16, నవంబర్ 2023, గురువారం

నాగుల చవితి విశిష్టత*

 *_రేపు నాగులచవితి పండుగ_* 

     *నాగుల చవితి విశిష్టత*

🕉️🪱🕉️🪱🕉️🪱🕉️🪱🕉️


*ఆశ్లేష , ఆరుద్ర , మూల , పూర్వాభాద్ర , పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రములు.* సర్పము అనగా కదిలేది , పాకేది.  *నాగములో *‘న , అగ’* ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని *‘నాగము’* అంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్ళేది *‘కాలము’* కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే ‘కాలనాగము’ లేదా *‘కాలనాగు’* అని అంటారు. 


జ్యోతిష్యశాస్త్రానుసారం కాలసర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతాయి.  జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా *‘నాగం’*. సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు.  కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఉదరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ కూడా *‘ఉరగముల’* మే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవనక్రమంలోని వివాహం , సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరస్తుంది కావున కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తారు. అగ్ని దేవతగా ఉండేది. కార్తీకమాసములోనే. మన జీవనానికి కావాల్సిన ఉత్సాహం , ఉత్తేజం వంటివి తేజస్సు వలన అనగా సూర్యుడు , అగ్ని వలన కలుగుతాయి. శ్రీహరికి శయ్య , శంకరునికి ఆభరణము కూడా సర్పమే.  కావున నాగులను ఆరాధించడం వలన హరిహరులను సేవించిన ఫలం దక్కుతుంది.


కార్తికమాసమంతా ఇంట్లో నాగ ప్రతిమను ఆరాధిస్తూ , నాగస్తుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడు. కార్తీకమాసం నెలరోజులు కాకపోయినా కనీసం *కార్తీక శుద్ధ చవితినాడు*  నాగులను ఆరాధించాలి. చవితి అంటే నాల్గవది అనగా *ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలలో*  నాల్గవది మోక్షం కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుంది. అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుండి విముక్తులవుతాము. కావున నాగులను చవితినాడు దేవాలయాలలో , గృహములో లేదా పుట్టల వద్ద నాగ దేవతను ఆరాధించాలి.* 


ప్రకృతి మానవుని మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును , పుట్టను , రాయిని , రప్పను , కొండను , కోనను , నదిని , పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపంగా చూసుకొంటూ ! పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని హిందువుల పండగల విశిష్టత. 


నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే *"నాగుపాము"* ను కూడా నాగరాజుగా , నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు.


ఈ రోజున ఊరిలో ఉన్న గుళ్ళలో ఉన్న పుట్టలలో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టలో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయటమనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. సిటీ ప్రాంతంలో నాగుల చవితికి అంత సందడిగా కనిపించదు కానీ గ్రామీణ ప్రాంతాలలో మాత్రం ఎంతో సందడి సందడిగా కనిపిస్తుంది. 


దేవాలయాల్లో రాతి విగ్రహా జంట పాముల ప్రతిమలు , రెండు పాములు మెలికలు వేసుకొని రావి , వేప చెట్ల కింద దర్శనం ఇవ్వటం మనము ఎక్కువ గమనిస్తుంటాము. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు , వైవాహిక , దాంపత్య దోషాలు , గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వాసంతో పుజిస్తారు. ఎందుకంటే కుజ దోషం , కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా నాగులచవితిని జరుపుకుంటారు. *కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ  జరుపుకుంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు.*  ఇవి రైతులకు కూడా ఎంతో మేలును చేకూరుస్తాయిఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి *" నీటిని"* ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే  క్రిమికీటకాదులను తింటూ , పరోక్షంగా *" రైతు "* కు పంటనష్టం కలగకుండా చేస్తాయట !.  అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.


భారతీయ సనాతన సంప్రదాయాల్లో జంతు పూజ ఒకటి. ఈశ్వరాంశ ప్రతి ప్రాణిలోనూ వ్యాపించి ఉన్నదని ఉపనిషత్‌ ప్రబోధం. ప్రకృతి పరిరక్షణకు తోడ్పడే సద్భావన అది. వేదంలో నాగ పూజ కనిపించకున్నా -  సంహితల్లో , బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది. పురాణ , ఇతిహాసాల్లోని గాథల్లో సర్పాలు వివిధ సందర్భాల్లో ప్రత్యక్షమవుతాయి. ఈ రోజునే తక్షకుడు , కర్కోటకుడు , వాసుకి , శేషుడు మొదలైన 100 మంది నాగ ప్రముఖులు జన్మించారని పురాణ కథనం. భూలోకానికి క్రింద ఉన్న అతల , వితల , సుతల , తలాతల , రసాతల , మహాతల , పాతాళ లోకాలల్లో వివిధ జీవరాసులు నివసిస్తాయి. వాటిలో ఐదు రసాతల లోకాల్లో రాక్షసులు నివసిస్తారు. చివరిదైన పాతాళ లోకంలో నాగులు ఉంటాయి. నాగ ప్రముఖులందరూ అక్కడ ఉంటారు. ఈరోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దోషాలు తొలగిపోతాయి.


కద్రువ నాగ మాత , మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు. సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం. అదే - ఆకాశం మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుడి చేతిలోని  ఆయుధమూ అదే. సర్పమే మంథర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు , రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది.


దంపతులకు సంతానం కలగకపోవడానికి ప్రాచీన , ఆధునిక వైద్యశాస్త్రాలు పలు కారణాలు చెబుతాయి.  సర్పదోషమే కారణమని భావించినవారు రామేశ్వరం వెళ్లి నాగప్రతిష్ఠ చేయడం రివాజు. అక్కడికి వెళ్లలేనివారు తమ గ్రామ దేవాలయప్రాంగణంలోనే సర్ప విగ్రహాల్ని ప్రతిష్ఠించే పద్ధతి ఉంది. మన ప్రాచీన దేవాలయాల చుట్టూ శిథిలమైన నాగ విగ్రహాలు ఇప్పటికీ దర్శనమిస్తుంటాయి.


వర్షకాలంలో పాములు పుట్టల్లో నుంచి బయటకు వచ్చి సంచరిస్తాయి. అందుకే శ్రావణ మాసంలో సైతం *‘నాగ పంచమి’*  పేరుతో పండుగ చేసుకుంటారు. పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి , రైతులు వాటిని దేవతలుగా భావిస్తుంటారు. పంటలు ఏపుగా పెరిగే కాలంలో *‘కార్తీక శుద్ధ చవితి’నాడు* మనం *‘నాగుల చవితి’ని*  పర్వదినంగా ఆచరిస్తున్నాం.


పాములకు ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు !.


పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్ప జాతీ నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి.  రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తీకుణ్ని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి  విద్యానైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు.


*‘సర్ప హింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని , వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం’* అంటాడు ఆస్తీకుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి , సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితినాడు ఈ కథ వింటే , నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం.


పంట పొలాలకు శత్రువులు ఎలుకలు , వాటిని నిర్మూలించేవి పాములు. అవి క్రమంగా కనుమరుగైతే , మానవాళి మనుగడకే ప్రమాదం. నాడు ఆస్తీకుడు వంటి విజ్ఞాని ప్రబోధం వల్ల జనమేజయుడు ప్రభావితుడయ్యాడు. అదే ఉద్బోధతో మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది నాగుల చవితి పండుగ ! ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివునికి వాసుకిగా , విష్ణువుకు ఆది శేషుడుగా తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి రోజు విశ్వాసం గల భక్తుల పూజ నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. 


*ఆధ్యాత్మిక యోగా పరంగా :-* ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను *' వెన్నుపాము'* అని అంటారు. అందులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో *"పాము"* ఆకారమువలెనే వుంటుందని *"యోగశాస్త్రం"* చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ ! కామ , క్రోధ , లోభ , మోహ , మద , మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ  మానవునిలో *'సత్వగుణ'* సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు *' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది , అందరి హృదయాలలో నివసించే ' శ్రీమహావిష్ణువు"* నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వార తెలుస్తుంది.


నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం*


పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాం. అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం , శివం , సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది.  ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము , యోగము , భోగమనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాలసారం , సకల జీవనసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం.


*”దేవా: చక్షుషా భుంజానా: భక్తాన్‌ పాలయంతి”* అనేది ప్రమాణ వాక్యం , అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి.


*నాగుల చవితి మంత్రం*

పాములకు చేసే ఏదైనా పూజ , నైవేద్యం నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు. అందువల్ల ఈ రోజు ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం నాగులు చవితి పూజా సమయంలో కొలుస్తారు. అంతేకాకుండా పాముకు పాలను సమర్పిస్తుంటారు. చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజ దోషం , కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుభ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి.

అనంత

వాసుకి

శేష

పద్మ

కంబాల

కర్కోటకం

ఆశ్వతార

ధృతరాష్ట్ర

శంఖపాల

కలియా

తక్షక

పింగళ

ఈ ప్రపంంచంలో పాములు, ఆకాశం , స్వర్గం , సూర్యకిరణాలు , సరస్సులు , బావులు చెరువులు నివసిస్తున్నాయి. ఈ రోజు ఈ సర్పాలను పూజించి ఆశీర్వాదాలు పొందుతారు.


*పాము పుట్టలో  పాలు పోసేటప్పుడు  ఇలా చేప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి .*


 *నడుము తొక్కితే నావాడు అనుకో* 

 *పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో* 

 *తోక తొక్కితే తోటి వాడు అనుకో* 

 *నా కంట నువ్వుపడకు నీకంట నేను పడకుండా చూడు తండ్రీ అని చెప్పాలి.* 


ప్రకృతిని పూజిచటం  మన భారతీయుల  సంస్కృతి.  మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము. అని అర్ధము.  పిల్లల చేత ఇవి చెప్పించటం ఎందుకంటే వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము.


మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత.  బియ్యం , రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులకు ఆహారంను పెట్టటం అన్నమాట.  ఉదాహరణకు చీమలకు ఆహారంగా పెడుతున్నాం.  పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చేవులకు పెడతారు.  ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని.

🪱🪱🪱🪱🪱🪱🪱🪱🪱

లోకాః సమస్తాః సుఖినోభవన్తు!

Hindu


 

Panchaag



⚜ శ్రీ రాంచోడ్ రాయి మందిర్

 🕉 మన గుడి : నెం 241





⚜ గుజరాత్ : డాకోర్


⚜ శ్రీ రాంచోడ్ రాయి మందిర్


💠 డాకోర్, గుజరాత్‌లోని తీర్థయాత్ర కేంద్రంగా మునుపటి దశలలో,శివ ఆరాధన స్థలం అయిన దంకనాథ్ ఆలయానికి ప్రసిద్ధి చెందింది.  తరువాతి దశలలో, ఇది 1772 A.D లో నిర్మించబడిన రాంచోద్రైజీ దేవాలయం యొక్క పెరుగుతున్న కీర్తితో వైష్ణవ కేంద్రంగా అభివృద్ధి చెందింది.

ప్రతి సంవత్సరం 70-80 లక్షల కంటే ఎక్కువ మంది యాత్రికులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు.


💠 శ్రీకృష్ణుడిని రాంచోడ్రైజీ అని ఎందుకు పిలుస్తారు?

శ్రీకృష్ణుడు జరాసంధునితో పోరాడుతూ మధురలో యుద్ధభూమి నుండి పారిపోయినప్పుడు అతనికి రాంచోర్ అని పేరు. 

రాంచోడ్జీ అంటే  "యుద్ధభూమిని విడిచిపెట్టినవాడు" అని అర్ధం 


💠 గోమతి రాంచోడ్రాయ్ సరస్సు ఒడ్డున ఉన్న డాకోర్‌లో ఉన్న దేవాలయం గుజరాత్‌లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా పరిగణించబడుతుంది.  కోట గోడలచే చుట్టబడి, ఈ గొప్ప ఆలయం డాకోర్ ప్రధాన బజార్ మధ్యలో ఉంది.  


💠 రాంచోడ్రాయ్ యొక్క ప్రధాన విగ్రహం 1 మీ ఎత్తు మరియు 45 సెం.మీ వెడల్పు మరియు నల్లని రాయితో  తయారు చేయబడింది.  విగ్రహం అన్ని ఖరీదైన బట్టలు మరియు నగలతో అలంకరించబడి ఉంటుంది. 

ప్రధాన దేవత యొక్క సింహాసనం బంగారం మరియు వెండితో చెక్కబడిన  కుర్చీ.



⚜ రాంచోడ్రైజీ ఆలయ చరిత్ర ⚜


💠 మహాభారత కాలంలో, డాకోర్ పరిసర ప్రాంతం 'హిదంబ' వాన్ (అడవి)గా ఉండేది.  అది చాలా దట్టమైన అడవి.  

ఋషులు తపస్సు కోసం తమ ఆశ్రమాన్ని స్థాపించడం ఒక ఆకర్షణగా మారింది.


💠 అదేవిధంగా, ఢాంక్ అనే రిషి ఈ ప్రాంతంలో తన ఆశ్రమం కలిగి ఉన్నాడు. 

తపస్సు చేస్తున్న సమయంలో పరమశివుడు అతని పట్ల సంతుష్టుడై, ఏదైనా కోరమని అడిగాడు.  ఆ తరువాత, డాంక్ రిషి తన ఆశ్రమంలో శాశ్వతంగా ఉండమని శివుడిని అభ్యర్థించాడు.

అతని అభ్యర్థనకు శివుడు అంగీకరించాడు.  అతను అదృశ్యమయ్యాడు మరియు అతని ప్రతిరూపాన్ని లింగ రూపంలో వదిలివేశాడు, దీనిని దంకనాథ్ మహాదేవ్ అని పిలుస్తారు.  అందువల్ల పురాతన కాలంలో, డాకోర్‌ను దంకాంత్ మహాదేవ్ పేరు మీదుగా 'డాంకోర్' అని పిలిచేవారు.


💠 ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని శ్రీ గోపాలరావు జగన్నాథ తాంబ్వేకర్ క్రీ.శ.1772లో లక్ష రూపాయలతో నిర్మించారు.

ఇది ఇటుక గోడలు మరియు రాతి స్తంభాలతో నిర్మించబడింది.


💠 రాంచోడ్రైజీ ఆలయం డాకోర్‌లోని దివ్యమైన దేవత విష్ణువు రూపంలో నాలుగు చేతులతో ఉంటుంది.

విష్ణువు తన చేతులలో శంఖం, కమలం,చక్రం  మరియు గద ధరించాడు.

దిగువ కుడి చేయి అభయ ముద్ర యొక్క భంగిమ, ఇది అతని వద్దకు వచ్చిన వారందరికీ రక్షణ ఇస్తుంది.

చేతిపై తామరపువ్వు ముద్ర ఉంది .

అతని కుడిచేతి వేణువును పట్టుకుంది .

పండుగల సమయంలో స్వామివారి చేతులు రత్నాలతో నిండిన బంగారు తొడుగులలో ఉంటాయి .


💠 ఈ ఆలయంలో పౌర్ణమి రోజులలో దర్శన సమయాలు భిన్నంగా ఉంటాయి మరియు దేవుడికి అదనపు భోగ్‌లు సమర్పించాలని కోరుకునే వైష్ణవుల సౌలభ్యం కోసం , డాకోర్ ఆలయ పథకంలో ఒక నిబంధన ఉంది మరియు తదనుగుణంగా, మహాభోగ్ , రాజ్‌భోగ్ మరియు అదనపు భోగ్‌లను దేవుడికి సమర్పిస్తారు.


💠 ప్రతి భోగ్ యొక్క ప్రాముఖ్యత మరియు దర్శనాలతో కూడిన ఆచారం ఆలయానికి చాలా ముఖ్యమైనది.


🔅 మంగళ దర్శనం - 

ఇది తెల్లవారుజామున  మొదటి దర్శనం. గోకులంలో ఉన్నప్పుడు, రాంచోద్రైజీని తన తల్లి యశోద యొక్క అదే ఆప్యాయత మరియు ప్రేమతో మేల్కొల్పడం యొక్క భావోద్వేగం ఈ దర్శనంలో కనిపిస్తుంది. 

మంగళ అనే పేరు భగవంతుని దర్శనంతో రోజును ప్రారంభించడం యొక్క శుభసూచకతను నొక్కి చెబుతుంది.


🔅 శృంగార్ దర్శనం -

సాధారణంగా మంగళ దర్శనం తర్వాత 45 నిమిషాల తర్వాత శృంగార దర్శనం ఉంటుంది.

రాంచోడ్రైజీ మెడలో పూల దండతో అలంకరిస్తారు . అతనికి డ్రై ఫ్రూట్స్ మరియు స్వీట్లు అందిస్తారు, ఆ తర్వాత వేణువును అతని భుజంపై ఉంచుతారు.


🔅 గ్వాల్ భోగ్ దర్శనం -

శృంగార్ దర్శనం తర్వాత, గ్వాల్ దర్శనం.

ఈ దర్శనం సమయంలో భగవంతుడు తన మధ్యాహ్న అల్పాహారం , పెరుగు మరియు తేలికపాటి ఆహారం తీసుకుంటాడు.

గ్వాల్ దర్శనం  రాంచోద్రైజీ తన ఆవులను పచ్చిక బయళ్లకు తీసుకెళ్లి తన స్నేహితులతో ఆడుకునే సమయాన్ని వర్ణిస్తుంది .


🔅 రాజ్‌భోగ్ దర్శనం -

ఈ దర్శన సమయంలో రాంచోడ్రైజీకి రోజు ప్రధాన భోజనం అందించబడుతుంది . తామరపూలతో, పూలమాలలతో, వేణువుతో అలంకరింపజేస్తారు.

 

🔅 ఉత్థాపన్ దర్శనం -

మధ్యాహ్న సమయంలో ఉత్థాపన్ దర్శనంలో

రాంచోడ్రైజీ తన మధ్యాహ్న నిద్ర నుండి మేల్కొంటాడు.


🔅 శయన్ దర్శనం –

శయన దర్శనం అనేది  రాంచోడ్రైజీ తేలికపాటి భోజనం ముగించిన ఆ రోజుకి చివరి దర్శనం . ఈ సమయంలో నెమలి ఈకలతో తయారు చేయబడిన వింజామరని  ప్రజల దృష్టిలో చెడు కన్ను ప్రభావం లేకుండా ఉండేందుకు ఊపుతారు.


 💠 ఈ ఆలయంలో చైత్ర మరియు అశ్విన్ పూర్ణిమ ముఖ్యమైన తిధులు.

ఆ రోజుల్లో లక్ష మందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకుంటారు మరియు వైష్ణవ ఉత్సవాలు జరుపుకుంటారు

 

💠 హోలీ, అమలకి ఏకాదశి,జన్మాష్టమి, నంద మహోత్సవ్, రథయాత్ర మరియు దశరా. ఈ ఉత్సవాల్లో భక్తులు కృష్ణుడి విగ్రహాన్ని ఏనుగుపై ఊరేగిస్తారు.


 💠  నడియాడ్ నుండి 33 కి.మీ

అష్టైశ్వర్యాల గురించిన వివరణ

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*అష్టైశ్వర్యాల గురించిన వివరణ...*


*(ఇరవై తొమ్మిదవ రోజు)*


"నీ వద్ద ఉన్న అష్టైశ్వర్యాల గురించి నీకు తెలుసా?.." అని స్వామివారు అడిగిన ప్రశ్నకు ప్రభావతి గారు కొద్దిగా అయోమయానికి గురయ్యారు..తనకు తెలీదన్నట్లుగా తలూపారు..


శ్రీ స్వామివారు మందహాసం చేస్తూ.."అమ్మా!..ఉన్నత వంశంలో..మంచి తల్లిదండ్రులకు జన్మించటం అన్నది దైవం ఇచ్చిన ఐశ్వర్యం కాదా?..

"ఆ తల్లిదండ్రుల ద్వారా చిన్న వయసులోనే మంత్రోపదేశం పొందటం మహా ఐశ్వర్యం కాదా?.."

"ఉపదేశం పొందిన మంత్రాన్ని విడవకుండా జపించే భాగ్యం ఎంతమందికి కలుగుతుంది..అంతకంటే ఐశ్వర్యం మరోటి ఉందా?.."

"నిన్ను అర్ధం చేసుకుని, నీ మనసు తెలుసుకొని, పరిపూర్ణ ప్రేమను పంచి ఇచ్చే భర్త దొరకడం నీకు లభించిన మహాదైశ్వర్యం కాదా?.."

ఉన్నంతలో చదువు, సంధ్య, రూపు, గుణము కలిగిన బిడ్డలు నీకు ఆ దైవం ఇచ్చిన సంపద కాదా?.."

"నిత్యమూ అతిధి అభ్యాగతులతో కళ కళ లాడే గృహము..అతిధికి అన్నం పెట్టాలనే సదాలోచన మహా ఐశ్వర్యం కాదా?.."

దైవం పాదాల చెంత వుండి.. నిరంతరమూ ఆ సేవ చేసుకునే అవకాశం కలిగివుండటం ఐశ్వర్యమే కదా?.."

అమోఘమైన రచనా శక్తి, పాండిత్యం..నీకు భగవంతుడు అయాచితంగా ప్రసాదించాడు..అదెంతటి భాగ్యమో నీకు తెలీదా?.."

"ఎంత ధనం వెచ్చిస్తే..పైవాటిని నువ్వు కొనగలవు?..చెప్పు తల్లీ!.."


"అమ్మా..కొందరికి అలవిమాలిన ధనం ఉంటుంది..కానీ శరీరం లో వ్యాధులుంటాయి..ఏదీ తినడానికి కుదరదు..మందులతోనే జీవనం కొనసాగించాలి..కొందరికి మానసిక బాధలుంటాయి..భార్యా భర్తల్లో ఒకరికొకరికి అవగాహన లేక..అనుమానాలతో సంసారం చేయలేక చేస్తూ ఉంటారు..ఒకరినిఒకరు మోసగిచ్చుకుంటూ.. ఐహిక సుఖాలకోసం ఎక్కడికో పరుగులెత్తుతూ వుంటారు..కొందరికి సంతానం ఉండదు..అందుకు బాధ..సంతానం వున్నా అవయవ లోపం తో వుంటారు..అది మరో నరకం..ఇలా రకరకాల వ్యక్తులు ధనం వుండికూడా..క్షోభ అనుభవిస్తుంటారు..ధనం ఒక్కటే ఐశ్వర్యం కాదమ్మా..దైవాన్ని ధనం ఇమ్మని అడగడమంత పిచ్చిపని మరోటి లేదు.."


"సరే తల్లీ..నీకు ధనం కావాలా?..ఎంత కావాలో చెప్పు ఇస్తాను..అయితే అందుకు ప్రతిఫలంగా నువ్వు..నీ భర్తను త్యాగం చేస్తావా?..నీ బిడ్డలను వదలుకుంటావా?..నీకు దైవం ఇచ్చిన ఈ వాతావరణాన్ని త్యజిస్తావా?..నీకబ్బిన పాండిత్యాన్ని వదిలేస్తావా?..ఏది త్యాగం చేయగలవో చెప్పు!.." అన్నారు..


శ్రీ స్వామివారి ముఖతా వస్తున్న మాటలు ఒక్కొక్కటీ సూటిగా ప్రభావతి గారినే కాదు..మిగిలిన ఇద్దరికీ తాకాయి..ప్రభావతి గారికి తానెంత ప్రలోభములో పడి ఉన్నదీ గ్రహించేసారు.. ఒక్కక్షణం లోనే ఆవిడ ఒక నిశ్చయానికి వచ్చేసారు..నిజమే..ధనం అవసరమే..కానీ..ధనమే సర్వస్వం.. ధనమే ఐశ్వర్యం కాదు..అది శ్రీ స్వామివారు మనసుకు నాటుకునేలా బోధించారు..


"నాయనా..నాకు దైవం ప్రసాదించిన ఆమోఘ సంపదలలో ఏ ఒక్కటీ వదులుకోను!..ఆర్ధిక బాధలున్నా భరిస్తాను!..సహిస్తాను!..ఇక కలతపడను వాటి గురించి.." అన్నారు మనస్ఫూర్తిగా..


శ్రీ స్వామివారు సంతోషంగా నవ్వారు..శ్రీధరరావు గారు కూడా శ్రీ స్వామివారి వివరణకు సంతృప్తిగా తలాడించారు..


"అమ్మా!..నేను నిన్ను అష్టాక్షరీ మంత్రం రోజూ 108 సార్లు జపించమని చెప్పాను..రోజూ చేస్తున్నావా?..అని శ్రీ స్వామివారు అడిగారు..


"చేస్తున్నాను నాయనా!.." అన్నారు ప్రభావతి గారు.


"అష్టాక్షరీ తిరుమంత్రం నీకు మాలకొండవద్ద ఉపదేశించాను..ఇక ఆ అష్టాక్షరి గురించిన పూర్తి వివరణ నీకు తెలుపుతానమ్మా..శ్రద్ధగా వ్రాసుకో..ఆ కాగితం జాగ్రత్తగా ఉంచుకో!..హృదయస్తం చేయి తల్లీ..అత్యంత గోప్యంగా ఉంచు..అహంకారంతో ఎవరికి పడితే వాళ్లకు చూపకు.." అన్నారు..


మంత్రార్ధము..ఛందస్సు..ఋషి..ఋషిపరంపర.. సర్వం వివరంగా చెప్పారు..ప్రభావతిగారు శ్రద్ధగా వ్రాసుకున్నారు..


ఆ తరువాత..తన బసకు వెళ్లిపోయారు..


శ్రీ స్వామివారి ప్రవర్తన..మాటలు..ఉపదేశం..రేపటి భాగంలో..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

విదురనీతి

 విదురనీతి

సుధన్వోవాచ - సుధన్వుడన్నాడు.

శ్లో)గాంప్ర దద్యా స్త్వౌరసాయ యద్వాన్యత్స్యాత్ ప్రియం ధనమ్ |

ద్వయోర్వివదతోస్తథ్యం వాచ్యం చ మతిమాం స్త్వయా॥


అ)నీ కుమారునికి గోవును గాని, ఇతర ప్రియమైన ధనాన్ని కాని ఇచ్చుకొమ్ము బుద్ధిశాలీ! వివాద పడుతున్న మా ఇద్దరికి సత్యమైన సమాధానాన్నే చెప్పుము

: ఉద్ధవగీత

శ్లో)కిం భద్రం కిమభద్రం వా ద్వైతస్యావ స్తునః కియత్ | వాచోదితం తదనృతం మనసా ధ్యాతమేవ చ ॥


అ)అవస్తువై అద్వైతమునందు ఏది మంచిది ఏది చెడ్డది లేదా ఎంత మంచిది ఎంత చెడ్డది యను ప్రశ్నయే యుండదు కాని వాక్కులచే జెప్పబడిన మనస్సుచే చింతిత మైన వస్తువు అన్నియు మిథ్యాభూతములే యని తెలిసికొనవలెను

పుష్పాలు వాటి ప్రాధాన్యత*

 *పుష్పాలు వాటి ప్రాధాన్యత*


*పర్వతమంత బంగారాన్ని భగవంతునికి సమర్పించినంత పుణ్యం, ఒక్క సంపంగి పువ్వును సమర్పిస్తే వస్తుంది.*


*సౌవర్ణాచ్చ ప్రసూనాస్తూ, మత్ర్పియం నాస్తి పాండవ*

*మేరుతుల్య సువర్ణాని, దత్త్వా భవతియత్ఫలం*

*ఏకేన స్వర్ణ పుష్పేన, హరిం సంపూజ్య తత్ఫలం*

*సువర్ణ కురుమైర్దివ్యై,* *యైర్నధితో హరి:*

*రత్న హీనై: సువర్ణాద్యై:,* *సభవేజ్జన్మ జన్మని*

*సంపంగి పూలతో పూజచేయనివాడు* 

*మరుజన్మలో సువర్ణ రత్నాల హీనుడవుతాడు.*

*ఆయుష్షుకోసం దుర్వారపూలతో,* 

*సంతానంకోసం దత్తొరపూలతో*

*రుద్రదేవుని పూజించాలట.*

*ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధమైన పూలతో* 

*శ్రీహరిని అర్చించితే పుణ్యప్రాప్తి కలుగుతుంది.* 

*చైత్రమాసంలో కమలాలు, జాజులు, సంపంగి పువ్వులు, బిల్వపత్రాలు,*

*వైశాఖ మాసంలో మల్లెపూవులు,*

*ఆషాఢమాసంలో కమలాలు, కదంబపుష్పాలు,*

*శ్రావణ మాసంలో అవిశెపూవులు, దూర్వారాలు,* 

*భాద్రపదంలో సంపంగులు, మల్లెలు, సింధూరాలు,*

*ఆశ్వయుజ మాసంలో తీగమల్లెలు, మల్లెపూవులు,* 

*కార్తీకంలో కమలాలు, సంపంగులు,*

*మార్గశిరమాసంలో బకుళ పుష్పాలు,* 

*పుష్యమాసంలో తులసి,* 

*మాఘ, ఫాల్గుణ మాసాల్లో అన్ని రకాల పుష్పాలు* *శ్రీమహావిష్ణువు పూజకు ఉపయోగించడంవల్ల* 

*విశేష పుణ్యప్రాప్తి కలుగుతుంది.*

*సాధారణంగా చెట్టునుంచి ఆరోజు కోసిన పూలను జలంతో ప్రోక్షించి స్వామి పూజకు ఉపయోగిస్తుంటాము* 

*కానీ, కొన్ని పుష్పాలను కొన్ని రోజులపాటు నిలువ ఉంచిన తరువాత కూడా పూజకు ఉపయోగించవచ్చు.*

*ఉదాహరణకు..*

*కమలాలను పదకొండు రోజులవరకు నిలువ ఉంచినప్పటికి పూజకు వినియొగించవచ్చని ‘భవిష్యపురాణం’ పేర్కొంటోంది.* 


*బిల్వ పత్రాలను, తులసీదళాలను, అవిశపూలను, వాడిపోయినప్పటికీ పూజకు ఉపయోగించవచ్చు.*

ఒకవేళ ఈ పువ్వులు చిద్రమైనప్పటికీ పూజకు ఉపయొగించవచ్చని ‘మేరుతంత్రం’ చెబుతోంది.

శ్రీరుద్రాభిభిషేక

 *_-శ్రీరుద్రాభిభిషేక ద్రవ్యఫలము_-*


శ్లో!! పయసా సర్వసౌఖ్యాని దధ్నా౽రోగ్యం బలంయశః! ఆజ్యేనైశ్వర్యవృద్ధిశ్చ దుఃఖనాశశ్చ శర్కరా !! తేజోవృద్ధిశ్చ మధునా ధనమిక్షురసేనవై| సర్వసంపత్సమృద్ధిశ్చ నారి కేళజలేనచ!! 

మహాపాపాని నశ్యంతి తక్షణాద్భస్మ వారిణా! గంధతోయేన సత్పుత్ర లాభశ్చా౽త్రన సంశయః!! భూలాభః పుష్పతోయేణ భాగ్యం బిల్వజలేనవై| దూర్వాజలేనలభతే నా౽న్యధా నష్ట

సంపదః!! అపమృత్యుహరంచైవ తిల తైలాభిషేచనం| 

రుద్రాక్ష సలిలేనైవ మహతీం శ్రియమాప్నుయాత్!!

స్వర్ణోదకాభిషేకేన ఘోర దారిద్ర్య నాశనం| 

అన్నేన రాజ్యసంప్రాప్తి ర్మోక్ష మాయుస్సు జీవనం!!

ద్రాక్షారసేన సర్వత్ర విజయం లభతే ధృవం! 

ఖర్జూర ఫలసారేణ శత్రుహాని ర్భవిష్యతి!!

వైరాగ్యంలభతే జంబూఫలసారేణ వైజగుః‌| కస్తూరీ సలిలేనైవ చక్రవర్తిత్వ మశ్నుతే!!

నవరత్నామ్బునా ధాన్య గృహ గోవృద్ధి రుచ్యతే| రసాలఫలసారేణ దీర్ఘ వ్యాధి వినాశనం!! 

హరిద్రవారిణా లింగస్నానంవై మంగళప్రదమ్| రుద్రస్నానఫలాన్యే తాన్యుచ్యంతే మునిభిః పురా!!

*( _-రుద్రకామ్యార్చనావిధౌ-_)*


తా॥ ఆవుపాలతో శివునభిషేకించిన సర్వసౌఖ్యములు, 

ఆవు పెరుగుతో ఆరోగ్య బల యశస్సులు కలుగును.... ఆవునేయితో ఐశ్వర్యవృద్ధి, మెత్తని పంచదారతో దుఃఖనాశనము, తేనెతో తేజోవృద్ధి, చెరుకురసముతో ధనవృద్ధి..... కొబ్బరినీళ్ళతో సర్వ సంపద్వృద్ధి, భస్మజలముతో మహాపాపహరము, సుగంధోదకముతో పుత్రలాభము, పుష్పోదకముతో భూలాభము, బిల్వజల ముతో భోగభాగ్యములు, దూర్వోదకముతో నష్టద్రవ్యప్రాప్తి, నువ్వులనూనెతో అపమృత్యుహరము, రుద్రాక్షోదకముతో మహ దైశ్వర్యము, సువర్ణ జలముతో దరిద్రనాశనము, అన్నముతో రాజ్వప్రాప్తియు, ఆయుర్వృద్ధి, సుఖజీవనము, మోక్షప్రాప్తి, ద్రాక్షపండ్లరసముతో సకలకార్యజయము, ఖర్జూరఫలరసముతో శతృవులకు హాని, నేరేడుపండ్ల రసముతో వైరాగ్యము, కస్తూరీ జలముతో చక్రవర్తిత్వము, నవరత్నజలముతో ధాన్య, గృహ, గోప్రాప్తి, మామిడిపండ్ల రసముతో దీర్ఘవ్యాధి నాశనము, పసుపునీళ్ళతో సౌభాగ్యము మంగళ ప్రదము...

ఆయా ద్రవ్యములతో పరమశివునకభిషేకము చేసిన "ఆయా ఫలములు కలుగునని పూర్వము మహర్షులచే చెప్పబడినది...... 

==========================

శ్లో॥ దశాపరాధాస్తోయేన క్షీరేణ శతనాశనం | 

సహస్రం శమతేదధ్నా ఘృతేనత్రి సహస్రకం॥

మధునా పంచసాహస్రం శర్కరాష్ట సహస్రకం | 

ఆయుతం చేక్షుసా రేణ నియుతామ్రరసేనచ॥

నారికేళోదకం చైవ చాయుతత్రయ నాశనం॥ ద్రాక్షారసేనార్బుదంచ తై లేనత్వర్బుదద్వయం| 

అనంతం గంధతోయేన అభిషేకం శివస్యచ॥  

*( _-ఇతి యోగజాగమే-_)*


తా॥ శంకరునకు స్వచ్ఛమైన జలముచే అభిషేకము చేసిన 10 అపరాధములు చేసిన దోషము పోవును.... ఆవుపాలతో 100, ఆవు పెరుగుతో 1,000, ఆవునేయితో 3,000, పట్టుతేనెతో 5,000, పంచదారపానకముతో 8,000, చెరకు రసముతో 10,000, మామిడిపండ్లరసముతో 20, 000, కొబ్బరినీళ్ళతో 30,000 .. ద్రాక్షపండ్లరసముతో ఒక అర్బుదము, నువ్వులనూనెతో రెండు అర్బుదములు,పన్నీరుతో లెక్కలేనన్ని అపరాధములు చేసిన దోషముపోవును......గాన వారి శక్త్యానుసారముగా పై ద్రవ్యములతో రుద్రునభిపేకించి దోషవిముక్తు లగుదురుగాక...

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


జనమేజయా ! ఈ రకంగా రవిపుత్రులైన అశ్వినులు చ్యవనుడి తపోబలంతో సోమపాయులు

అయ్యారు. అప్పటినుంచీ ఆ మహర్షీ, ఆ సరస్సూ, ఆ ఆశ్రమం, ఆ యజ్ఞభూమీ అన్నీ చాలా విఖ్యాతిని

పొందాయి.

రేవతుడి సత్యలోక యాత్ర

సూర్యవంశంలోపుట్టి ఇంతటి ప్రసిద్ధిని పొందిన శర్యాతికి అనర్హుడనే కుమారుడు జన్మించాడు.

అతడికి రేవతుడు జన్మించి రాజ్యం పాలించాడు. ఇతడు సముద్ర గర్భంలో కుశస్థలి అనే మహానగరం

నిర్మింపజేసి అరిందముడై సకలభోగాలూ అనుభవించాడు. ఇతడికి నూర్గురు పుత్రులు ప్రభవించారు.

వారిలో కకుద్మి జ్యేష్ఠుడు. కడసారిగా ఆడపిల్ల పుట్టింది. శుభలక్షణ సంపన్న. సుందరాంగి. పేరు రేవతి.

యుక్తవయస్కురాలు అయ్యింది. రేవతుడు రైవతాద్రికి వచ్చి అనురూపభర్తకోసం రాజపుత్రుల్లో అన్వేషణ

సాగించాడు. ఎవరికి ఇవ్వడమా అనేది ఎంతకూ తేలలేదు. సర్వజ్ఞుడైన సృష్టికర్తనే అడుగుదామనిపించి

రేవతిని వెంటబెట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. యజ్ఞాలూ ఛందస్సులూ పర్వతాలూ సముద్రాలు

నదులూ దివ్యరూపధారులై ఋషులతో దేవతాజాతులతో కలిసి బ్రహ్మసభలో సమావిష్టులై కనిపించారు.

అందరూ ముకుళిత హస్తాలతో ముక్తకంఠంతో బ్రహ్మను స్తుతిస్తున్నారు.

(అధ్యాయం-7, శ్లోకాలు-522

వ్యాసమహర్షీ ఇక్కడ నాదొక సందేహం. రేవతుడు రేవతితో సహా బ్రహ్మలోకానికి

వెళ్ళాడంటున్నావు. నేను లోగడ విన్నదాని ప్రకారం బ్రహ్మజ్ఞానియై శాంతచిత్తుడైన బ్రాహ్మణుడు

మాత్రమే బ్రహ్మలోకానికి వెళ్ళగలడు. కూతురిని తీసుకుని ఒక క్షత్రియుడు ఎలా వెళ్ళగలిగాడు?

మానవుడై పుట్టి మానవదేహంతో స్వర్గలోకానికిగానీ బ్రహ్మలోకానికిగానీ ఎవరైనా వెళ్ళగలరా? అది

దుష్ప్రపం అంటారు. అలా వెళ్ళిన వారికి మళ్ళీ భూలోకంలోకి ప్రవేశం ఉంటుందా ? ఉంటే

యథాతథంగా వస్తారా, ఏమైనా మార్పులుంటాయా ? ఈ సందేహాలు నువ్వే తీర్చాలి

మాయం

 *మాయం..మాయం!!*


గుమస్తాలు మాయం.

కూలీలు మాయం.

కోడళ్ళ పనితనం మాయం.

అత్తమామల మాటసాయం మాయం.

అల్లుళ్ళ గౌరవహోదా మాయం.

పోస్టుమాన్ మాయం.

ఆసాంతం వినే వైద్యుడు మాయం.

చీర, రవిక మాయం.

పుస్తక పఠనం మాయం.

రేడియోకి శ్రోతలు మాయం.

పెరడు బావి మాయం.

సైకిలు మాయం. 

ఎండావకాయ మాయం.

కుంపటిపై దిబ్బరొట్టి మాయం.

మట్టి వాసన మాయం.

పిడతకింద పప్పు బండి మాయం.

వందరోజులాడే సినిమాలు మాయం.

అర్ధరాత్రయినా నిశ్శబ్దం లేని నిశిరాత్రులు మాయం.

ఉపాధ్యాయుడు మాయం కొంత వరకు.

కుంకుడుకాయ, సీకాకాయ మాయం.

వాకిట పూల మొక్కలు మాయం.

పిచ్చుకలు, సీతాకోకచిలుకలు మాయం. 

సత్తు గిన్నె చారు మాయం.

స్కూల్లో మైదానం మాయం.

సంఘంలో నిదానం మాయం.

వానపాము మాయం.

చెరువుల్లో ఆటలు మాయం.

కోతికొమ్మచ్చి కబడ్డీ మాయం.

అవ్వ గోచీ కూడా మాయం.

థూళి లేని గాలి మాయం.

పాళీ ఉన్న పెన్ను మాయం.

ఖాళీ ఉన్న స్నేహితుడు మాయం.

నిలకడగా కురిసే వాన మాయం.

నిర్మానుష్యమైన ఏకాంతం మాయం.

కంటికి నిద్ర మాయం.

వెన్నెల చూడాలనే కన్నులు మాయం.

పట్టుమని పదినిమిషాల ఏకాగ్రత మాయం.

హారన్ కూత లేని వీధి మాయం.

దోమలు లేని పార్కులు మాయం.

తోటమాలి కొలువే మాయం.

దాచుకుందామంటే వడ్డీరేటు మాయం.

'ఒక అల్లం పెసరె' అని కేక వేసే పాక హోటల్ మాయం.

సగం సగం పంచుకునే తేనీరు మాయం.

నిఖార్సయిన చేగోడీ, వడియం, అప్పడం మాయం.

ప్రేమ ప్రకటించే పొందిక ప్రేమ లేఖలు మాయం.

సాయంకాలం మల్లెపువ్వులు పెట్టుకుని కాటన్ చీరతో స్వాగతించే ధర్మపత్ని మాయం.

ఆఫీసు నుండి రాగానే నాన్నా నాకేమి తెచ్చావు అని ఎదురుపడే‌సంతానం మాయం.

ఏమండీ రాత్రికి ఏమి చేయమంటారు అని అడిగే ధర్మపత్ని మాయం.

ఎంతసేపు జొమేటో ప్రత్యక్షం.

ఎవరి చరవాణి లోకి వాళ్ళు మాయం.


 *అంతా సాంకేతిక మయం.*

*మనదైన సమయం కూడా మాయం.. ఇప్పటికీ అంతా అయోమాయం.*

 శివానందలహరీ 


05

స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ 

పురాణే మంత్రేవా స్తుతినటన హాస్యే ష్వచతురహ

కథం రాజ్ఞామ్ ప్రీతిర్భవతి మయి కో2హం పశుపతే 

పశుం మాం సర్వజ్ఞ ప్రధితకృపయా పాలయ విభో  



సీ. స్మృతి,పురాణములందు, స్తుతి,నాట్యములయందు

               శకున , వైద్య , నటన శాస్త్ర మందు

    సంగీత ,సాహిత్య, సారస్వతము లందు 

               చతుర , హాస్య , విదూష వితతు లందు

    నేర్పున్న విబుధుండ నే గాను పరమేశ !

               భావింప నన్నింట పశువు నేను

    అటువంటి నా మీద నవనీపతుల కెట్లు

               ప్రేమతో జీరంగ ప్రీతి గలుగు ?

తే. పశువు నగునన్ను పాలించ పరుడు లేడు

     పశుపతీ ! నీవు పాలించి భవము నందు

     కరుణ తోడను రక్షించి కావు మెపుడు

    భక్త మందార ! శంకరా ! పాహి పాహి !        05 *



                              06

ఘటోవా మృత్పిండోవా2ష్యణురపి చ ధూమోగ్నిరచల

పటోవా తంతు ర్వా పరిహరతి కిం ఘోరశమనమ్ 

వృథా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా 

పదాంభోజం శంభో ర్భజ పరమసౌఖ్యం వ్రజ సుధీ  



సీ. "మట్టి సాధనమౌను మఱి కుండలనుచేయ

              నా మట్టి యేర్పడు నణువు వలన

     ధూమంబు కొండపై తోచుచుండెను గాన

             నచ్చోట తప్పక యనలముండు

     ధరణిలో వస్త్రముల్ దారంబు వలననే

            నిర్మితం బగుచుండె నిక్కమిద్ది "

     యనుచు వ్యర్థంబుగా ననయంబు వాదించి

             తర్కించు కొనినచో దక్కు నేది ?

     యీ శుష్క వాదన లీతర్క వచనముల్

            శమను నాపగలేవు క్షణము గూడ

తే. భవ్యమైనట్టి పరమేశు పాదయుగళి

     భక్తి చిత్తాన బట్టంగ భవమునందు

     సర్వ పాపంబులన్నియు సమసిపోవు

     గరళకంఠ కృపోన్నతిన్ గల్గు ముక్తి.            06


✍️గోపాలుని మధుసూదన రావు శర్మ 🙏

 *భరతునిపట్నం* సమూహ మిత్రులారా! 

మన గ్రూపులో ఎటువంటి స్పర్ధలు లేకుండే విధంగా అందరికి అన్ని విధాలా ఇష్టపడేవి, నచ్చేవి, సంతోషపెట్టేవి, విజ్ఞానదాయకమైనవి, వ్యాపారాభివృద్ధికి సంబంధించినవి, ఛలోక్తులు, కవిత్వం, పాండిత్యం, సాహిత్యం  మీకు నచ్చిన, మీరు మెచ్చిన, మీకు వచ్చిన మీకు నొచ్చిన ఒకటేమిటి అన్ని విషయాలను పంచుకోవచ్చు. విమర్శలు, చర్చలు మాత్రం దయచేసి చేయవలదు. 

ఒకరిని కించపరచేవి కాని, విమర్శించేవి కాని, రాజకీయసంబంధమైనవి కాని, ప్రభుత్వ వ్యతిరేకమైనవి కాని మన గ్రూపులో వలదు


 అనుమతించబడవు. కనుక ఎవరూ కూడా ఆవిధమైన సందేశములను మన "భరతునిపట్నం" గ్రూపులో .

పూజాకార్యక్రమాల సంకల్పము.

 **********

*శుభోదయం*

*********

సంధ్యా వందన మరియు 

ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.16.11..2023

బృహస్పతివాసరే( గురువారము)

**************

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతాు హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే

శరదృతౌ

కార్తీక మాసే శుక్ల పక్షే తృతీయాయాం (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

బృహస్పతివాసరే

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.


ఇతర పూజలకు

శ్రీ శోభకృత్  నామ సంవత్సరే దక్షిణాయనే

శరత్ ఋతౌ  కార్తీక మాసే  శుక్ల పక్షే  తృతీయౌపరి చతుర్ధ్యాం

బృహస్పతివాసరే  అని చెప్పుకోవాలి.


ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.6.08

సూ.అ.5.21

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 


శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు

కార్తీక మాసం 

శుక్ల పక్షం తదియ మ.12.53 వరకు. 

బృహస్పతివాసరే.

నక్షత్రం మూల రా.తె.3.37 వరకు. 

అమృతం రా.9.24 ల  10.58 వరకు. 

దుర్ముహూర్తం ఉ.9.52  ల 10.37 వరకు. 

దుర్ముహూర్తం మ. 2.21 ల 3.06 వరకు. 

వర్జ్యం మ. 12.00 ల 1.34 వరకు. 

వర్జ్యం తె. 2.03 ల 3.37 వరకు. 

యోగం సుకన్య ప. 11.48 వరకు.

కరణం గరజి మ.12.53 వరకు. 

సూర్యోదయము ఆరోగ్య ఉ.6.00 గంటలకు అయితే.

రాహు కాలం మ . 1.30 ల 3.00 వరకు. 

గుళిక కాలం ఉ.9.00 ల 10.30  వరకు. 

యమగండ కాలం ఉ.6.00 ల7.30  వరకు. 

***********

పుణ్యతిధి కార్తీక శు.చవితి.

.**********

*శ్రీ పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,

(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)

S2,/C92, 6 -3 -1599/92,బి 

M3 66579.

.**********

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

విస్తరిస్తుంది

 శ్లోకం:☝️

*యస్తు సంచరతే దేశాన్*

 *యస్తు సేవేత పండితాన్ l*

*తస్య విస్తారితా బుద్ధిః*

 *తైలబిందు రివాంభసి ll*


భావం: ఎవరు దేశాలు తిరుగుతారో, ఎవరు పండితులను సేవిస్తారో, వారి బుద్ధి నీటిలో పడిన నూనె బిందువులా విస్తరిస్తుంది!

పంచాంగం 16.11.2023

 ఈ రోజు పంచాంగం 16.11.2023  Thursday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు  కార్తీక మాస శుక్ల పక్ష: తృతీయా  తిధి బృహస్పతి వాసర: మూల నక్షత్రం సుకర్మ యోగ: గరజి తదుపరి వణిజ కరణం ఇది ఈరోజు పంచాంగం.


తదియ మధ్యాహ్నం 12:36 వరకు.

మూల రాత్రి 02:17 వరకు.

సూర్యోదయం : 06:25

సూర్యాస్తమయం : 05:36

వర్జ్యం : రాత్రి 12:42 నుండి 02:15 వరకు .

దుర్ముహూర్తం : పగలు 10:09 నుండి 10:53 వరకు తిరిగి మధ్యాహ్నం 02:37 నుండి 03:22 వరకు. 


రాహుకాలం :  మధ్యాహ్నం 01:30  నుండి 03:00 వరకు.


యమగండం : ఉదయం 06:00 నుండి 07:30 వరకు.


శుభోదయ:, నమస్కార:

Gunta vonamaalu


 

Air beloon

 


నవగ్రహా పురాణం🪐* . *78వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *78వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*బుధగ్రహ చరిత్ర - 5*


అదే సమయంలో ... వేట శబ్దాలు వినవస్తున్న అటు వైపు అరణ్యంలో ఒక అద్భుత సంఘటన జరిగింది. మృగయా వినోదం వేటగాళ్ళకు విషాదంగా మారింది.


వైవస్వత చక్రవర్తి కుమారుడు , యువరాజు సుద్యుమ్నుడు సైన్యంతో అరణ్యంలో తన నిత్యవినోదమైన వేటను సాగిస్తున్నాడు. తన బాణానికి అందినట్టే అంది. చిటికెలో తప్పించుకుపోతున్న లేడిని సుద్యుమ్నుడు గుర్రం మీద వెంటాడుతున్నాడు.


ప్రాణ భయంతో లేడి వాయు వేగంతో దూసుకు పోతోంది. సుద్యుమ్నుడి అశ్వం తన యజమాని హృదయాన్ని అర్థం చేసుకున్నట్టు , లేడి వెళ్ళిన దారిలో పరుగెడుతోంది. నలుగురైదుగురు అశ్వికభటులు మాత్రం సుద్యుమ్నుడి వెంట తమ గుర్రాలను పరుగెత్తించగలిగారు.


అందాల జింక గాలిలో అంగలు వేస్తూ పరుగెడుతోంది. సుద్యుమ్నుడి అశ్వం , భటుల అశ్వాలూ నురగలు కక్కుతూ పరుగులు తీస్తున్నాయి.


హఠాత్తుగా కీకారణ్యం మధ్యలో ఒక సుందరమైన ఉద్యానవనం ప్రత్యక్షమైంది. యువరాజు సుద్యుమ్నుడూ , అశ్వికభటులూ ఆగారు. చుట్టూ చూశారు. లేడి జాడలేదు. ఉద్యానవనంలోకి జొరబడి ఉంటుందన్న అనుమానంతో సుద్యుమ్నుడు తన గుర్రాన్ని అదలిస్తూ - ఎదురుగా ఉన్న వనంలోకి ప్రవేశించాడు. అతని వెనుకనే అశ్వికులూ...


ఎల్ల దాటి , ఉద్యానవనంలో ప్రవేశించిన క్షణంలో , అకస్మాత్తుగా జరిగిపోయింది. ఆ మహాద్భుతం ! యువరాజు సుద్యుమ్నుడూ , భటులూ క్షణంలో స్త్రీలుగా మారిపోయారు ! వాళ్ళు ధరించిన వస్త్రాలు కూడా స్త్రీల వస్త్రాలుగా మారిపోయాయి. సుద్యుమ్నుడి జవనాశ్వంతో పాటు భటులు ఎక్కిన పోతు గుర్రాలూ ఆడ గుర్రాలుగా మారిపోయాయి !


నిర్ఘాంతపోయిన వాళ్ళందరూ గుర్రాల మీద నుంచి దిగారు. ఒకరినొకరు చూసుకుంటూ ఆశ్చర్యంలో మునిగిపోయిన వాళ్ళందరూ తమను తాము స్త్రీలుగా గుర్తించి , ఆందోళనలో పడిపోయారు.


గుర్రాలన్నీ ఉద్యానవనం దాటి అరణ్యంలోకి యధేచ్చగా వెళ్ళిపోతున్నాయి. ఆడవాళ్ళుగా మారిపోయిన భటులు మంత్రముగ్ధుల్లాగా ఆ అశ్వాల వెంట వెళ్ళసాగారు.


ఆశ్చర్యం నుంచి చాలా సేపటికి గానీ యువరాజు సుద్యుమ్నుడు కోలుకోలేక పోయాడు. నివ్వెరపాటు నుండి తేరుకున్న సుద్యుమ్నుడు స్త్రీ లక్షణాలు కుప్ప పోసినట్టున్న తన శరీరాన్ని తడిమి చూసుకున్నాడు. గుర్రాల సకిలింతలూ , వాటితో పాటు స్త్రీల కంఠ స్వరాలూ వినవస్తున్నాయి. భయాందోళనలతో ఉక్కిరిబిక్కిరవుతున్న సుద్యుమ్నుడు. గొంతెత్తి భటులను పిలిచాడు. అతను విన్న అతని కంఠస్వరం మరోసారి సుద్యుమ్నుడిని ఆశ్చర్యజలపాతంలో పడద్రోసింది. తనది పురుషకంఠం కాదు , స్త్రీ కంఠం ! కోమలమైన స్త్రీ కంఠం !


జరిగిన అద్భుతం ఎలా జరిగిందో , ఎందుకు జరిగిందో ఊహించే శక్తి లేని సుద్యుమ్నుడు ఎదురుగా ఆకాశానికి పట్టిన అద్దంలా కనిపిస్తున్న చిన్న కొలను వైపు అడుగులు వేశాడు. తన నడకలో మునుపటి ఠీవీ , గాంభీర్యం కొరవడ్డాయనీ , వాటి స్థానంలో కులుకూ , వయ్యారం , సౌకుమార్యం వచ్చి చేరాయని అర్ధమవుతోంది సుద్యుమ్నుడికి.


సుద్యుమ్నుడు నీటి అంచున నిలుచుని కొలని లోనికి తొంగి చూశాడు.


నీటిలోంచి అద్భుత సౌందర్యవతి అయిన యువతి అతని వైపు చూస్తోంది. తన ప్రతిబింబం ! సుద్యుమ్నుడు సాలోచనగా తన ఎద మీద ఉన్న పయ్యెదను తొలగించి , నీటిలో చూశాడు. అతని గుండె దడదడ కొట్టుకుంది. కొన్ని నిమిషాల క్రితం దాకా విశాలంగా ఉన్న తన వక్షస్థలం ఇప్పుడు ఉన్నత వక్షస్థలంగా మారిపోయింది ! తన ప్రస్తుత వక్షభాగం కొలనిలోని జంట తామర మొగ్గలను గుర్తు చేస్తోంది ! సుద్యుమ్నుడు. మంత్రముగ్ధుడిలాగా నీటిలో ప్రత్యక్షమవుతున్న తన నీడని - 'ఆడనీడని' చూస్తూ. ఉండిపోయాడు. అణువణువూ పరిశీలిస్తూ ఉండిపోయాడు. తాను ధరించిన పురుష సంబంధమైన ఆభరణాలన్నీ కూడా స్త్రీ అలంకారులుగా మారిపోయి ఉన్నాయి ! ఎంత విచిత్రం !


నీటిలో నీడ తనకు కనువిందు చేస్తున్న సౌందర్యాన్ని కన్నార్పకుండా చూస్తున్న సుద్యుమ్నుడు , అప్రయత్నంగా పైట వేసుకున్నాడు. నీడలో కనిపిస్తున్న తనని చూస్తూ *"ఇలా !"* అంటూ సంబోధించాడు, అసంకల్పితంగా !


'ఇల' దారితప్పినట్టు అడవిలో తిరుగుతూ ఉండిపోయింది. తను ఇప్పుడు ఏం చేయాలి ? ఈ స్త్రీ రూపంలో రాజధానికి వెళ్తే , పౌరులు తనను యువరాజు సుద్యుమ్నుడుగా గుర్తించలేరు ! పరివారం గుర్తించరు. తండ్రి వైవస్వతుడు గుర్తించడు. తల్లి శ్రద్ధాదేవి కూడా గుర్తించదు ! తాను స్త్రీగా మారిపోయిన సుద్యుమ్నుడినని చెప్పడం చాలా ప్రమాదం. పిచ్చిపట్టిందనుకుంటారు ! పురుషులు తనను క్షేమంగా ఉండనివ్వరు ? ఏం చేయాలి ? తాను ఏం చేయాలి ? ఈ అరణ్యంలో ఒంటరిగా ఉండాలంటే భయం కలుగుతోంది. ఈ రూపంలో ఇప్పుడు లేడి కూనను చూసినా భయం కలుగుతోంది , పురుష రూపంలో సింహాలను ఎదిరించిన తనకు !


ఏదో శ్రవణానందం కలిగించే శబ్దం ఇల ఆలోచనలను తెంచివేసింది. ఏదో సంగీత వాద్యం... ఆ వాద్య సంగీత ధ్వని తనకు దగ్గరగా వస్తోంది. తనకు అభిముఖంగా వస్తున్న వ్యక్తిని ఇల ఆశ్చర్యంతో చూసింది. నారదమహర్షి ! ఆయన అంగుళీ స్పర్శతో వీణ రాగాలను ఒలుకుతోంది. నారదుడు ఆగి చూశాడు. వీణ మౌనం ధరించింది.


*"నారాయణ ! ఎవరమ్మా నీవు ? అందాలరాశివి ! అరణ్యంలో ఇలా సంచరించవచ్చా ?”* నారదుడు మందలిస్తున్నట్టు అన్నాడు. ఇలా సిగ్గుపడుతూ పైట సర్దుకుంది. నారదుడి వైపు నిష్కారణ భయంతో చూసింది.


*"నిన్నే !”* నారదుడు నవ్వుతూ అన్నాడు. *"మూగ సుందరివి కాదు కదా ! మాటలు వస్తాయి కదూ ! ఎవరు నీవు ?”*


*“... నా పేరు...నా పేరు ఇల"* ఇల అసంకల్పితంగా అంది.


*"ఇల ! అందానికి తగిన ఇంపైన నామధేయం !"* నారదుడు మెచ్చుకున్నాడు. *"ఎవరు నీవు ? ఇక్కడికి ఎందుకు వచ్చావు ? ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు ? నీలాంటి సుందరకాంత ఏకాంతంగా సంచరించడం బహు ప్రమాదం సుమా !"*


ఇల మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది. నారద మహర్షి రాజధానికి వచ్చిన సందర్భాల్లో తనను తన పురుష రూపాన్ని - చాలా సార్లు చూసి ఉన్నాడు. అయితే ఈ స్త్రీ రూపంలో పోల్చుకోలేకుండా ఉన్నాడు. ఆ దేవముని పోల్చుకోలేకపోతే ఇతరులు ఎవరు తనను పోల్చుకోగలరు ? తనకు దాపురించిన కష్టాన్ని వివరిస్తే , నారదమహర్షి ఏదైనా ఉపాయం ఉపదేశిస్తారేమో !


*“నా పేరు ఇల కాదు..."* మెల్లగా అంది.


*"నారాయణ ! కానప్పుడు కలగని చెప్పావా తల్లీ ? సరే నీ పేరేదో ఇప్పుడు చెప్పు ?”* నారదుడు నవ్వుతూ అన్నాడు.



*"నేను...నేను...స్త్రీని కాను...”*


నారదుడు ఎగాదిగా చూశాడు. *"నారాయణ ! స్త్రీవి కావా ? ఈ నారదుడు ఎంత బ్రహ్మచారి అయినా , చూడగానే స్త్రీలను పోల్చుకోగలడు !"*


*“నారదమహర్షీ ! మీకు వైవస్వత మహరాజుగారి పుత్రుడు సుద్యుమ్నుడు గుర్తున్నాడా ?”* ఇలా ప్రశ్నించింది.


*"చక్కగా గుర్తున్నాడు ! ఏం ? అతగాడేమైన నిన్ను వలపించి , వంచించాడా ?”* నారదుడు నవ్వుతూ అడిగాడు.


*“మీరు మరిచిపోయారు. నేను స్త్రీని కాదని చెప్పాను. నేను స్త్రీగా మారిపోయి కొన్ని ఘడియలైంది. "*


ఇలా వివరించడం ప్రారంభించింది.

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


*శ్లోకం*


*_భేషజం భవరోగిణాం అఖిలాపదామపహారిణం_*

*_దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం_*

*_భుక్తిముక్త ఫలప్రదం సకలాఘ సంఘనివర్హణం_*

*_చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః_*


_ *_శ్రీ చన్ద్రశేఖరాష్టకం -06_* _


*భా.  భవ రోగములను బాపే వైద్యుడై, సకల అశుభములను, ఆపదలను తొలగించే వాడైన, దక్షుని యజ్ఞమును నాశనము చేసిన, మూడు గుణములు, మూడు నేత్రములు కలిగిన, భక్తి, ముక్తి ప్రసాదించి, సర్వ పాపములను నాశనము చేసే _చన్ద్రుని ధరించిన ఆ చన్ద్రశేఖరుడిని పాహి అన్నాను, ఇంక నన్ను ఆ యమ ధర్మరాజు ఏమి చెయ్యగలడు?_*


🧘‍♂️🙏🪷 ✍️🙏

గురువారం, నవంబరు 16,2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


గురువారం, నవంబరు 16,2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

కార్తీక మాసం - శుక్ల పక్షం

తిథి:తదియ మ12.53 వరకు

వారం:గురువారం (బృహస్పతివాసరే)

నక్షత్రం : మూల తె3.26 వరకు  

యోగం: సుకర్మ ఉ11.48 వరకు

కరణం:గరజి మ12.53 వరకు తదుపరి వణిజ రా12.12 వరకు

వర్జ్యం:ఉ11.50 - 1.24 &

రా1.54 - 3.26

దుర్ముహూర్తము:ఉ9.52 - 10.37 &

మ2.21 - 3.06

అమృతకాలం:రా9.11 - 10.45

రాహుకాలం:మ1.30 - 3.00

యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30

సూర్యరాశి :  తుల

 చంద్రరాశి : ధనుస్సు 

సూర్యోదయం:6.08

సూర్యాస్తమయం:5.21


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు - కార్తీక మాసం - శుక్ల పక్షం  - తృతీయ  - మూల -‌ గురు వాసరే* *(15-11-2023)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.




🙏🙏

శివానందలహరీ – శ్లోకం – 1*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.      *శివానందలహరీ – శ్లోకం – 1*

.        శ్రీ ఆదిశంకరాచార్య విరచితం


*కళాభ్యాం చూడాలంకృతశశికళాభ్యాం నిజతపః*

*ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే |*

*శివాభ్యామస్తోకత్రిభువనశివాభ్యాం హృది పున*

*ర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతి రియమ్  1*


కళలస్వరూపులునూ (శ్రీవిద్యాస్వరూపులు, సకలవిద్యాస్వరూపులు),  సిగలపై చన్ద్రకళలను ధరించినవారునూ (కాలాతీతులునూ), ఒకరినొకరు తపస్సుద్వారా పొందిన వారునూ, భక్తులకు ఫలములిచ్చువారునూ, త్రిభువనములకూ మంగళదాయకులునూ, హృదయమునందు ధ్యానములో మరలమరల గోచరించువారునూ, ఆత్మానందానుభవముతో స్ఫురించు రూపముకలవారునూ అయిన పార్వతీపరమేశ్వరులకు నమస్కారములు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

శివానందలహరీ – శ్లోకం – 2*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.      *శివానందలహరీ – శ్లోకం – 2*

.        శ్రీ ఆదిశంకరాచార్య విరచితం

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱


*గళంతీ శంభో! త్వచ్చరితసరితః కిల్బిషరజో*

*దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతామ్ |*

*దిశంతీ సంసారభ్రమణపరితాపోపశమనం*

*వసంతీ మచ్చేతోహ్రదభువి శివానందలహరీ*


మహాదేవ శంభో! నీ చరితామృతము నుండి మొదలై, నా బుద్ధి అను కాల్వలద్వారా  ప్రవహిస్తూ, నా పాపములనూ, నా చావు-పుట్టుకల చక్రమునూ(సంసారభ్రమణం) తొలగించివేస్తూ, నా మనస్సనే మడుగును చేరి నిలిచిన శివానందలహరికి (పరమేశ్వరుని లీలలు వినుటచే కలిగిన ఆనంద ప్రవాహము) జయమగు గాక.

(శివలీలలను తెలిసుకొనుట ద్వారా పాపనాశనమూ, తాపనాశనమూ సాధించవచ్చునని శంకరాచార్యుల ఉపదేశం)


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

శివానందలహరీ – శ్లోకం – 3*

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.      *శివానందలహరీ – శ్లోకం – 3*

.        శ్రీ ఆదిశంకరాచార్య విరచితం

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱


*త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం*

*జటాభారోదారం చలదురగహారం మృగధరమ్ |*

*మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం*

*చిదాలంబం సాంబం శివ మతివిడంబం హృది భజే  3*


మూడు వేదములద్వారా తెలిసికొన దగిన వాడును , మిక్కిలి మనోహరమయిన ఆకారము కలవాడును , త్రిపురములనూ(త్రిపురాసురులను) సంహరించినవాడును , సృష్టికి పూర్వమేఉన్నవాడును , మూడుకన్నులు కలవాడును , గొప్ప జటాజూటము కలవాడును, గొప్ప ఉదారస్వభావం కలవాడును, కదులుచున్నసర్పములను ఆభరణములుగా ధరించినటువంటివాడును, లేడిని ధరించినవాడునూ , దేవతలకే దేవుడయిన మహాదేవుడునూ , సకల జీవులకూ పతి అయినవాడును , జ్ఞానమునకు ఆధారమయినవాడును , అనుకరింపశక్యము కానివాడును , నాయందు దయ కలవాడును అయిన పార్వతీ సమేతుడయిన శివుని హృదయమునందు ధ్యానించుచున్నాను.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

పెరియ పురాణం⚜️* . *నాయనార్ల చరిత్ర - 01*

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 01*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 *1. తిరు నీలకంఠ నాయనారు*


వేద బ్రాహ్మణులకు ఆవాసమైన చిదంబరంలో ఒక కుమ్మర కులంలో తిరునీలకంఠ నాయనారు జన్మించాడు. అతడు పరమేశ్వరునిపై అచంచల భక్తి తత్పరతలు కలిగినవాడు.

ఒక పర్యాయం తిరు నీలకంఠ నాయనారు ఒక వేశ్య ఇంటికి వెళ్లి తిరిగివచ్చాడు.


 తిరు నీలకంఠుని భార్య ఇది సహించలేకపోయింది. తన

భార్య అలుకను పోగొట్టడానికై నీలకంఠనాయనారు మృదు మధురంగా

మాట్లాడుతూ ఆమెను కౌగలించుకోవడానికి ప్రయత్నించాడు. “మీరు

మమ్మల్ని తాకినట్లయితే తిరు నీలకంఠేశ్వరుని మీద ఆన” అంటూ ఆమె తన భర్తను వారించింది. 


తిరు నీలకంఠ నాయనారు తన భార్యను చూసి

“నీవు మమ్మల్ని అని చెప్పడం వలన ఇక మీదట నిన్నే కాదు ఇతర స్త్రీలను

కూడ మాతృమూర్తులుగా భావించి తాకను కూడ తాకను" అంటూ ప్రతిజ్ఞ

చేసి అప్పటి నుండి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాడు. యౌవనప్రాయాన్ని

దాటి వారు ముసలివారయ్యారు. 


వారి భక్తి శ్రద్ధలను లోకానికి

తెలియజేయాలనే ఉద్దేశంతో పరమేశ్వరుడు జంగమ వేషంతో అతని ఇంటికి

వచ్చాడు.

మాయాశివుడు తన చేతిలో ఉన్న భిక్షాపాత్రను నీలకంఠుని చేతికి ఇచ్చి "ఇది చాలా అపూర్వమైంది. దీనిని నీ దగ్గర దాచి ఉంచు. మాకు

అవసరమైనపుడు తీసుకుంటాను” అని చెప్పి వెళ్లిపోయాడు. 


తిరు నీలకంఠుడు దానిని తన ఇంటిలో ఒకచోట భద్రంగా దాచాడు. శివుడు

నీలకంఠుని వద్దనున్న భిక్షాపాత్రను అదృశ్యమయ్యేలాగా చేశాడు.

కొంతకాలమైన తరువాత శివయోగి నీలకంఠుని దగ్గరికి వచ్చి "పూర్వం

నేను నీదగ్గర దాచి ఉంచిన భిక్షాపాత్రను నాకు తిరిగి ఇవ్వవలసింద”ని కోరాడు. 


నీలకంఠుడు ఇల్లంతా వెతికినా భిక్షాపాత్ర కనిపించలేదు.

శివయోగితో "స్వామీ! మీరిచ్చిన భిక్షాపాత్రకు బదులుగా వేరొక అందమైన

భిక్షాపాత్రను ఇస్తాను" అని చెప్పాడు. 


శివయోగి కోపంతో "నీవు నా

భిక్షాపాత్రను దొంగలించావు. నీవు దానిని దొంగలించి ఉండకపోతే నీ

భార్య చేతిని పట్టుకొని ఈ కొలనులో మునిగి శపథం చేయమని

కట్టడిచేశాడు. తిరు నీలకంఠుడు తనకు తన భార్యతోగల శపథాన్ని వివరించి

చెప్పి ఆమెతో కలసి కొలనులో మునగడం సాధ్యం కాదని చెప్పాడు.


శివయోగి ఆ మాటలకు కోపావేశుడై తిల్లెలోని బ్రాహ్మణులతో ఫిర్యాదు

చేశాడు. వాళ్లు తిరు నీలకంఠుని పిలిచి "ఈ యోగి చెప్పిన విధంగా నీవు

నీ భార్యతో కలిసి ఈ కొలనులో మునగడం న్యాయమే” అని తీర్పిచ్చారు.

వారు చెప్పిన ప్రకారం భార్యాభర్తలిరువురూ తమ శపథానికి భంగం

రాకుండా ఒక కర్రను చెరొకవైపు పట్టుకొని కొలనులో మునిగారు. 


మునిగి లేచిన భార్యభర్త లిరువురూ తమ ముదిమిని పోగొట్టుకొని యౌవనవంతులై

విరాజిల్లారు. శివగామీ సుందరీ సమేతుడై పరమేశ్వరుడు వారికి దర్శనమిచ్చి

“మీరిరువురూ మా సన్నిధిలో నిత్య యౌవనంతో శాశ్వతంగా ఉండగలరు”

అని దంపతులిరువురినీ ఆశీర్వదించాడు.


   *ఒకటవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

కార్తీకపురాణం - 3వ అధ్యాయము*

 *కార్తీకపురాణం - 3వ అధ్యాయము*

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


*కార్తీక మాస  స్నాన మహిమ*


జన క మహరాజా ! కార్తి క మాసమున యే ఒక్క చిన్న దానము చేసిన నూ, అది గొప్ప ప్రభావము గలదై వారికి సక లైశ్వర్యములు కలుగుట యే గాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ, కొంత మంది ఆస్థిరములైన భోగ భాగ్య ములు విడువలేక, కార్తిక స్నానములు చేయక , అవినీతి పరులై, భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి , కుక్క, పిల్లి గ జన్మింతురు..

అధమము కార్తీక మాస శుక్ల పార్ణమి రోజు న యిన నూ స్నాన దాన జపత పాదులు చేయక పోవుట వలన న నేక చండాలాది జన్మ లెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టిదురు. దీనిని గురుంచి నాకు తెలిసిన యితిహాసమొకటి  వినిపించెదను. సపరి వారముగా శ్రద్దగా ఆలకి౦పుము.


*బ్రహ్మ రాక్ష సులకు ముక్తి కలుగుట*


ఈ భారత ఖండ మదలి దక్షిణ ప్రా౦తమున ఒకానొక గ్రామములో మహా విద్వాంసుడు, తపశాలి, జ్ఞాన శాలి, సత్య వ్యాక్య పరిపాలకుడు అగు ' తత్వనిష్టుడు' అను బ్రాహ్మణుడొక  డుండెను. ఒక నాడా  బ్రాహ్మణుడు తీర్ధ యాత్ర సక్తుడై  అఖండగోదావరికి బయలుదేరును. ఆ తీర్ధ సమీపమున ఒక మహా వట వృక్ష౦బు  పై భయంకర ముఖములతోను, దీర్ఘ  కేశములతోను, బలిష్ట౦బులైన కోరలతోను, నల్లని బాన పొట్టలతోను, చూచువారుకి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసి౦చుచూ , ఆ దారిన బ్రోవు బాట సారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంత మంతయు భయక౦పితము చెయుచు౦డిరి. తీర్ధ యాత్రకై  బయలుదేరి అఖండ గోదావరి పుణ్య క్షేత్రమున  పితృ దేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు అ వృక్షము చెంతకు చేరుసరికి  యథా ప్రకారము బ్రహ్మ రాక్షసులు క్రిందకు దిగి అతనిని చ౦పబోవు 

సమయమున, బ్రాహ్మణుడు ఆ భయ౦కర రూపములను చూచి గజ గజ వణుకుచూ యేమియు తోచక నారాయణ స్తోత్రం భిగ్గరగా పటి౦చుచు ' ప్రభో ! ఆర్త త్రాణ పరాయణ! ఆ నాధ రక్షక ! ఆపధలోనున్న గజేంద్రుని, ని౦డు సభలో అవమానాలు పలగుచున్న మహాసాద్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే - యి పిశాచములు  బారినుండి నన్ను రక్షించు తండ్రీ!  యని వేడుకొనగా, ఆ ప్రార్ధనలు విన్న బ్రహ్మ రాక్షసులుకు జ్ఞానో దయ౦ కలిగి ' మహానుభావా! మీ నోటినుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు  జ్ఞానో దయ౦ అయినది మమ్ము రక్షింపుడు' యని ప్రాదేయపడిరి. వారి మాటలకూ విప్రుడు ధైర్యం తెచ్చుకొని' ఓయీ! మీరెవరు ? ఎందులకు మికి రాక్షస రూప౦బులు కలిగెను? మీ వృత్తా౦తము తెలుపుడు' యని పలుకగా వారు' విప్ర పుంగవా! మీరు పూజ్యులు, ధర్మాత్ములు , వ్రతనిష్టాపరులు, మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వ జన్మ మందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన యే ఆపద కలగదు' అని అభయమిచ్చి, అందొక  బ్రహ్మ రాక్షసుడు తన వృ త్తాంతము యీవిదముగా చెప్పసాగెను. నాది ద్రావిడ దేశం . బ్రహ్మనుడను. నేను మహా పండితుడనని గర్వము గలవాడై నై యుంటిని. న్యాయాన్యాయ విచాక్షణలు మని పసువునై ప్రవర్తి౦చితిని, బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యం గా దానం లాగుకోనుచు, దు ర్వ్యనాలతో  భార్య పుత్రా దులను సుఖపెట్టాక, పండితుల నవమాన పరచుచు, లుబ్దు డనై లోక కంట కుడిగ నుంటిని.

ఎట్లుండగా ఒకానొక పండితుడు కార్తిక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమర్ధన చేయు తల౦పుతొ పదార్ధ సంపాదన నిమి త్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచెను. వచ్చిన పండితుని నేను దూషించి, కొట్టి అతనికి వద్ద నున్న ధనము, వస్తువులు తీసుకోని ఇంటినుండి గెంతి వైచితిని. అందులకా విప్రునకు కోపము వచ్చి ' ఓరి ని చూడ ! అన్యక్రా౦తముగ డబ్బుకూడా బెట్టినది చాలక, మంచి చెడ్డలు తెలియక, తోటి బ్రాహ్మణుడని గూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకొంటివి గాక, నివు రాక్షసుడవై నార భక్ష కు డువుగా నిర్మానుష్య ప్రేదేశాములలో నుందువు'గాక! యని శపించు టచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మస్త్రమునైన తపెంచుకొవచును కానీ బ్రాహ్మణ శాపమును తపెంచాలేము గదా! కాన నయాప రాదము క్ష మి౦ పుమని వానిని ప్రా ర్ధి౦ చితిని. అందులకాతాడు దయదలచి' ఒయీ! గోదావరి క్షే త్రమ౦దొక వట వృక్షము గలదు. నివండు నివసించుచు యే బ్రాహ్మణువలన పునర్జన్మ నొ౦దు దు వు గాక' యని వేదలిపోయాను. ఆనతి నుండి నేని రాక్షస స్వరుపమున నభాక్ష ణము చేయుచున్దిని. కాన, ఓ విప్రోతమ! నన్ను న కుటుంబము వారిని రక్షిమ్పుదని మొదటి రాక్షసుడు తన వ్రుతంతమును జెప్పెను.


ఇక రెండవ రాక్షసుడు- ' ఓ ద్విజోత్త మా ! నేను కూడా పూర్వ జన్మలో బ్రహ్మనుడునే. నేను నీచుల సహవాసముచేసి తల్లితండ్రులను భాదించి వారికీ తిండి పెట్టక మాడ్చి  అన్నమో రామచంద్రాయను నటులచేసి, వారి యెదుటనే ణ బార్య బిడ్డలతో పంచభక్ష్య పరమన్నములతో భుజించుచు౦డేడివాడను.  నేను యెట్టి దానధర్మములు చేసి మెరుగును, నా బ౦ధువులను కూడా హింసించి వారి ధనమపహరి౦చి రాక్షసుని వలె ప్రవ ర్తి౦చితిని. కాన, నాకీ రాక్షస  సత్వము కలిగెను. నన్ని పాపప౦కిలము నుండి ఉద్దరి౦పుము' అని బ్రాహ్మణుని పాదములపై  బడి పరి పరి విధముల వేడుకొనెను.


మూడవ రాక్షసుడు కూడా తన వృ త్త౦తమును యిటుల తెలియ జేసెను. ' మహాశయా! నేనొక సంపన్న కుటుంబములో పుట్టిన బ్రహ్మణుడను. నేను విష్ణు  ఆలయములో అర్చకునిగా నుంటిని. స్నాన మైనను చేయక, కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచు౦డేడి వాడను భగవంతునికి ధూప దీప నైవేద్యము  లైనాను నర్పించక, భక్తులు గొనితేచ్చిన సంభారములను  నా వుంపుడు గత్తెకు అందజేయుచు మధ్య మాంసము సేవించుచు పాపకార్యములు  చేసినందున నా మరణన౦ తరము యి రూపము ధరించితిని, కావున నన్ను కూడా పాప విముక్తి ని కావి౦పు' మని ప్రార్ధించెను.ఓ జనక మహారాజ! తపోనిష్టుడగు ఆ విప్రుడు పిశాచములు దినలపము లాలకించి 'ఓ బ్రహ్మ రాక్షసులరా! భయపడకుడు. మీరు పూర్వ జన్మలో చేసిన ఘోర క్రుథ్య౦బులవల్ల మీకీ రూపములు కలిగెను. నా వెంట రండు మీకు విముక్తిని కలిగింతును' యని, వారి నోదార్చి తనతో గొనిపోయి ఆ మువ్వురి చేతనవిముక్తి సంకల్పము చెప్పుకొని తనే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్య ఫలమున ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంటమున కేగిరి. కార్తిక మాసములో గోదావరి స్నానమాచరించినాచో హరిహరాదులు సంతృప్తి నొంది, వారికీ సకలైశ్వర్యములు ప్రసాది౦చుతురు. అందువలన, ఎంత ప్రయత్నించిన సరే కార్తిక స్నానాలనా చరించాలి.


*ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత, వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య* *ముందలి*

*మూడవ రోజు* *అధ్యాయము -* *మూడవ రోజు పారాయణము సమాప్తము.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

 సంపూర్ణ ఆరోగ్యం సిద్దించుట కొరకు ఆయుర్వేద సూత్రాలు  - 


 *  ప్రాతఃకాలం నందే నిద్ర నుండి మేల్కొనవలెను . బ్రహ్మ ముహూర్తం సరైన సమయం . 


 *  ప్రాతఃకాలం నందు నిద్ర లేచిన వెంటనే గోరువెచ్చటి నీటిని తాగవలెను దీనివలన మలమూత్రాలు సాఫీగా సాగును. 


 *  నిద్ర లేచిన వెంటనే మలమూత్ర విసర్జన చేయవలెను . మలమూత్రాలను బలంగా ఆపుట వలన రోగాలు సంప్రాప్తిస్తాయి .


 *  దంతధావనం నందు నాలుకను , దంతములను శుభ్రపరచుకోవలెను . నల్లతుమ్మ చెట్టు బెరడు కషాయం నోటి యందు క్రిములను తొలగించు గుణము కలదు 


 *  దంతముల పాచిని తొలగించుట కొరకు వనమూలికలతో చేసినటువంటి దంత చూర్ణంని వాడవలెను . చిగుళ్ల యందు వ్యాధులు ఏమైనా ఉన్నచో చిగుళ్లకు నువ్వులనూనె రాయవలెను . 


 *  స్నానానికి ముందు నువ్వులనూనెతో మర్ధించుకొని కొంతసేపు నీరెండలో ఉండవలెను . నువ్వులనూనె బదులు కొబ్బరినూనె లేదా ఆవాలనూనె వాడుకోవచ్చు . ఆవాల నూనె చాలా శ్రేష్టం . ఔషధ తైలాలు కూడా వాడవచ్చు . 


 *  శరీరంకి నూనె మర్దించుకొనుట వలన చర్మం మృదువుగా , కోమలంగా తయారగును. 


 *  కీళ్లు , కండరాలు కదలికలు మంచిగా జరుగును. 


 *  రక్తప్రసరణ మంచిగా జరుగును. చర్మం ద్వారా , మలపదార్థాలు త్వరగా తొలగించబడును. 


 *  వ్యాయమం చేయవలెను . 


 *  స్నానం గొరువెచ్చటి నీటితో చేయవలెను .


 *  గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం వలన జఠరాగ్ని పెరుగును . రోమకూపములు , స్వేదరంధ్రములు , చర్మము శుభ్రపరచబడి శరీరం నిర్మలంగా ఉండును. 


 *  నివశించే ప్రదేశముని బట్టి, కాలం మరియు అలవాట్లని అనుసరించి ఆహారం నిర్ణయించవలెను . తీపి , పులుపు , ఉప్పు, కారం , చేదు , వగరు అను ఆరు రుచులు కలిగి ఉండు ఆహారముని తీసుకొనవలెను . 


 *  జీర్ణశక్తికి అనుకూలంగా ఉండు ఆహారముని నిర్ణయించుకొని తీసికొనవలెను . 


 *  భోజనం చేయుటకు 10 - 15 నిమిషములు ముందు పచ్చి అల్లం ముక్కలను కొద్దిగా ఉప్పుతో కలిపి తినవలెను . 


 *  గట్టిగా ఉండు పదార్థాలను బాగుగా నమిలి తినవలెను . 


 *  సాధ్యం అయినంత వరకు ఆహారసేవన తరువాత పెరుగు లేదా మజ్జిగ సేవించవలెను .


 * బాగుగా చల్లగా , వేడిగా ఉన్నటువంటి ఆహారపదార్థాలు తీసుకోరాదు . 


 *  ఆహారం తినుటకు 15 నిమిషాల లోపు నీరు తీసుకోరాదు . తిన్నవెంటనే అధిక మోతాదులో నీటిని తీసుకోరాదు . మధ్యమధ్యలో కొంచం కొంచం నీటిని తీసుకోవచ్చు . 


 *  ఆలస్యముగా జీర్ణం అయ్యేటువంటి ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోరాదు 


 *  భోజనం చేసిన వెంటనే అధిక శ్రమ చెయ్యరాదు . భోజనం చేసిన వెంటనే కొంత సమయం విశ్రాంతి తీసికొనవలెను . 


 *  తూర్పు , దక్షిణం వైపు తల యుంచి నిద్రించవలెను .


 *  నిదురించే గది అత్యంత స్వచ్ఛముగా గాలి వీచే విదముగా ఉండవలెను . 


 *  నిద్రించే మంచం ఎత్తు , వంపులు లేకుండా స్థిరంగా ఉండవలెను . 


 *  గది వాతావరణం దుష్ప్రభావం లేకుండా ఉండవలెను . 


 *  మెదడుని ఉత్తేజిత పరుచు పనులు అనగా గట్టిగా చదువుట , ఆలోచించుట , మద్యపానం , కాఫీ, టీలు సేవించుట మొదలగు వాని తరువాత వెంటనే పడుకోరాదు . 


 *  రోజుకి కనీసం 7 గంటలు నిద్రించవలెను . 


 *  పగటినిద్ర మంచిది కాదు కేవలం ఎండాకాలం నందు మాత్రమే పగటి సమయం నందు నిద్రించవలెను . 


 *  నింద్రించుటకు ముందు అరికాళ్లకు , అరచేతులకు తైలం మర్దించుట వలన కలలు నియంత్రించబడును . అనగా పీడకలలు నియంత్రించబడును. 


 *  అధికంగా మైథునం చేయుట వలన శరీరముకు హాని కలుగును. దీనివలన క్షయ మొదలగు వ్యాధులు కలుగును .


 *  మైథునం రాత్రి మొదటి భాగం నందు చేయుట ఉత్తమం . తగినంత విశ్రాంతి లభించును. 


 *  అసహజ మైధున కర్మలు రోగాలకు మూలకారణం . 


 *  వ్యాధులకు చికిత్స తీసుకునే సమయంలో మైధున ప్రక్రియ నిలిపివేయవలెను . లేనిచొ శరీర రోగ నిరోధక శక్తి సన్నగిల్లును. 


 *  మూత్రము ఆపుట వలన మూత్రము పోయుటలో బాధ కలుగును. మూత్రములో రాళ్లు ఏర్పడును . మూత్రాశయం యొక్క కండరాలు పటుత్వము కోల్పోవును. మూత్రమార్గంలో వాపు , మంట కలుగును.  అందువలన బలవంతంగా మూత్రాన్ని ఆపరాదు . 


 *  మలవిసర్జన ఆపుట వలన కడుపులో నొప్పి , కడుపుబ్బరం , అజీర్ణం , అపానవాయువులు , తలనొప్పి , కడుపులో పుండ్లు  వంటి సమస్యలు మొదలగును . కావున మలవిసర్జన ఆపకూడదు.


 *  శుక్రం బయల్పడే సమయంలో నిరోదించినచో శుక్రం గడ్డలు గడ్డలుగా రావటం వృషణాలలో నొప్పి , సంభోగం చేయు సమయంలో నొప్పి కలుగును. కావున శుక్ర వేగాన్ని నిరోధించరాదు . 


 *  వాంతిని ఆపుట వలన దద్దుర్లు , తలతిరగడం , రక్తహీనత , కడుపులో మంట , చర్మరోగాలు మరియు జ్వరం కలుగును . కావున వాంతులను బలవంతంగా అపరాదు. 


 *  తుమ్ములను ఆపుట వలన జలుబు , ముక్కునుండి అదేపనిగా నీరు కారే పీనస రోగం , తలనొప్పి , పార్శ్వపు నొప్పి మొదలగు సమస్యలు కలుగును. ముక్కులో ఉండు మలినాలు , అనవసర పదార్థాలను తొలగించుటకు సహాయపడతాయి. తుమ్ములను బలవంతంగా ఆపరాదు . 


 *  త్రేపులను ఆపడం వలన ఎక్కిళ్లు , ఛాతిలో నొప్పి , దగ్గు , ఆకలి మందగించడం , రుచి లేకపోవుట మొదలగు సమస్యలు సంభంవించును. 


 *  ఆవలింతలు ఆపుట వలన కండ్లు , గొంతు , చెవి , ముక్కు సంబంధ వ్యాధులు ఉత్పన్నం అగును . 


 *  ఆకలి , దప్పిక శరీరంకు కావలసిన పోషకాంశాలు మరియు నీటి ఆవశ్యకత ని తెలియచేస్తాయి . వీటిని అతిగా ఆపుట వలన శరీరంకు అందవలసిన పోషకాలు అందక శరీరం క్షీణించిపోతుంది. శరీరం కావాల్సిన రోగనిరోధక శక్తి తగ్గి రకరకాల సాంక్రమిక వ్యాధులు సంభవిస్తాయి . శరీరం పొడిగా మారును . 


 *  కన్నీటిని ఆపుట వలన  మనసిక వ్యాధులు , ఛాతిలో నొప్పి , తలతిరుగుట మరియు జీర్ణకోశ వ్యాధులు కలుగుతాయి . 


 *  శ్వాసప్రక్రియని ఆపుట వలన శ్వాసకోశ వ్యాధులు , గుండెజబ్బులు కలిగి మనిషి ని ఉక్కిరిబిక్కిరి చేయును . ఒక్కోసారి మరణం కూడా కలుగును. 


 *  నిద్రని ఆపుట వలన నిద్రలేమి , మానసిక వ్యాధులు , జీర్ణకోశ వ్యాధులు , మరియు జ్ఞానేంద్రియ వ్యాధులు సంభంవించును. 


          పైన చెప్పిన వాటిని అధారణీయ వేగాలు అని ఆయుర్వేదంలో పిలుస్తారు . ఇవి మొత్తం 13 రకాలు గా విభజించారు. వీటిని ఎట్టి పరిస్థితుల్లో బలవంతంగా ఆపరాదు . 


           ఈ నియమాలు నిబద్ధతతో పాటించటం వలన అనారోగ్యాలు కలగకుండా చూసుకోవచ్చు. 


     మరింత విలువైన సులభ ఔషధ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


     గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


       ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

         

        9885030034  

                         


    మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


        కాళహస్తి వేంకటేశ్వరరావు .


  అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


           9885030034

సప్త ధాతువులు

 శరీరం నందలి సప్త ధాతువులు మరియు ఉపధాతువులు గురించి వివరణ  - 


  శరీరం నందలి  7 రకాల ధాతువులు కలవు. 


 1 -  రసము .


 2 - రక్తము .


 3 - మాంసము .


 4 - మేధస్సు 


 5 - మజ్జ .


 6  - అస్థి .


 7 - శుక్రము .


                ఇవి శరీరమును పొషించును. 


 *  ఓజస్సు  - 


         శరీరం నందలి రసధాతువు మొదలు శుక్రధాతువు వరకు ఉండు సప్తధాతువుల యొక్క ఉత్క్రుష్టమైన తేజస్సే ఈ ఓజస్సు అని చెప్పబడును. అది స్నిగ్దముగా , నిర్మలంగా కొంచెం రక్తవర్ణము గా ఉండును.  ఇది ముఖ్యముగా హృదయము నందు ఉండినను శరీరం అంతా వ్యాపించి ఉండును. ఇది నశించినచో జీవియు నశించును . దీనివలన ప్రాణి బ్రతికి ఉండును. 


              దీనివల్లనే దేహసంబంధమైన అనేక భావములు కలుగుచున్నవి. ఇది శరీరం యొక్క జీవిత స్థితికి ముఖ్యకారణం అయిఉన్నది. ఇది 10 బిందువుల ప్రమాణంతో 

శరీరం నందు ఉండును.  


              కోపము , ఆకలి, ధ్యానము , దుఃఖము   శ్రమ  మొదలగు వాటివల్ల మనుజుడు యొక్క శరీరం మిక్కిలి దౌర్బల్యత్వం  చెందును .  శరీరం కాంతి నశించును. 


         పైన చెప్పిన కారణాల వలన ఓజస్సు తగ్గినప్పుడు చికిత్సా సమయంలో మధురద్రవ్యములను , పాలు , మాంసరసం , నెయ్యి , దూలగొండి మొదలగు ద్రవ్యములను వాడినచో ఓజస్సు వృద్ధిచెందును. 


  సప్తధాతువులు శరీరం నందు సంచరించు పద్దతి  - 


 *  రసము  - 


        ఇది మిక్కిలి పలచగా ఉండును. చిన్న ప్రేగుకి సంబందించిన రసాయనుల ద్వారా హృదయముకి చేరి అచ్చట వడపోయబడి స్థూలసూక్ష్మ భాగములుగా విభజింపబడును . అందు స్థూలభాగము సర్వశరీరం నందు గల రసాయనుల ద్వారా వ్యాపించుతూ రక్తధాతువుని పోషించుచుండును.


 *  రక్తము  - 


        ఇది శరీరం నందలి సిరల యందును , మాంసము నందు వ్యాపించి ఉండును. ఇది ధమనీ సహాయమున శరీరం అంతటా ప్రవహించుతూ కాలేయం , మూత్రపిండముల యందు శుద్ది అగును . రసధాతువు నుండి రక్తధాతువు ఏర్పడును . 


 

 *  మాంసము  - 


        ఇది నాళములలోని రక్తము ద్వారా పోషించబడుచూ ఉండును. ఇది కూడా స్థూలం , సూక్ష్మం , మలం అను విభాగాలు పొందును. సూక్ష్మంగా ఉండు భాగం మేధస్సుని చేరి పోషించబడుతూ ఉండును. ఇది రక్తధాతువు నుండి ఏర్పడును . 


 *  మేథస్సు  - 


          ఇది నెయ్యి వలే తెల్లగా ఉండును. ఇది కడుపులోను మరియు చిన్నచిన్న ఎముకలకు అంటియుండు కొవ్వుపదార్థం . మాంసము నందలి సూక్ష్మ భాగములచే ఇది పోషించబడును. ఇది కూడా స్థూల, సూక్ష్మ , మల భాగములుగా విభజించబడి ఎముకలను పోషించుచుండెను . ఇది మాంసధాతువు నుండి ఏర్పడును . 


 *  అస్థి  - 


          ఇది మేధోధాతువుచే పోషింపబడుచూ శరీరం యొక్క పటుత్వమునకు ప్రధాన హేతువుగా ఉంటుంది. ఇది 3 భాగాలుగా విభజింపబడి ఉంటుంది. ఇది మజ్జా ధాతువుని పోషించుతూ ఉండును. ఇది మేధోధాతువు వలన ఏర్పడును . 


 *  మజ్జ  - 


           

          ఇది బోలు ఎముకలో ఉండు పచ్చని కొవ్వు వంటి పదార్థం . ఇది అస్థిధాతువు చే పెంచబడును. ఇది స్థూలం , సూక్ష్మం , మలం మూడు బాగాలుగా విభజింపబడి ఉంటుంది. అందులో స్థూలభాగం మజ్జభాగంలో చేరుచూ ఉండును. సూక్ష్మ భాగం శుక్రధాతువు ని పొషించుచుండును . ఇది అస్థిధాతువు వలన ఏర్పడును . 


 *  శుక్రము  - 


        

           ఇది శరీరం నందు అంతటా ఉండు మజ్జాధాతువు యొక్క సూక్ష్మభాగం . ఎముకలలో ఉండు అతి సూక్ష్మ రంధ్రముల ద్వారా పైకి వచ్చి రక్తముతో కలిసి సిరల గుండా ప్రవహించుచూ సూక్ష్మ శుక్రద్రవము ను పోషింపుచూ ధమనీ సహాయంతో బీజకోశములలోకి చేర్చబడును . ఇది స్థూల సూక్ష్మ అను రెండు భాగములుగా విభజింపబడును. అందు స్థూలభాగం శుక్రమును , సూక్ష్మ భాగం ఓజస్సు పోషింపబడును. ఇది మజ్జా ధాతువు వలన ఏర్పడును . 


  ధాతువులకు ఉపధాతువులు  - 


     రసధాతువుకు  స్తన్యము , రక్తధాతువు కు స్త్రీల రజస్సు, మాంసధాతువుకు వస అనెడి చమురు , మేధోధాతువుకి చెమట, అస్థిధాతువుకి దంతములు , మజ్జాదాతువుకి వెంట్రుకలు , శుక్రధాతువుకి ఓజస్సు ,  వీటిని ఉపధాతువులు అనబడును.



   మరెన్నో అద్భుత సులభయోగాలు నేను రచించిన గ్రంథాల యందు సంపూర్ణముగా ఇచ్చాను. 


 

   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

        9885030034 


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


   అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


            9885030034