13, మే 2025, మంగళవారం

ఏకారణమైన భువిని

 *2106*

*కం*

ఏకారణమైన భువిని

నీకడ సిరి తక్కినపుడు నీవారలకున్

ఓకరముగ కనబడెదవను

భీకర సత్యము మరువకు వితతము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ఏ కారణంగా అయిన నూ నీవద్ద ధనము తగ్గినప్పుడు నీవారికి కూడా అసహ్యం గానే కనబడతావనే భయంకరమైన నిజమును ఎన్నడూ మరువవద్దు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

దేహానివా? చైతన్యానివా?

 దేహానివా? చైతన్యానివా?  

శ్రీ రమణ కథామృతం

తేజోమూర్తి అయిన ఆ యువస్వామికి ఆకర్షితులైన వారిలో పళనిస్వామి అనే విరాగి ఒకరు. ఈయన మాతృభాష మళయాళం. స్వామి కన్నా దాదాపు ఇరవై సంవత్సరాలు పెద్దాయన. ఊళ్ళో గ్రంథాలయానికి వెళ్లి కొన్ని ఆధ్యాత్మిక విషయాలను చెప్పే గ్రంథాలను తెచ్చి స్వామికి ఇస్తూ ఉండేవాడు. అప్పటి వరకు ఏ ఆధ్యాత్మిక గ్రంథాన్ని చదవని రమణునకు పళనిస్వామి తెచ్చే పుస్తకాలలోని విషయాలు తనకి అనుభవ సిద్ధమైనవేనని తెలిసొచ్చింది. ఆ విధంగా గ్రంథపఠనం ప్రారంభమైంది.

తల్లిగారు వెళ్లిపోయిన తరువాత రమణులు అరుణగిరిపై నుండే గుహలలో నివాసమేర్పరచుకున్నారు. దాదాపు ఎనిమిది సంవత్సరాలు విరూపాక్ష గుహలో, ఆ తరువాత ఆరు సంవత్సరాలు స్కందాశ్రమంలో ఉండేవారు. మౌనంగా, ఎవ్వరితో మాట్లాడకుండా ఉండే ఆ స్వామిని దర్శించుకోవడానికి ఎందరో వచ్చేవారు. వీళ్లంతా ఆ మౌనస్వామి కంటే పెద్దవారే! వీళ్లలో ఇద్దరి, ముగ్గురి గురించి చెప్పుకుందాం.

స్వామి తిరువణ్ణామలైలో ఉండగా ఆయనను దర్శించుకున్న వారిలో ఒక సాధువుండేవారు. ఆయన తరచూ స్వామిని కొండ మీదకు రమ్మంటూ ఉండేవారు. తీరా కొండపైకి స్వామి వెళ్లిన తరువాత ఆ సాధువు గ్రహించినదేమంటే ఇంతకు పూర్వం తన దర్శనానికి వచ్చే సామాన్యజనం ఇప్పుడు స్వామి దగ్గరకు వెళ్తున్నారనీ, తనని నిర్లక్ష్యం చేస్తున్నారని. అసూయను ఆపుకోలేక ఒకసారి స్వామి ముఖం మీద ఉమ్మేశాడు. పళనిస్వామి అతనిని కొట్టబోతే మౌనంగా సంజ్ఞలు చేసి స్వామి వారించారు. ఇదెట్లా సాధ్యమని మనం అనుకుంటాం. దేహం పట్ల ఏ విధమైన అభిమానమూ లేని ఆ మౌనస్వామిని ఆ సాధువు చేసిన అకృత్యం ఏమీ బాధపెట్టలేదు! ఇంతకూ ఆ సాధువు తన దేహాన్నే కదా అవమానపరచాడు? తానేమో చైతన్యస్వరూపుడాయె! స్వామి విరూపాక్షగుహలో ఉండగా ఆయనను దర్శించుకున్న వారిలో ముఖ్యులిద్దరి గురించి చెప్పుకుందాం. ఒకాయన శివప్రకాశం పిళ్ళై! ఇంకొకరు కావ్యకంఠ గణపతిముని! శివప్రకాశం పిళ్ళై పట్టభద్రుడు. కాలేజీలో ఫిలాసఫీ అధ్యయనం చేశాడు. ఆయన స్వామిని ఎన్నో ప్రశ్నలు వేస్తే పలక మీదో, నేల మీదో స్వామి సమాధానాలు రాసి ఇచ్చేవారు. వాటినన్నిటినీ భద్రపరచుకుని కొన్నేళ్ల తరువాత ‘‘నాన్‌ యార్‌’’(నేనెవరిని) అనే గ్రంథంగా రూపొందించారు పిళ్ళై. ఈ ప్రశ్నోత్తరాల సంగతి తరువాత చూద్దాం.

కావ్యకంఠ గణపతిముని రమణుల కంటే ఒక ఏడాది పెద్దవారు. కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన తపస్సు చేస్తుండేవారు. కాని ఆశించిన ఫలితం దొరకలేదు. చివరికి 1907లో మౌనస్వామిని ఆశ్రయించి, ‘తపస్సంటే ఏమిటి?’ అని ప్రశ్నించారు. గణపతిముని వైపు పదిహేను నిమిషాలు తదేకంగా చూసి మౌనస్వామి నోరు విప్పి మాట్లాడారు. అంటే అప్పటి వరకు (11 సంవత్సరాలు) మౌనంగా ఉన్న స్వామి మాట్లాడటం మొదలుపెట్టారన్నమాట! రమణులు ఇచ్చిన సమాధానమేమిటో, దాని పర్యవసానమేమిటో తరువాత చూద్దాం.(సశేషం) https://chat.whatsapp.com/CW3KU11WsA46NEQ246bxJc

*శ్రీ కంచి పరమాచార్య వైభవమ్*

 *శ్రీ కంచి పరమాచార్య వైభవమ్*

(నేడు శ్రీ కంచి పరమాచార్యులవారి జయంతి)

వైశాఖ బహుళ పాడ్యమి

🙏 *దైవం మానుష రూపేణ* 🙏

 *దైవం కాషాయ వస్త్రం ధరిస్తే, దైవం ఎలాంటి అలంకారాలు లేకుండా నిరాడంబరుడిగా మారితే, దైవం సత్యం, ధర్మం అనే ఆయుధాలతో దర్శనమిస్తే, దైవం ఈ కలియుగంలో మానుష రూపంలో ప్రత్యక్షమైతే, ఆ దైవమే కంచి కామకోటి పీఠం పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ చన్ద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు. మానవ రూపంలో అవతరించిన దైవం.* 🙏

🙏 ఆయన భువిపై నడయాడిన దైవం. ఆయన కాషాయ వస్త్రం ధరించిన త్రిమూర్తి స్వరూపం. సాక్షాత్తూ ఆదిశంకరాచార్యుల ప్రతిరూపం. భారతావనిని తన దివ్య చరణ స్పర్శతో పునీతం చేసిన మహానీయుడాయన. దైవం కనులముందు నడయాడుతుంటే దర్శించి తరించిన భక్తులు కోట్లకొలది వున్నారు. అంతటి మహనీయులు *పరమాచార్య చన్ద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి.* 

🙏 1894 వ సంవత్సరంలో దివినుంచి ఓ దివ్యజ్యోతి ప్రకాశిస్తూ భువిపై అవతరించింది. తమిళనాడులోని దక్షిణ ఆర్కాట్ జిల్లాలో ఉన్న విల్లుపురం అనే ఓ చిన్న గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జయనామ సంవత్సరం వైశాఖ బహుళ పాడ్యమి అనురాధ (అనుషం) నక్షత్రంలో జన్మించారు మహాస్వామి. స్వామివారి తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య శాస్త్రి, మహాలక్ష్మీ అమ్మాళ్. ఆ పుణ్య దంపతుల ఆరుగురి సంతానంలో స్వామివారు రెండవ సంతానం. పరమాచార్యుల పూర్వాశ్రమ నామం స్వామినాథన్. తమిళనాడులోని ప్రసిద్ధ క్షేత్రం స్వామిమలై సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో జన్మించారని ఆయనకు స్వామినాథన్ అని తల్లిదండ్రులు పేరు పెట్టారు. 

🙏‌‌ బాల్యంలోనే తండ్రి వద్ద కర్ణాటక సంగీతాన్ని అవపోసన పట్టారు స్వామినాథన్. తల్లి మహాలక్ష్మీ అమ్మాళ్ వద్ద శ్లోకాలు, మంత్రాలు నేర్చుకున్నారు. స్వామినాథన్ ను వారి తల్లిదండ్రులు అనేకసార్లు కాంచీపురానికి తీసుకువెళ్ళే వారు. 

🙏 ఒక సందర్భంలో కంచి కామకోటి పీఠం *66 వ పీఠాధిపతి శ్రీ చన్ద్రశేఖరేంద్ర స్వామి* వారి దర్శనానికి తల్లిదండ్రులతో పాటు స్వామినాథన్ వెళ్ళగా ఆ బాలుణ్ణి చూసిన జగద్గురువులు ఈ బాలుడు ఒక మహాత్ముడౌతాడు. కాంచీపుర పీఠాన్ని సైతం అధిరోహిస్తాడు, అని అన్నారట. 

🙏 బాల్యంలోనే ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన స్వామినాథన్ ను చూసి అధ్యాపకులు ఆశ్చర్యపోయేవారు. స్వామివారి పెదతల్లి కుమారుడైన లక్ష్మీకాంతన్ ఋగ్వేదాన్ని అభ్యసిస్తున్నప్పుడు స్వామినాథన్ శ్రద్ధగా వినేవాడు. ఆ వినడంతోనే ఋగ్వేద మంత్రాలను నేర్చుకున్నారు. 

🙏 1905 లో స్వామినాథన్ ఉపనయనం జరిగిన తరువాత సంస్కృత విద్యను అభ్యసించారు. ఓ సందర్భంలో స్వామినాథన్ జాతకాన్ని పరిశీలించిన ఒక జ్యోతిష్కుడు ఈ బాలుడు ప్రపంచమే పూజించేంతటి గొప్ప యోగి అవుతాడని చెప్పాడు. కంచి పీఠాధిపతుల అనుంగు శిష్యులైన లక్ష్మీకాంతన్ ప్రతినిత్యం పీఠాధిపతుల సేవలో తరించేవాడు. అతను చేసే కైంకర్యాలను స్వామినాథన్ శ్రద్ధగా గమనించేవాడు. 

🙏 విల్లుపురంకు సమీపంలో దిండి వనంలో ఉన్న ఆర్కాట్ అమెరికన్ మిషన్ స్కూల్ లో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు స్వామినాథన్. బైబిల్ ను సైతం అక్షర దోషాలు లేకుండా చదివేవాడు. స్కూల్ లో చదువుకునే రోజులలో నాటక ప్రదర్శనలలో సైతం ప్రతిభను చాటుకున్నాడు. 

🙏 కంచి కామకోటి పీఠం 66 వ పీఠాధిపతి శ్రీ చన్ద్రశేఖరేంద్ర సరస్వతీ శివైక్యం చెందగానే స్వామినాథన్ పెద్దమ్మ కుమారుడు పద్దెనిమిదేళ్ళ లక్ష్మీకాంతన్ సన్యాసం స్వీకరించి 67 వ పీఠాధిపతిగా కంచికామకోటి పీఠాన్ని అధిరోహించారు. ఈ వార్త తెలియగానే లక్ష్మీకాంతం తల్లిని పరామర్శించడానికి స్వామినాథన్ తో కలిసి మహాలక్ష్మీ అమ్మాళ్ కలువై కు బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో సంధ్యావందనం ఆచరిస్తున్న స్వామినాథన్ వద్దకు కంచి పీఠానికి చెందిన మునిరత్నం అనే సేవకుడు వచ్చి స్వామినాథన్ ను తనతో వెంటనే బయలుదేరి రావలసిందిగా కోరాడు. వారి తల్లి కోసం మరో బండి ఏర్పాటు చేసామని తెలియజేశారు. ఆ సేవకుడి వెంట బయలుదేరిన స్వామినాథన్ కు అసలు విషయం తెలుస్తుంది. 

🙏 67వ పీఠాధిపతిగా కంచి పీఠాన్ని అధిరోహించిన లక్ష్మీకాంతన్ కూడా శివైక్యం చెందాడని. ఆ స్థానంలో తనను పీఠాధిపతిగా నియమించబోతున్నారని అర్థమౌతుంది.

🙏 66 వ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్రుల అధిష్ఠానం వద్ద స్వామినాథన్ ప్రణమిల్లగానే ఆ బాలుడిలో ఓ జ్ఞానజ్యోతి వెలిగినట్లైంది. స్వామినాథన్ తండ్రికి టెలిగ్రాం ద్వారా విషయాన్ని జేరవేసిన మఠం సిబ్బంది స్వామినాథన్ ను పీఠాధిపతిగా నియమించేందుకు సంప్రదాయ క్రతువులు నిర్వహించారు. 

🙏 ఫిబ్రవరి 13, 1907 లో కంచికామకోటి పీఠం 68 వ పీఠాధిపతిగా *శ్రీచన్ద్రశేఖరేంద్ర సరస్వతీ* నామధేయంతో 13 ఏళ్ళ స్వామినాథన్ నియమితులయ్యారు. స్వామినాథన్ వద్దకు చేరుకున్న తల్లిదండ్రులను ఆ బాల సన్యాసి ఓదార్చి ఇంటికి పంపిస్తారు.

🙏 1907 మే, 9 న కుంభకోణం క్షేత్రంలో చన్ద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి పీఠాధిరోహణ మహోత్సవం జరిగింది. పీఠాన్ని అధిరోహించిన తరువాత వేదాలను, శాస్త్రాలను, పురాణాలను, హైందవ ధర్మాలను అభ్యసించడానికి చంద్రశేఖరుల వారు ఎంతో ఆసక్తి చూపారు. భక్తులనుంచి దూరంగా ఉండేందుకు మహేంద్ర మంగళం అనే కుగ్రామంలో వైదిక విద్యాభ్యాసం ప్రారంభించారు. ఎంతోమంది మహా మహోపాధ్యాయులు ఆ బాలుడి వైదిక ప్రతిభను వీక్షించి ఆశ్చర్యపోయారు.

*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం*

*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం।।*

17-09-గీతా మకరందము

 17-09-గీతా మకరందము.

           శ్రద్ధాత్రయ విభాగ యోగము

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అవతారిక - రాజసాహార మేదియో వివరించి చెప్పచున్నారు–

కట్వామ్ల* లవణాత్యుష్ణ తీక్ష్ణరూక్షవిదాహినః | 

ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః || 

తాత్పర్యము:- చేదుగాను, పులుపుగాను, ఉప్పగాను, మిక్కిలి వేడిగాను, కారముగాను, చమురులేనివిగాను, మిగుల దాహము గలుగజేయునవిగాను ఉండునవియు; (శరీరమునకు) దుఃఖమును, (మనస్సునకు) వ్యాకులత్వమును గలుగజేయునవియునగు ఆహారపదార్థములు రజోగుణముగలవానికి ఇష్టములై యుండును.

వ్యాఖ్య:- ఈ శ్లోకమున తెలుపబడిన ఆహాపదార్థములు రాజసములని పేర్కొనుట వలన అవి సర్వథా త్యాజ్యములే అయియున్నవి.

“దుఃఖశోకామయప్రదాః” - ఇచట దుఃఖమనగా భుజించినవెంటనే శరీరాదులకు గలుగు బాధయనియు, శోకమనగా భుజించిన పిమ్మట మనస్సునకు గలుగు క్లేశమనియు గ్రహించవలెను.

కొందఱు "ఉష్ణ” అను పదమునకు ముందున్న "అతి” యను విశేషణమును కట్వాది పదములకన్నిటికిని అన్వయించి అర్థము చెప్పిరి. కాని అట్లుచేయుట సమీచీనముగ కనబడుటలేదు. ఏలయనిన, అత్తఱి "అతికటుత్వము నిషిద్ధమని అల్పకటుత్వము గ్రాహ్యమని” అర్థమువచ్చును. అది అసమంజసమే యగును. (కొద్ది చేదుకూడ ఎవరును కోరరుగదా).

 మఱియు "విదాహినః” అను పదమునకు ‘అతి’ చేర్చినచో, "అతివిదాహినః” అగును. అపుడు "వి" అను ఉపసర్గమీద మఱల ‘అతి' అను విశేషణమును జోడించుట అప్రస్తుతముగ నుండగలదు. (రెండును ఒకే అర్థమును సూచించును గావున).

రాజససుఖముయొక్క లక్షణము - ప్రారంభమున అమృతతుల్యముగనుండి తుదకు విషప్రాయముగ పరిణమించుటయే యని 18వ అధ్యాయమున భగవానుడు చెప్పబోవుదురు - "విషయేన్ద్రియ సంయోగాత్ యత్తదగ్రేఽమృతోపమమ్, పరిణామే మిషమివ తత్సుఖం రాజసం స్మృతమ్" అని అట్లే ఈ రాజసాహారమున్ను ప్రారంభమున జనులకు ఇంపుగా తోచవచ్చును, కాని భుజించిన కొంతసేపటికి గొప్పదుఃఖమును, వ్యాకులత్వమును గలుగజేయును. నిత్యజీవితమున ఈ విషయమును పెక్కురు అనుభవించుచునే యున్నారు. మఱియు రజోగుణాత్మకమగు ఈ ఆహారమును భుజించువారికి ధ్యానమున్ను సరిగా జరుగదు. చిత్తము వికారవంతమై, చంచలమైయుండును. అత్తఱి కొద్దిసేపైనను మనస్సు నిశ్చలముగానుండదు. జంతువులలోగూడ రజోగుణాహారమగు మాంసాదులను భుజించు సింహము, పులి, ఎలుగుగొడ్డు, అతిచంచలములై క్రూరములై యుండును. తృణాదులను భుజించు గోవు, మేక మొదలైనవి సాత్త్వికచిత్తవృత్తి గలిగియుండును.

“ఆమయప్రదాః” - అని చెప్పుటవలన రాజసాహారము ఆరోగ్యమునుగూడ చెడగొట్టి వ్యాధులను గలుగజేయునని తెలియుచున్నది. కాబట్టి ఆరోగ్యభంగకరములును, దుఃఖ, శోకప్రదములును, ధ్యానప్రతిబంధకములునునగు అట్టి రాజసాహార పదార్థములను ముముక్షువు లెన్నడును గ్రహించరాదు. అట్టియాహారముపై ఎపుడైన ఇష్టము గలిగినచో తనయందింకను రజోగుణము ఏ కోశమందునో గలదని నిశ్చయించి దానిని తొలగద్రోయుటకై యత్నించవలెను.

“దాః" అని చెప్పక “ప్రదాః” అని చెప్పుటవలన రోగాదుల నవి లెస్సగ గలుగజేయునని అర్థము. 

ప్రశ్న:- రాజసాహార మెట్టిది?

ఉత్తరము:- (1) చేదు, పులుపు, ఉప్పు, కారము వీనితో గూడినది (2) మిక్కిలి వేడిగా నున్నది (3) చమురులేనిది (4) మిగుల దాహమును గలుగజేయునది.

ప్రశ్న:- కావున ముముక్షు వేమి చేయవలెను?

ఉత్తరము:- ఆ యాహారమువలన కలుగు దుష్పరిణామమును మఱల మఱల భావించుచు దానిని త్యజించివేయవలెను.

~~~~~

* కట్వమ్లలవణాత్యుష్ణ - పాఠాన్తరము.

తిరుమల సర్వస్వం -237*

 *తిరుమల సర్వస్వం -237*

*ద్వాదశ ఆళ్వారులు-2* 

2  ముని వెనుదిరగడంతో భూమాతకు ఏర్పడిన సంక్షోభం తొలగి పోయింది గానీ, విశ్వకర్మ శాపఫలితంగా అప్పటివరకూ అప్రతిహతంగా చలామణిలో ఉన్న ద్రావిడభాష మాత్రం తన ప్రాభవాన్ని సమూలంగా కోల్పోయింది. కేవలం పామరులు, పిశాచగణాలు ఉపయోగించుకునే భాషావశేషంగా మిగిలిపోయింది. తన మానసపుత్రిక యైన 'ద్రావిడభాష' కు పట్టిన దుస్థితికి తీవ్రంగా కలత చెందిన అగస్త్యముని అనితర సాధ్యమైన తపమాచరించి, ఆ భాషను పునరుద్ధరింప జేయవలసిందిగా శ్రీమహావిష్ణువును అభ్యర్థించాడు. లోకకళ్యాణార్థం అగస్త్యుని కోర్కెను మన్నించిన శ్రీమహావిష్ణువు ద్రావిడభాషకు పూర్వవైభవాన్ని సంతరింపజేయడానికై పూనుకున్నాడు. తదనుగుణంగా శ్రీహరి ఆదేశానుసారం వారి ఆయుధాలు, ఆభరణాలు, పరివార సదస్యులు వీరంతా ద్రావిడదేశంలో దివ్యపురుషులైన ఆళ్వారులుగా జన్మించి, శ్రీహరిని స్తుతిస్తూ వేలాది కీర్తనలు, పెక్కు గ్రంథాలు ద్రావిడభాషలో రచించి, వాటికి పండిత పామరులలో విశేషంగా ప్రాచుర్యం కల్పించి ఆ భాషకు తిరిగి ఔన్నత్యాన్ని కల్పించారు. తద్వారా మృతభాషగా నున్న ద్రావిడభాష పునరుజ్జీవం పోసుకొని, అగస్త్యుని చిరకాల స్వప్నం సాకారమైంది. ఆ విధంగా ఆళ్వారులందరూ ద్రావిడదేశం లోనే జన్మించడం, ద్రావిడభాష లోనే తమ సాహితీ సాధనను కొనసాగించడం శ్రీహరి ఆదేశం మేరకే జరిగిందన్న మాట.

 *నాలాయిర దివ్యప్రబంధం*  

 ఆళ్వారులందరూ శ్రీహరిని, శ్రీవేంకటేశ్వరుణ్ణి స్తుతిస్తూ రచించిన కీర్తనలనూ, పాశురాలనూ తరువాతి కాలంలో సేకరించి ఈనాడు తమిళులకూ, శ్రీవైష్ణవులకూ, వైష్ణవభక్తులందరికీ పరమ పూజనీయమైన 'నాలాయిర దివ్యప్రబంధం' అనే పాశురాల సంకలనం వెలువరించబడింది. ఈ సంకలనంలో, ఇరవైనాలుగు ప్రబంధాల యందు పొందుపరచబడి యున్న నాలుగువేల పాశురాలలో కొన్నింటిని నేటికీ వైష్ణవక్షేత్రాలన్నింటిలో నిత్యమూ పఠిస్తారు. ఈ నాలుగు వేల పాశురాల లోని 206 పాశురాలలో శ్రీవేంకటేశ్వరుడు కీర్తించబడ్డాడు. *'నాలాయిర'* అనే తమిళపదానికి *'నాలుగు వేలు'* అని అర్థం. అలాగే, 'పాశురం' అంటే 'పద్యము' లేదా 'శ్లోకము'; తీయని స్వరం అనే అర్థాలున్నాయి. ధనుర్మాసంలో వైష్ణవాలయాలన్నింటిలో పఠించే, మనకు సుపరిచితమైన, ముప్ఫై పాశురాల సమాహారం *'తిరుప్పావై'* నాలాయిర దివ్యప్రబంధంలో అంతర్భాగమే..

 ఈ పాశురాలకు విశేషమైన పౌరాణిక ప్రాధాన్యతతో పాటుగా, చారిత్రక ప్రాశస్త్యం కూడా ఉంది. వీరి రచనల ద్వారా తిరుమలకు, శ్రీరంగానికి, కాంచీపురానికి, మరెన్నో వైష్ణవ క్షేత్రాలకు సంబంధించిన చారిత్రకాంశాలు సైతం వెలుగు చూశాయి. 'నాధముని' అనే విష్ణుభక్తుడు ఈ దివ్యప్రబంధాన్ని పండితపామరులందరూ రాగయుక్తంగా పాడుకునే వీలుగా రాగాన్ని, తాళాన్ని సమకూర్చి తరించాడు.

 *పుట్టు పూర్వోత్తరాలు* 

 ఆళ్వారులందరూ తమిళదేశం లోనే జన్మించినప్పటికీ, వీరందరూ సమకాలికులు కాదు. వీరి జీవితకాలం గురించి చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వీరు మూడవ శతాబ్ది నుండి తొమ్మిదవ శతాబ్దానికి చెందినవారని కొందరు అభిప్రాయపడతారు. కాగా వీరు ఏడు నుండి తొమ్మిది శతాబ్దాల కాలంలో జీవించియున్నారని చాలామంది చరిత్రకారులు భావిస్తారు. అలాగే, వీరి సంఖ్య 'పన్నెండు' అనే విషయంలో స్థూలంగా ఏకాభిప్రాయ మున్నప్పటికీ, ఈ పన్నెండు మంది 'ఎవరెవరు?' అనే విషయంలో స్వల్పంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

 ఈ అళ్వారులందరూ జన్మతః శ్రీవైష్ణవులు కాదు. వీరు శ్రీవైష్ణవ సంజాతుల నుండి అంత్యజుల వరకూ; సుక్షత్రియుల నుండి చోరాగ్రేసరుల వరకూ; అలాగే పుట్టుక తోనే విష్ణువుభక్తిలో తల్లీనమైన వారినుండి వేశ్యాలోలత్వానికి గురియైన వారి వరకూ; ఇలా భిన్నమైన నేపథ్యాలు కలిగినవారు. కానీ, వీరందరినీ ఏకసూత్రంలో బంధించే విశేషమైన సారూప్యతలు కూడా అనేకం ఉన్నాయి. రందరూ శ్రీమహావిష్ణువును సాక్షాంత్కరింప జేసుకున్నవారే!

 శ్రీవేంకటేశ్వరుని శ్రీమహావిష్ణువు కలియుగావతారంగా భావించి, తిరుమలేశుని తమ పాశురాలతో కీర్తించి తరించినవారే!

 పుట్టుకతో సంబంధం లేకుండా వీరందరూ శ్రీహరిని సేవించుకుని, శ్రీవేంకటేశ్వరుని భక్తితత్వాన్ని విశేషంగా వ్యాప్తిచేసి ఆనాడు సమాజంలో విస్తృతంగా వ్రేళ్ళూనికుని ఉన్న కులవ్యవస్థకు, వర్ణాశ్రమధర్మాలకు పెను సవాలు విసిరి; ముక్తిమార్గాన్ని పొందడానికి కులం, పుట్టుకలతో సంబంధం లేదని, హరినామస్మరణతో, నిరంతర సాధనతో మోక్షాన్ని పొందవచ్చని నిరూపించారు.

 జన్మ రీత్యా విభిన్నమైన నేపథ్యాలు, జీవనగమనం రీత్యా పరస్పర విరుద్ధమైన దృక్పథాలు కలిగిన ఆళ్వారులందరూ తరువాతి కాలాలలో శ్రీవైష్ణవులకు తప్పనిరియైన *'పంచ సంస్కారాలను'* స్వీకరించి, శ్రీవైష్ణవులుగా పునర్జన్మ నొంది, శేషజీవితాన్ని శ్రీహరికి సమర్పించుకొని, తమ సంకీర్తనామృతంలో భక్తజనులను పరవశింప జేశారు. 

[ రేపటి భాగంలో ... *ద్వాదశ అళ్వారులు* - *పంచసంస్కారాలు,* గురించి తెలుసుకుందాం]

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 

*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*కర్ణ పర్వము ప్రథమాశ్వాసము*

*375 వ రోజు*

*దేవతలు బ్రహ్మదేవునితో చేరి ఈశ్వరుడిని వేడుకొనుట*

దేవతలు, మునులు, ఇంద్రుడు, బ్రహ్మదేవునితో చేరి శివుని వద్దకు చేరి " పరమేశ్వరా ! నీవు జ్ఞానమూర్తివి, సత్యస్వరూపుడవు నీకు తెలియనిది లేదు " అని స్తుతించగా ఈశ్వరుడు " సంతోషించి ఏమి కావాలి ? " అన్నాడు. బ్రహ్మ పరమేశ్వరునితో " పరమేశ్వరా ! నీవు నన్ను ప్రజాపతిగా చేసావు. ఆ అధికారమును వినియోగించి నేను ఈ ముగ్గురు రాక్షసులకు వరములు ప్రసాదించాను. వారు ఆ వరగర్వంతో మూడు పురములు నిర్మించుకుని ముల్లోకాలను గడగడలాడిస్తున్నారు. ఇంద్రునికి కూడా అతడిని గెలువ శక్యము కాలేదు. నీవుగాక వారిని సంహరించగల వారు లేరు. కనుక అందరమూ నిన్ను శరణు జొచ్చాము. ఆ రాక్షసులను సంహరించి ముల్లోకములను కాపాడాలి " అని వేడుకున్నారు. ఈశ్వరుడు " బ్రహ్మదేవా ! నీను చెప్పినది నిజమే. వారు చంపదగిన వారే అయినా వారు మహాబలవంతులు నేను ఒక్కడినే వారిని జయించ లేను. కనుక నేను నా తేజస్సులో సగభాగము ఇస్తాను మీరంతా వారిని సంహరించండి " అన్నాడు. దేవతలు " పరమేశ్వరా ! ఆ మువ్వురి బలముకంటే మా బలము సగమే ఉంది కనుక మేము వారిని గెలువలేము. నీ మహా తేజస్సు మేము భరించరానిది. కనుక మా శక్తులను మీకు ధార పోస్తాము. కనుక నీవే వారిని సంహరించు " అన్నాడు. ఆ మాటలకు శివుడు " దేవతలారా ! నాకు మీరు రాక్షసులు సమానమే. అంతే కాదు నాకు సర్వప్రాణులు నాకు సమానమే. అందరికీ సమానంగా ఆనందం కలిగిస్తాను కనుక నాకు శివుడు అనే నామం వచ్చింది. దుష్టశిక్షణ శిష్టరక్షణ నా కర్తవ్యం. పరులను పీడించే దుర్జనులను సంహరించి ధర్మవర్తనులైన మిమ్ము రక్షిస్తాను. కనుక మీరంతా మీ తేజస్సు బుజ బలము నాకు చెందేలా చేయండి. నేను ఈ కార్యము నిర్వహించడానికి ముల్లోకములకు పశుత్వము నాకు పశుపతిత్వము కావాలి నేను ఈ కార్యము చేయడానికి నాకు పశుపతిత్వము కావాలి ఈ లోకాలకంత పశుత్వము కావాలి. అప్పుడు కాని పశువులను చంపిన పాపం నన్ను అంటదు. మీరందరూ కలిసి నాకు ఒక దివ్యరధమును, ఒక సారథిని, దివాశ్వములను, ఒక విల్లు, ఒక బాణం కావాలి. అప్పుడు నేను ఆ రాక్షసుల మూడు పురములను ఒక్కసారిగా నాశనం చేయగలను.

*పాశుపత వ్రతము*

శివుని మాటలు విన్న దేవతలు సంకోచిస్తూ తలలు వంచుకున్నారు. తమకు కూడా పశుత్వము వస్తుంది అని శకించారు. వారి అనుమానం అర్ధం చేసుకున్న శివుడు దేవతలారా ! మీరు భయపడ వద్దు. మీకు కలిగిన పశుత్వము నుండి బయటపడటానికి ఒక మార్గం ఉంది. మీరంతా పాశుపత వ్రతం ఆచరించి మీ పశుత్వము పోగొట్టుకొని మోక్షము పొంద వచ్చు. ఆ వ్రతము పన్నెండు సంవత్సరములు చేయవలెను. చేసే వారి నిష్టానుసారం ఒక సంవత్సరము కాని ఆరు నెలలు కాని, ఒక రుతువులో కాని, ఒక మాసముకాని, కనీసం పన్నెండు దినములలో కాని ఫలితం ఇస్తుంది. ఆ మాటలకు దేవతలు సమ్మతించి అన్ని లోకములకు పశుత్వము రావడానికి అంగీకరించి. శివునకు పశుపతిత్వము కలగడానికి ఒప్పుకుని అతడిని పశుపతిగా కీర్తించారు. దేవతలంతా తమ తేజస్సులో సగము శివునకు ధారపోసారు. ఆ తేజస్సును అందుకున్న పరమ శివుడు తేజోవంతుడయ్యాడు. ఇంద్రుడు దేవతలతో కూడి శివుడిని త్రిపురాసుర సంహారానికి అభిషేకించారు. దేవతలందరూ త్వష్ట ప్రజాపతిని చూసి శివుడికి మహోత్కృష్టమైన ఒక విల్లును, ఒక రథమును, అమ్మును, హయములను తయారు చేసి ఇమ్మని అడిగారు.

*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

🙏శ్రీ కుచేలోపాఖ్యానము :🙏 మూడవ భాగం

 🙏శ్రీ కుచేలోపాఖ్యానము :🙏

మూడవ భాగం 

కని డాయం జనునంతఁ గృష్ణుఁడు దళత్కంజాక్షుఁ డప్పేద వి

ప్రుని నశ్రాంత దరిద్రపీడితుఁ గృశీభూతాంగు జీర్ణాంబరున్

ఘనతృష్ణాతురచిత్తు హాస్యనిలయున్ ఖండోత్తరీయుం గుచే

లుని నల్లంతనె చూచి సంభ్రమ విలోలుండై దిగెం దల్పమున్.

(చాలా గొప్ప పద్యం )

 టీక:- కని = చూసి; డాయన్ = దగ్గరకు; చనున్ = పోవుచుండగా; అంత = అంతలో; కృష్ణుడు = కృష్ణుడు; దళత్ = వికసించుచున్న; కంజా = పద్మములవంటి; అక్షుడు = కన్నులు కలవాడు; ఆ = ఆ; పేద = బీద; విప్రునిన్ = బ్రాహ్మణుని; అశ్రాంత = ఎడతెగని; దరిద్ర = బీదతనముతో; పీడితున్ = పీడింపబడువానిని; కృశీభూతున్ = చిక్కిపోయి ఉన్నవానిని; జీర్ణ = శిథిలమైన, చినిగిన; అంబరున్ = వస్త్రములు కలవానిని; ఘన = మిక్కుటమైన; తృష్ణ = ఆశచేత; ఆతుర = ఆతృత చెందిన; చిత్తున్ = మనస్సు కలవానిని; హాస్య = హాస్యరసము; నిలయున్ = స్వభావమున కలవానిని; ఖండ = చిరిగిన; ఉత్తరీయున్ = పైబట్ట కలవానిని; కుచేలునిన్ = కుచేలుడిని {కుచేలుడు - పాడైన చేలము కలవాడు}; అల్లంతనె = అంత దూరమునుండె; చూచి = చూసి; సంభ్రమ = తొట్రుపాటుతో; విలోలుండు = చలించువాడు; ఐ = అయ్యి; దిగెన్ = దిగెను; తల్పమున్ = పానుపును.

 భావము:- కుచేలుడు కృష్ణుడి దగ్గరకు వెళ్తుండగా. నిరంతర దారిద్ర్య పీడితుడూ; కృశించిన అంగములు కలవాడూ; చినిగిన వస్త్రములు ధరించినవాడూ; ఆశాపూరిత చిత్తుడూ; హాస్యానికి చిరునామా ఐన వాడు; అయిన కుచేలుడు వస్తుంటే అల్లంత దూరంలో చూసిన పద్మాల రేకుల వంటి కన్నులు కల శ్రీకృష్ణుడు ఎంతో సంభ్రమంగా గబగబా పానుపు దిగాడు.

23

కర మర్థి నెదురుగాఁ జని

పరిరంభణ మాచరించి, బంధుస్నేహ

స్ఫురణం దోడ్తెచ్చి, సమా

దరమునఁ గూర్పుండఁ బెట్టెఁ దన తల్పమునన్.

 టీక:- కరము = మిక్కిలి; అర్థిన్ = ప్రీతితో; ఎదురుగాన్ = ఎదురు; చని = వెళ్ళి; పరిరంభణము = ఆలింగనము; ఆచరించి = చేసి; బంధు = బందువుకాని; స్నేహ = మిత్రుడుకాని; స్ఫురణన్ = అన్నట్లు తోచగా; తోడ్తెచ్చి = కూడా తీసుకు వచ్చి;; సమ = మిక్కిలి; ఆదరమునన్ = ఆదరణతో; కూర్చుండబెట్టెన్ = కూర్చోబెట్టుకొనెను; తన = తన యొక్క; తల్పమునన్ = మంచముమీద.

 భావము:- ఆదరాభిమానాలతో కుచేలుని కెదురుగా వెళ్ళి శ్రీకృష్ణుడు అతనిని కౌగలించుకున్నాడు. స్నేహ పూర్వక అనురాగం ఉట్టిపడేలా స్వాగతం పలికి ఆప్యాయంగా తోడ్కొనివచ్చి తన పాన్పు మీద కూర్చుండ బెట్టాడు.

అట్లు గూర్చుండఁ బెట్టి నెయ్యమునఁ గనక

కలశ సలిలంబుచేఁ గాళ్ళు గడిగి భక్తిఁ

దజ్జలంబులు దనదు మస్తమునఁ దాల్చి

లలిత మృగమద ఘనసార మిళిత మైన.

 టీక:- అట్లు = ఆ విధముగా; కూర్చుండబెట్టి = ఆసీనునిచేసి; నెయ్యమునన్ = స్నేహభావముతో; కనక = బంగారు; కలశ = పాత్రలలోని; సలిలంబు = నీళ్ళ; చేన్ = చేత; కాళ్ళు = పాదములు; కడిగి = శుభ్రముచేసి; భక్తిన్ = భక్తితో; తత్ = ఆ; జలంబులున్ = నీళ్ళను; తనదు = తన యొక్క; మస్తమునన్ = తలపై; తాల్చి = ధరించి; లలిత = చక్కటి; మృగమద = కస్తూరి; ఘనసార = పచ్చకర్పూరము; మిళితము = కలపబడినది; ఐన = అయినట్టి.

 భావము:- అలా కుచేలుడిని కూర్చుండ బెట్టి, పిమ్మట శ్రీకృష్ణుడు బంగారు కలశంలో నీళ్ళు తీసుకు వచ్చి ఆయన పాదాలను కడిగాడు. ఆ జలాన్ని భక్తితో శిరస్సు మీద చల్లుకున్నాడు. పిమ్మట మనోహర మైన కస్తూరి, పచ్చకర్పూరపు మైపూతలు తీసుకుని....

25

మలయజము మేన జొబ్బిల్ల నలఁది యంత

శ్రమము వాయంగఁ దాళవృంతమున విసరి

బంధురామోదకలిత ధూపంబు లొసఁగి

మించు మణిదీపముల నివాళించి మఱియు.

 టీక:- మలయజమున్ = మంచిగంధమును; మేనన్ = శరీరము నందు; జొబ్బిల్లగన్ = నిండారునట్లుగా; అలది = రాసి; అంత = పిమ్మట; శ్రమము = బడలిక; వాయన్ = తొలగునట్లు; తాళవృంతమునన్ = తాటాకు విసనకఱ్ఱతో; విసరి = విసిరి; బంధుర = అధికమైన; ఆమోద = పరిమళముతో; కలిక = కూడుకొన్న; ధూపంబున్ = ధూపములు; ఒసగి = ఇచ్చి; మించు = అతిశయించునట్టి; మణి = రత్నాల; దీపములన్ = దీపములతో; నివాళించి = ఆరతిచ్చి; మఱియున్ = ఇంకను.

 భావము:- ఆ మనోజ్ఞ మైపూతలు కుచేలుని శరీరానికి ప్రీతితో అలది, మార్గాయాసం తీరేలా స్వయంగా ఆప్తమిత్రుడు కుచేలునికి విసన కఱ్ఱతో విసిరాడు. అగరధూపం వేసి, మణిమయ దీపాలతో నివాళులు అర్పించాడు.

26

సురభికుసుమ మాలికలు సిగముడిం దుఱిమి, కర్పూరమిళిత తాంబూలంబు నిడి, ధేనువు నొసంగి, సాదరంబుగా స్వాగతం బడిగిన నప్పు డవ్విప్రుండు మేనం బులకాంకురంబు లంకురింప నానందబాష్ప జలబిందు సందోహుం డయ్యె; నట్టియెడం బద్మలోచనుండు మన్నించు నంగనామణి యగు రుక్మిణి కరకంకణ రవంబు లొలయం జామరలు వీవం దజ్జాత వాతంబున ఘర్మసలిలంబు నివారించుచుండఁ జూచి శుద్ధాంత కాంతానివహంబులు దమ మనంబుల నద్భుతం బంది యిట్లనిరి.

 టీక:- సురభి = సువాసన కల; కుసుమ = పూల; మాలికలు = దండలు; సిగముడిన్ = జుట్టుముడి యందు; తుఱిమి = ముడిచి, పెట్టి; కర్పూర = కర్పూరము; మిళిత = కలిపిన; తాంబూలంబున్ = తాంబూలమును; ఇడి = ఇచ్చి; ధేనువున్ = ఆవును; ఒసంగి = ఇచ్చి; సాదరంబుగా = ఆదరణతో; స్వాగతంబున్ = కుశలప్రశ్నలు; అడిగినన్ = అడుగగా; అప్పుడు = అప్పుడు; ఆ = ఆ; విప్రుండు = బ్రాహ్మణుడు; మేనన్ = దేహమున; పులకాంకురంబులు = పులకింతలు; అంకురింపన్ = కలుగుగా; ఆనంద = సంతోషమువలని; బాష్ప = కన్నీటి; జల = నీటి; బిందు = బిందువుల; సందోహుండు = సమూహము కలవాడు; అయ్యెన్ = అయ్యెను; అట్టి = అటువంటి; ఎడన్ = సమయము నందు; పద్మలోచనుండు = కృష్ణుడు; మన్నించు = గౌరవించు; అంగనా = భార్యలలో; మణి = ఉత్తమురాలు; అగు = ఐన; రుక్మిణిన్ = రుక్మిణీదేవి; కర = చేతుల; కంకణ = గాజుల; రవంబు = ధ్వనులు; ఒలయన్ = వ్యాపించగా; చామరలు = వింజామరలు; వీవన్ = వీస్తుండగా; తత్ = వాటినుండి; జాత = పుట్టిన; వాతంబునన్ = గాలితోటి; ఘర్మ = చెమట; సలిలంబు = నీరు; నివారించుచుండన్ = తొలగించుచుండ; చూచి = చూసి; శుద్దాంత = అంతఃపురపు; కాంతా = స్త్రీల; నివహంబులు = సమూహములు; తమ = వారి యొక్క; మనంబులన్ = మనస్సులందు; అద్భుతమున్ = ఆశ్చర్యమును; అంది = పొంది; ఇట్లు = ఈ విధముగా; అనిరి = పలికిరి.

 భావము:- కుచేలుడి సిగలో పూలదండలు ముడిచి, కర్పూరతాంబూలం ఇచ్చి, గోదానం చేసి, ఆదరంగా కుశలప్రశ్నలు అడిగాడు. అప్పుడు కుచేలుడి శరీరం పులకించింది, కన్నుల నుండి ఆనందాశ్రువులు జాలువారాయి. శ్రీకృష్ణుని పట్టపురాణి రుక్మిణి చేతి కంకణాలు ఘల్లుఘల్లు మంటుంటే వింజామరము వీచింది. ఆ చల్లని గాలికి కుచేలుని మార్గాయాసం తీరింది. ఈ దృశ్యాన్ని చూసిన అంతఃపురకాంతలు విస్మయంతో ఇలా అనుకున్నారు.

 ( కుచేలుడు పొందిన సత్కారం పోతన గారు అద్భుతముగా వర్ణించారు )

               సశేషం 

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

శ్రీకాళహస్తీశ్వర శతకము!!

 శు భో ద యం 🙏

శ్రీకాళహస్తీశ్వర శతకము!!

            ధూర్జటి మహాకవి.

.

పవమానాశన భూషణ ప్రకరము . ల్భద్రేభచర్మంబు, నా

టవికత్వంబు బ్రియంబులై భుజగశుం .డాటవీదారులన్

భవదుఃఖంబులబాపు,టొప్పుగొలిదిం . బాటించి కైవల్య మి

చ్చి వినోదించుట కేమి కారణమయా . శ్రీ కాళహస్తీశ్వరా!

.

శ్రీ కాళహస్తీశ్వరా!నీకు గాలియే ఆహారముగా గల పాములు ,ఆభరణములు

,ఏనుగు చర్మము,వస్త్రము. అడవిలో తిరుగుటనీకిష్టము.

అందుచే పామునకు,ఏనుగునకు,కిరాతకులకు,వచ్చుకష్టములను

నివారించి,కైవల్య ప్రాప్తి నిచ్చి సంతోషమును పొందితివి. మరియా సాలెపురుగునకు కైవల్య మిచ్చితివిగదా,

అందుకు కారణమేమో? నాకు తెలియకున్నది?

🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

మంగళవారం🍁* *🌹13 మే 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

       *🍁మంగళవారం🍁*

       *🌹13  మే  2025🌹*

       *దృగ్గణిత పంచాంగం*                

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*వైశాఖ మాసం - కృష్ణపక్షం*

*తిథి      : పాడ్యమి* రా 12.35 వరకు ఉపరి *విదియ*

*వారం    : మంగళవారం* ( భౌమవాసరే )

*నక్షత్రం   : విశాఖ* ఉ 09.09 వరకు ఉపరి *అనూరాధ*

*యోగం  : వరీయాన్* ఉ 05.53 వరకు ఉపరి *పరిఘ*

*కరణం   : బాలువ* ఉ 11.32 *కౌలువ* రా 12.35 ఉపరి *తైతుల*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.00 - 10.30 సా 06.00 - 07.00*

అమృత కాలం  : *రా 12.14 - 02.01*

అభిజిత్ కాలం  :  *ప 11.38 - 12.30*

*వర్జ్యం            : మ 01.35 - 03.22*

*దుర్ముహూర్తం  : ఉ 08.12 - 09.04 రా 10.57 - 11.41*

*రాహు కాలం    : మ 03.17 - 04.54*

గుళికకాళం       : *మ 12.04 - 01.40*

యమగండం     : *ఉ 08.51 - 10.27*

సూర్యరాశి : *మేషం*

చంద్రరాశి : *వృశ్చికం*

సూర్యోదయం :*ఉ 05.45*

సూర్యాస్తమయం :*సా 06.40*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.37 - 08.12*

సంగవకాలం         :*08.12 - 10.47*

మధ్యాహ్న కాలం    :     *10.47 - 01.21*

అపరాహ్న కాలం    : *మ 01.21 - 03.56*

*ఆబ్ధికం తిధి        : వైశాఖ బహుళ పాడ్యమి*

సాయంకాలం        :*సా03.56- 06.30*

ప్రదోష కాలం         :  *సా 06.30 - 08.44*

రాత్రి కాలం           :*రా 08.44 - 11.41*

నిశీధి కాలం          :*రా 11.41 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.08 - 04.53*

--------------------------------------------------

         *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

_*🚩హనుమ ధ్యాన శ్లోకాలు*_🚩

_*ఆంజనేయం మహావీరం*_

_*బ్రహ్మవిష్ణుశివాత్మకం*_

_*తరుణార్కప్రభోశాంతం*_

_*రామదూతం నమామ్యహమ్*_

            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹

🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: ఆరవ అధ్యాయం

ఆత్మసంయమయోగం: శ్రీ భగవానువాచ

అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః 

స సన్న్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్నచాక్రియః (1)

యం సన్న్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ 

న హ్యసన్న్యస్తసంకల్పో యోగీ భవతి కశ్చన (2)

పాండునందనా.. కర్మఫలాపేక్ష లేకుండా కర్తవ్యాలను ఆచరించేవాడే నిజమైన సన్యాసి, యోగి అవుతాడు. అంతేకానీ అగ్నిహోత్రాది కర్మలు మానివేసినంతమాత్రాన కాడు. సన్యాసమూ, కర్మయోగమూ ఒకటే అని తెలుసుకో. ఎందువల్లనంటే సంకల్పాలను వదిలిపెట్టనివాడెవడూ యోగి కాలేడు.

Panchaag

క్షయమగును

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎

శ్లో𝕝𝕝   *ఆప్తద్వేషాద్భవేన్మృత్యుః పరద్వేషాద్ధనక్షయః|*

         *రాజద్వేషాద్భవేన్నాశః బ్రహ్మద్వేషాత్కులక్షయః||*

తా𝕝𝕝 *ఆప్తులను ద్వేషిస్తే మృత్యువు కలుగును. పరులను ద్వేషిస్తే ధనక్షయం సంభవించును. రాజును ద్వేషిస్తే తనకు తానే నాశనమవుతాడు. బ్రాహ్మణుని ద్వేషిస్తే వంశమే క్షయమగును*.

✍️🌸🌹💐🙏

శ్రీ తేలి కా ఆలయం

 🕉 మన గుడి : నెం 1109

⚜ మధ్యప్రదేశ్  : గ్వాలియర్ 

⚜  శ్రీ తేలి కా ఆలయం

💠 తేలి కా మందిర్ లేదా తెలికా దేవాలయం అనేది ఉత్తర భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ కోట ప్రాంగణంలో ఉన్న ఒక పురాతన హిందూ పుణ్యక్షేత్రం.  

💠 ఈ ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది.  

ఇది కోట సముదాయంలో 100 అడుగుల ఎత్తు వరకు ఉన్న పురాతన మరియు ఎత్తైన నిర్మాణం.  

💠 ఈ ఆలయం ప్రస్తుతం ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉంది.  

తెలి కా మందిర్ అనేది ఉత్తర భారత నగారా మరియు దక్షిణ భారత ద్రావిడ నిర్మాణ శైలి యొక్క సమ్మేళనం మరియు దాని నిర్మాణ శైలిలో బౌద్ధ ప్రభావానికి సంబంధించిన సంకేతాలను కూడా చూపుతుంది. 

💠 ఈ అద్భుతమైన మందిరాన్ని తెలి కమ్యూనిటీ సభ్యులు (చమురు వ్యాపారులు) నిర్మించారు మరియు అందుకే దీనిని తేలి కా మందిర్  ( తేల్ అంటే హిందీలో నూనె ) ఆయిల్‌మాన్ ఆలయం అని పిలుస్తారు.

🔆 చరిత్ర

💠 తేలి కా మందిర్ నిజానికి గరుడ రూపంలో ఉన్న విష్ణువుకు అంకితం చేయబడింది, ఈ విష్ణు పర్వతం ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ, 100 అడుగుల ఎత్తును కలిగి ఉంది, ఫోర్ట్ క్యాంపస్‌లో ఎత్తైన మరియు అత్యంత అద్భుతమైన వస్తువుగా నిలిచింది.

💠 దీని పేరుకు సంబంధించి అనేక ఇతిహాసాలు ఉన్నాయి. 

ఒక కథ చెబుతుంది, ఇది స్థానికంగా తేలి అని పిలువబడే నూనె వ్యాపారి విరాళం నుండి తయారు చేయబడిందని, దీనికి తేలి ఆలయం అని పేరు పెట్టారు. 

రెండవ కథ ప్రకారం  ఇది తెలంగాణ (దక్షిణ భారతదేశంలోని ప్రాంతం) నుండి వచ్చిన యువరాజులచే నిర్మించబడింది కాబట్టి దీనిని తేలి కా మందిర్ అని పిలుస్తారు. 

💠 మరొక కథ ప్రకారం, "తేలి కా మందిర్" అనే పదం ఈ రాజపుత్ర ఆలయంగా వచ్చిందని కొన్ని ఇతిహాసాలు చెబుతున్నాయి, రాష్ట్రకూట గోవింద III 794లో కోటను జయించాడు. తరువాత అతను తెలంగ్ బ్రాహ్మణులకు మతపరమైన వేడుకలు మరియు ఆచారాల ఆచారాలను నిర్వహించాడు మరియు 'తెలాంగ్' అనే పదం నుండి ఈ ఆలయం ఈ పేరు పొందిందని భావిస్తారు. 

💠  ఈ ఆలయం యొక్క ద్రావిడ మరియు ఉత్తర భారత శైలి ఆంధ్ర ప్రాంతానికి సరిపోతుందని ఇది నిర్ధారిస్తుంది.బ్రిటిష్ కాలంలో, దీనిని సోడా ఫ్యాక్టరీగా మరియు కాఫీ షాపుగా ఉపయోగించారు, తరువాత ఈ కార్యకలాపాలన్నీ కోటలోని ఆ భాగంలో నిషేధించబడ్డాయి.

💠 చాలా దేవాలయాల వలె, దీని లోపల విగ్రహం ఉండదు.  

ఇది విష్ణువు లేదా శివునికి అంకితం చేయబడిందని కొందరు నమ్ముతారు.

💠 మైఖేల్ మిస్టర్ ప్రకారం, ఈ ఆలయం మొదట శక్తి ఆరాధనకు అంకితం చేయబడింది.  

తరువాత, ఇది 11-12 వ శతాబ్దంలో విష్ణు దేవాలయంగా మారింది.

 మొఘలుల కాలంలో దీనిని శివాలయంగా మార్చారు.

💠 వరుస అపవిత్రతలతో, ఆలయాన్ని 1857 క్లైమాక్స్‌కు ముందు కంపెనీ బహదూర్ నడుపుతున్న సోడా ఫ్యాక్టరీగా మార్చారు.

💠 అలెగ్జాండర్ కన్నింగ్‌హమ్ చూపులు దానిపై పడినప్పుడు ఆలయం మళ్లీ జీవం పోసుకుంది మరియు అతను 1860లో దానిని పరిరక్షించాలని నిర్ణయించుకున్నాడు.

💠 చివరగా, 1880లలో, ఇంపీరియల్ ప్రభుత్వం మరియు గ్వాలియర్ స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ సమిష్టి కృషితో ఈ ఆలయం పునరుద్ధరించబడింది.

💠 ఆలయం యొక్క గొప్ప ప్రవేశ ద్వారం మరియు విస్తృతమైన శిల్పాలు పౌరాణిక బొమ్మలు, పూల నమూనాలు మరియు క్లిష్టమైన మూలాంశాలను ప్రదర్శిస్తాయి. 

💠 ఆలయ నిర్మాణానికి సంబంధించి ఖచ్చితమైన కాలానికి సంబంధించిన శాసనాలు లేవు

💠 సాధారణంగా ఉత్తరం నుండి వచ్చిన నాగరా శైలి, నిర్మాణ శైలుల యొక్క సున్నితమైన సమ్మేళనం గురించి మాట్లాడుతుంది.  

💠 గరుడ (విష్ణువు వాహనం) చిత్రం ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ. 

 ఇది కాకుండా, దేవతలు, పాములు మరియు జంటల బొమ్మలు కూడా చూడవచ్చు.  

💠 ఆలయానికి సాధారణ మండపం లేదా స్తంభాల హాలు లేనప్పటికీ, దీనికి భారీ, ఐదు మీటర్ల ఎత్తైన ద్వారం మరియు గర్భ గృహం లేదా గర్భాలయం ఉన్నాయి, అన్నీ రాతి శిల్పాలతో అందంగా అలంకరించబడ్డాయి.  

💠 తెలి కా మందిర్, లేదా ఆయిల్‌మాన్ దేవాలయం, దాని అద్భుతమైన నిర్మాణం కోసం సందర్శించదగినది

💠 గ్వాలియర్ లోని తేలి ఆలయం గ్వాలియర్ కోట సముదాయంలోని కొండపై ఉంది. 

రచన

©️ Santosh Kumar

17-09-గీతా మకరందము

 17-09-గీతా మకరందము.

           శ్రద్ధాత్రయ విభాగ యోగము

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అవతారిక - రాజసాహార మేదియో వివరించి చెప్పచున్నారు–

కట్వామ్ల* లవణాత్యుష్ణ తీక్ష్ణరూక్షవిదాహినః | 

ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః || 

తాత్పర్యము:- చేదుగాను, పులుపుగాను, ఉప్పగాను, మిక్కిలి వేడిగాను, కారముగాను, చమురులేనివిగాను, మిగుల దాహము గలుగజేయునవిగాను ఉండునవియు; (శరీరమునకు) దుఃఖమును, (మనస్సునకు) వ్యాకులత్వమును గలుగజేయునవియునగు ఆహారపదార్థములు రజోగుణముగలవానికి ఇష్టములై యుండును.

వ్యాఖ్య:- ఈ శ్లోకమున తెలుపబడిన ఆహాపదార్థములు రాజసములని పేర్కొనుట వలన అవి సర్వథా త్యాజ్యములే అయియున్నవి.

“దుఃఖశోకామయప్రదాః” - ఇచట దుఃఖమనగా భుజించినవెంటనే శరీరాదులకు గలుగు బాధయనియు, శోకమనగా భుజించిన పిమ్మట మనస్సునకు గలుగు క్లేశమనియు గ్రహించవలెను.

కొందఱు "ఉష్ణ” అను పదమునకు ముందున్న "అతి” యను విశేషణమును కట్వాది పదములకన్నిటికిని అన్వయించి అర్థము చెప్పిరి. కాని అట్లుచేయుట సమీచీనముగ కనబడుటలేదు. ఏలయనిన, అత్తఱి "అతికటుత్వము నిషిద్ధమని అల్పకటుత్వము గ్రాహ్యమని” అర్థమువచ్చును. అది అసమంజసమే యగును. (కొద్ది చేదుకూడ ఎవరును కోరరుగదా).

 మఱియు "విదాహినః” అను పదమునకు ‘అతి’ చేర్చినచో, "అతివిదాహినః” అగును. అపుడు "వి" అను ఉపసర్గమీద మఱల ‘అతి' అను విశేషణమును జోడించుట అప్రస్తుతముగ నుండగలదు. (రెండును ఒకే అర్థమును సూచించును గావున).

రాజససుఖముయొక్క లక్షణము - ప్రారంభమున అమృతతుల్యముగనుండి తుదకు విషప్రాయముగ పరిణమించుటయే యని 18వ అధ్యాయమున భగవానుడు చెప్పబోవుదురు - "విషయేన్ద్రియ సంయోగాత్ యత్తదగ్రేఽమృతోపమమ్, పరిణామే మిషమివ తత్సుఖం రాజసం స్మృతమ్" అని అట్లే ఈ రాజసాహారమున్ను ప్రారంభమున జనులకు ఇంపుగా తోచవచ్చును, కాని భుజించిన కొంతసేపటికి గొప్పదుఃఖమును, వ్యాకులత్వమును గలుగజేయును. నిత్యజీవితమున ఈ విషయమును పెక్కురు అనుభవించుచునే యున్నారు. మఱియు రజోగుణాత్మకమగు ఈ ఆహారమును భుజించువారికి ధ్యానమున్ను సరిగా జరుగదు. చిత్తము వికారవంతమై, చంచలమైయుండును. అత్తఱి కొద్దిసేపైనను మనస్సు నిశ్చలముగానుండదు. జంతువులలోగూడ రజోగుణాహారమగు మాంసాదులను భుజించు సింహము, పులి, ఎలుగుగొడ్డు, అతిచంచలములై క్రూరములై యుండును. తృణాదులను భుజించు గోవు, మేక మొదలైనవి సాత్త్వికచిత్తవృత్తి గలిగియుండును.

“ఆమయప్రదాః” - అని చెప్పుటవలన రాజసాహారము ఆరోగ్యమునుగూడ చెడగొట్టి వ్యాధులను గలుగజేయునని తెలియుచున్నది. కాబట్టి ఆరోగ్యభంగకరములును, దుఃఖ, శోకప్రదములును, ధ్యానప్రతిబంధకములునునగు అట్టి రాజసాహార పదార్థములను ముముక్షువు లెన్నడును గ్రహించరాదు. అట్టియాహారముపై ఎపుడైన ఇష్టము గలిగినచో తనయందింకను రజోగుణము ఏ కోశమందునో గలదని నిశ్చయించి దానిని తొలగద్రోయుటకై యత్నించవలెను.

“దాః" అని చెప్పక “ప్రదాః” అని చెప్పుటవలన రోగాదుల నవి లెస్సగ గలుగజేయునని అర్థము. 

ప్రశ్న:- రాజసాహార మెట్టిది?

ఉత్తరము:- (1) చేదు, పులుపు, ఉప్పు, కారము వీనితో గూడినది (2) మిక్కిలి వేడిగా నున్నది (3) చమురులేనిది (4) మిగుల దాహమును గలుగజేయునది.

ప్రశ్న:- కావున ముముక్షు వేమి చేయవలెను?

ఉత్తరము:- ఆ యాహారమువలన కలుగు దుష్పరిణామమును మఱల మఱల భావించుచు దానిని త్యజించివేయవలెను.

~~~~~

* కట్వమ్లలవణాత్యుష్ణ - పాఠాన్తరము.

తిరుమల సర్వస్వం -237*

 *తిరుమల సర్వస్వం -237*

*ద్వాదశ ఆళ్వారులు-2* 

2  ముని వెనుదిరగడంతో భూమాతకు ఏర్పడిన సంక్షోభం తొలగి పోయింది గానీ, విశ్వకర్మ శాపఫలితంగా అప్పటివరకూ అప్రతిహతంగా చలామణిలో ఉన్న ద్రావిడభాష మాత్రం తన ప్రాభవాన్ని సమూలంగా కోల్పోయింది. కేవలం పామరులు, పిశాచగణాలు ఉపయోగించుకునే భాషావశేషంగా మిగిలిపోయింది. తన మానసపుత్రిక యైన 'ద్రావిడభాష' కు పట్టిన దుస్థితికి తీవ్రంగా కలత చెందిన అగస్త్యముని అనితర సాధ్యమైన తపమాచరించి, ఆ భాషను పునరుద్ధరింప జేయవలసిందిగా శ్రీమహావిష్ణువును అభ్యర్థించాడు. లోకకళ్యాణార్థం అగస్త్యుని కోర్కెను మన్నించిన శ్రీమహావిష్ణువు ద్రావిడభాషకు పూర్వవైభవాన్ని సంతరింపజేయడానికై పూనుకున్నాడు. తదనుగుణంగా శ్రీహరి ఆదేశానుసారం వారి ఆయుధాలు, ఆభరణాలు, పరివార సదస్యులు వీరంతా ద్రావిడదేశంలో దివ్యపురుషులైన ఆళ్వారులుగా జన్మించి, శ్రీహరిని స్తుతిస్తూ వేలాది కీర్తనలు, పెక్కు గ్రంథాలు ద్రావిడభాషలో రచించి, వాటికి పండిత పామరులలో విశేషంగా ప్రాచుర్యం కల్పించి ఆ భాషకు తిరిగి ఔన్నత్యాన్ని కల్పించారు. తద్వారా మృతభాషగా నున్న ద్రావిడభాష పునరుజ్జీవం పోసుకొని, అగస్త్యుని చిరకాల స్వప్నం సాకారమైంది. ఆ విధంగా ఆళ్వారులందరూ ద్రావిడదేశం లోనే జన్మించడం, ద్రావిడభాష లోనే తమ సాహితీ సాధనను కొనసాగించడం శ్రీహరి ఆదేశం మేరకే జరిగిందన్న మాట.

 *నాలాయిర దివ్యప్రబంధం*  

 ఆళ్వారులందరూ శ్రీహరిని, శ్రీవేంకటేశ్వరుణ్ణి స్తుతిస్తూ రచించిన కీర్తనలనూ, పాశురాలనూ తరువాతి కాలంలో సేకరించి ఈనాడు తమిళులకూ, శ్రీవైష్ణవులకూ, వైష్ణవభక్తులందరికీ పరమ పూజనీయమైన 'నాలాయిర దివ్యప్రబంధం' అనే పాశురాల సంకలనం వెలువరించబడింది. ఈ సంకలనంలో, ఇరవైనాలుగు ప్రబంధాల యందు పొందుపరచబడి యున్న నాలుగువేల పాశురాలలో కొన్నింటిని నేటికీ వైష్ణవక్షేత్రాలన్నింటిలో నిత్యమూ పఠిస్తారు. ఈ నాలుగు వేల పాశురాల లోని 206 పాశురాలలో శ్రీవేంకటేశ్వరుడు కీర్తించబడ్డాడు. *'నాలాయిర'* అనే తమిళపదానికి *'నాలుగు వేలు'* అని అర్థం. అలాగే, 'పాశురం' అంటే 'పద్యము' లేదా 'శ్లోకము'; తీయని స్వరం అనే అర్థాలున్నాయి. ధనుర్మాసంలో వైష్ణవాలయాలన్నింటిలో పఠించే, మనకు సుపరిచితమైన, ముప్ఫై పాశురాల సమాహారం *'తిరుప్పావై'* నాలాయిర దివ్యప్రబంధంలో అంతర్భాగమే..

 ఈ పాశురాలకు విశేషమైన పౌరాణిక ప్రాధాన్యతతో పాటుగా, చారిత్రక ప్రాశస్త్యం కూడా ఉంది. వీరి రచనల ద్వారా తిరుమలకు, శ్రీరంగానికి, కాంచీపురానికి, మరెన్నో వైష్ణవ క్షేత్రాలకు సంబంధించిన చారిత్రకాంశాలు సైతం వెలుగు చూశాయి. 'నాధముని' అనే విష్ణుభక్తుడు ఈ దివ్యప్రబంధాన్ని పండితపామరులందరూ రాగయుక్తంగా పాడుకునే వీలుగా రాగాన్ని, తాళాన్ని సమకూర్చి తరించాడు.

 *పుట్టు పూర్వోత్తరాలు* 

 ఆళ్వారులందరూ తమిళదేశం లోనే జన్మించినప్పటికీ, వీరందరూ సమకాలికులు కాదు. వీరి జీవితకాలం గురించి చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వీరు మూడవ శతాబ్ది నుండి తొమ్మిదవ శతాబ్దానికి చెందినవారని కొందరు అభిప్రాయపడతారు. కాగా వీరు ఏడు నుండి తొమ్మిది శతాబ్దాల కాలంలో జీవించియున్నారని చాలామంది చరిత్రకారులు భావిస్తారు. అలాగే, వీరి సంఖ్య 'పన్నెండు' అనే విషయంలో స్థూలంగా ఏకాభిప్రాయ మున్నప్పటికీ, ఈ పన్నెండు మంది 'ఎవరెవరు?' అనే విషయంలో స్వల్పంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

 ఈ అళ్వారులందరూ జన్మతః శ్రీవైష్ణవులు కాదు. వీరు శ్రీవైష్ణవ సంజాతుల నుండి అంత్యజుల వరకూ; సుక్షత్రియుల నుండి చోరాగ్రేసరుల వరకూ; అలాగే పుట్టుక తోనే విష్ణువుభక్తిలో తల్లీనమైన వారినుండి వేశ్యాలోలత్వానికి గురియైన వారి వరకూ; ఇలా భిన్నమైన నేపథ్యాలు కలిగినవారు. కానీ, వీరందరినీ ఏకసూత్రంలో బంధించే విశేషమైన సారూప్యతలు కూడా అనేకం ఉన్నాయి. రందరూ శ్రీమహావిష్ణువును సాక్షాంత్కరింప జేసుకున్నవారే!

 శ్రీవేంకటేశ్వరుని శ్రీమహావిష్ణువు కలియుగావతారంగా భావించి, తిరుమలేశుని తమ పాశురాలతో కీర్తించి తరించినవారే!

 పుట్టుకతో సంబంధం లేకుండా వీరందరూ శ్రీహరిని సేవించుకుని, శ్రీవేంకటేశ్వరుని భక్తితత్వాన్ని విశేషంగా వ్యాప్తిచేసి ఆనాడు సమాజంలో విస్తృతంగా వ్రేళ్ళూనికుని ఉన్న కులవ్యవస్థకు, వర్ణాశ్రమధర్మాలకు పెను సవాలు విసిరి; ముక్తిమార్గాన్ని పొందడానికి కులం, పుట్టుకలతో సంబంధం లేదని, హరినామస్మరణతో, నిరంతర సాధనతో మోక్షాన్ని పొందవచ్చని నిరూపించారు.

 జన్మ రీత్యా విభిన్నమైన నేపథ్యాలు, జీవనగమనం రీత్యా పరస్పర విరుద్ధమైన దృక్పథాలు కలిగిన ఆళ్వారులందరూ తరువాతి కాలాలలో శ్రీవైష్ణవులకు తప్పనిరియైన *'పంచ సంస్కారాలను'* స్వీకరించి, శ్రీవైష్ణవులుగా పునర్జన్మ నొంది, శేషజీవితాన్ని శ్రీహరికి సమర్పించుకొని, తమ సంకీర్తనామృతంలో భక్తజనులను పరవశింప జేశారు. 

[ రేపటి భాగంలో ... *ద్వాదశ అళ్వారులు* - *పంచసంస్కారాలు,* గురించి తెలుసుకుందాం]

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 

*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*కర్ణ పర్వము ప్రథమాశ్వాసము*

*375 వ రోజు*

*దేవతలు బ్రహ్మదేవునితో చేరి ఈశ్వరుడిని వేడుకొనుట*

దేవతలు, మునులు, ఇంద్రుడు, బ్రహ్మదేవునితో చేరి శివుని వద్దకు చేరి " పరమేశ్వరా ! నీవు జ్ఞానమూర్తివి, సత్యస్వరూపుడవు నీకు తెలియనిది లేదు " అని స్తుతించగా ఈశ్వరుడు " సంతోషించి ఏమి కావాలి ? " అన్నాడు. బ్రహ్మ పరమేశ్వరునితో " పరమేశ్వరా ! నీవు నన్ను ప్రజాపతిగా చేసావు. ఆ అధికారమును వినియోగించి నేను ఈ ముగ్గురు రాక్షసులకు వరములు ప్రసాదించాను. వారు ఆ వరగర్వంతో మూడు పురములు నిర్మించుకుని ముల్లోకాలను గడగడలాడిస్తున్నారు. ఇంద్రునికి కూడా అతడిని గెలువ శక్యము కాలేదు. నీవుగాక వారిని సంహరించగల వారు లేరు. కనుక అందరమూ నిన్ను శరణు జొచ్చాము. ఆ రాక్షసులను సంహరించి ముల్లోకములను కాపాడాలి " అని వేడుకున్నారు. ఈశ్వరుడు " బ్రహ్మదేవా ! నీను చెప్పినది నిజమే. వారు చంపదగిన వారే అయినా వారు మహాబలవంతులు నేను ఒక్కడినే వారిని జయించ లేను. కనుక నేను నా తేజస్సులో సగభాగము ఇస్తాను మీరంతా వారిని సంహరించండి " అన్నాడు. దేవతలు " పరమేశ్వరా ! ఆ మువ్వురి బలముకంటే మా బలము సగమే ఉంది కనుక మేము వారిని గెలువలేము. నీ మహా తేజస్సు మేము భరించరానిది. కనుక మా శక్తులను మీకు ధార పోస్తాము. కనుక నీవే వారిని సంహరించు " అన్నాడు. ఆ మాటలకు శివుడు " దేవతలారా ! నాకు మీరు రాక్షసులు సమానమే. అంతే కాదు నాకు సర్వప్రాణులు నాకు సమానమే. అందరికీ సమానంగా ఆనందం కలిగిస్తాను కనుక నాకు శివుడు అనే నామం వచ్చింది. దుష్టశిక్షణ శిష్టరక్షణ నా కర్తవ్యం. పరులను పీడించే దుర్జనులను సంహరించి ధర్మవర్తనులైన మిమ్ము రక్షిస్తాను. కనుక మీరంతా మీ తేజస్సు బుజ బలము నాకు చెందేలా చేయండి. నేను ఈ కార్యము నిర్వహించడానికి ముల్లోకములకు పశుత్వము నాకు పశుపతిత్వము కావాలి నేను ఈ కార్యము చేయడానికి నాకు పశుపతిత్వము కావాలి ఈ లోకాలకంత పశుత్వము కావాలి. అప్పుడు కాని పశువులను చంపిన పాపం నన్ను అంటదు. మీరందరూ కలిసి నాకు ఒక దివ్యరధమును, ఒక సారథిని, దివాశ్వములను, ఒక విల్లు, ఒక బాణం కావాలి. అప్పుడు నేను ఆ రాక్షసుల మూడు పురములను ఒక్కసారిగా నాశనం చేయగలను.

*పాశుపత వ్రతము*

శివుని మాటలు విన్న దేవతలు సంకోచిస్తూ తలలు వంచుకున్నారు. తమకు కూడా పశుత్వము వస్తుంది అని శకించారు. వారి అనుమానం అర్ధం చేసుకున్న శివుడు దేవతలారా ! మీరు భయపడ వద్దు. మీకు కలిగిన పశుత్వము నుండి బయటపడటానికి ఒక మార్గం ఉంది. మీరంతా పాశుపత వ్రతం ఆచరించి మీ పశుత్వము పోగొట్టుకొని మోక్షము పొంద వచ్చు. ఆ వ్రతము పన్నెండు సంవత్సరములు చేయవలెను. చేసే వారి నిష్టానుసారం ఒక సంవత్సరము కాని ఆరు నెలలు కాని, ఒక రుతువులో కాని, ఒక మాసముకాని, కనీసం పన్నెండు దినములలో కాని ఫలితం ఇస్తుంది. ఆ మాటలకు దేవతలు సమ్మతించి అన్ని లోకములకు పశుత్వము రావడానికి అంగీకరించి. శివునకు పశుపతిత్వము కలగడానికి ఒప్పుకుని అతడిని పశుపతిగా కీర్తించారు. దేవతలంతా తమ తేజస్సులో సగము శివునకు ధారపోసారు. ఆ తేజస్సును అందుకున్న పరమ శివుడు తేజోవంతుడయ్యాడు. ఇంద్రుడు దేవతలతో కూడి శివుడిని త్రిపురాసుర సంహారానికి అభిషేకించారు. దేవతలందరూ త్వష్ట ప్రజాపతిని చూసి శివుడికి మహోత్కృష్టమైన ఒక విల్లును, ఒక రథమును, అమ్మును, హయములను తయారు చేసి ఇమ్మని అడిగారు.

*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు - వైశాఖ మాసం - కృష్ణ పక్షం - ప్రతిపత్ - విశాఖ -‌‌ భౌమ వాసరే* (13.05.2025)

ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

పంచాంగం 13.05.2025 Tuesday,,

 ఈ రోజు పంచాంగం 13.05.2025 Tuesday,,

స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాస కృష్ణ పక్ష ప్రతిపత్తి తిథి భౌమ వాసర విశాఖ నక్షత్రం వరియాన్ యోగః: బాలవ తదుపరి కౌలవ కరణం.

రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు.

నమస్కారః , శుభోదయం