7, మే 2025, బుధవారం

సంతోషాన్ని నిర్ణయించగల హార్మోన్లు

 మనుష్యుల సంతోషాన్ని నిర్ణయించగల హార్మోన్లు నాలుగు ఉన్నాయి..


అవి..


1.ఎండార్ఫిన్స్

2.డోపమైన్

3.సెరొటోనిన్

4.ఆక్సిటోసిన్


ఈ హార్మోన్లని అర్థం చేసుకోవడం మనకి చాలా అవసరం..ఎందుకంటే మన సంతోషానికి ఇవి కారణం కాబట్టి ...


మొదటి హార్మోన్ ఎండార్ఫిన్స్ గురించి తెలుసుకుందాం..


మనము వ్యాయామం(exercise) చేసినప్పుడు మన శరీరం ఈ హార్మోన్ ని విడుదల చేస్తుంది ..


ఈ హార్మోన్ మనం వ్యాయామం చేసినపుడు కలిగే నొప్పిని తట్టుకునేందుకు సహకరిస్తుంది...అందుకే మనం మన వ్యాయామాన్ని ఉల్లాసంగా తీసుకోగలము ఎందుకంటే ఎండార్ఫిన్స్ మనకి ఆనందాన్ని కలిగిస్తాయి..


నవ్వితే కూడా ఎండార్ఫిన్స్ చాలా చక్కగా విడుదల అవుతాయి..


మనం రోజుకి కనీసం 30 నిముషాల వ్యాయామం చేయాలి..హాస్యసంబంధిత విషయాలను చదవటం కానీ చూడటం కానీ చేస్తే రోజుకి సరిపడా ఎండార్ఫిన్స్ లభిస్తాయి..


రెండవ హార్మోన్ డోపమైన్..


మనం మన జీవితంలో చిన్నవైనవో పెద్దవైనవో అయిన లక్ష్యాలను సాధిస్తూ ఉంటాము..ఆయా సందర్భాలకు తగినంత డోపమైన్ లభిస్తూ ఉంటుంది..


మనకి ఇంటి దగ్గరనో ఆఫీసులోనో ప్రశంసలు దొరికినప్పుడు సంత్రృప్తిగా అనిపిస్తుంది..అది ఈ డోపమైన్ విడుదల అవటం వలననే ..


ఇదే కారణం ఎక్కువ మంది ఇల్లాళ్ళు(housewives) ఆనందంగా ఉండలేకపోవటానికి కారణం తాము చేసే శ్రమకు తగిన గుర్తింపు ప్రశంసలు దొరకక పోవటమే వారి అసంతృప్తికి కారణం ...


ఒకసారి మనకు ఉద్యోగం దొరికాక..

కారు

ఇల్లు 

కొత్త కొత్త అధునాతన వస్తువులు ..

కొంటాము..

ఆయా సందర్భాలలో ఈ డోపమైన్ విడుదల అవుతుంటుంది, మనం ఆనందపడుతాము..


ఇప్పుడర్ధమైంది కదా మనం షాపింగ్ చేసినప్పుడు మనకి ఆనందంగా ఎందుకనిపిస్తుందో...


మూడో హార్మోన్ సెరెటోనిన్ మన వల్ల వేరొకరు ఆనందపడినప్పుడు, మనం వేరొకరికి ఉపకారం చేసినప్పుడు విడుదల అవుతుంది...


మనం సాటివారకి గానీ ప్రకృతికి గానీ సమాజానికి గానీ మంచి చేయగలిగినప్పుడు సెరిటోనిన్ విడుదల అవుతుంది..


అంతేకాదు..ఒకరి సమస్యలకు, ప్రశ్నలకు ..సలహాలు, సమాధానాలు బ్లాగ్స్ రూపంలోనో ఫేస్‌బుక్ గ్రూపు ల రూపంలోనో ఇవ్వగలిగినప్పుడు కూడా ఈ సెరిటోనిన్ విడుదల అయ్యి ఆనందంగా అనిపిస్తుంది...


అలా ఎందుకంటే మన విలువైన సమయాన్ని మరొకరికి సాయం చేసేందుకు ఉపయోగించడం మనకి సంతోషాన్ని ఇస్తుంది..


చివరి నాలుగవ హార్మోన్ ఆక్సిటోసిన్..మనం తోటివారితో అనుబంధాన్ని పెంచుకుని వారికి దగ్గర అయినప్పుడు విడుదల అవుతుంది..


మనం మన స్నేహితులనో కుటుంబసభ్యులనో ఆలింగనం (hug) చేసుకున్నప్పుడు ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది...మున్నభాయ్ అనే హిందీ సినిమాలో చెప్పినట్టు నిజంగా, ఒక ఆత్మీయఆలింగనం మంత్రం వేసినట్లుగా మాయ చేసి మనసుని కుదుటపరుస్తుంది...

అదేవిధంగా కరచాలనం, భుజాల చుట్టూ చేయి వేసి భరోసా ఇవ్వటం కూడా చాలా ఆక్సిటోసిన్ ని విడుదల చేయగలదు...


కాబట్టి ..

రోజూ వ్యాయామం ఎండార్ఫిన్స్ కోసం...

చిన్ని చిన్ని లక్ష్యాలను సాధిస్తూ డోపమైన్ కోసం..

తోటివారితో స్నేహంగా ఉంటూ సెరొటోనిన్ కోసం...

మన పిల్లలను ఆలింగనం చేసుకుంటూ ఆత్మీయులను దగ్గరకు తీసుకుంటూ ఆక్సిటోసిన్ కోసం..

జీవించే పద్ధతి ని అలవాటుచేసుకుంటూ ఉంటే ఆనందంగా జీవించగలమ

మనం సంతోషంగా ఉంటేనే మనం మన సమస్యలను సవాళ్ళను బాగా పరిష్కరించుకోగలము..


ఇప్పుడర్ధమైందా పిల్లలు చిరాకుగా ఉన్నప్పుడు వారిని దగ్గరకు తీసుకుని లాలించాలి...


అప్పుడు రోజురోజుకి మీ బిడ్డ సంతోషంగా హుషారుగా ఉండగలరు..


1.* ఆరుబయట ఆడుకునేలా ప్రోత్సహించాలి...ఎండార్ఫిన్స్


2.బిడ్డల చిన్న పెద్ద విజయాలకు ప్రశంసించాలి...డోపమైన్


3.సాటివారిని కలుపుకుంటూ వారితో సంతోషాలు పంచుకుంటూ జీవించే అలవాటుని మీరు పాటిస్తూ పిల్లలకూ అలవాటు చెయ్యాలి...సెరొటోనిన్


4. మీ బిడ్డ ను దగ్గరకు హత్తుకోండి...ఆక్సిటోసిన్...


జీవితాన్ని ఆనందమయం చేసుకోండి...🙂

ఆ రోజులే ఎంతో హాయి!

 శీర్షిక.. ఆ రోజులే ఎంతో హాయి!


ఆరోజులె ఎంతో హాయి

ఇది కాదనలేని నిజం 


కారంతో మండే పచ్చడి మెతుకులు తిన్నా

చల్దన్నం తిన్నా .. మారాం గారం 

అలుకలతో.. అమ్మ గుమ్మపాలు త్రాగి గడిచిన బాల్యం 

భీమునిలా బలవంతుని చేసిన పౌష్టిక ఆహారం

ఈనాడు డబ్బా పాలతో అవుతుంది పీలగా.. బలహీనంగా 


కొండలు ఎక్కుతూ, చెట్టూ చేమలపై ఎగబ్రాకుతూ

పొలాల గట్లపై గెంతుతూ.. చెరువుల్లో ఈదుతూ 

చెట్లెక్కిన ఆ బాల్యం ఎంతో అపూర్వం 

నాన్న తెచ్చిన తాజా తాజా బుట్టెడు మామిడి పండ్ల

రసాలు జుర్రుతూ.. ఆస్వాదించిన తీయని మమతల 

మాధుర్యం బాల్యం గుండె గుడిలో దాగింది..దొంగాటలు ఆడుతుంది 

నేను మళ్లీ నీకు కనిపించనంటూ..


బ్రహ్మ ముహూర్తం లో ఎక్కాల లెక్కల

చదువుతూ.. శతక పద్యాలు బట్టీ బెట్టింగులతో 

స్వర రాగాల పల్లకిలో..హల్లుల తైతక్కలతో 

చిలుకల పలుకుల పదాల పదనిసలతో 

సరస్వతీ నమస్తుభ్యం.. గురువే దైవంగా 

భావించిన విద్యాధనం పొందిన ఆరోజులే ఎంతో హాయి 


 కష్ట సుఖాల్లో కలిసీ మెలిసీ ఒకరికి ఒకరై అండగా 

తోడు నీడగా.. నిలిచిన ఉమ్మడి కుటుంబం 

ఆకలిని తీర్చే దయా గుణంతో 

వినయం శాంతీ సహనంతో వర్ధిల్లిన ఆ రోజులే ఎంతో హాయిగా..


వృద్ధాప్యంలో తీయని స్మృతులు 

ఆలపించాయి.. మది వెన్నెల కంటె చల్లగా సేదలు తీర్చాయి 

మమతలు వెల్లువగా 

ఆనాటి ఆ రోజులే ఎంతో హాయి కదా!!


°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

ఇది నా స్వీయ కవిత

దయాసముద్ర తరంగాలు*

 🌸 *దయాసముద్ర తరంగాలు*


(శృంగేరి శారదా పీఠం 36వ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి జీవిత విశేషాలు)


శ్రీచరణులు నిరంతర పఠనశీలి. ఎన్నో గ్రంథాలను అవలోకిస్తుంటారు. కొన్ని పుస్తకాలను సంపాదించి శృంగేరికి వెళ్లినప్పుడు శ్రీచరణులకు సమర్పిద్దామని ఒక భక్తుడు అనుకుని పుస్తకాలను అమ్మే కొట్టుకువెళ్లాడు. అక్కడ పుస్తకాలను పరిశీలిస్తుంటే ఒకపుస్తకం పై అర నుండి క్రింద పడింది. అతను దానిని తీసి పైన పెట్టాడు. కాస్సేపటికి ఆ పుస్తకం మళ్లీ క్రిందపడింది. ఆ భక్తుడు తిరిగి దానిని పై అరలో పెట్టాడు. కొన్ని పుస్తకాలను ఎంచుకుని వాటిని డబ్బుకట్టే చోటికి తీసుకువెళ్తుంటే, రెండుసార్లు తాను పై అరలో పెట్టిన పుస్తకం మళ్లీ నేలమీదపడి ఉండటం చూసాడు. అప్పుడు ఆపుస్తకాన్ని కూడ కొన్నాడు.


శృంగేరికి వెళ్లి శ్రీచరణులను దర్శించిన తరువాత భక్తుడు తన సంచీనుండి తాను కొన్నపుస్తకాలను బయటికి తీసి శ్రీచరణులకు సమర్పించాడు అయితే మూడుసార్లు నేలమీద పడిన పుస్తకాన్ని మాత్రం సమర్పించలేదు.


శ్రీజగద్గురువులు : (ఆ పుస్తకాన్ని చూస్తూ) ఆపుస్తకమేమిటి?


భక్తుడు : యితరపుస్తకాలను వెదుకుతున్నప్పుడు దీనిని కొనాలనిపించింది.


శ్రీజగద్గురువులు : అలాగా! మేము దానిని ఒక్కసారి చూడవచ్చా?


భక్తుడు : తప్పక (పుస్తకాన్ని సమర్పిచాడు)


శ్రీజగద్గురువులు : (పుస్తకం పై అట్టను చూసి) ఆశ్చర్యంగా ఉంది. చాలా కాలంనుండి ఈ పుస్తకాన్ని మేము చదవాలనుకుంటున్నాము.


భక్తుడు : ఈవిధంగా ఈ పుస్తకాన్ని నేనెందుకు కొన్నానో నాకిప్పుడు అర్ధమైంది.


శ్రీచరణులు చిరునవ్వుతో యిలా అన్నారు "ఆ గొప్పతనం మాది కాదు. ఇలా. జరగాలని అమ్మవారి సంకల్పం. అలా జరిగింది."


ఆంగ్లమూలం:

కె.సురేష్ చందర్ గారు

https://chat.whatsapp.com/LbYrKf7JokM6lc6MEhj5if

తెలుగు అనువాదం : 

తుమ్మలపల్లి హరిహరశర్మ గారు.


🌸 *శారదే పాహిమాం శంకర రక్షమాం* 🙏

గోధుమగడ్డి రసం ఉపయోగాలు

 గోధుమగడ్డి రసం ఉపయోగాలు - సంపూర్ణ వివరణ.


       గోదుమగడ్డి రసం అనునది వైద్యంలో చాలా ప్రముఖపాత్ర కలిగి ఉంది. చాలా మందికి దీనియొక్క ఉపయోగాలు తెలియక నిర్లక్ష్యం చేస్తున్నారు . గత కొంతకాలంగా దీనిపైన కొంతపరిశోధన చేసి దీని ఉపయోగాలు తెలుసుకున్నాను. ఈ గోధుమగడ్డి రసం కేన్సర్ చికిత్సలో కూడా చాలా అద్బుతఫలితాలు ఇచ్చింది. ఇది జలుబు , దగ్గు లాంటి చిన్నచిన్న వ్యాధులనే కాక బ్లడ్ కేన్సర్ , కేన్సర్ వంటివాటిలో కూడా చక్కని ఫలితాలు ఇస్తుంది.


             డాక్టర్ థామస్ అనే పరిశోధకుడు కూడా ఈ గడ్డిపైనా చాలా అద్భుతపరిశోధనలు చేశాడు . ఈ గడ్డిలో జీవమున్న ఖనిజాలు , విటమిన్లు , ఇతర పోషకాలు అనేకం ఉన్నాయి అని కనుగొనినాడు. ఒక ఆరోగ్యవంతుడి రక్తములో ఉండే అన్ని రకాల పదార్ధాలు ఈ గోధుమగడ్డి రసములో ఉండును. ఈ గోధుమగడ్డి రసానికి "ఆకుపచ్చ రక్తం " అనికూడా పేరు కలదు. కేన్సర్ తో బాధపడువారు ఒక గ్లాసు నిండా గోదుమగడ్డి రసాన్ని రోజుకి నాలుగుసార్లు తీసుకొనవలెను . ఇలా రోజుకి నాలుగు గ్లాసుల చొప్పున గోదుమగడ్డి రసాన్ని తీసికొనవలెను .


              ఈ గోధుమగడ్డికి జీవమున్న ఆహారం అని పేరు కలదు. దీనిలో ఉండే "క్లోరోఫిల్" రక్తాన్ని శుద్దిచేస్తుంది. పేగుల్లోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది . గోదుమగడ్డి రసంలో ఉండు క్లోరోఫిల్ పార్టికల్స్ హిమోగ్లోబిన్ ని పోలి ఉంటాయి. అందువల్ల రక్తహీనతకు ఐరన్ లా పనిచేయును . ఈ క్లోరోఫిల్ గుండె పనితీరును మెరుగుపరుచును. శరీరవ్యవస్థను , పేగులను , మూత్రకోశం , ఊపిరితిత్తులను బాగుగా ప్రభావితం చేయును . దీనిలో విటమిన్ A , B , ఈ మరియు K పెద్దమొత్తంలో ఉంటాయి. గోధుమ కంటే 600 శాతం అధికంగా విటమిన్ B ను గోధుమగడ్డి కలిగి ఉంటుంది. గోధుమగడ్ది లో కేన్సర్ నివారణకు ఉపయోగపడు B17 పెద్దమొత్తంలో ఉన్నది. గోధుమల కంటే గోధుమగడ్డిలో 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 


                శరీరంలో 30 రకాల ఎంజైములను చురుకుగా ఉంచడానికి అవసరం అయిన మెగ్నీషియం ఖనిజాలు గోధుమగడ్డి రసములో తేలికగా లభ్యం అగును. ఇప్పుడు మీకు గోధుమగడ్డి రసం వాడటం వలన నయం అయ్యే కొన్నిరకాల వ్యాధుల గురించి తెలియచేస్తాను . అవి 


     చర్మవ్యాధులు , మానసిక , శారీరక వ్యాధులు , మూత్రకోశ సంబంధ వ్యాధులు , మూత్రపిండాలలో రాళ్లు , మలబద్దకం , కడుపువ్యాధులు , మధుమేహం , గుండెవ్యాధి , కీళ్లు , కండరాల వ్యాధులు , ఆస్తమా , వంధత్వము , కన్ను , చెవి సంబంధ వ్యాధులు , కంపవాతం , దీర్ఘకాలిక జలుబు , అగ్నిమొలలు , వయస్సుకు ముందే జుట్టు నెరవడం , స్త్రీ గర్భసంబంధ వ్యాధులు , నిద్రలేమి , రక్తహీనత , కేన్సర్ వంటి వ్యాధులు 


             పైన చెప్పిన సమస్యలతో బాధపడువారు రోజుకు నాలుగు గ్లాసుల చొప్పున తక్కువలోతక్కువ 21 రోజులపాటు తీసుకొనవలెను .


    

  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

నిమిత్త మాత్రులం

 *🙏🏻🙏🏻🙏🏻జై శ్రీ సంతోషిమాత 🙏🏻🙏🏻🙏🏻*


💎 *ఒక రోజు హనుమంతుడు శ్రీరాముణ్ణి కలుసుకున్నాడు. తన మనసులో కదులుతున్న ఆలోచనలను విన్నవించుకున్నాడు. "ప్రభూ! ఒక వేళ నేను లంకకు వెళ్ళకపోతే నా జీవితంలో ఎంతో పెద్ద లోపం మిగిలిపోయేది. అన్నిటికంటే ముందు విభీషణుడి ఇంటిని నేను చూశాను "ఈ రావణ లంకలో సాధువులు కూడా ఉంటారా" అనుకున్నాను. నేను లంకలో సీతాదేవిని వెతక లేకపోతే విభీషణుణ్ణి కలిసినప్పుడు ఉపాయం చెప్పాడు.*💎


              *నేను ఎంత ప్రయత్నించినా తెలియని విషయం లంకలో ఉన్న ఆ సాధువు ద్వారానే నాకు తెలిసింది ప్రభూ! బహుశా ఈ దృశ్యం చూపించడానికే ఇక్కడకు నన్ను పంపిచారేమో! అశోక వాటికలో రావణుడు వచ్చినప్పుడు ఆయన క్రోధంతో కత్తి దూసి సీతమ్మను చంపబోతుంటే, నాకు ఒక్కసారిగా దూకి, ఆ కత్తిని లాక్కొని, అతని తల ఖండించా లనిపించింది.*💎


        🔔 *కాని మరుక్షణమే మండోదరి రావణాసురుని చెయ్యి పట్టుకుని ఆపింది. ఆ దృశ్యం చూసి నేను పులకరించిపోయాను. ఓ తండ్రీ! మీరు ఎంతమంచి పాఠాన్ని నేర్పించారు! ఒకవేళ నేను సీతమ్మను రక్షించి ఉంటే "నేను లేకపోతే ఏమయ్యేది" అనే భ్రమ ఏర్పడేది. చాలమందికి "నేను లేకపోతే ఎలా?" అనే ఇలాంటి భ్రమ ఏర్పడుతుంది. నాకు కూడా అదే జరిగేది. ప్రభూ!*🔔


            *మీరు సీతమ్మను రక్షించడమే కాదు, ఆ పనిని రావణుడి భార్యకే అప్పగించారు. సీతమ్మకు ఏమవుతుందనే చింత, భయం నాకు తొలగిపోయాయి. అలాగే, త్రిజట లంకలోకి కోతి వచ్చిందని చెప్పింది. నాకు త్రిజట కూడా ఒక గొప్ప సాధ్విని అనిపించింది. ఈ కోతి లంకను తగుల బెడుతుందని చెప్పింది. కాని మరి "నా శ్రీరాముడు లంకను తగుల బెట్టమని చెప్పలేదు కదా? ఎలా?" అని ఆలోచనలో పడిపోయాను.*🔔


       🤔 *రావణాసురుడి సభలో నేను బంధితుణ్ణి అయితే ఎలా ఉంటుందో చూడ్డానికి బందీని అయ్యాను. రావణుడి సైనికులు నన్ను చంపడానికి వచ్చినప్పుడు నన్ను రక్షించుకోవడానికి నేను ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. కాని దూతను చంపడం సరికాదని విభీషణుడు చెప్పాడు. నన్ను రక్షించడానికి ఈ ఉపాయం మీరే చేశారని నాకు అర్థమయింది.*🙂


            *ముందు విభీషణుణ్ణి నాకు చూపి నా భ్రమను తొలగించారు. సీతమ్మను రక్షించడానికి మండోదరిని నియమించారు. నన్ను రక్షించడానికి రావణుడి తమ్ముణ్ణి పంపించారు. ప్రభూ! అన్నింటి కంటే ఆశ్చర్యకరమైన విషయం...రావణుడు " కోతిని చంపకూడదు. కాని దాని తోకకు నూనెలో ముంచిన వస్త్రాన్ని చుట్టి నిప్పు అంటించవచ్చు" అన్నాడు. ఆ విధంగా లంకలో త్రిజట చెప్పిన మాట సత్యమయింది. "లంకను తగులబెట్టడానికి నూనెనూ, నిప్పునూ నేను ఎక్కడినుంచి తీసుకురాగలను" అనుకున్నాను. కానీ ఆ ఏర్పాట్లు కూడా రావణాసురుడే చేశాడు. రావణుడితో కూడా మీరు పని చేయించు కున్నప్పుడు నాతో చేయించు కోవడం పెద్ద విషయమేమీ కాదు" అన్నాడు వినయంగా.*


          *అందుకే ఈ ప్రపంచంలో ఏది జరుగుతున్నా అది కర్మసిద్ధాంతం ప్రకారమే, దైవ సంకల్సం తోనే. మనం కేవలం "నిమిత్త మాత్రులం" అని గుర్తుంచుకోవాలి*👍🏼🔔🙏🏼🙏🏼.. *ఆంధ్ర ఫోకస్✍️*సర్వేజనా సుఖినోభవంతు🙏🏻🙏🏻*

జై గణేష్

 జై గణేష్

ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః

శుభోదయం.


శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే


ఓం గం గణపతయే నమః


అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః 

లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః 


ధూమ్ర కేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః 

వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః 


షోడశైతాని నామాని యః పఠేత్ శృణు యాదపి 

విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా 

సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య


శ్రీ గురుభ్యోన్నమః


గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।

గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ।।


సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం

అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం


పూజ్యాయ రాఘవేంద్రాయ, సత్య ధర్మ రతాయచ, భజతాం కల్పవృక్షాయ, నమతాం కామధేనువే.


లోకాః సమస్తాః సుఖినోభవంతు ॥

శుభమస్తు, 

ఓం శాంతి.. శాంతి.. శాంతిః

ఇద్దరే బలవంతులు

 *ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు. వారెవరో చెబితే నీళ్లు ఇస్తాను అంటుంది🌲*


*కాళిదాసు*


*🌻మండు వేసవిలో ఒకరోజు మహాకవి కాళిదాసు పరదేశానికి బయల్దేరాడు. మిట్టమధ్యాహ్న సమయానికి ఒక గ్రామానికి చేరుకున్నాడు. బాగా దాహం వేయడంతో ఓ గుడిసె దగ్గరికి నీళ్ల కోసం వెళ్తాడు.*


*🌻ఓ బాలిక నీటి కుండతో గుడిసెలోకి వెళ్తుంటుంది. ఆమెను చూసి బాలికా! నాకు దాహంగా ఉంది. నీళ్లు ఇవ్వమని అడిగాడు కాళిదాసు. అప్పుడా బాలిక,‘మీరెవరో నాకు తెలియదు నీళ్లు ఎలా ఇచ్చేదను’అని బదులిచ్చింది.*


*🌻కాళిదాసు ‘నేను ఎవరో తెలియకపోవడం ఏంటి? పెద్ద పండితుడను ఎవరిని అడిగినా చెబుతారు’అని అన్నాడు. అహంకార పూరితమైన ఆ మాటలు విని బాలిక నవ్వి,మీరు అసత్యమాడుతున్నారు. ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు. వారెవరో చెబితే నీళ్లు ఇస్తాను’ అంటుంది.*


*🌻అప్పుడు కాళిదాసు కాసేపు ఆలోచించి. ‘నాకు తెలియదు గొంతు ఎండిపోతోంది ముందు నీళ్లు ఇవ్వమ’ని బతిమాలుకుంటాడు. అయినా ఆ బాలిక కనికరించదు. ఇద్దరు బలవంతులు ఎవరో కాదు ఆకలి, దాహం.*


*🌻ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు? అని అడుగుతుంది బాలిక. ‘నేను బాటసారి’ని అన్నాడు కాళిదాసు. మళ్లీ అసత్యమాడుతున్నారు. బాటసారి అంటే ఒకచోటి నుంచి మరోచోటికి బడలిక లేకుండా వెళ్లాలి.*


*🌻మీరేమో అలిసిపోయారు కదా, ఈ లోకంలో అలా అలసిపోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు. వారే సూర్యచంద్రులు! అని చెప్పి గుడిసెలోకి వెళ్లింది బాలిక.*


*🌻దాహానికి తట్టుకోలేక ఆ గుడిసె ముందే నిలబడి, ‘మాతా నీళ్లు ఇవ్వండి దాహంతో చనిపోయేలా ఉన్నాను’ అని ప్రాధేయపడ్డాడు కాళిదాసు. లోపలి నుంచి ఓ ముసలావిడ బయటకు వచ్చి ‘మీరెవరో సెలవివ్వండి నీళ్లిస్తాను’ అంది. కాళిదాసు దీనంగా ‘నేను అతిథిని!’ అని బదులిచ్చాడు.*


*🌻మీరు అసత్యం చెబుతున్నారు. ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు. ఒకటి ధనం, రెండోది యవ్వనం. ఈ రెండూ ఎప్పుడు వెళ్లిపోతాయో ఎవరికీ తెలియదు అంటుంది. కాళిదాసు ‘నేను సహనశీలిని నీళ్లు ఇవ్వండ’ని వేడుకుంటాడు. కానీ ఆమె మీరు మళ్లీ అసత్యమే చెబుతున్నారు. ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలురు ఉన్నారు. ఒకటి భూమి, రెండోది వృక్షం. ఇప్పుడు నిజం చెప్పు నీవెవరు? అని అడిగింది.*


*🌻ఓపిక నశించిన కాళిదాసు, ‘నేను మూర్ఖుడను ఇప్పుడైనా నీళ్లివ్వండ’ని అడిగాడు. ఆ అవ్వ నవ్వుతూ, ఇదీ అసత్యమే. ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు, అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు అని అంటుంది.*


*🌻ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది. ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు. ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది. ‘కాళిదాసా! విద్యతో వినయం వృద్ధి చెందాలి కానీ, అహంకారం కాదు నాయనా! కీర్తిప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని మరల్చడానికే ఈ పరీక్ష’ అని జలమును అనుగ్రహిస్తుంది.*


*🌻విద్య, అధికారం, ధన బలముతో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి.*


🙏ఓంనమఃశివాయ హరహరమహదేవశంభోశంకర🙏