18, సెప్టెంబర్ 2023, సోమవారం

Cutting engine


 

Kalighat


 

Steem engine


 

Modi ji


 

Types of engine


 

Samudrayan


 

Rotary to receprpctin


 

Bhakta ramadas


 

రామాయణ కాలం నాటి భూగోళ రూపు రేఖలు

 రామాయణ కాలం నాటి భూగోళ రూపు రేఖలు



రామాయణం ఒక భూగోళ శాస్త్రము. 

సీత జాడకోసం వెతకడానికి వెళుతున్న వానరులకు సుగ్రీవుడు వింధ్య పర్వతం నాకు నలు దిక్కులా ఏమేమి విశేషాలున్నాయో, ఎటు వైపు ఏ నదులు, దేశాలు, ఏ ఏ సముద్రాలున్నాయో నిశితంగా వివరిస్తాడు. రామాయణ కాలం నాటి భూగోళ రూపు రేఖలు నేటికి కొన్ని మారినప్పటికీ మనం నేటికీ కొన్ని అన్వయిన్చుకోవచ్చును. అంతే కాక ఇప్పట్లోలాగా ఉపగ్రహాలు, గూగుల్ మ్యాపులు లేకుండా ఎంత ఖచ్చితంగా భూగోళ వివరాలను ఎలా వివరించాగలిగాడో ఒక సారి ఆలోచించండి. ఒకసారి అప్పుడు సుగ్రీవుడు చెప్పిన వివరాలు అవలోకించండి.

తూర్పు దిక్కునకు వినతుడి ఆధ్వర్యంలో వానర సైన్యాన్ని పంపుతూ అటు వైపు వివరాలిలా చెబుతాడు:

ముఖ్యమైన నదులు : గంగ, సరయు, కౌశికి, యమునా నది, యామునగిరి , సరస్వతి , సింధు;

నగరాలు : బ్రహ్మమాల , విదేహ, మాళవ, కాశి, కోసల, మగధ నగరాలు, పుండ్ర, అంగ,

అవి దాటాక సముద్రములో గల పర్వతములు, వాటి మధ్య ద్వీపములు, ( నేటి మన భారత దేశ ఈశాన్య రాష్ట్రాలను ఒకసారి పరికించండి)

తరువాత శిశిరము అను పర్వతము పిమ్మట సముద్రము (అండమాన్ సీ)

యవద్వీపము, సువర్ణ ద్వీపము, రూప్యక ద్వీపం, – బంగారు వెండికు నెలవైనవి (బర్మా, లాఓస్, ఇతరత్రా) ఇక్కడ చేపలను పచ్చిగా తింటారు. కొన్ని నేడు సముద్ర గర్భంలో కలిసిపోయి ఉండవచ్చును.

తరువాత శోననదము, అటుపై నల్లగా వుండే ఇక్షు సముద్రం ( నేడు ఒక సారి చూడండి ముదురు ఆకుపచ్చ రంగులో – సుమారు నలుపు రంగులో కనబడుతుంది సౌత్ చైనా సి )

అటుపై లోహితము, మధు సముద్రము (ఈస్ట్ చైనా సి)

తరువాత శాల్మలీ ద్వీపము (తైవాన్)

ఋషభము అని పర్వతము

మధుర జలధి (జపనీస్ సి )

ఔర్వుడు వలన హయముఖము (అగ్నిశిఖరం) (కొరియా)

13 యోజనాల దూరం లో బంగారు పర్వతము – జాత రూప శిలము

ఉదయాద్రి (ల్యాండ్ of రైసింగ్ sun ) (జపాన్ )

తరువాత క్షీరోదము అను సముద్రము (నార్త్ పసిఫిక్ ఓషన్)

అక్కడ వరకు మాత్రమె అతను చెప్పగలిగాడు. ఒకసారి మీరు గూగుల్ మ్యాప్ పరికించి చూడమని మనవి.

దక్షిణ దిక్కుకు అంగదుడు, హనుమంతుడు వంటి వీరులను పంపుతూ అక్కడి వివరాలిలా చెబుతాడు.

నదులు : గోదావరి, మహానది, కృష్ణవేణి, వరద , మహాభాగా

దేశాలు : మేఖల, ఉత్కళ, దశార్ణ , అవంతి, విదార్ధ, మూషిక, వంగ, కాలింగ, కౌశిక దండకారణ్యం, గోదావరి పాయఆంద్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ, మలయ పర్వతం అటుపై కావేరి,

పాండ్య దేశానంతరం మహా సముద్రం (బే of బెంగాల్ ) దానిలో మహేంద్రగిరి అటుపై 100 యోజనాల దూరంలో లంక

మరొక 100 యోజనాల దూరంలో పుష్పితకము (ఆస్ట్రేలియా ) , అటుపై 14 యోజనాల దూరంలో సూర్యవంతము(న్యూ జీలాండ్) ,విఅడుత్యము , కుంజరము, భోగవతి ,వృషభ పర్వతము (అంటార్క్టిక)

అది దాటాక భూమి సరిహద్దు

పశ్చిమ దిక్కుకు సుషేణుడు

వున్న రాజ్యాలు : సౌరాష్ట్ర, బాహ్లిక, శూరా, భీమ, అటుపై మరుభూమి మిట్ట నెలలు ( ఎడారులు ) ఆఫ్ఘనిస్తాన్ తరువాత సముద్రము

మురచీ , అవంతి , అటుపై సింధు నదము (మనలను సింధు నాగరికత పేరుతో నేడు ఆంగ్లేయులు హిందూ అని పిలుస్తున్నారు), అటుపై హేమగిరి, పారియాత్రము, చక్రవంతము – కొండ

60 యోజనాల దూరంలో వరాహగిరి – ప్రాగ్జోతిష పురము (భారతంలో చెప్పిన ప్రాగ్జోతిష్ పురము వేరు), సర్వ సౌవర్ణ పర్వతము, మరి కొన్ని పర్వతాలు

మేరు పర్వతము ( ఇతః పూర్వం మనము ముచ్చటించుకున్న మేరు పర్వతం మన భూగోళానికి రిఫరెన్స్ గా వున్న పాయింట్)

10000 యోజనాల దూరంలో అస్తాద్రి ( యునైటెడ్ కింగ్డమ్) (రవి అస్తమించని దేశం )

తరువాత సరిహద్దు

ఉత్తర దిక్కుకు శతవాలి

ముందుగా హిమవత్పర్వతము అటుపై మ్లేచ్చ దేశములు, పులిందులు, ఇంద్రప్రస్థ, Tankana, చీనా, పరమ చీనా,(నేటి చైనా ) కాల ప్రవతము,(కజాక్స్తాన్ ), హేమగర్భము (మంగోలియా) సుదర్శనము

దేవసాఖ శైలము అటుపై శూన్య ప్రదేశము (రష్యా) తరువాత తెల్లని హిమం తో కూడుకున్న పర్వతము – కైలాసము, అటుపై క్రౌన్చగిరి, ఇంకా హిమం తో వున్నా మరి కొన్ని పర్వతాలు (రస్యా )

లవణ సముద్రము ( కార సి), సోమగిరి (బోల్షెవిక్) పిమ్మట సరిహద్దు

అంతకు మునుపు టపాలలో మనకున్న టెక్టోనిక్ ప్లేట్ లు కదులుతున్నాయని ప్రస్తావించడం జరిగింది. కాలగర్భంలో ఎన్నో భౌగోళిక మార్పులు జరిగాయి. కొన్ని ఖండాలకు ఖండాలు సముద్ర గర్భంలో కాలిపోయాయి, కొత్తవి వెలికి వచ్చాయి. కానీ కొన్ని మార్పు లేకుండా వున్నాయి.

ఇక్కడ మనం గమనించ వలసినది ఏమిటంటే ఇంత టెక్నాలజీ లేకుండా ఎప్పుడో రచించ బడిన రామాయణంలో ఇంత ప్రస్ఫుటంగా భౌగోళిక వివరాలు పొందు పరచబడి వున్నాయి🙏🙏

Pastor


 

Amazing idea


 

మోదీ కాదు (కర్మ) యోగి !

 మోదీ కాదు (కర్మ) యోగి !


మోదీ అనగానే అందరూ ఓ గుజరాతీ అనో, హిందూత్వవాది అనో, ఆరెస్సెస్ స్వయం సేవక్ అనో, రాజకీయ నాయకుడనో, ముఖ్యమంత్రనో, ప్రధాని అనో... 


ఇలా తమకు తోచింది భావిస్తుంటారు! ఆయనంటే పడని వారు ఇంకా బోలెడు విధాలుగా భ్రమించి భయపడుతుంటారు! 


కానీ, నిజంగా మోదీ ఎవరు? 

మోదీ ఒక కర్మ యోగి! తన కోసం తాను సన్యాసిగా మారి పరివ్రాజకుడైపోదామనుకున్న అవధూత... 


ఇవాళ్ల మన కోసం... కర్మ యోగిగా మారి నిత్యం కష్టపడుతోన్న దైవం పంపిన దూత! 


ఆయన ఇళ్లు వదిలి వెళ్లిపోయాడు. భార్యని పట్టించుకోలేదు. ఇలాంటి మాటలే మీడియా వాగుతుంది కానీ... 


ఇంటి నుంచి బయలుదేరిన ఆ సత్యాన్వేషి తరువా ఏం చేశాడు? ఇది తెలిసి కూడా చెప్పదు! 

మీడియా చెప్పని మోదీ పరివ్రాజక జీవితం ఏంటంటే... 


ఇల్లు వదిలి బయలుదేరిన నరేంద్రుడు దేశమంతా తిరిగాడు. ఆరెస్సెస్ ప్రచారక్ గా కాదు. 


కేవలం ఒక సత్యాన్ని అన్వేషించే సనాతన ఆత్మ స్వరూపిగా! అలా తిరిగి తిరిగి ఆయన చివరకు మోక్షం కోరే అందరూ చేరే కేంద్రానికే చేరాడు! 


హిమాలయాలకు!

హిమాలయాల్లో అనేక పుణ్యక్షేత్రాలు దర్శించిన మోదీ మానస సరోవరం కూడా సందర్శించారు. 


మౌంట్ ఎవరెస్ట్ పర్వతం అధిరోహించి ( పర్వత శిఖరాగ్రం అధిరోహించలేదు. ) తిరిగొచ్చారు. 


స్వరాష్ట్రంలోని రాజ్ కోట్ కు వచ్చాక రామకృష్ణ మఠం చేరుకుని అక్కడి స్వామీజీ... 


ఆత్మస్థానందజీ మహారాజ్ ను ఆశ్రయించారు. తనకు సన్యాస దీక్ష ప్రసాదించమని అభ్యర్థిచారు. 


కానీ, అక్కడే విచిత్రం జరిగింది! రామకృష్ణ మఠం స్వామీజీ నరేంద్రుడికి సన్యాసం ఇవ్వలేదు! 


ఆయన తన స్వంత మోక్షం కోసం కాక జాతి విముక్తి కోసం కృషి చేయాల్సి వుందని నచ్చజెప్పి తిరిగి పంపారు! 


ఆ రోజు నుంచీ మోదీ యోగికి బదులు కర్మ యోగి అయ్యారు! సన్యాసి కాని సన్యాసి అయ్యారు!


ఇల్లు వదలటం, హిమాలయ యాత్ర, స్వామీజీని ఆశ్రయించటం... వీటి తరువాత అప్పుడు మొదలైంది ఆరెస్సెస్ స్వయం సేవక్ శకం! 


ఆరెస్సెస్ ఆఫీసులో గది శుభ్రం చేయటం, టీ పెట్టడం లాంటి చిరు పనులతో మొదలైన మోదీ జీవితం ప్రచారక్ గా ఉజ్వలమైంది! 


ఆయన మీద ఎన్నో బాధ్యతలు పెట్టిన సంఘ్ ని ఆయన ఏనాడూ నిరాశపరచలేదు! అడుగడుగునా తన సత్తాతో ఆశ్చర్యపరిచారు! 


అందుకే, ఆరెస్సెస్ మోదీ అనే తమ అణ్వయుధాన్ని బీజేపికి బహూకరించింది. 


పార్టీ కార్యకలాపాల్లో తలమునకలైన మోదీ ఏమేం చేశారో అంతా బహిరంగమే! 


ఇవాళ్ల గుజరాత్ బీజేపీ సర్వ విధాలా అజేయంగా వుండటానికి ఆయన పాత్ర కూడా కీలకం! అందుకే, గుజరాత్ సీఎం పీఠం ఆయనను అనివార్యంగా వరించేసింది!


మోదీ... ముఖ్యమంత్రి నుంచీ ప్రధాని ఎలా అయ్యాడో... ఇంకా చాలా మందికి తెలిసిన ప్రస్థానం! అసలు ఒక్క రోజు, 


ఒక్క గంట కూడా ప్రతిపక్షంలో వుండకుండా రాష్ట్రాన్ని, దేశాన్ని ఏలటం... కేవలం రాజకీయ చాతుర్యమేనా? కానేకాదు... మోదీ వెనుక ఆధ్యాత్మిక శక్తే... ఆయనను , మిగతా మరుగుజ్జు స్వార్థ రాజకీయ నేతల్ని వేరు చేసేది!


ఒక పరీక్షిత్తు, ఒక విక్రమాదిత్యుడు, ఒక చంద్రగుప్తుడు, ఒక శాతవాహనుడు, ఒక పుష్యమిత్ర శుంగుడు, ఒక ఛత్రపతి శివాజీ, ఒక నరేంద్ర దామోదర్ దాస్ మోదీ !🌹🇮🇳🙏

జ్యోతి ఈవెంట్స్* వారి *దసరా కార్నివాల్*

 *జ్యోతి ఈవెంట్స్* వారి *దసరా కార్నివాల్* 


మన స్టాల్ హోల్డర్స్ అందరికీ సువర్ణ అవకాశం. అల్కాపురి పార్క్ యాజమాన్యం మనకి ఎగ్జిబిషన్ & సేల్ నిర్వహించడానికి అవకాశం కల్పించింది. 


సుమారుగా 50 స్టాల్స్ తో మనము ఎగ్జిబిషన్ అండ్ సేల్ నిర్వహించుకోవచ్చును.


దసరా పండుగని పురస్కరించుకుని ఈనెల ముందుగానే మనము సెప్టెంబర్ 30వ తేదీ మరియు అక్టోబర్ 1వ తేదీ ఎగ్జిబిషన్ అండ్ సేల్ నిర్వహించడానికి సంసిద్ధులైనాము.


ఈ రెండు రోజులు అందరికీ చక్కటి వ్యాపారము తప్పకుండా కలుగుతుంది. ఈ పార్కు నందు పెట్టుకున్న స్టాల్ హోల్డర్స్ అందరికీ కూడా ఎగ్జిబిషన్లోనే కాకుండా తర్వాత కూడా చాలాసార్లు బిజినెస్ జరగడం జరిగింది.


*స్టాలు ధర:-* ఒక్కరోజు అయితే ₹800, అదే రెండు రోజులకి బుక్ చేసుకుంటే ₹1400 మాత్రమే. జ్యోతి ఈవెంట్స్ లో మెంబర్షిప్ ఉన్నవారికి 10% రాయితీ.


*సంప్రదించగలరు:-*

*తంగిరాల జ్యోతి*

*7416223176*

*JYOTHI EVENTS*

బసవ పురాణం - 34 వ భాగము

 🎻🌹🙏బసవ పురాణం - 34 వ భాగము


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌷గోవూరుబ్రహ్మయ్య కథ


🌸గోవూరు బ్రహ్మయ్య అనే భక్తుడు ఒక జైనునితో వాదించి ఓడించాడు. జైనుడు ‘ఈ వాదాలెందుకు? ఈ మర్రి చెట్టును కాలిస్తే బతికిస్తావా?’ అన్నాడు. 


🌿సరేనని బ్రహ్మయ్య చిరునవ్వు నవ్వాడు. జైనుడు మర్రిచెట్టును కాల్చాడు. బ్రహ్మయ్య దానిపై భస్మం చల్లి బతికించి జైనులందరినీ ఓడించాడు.


🌷తేడర దానయ్య


🌸పొట్ల చెరువు అనే నగరంలో ఏడు వందల జైనవసదులున్నాయి. ఇరవై వేలమంది జైనులు అందులో వున్నారు. భల్లహడనే నగర పాలకునికి జైనా చార్యుడే గురువు సింహభల్లహుని భార్య సగ్గలదేవి. 


🌿ఆమె శివభక్తురాలు. గురువు తేడర దాసయ్య. భర్త చెప్పినా వినక గురువును పాదపూజకై పొట్లచెరువు పిలిపించింది.దాసయ్యకూ జైనులకూ శాస్తవ్రాదం జరిగింది. అందులో దాసయ్య సమస్త సిద్ధాంతాలు ఖండించాడు. ‘


🌸రామనాధుడే’ కర్త వేదాల ప్రకారం ఏకమేవ రుద్రో’ అనీ ‘లింగమధ్యే జగత్సర్వ’మనీ ‘లింగబాహ్యాత్పరం నాస్తి’ అనీ ఉన్నది కాబట్టి ‘ఈశ్వరుడే పరదైవం’ అని ప్రతిపాదించాడు. 


🌿ఈశ్వరుడు సర్వవ్యాపి అయితే ఈ కుండలో ఈశ్వరుడున్నాడు పట్టుకో’’ అని జైనులు ఒక కుండలో నాగు పామును పెట్టి తెచ్చారు. తేడర దాసయ్య శివనామస్మణ చేసి కుండలో చేయి పెట్టి పామును పైకి తీశాడు. 


🌸సర్పం స్ఫటికలింగమై పైకి వచ్చింది. ఆ లింగాన్ని ఉత్తరేశ్వరుడనే పేర అక్కడే ప్రతిష్ఠ చేసి బల్లహునితో సహా సమస్త ప్రజలనూ శైవంలో చేర్పించాడు.


🌷హిరియ నాచయ్య కథ


🌿మారుడిగ అనే చోట హిరయ నాచయ్య అనే భక్తుడు ఉండేవాడు. అక్కడ పదిహేడు వందలమంది జైనులు విజృంభించి శివాలయాన్ని పడగొట్టి పూజారిని హింసించారు.


🌸అది చూచి నాచయ్య పదిహేను వేల లింగాలను బండ్లకెత్తించి పనె్నండు వేల శివభక్తులతో వచ్చి మారుడిగలో దిగి యుద్ధానికి సిద్ధమైనారు. 


🌿అందులో పదముగ్గురు తేరసులు అనేవారు నాచయ్యకు వదనం చేసి తమ తలలు తామే తరుక్కొని చేత బట్టుకొని జైనులపై పడ్డారు. జైనులు చిందర వందర అయినారు.


🌸జైన వసతులన్నింటిలోనూ లింగ ప్రతిష్ఠలు చేసి తిరిగి తమ తలలు తాము యధాస్థానంలో ఉంచుకొని తమ నాయకుడైన నాచయ్య మహిమను ప్రదర్శించారు.


🌷సోమన్నగారి కథ


🌸హుళిగఱ అను నగరంలో సోమన్న అనే శివభక్తుడున్నాడు. త్రికాల శివస్పర్శ అతని నియమం. ఒకనాడు కన్నులు కనబడక శివస్పర్శ చేయలేక భుజింప కూర్చొని యుండగా జైనులు వచ్చిరాశివాలయానికితీసుకుపోతాము’ 


🌿అని చేయి పట్టుకొని వెళ్లి జైన విగ్రహానికి మోకరిల్లజేయించి ‘జినుడు ప్రత్యక్షమైనాడులే!’ అన్నారు నవ్వుతూ. సోమన్న రోషంతో ‘మూర్ఖులారా! వంచన చేస్తారా?’ అని బలవంతంగా కన్నులు తెరిచి చూచాడు. 


🌸జిన విగ్రహం పగిలి నడుమ లింగం ఆవిర్భవించింది. జైనులు భయభీతులైనారు. లింగాన్ని సోమేశుడనే పేర నాటినుండీ అంతా పిలవసాగారు.


🌷వైజకవ్వ కథ


🌿పూర్వం వైజకవ్వ అనే భక్తురాలు ఉండేది. ఆమె భర్త జైనుడు. జైనులకోసం వంటలు చేయించాడు. ‘ఒక్క లింగ ప్రాణి అయినా తినకుండా వంటలు వ్యర్థమవుతున్నాయే


🌸అని వైజకవ్వ దుఃఖిస్తూ ఉండగా శివుడు శివముని రూపంలో వచ్చి వైజకవ్వ వంట ఆరగించాడు. అది చూచి జైనులు మండిపడి వైజకవ్వ మొగుడితో చెప్పారు.


🌿అతడు ‘జైనులకు పెట్టకుండా ఒక శివుడికి పెట్టావా?’ అని కోపగించి భార్యను కొట్టసాగాడు. కానీ వైజకవ్వను శివుడు కాచాడు. ఆమెపైన పడే దెబ్బలన్నీ జైనులపైబడి జైనులు ప్రాణాలు విడవసాగారు.


🌸‘్భర్త శైవేతరుడైనప్పుడు అతనిని విడవడమే ధర్మం’ అని భావించి వైజకవ్వ శివుణ్ణి ప్రార్థించి పురుషునిగా మారిపోయింది. వైజకనాథుడనే పేర ప్రసిద్ధుడైనాడు.


🌷షోడ్డలదేవు బాచయ్యగారి కథ


🌿షోడ్డలదేవు బాచరసు అనే భక్తుడు బిజ్జలుని కొలువులో ఉండేవాడు. శివరాత్రికి సౌరాష్ట్రం పోవాలని సంకల్పించి ప్రభువుతో చెప్పగా ‘చాలు చాలు నీవు పోతే ధాన్యం పని ఎవరు చూస్తారు?’ అని రాజు మందలించాడు. 


🌸గత్యంతరం లేక బాచరసు ‘నేను రాలేను ప్రభూ. నీవే రా’ అని ప్రార్థించాడు. సౌరాష్ట్ర లింగం ధాన్యపుగాదెలోప్రత్యక్షమైంది...సశేషం...🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

పద్యాల నైవేద్యం*

 *వినాయకునికి పద్యాల నైవేద్యం*


అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు!

వినాయకచవితి తెలుగువాళ్ళకి ఆహ్లాదకరమైన పండగ. వినాయకుడంటే తెలుగువాళ్ళందరికీ ఒక రకమైన ఆప్యాయత. ఎందుకో మరి! అతని రూపమే చిత్రం! అతని వాహనం మరీ విచిత్రం! ఇష్టమైన పిండివంటలు సరే సరి! మరే దేవుణ్ణైనా మనం గడ్డితో పూజిస్తామా! అతనితో ఎన్ని సరదాలు, మరెన్ని సరాగాలు! ఆ చనువుతోనే కాబోలు నిన్న రాత్రి ఎలక గుఱ్ఱాన్నెక్కి సరాసరి నా కల్లోకి వచ్చేసి పిచ్చాపాటీ మొదలుపెట్టాడా స్వామి!


వినాయకుడు: రేపు వినాయకచవితి గుర్తుందా!


నేను: అయ్యో ఎంత మాట! నాకు గుర్తులేకపోవడమేమిటి, మాకు సెలవు కూడానూ!


వినాయకుడు: అయితే మరి నాకేం నైవేద్యం పెడుతున్నావ్?


నేను: అదీ...మరీ...స్వామీ... మా ఆవిడ ఉండ్రాళ్ళో ఏవో చేస్తానంది. ఆవిడ దయా మీ ప్రాప్తం!


వినాయకుడు: అది కాదోయ్! నువ్వు పెట్టే నైవేద్యమేవిటీ అని అడుగుతున్నా...


నేను: నేనా? ఏంటంటున్నారు స్వామీ?


వినాయకుడు: అదేనయ్యా, నీ బ్లాగులో పండగలకీ పబ్బాలకీ పద్యాలు వేస్తున్నావు కదా! ఆ తెలుగు పద్యాల ప్రసాదం గురించి నేనడుగుతున్నది.


నేను: ఓ, అదా! అయినా మా తెలుగు పద్యాలు మీకు ఆనతాయా అని...


వినాయకుడు: అదేంటయ్యా అలా అంటావ్! అసలు నాకు సంస్కృతశ్లోకాల కన్నా తెలుగు పద్యాలే ప్రీతిపాత్రం తెలుసా!


నేను: అవునా స్వామీ! అదేం?


వినాయకుడు: నన్ను తల్చుకోగానే అందరికీ గుర్తుకొచ్చే సంస్కృత శ్లోకం ఏంటో చెప్పు.


నేను: శుక్లాంబరధరం విష్ణుం...


వినాయకుడు: అవునా! మరి నన్ను తల్చుకోగానే గుర్తుకొచ్చే మీ తెలుగు పద్యం ఏవిటి?


నేను: తోండము నేకదంతమును...


వినాయకుడు: ఊ...పూర్తిగా చదువు.


నేను:

తొండము నేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్

మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసముల్

కొండొక గుజ్జురూపమును కోరిన విద్యలకెల్ల నొజ్జయై

యుండెడి పార్వతీతనయ! ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్!


వినాయకుడు: చూసావా! నువ్వు చదివిన ఆ సంస్కృత శ్లోకం నేనుకూడా చాలా కాలంనుంచీ నా గురించే అనుకుంటున్నాను. కానీ కొంతమంది అది నాది కాదు, అసలందులో నాగురించి ఏవిటుందని సందేహం వెలిబుచ్చారు. దాంతో నాక్కూడా అనుమానం వచ్చేసింది, అది నా గురించేనా అని. అదే మీ తెలుగు పద్యం చూడు. స్పష్టంగా, వివరంగా నా గురించి ఎంత చక్కగా చెప్తోందో! అందికే మీ తెలుగు పద్యాలంటే నాకిష్టం!


నేను: బావుంది స్వామీ! మీకు తెలుగు పద్యాలిష్టమని విని చాలా ఆనందంగా ఉంది!


వినాయకుడు: మీ తెలుగు కవులు ఎన్నెన్ని రకాలుగా నన్ను ప్రస్తుతించారు! అవన్నీ గుర్తు చేసుకుంటే నా బొజ్జ నిండిపోతుందనుకో!


నేను: అలాగా!


వినాయకుడు: అవునయ్యా! అతనెవరూ... జిగిబిగి కవిత్వం రాసాడు. ఆ... అల్లసాని పెద్దన. అతను బలే గడుసువాడు సుమా! నా గురించి బలే పద్యాన్ని రాసాడు. ఏదీ ఆ పద్యం ఒక్కసారి చదివి వినిపించూ.


నేను:

అంకము జేరి శైలతనయా స్తనదుగ్ధములాను వేళ బా

ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్ గబళింపబోయి యా

వంక గుచంబు గాన కహివల్లభ హారము గాంచి వే మృణా

ళాంకుర శంక నంటెడి గజాస్యుని గొల్తు నభీష్ట సిద్ధికిన్!


వినాయకుడు: తస్సాదియ్యా! కవంటే ఇతనేనయ్యా. నాక్కూడా ఎప్పుడూ రాలేదిలాంటి అల్లరి ఆలోచన! దీనికి మీ విమర్శకులేవో చాలా లోతైన విశ్లేషణలు చేస్తారు. అసలిది నా గురించే కాదనీ ఏదో వేదాంతం చెప్తారు. కానీ నాకవేవీ పట్టవు. నా గురించి అలాటి చమత్కారమైన ఆలోచన చేసాడు చూడూ! అది నాకు బలే బలే అద్భుతంగా అనిపించింది.


నేను: అవును స్వామీ! పెద్దనవలె కృతిసెప్పిన పెద్దనవలె అని అందుకేగా మేం అనుకునేది! అయితే ఇంతకన్నా ముందే కేతన కవి ఇలాంటిదే మరో చిత్రమైన ఆట మీచేత ఆడించాడు స్వామీ!


వినాయకుడు: అవునా! ఎందులో? ఏదీ ఆ పద్యం కూడా వినిపించు మరి.


నేను: ఈ పద్యం దశకుమారచరిత్రములోది. వినండి.

గ్రక్కున నేత్రయుగ్మము కరద్వితయంబున మూసిపట్టి యా

మిక్కిలి కంటికిం దనదు మిక్కిలి హస్తము మాటుసేసి యిం

పెక్కెడు బాలకేళి బరమేశ్వరు చిత్తము పల్లవింపగా

దక్కక ముద్దునం బొలుచు దంతిముఖుం గొలుతుం బ్రసన్నుగాన్!


వినాయకుడు: ఓరి మీ అసాధ్యంగూలా! మీ తెలుగుకవులు భలే వాళ్ళయ్యా! నా చేత ఎన్నెన్ని చిత్రమైన చేతలు చేయించారూ! నా రెండు చేతులతోనూ మా నాన్న రెండు కళ్ళూ మూసేసి, మా నాన్న మూడో కంటిని నా మూడో చేత్తో, "హస్తంతో", అంటే తొండంతో మూసేసానా! ఆ నిప్పుకంటి జోలికి వెళితే నా తొండమేం గానూ!


నేను: పొండి స్వామీ మీరు మరీను! పరమేశ్వరుని చిత్తం చిగురిస్తే, ఆ కన్ను మంటలు కురిపిస్తుందా ముద్దులు కురిపిస్తుంది కానీ.


వినాయకుడు: ఆలా అంటావా! అయితే ఓకే. ఇంతకీ, నన్ను మొట్టమొదట కావ్యంలో ప్రత్యేకంగా స్తుతించిన కవి ఎవరో చెప్పు?


నేను: నన్నెచోడుడు అనుకుంటాను స్వామీ!


వినాయకుడు: ఓహో! అతనే కదూ మా తమ్ముడు పుట్టుకగురించి కుమారసంభవం తెలుగులో రాసిన కవి. ఏదీ అతను రాసిన పద్యం వినిపించు.


నేను: చిత్తం.

తను వసితాంబుదంబు, సితదంతముఖం బచిరాంశు, వాత్మ గ

ర్జన మురుగర్జనంబు, గర సద్రుచి శక్రశరాసనంబునై

చన మదవారివృష్టి హితసస్య సమృద్ధిగ నభ్రవేళ నా

జను గణనాథు గొల్తు ననిశంబు నభీష్టఫల ప్రదాతగాన్!


వినాయకుడు: బావుందయ్యా! నన్ను కాస్తా నల్లనివాణ్ణి చేసేసి వర్షాకాలంతో పోల్చాడే యీ కవి! మరి నేను పుట్టింది వానాకాలంలోనే కదా! ఇంకా ఎవరెవరు ఏం చమత్కారాలు చేసారో త్వరగా వినిపించు.


నేను: కాస్త ప్రౌఢమైన చమత్కారమేదో చేసిన కవి ఒకడున్నాడు స్వామీ. అతను రామరాజభూషణుడు, ఉరఫ్ భట్టుమూర్తి. ఆ పద్యం నాకు సరిగా అర్థం కాలేదు. మీరే వివరించాలి!


వినాయకుడు: ఏవిటి నేనా! ఇప్పుడంత సమయం లేదే. సరే చదువు చూద్దాం.


నేను:

దంతాఘట్టిత రాజతాచల చలద్గౌరీ స్వయంగ్రాహముం

గంతుద్వేషికి గూర్చి శైలజకు దద్గంగాఝరాచాంతి న

త్యంతామోదము మున్నుగా నిడి కుమారాగ్రేసరుండై పితృ

స్వాంతంబు ల్వెలయింపజాలు నిభరాడ్వక్త్రుం బ్రశంసించెదన్!


వినాయకుడు: అబ్బో, యీ భట్టుమూర్తి చాలా ఘటికుడయ్యా! వాక్యాలని అటూ ఇటూ చేసి అన్వయం కష్టం చేసిపారేసాడు! మధ్యలో శ్లేష ఒకటి!

నా తొండంతో ముందు గంగ నీళ్ళన్నీ పీల్చేసి సవతిపోరు లేకుండా మా అమ్మ పార్వతికి ఆనందాన్ని ఇచ్చానట! తర్వాత నా దంతంతో వెండి కొండని ఒక్కసారి కదిలిస్తే, ఆ ఊపుకి, మా తల్లి పార్వతి మా తండ్రి శివదేవుని దగ్గరగా హత్తుకొందిట. ఆ రకంగా తండ్రికి ఆనందాన్ని కలిగించేనట. ఇలా తల్లిదండ్రులిద్దరికీ ఆనందాన్ని చేకూర్చి నేను వాళ్ళ కుమారులలో అగ్రస్థానాన్ని (కుమారస్వామికి అన్ననే కదా!) సంపాదించానట. దానికి నన్ను ప్రశంసిస్తున్నాడోయ్ మీ భట్టుమూర్తి!


నేను: బాగా వివిరించారు స్వామీ! స్వయంగా మీ నోటితో దీని వివరణ వినడం పరమానందంగా ఉంది!


వినాయకుడు: అది సరేగానీ, ఇన్నేసి చమత్కారాలు గుప్పించిన పద్యాలు కాకుండా, వినసొంపుగా హాయిగా మనసుకి హత్తుకొనే పద్యాలు ఎవరూ రాయలేదా?


నేను: ఎందుకు రాయలేదు స్వామీ! అలాటివాటికి పెట్టింది పేరు పోతన, ఆ తర్వాత కొంతవరకూ మొల్ల.


వినాయకుడు: అయితే తొందరగా వినిపించు మరి!


నేను: పోతన తనకి సహజమైన అంత్యప్రాసలతో రాసిన పద్యం ఇదిగో:

ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సం

సాదికి దోషభేదికి బ్రసన్నవినోదికి విఘ్నవల్లికా

చ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జననందవేదికిన్

మోదక ఖాదికిన్ సమద మూషికసాదికి సుప్రసాదికిన్!


వినాయకుడు: ఆహా! పోతన పద్యంలో తీయని మకరంద ధార జాలువారుతునే ఉంటుంది. మరి మొల్ల పద్యమో?


నేను: చిత్తం సిద్ధం!


చంద్రఖండ కలాపు జారు వామనరూపు

గలిత చంచలకర్ణు గమల వర్ణు

మోదకోజ్జ్వలబాహు మూషికోత్తమవాహు

భద్రేభవదను సద్భక్తసదను

సన్ముని స్తుతిపాత్రు శైలరాడ్దౌహిత్రు

ననుదినామోదు విద్యాప్రసాదు

బరశువరాభ్యాసు బాశాంకుశోల్లాసు

నురుతరఖ్యాతు నాగోపవీతు


లోకవందిత గుణవంతు నేకదంతు

నతుల హేరంబు సత్కరుణావలంబు

విమల రవికోటితేజు శ్రీవిఘ్నరాజు

బ్రథిత వాక్ప్రౌఢికై యెప్డు ప్రస్తుతింతు!


వినాయకుడు: చాలా బావుంది! సీసంలోని తూగు మరే పద్యానికొస్తుంది! అన్నట్టు సీసమనగానే గుర్తుకొచ్చింది. అసలుసిసలు తెలుగుకవి, మీ శ్రీనాథ కవిసార్వభౌముడు నా గురించేమీ రాయలేదా?


నేను: అయ్యో పొరపాటైపోయింది స్వామీ! మరచిపోయాను. ఇదిగో మీ గురించి అతను రాసిన సీసం!


కలితశుండాదండ గండూషితోన్ముక్త

సప్తసాగర మహాజలధరములు

వప్రక్రియా కేళివశ విశీర్ణ సువర్ణ

మేదినీధర రత్నమేఖలములు

పక్వ జంబూఫల ప్రకటసంభావనా

చుంబిత భూభృత్కదంబకములు

వికట కండూల గండక దేహమండలీ

ఘట్టిత బ్రహ్మాండ కర్పరములు


శాంభవీశంభు లోచనోత్సవ కరములు

వాసవాద్యమృతాశన వందితములు

విఘ్నరాజ మదోల్లాస విభ్రమములు

మించి విఘ్నోపశాంతి గావించు గాత!


వినాయకుడు: అబ్బబ్బా! ఏవి ధారా, ఏవి ధారా! ఇందుకేగా ఇతన్ని ప్రసిద్ధ ధారాధుని అని పిలిచేది. సెభాష్!

అవునూ, నువ్వందరూ పాతకవులనే చెప్తున్నావ్, ఆధునిక కాలంలో నా గురించి పట్టించుకున్న కవే లేడా ఏంటి?


నేను: అయ్యో లేకేం స్వామీ! పైన చెప్పిన కవులందరూ తమ కావ్యాల్లో ఒక పద్యంలో మిమ్మల్ని స్తుతిస్తే, ఏకంగా ఒక పద్య ఖండికనే మీకు సమర్పించిన ఆధునిక కవి ఒకరున్నారు. అతనే, కరుణశ్రీ అలియాస్ జంధ్యాల పాపయ్య శాస్త్రి. తన ఉదయశ్రీలో మీకు "నమస్తే" చెప్పారు.


వినాయకుడు: అవన్నీ వినడానికి ఇప్పుడు నాకు సమయం చాలదు. అవతల మీవాళ్ళందరూ నన్ను ఎన్నెన్ని రూపాల్లో తయారుచేసారో, ఎన్నెన్ని పిండివంటలు చేసారో చూడ్డానికి వాహ్యాళికి వెళ్ళాలి. నువ్వు కూడా తొందరగా నిద్రలేచి పూజ చేసుకోవాలి కదా! మచ్చుకి ఒక్క పద్యం వినిపించు చాలు. ఆనక మిగతావి వింటాను.


నేను: సరే అలాగే స్వామీ! చిత్తగించండి.


ఎలుకగుఱ్ఱము మీద నీరేడు భువనాలు

పరుగెత్తి వచ్చిన పందెకాడు

ముల్లోకముల నేలు ముక్కంటి యింటిలో

పెత్తనమ్మొనరించు పెద్దకొడుకు

"నల్లమామా!" యంచు నారాయణుని పరి

యాచకాలాడు మేనల్లుకుఱ్ఱ

వడకుగుబ్బలి రాచవారిబిడ్డ భవాని

నూఱేండ్లు నోచిన నోముపంట


అమరులందగ్ర తాంబూలమందు మేటి

ఆఱుమోముల జగజెట్టి అన్నగారు

విఘ్నదేవుడు వాహ్యాళి వెడలివచ్చె

ఆంధ్రవిద్యార్థి! లెమ్ము జోహారు లిడగ!


వినాయకుడు: నేను విష్ణుమూర్తిని "నల్ల మామా" అని ఆటపట్టిస్తానా! ఆహా బలే అయిడియా ఇచ్చాడే ఇతను! ఎంతైనా మీ తెలుగుకవులకి సరసం ఎక్కువే సుమీ!

మొత్తానికివాళ పంచభక్ష్య పరమాన్నాలతో విందుభోజనం చేసినట్టుంది! బావుంది నీ పద్య నైవేద్యం!

కాకపోతే ఇన్ని పద్యాలు చూసి నాకొకటే లోటుగా అనిపిస్తోంది.


నేను: లోటా! ఏవిటి స్వామీ?


వినాయకుడు: మీ తెలుగు కవులు ఇందరిగురించి కావ్యాలు రాసి, నా గురించి మాత్రం రాయలేదే అని వెలితిగా అనిపిస్తోంది. మా తమ్ముడు కుమారస్వామి గురించి కూడా వెయ్యేళ్ళ కిందటే ఎవరో రాసారని చెప్పావే, మరి ఇన్నాళ్ళై నా కథని ఎవరూ కావ్యంగా ఎందుకు రాయలేదు?


నేను: అవును స్వామీ! మీరు చెప్పే దాకా నాక్కూడా తట్టలేదు. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఆశ్చర్యంగానే ఉంది.


వినాయకుడు: పోనీలే. ఇంతమంది రాసిన పద్యాలు చెప్పేవు కదా. సొంతంగా నువ్వొక్క పద్యం నా గురించి యిప్పుడు చెప్పకూడదూ. విని దానితోనే సంతృప్తి పడతాను.


నేను: అయ్యో అంత కన్నా మరో భాగ్యం ఉంటుందా! అవధరించండి!


శ్రీకంఠుని సతి ప్రేమకి

ఆకారమ్మైన సామి! హరుని దయన్ నూ

త్నాకృతి దాల్చిన గజముఖ!

చేకూర్చుము సిద్ధి బుద్ధి స్థిరముగ మాకున్!


నేనిలా పద్యం చదివానో లేదో, అలా అదృశ్యమైపోయాడా గణనాథుడు! నా పద్య ప్రభావమేనో ఏమో! సరే పొద్దున్న యథావిథిగా పూజా కార్యక్రమాలు సాగించి, మా ఆవిడ చేసిన పిండివంటలు స్వామికి నైవేద్యం పెట్టి నేను తిని, ఇదిగో నా నైవేద్యాన్ని మీ ముందు పెట్టాను. ఆరగించండి మరి!

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

. శ్రీ గణపతి స్మరణ వలన జ్ఞానం,

 గణేశుడు బుధ గ్రహానికి అధిపతి మరియు జ్ఞానం, సంపద మరియు ఐశ్వర్యానికి అధిపతి. జ్ఞానం ఉన్నచోట చెడు ఉండదు. శ్రీ గణపతి స్మరణ వలన జ్ఞానం, సంపద మరియు దీర్ఘాయువు లభిస్తాయి. గణేశుడి జీవితమంతా ఒక పూర్తి పాఠశాల. అతని జీవితం నుండి మనం చాలా నేర్చుకోవచ్చు మరియు మన జీవితాలను సుసంపన్నం చేసుకోవచ్చు.


గణేశుడి తల ఏనుగు కాగా, శరీరం మానవుడిది. మనం మరియు ఇతర వ్యక్తులు ఉన్నట్లే మనల్ని మరియు ఇతర వ్యక్తులను అంగీకరించాలని ఇది మనకు బోధిస్తుంది. మీ శారీరక రూపాన్ని చూసి ఎప్పుడూ నిరాశ చెందకండి. ప్రజలు వారి భౌతిక రూపాన్ని గురించి విచారంగా ఉన్నారు. చాలా మంది ఇతరులను ఎగతాళి చేస్తుంటారు. భౌతిక రూపం ఏదైనప్పటికీ, మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. దాన్ని అంగీకరించి గర్వపడండి. అందం అనేది చూసేవారి దృష్టిలో ఉంటుంది. మీ బలహీనతకు చింతించకండి. దానిని బలహీనతగా కాకుండా మీ బలంగా చేసుకోండి మరియు ప్రతి రూపంలో సంతోషంగా ఉండటం నేర్చుకోండి.


గణపతి పెద్ద పొట్ట రహస్యాన్ని దాచుకునే జ్ఞానాన్ని ఇస్తుంది. అతని పెద్ద చెవులు ప్రతి ఒక్కరూ వినాలి, కానీ కదలకుండా ఉండాలనే సందేశాన్ని ఇస్తాయి. గణపతి యొక్క చిన్న నోరు అంటే మీరు తక్కువ మాట్లాడటం మరియు ఎవరి నుండి తక్కువ ఆశించడం మాత్రమే జీవితంలో పురోగతి సాధ్యమవుతుంది.


ఏనుగు శరీరం మరియు తల చాలా పెద్దవి. పెద్ద తల ఉన్నప్పటికీ, ఏనుగు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అనవసరంగా ఎవరిపైనా దాడి చేయడు. గణపతి తల కూడా ఏనుగుదే. మన శక్తిని వృధా చేసుకోవద్దని గణపతి బోధిస్తాడు. శక్తిని నిల్వ చేసుకోవాలి. కష్ట సమయాల్లో ప్రశాంతంగా ఉండండి మరియు ప్రశాంతంగా ఉండండి మరియు తగిన నిర్ణయాలు తీసుకోండి.


వినాయకుడు చాలా పెద్దవాడు కానీ అతని వాహనం చిన్నది మరియు బలహీనమైన ఎలుక. అంటే ఎంత చిన్నదైనా దానికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. దాని స్వంత ప్రాముఖ్యత ఉంది. ఉదాహరణకు, సూద

_అడిగాడా దేవుడు

 *_అడిగాడా దేవుడు ఇదంతా..._*

*_ఇంత తంటా!?_*


################


*_గున్న గున్న మామిడి_*

*_గున్న మామిడి తోటకి.._*

ఇది అడిగాడా వినాయకుడు..!


*_ఓపెన్..గంధం స్టార్.._*

గణపతి మెడలో ఒక దండ..

ఆయన పేరిట పెద్ద దందా..

ఇంటింటా చందా..!

అలా చేస్తూ పోతే

*ఎమ్మల్యే పదవీ రాదా..*

అదేగా కొందరి ఇరాదా..!?


ఈ ఏడాదైతే మరీ జోష్..

జనాలు ఫుల్ ఖుష్..

ఈలోగా కొత్త పాటలు..

*ఊ..అంటావా..మావా*

*ఉహు అంటావా..*

హోరెత్తించే సంగీతం

*_పార్వతీ సుతునకేనా అంకితం..!?_*


ఇదేనా 

మన సంప్రదాయమిదేనా.. 

అసలు ఎప్పటి నుంచో

వినాయకుడు జోకర్..

ప్రమధ గణాధిపతి

*_కామెడీకేనా అధిపతి..!_*


వినాయకుడే *శంకర్ దాదా..*

ఆయనే *మేజర్ చంద్రకాంత్*

మరి అతగాడే *భారతీయుడు*

ఇప్పుడేమో లేటెస్ట్..

*_గణపతిరాజ్..తగ్గేదేలే.._*

ఆధునిక వినాయక్

*భీమ్లానాయక్*

ఎవుడు చెప్పిన గోల..

మంటపంలో డీజే..

అది లేకపోతే అందదా

శూర్పకర్ణుడికి భక్తుల జేజే!


వద్దయ్యా ఈ గోల

వినాయకుని మ్రోల..

ఇది పూజ...

అల్లాని కొలిచే ముసల్మాన్

భక్తి శ్రద్ధలు చూడు..

చర్చికి పోయి 

క్రైస్తవుని నిరతి గమనించు..

సిక్కుపైనా ఒక లుక్కు వెయ్యి

ఎవరి దేవుడు వారికి గొప్ప..

నీ గణపతి మాత్రం జోకరా..

ఇది దేవుడు 

కోరని హంగామా..

నువ్వు నీకుగా

ఆడే డ్రామా!


వినాయకుని ఊరేగింపులో

ఆ పాటలు..డాన్సులు..

ప్రళయభీకర మ్యూజిక్కుకి

కాలాంతక స్టెప్పుల కిక్కులు..

నిక్కర్లు..తలకి బాడ్జీలు..

ఇంగితం మరచి గంతులు..

గొడవలు..కొట్లాటలు..

నీతులు మరచి బూతులు..

వీటిలో భక్తి ఉందా..

చివర్లో పెట్టే సంతర్పణ..

అదే భగవంతునికి అర్పణ..

మిగిలిన జాగరణ..

ఊరికి రణగొణ..

అనవసరపు సంస్కరణ..

లోపించే త్రికరణ..!


🫢🫢🤦🏼‍♀️🤦🏼‍♀️🤦🏼‍♀️🫢🫢


                 *_ఈఎస్కే_*


ప్రశాంత..ఆనందకర..

శుభకర వినాయకచవితి

శుభాకాంక్షలతో..


🙏💐🙏💐🙏💐

సుభాషితమ్

|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 


𝕝𝕝శ్లో𝕝𝕝 *రణత్క్షుద్రఘణ్టానినాదాభిరామం*

*చలత్తాణ్డవోద్దణ్డవత్పద్మతాలమ్।*

*లసత్తున్దిలాఙ్గోపరివ్యాలహారం*

*గణాధీశమీశానసూనుం తమీడే॥*

                ~శ్రీగణేశభుజఙ్గస్తోత్రమ్


𝕝𝕝తా𝕝𝕝 

మ్రోగుచున్న చిరుగవ్వల సవ్వడిచే మనోహరుడు, తాళముననుసరించి ప్రచండతాండవం చేయుచున్న పాదపద్మములు కలవాడు, బొజ్జపై కదులుతున్న సర్పహారములు కలవాడు, ఈశ్వరపుత్రుడు అగు గణాధీశుని స్తుతించుచున్నాను.

 శుభోదయం🙏


అల్లసాని వారి చమత్కారమ్!

"అంకముఁ జేరి శైలతయా స్తన దుగ్ధము లానువేళ బా

ల్యాంక విచేష్ఠ తొండమున నవ్వలి చన్గబళింపఁ బోయి ఆ

వంకఁగుచంబు గానకహివల్లభ హారముఁగాంచి వేమృణా

ళాంకుర శంక నంటెడు గజాస్యునిగొల్తు నభీష్ఠసిధ్ధికిన్;

-పీఠిక -మనుచరిత్రము.


      భావము; "బాలగణపతి తల్లియొడిలోకెక్కి చనుబ్రాలు తాగుతూ, మరొకవంకనున్న స్తనమును నోటబెట్ట ప్రయత్నించి ,అవైపు(కుడివైపు)స్తనమును గానక వ్రేలాడు సర్పమును తామర తూడుగా భ్రమించి నోట దాని నందుకొనజూచుచున్నాడట! అట్టి బాలగణపతిని నాకోరిక దీర్ప సేవింతును".-అని

విశేషములు:

     బాలురు తల్లిపాలుద్రాగుచు, నొకచేతితో తాముగుడుచుచున్న స్తనమును పుణుకుచు,వేరొకచేత నవతలివైపు స్తనమును పుణుకుట సహజము.

        పార్వతి ఒడిలో నిడుకొని బాలగణపతికి చనుగుడుపసాగినది.అతడూరకుండునా ? బాలుడాయె, వెర్రిపనులకు ప్రయత్నించుచున్నాడు.ఏమాప్రయత్నము? అటువైపు చన్నుకొరకు వెదకులాడు చున్నాడు.పాపమాతల్లి యర్ధనారీశ్వరి.ఆమెతనువున ఎడమ భాగమునస్త్రీత్వము,కుడివైపు పరమేశ్వరత్వము.)అనగా పురుషత్వము)

       ఆభాగమున మనగణపతి తడవులాట. అట స్తనము లేదుసరిగదా సర్పహారములు వ్రేలాడుచున్నవి.పాపము!బాలుడుగదా పాములనియెరుగక వానిని నోట బెట్టు చున్నాడట.

వీడెంతవెర్రిబాలుడు? అట్టిగణపతి నాకభీష్ఠప్రదాతయగుత! అనుచున్నాడుకవి.

    ఇదియొక కల్పన!

దీనిమూలముగా ఆదిశక్తి పార్వతి యర్ధనారీశ్వరి యగుట సూచన!

         బాలుర వింత చేష్ఠలను నివరించుట,

అను నవియే ప్రయోజనములు.


పాములను తామరతూడులుగా భ్రమపడుట ఇది భ్రాంతి మదలంకారము.

     ఏనుగులకు తామరతూడులాహారము.

కనుక సహజోక్తి.

బాలురచేష్ఠల ప్రదర్శనముచే,బాలురు భ్రమపడుటయు,వారిస్వభావమే! స్వభావోక్తి,

అను నలంకారములిందుగలవు.                          స్వస్తి!

ధర్మం మనది.

 *వినాయక ఉత్సవాలు చేసే ప్రతి ఒక్కరూ ఒకసారి మంచి మనసుతో చదివి అర్ధం చేసుకోండి*


*ఈద్ రోజున మసీదు ముందు ముస్లింలు మద్యం మత్తులో అసభ్యకరమైన పాటలు వేసి, నృత్యం చేయడం మీరు ఎప్పుడైనా చూశారా? 

లేదు కదా  !!! 


*ఏసుక్రీస్తు ముందు 

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా పా, 

పాటకు క్రైస్తవులు నృత్యం చేయడం మీరెప్పుడైనా చూశారా?

అదీ లేదు కదా  !!! 


*మరి జైన మతస్థులు తమ దేవుడి ముందు 

కెవ్వు కేక ...పాట పాడుతూ నృత్యం చేయడం మీరు ఎప్పుడైనా చూశారా?

చూడలేదు కదూ  !!! 


ఈ మతాలన్నీ ఎంతో చిత్తశుద్ధితో తమ సొంత పండుగలను గౌరవిస్తాయి. ఎందుకంటే వారు తమ సంస్కృతి కోసం తమ మతాన్ని కాపాడుకోవాలి కాబట్టి, కాపాడుకుంటున్నారు కూడా. 


మరి అలాంటప్పుడు, మన హిందూ మతానికి చెందిన దేవుళ్ళ ముందు, చిత్తుగా మద్యం తాగి, ఆ మత్తులో అసభ్యకరమైన పాటలకు DJ పెట్టి మరీ ఈ అసభ్య పాటలు, అర్థ నగ్న నృత్యాలు ఎందుకు ?


ఈ కళంకం మన హిందూ సమాజంపై ఎవరు, ఎందుకు విధించారు లేక మనమే ఆలా చేస్తున్నామా  ???


డీజేలపై అసభ్యకరమైన పాటలు పెట్టి, 

కాపాడుకోవాల్సిన మన సనాతన సంస్కృతిని మనమే అవమానిస్తున్నాం, అగౌరవపరుస్తున్నాము. 

ఎందుకు  ??? 


మన  పండుగలు చాలా ఉత్సాహంగా, పెద్ద ఎత్తున జరుపుకోవాలి. కాదనడం లేదు. సంప్రదాయ సంగీత వాయిద్యాలు, సాంప్రదాయ దుస్తులు, మన వైభవాన్ని చాటి చెప్పే తలపాగా వంటి వాటిని ధరించి, ప్రతి హిందువుల పండుగలో మనం కనిపించాలి. అప్పుడే మన సనాతన సంస్కృతి  నిలబడుతుంది. 


ఇతర మతాలవాళ్ళు మనలా తమ మతపరమైన కార్యక్రమంలో ఎలాంటి దుబారా చేయరు. దుశ్చర్యలు చేయరు.


కనీసం ఇప్పటినుంచైనా, గణేశ నవరాత్రులు మొదలైన పండుగలను సంప్రదాయబద్ధంగా జరుపుకుందాం. 

మన సంస్కృతిని కాపాడుకుందాం. 

ఇతరులకు మార్గదర్శకంగా ఉందాం.

లేదంటే స్టాలిన్ లాంటి రక్త బీజులు పుట్టడానికి మనమే కారణం అవుతాం.


 DJ లకు బదులుగా హిందూ భక్తి పాటలు, సంగీతం ఆధారంగా శ్లోకాలు పెట్టి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుదాం. 

వినాయక నవరాత్రుల కోసం ఎంత వ్యయ ప్రయాసతో ఒక చక్కని భక్తి గీతం రాయించి, పాడించి మా యూట్యూబ్ ఛానల్ లో పెట్టాను. వీలయితే ఆ పాటని ఈ 9 రోజులు ప్రచారం చేయండి. 

మీ కాలనీలో లేదా అపార్ట్ మెంట్ లో గణపతి నవరాత్రులు జరుపుతూ ఉంటే నాకు ఫోన్ చేయండి..మా పాపల చేత గణపతి నవరాత్రుల పరిరక్షణ గీతం పాడిస్తాను. యువతకి అర్థమయ్యే రీతిలో మన పండుగ వైభవం గురించి 15 నిమిషాలు సందేశం ఇస్తాను. ఆలోచించండి.

దేశాన్ని కాపాడుకుందాం. 

ధర్మాన్ని కాపాడుకుందాం.

ఎందుకంటే.. 

ఈ దేశం మనది.

ఈ ధర్మం మనది.

జై హింద్.

ధన్యవాదాలు.

Steem engine


 

New gear technology

 


Vinayak


 

గణేష్ మహారాజ్ కీ జై

 🌼🌼🌼⚜️⚜️🔱🔱

*_జై శ్రీరామ్🛕🕉️🚩✊_*


*_జై బోలో గణేష్ మహారాజ్ కీ జై 💪🕉️✊_*


*_మనకు స్వాతంత్రం రాకముందు  జాతీయ సమైక్యతను సాధించే ఉద్దేశంతో అందరినీ ఓక కేంద్రముగా ఏర్పాటు చేసి దేశము ధర్మం కోసం భారతీయ జాతి బానిస సంకెళ్లు తెంచి మన దేశ స్వేచ్ఛ గాలులు మనకు అందించడానికి కీ.శే.శ్రీ బాలగంగాధర్ తిలక్ గారు ప్రారంభించిన, వినాయక నవరాత్రుల ఉత్సవాలు నేడు విశ్వ వ్యాప్తంగా అయ్యాయి ఇది అందరికి మంచిది🇮🇳🕉️🚩✊_*


*_ఇదేవిధంగా ఈరోజు ప్రతి గణపతి మంటపంలో దేశము కొసం భరతమాత ఫోటో... ధర్మం కోసం చత్రపతి ఫోటో... బాలగంగాధర్ తిలక్ గారి ఫోటోలు... తప్పకుండా ఉండాలని అదేవిధంగా ప్రతి మండపం మరియు ఇంటి మీద పవిత్రమైన విజయానికి ప్రతీకైనా ధర్మ జండ (కాషాయము జండాలు) పెట్టాలి... మరియు మండపాల దగ్గర భగవద్గీత పారాయణాలు...దైవ నామస్మరణ... దేశ భక్తి.. మంచి విషయాలు సౌండ్స్ స్పీకర్ ద్వారా చెప్పాలి... పెట్టాలి నిర్వాహకులు తప్పకుండ చేయాలి 🕉️🚩💪🙏_*


 *_మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ ఆదిమూల మహా గణపతి వినాయక చతుర్ధి' శుభాకాంక్షలు🪴🌸🌺🌹🍁_*

🚩🚩🔱🔱🕉️🕉️🛕🛕🔔

*_ధర్మో రక్షిత రక్షిత:_*


*_సర్వే జనా సుఖినోబవంతు అని చెపుతుంది మన సనాతన ధర్మం హిందు ధర్మం..ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే_* 


*_జై శ్రీరామ్🛕🛕🔱🕉️🚩_*


*_భారత్ మాతా కీ జై🇮🇳🚩✊_*


*_ఎల్లప్పుడూ మీ,మన మంచి కోరుకునే..._*


      *_మీ_*

*_మల్లేకేడి లక్ష్మణ్_*

*_నాగర్ కర్నూల్ జిల్లా obc మోర్చ ఉపాధ్యక్షులు_*

🙏🙏🙏🙏

నవగ్రహ పురాణం - 57 వ అధ్యాయం*

 *నవగ్రహ పురాణం - 57 వ అధ్యాయం*

🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿


*కేతుగ్రహ జననం - 2*



కశ్యప పత్ని దనూదేవి ఆతృతగా ఆశ్రమంలోకి వచ్చింది. ఆమె చేతుల్లో ఒక చిన్నారి శిశువున్నాడు.


*"స్వామీ ! స్వామీ !"* అంటూ భర్తను పిలిచిందామె. 


*"ఏమిటి దనూ !"* అంటూ వచ్చాడు కశ్యపుడు.


*"చూశారా ! చూశారా ! బాలుడు ! ఆశ్రమం వెనక తోటలోని ముళ్ళ పొద నీడలో హాయిగా ఆడుకుంటూ , పరవశంగా ఉన్నాడు !". 


*"ఎవరి బిడ్డదో..."* కశ్యపుడు బాలుడిని చూస్తూ అన్నాడు.


*"నాకు దొరికాడు కాబట్టి నా బిడ్డడే ! చూడండి... ఆ ముఖమూ , ఆ కళ్ళూ... అన్నీ నా బిడ్డలకు లాగానే ఉన్నాయి !"* దనూదేవి ఉత్సాహంగా అంది. *"వీడు నా బిడ్డడే ! ఏమిటలా చూస్తున్నారు ! నా బిడ్డడే ! నేను పెంచుకుంటాను !"*


*"సరే ! ఎవరు కాదన్నారు ! అంతా దేవేచ్ఛ కదా !"* కశ్యపుడు చిరునవ్వుతో అన్నాడు. 


*" పిల్లవాడికి... పేరు ?"* దనూ దేవి ఆవేశంగా అడిగింది. *“చక్కటి పేరు పెట్టండి !”*


*"పేరు...ఏ పేరు పెట్టమంటావు ?"* కశ్యపుడు ఆలోచిస్తూ అన్నాడు. 


*"కేతువు అని సృష్టికర్త బ్రహ్మదేవులు పెట్టేశారుగా !"* లోపలికి వస్తూ అన్నాడు. నారదుడు.


*"నారద మునీంద్రా !"* కశ్యపుడు ఆశ్చర్యంగా అన్నాడు.


*“నారాయణ ! ఆ విషయం చేరవేయడానికి వచ్చాను. బాలుడికి నామకరణం చేశాక , మీకు అందేలా చూశారు మా జనకులు. మీ బిడ్డగా స్వీకరించి , పోషించి , ప్రయోజకుణ్ణి చేయమన్నారు !"*


*"అలాగా ! మహా భాగ్యం !"* కశ్యపుడు చేతులు జోడించాడు.


*"అందుకేనేమో వీణ్ణి చూడగానే నా బిడ్డడే అనిపించి , స్తన్యం కురిసింది!"* అంటూ లోపలకి వెళ్ళింది దనూదేవి ఉత్సాహంగా.


రోజులు కాలాన్ని ఖండిస్తూ తమ గణన కార్యాన్ని కొనసాగిస్తున్నాయి. దనూదేవి పెంపుడు కొడుకు కేతువూ , సింహిక కుమారుడు రాహువు ఒకరిని వదిలి మరొకరు. ఉండలేనట్లు మసులుతున్నారు.


రాహుకేతువుల సాహచర్యం నేల మీద పాకే వయస్సులోనే మొగ్గ తొడిగింది ! ఇద్దరూ జంటగా పాకడం ప్రారంభించారు. ఇద్దరూ ఒకరిపక్కనొకరు దోగాడసాగారు. ఒకరి చేతిని ఒకరు పట్టుకుని తప్పటడుగులు వేశారు.


కశ్యప మహర్షి రాహువు కేతువులకు విద్యాభ్యాసం ఆరంభించారు. విద్యార్జనలో కూడా అంతే ! ఒకరికి చెప్తే చాలు - మరొకరు కూడా నేర్చుకుంటున్నారు. వాళ్ళ ప్రవర్తన దనూదేవికి సందేహం కలిగించింది. ఒకనాడు భర్తతో ఇలా అంది.


*"స్వామీ ! కన్నబిడ్డతో సమానంగా కేతువుకి పాలిచ్చి పెంచాను కద ! బాలుడు నా బిడ్డలతో కలిసి మెలిసి ఉండడానికి మారుగా , ఆ సింహిక బిడ్డడితో కలిసిపోయాడెందుకు ?"*

*“వాడి చిన్ని మనసులో ఏముందో , ఎవరికి తెలుసు ! కేతువు ఒక్కడే కాదు సుమా , రాహువుని చూడు ! వాడు కూడా కేతువు నీడలా ఉంటున్నాడు ! ఇద్దరి మధ్యా మనకు అర్ధం కాని అజ్ఞాత సంబంధం ఏదైనా ఉందేమో !”* అన్నాడు కశ్యపుడు.


దనూదేవి సాలోచనగా తల పంకించింది.


*"రాహుకేతువులిద్దరూ అన్యోన్యంగా పెరగాలనీ , రాణించాలనీ బ్రహ్మదేవుల సంకల్పం అయి ఉండవచ్చు. ఎందరో మానస పుత్రులూ , వారి సంతతులూ ఉండగా ఈ కశ్యపుడికే ఆ అవకాశం ఎందుకు వరించింది ? కేతువు మన పోషణలో పెరగాలన్న లక్ష్యం కన్నా , రాహుతో కలిసి మమేకంగా పెరగాలన్న సంకల్పమే అందుకు కారణమనిపిస్తోంది సుమా !"* కశ్యప మహర్షి విశ్లేషించాడు.


*"ఏది ఏమైనా అదంతా నా అదృష్టమే !"* దనూదేవి సగర్వంగా అంది. 


రాహుకేతువులు యువకులయ్యారు. రాహువు సింహిదేవి అనే స్త్రీని , కేతువు చిత్రలేఖనూ పత్నులుగా స్వీకరించారు.


కాలక్రమాన సింహిదేవీ రాహు దంపతులకు 'మేఘహాసుడు' అనే కుమారుడు. జన్మించాడు.


రాహుకేతువుల సహోదరానుబంధం వాళ్ళతో పాటే వృద్ధి చెంది , వికసిస్తూనే ఉంది.


నిర్వికల్పానంద నవగ్రహాల జన్మవృత్తాంతాల కథనం ముగించి ఇలా అన్నాడు. శిష్యులతో. *"ఇప్పటి దాకా మనం నవగ్రహాల పుట్టుకల గురించి తెలుసుకున్నాం. అయితే , మన నిత్య వ్యవహారంలో , జాతక గణనంలో పేర్కొంటున్న 'సూర్య , చంద్ర , కుజ , బుధ , గురు , శుక్ర , శని , రాహు , కేతు' అనే క్రమంలో కాకుండా వాళ్ళ ఆవిర్భావ క్రమంలో శ్రవణం చేశాం*


*"నవగ్రహాల ఆవిర్భావాలలో లాగే , వాళ్ళ చరిత్రలలో కూడా ఆసక్తిని రేకెత్తించే అద్భుత సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆ సంఘటనల సమాహారంగా , ఆ గ్రహదేవతల చరిత్రలను సూర్యుడి నుండి కేతువు దాకా , మనం స్మరించే వరస క్రమంలో శ్రవణం చేద్దాం.”*


*"ముందుగా సూర్య గ్రహ చరిత్ర ఒక్క సారి గుర్తుచేసుకుంటే , శివానందా ! సూర్యుడి తల్లిదండ్రులు ఎవరో గుర్తున్నారా ?”* అంటూ అడిగాడు చిరునవ్వుతో నిర్వికల్పానంద.


*"అదితీ , కశ్యపులు గురువుగారూ !"* శివానందుడు సమాధానం చెప్పాడు.


*"చిదానందా , నువ్వు చెప్పు , సూర్యపత్ని ఎవరు ?”* నిర్నికల్పానంద అడిగాడు.


*"విశ్మకర్మ పుత్రిక - సంజ్ఞ గురువుగారూ..."* చిదానందుడు అన్నాడు. *''సంజ్ఞ తన నీడను 'ఛాయ' అనే పేరుతో తన స్థానంలో సూర్యుడి భార్యగా నియమించింది !"* 


*"బాగుంది !"* నిర్వికల్పానంద చిరునవ్వుతో అన్నాడు. *“ఇప్పుడు సంజ్ఞ బిడ్డలు ఎవరో , ఛాయ బిడ్డలు ఎవరో మన శివానందుడూ , విమలనందుడూ చెప్తారు !”*


*"వైవస్వతుడు , యముడు , యమి - సంజ్ఞ సంతానం , గురువుగారూ !"* శివానందుడు గుర్తు చేసుకుంటూ అన్నాడు.


*"ఛాయ సంతతి శనైశ్చరుడు , సావర్ణి , తపతి !"* విమలానందుడు చెప్పాడు.


*"గుర్తుంచుకున్నారు. సంతోషం !”* నిర్వికల్పానంద అన్నాడు. సంజ్ఞకూ , ఛాయకూ జన్మించిన సూర్యుని సంతానం ఆరుగురూ ఛాయ పోషణలో పెరుగుతున్నారనీ , సంజ్ఞ బిడ్డల పట్ల ఛాయ ప్రేమ తగ్గుముఖం పట్టిందనీ చెప్పుకున్నాం కదా ! ఇక వినండి ! ఒక రోజు ఏమైందంటే...




_*ఇప్పటి వరకు నవగ్రహల జననం గురించి చదువుకున్నాము రేపటి నుండి నవగ్రహల చరిత్ర ప్రారంభం*_

శుభాకాంక్షలు

 ‘తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా దలచితినే హేరంభుని దలచిన నా విఘ్నములును తొలగుట కొరకున్’  వినాయక చవితి శుభాకాంక్షలు

Chaviti chandrudu?


 

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-50

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-50🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*శ్రీ వేంకటేశ్వర సుప్రభాతము:*


శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం కలియుగ వైకుంఠపతి వేంకటేశ్వరుని సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రము. "సు-ప్రభాతము" అనగా "మంచి ఉదయం" అని అర్ధం. 


హిందూ పూజా విధానాలలోను, ప్రత్యేకించి శ్రీవైష్ణవంఆచార పరంపరలోను, భగవంతుని పూజామూర్తికి అనేకమైన సేవలు (షోడశోపచారములు) నిర్వహించే సంప్రదాయం ఉంది. 


ఇలాంటి సేవలలోనిదే సుప్రభాత సేవ. ఆ సుప్రభాత సేవా సమయంలో చేసే కీర్తననే "సుప్రభాతం" అని అంటారు. 


తిరుమల శయనమంటపంలోని భోగశ్రీనివాసుని ఈ సుప్రభాతం ద్వారా మేల్కొలుపుతారు. బంగారు వాకిలిలో పదహారు స్తంభాల తిరుమామణి మంటపంలో ఈ సుప్రభాతాన్ని పఠిస్తారు. 


సుప్రభాత పఠనానంతరం భోగశ్రీనివాసుని గర్భగుడిలోనికి తీసికొని వెళతారు. 1430 సంవత్సరంలో శ్రీవీరప్రతాపరాయల హయాంలో వేదపఠవంతోపాటు సుప్రభాత పఠనం కూడా ఆరంభమైంది. అప్పటినుండి అవిచ్ఛిన్నంగా (అంటే 580 సంవత్సరాలుగా) ఈ సంప్రదాయం కొనసాగుతున్నది.



సంస్కృతంలో ఉన్న ఈ ప్రార్థన తెలుగునాట, మరియు ఇతర హిందువులలోను అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రార్థనా గీతాలలో ఒకటి. అనేక వెంకటేశ్వరస్వామి మందిరాలలోను, ఇండ్లలోను ఈ సుప్రభాతాన్ని చదివే, వినే ఆచారం ఉంది. 


చాలా శైవ, వైష్ణవ మందిరాలలో సుప్రభాతం చదివే సంప్రదాయం ఉన్నాగాని "సుప్రభాతం" అనగానే వెంకటేశ్వర సుప్రభాతం స్ఫురణకు రావడం కద్దు.



జగద్విఖ్యాతమైన శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం స్తోత్రాన్ని ప్రతివాద భయంకర అణ్ణాంగారాచార్య లేదా అణ్ణన్ స్వామి రచించారు



 

. ఇతడు క్రీ.శ.1361 వ సంవత్సరంలో అనంతాచార్యులు మరియు ఆండాళ్ దంపతులకు కంచి పట్టణంలో జన్మించారు. ఈయన శ్రీరామానుజాచార్యులచే నియమింపబడిన 74 సింహాసనాధిపతులలో ఒకరైన 'ముడుంబ నంబి' వంశానికి చెందినవారు. ఇతని గురువు మణవాళ మహాముని.



సుప్రసిద్ధమైన వేంకటేశ్వర సుప్రభాతము, రంగనాధ సుప్రభాతము కూడా అణ్ణన్ రచనలే. వేదాంత దేశికుల కుమారుడైన నారాయణావరదాచార్యుడు అణ్ణన్కు మొదటి గురువు. నారాయణ వరదాచార్యుల వద్ద వేదాలు, ఇతర విద్యలు అభ్యసిస్తున్న సమయంలో ఆణ్ణన్ను వాదంలో ఎదుర్కోవడం ప్రత్యర్ధులకు చాలా సంకటంగా ఉండేదట. 


నృసింహ మిశ్రుడనే అద్వైత పండితుడిని వాదనలో ఓడించినపుడు మణవాళ మహాముని అణ్ణన్కు "ప్రతివాద భయంకర" అనే బిరుదు ఇచ్చాడట. తరువాత అణ్ణన్ తిరుమలలో కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో అతను మణవాళ మహాముని శిష్యుడయ్యాడు.




*-శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం:*


కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ 1


తా. కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము.


ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ

ఉత్తిష్ఠ కమలాకాన్త త్రైలోక్యం మంగళం కురు 2


తా. ఓ గోవిందా! లెమ్ము. గరుడధ్వజము కల ఓ దేవా! లెమ్ము. ఓ లక్ష్మీవల్లభా ! లెమ్ము. లేచి ముల్లోకములకును శుభములు కలిగింపుము.


మాతః సమస్త జగతాం మధుకైటభారే:

వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే

శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే

శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్ 3


తా. సమస్త లోకములకును మాతృదేవతవును, విష్ణుదేవుని వక్షస్థలమందు విహరించుదానవును, మనస్సును ఆకర్షించు దివ్యసుందర స్వరూపము కలదానవును, జగదీశ్వరివిని, ఆశ్రితుల కోరికలను నెరవేర్చుదానవును, శ్రీ వేంకటేశ్వరుని సతీమణివి అగు ఓ లక్ష్మీదేవీ! నీకు సుప్రభాతమగు గాక.


తవ సుప్రభాత మరవిందలోచనే

భవతు ప్రసన్న ముఖచంద్రమండలే

విధిశంకరేన్ద్ర వనితాభిరర్చితే

వృషశైలనాద థయితే దయానిధే. 4


తా. కమలములను పోలు కన్నులును, చంద్రబింబము వలె ప్రసన్నమైన ముఖమును గల ఓ లక్ష్మీదేవీ! నిన్ను సరస్వతి, పార్వతి, శచీదేవి పూజించుచుందురు. శ్రీవేంకటేశ్వరుని సతీమణివి, దయానిధివి అగు నీకు సుప్రభాతమగు గాక.


అత్ర్యాధిసప్తఋషయస్య ముపాస్య సంధ్యాం

ఆకాశ సింధు కమలాని మనోహరాణి

ఆదాయ పాదయుగ మర్చయితుం ప్రపన్నాః

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ 5


తా. అత్రి మున్నగు సప్తమహర్షులను తమ చక్కని సంధ్యావందనమును ముగించి, ఆకాశగంగ యందలి చక్కని కమలములను తెచ్చి నీ పాదములను చూజించుటకు వచ్చియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.


పంచాన నాబ్జభవ షణ్ముఖ వాసవాద్యా:

త్రైవిక్రమాది చరితం విబుధాః స్తువంతి

భాషాపతిః పఠతి వాసరశుద్ధిమారాత్

శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్ 6


తా. శివుడు, బ్రహ్మ, కుమారస్వామి, ఇంద్రుడు మున్నగు దేవతలు త్రివిక్రమావతారము మున్నగు నీ అద్భుత చరిత్రలను కొనియాడుచున్నారు. బృహస్పతి నీ దగ్గరగా ఉండి నేటి తిథివారాదుల ఫలములను చదువుచున్నాడు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.


ఈషత్ర్పఫుల్ల సరసీరుహ నారికేళ

పూగద్రుమాది సుమనోహర పాళికానాం

ఆవాతి మందమనిల స్సహ దివ్యగంధైః

శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్ 7


తా. కొంచెం వికసించిన తామరపూల యొక్క, కొబ్బరి, పోక మున్నగు చెట్ల అందమైన మోవుల యొక్క సువాసనలతో మలయమారుతము మెల్లగా వీచుచున్నది. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.


ఉన్మీల్యనేత్ర యుగముత్తమ పంజరస్థాః

పాత్రావశిష్ట కదలీఫల పాయసాని

భుక్త్వా సలీలమథ కేళిశుకాః పఠంతి

శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్ 8


తా. ఓ శేషశైలపతీ! చక్కని పంజరములలో వున్న పెంపుడు చిలుకలు తా మిదివరకు కొంత భక్షింపగా పాత్రలలో మిగిలియున్న అరటిపండ్లను, పాయసమును తిని వాలాసముగా పాడుచున్నవి. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక!


తంత్రీప్రకర్ష మధురస్వనయా విపంచ్యా

గాయన్త్యనంత చరితం తవ నారదో7పి

భాషాసమగ్ర మసకృత్కర చారురమ్యం

శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్ 9


తా. ఓ అనంతా! నారదుడు కూడ మధురముగా ధ్వనిచేయు తన వీణ తీగలను మీటుచు, పెక్కు సారులు రమ్యముగా హస్తాభినయముచేయుచు, చక్కని భాషతో నీ దివ్య చరిత్రమును గానము చేయుచున్నాడు. ఓ శేషశైలాధీశా! నీకు సుప్రభాతమగు గాక.


భృంగావళీచ మకరంద రసానువిద్ధ

ఝంకారగీత నినదైః సహ సేవనాయ

నిర్యాత్యుపాంత సరసీకమలోదరేభ్యః

శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్ 10


తా. మకరందమును త్రాగి విజృంభించిన తుమ్మెదల గుంపు ఝంకార గీత ధ్వనులతో నిన్ను సేవించుటకై సమీప సరస్సులలోని కమలములనుండి బయలువెడలి వచ్చుచున్నవి. ఓ శేషాచలపతీ! నీకు సుప్రభాతమగు గా.


యోషాగణేన వరదధ్ని విమధ్యమానే

ఘోషాలయేషు దధిమంథన తీవ్ర ఘోషాః

రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః

శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్ 11


తా. ఓ శేషాద్రినాధుడవగు ఓ వేంకటేశ్వరా! గొల్ల పల్లెలలోని గొల్లపడుచులు పెరుగు చిలుకుచుండగా ఆ చిలికిన ధ్వనికి దిక్కులు ప్రతిధ్వనించుచున్నవి. ఆ ధ్వని, ప్రతిధ్వనుల బట్టి పెరుగుకుండలు, దిక్కులు కలహించుచున్నవా? అన్నట్లు కానవచ్చుచున్నవి. ఓ దేవా! నీకు సుప్రభాతమగు గాక.


పద్మేశమిత్ర శతపత్ర గతాళివర్గాః

హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యాః

భేరీనినాదమివ బిభ్రతి తీవ్రనాదం

శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్ 12


తా. సూర్యుని మిత్రములగు కమలములయందున్న తుమ్మెదలు, తమ దేహకాంతిచే కలువల నల్లని కాంతిని అపహరించుటకు బయలు వెడలి భేరీని వాయించునట్లు ధ్వని చేయుచున్నవి. ఓ శేషాచల ప్రభూ! నీకు సుప్రభాతమగు గాక.


శ్రీమన్నభీష్టవరదాఖిల లోకబంధో

శ్రీ శ్రీనివాస జగదేక దయైకసింధో

శ్రీ దేవతాగృహభుజాంతర దివ్యమూర్తే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ 13


తా. శ్రీమంతుడవైన ఓ దేవా! నీవు కోరిన వరములనిచ్చువాడవు. లోకములన్నింటికిని బంధువుడవు. ఓ శ్రీనివాసా! లోకములన్నింటను నీ వొక్కడవే దయాసముద్రుడవు. లక్ష్మీదేవికి నివాసమగు వక్షస్సు కలవాడవు. దివ్యస్వరూపుడవు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.


శ్రీ స్వామి పుష్కరిణికా ప్లవనిర్మలాంగాః

శ్రేయోర్థినో హరవిరించి సనందనాద్యాః

ద్వారే వసంతి వరవేత్రహతోత్తమాంగాః

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ 14


తా. బ్రహ్మ, శివుడు, సనందనుడు మున్నగువారు స్వామి పుష్కరిణిలో స్నానముచేసి పరిశుద్ధులై తమ మేలునకై ద్వారముకడ బెత్తములవారు తలలపయి కొట్టుచున్నను లెక్కింపక కాచుకొనియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.


శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి

నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం

ఆఖ్యాం త్వదయవసతే రనిశం వదంతి

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ 15


తా. ఓ వేంకటేశ్వరా! నీ నివాసమగు ఈ పర్వతమును అందరును శేషశైలము, గరుడాచలము, వేంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి మున్నగు పేర్లతో నిత్యము పిలుచుచుందురు. ఓ దేవా! నీకు సుప్రభాతమగు గాక.


సేవాపరాః శివసురేశ కృశానుధర్మ

రక్షోంబునాథ పవమాన ధనాధినాథాః

బద్ధాంజలి ప్రవిలసన్నిజశీర్ష దేశాః

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ 16


తా. ఈశానుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి వరుణుడు, వాయువు, కుబేరుడు అను అష్టదిక్పతులును శిరస్సులపయి చేతులు మోడ్చి నీ సేవకయి కాచుకొనియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.


ధాటీషు తే విహగరాజ మృగాధిరాజ

నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః

స్వస్వాధికార మహిమాధిక మర్థయంతే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ 17


తా. దేవా! గరుడుడు, మృగరాజు, ఆదిశేషుడు, గజేంద్రుడు, అశ్వరాజును దండయాత్రలయందు తమ తమ శక్తిని చూపుటకు నీ యనుమతిని వేడుచున్నారు. ఓ వేంకటేశ్వరా! నీ¬ు సుప్రభాతమగు గాక.


సూర్యేందు భౌమబుధవాక్పతి కావ్యసౌరి

స్వర్భాను కేతుదివి షత్సరిషత్ప్రధానాః

త్వద్దాస దాస చరమావధిదాస దాసాః

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ 18


తా. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు అను నవగ్రహములును నీ దాస, దాసచరమావధి దాసులకు దాసులయి యున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.


త్వత్పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగాః

స్వర్గాపవర్గనిరపేక్ష నిజాంతరంగా

కల్పాగమా7కలనయా కులతాం లభంతే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ 19


తా. ఓ స్వామీ! నీ పాదధూళిచే శిరస్సు పవిత్రమైనవారు వేరే స్వర్గమోక్షములను మనస్సులో కూడ కోరరు. ఈ కల్పము అంతమైపోవునేమో అనియే కలత పడుచుందురు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.


త్వద్గోపురాగ్రశిఖరాణి నిరీక్షమాణాః

స్వర్గాపవర్గ పదవీం పరమాశ్రయంతః

మర్త్యా మనుష్యభువనే మతిమాశ్రయన్తే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ 20


తా. స్వర్గ, మోక్షములకు పోవుచున్నవారు మార్గములో నీ గుడి గోపురముల శిఖరములను చూచి ఆనందపరవశులై మనుష్యులుగా భూలోకమునందే మిమ్ము దర్శించుచు ఉండవలెనని కోరుచుందురు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.


శ్రీ భూమినాయక దయాది గుణామృతాబ్ధే

దేవాధిదేవ జగదేక శరణ్యమూర్తే

శ్రీ మన్ననంత గరుడాదిభిరర్చితాంఘ్రే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ 21


తా. ఓ దేవాదిదేవా! నీవు శ్రీదేవికి, భూదేవికి భర్తవు. దయ మున్నగు గుణములకు పాలసముద్రము వంటివాడవు. లోకములకన్నింటికి శరణమిచ్చువాడవు నీవొక్కడవే. అనంతుడు, గరుడుడు నీ పాదములను సేవించుచుందురు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.


శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ

వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే

శ్రీవత్స చిహ్న శరణాగత పారిజాత

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ 22


తా. ఓ వేంకటేశ్వరా! నీవు పద్మము నాభియందు కలవాడవు. పురుషోత్తముడవు. వాసుదేవుడవు. వైకుంఠుడవు. మాధవుడవు. జనులను రక్షించువాడవు. హస్తమున చక్రము కలవాడవు. శ్రీవత్స చిహ్నము కలవాడవు. శరణుజొచ్చినవారి పాలిట కల్పవృక్షమవు. నీకు సుప్రభాతమగు గాక.


కందర్పదర్ప హరసుందర దివ్యమూర్తే

కాంతాకుచాంబురుహ కుట్మలలోలదృష్టే

కల్యాణనిర్మల గుణాకర దివ్యకీర్తే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ 23


తా. మన్మధుని గర్వము నణచు దివ్యసుందర శరీరము కల ఓ దేవా! నీ దృష్టి తామర మొగ్గలవంటి యువతి కుచములపయి పరిభ్రమించు చుండును. నీవు కీర్తి కలవాడవు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాత మగుగాక.


మీనాకృతే కమఠ కోల నృసింహ వర్ణిన్

స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర

శేషాంశరామ యదునందన కల్కిరూప

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ 24


తా. ఓ వేంకటేశ్వరా! నీవు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, కల్కిరూపములను ధరించితివి. ఓ దేవా! నీకు సుప్రభాతమగు గాక.


ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం

దివ్యం వియత్సరసిహేమఘటేషు పూర్ణం

ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్ఠాః

తిష్ఠంతి వేంకటపతే తవ సుప్రభాతమ్ 25


తా. ఓ దేవా! వైదికులగు భక్తులు, ఏలకులతోను, పచ్చకర్పూరముతోను పరిమళించు పవిత్రగంగా జలమును బంగారు కలశముల నిండుగా నింపి తెచ్చి సంతోషముతో నీ సేవకై యెదురు చూచుచున్నారు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.


భాస్వానుదేతి వికటాని సరోరుహాణి

సంపూరయంతి నినదైః కకుభో విహంగాః

శ్రీ వైష్ణవాః సతత మర్దిత మంగళాస్తే

ధామాశ్రయంతి తవ వేంకటసుప్రభాతమ్ 26


తా. ఓ దేవా! సూర్యుడు ఉదయించుచున్నాడు. కమలములు వికసించుచున్నవి. పక్షులు తమ కిలకిలరావములతో దిక్కులను నింపుచున్నవి. శ్రీవైష్ణవులు శుభములను కోరుచు నీ సన్నిధిలో వేచియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.


బ్రహ్మాదయస్సురవరాస్స మహర్షయస్తే

సంతస్సనందన ముఖాస్త్వథ యోగివర్యాః

ధామాంతికే తవ హి మంగళవస్తు హస్తాః

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ 27


తా. ఓ దేవా! బ్రహ్మ మున్నగు దేవతలు, మహర్షులు, సనందనుడు మున్నగు సత్పురుషులు, యోగులును నీ పూజకు తగిన మంగళకర వస్తువులను హస్తములందు ధరించి, నీ సన్నిధికి వచ్చియున్నారు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.


లక్ష్మీనివాస నిరవద్యగుణైక సింధో

సంసారసాగర సముత్తరణైక సేతో

వేదాంతవేద్య నిజవైభవ భక్త భోగ్య

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ 28


తా. ఓ దేవా! నీవు లక్ష్మీదేవికి నివాసమైనవాడవు. సద్గుణ సముద్రుడవు. సంసార సాగరమును తరించుటకు అనువైన వారధివి. వేదాంతములచే తెలిసికొనదగిన వైభవమును కలవాడవు. భక్తులకు స్వాధీనుడవు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.


ఇత్థం వృషాచలపతే రిహ సుప్రభాతమ్ (ఇత్థంp వృషాచలపతే తవ సుప్రభాతమ్- కొన్ని పుస్తకాలలొ ఇల కూడ ఉన్ది)

యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః

తేషాం ప్రభాతసమయే స్మృతిరంగ భాజాం

ప్రజ్ఞాం పరార్థసులభాం పరమాం ప్రసూతే


తా. వృషాచలపతియగు శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతమును ఈ రీతిగా ప్రతిదినము ప్రభాత సమయమున పఠించువారికి ఈ స్మృతి మోక్షసాధనమగు ప్రజ్ఞ కలిగించు చుండును.

శ్రీ వేంకటేశ స్తోత్రం

కమలాకుచ చూచుక కుంకుమతో

నియ తారుణి తాతుల నీలతనో

కమలాయత లోచన లోకపతే

విజయీ భవ వేంకటశైల పతే 1


తా. లక్ష్మీదేవి కుచాగ్రము నందలి కుంకుమచే ఎఱ్ఱనైన నీలదేహము కల ఓ వేంకటేశ్వరా! కమలదళములవలె విశాలములైన కన్నులు కలవాడా! లోకములకు ప్రభువైనవాడా! శేషశైలపతీ! నీకు జయము గలుగు గాక.


స చతుర్ముఖ షణ్ముఖ పంచముఖ

ప్రము ఖాఖిలదైవత మౌళిమణే

శరణాగత వత్సల సారనిధే

పరిపాలయ మాం వృషశైల పతే. 2


తా. ఓ దేవా! నీవు బ్రహ్మ, శివుడు, కుమారస్వామి మున్నగు సమస్త దేవతలకును నాయకుడవు. శరణాగత వత్సలుడవు. బలమునకు నిధివి. ఓ వృషశైలాధిపా! నన్ను పాలింపుము.


అతి వేలతయా తవ దుర్విషహై

రనువేలకృతై రపరాధ శతైః

భరితం త్వరితం వృషశైవ పతే

పరయా కృపయా పరిపాహి హరే. 3


తా. ఓ దేవా! హద్దులేనివియు, నీకును సహింప శక్యము కానివియు అగు అపరాధములను వందల కొలది ప్రతిదినము చేయుచున్నాను. ఇట్టి నన్ను గొప్ప దయతో వేగముగా రక్షింపుము.


అధి వేంకటశైల ముదారమతే

ర్జన తాభిమ తాధిక దాన రతాత్

పర దేవతయా కథితా న్నిగమైః

కమలా దయితా న్న పరం కలయే. 4


తా. జనసమూహము కోరిన దానికంటే అధికముగా ఇచ్చువాడు, వేంకటాచలమున నివసించు ఉదారబుద్ధి కలవాడు, వేదములచేత పరదేవతగా చెప్పబడినవాడు, లక్ష్మీదేవికి భర్తయు అగు వేంకటేశ్వరుని కంటె గొప్ప దైవము లేడు.


కలవేణు రవా వశ గోపవధూ

శతకోటి వృతా త్స్మరకోటి సమాత్

ప్రతిపల్ల వికాభిమతా త్సుఖదాత్

వసుదేవసుతాన్న పరం కలయే. 5


తా. మధురమైన వేణునాదము వలన పరవశత పొందిన కోట్లకొలది గోపికలచే చుట్టుకొనబడినవాడును, కోటి మన్మథుల చక్కదనము కలవాడును, గొల్లపడుచుల కందరికిని ఇష్టుడును, సుఖముల నిచ్చువాడును అగు వాసుదేవుని కంటె గొప్ప దైవము లేడు.


అభిరామ గుణాకర దాశరథే

జగదేక ధనుర్ధర ధీరమతే

రఘునాయక రామ రమేశ విభో

వరదో భవ దేవ దయాజలధే. 6


తా. ఓ రామా! రఘునాయకా! దాశరథీ! నీవు మనోహరములైన గుణములకు నిధివి, లోకమంతటికిని సాటిలేని ధనుర్ధురుడవు. ధీరుడవు. లక్ష్మికి భర్తవు. దేవుడవు. ఓ దయాసముద్రుడా! వరములొసగి నన్నుద్ధరింపుము.


అవనీ తనయా కమనీయకరం

రజనీకర చారు ముఖాంబురుహమ్

రజనీచర రాజ తమోమిహిరం

మహనీయ మహం రఘురామ మయే. 7


తా. ఓ దేవా! నీవు సీతాదేవికి ప్రియుడవు. చంద్రునివలె చక్కని ముఖము కలవాడవు. రాక్షస రాజగు రావణుడనెడి చీకటిని పోగొట్టు సూర్యుడవు. మహనీయుడవు. ఓ రామా! నన్ను రక్షింపుము.


సుముఖం సుహృదం సులభం సుఖదం

స్వనుజం చ సుఖాయ మమోఘ శరమ్

అసహాయ రఘూధ్వ మహన్య మహం

న కథంచన కంచన జాతు భజే. 8


తా. చక్కని ముఖము, మంచి మనస్సు, శరీరము కలవాడును, సులభుడును, సుఖముల నిచ్చువాడును, అనుకూల సోదరులు కలవాడును అగు శ్రీ రామచంద్రుని విడచి, నేను ఒకప్పుడును, ఎట్టి స్థితిలోను వేరొక దేవుని సేవింపను.


వినా వేంకటేశం న నాథో న నాథః

సదా వేంకటేశం స్మరామి స్మరామి

హరే వేంకటేశ ప్రసీద ప్రసీద

ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. 9


తా. వేంకటేశ్వరుడు తప్ప వేరొక దిక్కు లేనేలేదు. నే నెల్లప్పుడును వేంకటేశ్వరునే స్మరించుచుందును. ఓ హరీ! వేంకటేశ్వరా! అనుగ్రహింపుము. ఓ వేంకటేశ్వరా! నాకు ప్రియమును తప్పక కలుగజేయుము.


అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ

ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి

సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం

ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వేంకటేశ. 10


తా. ప్రభుడవైన ఓ వేంకటేశ్వరా! నీ పాద పద్మములకు నమస్కరించవలెనను కోరికతో నేనెంతో దూరము నుండి వచ్చి సేవించుచున్నాను. ఒక్కసారి చేసిన సేవకు, నిత్యసేవ చేయుటవలన కలుగు ఫలములను తప్పక అనుగ్రహింపుము.


అజ్ఞానినా మయా దోషా

నశేషా న్విహితాన్ హరే

క్షమస్వ త్వం క్షమస్వ త్వం

శేషశైల శిఖామణే. 11


తా. ఓ శేషశైలవాసియగు హరీ! నేను మూఢుడనై చేసిన లెక్కలేని తప్పులను తప్పక క్షమించి నన్ను రక్షింపుము.



శ్రీ వేంకటేశ ప్రపత్తిః

ఈశానం జగతోస్య వేంకటపతే ర్విష్ణోః పరాం ప్రేయసీమ్

తద్వక్షస్థ్సల నిత్యవాసర సికాం తత్ క్షాంతి సంవర్థనీమ్

పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం

వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్. 1


తా. ఈ లోకములకు ఆధారమైనదియు, శ్రీ వేంకటేశ్వరునికి మిక్కిలి ఇష్టురాలును, అతని వక్షస్థలమందు నిత్యము నివసించుటచే ఆనందించునదియును, అతని యోరిమిని వృద్ధి చేయునదియును, రెండు హస్తములందును కమలములను ధరించునదియును పద్మాసనమున ఉండునదియును, వాత్సల్యము మున్నగు గుణములచే ప్రకాశించునదియు, భగవతియు, లోకములకు తల్లియు అగు లక్ష్మీదేవికి నమస్కార మొనర్తును.


శ్రీమన్ కృపాజలనిధే కృతసర్వలోక

సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్

స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. 2


తా. శ్రీమంతుడవగు వేంకటేశ్వరా! నీవు దయాసముద్రుడవు. సమస్త లోకములకు సృష్టికర్తవు. సర్వజ్ఞుడవు. సర్వశక్తుడవు. సేవించువారి యెడల వాత్సల్యము కలవాడవు. సర్వస్వతంత్రుడవు. ప్రభువైనవాడవు. సుగుణములు కలవాడవు. ఆశ్రితులకు సులభముగా లభించు కల్పవృక్షమవు. నీ పాదములనే శరణుజొచ్చెదను.


ఆనూపు రార్చిత సుజాత సుగంధి పుష్ప

సౌరభ్య సౌరభకరౌ సమసన్నివేశౌ

సౌమ్యౌ సదానుభవనే పి నవానుభావ్యౌ

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. 3


తా. అందెలవరకును వ్యాపించిన మేలిరకపు పూల సువాసనచే పరిమళించునవియు, పొందికగా ఉన్నవియు, అందమైనవియు, నిత్యము చూచుచునే యున్నాను. క్రొత్తగా నుండి మనస్సును ఆకర్షించునవియు అగు శ్రీ వేంకటేశ్వరుని పాదములనే శరణు జొచ్చెదను.


సద్యో వికాసి సముదిత్త్వర సాంద్రరాగ

సౌరభ్య నిర్భర సరోరుహ సామ్యవార్తామ్

సమ్యక్షు సాహస పదేషు విలేలయంతౌ

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. 4


తా. అప్పుడే వికసించి, మనోహరముగా నుండి, ఎక్కువ పరిమళముతో నిండియున్న కమలముల పోలికలను సత్యముగా సాహసమే అని వెల్లడించుచున్న శ్రీ వేంకటేశవ్రుని పాదములనే శరణు పొందెదను.


రేఖామయ ధ్వజ సుధా కలశాత పత్ర

వజ్రాంకుశాంబురహ కల్పక శంఖ చక్రైః

భవ్యై రలంకృత తలౌ పరతత్త్వ చిహ్నైః

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. 5


తా. పరాత్పరుని చిహ్నములైన ధ్వజము, అమృతకలశము, ఛత్రము, అంకుశము, పద్మము, కల్పవృక్షము, శంఖము, చక్రము అను శుభకరములైన రేఖలతో కూడియున్న శ్రీ వేంకటేశ్వరుని పాదములనే శరణు పొందెదను.


తామ్రోదరద్యుతి పరాజిత పద్మరాగౌ

బాహ్మై ర్మహోభి రభిభూత మహేంద్రనీలౌ

ఉద్య న్నఖాంశుభి రుదస్త శశాంకభాసౌ

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. 6


తా. పద్మరాగములను మించిన అరపాదములును, ఇంద్రనీలములను అతిక్రమించిన కాంతిగల మీగాళ్లును, చంద్రుని కాంతిని మించిన కాంతి గల గోళ్ళును కల శ్రీ వేంకటేశ్వరుని పాదములనే శరణు పొందెదను.


స ప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం

సంవాహనేపి సపది క్లమ మాదధానౌ

కాంతావవాఙ్మనసగోచర సౌకుమార్యౌ

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. 7


తా. లక్ష్మీదేవి మిక్కిలి ప్రేమతోను, భయముతోను తన మృదువైన చిగురు హస్తములతో భద్రముగా ఒత్తుచున్నా శ్రీ వేంకటేశ్వరుని పాదములు కందిపోవును. అవి మిక్కిలి సుందరములై చెప్పుటకుగాని, ఊహించుటకు గాని సాధ్యపడని సౌకుమార్యము కలిగియుండును. అట్టి పాదములనే శరణు పొందెదను.


లక్ష్మీ మహీ తదనురూప నిజానుభావ

నీలాది దివ్య మహిషీ కరపల్లవానామ్

ఆరుణ్య సంక్రమణతః కిల సాంద్రరాగౌ

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. 8


తా. శ్రీదేవి, భూదేవి వారితో సమానులగు నీలాదేవి మున్నగు భార్యల పాదపల్లవముల ఎఱ్ఱని కాంతి సంక్రమించుటచేతనో యనునట్లుగా మిక్కిలి ఎఱ్ఱగా వున్న శ్రీ వేంకటేశ్వరుని పాదములను శరణుజొచ్చెదను.


నిత్యా నమద్విధి శివాది కిరీటకోటి

ప్రత్యుప్త దీప్త నవరత్న మహః ప్రరోహైః

నీరాజనా విధి ముదా ముపాదధానౌ

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. 9


తా. ప్రతిదినము నమస్కరించుచున్న శివుడు మున్నగు దేవతల కిరీటముల అగ్రభాగమునందు ఉన్నట్టివియు, మిక్కిలి ప్రకాశించునట్టివియు అగు నవరత్నములకాంతి సమూహమువలన నీరాజనమును పొందుచున్నవేమో అనునట్లు శ్రీ వేంకటేశ్వరుని పాదములను శరణు వేడెదను.


"విష్ణోః పదే పరమ" ఇత్యుదిత ప్రశంసౌ

యౌ 'మధ్వఉత్స' ఇతి భోగ్యతయా 7ప్యుపాత్తౌ

భూయ స్తథేతి తవ పాణితలౌ ప్రతిష్ఠౌ

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. 10


తా. ఓ వేంకటేశ్వరా! నీ పాదములు 'విష్ణోః పదే పరమ' అని ఋగ్వేదమున స్తుతింపబడినది. 'మద్య ఉత్స' అని తేనెయూటలుగా, అను భవయోగ్యములుగా చెప్పబడినది. 'ఆ మాట వాస్తవము' అని తిరిగి నీవే నీ హస్త సంజ్ఞతో తెలుపుచున్నావు. అట్టి నీ పాదములనే నేను శరణు వేడెదను.


పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ

యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి

భూయోపి మహ్య మిహ తౌ కరదర్శితౌ తే

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. 11


తా. ఓ వేంకటేశ్వరా! అర్జునునకు తగిన సారథివైన నీవు అతనికి 'నా పాదములనే శరణు పొందుము' అని హితమును ఉపదేశించితివి. ఆ పాదములనే ఇప్పుడు నాకును 'శరణు పొందుము' అని హస్తములతో చూపుచున్నావు. అట్టి నీ చరణములనే శరణు పొందెదను.


మున్మూర్ధ్ని కాళియఫణే వికటాటవీషు

శ్రీ వేంకటాద్రి శిఖరే శిరిసి శ్రుతీనామ్

చిత్తే ప్యనన్య మనసాం సమమాహితౌ తే

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. 12


తా. ఓ వేంకటేశ్వరా! నా తలపైని, కాళీయుని పడగపైని, దుర్గమారణ్యములందును, శ్రీ వేంకటాచలము యొక్క శిఖరముపైని, ఉపనిషత్తుల యందును, వేఱే ఆలోచన లేక నిన్నే స్మరించువారి మనస్సునందున, నీ పాదములు భేదములేక సమానముగనే ఉండును. అట్టి నీ పాదములనే శరణు వేడెదను.



ఆవ్లూన హృష్య దవనీతల కీర్ణ పుష్పౌ

శ్రీ వేంకటాద్రి శిఖరా భరణాయమానౌ

ఆనంది తాఖిల మనోనయనౌ తవైతౌ

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. 15


తా. ఓ వేంకటేశ్వరా! భూమిపైని, అంతటను చల్లబడిన వికసిత పరిమళ పుష్పములు కలవియు, శ్రీ వేంకటాచల శిఖరమునకు అలంకారమైనవియు, జనులందరి మనస్సులకు, నేత్రములకు ఆనందమును కల్గించునట్టివియు అగు నీ పాదములనే శరణు వేడెదను.


ప్రాయః ప్రసన్న జనతా ప్రథమావగాహ్యౌ

మాతుః స్తనావివ శిశో రమృతాయమాణౌ

ప్రాప్తౌ పరస్పర తులా మతులాంతరౌ తే

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. 16


తా. ఓ వేంకటేశ్వరా! ఆర్తులగు జనులకు సదా తొట్టతొలుత సేవింపదగినవియు, బిడ్డకు తల్లి యొక్క స్తనములవలె జనుల కమృతము వంటివియు, పరస్పరము పోలిక కలవియు, వేరొక వస్తువుతో పోలిక లేనివియు అగు నీ చరణములనే శరణువేడెదను.


సత్త్వోత్తరై స్సతత సేవ్యపదాంబుజేన

సంసార తారక దయార్ద్ర దృగంచలేన

సౌమ్యోపయంతృ మునినా మమ దర్శితౌ తే

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. 17


తా. ఓ వేంకటేశ్వరా! సాత్త్వికగుణము గల వారిచే సేవింపబడువాడును, సంసారమును తరింపజేయు దయామయమగు కడకంటి చూపు కలవాడును అగు మణవాళ మహాముని చేత నే నీ పాదములు నాకు చూపబడినవి. అట్టి నీ పాదముల నే నేను శరణువేడెదను.


శ్రీశ శ్రియా ఘటికయా త్వదుపాయభావే

ప్రాప్యే త్వయి స్వయముపే యతయా స్ఫురంత్యా

నిత్యాశ్రితాయ నిరవద్య గుణాయ తుభ్యం

స్యాం కింకరో వృషగిరీశ నజాతు మహ్యమ్. 18


తా. ఓ వృషశైవాధిపతీ! లక్ష్మీపతీ! మోక్ష మార్గమునకు నీవే ఉపాయభూతుడవు, నీవే ప్రాప్యుడవు. లక్ష్మీ దేవి నిన్నెల్లప్పుడును ఆశ్రయించి యుండుటవలన, ఆమెయును ఉపాయభూతురాలనును, ప్రాప్యురాలును అగుచున్నది. దోషరహితములైన గుణములు కల నీకే నేను సేవకుడనగుచున్నాను.

శ్రీ వేంకటేశ మంగళ స్తోత్రమ్

శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినామ్

శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్.


తా. లక్ష్మీదేవి భర్తయును, కళ్యాణ గుణములకు నిధియును, శరణార్థులకు రక్షకుడును, వేంకటాచలనివాసియు నగు శ్రీనివాసునకు మంగళ మగును గాక.


లక్ష్మీ సవిభ్రమాలోక సభ్రూ విభ్రమ చక్షుషే

చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్.


తా. లక్ష్మీదేవిని విలాసముగా చూచునట్టియు, చక్కని కనుబొమలు కల్గినట్టి నేత్రములు కలవాడును, సమస్త లోకములకును కన్నువంటివాడును అగు వేంకటేశ్వరునకు మంగళమగు గాక.


శ్రీ వేంకటాద్రి శృంగాగ్ర మంగళాభర ణాంఘ్రయే

మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్.


తా. శ్రీ వేంకటాచల శిఖరాగ్రమునకు చక్కని యాభరణమైన పాదములు కలవాడును, సమస్త మంగళములకు నిలయమైనవాడును అగు శ్రీ వేంకటేశవ్రునకు మంగళమగు గాక.


సర్వావయవ సౌందర్య సంపదే సర్వచేతసాం

సదా సమ్మోహనా యాస్తు వేంకటేశాయ మంగళమ్.


తా. సర్వావయవముల యొక్క సౌందర్య సంపదచే సమస్త ప్రాణులకును సమ్మోహమును కల్గించునట్టి శ్రీ వేంకటేశ్వరునికి మంగళమగు గాక.


నిత్యాయ నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే

సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్.


తా. నిత్యుడు, దోషములు లేనివాడు, సత్య స్వరూపుడు, చిదానందరూపుడు, సర్వాంతర్యామియు అగు శ్రీవేంకటేశ్వరునికి మంగళమగు గాక.


స్వత స్సర్వ విదే సర్వశక్తయే సర్వ శేషిణే

సులభాయ సుశీలాయ వేంకటేశాయ మంగళమ్.


తా. స్వభావము చేతనే సమస్తము ఎరిగినవాడు, సర్వసమర్థుడు, సర్వమునకు నియంతయైనవాడు, సులభుడు,

సుస్వభావము కలవాడు నగు శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.


పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే

ప్రయుంజే పరతత్త్వాయ వేంకటేశాయ మంగళమ్.


తా. పరబ్రహ్మస్వరూపుడు, నిండిన కోరికలు కలవాడు, పరమాత్మయు అగు శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.


అకాల తత్త్వ విశ్రాంత మాత్మనా మనుపశ్యతామ్

అతృప్త్యమృత రూపాయ వేంకటేశాయ మంగళమ్.


తా. కాలతత్త్వమును గమనింపక, ఎల్లపుడును తన్ను చూచుచున్న జీవాత్మలకు తనివితీరని అమృతస్వరూపుడగు శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.


ప్రాయః స్వ చరణౌ పుంసాం శరణ్య త్వేన పాణినా

కృపయా దృశ్యతే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్.


తా. పురుషులందరికిని తన పాదములే శరణమని వారియెడల గల దయచే తఱచుగా తన హస్తముతో చూపుచున్న శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.



దయామృత తరంగిణ్యా స్తరంగై రివ శీతలైః

ఆపాంగై స్సించతే విశ్వం వేంకటేశాయ మంగళమ్.


తా. దయ యనెడి అమృత ప్రవాహము నందలి అలల వలె చల్లనైన తన కటాక్షములను వ్యాపింపజేసి జీవలోకమును చల్లపరచుచున్న శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.


స్ర గ్భూషాంబర హేతీనాం సుష మావహ మూర్తయే

సర్వార్తి శమనాయాస్తు వేంకటేశాయ మంగళమ్.


తా. తాను ధరించిన పూలమాలలవలనను, నగల వలనను, వస్త్రములవలనను, ఆయుధములవలనను, ప్రకాశించు సుందర విగ్రహము కలవాడును, సమస్త బాధలను పోగొట్టువాడును అగు శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.


శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామిపుష్కరిణీ తటే

రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్.


తా. శ్రీ వైకుంఠ నివాసమున విరక్తిని పొంది, స్వామి పుష్కరిణీ తీరమునకు వచ్చి, అచట లక్ష్మీదేవితో కూడ వినోదించుచున్న శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.



శ్రీమత్సుదరజామాతృ మునిమానస వాసినే

సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్.


తా. శ్రీమణవాళ మహర్షి యొక్క మనసునందును, సమస్త జీవరాసులయందును నివసించునట్టి శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక!


నమ శ్శ్రీవేంకటేశాయ శుద్ధజ్ఞాన స్వరూపిణే

వాసుదేవాయ శాంతాయ వేంకటేశాయ మంగళమ్.


తా. శుద్ధజ్ఞాన స్వరూపుడు, శాంతుడు, వాసుదేవుడు శ్రీ కి నివాసస్థానమైన శ్రీ వేంకటేశ్వరునికి మంగళమగు గాక.


మంగళా శాసన పరై ర్మదాచార్య పురోగమైః

సర్వైశ్చ పూర్వై రాచార్యై స్సత్కృపాయాస్తు మంగళమ్.


తా. మంగళాశాసనమును చేయుచున్న మా గురువును, సమస్త పూర్వాచార్యులును ఆరాధించు శ్రీనివాసునకు మంగళమగు గాక.


*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

నమామి విఘ్నేశ్వర పాదపంకజమ్ 🌻

 🌻నమామి విఘ్నేశ్వర పాదపంకజమ్ 🌻


తెలి వలువలు శశి వర్ణము 

నలు భుజములు విష్ణుతత్వ నాయకు డయ్యు

న్నల శాంతివదన మొప్పెడు

నిలవేల్పుని శ్రీగణేశు నెపుడు భజింతున్


అందరికి వినాయక చతుర్థి శుభాకాంక్షలు,వందనములు 

              

 గోపాలుని మధుసూదనరావు శర్మ , సులోచన

గుణపాఠం

 *గుణపాఠం..*


ఆదివారం ఉదయం ఐదు గంటలకు మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం లో స్వామివారి ప్రభాతసేవ కార్యక్రమాలు మొదలవుతాయి..అప్పటినుంచి మరో గంటా నలభై ఐదు నిమిషాలపాటు ఆ కార్యక్రమం అలా సాగిపోతూనే ఉంటుంది..ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆఖరి హారతి ఇచ్చిన తరువాత..భక్తులను స్వామివారి మందిరం లోకి దర్శనానికి అనుమతి ఇస్తాము..సహజంగానే ఆ సమయం లో భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది..మేమందరమూ ఆ హడావిడి లో ఉంటాము..


ఆరోజు ఉదయం ఏడున్నర గంటలకు కందుకూరు నుంచి వచ్చే మొదటి బస్సులో ఒక యువతి స్వామివారి మందిరానికి వచ్చింది..మందిరం లోపలికి వచ్చి.."ఇక్కడ ప్రసాద్ గారంటే ఎవరు?" అని నన్నే అడిగింది.."నేనే" అని జవాబు చెప్పి.."మీ రెవరు..?" అని అడిగాను.."ఇక్కడ సిద్ధిపొందిన అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సమాధిని దర్శించుకోవాలి అని వచ్చాను..ముందుగా మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి.." అన్నది.."అమ్మా..చూస్తున్నారు కదా..ఇప్పుడు మీతో మాట్లాడే వ్యవధి లేదు..అన్యధాభావించవద్దు..ఇంకొక రెండు గంటల తరువాత..భక్తులు రావడం తగ్గుతుంది..ఈలోపల మీరు వెళ్లి స్నానం చేసి..స్వామివారి దర్శనానికి రండి..ముందు స్వామివారి సమాధి ని దర్శించుకొని..ఆ తరువాత సమయం చూసుకొని..నాతో మాట్లాడవచ్చు.." అని చెప్పాను.."సరే.." అని వెళ్ళిపోయింది..మరో అరగంటకు స్వామివారి దర్శనం చేసుకోవడానికి వచ్చింది కానీ..లోపలికి వెళ్ళలేదు..నా టేబుల్ వద్దనే ఒక ప్రక్కగా నేలమీద కూర్చుని.."ప్రసాద్ గారూ.మీకు తీరిక దొరికిన తరువాత..మీతో మాట్లాడి..ఆపై స్వామివారి సమాధి వద్దకు వెళతాను..అక్కడ నా మనసులోని మాట చెప్పుకుంటాను.." అన్నది..


మరో గంట తరువాత..నా వద్దకు రమ్మని చెప్పి..ప్రక్కనే కుర్చీలో కూర్చోమని చెప్పి.."అమ్మా..ఇప్పుడు చెప్పండి.." అన్నాను..అంతవరకూ ఎంతో ప్రశాంతంగా కూర్చుని ఉన్న ఆమె..తన రెండు చేతులతో ముఖం కప్పుకొని..ఏడ్చేసింది..అలా ఒక ఐదు నిమిషాల పాటు ఏడుస్తూనే ఉన్నది..ప్రక్కనే ఉన్న మా ఆవిడ..ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి..ఓదారుస్తూ.."అమ్మా..నీ కొచ్చిన కష్టం చెప్పు..ఇప్పుడు నువ్వు స్వామివారి సన్నిధిలో ఉన్నావు..భయపడకు..వ్యధ చెందకు.." అని చెప్పింది..కొద్దిసేపటికి తేరుకొని.."నా పేరు సుశీల..పెళ్లై పదేళ్లు అవుతున్నది..మాకొక బాబు..వాడికి ఎనిమిదేళ్ల వయసు..థర్డ్ క్లాస్ చదువుతున్నాడు..మావారు సాఫ్ట్ వేర్ లో ఉద్యోగం చేస్తున్నారు..నేనూ కొన్నాళ్ళు ఉద్యోగం చేసాను..బాబు పుట్టిన తరువాత మానేసాను..ఖాళీగా ఉన్న సమయం లో ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది కదా అని మావారితో చెప్పాను..నిజానికి ఆయన చెవిలో పోరు పెట్టాను..నేను ఖాళీగా వున్నాను..నేను నిర్వహిస్తాను..అని రోజూ మా వారితో చెప్పాను..ముందు ఆయన ఒప్పుకోలేదు..చివరకు ఒప్పుకున్నారు..ఇద్దరమూ బాగా చర్చించుకుని..చిట్ ఫండ్ వ్యాపారం పెట్టాలని నిర్ణయించుకొని..మొదలుపెట్టాము..మొత్తం నేనే నిర్వహించేదాన్ని..మొదటి మూడేళ్ళూ చాలాబాగా నడిచింది..ఆ తరువాతే మా కష్టాలు మొదలయ్యాయి..చిట్ పాడుకున్న వాళ్ళు కొన్నాళ్ళు డబ్బు కట్టారు..ఆ తరువాత మెల్లిగా ఆలస్యం చేయసాగారు..మాకు రావాలసింది ఎప్పుడైతే ఆలస్యం అయిందో..మేము కట్టాల్సిన వాళ్లకు సకాలం లో చెల్లించలేకపోయాము..కొందరికి చెక్ లు ఇచ్చాము..అవి కూడా నేను సంతకాలు చేసి ఇచ్చాను..నాలుగేళ్లు తిరిగే సరికి..బాగా ఇరుక్కుపోయాము..ఇద్దరు ముగ్గురు నేనిచ్చిన చెక్ లు అడ్డం పెట్టుకొని కోర్టులో కేస్ వేశారు..ఇంకొక పదిహేను రోజుల్లో కోర్టుకు హాజరు కావాలి..మావారు నేను నలిగిపోతున్నాము..ఏ దిక్కూ తోచలేదు.. ఈ మాధ్య సోషల్ మీడియా లో ఈ స్వామివారి గురించి చదివి..మా వారితో చెప్పి..చివరి ఆశగా ఇక్కడికి వచ్చాను.." అని మళ్లీ ఏడ్చేసింది..


కొద్దిసేపటి తరువాత..స్వామివారి సమాధి ని దర్శించుకొని..స్వామివారి పాదుకులకు నమస్కారం చేసుకొని..ఇవతలకు వచ్చి.."స్వామివారిని వేడుకున్నాను..నా సమస్యకు పరిష్కారం దొరికితే..మావారితో సహా ఇక్కడకు వచ్చి..మూడు రాత్రుళ్ళు నిద్ర చేసి..అన్నదానం చేసి వెళతాను.." అని మొక్కుకున్నాను..అన్నది.."చూద్దాం తల్లీ..స్వామివారిని త్రికరణ శుద్ధిగా నమ్ముకో..మంచి జరుగుతుంది.." అని మేమిద్దరం చెప్పాము..మధ్యాహ్నం వెళ్లిపోయింది..మూడు నాలుగు నెలలు గడిచిపోయాయి..ఒక శనివారం నాటి సాయంత్రం ఐదు గంటల వేళ..సుశీల తన భర్త, కుమారుడితో కలిసి స్వామివారి మందిరానికి వచ్చింది..నేరుగా మా దంపతుల వద్దకు వచ్చి..మాకు తన భర్తను పరిచయం చేసి.."మా సమస్య ఒక రకంగా తీరిపోయింది..ఇక్కడి నుండి వెళ్లిన తరువాత..అమెరికా లో ఉన్న మా అన్నయ్య కు విషయం తెలిసి..నా అప్పులు తీర్చడానికి అవసరమైన నగదు సర్దుబాటు చేసాడు..ముందు కేసుల్లోంచి బైటపడ్డాను.. మాకు వెసులుబాటు కలిగింది..కానీ..గుణపాఠం కూడా నేర్పింది..స్వామివారు సకాలం లో దారి చూపారు..మా అన్నయ్య రూపం లో స్వామివారే మమ్మల్ని కరుణించారు..ఇంకెప్పుడు అత్యాశకు పోను..స్వామివారి వద్ద ప్రమాణం చేయడానికి వచ్చాను..ఇప్పుడిప్పుడే మాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తున్నారు..త్వరలో వచ్చి నా మొక్కు చెల్లించుకుంటాను.." అని చెప్పింది..


సుశీల సమస్యకు పరిష్కారం చూపడమేకాక..జీవితం లో అత్యాశకు పోకుండా..చక్కటి పాఠం కూడా నేర్పారు స్వామివారు.


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

masterpiece joke !

 A masterpiece joke  !


A rat swallowed a diamond and the owner of the diamond contracted a man to kill the rat. 

When the rat hunter arrived to kill the rat there were more than a thousand rats bunched up all together and one sitting by itself away from the pack. 

He spotted and killed the one sitting by itself and to the owners surprise, that was the exact one that had swallowed the diamond! 


The amazed diamond owner asked: "How did you know it was that rat?"

He responded: "Very easy, 

When idiots get rich,  they don't mix with others!!!"

😏😜😂......


Superb 👍👍👍

Rather, its not a joke its a bitter reality ... 🤣🤣🤣🙏

సోమరిపోతులను

 *అన్నీ ఉచితం ! అంతా ఉచితం !*

✍🏻

45 ఏళ్ళదాకా నిరుద్యోగ భృతి,


45 ఏళ్ళనుండి వృద్ధాప్య పెన్షను.


*ఇంక జీవితంలో లేదు టెన్షన్,*

.

ఆకలేస్తే అన్న క్యాంటిన్


రోగమొస్తే ఆరోగ్యశ్రీ కార్డు


నిద్దరొస్తే సర్కారిచ్చిన ఇల్లు,


చుట్టాలొస్తే రూపాయికిలోసన్నబియ్యపువిందు !


పండగొస్తే 2 gas సిలిండర్లు,పండుగ కానుకగా ఒక సంచిలో 5 ఐటమ్స్.

.

అంతా బాగానే ఉన్నది !

భూతల స్వర్గం భారతదేశం !


కానీ

.

అన్న క్యాంటిన్ లో వంట ఎవరు చేస్తారు ? ఎందుకు చేస్తారు ?


రోగానికి మందిచ్చి సేవచేయటానికి ఎవరుముందుకొస్తారు ?


ఇంటినిర్మాణానికి రాళ్ళెత్తే కూలీవస్తాడా ?

.

వ్యవస్థ ,సమాజం ఛిన్నాభిన్నం కాదా ! అసలు మన నాయకులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ, మనలోని ఆత్మ గౌరవాన్ని నాశనం చేస్తున్నారు.


5 రూపాయల భోజనం ప్రజలు అడిగారా??


పండుగలకు బహుమతి అడిగారా??


లేదు 


నాణ్యమైన జీవితం కావాలని అడిగారు.


రోడ్లు అడిగారు, కరెంటు,నీరు,విద్య , ఉద్యొగ కల్పన అడిగారు. 


కానీ


అవి కాకుండా ఇదేమి విచిత్రం.


అసలు మనం ఎటు పోతున్నాం.


అసలు సంఘర్షణ లేని జీవితం ఒక జీవితమేనా ?


Is it worth living ???

.

ఒక గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారాలంటే "సంఘర్షణ"


ఒక లాల్ బహదూర్ శాస్త్రి ఒక ప్రధాని పీఠం దాకా రావాలంటే "సంఘర్షణ "


తన కలలు పండించుకోవడానికి  ఒక "కలామ్ " పడ్డది "సంఘర్షణ "


మనిషి ఎదగాలంటే కావాల్సింది సంఘర్షణ!

.

*పథకం చూడటానికి గొప్పదే*

.

ఇప్పటికే ప్రతి రంగం లోను పని చేసేవారు లేక కుదేలయిపోయింది !

.

వ్యవసాయానికి కూలీలేడు 

కొట్లోకి గుమాస్తా దొరకడు !


పనికి రమ్మంటే ఒక్కడూ రాడు ! వచ్చినా సరిగా పని చేయడు.

.

మనిషిని పనికి పురికొల్పేది అతని ఆకలే ! ఆకలి తీర్చాలి ! 


కానీ ఉచితంగా కాదు ! అది తీరేమార్గం చూపించాలి !


చైనా లో ఒక సామెత. ఆకలితో ఉన్నవాడికి  చేపలు ఇవ్వకండి, చేపలు పట్టడం నేర్పండి.

అతనికి ఎప్పుడు ఆకలేసిన, ఆకలి తీరుతుంది. 


అంతే గాని అన్ని ఉచితంగా ఇస్తాను. ఏమిటిది ???


.

*ఎవరికి ఉచితమివ్వాలి*?


పని చేసుకోలేని వారికి ,వృద్ధులకు ,అనాధలకు అభాగ్యులకు.

వారికి చేయూతనిచ్చే వ్యవస్థ ను రూపొందించండి.

.

అందరికీ అన్నీ ఉచితం అని సోమరిపోతులను తయారుచేయవద్దు !


పనిచేయని వాడికీ, పని చేసే వాడికీ కూడా ప్రభుత్వమే అన్నీ సమకూరుస్తే, చివరకి పని చేసే వాడు కూడా పని చేయడం మానేస్తాడు. వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతుంది,


ఒకప్పటి రష్యా పరిస్థితి ఇంతే కదా! 👋

ఎక్కడ దృష్టి పెడితే అదే కనిపిస్తుంది*

 👀 *ఎక్కడ దృష్టి పెడితే అదే కనిపిస్తుంది* 🌝


 ఒక మహిళ ప్రతిరోజు గుడికి వెళుతూ ఉండేది. 

 ఒక రోజు ఆమె పూజారిని చూసి ఇట్లా అంది -- ఇకపై నేను గుడికి రాను. 

 అప్పుడు పూజారి అడిగాడు -- ఏం జరిగింది? 

 అప్పుడు ఆమె చెప్పింది -- ఇక్కడ గుడిలో జనాలు చలవాణి లో తమ వ్యాపార విషయాలు మాట్లాడుకుంటున్నారు. కొందరు గుడిని ఊరికే ముచ్చట్లు పెట్టుకొనే స్థానంగా చేసుకున్నారు. కొందరు పూజ తక్కువ, అనాచారాలు, ప్రదర్శనలు ఎక్కువ చేస్తున్నారు. ఇదే చూస్తున్నాను. 

 అప్పుడు పూజారి కొద్దిసేపు మౌనం వహించి తర్వాత ఇట్లా అన్నాడు -- నిజమే కానీ మీ చివరి నిర్ణయానికి ముందు నేను చెప్పింది ఒకటి చేస్తారా? 

 అప్పుడు ఆమె ‘సరే చెప్పండి, ఏం చేయాలి?’ అని అడిగింది. 

 పూజారి అన్నాడు -- ఒక లోటా తీసుకొని నీటితో నింపండి. రెండుసార్లు గుడిచుట్టూ ప్రదక్షిణ  చేయండి. నియమం ఏంటంటే లోటా లో నుండి నీరు కింద పడరాదు. 

 అప్పుడామె -- సరే అలాగే చేస్తాను- అంది. 

 తర్వాత ఆమె కొద్దిసేపటి తర్వాత అట్లా చేసి చూపించింది. 

 అప్పుడు గుడి పూజారి ఆమెను చూసి 3 ప్రశ్నలను అడిగాడు – 

1. ఇప్పుడు మీరు ఎవరినైనా చలవాణిలో మాట్లాడుతూ చూసారా? 

2. ఎవరైనా గుడిలో ముచ్చట్లు పెట్టుకుంటూ కనిపించారా? 

3. ఎవరైనా అనాచారం చేస్తూ కళ్ళబడ్డారా? 

 అప్పుడామె అన్నది -- లేదు. నాకు ఇవేమీ కనిపించలేదు. 

 అప్పుడు పూజారి అన్నాడు -- మీరు గుడిలో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు పూర్తి దృష్టిని లోటా మీదనే ఉంచారు. దాని నుండి ఎక్కడ జలం కింద పడుతుందో అని. అందువల్ల మీరు ఇంక ఏమీ చూడలేదు. ఇవాల్టి నుంచి ఎప్పుడైనా మందిరానికి వస్తే మీ దృష్టినంతా పరమాత్మ మీద పెట్టండి. దానివల్ల మీరు దేనిని, ఎవరిని పట్టించుకోరు. భగవంతుడు మాత్రమే అంతట దృష్టిపథంలో కనిపిస్తాడు.

సత్సంగత్వే

 *ఖర్చులేని స్వర్గం!*

               ➖➖➖✍️


 *వాకింగ్ కి నడుచుకుంటూ వెళ్లివస్తూ, కాస్త అలుపు తీర్చుకునేందుకు కూర్చున్నప్పుడు, నా పక్కన ఉన్న వ్యక్తి ఒకరు సర్ ‘ఈరోజు ఏవైనా మంచి విషయాలు చెప్పండి!’ అన్నాడు.*


*నేను కాసేపు ఆలోచించి…“ స్వర్గానికి ప్రవేశం ఉచితం, కానీ నరకానికి వెళ్లాలంటే బోలెడు డబ్బు ఖర్చుపెట్టాలి, అయినా జనం చాలామంది ఖర్చు పెట్టి మరీ నరకానికి వెళ్ళటానికి ఇష్టపడతారు  అన్నాను.*


*అతను ఆశ్చర్యంగా నా వంకచూసి “అదెలా సామీ ?” అన్నాడు.*


*నేను చిన్నగా నవ్వి, ఇలా అన్నాను.. “జూదం ఆడటానికి డబ్బు కావాలి, మత్తు పానీయాలు త్రాగడానికి డబ్బు కావాలి, సిగరెట్ త్రాగడానికి డబ్బు కావాలి, పాపాలతో పయనించడానికి డబ్బుకావాలి, ఇలాటివే ఇంకా, ఇంకా చాలా ఉన్నాయ్ .. అవన్నీ నరకానికి వెళ్లేందుకు త్రోవలే కదా* 


*కానీ, ప్రేమను పంచడానికి డబ్బు అవసరం లేదు, నలుగురి మంచి కోరటానికి డబ్బులు అక్కర్లేదు, దేవుణ్ణి ప్రార్థించడానికి డబ్బు అవసరం లేదు, దీనులకు సేవచేయడానికి డబ్బు అవసరం లేదు, అలాగే  అప్పుడప్పుడు ఉపవాసం (ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం కోసం) ఉండడానికి డబ్బు అవసరం లేదు, క్షమించమని అడగడానికి డబ్బు అవసరం లేదు, మన చూపులో కరుణ, సానుభూతి, మానవత్వం చూపడానికి పెద్దగా డబ్బు అవసరంలేదు!*

 

 *దేవుడిపై నమ్మకం ఉండాలి, మనపై మనకు ప్రేమ, విశ్వాసం ఉండాలి, ఇప్పుడు చెప్పండి ..* 


*డబ్బు ఖర్చు చేసి నరకానికి వెళ్ళడానికి ఇష్టపడతారా ? ఉచితంగా లభించే స్వర్గం సుఖభోగాలకు ఇష్టపడతారా ? ఆలోచించండి ..*


 *సత్సంగత్వే నిస్సంగత్వం !* 

 *నిస్సంగత్వే నిర్మోహత్వం !!* 

 *నిర్మోహత్వే నిశ్చలతత్వం !* 

 *నిశ్చలతత్వే జీవన్ముక్తి: !!* 


*సత్పురుషుల మార్గదర్శనంలో సత్సాంగత్యం .. సత్ సహవాసం సత్ప్రవర్తనతో జీవించటానికి మించి గొప్ప జీవనం ఈ  భౌతిక  ప్రపంచంలో మరొకటి  లేదు*


పోస్ట్  వాట్సప్ నుండి సేకరించబడింది

రామమయం

 .

*ఒకసారి శ్రద్దగా చదవండి. చదివిన తరువాత ఆనందంతో ఆశ్చర్యపోతారు*

*అంతా రామమయం !. మన బతుకంతా రామమయం!*

*ఒక దేశానికి, జాతికి సొంతమయిన గ్రంథాలు ఉంటాయి. మనకు అలాంటిదే రామాయణం.*

*ఇంగ్లీషువాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ రాముడు మన వెంట నడిచిన దేవుడు !*

*మనం విలువల్లో, వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన ఆదర్శ పురుషుడు.*

*మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన అద్దం రాముడు.*

*ధర్మం పోతపోస్తే రాముడు!ఆదర్శాలు రూపుకడితే రాముడు!*

*అందం పోగుపోస్తే రాముడు!*

*ఆనందం నడిస్తే రాముడు!*

*వేదోపనిషత్తులకు అర్థం రాముడు !*

*మంత్రమూర్తి రాముడు !*

*పరబ్రహ్మం రాముడు!* *లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు !*

*ఎప్పటి త్రేతాయుగ రాముడు?*

*ఎన్ని యుగాలు దొర్లిపోయాయి?*

*అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగునా రాముడే.*

*చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట శ్రీరామరక్ష సర్వజగద్రక్ష !*

*బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడినపాట రామాలాలి మేఘశ్యామా లాలి.*

*మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు శ్రీరామరక్ష, సర్వ జగద్రక్ష.*

*మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట అయ్యో రామా.*

*వినకూడని మాట వింటే అనాల్సిన మాట రామ రామ.*

*భరించలేని కష్టానికి పర్యాయ పదం రాముడి కష్టం.*

*తండ్రి మాట జవదాటని వాడిని పొగడాలంటే రాముడు.*

*కష్టం గట్టెక్కే తారక మంత్రం  శ్రీరామ.*

*విష్ణుసహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట శ్రీరామ శ్రీరామ శ్రీరామ.*

*అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట అన్నమో రామచంద్రా !*

*వయసుడిగిన వేళ అనాల్సిన మాట కృష్ణా రామా !*

*తిరుగులేని మాటకు రామబాణం.*

*సకల సుఖశాంతులకు రామరాజ్యం.*

*ఆదర్శమయిన పాలనకు రాముడి పాలన.*

*ఆజానుబాహుడి పోలికకు రాముడు.*

*అన్నిప్రాణులను సమంగా చూసేవాడు రాముడు.*

*రాముడు ఎప్పుడూ మంచి బాలుడే.*

*ఆదర్శ దాంపత్యానికి సీతారాములు.*

 *గొప్ప కొడుకు రాముడు.*

*అన్నదమ్ముల అనుబంధానికి రామలక్ష్మణులు.*

*గొప్ప విద్యార్ధి రాముడు (వసిష్ఠ , విశ్వామిత్రలు చెప్పారు).*

*మంచి మిత్రుడు రాముడు (గుహుడు చెప్పాడు).*

*మంచి స్వామి రాముడు (హనుమ చెప్పారు).*

*సంగీత సారం రాముడు (రామదాసు, త్యాగయ్య చెప్పారు).*

*నాలుకమీదుగా తాగాల్సిన నామం రాముడు ( పిబరే రామ రసం సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు).*

*కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం రాముడు.*

*నోరున్నందుకు పలకాల్సిన నామం రాముడు.* *చెవులున్నందుకు వినాల్సిన కథ రాముడు.*

*చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు రాముడు.*

*జన్మ తరించడానికి రాముడు, రాముడు, రాముడు.*

*రామాయణం పలుకుబళ్లు మనం గమనించంగానీ, భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ, ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది. తెలుగులో కూడా అంతే.*

*ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడు ఏమవుతాడని అడిగినట్లే ఉంటుంది.*

*చెప్పడానికి వీలుకాకపోతే అబ్బో అదొక రామాయణం.*

*జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే సుగ్రీవాజ్ఞ, లక్ష్మణ రేఖ.*

*ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే అదొక పుష్పక విమానం.*

*కబళించే చేతులు, చేష్ఠలు కబంధ హస్తాలు.*

*వికారంగా ఉంటే శూర్పణఖ.*

*చూసిరమ్మంటే కాల్చి రావడం హనుమ.*

*పెద్ద పెద్ద అడుగులు వేస్తే అంగదుడి అంగలు.*

*మెలకువలేని నిద్ర కుంభకర్ణ నిద్ర.*

*పెద్ద ఇల్లు లంకంత ఇల్లు.*

*ఎంగిలిచేసి పెడితే శబరి.*

*ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే ఋష్యశృంగుడు.*

*అల్లరి మూకలకు నిలయం కిష్కింధ కాండ.*

*విషమ పరీక్షలన్నీ మనకు రోజూ అగ్ని పరీక్షలే.*

*పితూరీలు చెప్పేవారందరూ మంథరలే.*

*యుద్ధమంటే రామరావణ యుద్ధమే.*

*కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది (ఇది విచిత్రమయిన ప్రయోగం).*

*సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు.*

*బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు.*

*ఒక ఊళ్లో పడుకుని ఉంటారు.*

*ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు.*

*ఒక ఊళ్లో నీళ్ళు తాగి ఉంటారు.*

*ఒంటిమిట్టది ఒక కథ.*

*భద్రాద్రిది ఒక కథ.*

*అసలు రామాయణమే మన కథ.*

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 25*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 25*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


  *త్రయాణాం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే భవేత్పూ పూజా పూజా తవ చరణయో ర్యా విరచితా |*

 *తథాహి త్వత్పాదోద్వహన మణి పీఠస్య నికటే*

  *స్థితా హ్యేతే శశ్వ న్ముకుళిత కరోత్తం సమకుటాః ||*


త్రిగుణములు సత్త్వ, రజస్తమోగుణములు సమ స్థితిలో వున్నప్పుడు  అవ్యక్తము.  దీనిని మూలప్రకృతి అంటారు.


 మూలప్రకృతిః అవ్యక్తా, వ్యక్తా-వ్యక్త స్వరూపిణీ" అని అమ్మవారి నామాల్లో చెప్పుకుంటాం. తరువాత ఈ త్రిగుణములు సమతూకం కోల్పోయి, వ్యక్తం అయినప్పుడు అమ్మవారి ఆజ్ఞపై ఆమె సహాయంతో త్రిమూర్తులు సృష్టి, స్థితి, లయ కార్యములను చేస్తున్నారు. 


శివ వామ భాగ నిలయా ! నీ పాదములను పూజిస్తే సత్వ ,రజో ,తమో గుణాల వల్ల జన్మించిన బ్రహ్మా, విష్ణు, రుద్రులనే త్రిమూర్తులను పూజించినట్లే అంటున్నారు ఇక్కడ.

 భవేత్పూజా పూజా తవ చరణయోర్యా విరచితా... త్రయాణాం దేవానాం ఎందుకంటే, త్రిమూర్తులు నీ పాదపీఠం వద్ద నిలబడి రెండు చేతులు తలపై ఉంచుకొని నిన్ను ఆరాధిస్తున్నారు కనుక. మరి నీ పాదాలు ఎక్కడున్నాయి? సృష్టి, స్థితి లయలు జరిగే భువనానికి అతీతంగా పైన వున్నాయి. అట్టి త్రిగుణాతీతమైన అమ్మను ధ్యానిస్తే, త్రిగుణాలు మనను పతనం వైపు తీసుకువెళ్లకుండా కాపాడుతుందని భావం.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

ఈశ్వరపుత్రుడు

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 


𝕝𝕝శ్లో𝕝𝕝 *రణత్క్షుద్రఘణ్టానినాదాభిరామం*

*చలత్తాణ్డవోద్దణ్డవత్పద్మతాలమ్।*

*లసత్తున్దిలాఙ్గోపరివ్యాలహారం*

*గణాధీశమీశానసూనుం తమీడే॥*

                ~శ్రీగణేశభుజఙ్గస్తోత్రమ్


𝕝𝕝తా𝕝𝕝 

మ్రోగుచున్న చిరుగవ్వల సవ్వడిచే మనోహరుడు, తాళముననుసరించి ప్రచండతాండవం చేయుచున్న పాదపద్మములు కలవాడు, బొజ్జపై కదులుతున్న సర్పహారములు కలవాడు, ఈశ్వరపుత్రుడు అగు గణాధీశుని స్తుతించుచున్నాను.

ప్రవచన కౌముది

 శ్రీ రామాయణ ప్రవచన కౌముది బిరుదు ప్రదానం

-------------------------------

ప్రవచన కళా ప్రపూర్ణ, విశాఖ వాసి..శ్రీమాన్ అద్దంకి రాఘవాచార్యుల వారి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. వారికి ' శ్రీ రామాయణ కౌముది ' అనే బిరుదు ప్రదానం చేశారు. హైదరాబాద్ కొండాపూర్ లోని శ్రీ సీతారామాంజనేయ దేవస్థానంలో ' రామాయణ సారం సనాతన ధర్మ కాసారం ' అనే అంశంపై శ్రీమాన్ ఆచార్యుల వారు ఆదివారం చేసిన ప్రసంగం భక్తులను రామపారవశ్యంలో ముంచెత్తింది. దేవస్థానం వారు ఈ సందర్భంగా శ్రీవారిని బిరుదు, ప్రశంసా పత్రం, నగదు బహుమతితో ఘన.గా సన్మానించారు.

అజ్ఞానపు బిడ్డను

 శ్లోకం:☝️

*పృథివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరళాః*

*పరం తేషాం మధ్యే విరలతరలోఽహం తవ సుతః |*

*మదీయోఽయం త్యాగః సముచితమిదం నో తవ శివే*

*కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి ||*

 - దేవ్యపరాధక్షమాపనస్తోత్రం


భావం: శ్రీ మాతా! ఈ లోకంలో నీకు ఎందరో జ్ఞానులు, ఋజువర్తనులైన పుత్రులుండవచ్చు, కానీ వారందరిలో నేనే చాలా అరుదైన అజ్ఞానపు బిడ్డను. ఈ కారణంగా నన్ను విడిచిపెట్టి రక్షించకపోవడం సరికాదు. ఎందుకంటే ఎక్కడైనా చెడ్డ కొడుకు ఉండవచ్చు కాని చెడ్డ తల్లి ఉండదు కదా!🙏

పంచాంగం 18.09.2023 Monday,

 ఈ రోజు పంచాంగం 18.09.2023 Monday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస శుక్ల పక్ష: తృతీయ తిధి ఇందు వాసర: చిత్రా  నక్షత్రం ఇంద్ర యోగ: గరజి తదుపరి వణిజ కరణం ఇది ఈరోజు 

తదియ మధ్యాహ్నం 12:36 వరకు.

చిత్ర మధ్యాహ్నం 12:04 వరకు .

సూర్యోదయం : 06:08

సూర్యాస్తమయం : 06:12

వర్జ్యం : సాయంత్రం 06:04 నుండి రాత్రి 07:46 వరకు.

దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12:34 నుండి 01:22 వరకు తిరిగి మధ్యాహ్నం 02:59 నుండి 03:47 వరకు.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30  వరకు.


యమగండం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.  

 

వరసిద్ది వినాయక చవితి శుభాకాంక్షలు 


శుభోదయ:, నమస్కార:

సందేశం 3/11 వినాయక చవితి

 ॐ    వినాయక చవితి శుభాకాంక్షలు 

        


                        సందేశం 3/11 


        అగజానన పద్మార్కం 

        గజానన మహర్నిశం 

        అనేకదం తం భక్తానామ్ 

        ఏకదంతముపాస్మహే ॥ 


  - అనే శ్లోకం చాలా కాలంనుండి ఆనవాయితీగా వస్తున్నది. 


అగజ ఆనన పద్మ అర్కమ్ 

    

    గమించనిది కొండ. అట్టి మంచుకొండ కూతురు పార్వతి. పార్వతి ముఖపద్మానికి సూర్యునివంటి వాడని అర్థం. 

    సూర్యుని పోలిన వినాయకుని చూచినంతనే అగజానన పద్మము వికసిస్తుంది. 


గజాననం అహర్నిశం ఉపాస్మహే 


  - వినాయకుని రేయింబవలూ ఉపాసిస్తాను అని అర్థం. 

    రేయింబవలూ ఉపాసనచేయటం మనదేశంలోనే సాధ్యం. 


అనేకదం తం భక్తానామ్ 


అనేకదం- తమ్ - భక్తానామ్ 

  - అని విడదీయాలి. 

అంటే, భక్తులను స్వామి అనేక విధాలుగా అనుగ్రహిస్తాడు.


దంతం - విశేషం


    ఒక్కొక్క ప్రాణికి ఒకొక్క విషయమునందెక్కువ ప్రీతి. 

    చమరీమృగం తోక అంటే, 

    నెమలికి తన పింఛమే 

బంగారం. 

    ఏనుగునకు దంతాలంటే ప్రాణం .దేహం ఎలాగున్నా ఏనుగు తన దంతాలను మాత్రం తెల్లని కాంతులు వెదజల్లుతూ ఉండేటట్లుగా కాపాడుకుంటుంది. 


గజాననుడు - భారతం 


    కానీ గజాననుడు తాను అందం చందం గౌరవం వీటి అన్నింటికీ మూలాధారమైన ప్రాణప్రదమైన దంతాన్ని, చటాలున పెరికి మహాభారత రచనా సందర్భంలో కలముగా చేసికొన్నాడు. 

    న్యాయం ధర్మం విద్య - వీటికొరకు ఎంతటి త్యాగమైనా చేయవచ్చునని ఈయన ఈ పనితో నిరూపించారు. 

    దైవానికి ఉపకరణం నిమిత్తమాత్రమనిన్నీ, విద్యావ్యాప్తికి సత్యం జ్ఞానం ధర్మం, ఇవి వ్యాపించడానికి ఉత్కృష్టమైన ఎట్టి దేహావయవమునైనా త్యాగం చేయవచ్చుననీ నిరూపణకే ఈ మహామహుడు మహాభారతం వ్రాశాడని గోచరమవుతున్నది . 


    వినాయకుడు ప్రణవ స్వరూపి. 

    వినాయకుడు విఘ్నవినాశకుడు. 

    ఆయన అనుగ్రహబలం ఉంటే అంతా అనుకూలమే. 


గిరిరాజసుతా తనయుడు 


    లోకంలో పనులు అన్నీ విఘ్నం లేకుండా జరగాలంటే వినాయకుని అనుగ్రహబలం మనందరికీ కావాలి.     

    అందులకే త్యాగరాజస్వామి 

  "గిరిరాజసుతా తనయా" అని గానం చేశారు. 


           గిరిరాజసుతా తనయ

              (త్యాగరాజ కీర్తన)

                   ----------------


    పర్వతరాజైన హిమవంతుడి కుమార్తె - పార్వతియొక్క పుత్త్రుడా! 

    మంచి దయ కలిగినవాడా! 

    దేవేంద్రుడు మొదలైనవారిచేత అర్చించబడే పాదద్వయం కలిగినవాడా! 

    గొప్ప ఏనుగు ముఖం కలిగినవాడా! 

    నన్ను రక్షించుము. 


    గణపతీ! 

    శ్రేష్ఠులకు శ్రేష్ఠుడా! 

    శుభాన్ని కలుగజేసేవాడా! 

    వేదములనే సముద్రానికి చంద్రుడా! 

    (చంద్రుడిని చూచి సముద్రం ఘోషిస్తూ ఉప్పొంగుతుంది - వేదాలు భగవంతుడిని స్వరసహితంగా స్తుతిస్తాయి) 

    చేతి కంకణముగా పాములరాజును కలవాడా! 

    ఆటంకాలను అడ్డుకొనేవాడా! 

    శంభువు కుమారుడా! 

    త్యాగరాజుచేత స్తుతింపబడేవాడా! 


కీర్తన 


గిరిరాజసుతాతనయ! సదయ!     ॥గిరి॥ 


సురనాథముఖార్చిత పాదయుగ! - పరిపాలయ మామిభరాజముఖ!   ॥గిరి॥ 


గణనాథ! పరాత్పర!  శంకరా(ఆ) - గమవారినిధి రజనీకర! 

ఫణిరాజకంకణ! విఘ్ననివారణ! శాంభవ! శ్రీత్యాగరాజనుత!                        ॥గిరి॥  


https://youtu.be/yUeG8JxyHMM


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం