచి దిగిన ఆమెకు 40 సంవత్సరాలు ఉంటాయి.


దిగి చూసింది టైర్ పంక్చర్ అయ్యింది. స్టెఫినీ ఉందికానీ తనకు వెయ్యడంరాదు.

రోడ్డు పక్కకు తీసి సహాయం కోసం చూస్తోంది. ఒక్కరూ ఆగడం లేదు.

 

సమయం చూస్తే ...

సాయంత్రం ఆరు దాటుతోంది. నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. మనసులో ఆందోళన. ఒక్కతే ఉంది. తోడు ఎవరూ లేరు. చీకటి పడితే ఎలా?


దగ్గరలో ఇళ్ళు లేవు. సెల్ పనిచెయ్యడం లేదు(సిగ్నల్స్ లేవు). ఎవరూ కారునూ, పక్కనే నిలబడిన ఆమెనూ చూసినా ఆపడం లేదు. అప్పటికే దాదాపు ఒక గంట గడిచింది. ఎలారా దేవుడా అనుకుంటూ... భయపడడం మొదలయ్యింది. చలి కూడా పెరుగుతోంది.


అటుగా వెడుతున్న ఒక బైకు ముందుకు వెళ్లి పక్కకు తిప్పి వెనక్కు వచ్చింది.

ఒక వ్యక్తి బైకు స్టాండ్ వేసి, ఈమె దగ్గరకు వస్తుండటంతో... ఆమె సహజంగా భయపడింది. ఎవరతను? ఎందుకు వస్తున్నాడు? ఏమి చేస్తాడు?ఆందోళన!


అతను దగ్గరకి నవ్వుతూ వచ్చాడు. టైర్ లో గాలి లేదని చూశాడు. ఆమె బెదిరిపోతోందని గ్రహించాడు.

“భయపడకండి. నేను మీకు సహాయం చెయ్యడానికి వచ్చాను.

బాగా చలిగా ఉంది కదా! మీరు కారులో కూర్చోండి. నేను స్టేఫినీ మారుస్తాను” అన్నాడు.


ఆమె భయపడుతూనే ఉంది.


“నా పేరు బ్రియాన్. ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్ లో పని చేస్తాను” అన్నాడు.

అతను డిక్కీ తెరిచి కావలసిన సామాను తీసుకుని...కారు కిందకి దూరి జాకీ బిగించాడు.

తారు రోడ్డు గీసుకొన్న రక్తపు చారల చేతులతో ...

జాకీ బిగించి టైరు తీసి టైర్ మార్చాడు. సామాను తిరిగి కారులో పెట్టాడు. ఆమె డబ్బులు తీసి ఇవ్వబోయింది. 

వద్దు అన్నాడు.


“మీరు కాదనకండి. మీరు ఈ సహాయం చెయ్యక పోతే ...

నా పరిస్థితిని తలుచుకుంటే ... నాకు భయం వేస్తోంది” అంది.


“నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు సహాయ పడ్డారు.

మీకు సహాయం చెయ్యాలనిపిస్తే... ఎవరైనా కష్టాల్లో ఉన్నారనిపిస్తే... నా పేరు తలచుకుని వారికి సహాయం చెయ్యండి” అని వెళ్లి పోయాడు.


మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ... ఆమె కారు నడుపుకుంటూ వెడుతోంది. అప్పుడు ఆమెకు ఆకలి గుర్తుకు వచ్చింది.

తను వెళ్ళ వలసిన దూరం చాలా ఉంది. ఆకలి, చలీ ఆమెను రోడ్డుపక్కన ఉన్న హోటల్ కి వెళ్ళేలా చేశాయి.


అదొక చిన్న హోటల్. కస్టమర్ల టేబుల్స్ దగ్గరకి ఒక గర్భిణీ మహిళ సర్వ్ చేస్తోంది. ఆమెను చూస్తుంటే నిండు గర్భిణీ అనిపించింది.

డెలివరీ రోజులు దగ్గరకి వచ్చేసి ఉంటాయి అనిపించింది.

బరువుగా నడుస్తోంది.

అన్ని టేబుల్స్ దగ్గరకీ వెళ్ళి కావలసిన ఆర్డర్ తీసుకోవడం, సర్వ్ చెయ్యడం బిల్ తీసుకుని... చిల్లర ఇవ్వడం అన్నీ తనే చేస్తోంది.

ఆమె ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు.


ఆమె తన టేబుల్ దగ్గరకి వచ్చింది. చిరునవ్వుతో “ఏమి కావాలండి?” అని అడిగింది.


అంత శ్రమ పడుతూ కూడా... చెరిగిపోని చిరునవ్వు ఆమె ముఖంలో ఎలా ఉందో? అని, ఆశ్చర్య పడుతోంది, తను తన మనసులో. 


భోజనం ఆర్డర్ ఇచ్చింది.


భోజనం చేసి ఆమెకు... 2000 రూపాయల నోటు ఇచ్చింది.


ఆమె చిల్లర తేవడానికి వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పటికి ఈమె కనబడలేదు.. ఈమె కూర్చున్న టేబుల్ మీద ఉన్న గ్లాసు క్రింద ఒక కాగితమూ దానికింద... నాలుగు 2000 నోట్లూ ఉన్నాయి.


ఆ కాగితం చదివిన హోటల్ మెయిడ్ కి కన్నీళ్లు ఆగలేదు.

అందులో ఇలా ఉంది ...

“చిరునవ్వుతో ఉన్న నీ ముఖం నీకు బాధలు లేవేమో అన్నట్టు ఉంది. నువ్వు నిండు నెలలతో పని చేస్తున్నావు అంటే ...

నీకు డబ్బు అవసరం అని అనిపిస్తోంది. నాకు ఒక మిత్రుడు సహాయ పడినట్టే అతడిని తలచుకుంటూ ...

నేను నీకు సహాయపడుతున్నాను. నువ్వూ ఇలాగే ఇతరులకు సహాయపడు.” అని రాసి ఉంది..


హోటల్ మూసేశాక ఇంటికి వచ్చింది. అప్పుడే ఇంటికి వచ్చి అలసిపోయి పడుకున్న భర్త చేతి కేసి చూసింది. గీసుకు పోయిన చేతులు రక్తపు చారలతో ఉంది.


అతడి పక్కన మంచం మీదకు చేరుతూ...

“మనం దిగులుపడుతున్నాం కదా ... డెలివరీకి డబ్బులెలాగా అని…

ఇక ఆ బెంగ తీరిపోయిందిలే, బ్రియాన్! భగవంతుడే మనకు సహాయం చేశాడు. ఆయనకి కృతజ్ఞతలు” అంది ప్రశాంతంగా.


**“మనం ఎవరికయినా మనస్పూర్తిగా సహాయం చేస్తే అది ఎక్కడికీ వెళ్ళదు. మనం ఆపదల్లో ఉన్నపుడు తిరిగి మన దగ్గరకే ఏదోలా చేరుతుంది.”అన్నది ఆ కధ యొక్క పరమార్థం..!!✍️```

          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```


🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

భవబంధాలు

 ఈ భవబంధాలు, జనన మరణాల నుండి విముక్తులము కావలెనంటే వైరాగ్యము చాలా అవసరము. 

త్యాగము వలననే వైరాగ్యము అలవడుతుంది. 

వైరాగ్యము అంటే కుటుంబాన్ని వదిలేసి హిమాలయాలకు పరుగెత్తడం కాదు! తన ప్రాపంచిక మౌలిక బాధ్యతలను విస్మరించడం కాదు! ఏకాంతవాసం చెయ్యడం కాదు! కాషాయవస్త్రాలు ధరించడం కాదు! దండకమండలాలను పట్టుకుని తిరగడం కాదు! శిరోముండనం చేయించుకోవడం కాదు! మరి “వైరాగ్యం” అంటే ఏమిటి?! ప్రాపంచిక వస్తు విషయాలపై, అసక్తిని, కోరికలను విసర్జించాలి. 


కక్కేసిన ఆహారంపై వచ్చినంత విరక్తి ప్రపంచిక విషయ సుఖాలపై రావాలి.

కర్మలను భగవంతుని ఆజ్ఞగా భావించి ఫలితం ఆశించకుండా చేయాలి, మనసులో భగవంతుని చింతన నిరంతరం చేస్తుండాలి. 

మన కంటిని తెరవడం ద్వారా సుమారు 80% ప్రాణశక్తి బయటకు పోతుంది.

 కనుక దీనిని కాపాడుకోవడానికి ధ్యానము చేస్తుండాలి. 

మానవ జన్మ మళ్లీ మళ్లీ వచ్చేటటువంటిది కాదు కనుక సమయం ఉన్నంతలోనే భగవంతుని చేరుకోవడానికి సాధన చేస్తుండాలి.


                   *~బాబా~*

జీవితమొక అద్భుతం🌻

 🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸


*🌻జీవితమొక అద్భుతం🌻*


వైవిధ్యభరితమైన సకల జీవరాశి, ప్రకృతి, గ్రహరాశులు... ఇవి- విశ్వంలోని మహాద్భుతాలు. ఆకాశంలో ఏర్పడే హరివిల్లు, చెలియలికట్ట దాటి రాని సముద్రజలాలు, సూర్యకిరణంలోని ఏడు రంగులు... సాటిలేని అందమైన అద్భుత దృశ్యాలు.


మానవ శరీరం పంచభూత సమన్వితం. పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణవాయువులు, మనోబుద్ధి చిత్తాహంకారాలు, అవయవ నిర్మాణాకృతులు... ఇవన్నీ మహాద్భుత సృష్టిలోని అత్యద్భుతాలే.


మనిషి తనలోని శక్తిని పూర్తిగా వినియోగించుకుంటే అద్భుతాలను సృష్టించగలడు. ఆనందంగా నూరేళ్లు జీవించే నైపుణ్యాలు జీవన వికాసానికి అద్దం పడతాయి. చీకటినుంచి వెలుగులోకి ప్రయాణించే అద్భుత జీవనం అంటే అదేనని ఆధ్యాత్మికవేత్తలు అభిప్రాయపడతారు.


ఎవరూ పుట్టుకతోనే ప్రతిభా సంపన్నులు కారు. ఎదిగేకొద్దీ మానసిక పరిణతి, వివేకం, విచక్షణాజ్ఞానం అద్భుతాలు సృష్టిస్తాయి. అణువులో బ్రహ్మాండాన్ని చూడటమే అద్భుతం.


సంకల్పశక్తి, విశ్లేషణాశక్తి, సాధనాశక్తి- ఈ త్రిశక్తిధారణమే అద్భుతాలను సృష్టిస్తుంది. అద్భుతాలను సృష్టించేందుకు మాయలు, మంత్రాలు లేవు. కళ్లు మూసుకు కూర్చున్నంత మాత్రాన అద్భుతాలు జరిగిపోవు. కార్యరంగంలోకి యోధులై కదలనిదే అద్భుతాలు ఆవిష్కృతం కావు.


శ్రీమద్రామాయణంలోని సముద్రోల్లంఘన ఘట్టంలో చేష్టలుడిగి మిన్నకుండిపోయిన ఆంజనేయుడికి, అతడి నిజశక్తిని తెలిపారు వానర ప్రముఖులు. మారుతి సముద్రాన్ని దాటి సీతమ్మ జాడను కనుగొనడం, లంకాదహనం చేసి జానకి ఇచ్చిన చూడామణిని శ్రీరాముడికి సమర్పించడం, ప్రభు ఆలింగనాభాగ్యాన్ని పొందడం, సేతు నిర్మాణం చేయడం... తదితరాలన్నీ అద్భుత రస ఘట్టాలుగా నిలిచిపోయాయి.


తల్లిప్రేమతో తనను తరింపజేసిన యశోదమ్మకు, అంధుడైన ధృతరాష్ట్రుడికి తన అద్భుత విశ్వరూపాన్ని చూపి సౌజన్యమూర్తిగా భాసిల్లాడు శ్రీకృష్ణుడు. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో తన విశ్వరూప ప్రదర్శనతో కిరీటిలోని అజ్ఞానాన్ని పోగొట్టి కర్తవ్యోన్ముఖుణ్ని చేశాడు.


ఆకాశంలో ఎక్కడో దూరంగా గిరికీలు కొడుతూ తిరిగే గరుడపక్షి భూమిపై తిరిగే కీటకాలను, పక్షి సంతతికి చెందిన అల్పజీవులను స్పష్టంగా చూడగలగడం- అద్భుతమైన దృష్టికి నిదర్శనం. ప్రగతి సాధకుడై మనిషి అంతరిక్ష రహస్యాలను శోధించడం, విజయాలు పొందడం- అత్యద్భుత మేధాసంపత్తికి సంకేతం.


జీవన గమనంలో కష్టనష్టాలను మౌనంగా, గంభీరంగా భరించడం, ఓటమిని హుందాగా స్వీకరించడం, అవమాన భారాలను సహించడం, కన్నీరు ఉబికి వస్తున్నా చిరునవ్వులు చిందించే మనోస్థైర్యాన్ని చూపడం- కోపతాపాలను జయించడం, కష్టమని తెలిసినా ప్రయత్నమే విజయానికి నాంది అంటూ సంకల్ప సిద్ధులు కావడం వంటివి ధీరగంభీరమైన వ్యక్తిత్వానికి నిదర్శనాలు. అవి జీవితాన్ని పండించే అద్భుత రసగుళికలు.


చిన్న విత్తనం మొలకెత్తి వటవృక్షమై శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. అల్పజీవి చీమ- తలకు మించిన భారాన్ని ఎప్పుడూ మోస్తూ శ్రమిస్తూ ఉంటుంది. అద్భుత రస సాకారాలకు ఇవి మంచి ఉదాహరణలు. ఎవరో ఫలానా రంగంలో అద్భుతాలు సృష్టించారంటూ చెప్పుకొని మురిసిపోవడం కాదు- తానే అద్భుతాల సృష్టికి కేంద్రమని ప్రతి మనిషీ గ్రహించాలి. ఏదీ అద్భుతం కానట్లు యాంత్రికంగా జీవించడం జీవితం అనిపించుకోదు. సృష్టి యావత్తు చైతన్య స్వరూపమే అన్న జ్ఞానంతో ప్రతి విషయమూ ఓ అద్భుతమే అన్నట్లు జీవించడమే జీవితం అని అందరూ తెలుసుకోవాలి.


🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

ఆరు దోషాలను

 శ్లో𝕝𝕝   *షడ్ దోషాః పురుషేణేహ*

        *హతవ్యా భూతిమిచ్ఛతా!*

        *నిద్రా తన్ద్రా భయం క్రోధః*

        *ఆలస్యం దీర్ఘసూత్రతా!!*


                    *నీతిశాస్త్రమ్*

                 

*భావము* : ఏ మనిషైనా తాను ప్రతిపనిలోనూ సిద్ధిని సాధించి సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా గుర్తింపుని పొందాలంటే సహజంగా తనని పట్టి ఉన్న ఆరు దోషాలను విడిచిపెట్టాలి. అవి: 

1. *నిద్ర* : యుక్తసమయములలో కాకుండా అయుక్తసమయములలో నిద్రను పొందడం లేదా తనకి వినోదాన్ని కలిగించే విషయాలలో నిద్రను విడిచిపెట్టి తన జీవితాన్ని బాగుపరచే విషయాలలో నిద్రను పొందడం లాంటి దుఃస్వభావం ఒకదోషం.

2. *తంద్ర* : తంద్ర అంటే చేయవలసిన పనులను వాయిదా వేసుకుంటే ఆపనిని సాధించలేని స్థితికి దిగజారడం. 

3. *భయం* : చేయవలసిన పనిని ఆశతో చేపట్టి ఇది నాకు సాధ్యమౌతుందా? నన్నెవరైనా దీనివిషయంలో తప్పు పడతారేమో? అనే శంకలతో ఏర్పడేది భయం. అటువంటి భయం మనలోని ధైర్యాన్ని ఉత్సాహాన్ని నాశనం చేసి మనకి వైఫల్యాలనే మిగిల్చి పెడుతుంది.

4. *క్రోధః* : మనం అనుకున్న పనులన్నీ మనం అనుకున్నట్లే జరగాలి అనేది మూర్ఖభావం. ఈ స్వభావం గలవారు తాము చేపట్టే పనుల విషయంలో అత్యాశకు లోనౌతారు.  ఒకవేళ ఆ పని తామనుకున్నట్లు జరగకపోతే కోపాన్ని పెంచుకుని ఆలోచించకూడని ఆలోచనలతో చేయకూడని పనులతో తమని తామే అన్నివిధాలుగా నాశనం చేసుకుంటారు. (క్రోధస్వభావులకు సహనమే పరిష్కారం)

5. *ఆలస్యం* :  ఆలస్యం అంటే సోమరితనం. తనలో శక్తీ ఉన్నా దానిని దాచుకుని శక్తిహీనునివలె తనను ప్రకటించుకుంటూ చేయవలసిన పనులను విడిచిపెట్టడం ఒకదోషం.

6. *దీర్ఘసూత్రత* : ఒక పనిమీదే నిరంతరం దృష్టిపెట్టి చేయవలసిన ఇతర ఆలోచనలపై గాని ఇతరకార్యములపై గాని దృష్టి పెట్టకపోవడం ఒక దోషం. ఇలా ఒకే విషయాన్ని పొడిగించి పొడిగించి ఆలోచించేవాడు ఏ సిద్ధిని సాధించలేడు.

 *ఈ ఆరుదోషాలను ఎవరైతే సద్విచారణతో తొలగించుకుని కర్తవ్యోన్ముఖులౌతారో వారినే లక్ష్మీదేవి వరించి సకలసిద్ధులను ప్రసాదిస్తుంది*...

      

      

తప్పులు ఎంచుకుంటూ పోయే కన్నా..

 ప్రతీ మనిషిలో... తప్పులు ఎంచుకుంటూ పోయే కన్నా...

మంచిని మాత్రమే.. ఎంచుకుంటే...

ఎదో ఒక మంచి.. ఇతురులతో...

మంచి మిత్ర బంధం.. బలపడుతుంది!!

ఇప్పుడు ఉన్న స్వార్ధ సమాజంలో..

ఈ.. మంచిని ప్రోత్సాహించే దిశగా..

ప్రయత్నం చేస్తే.. ఖచ్చితంగా మనం

బలపడతాము!!

ఇప్పుడు ఉన్న పరిస్థితి లో.. మనందరం బల పడాలి!!

ఒక విషయం మీద అనేక రకాల

విశ్లేషణలు కన్నా ఆ విషయంలో..

మంచిని మాత్రం మీద మాత్రమే..

దృష్టి సారిద్దాము...

+ ve attitude అనేక దుర్గతులు నుండి విముక్తి చేసి మనల్ని ప్రగతి

వైపు నడిపిస్తుంది!!

మీ.. విధేయుడు,

మీ.. మి.. రామం ( చైనులు)

సుభాషితం

 *"నేటి సుభాషితం"*

(శ్రీ వాల్మీకి రామాయణం నుంచి, రోజుకొకటి) 


సూచకశ్చ కదర్యశ్చ 

మిత్రఘ్నో గురుతల్పగః

లోకం పాపాత్మనామేతే 

గచ్ఛన్తే నాత్ర సంశయః 

(వా.రా.4.17.36)


*అర్ధం:*

చాడీలు చెప్పేవారు, లోభి, మితృన్ని చంపేవారు, గురువు భార్య పట్ల అసభ్య ప్రవర్తన చేసేవారు - తప్పకుండా నరకానికి పోతారు.


శ్రీ శంకరాచార్య విరచిత 'శ్రీ నారాయణ స్తోత్రంతో' శుభోదయం.


*శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష*

ధర్మో రక్షతి రక్షితః

ఉత్సాహ సంపన్న మదీర్ఘ సూత్రం

 ఉత్సాహ సంపన్న మదీర్ఘ సూత్రం 

క్రియా విధిజ్ఞం వ్యసనే ష్వసక్తమ్।

శూరం కృతజ్ఞం దృఢ సౌహృదం చ 

లక్ష్మీ స్స్వయం యాతి నివాస హేతోః।।


ఉత్సాహ-ఉత్సాహంతో, 

సంపన్నం-కూడిన వాడును,

అదీర్ఘ సూత్రం-త్వర త్వరగా,

క్రియా-పనులు చేసే,

విధిజ్ఞం-పద్ధతి తెలిసిన వాడును,

వ్యసనేషు-దురభ్యాసాలందు,

అసక్తం-సంబంధం లేని వాడును,

శూరం-పరాక్రమవంతుడును,

కృతజ్ఞం-కృతజ్ఞుడైన వాడును, 

చ-మరియును,

దృఢ-బలమైన, 

సౌహృదం-మంచి హృదయం గల వాడును నైన వానిని,

నివాస-తా నుండడానికి,

హేతోః-కారణంగా,

లక్ష్మీః-లక్ష్మీదేవి,

స్వయం-స్వయంగానే,

యాతి-వెళ్తుంది।।


ఈలోకంలో మిక్కిలి చురుకైన వాడును,త్వర త్వరగా పనులు పూర్తి చేసే వాడును,దురభ్యాసాలు లేని వాడును,కార్య నిర్వాహణలో సమర్థుడును, పరాక్రమవంతుడును, కృతజ్ఞుడును,దృఢ సౌహృదం గలవాడును నైన వారి ఇంటికి శ్రీ లక్ష్మీ దేవి స్థిర నివాసం ఉండడానికి స్వయంగానే వస్తుంది।।

14-6-25/శనివారం/రెంటాల

వేగ మాంగ్ల మంటె వేగమ్ముకే సిగ్గు

 వేగ మాంగ్ల మంటె వేగమ్ముకే సిగ్గు

వేస్తె లైఫు లాంగు వేగ మెట్లు

వేగమంటె హోమ్యొ వేగంగ సరిజేయు

సకురు అప్ప రావు సత్య మిదిర!


భావం: "ఇంగ్లీషు మందులతో ఏ జబ్బైనా వేగంగా నయమైపోతుంది" అని ఎవరైనా అన్నారూ అనంటే,వాళ్ళు వట్టి అమాయకులని అర్థం! ఏ చిన్న జబ్బైనా, పెద్ద జబ్బైనా దానికి జీవితాంతం రోజూ వాడుకోమని, కొన్ని మందులు చేతిలో పెట్టి, చచ్చే దాకా అనునిత్యం మందులు వాడిపిస్తూ, ఆ జబ్బును మీకు, మీ వారసులకూ ఆస్తిగా ఇచ్చేదే "ఇంగ్లీషు వైద్యము"! టెంపరరీ రిలీఫ్ ని స్పీడ్ గా ఇచ్చినట్లు బిల్డప్ ఇచ్చి, సంపూర్ణ నివారణ మాత్రం చెయ్యలేక, టెస్టులు, స్కానింగ్ లతో ఎప్పటికప్పుడు షోయింగ్ చేసేదే " ఆంగ్ల వైద్యము"! దీనిని స్పీడ్ అంటే, ఆ స్పీడ్ అనే మాటే సిగ్గుపడుతుంది! రెండు రోజులో, రెండు నెలలో, లేదంటే రెండు సంవత్సరాలో టైము పట్టినా కూడా, ఒక జబ్బు సంపూర్ణంగా, ఏ సైడ్ ఎఫెక్టులూ లేకుండా నయమవ్వాలనుకుంటే, తప్పకుండా హోమియోకి వెళ్ళండి, లేదంటే యోగా, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం ద్వారా కూడా ఎన్నో జబ్బులు సంపూర్ణంగా, సవ్యంగా నయం చేయవచ్చు! అలా కాకుండా ఇంగ్లీషు దొరల చుట్టూ తిరిగితే, మీరు చచ్చినా, మీ జబ్బు మాత్రం చావకుండా, మీ జీన్స్ లో కూడా చేరి, మీ వారసులకు సైతం ఆ జబ్బు వారసత్వంగా ట్రాన్స్ ఫర్ అవుతుంది! హోమియోతో మీ జబ్బు ముదరకుండా మీ దగ్గరే, త్వరగానే, సేఫ్ గా, సమూలంగా (వేళ్ళతో సహా) అంతమౌతుంది! 


సకురు అప్పారావూ ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిజం! 


ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

అసలైన బంధువు।।

 ఉత్సవే వ్యసనే చైవ 

దుర్భిక్షే రాష్ట్ర విప్లవే।

రాజ ద్వారే శ్మశానే చ 

య స్తిష్ఠతి స బాంధవః।।


 ఉత్సవే-సంబరంలోనూ 

వ్యసనే-కష్టంలోనూ, 

చ ఏవ-ఇంకా,

దుర్భిక్షే-కరవు కాలాన,

రాష్ట్ర-దేశంయొక్క,

విప్లవే-తిరుగుబాటునందు,

రాజ ద్వారే-రాజ సముఖమున,

చ-మరియును,

శ్మశానే-శ్మశానంలోను,

యః-ఎవ్వడైతే,

తిష్ఠతి-(కలిసి) ఉంటాడో,

సః-వాడే,

బాంధవః-బంధువు।।


ఈలోకంలో సంబరంలోనూ,కష్ట సమయంలోనూ, కరువు కాలంలోనూ, దేశం అల్లకల్లోలం ఐనప్పుడూ,రాజ సముఖంలోనూ, ఇంకా శ్మశానంలోనూ తోడుగా ఉండిన వాడే అసలైన బంధువు।।

13-6-25/శుక్రవారం/ రెంటాల

సుభాషితం

 *"నేటి సుభాషితం"*

_( శ్రీ వాల్మీకి రామాయణం నుంచి, రోజుకొకటి)_ 

రాజహా బ్రహ్మహా గోఘ్నః 

చోరః ప్రాణివధే రతః 

నాస్తికః పరివేత్తా చ 

సర్వే నిరయగామినః

(వా. రా. 4.17.35)


*అర్థం:* 

రాజును, బ్రాహ్మణుడిని ఆవును చంపేవాడు, దొంగ, నిష్కారణంగా జీవులను చంపడం లేదా హింసించడం లో ఆనందించేవాడు; నాస్తికుడు, తన పెద్దవాడి కంటే ముందే వివాహం చేసుకునేవాడు వీరందరూ నరకానికి వెళతారు.


'శ్రీ ఆకొండి వేంకట కామ శాస్త్రి గారి' కీర్తనతో శుభోదయం 


*శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష*

ధర్మో రక్షతి రక్షితః

గాయంతం త్రాయతే

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝   *గాయత్రీ చైవ సంసేవ్యా ధర్మకామార్థ మోక్షదా|*

         *నిత్యే నైమిత్తికే కామ్యే త్రితయే తు పరాయణః|*

         *గాయత్ర్యాస్తు పరం నాస్తి ఇహలోకే పరత్రచ|*

         *గాయంతం త్రాయతే యస్మాద్గాయత్రీత్యభిధీయతే!!*


                   *_----గాయత్రీ మహత్తు----_*


తా𝕝𝕝 *గాయత్రీ కన్నా గొప్ప మంత్రము ఇహపరాలలో ఎక్కడా లేదు. గానం చేసే వాడిని (జపించేవాడిని) కాపాడుతుంది....కనుక గాయత్రీ అన్నారు*.....


 ✍️VKS ©️ MSV🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు - జేష్ఠ మాసం - కృష్ణ పక్షం -‌ తృతీయ - ఉత్తరాషాఢ -‌‌ స్థిర వాసరే* (14.06.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.






.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*