24, మే 2025, శనివారం

బ్రదర్స్ డే

 తెలుగు వెలుగు సాహిత్య వేదిక

సందర్భం : బ్రదర్స్ డే

ప్రక్రియ : వచనకవిత

తేది : ది.24/05/2022: మంగళవారం.


శీర్షిక : "" నిజ నేస్తాలు ""


తల్లి వృక్షానికి పుట్టిన కొమ్మల్లా

తల్లిదండ్రులకు పుట్టిన సంతతే అన్నదమ్ములు

రక్తం పంచుకు పుట్టిన రక్త సంబంధికులు

ఆపదల్లో. నిజమైన నేస్తాలు!

తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు అన్నయ్య

అన్నయ్యకు ఆత్మీయుడు తమ్మయ్య!

ఒకే రక్తం పంచుకున్న అన్నదమ్ములు

కుటుంబ గౌరవ ప్రతిష్టలకు పునాదులు

ఆ పునాదులే భారతీయ ఉమ్మడి కుటుంబ సంరక్షకులు!

అన్నదమ్ముల అనుబంధానికి. ప్రతీకలు రామలక్ష్మణులు

కష్టసుఖాల్లో కలసిమెలసి ఉండడం

ఆపదల్లో అండదండై నిలవడం

ఒకే మాటపై, ఒకే బాటలో పయనించడం

సమాజంలో ఉన్నతస్థాయిలో కుటుంబ గౌరవాన్ని నిలపడం

అన్నదమ్ముల గురుతర బాధ్యతలు!

ప్రపంచ దేశాలన్నీ సోదరభావం తో. మెలిగి

అన్నదమ్ముల్లా ఆత్మీయతానురాగాలు పంచుకుంటే....

యుద్ధ భయాలు అసలే ఉండవు

ప్రపంచశాంతికి కొరతే ఉండదు!

............................................ రచన :

ఆళ్ల నాగేశ్వరరావు

తెనాలి

గుంటూరు... జిల్లా

ఆంధ్రప్రదేశ్.... రాష్ట్రము

చరవాణి :7416638823

క్రమసంఖ్య :107

............................................ పై వచనకవిత నా స్వీయరచనే నని హా

అల్పబుధ్ధిని తెలుసుకొనుము.

 *2022*

*కం*

వంచించగ ఘనుడేనని

మంచిగ భావించుముందు మనిషిగ నీకా

వంచితుడిచ్చిన విలువల

నెంచగనీ కుంచితమతి నెరుగుము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ఇతరులను మోసగించి గొప్పగా భావించే ముందు మనిషి గా మోసపోయిన వాడు నీకు ఇచ్చిన విలువలు గుర్తించి నీ అల్పబుధ్ధిని తెలుసుకొనుము.

*సందేశం*:-- చాలా మంది ఇతరుల ను మోసగించి తమనుతాము గొప్ప వారి గా భ్రమపడుతూ ఉంటారు ‌ కానీ మిమ్మల్ని ఎంత గొప్ప గా భావించి మీపై విశ్వాసాన్నీ చూపాడో తెలుసుకుంటే మీరు ఎంతటి నీచమైన పని చేసారో అర్థమవుతుంది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: ఆరవ అధ్యాయం

ఆత్మసంయమయోగం: శ్రీ భగవానువాచ


సంకల్పప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః 

మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః (24)


శనైః శనైరుపరమేద్బుద్ధ్యా ధృతిగృహీతయా 

ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ (25)


సంకల్పంవల్ల కలిగే సకలవాంఛలనూ సంపూర్ణంగా విడిచిపెట్టి, ఇంద్రియాలన్నిటినీ సమస్తవిషయాల నుంచి మనస్సుతోనే మళ్ళించి, బుద్ధి ధైర్యంతో మనస్సును ఆత్మమీదే నెమ్మదిగా నిలిపి చిత్తశాంతి పొందాలి. ఏ మాత్రమూ ఇతర చింతనలు చేయకూడదు.

శ్రీ చింతామణి గణపతి ఆలయం

 🕉 మన గుడి : నెం 1120


⚜ మహారాష్ట్ర : థీయూర్‌

 

⚜ శ్రీ చింతామణి గణపతి ఆలయం



💠 మహారాష్ట్రలోని అష్టవినాయక దేవాలయాలలో ఇది ఒకటి.  

ఈ ఆలయం తేర్ వద్ద ఉంది.

అష్టవినాయక్ సర్క్యూట్‌లో సందర్శించాల్సిన ఐదవ ఆలయానికి తేర్ సూచించబడినప్పటికీ, యాత్రికులు మోర్గావ్ తర్వాత రెండవ స్థానంలో ఉన్న తేర్‌ను తరచుగా సందర్శిస్తారు, ఎందుకంటే ఇది అనుకూలమైన మార్గం.  


💠 అష్టవినాయక అంటే సంస్కృతంలో "ఎనిమిది వినాయకులు" అని అర్ధం. గణేశుడు ఐక్యత, శ్రేయస్సు, అభ్యాసం మరియు అడ్డంకులను తొలగిస్తాడు. ఈ పదం ఎనిమిది వినాయకులను సూచిస్తుంది.  

ఆదిశక్తి అష్టా దశ మహా శక్తి పీఠాలు 51 + శక్తి పీఠాలు మరియు ద్వాదశ జ్యోతిర్లింగాలలో శివుడు తన భక్తులను ఆశీర్వదిస్తున్నట్లు మనకు తెలుసు. అదేవిధంగా గణేశుడు కూడా అష్టవినాయక రూపంలో తన భక్తులను అనుగ్రహిస్తాడు.  

అష్టవినాయక యాత్ర యాత్ర పూణే చుట్టూ ఉన్న గణేశుడి ఎనిమిది పురాతన పవిత్ర దేవాలయాల తీర్థయాత్రను సూచిస్తుంది.  

ఈ దేవాలయాలలో ప్రతి ఒక్కటి దాని స్వంత వ్యక్తిగత పురాణం మరియు చరిత్రను కలిగి ఉంది, ప్రతి ఆలయంలోని మూర్తులు, విగ్రహాలు వంటివి ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి.  

వినాయకుడి ప్రతి విగ్రహం మరియు అతని తొండం ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి.  

అయితే, మహారాష్ట్రలోని అనేక ఇతర ప్రాంతాల్లో ఎనిమిది వినాయకుడి ఆలయాలు ఉన్నాయి; పూణె చుట్టుపక్కల వారు మునుపటి వాటి కంటే బాగా ప్రసిద్ధి చెందాయి. అష్టవినాయక యాత్ర పూర్తి కావడానికి మొత్తం ఎనిమిది గణపతిలను దర్శించుకున్న తర్వాత మళ్లీ మొదటి గణపతిని దర్శించుకోండి, అప్పుడే మీ యాత్ర పూర్తవుతుందని నమ్ముతారు.


💠 దేవతా విగ్రహం స్వయంభువు మరియు తూర్పు ముఖంగా పూర్వాభిముఖ అని పిలువబడుతుంది, అతని తొండం ఎడమవైపుకు తిరిగింది మరియు అతని కళ్ళలో అందమైన వజ్రాలు పొదిగబడ్డాయి.  


💠 విగ్రహం ఒక కాలు మీద కూర్చున్న స్థితిలో ఉంది. భీమా, మూల మరియు ముఠా అనే మూడు ప్రధాన ప్రాంతీయ నదుల సంగమం వద్ద ఉన్న తేూర్ ఒక ముఖ్యమైన పౌరాణిక ప్రదేశం. చింతామణి గణేశుడిగా మనశ్శాంతిని కలిగించే మరియు మనస్సులోని అన్ని గందరగోళాలను దూరం చేసే దేవుడు.


💠 థేర్ అనే పేరు సంస్కృత పదం స్థవర్ నుండి ఉద్భవించింది అంటే స్థిరమైనది.  

మరొక పురాణం ప్రకారం, బ్రహ్మ దేవుడు ఇక్కడ ధ్యానం చేసాడు మరియు గణేశుడి ఆశీర్వాదం కారణంగా అతని చంచలమైన మనస్సు స్థిరంగా మారింది.  

గణేశుడు బ్రహ్మ చింతలను వదిలించాడు కాబట్టి అతను చింతామణి అని పిలువబడ్డాడు.  


💠 మరొక కథ ప్రకారం, ఇంద్రుడు గౌతమ మహర్షి యొక్క శాపం నుండి విముక్తి కోసం ఇక్కడ కదంబ చెట్టు క్రింద వినాయకుడిని పూజించాడు.

ఈ ప్రదేశాన్ని కదంబ చెట్ల పట్టణంగా కదమబా-నగర్ అని పిలిచేవారు.  

 

🔆 స్థల పురాణం ప్రకారం


💠 ఒకసారి అభిజిత్ రాజు కుమారుడు గణ యువరాజు మరియు అతని మొత్తం సైన్యం  కోరికలు తీర్చే రత్నం చింతామణిని కలిగి ఉన్న కపిల మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకుంటారు.  కపిల రాజు మరియు అతని సైన్యానికి చింతామణి రత్నం సహాయంతో రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నాడు.  

అత్యాశగల యువరాజు ఆ ఆభరణాన్ని పొందాలని కోరుకుంటాడు.    

అయితే ఋషి నిరాకరిస్తాడు.  


💠 గణుడు దానిని ఋషి నుండి బలవంతంగా స్వాధీనం చేసుకుంటాడు. గణేశుడి భక్తుడైన కపిల ముని ..ఆభరణాన్ని తిరిగి పొందమని గణేశుడిని ప్రార్థించాడు.  


💠 గణేశుడు తన సైన్యంతో గణుని కలలో కనిపిస్తాడు, అతని సైనికుల్లో ఒకడు గణ తలని నరికాడు. గణుడు మేల్కొని, ఋషిని వధించాలనే ఉద్దేశంతో తన సైన్యంతో కపిల ఆశ్రమానికి బయలుదేరాడు.   

రాజు అభిజిత్ తన కుమారుడిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు మరియు చింతామణిని ఋషికి తిరిగి ఇవ్వమని సలహా ఇస్తాడు, కానీ ఫలించలేదు.  


💠 గణ ఆశ్రమాన్ని నాశనం చేయడం ప్రారంభించాడు. గణేశుడి శక్తి సిద్ధి దేవి కనిపించి, వెయ్యి సాయుధ యోధుడైన లక్షను సృష్టిస్తుంది, అతను గణ సైన్యాన్ని నాశనం చేస్తాడు, అయితే గణేశుడు అహంకారి యువరాజు గణను నరికివేస్తాడు. 

గణేశుడు ఆ ఆభరణాన్ని కపిలకు తిరిగి ఇస్తాడు, అయితే, ఋషి ఆ ఆభరణానికి బదులుగా తన స్వామిని కలిగి ఉండాలని ఎంచుకున్నాడు. కాబట్టి, గణేశుడు రత్న చింతామణి అని పేరు పెట్టుకుని కపిలతో కలిసి తేరులో ఉంటాడు. 

 

💠 ఈ ఆలయం మూడు ప్రధాన పండుగలను జరుపుకుంటుంది. 

గణేష్ చతుర్థి పండుగకు అనుగుణంగా ఉండే గణేష్ ప్రకటోస్తవ్ . 

ఈ పండుగను హిందూ నెల భాద్రపద మొదటి నుండి ఏడవ రోజు వరకు జరుపుకుంటారు , ఇక్కడ గణేష్ చతుర్థి నాల్గవ రోజు. 

ఈ సందర్భంగా ఒక ఉత్సవం జరుగుతుంది. గణేష్ పుట్టినరోజును గుర్తుచేసుకోవడానికి మాఘోత్సవం పండుగ జరుగుతుంది - గణేష్ జయంతి , ఇది హిందూ నెల మాఘ నాల్గవ రోజున వస్తుంది . 

ఆలయ ఉత్సవాన్ని నెల మొదటి నుండి ఎనిమిదవ తేదీ వరకు జరుపుకుంటారు.


💠 ఇది పూణే నుండి 25 కి.మీ దూరం


రచన

©️ Santosh kumar

17-20-గీతా మకరందము

 17-20-గీతా మకరందము.

    శ్రద్ధాత్రయ విభాగయోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - ఇక నిపుడు దానములను గూర్చి చెప్పదలంచి మొట్టమొదట సాత్త్వికదానమెట్టిదో తెలుపుచున్నారు–


దాతవ్యమితి యద్దానం దీయతే౽నుపకారిణే | 

దేశే కాలే చ పాత్రే చ 

తద్దానం సాత్త్వికం స్మృతమ్ || 


తాత్పర్యము:- ఇవ్వవలసినదే యను నిశ్చయముతో ఏ దానము పుణ్యప్రదేశమందును, పుణ్యకాలమందును, యోగ్యుడగువానికి మఱియు ప్రత్యుపకారముచేయు శక్తిలేనివానికొఱకు ఇవ్వబడుచున్నదో అది సాత్త్వికదానమని చెప్పబడుచున్నది.


వ్యాఖ్య:- “దాతవ్యమితి” - ప్రతివాడును దానముచేయుట తన ధర్మమని తలంచి దానము చేయవలెను. అంతియేకాని ఒకరిమెప్పుకొఱకుగాని, ప్రతిఫలాపేక్షచేగాని చేయరాదు. "నీవేల దానము చేయుచున్నా”వని యెవరైన దాత నడిగినచో “ఇది నా ధర్మము. నేను దానము చేయవలసినదే (దాతవ్యమ్) కాబట్టి చేయుచున్నాను" అనియే సమాధానము చెప్పవలయును. వాస్తవముగ త్యాగముచేయుట, దానముచేయుట తనమేలు కొఱకే యగును. ఒకరికి ఉపకారము చేసినను అదియు (పుణ్యప్రాప్తివలన) తనకు తానుచేసికొను ఉపకారమే యగును. కావున దానముచేయువారు తామేదో ఒకరి నుద్ధరించితిమని తలంచుటకంటె ౼ ఆ దానక్రియచే తమ్ముతాము యుద్ధరించుకొనినవారైరని భావించుట యుత్తమము.


"అనుపకారిణే” - అని చెప్పినందువలన, ప్రత్యుపకారము చేయలేనివారికి, బీదవారికి, అశక్తులకు, వికలాంగులకు, దరిద్రనారాయణులకు చేయు దానము ఉత్కృష్టమని తేలుచున్నది. మఱియు శక్తిగలవారికి, ప్రత్యుపకారము చేయగల సమర్థతగలవారికి దానముచేయుట అంత ఉత్తమమైనదిగాదనియు ఈ పదముద్వారా సూచితమగుచున్నది.


“దేశే” - అనగా పుణ్యక్షేత్రమందు, తీర్థాదులందు, పవిత్ర ఆశ్రమాదులందు లేక పవిత్రమైనట్టి, దైవగంధయుతమైనట్టి ఏ ప్రదేశమందైనను అని యర్థము.


"కాలే” యనగా గ్రహణము, సంక్రాంతి, లేక ఏదైన పుణ్యకార్యసందర్భము - ఇత్యాదిరూపమగు పవిత్రకాలమునందు అని యర్థము.


 ‘పాత్రే' యనగా యోగ్యతగలవానికి, తగినవానికి అని యర్థము. పాత్రతనెఱింగి దానముచేయుడని పెద్దలు చెప్పుదురు. అపాత్రునకు దానముచేసినచో దాతకు ఉత్తమఫలము చేకూరదని భావము.


ప్రశ్న: - సాత్త్వికదానమనగా నెట్టిది?

ఉత్తరము:- "దానముచేయవలసినదే" అని నిశ్చయించుకొని (1) ప్రత్యుపకారము చేయలేనివారికి, దీనులకు, అసహాయులకు (2) దేశ, కాల. పాత్రతలను జూచి చేయబడు దానము సాత్త్వికమని చెప్పబడును.

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*కర్ణ పర్వము ద్వితీయాశ్వాసము*


*386 వ రోజు*


*ధృష్టద్యుమ్నుడు*


ధృష్టద్యుమ్నుడు కృతవర్మను వక్షస్థలానికి గురిపెట్టి తొమ్మిది బాణములతో కొట్టి కృతవర్మ సారథిని రథమును అశ్వములను ధ్వజమును తన బాణములతో కప్పాడు. కృతవర్మ రథము నుండి దిగి పోయాడు. ధృష్టద్యుమ్నుడు కృతవర్మను వెతుకుతూ అతడి సారథిని చంపాడు. కృతవర్మ నేనిక్కడ ఉన్నాను అని పెద్దగా అరిచాడు. ధృష్టద్యుమ్నుని కృతవర్మ నేల మీద నిలబడి ఒక విల్లందుకుని ఎదుర్కొన్నాడు. కౌరవ వీరుడు అక్కడకు వచ్చి కృతవర్మను రథము మీదకు లాక్కుని తీసుకు వెళ్ళాడు. చేతికి చిక్కిన్మ కృతవర్మ పోగానే ధృష్టద్యుమ్నుడు కౌరవసేనను నాశనం చేయ సాగాడు.


*అశ్వత్థామ ధర్మజుల పోరు*


అశ్వత్థామతో యుద్ధము చేస్తున్న ధర్మజునికి సాయంగా సాత్యకి వచ్చి చేరాడు. అశ్వత్థామ వారందరిని తన శరపరంపరతో ముంచెత్తాడు. ధర్మరాజు కూడా అశ్వత్థామ మీద బాణవర్షం కురిపించాడు. అశ్వథ్థామ ధర్మజుని విల్లు తుంచి అతడి మీద మూడు బాణంఅములు వేసాడు. సాత్యకి అశ్వత్థామ విల్లు తుంచాడు. అశ్వత్థామ ఒక ఈటెను విసిరి సాత్యకి సారథిని చంపి సాత్యకి మీద బాణములు గుప్పించాడు. సారథి లేని సాత్యకిని రథమును గుర్రములు ఎటో ఈడ్చుకు వెళ్ళాయి. తన మీద శరవర్షం కురిపిస్తున్న పాడవ సేన మీద ఆగ్రహించిన అశ్వత్థామ పాండవసేనను ఊచకోత కోస్తున్నాడు. ఇది విన్న సుయోధనుడు పాండవులు కూడా అశ్వత్థామ చేతిలో హతులైనారని అనుకుని ఆనందించాడు. ఇంతలో ధర్మరాజు అశ్వత్థామను తరమడం చూసి హతాశుడయ్యాడు. ధర్మరాజు అశ్వత్థామను చూసి " గురుపుత్రా అశ్వత్థామా ! నీవు అత్యంత బలశాలివి అస్త్రశస్త్ర పారంగతుడవు నీ పరాక్రమము నా మీద కాక ధృష్టద్యుమ్నుడి మీద చూపు. నీవు బ్రాహ్మణుడవు నీకు జాలి దయ కరుణ కృతజ్ఞత ఏకోశాన లేవు. నీవు బ్రాహ్మణ సహజమైన జపతపాదులను వదిలి విల్లు పట్టి ఇలా యుద్ధము చేయడం ధర్మము కాదు " అన్నాడు. అశ్వత్థామ ఆ మాటలు పట్టించుకొనక ధర్మరాజు మీద బాణములు గుప్పించాడు. అశ్వత్థామ అస్త్రధాటికి ఆగలేక ధర్మరాజు అక్కడి నుండి వెళ్ళాడు.


*కురుపాండవ యోధుల సమరం*

భీమసేనుడితో యుద్ధము చేస్తున్న కర్ణుడు కృపాచార్యుడికి సాయంగా వచ్చాడు. భీముడు కౌరవ యోధులను తనుమాడుతున్నాడు. నకులసహదేవులతో యుద్ధం చేస్తూ సుయోధనుడు సహదేవుని ధ్వజము ఖండించి వారిద్దరి ధనస్సులు విరిచాడు. వారు వేరు ధనస్సులు ధరించి సుయోధనుడి మీద శరములు గుప్పించారు. సుయోధనుడు కోపించి వారిరువురిని బాణములతో కప్పేశాడు. వారు సుయోధనుడి చేతిలో మరణిస్తారని అనుకుంటున్న తరుణంలో ధృష్టద్యుమ్నుడు వేగంగా అక్కడకు వచ్చి వారిని రక్షించాడు. సుయోధనుడు ధృష్టద్యుమ్నుడు మీద అత్యంత తీవ్రమైన బాణము ప్రయోగించి అతడి ధనస్సును ఖండించాడు. ధృష్టద్యుమ్నుడు వేరొక విల్లు తీసుకుని సుయోధనుడి మీద బాణవర్షం కురిపించాడు. సుయోధనుడు ధృష్టద్యుమ్నుని ధనస్సు ఖండించి అతడి నుదుటన పది బాణములు నాటాడు. ఆగ్రహించిన ధృష్టద్యుమ్నుడు వేరొక ధనస్సు అందుకుని సుయోధనుడి ధనస్సు, కేతనము, రథమును విరిచాడు. సుయోధనుడు ఏమాత్రం జంకక ధృష్టద్యుమ్నుని బల్లెము, ఖడ్గం, ధ్వజము, అశ్వములను, సారథిని, కవచమును తునాతునకలు చేసాడు. అది చూసిన ధృష్టద్యుమ్నుడి సోదరుడు అతడిని తన రథము మీదకు లాక్కుని తీసుకు వెళ్ళాడు. అప్పటి వరకు సాత్యకితో పోరుతున్న కర్ణుడు అతడిని విడిచి ధృష్టద్యుమ్నుని వెంబడించాడు. సాత్యకి కర్ణుడిని తరుముతున్నాడు. ధృష్టద్యుమ్నునికి కర్ణుడికి మధ్య యుద్ధం ఘోరంగా సాగింది. వారిరువురికి మధ్యలో వచ్చి కర్ణుడిని ఎదుర్కొన్న ఎనిమిది మంది పాంచాలరాకుమారులను కర్ణుడు యమపురికి పంపాడు. తనను చుట్టుముట్టిన చేధి, పాంచాల వీరులను కర్ణుడు సంహరించి ధర్మరాజు వైపు వెళ్ళసాగాడు. అది చూసిన ఉపపాండవులు, 

*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

దుర్గుణాలు

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝 *పైశున్యం సాహసం ద్రోహం ఈర్ష్యాసూయార్థ దూషణమ్!* 

          *వాగ్దండయోశ్చ పౌరుష్యం క్రోధజోఁపి గుణోష్టకః!!*


తా𝕝𝕝 *కోపం వలన వచ్చే ఎనిమిది దుర్గుణాలు* : 


*👉 చాడీలు చెప్పడం, తొందరపాటుతనం, ఇతరులకు హాని చేయడం, ఓర్వలేనితనం, ఇతరులలో ఉన్న మంచి గుణాలను దోషాలుగా ప్రచారం చేయడం, కఠినంగా మాట్లాడడం, నిష్కారణంగా శిక్షించడం, పరుషంగా మాట్లాడడం - ఈ ఎనిమిదీ కోపం నుండి పుట్టిన దుర్గుణాలు*....


 ✍️🌹💐🌸🙏

జీవికా పరీక్ష*

 *జీవికా పరీక్ష*


ఇదేదో వ్రాత పరీక్ష కాదు, ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతే గాని తదుపరి విద్యలను అభ్యసించడానికి అర్హత పొందగలమని కాదు. లేదా మనం చేపట్టు ఉద్యోగానికి తొలిమెట్టు అని అంతకన్నా కాదు. 


నూతన దంపతులకు కలుగు సంతానం భవిష్యత్తులో ఎటువంటి వృత్తిని చేపట్టగలదని అన్నప్రాసన సమయాన్నే నిర్ధారించు ఓ ప్రక్రియ మాత్రమే. శాస్త్రాలే ఈ పరీక్షను సూచించాయి. ఈ పరీక్ష జరపడానికి ఒకే నియమం ఏంటంటే ఆ సంతానం - బాబు కావొచ్చు, పాప కావొచ్చు - దోగాడుతూ ఉండాలి. అంటే బిడ్డ నేలపై జేతులాని మోకాళ్లతో అటూఇటూ ప్రాకుతూ ఉండాలన్నమాట. అంటే బిడ్డకు అన్నప్రాశన సమయంలో గాని ఆ తర్వాత గాని ఎప్పుడైనా చేయగలం. దీనినే జీవికా పరీక్ష అని అంటారు. 


పూర్వకాలంలో పిల్లల భవిష్యత్తు ఏవృత్తిలో నైపుణ్యం ద్వారా అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని ఈ పరీక్ష ద్వారానే నిర్ధారించేవారు. అంటే తన భవిష్యత్తు ఎలా ఉంటుందనడానికి ఓ చిన్ని సంకేతమే అన్నట్టు. 


ఈ పరీక్షను ఎలా పాటించాలంటే వారి వారి కులదైవాన్ని పూజా గృహంలో నుండు ఇతర దేవతలను ప్రార్థించుకొని ఓ శుభ ముహూర్తాన ఈ పరీక్షను నిర్వహించాలి. 


వివిధ వృత్తులకు సంభందించిన ఆటవస్తువులు అంటే, వైద్య వృత్తిని, శాస్త్రవేత్త వృత్తిని, సాఫ్ట్వేర్ రంగాన్ని, పైలట్ లేదా వ్యోమగామిలను సూచించే బొమ్మలను గాని విద్యా రంగం లేదా ఇంజనీరింగు అని, ఇలా వివిధ రంగాలకు, అవి ఏవైనా కావొచ్చు, అనుగుణంగా చిన్ని చిన్ని వస్తువులను సేకరించి ఓ గదిలో నేలపై అక్కడక్కడా పరచాలి. ముందు ఈ వస్తువులన్నటిని నేలపై పరిచిన తర్వాత ఆ చిన్ని బాబును గాని పాపను గాని ఆ గదిలో ప్రవేశపెట్టాలి. 


వారికి అప్పటికే మనుష్యులను ఆట వస్తువులను శబ్దాలను గుర్తించే వయస్సు. ఈ వస్తువులన్నింటినీ వాళ్ళు చూడగానే నవ్వుతూ ఎంతో ఉత్సాహంగా ఆ వస్తువులను చేపట్టడానికి దోగాడుతూ వెళ్తారు కదా. వారు మొట్టమొదట ఏ వస్తువును మిక్కిలి మక్కువతో చేపట్టుతారో ఆ వస్తువు సూచించే వృత్తినే వారు భవిష్యత్తులో చేపట్టి నైపుణ్యం పొంది ఆరితేరినవారౌతారని ఘంటాపథంగా చెప్పగలం.


పుస్తకాన్ని గైకొన్న యెడల విద్యా రంగాన్ని, స్టెతస్కోప్పును పట్టుకొన్నచో వైద్య రంగాన్ని లేదా ఏరోప్లేన్ను చేపట్టితే పైలట్టని లేదా లాప్టాప్పును చేపట్టితే సాప్ట్వేరని ఇలా వివిధ రంగాల్లో భవిష్యత్తులో వారి జీవనశైలి కొనసాగ గలదని చెప్పడానికి ఇది శాస్త్ర ప్రామాణిత సూచికగా పరిగణించగలం. 


ఇవన్ని మనకేదో వింతగా తోచవచ్చు. ఇవన్నీ ఓ బూటకమేనని ఈ తరంవాళ్ళు కొట్టిపారేయవచ్చు. కాని ఇలాంటి పరీక్ష పురాతన కాలాల నుండే సంక్రమించింది, శాస్త్ర సమ్మతం కూడా. నమ్మడం నమ్మకపోవడం మన వంతు మరి. ఇలాంటి ఓ తంతును జరిపించి ఎక్కడైనా వ్రాసుకొన్న యెడల భవిష్యత్తులో సరిచూసుకోగలం. 


ప్రాచీన కాలానికి ఇప్పటికీ ఎన్నో వృత్తులు మారాయి. కొన్ని అడుగంటి పోయాయి, మరి కొన్ని నూతనంగా ఉద్భవించాయి కూడా. ఇవే కాకుండా కులవృత్తి అనే వైనం కూడా చాలా వరకు మారాయి. ఈ కాలంలో అందరూ అన్ని రంగాల్లో ప్రవేశించి వారి వారి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అందువల్ల ప్రస్తుత కాలప్రమాణాలకు అనుగుణంగా సూచించే వస్తువులను బొమ్మలను సేకరించి ఆ చిన్నారిని పరీక్షించాలి. వాళ్ళు ఏ వస్తువుపై ఎక్కువ మక్కువ చూపుతున్నారో మనం ఇట్టే పసిగట్టగలం. 


వారి భవిష్యత్తు అటే ఉండగలదని శాస్త్ర ఉవాచ. మీ పిల్లలతో ఇప్పుడే ప్రయత్నించండి. ఓ ఇరవై సంవత్సరాల తర్వాత మీరే సరిచూసుకోండి. నూటికి నూరు పాళ్ళు జరిగి తీరుతుంది. 


చిన్న పిల్లల మేధస్సు ఎలా పరిణమించగలదో అనడానికి ఓ చిన్ని సంకేతం మాత్రమే.

జకారా: పంచ

 ||జామాతా, జఠరం, జాయా, జాతవేదా, జలాశయ:

పూరితేనైవ పూర్యన్తే జకారా: పంచ దుర్లభా:|| (దుర్భరా)


లోకములో తృప్తి అనేది వేటికి వుండదు? అని ఆలోచించి ఒక కవి యిలా అన్నాడు... 


ఈ లోకం లో ఐదు 'జ' కారాలున్నాయి. వాటికి ఎంత చేసినా తృప్తి అనేది వుండదు.... అవి ఏమిటంటే... 


(1) 'జామాతా' అంటే అల్లుడు.... ఎంత యిచ్చినా చాలు అనని వాడు....


(2) 'జఠరం' అంటే కడుపు.... దీనికీ అంతే ఎంత తిన్నా మరునాటికి మామూలే....


(3) 'జాయా' అంటే భార్య.... ఈవిడ కూడా అంతే.... ఎంత మంచిగా ఉన్నా ఎప్పుడూ కోపమే.... 


(4) 'జాతవేదా' అంటే అగ్ని.. ఎన్ని వస్తువులు వేసినా కాలిపోతూ వుంటాయి....


(5) 'జలాశయ' అంటే సముద్రము. ఎంతనీరు వచ్చిపడినా తృప్తి లేదు... 


ఈ ఐదు 'జ' కారాలనూ తృప్తి పరచటం కష్టం.... 


శాశ్వతమైన జఠరాలు.... అసంతృప్తి తప్ప, తృప్తి అనేదే ఉండదు.... 

                                                 🙏💖🌷

ఏదీ వేసవి?*

 🌞🌞 *ఏదీ వేసవి?* 🌞🌞 



సీ॥

వేసవిగాడ్పులేవి? మహోష్ణతాపముల్ 

నిట్టూర్పులన్ వ్రేల్చు బిట్టులేవి? 

దిక్కులన్నిటి గల్పు తీవ్రదుమారముల్ 

చెలరేగి తిరుగాడు సీమలేవి? 

నీటముంచుకదీయ నెఱ చల్లగాలులన్ 

సృజియించు వీవనాశ్రేణులేవి? 

రోళ్ళను బగిలించు రోహిణీకార్తెలో 

సూర్యఖరమయూఖశౌర్యమేది? 

గీ॥ ప్రబలి ౘదలను దిరుగాడి వానతోడ 

పిడుగుల వడగండ్ల జెలగి భీతిగొల్పి 

ధరణి జృంభించు మేఘాలదర్పమెగయ 

గ్రీష్మలక్షణ మీనాడు కినిసెనేల? 

*~శ్రీశర్మద*

పంచాంగం 24.05.2025

 ఈ రోజు పంచాంగం 24.05.2025 Saturday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాస కృష్ణ పక్ష ద్వాదశి తిథి స్థిర వాసర రేవతి నక్షత్రం ఆయుష్మాన్ యోగః కౌలవ తదుపరి తైతుల తదుపరి గరజి కరణం.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.



నమస్కారః , శుభోదయం