21, ఏప్రిల్ 2025, సోమవారం

ఏంటమ్మా ఇది..

 🙏ఏంటమ్మా ఇది..

    ఎప్పుడూ ఆ ఆదిశంకరుడు, కాళిదాసు, మూకశంకరులేనా!

    కొంచెం మావైపు కూడా చూడొచ్చు కదా!

   “ఏమిట్రా నీ గోల! నేను మీవైపు చూడకుండానే మీరంతా పెద్దాళ్ళైపోతున్నార్రా!” అని ఉరమకు.

    చూడటం అంటే అలా ఇలా చూడమని కాదు.

    పామరుడిని మహాకవిని చేయడానికీ, మూగవాడితో అయిదొందల పద్యాలు చెప్పించడానికీ, నువ్వొక చూపు చూశావే! అదీ, ఆ చూపూ చూడాలి.

    అమ్మా! అవడానికి అక్షరాలను పుట్టించింది మీ ఆయనే అయినా, నీ చూపు పడకపోతే అవి కదలనే కదలవేంటమ్మా!

     ఆమాట కొస్తే, సర్వేశ్వరుడైన నీ మగడే, నీ అనుమతి లేనిదే ఏ పనీ చేయడు.

     అప్పట్లో హాలాహలం పుట్టి లోకాలను దహించి వేస్తుంటే..

    పాపం ఆ దేవతలంతా మీ ఇంటిముందు బారులు తీరి.. “కుయ్యో! మొర్రో! విను; మాలింపుము; చిత్తగింపుము; దయన్ వీక్షింపు” అని ఏడుపులు, పెడబొబ్బలూ పెడుతుంటే..,

    అప్పుడు కూడా అంతటి ఆ భోళాశంకరుడూ, వెళ్ళిరానా? అన్నట్టు నీవైపు చూశాడు.

   “పాపం మీ అన్నయ్య ఒక్కడే అక్కడ కష్టపడుతున్నాడు. నేను వెళ్ళి ఈ హాలాహలం సంగతేదో చూస్తే, అతను పొంగిపోతాడు” అంటూ నీ పుట్టింటి వారి మాటలు చెప్పి మరీ, నిన్ను ఒప్పించి బయల్దేరాల్సి వచ్చింది.

    మరి నువ్వు భర్తను కొంగున ముడేసుకున్న *“స్వాధీనవల్లభ”* వు కదా!

    పుట్టింటివాళ్ళ పేరు చెబితే పొంగిపోతావన్న మాట నిజమే కానీ, వాళ్ళైనా మీ ఆయన గురించి, ఒక చిన్నమాట తప్పుగా అన్నా, కళ్ళెర్ర జేస్తావు. అసలే నువ్వు *సదాశివపతివ్రతవు*.

    *కామేశ బద్ధ మాంగల్య సూత్రశోభిత కంధరవు.*

     మీ నాన్న దక్షుడు నీ మగని కోసం నానా మాటలు అంటే, ఆ తరువాత ఏం జరిగిందో మాకు తెలియనిదా!

    మీ ఆయనకు కూడా నీవంటే ఎంత ప్రేమో కదా! నువ్వు నవ్వితే ఉబ్బితబ్బిబ్బైపోతాడు ఆ కామారి.

   మరి *“మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశమానసా”* అని ఊరికే అన్నారా ఆ వసిన్యాది దేవతలు.

    నీ నవ్వులో ఉన్న మధురిమముందు ఆ చదువుల తల్లి వీణానాదమే వెలవెల బోయిందటగా. *“నిజసల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్ఛపీ”* అని వాళ్ళువీళ్ళూ చెప్పుకుంటుంటే ఈ విషయం తెలిసింది.

    మా ఆది శంకరులు కూడా సౌందర్య లహరిలో *“విపంచ్యా గాయంతీ వివిధమపదానం పశుపతేః.. ”* అంటూ మొదలయ్యే ఓ శ్లోకంలో ఈ విషయాన్నే చెప్పారు.

    సరస్వతీ దేవి నీ దగ్గర కూర్చొని, మీ ఆయన లీలలను తన వీణ కచ్ఛపిపై గానం చేస్తోందట. నువ్వేమో పొంగిపోయి, “భలే పాడుతున్నావ్!” అన్నావట. అసలు నీ మాటలలో ఉన్న మాధుర్యం ముందు నా వీణానాదం మరీ తీసికట్టుగా ఉందనుకుంటూ, ఆవిడా గభాలున ఆ వీణను మూటకట్టేసిందట.

    ఇక్కడ ఇంకొక విషయం.. మీ ఆయనన్నా, మీ ఆయనను కీర్తించేవారన్నా నీకు ఎంతిష్టమో కదా!

*“ఓ మహా కామేశ మహిషీ”* అని పిలిస్తే చాలు పొంగిపోతావ్. అవున్లే అసలు ఉన్నదంటూ మీ ఇద్దరే కదా!

    ఈ సృష్టి మొత్తం లయం చేసేసి, నీ మగడు ఆనంద తాడవం చేస్తుంటే.. అసలు పోలికే లేనంత అందమైన చుబుకం గల *“అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా”* వైన నువ్వు, నీ పల్లవముల వంటి అందమైన చేతులను అలా ఆ చుబుకం కింద పెట్టుకుని, ఆ తాండవాన్ని చూసి పరవశించిపోతూ.. *“మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి”గా* ఉన్నావు.

    నువ్వసలే *“లాస్యప్రియ”వు* కూడానాయే.

   ఎంతటి *“మహాలావణ్య శేవధి”వి*. *“ఆబ్రహ్మకీటజనని”వి* అయినా,

    నీకు మీ ఆయన తొడమీద కూర్చుని, *“శివకామేశ్వరాంకస్థా”* అని అనిపించుకోవడమే ఇష్టం. 

    అందుకే మా కాళిదాసు

*"వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే*

*జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ”* అంటూ మీ ఇద్దరి అభేదాన్ని చూపిస్తూ, నమస్కరించుకున్నాడు.

  అసలు మా కాళిదాసు నీపై వ్రాసిన *“దేవీ అశ్వధాటి”* స్తోత్రం చదివితే తెలుస్తుందమ్మా! మా కవుల కవిత్వంలోని సొగసు.

    సంగీతం ఏమాత్రం రానివాడికి కూడా తనకు సంగీతం వచ్చేసునేమో అన్న భ్రమకలిగించేంత అందంగా ఉంటుందా శ్లోకాల నడక.


*చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవన వాటీషు నాకి పటలీ*

*కోటీర చారుతర కోటీ మణీ కిరణ కోటీ కరంబిత పదా*

*పాటీరగంధి కుచశాటీ కవిత్వ పరిపాటీ మగాధిప సుతా*

*ఘోటీఖురా దధికధాటీ ముదార ముఖ వీటీరసేన తనుతామ్*


    ఆహా! మొదటి శ్లోకమే ఎంత అందంగా ఉందో చూశావా?

    ఇలాంటివి 13 శ్లోకాలున్నాయి ఆ స్తోత్రంలో. ఈ శ్లోకాలలో కూడా ఒకచోట నీకు మీ ఆయన మీద ఉన్న ప్రేమను రసవత్తరంగా చెప్పాడు కాళిదాసు.

   *“శంభా వుదార పరిరంభాంకుర త్పులక దంభానురాగ పిశునా..”* అంటాడు.

    మీ ఆయన నిన్ను గాఢంగా ఆలిగనం చేసుకున్నప్పుడు నీకు కలిగే పులకరింతలు నీకా పరమేశ్వరునిపై ఉన్న అపారమైన అనురాగానికి సూచికలట.

    మీ ఆయన కోసమే చెప్పుకుంటూ కూర్చుంటే నీకూ, నాకూ ఇద్దరికీ ఇక ఈ లోకం పట్టదు.

    కనుక కాసేపు వేరే విషయాలు కూడా మాట్లాడుకుందాం.


    అమ్మా! అసలు మీ అన్న దశావతారాలను అలా నీ చేతివేళ్ళ గోళ్ళలో నుండి అలా ఎలా పుట్టించేశావమ్మా! చిత్రం కాకపోతేను.

   *“కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః”* అన్న మాట తలచుకుంటేనే భలేగా ఉంటుంది. ఇక్కడే ఇంకొక్క విషయం చెప్పాలి. మళ్ళీ మరచిపోతానేమో!

   *“సాగరమేఖలా”* అనే నీ పేరు కూడా నాకెంత ఇష్టమో! 

     సముద్రాన్నే వడ్డాణంగా పెట్టుకున్న దానివంటకదా! ఎంత బావుంటుందో తెలుసా ఈ మాట.

     ఈ నీ నామాన్నే మా ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు

   *“తేనెలతేటల మాటలతో, మన దేశ మాతనే కొలిచెదమా..”* అనే ఓ చక్కని గీతంలో అందంగా వాడారు.

  *“సాగర మేఖల చుట్టుకొని - సురగంగ చీరగా మలచుకొని”* అంటూ నీ నామాన్ని దేశమాతకు అన్వయిస్తూ వ్రాశారు.

    అసలు మా సినీ కవులు కూడా నీమీద పాట రాయాల్సిన సందర్భం వచ్చినప్పుడు చెలరేగిపోతారు.

    ముందుగా మాత్రం నేను మా మల్లాది రామకృష్ణశాస్త్రి గారినే చెబుతాను.

*“లలిత భావ నిలయ నవ రసానంద హృదయ*

*విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ*

*మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ*

*సుమరదన విధువదన.. దేవి…”* అంటూ ఆయన వ్రాస్తే,

    ఆ సాహిత్యానికి మా ఘంటశాల వేంకటేశ్వర్రావు గారు బాణీ కట్టారు.

    మల్లాది వారి సూచన మేరకు, ఈ పాటలో

    సరస్వతీ దేవి కోసం వచ్చినప్పుడు సరస్వతి రాగంలో,

     శ్రీదేవి కోసం వచ్చినప్పుడు శ్రీరాగంలో,

     లలితాదేవి కోసం వచ్చినప్పుడు లలితరాగంలో స్వరరచన చేశారు మా ఘంటశాల.

     ఇలాంటి పాట వింటూ నాలాంటి పామరుడే పులకించిపోతుంటే..

   *“కావ్యాలాప వినోదిని”వి,*

  *“రసజ్ఞ”వు.* *“కావ్యకాళా”* రూపిణివి అయిన నీవెంత మురిసిపోతుంటావో కదా!

    ఆయనే వ్రాసిన *“శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా”* పాట కూడా మరో మేలిమి ముత్యం!

   *“జగముల చిరునగవుల పరిపాలించే జననీ*

    *అనయము మము కనికరమున కాపాడే జననీ”* అంటూ..

   *“అనేకకోటిబ్రహ్మాండజనని”* వైన నిన్ను కీర్తిస్తూ..

   *“మనసే నీ వశమై స్మరణే జీవనమై*

    *మాయని వరమీయవె పరమేశ్వరి మంగళనాయకి”* అంటూ మా అందరి తరపునా ఆయనే ప్రార్థించేశారు.

    ఇక సముద్రాలగారి *“జననీ శివకామినీ..”*, పింగళిగారి *“శివశంకరీ..”* పాటలు కూడా మమ్మల్ని ఆనందడోలికల్లో మునకలేయించేవే.

    మా వేటూరి గారి సంగతైతే చెప్పనక్కరనే లేదు.

*“అఖిలాండేశ్వరి చాముండేశ్వరి*

*పాలయమాం గౌరీ* *పరిపాలయమాం గౌరీ”* అంటూ మొదలయ్యే ఆ పాట, కాళిదాసు కవిత్వంలా సొగసుగా పరుగులు తీస్తుంది.

*“శుభగాత్రి గిరిరాజపుత్రి* 

*అభినేత్రి శర్వార్ధ గాత్రి*

*సర్వార్థ సంధాత్రి*

*జగదేక జనయిత్రి”* ఇలా అద్భుతంతా సాగిపోతుందా పాట.

    మీ ఆయన అయిన శర్వునిలో నీవు సగభాగం కాబట్టి *శర్వార్ధ గాత్రి* అన్నారు. గాత్రము అంటే శరీరం అనే అర్థం ఉంది కదా! అలానే సర్వ కార్యసిద్ధిని ఇచ్చుదానవు కనుక *సర్వార్థ సంధాత్రి* అన్నారు. అసలు శర్వార్థ, సర్వార్థ అనే పదాలు వినడానికి కొంచెం ఒకేలా ఉన్నా, ఎంతటి భేదం ఉందో కదా వాటి మధ్య. అదీ మరి మా వేటూరంటే!

    అదీ నీ కరుణ ప్రసరించిన వారి కవిత్వమంటే.

    ఈరోజు నీతో ఇలా ఏవోవో చెప్పేస్తున్నాను.

    అప్పట్లో శివరాత్రికి మీ ఆయనకోసం,

    శ్రీరామనవమికి మీ అన్నయ్యకోసం రెండుత్తరాలు వ్రాశాను.

    వాళ్ళకు వ్రాసి, మీ అందరికీ తల్లినైన నాకు మాత్రం వ్రాయవా అంటావమోనని ఈ మాటలన్నీ అరచి మరీ చెబుతున్నాను. వింటున్నావు కదా!

    ఇక్కడ వంటింట్లో పని చేసుకుంటున్న మా అమ్మకు ఏదో ఒకటి చెబుతూ,

    మధ్యమధ్యలో “ఇదిగో అమ్మా, వింటున్నావా? ఓ అమ్మా!!” అని అరుస్తుంటాను.

    మా అమ్మేమో, ఊ! చెప్పరా” అంటుంది తన పని తాను చేసుకుంటూనే. కాకపోతే ఆవిడకు ఇక్కడ ఒకింటి పనే కాబట్టి ఇబ్బంది లేదు.

    కానీ నీ సంగతి అలా కాదు కదా!

    అనంతకోటి బ్రహ్మాండాలన్నింటినీ పరిపాలించే తల్లివి.

    లోకాలన్నీ తన బొజ్జలో దాచుకున్న ఆ పరమశివుని భార్యవు. *“సదాశివకుటుంబిని”వి.*

    అందుకే, కోట్లాదిమంది పిలుపులలో నా పిలుపెక్కడ వినబడదో అన్న భయం చేత, ఇంకాస్త గట్టిగా అరచి చెబుతున్నాను.

    ఇదిగో అమ్మా! ఇటూ.. ఈవైపు.. నావైపు చూడు! నేనూ.


🌹🙏శ్రీ మాత్రే నమః 🙏🌹

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🌞ఆదివారం 20 ఏప్రిల్ 2025🌞*


           *రామాయణం*


ఒకసారి చదివినంత మాత్రాన 

మన సమస్త పాపాలని తీసేస్తుంది...


     *వాల్మీకి రామాయణం*

           *14 వ భాగం*

                    

హిమాలయ పర్వతాలమీద మహాదేవుడైన శివుని గూర్చి ఘోరమైన తపస్సు చేశాడు.


అప్పుడు శివుడుప్రత్యక్షమై,... “నాయనా విశ్వామిత్రా! నీ మనసులో ఏ కోరికుందో చెప్పు, ఆ కోరికని నేను తీరుస్తాను” అన్నాడు.


అప్పుడు విశ్వామిత్రుడు.......```

*యది తుష్టో మహాదేవ ధనుర్ వేదో మమ అనఘ |*

*సా అంగ ఉప అంగ ఉపనిషదః స రహస్యః ప్రదీయతాం ||*

```

“మహాదేవా! నువ్వు నిజంగా నా తపస్సుకు ప్రీతి చెందినవాడివైతే, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ధనుర్వేదాన్ని ఉపదేశం పొందకుండా నాకు ఆ ధనుర్వేదంలోని అస్త్రాలన్నీ రహస్యాలతో సహా తెలిసిపోయేటట్టు అనుగ్రహించమ”న్నాడు.


శివుడు “తధాస్తు“ అన్నాడు.


పౌర్ణమి నాడు సముద్రుడు ఎలా పొంగుతాడో, అలా విశ్వామిత్రుడు పొంగిన ఆత్మవిశ్వాసంతో రథమెక్కి వశిష్ఠుడి ఆశ్రమాన్ని చేరుకున్నాడు.


ఆయన వచ్చేసరికి ఆ ఆశ్రమం జింకలతో, పక్షులతో, ఆవులతో, గురువుల దగ్గర వేదం నేర్చుకుంటున్న శిష్యులతో ఎంతో పవిత్రంగా ఉంది.


ఇది చూసిన విశ్వామిత్రుడికి ఆగ్రహం ఎక్కువయ్యింది. కనీసం ఒకమాట కూడా చెప్పకుండా ఆ అస్త్రాలని ఆశ్రమం మీద ప్రయోగించాడు.


ఒక్కసారిగా భూకంపం వస్తే ఎలా ఉంటుందో, అలా అస్త్రాలన్నిటిని ఒకదాని వెంట ఒకదాన్ని పంపాడు.


కన్నుమూసి తెరిచేలోగా ఆ ఆశ్రమం అంతా బూడిదయ్యింది. ఆ ఆశ్రమంలోని గురువులు, శిష్యులు, జింకలు, ఆవులు అన్ని తలకోదారి పట్టి అరణ్యంలోకి పరుగు తీశాయి.


అప్పుడు వశిష్ఠుడు పారిపోతున్న వారిని… “ఆగండి, పారిపోకండి, నేను మిమ్మల్ని కాపాడతాను”అని అన్నారు.


ఆకాశం నుండి పడుతున్న అస్త్రాలని చూసి భయపడి అందరూ పారిపోయారు.


ఆశ్రమంలో వశిష్ఠుడు ఒక్కడే మిగిలాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ఆగ్నేయాస్త్రం నిప్పులు కక్కుతూ ఆయన మీదకి వచేస్తోంది.


“ఇన్ని సంవత్సరాలుగా ఈ ఆశ్రమాన్ని పోషించాను, ఇవ్వాళ నీ ఆవేశానికి ఈ ఆశ్రమాన్ని బూడిద చేశావు” అని వశిష్ఠుడు తన బ్రహ్మదండం పట్టుకొని కింద కూర్చున్నారు.


ఆయన ఆ బ్రహ్మదండాన్ని అలా పట్టుకుని ఉంటె అది ఎలా ఉందంటే, సమస్త లోకాలని శాసించగలిగే యమదండాన్ని పట్టుకున్న యముడిలా పట్టుకున్నారు.


మండుతున్న నిప్పు మీద నీళ్ళు పడితే ఎలా చల్లారిపోతుందో, అలా ఆ ఆగ్నేయాస్త్రం చల్లారిపోయి ఆ బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయింది.


తను అంత తపస్సు చేసి ప్రయోగించిన అస్త్రాన్ని వశిష్ఠుడు కనీసం వేరొక అస్త్రాన్ని ప్రయోగించి ఆపలేదు, కేవలం తన బ్రహ్మదండాన్ని అడ్డుపెట్టి ఆపేసరికి విశ్వామిత్రుడికి కోపం బాగా పెరిగిపోయింది.


అప్పుడాయన ఒకేసారి వారుణాస్త్రం, ఇంద్రాస్త్రం, పాశుపతాస్త్రం, ఇషీకాస్త్రం, మానవాస్త్రం, గాంధర్వాస్త్రం, బ్రహ్మపాశం, కాలపాశం, వారుణపాశం, పినాకాస్త్రం, క్రౌంచాస్త్రం, ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం, త్రిశూలం, కాపాలం అనేకంకణం, రకరకాల పిడుగులు, కంకాలం, ముసలం, పెద్ద పెద్ద గధలు మొదలైన రకరకాల అస్త్రాలని వశిష్ఠుడి మీద వేశాడు.


కాని ఆయన వేసినవన్ని వశిష్ఠుడి బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయాయి.


ఇక తనదగ్గర ఉన్న ఒకేఒక అస్త్రమైన బ్రహ్మాస్త్రాన్ని వెయ్యడానికని ఆ మంత్రాలని స్మరిస్తుండగా సముద్రాలు పొంగాయి, పర్వతాలు బద్దలయ్యాయి, ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణులు ఒక్కసారి మనస్సులో క్షోభ పొందాయి. అంతటి శక్తివంతమైన ఆ బ్రహ్మాస్త్రాన్ని విశ్వామిత్రుడు అభిమంత్రించి వదిలాడు.


ఇప్పటిదాకా ఎంతోమంది గొప్పవాళ్ళని మట్టుపెట్టిన ఆ బ్రహ్మాస్త్రం కూడా నిశబ్ధంగా ఆయన బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయింది.


అప్పుడు విశ్వామిత్రుడు......

```

*ధిక్ బలం క్షత్రియ బలం బ్రహ్మ తేజో బలం బలం |*

*ఏకేన బ్రహ్మ దణ్డేన సర్వ అస్త్రాణి హతాని మే ||*

```

“ఛీ! ఈ బ్రహ్మర్షి బలం ముందు ఈ క్షత్రియ బలం ఎందుకు పనికొస్తుంది. ఎన్నో అస్త్రాలని నేర్చుకున్నాను, అన్నీ ప్రయోగించాను. కాని ఆయన ఒక కర్రముక్క పట్టుకొని నా అస్త్రాలన్నిటిని మింగేసారు,” అని ఆ రథం దిగి వెళ్ళిపోయాడు.


వశిష్ఠుడు బ్రహ్మర్షి కనుక నేను ఆయనని ఓడించలేకపోయాను, కాబట్టి నేనూ బ్రహ్మర్షిని అవుతానని ఆ విశ్వామిత్రుడు దక్షిణ దిక్కుకి వెళ్ళాడు. అక్కడికి ఆయన తన పెద్ద భార్యతో వెళ్ళి 1000సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. ఈ కాలంలోనే ఆయనకి హవిష్పందుడు, మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అని నలుగురు కుమారులు పుట్టారు.


ఆయన తపస్సుకి సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నారు… “నువ్వు చేసిన ఈ తపస్సు చేత రాజర్షి లోకాలని గెలిచావు, ఇవ్వాళ నుంచి నిన్ను విశ్వామిత్ర మహారాజు అని కాకుండా రాజర్షి విశ్వామిత్రుడు అని పిలుస్తారు” అని చెప్పారు.


‘ఇన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే రాజర్షిని అయ్యాను, ఇంక బ్రహ్మర్షిని ఎప్పుడవుతానో’ అని విశ్వామిత్రుడు దిగులుపడ్డాడు.


*రేపు... 15వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏


🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🕉️సోమవారం 21 ఏప్రిల్ 2025🕉️*

           *రామాయణం*


ఒకసారి చదివినంత మాత్రాన 

మన సమస్త పాపాలని తీసేస్తుంది...


      *వాల్మీకి రామాయణం:*

            *15 వ  భాగం*

                   ```

అదే కాలంలో ఇక్ష్వాకు వంశంలో ‘త్రిశంకు’ అనే రాజు పరిపాలన చేసేవాడు. ఆయనకి శరీరం మీద ఉన్న వ్యామోహం వలన స్వర్గానికి శరీరంతో వెళ్ళాలన్న కోరిక పుట్టింది. వెంటనే కులగురువైన వశిష్ఠుడికి తన కోరిక చెప్పాడు.


“నువ్వు ఎంత గొప్ప రాజువైనా కాని, ఎంత గొప్ప యాగాలన్నా చెయ్యి, కాని శరీరంతో స్వర్గానికి వెళ్ళడమనేది ధర్మశాస్త్రంలో లేదు. ఎవరి శరీరమైనా కొంత కాలానికి పడిపోవాల్సిందే, అది పడిపోయిన తరవాతే స్వర్గలోక ప్రవేశం. కావున శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అనేది జరగదు” అన్నాడు వశిష్ఠుడు.


అప్పుడా త్రిశంకుడు వశిష్ఠుడి నూరుగురు కుమారుల దగ్గరికి వెళ్ళి జరిగినది చెప్పాడు.


“మా తండ్రిగారు కుదరదన్నారు, ఆయనకి అన్నీ తెలుసు, అయినా స్వర్గానికి శరీరంతో ఎవరూ వెళ్ళలేరు, అది జరిగేపనికా”దన్నారు ఆ నూరుగురు కుమారులు.


“అయితే నేను వేరొక గురువుని వెతుక్కుంటాను” అన్నాడు ఆ త్రిశంకుడు.


“నువ్వు నీ గురువు మాట వినలేదు, ఆయన పుత్రులమైన మా మాట వినలేదు, ఇప్పుడు వేరొక గురువుని వెతుకుతాను అంటున్నావు, నీకు ఇలాంటి దుర్బుద్ధి పుట్టింది కనుక నువ్వు చండాలుడివి అవుతావ”ని శపించారు.


మరుసటి రోజు ఆ త్రిశంకుడు నిద్రలేవగానే ఆయన ముఖంలోని కాంతి పోయి నల్లగా అయ్యాడు, ఆయన వేసుకొన్న బంగారు ఆభరణాలన్నీ ఇనుప ఆభరణాలయ్యాయి, జుట్టు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆయనని చూసిన ఆ మందిరంలోని వాళ్ళు, ఇతర మంత్రులు అందరూ పారిపోయారు. ఆ రూపంతో అలా తిరుగుతూ చివరికి విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు.


వశిష్ఠుడిని ఎలాగు అస్త్రాలతో ఓడించలేకపోయాను, వశిష్ఠుడు చెయ్యలేనన్నది విశ్వామిత్రుడు చేశాడు అని లోకం అనుకోవాలని, కనుక ఆ త్రిశంకుడి కోరిక తీరుస్తానన్నాడు విశ్వామిత్రుడు. అప్పుడాయన తన శిష్యుల్ని, కొడుకుల్ని పిలిచి...“మీరు ఈ బ్రహ్మాండం అంతా తిరగండి, ‘వశిష్ఠుడు చెయ్యలేని యాగం విశ్వామిత్రుడు చేస్తున్నాడు, త్రిశంకుడిని సశరీరంగా స్వర్గానికి పంపిస్తున్నాడు’ అని చెప్పి బ్రాహ్మణుల్ని, ఋషుల్ని తీసుకురండి. ఎవరన్నా ఆ యాగం చెయ్యలేరు, మేము రాము అంటె, వాళ్ళ వివరాలు తీసుకోండ”ని చెప్పాడు.


విశ్వామిత్రుడికి భయపడి అందరూ వచ్చారు. తరువాత ఆయన కొడుకులు వచ్చి… “వశిష్ఠ మహర్షి కొడుకులు ఈ యాగానికి రామన్నారు, అలాగే మహోదయుడనే బ్రాహ్మణుడు కూడా రానన్నాడు, కాని ఆయన ఒక మాటన్నాడు, అదేంటంటే, ‘యాగం చేస్తున్నవాడు ఒక క్షత్రియుడు, యాగం చేయిస్తున్నవాడు ఒక చండాలుడు, ఇలాంటప్పుడు దేవతలు హవిస్సులని ఎలా తీసుకుంటారు, అసలు సశరీరంగా స్వర్గానికి పంపవచ్చని వేదంలో ఎక్కడా లేదు, అందుకని రాన’న్నాడు” అని చెప్పారు.


విశ్వామిత్రుడికి ఎక్కడలేని కోపం వచ్చి, వశిష్ఠ మహర్షి కొడుకులని, మహోదయుడిని, మీరు భస్మరాశులై పడిపోయి నరకానికి వెళతారు, ఆ తరవాత 700 జన్మలపాటు శవ మాంసం తిని బతుకుతారు, ఆ తరవాత ముష్టికులన్న పేరుతో పుట్టి, కొన్ని జన్మల పాటు కుక్క మాంసం తిని బతుకుతారు. ఆ మహోదయుడు సర్వలోకాలలోని జనాలచేత ద్వేషింపపడి నిషాదుడై బతుకుతాడ”ని శపించాడు.


అందరూ కలిసి యాగం మొదలుపెట్టారు, యాగాగ్నిలో హవిస్సులు తీసుకోవడానికి ఏ దేవతా రాలేదు. ఎవరూ రాకపోయేసరికి విశ్వామిత్రుడికి ఆగ్రహం వచ్చి తన తపఃశక్తితో త్రిశంకుడిని పైకి పంపాడు. త్రిశంకుడు ఆకాశమార్గంలో ప్రయాణిస్తూ స్వర్గలోకం వైపు దూసుకుపోతున్నాడు. ఈ విషయం దేవేంద్రుడికి తెలిసి ఆయన...```


*”త్రిశంకో గచ్ఛ భూయః త్వం న అసి స్వర్గ కృత ఆలయః ||”*```


“త్రిశంకా, నువ్వు గురు శాపానికి గురయ్యావు, నీకు స్వర్గలోక ప్రవేశం లేదు” అని, “తలక్రిందులుగా కిందకిపో!” అన్నాడు.


ఆ త్రిశంకుడు అలా తలక్రిందులుగా భూమి మీదకి తోసేయబడ్డాడు.


కిందకి పడిపోతూ ఆయన విశ్వామిత్రుడిని ప్రార్ధించగా, విశ్వామిత్రుడు మిగిలిన తపఃశక్తితో దక్షిణ దిక్కున నక్షత్ర మండలాన్ని సృష్టించాడు, సప్తర్షులని సృష్టించాడు. కాని దేవతలు అప్పటికి కూడా రాకపోయేసరికి, దేవతలని కూడా సృష్టిద్దామని అనుకుంటుండగా దేవతలందరూ వచ్చారు.


“మహానుభావా! శాంతించు. ఎంత తపఃశక్తి ఉంటే మాత్రం ఇలా వేరే స్వర్గాన్ని సృష్టిస్తావా, మీకు శాస్త్రం తెలుసు, సశరీరంగా ఎవరినీ స్వర్గానికి పంపలేము. మీలాంటివారు చెయ్యవలసిన పని కాదు!”అన్నారు.


“మీరు మీ తపఃశక్తిని ధారపోసి సృష్టించిన ఆ నక్షత్ర మండలం జ్యోతిష్య చక్రానికి అవతల ఉంటుంది, అందులో ఈ త్రిశంకుడు తిరగబడి ఉంటాడు” అని వరం ఇచ్చారు దేవతలు.


శాంతించిన విశ్వామిత్రుడు “సరే” అన్నాడు.


తనకి ఇక్కడ మనశ్శాంతి లేదని, ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి ఆయన పశ్చిమ దిక్కుకి వెళ్ళారు.


*రేపు... 16వ భాగం*


*🚩జై శ్రీరామ్.!   జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

.



గోడకు జారి కూర్చొనిన కోమలి

 గోడకు జారి కూర్చొనిన కోమలి కెన్నియు చింతలున్నవో


వేడదు కోరదేదియును వేసట నొందదు నింటి కృత్యమున్


తోడుగ నీడగా మసలి దోహద మిచ్చెడి నింటి వారలే


చేడియ బాధ తీర్చవలె చెంతన కూర్చొని యూరడించుచున్.



అల్వాల లక్ష్మణ మూర్తి

వసంతఋతువు

 *వసంతఋతువు*

(వర్ణన) 



మత్తకోకిల పాడుచున్నది మంత్రముగ్ధుల జేయుచున్


చిత్తమందున క్రొత్తవూహలు చిందులేసెను చైత్రమున్


తత్తరించెను బంభరమ్ములు తావులన్ని చరించుచున్


హృత్తమస్విని పారిపోవును ప్రేమ వెల్గు వసంతమా!


అల్వాల లక్ష్మణ మూర్తి.

రిటైరైన పురుషులు

 *పురుషులందు రిటైరైన పురుషులు వేరయా!*

                    🌹🌹🌹


1)పదవి విరమించునాడు

 ప్రశంశించుదురు పలువురు

మరునాడు నుండి

 పెదవి విరుతురు ప్రతి ఒక్కరు.


2)గేటు తీయరెవరు

గది తలుపు దీయరు

లోనికి రమ్మనకపోగా 

తలుపుకడ్డము నిలిచెదరు 

తుదకు కూర్చోమనరెవరూ

పైగా పవరులేని వానిగా 

పరిగణింతురందరు


3)పింఛెనొచ్చు వరకు 

పెండ్లాము పలుకరించదు

వచ్చినాక తక్కువని 

సన్నాయి నొక్కులునొక్కుచుండు

ఏమి సేతునమ్మ

నిర్మలా సీతారావమ్మా? 


4)పదే పదే సెలవులిచ్చుకొను

 పనిమనిషి సైతము

*పనీ పాటా* లేని వాడని 

పదే పదే పరిహాసపు లుక్కు లిచ్చు !


5)రిటైరైనాక 

పగవాని వోలె

ఎదురైన ప్రియమిత్రుడుసైతము

 పళ్ళికిలించుచు జూచు!


6) సతి నాఫీసు కడ 

డ్రాపు చేసినను... లేదా...

పికప్ చేసికున్నను

పరమ జాలిగ చూచెదరు

ఆమె కొలీగులు!


7) నిన్న మొన్నటి వరకు

 *గుడ్డు మార్నింగు* చెప్పినవారు 

 కనబడిననూ చూడనట్లు

 *గుడ్డివారులా* పోవుచుందురు.


8) పదవి వీడిన నాడు 

కప్పిరి శాలువలెన్నో పోటీపడి 

ఇచ్చిరి భగవద్గీత ప్రతులు

ప్రేమ ఒలకబోసి!


9)వచ్చిన శాలువలు 

ఇచ్చిన గీతా మకరందములు

ముసుగు కప్పుకుని 

పఠించుటయే...

ఇక పై తక్షణ కర్తవ్యము.


10)ఇంతేలే రిటైరైనోళ్ళబతుకులు 

 ఇవి ఏనాటికీ బాగుపడని అతుకులు 

ఇంతేనయా! తెలుసుకోవయా!

ఈ లోకం సంగతి ఇంతేనయా!

రిటైరైనాక బతుకింతేనయా !


(*సరదాగా నవ్వుకోవడానికి వ్రాసిందే ! ఎవరినీ నొప్పించేందుకు కాదు సుమా!!*)


                    😁😁😁

" ఆ 'కలి ' కాలం

 అంశం : మానవ సంబంధాలు -- నాడు... నేడు


శీర్షిక : "" ఆ 'కలి ' కాలం ""


ఒక్క కాకికి కష్టమొస్తే

వంద కాకులు చేరి గోల చేసినట్లు

ఆనాటి మనుష్యుల్లోని మానవ సంబంధాలు

కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ

సమాజాన్ని సన్మార్గంలో నడిపించాయి!

మరి నేడు...

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక బాంధవ్యా లై

బెల్లం చుట్టూ మూగిన ఈగల చందంగా

ధనమున్నంత సేపు ధరి చేరి

ధనమయి పోయాక ఎవరిదారిన వారు పోయే ఆ కలి కాలామిది!

ఎవరికీ వారే యమునా తీరే అనేలా

నేను, నా కుటుంబమనే స్వార్ధం తప్ప

మన అనే భావన దూర్భిణీ పెట్టి వెదికి నా కన్పించని కలి. కాలమిది!

మారింది కాలా లు కాదు

మనుష్యుల మనసుల స్వరూప స్వభావాలు

స్వార్ధ పూరిత మనుష్యుల నిజ స్వరూపాలు!

ధనం తో అన్నీ కొనలేం

మానవ సంబంధాలను అసలే కొనలేం

అందరూ బాగుండాలి

అందులో నేనుండాలను కొంటూ

పరహితం ఆశిస్తూ

హృదయమనే ప్రమిదలో

మానవత్వమనే తైలం పోసి

మంచితనమనే దివ్వెను వెలిగించి

మృగ్యమోతున్న మానవ సంబంధాలను మెరుగు పరుచుకోవాలి

మానవతా విలువలను అంకురింప చేసుకోవాలి!

...........................................

రచన

ఆళ్ల నాగేశ్వరరావు

తెనాలి

గుంటూరు... జిల్లా

ఆంధ్రప్రదేశ్... రాష్ట్రము

సెల్ నెంబర్.7416638823

...........................................

పై వచన కవిత నా స్వీయ రచనే నని హామీ ఇస్తున్నాను.

గోమాత గొప్పదనం

 గోమాత గొప్పదనం - గోవుతో వైద్యం .

    

వేదకాలం నుంచి గోమాతకు ఈ భారతదేశం నందు ప్రత్యేక స్థానం కలదు. గోవు ని తల్లిలా భావించిన మన పూర్వికులు పూజించుట యే కాకుండా ఆవు కు సంబంధించిన వుత్పత్తులలోని గొప్పతనాన్ని తెలుసుకుని గ్రంధస్తం కూడా చేశారు అవి చాలా రహస్య యోగాలుగా ఉండిపోయాయి. కొన్ని పురాతన గ్రంథాల నుండి ఆ వివరాలు సేకరించాను అవి మీకు తెలియచేస్తాను 


• ఆవుపాలు  


  ఇవి మధురంగా సమ శితోష్ణము గా ఉంటాయి. తాగితే మంచి వీర్యపుష్టి , దేహపుష్టి కలిగిస్తాయి . వీటిలో A B C D విటమిన్లు వున్నాయి. పగలంతా మనంచేసే శ్రమ హరించిపొయి మరుసటి రోజుకి శక్తి రావాలంటే రోజు రాత్రిపుట తప్పనిసరిగా ఒక గ్లాస్ ఆవుపాలు తాగాలి. శరీరంలోని క్షీణించిపోయిన ధాతువులని మళ్లి జీవింప చేసి ధీర్ఘాయిషుని అందించడంలో ఆవుపాలదే అగ్రస్థానం వీటిని చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేయడం చాలా మంచిది. వేడితత్వం గలవారు తక్కువగా, శీతల తత్వం వారు ఎక్కువుగా వాడవచ్చు.


 • ఆవుపెరుగు -  


గర్భిణి స్త్రీకి వరం .  

                   వెండి పాత్రలో తోడు బెట్టిన పెరుగు గర్భిణి స్త్రీకి వరప్రసాదం లాంటిది. ఆవుపెరుగు వాడటం వలన గర్భస్రావాలు అరికట్టబడతాయి. నెలలు నిండకుండా జరిగే ప్రసవాలను నిరోధించవచ్చు. పుట్టే పిల్లలు ఎలాంటి అవలక్షణాలు లేకుండా ఆరోగ్యంగా పుడతారు. ఇంకా తల్లికి చనుబాలు పెంచడంలో కూడా ఆవుపెరుగు శ్రేష్టం అయినది.


 • ఆవు వెన్న - 

              

ఇది చలువ చేస్తుంది శరీరంలోని వాత, పిత్త , కఫ దోషాలను మూడింటిని నిర్మూలిస్తుంది. మేహరోగాలు , నేత్రవ్యాదులు పోగోడుతుంది . ముఖ్యంగా పిల్లలకు,వృద్దులకు ఆవువెన్న చాలా ఉపయోగపడుతుంది.


 •. ఆవునెయ్యి - 

             

. ఇది శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది. జీవకణాలను పోషిస్తూ ధీర్ఘాయిషు ని ఇస్తుంది.ఎంత భయంకరమైన పైత్యాన్ని అయినా హరించి వేస్తుంది సుఖవిరేచనం చేస్తుంది . ఉన్మాదం , పాండు రోగం , విషప్రయోగం , ఉదర శులలు ( కడుపు నొప్పి ) మొదలయిన వ్యాదులతో బాధపడే వారికి మంటల్లో కాలినవారికి , గాయాలు అయినవారికి మంచి పధ్యమైన ఆహారం గా ఆవునెయ్యి ఉపకరిస్తుంది. ఆవునేయ్యితో తలంటు కొని స్నానం చేస్తే తలకు, కళ్లకు అమితమైన చలువ చేస్తుంది .


 • ఆవుపేడ - 

             

  ఆవుపేడ రసం 70 గ్రాముల్లో 35 గ్రాములు ఆవుపాలు కలిపి తాగిస్తూ ఉంటే కడుపులోని మృత పిండం బయటపడుతుంది.

 

• గుధస్తానంలో తిమ్మిరి కొరకు - 

             

ఆవుపేడ ని వేడిచేసి ఒక గుడ్డలో చుట్టి గుధస్థానం లో కాపడం పెరుగుతూ ఉంటే తిమ్మిరి వ్యాధి హరిస్తుంది .

 

• వంటి దురదలకు - 

               

 అప్పుడే వేసిన ఆవుపేడతో వంటికి మర్దన చేసుకుంటూ ఉంటే ఒక గంట తరువాత వేడినీళ్ళతో స్నానం చేస్తూ ఉంటే దురదలు తగ్గిపోతాయి . 


 • కడుపులోని క్రిములకు - 

              

 20 గ్రా ఆవుపేడ పిడకల చూర్ణం 100 గ్రా మంచినీళ్ళలో కలిపి వడపోసి ప్రతి ఉదయం తాగుతూ ఉంటే కడుపులోని పేగుల్లో ఉండే క్రిములు అయిదారు రోజులలో పడిపోతాయి.

                  ఆవుపేడ లొ క్షయవ్యాధి క్రిములను చంపే శక్తి వుందని అందువల్ల కొంచం ఆవుపేడ ని మంచినీళ్ళతో కలిపి వడపోసి తాగిస్తూ ఉంటే క్షయ మలేరియా , కలరా వ్యాధులు హరించి పొతాయి. ఇదే విషయాన్ని ఇటలి శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో కనుగొన్నారు .

 

• ఆవుముత్రం - 

 

  ప్రతిరోజు వడకట్టిన గోముత్రాన్ని 25 గ్రా మోతాదుగా తాగుతూ ఉంటే శ్లేష్మం వల్ల వచ్చిన వ్యాధులు హరించి పొతాయి . 


 • గో మూత్రంలో కొంచం కలకండ పొడి కలిపి కొంచం ఉప్పు కలిపి తాగుతూ ఉంటే కొద్ది రొజుల్లోనే ఉదరానికి చెందిన కడుపుబ్బరం , కడుపునోప్పులు మొదలయిన వ్యాదులు అన్ని హరించి పొతాయి.


 * వడకట్టిన గో మూత్రాన్ని 35 గ్రా మోతాదుగా ప్రతిరోజు ఉదయమే తాగుతూ ఉంటే ఇరవయి నుంచి 40 రొజుల్లొ పాండు వ్యాధి హరించి పొతుంది.

 

* గో మూత్రాన్ని గోరువెచ్చగా వేడిచేసి చెవిని కడుగుతూ ఉంటే చెవిలొ చీము కారడం తగ్గిపొతుంది.


 * ఇరవై గ్రాముల గో మూత్రం లొ పది గ్రాముల మంచి నీళ్లు కలిపి తాగుతూ ఉంటే మూత్రం సాఫిగా బయటకు వెళ్ళిపోతుంది.


 * ప్రతిరోజు ఉదయమే గోమూత్రమును 30 గ్రా మోతాదులో 20 గ్రా పటికబెల్లం కలుపుకుని తాగుతూ ఉంటే మలబద్దకం హరించి పొతుంది. 


ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

  

 గమనిక -

      

నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

. ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

      

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

             

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

         

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                    

. 9885030034

కాళిదాసు 🙏 రెండవ భాగం

 🙏కాళిదాసు 🙏

                రెండవ భాగం 

కాళిదాసు భారతీయ కవితకి ఆత్మ వంటివాడు. కవిత ఏ రూపాన్నైనా పొంది ఉండవచ్చు. కావ్యం కావచ్చు నాటకం కావచ్చు.కవితాత్మ పాలు కొంతైనా దానిలో ఉంటుంది. ఇలా కాళిదాసప్రభావం తరువాత తరాల కవుల్లో ఉంటూనే వచ్చింది. కాళిదాసు భారతసంతతికి కేవలం కవిత్వాన్నే ఇవ్వలేదు. ఇంకా కొన్ని మౌలిమైన, మేధాపరమైన, సాంస్కృతిక పరమైన ఉపాధుల్ని సమకూర్చాడు. అవేమిటి? కాళిదాసు కవికులగురువు ఎందుకయ్యాడు? 


కవితాత్మలో కొన్ని భాగాల్ని కాళిదాసు ఎలా పండించి పోషించాడు? ఏ విధంగా అతడు మనకి అధ్యాపకుడు? అన్నది స్థూలంగా చర్చించడమే మిగిలిన వ్యాసం యొక్క ముఖ్యోద్దేశ్యం. కాళిదాసు కవిత్వంలో రసజ్ఞత గురించి వేరే చెప్పక్కర్లేదు. అది అన్నివేళలా తొణికిసలాడుతూనే ఉంటుంది. ఇక మిగిలిన విషయాలకొస్తే, ఇంత చిన్న వ్యాసంలో అన్నీ కూలంకషంగా చర్చించడం సాధ్యం కాదు కాబట్టి, కొన్నింటిని కాస్త విశదంగా, కొన్నింటిని స్థాలీపులాకంగా, కొన్నింటి గురించి సూక్ష్మం గానూ చెప్పి ముగిస్తాను.


1. భాష

భాషని నాదయోగంగా భావించినవాడు కాళిదాసు. పలికే మాట (శబ్దం), దానికున్న అర్ధం, వీటి మధ్యనున్న విడదీయరాని అర్థనాదేశ్వరబంధం అర్ధనారీశ్వరబంధంలాంటిదని పూర్తిగా తెలిసినవాడు. కాబట్టే రఘువంశాన్ని,


వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే

జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ  


అని మొదలు పెట్టాడు. పైగా వాగర్థప్రతిపత్తి (శబ్దం, అర్థం రెండింటికీ సంబధించిన జ్ఞానం అబ్బడం) కోసమే జగత్తుకి తల్లిదండ్రులైన (పితరౌ) పార్వతిని, పరమేశ్వరుణ్ణీ ప్రార్థిస్తున్నానన్నాడు. పార్వతీపరమేశ్వరౌ = పార్వతీప + రమేశ్వరౌ అని విడదీస్తే శివుడు, విష్ణువు అనే అర్థం వస్తుంది. సంస్కృతభాషలో పితరౌ అంటే ఇద్దరు తండ్రులు అని కూడా అర్థం ఉంది. అందువల్ల ప్రపంచానికి తండ్రులైన శివవిష్ణువులను కూడా ప్రార్థిస్తున్నాడు అని కూడా అనుకోవచ్చు. మొదటి శ్లోకంలోనే, వాగర్థప్రతిపత్తికోసం ప్రార్థిస్తున్నా (వందే) అనగానే అది పుష్కలంగా దొరికేసినట్టుంది, వెంటనే పార్వతీపరమేశ్వరౌ అనే గొప్ప శ్లేష చూపాడు.


రమ్యమైన పదాల్తో పూలజల్లులు కురిపించడం, కోమలమైన పదబంధాల్తో కట్టిపారెయ్యడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. సంస్కృతభాషతో పరిచయం తక్కువ ఉన్న (లేదా అసలు లేని) వాళ్ళకి కూడా హృద్యంగా తోచే విధంగా కూడా వ్రాశాడు. కేవలం పదనాదం ద్వారా రమ్యతను సృష్టించాడు. ఋతుసంహార కావ్యంలో కాళిదాసు ఆరు ఋతువుల్నీ ఆరు సర్గల్లో వర్ణించాడు. మచ్చుకి ఋతుసంహారం లోని మూడు శ్లోకాలు చూడండి.


సదా మనోఙ్ఞం స్వనదుత్సవోత్సుకం వికీర్ణ విస్తీర్ణ కలాపి శోభితం

ససంభ్రమాలింగనచుంబనాకులం ప్రవృత్తనృత్యం కులమద్యబర్హిణామ్ – (వర్ష ఋతువు)


(ఎప్పుడూ మనోజ్ఞంగా, శబ్దాలతో కూడిన మహోత్సవంలో తేలియాడుతూ, విస్తరించి విసరబడిన పింఛంతో శోభిస్తూ ఉన్న నెమళ్ళ గుంపులు ఇప్పుడు ముప్పిరిగొన్న ఆనందంలో ఒకదాన్నొకటి కౌగిలించుకుంటూ, ముద్దులాడుకుంటూ నాట్యం చెయ్యడం మొదలుపెట్టాయి. పైన చెప్పిన శబ్దాలు నెమళ్ళ కేకలు కావచ్చు లేదా మేఘాల గర్జనలు కావచ్చు.)


నితాంత లాక్షారసరాగరంజితైః నితంబినీనాం చరణైః సనూపురైః

పదే పదే హంసరుతానుకారిభిః జనస్య చిత్తం క్రియతే సమన్మథమ్ – (గ్రీష్మ ఋతువు)


(దట్టంగా పూసిన లాక్షారసం రంగు వల్ల ఎర్రబడి, అందెలతో కూడిన స్త్రీల పాదాలు అవి వేసే ప్రతీ అడుగులోనూ హంసల ధ్వనులను అనుకరిస్తున్నట్టుగా ఉన్నాయి. అది విన్న జనులందరి మనస్సులూ మన్మథప్రభావాన్ని పొందుతున్నాయి.)


ఆమ్రీ మంజులమంజరీ వరశరః సత్కింశుకం యద్ధనుః

జ్యా యస్యాలికులం కలంకరహితం ఛత్రం సితాంశుః సితం

మత్తేభో మలయానిలః పరభృతా యద్ద్వందినో లోకజిత్

సోఽయం వో వితరీతరీతు వితనుర్భద్రం వసంతాన్వితః – (వసంత ఋతువు)


(ఎవడి గొప్ప బాణాలు అందమైన ఆకర్షణీయమైన మామిడిపూల గుత్తులో, ఎవడి విల్లు మోదుగపువ్వో, ఎవడి వింటినారి తుమ్మెదల బారో, ఎవడి మచ్చలేని తెల్లని గొడుగు తెల్లని కిరణాల్తో కూడిన చందమామో, ఎవడి మదపుటేనుగు గంధపుచెట్లున్న మలయపర్వతపు వాయువో, ఎవడి వంది జనం (స్తోత్రపాఠాలు చేసేవాళ్ళు) కోకిలలో, అటువంటి లోకాల్ని జయించే మన్మథుడు, తన స్నేహితుడైన వసంతుడితో కలిసివచ్చి (అంటే వసంతకాలంలో) మీ అందరిమీదా సుఖభాగ్యాల్ని వెదజల్లుగాక! )


ఋతుసంహారం కాళిదాసు తొలిరోజుల్లో వ్రాసినది. రాను రాను, పదలాలిత్యానికి గాఢమైన భావాల్ని కూడా జోడించి తన భాషకీ, పదనాదానికీ కొత్త రంగులు దిద్దాడు. తరువాత వ్రాసిన రఘువంశ, కుమారసంభవ, మేఘదూత కావ్యాల్లో ఇది బాగా కనిపిస్తుంది. ఆ కావ్యాలు చదివి ఆనందించాలంటే సంస్కృతభాష నేర్చుకోవాలి. శ్రీమద్రామాయణం చదవాలంటే కొద్దిగా భాష తెలిస్తే చాలు. ఒక విధంగా చెప్పాలంటే, ఏ భాషవాళ్ళకి, ఆ భాషలో వాల్మీకి మహర్షి వ్రాసిన పాటలా ఉంటుంది. శ్లోకంలో ఉన్న పదాల్ని గద్యక్రమంలో (కర్త-కర్మ-క్రియ వరసలో) పేర్చుకుని అర్థం చేసుకోవడం చాలా సులువు. కాళిదాసు కావ్యాలకొస్తే, ఋతుసంహారంలో తప్ప మిగిలిన కావ్యాల్లో శ్లోకాల్ని గద్యక్రమంలో పేర్చుకోవడం, కొన్ని పదబంధాలకి అర్థాన్ని తెలుసుకోవడం అంత సులువు కాదు. భాషను ఒక గురువు దగ్గర నేర్చుకోవాలి. ఆ పరిణామాన్ని పై మూడు శ్లోకాల్లోనే చూడవచ్చు. వీటిలో మూడవ శ్లోకం ఋతుసంహారంలో ఆఖరి సర్గ అయిన వసంతర్తువులో ఆఖరి శ్లోకం.


ఇలా భాషను నేర్వగా, నేర్వగా ఈ క్రింద చెప్పిన లాంటి శ్లోకాల్లో, గీతరచయిత వేటూరి చెప్పినట్టుగా ‘ఆరు ఋతువులూ ఆహార్యములై’ కనిపిస్తూంటే, భావాల విందు, నాదాల పసందు రెండింటినీ అనుభవిస్తాం.


అది కుబేరుడి అలకానగరం అవడం వల్ల అన్ని ఋతువులూ అన్ని వేళలా ఉంటాయి. అందువల్ల అక్కడి వనితలు అన్ని ఋతువుల పువ్వుల్నీ అన్ని వేళలా దేహమంతా ధరిస్తారని మేఘుడికి (మబ్బుకి) యక్షుడు చెప్తున్నాడు.


హస్తే లీలాకమల మలకే బాలకుందానువిద్ధం

నీతా లోధ్రప్రసవరజసా పాండుతామాననే శ్రీః

చూడాపాశే నవకురువకం చారు కర్ణే శిరీషం

సీమంతే చ త్వదుపగమజం యత్ర నీపం వధూనామ్ – (మేఘసందేశః 2-2)

ఇక్కడ భావం కంటే ప్రతి పదార్థం తెలుసుకోవడం బాగుంటుంది.

[యత్ర= ఏ (అనగా ఆ కుబేరుని అలకానగరంలో); వధూనామ్ = స్త్రీల యొక్క; హస్తే = చేతిలో; లీలా కమలమ్ = విలాసం కోసం పట్టుకున్న తామరపువ్వు (ఇది శరదృతువులో లభిస్తుంది); అలకే = ముంగురుల్లో; బాలకుందానువిద్ధమ్ = తురుముకోబడ్డ అప్పుడే విరిసిన మల్లెలు (ఇది హేమంత ఋతువులో లభిస్తుంది); ఆననే = ముఖం మీద; లోధ్రప్రసవరజసా = లొద్దుగ పువ్వుల పుప్పొడిచేత నీతా= ఇవ్వబడిన; పాండుతామ్ శ్రీః= గౌరవర్ణపు శోభ (లొద్దుగ శిశిర ఋతువులో లభిస్తుంది); చూడాపాశే = కొప్పు ముడిలో; నవకురువకం = ఎర్ర గోరింట పువ్వు (ఇది వసంత ఋతువులో లభిస్తుంది); కర్ణే = చెవియందు; చారు శిరీషం = అందమైన దిరిసెన పువ్వు (ఇది గ్రీష్మ ఋతువులో లభిస్తుంది); సీమంతే = పాపటలో; త్వత్ =నీ; ఉపగమజం = రాక వల్ల పుట్టిన (వర్షాకాలం లో లభించే); నీపం చ = నీపకుసుమమూ ఉంటాయి


ఈ విధమైన భాషావికాసమే కాళిదాసుని కవికులగురువుగా మాత్రమే కాదు, సంస్కృతగురువుగా కూడా నిలబెట్టింది. సంస్కృతం నేర్చుకోవడంలో మొదటి భాగం పంచకావ్యాలు గురువు దగ్గర కూర్చుని చదివి అర్థం చేసుకోవడం. పంచకావ్యాలంటే రఘువంశం (కాళిదాసు), కుమారసంభవం (కాళిదాసు), కిరాతార్జునీయం (భారవి), శిశుపాలవధం (మాఘుడు), నైషధీయ చరితం (శ్రీహర్షుడు). దాక్షిణాత్యులు కొందరు నైషధీయ చరితం బదులు మేఘసందేశం (కాళిదాసు) అని అంటారు. ఏ లెక్కన చూసినా, అధ్యయనం విషయానికొస్తే, కాళిదాస గ్రంథాలకే పెద్దపీట. భాష నేర్వాలన్నా, భాషాసౌందర్యాన్ని అనుభవించాలన్నా కాళిదాసే.


ఆ కావ్యాల్ని చదవడం కూడా పైన చెప్పిన వరస లోనే చదవాలి. అప్పుడే భాషని సవ్యంగా నేర్చుకోగలుగుతాం. రఘువంశంలో భాష సరళంగా ప్రారంభమై, ఒక కావ్యాన్నుండి మరో కావ్యానికి వెడుతూంటే సంక్లిష్టంగా మారుతూ విద్యార్థుల మెదడుకి పరీక్షలు పెడుతుంది. అందుకే, నైషధం విద్వదౌషధం అనే సామెత. ఈ పాఠ్యప్రణాళికలో, కాళిదాసు విద్యార్ధులకిచ్చిన గొప్ప బహుమతి రఘువంశం నుంచీ కూడా కవితాసువాసనల్ని వెదజల్లడం. ఒకప్రక్క భాషని నేర్చుకుంటూండగానే, అద్భుతమైన భావసంపదలో చదువుకునే వాళ్ళని ముంచి తేల్చడం. భాషావిషయమైన అంతరార్ధాల్ని తెలియజెప్పడం. (రఘువంశం మొదటి శ్లోకంలోనే చూడండి. పదానికీ, దానికుండే అర్థానికీ గల సంబంధంతో మొదలు పెట్టాడు కావ్యాన్ని.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కూతురి ప్రేమ"

 "కూతురి ప్రేమ"


******************************


పెద్ద శ్రీమంతుల ఇంట్లో ఇంటి యజమాని చనిపోయారు


చాలా మంది బంధుమిత్రులు ఇంటికి చేరారు.


ఇంట్లో అందరూ శోక సాగరంలో మునిగిపోయారు,


భార్య,నలుగురు మగ పిల్లలు ఒక ఆడపిల్ల,భార్యను పిల్లలను కష్ట పడి జీవితంలో ఒక మంచి స్థాయికి.తెచ్చి న్యాయంగా సంపాదించినదానితోనే పిల్లలందరిని మంచి ఆస్తి చేసి ఇచ్చాడు. ఆడపిల్లకు మంచి సంబంధం మంచి ఇంటికి ఇచ్చి పెళ్ళి చేశాడు...


మృదు స్వభావం ఆయనది చాలామందికి సహాయం చేసేవాడు.నిజం చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి..


అన్ని పనులు పూర్తి అయ్యాక శవాన్ని ఎత్తుదాం అనుకునే లోపలే, ఒక వ్యక్తి పరిగెడుతూ వచ్చాడు,ఆగండి ఆగండీ నేను ఒక విషయం చెప్పాలి అని అడ్డు వేశాడు. ఇలాంటి టైం లో ఏంటి ఇది అని అడిగారు అంతలో ఒక పెద్దాయన ముందుకు వచ్చి ఏమైంది అని అడిగాడు...


ఆయన చెప్పిన మాటకు అందరూ ఆశ్చర్య పోయారు, నాకు "పదిహేను లక్షలు అప్పు ఉన్నాడు" అని చెప్పాడు.అందరూ గుస గుస మాట్లాడుకున్నారు. తరువాత అందరూ అన్నారు ఈ కార్యక్రమం అయ్యాక మాట్లాడదాం అన్నారు. పెద్దవాళ్ళందరు,"లేదు లేదు"


ముందు డబ్బుల విషయంలో ఎవరో ఒకరు మాట ఇస్తేనే నేను శవాన్ని తీసుకెళ్లడానికి ఒప్పుకుంటాను, అని పట్టు బట్టాడు. మగపిల్లల దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి డబ్బులు ఇస్తాము అని ఆయనకు మాట ఇవ్వండి అని అడిగారు......


అయితే నలుగురు ఒప్పుకోలేదు.అందరికి


చాలా విచిత్రం అనిపించింది. ముందు ఈ పని ఎలా జరగాలి అని పెద్దలందరు చర్చించుకుంటున్నారు,


అలా అలా విషయం లోపల ఉన్న ఆడవాళ్ళ దాకా వెళ్ళింది....


ఇది విన్న ఆ పెద్దాయన కూతురు ఎంతో దుఃఖంలో ఉన్నా కూతురు, ఏడుస్తూ బయటికి వచ్చింది. ఇవి నా తండ్రే నాకు ఇచ్చిన నగలు ఇవి తీసుకోండి అని ఆ పెద్దాయనకు ఇచ్చింది....


ముందు అంత్యక్రియలు జరగనియ్యండి నా తండ్రికి, మానాన్న మర్యాదకు ఎలాంటి భంగం కలగకూడదు అని తన నగలు అన్నీ ఇచ్చేసి ఏడుస్తూ లోపలికి వెళ్ళింది,


తరువాత అందరూ దహన సంస్కారాలు ముగించి వచ్చారు.....


నగలను తీసుకున్న ఆవ్యక్తి లోపలికి వచ్చి ఒక మూటను చనిపోయిన ఆయన కూతురి ముందు పెట్టాడు,


"తీసుకో తల్లి నీ నగలు ఈ పదిహేను లక్షలు"


అని చెప్పాడు అందరూ అక్షర్యపోయారు,అప్పుడు ఆయన నవ్వి ఇలా అన్నాడు నిజానికి చెప్పాలంటే...


"ఆయన నా దగ్గర ఎలాంటి అప్పు చేయలేదు"


నిజం చెప్పాలంటే నాకు చాలా అత్యవసర పరిస్థితిలో డబ్బు అవసరమైతే నీకు ఎప్పుడు వీలైతే అప్పుడే ఇవ్వు అని ఇచ్చాడు.మళ్ళీ ఇద్దామని అనుకునే లోపే ఆయన చనిపోయారు అని తెలిసి పరుగున వచ్చాను,


అయితే ఎవరికి ఇవ్వాలి అని తోచలేదు ఇంతమందిలో ఎవరికి అర్హత ఉంది అని గుర్తించడం కష్టమనిపించింది.


అందుకే ఈ నాటకమాడాను. తీసుకో బేటా,అని చెప్పి వెళ్ళిపోయాడు,తల దించుకున్న నలుగురు కొడుకులు తల ఎత్తలేదు. తిథి కర్మలకు కూతురే డబ్బులు ఖర్చుపెట్టి మిగిలిన డబ్బులు అమ్మకు ఇచ్చి భర్త వెంట ఏడుస్తూ వెళ్ళిపోయింది భారమైన హృదయంతో.....


మగపిల్లలే కావాలి అని పరితపించేవారు తెలుసుకోవలసిన కథ ఇది......


ఇప్పటి కాలంలో అలా లేదు అందరూ సమానంగా ఉన్నారు....అమ్మాయిలు కూడా అమ్మానాన్నలని ప్రేమిస్తున్నారు వాళ్లకు ఇచ్చే గౌరవం వారికి ఇస్తున్నారు..

మంచి రేపటి" కోసం పనిచేస్తాము

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏 🔥మనము ఎల్లప్పుడూ "మంచి రేపటి" కోసం పనిచేస్తాము.. కానీ ఆ "మంచి రోజు" వచ్చినప్పుడు అనందంచడానికి బదులుగా మనం మళ్ళీ మంచి రేపటి గురించి ఆలోచిస్తాము.. మనకి ఏదయినా చేయాలనే ఆసక్తి ఉన్నప్పుడు ఆది సౌకర్యవంతంగా ఉన్నప్పుడు మాత్రమే చేయడానికి ప్రయత్నిస్తాము.. కానీ దేనికోసమైనా నిబద్దతతో కట్టుబడి ఉన్నప్పుడు మనము ఎటువంటి సాకులను వెతకాక పొతే కావలసిన ఫలితాలు సాధిస్తాము🔥ఇతరులను సంతోషపెట్టడానికి మన సమయాన్ని మరియు ఆలోచనలను వృధా చేయకూడదు.. మన జీవితం మన ఆలోచనల ప్రతిబింబం.. నేను జీవితంలో విజయం సాధించాను అనుకుంటే పొరపాటే.. మనస్సు ఒక్క గెలుపుతో ఎప్పుడూ సరిపెట్టుకోదు.. అందుకే సరైన గెలుపు సంతృప్తిగా ఉన్నప్పుడే మాత్రమే లభిస్తుంది🔥సముద్రమంత సమస్య వచ్చిందని జీవితమే నాశనం అయిపోతుందని దిగులు పడకు.. ఆకాశమంత అవకాశం నీ ముందు ఉందని తలెత్తి చూడు.. ముందు నీపై నీకు నమ్మకం రావాలి..కోయల లా పాడే వారందరూ "జానికి" కాలేరు..గొప్ప ఆలోచనలు ఉన్నా వారందరు "శ్రీశ్రీ" కాలేరు..ప్రేమించే వారందరు "లైలా మజ్ను" కాలేరు.కానీ మనసు పెట్టి ప్రయత్నించే ప్రతీ ఒక్కరూ "గెలుపును" అందుకుంటారు..చరిత్ర గెలుపును మర్చిపోతుందేమో కానీ పోరాటాన్ని మార్చుపోదు🔥🔥మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్ ఏజన్సీస్ D .N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారికి రాలేను వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593 9182075510* 🙏🙏🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు - చైత్ర మాసం - కృష్ణ పక్షం - అష్టమి - ఉత్తరాఫాడ -‌‌ ఇందు వాసరే* (21.04.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.






.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

నేను పోరాడకపోతే,

 🔔 *జై శ్రీరాం* 🔔

```

తన చివరి శ్వాసను విడుస్తున్న, జటాయువు… ‘నేను రావణుడితో గెలవలేనని నాకు తెలుసు, అయినా కానీ నేను పోరాడాను. నేను పోరాడకపోతే, రాబోయే తరాలవారు నన్ను పిరికి వాడు అని అనుకుంటారు!’


రావణుడు జటాయువు యొక్క రెండు రెక్కలను తెంచినప్పుడు… అప్పుడు  మృత్యువు వచ్చింది. అపుడు జటాయువు మృత్యువుకు సవాలు విసిరాడు…


“జాగ్రత్త! ఓ మృత్యువా ! ముందుకు రావడానికి సాహసం చేయద్దు. నేను ఎప్పటివరకు మరణాన్ని అంగీకరించనో, అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు. నేను సీతామాత యొక్క సమాచారం  ‘ప్రభు శ్రీరాముడి’కి చెప్పనంత వరకు నా వద్దకు రావద్దు” అన్నాడు!


మరణం జటాయువును తాకలేకపోతోంది, అది నిలబడి   వణుకుతూనే ఉంది. మరణం అప్పటివరకు కదలకుండా నిల్చునే వుంది, వణుకుతూనే ఉంది. తాను  కోరుకోగానే చనిపోయే వరం జటాయువుకి వచ్చింది.



కానీ మహాభారతానికి చెందిన భీష్మ పితామహుడు 58 రోజులు బాణాల అంపశయ్య మీద పడుకుని మరణం కోసం ఎదురు చూశాడు. అతని కళ్ళలో కన్నీళ్ళు. ఏడుస్తూవున్నాడు. కానీ భగవంతుడు మనస్సులో తనకి తాను  చిరునవ్వు నవ్వుతున్నారు!


ఈ దృశ్యం చాలా అలౌకికమైనది.


రామాయణంలో జటాయువు శ్రీరాముడి  ఒడిలో పడుకున్నాడు. ప్రభు ‘శ్రీరామ్’ ఏడుస్తున్నాడు మరియు జటాయువు చిరునవ్వు నవ్వుతున్నాడు.



అక్కడ మహాభారతంలో…’


భీష్మ పితామహుడు  ఏడుస్తున్నాడు మరియు                          ‘శ్రీ కృష్ణుడు’ చిరునవ్వు నవ్వుతున్నాడు.



తేడా ఉందా లేదా?


అదే సమయంలో, జటాయువుకు ప్రభువు ‘శ్రీరాముడి’ ఒడి పాన్పుగా  అయింది. 

కాని భీష్మపితామహుడు  చనిపోయేటప్పుడు బాణపు మొనలు పాన్పుగా అయ్యాయి!



జటాయువు తన కర్మ బలం ద్వారా ప్రభు ‘శ్రీరాముడి’ యొక్క ఒడిలో ప్రాణ త్యాగం చేసాడు.  జటాయువు ప్రభు శ్రీరాముడి శరణులోకి చేరాడు. 


మరియు బాణాలపై భీష్మపితామహుడు  ఏడుస్తున్నాడు.



ఇంత తేడా ఎందుకు?


ఇంతటి తేడా ఏమిటంటే..,


ద్రౌపది ప్రతిష్టను నిండు సభలో  పరువు తీస్తున్నా భీష్మ పితామహుడు చూశాడు. కానీ..

అడ్డుకోలేకపోయాడు! 

దుశ్శాసనునికి  ధైర్యం ఇచ్చారు. దుర్యోధనుడికి అవకాశం ఇచ్చాడు. 


కాని ద్రౌపది ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూ, అరుస్తూ, అరుస్తూ వున్నా సరే భీష్మ పితామహుడు తల వంచుకునే వున్నాడు. ద్రౌపదిని రక్షించలేదు.


దీని ఫలితం ఏమిటంటే, మరణం కోరుకున్నప్పుడే  వరం వచ్చిన తరువాత కూడా, బాణాల ములుకుల అంపశయ్య దొరికింది.


జటాయువు స్త్రీని సన్మానించాడు. 

తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, కాబట్టి చనిపోతున్నప్పుడు, అతనికి ప్రభు “శ్రీరాముడి” ఒడి అనే పాన్పు లభించింది!


ఇతరులకు తప్పు జరిగిందని చూసి  కూడా ఎవరు కళ్ళు తిప్పు కుంటారో,  వారి గతి భీష్ముడిలా అవుతుంది. 


ఎవరైతే ఫలితం తెలిసినప్పటికీ, ఇతరుల కోసం పోరాడుతారో వారు, మహాత్మ జటాయువులా కీర్తి సంపాదిస్తారు.


నిజం అనేది  కలత చెందుతుంది, కానీ ఓడిపోదు.✍️```

          *"సత్యమేవ జయతే "*

          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                  

🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే

 

జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే కనపడేవి అనుభవించిన బాధలు అనవసరంగా పడిన నిందలు మోసపోయిన క్షణాలు కోల్పోయిన నమ్మకాలు దూరమైన బంధాలు దగ్గరయ్యి బాధపెట్టిన మనుషులు నష్టపోయిన డబ్బులు...



పైన చెప్పిన విషయాలన్నీ జ్ఞాపకాలే కదా! జ్ఞాపకం అంటే అనుభవ పాఠాలే కదా! ఈ జీవిత క్రమంలో(పయనం) జరిగిపోయిన ప్రతిక్షణం తిరిగి రాదు కదా! పుట్టుక ,మరణం మధ్య ఉన్నదే జీవితం. పుట్టకముందు ఈ సృష్టిలో ఎక్కడ ఉన్నామో తెలియదు?మరణం తర్వాత ఎక్కడికి వెళతామో తెలియదు. మరి అలాంటప్పుడు ఈ భూమి పైకి అతిధులుగా వచ్చిన మనం జరిగిపోయినది తలుచుకుంటూ బాధపడుతూ ఉండాలా? ప్రస్తుత క్షణాలను ఆనందమయంగా ఉంచుకోవాలా ?అనేది మన చేతులలోనే(బుద్ధిలో ,ఆలోచనలో, ఆచరణ లో) ఉంది.🙏

శ్రీ జటాశంకర్ గుహాలయం

 🕉 మన గుడి : నెం 1087


⚜ మధ్యప్రదేశ్ : పచ్మర్హి


⚜ శ్రీ జటాశంకర్ గుహాలయం



💠 శివుని మొదటి నివాసం కైలాష్ పర్వతం (ప్రస్తుతం చైనాలో ఉంది) మరియు రెండవది జటాశంకర్, పచ్‌మర్హి, మధ్యప్రదేశ్, భారతదేశం. 


💠 భారతీయ నాగరికతకు పునాది వేసిన చారిత్రక ప్రదేశం మధ్యప్రదేశ్.


💠 చుట్టూ అందమైన రాళ్ళు మరియు గుహలు చాలా కాల్షియం నిక్షేపాలు ఉన్నాయి. బండరాళ్లతో లోతైన లోయలో ఉన్న ఈ హిందూ మందిరం భారతదేశంలోని మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో పచ్‌మర్హికి ఉత్తరాన ఉంది. 


💠 పంచమర్హిలోని జటా శంకర్ దేవాలయం అత్యంత ప్రసిద్ధి చెందిన పవిత్ర దేవాలయాలలో ఒకటి.  

జటాశంకర అనేది జటా అంటే జుట్టు నుండి ఉద్భవించింది మరియు శంకర్ అనేది శివుని మరొక పేరు.  


💠 ఈ గుహ లోతైన మరియు ఇరుకైన సందులో విశాలమైన బండరాళ్లతో ఉంది మరియు దాని లోపల అద్భుతమైన శివలింగం ఉంది.  

ఈ గుహ శివుని పుణ్యక్షేత్రం మరియు యాత్రికుల కోసం ప్రసిద్ధి చెందిన ప్రదేశం.


💠 అపారమైన బండరాళ్లతో కూడిన లోతైన లోయలో ఉన్న పచ్‌మర్హిలోని జటా శంకర్ గుహలు పవిత్రమైనవిగా పరిగణించబడతాయి ఎందుకంటే ఇది శివుడు భస్మాసురుడి కోపం నుండి దాక్కున్న ప్రదేశంగా నమ్ముతారు.


💠 ఈ గుహలో సహజంగా ఏర్పడిన లింగాలు ఉన్నాయి. వాస్తవానికి, ఈ గుహలో ఇటువంటి 108 సహజ లింగాలు ఉన్నాయి. 

ఈ ప్రాంతంలో రెండు రకాల చెరువులు ఉన్నాయి, ఒకటి చల్లని నీరు మరియు మరొకటి వేడి నీరు. 

గుహలోని నీరు తెలియని ప్రదేశం నుండి ప్రవహిస్తుంది, ఎందుకంటే ఎవరూ ఆ ప్రారంభ స్థానాన్ని చూడలేదు లేదా చేరుకోలేదు, అందుకే ఈ నీటి ప్రవాహం 'గుప్త గంగా' అని ప్రసిద్ధి చెందింది. 

జంబు ద్వీపం ప్రవాహం ఈ గుహ నుండి ఉద్భవించిందని నమ్ముతారు. 


💠 గుహ పైభాగంలో ఉన్న ఒక వేదికపై శంకరుడు మరియు పార్వతి దేవి విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి.


💠 మహా శివరాత్రి ఈ ఆలయంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ. ఇది సాధారణంగా ఫిబ్రవరి లేదా మార్చిలో జరుపుకుంటారు. 

పంచమర్హి కొండ ప్రాంతంలో శివరాత్రి పండుగ సందర్భంగా వార్షిక ఉత్సవం కూడా జరుగుతుంది, ఇది భారీ జనసమూహాన్ని ఆకర్షిస్తుంది.


💠 పర్యాటకులు సుమారు 1 కి.మీ నడిచి, గుహ ఆలయానికి దారితీసే 150 మెట్లు దిగాలి.


💠 మహాశివరాత్రి స్థానిక భక్తులు మరియు పర్యాటకుల మధ్య ప్రతి సంవత్సరం గొప్ప ఉత్సాహంతో, భక్తితో జరుపుకుంటారు.  

ఈ పెద్ద పండుగను ఏటా జరుపుకోవడానికి స్థానిక భక్తులు మరియు నిర్వాహకులు ఒక ఫెస్ట్ (జాతర) నిర్వహించారు.  

భక్తులు ఈ రాత్రి ఉపవాసం ఉంటారు మరియు రాత్రి వరకు ఏమీ తినరు మరియు శివలింగానికి పండ్లు, పువ్వులు మరియు బెల్లము సమర్పించారు. ఈ చెప్పుకోదగ్గ తీర్థయాత్ర పూలు మరియు దీపాలతో అలంకరించబడింది మరియు యాత్రికులకు మనశ్శాంతిని మరియు హృదయానికి శాంతిని అందించే ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగి ఉంది.


💠 గుహ నిర్మాణం వంద తలల శేష, విష్ణువు యొక్క సర్ప పర్వతాన్ని పోలి ఉంటుంది.


💠 రైలు ద్వారా: 

సమీప రైల్వే స్టేషన్ పిపారియా, పచ్‌మరి నుండి సుమారు 53 కిలోమీటర్ల దూరంలో ఉంది. 


  రచన

©️ Santosh Kumar

16-22-గీతా మకరందము

 16-22-గీతా మకరందము

   దైవాసురసంపద్విభాగయోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - కామాదులను తొలగించుకొనువాడు పరమశ్రేయమును బొందునని సెలవిచ్చుచున్నారు -


ఏతైర్విముక్తః కౌన్తేయ ! 

తమోద్వారై స్త్రిభిర్నరః | 

ఆచరత్యాత్మన శ్శ్రేయః

తతో యాతి పరాంగతిమ్ || 


తాత్పర్యము:- ఓ అర్జునా! (కామక్రోధలోభములనునట్టి) ఈ మూడు నరకద్వారముల నుండి బాగుగ విడువబడిన మనుజుడు తనకు హితమును గావించుకొనుచున్నాడు. అందువలన సర్వోత్కృష్టమగు మోక్షగతిని పొందుచున్నాడు.


వ్యాఖ్య:- కామ, క్రోధ, లోభములను ఈ మూడు దుష్టగుణము లున్నంతవఱుకును ఎవడును వృద్ధికిరాలేడు. హితమును బొందలేడు. తనకు మేలొనర్చుకొనలేడు. అందుచేత మొట్టమొదట వానిని తొలగించివేయవలెననియు, అపుడు మాత్రమే మానవుడు తనకు శ్రేయము నొనగూర్చుకొని సర్వోత్తమమగు మోక్షపదవిని బడయగలడనియు భగవాను డిచట బోధించుచున్నారు. సూర్యచంద్రులు రాహువునుండి విడువబడినట్లున్ను, గజేంద్రుడు మొసలిబారినుండి విడుదల బొందినట్లును, బంధితుడు కారాగృహమునుండి విముక్తుడైనట్లును జీవుడీ దుష్టత్రయము యొక్క బంధమునుండి విడుదలను బొందవలెను. "ముక్తః” అని చెప్పక "విముక్తః" అని చెప్పుటవలన వానినుండి పూర్తిగ విడుదల జెందవలెనని, వానిజాడ ఏమాత్రము హృదయకోశమున నుండరాదని భావము. మఱియు అవి ‘తమోద్వారము' లని పేర్కొనబడుటవలన, ఆ కామాదులు అజ్ఞానరూపములే యనియు, అంధకార బంధురములనియు, ప్రకాశ అభావరూపములనియు, నరకహేతువులనియు స్పష్టమగుచున్నది. అవి తమోద్వారములగుటచే, అవి కలవాడు "చీకటియింటి" లో కాపురము పెట్టిన చందముననే యుండును. అనగా దుఃఖములనే యనుభవించును.


"ఆచరత్యాత్మనః శ్రేయః” - ఆ కామాదులున్నంతవఱకు ఎవరును తనకు శ్రేయమును గలుగజేసికొనజాలరు. ఆత్మోద్ధరణము గావించుకొనజాలరు. తానెవరు? జగత్తేమి? అని విచారింపజాలరు. అనగా వాసనాక్షయము కానంతవఱకు ఆత్మజ్ఞానము పూర్ణముగ ఉదయించనేరదనియు, ఆత్మానుభూతి లెస్సగ కలుగదనియు అర్థము. కామాదులు వదలిపోయినపుడే అట్టి జ్ఞానము బాగుగ సంప్రాప్తము కాగలదని ఈ శ్లోకముద్వారా తెలియుచున్నది.

 కాబట్టి సాధకుడు ప్రప్రథమమున ఆ దుష్టత్రయమును పారద్రోలవలెను.

"పరాంగతిమ్" - అని చెప్పుటచే మోక్షము అన్ని పదములకంటెను, అన్ని గతులకంటెను సర్వోత్కృష్టమైనదని తెలియుచున్నది. మఱియు కామాదులున్న స్థితి అత్యంతనికృష్టమైనదనియు దీనివలన ధ్వనించుచున్నది.

ప్రశ్న:- కామాదు లెట్టివి?

ఉత్తరము:- అవి నరకద్వారములు.

ప్రశ్న:- మోక్షమను హితమునకై ఎవడు యత్నించును?

ఉత్తరము:- ఆ కామాదులనుండి లెస్సగ విముక్తుడైనవాడు.

ప్రశ్న:- అట్లు యత్నించుటవలన నతనికి కలుగు ఫలితమేమి?

ఉత్తరము:- అతడు మోక్షమును బడయగలడు.

ప్రశ్న:- మోక్షపద మెట్టిది?

ఉత్తరము:- అన్నిటికంటెను సర్వోత్తమమైనగతి (పరాంగతిమ్).

తిరుమల సర్వస్వం -215*

 *తిరుమల సర్వస్వం -215*

 *ఫల, పుష్ప ప్రదర్శ-3* 


 తితిదే ఉద్యానవన విభాగం శ్రీవారికి తిరుమల లోని ఇతర ఆలయాలకు కావలసిన పుష్పాలను సరఫరా చేయడంతో పాటుగా; తిరుమలకు విచ్చేసిన భక్తులకు ఆహ్లాదాన్ని కూడా అందిస్తోంది. ప్రతి ఉద్యానవనమూ ఒక నందనవనమే. ఆయా ఉద్యానవనాలను ప్రతి ఒక్కరూ తనివితీరా చూసి ఆనందించవచ్చు. 


 ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా పాపనాశనం మార్గంలో ఉన్న కళ్యాణవేదిక వద్ద తి.తి.దే. వారి ఆధ్వర్యంలో *'ఫల-పుష్ప ప్రదర్శన'* ఏర్పాటు చేయబడుతుంది. దేశ, విదేశాల నుండి తెప్పించిన అరుదైన పుష్ప జాతులను ఇక్కడ ప్రదర్శిస్తారు. ఏదో ఒక పౌరాణిక ఘట్టాన్ని ఇతివృత్తంగా తీసుకొని, పువ్వులను సృజనాత్మకత ఉట్టిపడేలా అమర్చి, ఆ ఘట్టాన్ని సజీవంగా ఆవిష్కరిస్తారు. క్రితం బ్రహ్మోత్సవాల్లో నీలాదేవి, శ్రీవేంకటేశ్వరుడి నుదుటికి తన కేశాలను అతికిస్తున్న దృశ్యం సాకారం చేయబడింది. ఇంతే కాకుండా తండ్రి జమదగ్ని ఆదేశం మేరకు క్షత్రియసంహారం కావిస్తున్న పరశురాముడు, యాచకుని రూపంలో సీతమ్మను అపహరించి వెడలుతున్న రావణుణ్ణి అడ్డగిస్తున్న జటాయువు, అశోకవనంలో శోకతప్తయై ఉన్న సీతమ్మకు నమస్కరించుకుంటున్న ఆంజనేయుడు, బకాసురునితో తలపడుతున్న భీమసేనుడు, చెట్టుచాటు నుంచి వాలిపై బాణప్రహారం చేస్తున్న శ్రీరాముడు వంటి పదునాలుగు పౌరాణిక పాత్రలకు కూడా జీవం పోశారు. పశ్చిమబెంగాల్ నుండి వచ్చిన ఇరవైమంది కళాకారుల ద్వారా సృష్టించబడ్డ అత్తివరదరాజస్వామి ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


 గత కొద్ది సంవత్సరాల నుంచి మైసూర్ కు చెందిన గౌరీ, నీలాంబిక అనే ఇద్దరు అక్కచెల్లెళ్ళు సైకతశిల్పాన్ని అత్యంత సృజనాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. క్రితం సారి బ్రహ్మోత్సవాల్లో వీరిరువురూ రెండురోజులు శ్రమించి, మూడు టన్నుల ఇసుక, అనేక రంగుల నుపయోగించి, 'గరుత్మంతునిపై విహరిస్తున్న శ్రీమహావిష్ణువు' యొక్క సైకతశిల్పాన్ని సాక్షాత్కరింప జేసి భక్తుల మనసును దోచుకున్నారు.


 *కొండపై పూలు ధరించరాదు..* 

3  'పుష్పమండపం' గా వ్యవహరించబడే తిరుమల క్షేత్రంలో, పువ్వులన్నీ స్వామివారికే చెందాలి. అందుచేత, భక్తులెవ్వరూ కొండపై పూలు ధరించరాదు. కొండపై జరిగే వివాహాలలో కూడా పువ్వులతో చేసిన మాలలు వాడటం పూర్తిగా నిషిద్ధం.


 శ్రీవారికి కైంకర్యం చేయబడ్డ పువ్వుల నైర్మల్యాన్ని భక్తులకు ప్రసాదంగా ఇచ్చే సాంప్రదాయం కూడా తిరుమలలో లేదు. వెయ్యేళ్ళక్రితం రామానుజుల వారు చేసిన కట్టడిననుసరించి, పూజా నైర్మల్యాన్ని ఈ మధ్యకాలం వరకూ సంపంగి ప్రదక్షిణమార్గానికి ఉత్తరదిశలో ఉన్న, నేడు 'పూలబావి' గా పిలువబడే, సాక్షాత్తూ భూదేవిచే నిర్మించబడ్డ 'భూతీర్థం' లో విసర్జించే వారు. అయితే ఎప్పటికప్పుడు పెరుగుతున్న భక్తులు, ఉత్సవాల కారణంగా పూజానైర్మల్యాలు కూడా అధికమవ్వడంతో ఇప్పుడు వాటిని తిరుమల సానువుల్లో, ఎవరూ తొక్కేందుకు అవకాశం లేని నిర్జనప్రాంతంలో వదులుతున్నారు. సంవత్సరంలో ఒకసారి తిరుచానూరులో జరిగే కార్తీకమాస బ్రహ్మోత్సవాల చివరి రోజున మాత్రం శ్రీవారి పూజానైర్మల్యాలను పద్మావతీ అమ్మవారికి కానుకగా సకల లాంఛనాలతో పంపుతారు.


 *పద్మావతీ ఉద్యానవనం* 


 పద్మావతి అమ్మవారి ఆలయం మాడవీధిని ఆనుకొని 'పద్మావతి ఉద్యానవనం' ఉంది. ఇందులో కూడా కనులకు ఇంపుగా ఉండే మందార, చేమంతి, బంతి, సన్నజాజులు, కాగడామల్లెలు వంటి రకరకాల పూలమొక్కలు, కొన్ని అరుదైన వృక్షజాతులు పెంచబడుతున్నాయి. సువిశాల ప్రాంగణంలో ఉండే ఈ ఉద్యానవనంలో చూడచక్కనైన కోనేరును కూడా చూడవచ్చు. ఈ మధ్యనే ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా ఒక వినూత్నమైన ప్రదర్శనకు తి.తి.దే. శ్రీకారం చుట్టింది. ఉద్యానవనం లోని కుడ్యాలపై పద్మావతీ పరిణయం లోని విశేషాలన్నింటిని వేరు వేరుగా, క్యూ ఆర్ సంకేతంతో సహా, చిత్రీకరించారు. 'పద్మావతి పరిణయం' యాప్‌ను మన చరవాణిలో డౌన్లోడ్ చేసుకుని, శబ్దగ్రహణయంత్రాలను (ఇయర్ ఫోన్స్) మన చెవులకు అనుసంధానించుకుని, ఆయా చిత్రాలపై ఉన్న క్యూ ఆర్ సంకేతాన్ని చరవాణి ద్వారా స్కాన్ చేస్తే; ఆ చిత్రంలో ఉన్న లఘు చలనచిత్రాన్ని, దృశ్య-శ్రవణ మాధ్యమాల ద్వారా చూడవచ్చు. అత్యద్భుతమైన, వినూత్నమైన ఈ ప్రయోగానికి భక్తుల నుండి ఎంతగానో ఆదరణ లభిస్తోంది.


 పుష్పాలకు అధిదేవత యైన 'పుల్లుని' ఆశీస్సులతో, శ్రీవేంకటేశ్వరుని కృపాకటాక్షాలతో, తి.తి.దే. ఉద్యానవనశాఖ మరింతగా రాణించి, ప్రపంచ ఉద్యానవనరంగంలోనే అగ్రగామిగా వెలుగొందాలని ఆ దేవదేవుణ్ణి వేడుకుందాం.


[ రేపటి భాగంలో ... *శ్రీ వేంకటేశ్వర వస్తుప్రదర్శన శాల (మ్యూజియం)* గురించి తెలుసుకుందాం]


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*


*353 వ రోజు*


*ధర్మరాజు ద్రోణుని వధించమని సైన్యాలను పురికొల్పుట*


వ్యాసుడు వెళ్ళిన తరువాత ధర్మరాజు మనసును కుదుటపరచుకుని ధృష్టద్యుమ్నుడితో " భీముడు ద్రోణుడితో యుద్ధం చేస్తున్నాడు. ఇక మీదట నీవు ద్రోణుడితో యుద్ధము చెయ్యి. నీవు ద్రోణుడిని చంపడానికే పుట్టావు. శిఖండిని పాంచాల సైన్యాలను వెంట తీసుకుని ద్రోణుడిని ఎదిరించు " అని చెప్పి మిగిలిన వారిని చూసి చూసి " విరాటరాజా ! ద్రుపద మహారాజా! సాత్యకీ ! నకుల సహదేవులారా! ఉపపాండవులారా! మన ముందున్న ఏకైక లక్ష్యం ద్రోణ వధ. పార్ధుని నాయకత్వంలో మీరంతా ద్రోణుడిని ఎదుర్కొనండి " అన్నాడు. అప్పటికే ఇరుపక్షముల సేనలు ఒక పగలు ఒకరాత్రి యుద్ధం చేసి అలసి పోయాయి. నిద్రమత్తులో క్షణం ఒక యుగంగాఊవస్థ పడుతున్నారు. నిద్ర మత్తులో తూలుతున్నారు. ఇది గమనించిన అర్జునుడు ఇరుపక్షముల యోధులను ఉద్దేశించి " సైనికులారా! మీరంతా బాగా అలసి పోయి ఉన్నారు. నిద్రావస్థతో జోగుతున్నారు. కనుక మీరంతా కొంతసేపు నిద్రపొండి. మరొక ఝాములో చంద్రోదయం ఔతుంది. చంద్రుడు వచ్చిన తరువాత వెన్నెల వెలుగులో మన్ము తిరిగి యుద్ధము చేస్తాము " అన్నాడు. ఈ సూచనకు ఇరుపక్షముల సైనికులు సంతోషంగా అంగీకరించారు. కౌరవ సైనికులు సహితము అర్జునుడి దయాగుణానికి శ్లాఘించారు. సైనికులంతా ఎక్కడి వారక్కడే నిద్రకు ఉపక్రమించారు. అలా నిద్రిస్తుండగా చంద్రోదయం అయింది. పండు వెన్నెల కాయగానే పాండవ కౌరవ సేనలు నిద్ర మేల్కొని యుద్ధానికి సిద్ధం అయ్యాయి.


*సుయోధనుడు ద్రోణుని నిందించుట*


సుయోధనుడు ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి " ఆచార్యా ! నీవు చాలా గొప్పవాడవు, మహావీరుడవ నీముందు నిలువగలవారెవరు లేరు. కాని నీవు నీ శిష్యులైన పాండవులను చంపక వదిలి పెట్టడం నా దురదృష్టం కాక మరేమిటి ? " అన్నాడు. ఆ మాటలకు ద్రోణుడు కోపించి " సుయోధనా ! నీ ఉద్దేశం నేను పాండవులను నా శిష్యులని వదిలి వేస్తున్నాననే కదా ! ఖాండవ వన దహన సమయంలో అర్జునుడు అగ్నిదేవునికి సాయంగా ఉన్నప్పుడు. ఇంద్రుడు నా శిష్యుడనే అతడిని వదిలి వేసాడా ? నాడు ఘోషయాత్రా సమయాన చిత్రసేనుడు నిన్ను బంధీగా పట్టుకున్న సమయాన నీ కొరకు యుద్ధము చేసిన అర్జునుడిని చిత్రసేనుడు నా శిష్యుడనే వదిలాడా? కాలకేయులనే రాక్షసులు అర్జునుడు నా శిష్యుడనే అతడి చేతిలో మరణించారా ? అర్జునుడి పరాక్రమం తెలిసీ నన్ను నిందించడం తగదు " అన్నాడు. సుయోధనుడు " ఆచార్యా ! మీరు అవకాశం వచ్చినప్పుడల్లా అర్జునుడిని పొగుడుతూనే ఉన్నారు. మీరు అలాగే చేస్తూ పాండవులను అర్జునుడిని నాకు వదలండి. నేను కర్ణ, దుశ్శాసన, శకుని సాయంతో పాండవులను అంత మొందిస్తాను. మీరు మీకిష్టమైన వారితో యుద్ధము చేయండి " అన్నాడు. ఆ మాటలకు ద్రోణుడు నవ్వి " సుయోధనా ! అలాగే మీరు అర్జునిడి ని ఎదుర్కొనండి మీరే గెలుస్తారేమో ! నాకు మాత్రం అర్జునుడి చేతిలో మరణించే భయం పోగొట్టావు అంతే చాలు " అన్నాడు.


*ద్రోణుడు పాంచాల సేనను ఎదుర్కొనుట*


తరువాత ద్రోణుడు పాంచాల సైన్యాంతో యుద్ధం చెయ్యడానికి వెళ్ళాడు. అప్పటికే తెల్లవారు ఝాము అయింది. సుయోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని ఒక్కసారిగా అర్జునుడిని ఎదుర్కొని అతడి మీద శరవర్షం కురిపించారు. మహా వీరుడైన ద్రోణుడు అతిరధ మహారధులతో యుద్ధం చేయక తమలాంటి సామాన్య సైనికులుతో యుద్ధం చెయ్యడమేమిటని పాంచాల సైనికులు ఆశ్చర్య పోతున్నారు. అంతటి మహావీరునితో యుద్ధము చేసి చచ్చినా పరవాలేదని కొందరు అతడిని ఎదుర్కొంటున్నారు. ఇంతలో విరాటరాజు, ద్రుపదుడు, అతడి మనుమలు, కేకయ రాజులు తమ సైన్యాలతో ద్రోణుడిని ఎదుర్కొన్నారు. ద్రోణుడు తన వాడి అయిన బాణాలతో పాంచాల మత్స్య సేనలను హతమార్చడమే కాక ద్రుపదుని మనుమలను ముగ్గురిని హతమార్చాడు. కేకయ రాజుల తలలను పండ్లు రాల్చినట్లు నేమీద పడ వేసాడు. అది చూసి విరాటుడు, ద్రుపదుడు వీరావేశంతో ద్రోణుడిని ఎదుర్కొన్నాడు. ద్రోణుడు వారిద్దరినీ అమిత పరాక్రమంతో ఎదుర్కొని వారిద్దరినీ చెరి ఒక బాణంతో నేల కూల్చాడు. తన తండ్రి మరణం కళ్ళారా చూసిన ధృష్టద్యుమ్నుడు " నేను కనుక ద్రోణుడిని చంపకపోతే నా కులాచారాన్ని ధర్మాలను తప్పిన వాడిని ఔతాను. అని ఘోర ప్రత్నిజ్ఞ చేసి పాంచాల సేనను తీసుకుని ద్రోణుడిని ఎదుర్కొన్నాడు. అది చూసి సుయోధనుడు కర్ణుడితో వచ్చి ధృష్టద్యుమ్నుడిని అడ్డుకున్నాడు. అంతలో భీమసేనుడు వచ్చి ధృష్టద్యుమ్నుడికి తోడుగా ద్రోణుడిని ఎదుర్కొన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: నాల్గవ అధ్యాయం

జ్ఞానయోగం: శ్రీ భగవానువాచ


యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనమ్ 

నాయం లోకో௨స్త్యయజ్ఞస్య కుతో௨న్యః కురుసత్తమ (31)


ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే 

కర్మజాన్ విద్ధి తాన్ సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసే(32)


కురుకులభూషణా.. యజ్ఞాలలో మిగిలిన అన్నమనే అమృతాన్ని భుజించేవారు శాశ్వత పరబ్రహ్మం పొందుతారు. యజ్ఞం ఒకటీ చేయనివాడికి ఇహలోక సుఖం లేదు; పరలోకసుఖం అసలేలేదు. ఈ విధంగా వివిధ యజ్ఞాలు వేదంలో విశదీకరింపబడ్డాయి. అవన్నీ కర్మలనుంచి ఏర్పడ్డాయని తెలుసుకుంటే నీవు సంసారబంధం నుంచి విముక్తి పొందుతావు.

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎

                    

*శ్లో* 𝕝𝕝 *ఛాయామన్యస్య కుర్వన్తి*

 *తిష్ఠన్తి స్వయమాతపే।*

             *ఫలాన్యపి పరార్థాయ*

 *వృక్షాః సత్పురుష ఇవ॥*


*భావం 𝕝𝕝 చెట్లు ఎండలో నిలబడి కూడా ఇతరులకు నీడనిస్తాయి.....ఇతరులు ఆనందించడానికి పండ్లను కూడా అందిస్తాయి.... చెట్లు నిజంగా మంచి మనుషుల కంటే మంచిగా ఉంటాయి....*

   

 ✍️💐🌸🌹🙏

what century live

 Q. In what century live in? we are


Ans. We are in century where our phones are wireless, cooking is Fireless, cars are Keyless, Food is Fatless, Tyres are tubeless, Dresses are Sleeveless, youth are Jobless, Leaders are Shameless, Relationships are meaningless, Attitude. Is careless wives are Fearless, Babies are Fatherless, Feelings are Heartless, Education is valueless, children are mannerless, Everything is Becoming less, But still our hopes are endless


In Fact i am speechless!


10


Good L


Dislik

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                *విరచిత*

         *”శివానందలహరి”*

            *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉🕉️

*"నీ పాద ద్వంద్వాన్ని ఒక్కసారి నా కళ్ళకు కనబడేటట్లు చెయ్యి, నీ పాదాలను ఒత్తుతాను" అని శంకరులు శివుణ్ణి ఈ శ్లోకమున కోరారు.*


 *శ్లోకం : 79*


*నిత్యంయోగి మనస్సరోజదళ సంచార క్షమస్త్వత్క్రమః*


*శంభో! తేన కథం కఠోర యమరాడ్వక్షః కవాటక్షతిః*


*అత్యంతం మృదులం త్వదంఘ్రి యుగళం హామే మనశ్చింతయ*


*త్యే తల్లోచనగోచరం కురు‍విభో! హస్తేన సంవాహయే!!*


*తాత్పర్యము :-*


*ಓయి శంకరా! నీ పాద విన్యాసము నిత్యమునూ పద్మ దళము వలె మెత్తని యోగీంద్రుల మనస్సులలో సంచరించడానికి తగినది. దానితో అతి కఠినమైన యముడి వక్షః కవాటాన్ని తన్నడం ఎలా జరిగింది ?*

*నీ పాద యుగళము మిక్కిలి మృదువైనది. అందుచే నా మనస్సు, నీకు ఆ బాధ ఎలా తీరుతుందా ? అని ఆలోచిస్తుంది. నీ పాద ద్వంద్వాన్ని ఒక్కసారి నాకళ్ళకు కనబడేటట్లు చెయ్యి, దానిని నా చేతితో ఒత్తి నీకు శ్రమ తీరుస్తాను.*


*వివరణ:-*


*శంకరులు ఈశ్వరుణ్ణి ఆయన పాదాలను సేవించే భాగ్యం తనకు ప్రసాదించమని ఇలా కోరారు.*


*ಓ ఈశ్వరా! నిన్ను నిరంతరం యోగీశ్వరులు, హృదయాలలో ధ్యానిస్తూ వుంటారు. అప్పుడు నీవు వారి హృదయ కమలాల రేకులపై సంచరించాలి. ఇది నీకు నిత్యకృత్యం. సహజంగా నీ పాదాలు మృదువుగా వుంటాయి. ఆందులోనూ యోగీశ్వరుల హృదయ పద్మాల రేకులపై నిత్యం నడుస్తూ యుండడం వల్ల అవి మరింత సుకుమరంగా, సుతిమెత్తగా తయారయి యుంటాయి. అటువంటి పాదాలతో బండ రాయి లాంటి కఠినమైన యముడి వక్షఃస్థలాన్ని నీవు ఎలా తన్నావు ? అయ్యో ! నీసాహసాన్ని తలచుకుంటేనే నా హృదయం ద్రవించి పోతుంది. ఏదీ నీ పాదాలను ఒక్కసారి నా కనుల ముందు పెట్టు. నా చేతులతో వాటిని పట్టుకుని ఒత్తుతాను.".అని చెప్పి శంకరులు ఈశ్వర పాదసేవా భాగ్యాన్ని దక్కింౘుకునే ప్రయత్నం చేశారు.*


*భగవంతుడి పాద దర్శనంవల్ల కలిగే ఆనందానుభూతిని గురించి కేవలం బ్రహ్మాదులకే తెలుస్తుంది.మనం శివ పాదారవింద దర్శనం వల్ల కలిగే అనుభూతిని ఊహించలేము.*


*గుహుడు రామచంద్రుని పాదములను కన్నులారా చూసి , వాటిని కడిగి ఆ పాదాలను తన మనస్సులో నిల్పుకొని పరమానందంతో పారవశ్యం చెందాడని రామాయణం చెపుతోంది.*


*అలాగే గోపికలు బాలకృష్ణుని పాదాలను చూసి వాటిని చేతితో పట్టి ఎత్తి కన్నులకద్దుకుని తమ శిరస్సులపైన, హృదయం పైన పెట్టుకుని మైమరచి పోయారు.*


*భాగవతంలో అక్రూరుడు నంద గోకులానికి వెళ్ళి కృష్ణుడు నడచిన ఇసుకపై ఆయన పాద ముద్రలను చూసి ఆనందంతో తన రథాన్ని దిగి ఆ ఇసుకలో పొర్లాడాడు. ఇదీ భగవంతుడి పాద మహిమ.*  


*అందుకే శంకరులు ఈశ్వరుణ్ణి తనకు శివుని పాద సేవా భాగ్యాన్ని కల్పించమని కోరారు..*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

క్షమా యాచన మంత్రం*

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉🕉

     *క్షమా యాచన మంత్రం*

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉🕉


*యదక్షర పరభ్రష్టం*

 *మాత్రాహీనంతు యద్భవేత్ |*


*తత్సర్వం క్షమ్యతాం దేవ*

 *నారాయణి నమోస్తుతే ||*


*భావం:-*


*నే పలికిన పలుకులలో అక్షర దోషములున్న వాటిని క్షమించమని పార్వతీ మాతకు నమస్కరిస్తున్నాను.*


*ఓం శ్రీ మాత్రే నమః॥*

*ఓం శ్రీ మాత్రే నమః॥*

*ఓం శ్రీ మాత్రే నమః॥*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం

 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

     అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం 

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*లంకాయాం శాంకరీ దేవీ, కామాక్షీ కంచికాపురే, ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే.*


*అలంపురే జోగులాంబా, శ్రీశైలే భ్రమరాంబికా, కొల్హాపురే మహాలక్ష్మీ, మాధుర్యే ఏకవీరికా.*


*ఉజ్జయిన్యాం మహంకాళీ, పీఠికాయాం పురుహూతికా ఓఢ్యాయాం గిరిజాదేవీ, మాణిక్యా దక్షవాటికే.*


*హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ, జ్వాలాయాం వైష్ణవీ దేవీ, గయా మాంగల్యగౌరికా.*


*వారాణస్యాం విశాలాక్షీ, కాశ్మీరేషు సరస్వతీ, అష్టాదశ సుపీఠాని యోగినా మపి దుర్లభమ్.*


*సాయంకాలే పఠేన్నిత్యం, సర్వ శత్రువినాశనం, సర్వ రోగ హరం దివ్యం సర్వ సంపత్కరం శుభం.*


*ఇతి అష్టాదశపీఠస్తుతి: సంపూర్ణం.*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

అష్టాదశ శక్తిపీఠాలు*

 🕉🕉🕉🛐🛐🕉🕉🕉🕉

*అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాలు*

    *వాటి కథనాలు క్లుప్తంగా !*

    *(క్రిందటి భాగం తరువాయి)*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*క్రిందటి భాగంలో 13 శక్తి పీఠాల వరకు తెలుసుకొన్నాం. ఈరోజు మిగిలిన 5 శక్తి పీఠాల గురించి తెలుసుకుందాం.*


*14. మాధవేశ్వరి: అమ్మవారి కుడిచేతి నాలుగువేళ్లు ప్రయాగ(అలహాబాద్‌) ప్రాంతంలో పడినట్టు చెబుతారు. సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. నాలుగుదిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తిచెందుతారు. తాము తెచ్చే కానుకలను వూయలలో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు.*


*15. సరస్వతి: కాశ్మీర్‌లోని నేటి ముజఫరాబాద్‌కు ఇంచుమించు 150కి.మీ. దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు. ఇక్కడ అమ్మవారి కుడిచేయి పడిందని చెబుతారు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యులవారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకరవిజయకావ్యం ద్వారా తెలుస్తోంది.*


*16. వైష్ణవీదేవి: అమ్మవారి నాలుక హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు. భూమిలోంచి వచ్చే సహజవాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు. ఆ జ్వాలలు అవమానభారానికి గురైన సతీదేవి ఆగ్రహానికీ శక్తికీ సంకేతమని విశ్వసిస్తారు భక్తులు*. 


*మరికొందరు... 'జ్వాలాయాం వైష్ణవీదేవి' అంటే అది ఈ గుడి కాదనీ జమ్మూలోని వైష్ణోదేవి ఆలయమనీ చెబుతారు.*


*17. మంగళగౌరి: సతీదేవి శరీరభాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయ. అమ్మవారు మంగళగౌరీదేవి. స్థలపురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు.*


*18. విశాలాక్షి: సతీదేవి మణికర్ణిక(చెవి కుండలం) కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందనీ అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందనీ స్థలపురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుకభాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడి వైభవాన్ని కళ్లు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి.*


*అమ్మవారి శక్తి పీఠాలు వెనుక ఉన్న వృత్తాంతం:*


*ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది.*


*విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుణ్ని సృష్టించి దక్షయాగాన్ని ధ్వంసం చేశాడు. సతీదేవి పార్థివదేహాన్ని భుజాన వేసుకుని ప్రళయతాండవం చేశాడు. ఉగ్రశివుణ్ని శాంతింపజేసేందుకు చక్రప్రయోగం చేసి , సతీదేవి శరీరాన్ని ఖండించాడు విష్ణువు. ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ శక్తి పీఠాలు అయ్యాయి. ఇదీ అమ్మవారి శక్తి పీఠాలు, వాటి వెనుక ఉన్న వృత్తాంతం.*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

శ్రీమద్ భాగవతం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

            *(110వ రోజు)*

   *(క్రిందటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

            *కృష్ణావతారం*

*బలరామకృష్ణులు - మధురకు రాక* - *కంసుడు - మృత్యు సూచనలు* 

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*అద్దంలోకి చూసుకుంటూ మైపూతలు పూసుకుంటుంటే అద్దంలో తన తల కనిపించలేదు. మొండమే కనిపించింది. అలా కనిపిస్తే మృత్యువు దగ్గరపడినట్టే.*


*దీపం, సూర్యుడు, చంద్రుడు రెండు రెండుగా కనిపించాయి. అలా కనిపించకూడదు. కనిపిస్తే మరణం ఆసన్నమయినట్టే!*


*పాదప్రక్షాళన చేసుకుని భోజనానికి వస్తూ తడికాళ్ళ ముద్రలను అప్రయత్నంగా చూశాడు. లేవు. నేల మీద కాలిముద్రలు లేవంటే ఎంతోకాలం బతకరంటారు.* 


*చెవిరంధ్రాల్లో వేళ్ళు పెట్టుకుంటే గమ్మతయిన ఘోష వినవస్తుంది. చెవిలో వేళ్ళు పెట్టుకుంటే అలా వినరావడం లేదు. వినరాలేదంటే చావుకి దగ్గరపడినట్టే!*


*శవాన్ని కౌగలించుకున్నట్టు, గాడిదనూ, దున్నపోతునూ ఎక్కి ఊరేగుతున్నట్టు, తైలంతో తలంటుకున్నట్టు, దిసమొలతో తిరుగుతున్నట్టు తరచూ కలలు వస్తున్నాయి. ఆ కలలకు అర్థం మృత్యువు.*


*చెట్లు బంగారురంగులో కనిపించకూడదు. ఉద్యానవనంలోని చెట్లన్నీ అలాగే కనిపిస్తున్నాయి. ఆకుల దగ్గర్నుంచీ అంతా సువర్ణమయంగా కనిపిస్తోంది. కనిపించిందంటే చావు మూడిందనే అంటారు.*


*చావు తనని సమీపిస్తోంది. పొదివిపట్టుకునేందుకు దీర్ఘబాహువులు చాస్తోంది. తాను అందకూడదు. అందకుండా పరుగెత్తాలి. పరిగెత్తాడు కంసుడు. తల్పం మీద నుంచి ఎప్పుడు దిగాడో తెలియదు. ఎటు నుంచి ఎటు పరిగెత్తాడో తెలియదు. అంతఃపురం ఆఖరి వసారాను చేరుకున్నాడతను. దాటితే కందకం. పడితే మొసళ్ళకు ఆహారమయిపోతాడు. కాని పడలేదు. నిలదొక్కుకున్నాడు కంసుడు. బాధతో, భయంతో నిస్త్రాణంగా అక్కడి గోడకి చేరగిలబడ్డాడు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

అష్టాదశ శక్తిపీఠాలు*

 🕉🕉🕉🛐🛐🕉🕉🕉🕉

*అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాలు*

    *వాటి కథనాలు క్లుప్తంగా !*

    *(క్రిందటి భాగం తరువాయి)*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*క్రిందటి భాగంలో తొమ్మిది శక్తి పీఠాల వరకు తెలుసుకొన్నాం. ఈరోజు మరికొన్ని శక్తి పీఠాల గురించి తెలుసుకుందాం.*


*10. పురుహూతిక: పురాణ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం. పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయణి పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధం. ఇక్కడ అమ్మవారు పురుహూతికా దేవిగా హూంకారిణిగా భక్తుల పూజలందుకుంటోంది.*


*11.గిరిజాదేవి: గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ జిల్లాలో కొలువైన తల్లి. ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి. గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరజాదేవి అనేపేర్లతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు. సర్వాలంకృతయై మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివితీరదంటారు భక్తులు.*


*12.మాణిక్యాంబ:~*


*సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామక్షేత్రం కూడా. సతీదేవి తండ్రి అయిన దక్షప్రజాపతి రాజ్యంలోని దక్షిణభాగమే ఈ ప్రాంతమనీ ఆ చక్రవర్తి కొన్నాళ్లు ఇక్కడ ఉన్నాడనీ స్థలపురాణం. ఒకసారి వ్యాసమహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలచి తిండి దొరక్కుండా చేశాడట. అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకూ ఆయన పరివారానికీ అన్నం పెట్టిందట. శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ను కాశీవిడిచిపెట్టి వెళ్లమన్నాడనీ అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుణ్ని ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందనీ పురాణ ప్రతీతి.*


*13.కామాఖ్య: అసోం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వతశిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందనీ అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారనీ స్థలపురాణం. అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోనిభాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు వూటలా స్రవిస్తూ ఉంటుంది.*


*(రేపు మిగిలిన శక్తి పీఠాలు గురించి తెలుసుకుందాం)*


*ఓం శ్రీ మాత్రే నమః॥*

*ఓం శ్రీ మాత్రే నమః॥*

*ఓం శ్రీ మాత్రే నమః॥*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

శ్రీమద్ భాగవతం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

            *(109వ రోజు)*

   *(క్రిందటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

            *కృష్ణావతారం*

*బలరామకృష్ణులు - మధురకు రాక* - *కుబ్జ కేళివిలాసం* 

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*‘‘అందం ఇంత అందంగా ఉంటుందని నాకు తెలియదు. అలాగే నీ స్పర్శలో ఇంత సుఖం ఉన్నదని కూడా నాకు తెలియదు. ఈ అందం, ఈ సుఖం నాకు శాశ్వతం చెయ్యి. నా భర్తవు నువ్వే! నన్ను కరుణించు. నల్లనయ్యా నా ఇంటికి రావయ్యా, నను కూడి శయనించయ్యా.’’ కృష్ణుణ్ణి వేడుకుంది కుబ్జ.*


*‘‘తప్పకుండా వస్తాను.’’ అన్నాడు కృష్ణుడు.*


*‘‘నిజంగా’’ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని కృష్ణుణ్ణి నఖశిఖపర్యంతం చూసింది కుబ్జ.‘‘నిజం. అయితే ఇప్పుడు కాదు. ఈ మధురాపురిలో నేను వచ్చిన పని కానీ. అది అయిన తర్వాత తప్పకుండా నీ దగ్గరకు వస్తాను. నిన్ను అలకరిస్తాను. ఆనందిద్దాం.’’ అన్నాడు కృష్ణుడు.*


*‘‘నీ కోసం వేచి ఉంటానయ్యా.’’ అని కృష్ణుణ్ణి పదేపదే చూస్తూ అక్కణ్ణుంచి పరుగందుకుంది కుబ్జ.క్షణం ఒక యుగంగా ఎన్ని యుగాలు కృష్ణుని కోసం వేచిందో! వేగిపోయిందో! ఆఖరికి కృష్ణుని కౌగిలిలో కరగిపోయింది కుబ్జ. కన్నీరయి అతని పాదాలనంటి తరలిపోయింది. కంసుని సంహరణానంతరం ఉద్ధవుని వెంట కృష్ణుడు, కుబ్జ ఇంటికి వెళ్ళాడు. గుమ్మంలో నిలిచిన కృష్ణుని చూసి నమ్మలేకపోయింది కుబ్జ. మాధవుడు మాట నిలబెట్టుకుంటాడా? అని అనుమానించింది.*


*నిలబెట్టుకుని, నిలిచాడు కృష్ణ పరమాత్మ ఎదురుగా. చేతులు జాచి ఆహ్వానించిందతన్ని. ప్రేమించి పూజించింది. ఆ రాత్రంతా కుబ్జను అనుభవించాడు కృష్ణుడు. రసరాజాన్ని అందించాడు. తర్వాతి కాలంలో శ్రీకృష్ణ కుబ్జలు ఓ కుమారుణ్ణి కన్నారు. అతని పేరు ఉపశ్లోకుడు.తనని ఆరాధిస్తే చాలు, భగవంతుడు అనంతసౌఖ్యాలు అందిస్తాడు. అందుకే ఈ కథ అంటారు పెద్దలు. త్రివక్రను, పరిచారికను, దాసిని ఉద్ధరించడం, ఆమె మనోరథం ఈడేర్చడం శ్రీకృష్ణుని ఉదాత్తగుణానికి ఓ ఉదాహరణ. ఆ దేవదేవుని సంస్కారానికి మచ్చుతునక*


*కంసుడు - కకావికలు*


*కుబ్జను కటాక్షించి బలరామకృష్ణులు వెనుదిరిగారు. ఉద్యానవనానికి రావాల్సి ఉంది. అయితే వారిద్దరూ అటుగా నడవలేదు. ధనుర్యాగం జరిగేదెక్కడో తెలుసుకున్నారు. నడిచారటుగా. కంసమహారాజుకి తమ ధైర్యస్థయిర్యాలు తెలియజెయ్యాలి. బలరామకృష్ణులంటే అతనికి వణకుపుట్టాలి. ఈ రాత్రి నిద్ర కరవవ్వాలతనికి అనుకున్నారు. ధనుర్యాగం జరిగే ప్రదేశానికి చేరుకున్నారు బలరామకృష్ణులు. చుట్టూచూశారు. అదో పెద్ద ఆయుధశాల. రకరకాల శస్త్రాస్త్రాలు ఉన్నాయక్కడ. వాటిని బలశాలురయిన భటులు కాపలా కాస్తున్నారు. వారు వారించినప్పటికీ బలరామకృష్ణులు వినలేదు. ఆయుధాలను పట్టి చూశారు. పెద్దధనుస్సు కనిపించింది కృష్ణునికి. వెళ్ళి దాన్ని స్పృశించాడు చూడచక్కగా ఉన్నది ధనుస్సు. ఇంద్రధనుస్సులా, శివధనుస్సులా వెలిగిపోతున్నది. అందుకున్నాడు దాన్ని. సునాయసంగా ఎత్తాడు. భటులది చూసి ఆశ్చర్యపోయారు. ఇంత వరకూ ఆ ధనుస్సును ఎత్తినవారు లేరు. కంసమహారాజుకూడా దానిని ఎత్తేందుకు ఎక్కుపెట్టేందుకు చాలా కష్టపడతాడు. అలాంటిది కృష్ణుడు ధనుస్సును అవలీలగా ఎత్తాడు. ఎత్తి దానికి నారిని బిగించబోయాడు. అంతే! ఫెళఫెళమంటూ విరిగిపోయింది ధనుస్సు.*


*అది చూసి భటులంతా బెదరిపోయారు. హాహాకారాలు చేశారు. ధనుస్సు విరిగిన ధ్వని అంతఃపురంలో ఉన్న కంసునికి వినవచ్చింది. అదిరిపడ్డాడతను. ధనుస్సును విరచినందుకు కృష్ణుని మీద భటులు దాడి చేశారు. కత్తులు ఝళిపించారు. ఆ పాపానికి అంతా ప్రాణాలు కోల్పోయారు. కృష్ణుని మీదకి కత్తి ఎత్తితే ప్రాణాలుపోతున్నాయని తెలుసుకున్నాడు కంసుడు. భయపడ్డాడు. అంతలోనే తేరుకుని, బలరామకృష్ణులను వధించి రమ్మని వారి మీదకి సైన్యాన్ని ఉసిగొల్పాడు. వందలాది మంది సైన్యం మూకుమ్మడిగా బలరామకృష్ణులను ఎదుర్కొంది. పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కంసుని సైన్యం ఒక్కరూ మిగల్లేదు. అంతా మరణించారు. బలరామకృష్ణుల శౌర్యపరాక్రమాలకు మధురాపురప్రజలు ఆశ్చర్యపోయారు. వేనోళ్ళ ప్రశంసించారు వారిని. అప్పటికి బాగా చీకటి పడింది. నందాది ప్రముఖులు ఆందోళన చెందుతారని, ఇక వెళ్ళక తప్పదని అప్పుడు ఉద్యానవనానికి బయల్దేరిద్దరూ. చేరుకున్నారక్కడకి. రాత్రి సుఖంగా నిద్రించారు. బలరామకృష్ణులు హాయిగా ఇక్కడ నిద్రపోతుంటే అక్కడ కంసుడికి నిద్రకరవయింది. కృష్ణుడు ధనుర్భంగం కావించడం, కావలి భటులనూ, సైన్యాన్నీ మట్టుబెట్టడం తలచుకుంటూ కంసుడు నిద్రకు దూరమయ్యాడు. భయాన్ని మించిన భూతం లేదు. అది పట్టుకుందంటే మనిషిని పీల్చి పిప్పి చేసి కాని వదలదు. ఇప్పుడది కంసుణ్ణి గట్టిగా పట్టుకుంది. ఊపిరాడనీయడం లేదతన్ని. బలరామకృష్ణులు తనని సంహరించేందుకే పుట్టారు. అనుమానం లేదనుకున్నాడతను. అయిపోయింది. తనిక ఎంతో కాలం బతకననుకున్నాడు. నీడలా తనని మృత్యువు వెంటాడుతోందనిపించింది. కంటి మీద కునుకు లేదు. లేచి కూర్చున్నాడు కంసుడు. తల్పానికి చేరబడి కళ్ళు మూసుకున్నాడు. ఆలోచించసాగాడు. గత కొద్దిరోజులుగా పొడగట్టిన దుర్నిమిత్తాలను నెమరువేసుకున్నాడు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                *విరచిత*

         *”శివానందలహరి”*

            *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉

*ఈ శ్లోకంలో అజ్ఞానమనే తెరను తొలగించి, తన కన్నుల ఎదుట సాక్షాత్కరింపుమని, శంకరులు ఈశ్వరుని వేడుకుంటున్నారు. అనేక విధాలుగా బాధపడుతున్న బుద్ధి యొక్క విచారాన్ని పోగొట్టి, ఉద్ధరింపుమని శంకరులు ప్రార్థిస్తున్నారు.*


*శ్లోకం : 77*


*బుద్ధిః స్థిరా భవితు మీశ్వరపాదపద్మ*


*సక్తా వధూర్విరహిణీవ సదా స్మరంతీ*


*సద్భావనా స్మరణ దర్శన కీర్తనాది*


*సమ్మోహితేవ శివమంత్రజపేన వింతే !!*


*తాత్పర్యము :~*


*దయాసముద్రుడవైన ಓ ఈశ్వరా! మీ పాదపద్మముల యందు ఆసక్తిగల నా బుద్ధి, భర్తృవియోగాన్ని చెందిన భార్యవలె, నిరంతరమూ నిన్నే ధ్యానంచేస్తూ, "శివ శివ" అనే నామ మంత్రాన్ని జపిస్తూ, మోహాన్ని పొందినదై, స్థైర్యం కోసం, మీ పాదధ్యానం, మీ పాద స్మరణం, మీ పాద సందర్శనం, మీ పాద సంకీర్తనం, మీ పాదపూజ మొదలయిన వాటిని గూర్చి విచారిస్తుంది. దీన్ని ఉద్ధరించు.*


*వివరణ :~*


*బుద్ధి భర్తృవియోగాన్ని పొందిన సాధ్వివలె, శివుని పద్మాలవంటి పాదాలయందు ఆసక్తి కలిగి, ఎల్లప్పుడూ శివుణ్ణే స్మరిస్తూ శివ నామ మంత్రంతో ఈశ్వరుణ్ణే భావించడం, ధ్యానించడం, కీర్తించడం, పూజించడం మొదలయిన వాటిచే, మోహమును పొందిన దానివలె వర్తిస్తోంది.*


*అనగా శివ భక్తి పరాయణుల బుద్ధి, విరహిణియైన సాధ్వి , సదా భర్తనే స్మరిస్తున్న పిచ్చిదానివలె ఉండే విధంగా, ఎప్పుడూ ఈశ్వరునే భావిస్తూ, ధ్యానిస్తూ, కీర్తిస్తూ ఉంటుందని భావం.*


*ఈ శ్లోకంలో శంకరులు పూర్తిగా శివుని యందు నిరంతరాసక్తి కలిగిన తన బుద్ధిని, భర్తకు దూరమై విరహవేదనతో సతమతమయ్యే భార్యతో పోల్చి చెప్పారు.*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

అష్టాదశ శక్తిపీఠాలు*

 🕉🕉🕉🛐🛐🕉🕉🕉🕉

*అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాలు*

    *వాటి కథనాలు క్లుప్తంగా !*

    *(నిన్నటి భాగం తరువాయి)*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*నిన్నటి రోజున మూడు శక్తి పీఠాల గురించి తెలుసుకొన్నాం. ఈరోజు మిగిలిన శక్తి పీఠాల గురించి తెలుసుకుందాం.*


*4.చాముండి : హరుని రుద్రతాండవంలో అమ్మవారి కురులు వూడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం. ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి సతి శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవీభాగవతం చెబుతోంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది.*


*5. జోగులాంబ : మనరాష్ట్రంలోని నాలుగు శక్తిపీఠాల్లో వెుదటిది ఈ క్షేత్రం. సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు/దవడ భాగం పడినట్టు చెప్పే చోటు. ఈ దేవి కొలువైన ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. అప్పట్లో అక్కడివారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట. 2004లో కొత్తగా గుడికట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటిగుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకే ఈ ఏర్పాటు అని చెబుతారు స్థానికులు.. ఆ తల్లి సమక్షంలో సప్తమాతృకలు, వీణాపాణి (సరస్వతీదేవి), వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి.*


*6. భ్రమరాంబిక: విష్ణుచక్ర భిన్న అయిన సతి మెడ భాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి.* 


*అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకూ మునులకూ కంటకుడుగా తయారయ్యాడట. రెండు, నాలుగు కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతణ్ని సంహరించేందుకు... ఇక్కడ కొలువైన సతి 'శక్తి' భ్రమర(తుమ్మెద) రూపంలో అవతరించిందట. అసురవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జునస్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థలపురాణం.*


*శంకరాచార్యులవారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేసి, భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైలక్షేత్రంలోనే ఆయన 'సౌందర్య లహరి' కూడా రచించారని చెబుతారు.*


*7. మహాలక్ష్మి : రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి 'అంబాబాయి'గా కొల్హాపూర్‌ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. కొల్హాపూర్‌ వాసులు ఈ అమ్మవారిని భవానీమాతగానూ కరవీరవాసినిగానూ కొలుస్తారు. కొల్హాపురీ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదుపడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి రెండు కన్నులు సరిపోవంటారు భక్తులు. మహాప్రళయకాలంలో కూడా లక్ష్మీదేవి ఈక్షేత్రాన్ని వీడదని పురాణప్రతీతి. అందుకే కొల్లాపూర్‌ను 'అవిముక్త క్షేత్రం'గా వ్యవహరిస్తారు.*


*8.ఏకవీరాదేవి: మహారాష్ట్రలోని నాందేడ్‌ సమీపంలోని మాహోర్‌ క్షేత్రంలో వెలసిన తల్లి ఏకవీరికాదేవి. దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మకం. దక్షయజ్ఞంలో తనువు చాలించిన పార్వతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరా దేవిగా భక్తుల పూజలందుకుంటోందని చెబుతారు. ఇక్కడ రేణుకాదేవినే ఏకవీరాదేవిగా పొరబడతారు బయటి నుంచి వచ్చే భక్తులు. అసలైన ఆలయం మాహోర్‌కు 15 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్దపెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లినే ఏకవీరికాదేవిగా కొలుస్తారు స్థానికులు.*


*9. మహాకాళి : సప్త వోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయినీ నగరంలో సతీదేవి పై పెదవి పడిందని దేవీ భాగవతం చెబుతోంది. ఆ శక్తి మహంకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి. ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది. పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడట. బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల చిందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి తన పొడవైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థలపురాణం. స్థానికులు ఈ దేవిని గ్రహకాళికగా కొలుస్తారు. కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ తల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉజ్జయినీ మహానగరం ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రం కూడా.*


*(రేపు మరికొన్ని శక్తి పీఠాలు గురించి తెలుసుకుందాం)*


*ఓం శ్రీ మాత్రే నమః॥*

*ఓం శ్రీ మాత్రే నమః॥*

*ఓం శ్రీ మాత్రే నమః॥*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

శ్రీమద్ భాగవతం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

            *(108వ రోజు)*

   *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

            *కృష్ణావతారం*

*బలరామకృష్ణులు - మధురకు రాక* - *కుబ్జ కేళివిలాసం*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*కంసుని ధనుః యాగం ఆహ్వానాన్ని అందుకుని బలరామకృష్ణులు మధురాపురం చేరుకున్నారు. ఇద్దరికీ సరదాగా పురవీధులు తిరగాలనిపించింది. తిరగసాగారు. ఓ సాలెవాణ్ణి చూశారప్పుడు. అతడు చిత్రవిచిత్రంగా వస్త్రాలు నేస్తున్నాడు. బాగున్నాయవి. చూడముచ్చటనిపించాయి. నిలిచారక్కడ. తన ఎదురుగా నిలిచిన బలరామకృష్ణులను అవతారపురుషులని గ్రహించాడు నేతగాడు. చేతులెత్తి నమస్కరించాడు. యథాశక్తి వారిని పూజించాడు. తను నేసిన చిత్ర విచిత్ర వస్త్రాలు కట్టబెట్టి, అలంకారాలు చేశాడు వారికి. చూసి ఆనందించసాగాడు. అతని భక్తిని మెచ్చుకున్నాడు కృష్ణుడు. అష్టైశ్వర్యాలూ, ఆయురారోగ్యాలూ ప్రసాదించాడతనికి.*


*అక్కణ్ణించి నిష్క్రమించారు. ముందుకు నడిచారు. పూలమాలలు అల్లే సుదాముడి ఇంటి ముంగిట నిలిచారు. సుదాముడు గొప్ప భక్తుడు. బలరామకృష్ణులు ఇంటి ముంగిట నిలిచిన మరుక్షణం వారిని గుర్తించాడతను. లోనికి ఆహ్వానించాడు. పూజించాడు వారిని. స్వయంగా అల్లిన పూలమాలలు బలరామకృష్ణుల మెళ్ళో వేసి, తనివితీరా చూసి పొంగిపోయాడు. సాష్టాంగపడ్డాడు వారికి. కృష్ణుడు అతని భక్తిని మెచ్చుకున్నాడు.‘‘వరం కోరుకో’’ అన్నాడు.*


*‘‘నీ పట్ల నిరంతరభక్తిని ప్రసాదించు, చాలు.’’ అన్నాడు సుదాముడు.*


*‘‘సిరిసంపదలక్కర్లేదా?’’ అడిగాడు కృష్ణుడు.*


*‘‘అక్కర్లేదు’’ అన్నాడు సుదాముడు.*


*కళ్ళుమూసుకుని కృష్ణనామజపం చేయసాగాడు. అతని భక్తి కృష్ణుణ్ణి ముగ్ధుణ్ణి చేసింది. సిరిసంపదలు సహా భగవద్భక్తిని కూడా ప్రసాదించాడతనికి.*


*కుబ్జ::~*


*కంసుని అంతఃపురదాసిలలో కుబ్జ ఒకతె! ఆమె కురూపి. పుట్టుకతోనే అందవికారంగా పుట్టిందామె. శరీరం మూడు వంకరలు తిరిగి ఉంటుంది. ‘త్రివక్ర’ అని కూడా పిలుస్తారామెను. త్రివక్ర కనిపిస్తే చాలు, అంతా అసహ్యించుకుంటారు.* *దూరదూరంగా తొలగిపోతారు. పిలిచినా పలకరు. పలకరిస్తే కసురుకుంటారు. కంసునికి కావాల్సిన గంధం మొదలయిన లేపనాలు తయారు చేసి అందించడం ఆమె పని. ఆ లేపనాలు ఎంత సుగంధభరితమో, అవి పూసుకుంటే శరీరసుఖం ఎంతటి తీవ్రస్థాయిలో ఉంటుందో ఊహించుకోగలదామె. ఊహకే పరిమితం కుబ్జ. ఇంతవరకు ఆమెకు ఆ సుఖం తెలియదు. అంతా దాని గురించి మాట్లాడుకుంటుంటే విని చాటుగా కన్నీరు కార్చేది కుబ్జ.*


*‘‘దేవుడా! నేనే పాపం చేశాను? నన్ను ఎందుకిలా పుట్టించావు? ఏ సుఖానికీ నోచుకోని ఈ బతుకు ఎందుకు?’’ అనేది. ఆత్మహత్యకు ప్రయత్నించి అంతలోనే మానుకుంది కూడా.*


*సుదాముని కటాక్షించి వెళ్తున్న బలరామకృష్ణులకు దారిలో కుబ్జ కనిపించింది. ఆమె చేతిలో గంధం మొదలయిన మైపూతల పాత్రలు ఉన్నాయి. సువాసనలు వెదజల్లుతున్నాయవి. ఆ సువాసనలకు ఆమెను సమీపించారు బలరామకృష్ణులు. ఎవరన్నట్టుగా వారిని చూసింది కుబ్జ. నువ్వు మాకు తెలుసు! అలాగే మేమెవరో నీకు తెలుసు అన్నట్టుగా చూశారు వారు.*


*‘‘కుబ్జ’’ పిలిచాడు కృష్ణుడు. ఆ పిలుపే మధురం. వయ్యారాలు పోయింది కుబ్జ.*


*‘‘ఎవరు నువ్వు? ఈ పాత్రలలో ఏమిటిదంతా? ఈ సుగంధాలు ఎక్కడికి?’’ అడిగాడు కృష్ణుడు. సిగ్గుల మొగ్గయింది కుబ్జ. కృష్ణుడితో మాట్లాడేందుకు పెదవులు విడివడడం లేదు. ఏమిటిది? ఎందుకిలా అనుకుంటూ బలంగా పెదవులెత్తి పలికిందిలా.*


*‘‘నేను దాసిని. కంసుని అంతఃపురంలో పని చేస్తున్నాను. నన్ను అంతా త్రివక్ర అంటారు. ఇవన్నీ మైపూతలు, కంస మహారాజు కోసం తీసుకుని వెళ్తున్నాను.’’ అన్నది కుబ్జ.*


*‘‘సుగంధభరితమయిన ఈ మైపూతలు మాక్కొంచెం ఈయరాదూ?’’ అడిగాడు కృష్ణుడు. అడిగిందే ఆలస్యం అందజూపింది కుబ్జ.*


*‘‘ఈ పూతలకు మీరే అర్హులు. తీసుకోండయ్యా.’’ అంది. తీసుకున్నారు బలరామకృష్ణులు. పూతలు పూసుకున్నారు. బంగారానికి తావి అబ్బినట్టుగా అవతారపురుషులయిన బలరామకృష్ణులు మైపూతలతో మరింతగా మెరసిపోయారు. సూర్యునిలా తెల్లగా, చంద్రునిలా చల్లగా వెలిగిపోతున్న కృష్ణుణ్ణి కన్నార్పకుండా చూడసాగింది కుబ్జ. తనని కుబ్జ గమనిస్తున్నదని తెలుసుకుని, మెల్లమెల్లగా కళ్ళెత్తి ఆమెను చూశాడు కృష్ణుడు. తనని కృష్ణుడు గమనించాడని తెలుసుకుని, సనసన్నగా కళ్ళు దించుకుంది కుబ్జ.*


*సెలవివార నవ్వుకోసాగింది. ఆమెను కరుణించాడు కృష్ణుడు. కటాక్షించేందుకు సిద్ధమయ్యాడు.‘‘కుబ్జ’’ పిలిచాడు. వేణునాదంలా వినవచ్చింది ఆ పిలుపు. నిలువెల్లా కదలిపోయిందామె. వంగలేక వంగలేక వంగి కృష్ణుని పాదాలను స్పృశించింది కుబ్జ. కళ్ళకద్దుకుంది వాటిని. అప్పుడు కృష్ణుడు ఆమె ముంగాళ్ళను తొక్కిపట్టి, కుడిచేతి చూపుడు వేలుని చుబకం మీద నుంచి లేవనెత్తాడామెను. అతనలా లేవనెత్తుతోంటే ఎముకలు పటపటమని శబ్దం చేస్తూ సర్దుకున్నాయి. ముద్దలు ముద్దలుగా గడ్డలుగా ఉన్న మాంసం కిందు మీదులయింది. శరీరం అంతా సమంగా పరుచుకుంది. చర్మం సరిదిద్దుకుంది. వికారాలన్నీ పోయాయి. విచిత్రంగా కుబ్జ అందగత్తెగా మారిపోయింది. కటిప్రదేశం, వక్షస్థలం, కంఠం...ఈ మూడుచోట్లా కుబ్జదేహం వంకరలు తిరిగి ఉండేది. ఆ వంకరలన్నీ పోయి ఇప్పుడవి వయ్యారాలు అయ్యాయి. దేవకన్యలా వెలిగిపోసాగింది కుబ్జ. తనని తాను చూసుకుంది. ఆశ్చర్యపోయింది. కృష్ణుని కళ్ళలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. పొంగిపోయింది. ఈ అందాలభరిణె ఎవరనుకుంది. ఇంకెవరు? తనే ననుకుంది. తన్మయత్వం చెందింది. కృష్ణుని పాదాలను ఆశ్రయించింది. కన్నీటితోనూ, కృతజ్ఞతతోనూ ఆ పాదాలను పరిశుభ్రం చేసింది. భుజాలు పట్టి లేవనెత్తాడామెను కృష్ణుడు. చిరునవ్వుతో చూశాడామెను. సన్నగా వణకిపోతూ ఇలా అంది కుబ్జ.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

అష్టాదశ శక్తిపీఠాలు*

 🕉🕉🕉🛐🛐🕉🕉🕉🕉

*అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాలు*

    *వాటి కథనాలు క్లుప్తంగా !*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*దేవీ నవరాత్రులు జరిగినన్ని రోజులూ దేశం మొత్తం ఎంతో ఘనంగా అమ్మవారిని స్మరించుకుంటారు. అయితే అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలు ఉన్న ప్రాంతాల్లో పూజలు మరింత ప్రత్యేకం. ఆ ప్రాంతాల గురించి తెలుసుకుంటే జన్మ ధన్యం అయినట్టే……*


*లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే…. అనే శ్లోకం అందరికీ తెలిసే ఉంటుంది.*


*ఇది ఆదిశంకరాచార్యులవారు చెప్పిన శ్లోకం. అష్టాదశ శక్తిపీఠాల విషయంలో దీన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆదిశంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలనూ దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి.*


*వీటిలో నాలుగు శక్తిపీఠాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి, అవి శ్రీశైలం, అలంపురం, పిఠాపురం, ద్రాక్షారామం.*


*మిగిలిన వాటిలో పన్నెండు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా మిగిలిన వాటిలో ఒకటి శ్రీలంకలోనూ రెండవది కాశ్మీర్‌లోనూ ఉంది.*


*ఈ పద్దెనిమిది శక్తిపీఠాల్లో మూడు గయాక్షేత్రాలూ (గయ-శిరోగయ, పిఠాపురం-పాదగయ, జాజ్‌పూర్‌-నాభిగయ)*


*రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలూ (శ్రీశైలం, ఉజ్జయిని) ఉండటం మరో విశేషం.*


*ఆ క్షేత్రాల గురించిన వివరాలు...*


*1. శాంకరీదేవి: లంకాయాం శాంకరీదేవి అంటే...మునులూ రుషుల లెక్కప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు, భూమధ్యరేఖకు సున్నాడిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు.* 


*ప్రస్తుతం ట్రింకోమలీ (శ్రీలంక)లోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు. 17వ శతాబ్దంలో పోర్చుగీసువారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రకాధారాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడొక స్తంభం మాత్రమే ఉంటుంది.*


*2.కామాక్షి : సతీదేవి వీపుభాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉంది. పాశాంకుశాలూ చెరకుగడ, భుజంపై చిలుకతో పద్మాసనస్థితిలో కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరిసంపదలూ కలుగుతాయని ప్రతీతి.*


*3.శృంఖల: అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ క్షేత్రం గుజరాత్‌లో ఉన్నదని కొందరూ, కోల్‌కతకు దగ్గరలో ఉన్నదని మరికొందరూ అంటారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు సమీపాన ఉన్న సురేంద్రనగర్‌లో కొలువై ఉన్న 'చోటిల్లామాత'ను అక్కడివారు శృంఖలా (శృంగళా) దేవిగా భావిస్తారు. కానీ... పశ్చిమబెంగాల్‌లో ఉన్న 'పాండువా'నే అసలైన శక్తిక్షేత్రం అని ఎక్కువ శాతం మంది విశ్వసిస్తారు. అయితే, పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినారు కనిపిస్తుంది. పురాతత్వశాస్త్రవేత్తల అధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ 'మేళతాళ' పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో హిందూముస్లింలు కలిసే పాల్గొనడం విశేషం.*


*(రేపు మరికొన్ని శక్తి పీఠాలు గురించి తెలుసుకుందాం)*


*ఓం శ్రీ మాత్రే నమః॥*

*ఓం శ్రీ మాత్రే నమః॥*

*ఓం శ్రీ మాత్రే నమః॥*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

శ్రీమద్ భాగవతం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

            *(107వ రోజు)*

   *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

            *కృష్ణావతారం*

*బలరామకృష్ణులు - మధురకు రాక*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*నీ కోరిక తప్పకుండా తీరుస్తాను, అయితే ఇప్పుడు కాదు, త్వరలో. ముందు నేను వచ్చిన పని చక్కబెట్టనీ.’’ అన్నాడు కృష్ణుడు. సరేనన్నాడు అక్రూరుడు. శలవు తీసుకున్నాడు. నిష్క్రమించాడక్కణ్ణుంచి. కంసుణ్ణి సందర్శించాడు. బలరామకృష్ణుల్ని వెంటబెట్టుకుని వచ్చానని చెప్పాడతనికి. కుట్ర ఫలించినందుకు సంతోషించాడు కంసుడు.*


*రజకుని రగడ:-*


*బలరామకృష్ణులు మధురపురానికి రావడం అదే మొదటిసారి. ఆ కారణంగా చాలా సంతోషంగా ఉన్నారిద్దరూ. పైగా తమ తల్లిదండ్రులు, మేనమామ కలగసిన ఊరు. ఆ నేలతో తెలియని అనుబంధం ఉన్నదనిపించింది. పురవీధులు తిరగాలనిపించింది. బయల్దేరారిద్దరూ. మధుర ఎంతో బాగుంది. వైభవంగా ఉంది. ఎటు చూసినా ఐశ్వర్యం కనిపించసాగింది. ఒకరి చేయి ఒకరు పట్టుకుని తిరుగుతున్న బలరామకృష్ణుల్ని చూసి, మధురాపురవాసులు వారెవరో ఇట్టే గుర్తించగలిగారు. బలరామకృష్ణుల్ని చూసి జన్మ తరించందనుకున్నారు. మహదానందం చెందారు. భక్తితో నమస్కరించారు. పూలూ, గంధాక్షితలూ చల్లి పూజించారు. కంసునికి రోజులు దగ్గరపడ్డాయి. అందుకే బలరామకృష్ణులు వేంచేశారనుకున్నారు యోగులు.*


*తిరుగుతూ తిరుగుతూ ఓ మలుపు దగ్గరకు చేరుకున్నారు బలరామకృష్ణులు. అక్కడ వారికి ఓ రజకుడు కనిపించాడు. కంసుని బట్టలుతికేవాడతను. మహారాజూ, అతని పరివారం ధరించేందుకు రకరకాల రంగు రంగుల దుస్తులు ఉన్నాయి అతని దగ్గర. చలువజేసి, చక్కగా మడతలుబెట్టి ఉన్నాయి. వాటిని ధరించాలనిపించింది బలరామకృష్ణులకు. గోకులంలో పెరిగారు. ఆలమందలను కాచుకుంటూ తిరిగారు. ఎన్నడూ అలాంటి వస్త్రాలు ధరించలేదు. సరదాపడ్డారిద్దరూ.*


*‘‘ఇదిగో నీ దగ్గర బలే మంచి మంచి దుస్తులు ఉన్నాయి. మేము వాటిని ధరించాలనుకుంటున్నాం. ఓ రెండు జతలివ్వు.’’ అడిగారు.సమాధానంగా పగలబడి నవ్వాడు రజకుడు.*


*కంసునిలాగే వాడు కూడా దుష్టుడు. మదాంధుడు. బలరామకృష్ణులను అవమానించాడతను*


*‘గోవులు కాచుకునే మీకు రాజదుస్తులు కావాలా? తప్పు తప్పు. తప్పుకోండి.’’ అన్నాడు.‘*


*‘ఈ దుస్తులు కంసమహారాజే ధరించాలి. వీటిని ధరించే అర్హత, అందం, చందం అతనికే ఉన్నాయి.’’ అన్నాడు.*


*ఆ మాటలకి కృష్ణుడికి కోపం వచ్చింది. రజకుణ్ణి కోపంగా చూశాడతను. పిడికిలి బిగించి, రజకుని గుండెలో గట్టిగా ఒక్క పోటు పొడిచాడు. దెబ్బకి వాడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.*


*అది చూశారు సాటి రజకులు. ప్రాణభయంతో పరుగందుకున్నారు. పారిపోతున్న రజకుల్ని కేకేసి మరింతగా బెదిరించి, తర్వాత తీరిగ్గా రాజదుస్తులు అందుకున్నారు బలరామకృష్ణులు. నచ్చిన వాటిని ధరించారు. కొన్ని దుస్తుల్ని వెన్నంటి వచ్చిన గోపాలురకు బహూకరించారు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                *విరచిత*

         *”శివానందలహరి”*

            *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉

*తనమనస్సనే పంచకల్యాణి గుఱ్ఱాన్ని ఎక్కి హాయిగా సంచరింపుమని శంకరులు శివుని ఈ శ్లోకంలో కోరారు.*


*శ్లోకం : 75*


*కల్యాణినం సరసచిత్ర గతిం సవేగం*

     

*సర్వేంగితజ్ఞ మనఘం ధ్రువలక్షణాఢ్యమ్*

     

*చేతస్తురంగ మధిరుహ్య చర స్మరారే !*

    

*నేతసమస్త జగతాం! వృషభాధిరూఢ!!"*


*తాత్పర్యము :~*


*ಓ సకల జగత్తునకూ నాయకుడైన పరమేశ్వరా ! నీకు వాహనము ఎద్దు కదా! అంతకన్నా గుఱ్ఱము బాగుంటుంది కదా !ఇదిగో చూడు . ఇప్పుడు నామనస్సొక గుఱ్ఱముగా వుంది. దీనినెక్కి నీవు చక్కగా స్వారీ చెయ్యి. ఇది కల్యాణీ గుఱ్ఱము . యజమానికి శుభసూచకములైన లక్షణాలు దీనికున్నాయి. ఇది సరసమైనది.* *అనురాగము చూపిస్తూ పోతుంది. దీని పోకడలు అనేక విధములుగా ఉంటాయి. కదం మొదలైన నడకలు అన్నీ ఇది నడుస్తుంది. మిగుల వేగంగా పోతుంది. యజమాని ఇంగితాన్ని గమనించి నడచుకుంటుంది. ఏ దోషాలూ లేవు. దీనికి స్థిరమైన లక్షణాలు ఉన్నాయి. అందువల్ల ఇది నీకు వాహనంగా యుక్తమైనది (నిత్యమూ నా మనసులో నీ స్మరణ కలిగేటట్లు అనుగ్రహింపుమని భావం ).*


*వివరణ :~*


*సామాన్యముగా అందరూ దేవుణ్ణి ఏదో ఒకటి కావాలని అడుగుతూ ఉంటారు. కానీ ఆయనకు ఏదీ ఇస్తానని ముందుకు రారు. అదీ కాక సమస్త జగత్తులకూ అధినాయకుడైన పరమేశ్వరుడికి ఇవ్వడానికి తమ దగ్గర ఏముంటుందని అనుకుంటారు. కానీ శంకరులు ఈశ్వరుడికి తనమనస్సనే తురగాన్ని ఇస్తానని ముందుకొచ్చారు. తన మనసు అనే తురంగాన్ని వాహనంగా స్వీకరింపుమని శివుణ్ణి కోరారు.*


*ఈశ్వరా! నీవు విశ్వ సామ్రాజ్యాధి నేతవు. నీవు భక్తరక్షణ కోసం ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది. నీకున్న వాహనం ఒక ముసలి ఎద్దు. అది నిన్నెక్కించుకుని వేగంగా తిరుగ లేదుకదా! కాబట్టి నామనస్సనే గుఱ్ఱాన్ని నీకు వాహనంగా ఇస్తాను. స్వీకరించు*. *ఎద్దు కన్నా గుఱ్ఱము వేగంగా పరుగెడుతుంది. కాబట్టి నా మనస్సనే గుఱ్ఱాన్ని ఎక్కి నీపనులు చక్కబెట్టుకో ప్రభూ! అన్నారు శంకరులు.*


*మనస్సు మంచి గుఱ్ఱము వంటిది. గుఱ్ఱములలో ఉత్తమమైనది పంచకల్యాణి. పంచకల్యాణి గుఱ్ఱమునకు ఐదు శుభలక్షణాలుంటాయి.* 1) ముఖము 2) గుండె 3) వీపు 4) రెండు పార్శ్వములు మొత్తము ఐదు.*


*మనస్సునకు కూడా మంగళకర లక్షణాలయిన 1)ఈశ్వరుని దర్శించడం 2) ఈశ్వరుని కథలు వినడం 3) ఈశ్వర ప్రసాదాన్ని తినడం 4) ఈశ్వర లింగాన్ని స్పృశించడం 5) ఈశ్వరునికి అలంకరించిన పుష్పాన్ని ఆఘ్రాణింౘడం వంటి పనులు చేసే పంచ జ్ఞానేంద్రియాలు ఉంటాయి.*


*పంచ కల్యాణి గుఱ్ఱము సరస చిత్ర గతులు కలది. అది యజమానియందనురాగము కలిగి అస్కందితం, ధౌరితకం, రేచితం, వల్గితం, ప్లుతం మొదలయిన విచిత్రములయిన గమనాలతో సాగిపోతుంది.*


*మనస్సు కూడా నానా విధములయిన పోకడలు కలది. మనస్సు కూడా సరస విచిత్ర గతులు కలదే.*


*ఇక పంచకల్యాణి గుఱ్ఱము "సవేగం" అంటే వేగంగా పోతుంది. మనోవేగం అంటారుకదా! మనం సంకల్పించిన చోటుకి మనస్సు తక్షణం పోతుంది.*


*గుఱ్ఱము సర్వేంగితజ్ఞము పంచకల్యాణి గుఱ్ఱము యజమాని మనోభావం గుర్తిస్తూ నడుస్తుంది. కాగా మనస్సు అందరి అభిప్రాయాలనూ గుర్తించగలిగినట్టిది.*


*గుఱ్ఱము "అనఘం" అనగా దోషము లేనిది. మనస్సు

పాపరహితము. పుణ్యప్రదమైనది. గుఱ్ఱము "ధ్రువలక్షణాఢ్యమ్". అనగా ధ్రువమనే మంచి సుడిని కలిగి యుంటుంది. మనస్సు స్థిరత్వము అనగా అనగా ఈశ్వర సాన్నిధ్య ప్రాప్తి విషయంలో మంచి పట్టుదల కలిగి యుంటుంది.*


*ఈవిధంగా తన మనస్సునకు ఉత్తమ అశ్వ లక్షణాలు అన్నీ ఉన్నాయనీ దానిని వాహనంగా స్వీకరించి విహరింపుమనీ శివుని శంకరులు కోరారు. అంటే సదా తన మనస్సులో మెదలుతూ ఉండమని శంకరులు ఈశ్వరుణ్ణి కోరారని మనం గ్రహించాలి.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️