24, జూన్ 2023, శనివారం

శాస్త్రీయ విధానాన్ని

 ఎసోఫెగస్ (Esophagus ) అనేది మన గొంతుని పొట్టకు కలిపేటువంటి ఒక ట్యూబు. ఇది కండరాలతో నిర్మితమై వుండి, ఎప్పుడూ మూసుకునే ఉంటుంది. ఆహారం లోనికి తీసుకునేటప్పుడు మాత్రం తెరుచుకుని మళ్ళీ వెంటనే మూసుకుపోవాలి. అలా మూసుకుని జీర్ణాశయంలో ఉన్న ఏసిడ్, ఆహారాలను బయటకు రాకుండా ఆపి రక్షిస్తూ ఉంటుంది. ఏసిడ్ బయటకి లీక్ అయ్యి వస్తే దాన్నే మనం ఎసిడిటీ అంటాము. 


భోజనం చేసే ముందు ఈ ఎసోఫెగస్  సాఫీగా తెరుచుకోవడానికి బ్రాహ్మణులు చేసే "ఆచమనం" అనే పద్దతిని అందరూ పాటించాలి. పరిశీలిస్తే ఈ ఆచమనం అనే ప్రక్రియ ఒక శాస్త్రీయ దృష్ఠితో అలవరచుకున్న ఆరోగ్యకరమైన విధానం అని తెలుస్తుంది. కొందరు అనుకున్నట్టు ఒక మూఢాచారం కాదు. కొంచెం నీరు తీసుకుని ఆహారం మొదలుపెడితే  ఎసోఫెగస్‌కి లూబ్రికేషన్ జరుగుతుంది, ఆహారం సాఫీగా పొట్టలోకి జారుతుంది. అంతేనా? ఆలాగైతే ముందుగా కాస్త నీళ్ళుతాగి భోజనం చెయ్యమని చెప్పచ్చుగా? కేశవ నామాలు దేనికి అని అనుమానం రావచ్చు. ఈ ఆచమనం భోజనం చేసే ముందే కాదు, ఏ పూజచేసేటప్పుడైనా కూడా చేస్తారు.   అన్నిటికీ కలిపి ఒకే ప్రాసెసుని మనకు నేర్పారు అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. 


గొంతులో ఎసోఫెగస్ ఒక్కటే కాదు. సున్నితమైన శ్వాసనాళము, స్వరతంతంత్రులు వంటివి అనేకం ఉంటాయి. మంత్రోచ్చారణ చేయడానికి ముందు వాటికి కూడా కొంచెం ఒక నిర్ధిష్థపద్దతిలో వ్యాయామం (వార్మ్ అప్) అవసరం. దానికి భగవన్నామాలతో మొదలు పెట్టమన్నారు. అదీ ఏ నామం పడితే అది అని చెప్పలేదు. కేశవ, నారాయణ, మాధవ అని మాత్రమే అనమన్నారు. 


ఎందుకంటే, "కేశవ" నామం గొంతులోనుంచీ వస్తుంది. "నారాయణ" నామం నాలిక సహాయంతో వస్తుంది. "మాధవ" నామం పెదాల సహకారంతో వస్తుంది.  అంటే నోటిలో అన్ని భాగాలకూ ఒక ఎక్సర్సైజు అన్న మాట.


మరి నీళ్ళు చేతిలో పోసుకుని నోట్లో ఎందుకు పోసుకోవాలి? ఉద్ధరిణితో నేరుగా నోట్లో పోసుకోవచ్చుకదా? మన చేతిలో ఎప్పుడూ కొంత విద్యుత్తు (స్టాటిక్ పవర్) ఉంటుంది. ఆ చేతితో నీరు పోసుకుని మింగితే, దానితో చేతిలో ఉన్న విద్యుత్తు, నోటిలోకి పొట్టలోకి ప్రవహించి  అన్నిటినీ ఉత్తేజపరచి, సమతుల్యం చేస్తుంది. దానితో ఆహారం స్వీకరించడం తేలికవుతుంది. అలాగే కంఠంలో ఉన్న స్వరతంతంత్రులు కూడా ఉత్తేజితం అవుతాయి. ఇది ఒక దృక్పదం. కొందరు మరొక విధంగా చెప్పవచ్చు. కానీ ఈ విధానంలో ఒక శాస్త్రీయత (మనకి పూర్తిగా అర్థం కాకపోయినా) కనిపిస్తుంది.


ఇలాగే ఇంకా మనలో చాలా ప్రశ్నలు సహజంగానే రావచ్చు. వస్తాయి. రావాలి. ఐతే అన్నిటికీ మనకు సమాధానం వెంటనే దొరుకకపోవచ్చు. అంటే దాని వెనుకనున్న నాలెడ్జిని మనం కోల్పోయాము. కనుక తిరిగి సంపాదించుకోవాలి అని ప్రయత్నిస్తే, సమాధానాలు అన్నీ ఒకరోజుకి దొరుకుతాయి. 


PS: ఒక శాస్త్రీయ విధానాన్ని సింపులుగా మూఢనమ్మకం అని కొట్టేయడాన్ని మించిన మూఢనమ్మకం మరొకటి వుండదేమో.



 


 


 


 


 

నమస్కారం విలువ

 *_🙏నమస్కారం విలువ.. ఎంతో తెలుసా!?🙏_*

_[ప్రస్తుతం సమాజంలోని అనేక సమస్యలకు మూల కారణం ఒకరి నొకరు గౌరవించుకోక పోవడమే! అహంకారం వదిలి, ఎదుటి వారిని చులకనగా చూడడం వలన అనర్థాలు జరుగు తున్నాయి.]_

 *===(((🙏🙏🙏)))===*


*మహాభారత యుద్ధ సమయంలో "మీరు పక్షపాతంగా యుద్ధం చేస్తున్నారు" అని దుర్యోధనుడు అనిన వ్యంగ్యమైన మాటలకు బాధపడిన భీష్మ పితామహడు _"నేను రేపు పాండవులను చంపుతాను"_ అని ప్రకటించాడు.*

*అంతే... పాండవుల శిబిరంలో ఆందోళన పెరిగింది. భీష్ముని సామర్ధ్యం గురించి అందరికీ తెలుసు కాబట్టి, జరగబోయే పరిణామాల గురించి భయంతో కలవరపడ్డారు. అప్పుడు.. శ్రీ కృష్ణుడు తన వెంట ద్రౌపదిని తీసుకొని భీష్ముని శిబిరానికి వెళ్ళాడు.*

*తను బయటే నిలబడి ద్రౌపదితో "నీవు వెళ్లి భీష్మునికి నమస్కరించు, ఆయన _"అఖండ సౌభాగ్యవతీ భవ"_ అని ఆశీర్వదిస్తాడు. తర్వాత జరిగేది గమనించు అన్నాడు.*

*ద్రౌపది అలానే చేసింది, భీష్ముడు దీవించి, "ఏంటమ్మా! ఇంత రాత్రి ఒంటరిగా వచ్చావు. నిన్ను కృష్ణుడు తీసుకు వచ్చాడు కదా!" అన్నాడు.*

*దానికి ద్రౌపది "అవును తాతయ్యా..! అన్న శిబిరం బయట నిలబడి ఉన్నారు" అనింది. భీష్ముడు బయటకు వెళ్ళగా.. ఇద్దరూ ఒకరికి ఒకరు నమస్కరించు కున్నారు.*


*వెంటనే భీష్ముడు.. "నాకు తెలుసు కృష్ణా, మీరు ఇలా చేస్తారని. ప్రతిజ్ఞ కన్నా దీవెనకు ప్రభావం ఎక్కువ. నేను పాండవుల జోలికి రాకుండా ఉండేందుకు ఇలా చేయండి" అని ఒక మార్గం ఉపదేశించాడు.*


*శిబిరం నుండి తిరిగి వస్తున్నప్పుడు, శ్రీ కృష్ణుడు ద్రౌపదితో "నీవు వెళ్లి భీష్మునికి నమస్కరించడం ద్వారా నీ భర్తలు జీవితాన్ని పొందారు".*

*"ఇలాగే.. నీవు ప్రతిరోజూ భీష్ముడు, ధృతరాష్ట్రుడు, ద్రోణాచార్యుడు లాంటి పెద్దలకు నమస్కరిస్తూ ఉండు. అలాగే దుర్యోధనుడు, దుశ్శాసనుడి భార్యలు కూడా ఆ పెద్దలతో పాటు పాండవులకు కూడా నమస్కరిస్తూ ఉంటే బహుశా ఈ యుద్ధం ఆగిపోవచ్చు. ఒక్క నమస్కారానికి అంతటి భాగ్యం కలుగుతుంది" అన్నాడు.*


*👌ఇంటిలోని పిల్లలు మరియు కోడళ్లు ప్రతిరోజూ ఇంటి పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే ఆ ఇంటిలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. పెద్దల ఆశీర్వాదాలు కవచం లాగా పనిచేస్తాయి.*

*ఎందుకంటే...*


*🙏నమస్కారం ప్రేమ.*


*🙏నమస్కారం క్రమశిక్షణ.*


*🙏నమస్కారం చల్లదనం.*


*🙏నమస్కారం గౌరవాన్ని నేర్పుతుంది.*


*💠నమస్కారం మంచి ఆలోచనలను ఇస్తుంది.*


*💠నమస్కారం సంస్కారాన్ని నేర్పుతుంది.*


*💠నమస్కారం కోపాన్ని తొలగిస్తుంది.*

 

*💠నమస్కారం కన్నీళ్లను కడిగివేస్తుంది.*


*🔶ఎక్కడ సజ్జన సాంగత్యం లభిస్తుందో అక్కడ ప్రతిభ ఇనుమడిస్తుంది. మంచి సంస్కారాలు అలవర్చుకొంటే తరతరాలుగా వంశాభివృద్ధి  జరుగుతుంది.*

_(శ్రీ శిష్ట్లా తమ్మిరాజు గారి సౌజన్యముతో... 🙏)_ 

_🙏🙏🙏ఇదీ మరి నమస్కారం విలువ అంటే..._🙏🙏🙏

సన్యాసి సంకల్పం

 సన్యాసి సంకల్పం


ఒకసారి పరమాచార్య స్వామివారు ఆంధ్ర దేశంలోని కర్నూలులో చాతుర్మాస్యం చేస్తున్నారు. పరమాచార్య స్వామివారిని సాక్షాత్ ఈశ్వర స్వరూపంగా భావించే శ్రీ జనార్ధనానంద సరస్వతి అనబడే సన్యాసి ఒకరు ఈ పుణ్యదినాలలో మహాస్వామివారితో గడపాలని నిశ్చయించుకున్నారు. వారు పాదయాత్రగా విజయావాడ నుండి బయలుదేరి వస్తున్నారని మహాస్వామి వారికి కబురందింది.


ఆ విజయవాడ స్వామి పాదయాత్ర మొదలుపెట్టిన రెండు మూడు రోజులకి, పరమాచార్య స్వామివారు మఠంలో పనిచేస్తున్న శ్రీ ఏకాంబరం మరియు శ్రీ మెట్టూర్ రాజులను ఒక కారులో విజయవాడ వెళ్లవలసినదిగా ఆదేశించారు. అలాగే పూజ్యశ్రీ విజయవాడ స్వామివారిని కలిసి వారిని కారులో ఇక్కడికి తీసుకురావలసిందిగా చెప్పారు.


అక్కడున్న భక్తులు ఈ మాటలను విని అయోమయంలో పడ్డారు. సన్యాసులు కారులో తిరగడం మహాస్వామివారు ఎన్నటికి ఒప్పుకోరు. అలా చెయ్యమని ఆదేశించరు కూడా. ఎందుకంటే అది సన్యాస ధర్మానికి విరుద్ధం కనుక.


ఆ విజయవాడ స్వామివారిని ఎలా కలుసుకోవాలో వీరికి తెలియదు. జనార్ధనానంద సరస్వతి స్వామివారు తమ పర్యటనకు ముందుగానే ప్రణాళిక వేసుకోలేదు కనుక వార్తాపత్రికలలో కూడా ఎక్కడా సమాచారము లేదు. వారిద్దరూ గుంటూరు చేరుకొని చుట్టుపక్కల ప్రాంతాలలో వెదకసాగారు. చివరికి వారికి ఆ స్వామివారు శివాపురం అనే ఒక చిన్న గ్రామంలో తారసపడ్డారు.


వచ్చినవారి నోటివెంట పరమాచార్య స్వామివారి ఆదేశాన్ని వినగానే విజయవాడ స్వామివారు అమితాశ్చర్యానికి లోనయ్యారు. ఆనందంతో, సంభ్రమాశ్చర్యాలతో పరమాచార్య స్వామివారిని సాక్షాత్తు ఆ కైలాస వాసి పరమేశ్వరుడే అని వేనోళ్ళ కొనియాడారు.


మహాస్వామివారిని దర్శించాలనే కోరికతో ఆ ముందురోజు వరకూ కర్నూలు వైపు పాదయాత్ర చేశారు. హటాత్తుగా కాలినరం ముడిపడి ఇబ్బంది పెట్టడంతో శివపురంలో ఆగవవలసి వచ్చింది. చాలా ఆందోళన చెందిన స్వామివారు మహాస్వామి వారిని ఇలా కొనియాడారు. “ఈశ్వరా! కైలాసనాథుడవైన నీకు కనీసం ఒక ముసలి ఎద్దు అయినా వాహనంగా ఉంది. కానీ ఇప్పుడు కంచినాథుడుగా, పరమాచార్యులుగా వచ్చిన నీవు, ఉన్న ఆ ఎద్దును కూడా వదిలిపెట్టి మొత్తం దేశం అంతా పాదచారియై తిరగడానికి నిర్ణయించుకున్నావు”


వారు చికిత్స తీసుకుని పాదయాత్రగానే కర్నూలుకు వెళ్లాలని నిర్ణయించుకుని ఉంటే వారు తడుపారు చాతుర్మాస్యానికే చేరేవారు. విజయవాడ స్వామీ బాధను చూసి మహాస్వామివారే వారికి చేయూతనివ్వదలచి వారిని పిలుచుకుని రావడానికి కారుని పంపారు. వారు సాక్షాత్ శంకరావతారులు కాబట్టే ఇది స్వామివారికి సాధ్యమైందని గ్రహించారు జనార్ధనానంద సరస్వతి స్వామి.


కాలినెప్పితో బాధపడుతున్న స్వామివారు అతికష్టంపై కారు ఎక్కి కూర్చున్నారు. కర్నూలుకు ప్రయాణించి పరమాచార్య స్వామివారి దివ్యసన్నిధికి చేరుకున్నారు. చాతుర్మాస్య సంకల్పంతో పాటు వారి కాలి నరం బాధను కూడా మహాస్వామివారు కరుణతో తొలగించారు.


--- ‘ప్రదోషం మామ గృహం న్యూస్ లెటర్’ నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

సౌందర్యలహరి- 22

 సౌందర్యలహరి- 22 - “భాస్కర ప్రియ”

సౌందర్యలహరి- 22


భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం

ఇతి స్తోతుం వాంచన్కథయతి భవాని త్వమితి యః |

తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్యపదవీం

ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదామ్ || 22


తల్లీ, భవాని! నేను నీ దాసుణ్ణి, నీ కృపా కటాక్ష వీక్షణం నాపై ప్రసరింపజేయుము అని ఉపాసకుడు ప్రార్థించినంతనే, అతడికి, ముకుందబ్రహ్మేంద్రులు తమ రత్నకిరీటాలచేత నీరాజనం గావించబడే  నీ పాదపద్మాల యొక్క సాయుజ్యాన్ని కల్పిస్తున్నావు.

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,

నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.


  భాస్కర ప్రియ  (భాస్కరానందనాథ  భావము)

చాలా అత్భుతమైన శ్లోకము. ఆచార్యులు వారు మనకు దేవతార్చనలో నిత్యం చదువుకొనేదానికి ఇచ్చిన గొప్ప శ్లోకము ఇది. ఆత్మార్పణము అంటే ఏమిటి, శరణాగతి అంటే ఏమిటి  అనేది మనకు ఈ శ్లోకము ద్వారా నేర్పిస్తున్నారు.

భవాని త్వం.... భవానీ నీవు ....అని  అనీ అనే లోపల అమ్మ మనకు మోక్షం ఇచ్చేస్తుంది అట. అది ఎలాగో చూస్తాము.

భవానిత్వం అంటే  మోక్షత్వం.  భా అంటే ప్రకాశించునది. కాంతివంత మైనది. శుద్ధ తత్త్వం లోనే, సత్వ గుణం తోనే  ఆత్మ ప్రకాశిస్తూ వుంటుంది.   సదా ప్రకాశిస్తూ ఉండడమే మోక్షత్వం లో వుండడం. భవానిత్వం అంటే  మోక్షత్వం, మోక్షత్వం అంటే ప్రకాశించడం అని అర్ధం. కర్మలు లేకుండా వుండడటమే ప్రకాశించడము.

మోక్షం దేని నుంచి అంటే కర్మ నుంచి. కర్మ నుంచి విముక్తి పొందడమే మోక్షం. కర్మలు లేకుండా ఉండడమే  కైవల్యము.

భ అంటే భవము. అంటే సంసారము. సంసారము నుంచి విముక్తి ప్రసాదించేది గనుక భవాని.


భవస్య పత్నీ భవానీ, భవుని భార్య భవాని.  

భవతి భవతేవా సర్వమితి భవః.....అంతయూ తానైన వాడు.   అంతయూ నిండిన వాడు. భవుడు అంటే శివుడు. మహాదేవుడు.

భవము  అంటే పుట్టుక, సంసారము, ప్రాప్తి, శుభము  అని కూ



ఇలాంటి మరిన్ని పోస్ట్‌లను చూడటానికి మరియు తెలంగాణ బ్రాహ్మణ సే�


 

సాలగ్రామం_అంటే_ఏమిటి

 #సాలగ్రామం_అంటే_ఏమిటి......!!


సాలగ్రామం అనేది ఒక రకమైన రాయి. అయితే, ఇది ఓ పురుగువల్ల.. అంటే ఓ జలచరం వల్ల తయారౌతుంది అంటే అతిశయోక్తి కాదు. సాలాగ్రామాలు చాలా చాలా అరుదైనవి. ఇవి నర్మదానదిలో దొరుకుతాయి. అలాగే ఖాట్మండు నగరానికి ఉత్తరాన గండకీనదిలో దొరుకుతాయి. ఈ గండకీనది తీరంలో ”ముక్తినాథం” పేరుతో సాలగ్రామం ఉంది. ఈ ప్రాంతాల్లో మాత్రమే సాలగ్రామాలు దొరుకుతాయి. మరెక్కడా ఇవి లభ్యం కావు.


సంస్కృతంలో ”శిలగా మారిన శలభమే సాలగ్రామం” అంటూ నిర్వచనం చెప్తారు. సాలగ్రామం ఎంత ఎక్కువ సంవత్సరాలు గడిస్తే అంత మహత్తరమైంది. అలాగే, ఎంత చిన్నది అయితే అంత గొప్పది. కాలం గడిచిన తర్వాత సాలగ్రామానికి ఔషధ గుణాలు వచ్చి చేరతాయి.


ఒక విధమైన పురుగు సాలగ్రామంగా రూపొందుతుంది. అయితే కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత మాత్రమే అది రాయిలా గట్టిపడుతుంది. రసాయనికంగా చూస్తే సాలగ్రామం సిలికాన్ డయాక్సైడ్. దీనికి చెకుముకి రాయి లక్షణాలు ఉంటాయి. గట్టిపడకముందు సాలగ్రామంలో సున్నపు లక్షణం ఉంటుంది.


సాలగ్రామం విశిష్ట శిలారూపం. ఇవి వేల, లక్షల సంవత్సరాలు యథాతథంగా ఉంటాయని రుజువైంది. నీళ్ళలో ఉండే ఒక జీవి సుదీర్ఘకాలం తర్వాత సాలగ్రామంగా రూపాంతరం చెందుతుంది. అంటే ఇది జరాసిక్ టెతీన్ కాలానికి చెందినది.


సాలగ్రామం సంపాదించి, దేవుడి మందిరంలో ఉంచుకుంటే ఎంతో మంచిది. దీన్ని నియమనిష్టలతో పూజించాలి. ఏ మంత్రాలూ రానివారు మనసునే అర్పించుకుంటూ ప్రార్ధించాలి. సాలగ్రామం ఒకవేళ పగిలిపోయినా, దాని విలువ తగ్గదు. సాలగ్రామాన్ని అభిషేకించిన నీటిని సేవించడం శ్రేష్టం.

 



 

 వాట్సప్ లో వచ్చిన తప్పులన్నీ పునరావృతమౌతున్నాయి. సరే అది అటు ఉంచుదాం. వరరుచి సిధ్ధాంతకౌముది-అనేవ్యాకరణంలో వార్తికకారుడు.

చక్కని సంస్కృత పరిణతికలవాడు.అతడు అర్ధాలకోసం దేశాలు పట్టుకుతిరగటం.విక్రమార్కుడు.ఇవన్నీ కట్టు కథలు.

     అసలాశ్లోకానికి 18 అర్ధాలున్నాయా?పండితులతో చర్చించటం జరిగింది.

  1రామాయణపరంగా-

హేతాత!-ఓనాయనా! 

రామం-రాముని,

దశరథంవిధ్ధి-దశరధుడనుకో,

జనకాత్మజాం-జానకిని

మాం విధ్ధి-నేననుకో

అటవీం- అడవిని

అయోధ్యాం విధ్ధి-అయోధ్యయనుకో

యధాసుఖమ్-సంతోషంగా ,

గఛ్ఛ-పోయిరా,

నాయనా లక్మణా!రాముడు మీనాన్నే అనుకో,సీతను మీయమ్మేఅనుకో,అడవే అయోధ్యయనుకో , ఉత్సాహంగాపోయిరా!

అని రామాయణకధాపరంగా అర్ధం.

   ఇదిగాక,

రామందశరథంవిధ్ధి-రాముని విష్ణువనుకో.

    జనకాత్మజను మాం లక్ష్మి అనిభావించు.

అని వారియవతారస్వరూపములను తెలియజెప్పుట

రెండవయర్ధము.

      ఇంతకు మించి కృతకముగా అర్థప్రకల్పనమొనరింపయోగ్యముగాదు.కావున పైపోస్టులోని 18 అర్థములనుమాట పొసగదు.🙏🙏

నిత్యాన్వేషణ

 నిత్యాన్వేషణ:


రామునికి గల 16 సద్గుణాలు ఏవి?




యుక్త వయసు అమ్మాయిల్ని అందరు దీవించే మాట నీకు రాముడు లాంటి భర్త రావాలి అని..


మన హిందూ పురాణాల్లో అనేకమంది దేవుళ్ళు దేవతా మూర్తులు వున్నారు, కానీ రాముడి లాంటి భర్త రావాలి అని రాముడితో పోల్చడానికి కారణం లేకపోలేదు..


తల్లిదండ్రుల మాటను తచ తప్పక పాటించడం, సోదరులను అత్యంత ఆదరంగా చూడటం, తన భార్యను అత్యంత ప్రేమించడం, తన పాలనలో ప్రజలను తన కన్న బిడ్డల్లా చూడటం, వారికి ఎటువంటి కష్టాలు లేకుండా పాలించడం; దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని రక్షించడానికి ఎంతదూరమైనా వెళ్ళటం వంటి సద్గుణాలు మూర్తీభవించిన వ్యక్తి; స్త్రీ వ్యామోహం, ధన వ్యామోహం, పదవీ వ్యామోహం వంటి దుర్గుణాలు లేని వ్యక్తి కనిపించడం చాలా అరుదు. కానీ విలువలకు పట్టం కట్టే మన సనాతన భారతదేశంలో ఈ అన్ని గుణాలు కలిగిన వ్యక్తులు అనేకులు ఉన్నారు. కానీ వారందరికీ ఆదర్శం నాటి శ్రీరాముడు.


ఒకానొక సందర్భంలో వాల్మీకి మహర్షి నారద మహర్షిని ‘ఈ భూమిలో ఈ క్రింది 16 లక్షణాలు లేక సద్గుణాలు కల్గిన ఆదర్శపురుషుడు ఎవరైనా ఉన్నారా? అని అడిగారు. ఆ 16 సద్గుణాలు ఇవి :


గుణవంతుడు

వీర్యవంతుడు (ధైర్యవంతుడు)

ధర్మం కలవాడు

కృతజ్ఞత కలవాడు

సత్యాన్ని పలికేవాడు

దృఢవ్రతుడు (శక్తివంతుడు)

చరిత్రను లిఖింపగల యోధుడు

సర్వప్రాణుల హితం కొరుకునేవాడు

విద్వాంసుడు (పండితుడు)

సమర్ధుడు (ప్రావీణుడు)

ఆత్మను ధర్మించేవాడు

జితక్రోధుడు (అందరిని కలిపే గుణం)

ద్యుతిమాన్

అసూయ లేనివాడు

వాస్తవాన్ని గ్రహించేవాడు

యుద్ధ రంగంలో మూర్తీభవించిన ఆగ్రహం కలవాడు.


వాల్మీకి అడిగిన ప్రశ్నకు సమాధానంగా నారదుడు..అన్నాడు. అంతే కాదు మరో 67 గుణాలున్న మహానుభావుడు కూడా ఉన్నాడు. ఆయనే శ్రీరామచంద్రుడు’ అని చెప్పాడు.


రాముడికి ఈ 16 సద్గుణాలు( మంచి లక్షణాలు) ఉండడం చేత, ఆ 16 మంచి లక్షణాలు ఉన్న వరుడై ఉండాలని అందరూ రాముడి లాంటి భర్త రావాలని దీవిస్తారు..

లోపాలు

 .                          🕉️

                  _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*కిం దాతురఖిలైర్దోషైః* 

*కిం లుబ్ధస్యాఖిలైర్గుణైః।*

*న లోభాదధికో దోషః*

*న దానాదధికో గుణః॥*


తా𝕝𝕝 

దాతకు లోపాలు ఎన్ని ఉంటే ఏమిటి ? పిసినారికి ఎన్ని గుణాలు ఉంటే ఏమిటి? పిసినారితనం కన్నా గొప్ప దోషం లేదు...     దానం కన్నా గొప్ప గుణం లేదు.

విశిష్టమయిన శ్లోకం ఏది?*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌻🌻🌻🌻🕉️🌻🌻🌻🌻


*రామాయణంలో అత్యంత ముఖ్యమయిన/ విశిష్టమయిన శ్లోకం ఏది?* 


ఒకసారి విక్రమాదిత్య అనే రాజుకు తన సభలో ఉన్న "నవరత్నాలలో" ఎవరు ఉత్తమ పండితులో తెలుసుకోవాలని అనిపించింది.


రాజ్యసభలో ఉన్న పండితుల అందరినీ పిలిచి " *రామాయణం* " లో ఉన్న శ్లోకాలలో అత్యంత ముఖ్యమైన శ్లోకం ఏది అయి ఉంటుంది అని ప్రశ్నించారు.


ఆ శ్లోకం గురించి చెప్పిన వారికి 1000 బంగారపు నాణేలు ఇస్తాము అని కూడా ప్రకటించారు. ఈ శ్లోకాన్ని రామాయణంలో నుంచి వెతికి పట్టుకోవడానికి పండితులకు విక్రమాదిత్యుడు 40 రోజుల గడువు ఇచ్చాడు.


విక్రమాదిత్యుని రాజ్యసభలో *"వరరుచి"* అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి ఆ వెయ్యి  బంగారు నాణాలు ఎలాగైనా సంపాదించాలి అని కోరిక కలిగింది.


అప్పుడు ఆ వరరుచి దేశాటనకు బయలుదేరి అనేక రాజ్యాల లో తిరిగి రామాయణం లో ఉన్న ముఖ్యమైన శ్లోకం ఏది అని అందరు పండితులను అడగటం మొదలు పెట్టాడు.


అయితే అతనికి రామాయణం లో ఉన్న అన్ని శ్లోకాలలో ఒకే ఒక్క శ్లోకాన్ని ఉత్తమమైనది అని చెప్పటం సాధ్యం కాదు అన్న సమాధానమే దొరికింది. 


40 రోజులలో చివరి రోజు అతను తన రాజ్యానికి తిరిగి వస్తూ అలసిపోయి ఒక చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటున్నాడు.


నిద్రపోతున్న సమయంలో ఆ చెట్టు మీదకు ఇద్దరు వనదేవతలు వచ్చి సంభాషించుకుంటూ ఉన్నారు.

వారిలో ఒక వనదేవత మాట్లాడుతూ  మాటల్లో రామాయణంలో ప్రముఖమయిన శ్లోకం "మాం విద్ధి... అని చెప్పింది. ఆ సంభాషణ విన్న వరరుచికి ఎంతో ఆనందం కలిగింది.


అతను వెంటనే విక్రమాదిత్య రాజ్యసభకు వెళ్లి ఆ ముఖ్యమయిన శ్లోకం ఏదో చెప్పాడు.


ఆ శ్లోకం ఇది 


*రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజామ్* 

*అయోధ్యామటవీం విద్ధి గచ్ఛ తాత యథాసుఖమ్* 


ఆ శ్లోకాన్ని విన్న విక్రమాదిత్యుడు ఆ శ్లోకానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? అని అడిగాడు.


అతను  చెప్పిన 18 రకాలయిన  అర్ధాలను విన్న విక్రమాదిత్యుడు రామాయణంలో ఇదే ఉత్తమమైన శ్లోకం గా భావించి అతనికి 1000 బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు.


ఈ శ్లోకంలో ఉన్న అర్ధం ఏమిటి?

ఎందుకు ఈ శ్లోకం అంత ముఖ్యమయినదిగా చెప్పారు?


ఈ శ్లోకం వాల్మీకి రామాయణంలో అరణ్యకాండలో 40వ సర్గలో వస్తుంది.

రాముడు అరణ్యాలకి వెళ్తున్నాడు అని తెలిసి  లక్ష్మణుడు తను కూడా అరణ్యాలకు బయలుదేరుతూ,

తన తల్లి "సుమిత్ర" ఆశీర్వాదం కోరినప్పుడు సుమిత్ర లక్ష్మణుడికి చెప్పిన సమాధానం ఈ శ్లోకం.


ఈ శ్లోకానికి ఉన్న అనేక అర్థాలలో కొన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. 


రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజామ్.

అయోధ్యామటవీం విధ్ది గచ్ఛ తాత! యథాసుఖమ్৷৷


*మొదటి అర్ధం:* 


రామ= రాముడు:  దశరథం=దశరథుడు:  విద్ధి=అనుకో: మామ్= నేనే; జనకాత్మజ= జనకుని కూతురు;విద్ధి= అనుకో; అయోధ్యా= అయోధ్య; మాటవీం=అడవి; విద్ధి=అనుకో; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; యథా సుఖమ్=సుఖంగా


లక్ష్మణా! రాముడే దశరథుడు అనుకో,  సీతనే నేను(సుమిత్ర) అనుకో, అడవినే అయోధ్య అనుకో, సుఖంగా వెళ్ళిరా!


*రెండవ అర్ధం:* 


రామ= రాముడు: (దశ = పక్షి రథం=రధం)  దశరథం= పక్షిని రధంగా కలిగిన వాడు, విష్ణువు ; మామ్= లక్ష్మీదేవి; జనకాత్మజ= జనకుని కూతురు; అయోధ్యా= శతృదుర్భేద్యమయినది(వైకుంఠం); మాటవీం=అడవి; విద్ధి=అనుకో; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; యథా సుఖమ్=సుఖంగా


ఓ పుత్రా! ఈ రాముడే శ్రీమహావిష్ణువు, సీతే శ్రీ మహాలక్ష్మి, వారిద్దరూ  ఎక్కడ ఉంటే అదే వైకుంఠం అనుకుని సుఖంగా వెళ్లి  రా! 


*మూడవ అర్ధం:* 


రామ= రాముడు: దశరథం=దశరథుడు: విద్ధి=వలెనే: మామ్=నీ తల్లి (కైకను ఉద్దేశించి ); జనకాత్మజ= జనకుని కూతురు; విద్ధి= వలెనే; అయోధ్యా= అయోధ్య; మాటవీం=అడవి; విద్ధి=వలెనే; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; యథా సుఖమ్= వీలయినంత సుఖంగా


ఓ పుత్రా!  నీ తండ్రి దశరధుడు భార్యమాటని విని, అత్యంత అమూల్యమయిన రాముని సాంగత్యం పోగొట్టుకుని ఎలా దుఃఖిస్తాడో,

సీత మాట విని రాముడు కూడా అతనికి అమూల్యమయిన సీతను చేజార్చుకుని దుఃఖాన్ని పొందుతాడు.

రాముడు లేక అయోధ్య ఎలా శోకిస్తుందో అలాగే అరణ్యం కూడా సీత జాడ లేక  శోకిస్తుంది.


కనుక వీలయినంత దైర్యం చెప్తూ *రాముని చెంత నీవు ఉండు.*  


*సేకరణ:- వాట్సాప్ పోస్ట్* 


🙏🙏🙏🙏🌷🪷🌷🙏🙏🙏🙏

                                -

ఆర్య చాణక్య*♦️ *అధ్యాయము - 16 : పార్ట్ - 100*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*అధ్యాయము - 16 : పార్ట్ - 100*


నేపాళ దేశపు రాజధాని మంజుపట్టణమునకు చేరుకున్నాడు రాక్షసామాత్యుడు. 


దేశపు ప్రభువు పర్వతకుని దుర్మరణంతో శోకగ్రస్తుడైన అతని కుమారుడు మలయకేతుని ఓదార్చి, ధైర్యము చెప్పాడు రాక్షసుడు. 


మలయకేతు కొంత తేరుకొని "ఈ సానుభూతి మాటలతో నా గుండె మంట చల్లారదు. విషకన్య ప్రయోగంతో నా తండ్రిని, ఊరేగింపు మిషతో నా పినతండ్రిని హత్య చేయించిన ఆ చాణక్య చంద్రగుప్తుల మీద పగ తీర్చుకునేంతవరకూ నా తండ్రి, పినతండ్రులకు ఉత్తరక్రియలు కూడా జరపనని శపధం చేశాను. మీరు నా తండ్రికి ఆప్తమిత్రులు చెప్పండి. నా పగతీరుస్తారా ?" అని అడిగాడు ఆవేశంగా. 


"శభాష్ కుమారా ...! నీ పౌరుషానికి తగినట్లు ప్రతిజ్ఞ చేశావు. ఆ చాణక్యుని కుట్ర కారణంగానే మిత్రులైన నందులు పర్వతకుల మధ్య విరోధం వచ్చింది. ఆ కల్పిత వైరానికి వారూ వీరూ బలైపోయారు. మగధ సింహాసనంపై కూర్చోబెట్టడానికి ఒక్కనంద వంశాంకురం కూడా లేకుండా నందవంశీయులందర్నీ నల్లుల్లా నలిపిపారేశాడు ఆ చాణక్యుడు. నేను ఆశ్రయం పొందిన ప్రభువంశ వారసులు లేనప్పుడు ఆ మగధ సింహాసనము ఎవరు అధిష్టిస్తే నాకేం... ? నువ్వే అధిష్టించు.... మీతండ్రికి అర్థరాజ్యం వాగ్దానం చేశాడు ఆ చాణక్యుడు. ఇప్పుడు అర్ధరాజ్యమేం ఖర్మ... పూర్తి రాజ్యాన్నే నీకు కట్టబెడతాను... ఆ చాణక్య చంద్రగుప్తులను తుదముట్టించి..." అని భరోసా ఇచ్చాడు రాక్షసుడు. 


మలయకేతు సంతోషించి, రాక్షసుని శక్తి సామర్థ్యాలు తెలిసిన వాడవడం చేత అతనికి తన మంత్రి మండలిలో అత్యున్నత స్థానమిచ్చి గౌరవించాడు. అయితే మరల ఎప్పటికైనా తాను మగధకే మహామంత్రి కావాలన్న ఆశను బయటపడనీయకుండా మందహాసం చేసి "నాకు పదవులు కాదు ముఖ్యం... శత్రువుల పరాభవం...." అంటూ ఆ పదవిని సున్నితంగా తిరస్కరించాడు. అయినప్పటికీ మలయకేతు మంత్రిమండలిలో రాక్షసుని మాటే చెల్లుబాటుకాసాగింది. 


క్రమక్రమంగా రాక్షసుడు బలం పుంజుకొని నేపాళ దేశానికి సామంతరాజ్యాలైన, కులూత, మలయా, కాశ్మీర, సింధు, పారశీక, కామరూప తదితర రాజ్యాధిపతులను మంజుపట్టణాడానికి పిలిపించి వారితో సమావేశమై 'మగధ మీద దండెత్తడానికి సంసిద్ధులు కావాలని' హెచ్చరించాడు. ఇంతకు మునుపు జరిగిన యుద్ధంలో పర్వతక-చంద్రగుప్తులకి సహాయంగా వెళ్లి సైనికంగా ఆర్థికంగా నష్టపోయిన సామంత రాజులు తమ సైనికబలాలు పెంచుకోవడానికి కొంత వ్యవధి కావాలని కోరారు. రాక్షసుడు వారికి ఆరుమాసాల కాలవ్యవధి ఇచ్చి పంపించేశాడు. అనంతరం కొద్దిరోజులకే రాక్షసునికి సంతోషాన్ని చేకూర్చే సంఘటన ఒకటి జరిగింది. 


మగధసేనానులలో ప్రముఖుడైన బాగురాయణుడు దేశబహిష్కారమునకు గురై వచ్చి రాక్షసుని ఆశ్రయించాడు. "మేము మీ అభిమానులమని ఆ చాణక్యుడు గ్రహించాడు. అందుకే కల్పిత కారణాల సాకు చూపించి నాకు దేశబహిష్కరణ విధించాడు. మాలాంటి వాళ్ళం పదవుల్లో ఉంటే తన ఆటలు సాగవని ఆ చాణక్యుని భయం. అందుకే నన్ను ఈ వంకన వెళ్లగొట్టించాడు. అప్పుడూ-ఇప్పుడూ, అక్కడా-ఇక్కడా మీరే కదా నాకు దిక్కు..." అంటూ బాగురాయణుడు రాక్షసుని ఆశ్రయించాడు. 


బాగురాయణుడి రాక రాక్షసుడుకి చాలా సంతోషాన్ని కలిగించింది. అక్కడ చాణక్యుడు ఒక్కొక్కర్నీ వెళ్ళగొట్టించి బలహీనుడైతే ఇక్కడ ఒక్కొక్కరి చేరికతో తాను బలవంతుడవడం తథ్యం. ఆ ఆనందంతోటే బాగురాయణుడి తీసుకువెళ్లి మలయకేతుకి పరిచయం చేసి, తన వ్యూహాన్ని అతడికి వివరించి చెప్పి బాగురాయణుడిని సేనానాయకుడిని చేయించాడు రాక్షసామాత్యుడు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻


👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సరస్వతీ నది

 సరస్వతీ నది అంతర్వాహిణియై ప్రవహిస్తోంది అని మన పురాణాలు...పూర్వీకుల మాటలు నమ్మని వారు ...నమ్మే వారు అందరూ చూడండి..


సరస్వతీ నదీమతల్లి ఎలా భూమిలోకి వెళుతోందో..


ఇలా..ఎందుకంటే..వ్యాస భగవాన్ ఆజ్ఞ మేరకు 


మహా భారత రచన చేయ సంకల్పించిన వ్యాస భగవాన్ కు ..బద్రీనాధ్ పరిసర ప్రాంతాలు చాలా బాగా నచ్చాయట..


వినాయక స్వామి తో కలిసి #మహాభారత రచన చేస్తుంటే..పక్కన ప్రవహించే సరస్వతి నది హోరు 

వారిని ఇబ్బంది పెట్టేదట ..దాంతో వ్యాస భగవాన్ ..సరస్వతీ నది ని ఆజ్ఞాపించారట 

ఇవాళ్టి నుండి నువ్వు అంతర్వాహిణియై ప్రవహించు...


గంగ..యమున కలిసే సంగమస్థలం లో నీవూ వెళ్లి కలువు అంతర్వాహిణియై...అది అత్యంత పవిత్ర పుణ్యతీర్థమై విరాజిల్లుతుంది...


మీ ముగ్గురి కలయుక తో ఆ ప్రదేశం త్రివేణీ సంగమం అన్న పేరున ప్రసిద్ధి చెందుతుంది అని ఆజ్ఞాపించటంతో..


ఆనాటి నుండి సరస్వతి నది..ఇక్కడ వీడియోలో 

చూస్తున్న ప్రదేశం నుంచి అంతర్వాహిణియై ప్రవహించటం మొదలు పెట్టింది...


ఇది సనాతన హైందవ ధర్మానికి..

మన మహోన్నత మహర్షుల గొప్ప తనానికి 

ప్రత్యక్ష నిదర్శనం..


ఈ వీడియో లో చూడండి..ఈ వింతను చూసి 

విదేశీయులు సైతం ఆశ్చర్యపోతున్నారు...


అదీ మన సంస్కృతి గొప్ప తనం..🙏🏻





ఒకటి వదిలితే చాలు

 *ఒకటి వదిలితే చాలు*


ఒకసారి రామారావుకు  కాళ్ళు, చేతులు తిమ్మిరులు ఎక్కటం, అప్పుడప్పుడు కళ్ళుతిరగటం అవుతుంటే ఎందుకైనా మంచిదని ఒకసారి డాక్టరు దగ్గరకు వెళ్లి చుపెట్టుకుందాం అనుకోని సమీపంలో ఉన్న ఒక డాక్టారు వద్దకు వెళ్ళాడు.  డాక్టరు పరీక్షించినతరువాత నాకు అనుమానంగా వున్నదండి మీ లక్షణాలు చూస్తుంటే మీకు షుగర్ ఉన్నట్లు వున్నది ఒకసారి రక్త పరీక్ష చేయించండి అని సలహా ఇచ్చాడు.  వెంటనే ఆయన రక్త పరీక్ష చేయించుకున్నాడు. అతని ధీమా ఏమిటంటే నాకు షుగరు ఎందుకు వస్తుంది.  నేనేమయినా రోజు స్వీట్లు తింటానా ఏమన్ననా  నేను ఎప్పుడో కానీ స్వీట్ తినను. స్వీట్ తినేవాళ్లకు వస్తుంది కానీ నాకెందుకు షుగరు వ్యాధి వస్తుంది అని అనుకున్నాడు. రక్త  పరీక్ష రిపోర్ట్ ఇవ్వగానే అనుమాన నివృత్తి చేసుకోవటానికి అక్కడి టెక్నీషియన్ని అడిగాడు.  నాకు షుగర్ ఉన్నదా  అని. దానికి అతను మీరు వెళ్లి మీ డాక్టరుకు చూపించండి ఆయన చెపుతాడు అని అన్నాడు. . మనసులో ఏదో తెలియని గుబులు.  నిజంగా నాకు షుగరు వ్యాధి వచ్చిందా రాలేదా రాకుంటే అతను అలా ఎందుకు చెపుతాడు అని ఇంటికి వెళ్ళాడు.  రేపు ఉదయం డాక్టరు వద్దకు వెళ్ళాలి.  రాత్రంతా నిద్ర రాలేదు. ఏదో తెలియని గుబులు.  ఉదయం లేచి ముఖ ప్రక్షాళన చేసుకొని గడియారం వైపే చేస్త్తున్నాడు. అతని ప్రవర్తన చిత్రంగా తోచిన ఆయన శ్రీమతి రేణుక  ఏమైనదండి మీకు ఏదో చిత్రంగా ప్రవర్తిస్తున్నారు అని అడిగింది. అప్పుడు గత దినం డాక్టరు వద్దకు వెళ్లిన దగ్గరినుండి ల్యాబ్ టెక్నీషన్ చెప్పిన మాట దాకా పూసగుచ్చినట్లు చెప్పాడు.రామారావు.   రేణుక  మంచి సమయస్పూర్తి, సద్బుద్ధికల ఇల్లాలు . ఆమెకు వెంటనే తన భర్త మానసిక స్థితి అర్ధం అయ్యింది. అందుకు ఆమె ఆయనను అనునయిస్తూ మీకైమై చాదస్తమా ఏమిటి మీకు షుగరు రావటం ఏమిటి మన ఇంట వంట అటువంటి దరిద్రపు జబ్బు లేదు.  మీరు నిశ్చింతగా వుండండి. టిఫిను చేసి డాక్టరు వద్దకు వెళ్ళండి.  ఆయనకూడా మీకు షుగరు లేదని అంటాడు అని భర్తకు ధెర్యం చెప్పింది. నిజానికి భర్త యెంత పిరికివాడు అయినా కూడా భార్య మాటలే ధైర్యాన్ని ఇస్తాయి. అప్పుడు కానీ మన రామారావుకు పూర్తిగా ధెర్యం వచ్చింది. తృప్తిగా ఇడ్లిలు తిని బట్టలు కట్టుకొని మోటారు సైకిలు మీద డాక్టారు దగ్గరకు వెళ్ళాడు. డాక్టరు దగ్గరకు వెళుతున్న కూడా మనసులో ఏవో తెలియని సందేహాలు.  డాక్టరు ఏమి చెపుతాడో ఏమో అనే గుబులు ఇంకా వేధిస్తూ వున్నది. ఒకవైపు భార్య ఇచ్చిన భరోసా వున్నా కూడా తన్ను తానూ నిభాయించుకోలేక పోతున్నాడు. చిన్నగా డాక్టరు వద్దకు కాంపౌండరు పిలవగానే చేతులు కళ్ళు వణుకుతూ లోపలి వెళ్ళాడు. 


ఆఁ.. రండి రామారావు గారు ఎలావున్నారు అని మంచి ఉత్సాహంగా పలకరించాడు  డాక్టరు. తనకు తెలుసు డాక్టర్ల మాటలకే రోగుల సగం రోగాలు  తగ్గుతాయని ఇంకొక గంటలో చనిపోతాడన్న పేషంటుని కూడా నొప్పించకుండా మీకేమి భయంలేదు ఇంకొక గంటదాకా అని ప్రోత్సాహకరంగా భయంలేదు అనే మాటను పెద్దగా ఇంకొక గంటదాకా అనే మాటలు చిన్నగా చెప్పటం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య.  ఏమిటీ నాకు ఈ రోజు అనేక విధాలుగా ఆలోచనలు వస్తున్నాయి అని అనుకుంటుంటే రామారావు గారు అనే డాక్టరు పిలుపుతో ఈ లోకానికి వచ్చాడు.  ఏమండీ ఇంతకు  ముందు కూడా ఇట్లా మీరు బాధపడే వార.  లేదండి అన్నాడు.  సరే ఎన్నాళ్ళనుండి మీకు ఈ ప్రాబ్లమ్ వుంది అని మరలా  ప్రశ్నించాడు. ఇటీవలే బహుశా రెండు మూడు నెలలనుండి అని జవాబు చెప్పాడు రామారావు.  అదేమిటి ఈ డాక్టారు నాకు షుగరు ఉందా లేదా అని చెప్పకుండా అనవసరపు ప్రశ్నలు వేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని మనసులో అనుకోని.  ఇక ఆలస్యం చేస్తే తట్టుకునేటట్లు లేదని తానే ధైర్యం చేసి డాక్టరుగారు ఇంతకూ నాకు షుగరు ఉన్నట్లా లేనట్లా అని ఓపెనుగా అడిగేశాడు. రామారావు అవస్ధచూసి డాక్టరు చావు వార్త చల్లగా చెప్పాడు.  చూడండి  మీకు షుగరు చాలా వుంది మీరు ఇన్నాళ్లు నిర్లక్ష్యం చేశారు.  ఇంకా నయం ఇట్లానే మీరు మందులు వాడకుండా ఉంటే చాలా ప్రమాదములోకి వెళ్లేవారు అని అన్నాడు. ఆ మాటలు వింటుంటే ఒక్కసారి తన క్రింద వున్న భూమి మొత్తం మాయమైనట్లుగా తోచింది తాను ఏ ఆధారము లేకుండా గాలిలో ఉన్నానా అని అనిపించింది.  భగవంతుడా నాకే ఎందుకు ఇల్లాంటి పరీక్షలు  పెడతావు. అవును పొద్దున నా భార్య నాకు యెంత ధెర్యం చెప్పింది మీకు షుగరు ఎందుకు వస్తుంది అని అన్నదే.  ఈ డాక్టరు ఏమైనా డబ్బులు గుంజటానికి అబద్దం చెపుతున్నాడా అని మనసులో అనుకున్నాడు.  అప్పుడు రామారావు మోహంలో కత్తివాటుకి రక్తపు చుక్కలేదు. 


రామారావు గారు మీకు కొన్ని మందులు వ్రాసిస్తున్నాను. వాటిని నిర్లక్ష్యం చేయకుండా రోజు ఉదయం రాత్రి భోజంనం చేసిన తరువాత వేసుకోండి.  ఒక వారం చూద్దాం.  అప్పుడు మరలా రక్త పరీక్ష చేయిద్దాము ఆ రిజల్టునుబట్టి మందులు  నిర్ణయిద్దాం. మీరేమి భయపడనవసరం లేదు ఈ రోజుల్లో షుగరు వ్యాధి చాలా కామను అని ధెర్యం చెప్పాడు.  డాక్టరు గారు ఈ మందులు ఎన్నాళ్ళు వాడాలి అని అడిగాడు  అమాయకంగా. . షుగరు వ్యాధి రావటమే కానీ పోవటం అనేది ఉండదు.  మందులతో కేవలం దానిని  నియంత్రించటమే. ఇంకా మీరు అదృష్టవంతులు ఇంకా  ఆలస్యం చేస్తే ఇన్సూలిను ఇంజక్షన్ మొదలు పెట్టవలసి వచ్చేది అని అన్నాడు. నా అదృష్టం అడుక్కొని తిన్నట్లే ఉందిలే అని గోణుగుకుంటూ మందులు కొనుక్కొని ఇంటిదారి పట్టాడు. 


అప్పటినుండి రామారావు కనపడ్డ ప్రతిమనిషిని  షుగరు ఎలా తగ్గించుకోవాలని  అడిగేవాడు. గూగుల్ సర్చి చేసి చిట్కాలు, వెతకటం మొదలు పెట్టాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. రోగం వచ్చిన నెలరోజులకు సగం అయ్యాడు  రామారావు. ఇప్పుడు రామారావు మదిలో ఎప్పుడు ఒకటే ఆలోచన షుగరు ఎలా తగ్గిచుకోవాలి. అసలు భగవంతుడు ఈ షుగరు ఎందుకు మనుషులకు పెట్టాడు అది నా లాంటి మంచివాళ్లకు.  దేముడా ఎందుకయ్యా నామీద ఇంత  కోపం. నేనేమైన తప్పు చేస్తే క్షమించు స్వామి.  ఈ షుగరు కనక పూర్తిగా తగ్గితే వచ్చే శనివారం నీకు కొబ్బరికాయ కొడతాను అని మొక్కుకున్నాడు.  అందులో లాజిక్ ఏమిటంటే చెప్పకుండానే దేముడికి తనకు షుగరు వచ్చే శనివారం లోగా తగ్గాలని కోరుకున్నాడన్న మాట.  కానీ దేముడు ఇలాంటి రామారావుని ఎంతమందిని చూసాడు.  నాయనా అది నీ ప్రారబ్దము. అనుభవించక తప్పదు అని దేముడు నవ్వుకున్నాడు. 


రామారావు ఏ డాక్టరు వద్దకు వెళ్లిన అది తినకు ఇది తినకు అని తినే వాటి లిస్టు తినని వాటి లిస్టు చెప్పేవారు. ఇందులో గమ్మత్తు ఏమిటంటే తినని వాటి లిస్టు చాంతాడంట తినే వాటి లిస్టు చిటికెన వేలంత ఉండేది.  ఇక డాక్టర్ల మాటలు వినాలంటే చికాకు వేసింది.  ఆలా అలా తిరుగుతుంటే ఎవరో చెప్పారు మిత్రమా కుక్కుటేశ్వరరావు అనే డాక్టరు  షుగరుకు మంచి డాక్టరు ఆయన తినని పదార్ధాల లిస్టు పెద్దగా చెప్పాడు కేవలం "ఒక్కటి తినకుండా ఉంటే చాలు" అంటాడట అని ఒక ఆశాకిరణాన్ని  వదిలాడు. బతుకు జీవుడా అని ఆఘమేఘాలమీద వెతుకుంటూ డాక్టరు కుక్కుటేశ్వర రావుగారి వద్దకు వెళ్ళాడు. 


రామారావుని చూడంగానే కుక్కుటేశ్వరరావు చిన్నగా  నవ్వాడు. ఈ నవ్వుకు అర్ధం ఏమిటి ఒరే అమాయకుడా నా దగ్గరకు వచ్చావు ఇక నీ సంగతి చూస్తాను అనా లేక ఇంకేమన్నానా అని అనుకున్నాడు.  రామాయణంలో లక్ష్మణుడి నవ్వులాగ తోచింది.  నమస్కారం డాక్టారు గారు నాకు షుగరు వుంది అన్నాడు.  ఆ సంగతి మీరు చెప్పక్కర్లేదు మీ ముఖం చూస్తేనే తెలుస్తున్నది అని అన్నాడు. 


అయ్యా ప్రతి డాక్టరు షుగరు పేషంట్లు అది తినకూడదు ఇది తినకూడదు అని పెద్ద లిస్టు చెపుతారు, కానీ మీరు ఒక్కటి తినకుండా ఉంటే చాలు అంటారని ఎవరో చెపితే వచ్చాను అని రామారావు అన్నాడు.  దానికి డాక్టరు పెద్దగా ఒక వెకిలి నవ్వు నవ్వి అదేనండి అందరు  అంటుంటారు. నేను వెరీ సింపులుగా చెపుతాను. ఏమిటి సింపులుగా చెపుతావా ఇక్కడ ప్రాణాలు ఉగ్గపట్టుకొని నేను చస్తుంటే అని మనసులో అనుకున్నాడు మన హీరో రామారావు.  ఏమీలేదండి మీకు ఇష్టమైనవి తినటం మానండి చాలు అని అన్నాడు. ఇదేదో బాగుందే అవును తనకు ఇష్టమైనవి తినటం మానితే షుగరు తగ్గుతుందా డాక్టరుగారు అని అడిగాడు పసివానివలె.  అవునండి అంతే మీరేమి కంగారు పడనవసరం లేదు అని యేవో మందులు వ్రాసి ఇచ్చాడు. 


మందు బిళ్ళలు కొనుక్కొని సంతోషంగా ఇంటికి వెళ్ళాడు.  సంతోషంగా ఇంటికి వచ్చిన భర్తను చూసి రాగిణి అడిగింది ఏమిటండి ఇంత సంతోషంగా వున్నారు ఏమైంది మీకు ఈ వేళ అని అడిగింది జరిగిందంతా చెప్పి ఇకనుంచి నేను అది తినకూడదు ఇది తినకూడదు అని నేను తిండి మానవలసిన పనిలేదు డాక్టరుగారు నాకు కేవలం నాకు ఇష్టమైనది మాత్రమే తిననవసరం లేదు అని చెప్పాడు అని అన్నాడు.  బాగుంది మీ తెలివి తెల్లారినట్లే వుంది ఆ డాక్టరు మిమ్మలిని పిచ్చివాడిని చేశాడండి అని అన్నది. ఆ. అదెట్లా అన్నాడు.  ఇప్పుడు చెప్పండి మీకు చామగడ్డల వేపుడు ఇష్టమా కాదా ఇష్టం కదా అని అన్నది.  ఇష్టం కాకపోవటం ఏమిటి ఎప్పుడు నీకు కూడా మిగల్చకుండా నేనే తింటాను అని  అంటావుగా. అయితే చెప్పండి ఆలుచిప్స్, గుత్తి వంకాయ కూర, కంద కూర, ఆవకాయ పచ్చడి, నీళ్లవంకాయ, మాగాయ, మిరపకాయ బజ్జిలు, ఆలు  బొండాలు,అరటికాయ బజ్జిలు, జిలేబీలు, మైసూరుపాకులు, జహాంగీరీలు, కోవా, కిస్మిస్, జీడిపప్పు, ఇలా మన రామారావుకు ఇష్టమైన తినుబండారాల లిస్టు మొత్తం చెప్పింది.  అబ్బా అబ్బా ఇలా నన్ను ఊరించకే ఇవన్నీరేపు పండగకు చేసే ప్రొపోజలు ఏమైనా ఉన్నదా చెప్పు అని అన్నాడు. ఆ మాట అంటుంటే రామారావు మొహం వెయ్యి వాట్ల బలుపు వెలిగినట్లుగా వున్నది. నా మొహం అవన్నీ నేనెందుకు చేస్తానండి మీకే మీ డాక్టరు అవన్నీ తినకూడదని చెప్పాడని ఇప్పుడే చెప్పారుగా అని అనే సరికి రామారావు ట్యూబులైటు మెదడు టుపుకు టుపుకు అని  వెలిగింది.  అదా సంగతి అని అనుకోని అప్పుడు కానీ రామారావుకు అది చెప్పేటప్పుడు డాక్టరు పెద్దగా వెకిలి నవ్వు ఎందుకు నవ్వడో తెలియలేదు. . 


ఇది సాధారణంగా సమాజంలో సగటు మనిషి షుగరు వ్యాధి సోకినప్పుడు కలిగే ఆవేదన, మనలో చాలామందికి రామారావుకు కలిగినటువంటి అనుభవాలు ఉండి ఉండవచ్చు  వక్కసారి వెనుకకు తిరిగి చూసి చెప్పండి.  అయ్యా వెనుకకు అంటే మీ వెనుకకు కాదు మీ గతంలోకి తెలిసిందా. 


ఇక అసలు విషయానికి వద్దాము. ఏ రకంగా అయితే ఒక షుగరు వ్యాధిగ్రస్తుడు తనకు షుగరు వ్యాధి జీవితాంతం ఉంటుండదని తెలుసుకొని కూడా షుగరు తగ్గుతుందనే ఆశతో ఉంటాడో అదే విధంగా ప్రతి సాధకుడు కూడా ఈ భవ బంధాలు జీవితాంతం వుంటాయని తెలుసుకొని నిత్యం తన సాధనతో వాటిని తెంచుకోవాలని చూస్తాడు. ఒక గుర్రపురౌతు తాను గుర్రం దిగిన తరువాత రోజు దానికి తాడు కట్టి ఒక గుంజకు కట్టి వేసే వాడట ఒకరోజు తాను రోజు కట్టే తాడు తెగి ముక్కలు అయ్యిందట ఇప్పుడు యెట్లా గుర్రాన్ని కట్టివేయాలి అని  ఆలోచించాడు. అప్పటి కప్పుడు ఇంకొక తాడు తేవాలంటే అది జరిగే పని కాదు. అప్పడు అతనికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే గుర్రం మేస్తున్న గడ్డి పరకలను కొన్నిటిని తీసుకొని దాని మేడవద్ద తాడుతో కట్టినట్లు దానిమీద నిమిరాడట అంటే ఆ గుఱ్ఱం తన యజమాని తనను తాటితో కట్టాడని అనుకోని రోజులాగే అక్కేదే వుండినదట .  మరుసటి రోజు రౌతు గుర్రాన్ని తీసుకొని వెళ్ళటానికి అదిలిస్తే అది ఆ గుంజ చుట్టే తిరుగుతున్నది కానీ దానిని వదిలి రావటం లేదు అప్పుడు మరల ఆ రౌతు కొన్ని గడ్డి పరకలతో దాని మెడను నిమిరితే అప్పుడు అది అక్కడినుండి కదిలినదట.  అంటే నిజానికి దాని మేడలో పలుపు (తాడు) లేదు కానీ అది వున్నట్లుగా భావించి తనకు తాను బందించినట్లుగా భావిస్తున్నది. సాధక నీవు కూడా ఆ గుర్రం వలెనె నిజానికి ఎటువంటి బంధనాలు లేకుండా  వున్నావు. కానీ సంసారం ఒక బంధనం అనుకోని దానికి నీవు కట్టివేయబడినట్లు నీ యంతట నీవె ఊహలలో  ఉంటున్నావు. ఈ సత్యాన్ని తెలుసుకుంటే సంసార బంధనాలను వీడటం ఏమి సమస్య కాదు. గృహస్థజీవనం చేస్తూకూడా మోక్షాన్ని చేరుకోవచ్చు మనకు అనేకమంది సాధకులు ఉదాహరణగా వున్నారు. 


భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే మన మహర్షులు ఏమన్నారంటే "మనః ఏవ కారణాయ మనుష్యాణాం బంధః ఏవ మోక్ష" అందువలన మనస్సును సదా ఆ పరమేశ్వరుని మీద లగ్నం చేసి మన దైనందిక కార్యక్రమాలను మన ధర్మంగా భావించి ఏ సాధకుడైతే నిరంతర సాధన చేస్తాడో తప్పకుండ అతడు మోక్షాన్ని పొందగలడు. అందులో ఇసుమంతకూడా అసత్యం లేదు. కేవలము దృఢ సంకల్పము, అకుంఠిత దీక్ష నిరంతర కృషి ఉండాలి. "సాధనేన సాధ్యతే సర్వం" ఇంకా ఎందుకు ఆల్సస్యం ఇప్పుడే నీ సాధనను మొదలు పెట్టు మోక్షపదాన్ని ఈ జన్మలోనే పొందు. 


ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః


ఇట్లు 

మీ భార్గవశర్మ

⚜ శ్రీ త్రిపుర సుందరీదేవి ఆలయం

 🕉 మన గుడి : 





⚜ కడప జిల్లా : కన్యతీర్థం


⚜ శ్రీ త్రిపుర సుందరీదేవి ఆలయం


💠 స్వర్గలోకంలో ఉన్న పెళ్లి కాని కన్యలని దేవకన్యలు అని అంటారు.. 

అయితే దేవకన్యలు భూలోకానికి వచ్చి దర్శించుకునేంత ప్రత్యేకమైన దేవాలయం ఎక్కడ ఉంది..? 


💠 పచ్చటి చెట్ల మధ్య.. ప్రశాంతమైన వాతావరణంలో.. మనసుకు హాయి కలిగించేలా ఉన్న పరిసరాలలో.. అమ్మ త్రిపురసుందరీదేవిని ప్రతిరోజు స్వర్గం నుంచి దిగి వచ్చి దేవకన్యలు దర్శించుకుంటారని అంటారు.. 

5,000 సంవత్సరాల కిందట ఈ ఆలయంలో త్రిపురసుందరీ దేవి స్వయంభువుగా వెలసింది. 

ముఖ్యంగా కన్యలకు ఈ దేవాలయం అత్యంత పవిత్రతను సంతరించుకుంది. 


💠 కడప జిల్లా జమ్మలమడుగు దగ్గర దండ్లూరి పొలిమేరలో పినాకిని నది ఒడ్డున , భాను కొండల మధ్య అత్యంత సుందరంగా అమ్మవారి క్షేత్రం మనకు కనిపిస్తుంది.

అన్ని దేవాలయాల్లో అమ్మవారికి పీఠం ఉండగా,ఈ అమ్మవారికి ఎక్కడ కూడా పీఠం కనిపించదు. అంతే కాదు అమ్మవారి విగ్రహం భూమి లోపల ఎంతవరకు ఉందో కూడా తెలియదు.. ఇక దేవకన్యలు ఇక్కడికి వచ్చి పుష్కరిణిలో స్నానమాచరించి, త్రిపురసుందరీదేవిని దర్శించుకుంటారు. అందుకే ఈ గుడికి కన్యతీర్థం అని పేరు కూడా వచ్చింది అని స్థలపురాణం చెబుతోంది.


💠 ఇచ్చట ప్రధాన దైవం "శ్రీ త్రిపుర సుందరీదేవి". కొంత మంది శ్రీ విజయ దుర్గా మాతగా కొలుస్తారు

మాత వెలసి ఇప్పటికి సుమారు 5 వేలు సంవత్సరాలకు పైగా అయినట్లు గుడిలోని శాసనాల ద్వారా తెలుస్తున్నది.


⚜ స్థల పురాణం ⚜


💠 ఈ గుడి సమీపంలోనే అగస్త్యాశ్రమం ఉన్నది. వింద్య పర్వతాల మదమణచడానికి వచ్చిన అగస్త్య మహాముని చాలా కాలం జమ్మలమడుగు మండలంలోని చారిత్రక ప్రాంతం అయిన గండికోటకు ప్రక్కనున్న కోనలో నివాసం ఉన్నట్లు పురాణాలు తెలుపుతున్నాయి. 

అందువల్ల ఆ కోనకు అగస్త్యేశ్వర కోన అనే పేరు వచ్చింది. అగస్త్యుడు ప్రతి రోజూ గండికోట నుండి కన్నెతీర్థం వచ్చి దుర్గామాతను కొలిచివేళ్లే వాడని ప్రతీతి.


💠 క్షేత్రంలో నేటికి శ్రీ అగస్త్య ఆశ్రమం వుంది. దేవతలు, మహాపురుషులు, సిద్ద పురుషులు, మునులు అమ్మవారిని సేవించుకున్నారు. అలాగే క్రీ.పూ ఆచార్య సిద్ధ నాగార్జునుడు, మౌర్య వంశ స్థాపకుడు చంద్రగుప్తుడు, 

అశోక చక్రవర్తి అమ్మవారిని దర్శించుకొని సేవించుకున్నట్లు తెలుస్తోంది. 

అలాగే 2 నుండి 7వ శతాబ్దం కాలంలో శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు, శాతవాహనులు, చోళులు, హర్షవర్ధనుడు శ్రీ త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని పూజించినట్లు స్థల పురాణాలు చెబుతున్నాయి.

తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన ఆంధ్రభోజుడుగా పేరొందిన శ్రీ కృష్ణదేవరాయులు క్షేత్రంను అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. 

ఆ తరువాతి కాలంలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ, కాలజ్ఞాన బ్రహ్మ పోతులూరి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు అమ్మవారిని సేవించినట్లు తెలుస్తోంది.


💠 క్షేత్రం మహిమలు గురించి పరాశర మహాముని రాసిన స్కంద పురాణంలోనూ, జైమిని భారతంలోనూ, శ్రీశైల పురాణంలోనూ గొప్పగా వివరించారు. కన్యతీర్థంలోని శ్రీ త్రిపుర సుందరీ దేవి రూపంలో వున్న విజయదుర్గ అమ్మవారి మహిమలు విని జైనులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని సేవించుకున్నారు. 

దీనికి తార్కాణంగా జమ్మలమడుగు- ప్రొద్దుటూరు రూటులో నాటి దేవనహళ్లి అయిన నేడు దేవగుడి వద్ద బాహుబలి విగ్రహం వుంది. దీనికి నిదర్శనంగా ఇప్పటికీ అమ్మవారి గుడి పైభాగాన సిద్ద, బౌద్ధ అస్తికల గూళ్లు చూపరులకు దర్శనమిస్తాయి.


💠 శ్రీ కన్యతీర్థంనకు మరొక ప్రత్యేకత ఉంది. 

ఈ తీర్థం తిరుపతి, శ్రీశైల క్షేత్రాలకు సరిగ్గా 90 డిగ్రీల కోణంలో అమరి ఉండడం ఒక విశేషం.


💠 ఆలయ ప్రాంగణములో అమ్మవారు ఆలయంతో పాటు శివాలయం, సత్యనారాయణ సన్నిధి, సంజీవ ఆంజనేయ సన్నిధి, నాగ ప్రతిమలు, నవగ్రహ మండపం మొదలగునవి కలవు.  

అన్నదానం జరుగు స్ధలం,యాత్రికుల విశ్రాంతి హాలు, కళ్యాణ మండపం మొదలగు వసతులున్నాయి. 

శివాలయం నందు శ్రీ సుందరేశ్వర స్వామి, 

శ్రీ వర సిద్ధ వినాయక స్వామి, శ్రీ కార్తికేయ స్వామి సన్నిధి కలవు.  


💠 శివాలయం నకు ఎడమ భాగం నందు శ్రీ త్రిపుర సుందరీదేవి ఆలయం ఉంటుంది. గర్భాలయం నందు సుమారు మూడు అడుగుల ఎత్తు గల ఒక పరాశక్తి ప్రతిమ దర్శనమిస్తుంది. ప్రతి రోజు అర్చనలు జరుగుతాయి.  


💠 ప్రతి పౌర్ణమి నాడు విశేష అర్చనలు ఉంటాయి. అమ్మవారు రాత్రి పూట సంచారము చేస్తారు. 

ఆలయ ప్రాంగణములో భక్తులు అమ్మ కృప కోసం నిద్ర చేస్తారు. భక్తులుకు రెండు పూటల ఉచిత భోజనం దొరుకుతుంది.


💠 ఇక్కడ వారాహి, వైష్ణవి, బ్రాహ్మణి , మహేశ్వరి , కౌమారి, చాముండి, ఇంద్రాణి వంటి 7 మంది దేవతలు ఒకేచోట కొలువై ఉండటం వల్ల ఈ క్షేత్రాన్ని సప్తమాతృక క్షేత్రమని, దేవేంద్రుడు రావడం వల్ల దేవ క్షేత్రమని, అగస్త్యమహర్షి తపస్సు చేయడంవల్ల ఈ క్షేత్రాన్ని అగస్త్య క్షేత్రమని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు.


💠 జమ్మలమడుగు పట్టణం నుంచి కన్యతీర్థం నకు బస్సులు ఉదయం 05:45 & సాయంత్రం 05:30 మాత్రమే ఉంటాయి. జమ్మలమడుగు నుంచి ఆటోలు/టాక్సీలు దొరుకుతాయి.