26, ఫిబ్రవరి 2024, సోమవారం

అంటుకొని ఉన్నట్టు!

 🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝 సుఖమధ్యే స్థితం దుఃఖం

దుఃఖమధ్యే స్థితం సుఖమ్౹

ద్వయమన్యోన్య సంయుక్తం

ప్రోచ్యతే జలపఞ్కవత్౹౹


తా𝕝𝕝 సుఖాల మధ్య దుఃఖాలు, దుఃఖాల మధ్య సుఖాలు ఉండే ఉంటాయి. నీళ్లు బురద ఒకటికి ఒకటి అంటుకొని ఉన్నట్టు!


*_సేకరణ: బ్ర.శ్రీ. అడుసుమల్లి ప్రభాకరశర్మ_*

*_అడ్మిన్ - సంస్కృతసుధాసింధువు_*

సూర్యాష్టకం

 *సూర్యాష్టకం*


ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర

దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే


సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం

శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం


లోహితం రధమారూఢం సర్వ లోక పితామహం

మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం 


త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం

మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం


బృంహితం తేజసాం పుంజం వాయు మాకాశ మేవచ

ప్రభుంచ సర్వ లోకానాం తం సూర్యం ప్రణమామ్యహం


బంధూక పుష్ప సంకాశం హార కుండల భూషితం

ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం


విశ్వేశం విశ్వ కర్తారం మహా తేజః ప్రదీపనం

మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం


తం సూర్యం జగతాం నాధం జ్నాన విజ్నాన మోక్షదం

మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం


సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం

అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్


ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే

సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా


స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే

న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి


*ఇతి శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం*

Kapila theertham


 

Pittu


 

Divyaanugraham


 

Thrible strich


 

Devudu chustunnaaduchustunnaad


 

Chandragir fourt


 

Three baabaas


 

Pesarattu


 

Orange in America


 

Natural sea salt


 

భృగుమహర్షి శోధనంబు

 🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *పురాణ పఠనం*

. *🪐శ్రీ కృష్ణావతారం🪐*

. *102వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*భృగుమహర్షి శోధనంబు* 


వారు పలు యాగాలను వైభవోపేతంగా చేయసాగారు. ఆ సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు ఎక్కువ గొప్పవారు అన్న చర్చ వారి మధ్య వచ్చింది. ఇలా చర్చించుకుని, భృగుమహర్షిని త్రిమూర్తుల మహత్యములను పరీక్షించి రమ్మని పంపారు. అంతట ఆ మహర్షి బయలుదేరి వెళ్ళి…..ఆయన సత్త్వ గుణసంపదను పరీక్షించాలి అనుకుని, భృగుమహర్షి బ్రహ్మదేవుడి కొలువులోనికి ప్రవేశించాడు. బ్రహ్మను స్తుతించకుండా ఆ మహర్షి మౌనంగా నిలబడ్డాడు. బ్రహ్మదేవుడు రుసరుస లాడి చిరాకుగా చూస్తూ....చతుర్ముఖుడు తన మనసులో కలతపడ్డాడు. భృగువు తన కొడుకే కదా అనుకుని, బ్రహ్మదేవుడు తన రోషాన్ని ఎలాగో చల్లార్చుకున్నాడు. ఆ మహాతపశ్శాలి, మునివరుడు, భృగుమహర్షి బ్రహ్మదేవుడి సభనుండి నిష్క్రమించి, నాగాభరణుడు అయిన ఈశ్వరుని కోసం కైలాస పర్వతం దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు ఆ వెండికొండ మీద విశ్రమించి ఉన్న పార్వతీపరమేశ్వరులు బ్రహ్మదేవుని పుత్రుడు అయిన భృగువు రాకకు సంతోషించారు. భృగువు సోదరవాత్సల్యంతో తనను కౌగలించుకుంటాడు అనుకుని పరమశివుడు వేగంగా అతనికి ఎదురు వెళ్ళాడు. కాని, శివుడి సత్త్వగుణం పరీక్షించాలనే ఉద్దేశంతో....భృగువు శివుని రాకకు స్పందించకుండా ఊరక నిలబడ్డాడు. ముక్కంటి పరమశివుడు, బ్రహ్మపుత్రుడైన భృగువు ఎడల ఆగ్రహోదగ్రుడయ్యాడు. తన విస్ఫులింగాలు వెదజల్లే త్రిశూలంతో ఆ మహర్షిని వక్షంపై పొడవడానికి ప్రయత్నించాడు. కాని, పార్వతీదేవి చటుక్కున అడ్డువచ్చి....పార్వతీదేవి పతి పాదాలమీదపడి సముచిత మధుర వచనాలతో అతని కోపం పోగొట్టింది. భృగువు అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

పిమ్మట భృగుమహర్షి వైకుంఠానికి వెళ్ళాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఒడిలో తలపెట్టుకుని పవళించి ఉన్నాడు. కౌస్తుభమణితో విరాజిల్లుతున్న విష్ణువు యొక్క వక్షాన్ని మునీశ్వరుడు తన కాలితో గట్టిగా తన్నాడు. నారాయణుడు నిర్వికారంగా పానుపు దిగి, ముని దగ్గరకు వచ్చి, కాళ్ళకు నమస్కారించి ఇలా అన్నాడు. “ఓ మునివర! దివ్య తపశ్శాలి! నీ రాకను గురించి తెలిసికొనలేక నేను చేసిన అపరాధాన్ని మన్నించు నన్ను కరుణించు. నీవు అభయము ఇచ్చుటలో ముందుండు వాడవు. ఈ మణిమయ సింహాసనంపై ఆసీనులు కండు. పవిత్రమూర్తి! మహానుభావా! నీ పాదజలం నన్నే కాదు నా కడుపులో ఉన్న సమస్త లోకాలను, లోకపాలకులను పవిత్రం చేయగలదు. ఓ మునీశ్వరా! నీ పాదతాడనము నా వక్షానికి అలంకారము అయిది. నీ రాక మా వంటి వారికి శుభదాయకం కదా. నేను ధన్యుడను అయ్యాను.” అని మృదుమధురంగా మాట్లాడాడు. శ్రీపతి మధురోక్తులకు భృగుమహర్షి మనసు సంతుష్టి చెందింది. ఆ శ్రీహరిని, ముకుందుడిని, అనంతగుణ నిధిని పలువిధాల స్తుతించాడు. ఆనంద భక్తి పారవశ్యాలతో కనులు చెమర్చుతుండగా విష్ణువు దగ్గర అనుమతి తీసుకొని, వెనుదిరిగి సరస్వతీనదీ తీరంలో ఉన్న మునుల వద్దకు వచ్చి, వారికి విషయం అంతా చెప్పాడు.....ఆ ఋషీశ్వరులకు తను వెళ్ళివచ్చిన వివరాలు, తనకు అవగతము అయిన త్రిమూర్తుల స్వభావాలు భృగుమహర్షి సవిస్తరంగా తెలిపాడు. ఆ మునీంద్రులు అచ్చెరు వొందారు. వారు సందేహాలు విడిచిపెట్టారు. సకల కల్యాణనిధి, చిన్మయస్వరూపుడు, లక్ష్మీపతి, అనుపమ అనవద్యుడు, ఆదిమధ్యాంత రహితుడు, పుండరీకాక్షుడు అయిన శ్రీమహావిష్ణువు ఒక్కడే పరమదైవం అని నిర్ణయించారు. అలా ఆ మునులు మహాఙ్ఞానులు అయి, హరిపాదారవింద ధ్యానరతులు అయి, ప్రీతితో సేవించారు.

అలా విష్ణుమూర్తిని భక్తితో సేవించిన ఆ మునులు వైకుంఠప్రాప్తిని పొందారు.” అని చెప్పి శుకమహర్షి పరీక్షిత్తుతో ఇంకా ఇలా అన్నాడు. 


విప్రుని ఘనశోకంబు 


“మహారాజా! తామరల వంటి విశాల నయనాల వాడు శ్రీకృష్ణుడు కుశస్థలిలో సుఖంగా ఉంటున్న రోజులలో, ఒక విప్రుని భార్యకు పుత్రుడు పుట్టి పుట్టగానే చనిపోయాడు. శోకంతో కన్నీళ్ళు పెట్టుకుని మృతబాలుడిని ఎత్తుకుని వచ్చి, ఆ బాలుడి శవాన్ని రాజద్వారం ముందు పెట్టి, విధిని నిందిస్తూ, తనను తాను తిట్టుకుంటూ, బ్రాహ్మణుడు గుండెబ్రద్దలయ్యేలా “అయ్యో” అంటూ దుఃఖించసాగాడు. దుర్భరశోకంతో కుమిలిపోతున్న ఆ విప్రుడు అక్కడి ప్రజలతో “బ్రాహ్మణద్వేషి, శాస్త్రాచారాన్ని పాటించని వాడు, పాపాత్ముడు అయిన క్షత్రబంధువు చేసిన పాపం వలన నా కుమారుడు పుట్టగానే చచ్చిపోయాడు. దేశాన్ని ఏలే రాజు హింసను ఏవగించుకోకుండా, న్యాయానికి దూరుడు, ఇంద్రియలోలుడు అయితే ఆ ప్రజలు నిరాశతో దుఃఖాలవలన అధికమైన కష్టాలను పొందుతారు.” అని ఏడుస్తూ ఇక అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు. ఈ విధంగా తనకు కొడుకులు పుట్టి మరణించిన ఎనమండుగురు కొడుకులను ప్రతిసారి, వారిని తీసుకు వచ్చి రాజమందిర ద్వారం ముందు పెట్టి, ఆ బ్రాహ్మణుడు ఏడుస్తూ మునుపటిలాగే కొన్ని కథలు చదివి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇలా అతనికి పుట్టి చనిపోయిన తొమ్మిదవకొడుకును కూడ ఆ బాలుని శవాన్ని తెచ్చి ఆక్రందిస్తున్న బ్రాహ్మణుడిని చూసిన అర్జునుడు ఇలా అన్నాడు. “అయ్యా! ఇలా నీవు దుఃఖిస్తుంటే చూసి ఈ అన్యాయాన్ని వారించే సమర్ధత గల విలుకాడు ఒక్కడు అయినా ఈ నగరంలో లేడా? ఇది పాపము.


ఈలోకంలో అధికంగా ఎవరి రాజ్యంలో కన్నబిడ్డల్ని పోగొట్టుకుని దుర్భరశోకంతో పరితపించే బ్రాహ్మణులు ఉంటారో, ఆ రాజు రాజు కాడు కేవలం వేషగాడు మాత్రమే. నీ కుమారుడిని నేను బ్రతికిస్తాను అలా చేయకపోతే నేను అగ్నిప్రవేశం చేస్తాను.” ఈ పలుకులు వినిన బ్రాహ్మణుడు ఆశ్చర్యపడి ఇలాగా అన్నాడు. “అయ్యా! ఇలాంటి అవివేకపు మాటలు పలుక తగదు. మహా వీరులు, మహా బలశాలురు అయిన బలరామకృష్ణులు, కృష్ణకుమారుడు ప్రద్యుమ్నాదులు ఉండగా, ఇంకా... ప్రశంసించదగిన బలం కలిగిన యాదవవీరులు ఉండగా, వారిచేతనే కాని పనిని చక్కపెట్టడం నీవు ఎలా చేయగలవు కానీ, నీ దారిన నీవు వెళ్ళు.” ఇలా అంటున్న ఆ బ్రాహ్మణుడి మాటలు వినిన ఇంద్రతనయుడు...అర్జునుడి మనసులో దురహంకారం పెచ్చుమీరింది. రెండు చేతులతో వడిగా బాణాలు వేయగలిగిన ఆ మహావీరుడు రోషంతో వశంతప్పి, అక్కడి జనాలు అందరు వినేలా విప్రుడితో ఇలా అన్నాడు. “నేను బలరాముడినికాను కృష్ణుడిని కాను; ప్రద్యుమ్నుడిని కాను; అతని కొడుకైన అనిరుద్ధుడిని కాను. యుద్ధంలో నా భీకరమైన గాండీవం నుండి వెలువడే వాడిబాణాలతో శత్రువులను చీల్చిచెండాడే మహాపరాక్రమం కలిగిన నేను అర్జునుడిని. అంతేకాక.....అయ్యా! ఆ పరమశివుడినే ఎదిరించి పోరాడి భుజబలం చూపిన నన్నే ఎరుగవా? మృత్యుదేవత పొగరు అణచి, నా పట్టు ప్రదర్శించి, నీ పుత్రులను ఇప్పుడే తీసుకు వచ్చి ఇస్తాను.” ఇలా నమ్మకంగా పలికిన పార్థుడి మాటలపై బ్రాహ్మణుడి మనసు శాంతించింది. అతడు నరుని కొనియాడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్నిదినాలు గడిచాయి. విప్రుడి భార్యకు మళ్ళీ ప్రసవించే సమయం సమీపించింది. భూసురుడు వెంటనే వచ్చి పరమ భీభత్సంగా యుద్ధంచేసే వాడైన అర్జునుడికి ఈ విషయం చెప్పాడు. ఆ ఇంద్రపుత్రుడు అంతట...

విశిష్టమైన పవిత్రజలాలతో ఆచమనం చేసాడు. పరిశుద్ధ ప్రదేశంలో నిలబడి శివుడికి నమస్కరించాడు. గొప్పగొప్ప అస్త్రాలను వేయగలిగిన అర్జునుడు శుభప్రదులైన మంత్రదేవతలను మనసున తలచుకుని గాండీవాన్ని ఎక్కుపెట్టి పట్టుకున్నాడు. అమ్ముల పొదులు రెంటినీ కట్టుకున్నాడు. ఈ విధంగా సంసిద్ధుడు అయిన అర్జునుడు అంతట....బ్రాహ్మణుడి కూడా వెళ్ళి ఆ ప్రసవమందిరం చుట్టూ దట్టమైన బాణాలతో కప్పివేశాడు. మిక్కిలి జాగరూకతతో ప్రసూతిగృహానికి కావలి కాస్తున్నాడు. అప్పుడా బ్రాహ్మణుని భార్యకు మగ పిల్లాడు పుట్టి వెంటనే చనిపోయాడు. అక్కడి జనం ఆర్తనాదాలు చేశారు. మరణించిన పిల్లాడు శరీరంతోసహా ఆకాశంలోనికి అదృశ్యం అయ్యాడు. బ్రాహ్మణుడు విలపిస్తూ మురాసురుడు కృష్ణుడి దగ్గరకు వచ్చాడు. అలా వెళ్ళిన విప్రోత్తముడు....శ్రీకృష్ణుడి సమక్షంలో నిలబడి. “ముకుందా! నందనందనా! సనందాది ముని వందితా! పరమానంద! శ్రీకృష్ణా! గోవిందా! హరీ! శరశ్చంద్రుని వెన్నెల వంటి గొప్ప సత్కీర్తి కలవాడా! ఒకటి, అంతకన్నా ఎక్కువ హల్లులు పెక్కుమార్లు ఆవృత్తి చేయుట వృత్యనుప్రాస. అనగా ఒకే హల్లు అనేకసార్లు తిరిగితిరిగి వస్తే అది వృత్యనుప్రాస. ఇక్కడ విప్రుడు శ్రీకృష్ణుని స్తుతించు సందర్భంలో కంద పద్యంలో "పూర్ణానుస్వార పూర్వక ద" పది పర్యాయాలు వాడుతూ నింద చేయబోతున్నాడు అని సూచిస్తున్నాడా అన్నట్లు వృత్యనుప్రాస మన పోతన అలంకరించాడు. మహాత్మా! నా విన్నపాన్నిఆలకించు. పౌరుషహీనుడైన పార్థుని డాంబిక వచనాలను నమ్మి అమాయకుడిని అయి కొడుకును పోగొట్టుకున్న నన్ను నేను ఏమని నిందించుకోవాలి. సమస్త జగత్తు సృష్టి స్థితి లయాలకు మూలకారకుడవు అయిన నీవు సమర్థుడివే అయినా వారించలేక ఊరకున్నావు. మానవమాతృడు ఇంతటి మహాకార్యం ఎక్కడ నెరవేర్చగలడు?” అని ఇంకా ఇలా అన్నాడు....“ఈ పాండుతనయుడు ఒక విలుకాడట; ఇతగాడి మాటలు యదార్థ మట; ఇదొక గాండీవ మట; ఇతగాడికి దివ్యాస్త్రాలంటూ ఉన్నాయిట; ఏ మనగలం.” ఈలాగున బ్రాహ్మణుడు తనను నిందిస్తుంటే, కోపం వచ్చిన అర్జునుడు తన విద్యాప్రభావంతో వెంటనే బయలుదేరి యమమందిరానికి వెళ్ళాడు. అక్కడ బ్రాహ్మణపుత్రులు లేకపోడంతో పార్థుడు వెంటనే ఇంద్ర, అగ్ని, నిరృతి, వరుణ, వాయు, కుబేర,–

 ఈశానుల నివాసాలకు వెళ్ళి అన్వేషించాడు. అనంతరం దేవ, యక్ష, కింపురుష, నాగ, రాక్షస, సిద్ధ, సాధ్య, ఖేచరాదుల ఇళ్ళకు వెళ్ళి బ్రాహ్మణపుత్రుల కోసం వెదికాడు. కాని వారి జాడ అక్కడ కూడా దొరకలేదు. చివరకు మళ్ళీ భూలోకానికి వచ్చాడు. తన ప్రతిజ్ఞ ప్రకారం అగ్నిప్రవేశం చేయటానికి పట్టుదలగా సిద్ధపడ్డాడు, శ్రీకృష్ణుడు ఈ విషయం తెలుసుకుని “బ్రాహ్మణ కుమారులను నేను నీకు చూపిస్తాను.” అని చెప్పి అర్జునుడిని మంటల్లో దూకకుండా వారించాడు. పిమ్మట...


మృతవిప్రసుతులఁదెచ్చుట 


సూర్యుడు ఉదయపర్వతాన్నిఎక్కినట్లు, అందమైన దివ్యరత్నకాంతులతో ప్రకాశిస్తున్న బంగారు రథాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడితో కలిసి అధిరోహించాడు. తన దేహకాంతులు దిక్కుల ప్రకాశిస్తుండగా శ్రీకృష్ణుడు విప్రబాలురను వెదకటానికి బయలుదేరాడు. పట్టణాలతో పల్లెలతో దుర్గాలతో అరణ్యాలతో పర్వతాలతో నదీనదాలతో సరోవరాలతో నిండిన భూమండలం, సప్తసముద్రాలు, మహాదీవులు, కులపర్వతాలు, మేరుపర్వతం దాటి శ్రీకృష్ణుడి రథం మహావేగంతో ముందుకు సాగిపోయింది. శ్రీకృష్ణార్జునులు దట్టమైన చీకటిమండలాన్ని ప్రవేశించారు.


వారు సాహసంగా ముందుకు వెళ్తూ ఉంటే, చీకటి మరింత భయంకరంగా తయారైంది. కళ్ళకేదీ కనిపించ లేదు. గుఱ్ఱాలు శక్తి కోల్పోయి దారితప్పి నిలబడిపోయాయి. శ్రీకృష్ణుడు భేదించరాని ఆ చీకట్లను రూపుమాపడం కోసం...బాలసూర్యుడి కాంతికి సాటివచ్చే కాంతితో వెలిగే తన చక్రాయుధాన్ని శ్రీకృష్ణుడు ప్రయోగించాడు. అది విజృంభించి చిమ్మచీకటిని తొలగిస్తూ పైనుండి ముందుకు దూసుకుని పోసాగింది. కృష్ణార్జునులు చక్రాయుధం వెళ్ళే మార్గం వెంట అమితివేగంగా రథాన్ని నడిపించుకుంటూ వెళ్ళి చీకటిని దాటారు. అప్పుడు వారి ముందు కన్నులు మిరుమిట్లు కొలిపే దివ్యతేజస్సు కనిపించింది. అర్జునుడు భయంతో కళ్ళు మూసుకున్నాడు. అతని ఆ స్థితిలో కొంత దూరం వెళ్ళారు. పిమ్మట, పూని మహావేగంగా వీచే గాలులతో, చెలరేగే కెరటాలతో గంభీరంగా ఉన్న జలరాశిని కృష్ణార్జునులు ప్రవేశించారు. ఆ నీటి నడిమిభాగంలో కోటిసూర్యుల కాంతులు ప్రకాశిస్తున్నాయి. అక్కడ ఆ జలరాశిమధ్యలో ఒక దివ్యభవనం కనబడింది. దానిలో తేజోమయమైన వేలకొలది మనోహరమైన మణిస్తంభాలు ఉన్నాయి రమణీయ రత్నహారాలు అలంకృతమై వ్రేలాడుతున్నాయి. అది అనంత తేజస్సుతో విరాజిల్లుతోంది. సూర్యచంద్ర కిరణాలకు ప్రవేశింపరానిది, జన్మరాహిత్యానికి మార్గము, నిత్యైశ్వర్యదాయకము, అవ్యయము, మహోన్నతము, సాటిలేని వైభవోపేతము, పరమ యోగీంద్రులకు ప్రవేశయోగ్యము, భాగవతోత్తములకు నివాసస్థానము అయి విరాజిల్లుతోంది. ఆయొక్క మహాసౌధంలో...అటువంటి ఆ దివ్యభవనంలో దట్టమైన శరత్కాలపు పండువెన్నెల, కర్పూరం, మంచులకు సాటివచ్చే తెల్లనిదేహము; తుమ్మెదల్లాగా నల్లకలువల్లాగా ఇంద్రనీలమణులలాంటి నల్లని కంఠాలు; ఉదయకాలం సూర్యుడిలాగా ప్రకాశించే పద్మరాగమణులతో కూడిన పడగలు; తెరచుకున్న నోళ్ళ నుంచి వెలువడే విషపు పొగలలా ఉన్న నాలుకలు; యాగగుండాలలోని జ్వాలలాగ ప్రకాశించే వేడిచూపులు; వెండికొండలాగా ఉన్న భారీ ఆకారము కలిగిన ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడనే పాన్పు....ఆ ఆదిశేషుని పాన్పుగా కొని సుఖంగా ఆసీనుడై ఉన్న తేజోమూర్తి దగ్గరకు శ్రీకృష్ణార్జునులు వెళ్ళి దర్శించారు. నీలమేఘశ్యాముడు, ఆశ్రితజనరక్షకుడు, పద్మాలలో తుమ్మెదలాగ సనకాది మునీంద్రుల హృదయపద్మాలలో నివసించేవాడు, పూర్ణ చంద్రుని మించిన ముఖకాంతి కలవాడు, విశ్వవిఖ్యాత చారిత్రుడు, ప్రాతఃకాలంలో వికసించిన పద్మపత్రాల వంటి నేత్రాలు కలవాడు, లక్ష్మీమనోహరుడు, శ్రీకరుడు, పీతాంబరధరుడు, హారాలు కేయూరాలు కటక కంకణాలు కిరీటాలతో భూషణుడు, భవసాగర శోషణుడు, భక్తజన సంపోషణుడు అయిన మహావిష్ణువును వారు చూసారు. అంతేకాదు, సదా సునందాది పరిజనులచే సేవించబడువాడు, నిత్యానంద కందళిత హృదయుడు, శ్రీదేవి భూదేవి సమేతుడు, నారదయోగీంద్ర గానలోలుడు, కరుణాసముద్రుడు, అవ్యయుడు, అనఘుడు, అనంతుడు, అప్రమేయుడు, అజితుడు, అవికారుడు, పరమ పురుషుడు, పురుషోత్తముడు, సకల లోకాల సృష్టి స్థితి లయ కారకుడు, చిత్తు అచిత్తులకు ఈశ్వరుడు, అష్టభుజుడు, వక్షమున కౌస్తుభమణి అలంకృతుడు, శంఖచక్రగదాశార్ఙ్గాది దివ్యాయుధ సంపన్నుడు, సర్వశక్తి సేవితుడు, బ్రహ్మదేవుని జనకుడు అయిన ఆ శ్రీమన్నారాయణునికి శ్రీకృష్ణార్జునులు భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి, చేతులు జోడించి స్తుతించారు. ఆ ఆదినారాయణుడు వారిని దయాదృష్టితో చూసి, మందహాసం చేసి, సాదరంగా ఇలా అన్నాడు. “భూమికి భారమైపోయిన రాక్షసులను వధించి, ధర్మాన్ని రక్షించడం కోసం నా అంశతో మీరిద్దరు నరనారాయణులుగా జన్మించారు.

మహానిష్ఠతో ఉన్నతులైన మిమ్మల్ని ఈ మునీశ్వరులు చూడాలని కోరారు. అందుకని, మీరిక్కడకు రావాలనే ఉద్దేశంతో ఆ బ్రాహ్మణుని కుమారులను ఇక్కడకు తెప్పించవలసివచ్చింది.”

అని పిమ్మట “ఈ బాలకులను మీరు తీసుకుని వెళ్ళండి” అని పలికి ఆ బాలకులను అప్పజెప్పి విష్ణువు వారికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. శ్రీకృష్ణార్జునులు వినయంతో భగవంతుడిని అనేక విధాల స్తుతిస్తూ బ్రాహ్మణపుత్రులతో అక్కడ నుండి బయలుదేరారు. కోరిన పని సాధించి సఫల మనోరథులు అయిన కృష్ణార్జునులు వారి వారి వయసులకు తగిన ఆకారాలతో ఉన్న ఆ విప్రసుతులను వెంటబెట్టుకుని వచ్చి బ్రాహ్మణుడికి అప్పజెప్పారు. ఆ బిడ్డలను చూసిన ఆ విప్రుడు ఎంతో ఆనందం పొందాడు. అంతట....ఓ మహారాజా పరీక్షిత్తు! ఇంద్రతనయుడు సూర్యసమతేజస్వి అయిన అర్జునుడు కృష్ణుడితో వెళ్ళి తను దర్శించిన ఆ లోకశరణ్యుడు విష్ణుమూర్తి సౌధవైభవం; ఆయన మహనీయ సమున్నత యశస్సునకు మనస్సులో ఆనందించి పెక్కుమార్లు స్తుతించాడు. పద్మాక్షుడిని, భక్తమందారుని, పుణ్యాత్ముని, అఖిలేశుని, కేశవుని, జయశీలుని, పరమాత్ముని, శ్రీకృష్ణుడిని స్తుతించి; ఆయన పాదపద్మాలకు ప్రణామాలు చేసి అర్జునుడు మిక్కిలి ఆనందించాడు.అంతట....అనంతుడు, వేదవేద్యుడు, సర్వేశ్వరుడు, ఆద్యుడు, అభవుడు అయిన శ్రీకృష్ణుడు బ్రాహ్మణులాదిగా గల సమస్త ప్రజలను సకల ధన వస్తు సంపన్నులను చేసాడు. వారిని సంరక్షిస్తూ ధర్మాన్ని సంస్థాపిస్తు పాపాత్ములను సంహరిస్తు, ద్వారకలో గొప్ప శుభసంతోషాలతో ప్రకాశించాడు. సంతోషచిత్తుడై ప్రజలు మెచ్చేలాగ అనేక యజ్ఞ యాగాలను శ్రీకృష్ణుడు శాస్త్రోక్తంగా తనను ఉద్దేశించి తనే పరమోత్సాహంతో జరిపించాడు,


సశేషం🙏


*హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

సామరస్యాన్ని కొనసాగించాలి*....

💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

      🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


   *||శ్లోకము||*


*పరస్పరసమం నాస్తి* 

*ప్రాణిమాత్రద్వయం భువి|*

*ఇతి విజ్ఞాన సౌహార్దం* 

*రక్షేయుర్విశ్వబంధవః||*


*||తాత్పర్యము||*


*ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు, ఆలోచించరని అర్థం చేసుకుని మానవాళి పరస్పర సామరస్యాన్ని కొనసాగించాలి*....

జ్ఞానం పెరుగుతుంది.*

 *ముంబై హైకోర్టు సీనియర్ న్యాయవాది డికె శ్రీవాస్తవ రాసిన ఈ పోస్ట్‌తో మన జ్ఞానం పెరుగుతుంది.*


*ఇదీ భారతదేశ వ్యవస్థ!!*


 *మీరే చూడండి ....*

    సేకరణ:-పవర్ ఆఫ్ ఆర్టీఐ.


1- ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు కావాలను కుంటే, అతను ఒకేసారి రెండు స్థానాల నుండి ఎన్నికల్లో పోటీ చేయ వచ్చు.కానీ అదే వ్యక్తి మాత్రం రెండు చోట్ల ఓటు వేయ లేరు.


2- ఒక వ్యక్తి జైలులో ఉంటే ఓటు వేయలేరు.కానీ అదే వ్యక్తిరాజ కీయ నాయకుడు కావాలను కుంటే మాత్రం జైలులో ఉన్న ప్పుడు కూడా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.


3-ఒక వ్యక్తి ఎప్పుడైనా జైలుకు వెళ్లినట్లయితే జీవితకాలం ప్రభుత్వ ఉద్యోగం రాదు,కానీ అదే వ్యక్తి హత్య లేదా అత్యాచారానికి పాల్పడినా, ఎన్నిసార్లు జైలు శిక్ష అనుభవించినా, ప్రధాని లేదా రాష్ట్రపతి కూడా కావచ్చు.


4- ఒక వ్యక్తి నిరాడంబర మైన ఉద్యోగం పొందడానికి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.కానీ అదే వ్యక్తి చదువు లేనప్పటికీ భారతదేశ ఆర్థిక లేదా విద్యా మంత్రి కావచ్చు.


5-ఒకవ్యక్తి సైన్యంలో చేరటానికి మైనర్ అయి ఉండాలి10 కిలోమీటర్లు పరిగెత్తి డిగ్రీ చూపించాలి.కానీ అదే వ్యక్తి నిరక్ష రాస్యుడు,పిరికివాడు కుంటివాడు అవుతూ కూడా డిఫెన్స్ మినిస్టర్ కూడా కావచ్చు.


6 ఒక వ్యక్తి వేలాది కేసులలో నిందితుడైన ప్పటికీ న్యాయ లేదా హోం మంత్రి కూడా కావచ్చు.


ఈ వ్యవస్థను మార్చాలని మీరు అనుకోవట్లేదా?

నాయకులు మరియు ప్రజలు ఇద్దరికీ ఒకే చట్టం ఉండవద్దా?

కాబట్టి దయచేసి ఈ సందేశాన్ని ఫార్వార్డ్ చేయడం ద్వారా దేశంలో అవగాహన తీసుకురావ డానికి మీమద్దతు ఇవ్వండి.


మీరు ఫార్వార్డ్ చేయకపోతే ఏ నాయకుడిని నిందించవద్దు.కాక పోతే,మీరు నష్టానికి బాధ్యత వహిస్తారు.


30 నుండి 35 సంవత్సరాల వరకు సంతృప్తికరమైన సేవను అందించిన తర్వాత కూడా ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ అర్హత లేదా? 


కేవలం 5 సంవత్సరాలు కూడా  రాజకీయ పదవిలో లేకుండా పెన్షనా? 


ఎన్ని రాజకీయ పదవులు పోషిస్తే అన్ని పెన్షన్లా??


న్యాయం ఎక్కడ ఉంది ...?


శ్రీ డి. కె. శ్రీవాస్తవ

చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్

బొంబాయి హైకోర్టు.


ముంబై .....

ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లండి తొలగించ వద్దు,ఈ వ్యవస్థను మార్చటం నిజంగా అవసరం కాదా???!

సంకల్పము

 *శుభోదయం*

16.2291923113

Xxxxxx

 సంధ్యా వందన 

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల 

సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.26.02.2024 

సోమ వారం (ఇందు వాసరే) 

 *******

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే

శిశిర ఋతౌ 

మాఘ మాసే కృష్ణ పక్షే

ద్వితీయాయాం (సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

ఇందు వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు

 శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే

శిశిర ఋతౌ 

మాఘ మాసే 

కృష్ణ పక్షే ద్వితీయాయాం

ఇందు వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.6.26

సూ.అ.6.01

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

శిశిర ఋతువు

మాఘ మాసం 

కృష్ణ పక్షం విదియ రా. 9.26 వరకు. 

సోమ వారం. 

నక్షత్రం ఉత్తర రా.2.58 వరకు. 

అమృతం రా.6.59 ల 8.45 వరకు. 

దుర్ముహూర్తం ప. 12.36 ల 1.22 వరకు.

దుర్ముహూర్తం మ. 2.55 ల 3.41 వరకు. 

వర్జ్యం ఉ.8.21 ల 10.07 వరకు. 

యోగం ధృతి మ.2.27 వరకు.  

కరణం తైతుల ఉ.8.23 వరకు.  

కరణం గరజి రా. 9.26 వరకు. 

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం ఉ. 7.30 ల 9.00 వరకు. 

గుళిక కాలం మ.1.30 ల 3.00 వరకు. 

యమగండ కాలం మ.10.30 ల 12.00 వరకు. 

***************

పుణ్యతిధి మాఘ బహుళ విదియ. 

*****************

గమనిక* :౼

మా సంస్థ *శ్రీ పద్మావతీ శ్రీనివాస బ్రాహ్మణ వివాహ సమాచార సంస్థ*(రి.జి.నెం.556/2013) *వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

బ్రాహ్మణ పరిచయ వేదిక *పరిచయం - పరిణయం*

*26/05/2024* (ఆదివారం) రోజు *వనస్థలిపురం హైదరాబాద్* లో ఏర్పటు చేశాము. *రిజిస్ట్రేషన్* మరియు ఇతర వివరాలు కై దిగువ ఇవ్వబడిన ఫోన్ నెం లను సంప్రదించండి

*80195 66579/98487 51577*.

*************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏

.

సోమవారం,ఫిబ్రవరి 26,2024

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


సోమవారం,ఫిబ్రవరి 26,2024

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణం - శిశిర ఋతువు

మాఘ మాసం - బహుళ పక్షం

తిథి:విదియ రా9.22 వరకు

వారం:సోమవారం(ఇందువాసరే) 

నక్షత్రం:ఉత్తర రా2.54 వరకు 

యోగం:ధృతి మ2.25 వరకు

కరణం:తైతుల ఉ8.18 వరకు తదుపరి గరజి రా9.22 వరకు

వర్జ్యం:ఉ8.17 - 10.03

దుర్ముహూర్తము:మ12.36 - 1.22 & మరల మ2.55 - 3.41

అమృతకాలం:సా6.55 - 8.41

రాహుకాలం:ఉ7.30 - 9.00

యమగండ/కేతుకాలం:ఉ10.30- మ12.00 

 సూర్యరాశి : కుంభం

చంద్రరాశి : కన్య 

సూర్యోదయం:6.26

సూర్యాస్తమయం:6.01


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

హైదరాబాద్‌

 *హైదరాబాద్‌ లోని ప్రాంతాలు..వాటికి  ఇప్పుడు మనం పిలుచుకునే పేర్లు ఎలా వచ్చాయి?..ఒక విశ్లేషణ*

బేగం పేట.

6వ నిజాం  మహబూబ్  అలీ కుమార్తె బ‌షీర్ ఉన్నిసా బేగం ను ఉమ్రన్ అమిర్ కు ఇచ్చి పెళ్లి చేశాడు..

కూతురికి క‌ట్నం కింద‌ ఒక స్థలాన్ని  కట్నంగా  ఇచ్చాడు. ఆ స్థలానికి  బషీర్ ఉన్నిసా బేగం  పేరు  మీదగా  బేగంపేట  అని  పేరు వచ్చింది. 

చార్మినార్*

కులికుతుబ్ షా  కట్టిన  ఈ కట్టడానికి  ప్రధాన  ఆకర్షణ నాలుగు స్థంబాలు…. 

ఉర్దూలో చార్ అంటే నాలుగు, మినార్ అంటే స్థంబాలు… వీటి పేరు మీదుగానే చార్ మినార్ అనే పేరు వ‌చ్చింది!

సికింద్రాబాద్*

మూడో  నిజాం  సికిందర్ ఝా  పేరు మీద ఈ ప్రాంతానికి సికింద్రాబాద్  అనే  పేరు  వచ్చింది . అంతకుముందు  సికింద్రాబాద్ ని  లష్కర్  అని  పిలిచే వారు.

ఖైరతాబాద్*

ఇబ్రహీం కుతుబ్ షా తన కుమార్తె ఖైరున్నీసా బేగానికి ఇచ్చిన జాగీరు కాలక్రమేణా ఖైరతాబాద్ గా మారింది

శంషాబాద్*

షమ్స్-ఉల్-ఉమ్రా అనే పేరు మీద శంషాబాద్ అనే పేరు వ‌చ్చింది. ష‌మ్స్ అంటే సూర్యుడు. 

దీని అర్థం ప్ర‌భువుల యందు సూర్యుడిలాంటి వాడని…. 

ఈ బిరుదు నవాబ్ మొయిన్-ఉద్-దౌలా బహదూర్ కు క‌ల‌దు.!

నాంపల్లి*

నిజాం నవాబు దగ్గర పనిచేసిన రజా అలీ ఖాన్ అనే దివాన్‌కు నెఖ్‌ నామ్‌ ఖాన్  అనే బిరుదు ఉండేది. నవాబు ఆయనకు కొంత భూమిని దానంగా ఇచ్చాడు. ఆ ప్రాంతాన్ని మొదట్లో నెఖ్- నామ్- పల్లిగా పిలిచేవారు. ఇప్పుడది నాంపల్లిగా మారిపోయింది.


హిమయత్ నగర్*

1933 లో  ఏడవ నిజాం  ఉస్మాన్  అలీఖాన్  యొక్క పెద్ద కుమారుడు   హిమాయత్  అలీ ఖాన్  ఆస‌ఫ్ జా పేరు  మీద  ఆ స్థలానికి  హిమాయత్ నగర్  అని  పేరు వచ్చింది.


అబిడ్స్*

ఆరో నిజాం కాలంలో అల్‌బర్ట్ అబిద్ అనే ఒక ఆర్మేనియా  యూదువ్యాపారి  ప్యాలెస్ టాకీస్ దగ్గర ఓ షాప్ పెట్టుకున్నాడు. దానికి అబిద్ అండ్ కంపెనీ అనే పేరు పెట్టాడు. తర్వాత  కొంతకాలానికి  ఆల్బర్డ్ అబిడ్  ఇంగ్లాండ్ కి వెళ్లిపోయిన‌ప్ప‌టికీ ఆ స్థలానికి ఆ పేరే స్థిర‌ప‌డిపోయింది!కాలక్రమంలో ఆ ప్రాంతం కాస్తా అబిడ్స్ గా మారిపోయింది.


సోమాజిగూడ*

నిజాం కాలంలోని రెవెన్యూ  డిపార్ట్మెంట్  అధికారైన సోనాజీకి  కొన్ని  భూములుండేవి .  

సోనాజీ కాస్త సోమాజి  అయింది.  గూడ  అంటే  చిన్న  గూడెం  లేదా ప్రాంతం  అని  అర్ధం. రెండు క‌లిపి సోమాజిగూడ అయ్యింది!


మాసబ్ ట్యాంక్*

6వ కుతుబ్ షాహ్  భార్య  హ‌యత్  భ‌క్షిభేగంను  మాసాహెబా  అని  పిలిచేవారు.  మాసాహెబా పల్లె భూములకు  సాగునీరు  ఇవ్వడానికి  ఒక ట్యాంక్  నిర్మించింది .  

ఆ ట్యాంక్  పేరు  మాసాహెబా తలాబ్  అని  పిలిచేవారు . చివరకు  ఆ పేరు మాసబ్ ట్యాంక్  అయింది .


హైదరాబాద్*

కులీకుతుబ్ షా భార్య  భాగమతి  వివాహం  తర్వాత తన  పేరుని  హైదర్ మహల్ గా  మార్చుకున్నారు. హైదర్ మహల్  అంటే  హైద్రా నగరం  అని  అర్ధం తర్వాత  ఆ పేరు  మీద  హైదరాబాద్ గా  మారింది .


మలక్ పేట్*

గోల్కొండ  రాజు అబ్దుల్  కుతుబ్ షా  యొక్క  సేవకుడు మాలిక్ యాకుబ్  పేరు  మీదగా  ఈ ప్రదేశానికి  మలక్ పేట్  అనే  పేరు  వచ్చింది.


బషీర్ బాగ్*

బసిరుద్దౌలాకు   హైద్రాబాద్ లో   ఒక ప్యాలెస్  ఉండేది .  

ఆ ప్యాలెస్  దగ్గర  పెద్ద గార్డెన్  ఉండేది . బసిరుద్దౌలా  పేరు  మీద  ఆ ప్రదేశానికి  బషీర్ బాగ్  అనే  పేరు  వచ్చింది.  బాగ్ అంటే  గార్డెన్  అని  అర్ధం .


ఫలక్ నుమా:*

ఫలక్  అంటే  ఆకాశం ,  నామ  అంటే  అద్దం .  ఈ ప్రదేశం  అంతా  కొండలతో  ఎంతో  ఎత్తుగా  ఉండేది . కాబట్టి  ఆకాశానికి  అద్దం  అనే అర్థం  వచ్చేలా  ఫలక్ నామ అని  పేరు  పెట్టారు . ఫలక్ నామ కాస్త ఫలక్ నుమా అయ్యింది!


సరూర్ నగర్*

రెండో నిజాం అలీ ఖాన్ హయాంలో ప్రధాని పనిచేసిన నవాబ్ అరస్తు ఝా బహదూర్ భార్య సరూర్ అఫ్జా బాయికి చార్మినార్‌కు 4 మైళ్ల దూరంలో రాజు కొంత స్థలాన్ని రాసిచ్చాడు. ప్రస్తుతం సరూర్ నగర్ అని పిలిచే ఆ ఏరియా సరూర్ అఫ్జాబాయి పేరుమీదనే స్థిరపడింది.


లంగర్ హౌజ్:*

గోల్కొండ నవాబుల కాలంలో సైనికుల భోజనం కోసం ఏర్పాటు చేసిన లంగర్ ఖానా కాలక్రమేణా లంగర్‌ హౌజ్‌ మారింది. 

గోల్కొండ నుంచి సైనికులు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి వెళ్లేవారు.


చెంచల్‌ గూడ:*

 చిచ్‌లం అనే బంజారా తెగ ఉండే ఏరియా కాలక్రమంలో చెంచల్‌ గూడగా మారింది. ఇక్కడే భాగమతి కూడా నివాసం ఉండేదని చరిత్రకారులు చెప్తుంటారు.


కార్వాన్:*

ఒకప్పుడు సాహుకారి కార్వా అని పిలిచే ప్రాంతాన్ని నేడు కార్వాన్ అని పిలుస్తున్నారు. కోహినూర్ వజ్రాన్ని సానపట్టింది ఇక్కడే అని చెప్పుకుంటారు. వజ్రాలు, ముత్యాల వ్యాపారస్థుల సమూహంగా చరిత్రలో ఒక వెలుగు వెలిగిన ప్రాంతం కార్వాన్.


కవాడిగూడ:*

ట్యాంక్ బండ్ నిర్మాణానికి కావడిలో రాళ్లు మోసిన కూలీలు అక్కడే గుడిసెలు వేసుకుని నివసించేవారు. అప్పట్లో ఆ ప్రాంతాన్ని కావడీల గూడెం అని పిలిచేవారు.. క్రమంగా ఆ ఏరియా కవాడిగూడగా మారింది.


దోమలగూడ:*

 దోమలగూడ అసలు పేరు దో మల్ గూడ! పూర్వం ఇద్దరు మల్ల యోధులు అక్కడ ఉండేవారు. వారిపేరుమీదనే ఆ ఏరియాను దో మల్ గూడ అని పిలిచేవారు. కాలక్రమంలో అది దోమలగూడగా మారింది.


బేగం బజారు:*

 హైదరాబాద్ వ్యాపారులపై దయతో నిజాం సతీమణి హందాబేగం ఓ ప్రాంతాన్ని రాసిచ్చేసింది. అది కాలక్రమంలో బేగం బజారుగా నిలిచిపోయింది.


అఫ్జల్ గంజ్:*

 ఐదో నిజాం అఫ్జల్ ఉద్ధౌలా ధాన్యం గింజల వ్యాపారులకు బహుమతిగా ఇచ్చిన భూమి కాలక్రమేణా అఫ్జల్ గంజ్ గా మారింది

హైదర్ గూడ:*

మొదటి తాలుఖ్ దార్( జిల్లా కలెక్టర్) హైదర్ అలీ పేరుతో హైదర్ గూడ ఏర్పడింది.


తార్నాక:*

తార్నాక అసలు పేరు తార్ నాకా! తార్ అంటే ముళ్లకంచె.. 

నాకా అంటే పోలీస్ ఔట్ పోస్టు. నిజాం ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారికి ఉస్మానియా యూనివర్శిటీ దగ్గరలో తోట ఉండేది. దాని చుట్టూ ముళ్లకంచె, ముందొక పోలీస్ ఔట్ పోస్టు ఉండేది. అందుకే ఆ ఏరియాను తార్ నాకా అని పిలిచేవారు. కాలక్రమంలో అది తార్నాకగా మారింది.

శాలిబండ:*

 శాలిబండ అసలు పేరు షా-అలీ-బండ. అప్పట్లో షా అలీ అనే ఒక సూఫీ యోగి పెద్ద బండ నివసించేవాడు. 

ఆయన పేరు మీదనే ఆ ఏరియాను షా అలీ బండ అని పిలిచేవారు.. కాలక్రమంలో అది శాలిబండగా మారింది


హబ్సిగూడ:* 

నిజాం అశ్వికదళంలో అస్బీనియన్స్ అనే నీగ్రోజాతి ప్రత్యేకంగా ఉండేది. వాళ్లంతా తార్నాక దాటిన తర్వాత డేరాలు వేసుకుని ఉండేవాళ్లు. అస్బీనియన్స్ ఉండేవాళ్లు కాబట్టి ఆ ఏరియాను పిలుస్తున్నారు.


మదీనా:*

ధర్మదాత ఖాన్ బహద్దూర్ అల్లావుద్దీన్ 1900 సంవత్సరంలో నిర్మించిన మూడంతస్తుల భవనంవల్ల ఈ ప్రాంతానికి మదీనా అనే పేరు వచ్చింది.


చిక్కడపల్లి:*

చిక్కడపల్లి అసలు పేరు చిక్కడ్-పల్లి. చిక్కడ్ అంటే మారాఠీలో బురద. ట్యాంక్ బండ్పరీవాహక ప్రాంతం కావడంతో ఆ ఏరియాలో అప్పట్లో మోకాల్లోతు బురద ఉండేది! బురద ఉన్న ప్రదేశం కాబట్టి చిక్కడ్పల్లి అని పిలిచేవారు. కాలక్రమంలో చిక్కడపల్లిగా మారిపోయింది.


నౌబత్ పహాడ్:*

నిజాం కాలంలో నౌబత్ పహాడ్‌పై నగారాలు మోగించి ప్రజలకు ఫర్మానా చదివి వినిపించేవారు. నౌబత్ అంటే డోలు. పహాడ్ అంటే గుట్ట. నగారాలు మోగించి ఫర్మానాలు చదివి వినిపించే గుట్ట కాబట్టి దానికి నౌబత్ పహాడ్ అని పేరొచ్చింది.


బాగ్‌లింగంపల్లి:*

గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా ఖుతుబ్షా మార్నింగ్ వాక్ చేయడానికి టాంక్ బండ్ పరీవాహక ప్రాంతంలో  పెద్ద ఉద్యానవనాన్ని నిర్మించారు. బాగ్ ఉండటం వల్ల ఆ ఏరియాను బాగ్‌లింగంపల్లి అంటున్నారు.


అడిక్‌మెట్:* 

అడిక్‌మెట్ అసలు పేరు అధికమెట్టు. ఎత్తైన ప్రాంతం కాబట్టి అధిక మెట్టు అని పిలిచేవారు. కాలక్రమంలో అడిక్ మెట్ గా మారిపోయింది.

                             Continue…ఇంకా వుంది …

పురాతన భాష

 పురాతన భాష ఏది?


నేను పరమాచార్య స్వామివారి దర్శనానికి మొదటిసారి శ్రీమఠానికి వెళ్ళినప్పుడు అక్కడ నలుగురు విదేశీయులు ఉన్నారు. ఒక ఇజ్రాయిలి, ఒక ఇటలీయుడు, ఒక జర్మనీయుడు, ఒక ఆంగ్లేయుడు. వారు ‘పాశ్చాత్య మరియు తూర్పు ఆసియాలో అత్యంత ప్రాచీన భాషలు’ అనే అంశంపై పి.హెచ్.డి చేయడానికి వచ్చారు. పాశ్చాత్య విభాగంలో లాటిన్, హీబ్రూ మరియు గ్రీకు భాషలు; తూర్పు ఆసియా విభాగంలో సంస్కృతము మరియు తమిళము అధ్యయనం చేస్తున్నారు. 


మహాస్వామి వారు అనుష్టానం కొరకు లోపలికి వెళ్ళారు. వారు స్వామివారి ఫోటో తీయాలనుకున్నారు కాని సహాయకులు ఒప్పుకోలేదు. వారు ఉదయం నుండి ఒక చెట్టు నీడన నిలుచున్నారు. స్వామివారి పూజ ఎంతసేపటికి అవుతుంది అని సేవకులను అడిగారు కాని వారికి సరైన సమాధానం దొరకలేదు. 


మహాస్వామి వారు పది నిముషాలలో బయటకు వచ్చారు. మేమందరమూ వెళ్ళి సాష్టాంగం చేసాము. మెడలో కెమరా తగిలించుకున్న వ్యక్తివైపు చూసి మహాస్వామి వారు ఫోటోలు తీసుకోండి అన్నట్టు సైగ చేసారు. మూడు చిత్రాలకు అనుమతి ఇచ్చి నాల్గవ చిత్రం తీస్తుండగా ఆపమన్నారు. వారి రాకకు కారణం అడిగారు. 

వారు వచ్చిన ఉద్దేశమును వివరించారు. 


మహాస్వామి వారు వారితో, ”ఏది అత్యంత ప్రాచీన భాష అని మీరు ఒక నిర్ణయానికి వచ్చారా?” అని అడిగారు. 


”పాశ్చాత్య భాషలలో హీబ్రూ చాలా ప్రాచీనమైనది. కాని తూర్పు ఆసియాలో సంస్కృతము తమిళము రెండు ప్రాచీనమైనవి అని అందరూ అంటున్నారు. మాకు అనుమానం వచ్చి మీ వద్దకు వచ్చాము” అని ఇజ్రాయిలీ చెప్పాడు.


అందుకు మహాస్వామి వారు “వీటన్నిటికంటే ప్రాచీనమైన భాష ఒకటి ఉంది. అది వైదిక భాష. సంస్కృతము హీబ్రూ కూడా దాని నుండే వచ్చాయి” అని అన్నారు. ”హీబ్రూ లో పునర్జన్మ గురించి ఒక శ్లోకం ఉంది. దాన్ని మొత్తం చెప్పగలవా?” అని ఇజ్రాయలీని అడిగి మొదటి రెండు పదాలు ఎత్తిచ్చారు.


అతను మూడు నాలుగు నిముషాలపాటు దాన్ని చెప్పాడు. స్వామి వారు చుట్టూ చూసి, అక్కడున్న పిల్లలతో “మీరు ఋగ్వేదం చదువుకున్నారా? ఈ శ్లోకాన్ని చెప్పగలరా?” అని అడిగారు. 


ఆ పిల్లలు ఐదు నిముషాలపాటు ఉచ్చరించారు. స్వామి వారు నాతో “ఈ పిల్లలు చెప్పినది వారికి అర్థమైందేమో అడుగు?” అన్నారు. 


నలుగురు ఏమి మాట్లాడలేదు. స్వామి వారు ఆ పిల్లలవైపు తిరిగి “ఇతను హీబ్రూ లో చెప్పినది మీకు ఖచ్చితంగా అర్థమై ఉండదు” అని అన్నారు. 


మరలా నావైపు తిరిగి, “ఆ ఇజ్రాయిలీతో చెప్పు అతను చెప్పినది ఈ పిల్లలు చెప్పినది రెండూ ఒక్కటేనని” అని అన్నారు. నేను అతనితో, “నువ్వు చెప్పిన శ్లోకం ఆ పిల్లలు చెప్పిన శ్లోకం రెండూ ‘ఉచ్చారణలలో’ ఒక్కటే అని స్వామివారు చెప్తున్నారు” అని చెప్పాను. 


”ఏమిటి? కేవలం ‘ఉచ్చారణలలో’ మాత్రమే కాదు ‘అక్షరాలలో’ కూడా రెండూ ఒక్కటే” అని నా మాటలను సరిచేసారు. 


ఈ విషయాన్ని నిరూపిస్తానని ఒక కలం కాగితం ఇమ్మనారు. “వేదాలలో భూగోళం 32 భాగాలుగా విభజించబడింది అని చెప్పబడింది. ఈ 32 భాగాలలోని ప్రతి భాగంలో వేదాక్షరాలు ఎలా మార్పు చెందాయి ఎలా ఉచ్చరింపబడతాయి అని కూడా చెప్పబడింది”. వచ్చిన ఆ నలుగురిని వారి ఏ ప్రాంతం వారో కనుక్కుని ప్రతి వేదాక్షరం వారి ప్రాంతాలలో ఎలా మార్పు చెందింది అనే విషయం చెప్పారు. ఆ పిల్లల్ని ఋగ్వేదం నుండి మళ్ళా ఒక శ్లోకం చెప్పమని ఆ శ్లోకంలోని ప్రతి అక్షారం వారి వారి ప్రాంతలో ఎలా పలుకుతారో చెప్పారు. 


ఆ పిల్లల వైపు తిరిగి “ఈ శ్లోకాన్ని నేను కొద్దిగా వేరే ఉచ్చారణలో హీబ్రూ భాషలో వీటిని ఎలా పలుకుతారో అలా చెప్తాను. అది తప్పు అనుకోకండి. వేదాలలో ఇది ఇలా కూడా ఉచ్ఛరించవచ్చు అన్న ఆదేశము ఉన్నది” అని అన్నారు. 


పరమాచార్య స్వామివారు మెల్లిగా మొదలుపెట్టారు. అద్భుతం ఆ ఇజ్రాయిలీ కూడా స్వామివారితో చెప్పడం ప్రారంభించాడు. 


మేమందరమూ నిర్ఘాంతపోయాము. “నేను అప్పుడే చెప్పాను. ఋగ్వేదములో ఉన్న శ్లోకమే హీబ్రూ లో కూడా ఉన్నదని. కాని అక్షరాలు కొద్దిగా మార్పుతో ఉంటాయి. (దక్షిణాన ‘యమున’ అంటే ఉత్తరాన ‘జమున’ అంటారు. దక్షిణాన ‘వ’ పశ్చిమ బెగాల్ లో ‘బ’. తమిళంలో ‘ప’ కన్నడంలో ‘హ’ అలా . . .) కాబట్టి ప్రపంచంలో అతి ప్రాచీనమైన భాష ‘వైదిక భాష’”


మహాస్వామి వారు ఆ నలుగురిని ఋగ్వేద అక్షరములు వారి వారి భాషలలో ఎలా ఉచ్చరింపబడతాయో ఒక పట్టిక వెయ్యమన్నారు. పదిహేను నిముషాలలో అంతా రాసారు. దాన్ని చూసి ఇజ్రాయిలీ ఆశ్చర్యముతో ఇది అసలు ఊహింపశక్యము కానిది అని అన్నాడు. 


స్వామి వారు అతనితో “ఏమిటి అన్ని భాషలూ వేద భాషనుండే పుట్టాయని ఇప్పుడు ఒప్పుకుంటావా?” అని అడిగారు. కాని అతని మొహంలో అతను ఒప్పుకున్నట్టు కనబడడంలేదు. ”హీబ్రూ నుండే వేదాలు పుట్టి ఉండోచ్చు. అని అతని సందేహము కదా?” అని అడిగారు. అందుకు అతను అవును “హీబ్రూ నుండే వేదాలు పుట్టి ఉండొచ్చు కదా?” అన్నాడు. 


స్వామి వారు నవ్వుతూ, “మీవద్ద తాళం మాత్రమే ఉంది. మా వద్ద తాళంచెవి కూడా ఉంది. వేదాలలో ఏ మహర్షి భారతదేశం నుండి వెళ్ళి ఇజ్రాయల్ లో వేదాన్ని వ్యాప్తి చేసారో అనే విషయం కూడా ఉంది” అని చెప్పారు. 


అతను చివరికి ఒప్పుకున్నాడు. 


--- తిరువణ్ణామలై గౌరీశంకర్ గారి తమిళ ఇంటర్వ్యూ వీడియో నుండి


#KanchiParamacharyaVaibhavam #

థర్మప్రబోధమెంతేని

 *సుభాషితం*



*కేచిదజ్ఞానతోనష్టాః*

*కేచిన్నష్టాః ప్రమాదతః*

*కేచిత్‌ జ్ఞానావలేశేన*

*కేచిన్నష్టాఃవినాశితాః*


'కేచిదజ్ఞానతోనష్టాః' తెలియక చెడువారు కొందరు, 'కేచి నష్టాః ప్రమాదతః' తెలిసియుండియు ప్రమాదవశమున చెడువారు మరికొందరు 'కేచిత్‌. జ్ఞానావలేపేన' కొందరు, తెలిసి తెలియని. అల్పమైన జ్ఞానముచే చెడుచుందురు. కేచిన్నష్టాః వినాశితాః' వేరొకకొందరు, చెడినవారిచే, చెఱుపబడుచుందురు. ఈ రీతిని అజ్ఞానముచే, ప్రమాదముచే అల్పజ్ఞానముచే, చెడినవారిని చూచి చెడిపోవడము వంటి, దోష చతుష్టయము చెడిపోవుటయే విధిగ యేర్పడుచున్న యీ తరుణమున జ్ఞానులైన పెద్దలెల్లరు, మన సనాతన థర్మప్రబోధమెంతేని చేయదగు తరుణ మాసన్నమైయున్నది.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - మాఘ మాసం - కృష్ణ పక్షం  -‌ ద్వితీయ - ఉత్తరాఫల్గుణి -‌ ఇందు వాసరే* (26.02.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.






.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

అంకమ్మ భక్తి..

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*అంకమ్మ భక్తి..*


"అమ్మా..వయసురీత్యా పెద్దదానివి..ఇంటిపట్టున కూర్చొని కృష్ణా..రామా..అనుకోరాదూ..వారం మార్చి వారం బస్సెక్కి ఇంతదూరం రాకపోతే.." అని మా సిబ్బంది ఆమెతో హాస్యానికి అంటూ వుంటారు.."నాకేం ఇబ్బందీ లేదు..అన్నింటికీ ఆ దత్తాత్రేయుడే వున్నాడు..నాకే భయమూ లేదు..అన్నీ ఆ స్వామే చూసుకుంటాడు.." అని నిర్మలంగా నవ్వుతూ కందుకూరు నుంచి క్రమం తప్పకుండా శ్రీ స్వామివారి మందిరానికి వచ్చే అంకమ్మ గారు తరచూ చెప్పే మాట ఇది..ఆమె విషయం లో అది నిజం కూడా..


శ్రీ స్వామివారు సిద్ధిపొందినది 1976 వ సంవత్సరం మే నెల 6వ తేదీ నాడు..ఆ తరువాత రెండు సంవత్సరాలకు అంకమ్మ గారు మొదటిసారి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి వద్దకు వచ్చారు.."నాకు ముప్పై ఏళ్ల వయసప్పుడు జబ్బు చేసింది..అప్పట్లో ఇంత వైద్య సౌకర్యాలు లేవు..అప్పటికీ మా వాళ్ళు డాక్టర్ల కు చూపించారు కానీ పెద్దగా ప్రయోజనం కనబడలేదు..చుట్టుప్రక్కల వాళ్ళు ఈ స్వామి దగ్గరకు తీసుకెళ్లండి..ఏదైనా గాలి చేష్ట వున్నా బైట పడుతుంది..ఆరోగ్యం బాగు పడుతుందని చెపితే..ఇక్కడికి తీసుకొచ్చారయ్యా..మూడు వారాల్లోనే నేను మామూలు మనిషినయ్యాను..నువ్వు అప్పుడు ఇక్కడ లేవు..మీ నాన్నా..అమ్మా..నన్ను కన్నా బిడ్డలా చూసుకున్నారు..ఈ దత్తాత్రేయుడి దయ లేకుంటే..అప్పుడే నేను పోయేదాన్ని.." అని మొగలిచెర్ల శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చిన ప్రతిసారీ నాకు చెపుతూ వుంటారు..


ఆనాటి నుంచీ నేటి దాకా అంకమ్మగారు ఏ కష్టమొచ్చినా..సుఖం కలిగినా..నేరుగా శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి..ఆ స్వామివారి సమాధి ముందు నిలబడి విన్నవించుకొంటారు..తన బిడ్డల వివాహాలు ఇక్కడే చేశారు..ఆ తరువాతి తరం వాళ్ల వివాహాలు కూడా ఇక్కడే చేశారు..అంకమ్మ గారితో పాటు ఆమె సంతానమూ.. వారి సంతానం కూడా శ్రీ స్వామివారికి అత్యంత భక్తులు..ఇప్పుడంటే వార్ధక్యం కారణంగా అంకమ్మ గారు కేవలం శ్రీ స్వామివారి సమాధి దర్శనానికి పరిమితం అయ్యారు గానీ..అంతకుముందు ఆవిడ వచ్చినప్పుడల్లా ఏదో ఒక సేవ చేస్తూనే ఉండేది..


పిల్లల కు చెప్పుకొని.. శ్రీ స్వామివారి మందిరం వద్ద..వచ్చి పోయే భక్తుల సౌకర్యం కోసం.. ఒక గది కూడా కట్టించారు..ప్రస్తుతం అంకమ్మ గారి వయసు సుమారు ఎనభై సంవత్సరాలు.. ఇప్పటికీ తన శక్తి కూడగట్టుకొని వారం మార్చి వారం (ఆదివారాల్లో) శ్రీ స్వామివారి దర్శనార్థం వస్తూనే వుంటారు..ఏనాడూ ఉత్త చేతులతో మందిరానికి రాదు..పళ్ళూ..కూరగాయలూ..బియ్యమో..ఏదో ఒకటి తీసుకొని వస్తారు..అంకమ్మ గారు శ్రీ స్వామివారిని దర్శించుకునే పద్దతి చిత్రంగా ఉంటుంది..ఆవిడ మందిరం లో గడిపే నాలుగైదు గంటల సమయంలో..కనీసం తొమ్మిది పది సార్లు శ్రీ స్వామివారి సమాధిని దర్శించి వస్తుంటారు.."అయ్యా..అక్కడ ఖాళీగా ఉంది..భక్తులెవరూ లేరు..ఒక్కసారి స్వామి దాకా వెళ్ళొస్తా నాయనా.." అని ప్రాధేయపూర్వకంగా అడుగుతారు..మేమూ కాదని చెప్పము.. ఎందుకంటే..ఒక్కొక్కసారి భక్తుల తాకిడి ఎక్కువగా వున్నప్పుడు..ఆవిడే గమనించుకుని ఒక ప్రక్కగా నిలబడి వుంటారు తప్ప..వాళ్ళ మధ్యలో దూరి వెళ్ళరు..తన పరిమితులు దాటి వేరే విధంగా ప్రవర్తించే అలవాటు లేని మనిషి అంకమ్మ గారు..


"మనకు కష్టమొచ్చినప్పుడే స్వామి దగ్గరకు వచ్చి..మనకు సుఖం కలిగితే అది మన గొప్ప అనుకోకూడదయ్యా.. ఏ కాలానికి ఏది మనకు ప్రాప్తమో దానిని అనుభవించాలి..ఇప్పటి వరకూ అన్ని విషయాల్లో ఆ దత్తాత్రేయుడు మమ్మల్ని చల్లగానే చూసాడు..కష్టాలు లేకుండా ఎవ్వరి జీవితమూ ఉండదు..చిన్నదో పెద్దదో కష్టం వచ్చి తీరుతుంది..స్వామిని నమ్ముకుంటే..ఆ కష్టం యొక్క తీవ్రత తగ్గిస్తాడు..నువ్వు చూపే విశ్వాసం..భక్తీ..ఆ రెండే ఆ స్వామి చూసేది..నీ దగ్గరున్న ధన రాశులు ఆయన చూడడు..ఆ స్వామి దయ లేకుండా ఒక్క అడుగు కూడా వేయలేను నేను..ఇట్లా తిరుగుతూ వున్నపుడే నాకు మరణం ప్రసాదించే వరమివ్వు నాయనా..అని కోరుకుంటానయ్యా నేను.." అంటూ ఎల్లప్పుడూ చెప్పుకుంటూ వుంటారు అంకమ్మ గారు..ఆవిడ మాటల్లో అంతర్లీనంగా వేదాంత ఛాయలు ఉంటాయి..శ్రీ స్వామివారి గురించి చెప్పేటప్పుడు అంకమ్మ గారు ఏదో తెలియని ఆనందంతో పొంగిపోతూ వుంటారు..ఆవిడ కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి..


అంకమ్మ గారు నిష్కల్మష భక్తి కి ప్రతిరూపంగా వుంటారు..ఆవిడ గారు చెప్పినట్టు భక్తీ విశ్వాసాలే ఆ భగవంతుడు చూస్తాడు..


సర్వం..

దత్తకృప.!!


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్:523114...సెల్..94402 66380 & 99089 73699).

ఉసిరికాయ ఎందుకు

 ఆదివారం & రాత్రిపూట ఉసిరికాయ ఎందుకు తినవద్దంటారో తెలుసా..!!!


పూర్వం ఇళ్ళలో అందరూ కలిసి భోజనం చేసే సమయంలో భోజనంలోకి ఉసిరియాక పచ్చడి అడిగితే ఆదివారం తినకూడదు అనేవారు.... 

ఎందుకు తినకూడదు అంటే అది అంతే అనే వారు......

ఉసిరికాయ పేరు కూడా మాట్లాడనిచ్చే వారు కాదు.....

వారికి కూడా వివరం తెలియక పోయిన సరే తమ తల్లి తండ్రుల నుంచీ వస్తున్న నియమాలని పాటించేవారు..... 

కానీ ప్రస్తుతం కొందమంది మాత్రమే ఈ నియమాన్ని పాటిస్తున్నారు.... 

అయితే ఆదివారం ఎందుకు ఉసిరి తినకూడదో అనే సందేహం మాత్రం చాలామంది మెదడుని తొలిచే ప్రశ్న..... 

అందుకే ఆ నియమం లో దాగివున్న అర్ధాన్ని మీ ముందు ఉంచుతున్నాం...... 

ఆదివారం రోజు, రాత్రి సమయంలో ఉసిరి ఎందుకు తాకకూడదు అంటే..... ఉసిరికాయలో పుష్కలంగా సి విటమిన్ ఉంటుంది...... 

ఇది ప్రేగులలో ఉండే ఆమ్లాన్ని పెంచుతుంది.... దాంతో రాత్రి సమయంలో తిన్న అన్నం సరిగా జీర్ణం కాదు.....

అజీర్తి చేయడం వలన గుండె మంటగా ఉండటం జరుగుతుంది.... అంతేకాదు ఉసిరి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.....అందులో ఉండే శక్తి రాత్రి పూట మనల్ని నిద్రపోకుండా చేస్తుంది.....


అంతేకాదు రక్త ప్రసరణ వేగంగా ఉండటంతో రాత్రి సమయంలో నిద్ర కూడా సరిగా పట్టక ఇబ్బందులు పడతాము అందుకే రాత్రి సమయంలో ఉసిరిని తినకూడదు అంటారు.....

ఉసిరి కాయకి ప్రత్యేకమైన గుణం ఏమిటంటే ఇందులో సూర్య శక్తి దాగి ఉంటుంది..... 

సూర్యుడు రోజైన ఆదివారం నాడు ఉసిరికి మరింత బలం చేకూరుతుంది..... 

అందుకే ఆదివారం నాడు ఉసిరిని కూడా దూరం పెడుతారు....

(ఏకాదశి ఉపవాసం ఉండి మరుసటి రోజు అదే ఫలాన్ని తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.....) 

ఇది సైన్స్ తో కూడిన దివ్య రహస్యం.

ఇక శాస్త్ర ప్రమాణం కూడా చూడండి


శ్లో. భానువారేదివారాత్రం సప్తమ్యాంచతథాదివా , ధాత్రీఫలంనరస్స్యా ద్యహ్యలక్ష్మీకోభవేత్సదా. వీర్యహానిర్యశోహానిః ప్రజ్ఞాహానిస్తథైవచ. భవేద్యస్మాత్తతోరాత్రౌ ధాత్రీంయత్నేనవర్జయేత్.


ఆదివారంనాడు రాత్రింబగళ్ళు సప్తమినాడుపగటిపూట ఉసిరికపచ్చడి ని తిన్నచో అలక్ష్మీకుడగును,, కనుక నిషేధము.


పైశ్లోకం ప్రకారం

వీర్యహాని

యశోహాని

ప్రజ్ఞాహాని కూడా పొందుతారు నిషిద్ధ దినాలలో ఉసిరిక తింటే..