22, సెప్టెంబర్ 2023, శుక్రవారం

లలితా సప్తమి*



              *లలితా సప్తమి* 

లలితా సప్తమి అంటే ఏమిటి....?

లలితా సప్తమి శ్రీ లలితా దేవిని భక్తితో జరుపుకునే పండుగ.


శ్రీ రాధా రాణి సన్నిహితురాలు 

శ్రీ లలితా దేవి జన్మదినం కావడంతో ఈ రోజు దాదాపు ప్రతి ఒక్కరూ భక్తితో పూజిస్తారు. 

ఆమె శ్రీకృష్ణ మరియు శ్రీ రాధ రాణికి అత్యంత సన్నిహితులలో ఒకరు మరియు మిగతా వారందరిలో అత్యంత గొప్ప భక్తీ సేవభావం ఉన్న గోపిగా అంటారు


లలిత సప్తమి రాధా అష్టమి సందర్భానికి సరిగ్గా ఒక రోజు ముందు మరియు జన్మాష్టమి పండుగ 14 రోజుల తరువాత జరుగుతుంది .


*లలితా సప్తమిని మనం ఎందుకు జరుపుకుంటాము???*


లలితా సప్తమి లలితా దేవి కనిపించిన రోజు  భాద్రపద మాసం  శుక్ల పక్షంలో, లలిత సప్తమి రోజు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది,


ఈ రోజున లలితా దేవిని ఆరాధించడం చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. 

ఆమె తన ప్రియమైన కృష్ణ మరియు రాధారాణి పట్ల అపారమైన ప్రేమ మరియు పరమ మక్కువ కలిగి ఉండేది.

మిగతా అష్టసఖిలందరూ లలితా దేవి మార్గదర్శకత్వంలో మాత్రమే పనిచేసేవారు. 

కృష్ణ , రాధల సేవకు వారు తమ సంరక్షకురాలిగా లలితా దేవికి ఎంతో భక్తి , గౌరవం ఇచ్చేవారు. 

ఆమె కరేహ్లా గ్రామంలో జన్మించింది మరియు ఆమె తండ్రి లలితా దేవిని ఉక్కగావ్‌కు తీసుకువచ్చారు, లలితాదేవి యొక్క తామర పాదాల ముద్రలతో పాటు కృష్ణుడిని పోషించడానికి ఆమె ఉపయోగించిన పాత్రలను కలిగి ఉన్న ఒక రాతి ఉంది.


 సూర్యకాంతి సమక్షంలో , ముద్రలు కొన్ని సార్లు మెరుస్తాయి మరియు ప్రకాశిస్తాయి.


అష్టసఖిలలో , అంటే ఎనిమిది వరిష్ఠ గోపికలలో , లలితా దేవి అగ్రగామి. 

ఇతర అష్టసఖిలలో విశాఖ , తుంగవిద్య , చిత్రాలేఖ , ఇందూలేఖ , చంపకలత , సుదేవి మరియు రంగదేవి ఉన్నారు. 

అష్టసఖిలందరూ తమ ప్రియమైన శ్రీకృష్ణుడు మరియు రాధారాణి పట్ల ఆధ్యాత్మిక ప్రేమను సూచిస్తారు. 


రాధా - కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమను ఎవ్వరూ మించలేరు  సమానం చేయలేరని నమ్మకం.


లలితా దేవి రాధారాణి కంటే 14 సంవత్సరాలు , 8 నెలలు మరియు 27 రోజులు పెద్దది మరియు మిగతా గోపీల కంటే పురాతనమైనది. 

లలిత దేవి రాధారాణి యొక్క నమ్మకమైన మరియు స్థిరమైన స్నేహితురాలిగా ప్రసిద్ది చెందింది.


*లలిత సప్తమి వేడుకలు మరియు ఆచారాలు!!*

బృందావనం  శ్రీకృష్ణ భగవానుడు మరియు రాధారాణి విశాఖ మరియు లలిత అనే ఇద్దరు సఖి   ఇక్కడ దేవాలయాలు ఉన్నాయి. 

లలితను అత్యంత నమ్మకమైన తోడుగా మరియు రాధారాణి యొక్క అతిపెద్ద అనుచరిగా భావిస్తారు...

మరియు ఎల్లప్పుడూ రాధా వైపు మాత్రమే తీసుకుంటారు.

 ఆమె ఏకైక కోరిక కృష్ణ , రాధలకు సేవ చేయడమే.

 బృందావనంలో ఉన్న ప్రసిద్ధ ధర్మబద్ధమైన లలిత కుండ్ భక్తులకు విముక్తి కల్పించడంలో ప్రసిద్ధి చెందింది.


రాధా మరియు కృష్ణుల పట్ల లలితా దేవి ప్రేమ మరియు భక్తిని సూచించే అత్యంత అదృష్ట మరియు శుభ వ్యక్తీకరణగా ఇది సూచించబడుతుంది , ఇది అంకితభావం మరియు భక్తి మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులను తొలగిస్తుంది.

 లలితా సప్తమిపై శ్రీకృష్ణుడు , రాధారాణి లలితదేవిని ఆరాధించడం చాలా పవిత్రమైనది.

కొంతమంది భక్తులు లలిత సప్తమి ఉపవాసాన్ని కూడా పాటిస్తారు , ఇది నమ్మకం ప్రకారం , శ్రీకృష్ణుడిచే సూచించబడింది.

ఈ వ్రతాన్ని వివాహిత జంటలు తమ పిల్లల దీర్ఘాయువు మరియు ఆరోగ్యం కోసం ఎక్కువగా చేస్తారు.

శర్మ స్ బ్రాహ్మణ భోజనం& క్యాటరింగ్

 ఆల్ ఓవర్ ఇండియా

శర్మ స్ బ్రాహ్మణ భోజనం& క్యాటరింగ్


మీ ఇంట జరిగే శుభకార్యాలకి అన్ని కార్యక్రమాలకి వేద పండితులకి,మడితో రుచిగా శుభ్రంగా (ఉల్లి పాయ వెల్లుల్లిపాయ లేకుండా)  మీరు కోరుకున్న విధంగా బ్రాహ్మణ క్యాటరింగ్ చేయబడును దూరప్రాంతాలకు ప్రయాణం చేసే ప్రయాణికులకు,శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప స్వాములకు, భవానీలకు, వేద పండితులకు కూడా భోజనం టిఫిన్స్ అందజేస్తాం దయచేసి ఒకరోజు ముందు రోజు తెలియజేయగలరు🙏 ప్రసాదాలు కూడా ఇవ్వబడును


విజయవాడ సాయిశర్మ 7396881404

విజయవాడ మధువని 9182554800

విజయవాడ పవన్ శర్మ 79896 44180

సికింద్రాబాద్ శ్రీ రామ క్యాటరింగ్090329 10106

సికింద్రాబాద్ రవి కిరణ్ శర్మ7842413139

సికింద్రాబాద్ కళ్యాణ్ శర్మ9885785556

వైజాగ్ సాయి శర్మ 7032324851

బెంగళూరు బాలసుబ్రమణ్యం శర్మగారు9986119510

తిరుపతి హేమంత్ శర్మ9959859227

నెల్లూరు భార్గవ శర్మ+91 93469 43145

కాకినాడ హరి శర్మ

08142729222

సామర్లకోట శర్మ గారు

9182285617

గుంటూరు సాయి శర్మ7989585295

కడప మురళీ శర్మ

9866261232

చెన్నై శ్రీనివాస్ శర్మ7395932954

కేరళ శర్మ9447136023

ముంబై శివరామన్ శర్మ+91 74484 08447

మధురై నారాయణ శర్మ9842191826

అరుణాచలం లక్ష్మీకాంత శర్మ8870218670

శ్రీరంగం జై శర్మ+91 94871 80737

న్యూఢిల్లీ ఫణి కుమార్ శర్మ9650873730

నాగపూర్ 9505651387

వారణాసి శర్మగారు6387716431


ప్రయాణంలో మన భోజనం దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లలో మన బ్రాహ్మణ ఇంటి భోజనం అందించబడును నలుగురికి ఉపయోగపడే పోస్ట్ దయచేసి తప్పకుండా షేర్ చేయండి

మనిషి ఆయుర్దాయం


 ಸುಭಾಷಿತ . 630 .


ಇದಂ ಲಬ್ಧಮಿದಂ ನಷ್ಟಮಿದಂ ಲಪ್ಸ್ಯೇ ಪುನರ್ಧಿಯಾ | ಇತಿ ಚಿಂತಯತಾಮೇವ ಜೀರ್ಣಮಾಯುಃ ಶರೀರಿಣಾಂ ||


ಇದು ಕೈ ಸೇರಿತು , ಇದು ಕಳೆದುಹೋಯಿತು , ಇದನ್ನು ಮತ್ತೆ ಪಡೆಯುವೆನು ಎಂದು ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಆಲೋಚಿಸುತ್ತಲೇ ಜನರ ಆಯಸ್ಸು ಕಳೆದುಹೋಗುತ್ತದೆ . 


ಮಹಾಭಾರತ .

ఇది దొరికింది ఇది పోయింది ఇది మరల ఎలా సంపాదించాలి.. ఇటువంటి ఆలోచనలతోనే మనిషి ఆయుర్దాయం గడిచిపోతోంది

Folk dance


 

మహాభారతములో - ఆది పర్వము*

 *మహాభారతములో - ఆది పర్వము*


*ప్రథమాశ్వాసము*


           *2*


శౌనకుడు నైమశారణ్యంలో సత్రయాగం చేస్తున్న సమయంలో అక్కడకు రోమహర్షుని కుమారుడైన ఉగశ్రవసుడు అను సూతుడు వచ్చాడు. సూతుడు తనను తాను మునులకు పరిచయం చేసుకుని తాను పురాణకథలు చెప్పటంలో సిద్ధహస్థుడినని చెప్పాడు. అక్కడ ఉన్న మునులు పుణ్యకథను వినాలని కోరికను ఉగ్రశ్రవసువునకు తెలిపారు. ఉగ్రశ్రవసువు వారికి ఒక కథ చెప్పటం ప్రారంభించాడు.


 పూర్వం కృష్ణద్వైపాయనుడు అను మహర్షి ఒకటిగా ఉన్న వేదాలను ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అని నాలుగు భాగాలుగా విభజించాడు. తర్వాత బ్రహ్మదేవుని అనుమతి పొంది అష్టాదశ పురాణాలను, భాగవతకథ, అణు ధర్మశాస్త్రాలను, రాజవంశ చరిత్రలను, ఇతిహాసాలు మొదలైన రచనలను చేసాడు. ఈ మహా భారతం గ్రంథాన్ని ధర్మజ్ఞులు ధర్మశాస్త్రమని, ఆత్మ జ్ఞానులు వేదాంతమని, నీతి కోవిదులు నీతి శాస్త్రమని, కవులు మహాకావ్యమని, ఇతిహాసికులు ఇతిహాసమని, పౌరాణికులు పురాణమని, లాక్షణికులు సర్వ లక్షణ గ్రంథమని అంటారు. ఈ మహాభారతాన్ని చెప్పుటకు దేవలోకంలో నారదుని, పితృలోకంలో దేవలుడిని, గరుడ, గంధర్వ, యక్ష, రాక్షస లోకాలలో చెప్పుటకు  శుకమహర్షిని, మనుష్యలోకంలో వైశంపాయుని నియమించాడు.  వైశంపాయుడు జనమేజయునికి చెప్తుండగా నేను విని అది మీకు చెప్తున్నాను.

నవగ్రహ పురాణం - 61 వ అధ్యాయం*

 *నవగ్రహ పురాణం - 61 వ అధ్యాయం*

🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷


*సూర్యగ్రహ చరిత్ర - 4*


ఆ ప్రశాంత వాతావరణంలో సూర్యుడూ , సంజ్ఞ అశ్వ దంపతులుగా విహరిస్తూ. ఉండిపోయారు.


అశ్వరూపంలో ఉన్న సంజ్ఞ తనలో సూర్యుడు ప్రవేశపెట్టిన తేజస్సును నాసికా రంధ్రాల గుండా వెళ్ళగక్కింది. రెండు నాసికారంధ్రాల నుండి వెలువడిన సూర్య తేజం . ఇద్దరు కుమారులుగా మారింది. ఆశ్విక దాంపత్య ఫలంగా , అశ్వముఖాలతో , మానవ శరీరాలతో జన్మించిన ఇద్దరు పుత్రులతో బాటు , సహజ శరీరంతో మరొక పుత్రుడూ ఆవిర్భవించారు.


తమ ఆశ్విక దాంపత్యం ఫలవంతం కాగానే , సూర్యుడు తన సహజరూపాన్ని ధరించాడు. ఆయనను అనుసరిస్తూ సంజ్ఞ కూడా తన బడబారూపాన్ని వీడి , పూర్వ రూపాన్ని పొందింది.


అశ్వముఖాలతో జన్మించిన కుమారులకు - 'నాసత్యుడు' అనీ , 'దస్రుడు' అనీ పేర్లు నిర్ణయించాడు సూర్యుడు. ఆ ఇద్దరూ అశ్వనీ కుమారులుగా ప్రసిద్ధులవుతారని చెప్పాడు సంజ్ఞతో.


మూడవ కుమారుడికి 'రేవంతుడు' అని నామకరణం చేశాడు సూర్యుడు. అశ్వావతార సమయంలో తమకు పుట్టిన ఆ ముగ్గురు పుత్రుల భవితవ్యం గురించి భర్తను అడిగింది. సంజ్ఞ.


*"ఇప్పుడు మనకు జన్మించిన ఈ ముగ్గురూ సామాన్యులు కారు ! సద్యోగర్భాన జన్మించి యువకులయ్యారు. చూడు ! నాసత్యద్రసులు ఇద్దరూ - అశ్వనీ కుమారులుగా , దేవ వైద్యులవుతారు. అశ్వనీ దేవతలుగా ఆరాధించబడతారు !”* సూర్యుడు చిరునవ్వుతో చెప్పాడు. *“ఇక రేవంతుడు అశ్వసంభూతుడైన కారణంగా అశ్వ విద్యలో ప్రసిద్ధుడవుతాడు !"*


*"సంజ్ఞా ! నీ బిడ్డలు - వైవస్వతుడూ , యముడూ , యమీ నీ కోసం పరితపించి పోతున్నారు. మందిరానికి వెళ్దాం , రా!”* సూర్యుడు మన్ననగా అడిగాడు. 


సంజ్ఞ సమాధానం చెప్పకుండా చూపుల్ని క్రిందకు దించుకుంది. ఆమెలో కలుగుతున్న ఆలోచనను వ్యక్తం చేస్తున్న 'అక్షర బిందువుల్లా' - సంజ్ఞ అందమైన శరీరం మీద స్వేద బిందువులు పొటమరించాయి.


సంజ్ఞ శరీరాన్ని అలంకరించిన 'చెమట పూసల్ని' సూర్యుడు చిరునవ్వుతో చూశాడు. *"అర్థమైంది ! నీ కోసం , మన దాంపత్యం కోసం నా దేహం విరజిమ్మే వెల్తురునూ , వేడిమినీ తగ్గించుకొంటాను !”*


*"స్వామీ...!"* సంజ్ఞ ఆనందంగా అంది. *“అది... అది...నా భాగ్యం...”*


సంజ్ఞ భర్త వైపు ప్రశ్నార్థకంగా చూసింది. *"స్వామీ... మన బిడ్డలు... అశ్వనీ కుమారులూ , రేవంతుడూ... మనతో మందిరానికి వస్తారు కదా !”*


సూర్యుడు తల అడ్డంగా ఊపాడు. *"నీ అశ్వనీ కుమారులు దేవ వైద్యులు. రేవంతుడు దేవలోక అశ్విక నిపుణుడు ! ముగ్గురూ దేవలోకంలో ఇంద్రుని కొలువులో వెలుగొందాల్సినవారు !”*


*"జననీ జనకులారా ! మమ్మల్ని దేవలోకానికి ఎవరు తీసుకువెళ్తారు ?"* రేవంతుడు ప్రశ్నించాడు. అశ్వనీ కుమారులు తమ అశ్వముఖాలను ఆడించారు. 'అవును' అన్నట్టుగా. 


*"అదిగో... ఆకాశమార్గాన... వస్తున్నారు చూడండి !... నారదమహర్షి !"* అన్నాడు. సూర్యుడు నవ్వుతూ.


*“నారాయణ !”* అంటూ వాళ్ళ వద్ద సిద్ధమయ్యాడు నారదుడు. *"ఈ ప్రశాంత ప్రదేశంలో సద్యోదాతులైన అశ్వనీ కుమారులను , రేవంత కుమారుడినీ ఇంద్ర సభకు జేర్చమని , బ్రహ్మదేవులు నన్ను పంపించారు !"*


అశ్వనీ కుమారులూ , రేవంతుడూ తల్లిదండ్రులకు నమస్కరించారు. సంజ్ఞ పుత్రుల్ని అక్కున జేర్చుకుని , నుదుర్ల మీద చుంబించింది. సూర్యుడు ముగ్గుర్నీ కౌగిలించుకుని , దీవించాడు.


*"అశ్వినులారా ! మీ వైద్యం దేవతలకే కాదు, మానవులకూ ఉపయోగపడాలి !”* సూర్యుడు అన్నాడు.


*"తండ్రిగారి ఆశయాన్ని తలదాల్చి , కర్తవ్యపాలన చేస్తాం !"* అన్నాడు నాసత్యుడు. 


*"అమ్మా...సంజ్ఞా ! నీ రూపం ధరించి , నీ 'ఛాయ' అక్కడ ఆడిన నాటకం , అశ్వకామిని రూపంలో ఇక్కడ నువ్వు సాగించిన సాధనా ఫలవంతమయ్యాయి ! అక్కడ శనైశ్చరుడు జన్మించాడు ! ఇక్కడ దేవవైద్యులూ , రేవంతుడూ జన్మించారు !"* నారదుడు మెప్పుగా అన్నాడు..


సూర్యుడు నారదుణ్ణి ఆశ్చర్యంగా చూశాడు. *“అయితే , నారదమహర్షీ ! ఇక్కడ ఈ సంఘటనలకు సంకల్పం...”.*


*“అక్కడ జరిగింది, సూర్యాదిత్యా !"* చేత్తో పైకి చూపుతూ మాట పూర్తి చేశాడు నారదుడు.


నారదుడి వెంట వెళ్తున్న ముగ్గురు కుమారులనూ అశ్రునయనాలతో చూస్తూ ఉండిపోయింది సంజ్ఞ. సూర్యుడు ఆమెను సమీపించాడు. ఆమె భుజం చుట్టూ చేతిని వేశాడు. సంజ్ఞ తలతిప్పి , ఆయన ముఖంలోకి చూసింది.


*"వైవస్వతుడూ , యముడూ , యమీ నీకోసం ఆశగా ఎదురుచూస్తున్నారు, మందిరంలో !"* సూర్యుడు చిరునవ్వుతో అన్నాడు.


సంజ్ఞ బుగ్గల మీదికి జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ , భర్త వైపు చిరునవ్వుతో చూసింది.


*"అమ్మా !"* యమీ , యముడూ , వైవస్వతుడూ సంజ్ఞను చూడగానే ఏకకంఠంతో అరిచారు. తన వైపు దూసుకువచ్చిన ముగ్గుర్నీ ఒకేసారి తన చేతుల్లో బంధించలేక సతమతమవుతూ , వాళ్ళ శిరస్సుల మీద ముద్దులు కురిపించింది సంజ్ఞ..


సూర్యుడు ఆనందంగా తల్లీబిడ్డల్ని చూస్తూ ఉండిపోయాడు. ద్వారం వద్ద శబ్దమైంది. అందరూ చూశారు. శని , సావర్జీ , తపతీ వస్తున్నారు. ముగ్గురూ ఆగి , ఆశ్చర్యంగా సంజ్ఞ వైపు చూస్తూ ఉండిపోయారు.


*"అమ్మా..."* తపతి అనుమానిస్తూ అంది.


*"రా తల్లీ ! రండి , నాయనా ! నేను మీ అమ్మనే !"* సంజ్ఞ హాయిగొలిపేలా నవ్వుతూ అంది.


ముగ్గురూ సంజ్ఞ దగ్గరగా వచ్చారు. వైవస్వతుడు , యముడూ , యమీ పక్కకు జరిగారు. శనీ , సావర్టీ , తపతీ సంజ్ఞను సమీపించారు. ముగ్గుర్నీ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది సంజ్ఞ.


*"అమ్మా...ఆ అమ్మ ?"* శని సందేహిస్తూ లోపలి కక్ష్య వైపు చూపించాడు.


*"ఛాయా !”* సంజ్ఞ బిగ్గరగా పిలిచింది. ఛాయ ద్వారం దాటి , ఈవలకు వచ్చి , తటపటాయిస్తూ చూసింది. ఆమె ముఖం మీద అపరాధ భావన నాట్యం చేస్తోంది.


*"ఇలా రా , ఛాయా !"* సంజ్ఞ స్వరంలో ఆజ్ఞ ధ్వనించింది.


ఛాయ మెల్లగా నీడలా కదుల్తూ , ఆమె దగ్గరగా వచ్చింది.


*"ఛాయా ! నీ కర్తవ్యం ముగిసింది. నువ్వు నీ వ్యక్తిత్వాన్ని మరిచిపోయి , నాలో నా ఛాయలో కలిసిపోవాలి !"* సంజ్ఞ గంభీరంగా అంది.


ఛాయ మంత్ర ముగ్ధలా మౌనంగా చూసింది. *"రా , ఛాయా ! నాలో కలిసిపో !"* సంజ్ఞ అంది.


సూర్యుడూ , ఆరుమంది పిల్లలూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఛాయ నెమ్మదిగా సంజ్ఞ వైపు నడిచింది. సమీపించిన క్షణంలో సంజ్ఞలో కలిసిపోయిన ట్టనిపించింది. సువర్ణకుడ్యం మీద సంజ్ఞ నీడ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.


అందరూ సంజ్ఞ వైపు ఆశ్చర్యంగా చూశారు. సంజ్ఞ అందర్నీ కలియజూసింది. *“ఈ సంజ్ఞా , ఆ ఛాయా ఇద్దరూ నేనే ! మీరు ఆరుగురూ నా బిడ్డలే ఇకనుంచీ !"* అంది నవ్వుతూ.


అందరి ముఖాలూ నవ్వుతో వికసించాయి.

 లక్ష్మీలలితా వాస్తు జ్యోతిషాలయం



*దీపారాధన* 


దీపం పరబ్రహ్మ స్వరూపం..

దీపం మంగళ కారకం 

దీపం ఆరోగ్యదాయకం


ఉదయ సంధ్యా దీపారాధన సర్వ సౌభాగ్యదాయకం.

సంప్రదాయబద్దంగా వెలిగించే నూనె లేదా నేతి దీపానికి ఆధ్యాత్మిక కారణం వుంది.

దీపం జ్ఞానానికి చిహ్నం నేటికి పూజ చేసేటప్పుడు దేవాలయములోను నేతి దీపాలను వెలిగిస్తారు. దీపం ఒక జ్యోతి వెలుగుతో అనేక జ్యోతులను వెలిగించవచ్చును,దీపానికి చీకటిని పారద్రోలి వెలుగులు పంచగల శక్తి దీపానికి వుంది.

పవిత్రమైన శుభ సందర్భాల్లో దీప జ్యోతిని వెలిగించే సంప్రదాయం మనది.

దీపం చీకటిని పారత్రోలె దివ్యజ్యోతి ప్రతి ఇంట ఉదయం, సాయంత్రం దీపారాధన చేయటం హిందూ సంప్రదాయం.

దీపపు కుందేలలో వేసే నునె/నెయ్యి ప్రత్తితో చేసే వత్తి మన అహంకార,లోభము,మొహానికి సంకేతం. భగవంతుని ఎదుట దీపం వెలిగించగానే నెమ్మదిగా అవి నశిస్తాయని బావిస్తారు.

దీపపు సమ్మెను తప్పనిసరిగా పూజించే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో వుంది.

దీపపు సమ్మెకు కుంకుమ, గంధం మూడు చోట్ల పెట్టి పూలతో అలంకరంచి పూజిస్తారు. ఆ తరువాత ఆ దీపాన్నిఅష్టదిక్కులకు భూమికి అకాశానికి చూపిస్తూ నమస్కరిస్తూ దేవుని వద్ద ఉంచుతారు. దీపపు సమ్మెకు వుండే ఐదువత్తుల యొక్క పరమార్ధం …… ఐదువత్తులలో మొదటి వత్తి భర్త కోరికలు తీరుటకు, రెండోవ వత్తి సంతాన యోగక్షేమాలకు, మూడోవ వంశవృద్ది కొరకు, నాల్గోవ వత్తి కీర్తి ప్రతిష్ట ల కొరకు, ఐదోవ వత్తి దు:ఖముల నుండి విముక్తి కొరకు ఈ ఐదు జ్యోతులను వెలిగించటం శ్రేయస్కరం.

అమావాస్య రోజున సాయంసంధ్యలో దీపారాధన చేసి ఇష్ట దైవాన్ని పూజించి అష్టదిక్కులకు చూపించిన అరిష్టాలు తోలగుతాయి.

దీపము కొండెక్కిన….

దీపము కొండెక్కిన ఇష్టదేవత నామాన్ని జపిస్తూ మళ్లీ దీపము వెలిగిస్తే దీపము కొండెక్కిన దోషము తొలగుతుంది. 

ఒక వత్తిని ఏనాడు వెలిగించరాదు, దీపారాధన రెండు వత్తులు వేసి వెలిగించవలెను.

మురికిగా వున్న వత్తిని వెలిగించిన జ్ఞాపకశక్తి తగ్గుతుంది. స్టీల్ కుందులలో దీపారాధన చేయరాదు.

దీపారాధన ఈశ్వరునికి ఎడమ వైపు, విష్ణువుకి కుడి ప్రక్కన చేయాలి, దేవి పూజలలో నేతిదీపాన్ని వెలిగించాలి.

దీపమునకు కుంకుమ పూవులు పెట్టి పూజ ప్రారంబించాలి. దీపమునకు ఈ విధంగా చేయుట అగ్నిదేవుని ఆరాధించుటకు సంకేతం.


జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా  సంప్రదించవచ్చును.  

*ద్విస్వర్ణ కంకణ సన్మానిత.*

*జ్యోతిషరత్న, member in international astrology federation. ..శ్రీనివాస సిద్ధాంతి*

*

🪷 శ్రీ మద్భగవద్గీత🪷* *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸* *🌸 సాంఖ్య యోగః 🌸*

 🕉️🪷 *ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః* 🪷🕉️

 *🪷 శ్రీ మద్భగవద్గీత🪷* 

 *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸* 

 *🌸 సాంఖ్య యోగః 🌸* 


 *2-అధ్యాయం, 34వ శ్లోకం* 


 *అ కీర్తిం  చాపి భూతాని కథయిష్యంతి తేవ్యయామ్ |* 

 *సంభావితస్య చాకీర్తిః  మరణాదతిరిచ్యతే ||34* 


 *ప్రతిపదార్థము* 


చ = మరియు; భూతాని = సమస్త జనులు; తే = నీ యొక్క ; అవ్యయామ్ = కలకాలము నిలిచియుoడు; అ కీర్తిమ్, ఆపి = అపకీర్తిని గూర్చియు; కథయిష్యతి = చెప్పి కొందురు;చ= మరియు; సంభావితస్య = మా మాన్యుడైన వానికి ; అకీర్తిః =అపకీర్తి; మరణాత్ = మృత్యువు కంటేను ; అతిరిచ్యతే = అధిక (బాధాకర )మైనది ;


 *తాత్పర్యము* 


 లోకులేల్లరును బహుకాలములు వరకును నీ అపకీర్తిని గూర్చి చిలువలు పలువులుగా చెప్పుకొందురు. మాన్యుడైన పురుషులకు అపకీర్తి మరణం కంటేను బాధాకరమైనది.


 *సర్వేజనా సుఖినోభవంతు* 

 *హరిః ఓం 🙏🙏*

శివమానసపూజ

 శ్రీశంకరాచార్య విరచిత 

           శివమానసపూజ

          ఆంధ్ర పద్యానుసరణ



నవరత్న ఖచితమౌ నవ్యాసనంబును

         మహిత హిమజలమ్ము మజ్జనముకు

దేదీప్యమానమౌ దివ్యాంబరంబులు 

         భూతితో విలసిల్లు భూషణములు

సకలాంగములకెల్ల చందన చర్చయున్ 

         మేలైన సౌగంధ మృగమదమ్ము

జాజి బిల్వ దళాలు చంపక పుష్పముల్

         దీప నైవేద్యముల్ దివ్య ముగను

హృదయపూర్వక భక్తితో నిచ్చు చుంటి

స్వీకరించుము శంకరా ! చేతు నతులు

ముక్తి నొనగూర్చుమయ్య యో భక్తవరద!

పార్వతీనాథ !పశుపతే ! పాహి ! పాహి!         01


                 

కాంచన బహురత్నఖచితమౌ పాత్రల

        పరమాన్న యాజ్యపు పాయసములు

పంచ విధమ్ములౌ పలుభక్ష్య తతితోడ

        పయయుక్త దధికృత పాకములను

భర్మ్యంపు పాత్రల పరిపూరితంబైన

        పలు స్వాధు శర్కర పానకములు

సంచిత శాకముల్ సత్ఫల వీడ్యమున్ 

        రస యుక్త శ్రేష్ఠమౌ రసనములను

అంచితంబైన భావాన యాత్మ సాక్షి

యర్పణము చేయు చుంటిని యభవ !నీకు

మానసంబున నిప్పుడు మధురముగను

పార్వతీనాథ !పశుపతే ! పాహి ! పాహి !       02

       


ఛత్ర చామరదోయి సరితాళవృంతముల్ 

        దర్శనయుక్తమౌ  దర్పణమును 

వీణా మృదంగాల విభవ నాట్యమ్ములన్ 

       శ్రావ్య గానమ్ముల భవ్య స్తుతుల

మక్కువ తోడ నా మానసంబందున

       వరలు భక్తియుక్త వందనములు

పెక్కగు పూజాళి ప్రేమతో నర్పింతు 

       దిక్కు నీవే స్వామి! దీనబంధు!

పరవశంబున నే చేయు భక్తి పూజ

లందు కొని ముక్తి నీవయ్య యిందుమౌళి !

నిరతమును నిన్నె నమ్మితి న్నీలకంఠ !

పార్వతీనాథ !పశుపతే! పాహి !పాహి !       03



ఆత్మయే నీవయ్య  నగజయే నా మతి

         ప్రమథాళి ప్రాణముల్  భసితదేహ !

నిత్యమ్ము నిద్దురే  నిత్యసమాధి ఔ

         దేహమే గేహమ్ము దివ్యతేజ !

చరణాల చలనమే యరయ ప్రదక్షిణ

         పలికెడి వాక్కులే భవ్య నుతులు 

యెయ్యవి కర్మంబు లెపుడాచరింతునో

        నయ్యవి నీ సేవె ననయ మెంచ

సర్వ వాక్కాయ కర్మలు సర్పభూష !

నీకె యర్పింతు మనసార  నిచ్చలందు 

కరుణ చూపుము పరమేశ ! కామితార్థ !

పార్వతీనాథ ! పశుపతే ! పాహి ! పాహి !   04



కర చరణములతో కర్ణ నేత్రాలతో

         భాషణమ్ములతోడ పనులతోడ

నిరతమ్ము మదియందు నే నాచరించెడి

         కడు విధమ్ములు యైన  కర్మ లందు

సరియును సరికాని సర్వమౌ చర్యల

        క్షమియించి కావుము స్వాంత మందు

నజ్ఞాన జ్ఞానాల నాచరించిన యట్టి

        చర్యల మన్నించు చారురూప !

నిన్నె నమ్మితి నిరతమ్ము నీలకంఠ !

కాచి బ్రోచుము నన్ను యో కామితార్థ !

భక్తపాలన శంకరా !భవ విదూర:!

పార్వతీనాథ !పశుపతే ! పాహి ! పాహి !      05


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

Name change


 

మోడీ రెండో దెబ్బ

 *మోడీ రెండో దెబ్బ రాబోతోంది,*

 *చట్టం 30-A రద్దు చేయబడవచ్చు-.*

 నెహ్రూ హిందువులకు చేసిన ద్రోహాన్ని సరిదిద్దడానికి మోదీజీ పూర్తిగా సిద్ధమయ్యారు.

 *మీరు "లా 30" మరియు లా "30A" గురించి విన్నారా?*

 హిందీలో *"30A"* అంటే ఏమిటో తెలుసా?

 మరింత తెలుసుకోవడానికి ఆలస్యం చేయవద్దు ⬇️

 *30-A* అనేది రాజ్యాంగంలో ఉన్న చట్టం.

 నెహ్రూ ఈ చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చాలని ప్రయత్నించినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తీవ్రంగా వ్యతిరేకించారు.

 సర్దార్ పటేల్, *"ఈ చట్టం హిందువులకు ద్రోహం,* కాబట్టి ఈ చట్టాన్ని రాజ్యాంగంలోకి తీసుకువస్తే, దానికి వ్యతిరేకంగా నేను మంత్రివర్గం మరియు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాను.

 అంతిమంగా సర్దార్ పటేల్ కోరికకు నెహ్రూ తలవంచాల్సి వచ్చింది.

 కానీ దురదృష్టవశాత్తు తెలియదు.. ఈ ఘటన జరిగిన కొన్ని నెలలకే సర్దార్ వల్లభాయ్ పటేల్ హఠాన్మరణం చెందాడా..?

 *సర్దార్ పటేల్ మరణానంతరం నెహ్రూ వెంటనే ఈ చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చారు.*


 *30-A అంటే ఏమిటి, దాని ఫీచర్లను మీకు చెప్తాను!...*

 ఈ చట్టం ప్రకారం - హిందువులు తమ "హిందూ మతాన్ని" బోధించడానికి/బోధించడానికి అనుమతించబడరు.  *"చట్టం 30-A"* అతన్ని అనుమతించదు లేదా అధికారం ఇవ్వదు.....

 కాబట్టి హిందువులు తమ ప్రైవేట్ కళాశాలల్లో హిందూ మతాన్ని బోధించకూడదు.

 హిందూ మతాన్ని బోధించడానికి కాలేజీలు ప్రారంభించకూడదు.  హిందూ మతాన్ని బోధించడానికి హిందూ పాఠశాలలు ప్రారంభించకూడదు.  చట్టం 30-A ప్రకారం ప్రభుత్వ పాఠశాలలు లేదా కళాశాలల్లో హిందూ మత సంస్కృతిని బోధించడానికి ఎవరికీ అనుమతి లేదు.

 ఇది వింతగా ఉంది, (30-A) నెహ్రూ తన రాజ్యాంగంలో *"లా 30"*లో మరొక చట్టాన్ని చేసారు.  ఈ "లా 30" ప్రకారం ముస్లింలు, సిక్కులు మరియు క్రైస్తవులు తమ మత విద్య కోసం ఇస్లామిక్, సిక్కు, క్రైస్తవ మత పాఠశాలలను ప్రారంభించవచ్చు.

 ముస్లింలు, సిక్కులు మరియు క్రైస్తవులు తమ మతాన్ని బోధించవచ్చు.

 చట్టం 30 ముస్లింలకు వారి స్వంత 'మదరసా'ను ప్రారంభించేందుకు పూర్తి హక్కును మరియు అనుమతిని ఇస్తుంది మరియు రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 వారి స్వంత మతపరమైన పాఠశాలలు మరియు కళాశాలలను స్థాపించడానికి మరియు బోధించడానికి క్రైస్తవులకు పూర్తి హక్కు మరియు అనుమతిని ఇస్తుంది.  మీ మతాన్ని ఉచితంగా ప్రచారం చేయండి... ఇందులోని ఇతర చట్టపరమైన అంశం ఏమిటంటే, హిందూ దేవాలయాల డబ్బు మరియు ఆస్తులన్నీ ప్రభుత్వ విచక్షణకు వదిలివేయవచ్చు, హిందూ భక్తులు హిందూ దేవాలయాలకు ఇచ్చే డబ్బు మరియు ఇతర విరాళాలన్నీ రాష్ట్ర ఖజానాకు వెళ్తాయి.  లోపలికి తీసుకోవచ్చు.

 అదే సమయంలో, ముస్లిం మరియు క్రైస్తవ మసీదుల నుండి విరాళాలు మరియు భిక్ష క్రైస్తవ-ముస్లిం సమాజానికి మాత్రమే ఇవ్వబడుతుంది.  ఈ *"చట్టం 30"* యొక్క లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి.

 కాబట్టి, *చట్టం 30-A" మరియు "చట్టం 30"* అనేది హిందువులపై ఉద్దేశపూర్వక వివక్ష మరియు ఉద్దేశపూర్వకంగా క్రమబద్ధమైన ద్రోహం.

 ఈ రోజు హిందువు జానపద కథలకే పరిమితమైందనే విషయాన్ని అందరూ బాగా అర్థం చేసుకోవాలి.  హిందువులకు వారి గ్రంధాల జ్ఞానం లేదు.  *నేర్చుకో*

 ఇతరుల పట్ల అవగాహన మనమందరం సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం.  చదవండి, నేర్చుకోండి మరియు వ్యాప్తి చేయండి..

 దీనికి కారణం *ఆర్టికల్ 30-A*

 మన దేశంలో ఎక్కడా *భగవద్గీత* బోధించలేము.

 



 *ఏసీబీ జడ్జి* :  గారి పేరు బొక్కా సత్య వెంకట హిమబిందు గారు, వయస్సు 50 సంవత్సరాలు. సొంత ఊరు బొక్కా వారి పాలెం, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా. Cast: గౌడ సామాజిక వర్గం, Sub Cast: శెట్టి బలిజ(కల్లు గీత కార్మిక కులం). తండ్రి చంద్రశేఖర్ Lawer వృత్తి. న్యాయవాద వృత్తిలో కంటే కూడా Notary Work లో చాలా Busy గా ఉంటాడు.

ఈ కుటుంబం రాజకీయాలకు చాలా ఆమడ దూరంలో ఉంటుంది. ఆ ఊరిలో పెద్ద మనుషులు గా అందరి మన్ననలు పొందే కుటుంబం. హిమబిందు గారు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఆంధ్ర యూనివర్సిటీ నుంచి లా(Law) పట్ట పొందారు. 1996లో హైకోర్టు బార్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకున్నారు. జడ్జి ఎంట్రన్స్ టెస్ట్ లో పాస్ అయ్యి 2016లో అమలాపురంలో అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జిగా పోస్టింగ్ తీసుకున్నారు. అక్కడి నుంచి వైజాగ్ కి ట్రాన్స్ఫర్ అయి CBI Court lo Pricipal Special Judge గా Work చేసారు. 18-04-23 లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల వారు ఆమె ను Vijayawada కి ట్రాన్స్ఫర్ చేసి ఆమెకు మూడు పదవి బాధ్యతలు అప్పగించారు (1) CBI Court Judge (సెంట్రల్ గవర్నమెంట్ వ్యవహారాలకు సంబంధించిన) (2) ACB Court Judge(రాజకీయ నాయకులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు వ్యవహారాలకు సంబంధించి అవినీతి నిరోధక చట్టాన్ని అమలు చేయడం) (3) 3వ  Additional District And Sessions Judge గా  నియమించారు. ఆమె ఎవరి ప్రలోభాలకు గురికాకుండా న్యాయ దేవత పుత్రికగా తన తీర్పులు ఇస్తుంది. విజయవాడలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన న్యాయవాదులు హిమబిందు గారి ఇంటికి వెళ్లి కొంచెం రచ్చలు చేశారు. హౌస్ మోషన్ వెయ్యమని డిమాండ్ చేశారు. ఆమె వారికి ఒక్కటే మాట చెప్పింది. రిమాండ్ రిపోర్ట్ లేకుండా హౌస్ మోషన్ వెయ్యను అని చెప్పింది. రిమాండ్ రిపోర్ట్ వచ్చిన మరుక్షణమే మీరు హౌస్ మోషన్ కి అప్లై చేసుకోవచ్చు అని నిజాయితీగా చెప్పింది. చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాది సిద్ధార్థ లూద్ర వారి న్యాయవాదులు 15 మంది కంటే ఎక్కువ ఉండరాదు, అలాగే ప్రభుత్వ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కి సంబంధించిన న్యాయవాదులు 15 మంది కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పి... న్యాయ దేవతను నమ్మే నల్ల కోటు ధరించే మనము పోలీసులతో చెప్పించు కునే పని ఉండకూడదు అని గౌరవంగా విన్నవించి ఆ విధంగా మిగతా వారందరినీ కోర్ట్ హాల్ నుంచి బయటికి పంపించి వేసింది. ఆమె నిజాయితీగా నిక్కచ్చిగా కఠి నాతి కఠినంగా తీర్పులు చెప్పే మనస్తత్వం కలిగిన వ్యక్తి. తెలుగుదేశం నాయకులు అవగాహన రాహిత్యం తో ఆమె జగన్ మాటలు వింటుంది అని ప్రచారం చేశారు. కానీ ఆమెకు సంబంధించిన ప్రమోషన్ లు, బదిలీలు ఇంక్రి మెంట్లు, ఉద్యోగ నియామకాలు అన్ని హైకోర్టుకు సంబంధించి ఉంటాయి. ఆమె ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఆమె ను Judge గా విజయవాడ కు మార్చారు.  చంద్రబాబునాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గాని నియమించలేదు. ఆమె చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3వ  Additional District And Sessions Judge గా పని చేసారు. ఆమె చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రత్యేక గా న్యాయ దేవత ముద్దు బిడ్డగా మన్నన లు పొందిన వ్యక్తి. ఆమెను చూసి తెలుగువారు గర్వపడాలి ఎటువంటి రాగద్వేషాలకు గురికాకుండా తీర్పులు చెప్పింది. ఎవ్వరి ప్రలోభాలకు ఎప్పుడూ గురి కాలేదు. చట్టాన్ని రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు ధర్మాన్ని పాటించింది. నిర్భయంగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా దేశ చరిత్రలో ఒక సంచలనాత్మకమైన తీర్పును ఇచ్చిన ఒక వీర వనితగా చరిత్ర కు ఎక్కింది.  ఆమె ఇచ్చిన తీర్పులను తర్వాత కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అణువణువునా పరిశీలిస్తారు. చట్టంలో ఉండే సెక్షన్ల ను రాజ్యాంగంలో ఉండే అధికరణాలు ను అలాగే అవినీతి నిరోధక శాఖ కు సంబంధించిన చట్టాలు, నియమాలు కు లోబడి ఆమె తీర్పులు ఉంటాయి. ఈ రోజున సీనియర్ న్యాయవాదులు సుప్రీంకోర్టు హైకోర్టు రిటైర్డ్ జడ్జిలు ఆమె ఇచ్చిన తీర్పును అభినందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండవచ్చు 14 సంవత్సరాలు పని చేసి ఉండవచ్చు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నో సంవత్సరాలు పని చేసి ఉండవచ్చు, NDA Convener గా దేశ రాజకీయాలను చక్రం తిప్పి ఉండవచ్చు కానీ చట్టం న్యాయం ధర్మం సెక్షన్ల ప్రకారం ఆమె తీర్పు ఇచ్చినందుకు భారతదేశ ప్రజలందరూ గర్వపడుతున్నారు. భర్త ఆంధ్రప్రదేశ్లో గెజిటెడ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు. చెల్లెలు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివి హైదరాబాదులో మంచి Software కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అక్క చెల్లెలు ఇద్దరు మాత్రమే.

నవగ్రహా పురాణం🪐* . *32వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *32వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*గురుగ్రహ జననం - 3*


*"ఆ సుముహూర్తాన్ని - మాకు కూడా పితృసమానులైన అంగిరస మహర్షులు నిర్ణయిస్తారు !"* ఇంద్రుడు సవినయంగా అన్నాడు.


అంగిరసుడు నిర్ణయించిన శుభముహూర్తాన దేవసభలో బృహస్పతి దేవగురువుగా అభిషిక్తుడయ్యాడు. అత్యంత సుందరంగా నిర్మించబడిన ఆశ్రమ ప్రాంగణంలో విద్యార్థులకు బృహస్పతి విద్యాబోధన ప్రారంభమైంది. ఆశ్రమంలో వాసం చేస్తూ అవసరమైనప్పుడల్లా దేవసభకు వెళ్లి అక్కడ తన విధుల్ని నిర్వహిస్తున్నాడు బృహస్పతి.


ఒకనాడు ఇంద్రుడు బృహస్పతిని వెంటబెట్టుకుని , చతుర్ముఖ బ్రహ్మ సన్నిధికి వెళ్ళాడు. బృహస్పతిని దేవతల గురువుగా బ్రహ్మకు పరిచయం చేశాడు. 


*"మా గురుదేవుల వివాహం సంకల్పించారు. వారి జననీజనకులు. తగిన స్త్రీ రత్నాన్ని తమరే సూచించాలి"* అంటూ ఇంద్రుడు బ్రహ్మను ప్రార్ధించాడు.


బ్రహ్మ బృహస్పతిని తదేకంగా చూశాడు. *"బృహస్పతి చక్కని దేహసౌందర్యం , వర్ఛస్సూ కలిగిన వాడు. అతనికి తగిన అందగత్తె లభించాలి..."* అంటూ బ్రహ్మ. అర్ధనిమీలిత నేత్రాలతో ధ్యాననిమగ్నుడయ్యాడు..


ఇంద్రుడూ , బృహస్పతీ , ఆశ్చర్యంగా ఆయనవైపే చూస్తూన్నారు. బ్రహ్మ రెప్పలు పైకెత్తి బృహస్పతి వైపు చూశాడు.


*"తార అనే జవ్వని తగిన పెనిమిటి కోసం తపస్సు చేస్తోంది. ఆమె జగదేక సుందరి ! కాలం మీ ఇద్దర్నీ కలుపుతుంది. ఆ తారను ధర్మపత్నిగా స్వీకరించు !"* బ్రహ్మ వాక్కులో అనుశాసనం ధ్వనించింది.


బ్రహ్మ హఠాత్తుగా సాక్షాత్కరించి , తార వైపు చూస్తూ ఉండిపోయాడు. శ్వేత వర్ణ వస్త్రాలు ధరించిన తార - తెల్ల రేకుల్లో దాగిన ఎర్ర తామరలా ఉంది. తార సర్వస్వమూ పద్మమయంగా కనిపిస్తోంది బ్రహ్మ చూపులకు. ముఖం పద్మం. రెప్పలు మూసిన విశాలవిలోచనాలు పద్మ పత్రాలు. చేతులు నాజూకైన పద్మనాళాలు. అరచేతులు పద్మపత్రాలు. తార తనువల్లిపైన తామరమొగ్గలు కనిపిస్తున్నాయి. ఓహ్ ! తారది నిసర్గ సౌందర్యం ! ఎనిమిది కళ్ళతోనూ చూడాలనిపిస్తోందామెను !


*"తారా..."* అప్రయత్నంగా పిలిచాడు బ్రహ్మ.


బోర్లించిన అరచేతుల్లా ఉన్న విశాలమైన రెప్పలు నెమ్మదిగా స్పందిస్తూ - పైకి లేచాయి. తార విశాల నేత్రాలు ఆశ్చర్యానందాలతో బ్రహ్మ దేవుణ్ని చూశాయి. *“స్వామీ...”* తార చేతులు జోడించింది.


*"నువ్వు తగిన వరుని కోసం తపస్సు చేస్తున్నావని మాకు తెలుసు. స్ఫురద్రూపీ , కుశాగ్రబుద్ధీ అయిన యువకుడు నీ భర్త కాబోతున్నాడు...”* 


*"స్వామీ...!"* తార కంఠంలో వీణలు పలికా యనిపించింది. నిరంతరం వాణి వీణానాదం వినే బ్రహ్మకు.


*"అతని పేరు బృహస్పతి ! దేవ గురువుగా విశిష్ట పదవిలో వున్నాడు. అచిర కాలంలో బృహస్పతి నీకు తారసిల్లుతాడు. ఆ సుందరుణ్ని భర్తగా స్వీకరించు !"*



*"ఆజ్ఞ !"* తార నమస్కరిస్తూ అంది. 


*"బృహస్పతితో నీ కళ్యాణం ఏకోన్ముఖం. ఆనందం ద్విముఖం ! కళ్యాణమస్తు !"* తారను దీవించి , మరికాసేపు ఆమె అలౌకిక సౌందర్యాన్ని వీక్షించి , బ్రహ్మ అంతర్ధాన మయ్యాడు.


తపస్సు ఫలించిన ఆనందం తార వదనం మీద దరహాస చంద్రిక రూపంలో ప్రత్యక్ష మవుతోంది. తార కూర్చున్న చోటి నుంచి లేచింది. ఎదురుగా వున్న కొలను తామర కన్నులతో తననే చూస్తూ చిన్ని చిన్ని తరంగ హస్తాలతో రమ్మని పిలుస్తున్నట్టు కనిపిస్తోంది తారకు.


యజ్ఞం ముగిశాక 'అవభృథ స్నానం' చేయడానికన్నట్టు తార పిలుస్తున్న కొలను వైపు అడుగులు వేసింది. జుత్తు ముడి విప్పుకుంటూ నెమ్మదిగా కొలనులోనికి దిగింది. కొలనులోని తేటనీరు పై పైకి వ్యాపిస్తూ తారను తనలో ఇముడ్చుకోవడం ప్రారంభించింది. 


తార ఒక్కసారిగా నీటిలో మునిగింది. క్షణంలో ఆమె మొహం నీటిపైన ప్రత్యక్షమైంది. కొలనులో వున్న తామరలను వెక్కిరిస్తున్న 'ముద్దు తామరలా' ఆమె ముఖం కనిపిస్తోంది.


రోజులు గడుస్తున్నాయి. కాబోయే ప్రాణేశ్వరుడి కోసం తార తనకు తెలియకుండానే అన్వేషణ సాగిస్తోంది. అందమైన ప్రకృతిలో , ఆకర్షణీయమైన స్థలాల్లో ఆమె అదే పనిగా విహరిస్తోంది.


తనతో తారను కలిపే కాలం ఎప్పుడొస్తుందో అని లోలోపల అనుకుంటూనే వున్నాడు బృహస్పతి.


ఆశ్రమంలో శిష్యులు క్రిందటిరోజు బోధించిన వేదపాఠాన్ని వల్లె వేస్తున్నారు. అనుష్ఠానాలు తీర్చుకునేందుకు బృహస్పతి సమీపంలోని నది వైపు బయలుదేరాడు.


నదీతీరానికి చేరుకున్న బృహస్పతి , తటాలున ఆగాడు. నదిలోంచి ఎవరో స్త్రీ గట్టు వైపు అడుగులు వేస్తోంది. సచేల స్నానం చేసిన ఆమె వలువలలోంచి నీరు - వయ్యారంగా వొలికిపోతోంది. తడిసిన శ్వేతాంబరం ఆ శరీరాన్ని దాచీ , దాచకుండా చూపుతున్న తెరలా వుంది.


నీటిలో నుంచి పైకి లేవనెత్తిన బంగారుబొమ్మలా వుందామె. ఎవరు ? ఎవరామె ? నదీ కన్యా ? సముద్రంలోంచి ఎదురీదుతూ వచ్చిన మత్స్యకాంతా ? లేక సాగరకన్య ? కమ్మెచ్చులోంచి తీసిన బంగారు తీగలాంటి ఆమె శరీరం బృహస్పతి సర్వస్వాన్నీ అయస్కాంత శిల్పంలా లాగుతోంది. అసంకల్పితంగా ఆమె వైపు అడుగు వేశాడతను.


బృహస్పతి తనలో కలుగుతున్న భావావేశానికి ఆశ్చర్యపోయాడు. ఇంతవరకూ ఏ స్త్రీని తాను అలా నిర్భయంగా , నిస్సంకోచంగా , రెప్పవేయకుండా చూడలేదు. బ్రహ్మదేవుడు ఎవరో 'తార' అన్నాడు ! తార కాకుండా ఈ లావణ్యవతి అని వుంటే ?....


లేకపోతే.... ఈ లావణ్యవతే తార అయితే ? లోపల్నుంచీ తన్నుకొస్తున్న ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరవుతూ బృహస్పతి ఆగాడు. ఆమె కూడా ఆగింది.


సచేలస్నానం చేసిన ఆమె తనువు కాకుండా , బలిసిన చేపల్లా స్పందిస్తున్న ఆమె కళ్ళు బృహస్పతి దృష్టిని బలంగా లాగుతున్నాయి. 


బృహస్పతి పెదవులు ఆరిపోతూ కదిలాయి.


అయితే - మాటను ఆమె పెదవులు పలికాయి.


*" ఆర్యా... నా పేరు తార. మీరు బృహస్పతీ కుమారులను ఎరుగుదురా ?"* తార ! బృహస్పతి గుండెగూటిలో పావురంలా కొట్టుకుంది. మౌనంగా , తెలుసన్నట్టు తల పంకించాడు.


*"వారు ఎక్కడున్నారో చెప్పండి !"* తార కంఠంలో కోయిల దాగి వుందేమో అనిపించింది బృహస్పతికి.


*“ఇక్కడే... నీ సన్నిధిలో...”*


*“మీరా ?!”* ఆశ్చర్యానందాలు తార కంఠంలో జంట స్వరాల్లా పలికాయి.


*"తారా !"* అన్నాడు బృహస్పతి ఆమె చేతిని పట్టుకుంటూ.


శ్రద్ధా అంగిరసులకు తార ఎంతగానో నచ్చింది. తారను తనంత తాను పరిగ్రహించకుండా , తమ అనుమతికోసం ఆమెతో బాటు వచ్చిన బృహస్పతిని చూసి అంగిరసుడూ , శ్రద్ధా సంతోషపడిపోయారు.


బృహస్పతీ తారల వివాహం నిశ్చయమైంది. ఇంద్రాది దేవతలూ , నారదుడూ , మానస పుత్రులూ వివాహానికి విచ్చేశారు. దేవేంద్రుడి ఆధ్వర్యంలో బృహస్పతి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.


శ్రద్ధా , అంగిరసుడూ - తారకూ , బృహస్పతికీ వేర్వేరుగా గృహస్థ ధర్మాలూ , దాంపత్య సూత్రాలూ బోధించారు. దాంపత్య యాత్ర నిరాఘాటంగా సాగించమనీ , వంశాన్ని సత్ సంతానంతో అభివృద్ధి చేయమని ఇద్దర్నీ దీవించి పంపించారు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -53🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -53🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


.             *🌷కులశేఖర పడి🌷*


తిరుమల ఆలయంలోని వేంకటేశ్వర స్వామి మూలవిగ్రహం ఎదురుగా ఉండే గడప. ఆళ్వారులలో ఒకడు, తిరువాన్కూరు మహారాజు కులశేఖరుని పేరు మీదుగా ఈ గడప పేరు ఏర్పడింది.

కేరళ ప్రాంతానికి చెందిన విష్ణుభక్తుడు, తిరువాన్కూరు రాజ్యానికి మహారాజు కులశేఖరుడు. 12మంది వైష్ణవ మహాభక్తులు ఆళ్వారులలో ఆయన కూడా ఒకరు. క్రీ.శ. 7వ శతాబ్దంలో ముకుందమాల అనే గ్రంథాన్ని రచించి భగవంతునికి అంకితం చేశారు. ఆ గ్రంథంలో తిరుమల దేవునితో నీ సన్నిధికి దేవతలు, అప్సరసలు, మహాభక్తులు ఎందరో వస్తారు. అటువంటి నీ సన్నిధిలో గడపగా ఉన్నా నా జన్మ తరించినట్లేనని తన కోరిక విన్నవించుకున్నారు. కులశేఖరుడు గడపగా మారాడన్న భావనతో ఈ గడపను కులశేఖర పడి అని పిలుస్తారు.


*🌷ఆనంద నిలయ విమానం:*

గర్భాలయం మీద మనకు బంగారు పూత పూసిన గోపురం కనిపిస్తుంది. దీనిని ఆగమ భాషలో విమానం అంటారు. శ్రీవారి దేవాలయం మీద ఉన్న విమానానికి ఆనంద నిలయ విమానమని పేరు. ఇది త్రిదళ విమానం. ఈది మూడు అంతస్తులుగా ఏర్పాటు చేయబడింది.


*🌷బేడి ఆంజనేయస్వామి దేవాలయము:*


బేడి ఆంజనేయస్వామి వారి దేవాలయం శ్రీవారి సన్నిధికి తూర్పు మాడా వీధిలో మహాద్వారానికి అఖిలాండానికి ఎదురుగా ఉంటుంది. బేడి ఆంజనేయస్వామి రెండు చేతులు అంజలి ఘటించి శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి నమస్కరిస్తూ నిలబడి ఉంటాడు. చిన్నతనంలో తిరుమల వదిలి పారిపోతుంటే అంజలీ దేవి (ఆంజనేయుని తల్లి) చేతులకు బేడీలు తగిలించిందట అందుకనే ఈయనను బేడీ ఆంజనేయస్వామి అంటారు. ఈయన విగ్రహం చేతులకు బేడీలు తగిలించి వుంటుంది.


*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️

రామాయణమ్ 332

 రామాయణమ్ 332

...

వారు వానరులు ! 

వారి శరీరములు ఒక్కొక్కరిది ఏనుగంత ! 

.

కోట్లకొలదిగ ఉన్న వానరసైన్యం రివ్వుమంటూ గగనతలంలో మెరిసింది !

.

ఎగిరేవారు కొందరు ,

చెట్లమీద దూకేవారు కొందరు గర్జించెవారుకొందరు ! 

శత్రువును 

నిర్జిస్తామని కొందరు సింహనాదాలు చేసుకుంటూ కోలాహలంగా బయలుదేరారు.

.

పళ్ళగుత్తులతో వున్న చెట్లు పెకిలించి మోసేవారుకొందరు !

.

తేనెటీగలు చెదరగొట్డి పెద్దపెద్దతుట్టెలు మోసేవారు కొందరు!

.

మధుభక్షణం చేస్తూ కొందరు! ఫలభక్షణం చేస్తూ కొందరు!

పరస్పరము పైకి ఎత్తి పడవేస్తూ కొందరు!

భుజస్ఫాలనములు చేసుకుంటూ కొందరు ..

.

అందరూ కదిలారు !

అవనిజ సీతమ్మచెర విడిపించడానికి!

.

పదికోట్ల సైన్యము శతబలి రక్షణలో ఉన్నది!

.

కేసరి,పనసుడు,గజుడు,అర్కుడు వీరు నూరుకోట్ల సైన్యపర్యవేక్షణ చేయుచుండిరి!

.

వలీముఖుడు,ప్రజంఘుడు,

జంభుడు,రభసుడు వీరు నలుదిక్కులా తిరుగుతూ సేనను ఉత్సాహపరుస్తూ తొందరపెట్టుచూ ముందుకు నడిపించుచుండిరి.

.

అది వానర సైన్యమా ! 

లేక అరణ్యములో చెట్ల పైభాగముమీద కదులుతున్న సముద్రమా ! 

.

వారి నడక శత్రుభీకరము !

వారు చేసే కోలాహలము సముద్రఘోష!

వారి కదలిక ఉత్తుంగ కడలితరంగం!

.

సేన కదిలేవైపు అనుకూలంగా అనిలుడు వీస్తున్నాడు!

.

పక్షులన్నీ మధురస్వరంతో ధ్వని చేస్తున్నాయి.

.

సూర్యుడు నిర్మలంగా ఉన్నాడు.

.

అనుకూల శకునాలు విజయతీరం చేరుతారు మీరు! 

అచిరకాలంలోనే!

అని పలుకుతున్నట్లుగా ఉన్నాయి!

.

వానరులు దారిలో కనపడిన ప్రతిసరస్సులో స్నానమాడారు 

ప్రతి చెట్టును పట్టుకొని వేళ్ళాడారు

ప్రతి తేనెతుట్టెనూ లేపారు!

.

కలియదిప్పని సరస్సు గాని

విరగ గొట్టని చెట్టుగానీ

రాళ్ళు పడదోయని గిరులు గానీ

ఎగురగొట్టని కొండగానీ

 మిగులలేదు !

.

పిమ్మట వారు మహేంద్ర పర్వత సానువులు సమీపించిరి

.

అక్కడనుండి ప్రళయతరంగ ఘోషలతో ఉన్న అపారపారావారమును కనుగొంటిరి.

.

సుగ్రీవా ! ఇదుగో సముద్రము దీనిని దాటుట ఎట్లా? అని రామచంద్రుడు పలికెను.

.

వూటుకూరు జానకిరామారావు

సరస్వతీదేవికి నమస్కారము

 శ్లోకం:☝️

*యాశ్రితా పావనతయా*

  *యాతనాచ్ఛిదనీచయా |*

*యాచనీయా ధియా మాయా*

  *యా మాయా సంస్తుతా శ్రియా ||*

(సరస్వతీకంఠాభరణము 4-284)


భావం: శుద్ధ జ్ఞాన స్వరూపియు (పరమ పావనియు), నరకాది నీచమైన యాతనలను నాశము చేయునదియు, మాయను (అజ్ఞానమును) నాశమును చేయు ఉన్నతమైన జ్ఞానము (శ్రీవిద్యను) ప్రసాదించేదియు, లక్ష్మిచేత సైతము సంస్తుతింప బడినదియు - అయిన సరస్వతీదేవికి నమస్కారము.🙏 ఈ శ్లోకంలో ప్రతి పాదము *యా* అక్షరముతో మొదలై అంతమవుతుంది.

పంచాంగం 22.09.2023 Friday,

 ఈ రోజు పంచాంగం 22.09.2023 Friday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస శుక్ల పక్ష: సప్తమి తిధి భృగు వాసర: జ్యేష్ఠ నక్షత్రం ఆయుష్మాన్ యోగ: వణిజ తదుపరి భద్ర కరణం ఇది ఈరోజు పంచాంగం 

సప్తమి మధ్యాహ్నం 01:30 వరకు.

జ్యేష్ఠ మధ్యాహ్నం 03:29 వరకు .

సూర్యోదయం : 06:08

సూర్యాస్తమయం : 06:09

వర్జ్యం : ఈ రోజు లేదు.

దుర్ముహూర్తం : పగలు 08:32 నుండి 09:20 వరకు తిరిగి మధ్యాహ్నం 12:33 నుండి 01:21 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 10:30 నుండి 12:00  వరకు.


యమగండం : మద్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.  



శుభోదయ:, నమస్కార:

హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం

 బ్రేకింగ్ న్యూస్: హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా పార్లమెంట్ సాక్షిగా ప్రకటించబోతున్న ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశంలో రెండో రాజధాని హైదరాబాద్ అవతరించబోతుంది ఈ పార్లమెంట్ సెక్షన్లో బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు.  ఆర్మీ అధికారులతో కంటోన్మెంట్ ఏరియాలో కిషన్ రెడ్డి గారు కీలక చర్చలు కొనసాగాయి ఎటువంటి పరిణామాలైనా ఎదురుకోవటానికి ముందు జాగ్రత్త చర్యగా అన్ని సిద్ధం చేసుకుంటున్నారు, హైదరాబాద్ కేంద్రపాలితం మంచి అవకాశం, ఎన్నికలు ఉన్నాయని నరేంద్ర మోడీ గారు భయపడరు ప్రజలకి ఉపయోగకరమైనవి దేశానికి ఉపయోగకరమైనవి పార్లమెంట్ లో బిల్లులు ప్రవేశపెడుతున్నారు చాలా కీలక బిల్లులు రాబోతున్నాయి

శుక్రవారం, సెప్టెంబరు 22, 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


శుక్రవారం, సెప్టెంబరు 22, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

 భాద్రపద మాసం - శుక్ల పక్షం

తిథి:సప్తమి ఉ9.07 వరకు  

వారం:శుక్రవారం (భృగువాసరే)

నక్షత్రం:జ్యేష్ఠ మ12.27 వరకు

యోగం:ఆయుష్మాన్ రా9.51 వరకు

కరణం:వణిజ ఉ9.07 వరకు తదుపరి విష్ఠి రా8.25 వరకు

వర్జ్యం:రా8.12 - 9.45

దుర్ముహూర్తము:ఉ8.16 - 9.05 &

మ12.18 - 1.06

అమృతకాలం:తె5.29నుండి

రాహుకాలం:ఉ10.30 - 12.00

యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30

సూర్యరాశి: కన్య

 చంద్ర రాశి:వృశ్చికం 

సూర్యోదయం:5.52

సూర్యాస్తమయం: 5.56


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

నవగ్రహా పురాణం🪐* . *33వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *33వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*గురుగ్రహ జననం - 4*


తారా బృహస్పతుల దాంపత్య జీవితం ప్రారంభమైంది.


నిర్వికల్పానంద నవగ్రహ పురాణం కథనం కొనసాగిస్తూ ఇలా అన్నాడు. *"గురు గ్రహం అనబడే బృహస్పతి జన్మ వృత్తాంతం ఆలకించారు. ఆ బృహస్పతికి సమకాలికుడూ , సముడూ అయిన శుక్రుడి జన్మ గాథ వినండి.*


*"నవ గ్రహాలలో ఆరవ గ్రహమైన శుక్రుడు బ్రహ్మ మానస పుత్రులలో ప్రముఖుడైన భృగుమహర్షి కుమారుడు. 'శుక్రుడు' అన్నది ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు. ఒక మహత్తరమైన కారణంతో ఆయనకు 'శుక్రుడు' అనే సార్ధక నామధేయం ఏర్పడింది..."* అంటూ ఆగాడు నిర్వికల్పానంద.


*"ఈ రహస్యం మాకు తెలీదు ! శుక్రుడు - 'శుక్రుడే' అనుకుంటున్నాం ! ఆ పేరు రావడానికి కారణం ఏమిటి గురువు గారు ?"* సదానందుడు అడిగాడు.


నిర్వికల్పానంద చిన్నగా నవ్వాడు. *“అంత తొందర ఎందుకు , సదానందా ! శుక్రుడి చరిత్రను సంపూర్ణంగా ఆకర్ణిస్తారు గదా ! ఆ క్రమంలో ఆ 'రహస్యగాథ' తెలుస్తుందిలే ! శుక్రుడి తండ్రి భృగుమహర్షి అని చెప్పాను కదా ! ఆయన భార్య పులోమ. ఆమెను పౌలామి అని కూడా అంటారు. పులోమ అసుర వంశానికి చెందింది. భృగు మహర్షిని వివాహం చేసుకున్నాక , ఆమె గర్భవతి అయింది. మొదటి నుంచీ ఆమె మీద మనసు పడిన రాక్షసుడు (పులోముడు) భృగువు లేని సమయంలో సూకర రూపం ధరించి , పులోమిని అపహరించుకుపోయాడు. ఆ రాక్షసుడు పరిగెడుతున్న సమయంలో నిండు చూలాలైన పులోమకు ప్రసవం జరిగిపోయింది. పురుష శిశివు ఆమె గర్భం లోంచి నేల మీదకు పడిపోయాడు. ఆ శిశువే చ్యవనుడు...”* కథ చెప్తున్న నిర్వికల్పానంద ఆగాడు.


*"చ్యవనుడంటే... సుకన్య భర్త. చ్యవన మహర్షేనా గురువు గారూ ?"* చిదానందుడు అడిగాడు.


*“ఔను... ఆ చ్యవనమహర్షి గాథ అటుంచి ఆ భృగుపత్ని పులోమను గురించి వినండి. ఆమె మహామహిమ కలిగిన వనిత. ఆమోఘమైన తపశ్శక్తి ఆమెది. భృగుపత్నిగా ఆమె అలవరచుకున్న పతిభక్తి ఆమె శక్తిని ఇతోధికంగా పెంచింది. భూపతనమై జన్మించిన చ్యవనుడు తపస్సులో నిమగ్నుడైపోయాడు. తదనంతరం పులోమా , భృగు దంపతులకు 'వజ్రశీర్షుడు', 'శుచి', 'ఔర్వుడు' అనే కుమారులు కలిగారు. అయితే ఆ పుత్రుల సాధారణ మేధోశక్తీ , సాత్వికతా పులోమను సంతోష పెట్టలేక పోయాయి. మహాశక్తి సంపన్నుడూ , కత్తివాదర లాంటి బుద్ధికుశలత కలిగిన వాడూ , కార్యదక్షతా , పట్టుదలా కలిగిన వాడూ , ముఖ్యంగా తాను ఏ కులంలో ఉద్భవించిందో , ఆ అసురకులం పట్ల చెరగని పక్షపాత ధోరణి కలిగినవాడూ అయిన అసాధారణ పుత్రుడు కావాలన్నది పులోమ చిరకాల వాంఛ...”* అంటూ వివరించ సాగేడు నిర్వికల్పానంద.


_*రేపటి నుండి శుక్రగ్రహ జననం ప్రారంభం*_


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-54🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-54🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*తిరుమల కళ్యాణకట్ట:*


ప్రతి ప్రసిద్ధ గుడిలో తలనీలాలు (తల వెండ్రుకలు) ఇచ్చే ప్రదేశాన్ని కళ్యాణకట్ట అంటారు. దీని వెనుక ఒక కథ ఉంది.

ఒక సారి వెంకటేశ్వర స్వామి వారి తల్లి వకుళ మాతకు స్వామి వారి జుట్టు కొంచెం ఊడిపోయి నట్టు అనిపించి స్వామి వారితో చెబుతుంది. అప్పుడు స్వామి అవును అని వకుళ మాతతో అనగా అప్పుడు వకుళ మాత బాధపడకు నాయన నీకు కలియుగాంతం వరకు నీ భక్తులే నీకు వెండ్రుకలు సమర్పిస్తారు అని చెబుతుంది. అందుకే అప్పటినుండి నేటివరకు తిరుమలకు వచ్చిన భక్తులు తలనీలాలు సమర్పించి స్వామి వారి కృపకు పాత్రులు అవుతుంటారు. తలనీలాల మొక్కు లేని వారు కనీసం 5 కత్తెరలు అయిన సమర్పించాలని అంటారు.

శ్రీవారి పాదాల చెంత ఉండే ప్రసిద్ధ నది స్వర్ణముఖి. ఈ నదికి సంబంధించిన పురాణాలు, ఐతిహాసాలు ఎన్నో ఉన్నాయి. అయితే స్వర్ణముఖి నదికి చరిత్రలో ఎంతో గొప్ప స్థానం ఉంది. స్వర్ణముఖి నదికి ఉపనది కల్యాణి నది. కల్యాణి నది ఒడ్డున శ్రీనివాస మంగాపురం ఆలయం వుంది.పూర్వం తిరుమలకు సామూహికంగా మాత్రమే భక్తులు వెళ్ళేవారు. ఇలాంటి పరిస్థితుల్లో కళ్యాణీ నదీ తీరంలో కళ్యాణ కట్టలు వెలిశాయి. యాత్రికులు తమ తలనీలాలను ఈ కళ్యాణకట్టలోనే సమర్పించి కళ్యాణీ నదిలో స్నానం చేసి కళ్యాణ వేంకటేశ్వరుని దర్శించుకునేవారు. కళ్యాణీ నదీ తీరంలో మంగలికట్టలు వెలిశాయి కాబట్టి వారికి కళ్యాణకట్టలు అనే పేరు వచ్చింది. తిరుమలలో మంగలి కట్టలు వెలిశాక శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ కట్టలు అంతరించాయి. అందుకే తిరుమలలోని మంగలి కట్టలకు కళ్యాణ కట్టలు అనే పేరు స్థిరపడింపోయింది. 

 

నీలాద్రి కొండ మీద క్రూర జంతువుల సంచారం ఎక్కువగా వుండడం వల్ల తనకు చాలా యిబ్బందిగా ఉందని నీలాదేవి శ్రీనివాసుకి మొరపెట్టుకుంది. అప్పుడు స్వామి నీలాద్రి మీద క్రూర జంతువులను వేటాడి అలసిపోయి నిద్రిస్తాడు. అలా నిద్రిస్తున్న స్వామివారి సుందర రూపాన్ని నీలాదేవి చూస్తుండగా స్వామివారి నుదుటిపై కొంత భాగం వెంట్రుకలు లేకపోవడాన్ని గమనిస్తుంది. అంతటి మనోహర రూపానికి అతి పెద్ద లోపంగా ఆమె భావిస్తుంది. వెంటనే తన నొసటిపై ఉన్న వెంట్రుకలను శ్రీవారికి అతికిస్తుంది. వెంటనే శ్రీనివాసుడు మేల్కొని చూడగా నీలాదేవి నొసటిపై రక్తం కారుతూ ఉంటుంది. ఆమె భక్తికి సంతోషపడిన స్వామి తన కొండకు వచ్చి భక్తులు తమ తలలాలను సమర్పిస్తారని, అవి నీలాదేవికి చేరుతాయని వరమిచ్చాడట. ఇదే కాక మరెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వేంకటేశ్వరుడు బీబీనాంచారీని పెళ్ళి చేసుకొనేటప్పుడు ఆమెకొక వరం ఇచ్చాడట. ఎగువ తిరుపతికి జుట్టుతో వచ్చేవాళ్ళు తనవారని, గుండు చేయించుకున్నాక ముస్లీంలాగా తిరిగి వెళ్ళే వాళ్ళు నీవాళ్ళని ప్రమపూర్వకంగా మాటిచ్చాడట. 

జానపద విజ్ఞానం ప్రకారం చూస్తే తల వెంట్రుకలు ఎవరికైనా అపూర్వం. తల వెంట్రుకల మీద ఎన్నో జానపద కథలు ఉన్నాయి. మనిషి అందానికి ప్రతీక తల వెంట్రుకలు. తల వెంట్రుకల సౌదర్యం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకునే విధానం జానపదుల్లో కనిపిస్తూ ఉంటుంది. వెంట్రుకలను సంపదతో పోల్చి కేశసంపద అని అంటారు. ఆరోజుల్లో ఎంత పొడవు కురులు ఉంటే అంత విలువ ఉండేది. అందుకే ఆ రోజుల్లో మగవాళ్ళు కూడా జుట్టు పెంచి, పూలను అలంకరించుకునేవాళ్ళు. మనిషి కురుల మీద చూపించే మమకారం మరి దేనిమీదా చూపించడు. అద్దంలో చూసుకున్నా కురులనే చూసుకుంటారు. అంత విలువైన వెలకట్టలేని కురులను శ్రీవారి మీద భక్తితో వాటిని తృణప్రాయంగా భావించి స్వామివారికి సమర్పించడం గొప్ప విషయం. తాము అంద విహీనంగా మారినా ఫరవాలేదు. తమ అందంకన్నా శ్రీవారి భక్తి మిన్న అనే ఆనందంలో తరించాలనే ఉద్దేశ్యంతో స్వామివారికి తలనీలాలను సమర్పిస్తారు. కాలం గడిచేకొద్దీ గుండు గీయించుకోవడం మొక్కుబడిగా మారిపోయింది. మొదట గుండు గీయించుకుని కులదైవానికి సమర్పిస్తారు. ఆ తర్వాత రకరకాల మొక్కుబడులతో తిరుమలకు వచ్చి గుండు గీయించుకోవడం ఆనవాయితీగా మారింది.

మరికొంతమంది కత్తులతో తలలను నరికించుకొని శివునికి 'తలపండు'నూ

 సమర్పించేవాళ్ళు. రెడ్డి రాజుల్లో అనవేమారెడ్డి శ్రీశైలం ఆలయం ముందు ఇలాంటి వారి కోసం వీర శిరోమండపాన్ని నిర్మించాడు. ఆ మండపం ఈనాటికీ చెక్కుచెదరకుండా ఉంది. కొంతమంది చేతులు నరుక్కునేవారు, మరికొంతమది అనేక అవయవాలను సమర్పించేవారు, ఇంకా కొంతమంది తమ వీపులలోని మాంసాన్ని కోసి శివునికి సమర్పించేవాళ్ళు. అలా ఆనాడు తలను పండుగా భావించి, తలను నరికించుకొని దేవునికి సమర్పించేవారు. దానివల్ల శైవులు అయితే కైలాసానికి, వైష్ణవులు అయితే వైకుంఠానికి చేరుకునేవారు. అలాంటి ఆచారం కాలక్రమేణా గుండు గీయించుకోవడం వరకు వచ్చింది. తలకు ప్రధానమైనవి కురులు. కురులను సమర్పిస్తే దేవునికి తలను సమర్పించిన దానితో సమానం. 



*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 46*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 46*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


శ్రీరామకృష్ణులు పరీక్ష:


నరేంద్రుడు దక్షిణేశ్వరానికి వచ్చాడంటే చాలు, శ్రీరామకృష్ణులు  భావపారవశ్య స్థితిలో మగ్నులయ్యేవారు. కాని ఒకసారి ఈ పరిస్థితి తలక్రిందులైంది. నరేంద్రుడు వచ్చినప్పుడల్లా అతణ్ణి పట్టించుకోకుండా, ఎడముఖం పెడ ముఖంగా ఉండిపోయారు శ్రీరామకృష్ణులు;   శ్రీరామకృష్ణులు పారవశ్య స్థితిలో నెలకొని ఉన్నారని నరేంద్రుడు భావించాడు.  నరేంద్రుడు బయటకు వెళ్లగానే శ్రీరామకృష్ణులు తక్కిన వారితో మాట్లాడసాగారు. ఆయన మాటల శబ్దం చెవిన పడగానే నరేంద్రుడు లోపలకు వచ్చి కూర్చున్నాడు. అప్పటికీ ఆయన నరేంద్రునితో మాట్లాడకుండా, ముఖం త్రిప్పుకొని పడుకొన్నారు. ఆ పగలంతా ఇలాగే గడిచింది. సాయంత్రమయినప్పటికీ శ్రీరామకృష్ణుల వైఖరిలో ఎలాంటి మార్పు రాకపోవడం చూసి నరేంద్రుడు ఆయనకు ప్రణమిల్లి కలకత్తా తిరుగు ముఖం పట్టాడు.


నరేంద్రుడు దక్షిణేశ్వరానికి రాకుండా ఇంట్లోనే ఉన్నప్పుడు అతడి క్షేమ సమాచారాలు వాకబు చేయడానికి శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు ఎవరినైనా కలకత్తాకు పంపడం కద్దు. కాని అతడు ప్రత్యక్షంగా వచ్చినప్పుడు మాత్రం అదే ఎడముఖం పెడముఖం. ఈ విధంగా ఒక నెలకు పైగా గడిచింది. నరేంద్రుడు కించిత్తు కూడా కలత చెందకుండా దక్షిణేశ్వరానికి వస్తూవుండడం గమనించిన శ్రీరామకృష్ణులు చివరకు ఒక రోజు అతణ్ణి పిలిచి, "ఏం నాయనా! నేను నీతో ఒక్క మాట కూడా మాట్లాడలేదే! అయినప్పటికీ నువ్వెందుకు వస్తూనే ఉన్నావు?” అని అడిగారు. 


అందుకు నరేంద్రుడు, “మీ మాటలు వినడానికా వస్తున్నాను? నేను మిమ్మల్ని అభిమానిస్తున్నాను. మిమ్మల్ని చూడాలని అనిపిస్తుంది. అందుకే వస్తున్నాను" అని జవాబిచ్చాడు. ఆ మాటలు విన్న శ్రీరామకృష్ణులు పరమానంద భరితులై, “నా ప్రేమానురాగాలు లభించకపోతే, నువ్వు ఇక్కడకు రావడం మానుకొంటావేమోనని నిన్ను పరీక్షించి చూశాను. నీ లాంటి దృఢచిత్తులే ఇంత అవమానాన్నీ, చిన్నబుచ్చడాన్నీ దిగమింగుకోగలరు. మరొకరైతే ఎప్పుడో పలాయనం చిత్తగించేవాడు, ఈ వైపు కన్నెత్తి కూడా చూసి ఉండడు" అన్నారు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🪷🙏🏻* *శ్లోకం - 29*

 *🙏🏻🪷సౌందర్యలహరి🪷🙏🏻*


*శ్లోకం - 29*


  *కిరీటం వైరించం పరిహర పురః కైటభ భిదః*

          *కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటమ్ |*

          *ప్రణమ్రేష్వేతేషు ప్రసభముపయాతస్య భవనం*

          *భవస్యభ్యుత్థానే తవ పరిజనోక్తి ర్విజయతే ||*


ప్రసభముపయాతస్య భవనం =  అమ్మవారు తన నివాసమైన చింతామణి గృహంలో సభ తీర్చి యుండగా పరమేశ్వరుడు అక్కడికి విచ్చేస్తున్నారన్న సమాచారం అందుకొని ఆవిడ ఒక్కసారిగా *అభ్యుత్థానే* లేచారట.ఆయనకు ఆహ్వానము పలకటానికి


పరిజనోక్తి ర్విజయతే =  పరిజనులు జయజయ ధ్వానాలు చేస్తూండగా. దేవతలందరూ ఆమెకు సాగిలపడి ప్రణమిల్లుతున్నారట.


ఆ పరిజనులు చెపుతున్నారట అమ్మ ఇది బ్రహ్మదేవుని కిరీటము, ఇది దేవేంద్రుని కిరీటము, ఇది విష్ణువు కిరీటము అని చెప్తూ వారి శిరసులు కనబడటం లేదు, కిరీటాలతో సహా నేలవాల్చి వున్నాయి.


కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటమ్ = కఠినమైన ఆ కిరీటములు అమ్మవారి పాదములకు తగిలి నొప్పివస్తాయేమోనని హెచ్చరికగా చెపుతున్నారట ఆ పరిజనులు.


ఇక్కడ అమ్మవారి పాతివ్రత్యము మాత్రమే కాక ఆమె దేవాధిదేవత అనే విషయం కూడా ప్రస్తుతిస్తున్నారు.


ఇందులో ముఖ్యమైన అంతరార్థం మరొకటి వుంది.

అమ్మవారు చిచ్ఛక్తిగా మూలాధారం నుండి సహస్రారము వరకు తిరిగి వెనుకకు మేరుదండము నందు ప్రయాణిస్తున్నది. అట్టి పరదేవత సహస్రారములోని పరమశివుని చూచుటకు మూలాధారము నుండి బయలుదేరి క్రమముగా బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి మొదలుగా కల షట్చక్రములను దాటి సహస్రారమును చేరుతుంది. ఈ చక్రములను గ్రంథులనూ నియంత్రించే బ్రహ్మ, విష్ణు, రుద్రాదులే కాక వీరి అనుచరగణమైన 33 కోట్ల దేవతలు శరీరములో వివిధ స్థానాల్లో నిక్షిప్తమై ఉంటారు.


ఒక్కొక్క గ్రంథి విభేదనం జరిగినప్పుడు సాధకుడికి ఆ గ్రంథికి,ఆ చక్రాధిదేవతకు సంబంధించిన శక్తులు లభిస్తాయి. మోక్షగామి అయిన నిజమైన సాధకుడు ఈ సిద్ధుల వైపు చూడకుండా అమ్మవారు దేవతల కిరీటముల వంక చూడనట్లు తన ప్రయాణాన్ని ఊర్ధ్వగతిగా సాగిస్తాడు. పొరపాటున సిద్ధులకు ఆకర్షింపబడి వాటిని ఉపయోగించటం మొదలుపెడితే, అతడి సాధన భంగపడినట్లే.


ఈ కుండలినీ ప్రయాణంలో శరీరం పతనమైతే ఏ దేవత సిద్ధి అప్పటికి పొందివుంటాడో  ఆ దేవత లోకానికి చేరుతాడు. (ఇంద్ర, బ్రహ్మ, విష్ణు లోకములు మున్నగునవి).


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

ఘనత

 మన పూర్వీకులు ఘనత.....


చదరంగం ప్రియుడయిన ఒక రాజు వద్దకు ఒక వేద పండితుడు వచ్చాడు.ఆ పండితుడు అతన్ని ఒక ఘనపనస చదివి ఆశీర్వదించాడు.

అప్పుడు ఆ రాజుగారు "ఏమయ్యా! పండితా! ఈ వేదపనసలు ఎవరైనా నేర్చుకుని చదవవచ్చు!

చదరంగం ఆడడానికి సహజమైన తెలివి కావాలి. నాతో కేవలం ఒక 20 ఎత్తులు పూర్తయ్యే వరకు ఆడి నిలువు! అప్పుడు నువ్వడిగిన కోరికను నెరవేర్చుతాను." అన్నాడు.

అప్పుడు ఆ పండితుడు "రాజా! నాకు చదరంగం వస్తుందని కాదు గానీ, మిమ్ములను సంతోషపరచడానికి ఆడతాను" అంటూ రాజుతో చదరంగం ఆడి 20 ఎత్తులు పూర్తయ్యే వరకు నిలిచాడు.

రాజు గారూ ఆటను చివరి వరకూ కొనసాగిద్దాం! అన్నాడు.కానీ ఆ పండితుడు "రాజా! ఆటను ఇక్కడితో ఆపడం నాకు క్షేమమూ - గౌరవం కూడా!

రాజు గారితో 20 ఎత్తుల వరకు ఆడగలిగాను అని గొప్పగా చెప్పుకోవచ్చు! " అంటూ సున్నితంగా తిరస్కరించాడు.

"సరే! పండితా! నీ తెలివిని గుర్తించాను. మాట ఇచ్చినట్లుగా నీ కోరిక నేరవేర్చుతాను.చెప్పు! " అన్నాడు రాజుగారు.

మహారాజా! చదరంగంలో 64 గడులు ఉంటాయి కదా!

ఒక గడిలో ఒక గింజ -

రెండవ గడికి అంతకు రెట్టింపు రెండు గింజలు -

మూడవ గడికి మళ్లి రెట్టింపు 4 గింజలు -

నాలుగవ గడికి మళ్లి రెట్టింపు 8 గింజలు -

.... ఇలా 64 గడులకు లెక్క వేసి ఆ ధాన్యాన్ని పంపండి చాలు! అదే మహాప్రసాదం." అంటూ ఆ పండితుడు వెళ్లిపోయాడు.

రాజు సరే ! అని ఆ పని మంత్రికి పురమాయించాడు.

ఆ పండితుని వెంట మంత్రి గారు కూడా వెళ్లి తన ఆస్థాన గణికులతో ఎంత ధాన్యం అవుతుందో విచారించాడు.

తిరిగి వచ్చిన మంత్రితో రాజుగారు "పండితుడడిగాడు కదా .. మొదటి గడిలో ఒక ధాన్యపు గింజ.. రెండవ గడిలో దానికి రెట్టింపు రెండు.. మూడవగడిలో దానికి రెట్టింపు నాలుగు.. తర్వాత8 గింజలు, ఐదవ గడిలో 16 గింజలు..

‘అయితే ఏముంది.. చదరంగంలో ఉన్నదంతా 64 గళ్లేగా.. ఇచ్చుకోవలసిందేమో గడికీ గడికీ రెట్టింపు.. వెఱ్ఱి పండితుడు.. గింజలకు గింజలు రెట్టింపు చేసుకు పోయినా ఎన్నివస్తాయి..? ఏదేనా మంచి అగ్రహారం కోరుకుని ఉండాల్సింది..’

‘అలా తీసెయ్యకండి మహారాజా !.. ఆ పండితుడేమీ వెర్రిబాగులవాడు కాదు.. ’

‘ఎందుచేత..?’ అన్నాడు రాజుగారు.

‘లెక్క కట్టి చూసుకుంటే.. ఆ పండితుడడిగిన ధాన్యపు గింజలు ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు కనుక..!’

‘ఎందుకు..? ఆశ్చర్యపోతూ అడిగాడు మహారాజు

ఎన్ని ధాన్యపు గింజలో మన గణికులు గంటలకొద్ది లెక్కించి చెప్పిన సంఖ్యను ఆ పండితుడు వేదగణితం ద్వారా క్షణంలో చెప్పేసాడు మహారాజా ! అంతే కాదు దాన్ని సులువుగా గుర్తుంచుకునే విధంగా ఆశువుగా ఒక చంపకమాల పద్యం కూడా చెప్పాడు.

‘అలాగా.. ఏమిటా పద్యం..?’

‘ఇదుగో.. వినండి మహారాజా !’

శర శశి షట్క చంద్ర శర

సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ

ధర గగనాబ్ధి వేద గిరి

తర్క పయోనిధి పద్మజాస్య కుం

జర తుహినాంశు సంఖ్యకు ని

జంబగు తచ్చతురంగ గేహ వి

స్తర మగు రెట్టికగు

సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్

పద్యం విన్న మహారాజు ‘దీన్లో తేలిన లెక్కెక్కడుంది..? అంతా బాణాలూ, చంద్రులూ, ఆకాశం, అంబుధి,కొండలు తప్ప..’

‘అదే మహారాజా ! మనదేశ పండితుల మేధ.. సంక్షిప్తంగా అల్పాక్షరములతో అనల్పార్థసాధకంగా ప్రజ్వరిల్లిన మేధాశక్తి అది..’

‘సరే… సరే.. విప్పి చెప్పు..’

‘ఈ పద్యంలో లెక్కచిక్కు విడిపోవాలంటే మనపూర్వుల సంఖ్యాగణన పద్ధతి తెలియాలి.. వారు ఒక్కొక్క అంకెకు విశ్వంలో విరాజిల్లే ప్రకృతిశక్తులను సంకేతాలుగా ఏర్పాటు చేసుకున్నారు..

ఈ పద్యంలో

శర, సాయక, - అనే పదాలకు అర్థం బాణాలు అని .( మన్మథుని పంచసాయకములు) ఇక్కడ ఆ రెండు పదాలు 5 సంఖ్యను సూచిస్తాయి.

గగన, వియత్ - 0

(ఆకాశం గగనం శూన్యం)

శశి, చంద్ర, తుహినాంశు -1

(చంద్రుడొకడే భూమికి )

షట్కము - 6

రంధ్ర - 9

(నవరంధ్రాలు)

నగ, గిరి, భూధర - 7

అగ్ని - 3

(మూడగ్నులు; గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని,ఆహవనీయాగ్ని)

అబ్ధి, పయోనిధి - 4

వేద -4

(చతుర్వేదములు)

తర్క - 6

( షట్ తర్కప్రమాణాలు, ‘ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన,శబ్ద, అర్థాపత్తి, అనుపలబ్ధి’)

పద్మజాస్య - 4

(పద్మజుడు బ్రహ్మ, చతుర్ముఖుడు)

కుంజర - 8

(అష్ట దిగ్గజములు)

ఇవీ ఇందులోని అంకెలసంకేతాలు.. ఇప్పుడు ఇవి ఆయా పదాల దగ్గర పెట్టుకుని చూస్తే..’

శర శశి షట్క చంద్ర శర

5 1 6 1 5

సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ

5 9 0 7 3

ధర గగనాబ్ధి వేద గిరి

7 0 4 4 7

తర్క పయోనిధి పద్మజాస్య కుం

6 4 4

జర తుహినాంశు సంఖ్యకు ని

8 1

జంబగు తచ్చతురంగ గేహ వి

స్తర మగు రెట్టికగు సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్

అంకెలు లెక్కించెటప్పుడు మనపూర్వీకుల సాంప్రదాయ సూత్రం .. ‘అంకానాం వామతో గతిః’ -

కుడినుంచి ఎడమకు చేర్చి చదువుకోవాలి..

అలా చేస్తే చివరగా తేలిన సంఖ్య.

1,84,46,74,40,73,70,95,51,615

ఒకకోటి 84లక్షల 46వేల 74కోట్ల 40 లక్షల73 వేల 70కోట్ల 95 లక్షల 51వేల 615

ఇంత పెద్ద సంఖ్యను పిలవడమే కష్టం.ఇక ఇంతోటి ధాన్యాన్ని నిలవచేయాలి అంటే,

ఒక ఘనమీటరు విస్తృతిగల గాదెలో దాదాపు ఒకటిన్నర కోటి గింజలు దాచవచ్చు అని అంచనా వేసుకుంటే,

4మీటర్ల ఎత్తు 10 మీటర్ల నిడివిగల గాదెలు దాదాపుగా 12,000 ఘనకిలోమీటర్లు విస్తీర్ణం కావాలి..

పేర్చుకుంటూ వెళితే 300,000,000-ముప్పై కోట్ల కిలోమీటర్లు.. అంటే భూమికి సూర్యునికి ఉన్నదూరానికి రెట్టింపు.

పోనీ లెక్కపెట్టడానికి ఎంత సమయం పడుతుందో అంటే

సెకనుకు ఒక్కగింజగా లెక్కించితే అన్నీ లెక్కించటానికయ్యేవి 58,495 కోట్ల సంవత్సరాలు..

అదీ సంగతి…

వేదపండితులతో వేళాకోళం తగదు మహారాజా !…నిజానికి అతడు చదివిన గణపనస కూడా లెక్కలకు ,ధారణ శక్తికి సంబంధించినదే ! ఎంతో ధారణ శక్తి - పాండిత్యం - సాధన ఉంటేకానీ ఘనాపాటి కాలేరు. అతడు ప్రేమగా ఆశీర్వదించడానికి వస్తే అతని వేదవిద్యను కించపరిచారు. ఇప్పుడు ఏం చేయడం ? మాట తప్పిన దోషం సంక్రమిస్తుంది .

అది విన్న మహారాజు సిగ్గుపడ్డాడు. అతని పూర్వీకులనుండి ఎవ్వరు కూడా ఇప్పటివరకు మాట తప్పలేదు.

ఏం చేసి ఈ దోషం నుండి తప్పించుకోవలో ఆ పండితుడినే అడుగుదాము. అని ఆ పండితున్ని పిలిపించి క్షమించుమంటూ వాగ్దాన భంగ దోషం అంటకుండా ఏం చేయాలో చెప్పుమన్నాడు .

ఆ పండితుడు" రాజా ! ఈ లోకంలో ఆవుకు విలువ కట్టలేము. ధాన్యం బదులుగా అవును ఇవ్వండి చాలు !" అని ఆ రాజును వాగ్దాన భంగ దోషం నుండి తప్పించాడు.


సేకరణ

⚜ శ్రీ చంద్రహాసిని దేవి మందిర్

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🕉 మన గుడి : నెం 185




⚜ ఛత్తీస్‌గఢ్ : చంద్రపూర్


⚜ శ్రీ చంద్రహాసిని దేవి మందిర్ 


💠 ఛత్తీస్‌గఢ్‌లో అనేక అందమైన సహజ ప్రదేశాలు ఉన్నాయి, వాటిలో ఒకటి చంద్రపూర్‌లో ఉన్న చంద్రహాసిని ఆలయం. 

చంద్రహాసిని దేవి ఆలయం జంజ్‌గిర్-చంపా జిల్లాలోని చంద్రపూర్‌లో ఉంది.  

మహానది ఒడ్డున ఉన్న సిద్ధపీఠం 

మా చంద్రహాసిని పేరుతో ప్రసిద్ధి చెందింది. 


💠 ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న శక్తి పీఠాలలో ఇది ఒకటి.  సతీదేవి అవయవాలు ఇక్కడ పడ్డాయని నమ్ముతారు. 

ఆమె చంద్రుని ఆకారపు లక్షణాల కారణంగా ఆమెను చంద్రహాసిని మరియు చంద్రసేని మా అని పిలుస్తారు.  చంద్రాకారంలో ఉన్న మాత చంద్రసేని విగ్రహాన్ని దర్శిస్తే చాలు భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి.



⚜ పురాణ కథనం ⚜


💠 పురాణాల ప్రకారం, శివుడు దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవిని ఆమె తండ్రి ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకున్నాడు.  

కూతురి పెళ్లి వార్త విని దక్షుడికి కోపం వచ్చింది.  ఒక యాగం చేయడం ద్వారా శివుని పరువు తీయాలని ప్లాన్ చేశాడు.  దక్షుని అల్లుడు శివుడు మరియు అతని కుమార్తె సతీదేవి తప్ప మిగిలిన దేవతలందరూ ఆహ్వానించబడ్డారు.  సతీ, తన తండ్రి యాగం గురించి సమాచారం తెలుసుకున్న తరువాత, తన భర్తను పాల్గొనమని అభ్యర్థించింది.  ఆహ్వానం లేనందున ఈ యజ్ఞానికి హాజరుకావద్దని సతీదేవిని శివుడు కోరాడు.  

శివునికి అనేక అభ్యర్థనల తరువాత, సతీదేవి యాగానికి హాజరయ్యేందుకు అనుమతించబడింది.  

సతీ తన పూర్వీకుల ఇంటికి చేరుకుని, శివునికి అవిధేయత చూపవద్దని తన తండ్రిని కోరింది.  సందర్శకుల ముందు దక్షుడు సతీదేవిని అవమానించాడు.  

కోపోద్రిక్తుడైన సతీ యోగ అగ్నిలో ఆత్మాహుతి చేసుకుంది.  సతీ దహనం తర్వాత కూడా దక్షుడు యాగాన్ని కొనసాగించాడు.


💠 సతీదేవి మరణవార్త తెలుసుకున్న శివుడు దక్షుడిని చంపమని వీరభద్రుడిని కోరాడు.  వీరభద్రుడు, కాలుడు మరియు ఇతర శివగణాలు యాగాన్ని ధ్వంసం చేసి దక్షుడిని చంపారు.  సతీదేవి దేహాన్ని సేకరించిన తర్వాత శివుడు ప్రళయ్ తాండవం చేశాడు.  

విశ్వం యొక్క నాశనాన్ని నిరోధించడానికి, విష్ణువు తన చక్రాన్ని పంపి, సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేసాడు.

భారత ఉపఖండం అంతటా చెల్లాచెదురుగా ఉన్న శరీర ముక్కలు పవిత్ర శక్తి పీఠంగా మారాయి.  సతీదేవి శరీర భాగాలు కూడా ఇక్కడ పడిపోయాయని నమ్ముతారు.  ఇక్కడ మహానది ఒడ్డున ఉన్న చంద్రాపూర్‌లో మాతా సతీ విగ్రహం పడిపోయిందని, ఆ తర్వాత ఇక్కడ సిద్ధ పీఠాన్ని నిర్మించారని చెబుతారు.


💠 చంద్రహాసినీ దేవి సుర్గుజా నుండి బయలుదేరి ఉదయపూర్ మరియు రాయ్‌గఢ్ మీదుగా మహానది ఒడ్డున చంద్రాపూర్‌కు ప్రయాణించిందని చెబుతారు.  మహానది పవిత్ర చల్లని ప్రవాహానికి ముగ్ధులై మాతా రాణి విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించింది.  

దీని తర్వాత ఆమెకు నిద్ర పట్టేసింది.

ఏళ్లు గడిచినా నిద్ర లేవలేదు.  

ఒకసారి సంబల్పూర్ రాజు ఊరేగింపు ఇక్కడి గుండా వెళ్ళింది.  అనుకోకుండా అతని పాదాలు తాకడంతో చంద్రసేని దేవి గాయపడింది, దాని కారణంగా ఆమె మేల్కొన్నారు. అప్పుడు ఒకరోజు దేవత అతనికి కలలో కనిపించి, ఆలయాన్ని నిర్మించి అక్కడ విగ్రహాన్ని ప్రతిష్టించమని కోరింది.  


💠 ప్రతి సంవత్సరం చైత్ర నవరాత్రుల సందర్భంగా, చంద్రాపూర్‌లోని సిద్ధ శక్తిపీఠం మా చంద్రహాసిని దేవి ఆలయంలో మహా హారతితో పాటు 108 దీపాలను పూజిస్తారు.

సకల సిద్ధి ప్రదాత అయిన చంద్రహాసిని మాతను పూజించే ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుతాయి.  నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు పాదరక్షలు లేకుండా అమ్మవారి ఆస్థానానికి చేరుకుని ఆశీస్సులను పొందుతారు.


💠 నవరాత్రి పండుగ (దసరా) సమయంలో ఈ ఆలయాన్ని సందర్శించడానికి వేలాది మంది భక్తులు వస్తారు.  నవరాత్రి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు, ఇందులో ఒరిస్సా నలుమూలల నుండి మరియు వెలుపల నుండి భక్తులు వచ్చి ఈ పండుగలో పాల్గొంటారు.


💠 ఆలయ ప్రాంగణంలో, అర్ధనారీశ్వరుడు, మహాబలసాలి పవన్ పుత్ర హనుమ, కృష్ణ లీలలు, గోపికా వస్త్రపహరణ, మహిషాసుర వధ, చార్ ధామ్, నవగ్రహ, శేషనాగ్  మరియు ఇతర దేవతల యొక్క విగ్రహాలు కనిపిస్తాయి. 


💠 చంద్రహాసిని ఆలయానికి కొద్ది దూరంలో మహానది మధ్యలో మా నాథల్డై ఆలయం ఉంది.  వర్షాకాలంలో మహానది నీటితో నిండినా మా నాథాలడై ఆలయం మునిగిపోదని చెబుతారు.

ఈ ఆలయంలో ఏడాది పొడవునా భక్తుల రద్దీ నిరంతరం ఉంటుంది.  మీరు ఎప్పుడైనా ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు, సంవత్సరంలో రెండు నవరాత్రి ఉత్సవాలలోనూ ఒక వేరే రకమైన వాతావరణం ఉంటుంది, కాబట్టి మీరు నవరాత్రి సమయంలో వెళితే, మీరు విభిన్న వాతావరణాన్ని చూడవచ్చు.


💠 పూర్వం ఇక్కడ బలి ఆచారం ప్రబలంగా ఉండేది కానీ కాలక్రమేణా అది నిషేధించబడింది కానీ ఈనాటికి కూడా చాలా మంది భక్తులు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి ఇక్కడ మేకలు మరియు కోళ్లను బలి ఇస్తారు


💠  మా చంద్రహాసిని దర్శనం తర్వాత మాత నాతాల్డై దర్శనం కూడా తప్పనిసరి, లేకుంటే తల్లికి కోపం వస్తుంది అని ఇక్కడి వారి నమ్మకం.


💠 చంపా నుండి 120 కి.మీ , మరియు ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ నుండి 221 కి.మీ.ల దూరంలో ఉంది.


*సేకరణ:- శ్రీ శర్మద గారి పోస్టు.*