6, సెప్టెంబర్ 2023, బుధవారం

Krishan


 

ఒకడుగు ముందే..

 ఆయన ఓ అచల హిమవన్నగం

ఎవరన్నారు నాన్న వెనక బడ్డాడని?

ఆయన దిక్కులు తెలిసిన దిక్సూచి

ఎవరన్నారు నాన్న వెనక బడ్డాడని?

ఆయన బహుదూరపు బాటసారి

ఎవరన్నారు నాన్న వెనకబడ్డాడని?


ఆయన నమ్మినోళ్ళ ఆంతర్యం తెలిసిన అంతర్యామి

రేపు లేని, మాపు తెలియని శ్రమజీవి..సర్వసంగ పరిత్యాగి

ఇవ్వడమంటే ఇష్టం, తీసుకోవడం తెలియని త్యాగి

మానావమానాలను నవ్వుతూ పంటి బిగువున భరించడం ఆయన నైజం

బాధ్యతలే తప్ప హక్కులు కోరడు

తనలో తాను కుమిలిపోతాడే కానీ తనువు శాశ్వత మనుకోడు

నిశ్శబ్ధ నుంచి మహా నిశ్శబ్ధం లోకి జారిపోతాడు నర్మగర్భంగా


ఇప్పుడు చెప్పండి?

నాన్న వెనక బడ్డాడా?

ఆయన ఎప్పుడూ ఒకడుగు ముందే.. మునుముందే..//


_అంతరంగ తరంగం

_ఆదూరి వేంకటేశ్వర రావు

________________________

 

Panchaag


 

⚜ *శ్రీ సోమనాథ్ మందిర్*

 🕉 *మన గుడి : నెం 170*





⚜ *ఛత్తీస్‌గఢ్ : సిమ్గా ( రాయిపూర్)*


⚜ *శ్రీ సోమనాథ్ మందిర్*


💠 సోమనాథ్ మందిర్ పేరు అనగానే మన దృష్టి గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్ ఆలయం వైపు వెళుతుంది, ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి.


💠 ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్ జిల్లాలో 

కూడా ఒక సోమనాథ్ ఆలయం ఉంది, ఇది రాజధాని రాయ్‌పూర్ నుండి 45 కిమీ దూరంలో ఉంది.



💠 ఛత్తీస్‌గఢ్‌లోని సోమనాథ్ ఆలయం కూడా రెండు నదుల సంగమం వద్ద ఉంది. 

ఈ నదులలో ఒకటి శివనాథ్ నది, ఇది ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని అంబగర్ చౌకీ కొండ నుండి ఉద్భవిస్తుంది మరియు మరొకటి ధామ్‌తరి జిల్లా నుండి ఉద్భవించే రాయ్‌పూర్ నగరానికి జీవనాడి అయిన ఖరున్ నది.

ఈ రెండు నదుల సంగమం జరిగే పుణ్యభూమిలో దేవతల దేవుడైన మహాదేవుని ఆలయం అక్కడ ఉంది.


💠 ఇప్పుడు దాదాపు 3.5 అడుగుల ఎత్తులో ఉన్న శివలింగం అంతకుముందు 3 అడుగుల ఎత్తు ఉండేది, అంటే ప్రతి సంవత్సరం దాని పొడవు పెరుగుతూ ఉంటుంది.

 దానిని ఇక్కడ సోమనాథ్ అని పిలుస్తారు.


💠 ఖరూన్ మరియు శివనాథ్ నదుల సంగమం వద్ద, సంవత్సరానికి మూడుసార్లు రంగు మారే గుణం కూడా ఈ శివలింగంకి ఉంది. సోమనాథ్ మహాదేవ్ వేసవి, వర్షం మరియు చలికాలంలో వరుసగా ఎరుపు, గోధుమ మరియు నలుపు రంగులతో భక్తులకు దర్శనమిస్తాడు.


💠 ఈ శివలింగం వేల సంవత్సరాల నాటిదని, తవ్వకాల్లో దొరికిందని చెప్పారు.  

ఇది కాకుండా, సంగం మధ్యలో ఒక పురాతన శివుని ఆలయం కూడా ఉంది, ఇది సంవత్సరం పొడవునా నీటిలో మునిగి ఉంటుంది. వేసవిలో, నీటి మట్టం తక్కువగా ఉన్నప్పుడు, సాధారణ ప్రజలు శివలింగాన్ని చూడవచ్చు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి, మాఘ పూర్ణిమ మరియు శ్రావణ సోమవారాల్లో సుదూర ప్రాంతాల నుండి ప్రజలు ఇక్కడికి వచ్చి శివలింగానికి నీటితో అభిషేకం చెయ్యడానికి వస్తారు.


💠 సోమనాథ్ మహాదేవ్ ఆలయం సోమనాథ్‌లోని ఖరున్ నది మరియు శివనాథ్ నది సంగమం వద్ద ఎత్తైన గుట్టపై ఉంది. వృత్తాకార శివలింగం 3 అడుగుల ఎత్తు ఉంటుంది. 

ఈ ఆలయంలో శివ కుటుంబమైన పార్వతి దేవి, గణేశ, కార్తికేయ మరియు నంది విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి. 


💠 ఈ ఆలయంలో త్రవ్వకాల సమయంలో, సోమనాథ్ మహాదేవ్ శివలింగాన్ని పోలిన శివలింగాన్ని నిషాద్ సమాజ్ నిర్మించిన ఆలయంలో స్థాపించబడింది.


💠 ఈ ఆలయ ప్రాంగణంలో ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి. వీటిలో, మా పార్వతి, రాధా-కృష్ణ, మా దుర్గ మరియు రాముడు, లక్ష్మణ, సీత మరియు హనుమంతుని ఆలయం ఉంది.


💠 సోమనాథ్ ఆలయ సముదాయానికి కొద్ది దూరంలో మరికొన్ని ఆలయాలు ఉన్నాయి.

 ఈ ఆలయాలకు కాలినడకన సులభంగా చేరుకోవచ్చు. 

వర్షాకాలంలో రోడ్డు బురదమయంగా మారుతుంది. దీంతో చాలా మంది భక్తులు ఈ ఆలయాలకు చేరుకోలేకపోతున్నారు. సోమనాథ్ ఆలయ సముదాయం నుండి ఖరున్ మరియు శివనాథ్ నదుల సంగమానికి వెళ్లే రహదారి విషయంలో కూడా ఇదే పరిస్థితి. 



💠 ఛత్తీస్‌గఢ్‌లోని సోమనాథ్ ఆలయం రాజధాని రాయ్‌పూర్ నుండి 45 కిమీ దూరంలో మరియు బిలాస్‌పూర్ నుండి 70 కిమీ దూరంలో ఉంది.

Stikaalahastisvaraa


 

Naarasimha


 

శ్రీకృష్ణప్రార్థనా

 *శ్రీకృష్ణప్రార్థనా* రచన-కంచినాథం సూరిబాబు.

1.హేకృష్ణ!నారాయణ!దీనబన్ధో!,

    గోవిన్ద!దామోదర!లోకబన్ధో!।

     హేచక్రపాణే!వసుధాప్రియేశ!, 

      తుభ్యం నమో దేవ!హి విశ్వమూర్తే!।।

భావం=ఓకృష్ణ!ఓనారాయణ!,ఓదీనబంధూ!,ఓగోవిందుడా!ఓదామోదరుడా!,ఓలోకబంధూ!,ఓచక్రపాణి!ఓభూమిప్రభువా!,ఓవిశ్వమూర్తీ!ఓదేవా!నీకు నమస్కారము.

2.మన్దారగన్ధేన విరాజమానం,

 ప్రఫుల్లపద్మాయతలోచనాభమ్।

గోవర్ధనోద్ధారమహానుభావం,

 వన్దే ముకున్దం నవనీరదాభమ్।।

భావం=మందారపుష్పగంధముతో విరాజిల్లేటటువంటి,వికసించినపద్మమువంటి నేత్రములు కలిగినటువంటి,గోవర్ధనగిరిని ఉద్ధరించినటువంటి,మహానుభావుడైనటువంటి,కొత్తగావచ్చిన మేఘమువంటి కాంతికలిగినటువంటి,ముకుందుని నమస్కరించుచున్నాను.

3.గోపాలబాలం నవనీతచోరం,

    శ్రీవాసుదేవం యదువంశధీరమ్।

గోపీజనానన్దకరం చ కృష్ణం,

వన్దే ముకున్దం నవనీరదాభమ్।।

భావం=గోపాలబాలుని,నవనీతచోరుని,శ్రీవాసుదేవుని,యదువంశధీరుని,గోపీజనానందకరుని,కొత్తమేఘమువంటికాంతికలిగినవానిని,కృష్ణుని,ముకుందుని నమస్కరించుచున్నాను.

4.కృష్ణాయ వాసుదేవాయ,

   దామోదరాయ విష్ణవే।

   గోపాలకాయ గోపాయ,

   గోవిన్దాయ నమో నమః।।

భావం=కృష్ణునికొరకు,వాసుదేవుని కొరకు దామోదరునికొరకు,విష్ణువుకొరకు,గోవులను పాలించువానికొరకు,గోవులను రక్షించువానికొరకు,వేదమంత్రములచే తెలియబడేవానికొరకు నమస్కారము,నమస్కారము.

5.గోధూళియుక్తపద్మాంఘ్రిం,

   శైత్యపావనసంయుతమ్।

   అవాచ్యానన్దదాతారం,

   బాలకృష్ణం నమామ్యహమ్ ।।

భావం=గోధూళితోకూడినపాదపద్మముకలిగినటువంటి,చల్లదనముతోను పవిత్రతతోను కూడియున్నటువంటి,చెప్పలేని ఆనందమును కలుగజేసేటటువంటి,బాలకృష్ణను నమస్కరించుచున్నాను.

*ఇట్లు శ్రీకృష్ణాష్టమిశుభాకాంక్షలతో మీ కంచినాథం సూరిబాబు*🪷💐🌸🙏🙏🙏

చిన్న వివరణ

 జైశ్రీరామ్ మన హిందూ బంధువుల్లో ఉన్న సాయి భక్తులకు నాదొక చిన్న వివరణ సాయిబాబా హిందువా ముస్లిమా అనేది కొంచెం సేపు పక్కన పెడదాం కానీ షిరిడీలో ఉన్న సాయి మందిరాన్ని నిర్వహిస్తున్నది ముస్లిమ్స్ వాళ్లు పూర్తి ఆధారాలతో సహా సాయిబాబా మా ముస్లిం వ్యక్తి ఇక్కడికి వస్తున్న హిందువుల డబ్బులు మేము మా ముస్లింల రక్షణ కొరకు మాత్రమే మాకు ఇష్టం వచ్చిన వారికి మాత్రమే వాడుకుంటాము అని కోర్టులో వాదించి గెలిచారు దాన్లో భాగంగానే మసీదులకి మక్కా యాత్రలకు కొన్ని కోట్ల రూపాయలు హిందువుల ద్వారా వచ్చిన షిరిడీలోని హుండీ ఆదాయాన్ని పంచారు అంటే మన హిందువులం అమాయకంగా మనకు  ఉన్న దేవుళ్లను వదిలేసి శిరిడీలోని ఆ ముస్లిం సాయిబాబా దేవాలయంలో డబ్బులు కుమ్మరించి మన తల నరకటానికి ముస్లింసు కత్తి కొనుక్కోమని సహకరించినట్టుగా ఉంది దయచేసి అర్ధం చేసుకొని మీకు సాయిబాబా మీద భక్తి ఉంటే మీ ఇంట్లోనే మీ మనసులోని ధ్యానించుకొని దేవాలయానికి వెళ్లాలంటే కాశీ రామేశ్వరం తిరుపతి శ్రీశైలం అరుణాచలం వంటి ప్రదేశాలకు మాత్రమే వెళ్లవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను జైహింద్

Sri Sri:

ముస్లిం  ఫకీర్    సాయిబ్ బాబా*  నే  short Cut లో  *సాయి బాబా* అని  అంటున్నాము.

సాయిబ్ బాబా అసలు పేరు - సైఫుద్దీన్ బాబా. ఇతను 1918 లో మరణించినాడు.


ముస్లిం అయినా,  సాయిబు బాబా కు,  హిందూ మతం నకు ఎలాంటి సంబంధం లేదు..

1000 సంవత్సరాలనుండి ముస్లిం ల. దండయాత్ర లకు వ్యతిరేకంగా. పోరాటం చేస్తూ,, 

మళ్ళీ 1970 తర్వాత ఒక ముస్లిం ఫకీర్ సాయిబ్ ను  సాయిరాం, సాయి కృష్ణ అంటూ పూజించడం  మన. హిందువుల అజ్ఞానము / అమాయకత్వం..     ఇది . ప్రధాన దేవుళ్ళ పై  జరుగుతున్న   జిహాద్..


1950 వరకు  షిర్డీ లో. ఉన్నది. సమాధి (దర్గా ) మాత్రమే.. 

హిందువుల అమాయకత్వం ను ఆసరాగా చేసుకొని " దర్గా " ను  మందిరం అని పిలవడం ప్రారంభించిన్నారు.. అప్పటి నుంచే  ముస్లిం ఫకీర్ ను హిందువులు,.  హిందూ దేవుని పూజించడం ప్రారంభించారు..


(దర్గా/ సమాధి  అంటే Extention ఉండదు..  కానీ  దేవుని మందిరలు ఎన్నైనా నిర్మించుకోవచ్చు..  అందుకే 1950 తర్వాత ఈ  సమాధి /దర్గా ను. ఒక plan ప్రకారం మందిర్ అని పిలవడం ప్రారంభించారు....  అప్పటి నుంచే ముస్లిం ఫకీర్ సాయిబ్ కు గుడులు కట్టించడం  ప్రారంభం అయ్యింది )


*సాయిరాం / సాయికృష్ణ అంటే కూడా అర్ధం తెలియనంత  అజ్ఞానము లోకి పోయిన్నారు.

*సాయి అంటే ఫకీర్*  అని* అర్ధం..*

*సాయిరాం / సాయి కృష్ణ అంటే  ఫకీర్. రామ్ / ఫకీర్ కృష్ణ.  అని అర్ధం..  

  ఇలా తెలియకుండానే, మన దేవుళ్ళ కు. ముస్లిమికరణ/ ఇస్లామికరణ   చేస్తూ,  ముస్లిం మతం లో కలిపేస్తున్నారు..*


విచిత్రం ఏమిటంటే..  ముస్లిం ఫకీర్ సైఫుద్దీన్ ( సాయిబు బాబా ) భక్తులు *99.9* % చదువుకున్న  హిందువులే..


1950 వరకు వచ్చిన. News పేపర్స్ లలో కానీ,  సాహిత్యం లో  కానీ ఎక్కుడ   కూడా ఈ ముస్లిం సాయిబాబా గురించి  వ్రాయలేదు..   1970 తర్వాత నే మొదటి సారి ఈ సాయిబ్ గురించి ఒక పాట సినిమా లో వచ్చింది. ఆలా ముస్లిం సాయిబ్ ను హిందూ దేవుడు అని ప్రచారం చెయ్యడం లో   వామపక్ష వాదులు / కమ్యూనిస్ట్ లు  విజయం సాధించారు..

ముస్లిం లు కూడ ఈ సాయిబ్ బాబా, మా  ముస్లిం నే అని అంగీకరిస్తున్నారు..  కానీ, హిందువులకే ఇంకా జ్ఞానోదయము కావడం లేదు..

కానీ, విచిత్రం  ఏమిటంటే,  శాస్రాలు, హిందుత్వం గురించి అవగాహనా ఉన్న చాలా మంది  బ్రాహ్మణులూ  ఈ ముస్లిం ఫకీర్ సాయిబ్ కొలవటం చాలా విచిత్రం.. 


దేశం, ధర్మం అంటూ  ఇస్లాం కు. వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న, జాతీయ వాదులు  చాలా మంది,   ఈ ముస్లిం ఫకీర్ సాయిబ్ ను పూజించడం చాలా. విచిత్రం..


ముఖ్యం గా, ఈ సాయిబ్ గుడులు  ఒక్క మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల లోనే ఉన్నాయి..  ఇప్పుడిప్పుడే  ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తున్నారు..


హిందువులు, ముఖ్యం గా  జాతీయ వాదులు ఈ ప్రమాదం ను   అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి.

* *

సైఫుద్దీన్ బాబా,(సాయిబాబా అసలు పేరు,),

ఏ ఒక్క రోజు హిందూ దేవుళ్ళ నీ     పూజించని  ఫకీర్ బాబా( ముస్లిం) ను,  "హిందూ దేవుడు"  గా  హిందువులు  పూజించడం  ఏమిటి?,,   కొంచెం అయినా  ఆలోచన   ఉండాలి కదా? 


శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్,  షిర్డీ వారు  ప్రచురించిన  " శ్రీ  సాయి  సచ్చరిత్రము "


ఫకీర్ కు,    సాయి అనే పేరు ఎలా వచ్చేను,,  పేజీ no.41, 42, 43


సాయిబాబా కు   కోపం వచ్చినప్పుడు  భక్తులపై ఇటుక / రాళ్లు విసిరేవారు. బిగ్గరగా  తిట్టుచుండిరి,, " పేజీ no. 59, 62, 63, 92, 105,,.  etc. 

(  దేవుడు అయితే,  కోపం వస్తే,  భక్తులపై  రాళ్లు,  ఇటుకలు  విసిరి వేయడం  ఏమిటి?,  భక్తులను  తిట్టడం  ఏమిటి?  )


" నేనొక  ముసల్మాన్ (ముస్లిం ) ",   అని,  ఒక మహమ్మదియున్ అని  సాయి బాబా నే  స్వయంగా  చెప్పినారు 

" పేజీ No. 103 &

" సాయి బాబా ఒక  మహమ్మదియున్ ( ముస్లిం ) అని  చెప్పినారు 

" పేజీ No. 112,  226, 232,  ( బాబా గారే  తను  ముస్లిం అని చెప్పిన,  హిందువుల దేవుడు ఎలా అయినారు )


సాయిబాబా,  పొగాకు పీల్చుట / తాగుట ,,  పేజీ no.48,  126,  etc.

               * *

సాయి బాబా  అసలు పేరు - సైఫుద్ధిన్ బాబా,,  

ఫకీర్ లను పర్షియన్ భాష లో  " సాయి ' అని అంటారు,,   ఆవిధంగా  ఫకీర్ పేరు క్రమం గా  " సాయి" గా  మారినది. 

తన జీవితాంతం  మసీదు లోనే గడిపినారు.  ఎప్పుడు   "అల్లా మాలిక్ " అని చెప్పేవారు. 

  * * *

ఏ ఒక్క రోజు  సాయి బాబా  హిందు దేవుళ్ళ ను  పూజించలేదు. 

తను ముస్లిం కాబట్టి,  మసీదు లోనే ఉండి  అల్లా  ను ఆరాధించేవారు. / నమాజ్ చేసే వారు,,

    **  

త్రిమూర్తుల  అంశ తో ఏర్పాడిన అవధూత అవతారం   ధాత్తాత్రేయ,,  

అవతారం నకు  మరో అవతారం  ఉండదు,, 

విష్ణు మూర్తి అవతారం  శ్రీ రాముడు,   కానీ  శ్రీ రాముడు కి  మరో అవతారం  ఉండదు.

విష్ణు మూర్తి అవతారం  శ్రీ కృష్ణుడు,,   కానీ  శ్రీ కృష్ణుడు కి  మరో అవతారం  లేదు,,

అదే విధంగా   దాత్తత్రేయ స్వామీ నే  ఒక అవధూత అవతారం,,  మళ్ళీ  ఒక అవతారం నకు  మరో అవతారం  ఉండదు,,

కానీ,  సాయిబాబా  ధాత్తాత్రేయ   అవతారం గా ఎలా ప్రచారం చేస్తారు,,  కొంచెం అయినా  ఆలోచించాలి గదా?


ఇందులోనే   పెద్ద కుట్ర  ఉన్నది..!!


అయినా మనకు ఎంత మంది గురువు లేరు...,


ఇప్పుడిప్పడే

మన హిందువులు భగవాన్ రమణ మహర్షి ఆశ్రమం చూడటానికి తిరువన్నామలై వెళ్తున్నారు,

ఆదిశంకరాచార్యులు వారు నడయాడిన ప్రదేశాలు చూడటానికి కాలడీ వెళ్తున్నారు,  బేలూరు రామకృష్ణ మఠంకు వెళ్తున్నారు, శృంగేరి మఠంకు వెళ్తున్నారు,

ఇకనుంచైనా  *షిరిడి వెళ్ళకండి*

ఆలోచించండి...👍🏻👍🏻👍🏻👍🏻

కేంద్రప్రభుత్వం* లేబర్ ఇన్సూరెన్స్

 **కేంద్రప్రభుత్వం* ప్రవేశపెట్టిన  

 లేబర్ ఇన్సూరెన్స్ సద్వినియోగం చేసుకోండి** 

➖  ప్రభుత్వ ఉద్యోగులు  తప్ప.

➖  కూలీలతో పాటు అందరు అర్హలే.

➖  తెల్ల రేషన్ కార్డు తప్పని సరి.

➖  ఏడాదికి రూ 22 మాత్రమే.

     5 స0 రాలు ఒకేసారి చెల్లించాలి,కేవలం 110/-రూ.. మాత్రమే.

➖  అవగాహన పెంచుకుందాం.

➖  అందరికీ చేరేలా చేయండి.

1) 18 నుండి 55 years ఉన్న స్త్రీ,పురుషులు అర్హులు.

2) ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైన,ఇతరులైన ఇందులో చేరవచ్చు.

3) రేషన్ కార్డు,ఆధార్ కార్డు,జిరాక్స్ జత చేయాలి.

4) బ్యాంకు చలానా జత చేసి లేబర్ ఆఫీస్ లో ఇవ్వాలి.

*ప్రయోజనాలు*

5) పాలసీదారు సహజ మరణం పొందితే రూ.1,30,000/-రులు ఇన్సూరెన్స్

6.అలాగే ప్రమాద వశాత్తూ మరణం వల్ల రూ.6,00000/-

7) ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు వుంటే ఒకొక్కరికి వివాహ నజరానాగా 30,000/-రూ,,

8) ప్రసవ కానుకగా రెండు ప్రసవాలకు 30,000/-రూ,,చొప్పున వచ్చే అవకాశం ఉంది.

9) 1 year పాలసీ పొందిన తరువాత లబ్ధిదారునికి

ప్రమాదం జరిగి 50% వికలాంగులుగా ఉంటే 2.50 లక్షలు,అదే 100% ఉంటే 5 లక్షల పరిహారం పొందే అవకాశం ఉంది.

👉ఈ లేబర్ ఇన్సూరెన్స్ ఒకసారి 110/-రూ.చెల్లిస్తే 5 సంవత్సరాలు వరకు చెల్లించనక్కర్లేదు.అంటే మీరు చెల్లించేది సంవత్సరానికి 22/-రూ,, అన్నమాట

👉 వెంటనే మీరు,మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు,బంధువు లందరిని చేర్పించండి.

👉 ఇలాంటి ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమైనవి.

కావున వెంటనే మీ మండలంలోని కార్మిక అధికారిని(లేబర్ ఆఫీసర్)MPDO/MRO గార్లను సంప్రదించండి.

చివరగా ఒక్క మాట 

ఈ పథకంలోకి చాలా మంది.....కార్మికులు మాత్రమే చేరవచ్చని అనుకుంటారు.             

అది కానే కాదు.తెల్ల రేషన్ కార్డు కలిగి వున్న ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హులే...

మీ అందరికీ విన్నపము జోక్స్,కార్టూన్లు పంపే బదులు ఈ Msg పంపితే జనం అందరూ తెలుసుకుంటారు.

మీకు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయె వాటన్నిటికీ send చేయండి (or)ఈ Msg ని కనీసం 3 Groups కు పంపించండి.

ఎందుకంటే చాలా మంది   అనారోగ్యంతో బాధపడుతున్నారు.        

50 నుండి 60 స0 లోపు చనిపోతున్నారు.🙏

చంపేసిన" తెలుగు పదాలు

 మనం "చంపేసిన" తెలుగు పదాలు


1. అన్నం బువ్వ (మీల్స్)


29 పుస్తకం - (బుక్)


30) కాగితం - (పేపర్)


2. కూర కర్రీ)


3) కంచం (ప్లేట్) 4) లోటా (గ్లాస్)


31) కలం - (పెన్)


32) పలక - (స్లేట్)


5) పచ్చడి - (చట్నీ) 6) ఊరగాయ - (పికిల్)


33) సూది - (నీడిల్)


34) దారం - (థ్రెడ్)


7) నీళ్లు - (వాటర్)


8) సీసా - (బాటిల్)


35) స్నానం - (బాత్) 36) సబ్బు - (సోప్)


9) చెంచా - (స్పూన్) 10) పాలు - ( మిల్క్


37) సంచి (బ్యాగ్) -


38) పొడి - (పౌడర్)


11) పెరుగు - (కర్డ్)


39) బడి - (స్కూల్) 40) పాఠం - (లెసన్)


12) కోడికూర - (చికెన్ కర్రీ)


13) చేపకూర - (ఫిష్ కర్రీ)


41) లెక్కలు - (మాథ్స్)


14) తుండుగుడ్డ - (టవల్) 42) ఎక్కాలు - (టేబుల్స్)


15) చొక్కా 16) ఉప్పు - (సాల్ట్)


- అంగీ (షర్ట్) 43) సాంఘిక శాస్త్రం - (సోషల్) 44) సామాన్య శాస్త్రం - ( సైన్స్)


17) ఘాటు - (స్పైసీ)


45) చరిత్ర - (హిస్టరీ).


46) అర్ధ శాస్త్రం (ఎకనామిక్స్)


47) బలపం (స్లేట్ పెన్సిల్)


18) చేతి గుడ్డ – ( హాఁ కీ) -


19) బల్ల - (టేబుల్)


20) కుర్చీ - (చైర్


21) మంచం - (కాట్)


48) రంగు - (కలర్)


49) సమయం - (టైం)


22) పొడుగు లాగు- (ప్యాంట్)


50) దారి దోవ (రోడ్) 51) అమ్మ (మమ్మీ)


-


23) తీపి - (స్వీట్)


24) తలుపు -( డోర్)


52) నాన్న - (డాడీ)


25) కిటికీ - ( విండో 26) తాళం (లాక్)


-


53) 30-(505)


54) పిన్ని - అత్త (ఆంటీ)


27) తాళం చెవులు -(కీస్)


55) పెదనాన్న, బాబాయ్, మామ (అంకుల్


28) మీట - (స్విచ్)

నిర్వాణ షట్కము**

 **నిర్వాణ షట్కము**


01*

మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం

న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే

న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః

చిదానందరూపః శివోహం శివోహం

చిదానందరూపః శివోహం శివోహం



ఘనత  గల్గిన చిత్తమ్ము  మనసు కాను 

అరయ బుద్ధిని కాను నే నహము కాను 

చెవులు కన్నులు  నాసిక  జిహ్వ  కాను

అవని వ్యో మాగ్ని  వాయువు నరయ కాను

శివ  చిదానంద రూపమౌ శివుడ నేను 

శివ  చిదానంద రూపమౌ శివుడ నేను     01*



 02*                                                                              

న చ ప్రాణ సంజ్ఞో న వై పంచవాయుః

న వా సప్తధాతుః న వా పంచకోశః

న వాక్పాణిపాదం న చోపస్థపాయుః

చిదానందరూపః శివోహం శివోహం

చిదానందరూపః శివోహం శివోహం



ప్రాణ  సంజ్ఞను  భావింప కాను నేను 

పంచవాయువు లరయంగ నెంచ కాను

రక్త రస మాంస  మేదాస్థి  యుక్త మైన 

సప్తధాతువులను కాను  సంభ్రమముగ

పంచకోశాదివాస సంపత్తి కాను 

మాట చేయి పాదములను  మరియు కాను

శివ  చిదానంద రూపమౌ శివుడ నేను 

శివ  చిదానంద రూపమౌ శివుడ నేను       02*



03*                                                                           

న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ

మదో నైవ మే నైవ మాత్సర్యభావః

న ధర్మో న చార్థో న కామో న మోక్షః

చిదానందరూపః శివోహం శివోహం

చిదానందరూపః శివోహం శివోహం



ద్వేష మనురాగ  లోభముల్ వెదుక లేవు 

ఆరయ ద్వేషానురాగ విహారి కాను 

మోహలోభంబులును కూడ మొదలు లేవు 

మరియు ధర్మార్థ  కామముల్ మహిత ముక్తి

యే వియును లేవు నాకు నే నే మి కాను

శివ  చిదానంద రూపమౌ శివుడ నేను 

శివ  చిదానంద రూపమౌ శివుడ నేను      03*



 04*                                                                            

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం

న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా

అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా

చిదానందరూపః శివోహం శివోహం

చిదానందరూపః శివోహం శివోహం



ఎన్నగా పుణ్య పాపంబు లేవి లేవు 

సుఖము దుఃఖము లనునవి చూడ లేవు 

తీర్థ మఖములు మంత్రముల్ తెలియ లేవు

అనుభ వమ్మది  లేదు నా కనుభ వించ

శివ  చిదానంద రూపమౌ శివుడ నేను 

శివ  చిదానంద రూపమౌ శివుడ నేను      04*



05*                                                                           

న మే మృత్యుశంకా న మే జాతి భేదః

పితా నైవ మే నైవ మాతా న జన్మః

న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యం

చిదానందరూపః శివోహం శివోహం

చిదానందరూపః శివోహం శివోహం



చనెడు భయమది  లేదింక  జాతి లేదు 

జనని జనకులు మరిలేరు జన్మ లేదు

కాను  బంధువు  నరయంగ  కాను సఖుడ

కాను నే శిష్యు డ ను మరి   కాను గురువు

శివ  చిదానంద రూపమౌ శివుడ నేను 

శివ  చిదానంద రూపమౌ శివుడ నేను      05*  



 06                                                                            

అహం నిర్వికల్పో నిరాకార రూపః

విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణాం

సదామే సమత్వం న ముక్తిర్న బంధః

చిదానందరూపః శివోహం శివోహం

చిదానందరూపః శివోహం శివోహం



లేదు  రూపమ్ము చూడగన్   లేదు మార్పు

ఇల ప్ర దేశమ్ము లందున నింద్రియముల

వ్యాప్తి చెందియు ననయమ్ము వరలు చుందు

నరయ సమ దృష్టి నుందు నే నన్ని టందు 

ముక్తి బంధమ్ము లవిలేవు రక్తి లేదు

శివ  చిదానంద రూపమౌ శివుడ నేను 

శివ  చిదానంద రూపమౌ శివుడ నేను        06*



గోపాలుని మధుసూదన రావు

ATM card covers

https://www.apteachers9.com/2023/09/atm-card-do-you-have-atm-card-but-in.html 

CHEER THIS BOY.*

 *CHEER THIS BOY.*


*In Bangalore Guru Ravi Shankar Guruji University, Student Priyavrata is the First Vedic Professor in India and the Youngest Adult to get GOLD MEDAL at the age 16yrs.*

*Cleared all the 14 Levels of Sanskrit Shastra Tenali MahaPariksha..*

Phd in Sanskrit

Logic

Vedam

Panini Grammar

Kavya Drama Decoration..

Currently a Professor Training University Students.                       *See The Tejasam Glow In His Face:-)*🇮🇳.                               🌹

తేలిగ్గా క్రైస్తవులుగా మారిపోతారు

 "బ్రహ్మణులను అంతం చేస్తే భారతీయులందరు తేలిగ్గా క్రైస్తవులుగా మారిపోతారు" సెయింట్ జోవియర్ అనే క్రైస్తవ మత బోధకుడు పోర్చుగల్ రాజుకి ఉత్తరంలో వ్రాసిన సారాంశమిది.....

       బ్రాహ్మణ వ్యతిరేక వాదం, భారతీయులకు ముఖ్యంగా కొన్ని వర్గాల వారికి నూరిపోసిన దృష్టాంతనికి పరాకాష్ట ఆ పలుకులు..పరాయి మత చాందస వాదులచే భారతీయుల మెదడు పొరలలో నాటబడ్డ బ్రాహ్మణ వ్యతిరేక సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి కాస్తoత బుర్ర ఉంటే చాలు, మరి ప్రపంచాన్నే మార్చేసే తెలివితేటలు ఎం అవసరంలేదు....

ఈ పుణ్య భారత ధరిత్రిని ఇస్లామీ మతోన్మాద పాలకులు 800 సంవత్సరాలు, ఇసాయి మతోన్మాద పాలకులు 200 సంవత్సరాలు పాలించారు...ఈ జాత్యహంకార మతోన్మాద పాలకులు భారత దేశాన్ని, దేశ సంపదని దోచుకుంటూ మన మెదడు పొరలలో నాటిన ఒక విషబీజం బ్రాహ్మణ వ్యతిరేకవాదం.....

       హరిజనులు,నిమ్నకులాలు,అణగారిన వర్గాలని అణిచివేసింది కొంత మంది భూస్వాములు,జమీందార్లు ఇసాయిలు, ఇస్లామీలు కానీ బ్రాహ్మణులు కారు కదా..

మన దేశాన్ని పాలించిన హిందూ చక్రవర్తుల్లో అధిక శాతం బ్రహ్మణేతరులే కదా.. సామ్రాట్ చంద్రగుప్తమౌర్య, ఛత్రపతి శివాజీ మహారాజ, చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు కాకతీయ చక్రవర్తులు శాలివాహన చక్రవర్తులు చోళులు పాండ్యులు చేర హోయసళ చక్రవర్తులు ఇంకా చాలా చాలా రాజవంశాలు..వీరెవ్వరు బ్రాహ్మణులు కారు కదా.. 

*హిందూ సనాతనధర్మాన్ని పునఃప్రతిష్ట చేసిన అపర శంకర భగవానులు శంకరాచార్యులు ఒక చండాలుడి పాదాలపై పడ్డాడు, ఏం శంకరులు బ్రాహ్మణులు కారా...

*భగవాన్ రామనుజాచార్యుల వారు నీ తల వేయి వక్కలవుతుందని హెచ్చరించిన ధైర్యంగా పవిత్రమైన "ఓం నమో నారాయణాయా"మంత్రాన్ని అందరికి ఉపదేశించాడే కానీ,నా వర్గం కదా అని బ్రహ్మణులుకే చెప్పలేదే..

*చాణక్యుడు బ్రహ్మణుడే..కానీ పట్టం కట్టింది మాత్రం బ్రాహ్మానేతరుడు అయిన చంద్ర గుప్తుడికి అని చరిత్రలో ఉన్నది కదా.. 

*సమర్థ రామదాసు బ్రహ్మణుడే కదా.. పట్టం కట్టింది నిమ్నవర్గానికి చెందిన హిందూ సామ్రాజ్య స్థాపకుడైన శివాజీ మహారాజుకి..

*గోవింద దీక్షితులు.. పట్టం కట్టింది శూద్రనాయకుడైన జనాంగానుడికి.. 

*విద్యారణ్యుడు పట్టం కట్టింది కురబలైన హరిహర-బుక్కరాయ సోదరులకే.

ఇంకా చరకుడు, శుశ్రుతుడు,వరాహామిహిరుడు,ఆర్యభట్ట....

ఇలా చరిత్రలో చాలా మంది బ్రాహ్మణోత్తములు దేశం కోసం ధర్మం కోసం వర్గ బేదం లేకుండా హిందువులు అందరి కోసం సర్వం వదిలేసిన వారున్నారు..కానీ కొందరి బ్రాహ్మణుల వల్ల మొత్తము బ్రాహ్మణ సమాజాన్ని అవమాణిస్తారా...???

మరి ఈ బ్రహ్మణులు పూజించేదెవరిని..క్షత్రియుడైన శ్రీరామున్ని,గొల్లగోపకుడు యాదవుడు శ్రీకృష్ణున్ని, స్మశానంలో సంచరించే శివున్ని..

కుహనా మేధావులు చెప్తా ఉంటారు వేద జ్ఞానం కేవలము బ్రహ్మణులకే అని.. అలా అయితే పవిత్ర రామయాణన్ని రచించింది ఎవరు..?? మహాభారతం, భగవద్గితలను, పురాణలను రచించిన వారు బ్రాహ్మానులు కాదు ఇతర వర్గాలకు చెందిన వారే కద.. 

ఈ రోజు బ్రాహ్మానులకు గవర్నమెంట్ పథకాలుండవు,Resarvations ఉండవు.. ఎంత మంది బ్రాహ్మణులు పేదరికంలో మగ్గిపోతున్నారో చూడట్లేదా..??ఇతర కులాల్లో ధనికులు-బీదలు ఎలాగైతే ఉన్నారో, బ్రహ్మణులలో కూడా అంతేగా..కానీ ప్రతి అడ్డమైనా ఎదవకి Target మళ్ళీ బ్రహ్మణులే.. ఇదెక్కడి న్యాయమండి..ఎప్పుడో కొందరు చేసిన ఎదవ పనులకు వీరా బాధ్యులు..!!.ఈ రోజుకి కాశీ కి వెళ్తే రిక్షా తొక్కే వాళ్లలో సగం మంది బ్రహ్మణులే.. ఢిల్లీ రైల్వేస్టేషన్ లో కూలీ పని చేసేవారిలో 50% మంది బ్రహ్మణులే..అంతెందుకు మన తెలుగు రాష్ట్రాలలో వంట పని చేసేవారిలో 75% మంది బ్రహ్మణులే.....

    ఈ రోజు కొత్త మనుషులు పుట్టుకొచ్చారు..కాళ్లు లేనివారికి కాళ్ళు,చూపు లేనివారికి చూపు..నయం కాని Aids ని కాన్సర్ ని కూడా నయం చేసే అన్యమతస్తులు ఆఖరికి ఇంకాసేపట్లో చనిపోయేవారిని కూడా బతికిస్తాం అని మభ్యపెడుతున్నారు.. స్వస్థత సభలటవి.. కానీ వాళ్లని ఎవ్వరూ ఏమి అనరు.. కానీ వారిని హిందువులు ఎవరైనా విమర్శిస్తే మాత్రం బ్రాహ్మణులను అనరాని మాటలు అంటారు, బ్రాహ్మణులు తేరగా దొరికారు కదా..... 

        చరిత్రలో బ్రాహ్మణులపై దాడులు చూస్తే.. హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని ఎంతోమంది బ్రహ్మణులని ఊచకోత కోశారు, అప్పుడు కత్తులతో, ఇప్పుడు మాటలతో..

         మహా పవిత్ర పుణ్య క్షేత్రం అయిన కాశీలో, గంగ ఒడ్డున మతం మారడానికి నిరాకరించారు అన్న కారణంతో వేల మంది బ్రాహ్మణులను వారి పిల్లలను గొంతులు కోసి నరికి చంపి దూరం నుంచి కనపడే విధంగా ఒక పెద్ద గుట్టగా వేసాడు ముస్లిం మతోన్మాద ఔరంగజేబు.. అమాయక బ్రాహ్మణుల జంధ్యాలు తెంచి గుట్టగా పోసి నిప్పంటించి చలి కాచుకున్నడు క్రూరుడైన ఔరంగజేబ్.. 

 వేల మంది గౌడ సరస్వతి బ్రాహ్మణులను కిరాతకంగా చంపించాడు సెయింట్ జేవియర్ నేర విచారణ పేరుతో.. దీనినే మనం "Goa Inquisition" పేరుతో చరిత్రలో చదివాము కదా..... 

       మైసూరు ప్రాంతం మేల్కొటే పట్టణంలో దీపావళి పండుగ రోజున 800 మంది అయ్యంగార్ బ్రాహ్మణులను ఊచకోత కోయించాడు టిప్పు సుల్తాన్. అందుకే ఇప్పటికీ ఆ ప్రాంతంలో బ్రాహ్మణులు దీపావళి జరుపుకోరు. 

ఇక కాశ్మీరీ పండిట్ల సంగతి తెలియనిది ఎవరికీ. మతం మారతారా లేక ఇళ్ళు విడిచిపెట్టి పోతారా అని నమాజ్ అనంతరం మైకుల్లో ప్రకటన చేస్తే ప్రాణాలు అరచేత పట్టుకుని ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిభిరాలలో చేరి దిక్కు లేని జీవితం గడుపుతున్నారు లక్షల మంది కాశ్మీరీ హిందువులు.. ముష్కర జీహాదీల చేతుల్లో వేలాది మంది హత్య చేయబడ్డారు.. 

బ్రాహ్మణులు ప్రధానంగా జ్ఞానానికి ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల, మత మార్పిడి మాఫియాలు ఎక్కువగా బ్రాహ్మణ వ్యతిరేక కధలు ప్రచారం చేస్తుంది. వారు చెప్పే తాటాకు, చెంబు కధలు చరిత్రలో ఎక్కడా కనపడవు. కాని ఒక అబద్దాన్ని పదే పదే చెబితే దాన్నే నిజం అనుకుంటుంది ఆలోచించే సమయం లేని లోకం.....

     హిందూ ధర్మాన్ని అంతం చేయాలంటే బ్రాహ్మానులను అంతం చేయాలి ఇదే ముస్లిం కృిస్టియన్ మతోన్మాదుల కమ్యూనిస్టు ఉన్మాదుల సిద్ధాంతం.. నేటికి కూడా అన్యమతస్తుల మూకుమ్మడి ఓట్ల కోసం ఇలా బ్రాహ్మణ వ్యతిరేక సిద్ధాంతాన్ని కొన్ని పార్టీలు వెనక ఉండి నడిపిస్తున్నారు. దయచేసి హిందువులు ఎవరు వారి ఉచ్చు లో పడకండి,ఎంతో మంది ముస్లింల పాలనలో వేదశాస్త్రాధ్యనాలు చేసేవారిని క్రూరంగా చంపారు, అయినా ధర్మం కోసం ప్రాణాలను పణంగా పెట్టి చదివి తరువాత తరాలవారికి అందించిన వారు బ్రాహ్మణులు, బ్రిటిష్ వారు ఎంతో మంది బ్రాహ్మణుల నుండి వేద శాస్త్ర భాష్యాలను నేర్చుకుని వారి ని వధించారు. ఎన్నో ముష్కరదాడులనుండీ లక్షల సంఖ్య లో ప్రాణత్యాగాలు చేసి ఎన్నో దేవాలయాలను కాపాడారు బ్రాహ్మణులు. ఇప్పటికీ సంపాదనలేకపోయినా సాంప్రదాయంగా వేదశాస్త్ర అధ్యయనాలు చేస్తూ జీవితాలను త్యాగం చేస్తున్నారు బ్రాహ్మణులు, కానీ కమ్యూనిస్టు లు,హేతువాదులు(వ్యాధులు),అంబేద్కరిస్టులు,బుధ్ధిస్టులు పేరులతో భారత స్వదేశంలో ఉన్న విదేశీ క్రైస్తవులు బ్రాహ్మణుల ను అడుగడుగునా వేధిస్తూనే ఉన్నారు., గ్రామాలనుండి తరిమేసారు,నానారకాల పనులు చేసుకుంటూ కూడా సర్వేజనాస్సుఖినో భవన్తు అనుకుంటూనే బ్రతుకుతున్న బ్రాహ్మణుల ను దూరం చేసుకుంటే నష్టపోయేది హిందూ సమాజమే,తద్వారా క్రైస్తవ, ముస్లింలు పెరిగి శాంతి కూడా నశిస్తుంది. మనకోసం జీవించే బ్రాహ్మణుల ను,గోవులను కాపాడుకోండి. *గోబ్రాహ్మణేభ్యశ్శుభమస్తు నిత్యం లోకాస్సమస్తాస్సుఖినో భవన్తు*

 మన సనాతన ధర్మాన్ని నిజమైన భారత చరిత్ర ని తెలుసుకోండి, ధర్మంగా జీవించండి.....

Courtesy :- శ్రీమాన్ Prasadrao Klg గారు 🙏🙏💐


నేను విశ్వకర్మీయుణ్ణి, బ్రాహ్మణుడను కాను.....

బసవ పురాణం - 24 వ భాగము....

 🎻🌹🙏బసవ పురాణం - 24 వ భాగము....!!


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


    🌹దీపదకళియారు కథ:🌹


🌸కాంచీపురంలో దీపదకళి అనేమహాభక్తుడు ఉండేవాడు. ఒకనాడు అతడు పొరుగూరుపోయి తిరిగి వస్తుండగా ఒక జీర్ణాలయం కనబడ్డది. 


🌿అది చూచి దీపదకళి ఎంతో బాధపడ్డాడు. దిక్కులేని వానిలాగా శివుడు ఇక్కడున్నాడే. ఈయనకు నైవేద్యాలు భోగ భాగ్యాలు అటుంచి కనీసం దీపారాధన కూడా లేకుండా పోయిందే అని విచారించాడు. 


🌸వెంటనే తన ఇంటికి పోయి ఆస్తిమొత్తమూ అమ్మి శివునికి రమణీయమైన దేవాలయం కట్టించాడు. ఆలయం చుట్టూ మనోహరమైన ఉద్యానవనాన్ని ఏర్పాటుచేశాడు. 


🌿స్వామికి నిత్యధూప, దీప నైవేద్యాలు జరిగేటట్టు చేశాడు. ఈ విధంగా కొంతకాలం భోగం నడిచింది. క్రమంగా ధనం అయిపోయేసరికి భోగభాగ్యాలు తగ్గిపోయాయి. 


🌸అప్పుడు తానే కాళ్ళకూ చేతులకూ గజ్జెలు కట్టుకొని నర్తిస్తూ దీపం వెలిగించి భోగాలు జరిపాడు. కొంత కాలానికి ఆ ధనం కూడాఅయిపోయింది. అప్పుడు దీపారాధనమే కష్టమయింది.


🌿 క్రమంగా చెట్టుకొమ్మలు తెచ్చి వెలిగించి దీపాలవలె చేశాడు. కొంతకాలానికి చెట్టు కొమ్మలు కూడా సేకరించే ధనం లేకపోయింది. అప్పుడు గడ్డిని వెంటిగా చేసి వాటిని నూనెతో తడిపి దీపారాధన చేశాడు. 


🌸గడ్డి నూనె కూడా అయిపోయింది. అప్పుడు ఇంట్లోగల సమస్త వస్త్రాలూ కాగడాలుగా చుట్టిస్వామికి కైంకర్యం చేశాడు. చీరెల దివిటీలు కూడా అయిపోయాయి. చివరకు ఏమీ మిగలలేదు.


🌿 అప్పుడు దీపదకళియారు తన జుట్టును పొడవైన జడగా అల్లి దానికి నూనె రాసి, వెలిగించి స్వామి ముందు కాగడా పట్టాడు. జడ క్రమంగా తగలబడుతూ తలవరకూ వచ్చింది. 


🌸అప్పుడు శివుడు ప్రత్యక్షమై ‘దీపదకళీ! నీ భక్తికి మెచ్చాను. ఏమి కావాలో కోరుకో’ అన్నాడు. ‘స్వామీ! నాకే కోరికలూ లేవు. నీవు ఇట్లా దిక్కులేనివాడిలా ఈ నిర్జన ప్రదేశంలో ఉండటం నాకిష్టంలేదు. 


🌿వెండి కొండగల మహానుభావుడివి. నీవిక్కడ ఉండకూడదు అన్నాడు.శివుడు దీపదకళి కోరికను మన్నించి దేవాలయాన్ని శివలింగాన్ని, మొత్తాన్ని పెకలించుకొని దీపదకళితో సహా కైలాసానికి వెళ్లిపోయాడు.


🌷నాట్యనమిత్తండి కథ🌷


🌸(బసవన్న చెన్నబసవనికి చెప్పిన కథ)పూర్వం కంచిలోపల నాట్య నిమిత్తండి అనే మూఢ భక్తుడు ఉండేవాడు. ఒకనాడాయన శివాలయానికి పోయాడు. 


🌿అక్కడ ఏకామ్రనాథుని విగ్రహం చూచాడు. శివమూర్తి తాండవ భంగిమలో ఉన్నాడు కదా! అది చూచి నాట్యనమిత్తండి భయపడి పూజారిని పిలిచి ‘అయ్యా! స్వామివారికి జడ ముడి వీడిపోయింది.


🌸 శరీరం వంకరలు తిరిగింది. తల వాలిపోయింది. ఎందువల్ల? అని ప్రశ్నించాడు. పూజారి నవ్వి ‘‘అదా! నీ శివుడికి వాయురోగం వచ్చిందయ్యా! అందుకని వంకరలు తిరిగాడు’


🌿 అని ఎగతాళి పట్టించాలని చెప్పాడు పూజారి. నాట్యనమిత్తండి నిజమేనని నమ్మి దుఃఖించసాగాడు. ‘ఆలస్యమైతే శరీరమంతా ఇలాగే కొంకర్లు పడుతుంది. అప్పుడు నీ శివునికే కష్టం. 


🌸నాకు దీనికి మందు తెలుసు. డబ్బిచ్చి బాగుచేయించుకో’ అన్నాడు పూజారి. అప్పుడు నాట్యనమిత్తండి ఇంటికి పోయి తన సమస్త సంపదనూ అమ్మివేసి తెచ్చి పూజారికి ఇచ్చాడు. 


🌿పూజారి విగ్రహానికి కొంచెం ఆముదం పూసి వాయుతైలాదులు మర్దన చేశాడు. ఇకపో అన్నాడు. నాట్యనమిత్తండి మళ్లీ కొద్ది రోజులకు వచ్చి చూచాడు. శివవిగ్రహం అలాగేంది. 


🌸అయ్యో! శివుడికి రోగం కుదరలేదు. ఈ ఆకులవల్లా, తైలాలవల్లా ప్రయోజనం శూన్యం. ఆత్మత్యాగమే దీనికి మార్గం అని నిశ్చయించుకొని నాట్యనమిత్తండి బలిదానానికి పూనుకున్నాడు. 


🌿అప్పుడు శివుడు ప్రత్యక్షమై ‘నమిత్తండీ! నీ భక్తికి మెచ్చాను. వరం కోరుకో అన్నాడు. నాకే కోరికలూ లేవు స్వామీ! మీ శరీరం వంకరలు పోవడం నేను సహించలేను అని మనవి చేశాడు నమిత్తండి.


🌸శివుడు చిరునవ్వు నవ్వి అది వంకరలుపోవడం కాదనీ తాండవలీల అని వివరించాడు.నాట్యనిమిత్తండి శివుని ముఖంగా తాండవలీలకు వివరణం విని సంతోషించాడు. 


🌿శివుడు తన వెంట దివ్య విమానంలో నాట్యనమిత్తండిని కూడా కైలాసానికి తీసుకొనిపోయాడు.ఉడుమూరి కన్నప్ప కథ(బసవన్న చెన్న బసవనితో)పూర్వం శ్రీకాళహస్తి ప్రాంతంలో అరణ్యంలో ఉడుమూరి కన్నప్పడు అనే శివభక్తుడు ఉండేవాడు. 


🌸ఒకనాడు కన్నప్పడు వేటకు వెళ్లి అలసిపోయి ఒక చోట పడుకున్నాడు. అప్పుడతనికి కల వచ్చింది. అందులో రుద్ర చిహ్నాలతో ఒక తపసి కనపడి కొంచెము ముందుకుపో. నీకు లింగమూర్తి కనపడుతాడు. 


🌿అతడే నీకు ప్రాణలింగంగా భావించుకో’ అని చెప్పి అదృశ్యమైనాడు. కన్నప్పనికి మెలకువ వచ్చింది. లేచి కొంత ముందుకు పోయాడు. కలలో తపసి చెప్పినట్లే అక్కడ ఘన లింగమూర్తి కనిపించాడు. 


🌸అది చూచి ముగ్ధ్భావనతో కన్నప్పుడు ఇలా అన్నాడు.శివా! నీవు ఒంటరిగా ఇక్కడ ఉండటానికి కారణం ఏమిటి? అన్నదమ్ముళ్ళతో దెబ్బలాడి వచ్చావా? చెప్పు. నీ అలుక తీరుస్తాను....సశేషం...🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

భాగం 11/12 ॐ శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం

 .   

                    భాగం 11/12 


ॐ    శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం 

(ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం - 2007లో "రామాయణం"పై నిర్వహించిన సదస్సులో సమర్పించిన, 

   "శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం" 

    అనే పత్రంలోని ఒక అంశం) 


               ----------------------- 


          10. వైద్యశాస్త్రం 


       విదేశీ వైద్య విజ్ఞానం ప్రస్తుత కాలంలో బహుళ వ్యాప్తి చెందియుంది. కానీ దానిని సంపూర్ణ జ్ఞానంగా పరిగణించలేము. ఆ విధానంలో 

  - ఇప్పుడున్న వ్యాధులకు చికిత్సా విధానం సంపూర్ణంగా గానీ, కొన్ని వ్యాధులకు అసలు చికిత్సేగానీ లేకుండా ఉంది. 

  - క్రొత్త వ్యాధులకు చికిత్స సంగతి సరేసరి. 

    ఈ రెండు సందర్భాలలోనూ, నిరంతర పరిశోధన జరిగినా, ఫలితం సంపూర్ణతను అందివ్వడం జరుగదు. 


      శ్రీమద్రామయణంలో కొన్ని సంఘటనలు, ఆ కాలంలో వైద్యవిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందిందో తెలుస్తుంది. 


సంజీవని 


      ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ప్రయోగంతో రామలక్ష్మణులు మూర్ఛిల్లుతారు. 

      అప్పుడు జాంబవంతుడు హనుమంతునితో హిమవత్పర్వతాలకి వెళ్ళాలని సూచిస్తూ, నాలుగు ఓషధులను గూర్చి తెలిపాడు. అవి 

1. మరణించినవారిని బ్రతికించే "మృత సంజీవని", 

2. శరీరంలో ఉన్న ములుకులు తొలగించే "విశల్యకరణి", 

3. విరిగిన శరీరభాగాలని అతికించే "సంధానకరణి", 

4. దేహానికి మంచిరంగు కలిగించే "సువర్ణకరణి". 


    సంధానకరణికి ఈ కాలంనాటి ఉదాహరణ: 

    అవిభక్త ఖమ్మం జిల్లాలో భాగమైన చర్ల సమీపాన ఒక గిరిజన గ్రామంలో 

    పరదేశీ అనే ఒక గిరిజనుడు ఒక పసరును కోడి ఈకతో రాస్తే, విరిగిన ఎముక వెంటనే అతుక్కునేదట. 

    కొలది కాలం క్రాతమే అతను మరణించాడు. 

    అతను ప్రదర్శనగా, 

    మాంసం కోసం చంపిన మేకని, దాని ముక్కలను చేర్చి, ఆ పసరు రాసి విరిగిన ఎముకలు కలవడం చూపేవాడట. 

    అతనినీ, అతని చికిత్సనీ ప్రత్యక్షంగా చూసినవాళ్ళు ఇప్పటికీ సాక్ష్యంగా ఉన్నారు. 

    ఇతరులు ఆ వైద్యం  నేర్చుకోవటానికి ఉత్సాహం చూపనందువలన అది అతనితోనే అంతమైపోయింది.

     

 సువర్ణకరణి: 

     హనుమ తెచ్చిన పర్వత ఓషధుల వాసనను ఆఘ్రాణించగానే, రామలక్ష్మణుల దేహంలోని శల్యాలూ తొలగిపోయాయి. 

    రుగ్మత మాయమైంది. 

    మరణించిన వానరులందఱూ ప్రాణాలతో లేచారు. 


    బాలరాజు మహర్షి హిమాలయాలకి వెళ్ళి, మూలికా వైద్యశాస్త్రాన్ని పొంది తెలియజేశారు. 

    దానిని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యరూపంలోకి తీసుకువచ్చింది. అది ఒక సమగ్ర పుస్తకరూపంలో లభించడం గొప్ప అదృష్టం. 


బాధోపశమనం 


    ఇంద్రజిత్తు వధానంతరం గాయపడిన లక్ష్మణునికి సుషేణుడు చికిత్స చేశాడు. 

    లక్ష్మణుడు నాసిక ద్వారా ఉత్తమ ఓషధిని పీల్చగానే, 

    శరీరంలోని శల్యాలన్నీ తొలగిపోయి, 

    గాయాలు మాని, 

    అలసట తగ్గి, 

    స్వస్థతపొంది, 

    క్షణకాలంలోనే బాధోపశమనంతో   సంతసించాడట. 

    ప్రస్తుత విదేశీ వైద్యపద్ధతిలో మందులవలె ముందుగా  తాత్కాలికోపశమనం పొందే విధానంగా కాకుండా, 

    క్షణంలో తగ్గి, శరీరం పూర్వపు ఆరోగ్యస్థితికి వెంటనే రావడం దీనిలోని విశేషం. 


శస్త్ర చికిత్స 


    సీతామాత లంకలో తనలో తనే బాధపడుతూ, 

   "శస్త్ర చికిత్సకుడు గర్భస్థప్రాణిని ఛేదించినట్లు, ఆ రావణుడు తన అవయవాలని శస్త్రంతో ముక్కలు చేస్తాడ"ని అనుకుంటుంది. 

    తద్వారా ఆనాటి శస్త్రచికిత్సా విధానాన్ని సూచనప్రాయంగా తెలియజేసింది. 


అవయవ మార్పిడి 


    కైక దశరథునితో మాట్లాడుతూ, 

    గతంలో అలర్క మహారాజును ఒక వేదపండితుడైన బ్రాహ్మణుడు యాచిస్తే, 

    ఆ రాజు తన నేత్రములను పెకలించి, ఆ బ్రాహ్మణునికి దానం చేశాడని ఉదహరిస్తుంది. 

    తద్వారా అవయవ మార్పిడి చికిత్స ఆ రోజులలోనే ఉండేదని స్పష్టమౌతుంది.


ఆయుర్వేదం 


    ఆయుర్వేదం అద్భుతమైన భారతీయ వైద్యశాస్త్రానికి వేద ప్రామాణికమైనది. 

    అద్భుత చికిత్సలు చేసిన, చరకుడు - శుశ్రుతుడు వంటి ఆయుర్వేద వైద్యులు, 

    అందుబాటులో ఉన్న ఇప్పటి చరిత్ర కాలానికి చెందినవారే కదా!

    భారతీయ వైద్య విధానం ఆయుర్వేద వైద్యపద్ధతికి చెందినది. 


    మనం ఇప్పటిదాకా పరిశీలించిన

శ్రీమద్రామాయణంలోని వైద్యవిధానం ఆ భారతీయ వైద్య ప్రామాణికమైనదని తెలుస్తుంది కదా! 

    అభివృద్ధిచెందిన ఆ సంప్రదాయ వైద్యవిధానాన్ని మనం స్వీకరిస్తే, 

    - ఏ రుగ్మతలకైనా ప్రామాణికమైన చికిత్స, 

    - ఆర్థిక పరమైన అవుసరాలులేక 

    (ఒళ్ళూ ఇల్లూ గుల్లవకుండా) 

    వ్యాధులనుండీ బయటపడే అవకాశం ఉంటుంది కదా!


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

Jai janardhana


 

Mother love


 

ఉపవాసం చేయడం

 ఉపవాసం చేయడం వలన వివిధ అవయవాలలో కలుగు మార్పులు  - 


 *  జీర్ణక్రియ  - 


      జీర్ణావయవాలకు మంచి విశ్రాంతి లభించును . అజీర్ణము తొలగించి ఆకలి వృద్ది అగును. 


 *  మలాశయం  - 


       మలాశయంలోని మురికి బహిష్కరించబడి అజీర్ణం తొలగును . క్రిములను , బ్యాక్టీరియాలను నాశనం చేయును . 


 *  మూత్రపిండములు  - 


       మూత్రపిండములలోని విషపదార్ధములు , రాళ్లు బయటకి వెడలును . 


 *  ఊపిరితిత్తులు  - 


        ఉపిరితిత్తులోని నంజు , నీరు బహిష్కరించబడి ఆయాసము నివారించును . శ్వాసక్రియ చక్కగా జరుగును . 


 *  గుండె  - 


       గుండె చుట్టు , లోపల చేరిన కొవ్వు , నీరు తగ్గి గుండె చక్కగా కొట్టుకొనును . అధికంగా తినడం వలన రక్తంలో కొలెస్టరాల్ ఎక్కువ అయ్యి గుండెజబ్బులు వచ్చును . 


  *  లివర్ , స్ప్లీన్  - 


        ఆహారం జీర్ణం అగుటకు ఇవి ముఖ్యముగా పనిచేయవలెను . ఉపవాసం చేయుట వలన వీటికి విశ్రాంతి దొరుకును . వాటిలో మాలిన్యాలు తొలగించబడి జీర్ణక్రియ వృద్ధిచెందును . 


 *  రక్తప్రసరణ  - 


       రక్తదోషములు నివారణ జరుగును. ఉపవాసం వలన రక్తప్రసారం చురుకుగా జరుగును. కావున తిమ్మిర్లు , మంటలు , నొప్పులు నివారణ అగును. 


 *  కీళ్లు  - 


        కీళ్లలో పేరుకుపోయిన కొవ్వు , నీరు , మాంసం , ఇతర మాలిన్యాలు తొలగించబడి వ్యాధి నివారణ అగును. 


 *  నాడి మండలము  - 


        ఉపవాసం వలన నాడీ మండలం శుద్ది జరిగి వ్యాధి నివారణ జరుగును. 


 *  జ్ఞానేంద్రియములు  - 


        జ్ఞానేంద్రియాలలోని మాలిన్యములు కూడా నివారణ అగును. 


 *  చర్మము  -  


        చర్మము కాంతివంతం అగును. చర్మవ్యాధులు హరించును . శరీరానికి చక్కని రంగు వచ్చును . 


 *  మనస్సు  - 


        మనస్సు నిర్మలం అగును. కోపతాపములు నివారించును . ఆధ్యాత్మిక చింతనకు పునాదులు ఏర్పడును . 


        పైన చెప్పినవే కాకుండా మరెన్నో ఉపయోగాలు ఉన్నాయి . దురభ్యాసాలను విడుచుటకు ఉపవాసం మిక్కిలి ఉపయోగపడును. ఉపవాసం అనగా ఆహారం తీసుకోకపోవడం ఉపవాసం కాదు. ఉపవాసానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాటి గురించి తరవాతి పోస్టులలో వివరిస్తాను . 


        మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు . 


   

Lord krishna


 

మార్గం తెలిపేవారే పూజ్యులు

 *1889*

*కం*

అక్కర కై సొమ్ములుగొన

గ్రక్కున వెచ్చించబడును గమనించుమయా(గమనించంగా).

పెక్కుగ సిరిగొను మార్గము

మక్కువ తో నేర్పు వారె మాన్యులు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! అవసరమైనప్పుడు సొమ్ములు తీసుకుంటే వెంటనే ఖర్చైపోగలవు. కానీ అలా డబ్బిచ్చేవారి కన్నా ఎక్కువగా ధనములు పొందగలిగే మార్గం తెలిపేవారే పూజ్యులు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

⚜ శ్రీ మహాదేవ్ మందిర్

 🕉 మన గుడి : నెం 169


⚜ ఛత్తీస్‌గఢ్ : దేవబలోదా


⚜ శ్రీ మహాదేవ్ మందిర్


 💠 ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లా కేంద్రానికి 22 కిమీ దూరంలో  దేవబలోడా గ్రామంలో ఒక పురాతన శివాలయం ఉంది.  

ఈ ఆలయం ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రక్షిత స్మారక చిహ్నం.


💠 ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఉన్న శివలింగం భూమి నుండి ఉద్భవించింది.  ఈ ఆలయం 12-13వ శతాబ్దంలో కల్చూరి యుగంలో నిర్మించబడిందని, 6 నెలల్లో ,కేవలం రాత్రుల్లో నిర్మిస్తూ

 ఒకే వ్యక్తి ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు.  

ఈ ఆలయం మొత్తం ఒకే రాతితో నిర్మించబడింది మరియు గోపురం సగం ఉంటుంది.

 

💠 దేవాలయం సమీపంలో ఒక చెరువు ఉంది, ఈ చెరువు చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని అరంగ్ అనే మరో పాత పట్టణానికి భూగర్భo ద్వారా మార్గం   కలిగి ఉందనే అపోహ ఉంది.


💠 ఆలయ ప్రవేశ ద్వారం వద్ద నంది విగ్రహం ఉంది.  ఆలయం లోపల శివలింగం ఉంది.  ఆలయం లోపల శివుడు, గణేశుడు మరియు ఇతర దేవతల యొక్క అనేక శిల్పాలు ఉన్నాయి.  ఆలయం వెలుపలి గోడలపై యోధులు, నృత్యం చేసే పురుషులు మరియు మహిళలు, జంతువులు, దేవతలు మొదలైన అందమైన శిల్పాలు ఉన్నాయి.  

ఈ గోడలలో కొన్ని శృంగార శిల్పాలు కూడా ఉన్నాయి.


💠 ఈ ఆలయం కల్చూరి కాలానికి చెందినది. 

మహాశివరాత్రి సమయంలో భక్తులు శివుని దర్శనం  కోసం సమీపంలోని గ్రామాల నుండి   ఆలయానికి  పాద యాత్ర చేస్తారు.


💠 ఈ ఆలయం కేవలం 6 నెలల్లో నిర్మించబడిందని చెబుతారు, అందుకే దీనిని 6 మాషి (మాసి లేదా మాసి, హిందీలో- నెలలు) దేవాలయం అని కూడా పిలుస్తారు


🔅 స్థలపురాణం 🔅 


💠 ఒక శిల్పి ప్రతి రాత్రి ఆలయాన్ని నిర్మించే ముందు సమీపంలోని కొలనులో స్నానం చేసేవాడు.  

శిల్పి తన పనిలో నిమగ్నమయ్యాడు, అతను ఇంకేమీ పట్టించుకోలేదు. 

అతని బట్టల గురించి కూడా కాదు. 

తన పనిపై పూర్తి ఏకాగ్రతతో  నిరంతరం పని చేస్తున్నప్పుడు, అతని బట్టలు చిరిగిపోయాయి, చివరికి అతను నగ్నంగా మారాడు.

ఆ కళాకారుడి భార్య కూడా అతని పనికి సహకరిస్తూ ఉండేది.  

తన భర్త ఆలయ నిర్మాణంలో పని చేస్తున్నప్పుడు, ఆమె అతనికి రోజూ భోజనం తెచ్చేది, కానీ ఒక రోజు అతను అక్కడ గుడి కట్టేటప్పుడు, అతని భార్యకు బదులుగా, అతని సోదరి భోజనం తెచ్చింది.


💠శిల్పి సోదరి ఒక కుండలో లేదా కలశంలో నీరుతో పాటు ఆహారాన్ని అతనికి తీసుకువచ్చింది. తన చెల్లెలు దగ్గరకు రావడం చూసి, అతను తన నగ్నత్వానికి చాలా సిగ్గుపడ్డాడు, భార్యకు బదులు తన సోదరి భోజనం తీసుకురావడం, తాను నగ్నంగా ఉండడం చూసి ఆ వ్యక్తి అవమానం కారణంగా గుడి ఆవరణలో నిర్మించిన కొలనులోకి దూకాడు.  అప్పటి నుంచి నేటి వరకు ఆ వ్యక్తి ఆచూకీ తెలియలేదు.  

దీని కారణంగా ఆలయ గోపురం పూర్తి కాలేదని చెబుతారు.  అందుకే పురాతన దేవాలయాలలో గోపురం సగం నిర్మించబడిన ఏకైక ఆలయం ఇది.


💠 ఆమె సోదరుడు ట్యాంక్‌లో దూకడం చూసి, అతను చనిపోయాడని నమ్మి, ఆమె అపరాధ భావనతో సరస్సులో దూకింది. నీటి మట్టాలు తగ్గినప్పుడు, నేటికీ నీటి ఉపరితలం పైన ఆమె తెచ్చిన కలశం మనం చూడగలము


💠 ఇంకా ముందుకు వెళితే, ఆరంగ్ అనే మరో గ్రామంలో తెరుచుకునే ట్యాంక్ లోపల ఒక సొరంగం ఉందని ఈ జానపద కథ చెబుతుంది. శిల్పి సొరంగాన్ని కనుగొని ఆరంగ్ ఆలయంకి దాని గుండా వెళ్ళాడని వారు చెప్పారు. 

అక్కడ శిలా విగ్రహంగా మారిపోయాడు. 

ఆ ప్రదేశంలో భానదేవ దేవాలయం నిర్మించబడింది.

ఈ రాతి విగ్రహం ఇప్పటికీ ఆరంగ్ భానదేవ దేవాలయoలో ఉందని స్థానికులు చెబుతున్నారు.


💠 ఆలయ ట్యాంక్ వెనుక సరస్సు ఉంది.  దీనిని కరస తలాబ్ లేదా కలాష్ తలాబ్ అంటారు. 


💠 ఈ ఆలయం చుట్టూ అద్భుతమైన పనితనం జరిగింది.  దీనిని చూస్తే 12-13 వ శతాబ్దం మధ్య ప్రజలు ఎలా జీవించారో అనిపిస్తుంది.  పరమశివుడు  త్రిశూలంతో నృత్యం చేయడం, 2 ఎద్దులతో పోరాటం, ఇలా ఎన్నో కళాకృతులు ఉంటాయి.


💠 చాలా ఏళ్లుగా కనిపించే ఈ ఆలయ ప్రాంగణంలో ఒక జత పాములు కూడా ఉన్నాయని చెబుతారు.   

శివలింగంలో చుట్టబడి ఉండటం కూడా చాలా సార్లు ప్రజలు చూశారు.  నేటికీ ఈ ఆలయంలో ఒక జత పాములు సంచరిస్తాయని ప్రజల నమ్మకం.  అయితే, ఇప్పటివరకు ఈ పాముల జంట వల్ల ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు.


💠 ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున ఇక్కడ భారీ జాతర కూడా జరుగుతుంది.  

ఈ జాతరను దేవబలోదా జాతర అని కూడా అంటారు.  నిజానికి, ఆ రోజున భోలేనాథ్ స్వామిని ఆరాధించడానికి, భక్తులు తమ కోరికలతో సుదూర ప్రాంతాల నుండి వస్తారు మరియు భోలేనాథ్ శివలింగాన్ని ఆరాధించడానికి రాత్రి నుండి క్యూలలో నిలబడతారు.  ఈ జాతర 2 రోజుల పాటు జరుగుతుంది.  ఊరంతా జాతర నిర్వహించడం వల్ల గ్రామంలో శోభ వెలిగిపోతుంది

 

💠 గర్భగృహంలో దాదాపు 1.5 అడుగుల ఎత్తులో ఉన్న శివలింగం ఉంది, గర్భగృహం లోపల పార్వతి దేవి , గణేశుడు మరియు హనుమంతుని,శ్రీమహావిష్ణువు , మహిషాసుర మర్దిని, సంగీతకారులు, నృత్యకారుల విగ్రహాలు, త్రిపురాంతక శివుడు, గజాంతక శివుడు, నరసింహుడు , రాధాకృష్ణుడు , గణేష్ , వరాహ , లక్ష్మి వంటి దేవతల చిత్రాలతో అలంకరించబడి ఉన్నాయి.


💠 ఇది రాయ్‌పూర్ రైల్వే స్టేషన్ నుండి 20 కిమీ దూరం.

Bhagwan Shri Krishna

 Excellent information about Bhagwan Shri Krishna


1) Krishna was born *5252 years  ago* 

2) Date of *Birth* : *18 th July,3228 B.C*

3) Month : *Shravan*

4) Day :  *Ashtami*

5) Nakshatra : *Rohini*

6) Day : *Wednesday*

7) Time : *00:00 A.M.*

😎 Shri Krishna *lived 125 years, 08 months & 07 days.*

9) Date of *Death* : *18th February 3102BC.*

10) When Krishna was *89 years old* ; the mega war *(Kurukshetra war)* took place. 

11) He died *36 years after the Kurukshetra* war.

12) Kurukshetra War was *started on Mrigashira Shukla Ekadashi, BC 3139. i.e "8th December 3139BC" and ended on "25th December, 3139BC".*  

12) There was a *Solar eclipse between "3p.m to 5p.m on 21st December, 3139BC" ; cause of Jayadrath's death.*

13) Bhishma died on *2nd February,(First Ekadasi of the Uttarayana), in 3138 B.C.*


14) Krishna  is worshipped as:

(a)Krishna *Kanhaiyya* : *Mathura*

(b) *Jagannath*:- In *Odisha*

(c) *Vithoba*:- In *Maharashtra*

(d) *Srinath*:  In *Rajasthan*

(e) *Dwarakadheesh*: In *Gujarat*

(f) *Ranchhod*: In *Gujarat*

(g) *Krishna* : *Udupi in Karnataka*

h) *Guruvayurappan in Kerala*


15) *Bilological Father*: *Vasudeva*

16) *Biological Mother*: *Devaki*

17) *Adopted Father*:- *Nanda*

18) *Adopted Mother*: *Yashoda*

19 *Elder Brother*: *Balaram*

20) *Sister*: *Subhadra*

21) *Birth Place*: *Mathura*

22) *Wives*: *Rukmini, Satyabhama, Jambavati, Kalindi, Mitravinda, Nagnajiti, Bhadra, Lakshmana*

23) Krishna is reported to have *Killed only 4 people* in his life time. 

(i) *Chanoora* ; the Wrestler

(ii) *Kansa* ; his maternal uncle

(iii) & (iv) *Shishupaala and Dantavakra* ; his cousins. 

24) Life was not fair to him at all. His *mother* was from *Ugra clan*, and *Father* from *Yadava clan,* inter-racial marriage. 

25) He was *born dark skinned.* He was not named at all throughout his life. The whole village of Gokul started calling him the black one ; *Kanha*. He was ridiculed and teased for being black, short and adopted too. His childhood was wrought with life threatening situations.

26) *'Drought' and "threat of wild wolves" made them shift from 'Gokul' to 'Vrindavan' at the age 9.*

27) He stayed in Vrindavan *till 10 years and 8 months*. He killed his own uncle at the age of  10 years and 8 months at Mathura.He then released  his biological mother and father. 

28) He *never returned to Vrindavan ever again.*

29) He had to *migrate to Dwaraka from Mathura due to threat of a Sindhu King ;  Kala Yaavana.*

30) He *defeated 'Jarasandha' with the help of 'Vainatheya' Tribes on Gomantaka hill (now Goa).*

31) He *rebuilt Dwaraka*. 

32) He then *left to Sandipani's Ashram in Ujjain* to start his schooling at age 16~18. 

33) He had to *fight the pirates from Afrika and rescue his teachers son ;  Punardatta*;  who *was kidnapped near Prabhasa* ; a sea port in Gujarat. 

34) After his education, he came to know about his cousins fate of Vanvas. He came to their rescue in ''Wax house'' and later his cousins got married to *Draupadi.* His role was immense in this saga. 

35) Then, he helped his cousins  establish Indraprastha and their Kingdom.


36) He *saved Draupadi from embarrassment.*


37) He *stood by his cousins during their exile.*

38) He stood by them and *made them win the Kurushetra war.*


39) He *saw his cherished city, Dwaraka washed away.* 

40) He was *killed by a hunter (Jara by name)* in nearby forest. 

41) He never did any miracles. His life was not a successful one. There was not a single moment when he was at peace throughout his life. At every turn, he had challenges and even more bigger challenges. 

42) He *faced everything and everyone with a sense of responsibility and yet remained unattached.*


43)  He is the *only person, who knew the past and future ; yet he lived at that present moment always.*


44) He and his life is truly *an example for every human being.*🌷🙏🏻


*Jai  Shri Krishna*🙏

Knowledge


 

తేలు విషం




 *_👆తేలు విషం..లీటరు రూ. 82కోట్లు!_*  *_వ్యవసాయం.. పశువుల పెంపకం..కోళ్ల ఫారాలు వంటి వాటి గురించి మనందరికీ తెలుసు కానీ తేళ్ల పెంపకం గురించి ఎప్పుడైనా విన్నారా? కోళ్ల ఫారాలు లాగానే తేళ్ల ఫారాలు కూడా ఉంటాయని, వాటిల్లో వేల సంఖ్యలో విషపూరిత తేళ్లను పెంచుతారని తెలుసా? తేలు పేరు చెబితేనే మనం భయపడిపోతాం కానీ తేలు విషానికి మార్కెట్లో బోలెడంత డిమాండ్ ఉంది. లీటర్ విషం ధర రూ.82 కోట్ల వరకూ ఉంటుంది. అందుకే కొందరు తేళ్ల ఫారాలు నిర్వహిస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వేల కొద్దీ తేళ్లు ఒకే చోట లుకలుకలాడుతూ తిరుగుతండటం చూడలేక పలువురు భయపడిపోతున్నారు._*  *_తేలు విషాన్ని సౌందర్య ఉత్పత్తులు, ఇతర ఔషధాల్లో విరివిగా వాడతారు. కొన్ని ఆసియా దేశాల్లో సంప్రదాయిక వైద్య విధానాల్లో తేలు విషానికి అమిత ప్రాధాన్యం ఉంది. దీంతో, అనేక ప్రాంతాల్లో తేళ్ల ఫారాలు వెలిశాయి. క్యాన్సర్ మందుల తయారీలోనూ తేలు విషం వాడతారట. ఈ విషాన్ని నిల్వ చేసేందుకు ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి. ఒక్కో తేలు నుంచి రోజుకు 2 మిల్లీలీటర్ల విషం వస్తుంది. తేలు కొండెను ట్వీజర్స్‌తో పిండి విషాన్ని బయటకు తీస్తారు. ఈ ప్రక్రియలో తేలుకు ఎటువంటి

Photo
















 

లవ్ జిహాద్

 లవ్ జిహాద్ ఫలితం ఇది..!


@ పెద్దకూతురు మరణం..!

@ చిన్న కూతురుకు జైలు..!

@ తీరని ఆవేదనలో తల్లిదండ్రులు..!!! 

@ మొత్తంగా కుటుంబం చిన్నాభిన్నం..!!!

@ లవ్ జిహాద్ ముప్పు నుంచి కుటుంబాన్ని కాపాడే క్రమంలో ప్రాణాలు విడిచిన దీప్తి త్యాగం గొప్పది..

@ బాధిత కుటుంబానికి భగవంతుడు ధైర్యం ప్రసాదించాలి..

@ ప్రేమ పేరుతో కుటుంబాన్ని నాశనం చేసిన చందనకు అంతకుమించి శిక్ష పడాలి..

@ "చందన" ఉదంతంతో నైనా హిందూ కుటుంబాలు మేల్కోవాలి 

@ ఖరాకండిగా  అమ్మాయిల విషయంలో అప్రమత్తంగా ఉండాలి

@ చేతులు కాలకముందే జాగ్రత్తలు వహించాలి : VHP 


రక్తం పంచుకు పుట్టిన సొంత అక్కను అంతం చేయాల్సిన కర్కషత్వం ఎక్కడిది.. ? 

క్షణికమైన శారీరక సుఖాల కోసం కుటుంబాలను చిదిమేసే చిత్రమైన ఆలోచన ఎక్కడిది..?

డబ్బును తప్ప మనసును ప్రేమించిన వ్యక్తికి సర్వం దార పోసే దరిద్రపు ఆలోచన ఎక్కడిది..?

జీవితాంతం అష్ట కష్టాలు పడి సంపాదించిన డబ్బును ఒక్క రాత్రిలోనే దానం చేసే దుర్నీతి ఎక్కడిది..?

తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలు.. కుటుంబ బాంధవ్యాలు.. రక్తసంబంధీకులు.. స్నేహితులు .. చుట్టాలు .. అన్నిటిని మించి పేగు తెంచుకు పుట్టిన తల్లిదండ్రులను గుండెల మీద తన్నే రాక్షసత్వం ఎక్కడిది..?

కులం.. గోత్రం.. చదువు..సంపాదన.. ఉద్యోగం.. కుటుంబం మంచి చెడులు చూసి, పది మందిని ఒప్పించి మెప్పించి చేసే పెళ్లిని కాదని.. అడ్రస్ లేని వాని వెంబడి వెళ్లే తెంపరి తనం ఎక్కడిది..?

అంటే... ఇలాంటి వందలాది ప్రశ్నలకు సమాధానం ఒకటే.. ! దానిపేరే  ..."లవ్ జిహాద్". 


జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన ఈ సంఘటనతో రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి.కానీ

ఇలాంటి సంఘటనలు విశ్వహిందూ పరిషత్ కు నిత్యం తారస పడుతూనే ఉంటాయి. అయితే ఒకదాన్ని తలదన్నే రీతిలో మరో సంఘటన చోటు చేసుకోవడం విశేషం. కోరుట్ల సంఘటన కూడా పోలీసులు వెల్లడించక ముందే విశ్వహిందూ పరిషత్ ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేసింది. లవ్ జిహాద్ కోణంలోనే ఆలోచించింది. అయితే ఆధారాలతో సహా పోలీసులు వెల్లడించాక  విశ్వహిందూ పరిషత్ అనుమానం నిజమైంది. ఎందుకంటే దాదాపు 20 ఏళ్ల చందన తన 22 సంవత్సరాల అక్కను ఒక్క రాత్రికి రాత్రే ఊపిరాడకుండా ముక్కుకు, మూతికి ప్లాస్టర్ వేయడం.. చున్నీతో కాళ్లు చేతులు గట్టిగా కట్టేయడం.. నిమిషాల వ్యవధిలో నిర్దాక్షిణ్యంగా చంపేయడం చూస్తుంటే దాని వెనుక అంతకుమించి క్రూరమైన కుట్ర "లవ్ జిహాద్" రూపంలో దాగి ఉంది అని విశ్వహిందూ పరిషత్ బల్లగుద్ది చెబుతోంది. అయితే ఇక్కడ చందన తన ప్రేమ కోసం అమాయకంగా అక్క దీప్తిని బలి తీసుకోవడం దారుణం. "మన కులం.. మన మతం.. కాని వాడిని పెళ్లి చేసుకోవద్దని చందన నిర్ణయాన్ని దీప్తి తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో అక్కపై పగ పెంచుకుని చివరకు ప్రాణాలు తీయడం ఘోరం.     


ఫలితంగా పెద్ద కూతురు హత్యకు గురి కావడం... చిన్న కూతురు జైలు పాలు కావడం.. కష్టం చేసిన సొమ్ము బజార్లో పడటం.. మొత్తంగా కుటుంబం చిన్నాభిన్నమై రోడ్డున పడటానికి "లవ్ జిహాద్" రూపంలో ఉమర్ షేక్ సుల్తానా మాత్రమే కారణం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఎందుకంటే ప్రేమించిన వాడు అష్ట కష్టాలు పడి భార్యను చూసుకోవాలి. కానీ అమ్మాయి డబ్బులకు ఆశపడి వారి కుటుంబ సభ్యులను అంతం చేసే ఆలోచన రావడం తోనే ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు రుజువైంది.


హిందూ అమ్మాయిలపై తీవ్రమైన వేట కొనసాగుతోంది. ప్రేమ పేరుతో విషపు వల విసురుతోంది లవ్ జిహాద్ మూఖ.

 నిత్యం ఎక్కడో ఒక చోట ముస్లిం అబ్బాయి -  హిందూ అమ్మాయి ప్రేమ వ్యవహారం వెలుగు చూస్తూనే ఉంది. అయితే ఒక్కో సంఘటన ఒక్క రీతిలో ఉండటం విస్మయానికి గురిచేస్తుంది. మొన్నకు మొన్న అలంపూర్ టెంపుల్ లో ఆలయ అధికారి లవ్ జిహాద్ ను ప్రోత్సహించడం ఒళ్ళు గగుర్పొడిచే అంశం. అంతకుముందు ఉన్నత చదువు చదివిన ఓ యువతీ కరీంనగర్ లో  పండ్లు అమ్మే వాడిని ప్రేమించి.. పెళ్లి చేసుకుంది. చివరకు వాడి వేధింపులు తట్టుకోలేక పిల్లలతో సహా మానేరు డ్యాంలో దూకి ప్రాణాలు విడిచిన సంగతి మర్చిపోనేలేదు. ఇలాంటి సంఘటనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. వీటన్నింటిని గమనిస్తుంటే.. హిందూ అమ్మాయిలపై ఎంతటి కుట్ర జరుగుతుందో ఆలోచించాలి.

 భాగ్యనగర్ లోనైతే తల్లిదండ్రులు సంపాదించిన విలువైన నగలు, వజ్రాలు, కోట్ల రూపాయలతో పారిపోవడం కొంత మంది అమ్మాయిల వంతు అయింది. పెరుగుతున్న డిజిటల్ మీడియా ఆధారంగా.. హిందూ అమ్మాయిల బలహీనతను వాసరగా చేసుకుని దుర్మార్గులు ఘోరమైన రాక్షస క్రీడా సాగిస్తున్నారు.


ఇలాంటి విషయాలపై నిరంతరం ప్రతి సమావేశంలో విశ్వహిందూ పరిషత్, దాని యువ  విభాగాలు బజరంగ్ దళ్, దుర్గా వాహిని నాయకులు మొత్తుకుంటూనే ఉన్నారు. దుర్గా వాహిని ఆధ్వర్యంలో "నారీ సురక్ష" అనే కార్యక్రమం ద్వారా మహిళల రక్షణ కోసం విరివిగా ప్రచారం సాగిస్తున్నారు. లెక్కకు మించి అవగాహన కల్పిస్తున్నారు. అమ్మాయిల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు సూచిస్తూనే ఉన్నారు. కాలేజీలు, యూనివర్సిటీలతో మొదలుకుంటే అనేక సందర్భాల్లో అవేర్నెస్ క్యాంపులో నిర్వహిస్తూనే ఉన్నారు. లవ్ జిహాద్ పర్యవసనాలు తెలియజేస్తూనే ఉన్నారు. చివరకు "ది కేరళ స్టోరీ" లాంటి సినిమాలు చూపించారు. కానీ ఏం లాభం..? పెద్ద పెద్ద కుటుంబాలు బుద్ధి తెచ్చుకోలేకపోతున్నాయి. చేతులు కాలక ముందే జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నాయి. ఫలితంగా ఎదిగి  వచ్చిన అమ్మాయిలు అటు క్రైస్తువులు, ఇటు ముస్లింల వలలో చిక్కి నాశనం అవుతున్నాయి.. కుటుంబాలు చిద్రమవుతున్నాయి. 

నివురు గప్పిన నిప్పులా.. ఇలాంటి సంఘటనలు సమాజంలో ఇంకా చాలా దాగి ఉన్నాయి. మీడియా ద్వారా బయటికి వచ్చిన విషయాలు కొన్ని మాత్రమే. పరువుకు భయపడి  లోలోపల కుమిలిపోతున్న కుటుంబాలు అనేకం.


"లవ్ జిహాద్" ఉపద్రవం నుంచి హిందూ సమాజాన్ని కాపాడేందుకు విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, దుర్గావాహిని నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. హిందూ ధర్మం పై జరుగుతున్న దాడిని సమర్థవంతంగా ఎదుర్కొంటూనే.. ప్రతి హిందూ అమ్మాయిని ధర్మం వీడకుండా జాగ్రత్త లు పడుతూనే ఉంటాయి. అమ్మాయి లవ్ జిహాద్ బారిన పడి హిందూధర్మం వీడితే ఆ కుటుంబాని కంటే ఎక్కువగా విశ్వహిందూ పరిషత్ ఆవేదన వ్యక్తం చేస్తుంది. చిట్ట చివరి వరకు అటు పోలీసులు, ఇటు న్యాయస్థానాలను ఆశ్రయించి యువతుల రక్షణ కోసం పనిచేస్తుంది VHP.


ఇప్పటికైనా హిందూ సమాజం మేల్కోవాల్సిందే. తమ ఇళ్లలోని ఆడపిల్లల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించేలా చూసుకోవాల్సిందే..!


ఏది ఏమైనా లవ్ జిహాద్ నుంచి తన కుటుంబాన్ని, తన చెల్లిని, కాపాడుకునేందుకు దీప్తి చివరి వరకు పోరాడింది. తన చెల్లిని, తన తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను..  తమ కుటుంబ గౌరవ మర్యాదలను రక్షించేందుకు చిట్టచివరి శ్వాస వరకు పోరాటం చేసిన దీప్తి చాలా గొప్పది. కానీ చందన పై ప్రేమపేరుతో ఆ కుటుంబాన్ని చిద్రం చేసేందుకు వచ్చిన ఆ ముష్కరుడు అమ్మాయి ప్రాణం తీయడం దౌర్భాగ్యం. దీప్తి ఆత్మకు శాంతి చేకూరాలని విశ్వహిందూ పరిషత్ ప్రగాఢంగా కోరుతోంది. కూతురును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న  ఆ తల్లిదండ్రులకు  భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటుంది. "లవ్ జిహాద్" బారినపడి .. సొంత అక్కను చంపి, కుటుంబాన్ని రోడ్డుపాలు చేసిన చందన అంతకుమించి శిక్ష అనుభవించాలి.


"చందన" ఉదంతంతోనైనా హిందూ కుటుంబాలు మేలుకోవాలి. ప్రతి తల్లిదండ్రులు .. ప్రతి అన్న.. ప్రతి తమ్ముడు తన ఇంట్లోనే ఆడపడుచుల విషయంలో జాగ్రత్తగా మసులుకోవాలి. ప్రతి కదలికలను కనిపెట్టుకొని చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్వహిందూ పరిషత్ సూచిస్తుంది. లేదంటే దానికి ఆ కుటుంబమే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే విషయం సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలి. 


తల్లిదండ్రులు సంపూర్ణమైన వ్యాపారం.. పెద్ద కూతురు దీప్తి సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. చిన్న కూతురు చందన బీటెక్ పూర్తి.. కొడుకు బెంగళూరులో ఉన్నత చదువు.. ఇలా గుట్టుగా గౌరవంగా బతుకుతున్న కుటుంబం నేడు ఉమర్ షేక్ సుల్తానా కారణంగా తలకిందులైంది. రోడ్డున పడింది. జీవితంలో కోలుకోలేని దెబ్బ తింది. ఇలాంటి బాధ మరి ఎవరికి రాకుండా ఉండాలంటే.. ప్రతి హిందూ కుటుంబం తన ఆడపిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మనకే మంచిదని  హిందూ సమాజానికి చేతులు జోడించి విన్నవిస్తోంది విశ్వహిందూ పరిషత్.

గురువు స్థానం... గ్రేట్!*

 

         *గురువు స్థానం... గ్రేట్!*

                    ➖➖➖✍️


 *ఒకప్పుడు హెడ్ మాస్టర్లకి రాజులు ఇచ్చిన గౌరవం ఇలా ఉండేది...*


*ఇంగ్లాండ్ కి రాజైన రెండవ చార్లెస్ కొడుకు రాజధానికి కాస్త దూరంలో ఉన్న పాఠశాలలో చదువుతున్నాడు. ఆ పాఠశాల హెడ్మాస్టర్ పేరు బస్బీ.*


*ఒక రోజు ఆయనకి రాజుగారినుండి ఒక ఉత్తరం వచ్చింది.*


*తన కుమారుడు ఎలా చదువుతున్నాడో తనిఖీ చేయడానికి ఒకసారి పాఠశాలని సందర్శిస్తానని ఆ ఉత్తరం సారాంశం....*


*హెడ్ మాస్టర్ తిరుగు టపాలో రాజు గారిని రావద్దని జవాబు రాశారు.*


*సర్వంసహా రాజ్యాధికారి, తన రాజ్యంలోని   పాఠశాలని చూడాలని కోరుతూ ఉత్తరం రాస్తే (పైగా అది ప్రభుత్వ పాఠశాల) ‘రావద్దనేంత దమ్ముందా ? హెడ్మాస్టారుకి ?’*


*ఆ దమ్ము ఉన్నవాడు కాబట్టే అలా రాసాడు. కారణం కూడా చెప్పాడు...*


 *”మా ప్రభువు అయిన మీరు, వస్తే గౌరవ సూచకంగా నా తలపై ఉన్న టోపీని తీయాలి. ఇప్పటివరకు నా దగ్గర చదువుకుంటున్న విద్యార్థులు నాకన్నా అధికుడు లేడని భావిస్తున్నారు. నాకన్నా పై అధికారి ఒకడు ఉన్నాడని, ఆయన వద్ద నేను ఒదిగి ఒదిగి ఉంటానని గుర్తించిన క్షణం, వారికి నాపై గౌరవ భావం తగ్గుతుంది. క్రమశిక్షణలో మార్పు వస్తుంది. దాని ఫలితం విద్యాభ్యాసం పై పడుతుంది., ఇది మీరు అర్ధం చేసుకోగలరని ప్రార్ధిస్తున్నాను. ఒకవేళ మీ రాక తప్పనిసరి అయితే నేను రాజీనామా చేయవలసి ఉంటుంది.”*


*హెడ్మాస్టరుగారి ఉద్దేశ్యాన్ని అర్ధం చేసుకొని, ఆయన “తన సమక్షంలో ‘రాచరిక మర్యాదలు పాటించనక్కరలేదని, తానే టోపీ తీసి హెడ్మాస్టారుని గౌరవిస్తానని”జవాబిచ్చాడు రాజు.*


*అలాగే చేసాడు కూడా... గ్రేట్... కింగ్!*

***********************



*ఇలాంటి ఉదాహరణల నుంచి నేటి పాలకులు ఎంతో కొంత  నేర్చుకోవాల్సి ఉంది. హెడ్మాస్టర్ లని ఏకవచన సంబోధనతో పిలిచే అధికార/అనధికారులకు ఇలాంటి విషయాలు కనీసం కొద్దిగా అన్నా... అర్ధం అవుతాయా?* 


 *ఎక్కడేతే... స్త్రీలు గౌరవింపబడతారో... అక్కడ సిరిసంపదలు ఉంటాయి..!*


 *ఎక్కడైతే... గురువులు పూజింపబడతారో... అక్కడ   ఉన్నత విద్యా ప్రమాణాలు పరిఢవిల్లి - దేశం సుభిక్షంగా ఉంటుంది!*✍️

                       

                 *🙏గురు బ్రహ్మ, 🙏*

                 *🙏గురుర్విష్ణుః, 🙏*

          *🙏గురుర్దేవో మహేశ్వరహః🙏*

         *🙏గురు సాక్షాత్ పరబ్రహ్మ!🙏*

           *🙏తస్మై శ్రీగురవే నమః🙏*


 .          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

భారత్‌ అనే పేరు

 భారత్‌ అనే పేరు వినగానే ఎందుకు ఉలిక్కిపడుతున్నారు.. గతంలో హిందుస్థాన్‌ అంటే కూడా విలవిలలాడిన వారు ఉన్నారు.. మన దేశంలోని అతి కుహనా లౌకికవాద మౌడ్యులు దశాబ్దాలుగా దేశ ప్రజల కళ్లకు కడుతున్న గంతలు తొలగిపోతుంటే బెంబేలెత్తిపోతున్నారు.. 

' भारत हमारा देश है । हमें अपना देश प्राणों से प्यारा है ।.. , భారతదేశము నా మాతృభూమి. నేను నా దేశమును ప్రేమించుచున్నాను.. , India is my country.All Indians are my brothers and sisters..' దేశ వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో చేసే ప్రతిజ్ఞ ఇది..

'జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే దండకారణ్యే కృష్ణాగోదావరీ మధ్యదేశే..' మన ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా పూజారి పఠించే సంకల్పంలోని ఈ పదాల మీద ఎప్పుడైనా దృష్టి పెట్టారా? 

'భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగ దూడలై యేడ్చుచుండ..' అనే చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి పద్యం చిన్నప్పుడు తెలుగు పాఠ్య పుస్తకంలో చదువుకొనే ఉంటాం..

మన జాతీయ గీతం 'జనగణమన అధినాయక జయహే భారత భాగ్యవిధాతా..'తో ప్రారంభమై చివరలో 'జైహింద్‌' అని ముగిస్తాం.. మన జై ఇండియా అని ఎందుకు అనడం లేదు?

మన దేశంలోకి విదేశీయులు రాక ముందు నుంచే భారత్‌ లేదా భరత అనే పదాలు ఉనికిలో ఉండటం గమనించాలి.. అలాగే హిందుస్థాన్‌, హిందూ అనే పేర్లు కూడా.. బ్రిటిష్‌వారు తమ పాలనా కాలంలో మన దేశం పేరును India(ఇండియా)గా వ్యవహరించారు. అంతకన్నా ముందు నుంచే భారత్‌వర్ష్‌, భారత్‌ అనే పేర్లు ఉనికిలో ఉన్నాయి. భరతముని, శకుంతల-దుష్యంతుల తనయుడు భరతుడి పేరుతో ఈ పేరు వచ్చిందనే చరిత్ర కూడా ఉంది. 

యూరోప్‌, అరబు దేశాల వారు వారికి తూర్పువైపున సింధూనదికి అవతల కనిపించిన మన దేశాన్ని  సింద్‌ అని పిలిచేవారు, అది క్రమంగా హిందు, హిందుస్థాన్‌ అని వాడుకలోకి వచ్చింది.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడిన స్వదేశీ పాలక ప్రభుత్వం రాజ్యాంగం రచిస్తున్న సమయంలో మన దేశాన్ని ఏ పేరుతో పిలుద్దాం అనే చర్చ జరిగింది. 'భారత్‌' అని మనం పిలుచుకుంటున్నా ప్రపంచ వ్యాప్తంగా 'ఇండియా'అనే పేరుతో గుర్తింపు ఉన్నందున రెండు పేర్లను కొనసాగించాలని నిర్ణయించారు. 

ఇప్పుడు మన దేశం అనేక రంగాల్లో సాధిస్తున్న విజయాల కారణంగా అంతర్జాతీయంగా మన పాత్ర పెరిగింది. మన దేశం పేరును ఇండియా బదులు 'భారత్‌'గానే స్థిరపరచుకోవాలి. ఇందుకు ఇదే సరైన సమయం..

తాజాగా మన దేశంలో జరగనున్న జీ-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వివిధ దేశాల అగ్రనేతలకు ప్రత్యేక విందు ఇస్తున్నారు. ఈ అహ్వాన పత్రాల మీద President of India బదులుగా President of Bharat అని ముద్రించారు. జీ-20 సదస్సు కోసం రూపొందించిన బుక్‌లెట్‌లోనూ దేశం పేరు ‘భారత్‌’ అని పేర్కొన్నారు. ‘భారత్‌, మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ’ అని అందులో రాశారు. ఇది చూసి కాంగ్రెస్‌ పార్టీ ఏదో వారి కొంపలు అంటుకున్నట్లు గగ్గోలు పెడుతోంది. ఇందుకు మోదీ సర్కారును నిందిస్తోంది. 

రానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో మన దేశం పేరును ఆంగ్లంలోనూ ‘ఇండియా’ నుంచి ‘భారత్‌’గా పేరు మారుస్తూ ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రత్యేక తీర్మానం తీసుకురానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజ్యాంగంలో ‘ఇండియా: దటీజ్‌ భారత్‌’ అని ఉండగా.. ఇకపై ‘भारत' (భారత్‌) అనే పేరు మాత్రమే ఉండేలా సవరణ చేయనున్నట్లు తెలుస్తోంది. 

నిజంగా ఈ మార్పు జరిగితే దేశ ప్రజలంతా సంతోషించాలి.. గర్వపడాలి.. ఇప్పటికే విదేశీ పాలనా ముద్రలను క్రమంగా తొలగించడం మొదలైంది.. ఈ దిశలో 'భారత్‌' అనే శాశ్వత పేరు ఉండటంలో తప్పేమీ లేదు.

జైహింద్‌, జైభారత్‌, భారత్‌ మాతాకీ జై..

#भारत #భారత్‌ #Bharat

శ్రీ కృష్ణ జన్మాష్టమి

 శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు


శ్రీ కృష్ణ జన్మాష్టమి



‘శ్రీకృష్ణావతార జన్మదినం’ మనకు చాలా పవిత్రమైన పుణ్యదినంగా ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుంటూ, పరమ భాగవతోత్తములు అందించిన స్వామీవారి జన్మవృత్తాంత విశేషాలను ఏమిటో….. ఒక్కసారి సమిక్షించుకుందం !

శ్రీముఖనామ సంవత్సర దక్షిణాయన వర్షఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రం నాల్గవపాదం బుధవారం నాడు అర్ధరాత్రి యదువంశంలో దేవకీదేవి, వసుదేవులకు ‘శ్రీకృష్ణుడు’ జన్మించాడు. అంటే ! క్రీస్తు పూర్వం 3228 సం|| అన్నమాట! ఓ దేవకినందనా ! ఓ వృష్టివంశ మంగళ దీపమా ! సుకుమార శరిరుడా! మేఘ శ్యామ! భూభారనాశక ముకుంద! నీకు సర్వదా జయమగుగాక!


వసుదేవసుతం దేవం కంసచాణుర మర్దనం |

దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ||


నేటి మన సమాజానికి యుగయుగాల చరిత్ర కలిగియుంది. అట్టి ఈ సమాజం ఎల్లప్పుడు కులాతిత, మతాతీత, వర్ణాతితంగా ఉంటూ, సహజీవనాన్ని కోరుకుంటూ వస్తూవుంది. అందు ఉన్న ఈ జనులంతా వార్కి జన్మతహవస్తున్న ఆచారాలను అనుసరిస్తూ ! వారి పోట్టకుటికోసం వివిధ వృత్తులను చేపడుతూ ఉంటారు. చేసే పనులు వేరు అయినా: పూలదండలో దారంవలె “ధర్మం” మాత్రం వీరందరికీ ఒకటే ఉంటుంది. అన్ని కాలాల్లోను చెక్కుచెదరకుండా ఉండేది “ధర్మ మార్గం” ఒక్కటే అని సర్వులూ అంగికరిస్తున్న విషయం. ఈ కాలగమన ప్రయాణంలో జనజీవనానికి అప్పుడప్పుడు ఎన్నో ఆటంకాలు ఏర్పడుతూ, శృతి మించి రాగానికి వస్తు వుంటాయి. అట్టి మానవ మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితి వచ్చినప్పుడు….. గీతలో శ్రీ కృష్ణ భగవానుడు అర్జునితో ఇలా అన్నాడు!


యదా యదా హి ధర్మస్యా

గ్లానిర్భవతి భారత

అభ్యుత్యానం అధర్మస్య

తదాత్మానం సుజామ్యహమ్


ఓ అర్జునా ! ధర్మమునకు హాని కలిగినప్పుడు… అధర్మము పెచ్చుపెరిగినప్పుడు నన్ను నేను సృజించుకొందును. అనగా సాకార రూపముతో లోకమున నేను అవతరింతును, అని చెప్పియున్నాడు. ఈ భారతావనిలో శ్రీకృష్ణుడు అంటే తెలియని వారుండరు. ఆయనే ఈ నవభారత నిర్మాణానికి సూత్రధారుడు, కానీ మనకు మనుష్యులను పూజించడమే తెలుసుగాని, అర్ధం చేసుకోవడం తెలియటంలేదు. శ్రీకృష్ణుని భగవంతుని అవతారంగా, మానవ రూపంలో, జన్మించిన దేవునిగా ఆరాధించామేగాని మానవుడిగా పుట్టిన ఆ దేవదేవుని మానవునిగా కాక వారి లీలలను మానవ మనుగడతో సరిపోల్చుకుంటూ అర్ధం చేసుకోవడం కూడా అంతే ముఖ్యంగా తెలుసుకోవాలి. భగవానుడు సామాన్య జనుల మధ్య సామాన్య మానవుడి రూపంలో జన్మించి నివురుగప్పిన నిప్పులా దినదినాభివృద్ది చెందుతూ ధర్మానికి ఆటంకం కలిగించే శక్తులను తనలో ఉన్న మధ్యాహ్న సూర్యకాంతితో ఒక మండించే శక్తిలా; ఆ దుష్టశక్తులను నశిపంచేస్తూ సామాన్య జనులకు ఊరటకలిగిస్తూ…. మానవులందరు తిరిగి ఎలాకలిసి మెలిసి జీవించాలో అని జ్ఞానబోధను చేస్తూ ముందుకు సాగిపోతుంటాడు. ఆ బాలకృష్ణుడు దినదిన ప్రవర్ధమానమగుచూ తన లీలావినొదాదులచే బాల్యమునుండే, అడుగడుగునా భక్తులకు జ్ఞానోపదేశం చేస్తూ వచ్చినాడు.

బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్నముద్దలు దొంగలిస్తూ వెన్నదొంగగా ముద్రవేసుకున్నాడు. అలా వెన్నముద్దల దొంగతనంలో కుడా మానవులకు అందని దేవరహస్యం ఉందట ! వెన్న జ్ఞానానికి సంకేతంగా చెప్తారు. పెరుగును మధించగా మధించగా కాని వెన్న లభ్యంకాదు కదా! అట్టి తెల్లని వెన్నను తాను తింటూ, ఆ అజ్ఞానమనే నల్లటి కుండను బద్దలుకొట్టి మానవునిలో జ్ఞానజ్యోతిని వెలిగించడమే కృష్ణ సందేశంగా భావించాలి అని చెప్తూ ఉంటారు. ఆలాగునే….. గోపికలు కుండలలో ఇండ్లకు నీళ్ళను యమునానదిలో నుండి తీసుకుని వెళుతూఉంటే, రాళ్ళను విసిరిచిల్లుపెట్టేవాడట. అలా ఆకుండ మానవశరీరము అనుకుంటే ఆకుండ లోని నీరు “అహంకారం’ ఆ అహంకారం కారిపోతేగాని జీవికి ముక్తి లభించదని ఇలా వారి లీలలొనీ ఆంతర్యాన్ని భాగవతోత్తములు వివరిస్తూ ఉంటారు.

ఇక చిన్ని కృష్ణుడు తన చిన్న తనమునుండే అనేకమంది రాక్షసులను సంహరిస్తూ దుష్టశిష్టరక్షణ కావిస్తూ కురుపాండవ సంగ్రామంలో అర్జునునకు రధాసారదియై అర్జునిలో ఏర్పడిన అజ్ఞానంధకారాన్ని తొలగించుటకు ‘విశ్వరూపాన్ని’ చూపించి గీతను బోధించి, తద్వారా మానవాళికి జ్ఞానామృతాన్ని ప్రసాదించాడు. ఇలా కృష్ణతత్వాన్ని కొనియాడి చెప్పుటకు వేయుతలలు కలిగిన ఆదిశేషునకే సాధ్యము కాదని చెప్పగా ! ఇక మానవ మాత్రులము… మనమెంతో చెప్పండి ? అట్టి శ్రీ కృష్ణ భగవానుని జ్ఞానబోధతో అందించిన ‘గీతామృతం’ మనకు ఆదర్శప్రాయం. ఇంకా, ప్రముఖ భాగవతోత్తములు మనకు అందించే సమాచారాన్ని బట్టి సుమారు ౩౦వ శతబ్దములకు పూర్వం అంటే క్రీస్తు పూర్వం 3122లో ద్వారకా పట్టణమందు కృష్ణభగవానుడు నిర్యాణము చెందినట్లు తెలియచున్నది. నాటినుండే కాళీ ప్రవేశముతో ‘కలియుగం’ ఆరంభమైనదని చెప్తారు. అట్టి ‘గీతాచార్యుడు’ కృష్ణపరమాత్మా జన్మాష్టమినాడు సూర్యోదయమునకు పూర్వమే కాలకృత్యాలను తీర్చుకొని చల్లని నీటిలో ‘తులసిదళము’ లను వుంచి స్నానమాచరించిన……. సమస్త పుణ్య తిర్ధములలోను స్నానమాచరించిన పుణ్యఫలాన్ని పొందుతారని భాగవతోత్తములు చెప్తున్నారు.


ఆరోజు భక్తులు వారి వారి గృహాలను ముత్యాలు ముగ్గులతో, పచ్చని తోరణాలతో కృష్ణ పాదాలను రంగవల్లికలతో తీర్చిదిద్ది ఆ కృష్ణ పరమాత్మను ఆహ్వానం పలుకుతూ, ఊయలలో ఓ చిన్ని కృష్ణుని ప్రతిమను వుంచి, రకరకాల పూవులతో గంధాక్షతలతో యధావిధిగా పూజించి, ధూపదీప నైవేద్యములతో ఆ స్వామిని ఆరాధించి భక్తులకు తీర్ధ ప్రసాదములు దక్షిణ తాంబులములు సమర్పించుకొనుట ఎంత మంచిదో చెప్పబడినది. ఇంతేగాక చాలా చోట్ల కృష్ణ పరమాత్మ లిలల్లో ఒక లిలగా ఉట్టికుండ కొట్టే కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఓ కృష్ణా….! మరణ సమయాన నిన్ను స్మరించుచూ నీలో ఐక్యమవ్వాలని కోరిక వున్నది కాని! ఆ వేళ కఫవాత పైత్యములచే కంఠము మూతపడిపోయి నిన్ను స్మరించగలనో! లేనో ? అని తలచి ఇప్పుడే నా ‘మానస రాజహస’ను శతృఅబేధ్యమైన ‘నీ పాద పద్మ వజ్ర పంజర’ మందు ఉంచుతున్నాను తండ్రి….! అంటూ శ్రీ కృష్ణ భక్తులు ఆ భగవానుని వేడుకుంటారు. తెలుసుకున్నారు కదండీ…! శ్రీ కృష్ణాష్టమి ప్రత్యేకత. ఇట్టి పరమ పుణ్యదినమైన ఈ శ్రీ కృష్ణ జన్మాష్టమినాడు విశేషార్చనలు జరిపించుకుని కృష్ణభగవానుని ఆశిస్సులతో పునితులమవుదాము. నమస్తే…! జై శ్రీ కృష్ణ! #🙏🏼శ్రీకృష్ణుని లీలలు

https://sharechat.com/post/1xjyw47?d=n&ddl=nws_v10&p=v3&v=var10&~campaign=WAShareExpcontrol&referrer=whatsappShare


BuddyLoan ద్వారా కేవలం 5 నిమిషాల్లో రూ. 5 లక్షల వరకు అవాంతరాలు లేని పర్సనల్ లోన్ ను మీ బ్యాంక్ ఖాతాలో  పొందండి. 24 గంటల్లో గ్యారెంటీడ్ డిస్బర్స్‌మెంట్ లేదా ప్రాసెసింగ్ ఫీజుపై 100% తగ్గింపు. సహాయం చేయడానికి  మేము సిద్ధంగా ఉన్నాము.:https://s1.whistleloop.com/?linkid=6598&offerid=2&publisher_id=701&parentid=336

*శ్రీ మద్భగవద్గీత

 🕉️🪷 *ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః* 🪷🕉️

🪷 *శ్రీ మద్భగవద్గీత🪷* 

🌸 *అథ ద్వితీయోధ్యాయః 🌸* 

 *🌸 సాంఖ్య యోగః 🌸* 


 *2-అధ్యాయం, 19వ శ్లోకఒ* 


 *య ఏనం వేత్తి హంతారం య శ్చైనం మన్యతే హతమ్l* 

 *ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే || 19* 


 *ప్రతిపదార్థం* 


యః = ఎవడైతే; ఏనమ్ = దీనిని (ఈ ఆత్మను ); హంతారమ్ =చంపునట్టి దానినిగా; వేత్తి = భావించునో; చ= అట్లే; యః = ఎవడయితే ; ఏనమ్ = దీనిని (ఈ ఆత్మను )i హత మ్ = చంపబడు దానినిగా; మన్యతే = భావించు నో; తౌ, ఉభౌ = ఆ , ఉభయులును;న, విజానతః = తెలిసికొనిన వారు (జ్ఞానులు ) కారు ( ఏలనన ); అయమ్ = ఇది (ఈ ఆత్మ )వాస్తవముగా;న, హంతి = (ఎవ్వరినీ ) చంపదు;న, హన్యతే =(ఎవ్వరిచేతను ) చంపబడదు;


 *తాత్పర్యము* 


ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును, అది (ఆత్మ) ఇతరులచే చంపబడునని భావించువాడును, ఆ ఇద్దరును అజ్ఞానులే. ఏలనన వాస్తవముగా ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎర్వం చేతను చ బాడదు.


 *సర్వేజనా సుఖినోభవంతు* 

 *హరిః ఓం🙏🙏*

రామాయణమ్ ..316

 రామాయణమ్ ..316

...

"వీడిని వధించండి " రావణుడి నోటివెంట వచ్చిన కఠినమైన ఆజ్ఞ అది .

.

ఇక్కడ దూతవధ జరగనున్నది ,దానిని ఎటులైనా సరే ఆపవలెను అది అకార్యము ,అధర్మముకూడా! అని అనుకొని విభీషణుడు అన్నతో ఇలా పలికాడు.

.

మహారాజా ! నన్ను క్షమించండి ! కొంచెము రోషము విడిచి పెట్టండి. రాజశ్రేష్ఠులు దూతను వధించరు !

.

ఓ వీరుడా ఈ వానరుని చంపుట రాజధర్మానికి విరుద్ధము .అది లోకమర్యాద కాదు ,పైగా నీవంటి వాడు చేయదగిన పని కానే కాదు.నీకు సకల ధర్మాలు తెలుసు .రాజధర్మములు పాటించుటలో నేర్పగలవాడవు !

.

రాజా ! నీ వంటి పండితులు కూడా రోషమునకు లొంగి పోయినచో శాస్త్రాలలో పాండిత్యము సంపాదించుట ఉత్త శ్రమగానే మిగిలి పోవును కదా !

.

(శాస్త్రాలు చదివినవాడు ఆ శాస్త్రాలుచెప్పిన విధంగా ప్రవర్తించాలి ! లేకపోతే చదివినవాడికి చదవని వాడికి తేడా ఏముంటుంది ?).

.

శత్రు సంహారకుడవు ,శత్రువులలో  నిన్ను తేరిపారచూడగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా ? .....అందువలన ప్రసన్నుడవు కమ్ము ఈ దూతకు శాస్త్రప్రకారము తగిన దండన విధింపుము....అని విభీషణుడు రాజైన రావణుని చూసి హితవు పలికాడు.

.

అది విన్న రావణుడు ,విభీషణా ! వీడు పాపాత్ముడు ,పాపాత్ములను వధించినా పాపము అంటదు కావున వీనికి మరణదండనయే సరి అయిన శిక్ష ...అనుచూ పలికెను.

.

అందుకు విభీషణుడు రాజైన రావణునితో ,నిజమే ఈతడు చేసిన కార్యము దండనార్హమైనదే ఇతడు మితిమీరి ప్రవర్తించినాడు అను మాట అక్షర సత్యము....కానీ ఏ దేశములో నైనా ,ఏ కాలములో నైనా సత్పురుషులు దూతన వధించినట్లుగా మనమెరుగుదుమా ? 

.

దూతకు విధించదగిన అనేక దండనలు శాస్త్రములు చెప్పినవి కదా ! 

.

ధర్మార్ధములను బాగుగా తెలిసికొని మంచిచెడ్డల విషయములో సునిశితప్రజ్ఞ కలిగినవాడు చేయవలసిన పనికాదు, నీ వంటి బుద్ధిమంతుడు ఇంత శీఘ్రముగా కోపమునకు వశుడెట్లు అయినాడు? ఆశ్చర్యము ! .

.

ధర్మమును తెలిసికొన్న వారిలోసురాసురులలో నీ వంటి ఉత్తముడు ఇంకొకడులేడు కదా !

.

ఈ వానరుని చంపుట వలన ఏమి ప్రయోజనము లభించును? ఈతనిని చంపిన ఇతనిని పంపిన వారిని మనపై యుద్ధానికి తీసుకొని రాగలవాడు ఎవ్వడు ?.

.

అప్పుడు రావణుడు తమ్ముని మాటలు బాగుగా ఆలకించి ఇట్లు పలికినాడు.

.NB

.

విభీషణుడు అన్నతోమాటలాడిన విధము గమనించగలరు ... Transaction analysis లో దీనిని salesmen techniques అని అంటారు...tickling the EGO..

.

కొనటానికి వచ్చిన customers ను చూసి ఇది మీకు బాగుంటుంది కానీcost చాలా ఎక్కువ అని పక్కన పెట్టాడు అనుకోండి ...మన మనస్సు దానిమీదనే లగ్నమయి అది కొనేదాకా నిద్రపోము...

.

అలాగే ఇక్కడ రాజశ్రేష్ఠులు దూతను వధించరు అని అనగానే ...ఒక వేళ వధిస్తే !తనుఅందరు సభికుల దృష్టిలో శ్రేష్ఠుడుకాని వాడుగా మిగిలి పోతాడు....కాబట్టి విడిచి పెట్టి తీరాల్సిందే!!!

.

ఇది Today's Salesman technique!!!....Tickling the EGO...


.

జానకిరామారావు వూటుకూరు

ఎంచుకోండి

 *హిందూ సోదరులందరినీ అభ్యర్థిస్తున్నాము, ఖచ్చితంగా దీన్ని చేయండి*: -

1) నాయకుడిని ఎన్నుకోండి *హిందూ*

2) న్యాయవాదిని ఎంచుకోండి *హిందూ*

3) ఇంజనీర్ *హిందూ* ఎంచుకోండి

4) ఆటో ఎక్కలా *హిందూ* ఎంచుకోండి

5) కూరగాయలు అమ్మే వాడు ఎంచుకోండి *హిందూ*

6) మొబైల్ రీఛార్జ్

*హిందూ* ఎంచుకోండి

7) మెడికల్ స్టోర్ *హిందూ* ఎంచుకోండి

8) మిల్క్ డెయిరీ *హిందూ* ఎంచుకోండి

9) ప్రింటింగ్ ప్రెస్ *హిందూ* ఎంచుకోండి

10) మిల్క్‌మ్యాన్ *హిందూ* ని ఎంచుకోండి

11) స్టేషనరీ దుకాణాలను ఎంచుకోండి *హిందూ*

12) బట్టల షోరూమ్ ఎంచుకోండి మరియు షాపింగ్ *హిందూ*

13) ఎలక్ట్రానిక్ & ఎలక్ట్రికల్ స్టోర్ *హిందూ* ఎంచుకోండి

14) వ్యవసాయ సేవా కేంద్రాన్ని ఎంచుకోండి *హిందూ*

15) ట్రావెల్ బుకింగ్ *హిందూ* ఎంచుకోండి

16) ఫ్లోర్ మిల్ *హిందూ* ఎంచుకోండి

17) కిరణా దుకాణాలను ఎంచుకోండి *హిందూ*

18) హార్డ్‌వేర్ స్టోర్ *హిందూ* ఎంచుకోండి

19) జిరాక్స్ సెంటర్ *హిందూ* ఎంచుకోండి

20) హోటల్ *హిందూ* ఎంచుకోండి

21) కూరగాయలు మరియు పండ్లు అమ్మేవారు  *హిందూ* ఎంచుకోండి

22) మిషన్ *హిందూ* ఎంచుకోండి

23) స్వీట్ షాప్ *హిందూ* ఎంచుకోండి

24) మిగతా అన్నిటికీ చికెన్ మటన్ కొనాల *హిందూ* వ్యాపారిని ఎన్నుకోండి


హిందువుకి ఇలాంటి ఆలోచన ఉండాలి ఎందుకంటే ఒక చిన్న ఆలోచన పెద్ద ఆయుధం గా మారుతుంది.

మీరు భుజంతో భుజం కలిపిన తర్వాత, ప్రతి ఒక్కరూ తల వంచకపోతే చూడండి. 


 *జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్* 


గమనిక: 

ఈ సందేశాన్ని ప్రతి 10 మంది హిందువులకు పంచుకోండి మరియు రోజుకు ఒకసారి ఈ సందేశాన్ని ఉంచండి. చాలా ధన్యవాదాలు


జై శ్రీ రామ్


చివరిగా

ఒక పాయింట్ మరియు


*ఈ సందేశాన్ని  హిందువుకు మాత్రమే పంపండి*


 *తప్పకుండా పంపించండి.*

🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

పుణ్యం వల్ల

సుకృతేన కులే జన్మ సుకృతేన సుభాషితం 

సుకృతేన సతే భార్యా సుకృతేన కృతే సుతః 

స  త్ కులం లో జన్మిచటం, సుభాషితములు గ్రహించటం, సాధ్వి భార్య, పండితుడైన సుతుడు పుణ్యం వల్ల లభిస్తారు.

హరి హర సుభాషితం


గత సుకృతము వలనె కల్గును జన్మంబు

బడయబడునిలను సుభాషితంబు

తలచ సుకృతముననె ధర్మపత్నియు కూడు

సుతుడు కూడ కూడు సుకృతముననె

ఏకాదశ రుద్రులు

 🕉️ *ఏకాదశ రుద్రులు* 🕉️

1. విశ్వేశ్వర -

(శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత వ్యాఘ్రేశ్వర స్వామి):

2. మహాదేవ - 

 (శ్రీపార్వతీ సమేత మేనకేశ్వర స్వామి):

3. త్రయంబకేశ్వర -

 (శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత ఆనందరామేశ్వర స్వామి):

4. త్రిపురాంతక -

(శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి):

5. త్రికాగ్నికాల - 

 (సర్వమంగళా పార్వతీ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి):

6. కాలాగ్ని రుద్ర- 

(బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ రాఘవేశ్వర స్వామి):

7. నీలకంఠ -

( శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత అనంత భోగేశ్వర స్వామి )

8. మృత్యుంజయ - 

(శ్యామలాంబా సమేత శ్రీచెన్నమల్లేశ్వర స్వామి):

9. సర్వేశ్వర -  

 (ఉమాపార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి):

10. సదాశివ -

 (సర్వమంగళా పార్వతీ సమేత శ్రీచెన్నమల్లేశ్వర స్వామి):

11. శ్రీమన్మహాదేవ - (శ్రీబాలాత్రిపురసుందరీ సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడు):

కాలం

 🕉️ *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 


 𝕝𝕝శ్లోకం𝕝𝕝 


*కాలః పచతి భూతాని* 

*కాలః సంహరతే ప్రజాఃI*

*కాలః సుప్తేషు జాగర్తి* 

*కాలో హి దురతిక్రమఃII*


𝕝𝕝తా𝕝𝕝


*కాలం అన్ని అంశాలను మ్రింగివేస్తుంది, కాలం అన్ని జీవులను మాయంచేస్తుంది, ప్రపంచం అంతా నిద్రలో ఉన్నప్పుడు కూడ కాలం మెలకువగా ఉంటుంది, కాలము అతిక్రమించలేని ఒక మాయాజాలం.


కాలము మ్రింగును జీవుల 

కాలము తా మాయ చేయు కల్గిన వానిన్

కాలము తా నిద్రించదు

కాలమ్మును దాటలేము గమనించ దగున్

శ్రీకృష్ణాష్టమి

 ॐ          శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు 


    దేవకీవసుదేవులకు కుమారుడుగా చతుర్భుజుడైన స్వామి ఆవిర్భవించినరోజు. 

    వారు స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని చూసి స్వామిని స్తుతించారు. 

    దాన్ని నారాయనతీర్థులవారు ఒక తరంగంలో చక్కగా చూపారు, 


భావం  


దేవకీవసుదేవులు పరమానంద సాగరమగ్నులయి వినుతిస్తున్నారు. 


మంగళస్వరూపా! శ్రీపతీ! 

    నీవు అపరిమిత జ్ఞానానంద స్వరూపుడవు. జ

    సనకాదియోగులునూ, బ్రహ్మాదిదేవతలునూ నీ మహిమను చనలేరు, 

    అట్టివాడవు మా గర్భాన ఈ చీకటింట ఉదయించడమేమి? 

    ఈ దివ్యకిరీటరత్న ప్రకాశమేమి? 

    ఈ పీతాంబర సుందర దివ్యమంగళ విగ్రహమేమి? 

    ఈ కౌస్తుభ వనమాలాలంకృత వక్షమేమి? 

    ఈ మకరకుండల ప్రభావిభావసిత కపోలమేమి? 

    ఈ కనుతామరల విలాసములేమి? 

    సకల దుష్ట తమస్సులను పారదోలు నీ దివ్యపుంజమేమి? 

    ఆశ్చర్యంగా ఉంది. 

    దీనులమైన మమ్మ గావుము. 

    భూమియందు గురుభక్తి విశేషంగల నారాయణతీర్థమునికి రక్షకుడవు కమ్ము. 


తరంగం 


మంగళాలయ మామవ దేవ

పంకజాసన భావిత భావ 


1. దేవకీవసుదేవతనూజ

    దివ్యకిరీట దళితభవబీజ

    సర్వయోగివిచింత్యపదాబ్జ

    సంగతాఖిలసాధుసమాజ


2. అపరిమితానందబోధస్వరూప

    అతికరుణాకర కరధృతచాప 

    కపటదైత్యహర ఖండితపాప

    కనకాంబరధర కలితకలాప 


3. మకరకుండల కేయూరవిభూష

    మనసిజశతకోటి మంజులవేష

    వికచకమలసన్నిభ విపులాక్ష

    విమలహృదయ గోపాలరక్ష


4. కలిత శ్రీకౌస్తుభ కమనీయ కంఠ

    కరుణారసభర మిళిత వైకుంఠ

    పరిపాలయభువి భాగ్యవితరణ

    గురుభక్త నారాయణతీర్థ శరణ 


అవతారిక 


    ఇట్లు తదేకచిత్తంతో భగవంతుని దివ్యమంగళ విగ్రహాన్ని సేవించి, 

    కంసునివలన భయమునొందినవాడు గావున ఈ విధంగా విన్నవించుకొనుచున్నాడు వసుదేవుడు.  


    శ్రియఃపతీ! 

    సర్వాంతర్యామివగు నీవు ఎఱుగనిది ఉన్నదా? 

    సర్వేశ్వరుదవగు నీవు దేవబ్రాహ్మణరక్ష ఎటులచేయనగునో? అది ఆనతిమ్ము. 

    మరియు మహా తపస్సంపన్నులగు మనీంద్రులకు గమ్యమైన నీ దివ్యరూపమును దర్శింప శక్తులముగాని మాకు, 

    మనుష్య బాలరూపమును చూపుము. 

    

https://youtu.be/0Z2Yh44jquE?si=IBamG7asP87b_kEm


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

నవగ్రహా పురాణం🪐* . *17వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *17వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*సూర్యగ్రహ జననం - 8*


సూర్యుడు సంపత్ని స్వీకరించడానికి అంగీకరించాడు. విశ్వకర్మ దంపతులు కశ్యప ప్రజాపతి అదితి దంపతులను కలుసుకున్నారు.


త్రిమూర్తులూ , ఇతర దేవతలూ , మానస పుత్రులూ విశ్వకర్మ మందిరానికి విచ్చేశారు. అందరి సమక్షంలో సంజ్ఞాసూర్యుల వివాహం వైభవంగా జరిగింది. నూతన దంపతులు సుఖసంతోషాలతో జీవించాలనీ , సంతానవంతులు కావాలనీ త్రిమూర్తులు దీవించారు.


అంతరిక్షంలో జ్యోతిర్మండలంలో ఉన్న సూర్య మండలంలో సూర్యుడి కోసం స్వర్ణం మందిరం నిర్మించమని శ్రీమహావిష్ణువు విశ్వకర్మకు సూచించాడు.


అద్భుతమైన స్వర్ణ మందిరాన్ని అల్లుడికి కానుకగా వెంటనే నిర్మించి ఇస్తానన్నాడు. విశ్వకర్మ. సంజ్ఞ , సూర్యుల కళ్యాణానికి సంధానకర్తగా వ్యవహరించిన నారదుణ్ణి త్రిమూర్తులు మెచ్చుకున్నారు.


అత్తవారింట కొన్ని రోజులు గడిపాడు సూర్యుడు.


సూర్యుడు సంజ్ఞను తీసుకొని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాడు. కశ్యపపత్నులందరూ సంజ్ఞను చూసి మురిసిపోయారు. అచిరకాలంలో సూర్యుడు తమను వదిలి , ధర్మపత్నితో ప్రత్యేకంగా జీవించబోతాడన్న ఆలోచన అదితికి విచారాన్ని కలిగించింది.


సూర్యుడి జననంలోని ఉద్దేశాన్నీ , భవిష్యత్తులో అతడిని వరించబోయే గ్రహరాజ పదవి లక్ష్యాన్నీ , సూర్యుడి ద్వారా జరగాల్సిన లోకోపకారాన్నీ వివరించి చెప్తూ , కశ్యపుడు. అదితిని ఓదార్చాడు. *"లోక బాంధవుడుగా విరాజిల్లే పుత్రుడు కావాలని కోరినప్పుడే నువ్వు తల్లిగా నీ స్వార్థాన్ని త్యాగం చేశావు ! మన సూర్యుడు ఎక్కడున్నా ఇక్కడున్నట్లే , అదితీ !"* అన్నాడు కశ్యప ప్రజాపతి. 


సూర్యమండలంలో మందిర నిర్మాణం పూర్తయ్యాక , విశ్వకర్మ కశ్యపాశ్రమానికి వచ్చాడు. నూతన మందిర ప్రవేశం చేయమని అల్లునికి విన్నవించాడు.


సూర్యుడు తల్లి దగ్గరా , తండ్రి దగ్గరా , పిన తల్లుల దగ్గరా సెలవు తీసుకున్నాడు. సంకల్పించిన క్షణంలో సన్నిధిలో ఉంటాననీ , విచారించవద్దనీ అమ్మను అనునయించాడు.


శ్రీమహావిష్ణువు ఆదేశాన్ని పాటించడం అందరి కర్తవ్యం అన్నాడు.. విశ్వకర్మ కూతురినీ , అల్లుడినీ తాను స్వయంగా నిర్మించిన ప్రత్యేక భవనంలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు.


సంజ్ఞ , సూర్యుల దాంపత్య జీవనం ప్రారంభమైంది. ఒకరికి , ఒకరుగా , ఇద్దరూ ఒకరుగా ఆకాశమందిరంలో , ఉద్యానవనంలో ఆనందయాత్ర సాగిస్తున్నారు. సూర్యపులు. 


సంజ్ఞ ఎటు తిరిగితే సూర్యుడి కళ్ళు అటు తిరుగుతున్నాయి. తీగలాంటి శరీరం. మెరిసే శరీర వర్ణం. ప్రణయ కాంతుల్ని వెదజల్లే పెద్ద పెద్ద కళ్ళు. నడకని నాట్యంగా మార్చివేసే అందాల అందెల పాదాలు. ముఖవర్ణాన్నీ , సౌందర్యాన్నీ హెచ్చవేత వేసే  జుత్తు. అడుగు అడుగుకూ అందంగా నర్తించే అందాల వాలుజడ. అన్నిటినీ మించి చిరుగాలికి కదిలే చిగురుటాకుల్లా ప్రణయోద్రేకంతో స్పందించే ఎర్రటి పెదవులు. 


సంజ్ఞ అందం సూర్యుణ్ణి ఆమె కనుసన్నల్లో మెలిగేలా చేసింది...


సంజ్ఞ ప్రణయతికలా సమ్మోహనకరంగా నడుస్తూ , సూర్యుడిని సమీపించింది. ఆయన పాదాల ముందు కూర్చుని , అద్దంలాంటి ముఖాన్ని పైకెత్తి తదేకంగా చూసింది. సంజ్ఞ చూపులు సూర్యుడి కళ్ళల్లోకి దూసుకెళ్తున్నాయి.


*"స్వామీ... మిమ్మల్ని ఏదో కోరాలనిపిస్తోంది ! ఇస్తారా ?"* అంది మెల్లగా. 


*"నువ్వు కోరకుండానే అన్నీ నీకు ఇవ్వాలనుకున్నాను. కోరితే ఎందుకివ్వను ?"* సూర్యుడు చిరునవ్వు నవ్వాడు.


*"నాకు... నాకు... సంతానం కావాలి... ముగ్గురు !"* సంజ్ఞ కంఠంలో నునుసిగ్గు తారట్లాడుతోంది.


*"ముగ్గురా ?”* సూర్యుడి కంఠంలో ఆశ్చర్యం.. 


*"ఔను... ఇద్దరు కుమారులూ , ఒక కుమార్తే !"* సంజ్ఞ ఆశగా అంది.


*“అనుగ్రహిస్తారా ?”*


*"గ్రహించానుగా !"* సూర్యుడు నవ్వుతూ అన్నాడు , పాదాల వద్ద నుండి ఆమెను పైకి లేవదీస్తూ.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐