8, డిసెంబర్ 2025, సోమవారం

సంపూర్ణ మహాభారతము*

 🔯🌹🌷🏹🛕🏹🌷🌹🕉️

*🕉️సోమవారం 8 డిసెంబర్ 2025🕉️*


             *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                         6️⃣8️⃣``

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


       *సంపూర్ణ మహాభారతము*         

                    *68 వ రోజు*

                    

      *వన పర్వము ప్రథమాశ్వాసము*


              *హస్థినా పురం*```


హస్థినా పురంలో ధృతరాష్ట్రుడు విదురునితో “విదురా పాండవులు ఏమి చేస్తుంటారు” అని అడిగాడు. 


దానికి విదురుడు “పాండవులు దైవసంభూతులు. జూదం వలన అన్నదమ్ములకు వైరం వస్తుందని చెప్పాను. నీవు విన లేదు. ఇప్పటికైనా నా మాట విని పాండవులను పిలిపించి వారి రాజ్యం వారికి ఇచ్చి ధర్మం నిలబెట్టు. కర్ణుడు, శకుని మాటలు విని చెడు పనులు చేసే నీ కొడుకు సుయోధనుని విడిచి పెట్టు.ద్రౌపదికి,భీమునికి దుశ్శాశనునితో క్షమాణలు చెప్పించు” అన్నాడు. 


ఆ మాటలకు దృతరాష్ట్రుడికి కోపం వచ్చి “సుయోధనుడు నా కన్న కొడుకు వాడిని నేను ఎలా వదలను. నీకు నాకొడుకులంటే పడదు. వారు ఉన్నతులైతే సహించలేవు. నీ సాయం నాకు అక్కర లేదు. నీవు పాండవుల దగ్గరికే వెళతావో ఇంకెక్కడి వెళతావో నీ ఇష్టం!” అన్నాడు. 


వెంటనే విదురుడు కామ్యక వనంలో ఉన్న పాండవుల వద్దకు వెళ్ళాడు. 


ధర్మరాజు తన పెద నాన్న గురించి అడిగాడు. విదురుడు జరిగినది చెప్పాడు. 


ధృతరాష్ట్రునికి విదురుడు పాండవుల వద్ద ఉన్నాడని తెలిసింది. విదురుని విడిచి ఉండ లేక విదురుని కొరకు సంజయుని పంపాడు. 


సంజయుడు కామ్యకవనం వెళ్ళి విదురునికి నచ్చచెప్పి తీసుకు వచ్చాడు. 


దృతరాష్ట్రుడు “విదురా! నీవు నీతి మంతుడవు. నాకు బుద్ధి లేదు. అందుకే నిన్ను వెళ్ళగొట్టాను నన్ను క్షమించు!” అన్నాడు. 


విదురుడు “ధృతరాష్ట్రా! నీవు నీ కొడుకులు ధర్మంతప్పి నడుస్తున్నప్పుడు మీకు ధర్మం చెప్పడం నా ధర్మం. మహా పరాక్రమవంతులైన పాండవులతో వైరం మంచిది కాదు!” అన్నాడు. 


విదురుడు తిరిగి రావడం దుర్యోధనుడికి నచ్చలేదు. కర్ణ, శకుని, దుశ్శాశనులతో చర్చిస్తూ “పాండవుల దగ్గరకు వెళ్ళిన విదురుడు మరల వచ్చాడు. మనకు మంత్రి అయ్యాడు. ఒకవేళ విదురుడు, ధృతరాష్ట్రుడు కలసి పాండవులను తిరిగి రమ్మంటే ఏమి చేయాలి?” అన్నాడు. 


శకుని “సత్య సంధులైన పాండవులు ఎట్టి పరిస్థితిలో తిరిగి రారు. ఆ భయం నీకు వద్దు!” అన్నాడు. 


కర్ణుడు “ఈ అదను చూసుకుని వారి మీద యుద్ధం చేసి వారిని హతమారుస్తాము. శత్రుశేషం లేకుండా చేద్దాం!” అన్నాడు. 


కర్ణుని మాట విని దుర్యోధనుడు సేనలను సమీకరిస్తున్నాడు. పాండవులపై యుద్ధానికి సన్నద్ధం అయ్యాడు. 


ఇది తెలిసి వ్యాసుడు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి “నీ కుమారుడు పాండవుల మీదకు యుద్ధానికి వెళుతున్నాడు. పాండవుల అరణ్య, అజ్ఞాత వాసం తరువాత ఎలాగూ యుద్ధం తప్పదు తొందరెందుకు?” అన్నాడు. 


ధృతరాష్ట్రుడు “మహత్మా! నన్ను ఏమి చెయ్యమంటారు. జూదం వలన చెడు జరిగింది. నేను పుత్ర వాత్సల్యం వలన నా కొడుకుని విడువలేను” అన్నాడు. 


వ్యాసుడు “ధృతరాష్ట్రా! పుత్ర వాత్సల్యం ఉండవలసిందే కానీ అడవిలో ఉండే పాండవుల మీద దయ చూపించు. నాకు ఇద్దరూ సమానులే. ధర్మరాజు స్నేహంతో నీ కొడుకు సుయోధనుడు మారవచ్చు" అన్నాడు.


ధృతరాష్ట్రుడు “అయ్యా! వాడు నా మాట వినడు. మీరే వాడికి నచ్చ చెప్పండి” అన్నాడు. 


వ్యాసుడు “మైత్రేయ మహర్షి వచ్చి నీ కొడుక్కు నచ్చ చెబుతాడు” అని వెళ్ళి పోయాడు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

గొప్ప పురాణ కథ

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹

  ఆడపిల్లలైనా, మగ పిల్లలైనా మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలి. అటువంటి వ్యక్తిత్వం పెరగాలంటే ఆదర్శప్రాయులైనవారి కథలైనా తెలుసుకోవాలి. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు అటువంటి గొప్ప పురాణ కథ ఈ ఎపిసోడ్ లో అందిస్తున్నారు. కుశనాభుడి కుమార్తెల కథ వింటే యువతులు ఎలా నడుచుకోవాలో అర్థమవుతుంది. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

ఆన్లైన్లో సంగీతం క్లాసులు

  ఆన్లైన్లో సంగీతం క్లాసులు




 ఆన్లైన్లో కర్ణాటక సంగీత క్లాసులు కండక్ట్ చేయబడుతున్నాయి మీ పిల్లలకి సంగీతం నేర్పించదల్చుకుంటే వెంటనే ఈ పోస్ట్ కింద కామెంట్ రూపంలో మీరు తెలియజేయగలరు. మీ వాట్సాప్ నంబర్ తెలియజేస్తే వాట్సాప్ ద్వారా మేమే మిమ్మల్ని కాంటాక్ట్ చేయగలము.




మీరు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా పర్వాలేదు ఆన్లైన్లో క్లాసులు అటెండ్ కావచ్చు 




ప్రస్తుతం అమెరికాలో వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఉన్నారు."

జీవిత సత్యం

 *శుభ  సోమ వారం*🔱Happy Monday. 


        🤘 *జీవిత సత్యం*👌


         కష్టపడి పెంచిన చెట్టు యొక్క ఫలం ఎంత తీయగా అనిపిస్తుందో. అలాగే కష్టంతో దక్కిన ఫలితం కూడా అంతే అంతులేని ఆనందాన్ని ఇస్తుంది.


 🏹  *నిత్య సత్యం* 🏑


        అడవుల్లో తిరిగినా రాముడు చెడిపోలేదు. అంతఃపురంలో పెరిగినా రావణుడు బాగుపడలేదు. వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనో, అంతస్తులోనో ఉండదు. ఆలోచనలో, ఆచరణలో మాత్రమే ఉంటుంది..

దయతో అంగీకరించ గలరు."

 😃😃😃😃😃😃

మధ్యాహ్నం పడుకుందామని మెయిన్ గేటు వెయ్యబోతుండగా ఒక పెంపుడు కుక్క గబగబా లోపలి వచ్చింది. కుక్కలు ఏమైనా తరుముతున్నాయేమో అని అటూ ఇటూ చూశాను. ఏమీ లేవు.


పోన్లే అని దానిని లోపలి


రానిచ్చాను. అరుగు మీద పడుకుంది.


నేను తలుపు వేసుకుని లోపల పడుకున్నాను. సాయంత్రం అయ్యింది. నేను తలుపు తీశాను. కుక్క నా దగ్గరకి వచ్చి తోక ఊపుతూ నాకేసి చూస్తోంది. బయటకు వెళ్లి పోతుందేమో అని గేటు తీశాను. వెంటనే వెళ్లి పోయింది.


ఇలా గత 6 రోజులుగా జరుగుతోంది. మధ్యాహ్నం రావడం, పడుకోవడం, సాయంత్రం వెళ్ళిపోవడం. ఆ పెంపుడు కుక్క ఎవరిదీ?


నిన్న ఒక చీటీ రాసి దాని మెడకు తగిలించి పంపాను. అందులో ఇలా రాశాను.


"ఏమండీ ! మీ కుక్క ప్రతి రోజూ మధ్యాహ్నం అయ్యేసరికి మా ఇంటి దగ్గరకి వచ్చి పడుకుంటోంది. నాకు ఇబ్బంది ఏమీ లేదు గానీ, మీరు వెతుక్కుంటారు అని రాస్తున్నాను."


ఇదిగో ఇవాళ దాని మెడలో ఒక కాగితం ఉంది.


"ధన్యవాదాలు! మా ఇంట్లో భోజనాలు కాగానే మా ఆవిడ తెలుగు సీరియళ్ళు పెట్టి దానిని నిద్ర పోకుండా చేస్తున్నందు వలన మీ ఇంటికి వచ్చి పడుకుంటోంది. అది చాలా సుఖ పడుతోంది. మీరు అనుమతిస్తే నేను కూడా వద్దామని అనుకుంటున్నాను. దయతో అంగీకరించ గలరు."


😃😃😃😃😃😃