2, జూన్ 2025, సోమవారం

నిద్దుర రానప్పుడెపుడు

 *2038*

*కం*

నిద్దుర రానప్పుడెపుడు

నిద్దురకై యత్నమొనర నిస్పృహ కలుగున్.

ఒద్దికతో వేరొకపని

నుద్దియచేయుటయె మేల గుర్విన సుజనా.

*భావం*:-- ఓ సుజనా! నిద్ర రానప్పుడు నిద్ర కోసం ప్రయత్నాలు చేస్తే నిరాశ/విసుగు/చికాకు కలుగుతుంది.  జాగ్రత్తగా వేరొక ఉపయుక్తమైన పనిచేయడానికి ప్రయత్నం చేయటం(ఆ పని చేసిన సంతృప్తి చేత నిద్ర రావచ్చు.) మంచిది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

నిన్నిట నువ్వే గెలువగ

 *2037*

*కం*

నిన్నిట నువ్వే గెలువగ

మిన్నైనను తలను వంచు మేలొనరంగన్.

నిన్నలమిన బలహీనత

నెన్నిగెలువ జగతిమెచ్చ నెగడుదు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! నిన్ను నువ్వు గెలిచి నప్పుడు ఆకాశమైనా నీకు ఉపకారం చేయడానికి తలవంచుతుంది. నిన్ను ఆవరించి యున్న బలహీనతలను గుర్తించి వానిని గెలిచినప్పుడు నువ్వు ప్రపంచం మెచ్చుకునే స్థాయి కి ఎదగగలవు.

*సందేశం*:-- నీ లోపమునైననూ(అవయవలోపం వంటి వి కూడా) నీ దోషము నైననూ నువ్వు గెలిచి నిలిచినప్పుడు ప్రపంచం నీకు పాదాక్రాంతం కాగలదు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

సుఖం ఎరుగనివారు

 ప్రపంచంలో సుఖం ఎరుగనివారు

ఎవరైనా ఉన్నారా?


అంటే...

ఉన్నారంటున్నాయి శాస్త్రాలు

వారిని "దుఖఃభాగులు" అంటారు;

వారి వివరాల్లో కెళితే వారు *ఆరు రకాలు*


*1. ఈర్ష్యాళువు*

వీళ్లు ఎవరి వృద్ధిని లేక ఎదుగుదలను చూడలేరు

అలాంటివారిని ఈర్ష్యాళువు అంటారు.


*2. జుగుప్సావంతుడు* 

వీళ్లు దేన్ని చూచినా అసహ్యించుకుంటారు

అలాంటి వానికి సుఖం ఎక్కడుంటుంది.


*3. నిస్సంతోషి*

వీడొక విచిత్రమైన వాడు; వీడికి సంతోషమనేది ఉండదు.

దాంతో వీనికి సుఖమెక్కడ


*4. క్రోధనుడు*

వీడు ప్రతివిషయానికి చిటపటలాడుతూ ఎప్పుడూ 

కోపంతో ఉండే కోపిష్ఠి; వీడికి సంతోషమెక్కడ


*5. నిత్యశంకితుడు*

అన్నిచోట్లా, అందరినీ శంకించేవాడు వీడు;

అంటే ప్రతిదీ అనుమానమే ఇంకేముంది సుఖం?!


*6. పరభాగ్యోపజీవి*

ఎప్పుడూ ఇతరుల సొమ్ముపై ఆధారపడి బ్రతికేవాడు;

వీడికి ఎప్పుడూ ఎవరోఒకరు ఇస్తూ వుంటేనే, లేదంటే 

దుఖఃమే; ఇది సాధ్యము కాదు కదా!? అందుకే వీనికీ

సుఖం సున్నా.


ఈ ఆరుగురురూ ఎప్పుడూ సుఖాన్నీ, ఆనందాన్ని, లేకుండా బాధతో అసంతృప్తితో

జీవిస్తుంటారు కాబట్టి వీరిని *దుఖఃభాగులు* అంటున్నాయి.

మధుమేహం

 మధుమేహం రావడానికి గల కారణాలు - పాటించవలసిన ఆహార నియమాలు - . మధుమేహ నివారణ చూర్ణం.

       

. మధుమేహము కలిగినటువంటి మనుష్యుని యొక్క మూత్రం తేనె వలే తియ్యటి మరియు చిక్కటి మూత్రం వెలువరించును. ఈ మధుమేహము రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది శరీరం నందలి రస,రక్త ధాతువులు కొన్ని కారణాలచే క్షీణించడం వలన వాతం ప్రకోపించడం వలన కలుగునది. రెండోవది శరీరం నందు వాతం సంచరించు మార్గములలో కొన్ని దోషములు అడ్డగించునపుడు వాతం ప్రకోపం చెంది కలుగునది . మొదటి రకమైన ధాతు క్షయముచే వచ్చు మధుమేహము తగ్గుట అసాధ్యము. జీవితాంతం ఔషధాలు వాడుతూ ఉండవలెను.

   

•. మధుమేహ రోగులు తీసుకోవలసిన ఆహార పదార్థాలు -

  

. పాతబియ్యం , పాత గోధుమలు, రాగిమాల్ట్, మేకమాంసం , మజ్జిగ, కందిపప్పు కట్టు, పెసర కట్టు, పాత చింతపండు, ఉసిరికాయ, వెలగపండు, తోటకూర, పాలకూర, మెంతికూర , కొయ్యతోటకూర, పొన్నగంటికూర, లేత మునగ కూర, లేత బీరకాయ, లేత సొరకాయ, లేత పొట్లకాయ, లేత బెండ , లేత క్యాబేజి, లేత టమాటో లేతవి మాత్రమే తీసుకోవాలి . బూడిద గుమ్మడి , కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలి .జొన్నరొట్టె చాలా మంచిది.


• తీసుకోకూడని ఆహారపదార్థాలు -

       

. తేలికగా అరగని ఆహారం నిషిద్దం, చేపలు , రొయ్యలు తినరాదు. మద్యపానం , ధూమపానం నిషిద్దం , పెరుగు వాడరాదు , ఇంగువ, వెల్లుల్లి వాడకూడదు, నువ్వులు , నువ్వుల నూనె , ఆవాలు, ఆవనూనె వాడరాదు. ఎర్రగుమ్మడి తీసుకోరాదు, శనగపిండి తినరాదు, నూనెతో వేపిన పదార్థాలు వాడరాదు, కొబ్బరి ముట్టుకోకూడదు, పనస, ద్రాక్ష, కమలా పండ్లు నిషిద్దం, దుంపకూరలు పూర్తిగా మానివేయాలి, భోజనం చేసిన వెంటనే నిద్రించరాదు, బెల్లము , కొత్త చింతపండు వాడరాదు . 

 

 మధుమేహ ఔషధాలు వాడు సమయంలో టీ , కాఫీ , మద్యం , మాంసాహారం ముట్టుకోరాదు. త్వరగా గుణం కనిపించును. 


• మధుమేహ నివారణా చూర్ణం -

 

. 14 రకాల మూలికలతో చేసిన "మధుమేహ చూర్ణం " మా దగ్గర లభ్యం అగును. ఈ చూర్ణం మధుమేహం, దీర్ఘాకాలంగా మధుమేహం ఉండటం వలన అంతర్గత అవయవాల మీద పడు దుష్ప్రభావాలను అద్భుతంగా నయం చేయును. శరీరంలో కోల్పోయిన శక్తిని పునురుద్దరించును. రక్తశుద్ధి చేయును. శరీరము నందలి వ్యర్థ పదార్ధాలను బయటకి పంపును. శరీరం శుద్ధి అగును. మధుమేహ రోగులకు సంభవించు నరాల దోషమును సంపూర్ణముగా పోగొట్టును.  


ఈ చూర్ణము కావలసిన వారు 9885030034 నెంబర్ నందు సంప్రదించగలరు. 

     

        

     కాళహస్తి వేంకటేశ్వరరావు  


. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

         

. 9885030034

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు - జేష్ఠ మాసం - శుక్ల పక్షం -‌ సప్తమి - మఘా -‌‌ ఇందు వాసరే* (02.06.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

కారాలంటే

 తెలుగువాళ్ళకు 'కారాలంటే ఎంతో యిష్టం.ఈ కారాలను చూడండి.


1. మొదలు పెట్టె కారం -- శ్రీకారం 

2. గౌరవించే కారం ----సంస్కారం, 

3. ప్రేమ లో కారం --- మమకారం 

4. పలకరించేకారం ----సంస్కారం 

5. పదవి తో వచ్చే కారం ---అధికారం, 

6. అది లేకుండా చేసే కారం------ అనధికారం

7. వేళాకోళం లో కారం ---- వెటకారం 

8. భయం తో చేసే కారం ---- హాహాకారం, 

9. బహుమతి లో కారం --- పురస్కారం, 

10. ఎదిరించే కారం --- ధిక్కారం 

11. వద్దని తిప్పికొట్టే కారం-----తిరస్కారం, 

12. లెక్కల్లో కారం --- గుణకారం, 

13. గుణింతం లో కారం -- నుడికారం 

14. గర్వం తో వచ్చే కారం ---- అహంకారం, 

15. సమస్యలకు కారం ----- పరిష్కారం, 

16. ప్రయోగశాల లో కారం------- ఆవిష్కారం, 

17. సంధులలో కారం --- ఉ కారం 

18. సాయం లో కారం --- సహకారం 

19. స్రీలకు నచ్చే కారం--- అలంకారం, 

20. మేలు చేసే కారం ----ఉపకారం, 

21. కీడు చేసే కారం -- అపకారం 

22. శివునికి నచ్చే కారం ---- ఓం కారం, 

23. విష్ణువు లో కారం ----శాంతాకారం, 

24. ఏనుగులు చేసేది --- ఘీంకారం 

25. మదం తో చేసే కారం --- హూంకారం, 

26. పైత్యం తో వచ్చే కారం --వికారం,

27. రూపం తో వచ్చే కారం --ఆకారం 

28. ఇంటి చుట్టూ కట్టే కారం -- ప్రాకారం, 

29. ఒప్పుకునే కారం --- అంగీకారం, 

30. చీదరించుకునే కారం ---చీత్కారం

31. పగ తీర్చుకునే కారం---- ప్రతీకారం, 

32. మన *వైదికప్రపంచం* లోని అందరికి--- నమస్కారం