27, మే 2025, మంగళవారం

జ్యేష్ఠ మాసం ప్రారంభం

 *జ్యేష్ఠ మాసం ప్రారంభం సందర్భంగా...* 


*మే 28 బుధవారం నుండి జ్యేష్ఠ మాసం ప్రారంభం...* 


*జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవునికి ప్రీతికరమైన మాసం...* 


ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని. బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకుని ఈ నెల రోజుల పాటు పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చని. ఈ మాసంలో చేసే విష్ణుసహస్రనామ పారాయణం అనంత ఫలాన్నిస్తుంది. అలాగే నీళ్ళను దానం చేయడం వలన చాలా ఉత్తమమైన ఫలితాలు దక్కుతాయి. జ్యేష్ఠ శుద్ద తదియనాడు రంభా తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేకంగా పార్వతి దేవిని పూజించడమే కాదు, దానాలకు శుభకాలం. ముఖ్యంగా అన్న దానం చేయడం ఉత్తమం. జ్యేష్ఠశుద్ద దశమిని దశపాపహర దశమి అంటారు. అంటే పది రకాలను పాపాలను పోగొట్టే దశమి అని అర్ధం.


పాపాలను హరించే శక్తి కలిగిన దశమి రోజున గంగా స్నానం, లేదా ఏదైనా నదిలో పదిసార్లు మునకేస్తే మంచి ఫలితాన్నిస్తుంది. ఈ మాసం శుక్లపక్ష పాడ్యమి మొదలు దశమి వరకు అంటే తొలి పదిరోజులూ కాశీలోని దశాశ్వమేధఘాట్ లో బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని గంగానదిలో స్నానం చేయడంతో పాటు గంగానదిని పూజించాలి. అందుకు వీలుకాని వారు సమీపంలోని నది గానీ, లేదా ఇంటిలో గానీ గంగానదిని స్మరిస్తూ స్నానం చేయాలి. నల్ల నువ్వులు, నెయ్యి, పేలాలు, బెల్లం నదిలో వేయాలి. ఈ రోజున ఇష్ట దైవాన్ని పూజించి ఆలయాల సందర్శిస్తే శుభం జరుగుతుంది.


జ్యేష్ఠ శుద్ద ఏకాదశినే నిర్జల 'మతత్రయ' ఏకాదశి అనే పేరుతోనూ పిలుస్తారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పెసరపప్పు, పాయసం, పానకం, నెయ్యి, గొడుగు పేదవారికి దానం చేయాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే 12 ఏకాదశులను ఆచరించిన ఫలితం దక్కుతుంది. జ్యేష్ఠ శుద్ద ద్వాదశిని దశహరా అంటారు. ఇది దుర్దశలను పోగొట్టగలిగే శక్తి కలిగిన తిథి. ఈరోజు నది స్నానాలు చేయాలి. అలాంటి అవకాశంలేనప్పుడు ఇంట్లో స్నానమాచరించే సమయంలో గంగా దేవిని స్మరించడం ఉత్తమం. జ్యేష్ఠ పూర్ణిమను మహాజ్యేష్టి అంటారు. ఈ రోజున తిలలు దానం చేసిన వారికి ఆశ్వమేథయాగం చేసిన ఫలితం లభిస్తుంది. జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన జ్యేష్ఠ మాసంలో గొడుగు, చెప్పులను అనాధలకు, నిర్భాగ్యులకు దానం చేసిన వారికి ఉత్తమగతులతో పాటు ఐశ్వర్యం ప్రాప్తిస్తాయని విష్ణు పురాణం తెలిపింది. వామన ప్రీతికి విసనకర్ర, జల కలశం, మంచి గంధం దానం చేయాలి. ఈ పౌర్ణమినే ఏరువాక పున్నమి పేరుతో జరుపుకుంటారు. ఇది రైతుల పండుగ.. ఎద్దులను అలంకరించి పొంగలి పెట్టి, ఉరేగింపుగా పొలాల వద్దకు తీసుకెళ్లి దుక్కి దున్నిస్తారు. వటసావిత్రి వ్రతం చేయనున్న మహిళలు జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత పదమూడో రోజున మహిళలు వటసావిత్రి వ్రతం చేసుకుంటారు. భర్తలు పది కాలాల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులు కావాలని మనసార కోరుకుంటూ ఈ పూజ చేస్తారు.


జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగినీ 'వైష్ణవ మాద్వ ' ఏకాదశి, సిద్ద ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల అనుకున్న పనులు నేరవేరుతాయి. ఏకాదశి సూర్యోదయం నుండి ద్వాదశి సూర్యోదయం వరకు నీటిని త్యాగం చేసి ద్వాదశినాడు స్నానాదికాలు పూర్తిచేసి, బ్రాహ్మణులకు నీటితోపాటు సువర్ణదానం చెయ్యి. తర్వాత జితేంద్రియులైన బ్రాహ్మణులతో కలసి భోజనం చెయ్యి. శ్రీమహావిష్ణువు నాతో ' ఏ మానవుడు నన్ను తలచి ఏకాదశి వ్రతం చేస్తారో వారు పాపాల నుండి విముక్తులవుతారు అని తెలియజేశాడు. జ్యేష్ఠ బహుళ చతుర్దశి మాస శివరాత్రి ప్రదోష కాలంలో శివునికి అభిషేకం, బిల్వదళాలతో పూజిస్తే అకాల మృత‌్యుహరణం, యశస్సు కీర్తి, ఆరోగ్యం లభిస్తుంది. సూర్యుడిని ఆరాధించే 'మిథున సంక్రమణం' వ్యవసాయ సంబంధమైన పనులకు శుభారంభాన్ని పలికే 'ఏరువాక పున్నమి' ఈ మాసంలోనే పలకరిస్తుంటాయి. ఇక దాన ధర్మాలకు అవకాశమిస్తూ విశేష పుణ్యఫలాలను ప్రసాదించే 'జ్యేష్ఠ పౌర్ణమి' శ్రీ మహా విష్ణువు ఆరాధనలో తరింపజేసే 'అపర ఏకాదశి' ఈ మాసాన్ని ప్రభావితం చేస్తుంది. ఏకాదశి వ్రతం చేసిన వారికి స్వర్గం ప్రాప్తిస్తుంది. ఏకాదశి రోజు ఎవరైతే నీటిని కూడా తాగకుండా వుంటారో వారికి ఒక్కొక్క ఏకాదశికి కోటి సువర్ణ ముద్రలు దానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది.

నైరుతి పలకరించే...!!*

 *నైరుతి పలకరించే...!!*


ఎండిన భూమాతను చల్లపరిచేందుకు 

మండించిన సూర్యున్ని మేఘం చుట్టుముట్టి 

అలసిన ఎన్నో హృదయాలకు 

దాహాన్ని తీర్చేందుకు నైరుతి పలకరించే...


వేడికి కందిన నేలకు ఔషధంలా 

ఉక్కపోతకు ఉడికిన మనిషికి చల్లదనంలా

చినుకు చినుకు మాట్లాడుతున్నట్లుగా

పసి హృదయంలా మబ్బులు పలకరించే...


ఎండిన మట్టిని పరమాన్నంగా మార్చుటకు

ఏరువాక వచ్చి వసంతం తెచ్చే 

జీవుల మనుగడ పునర్జీవం పోయుటకు

ఆహారాన్ని వండేందుకు నింగి పలకరించే...


ఆవిరైన నీరు ఆకాశపు కుండను నింపి 

మండే నేలను మురిపించేందుకు వ్యాపించే 

వేడిగాలుల పెత్తనాన్ని హరించి వేసేందుకు 

చల్లని కబురులు తో నైరుతి పలకరించే...


మంండిన భానుని జలఖడ్గం నివారించే 

నేలలో దాగిన విత్తును ఆశీర్వదించే 

ప్రకృతినంతా సస్యశ్యామలం చేసేందుకు 

వర్షపు చినుకులు సవ్వడితో పలకరించే..


సేదతీరుతున్న రైతన్నను మేల్కొల్పి 

నేలమ్మ పెదవులను నాగలితో మాట్లాడించి

ముద్దుల బంగారపు ఫలాల అందించేందుకు 

కర్తవ్యాన్ని బోధించేందుకు పలకరించే..


ఎండిన మట్టికి వసంతపు స్నానం 

మండిన మనిషికి చల్లని కబురు 

నింగి అంతా వ్యాపించిన నైరుతి సందేశం 

చినుకుల రూపంలో పరవశించి పలకరించే..


కొప్పుల ప్రసాద్ 

నంద్యాల 

9885066235

గుండె గూటిలో!

 శీర్షిక..గుండె గూటిలో!


సముద్రమంత గంభీరం 

గగనమంత విశాలం 

గుండె గూటిలో ఎన్నో ఆలోచనలు 

గలగలపారే  ఆశలు అలలు 

రాగాల అనురాగాల పల్లకిలో 

తీయని అనుభూతుల సందడి 

ఆనందాల అందాలను పంచుతూ-పంచుకుంటూ

గల గల పారే గోదారిలా నవ్వుతూ-నవ్విస్తూ

ఎదను దోచేస్తుంది జలపాతంలా..


ఆ గుప్పెడంత గుండెలోనే విప్పి చెప్పలేని బాధలు 

నిరాశా నిస్పృహలు భారంగా గుండె బరువుతో 

మౌనంగా మనసుని కృంగదీస్తున్న వేదనల పెను చీకట్లు 

కరిగిపోతున్న కాలంతో పోటీ పడలేక నిట్టూర్పులు 

గుండె దిటవు చేసుకొంటూ..


స్వాతంత్రం కోసం గుండెలు ఎదురొడ్డిన సాహస ధైర్యం 

శతృవుని చీల్చి చెండాడే పరాక్రమం ఆ గుండెల్లోనే


కసాయి గుండెలు..పశువాంఛతో 

అమానుష అత్యాచారాలతో  అమ్మతనాన్ని చీల్చేస్తూ 

జాతికి వెన్నుపోటు పొడిచే దేశ ద్రోహులు 

గుండెలు తీసిన బంట్లు, విద్రోహ చర్యలతో..


మమతల కౌగిలిలో బంధించిన 

లలిత లాస్య  దయా కరుణా సేవా త్యాగం తో

గుండెను అర్పించిన ఘనులు, త్యాగధనులు 

నీవు అండగా ఉంటే జనజీవిత స్రవంతులు

నిర్మలమైన గంగా నదిలా సాగదా జీవితం పవిత్రంగా..

ంంంంంంంంంంంంంంంంంంంంంం

భారీ వర్షంలో హైవేపై కారు

 భారీ వర్షంలో హైవేపై కారు నడపడం సవాలుగా ఉంటుంది, ఎందుకంటే తక్కువ విజిబిలిటీ, జారే రోడ్లు, మరియు ఇతర అనూహ్య పరిస్థితులు ప్రమాదాన్ని పెంచుతాయి. కింది జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు సురక్షితంగా డ్రైవ్ చేయవచ్చు:


1. వాహనం సిద్ధంగా ఉంచడం:


• వైపర్స్: విండ్‌షీల్డ్ వైపర్స్ సరిగ్గా పనిచేస్తున్నాయని నిర్ధారించుకోండి. వైపర్ బ్లేడ్‌లు దెబ్బతిన్నట్లయితే, వాటిని మార్చండి.


• టైర్లు: టైర్ల ట్రెడ్ మంచి స్థితిలో ఉండేలా చూడండి, ఎందుకంటే జారే రోడ్లపై గ్రిప్ చాలా ముఖ్యం.


• బ్రేక్‌లు: బ్రేక్‌లు సరిగ్గా పనిచేస్తున్నాయని తనిఖీ చేయండి.


• లైట్లు: హెడ్‌లైట్స్, టెయిల్ లైట్స్, ఫాగ్ లైట్స్, మరియు ఇండికేటర్స్ పనిచేస్తున్నాయని నిర్ధారించుకోండి.


• విండ్‌షీల్డ్: విండ్‌షీల్డ్ శుభ్రంగా ఉంచండి మరియు వాటర్-రిపెల్లెంట్ సొల్యూషన్ ఉపయోగించడం మంచిది.


2. డ్రైవింగ్ సమయంలో జాగ్రత్తలు:


• వేగం తగ్గించండి: భారీ వర్షంలో రోడ్లు జారుడుగా ఉంటాయి కాబట్టి, సాధారణ వేగం కంటే తక్కువ వేగంతో నడపండి. హైవే వేగ పరిమితిని అనుసరించండి, కానీ వర్షం తీవ్రత ఎక్కువగా ఉంటే మరింత నెమ్మదిగా వెళ్ళండి.


• సురక్షిత దూరం: ముందు వాహనంతో సురక్షిత దూరం (4-5 సెకన్ల గ్యాప్) పాటించండి, ఎందుకంటే జారే రోడ్లపై బ్రేక్ వేయడానికి ఎక్కువ సమయం పడుతుంది.


• హెడ్‌లైట్స్ మరియు ఫాగ్ లైట్స్: తక్కువ విజిబిలిటీలో హెడ్‌లైట్స్ ఆన్ చేయండి. అవసరమైతే ఫాగ్ లైట్స్ ఉపయోగించండి, కానీ ఇతర డ్రైవర్లకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్త వహించండి.


• సాఫ్ట్ బ్రేకింగ్: ఆకస్మిక బ్రేక్‌లు వేయడం మానండి, ఎందుకంటే ఇది టైర్లు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. సాఫ్ట్‌గా బ్రేక్‌లు వాడండి.


• హైడ్రోప్లానింగ్‌ను నివారించండి: రోడ్డుపై నీరు నిలిచి ఉంటే, టైర్లు రోడ్డుతో గ్రిప్ కోల్పోయే ప్రమాదం (హైడ్రోప్లానింగ్) ఉంటుంది. ఇలాంటి సందర్భంలో, నీటి గుండా వెళుతున్నప్పుడు వేగం తగ్గించండి మరియు స్టీరింగ్‌ను స్థిరంగా పట్టుకోండి.


3. విజిబిలిటీ మరియు నియంత్రణ:


• వైపర్స్ సరిగ్గా ఉపయోగించండి: వర్షం తీవ్రతకు అనుగుణంగా వైపర్ స్పీడ్‌ను సర్దుబాటు చేయండి.


• డీఫాగర్ ఉపయోగించండి: విండ్‌షీల్డ్ మరియు కిటికీలపై పొగమంచు (ఫాగ్) ఏర్పడకుండా డీఫాగర్ లేదా ఏసీ ఉపయోగించండి.


• రోడ్ సిగ్నల్స్ గమనించండి: రోడ్డు గుర్తులు మరియు సిగ్నల్స్‌ను జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే వర్షంలో అవి స్పష్టంగా కనిపించకపోవచ్చు.


4. ప్రమాదకర పరిస్థితుల్లో జాగ్రత్తలు:


• నీరు నిలిచిన ప్రాంతాలు: రోడ్డుపై నీరు నిలిచిన ప్రాంతాలను నీటి లోతు తెలియకపోతే దాటడం మానండి. నీరు లోతుగా ఉంటే, ఇంజిన్‌లోకి నీరు చొచ్చుకుపోయే ప్రమాదం ఉంది.


• అత్యవసర పరిస్థితులు: ఒకవేళ కారు స్కిడ్ అయితే, పానిక్ కాకుండా స్టీరింగ్‌ను స్కిడ్ దిశలో మెల్లగా తిప్పండి మరియు యాక్సిలరేటర్ నుండి పాదం తీసేయండి.


• వర్షం తీవ్రంగా ఉంటే ఆగండి: విజిబిలిటీ దాదాపు సున్నాకి ఉంటే లేదా రోడ్డు పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటే, హైవేపై సురక్షితమైన ప్రదేశంలో (రోడ్ సైడ్, రెస్ట్ ఏరియా) కారును ఆపి, హజార్డ్ లైట్స్ ఆన్ చేసి, వర్షం తగ్గే వరకు వేచి ఉండండి.


5. అత్యవసర సామగ్రి:


• కారులో ఎమర్జెన్సీ కిట్ (ఫస్ట్ ఎయిడ్, టార్చ్, బ్లాంకెట్, నీరు, స్నాక్స్) ఉంచండి.


• టవల్ లేదా గుడ్డ ఉంచండి, విండ్‌షీల్డ్ శుభ్రం చేయడానికి లేదా ఇతర అవసరాలకు ఉపయోగపడుతుంది.


• మొబైల్ ఫోన్ ఛార్జ్‌లో ఉంచండి మరియు ఎమర్జెన్సీ నంబర్లు (పోలీస్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్) సేవ్ చేసి ఉంచండి.


6. ఇతర చిట్కాలు:


• రోడ్ కండిషన్స్ తెలుసుకోండి: డ్రైవ్ చేయడానికి ముందు వాతావరణ నివేదికలు మరియు రోడ్ కండిషన్స్ చెక్ చేయండి.


• ట్రాఫిక్ నియమాలు పాటించండి: హైవేపై లేన్ డిసిప్లిన్ మరియు ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించండి.


• డిస్ట్రాక్షన్స్ తగ్గించండి: మొబైల్ ఫోన్ ఉపయోగించడం, లౌడ్ మ్యూజిక్ వినడం మానండి, ఎందుకంటే వర్షంలో ఫోకస్ చాలా ముఖ్యం.


సారాంశం:


భారీ వర్షంలో హైవేపై డ్రైవింగ్ చేసేటప్పుడు వాహనం సిద్ధంగా ఉంచడం, వేగం తగ్గించడం, సురక్షిత దూరం పాటించడం, మరియు విజిబిలిటీ మెరుగుపరచడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అత్యవసర పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండి, సురక్షితమైన నిర్ణయాలు తీసుకోండి.

విద్య నిగూఢ గుప్తమగు విత్తము

 విద్య నిగూఢ గుప్తమగు విత్తము, రూపము పూరుషాళికిన్

విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు విదేశ బంధుడన్

విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్,

విద్య నృపాల పూజితము, విద్య నెఱుంగని వాడు మర్త్యుడే..?


తాత్పర్యం :

విద్య అనేది మనం రహస్యంగా దాచిపెట్టుకునే ధనం లాంటిది. అంటే.. చదువుకున్నవారైతే మీకున్న గుప్త ధనం చదువేనన్నమాట. మానవులకు చదువు అందాన్నిస్తుంది.. కీర్తిని, సుఖాన్ని ఇస్తుంది.


విద్యయే గురువు, విదేశాలలో బంధువు, దైవం కూడానూ. ఈ భూమిమీద విద్యకు సాటి అయిన ధనం ఏదీ లేదు. సమస్త జనుల చేత పూజింపబడేది విద్య. విద్యరాని వాడు మనిషా..? అంటే, కాదు అని అని పద్యం యొక్క భావం.

సంస్కృత భాషా వైభవం

 🙏సంస్కృత భాషా వైభవం 🙏

సంస్కృతం వేదకాలము నాటి భాష , భారతదేశ 23 ఆధికారిక భాషలలో ఒకటి.

సంస్కృతం' సమ్యక్ కృతం నుండి వచ్చింది. సంస్కృతంలో, 'సమ్యక్' అంటే పరిపూర్ణం, బాగా, సంపూర్ణం, మరియు 'కృతం' అంటే పూర్తయింది.

సారాంశం సంస్కరింప బడిన భాష.

సంస్కృతం యొక్క పూర్వ సాంప్రదాయ రూపాన్ని వేద సంస్కృతం అని పిలుస్తారు . పూర్వము ధృవీకరించబడిన సంస్కృత గ్రంథం ఋగ్వేదం ,  అటువంటి ప్రారంభ కాలం నుండి వ్రాతపూర్వక  ప్రతులు లేవు, ఆకాలంలో లిపి లేదు వేదం కేవలం మౌఖికం ద్వారానే వ్యాప్తిలోకి వచ్చింది. చరిత్ర కారులు ఏదో క్రీస్తు పూర్వం అంటారు. క్రీస్తు ఎప్పటి వాడు? ఇప్పటికి 2400 సంవత్సరాలు మరి వేదం ఐదు వేల సంవత్సరాల పూర్వం. వీరు ఎప్పటికి సంస్కృత భాష పుట్టుక గురించి చెప్పలేరు. ప్రపంచంలో మొదటి భాష సంస్కృతం. ఎవ్వరైనా అంగీకరించాలి.

భారతదేశము పాశ్చాత్యుల అధీనమయిన కాలములో, పాశ్చాత్యులు భారతీయభాషయే తమ భాషకు తల్లియని అంగీకరించుచో,  అట్లొప్పుకొనుట పాలకజాతివారి గర్వమునకు భంగకరమును, పాలితజాతివారి ఆత్మగౌరవమునకు ఉద్దీపకమును అగును. అయినను ఉదారులగు పాశ్చ్యాత్యులు కొందరు ఈ సత్యమును బాహాటముగా చాటిరి. విమర్శకులలో ఉన్నతశ్రేణికి చెందిన కర్జన్ పండితుడు వ్రాసిన మాటలు 

“గ్రీకు, లాటిను,  మొదలైన భాషలన్నియు భిన్న, భిన్న కాలములయందు సంస్కృతభాషనుండియే ఆవిర్భవించినవి అని ఆధారాలతో పేర్కొన్నాడు 

 సంస్కృతం హిందూ, బౌద్ధ, జైన మతాలకు ప్రధాన భాష. నేపాలు లో కూడా సంస్కృతానికి భారతదేశములో ఉన్నటువంటి స్థానమే ఉంది.


పాణిని సంస్కృత భాష అభివృద్ధిలో గొప్ప మైలురాయి. అతను, తన కాలంలో ప్రబలంగా ఉన్న పది వ్యాకరణములను సంక్షిప్తీకరిస్తూ, అష్టాధ్యాయి అనే వ్యాకరణానికి సంబంధించిన  గొప్ప వ్యాకరణ గ్రంథాన్ని వ్రాసాడు, ఇది సాహిత్య సంస్కృతం మరియు మాట్లాడే సంస్కృతం రెండూ పాణిని భాషా విధానాన్ని అనుసరించాయి. నేడు సంస్కృత భాష యొక్క ఖచ్చితత్వం పాణిని యొక్క అష్టాధ్యాయీ యొక్క గీటురాయిపై పరీక్షించబడింది

 పరమేశ్వరుని డమరుక నాదము నుండి వెలువడిన శబ్ద బ్రహ్మమే సంస్కృత భాష.అట్లు వెలువడిన పదునాలుగు రకములైన సూత్రములను మాహేశ్వర సూత్రములందురు.


1 అ,ఇ,ఉ,ణ్,

2 ఋ,ఌ,క్ 

3 ఏ,ఓ,ఙ్ 

4 ఐ,ఔ,చ్ 

5 హ,య,వ,ర,ట్ 

6 ల,ణ్

7 ఞ,మ,ఙ,ణ,న,మ్ 

8 ఝ,భ,ఞ్ 

9 ఘ,ఢ,ధ,ష్ 

10 జ,బ,గ,డ,ద,శ్ 

11 ఖ,ఫ,ఛ,ఠ,థ,చ,ట,త,వ్ 

12 క,ప,య్ 

13 శ,ష,స,ర్ 

14 హ,ల్.

భారత దేశంలో కనీసం పది లక్షల కంటే ఎక్కువ మందే సంస్కృతాన్ని అనర్గళంగా మాట్లాడగలరు. కర్ణాటకలోని మత్తూరు అనే గ్రామములో పూర్తిగా సంస్కృతమే వ్యవహారభాష. సంస్కృతం అంటే 'సంస్కరించబడిన', 'ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పడిన' అని అర్థం .ప్రపంచంలోని 876 భాషలకు సంస్కృతం జీవంపోసింది . సంస్కృతమునకు అమరవాణి, దేవభాష, సురభాష, గీర్వాణి మొదలగు పేర్లు ఉన్నాయి. శౌరసేని, పైశాచి, మాగధి మొదలగు ప్రాకృత భాషలు కూడా సంస్కృతము నుండియే పుట్టినవి. సంస్కృతమునందు ఏకవచనము, ద్వివచనము, బహువచనము అను మూడు వచనములు ఉన్నాయి.

అందువలన ఏ పదాన్ని సంస్కృతంలో చేర్చలేము.

ఇంకో విషయం ఏమిటంటే సంస్కృతంలో ప్రతి శబ్దానికి వ్యుత్పత్తి ఉంది.సంస్కృతంలని పదాలు మాత్రం అన్ని భాషలలోకి చేరాయి.సంస్కృత భాషకు ఇవ్వడమే గాని పుచ్చుకోవడం తెలియదు.

ప్రపంచంలోని కొన్ని భాషలతో జన్య జనక సంబంధం ఉంటే మిగిలిన అన్ని భాషలతోను పోష్య పోషక సంబంధం ఉంది. మన తెలుగు భాషకు సంస్కృతం పెంపుడు తల్లియే గాని కన్నతల్లి కాదు. ఎంతగా పోషించింది అంటే కన్నతల్లి అయిన మూల ద్రావిడ భాషనే మరిపించింది. చివరకు సంస్కృతం నుండి తెలుగు పుట్టినదేమో అనే సందేహం కలుగజేసింది.మూల ద్రావిడ భాష నుండి తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం అనే నాలుగు నాగరిక భాషలు, తుళు, గోండి, కోసి, నాయకి, పర్జీ వంటి అనాగరిక భాషలు వెలువడ్డాయి. లిపి కలిగిన భాష నాగరికభాష. లిపి లేని భాష అనాగరిక భాష 

 సంస్కృతమునందు నామవాచకములను విశేష్యములనియు, శబ్దములనియును, క్రియాపదముల యొక్క మూలరూపములను ధాతువులనియును వ్యవహరింతురు.

సంస్కృత భాషకు ఏ భాషలోనూ లేని విధంగా మూడు వచనాలు ఉన్నాయి. 

 సంస్కృతాన్ని మొదట సరస్వతీ లిపిలో వ్రాసేవారు. కాలక్రమేణ ఇది బ్రాహ్మీ లిపిగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత దేవనాగరి లిపిగా పరివర్తనం చెందింది. ఇదే విధంగా తెలుగు లిపి, తమిళ లిపి, బెంగాలీ లిపి, గుజరాతీ లిపి, అనేక ఇతర లిపులు ఉద్భవించాయి. క్రియా పదముల యొక్క లింగ, వచన, విభక్తులు నామవాచకమును అనుసరించి ఉండును.

మొదటి కావ్యాన్ని  వాల్మీకి రచించాడు; అతను రామాయణాన్ని గొప్ప-కావ్యంగా వ్రాసాడు, ఇది తరువాతి సాహిత్యంపై గొప్ప ప్రభావాన్ని చూపింది. నేటికీ వాల్మీకి మార్గంలో సరికొత్త కవిత్వం రాస్తున్నారు. 

రెండవ ఇతిహాసం మహాభారతాన్ని కృష్ణద్వైపాయన వ్యాసుడు రచించాడు, 


తరువాత కాళిదాసు వంటి కవులు గుప్తుల కాలంలో గణనీయమైన కృషి చేశారు. భారవి, భట్టి, కుమారదాసు మరియు మాఘ - అందరూ మహాకావ్యాలు రాశారు. . శాస్త్రీయ సాహిత్యంలోని కొన్ని ఇతర విభాగాలు మరియు శాస్త్రీయ రచయితల పేర్లు: చారిత్రక కావ్యాల రంగంలో కల్హణుడు మరియు బిల్హణుడు : భర్తృహరి, అమరుక, బిల్హణ, జయదేవ, సోమదేవ మొదలైనవారు గేయ కవులుగా ప్రసిద్ధి చెందారు. బృహత్కథ,  మరియు శృంగార కవిత్వం, చంపు కావ్యాలు, కవితలు మరియు సంకలనాలపై రచనలు, కవిత్వం మొదలైనవి సంస్కృత సాహిత్యంలో అసమానమైన భాగంగా ఉన్నాయి

ఉత్తరాఖండ్, ఒక భారతీయ రాష్ట్రం, సంస్కృతాన్ని తన అధికారిక భాషగా పరిగణించింది.సంస్కృత భాషకు ఎప్పుడూ మాండలికం లేదు. అలాగే, ప్రతి యుగంలో, భాష ఎప్పుడూ అలాగే ఉంటుంది.పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, సంస్కృతం నేర్చుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

రామాయణంలో

 *‘రామాయణంలో*

  *అత్యంత ముఖ్యమయిన/ విశిష్టమయిన శ్లోకం ఏది?*

            

ఒకసారి విక్రమాదిత్య అనే రాజుకు తన సభలో ఉన్న “నవరత్నాలలో” ఎవరు ఉత్తమ పండితులో తెలుసుకోవాలని అనిపించింది.


రాజ్యసభలో ఉన్న పండితులందరినీ పిలిచి ‘రామాయణంలో ఉన్న శ్లోకాలలో అత్యంత ముఖ్యమైన శ్లోకం ఏది అయి ఉంటుంది’ అని ప్రశ్నించారు.


ఆ శ్లోకం గురించి చెప్పిన వారికి 1000 బంగారపు నాణేలు ఇస్తాము అని కూడా ప్రకటించారు.


ఈ శ్లోకాన్ని రామాయణంలో నుంచి వెతికి పట్టుకోవడానికి పండితులకు విక్రమాదిత్యుడు 40 రోజుల గడువు ఇచ్చాడు.


విక్రమాదిత్యుని రాజ్యసభలో “వరరుచి” అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి ఆ వెయ్యి బంగారు నాణాలు ఎలాగైనా సంపాదించాలి అని కోరిక కలిగింది.


అప్పుడు ఆ వరరుచి దేశాటనకు బయలుదేరి అనేక రాజ్యాలు తిరుగుతూ రామాయణం లో ఉన్న ముఖ్యమైన శ్లోకం ఏది అని అందరు పండితులను అడగటం మొదలు పెట్టాడు.


అయితే అతనికి రామాయణం లో ఉన్న అన్ని శ్లోకాలలో ఒకే ఒక్క శ్లోకాన్ని ఉత్తమమైనది అని చెప్పటం సాధ్యం కాదు అన్న సమాధానమే దొరికింది.


40 రోజులలో చివరి రోజు అతను తన రాజ్యానికి తిరిగి వస్తూ అలసిపోయి ఒక చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటున్నాడు.


నిద్రపోతున్న సమయంలో ఆ చెట్టు మీదకు ఇద్దరు వనదేవతలు వచ్చి సంభాషించుకుంటూ ఉన్నారు.


వారిలో ఒక వనదేవత మాట్లాడుతూ మాటల్లో రామాయణంలో ప్రముఖమయిన శ్లోకం “మాం విద్ధి..” అని చెప్పింది.


ఆ సంభాషణ విన్న వరరుచికి ఎంతో ఆనందం కలిగింది.


అతను వెంటనే విక్రమాదిత్య రాజ్యసభకు వెళ్లి ఆ ముఖ్యమయిన శ్లోకం ఏదో చెప్పాడు.


*ఆ శ్లోకం ఇది...```


*రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజామ్*

*అయోధ్యామటవీం విద్ధి గచ్ఛ తాత యథాసుఖమ్*


```ఆ శ్లోకాన్ని విన్న విక్రమాదిత్యుడు.. ఆ శ్లోకానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? అని అడిగాడు.


అతను చెప్పిన 18 రకాలయిన అర్ధాలను విన్న విక్రమాదిత్యుడు రామాయణంలో ఇదే ఉత్తమమైన శ్లోకం గా భావించి అతనికి 1000 బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు.```


ఈ శ్లోకంలో ఉన్న అర్ధం ఏమిటి? ఎందుకు ఈ శ్లోకం అంత ముఖ్యమయినదిగా చెప్పారు?```


ఈ శ్లోకం వాల్మీకి రామాయణంలో అరణ్యకాండలో 40వ సర్గలో వస్తుంది...


రాముడు అరణ్యాలకి వెళ్తున్నాడు అని తెలిసి లక్ష్మణుడు తను కూడా అరణ్యాలకు బయలుదేరుతూ, తన తల్లి “సుమిత్ర” ఆశీర్వాదం కోరినప్పుడు సుమిత్ర లక్ష్మణుడికి చెప్పిన సమాధానం ఈ శ్లోకం...


ఈ శ్లోకానికి ఉన్న అనేక అర్థాలలో కొన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం...``` 


*రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజామ్.*

*అయోధ్యామటవీం విధ్ది గచ్ఛ తాత! యథాసుఖమ్৷৷*


*మొదటి అర్ధం:```

రామ= రాముడు: దశరథం=దశరథుడు:  

విద్ధి=అనుకో: మామ్= నేనే; జనకాత్మజ= జనకుని కూతురు;

విద్ధి= అనుకో; అయోధ్యా= అయోధ్య; మాటవీం=అడవి; విద్ధి=అనుకో; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; 

యథా సుఖమ్=సుఖంగా```


లక్ష్మణా! రాముడే దశరథుడు అనుకో, సీతనే నేను(సుమిత్ర) అనుకో, అడవినే అయోధ్య అనుకో, సుఖంగా వెళ్ళిరా!



*రెండవ అర్ధం:```

రామ= రాముడు: (దశ = పక్షి రథం=రధం) దశరథం= పక్షిని రధంగా కలిగిన వాడు, విష్ణువు ; మామ్= లక్ష్మీదేవి; జనకాత్మజ= జనకుని కూతురు; అయోధ్యా= శతృదుర్భేద్యమయినది(వైకుంఠం); మాటవీం=అడవి; విద్ధి=అనుకో; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; యథా సుఖమ్=సుఖంగా.```


ఓ పుత్రా! ఈ రాముడే శ్రీమహావిష్ణువు, సీతే శ్రీ మహాలక్ష్మి, వారిద్దరూ ఎక్కడ ఉంటే అదే వైకుంఠం అనుకుని సుఖంగా వెళ్లి రా!



*మూడవ అర్ధం:```

రామ= రాముడు: దశరథం=దశరథుడు: విద్ధి=వలెనే: మామ్=నీ తల్లి (కైకను ఉద్దేశించి); జనకాత్మజ= జనకుని కూతురు; విద్ధి= వలెనే; అయోధ్యా= అయోధ్య; మాటవీం=అడవి; విద్ధి=వలెనే; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; యథా సుఖమ్= వీలయినంత సుఖంగా```


ఓ పుత్రా! నీ తండ్రి దశరధుడు భార్యమాటని విని, అత్యంత అమూల్యమయిన రాముని సాంగత్యం పోగొట్టుకుని ఎలా దుఃఖిస్తాడో, సీత మాట విని రాముడు కూడా అతనికి అమూల్యమయిన సీతను చేజార్చుకుని దుఃఖాన్ని పొందుతాడు.

రాముడు లేక అయోధ్య ఎలా శోకిస్తుందో అలాగే అరణ్యం కూడా సీత జాడ లేక శోకిస్తుంది.

కనుక వీలయినంత దైర్యం చెప్తూ రాముని చెంత నీవు ఉండు.


ఈ దేశం ఎంత గొప్పది, ఇక్కడ ఋషులు ఎంత గొప్ప వారో వారు!  


వారసత్వంగా మనకు అందించిన….         

ఆ అమూల్య రత్నాలు ఎంత విలువైనవో గదా.

గృహస్థుడే సంపదకు మూలకారకుడు

 గృహాన్తా ద్రవ్య సంఘాతా 

ద్రవ్యాన్తా చ తథా మతిః |

అర్థాశ్చాత్మోపభోగాన్తా 

భవిష్యన్తి కలౌ యుగే|| 




గృహస్థుడే సంపదకు మూలకారకుడు. భవిష్యత్తు భౌతిక ప్రపంచం యొక్క ఆనందంతో నిండి ఉంటుంది.


డబ్బు సంపాదించడం అంటే మంచి ఇల్లు కట్టుకోవడం, మన తెలివితేటలు చివరికి డబ్బు సంపాదించడంలోనే ఉంటాయి.

17-23-గీతా మకరందము

 17-23-గీతా మకరందము.

    శ్రద్ధాత్రయ విభాగయోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - బ్రహ్మముయొక్క నామమును గుఱించి ఐదు శ్లోకములద్వారా తెలియజేయుచున్నారు–


ఓం తత్సదితి నిర్దేశో 

బ్రహ్మణస్త్రివిధః స్మృతః | 

బ్రాహ్మణా స్తేన వేదాశ్చ 

యజ్ఞాశ్చ విహితాః పురా || 


తాత్పర్యము:- పరబ్రహ్మమునకు “ఓమ్" అనియు, "తత్” అనియు, 'సత్' అనియు మూడు విధములగు పేర్లు చెప్పబడినవి. ఈ నామత్రయము వలననే (దాని యుచ్చారణ చేతనే) పూర్వము బ్రాహ్మణులు (బ్రహ్మజ్ఞానులు), వేదములు, యజ్ఞములు నిర్మింపబడినవి.


వ్యాఖ్య:- పరబ్రహ్మము వాస్తవముగ నామరూపరహితమైనను, భక్తులు ధ్యానించుటకు, చింతించుటకు అద్దానికి నామములు నిర్దేశింపబడెను. అవియే ‘ఓమ్' అనియు, ‘తత్' అనియు, 'సత్' అనియు చెప్పబడును. అట్టి మంత్రముల చింతనద్వారా, లక్ష్యమగు పరబ్రహ్మమును జనులు చింతనజేయుచున్నారు. సాక్షాత్ పరబ్రహ్మము యొక్క వాచకములు గనుక ఆ మూడునామములు మహత్తరమగుశక్తి, పవిత్రతగలిగి యున్నవి. వేదశాస్త్రాదులం దెల్లెడలను ఈ ప్రణవాది మంత్రములను గూర్చి విశేషముగ చెప్పబడియున్నది.

   “తస్య వాచకః ప్రణవః” - ఆ పరమాత్మయొక్క నామము ఓంకారము.


"తజ్జపస్తదర్థభావనమ్" - " ఆ నామమును జపించుచు దానియర్థమును లెస్సగ భావించవలెను" - అని పతంజలి మహర్షియు ఓంకారమహిమనుగూర్చి శ్లాఘించియున్నారు. కర్మానుష్ఠానమందు ఏవైన లోపములు, విఘ్నములు, దోషములు మున్నగునవి యున్నచో అవియన్నియు పరమపవిత్రములగు ఆ మూడునామముల యొక్క ఉచ్చారణచే పటాపంచలైపోవును. కనుకనే ఏ కార్యమును ప్రారంభించినను పెద్దలు ప్రణవోచ్చారణము చేయుదురు. మంత్రములన్నిటిలోను ప్రణవము శిరోమణియై యలరుచున్నది. కనుకనే ప్రతిమంత్రమునకును ఆదిలో ఓంకారము చేర్చబడుచుండును. అయితే " ఓం తత్ సత్” అను మంత్రము నుచ్చరించునపుడు అద్దాని అర్థమును భావించుచు దాని వాచ్యరూపమగు పరబ్రహ్మమును చింతన జేయవలెను. భావముతో గూడినపుడుమాత్రమే మంత్రము ఎక్కువగ శక్తివంతమగును.

మఱియు వేదములు, యజ్ఞములు మున్నగునవి ఆ ప్రణవమంత్రోచ్చారణము చేతనే నిర్మింపబడినవని చెప్పుటవలన వేదములయొక్క మూలము, బీజము ఓంకారమే (పరబ్రహ్మమే) అయియున్నదని తేలుచున్నది. మఱియు వేదసారమంతయు ఆ ప్రణవమునందే యున్నటుల గోచరమగుచున్నది. కావున వేదసారమగు ఓంకారము నుచ్చరించి భావమును మననముచేసినపుడు సమస్త వేదములను ఉచ్చరించినట్లే యగుచున్నది.


“ఓమ్ తత్సత్” అనుదానికి మఱియొక అర్థమున్ను గలదు. ఓమ్ అనగా పరబ్రహ్మము, తత్ అనగా అది (ఆ పరబ్రహ్మము) ఒకటియే, సత్ = సద్వస్తువు, తక్కినదియగు దృశ్యజగత్తంతయు మిథ్యావస్తువు అని యర్థము. కావున ఈ “ఓమ్ తత్ సత్” అను మంత్రముయొక్క ఉచ్చారణచేత " బ్రహ్మసత్యం జగన్మిథ్యా" అను సర్వవేదాంతసిద్ధాంతసారసంగ్రహము ప్రస్ఫుటమగుచున్నది. అట్టి నామోచ్చారణ చేయుచు సద్వస్తువగు బ్రహ్మమును సత్యముగ భావించుచు, మిథ్యాభూతమగు దృశ్యజగత్తును అసత్యముగ తలంచుచు వైరాగ్యభావమును అభివృద్ధిపఱచుకొనవలెను. సద్రూపదైవభావనను, ఆత్మభావనను దృఢపఱచుకొనవలెను .

“ఓమ్ తత్సత్” అను మంత్రమునకు ఈ క్రింది రెండు అర్థములున్ను చెప్పవచ్చును.

(1) ఓమ్ = పరబ్రహ్మము (కలదు) 

      తత్ = ఆ పరబ్రహ్మము

       సత్ = సద్రూపమైనది 

~~~~

(2) తత్ = ఆ

      సత్ = సద్వస్తువు

       ఓమ్ = పరబ్రహ్మము

~~

ప్రశ్న:- పరబ్రహ్మమునకు ఎన్ని పేర్లు కలవు? అవియేవి?

ఉత్తరము:- మూడుపేర్లు కలవు. అవి క్రమముగ (1) ఓమ్ (2) తత్ (3) సత్ అని చెప్పబడును.

ప్రశ్న:- వానియొక్క మహత్తు యెట్టిది?

ఉత్తరము: - వానినుండియే (లేక, వాని నామోచ్చారణచేతనే) పూర్వము (1) బ్రాహ్మణులు (బ్రహ్మజ్ఞానులు) (2) వేదములు (3) యజ్ఞములు సృష్టింపబడినవి.

ప్రశ్న:- కావున బ్రహ్మజ్ఞానులు, వేదములు, యజ్ఞములు - వీనికి మూలమేమి?

ఉత్తరము:- ఓంకారమే. (తల్లక్ష్యమగు) పరబ్రహ్మమే.

తిరుమల సర్వస్వం 252-*

 *తిరుమల సర్వస్వం 252-*

*ద్వాదశ ఆళ్వారులు-16*

🙏 *స్వప్న సాక్షాత్కారం* 🌈

💫 విష్ణువు కర్పించబోయే పూలమాలలను ముందుగా తాను ధరిస్తున్న విషయాన్ని గోదాదేవి అత్యంత గోప్యంగా ఉంచడం వల్ల, చాలాకాలం విష్ణుచిత్తునికా విషయం తెలియరాలేదు. కొంత కాలానికి శ్రీకృష్ణుని కర్పించిన పూలమాలలో నున్న రోమం (వెంట్రుక) కారణంగా ఆ విషయాన్ని తెలుసుకున్న విష్ణుచిత్తుడు ఉగ్రుడయ్యాడు. అల్లారుముద్దుగా సాకుతున్న గారాల పట్టిని తీవ్రంగా మందలించాడు. గోదాదేవి మాత్రం శ్రీమహావిష్ణువే తన భర్త యని, ఆ చనువుతో తాను మాలలను ముందుగానే ధరిస్తున్నానని నిష్కర్షగా సమాధానమిచ్చింది. విష్ణుచిత్తుని కేంచేయాలో పాలుపోలేదు. ఇన్నాళ్ళుగా, వటపత్రశాయికి తాను ఉచ్ఛిష్టమాలలను ('ఉచ్ఛిష్టము' అనగా 'ఎంగిలి' లేదా 'వేరొకరు వాడినది' అని అర్థం) అర్పించాడన్న మాట. తనవల్ల ఎంతటి ఘోరాపరాధం జరిగిపోయింది? తనకు తెలియకుండా పొరబాటు జరిగినప్పటికీ, శాస్త్రానుసారం అవివాహిత యైన స్త్రీ చేసే తప్పొప్పులకు తల్లిదండ్రులే బాధ్యత వహించాలి. దీని వల్ల ఎంతటి దుష్పరిణామం ఎదురుకానున్నదో? విష్ణుచిత్తుడు ఇవే ఆలోచనలతో చింతామగ్నుడై ఉండి, ఆరోజు దేవునికి పూలమాలలు సమర్పించనే లేదు. ఆ దినమంతా అన్నపానాలు లేకుండా కలతనిద్ర లోకి జారుకున్న విష్ణుచిత్తునికి స్వప్నంలో సాక్షాత్కరించిన వటపత్రశాయి తాను అనునిత్యం ఎంతో ప్రేమగా స్వీకరించే పూమాలల నెందుకు అర్పించలేదని చనువుగా ప్రశ్నించాడు. విష్ణుచిత్తుడు జరిగిన ఉదంతమంతా దేవదేవునికి వివరించి, తన అపరాధాన్ని మన్నించమని వేడుకున్నాడు. దానికా వటపత్రశాయి తన పరమ భక్తురాలైన గోదాదేవి ధరించుకొన్న మాలలే తనకత్యంత ప్రీతిపాత్రమని, మున్ముందు కూడా ఆమె అలంకరించుకున్న మాలలనే తన కర్పించాలని శెలవిచ్చాడు. శ్రీహరి సమాధానంతో విష్ణుచిత్తుని మనసు కుదుట పడింది. విష్ణుచిత్తునికి తన పుత్రిక సాధారణ యువతి కాదని, దైవాంశ తోనే ఉద్భవించిందని, ముందు ముందు గొప్ప భాగవతారిణిగా వెలుగొందబోతోందని తోచి పుత్రికాగర్వంతో ఉప్పొంగిపోయాడు. అప్పటినుండి ఆమెను మరింత వాత్సల్యభావంతో చూస్తూ, ఆమె ధరించిన మాలలనే వటపత్రశాయి కలంకరించ సాగాడు. శ్రీవిల్లిపుత్తూరులో అదే సాంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంలో, ఆండాళ్ అమ్మవారు ధరించిన పూలమాలలను శ్రీవిల్లిపుత్తూరు నుండి వేడుకగా తెచ్చి శ్రీవేంకటేశ్వరునికి సమర్పిస్తారని ఇంతకు ముందే తెలుసుకున్నాం.


🙏 *శ్రీరంగనాథునిలో ఐక్యం* 🌈


💫 గోదాదేవి దైవాంశ సంభూతురాలైనప్పటికి తండ్రిగా తన బాధ్యత ననుసరించి, యుక్తవయస్కురాలైన ఆమెను తగిన వరునికిచ్చి వివాహం చేయాలి కదా! అని విష్ణుచిత్తుడు తలపోయసాగాడు. ఆమేమో భగవంతుడే తన భర్తయని భీష్మించుకుంది. చిత్రమైన సంకటంలో పడ్డ విష్ణుచిత్తుడు వివాహ విషయమై కూతుర్ని సంప్రదించగా అదే విషయం ఆమె ధృవీకరించి, విష్ణువును తప్ప వేరెవ్వరినీ వివాహమాడనని మరో సారి స్పష్టం చేసింది.


అంతే గాకుండా, నూట ఎనిమిదిగా గల దివ్యవైష్ణవక్షేత్రాలలో నున్న శ్రీమహావిష్ణువు అవతారాలన్నింటి మహిమలను విశద పరచవలసిందిగా తండ్రిని కోరింది. చివరికి శ్రీరంగక్షేత్రంలో కొలువై ఉన్న శ్రీరంగనాథుడే తనకు కాబోయే భర్తయని, వారితోనే తన వివాహం జరిపించమని తండ్రిని వేడుకొంది. ఇప్పుడు విష్ణుచిత్తుని ముందున్న సమస్య మరింత జటిలమైంది. మానవమాత్రురాలిగా, భౌతికరూపంలో నున్న తన కుమార్తెకు అర్చామూర్తిగా నున్న శ్రీరంగనాథునితో వివాహమెలా సాధ్యం? అయినప్పటికీ శ్రీకృష్ణుణ్ణి ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే కూతురి నిర్ణయం పట్ల నమ్మకంతో, భగవంతునిపై భారం వేసి, వివాహ ఏర్పాట్ల విషయంలో అప్పటి పాండ్యరాజు సహాయ మర్థించాడు. ఇదంతా భగవత్ప్రేరణ తోనే జరుగుతోందని విశ్వసించిన విష్ణుచిత్తుడు శ్రీరంగనాథుణ్ణి వరునిగా, శ్రీరంగాలయాన్నే వివాహవేదికగా నిర్ణయించి, బంధుమిత్రు లందరిని వివాహాని కాహ్వానించాడు. పుత్రికను సర్వాంగ సుందరంగా అలంకరింప జేసి శ్రీరంగనాథాలయం లోని వివాహవేదిక వద్దకు తోడ్కొని వచ్చాడు. అయినప్పటికీ మదిలోని సంశయం పట్టిపీడిస్తూనే ఉంది. ఈ వివాహమెలా సంపన్నమవు తుందన్న ఉత్కంఠ పాండ్యరాజుతో సహా ఆహ్వానితు లందరి మదిలో మెదులుతోంది. ఏం జరుగ బోతోందోనని అతిథులందరూ ఆసక్తితో తిలకిస్తూ ఉండగా ఏదో అదృశ్యశక్తి తనను ప్రేరేపించినట్లు, గోదాదేవి శ్రీరంగనాథుని పాదపద్మాలపై సాగిలపడింది. మరుక్షణం గోదాదేవి ఆత్మ పరమాత్మలో లీనమవ్వడంతో, ఆమె తన భౌతికకాయాన్ని త్యజించింది. వివాహ సంరంభాన్ని తిలకించటానికి విచ్చేసిన వారందరూ నిశ్చేష్ఠులయ్యారు. ఆ విధంగా తనను తానుగా భగవంతుని కర్పించుకున్న గోదాదేవి


అనతికాలంలో 'ఆండాళ్' గా, 'ద్వాదశాళ్వారు' లలో ఒకరిగా వినుతి కెక్కింది. 'ఆండాళ్' అనే తమిళపదానికి 'రక్షించే తల్లి' అని అర్థం. కొంతకాలం క్రితం వరకూ తమిళనాడులోని శ్రీవైష్ణవులు తమ బాలికలను 'ఆండాళ్' అని పిలిచే సాంప్రదాయముండేది. ఎత్తైన కొప్పుముడితో, నిండైన చీరెకట్టుతో, ముంజేతిపై రామచిలుకతో విలక్షణంగా గోచరించే గోదాదేవిని 'ఆండాళ్ అమ్మవారి' గా దాదాపు ప్రతి వైష్ణవాలయంలో ఈనాటికీ మనం చూస్తుంటాం.


గోదాదేవి శ్రీరంగనాథునిలో ఐక్యమైన తరువాత, వారి ఆదేశం మేరకు విష్ణుచిత్తుడు తిరిగి శ్రీవిల్లిపుత్తూరు చేరుకుని, సుదీర్ఘకాలం వటపత్రశాయిని సేవించుకున్న అనంతరం పరమపదం చెందారు.


 *సాహిత్యసాధన* 


 గోదాదేవి *తిరుప్పావై* తో పాటుగా, *'నాచ్చియార్ తిరుమొళి'* అనే 140 పాశురాల సంకలనాన్ని కూడా రచించింది. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా, ఎనిమిదవ రోజు సాయంత్రం జరిగే 'అశ్వవాహనోత్సవం' లో నాచ్చియార్ తిరుమొళి పారాయణం జరుగుతుంది.


[ రేపటి భాగంలో... *తిరుమంగై ఆళ్వార్* గురించి మరియు తదుపరి భాగాలలో ... *ద్వాదశ అళ్వారులలో మిగిలిన 3 మంది* గురించి తెలుసుకుందాం]


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*కర్ణ పర్వము ద్వితీయాశ్వాసము*


*389 వ రోజు*

*కురు పాండవయోధుల సమరం*-


అశ్వత్థామ పరాజయానికి పాండవయోధులు అర్జునుడిని కొనియాడారు. భేరీ మృదంగ నాదాలు మిన్నంటాయి. అది చూసి కర్ణుడు అర్జునుడిని ఎదుర్కొన్నాడు. త్రిగర్తసేనలు అర్జునుడిని కవ్వించాయి. అర్జునుడు " కృష్ణా ! త్రిగర్తలు మనలను కవ్విస్తున్నారు ముందు వారి పని పడతాను. కర్ణుడి సంగతి తరువాత చూడచ్చు. కర్ణుని ఎదుర్కొన్న త్రిగర్తలకు ఓడిన వారిమి ఔతాము " అన్నాడు. కృష్ణుడు రధమును త్రిగర్తల వైపు పోనిచ్చాడు. అర్జునుడు త్రిగర్తసేనలను చీల్చిచెండాడుతున్నాడు. కర్ణుడు ధర్మరాజును ఎదుర్కొన్నాడు. ఇరువురికి నడుమ పోరు ఘోరంగా సాగుతుంది. కర్ణుడు పాండవసేన లోని ప్రముఖులను, రధాశ్వములను, సారధులను వధించి వారి రధములను, కేతనములను విరుస్తున్నాడు. నకులసహదేవులు, సాత్యకి, ఉపపాండవులు కర్ణుడిని ఎదుర్కొన్నారు. కర్ణుడు ఒక్కడే వారిని ఎదుర్కొని వారిని తన బాణ పరంపరతో ముంచెత్తాడు. సుయోధనుడు గజ సైన్యాలను యుద్ధానికి పంపాడు. అంగ, వంగ, పౌండ్రక, మగధ, సుష్మ దేశాలకు చెందిన గజ సైన్యములు పాండవసేనలపై పురికొల్పాడు. గజసైన్యము పాండవసేనలను కాళ్ళతో తొక్కి నాశనం చేయసాగింది. సాత్యకి అత్యంత సాహసంతో వంగరాజును అతడి గజసైన్యమును నాశనం చేసాడు. నకులుడు పౌండ్ర రాజును, సహదేవుడు సుష్మరాజును ససైన్యంగా వధించారు. రాజులు చనిపోగానే గజములు పాండసేనల మీద విజృంభించాయి. నకులుడు అత్యంత శక్తివంతమైన బాణములు వేసి గజసేనలను నిర్మూలిస్తున్నాడు. ధృష్టద్యుమ్నుడు మొదలైన వారు ఏనుగుల గుంపులను హతమారుస్తున్నారు. యుద్ధము తీవ్రమైంది. రధములు విరుగుతున్నాయి. తలలు, కాళ్ళు, చేతులు తెగి పడుతున్నాయి. ఏనుగుల కళేబరాలు కొండల మాదిరి గుట్టలుగా పడ్డాయి. రక్తం ఏరులై పారింది. సుయోధనుడు ధర్మరాజును పట్టడానికి తన అనుయాయులతో వచ్చాడు. సాత్యకి భీమసేనుడు వారిని ఎదుర్కొని ధర్మరాజును కాపాడారు. కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ సుయోధనుడికి సాయంగా వచ్చారు. వారంతా భీముని మీద సాత్యకి మీద శరవర్షం గుప్పించి ధర్మరాజు కవచం ఖండించారు. కర్ణుడు పాండవ సేనలను దునుమాడుతూ అర్జునుడి కొరకు ఎదురు చూస్తున్నాడు. అది చూసి కృష్ణుడు " అర్జునా ! కర్ణుడు నీ కొరకు వెతుకుతున్నాడు. వెళ్ళి అతడిని వధించి సుయోధనుడిని ఒంటరి వాడిని చేసి సామ్రాజ్యలక్ష్మిని వరించు " అన్నాడు. భీమసేనుడు, సాత్యకి, ధృష్టద్యుమ్నులతో చేరి కౌరవ సేనలను తరిమి తరిమి కొడుతున్నాడు. భీముడు తనతో తలపడిన నిషాద రాజకుమారుని ఒకే బాణము వేసి అతడి తలను ఏనుగు తలను ఏక కాలంలో నరికాడు. అది చూసి నిషాద రాజకుమారుడి సైన్యం పారిపోయింది. ప్రళయకాల రుద్రుడి వలె ఉన్న భీముని ఎదిరించడానికి ఎవరికీ సాహసం లేక పోయింది. అది చూసిన దుర్యోధనుడు భీముని అడ్డగించాడు. 


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: ఆరవ అధ్యాయం

ఆత్మసంయమయోగం: శ్రీ భగవానువాచ


యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి 

తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి (30)


సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః 

సర్వథా వర్తమానో௨పి స యోగీ మయి వర్తతే (31)


అన్ని భూతాలలో నన్నూ, నాలో అన్ని భూతాలనూ చూసేవాడికి నేను లేకుండా పోను; నాకు వాడు లేకుండా పోడు. సమస్తభూతాలలో వున్న నన్ను భేదభావం లేకుండా సేవించే యోగి ఎలా జీవిస్తున్నప్పటికీ నాలోనే వుంటాడు.

రోగనిరోధక శక్తి

 *రోగనిరోధక శక్తి పెంచే మార్గాలు*


*1. Hydration is Immunity (నీటి తాగడం ఆరోగ్య రక్షణకు మూలం)*


*రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి. శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్లేందుకు ఇది సహాయపడుతుంది. రక్త ప్రవాహం మెరుగవుతుంది. సెల్స్‌కు ఆక్సిజన్ సరఫరా బాగా జరుగుతుంది. జీర్ణవ్యవస్థ మేతాబాలిజాన్ని పెంచుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. నీరు తక్కువగా తాగడం వల్ల రోగనిరోధక శక్తి పడిపోయే ప్రమాదం ఉంటుంది.*


*2. Sleep Well, Fight Well (నిద్ర బాగా పడితే వ్యాధులకు చెక్ పెట్టవచ్చు)*


*రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర అవసరం. నిద్రపోయే సమయంలో శరీరం మరమ్మతులు చేసుకుంటుంది. హార్మోన్ల ఉత్పత్తి నిబంధితంగా జరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. మెదడు విశ్రాంతి తీసుకుంటుంది. రోగనిరోధక వ్యవస్థ క్రియాశీలంగా మారుతుంది. నిద్రలేమి వల్ల వ్యాధుల పట్ల ప్రతిఘటన తక్కువవుతుంది. అలసట, మానసిక ఉద్రేకం వస్తాయి.*


*3. Eat Rainbow Foods (రంగురంగుల ఆహారం.. రోగనిరోధక బలం)*


*పచ్చ, నారింజ, ఎరుపు రంగు కూరగాయలు తినాలి. ఇవి విటమిన్ A, C, E లతో నిండి ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. శరీరానికి శక్తి అందుతుంది. వ్యాధుల ప్రభావాన్ని తగ్గిస్తాయి. నేచురల్ ఇన్ఫ్లమేషన్‌కి చెక్ వేస్తాయి. కండరాలకు బలం ఇస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.*


*4. Exercise is Immunity Booster (వ్యాయామమే రక్షణ కవచం)*


*రోజుకు కనీసం 30 నిమిషాల శారీరక వ్యాయామం చేయాలి. నడక, యోగా, ప్రాణాయామం ఉపయోగపడతాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శ్వాసకోశ వ్యవస్థను శక్తివంతంగా ఉంచుతుంది. హార్మోన్ల బ్యాలెన్స్ సరిగా ఉంటుంది. మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. వ్యాధులకు చెక్ వేయడంలో సహాయపడుతుంది.*


*5. Vitamin C is the Key (విటమిన్ C మాయాజాలం)*


*నిమ్మకాయ, ఉసిరికాయ, నారింజలు తీసుకోవాలి. వీటిలో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇది తెల్ల రక్తకణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. శరీర రక్షణ వ్యవస్థను బలపరుస్తుంది. ఇన్ఫెక్షన్లపై పోరాటం చేస్తుంది. చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. గాయం త్వరగా మానుతుంది. తలనొప్పి, అలసట తగ్గుతుంది.*


*6. Stress Down, Immunity Up (మానసిక ఒత్తిడిని తగ్గించండి)*


*ఒత్తిడితో హార్మోన్ల అసమతుల్యత వస్తుంది. కార్టిసోల్ అధికంగా విడుదలవుతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. మానసిక శాంతి కోసం ధ్యానం చేయండి. పాజిటివ్ ఆలోచనలు పెంచండి. ప్రశాంత వాతావరణంలో ఉండండి. మ్యూజిక్ థెరపీ లేదా నడక మంచిది. ఆత్మస్థైర్యంతో జీవించండి.*


*7. Limit Junk & Sugar (జంక్ ఫుడ్, చక్కెర తగ్గించండి)*


*అధిక చక్కెర రక్తంలోని శ్వేత కణాల పని తక్కువ చేస్తుంది. ప్రాసెస్డ్ ఫుడ్స్ శరీరాన్ని అలసిపోతేలా చేస్తాయి. శరీర బరువు పెరగడం వల్ల వ్యాధుల ముప్పు పెరుగుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ స్లో అవుతుంది. మలబద్ధకం, గ్యాస్ సమస్యలు వస్తాయి. షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్‌కు అవకాశం ఉంటుంది. హెల్దీ స్నాక్స్ తీసుకోవాలి. తాజా పండ్లు మంచి ప్రత్యామ్నాయం.*


*8. Probiotics are Protectors (ప్రొబయాటిక్స్.. రక్షణ కవచాలు)*


*పెరుగు, బటర్ మిల్క్ వంటి వాటిలో ప్రొబయాటిక్స్ ఉంటాయి. ఇవి గట్ హెల్త్‌ను మెరుగుపరుస్తాయి. జీర్ణవ్యవస్థను బలపరుస్తాయి. శరీరానికి అవసరమైన మంచి బ్యాక్టీరియాను అందిస్తాయి. వ్యాధి కారక బ్యాక్టీరియాను అరికడతాయి. ఫ్రీ మోషన్ సాఫీగా జరుగుతుంది. పొట్ట నొప్పులు తగ్గుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.*


*9. Herbal Support Helps (సోంపు, తులసి వంటి సాయాలు)*


*తులసి, అల్లం, పెరుగు, మిరియాలు వంటి హెర్బల్స్‌ ఉపయోగించాలి. ఇవి శరీరాన్ని శుద్ధి చేస్తాయి. శ్వాసకోశం ఆరోగ్యంగా ఉంటుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి. రక్తశుద్ధి చేయడంలో సహాయపడతాయి. నేచురల్ యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. రోజూ 1 కప్పు హెర్బల్ టీ తాగడం మంచిది. ఇది రోగనిరోధక శక్తికి బలమవుతుంది.*


*10. Sunlight is Essential (వెలుగు నీకు ఔషధం)*


*రోజుకు కనీసం 20 నిమిషాలు ఉదయపు సూర్యరశ్మిని పొందాలి. విటమిన్ D శరీరంలో తయారవుతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థకు కీలకం. ఎముకలు బలపడతాయి. మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్త ప్రసరణ మెరుగవుతుంది. పాజిటివ్ ఎనర్జీ కలిగిస్తుంది.*

జిహ్వకో రుచి...*

 *జిహ్వకో రుచి...*

💐💐💐💐💐


"మావిడికాయ్ పప్పు చేశావ్, బ్రమ్మాండంగా ఉంది. అదే చేత్తో నాలుగప్పడాలు, రెండు ఒడియాలు, ఓ పది చల్లమిరపకాయలూ కూడా వేయించేస్తే, స్వర్గానికి జానెడు దూరంలో ఉండేది కదటోయ్..."


"ఇందాకే యూట్యూబులో చూశాను, మా డాక్టర్ గారి వీడియో...'డీప్ ఫ్రై' చేసినవి తింటే, ఆరోగ్యం అటకెక్కుతుందని చెప్పారు... పైగా, అందరికీ చెప్పమన్నారు..."


"మనింట్లో అటక లేదుగా... ఏం పర్లేదు ! మా గురువుగారు, గరికిపాటి గారు చెప్పారు... 'రసహీనమైన బతుకు బతికే కంటే, అన్నీ సుబ్బరంగా తిని, 50 ఏళ్ళకే బకెట్ తన్నేస్తే... నష్టం ఏంటి ?' అని !"


"మొదలెట్టారా, మీ వితండవాదం ? వయసులో ఉండగా ఏం తిన్నా హరాయించుకుంటుంది మన శరీరం... తిన్నన్నాళ్ళు తిన్నాం... ఇప్పటినుంచైనా కాస్త జాగ్రత్తగా వుంటే ఏవైందిట ?"


"ఏడు దశాబ్దాలు దాటేశాం... నాటౌటు ! ఇప్పటిదాకా ఏం కాలేదు... ఇప్పటికీ గుండ్రాయిలా ఉన్నాం. ఒకవేళ నోరు కట్టుకుని, వందేళ్ళు బతికినా... ఎవరికోసం, ఎందుకోసం ?


"ఓ కొత్తావకాయ తినక, మాగాయ అన్నంలో పెరుగు కలుపుకోక, పప్పులో గుమ్మడి ఒడియాలు నంజుకోక, నాలుగు చల్లమిరపకాయలు వేయించుకోక, నాలుగు మావిడిపళ్ళు, పది పనసతొనలు తినక... ఎందుకు బతకడం ?


"ఒకవేళ అన్నీ మానేసి, నెయ్యి - నూని కూడా ఒదిలేసి, చెరో రెండూ ఎండు పుల్కాలు తిని, బతికేస్తాం అనుకో... సెంచరీ కొట్టేస్తామా ? ఎవరైనా గేరంటీ ఇవ్వగలరా ? హంసలాగ ఆర్నెల్లు బతకమన్నారుగా ?"


"మీతో వాదించే కన్నా... ఊరుకోడం అంత ఉత్తమం లేదు..."


"కదా... అంచేత, చల్లమిరపకాయల డబ్బా, అప్పడాల డబ్బా, ఒడియాల మూట, నాకు కనపడకుండా ఎక్కడ దాచేశావో చెప్పు... నేనే వేయించుకు తింటాను..."


"ఇప్పుడు నన్ను వేయించుకు తింటున్నది చాలదూ... మీతో వేగడం కష్టం... మళ్ళీ మీకెందుకు శ్రమ ? నేనే వేయించి తెస్తాను, భోయినం దగ్గర కూచున్నాక మీరు లేవడం ఎందుకు !"


"ఇప్పుడు నా అర్ధాంగి అనిపించావు. రానీ... అవన్నీ వచ్చేదాకా వేచి ఉంటాను, వచ్చేప్పుడు... కాస్త కొత్తావకాయ్ జాడీకూడా తీసుకురా..."


"మహాప్రభో... మీకో నమస్కారం !"


"దీర్ఘ సుమంగళీ భవ !!!"

అన్నము

 అన్నము అంటే ఏమిటి ?


అన్నం పరబ్రహ్మ స్వరూపం !

మనలో చాలా మందికి ” అన్నము” అంటే తెలియదు . బియ్యాన్ని ఉడికించి చేసిన పదార్ధాన్నే అన్నము అంటారని అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి ప్రతి మనిషికి పంచ కోశములు అని అయిదు కోశములు ఉంటాయి. అవి అన్నమయ , ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు . అన్నమయ కోశము స్థూల శరీరానికి సంబంధించినది. ఈ అన్నమయ కోశములో ప్రవేశించే అన్నము ప్రాణశక్తిగా మారుతున్నది.కనుక అన్నమయ కోశాములోనికి వెళ్ళే ఆహారమే అన్నము అని అర్ధం . మనము ఏది తిన్నా అది అన్నమే అవుతుంది కేవలం బియ్యం ఉడికించినది మాత్రమే కాదు. .

అన్నదానం అంటే ఏమిటి ?

అన్నమే అన్నకోశములో ప్రవేశించి ప్రాణంగా మారుతున్నందువలన అన్నదానం అంటే ప్రాణాన్ని దానం చేయడమే . అంతే కాదు ఒక ప్రాణం నిలవడానికి కావలసినవన్ని అన్నమే . కనుక అన్నదానం చేయడం శ్రేష్టం అని శాస్త్రాలు చెప్తున్నాయి . ఏదైనా దానం చేసేప్పుడు విచక్షణ అవసరం కానీ అన్నదానానికి మాత్రం ఈ నియమం లేదు . అన్నదానం చేయడం అంటే వాళ్ళ ప్రాణాన్ని నిలపడమే కనుక అత్యంత శ్రేష్టం అయినది అన్నదానం.


శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అన్నాన్ని గురించి ప్రస్తావించాడు. అన్నం భగవంతుని సొత్తు. మనది కాదు. పరమాత్మయే వర్షాల్ని కురిపించి ధాన్యం సృష్టిస్తున్నాడు. భోజనం లేనిదే మనం లేము. మన జీవనాధారం భోజనం పైనే ఆధారపడి వున్నది. ఆ భోజనాన్ని మనకు అందించే దేవునకు సదా కృతజ్ఞులమై వుండాలి. 

 మనం చూపే కృతజ్ఞతయే ఆ దేవునికి మూల్యం. అదే భక్తి. ఆ భక్తితో మనం తినే అన్నాన్ని భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా నివేదించాలి. లేదా దానిలో కొంత భాగాన్ని ప్రాణికోటికి సమర్పించాలి. ఈ శరీరం పంచకోశములతో ఆవృతమై వుంది. అవి అన్నమయకోశం, ప్రాణమయకోశం, మనోమయకోశం, విజ్ఞానమయకోశం, ఆనందమయకోశం. ఇవి ఉల్లిపొరల వలె ఒకదాని లోపల ఒకటి విలీనమై వుంటాయి. వీటిలో అన్నిటికంటే బయట వున్నది అన్నమయకోశం. లోపల వున్నది ఆనందమయకోశం. అందుకే అన్నమయకోశం శరీరంగాను, ప్రాణమయకోశం దీనికి ఆత్మగా చెప్పబడింది. 

 సద్గృహస్తులు అతిథులకు అన్నం సిద్దంగా వుందని చెప్తారు. అతిథులు ఏ సమయంలో వచ్చినా వారికి అన్నం పెడతారు. ఎవరు సిద్ధమైన అన్నాన్ని అత్యంత శ్రద్ధాభక్తితో అతిథులకు, అభ్యాగతులకు సమర్పిస్తారో వారు జన్మాంతరంలో అత్యంత శ్రద్ధాభక్తులతో సమర్పించబడిన అన్నాన్ని శ్రమపడక్కర లేకుండానే గౌరవంగా పొందుతారు. ఎవరు తక్కువ శ్రద్ధతో ఇక తప్పదని గ్రహించి ఈ సిద్ధమైన అన్నాన్ని అతిథులకు, అభ్యాగతులకు సమర్పిస్తారో వారికి జన్మాంతరంలో అదేవిదంగా తక్కువ శ్రద్ధతో సమర్పించబడిన అన్నం, సామాన్య శ్రమతో దొరుకుతుంది. 


అన్నం గురించి కొంత మంది పెద్ద మనుషులు మంచి మనసుతో చెప్పిన గొప్ప మాటలు ఈ విధంగా...

 " నేను వంటింట్లోకి వేరే పనిమీద వెళ్ళినా కూడా , వంట చేస్తున్న మా అమ్మగారు. " పెట్టేస్తా నాన్నా. ఒక్క అయిదు నిముషాలు " అనేవారు... నొచ్చుకుంటూ- నేను అన్నం కోసం వచ్చాననుకుని ! ఎంతయినా అమ్మ అంటే అన్నం. అన్నం అంటే అమ్మ ! అంతే ! 

( జంధ్యాల గారు ) . 

 మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళటం - సంతాప సభకి వెళ్ళిన దానితో సమానం !

( విశ్వనాధ సత్యనారాయణ గారు ) .


 రాళ్లు తిని అరిగించుకోగల వయసులో వున్నప్పుడు తినటానికి మరమరాలు కూడా దొరకలేదు ! ... వజ్రాలూ , వైడూర్యాలూ పోగేసుకున్న ఈ వయసులో మరమరాలు కూడా అరగట్లేదు ! అదే విధి !

( రేలంగి వెంకట్రామయ్య గారు ) .


 ఆరు రోజుల పస్తులున్న వాడి ఆకలి కన్నా, మూడు రోజుల పస్తులున్న వాడి ఆకలి మరీ ప్రమాదం ! ఆహారం దొరికినప్పుడు ముందు వాడ్నే తిననివ్వాలి !

( ముళ్ళపూడి వెంకటరమణ గారు ) .


 ఏటా వంద బస్తాల బియ్యం మాకు ఇంటికి వచ్చినా మా తండ్రిగారు అన్నీ మనవి కావు నాయనా " అని బీదసాదల కి చేటలతో పంచేసే వారు.. అన్నీ మనవి కావు అనటంలో వున్న వేదార్ధం నాకు పెద్దయితేనే గానీ అర్ధం కాలేదు !

( ఆత్రేయ గారు )


 అమ్మకి నేను అన్నం పెడుతున్నాను అనటం మూర్ఖత్వం !

అమ్మ చేతి అన్నం తింటున్నాను అని చెప్పగలిగినవాడు ధన్యుడు !

( చాగంటి కోటేశ్వరరావు గారు ) .

. ఆకలితో వున్న వాని మాటలకు ఆగ్రహించవద్దు !!

(గౌతమ బుద్దుడు )


 ఆత్మీయులతో కలసి తినే భోజనానికి రుచి ఎక్కువ ! చారు కూడా అమృతంలా రుచిస్తుంది !

( మాతా అమృతానందమయి )


 మీ పిల్లలు ఎంత దూరంలో, ఎక్కడ వున్నా , వేళ పట్టున ఇంత అన్నం తినగలుగుతున్నారంటే అది వాళ్ళ గొప్పా కాదూ , మీ గొప్పా కాదు. మీ పూర్వీకుల పుణ్యఫలమే అని గుర్తించుకుని మనం బ్రతకాలి..

సమస్య ప్రతి జీవికి ఉంటుంది.సమస్య లేని జీవి ఉండడు.అది ఏ రూపంలో నైనా ఉండవచ్చు.దీని మూలంగానే ప్రశాంతతకు దూరంగా బతకనక్కరలేదు.ఎన్ని సమస్యలున్నా ప్రశాంతంగా బతకడం నేరిస్తేనే జీవితాన్ని కాచి ఒడబొసిన వాళ్ళమవుతాము.ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఎదురొడ్డి పోరాడి గెలుపును సాధించడమే జీవిత పరమార్థం. మనిషికి ఆశ ఉండడం తప్పు కాదు కాని అత్యాశ ఉండకూడదు. కోరికలను అదుపులో పెట్టుకోవాలి, లేకుంటే అవి మన జీవితాన్ని నాశనం చేస్తాయి.

అందరికీ అన్నీ ఉన్నాయని బాధ పడకూడదు.మన పనల్లా ఇతరులకు వీలైనంత సహాయం చేయడం,మంచి పనులు చేయడం,మనం చేసిన పని ఇతరులకు సుఖ సంతోషాలను కలిగించాలి. మనం పాప కార్యాలు చేసి బంధనంలో పడేకంటే పుణ్య కార్యాలు చేసి శాశ్వతంగా నిలిచిపోవడమే భావ్యం.అందుకే మనం ప్రతినిత్యం దైవాన్ని ప్రార్థించేముందు ఇచ్చినదానితో సంతృప్తి చెందామని దైవం ముందు తలవంచాలి.

ఎవరు అత్యంత నిరసనతో అన్నంలేదు పో... అంటూ పరిభాషిస్తారో వారికి జన్మాంతరమందు అదేవిధంగా అత్యంత నిరసనతో అతికష్టం మీద అన్నం దొరుకుంది. కనుక ఆశ్రయించివచ్చిన వారికి అన్నం పెట్టాలి. ఎంతమంది వచ్చినా అన్నం సిద్ధపరుచుకోవాలి

అన్నదాన మహిమ చెప్పే కథ

పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు కాశీ యాత్రకు బయలుదేరాడు. ఆరోజుల్లో ప్రయాణ సాధనాలు, సరైన రహదారి వ్యవస్థ ఇంతగా లేనందున కాశీచేరడానికి వారు నివసించే ప్రాంతాలను బట్టి కొన్ని నెలలు ప్రయాణించాల్సి వచ్చేది. యాత్రికులు మధ్యలో గ్రామాల్లో రాత్రుళ్లు బస చేస్తూ వెళ్లేవారు. ఈ బ్రాహ్మణుడు ఏదో ఆలస్యం కారణంగా చీకటి పడే సమయానికి తాను వెళ్లవలసిన గ్రామానికి చేరుకోలేకపోయాడు. చిట్టడవిలో ఉన్నాడు. చీకటి పడింది. ఏమి చేయాలో తోచలేదు. అయితే అదృష్టవశాత్తు ఒక కోయవాని ఇల్లు కనబడింది. అక్కడ ఆశ్రయం కోరాడు. శంబరుడు అనే ఆ కోయవాడు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకొని తన వద్ద ఉన్న వెదురు బియ్యం, తేనె తినడానికి ఇచ్చాడు. తన కుటీరం చిన్నదైనందున దానిలో పడుకోమని, తాను బయట కాపలాగా ఉంటానన్నాడు. అర్ధరాత్రి ఒక పులి అతనిపై అదను చూసి దాడిచేసి, చంపివేసి, దేహాన్ని తీసుకుపోయింది. ఇదంతా చూసిన బ్రాహ్మణుడు బిక్కచచ్చిపోయాడు. కోయవాని మరణానికి చింతించి, తన దారిన తాను వెళ్లాడు. కాశీ చేరాడు. దైవదర్శనం చేసుకున్నాడు.

ఈ బ్రాహ్మణునికి ఎప్పటినుంచో అన్నదానం అంత గొప్పదా అన్న అనుమానం ఉండేది. తన ఇష్టదైవమైన విశ్వేశ్వరుడు ఆ సందేహం తీరిస్తే బావుండునని అనుకున్నాడు. ఆరోజు రాత్రి విశ్వేశ్వరుడు అతనికి కలలో కనిపించి, నువ్వు తిరుగు ప్రయాణంలో ఒక రాజ్యం మీదుగా వెడతావు. అక్కడి రాజుకు ఒక పుత్రుడు జన్మించి ఉంటాడు. ఆ శిశువును ఏకాంతంగా ఆశీర్వదించు అని చెప్పాడు. ఎందుకో చెప్పలేదు. బ్రాహ్మణుడు అలాగే చేశాడు. రాజకుమారుణ్ణి ఏకాంతంగా ఆశీర్వదించేందుకు వెళ్లాడు. చంటి పిల్లవాడైన ఆ రాజకుమారుడు, ఈ బ్రాహ్మణుణ్ణి చూసి నవ్వి, ఓయీ బ్రాహ్మణా! నన్ను గుర్తుపట్టావా? నేను కోయవాణ్ణి. శంబరుణ్ణి. నీకు ఒక్క రాత్రి అన్నదానం చేయడం వల్ల ఈ జన్మలో నాకు రాజయోగం సిద్ధించింది అన్నాడు. మరుక్షణం అతనికి మళ్లీ పూర్వజన్మ జ్ఞానం నశించి మామూలు శిశువుల మాదిరి ఆడుకోవడం మొదలెట్టాడు. బ్రాహ్మణుని సంశయం తీరింది.

అన్నదాన మహిమ ఎంతటి గొప్పదో ఈ కథ చెబుతుంది.

ఆలయం మోసాలు

 #కర్నూల్ జిల్లా #మహానంది ఆలయం లో మీకు తెలియని మోసాలు  భక్తులని యెంత ఇబ్బంది పాలు చేస్తున్న ఈఓ


1) నిత్యా #అన్నదానం డోనార్స్ ఉన్న, నిత్యం ఉచిత కూరగాయలు ఇస్తున్నవచ్చే భక్తులు  వేలల్లో, లక్షల్లో ఉన్న

కేవలం 100 మందికే మిగిలితే ఇంకో 20 మందికే అన్నదానం ఎందుకో తెలుసా ఈ ఆలయం మొదట్లో భోజనం హోటల్ ఉంది..

ఆ హోటల్ వాడు సంవత్సరానికి అక్షరాలా 40 లక్షలు దేవాలయాన్ని కడతాడంట అలాంటప్పుడు దేవాలయాల్లో అన్నదానం చేస్తే ఊరుకుంటాడా హోటల్ వాడు


2) ఈ దేవాలయం లో బాత్రూమ్స్ ఉండవ్ ఉన్న క్లోజ్  చేసేసి  చేన్నాళ్ళు అయ్యింది ఎందుకో తెలుసా ఈ గుడికి లెఫ్ట్ సైడ్ పే యూజ్ బాత్రూమ్స్ ఉన్నాయ్ ఆడవాళ్లు , పసి పిల్లలు , మొగవారు ఎవరైనా ఒకటి కైనా రెండుకైన 10 రూపాయలు చెల్లిస్తేనే వెళ్ళనిస్తారు లేకపోతె లేదు పొరపాటున డబ్బులు రూమ్ లో మర్చి పొతే ఆడవాళ్లు ఐన ఏ చెట్టో చూసుకోవాలి 


3) దేవస్థానం రూములు ఉంటాయి ఒక రోజుకు 200 కానీ ఎప్పుడు ఫుల్ అనే చెపుతారు ఆ రూమ్స్ ఎవరు లేక పాడుపడి పందులు కూడా ఉండవ్ నల్లుల మంచాలు పరుపు లో కబ్బరి పీచు కనిపించేలా చిరిగిపోయి గదులు ప్రేతకళతో ఉంటాయి ఎందుకో తెలుసా ఆ చుట్టుపక్కల ఉండే లాడ్జ్ లు డీలాక్స్ రూమ్స్  అని ప్రైవేట్ రూమ్స్ వాళ్ళు మొత్తం అందరు కలసి సంవత్సరానికి 3 కోట్ల దాక ఇస్తారు అంటా ఈ దేవాలయానికి

అలాగే చుట్టుపక్కల ఉన్న తినుబండారాల బండులు కలిపి నెలకి ఒక్కొక్క బండికి 1200 చప్పున కడతారంట అన్ని అధిక రేట్లకే అమ్ముతారు అక్కడ 


4) మీరు పువ్వులు కబ్బరికాయలు పూజ ద్రవ్యాలు ఏ దేవాలయానికి వెళ్లిన చేలా షాపులు ఉంటాయి కానీ మహానంది లో ఒక్క షాప్ మాత్రమే ఉంటుంది అక్కడ రేట్లకు హద్దు ఆపు ఉండదు భక్తులు ఏమి చేయలేక కొంటుంటారు 


5) ఏ దేవాలయాల్లో ఐన శనేశ్వరస్వామి ని దర్శించక శివయ్యను దర్శిస్తారు కానీ ఇక్కడ చాలాదారుణం దేవుణ్ణి పెట్టి వ్యాపారం చేస్తున్నారు  ఏంటంటే శివయ్యను ,కామేశ్వరి అమ్మవార్ని , రామాలయాన్ని , ఆంజనేస్వామి ని దర్శించక బయటికి వచ్చే దారిలో నవగ్రహాల  ఆలయం ఉంటది బయటకి వచ్చే దారిని మూసేసి నవగ్రహాలు లోపలి నుండి అది ఎడమ వైపు నుండి ప్రదక్షణమ్ చేయమంటారు ఒక పంతులు మామూలుగా ఐతే నవగ్రహాల బయటవరకే భక్తులు ప్రదక్షణం చేస్తరు కానీ డబ్బు కోసం నవగ్రహాల లోపలి కి  వెళ్లి  ఎడమ  వైపు నుండి ప్రదక్షణమ్ చేపించి దీపం వెలిగించాలి అన్ని చెప్పి ఒక్కరిదగ్గర 50 రూపాయలు  వసూళ్లు చేస్తాడు 


6)ఆ పంతులు  అదేంటి ఆరా తీయగా నవగ్రహాల ను సంవత్సరానికి 20 లక్షలకు పాడాడంట ఆ పంతులు, ఇలాగ ఈ దేవాలయానికి సంవత్సర ఆదాయం అక్షరాలా 11 కోట్లు అంట దేవాదాయ ఈ ఆదాయం తో బాత్రూమ్స్ కటించ వచ్చు , అన్నదానం , ఇంకా ఎన్నో చేయొచ్చు  ధర్మాదాయ శాఖ ఏంచేస్తుందో దేవాలయాల్లో ఇంతంత మోసాలు జరుగు తుంటే ఇక్కడే కాదు భద్రాచలం , లో కాణిపాకం లో ఆలయ గర్భ గుడిలా ఫోటోలు తీయటం తప్పు కానీ గుడి బయట ఆవరణాల్లో సెల్ ఫోనుల్లో ఫోటోలు తీయనీయకుండా అక్కడ ఫోటో గ్రాఫేర్స్ కి కాంట్రాక్ట్స్ ఇచ్చేసి వాళ్ళతో  డబ్బులు ఇచ్చి తప్ప ఫోన్ లో  ఫొటోస్ తీయనీకుండా చేస్తున్నారు  కూడా నాకు ఎదురైనా పరిస్తుతులు ఇంకా ఎన్నో హిందూ దేవాలయాల్లో కూడా ఇదే పరిస్థితి అసలు ఎంతంత దూరాలనుండి దేవాలయాల దర్శనాలకు వెళ్తున్న భక్తులకు కనీస సౌకర్యాలు లేకపోగా అనేక ఇబ్బందుల పాలు చేటున్నారు 


7)ఈ దేవాలయాల అధికారులు వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే దాక షేర్ చేయండి లేకపోతె మన దేవాలయాలకు సామాన్యులు దేవాలయాలకు వెళ్ళలేరు..........

RR team.

మంగళవారం🍁* *🌹27 మే 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

      *🍁మంగళవారం🍁*

      *🌹27 మే 2025🌹*

      *దృగ్గణిత పంచాంగం*                 


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం -వసంత ఋతౌః*

*వైశాఖ మాసం - కృష్ణపక్షం*


*తిథి : అమావాస్య* ఉ 08.31 ఉపరి *జ్యేష్ఠ పాడ్యమి* తె 05.02 వరకు 

*వారం    : మంగళవారం* ( భౌమవాసరే )

*నక్షత్రం   : రోహిణి* రా 02.50 వరకు ఉపరి *మృగశిర* 


*యోగం : సుకర్మ* ఉ 10.54 వరకు ఉపరి *ధృతి* 

*కరణం   : నాగ* ఉ 08.31 *కింస్తుఘ్న* సా 06.45 ఉపరి 

*బవ* తె 05.02 వరకు *ఆపైన బాలువ*


*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 11.00 - 01.00 సా 05.30 - 06.30*

అమృత కాలం  : *రా 12.00 - 01.25*

అభిజిత్ కాలం  : *ప 11.39 - 12.31*


*వర్జ్యం            : రా 07.44 - 09.10*

*దుర్ముహూర్తం  : ఉ 08.10 - 09.03 రా 10.59 - 11.43*

*రాహు కాలం    : మ 03.20 - 04.57*

గుళికకాళం       : *మ 12.05 - 01.42*

యమగండం     : *ఉ 08.49 - 10.27*

సూర్యరాశి : *వృషభం*

చంద్రరాశి : *వృషభం*

సూర్యోదయం :*ఉ 05.42*

సూర్యాస్తమయం :*సా 06.45*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.34 - 08.10*

సంగవకాలం         :*08.10 - 10.47*

మధ్యాహ్న కాలం    :     *10.47 - 01.23*

అపరాహ్న కాలం    : *మ 01.23 - 03.59*


*ఆబ్ధికం తిధి         : జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి*

సాయంకాలం       :*సా 03.59 - 06.35*

ప్రదోష కాలం         :  *సా 06.35 - 08.47*

రాత్రి కాలం           :*రా 08.47 - 11.43*

నిశీధి కాలం          :*రా 11.43 - 12.27*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.06 - 04.50*

--------------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


_*🚩హనుమ ధ్యాన శ్లోకాలు*_🚩


_*యత్ర యత్ర రఘునాథకీర్తనం*_

_*తత్రతత్ర కృతమస్తకాంజలిమ్*_

_*బాష్పవారి పరిపూర్ణలోచనమ్*_

_*మారుతిం నమతరాక్షసాంతకమ్*_


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🌷🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

       🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు - వైశాఖ మాసం - కృష్ణ పక్షం -‌ పూర్ణిమ మరియు జేష్ట శుక్ల ప్రతిపత్ - రోహిణీ -‌‌ భౌమ వాసరే* (27.05.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*